![BSNL Achieves Rs 262 Crore Profit in Q3](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/BSNL-IFTV.jpg.webp?itok=hC8LcFKr)
క్యూ3లో రూ. 262 కోట్లు
న్యూఢిల్లీ: టెలికం రంగ ప్రభుత్వ దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో టర్న్‌అరౌండ్ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 262 కోట్ల నికర లాభం ఆర్జించింది. వెరసి సుమారు 17 ఏళ్ల తదుపరి తిరిగి లాభాల్లోకి ప్రవేశించినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలియజేశారు. ఇది ప్రస్తావించదగ్గ కీలక మలుపు అంటూ వ్యాఖ్యానించారు.
బీఎస్‌ఎన్‌ఎల్ ఇంతక్రితం 2007లో మాత్రమే త్రైమాసికవారీగా లాభాలు ఆర్జించడం గమనార్హం! కంపెనీకిది అతిముఖ్యమైన రోజుగా సింధియా పేర్కొన్నారు. కంపెనీ కొంతకాలంగా సరీ్వసులను విస్తరించడంతోపాటు వినియోగదారులను పెంచుకోవడంపై దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. కాగా.. బీఎస్‌ఎన్‌ఎల్ మొబిలిటీ, ఫైబర్ టు హోమ్(ఎఫ్‌టీటీహెచ్), లీజ్‌డ్ లైన్ సరీ్వసులలో 14–18 శాతం వృద్ధిని సాధించినట్లు సిందియా తెలిపారు. మరోవైపు సబ్‌స్క్రయిబర్ల సంఖ్య సైతం 2024 డిసెంబర్‌లో 9 కోట్లకు ఎగసినట్లు వెల్లడించారు. జూన్‌లో ఈ సంఖ్య 8.4 కోట్లు మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment