third quarter
-
బీఎస్ఎన్ఎల్ లాభాల సిగ్నల్
న్యూఢిల్లీ: టెలికం రంగ ప్రభుత్వ దిగ్గజం బీఎస్ఎన్ఎల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 262 కోట్ల నికర లాభం ఆర్జించింది. వెరసి సుమారు 17 ఏళ్ల తదుపరి తిరిగి లాభాల్లోకి ప్రవేశించినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలియజేశారు. ఇది ప్రస్తావించదగ్గ కీలక మలుపు అంటూ వ్యాఖ్యానించారు. బీఎస్ఎన్ఎల్ ఇంతక్రితం 2007లో మాత్రమే త్రైమాసికవారీగా లాభాలు ఆర్జించడం గమనార్హం! కంపెనీకిది అతిముఖ్యమైన రోజుగా సింధియా పేర్కొన్నారు. కంపెనీ కొంతకాలంగా సరీ్వసులను విస్తరించడంతోపాటు వినియోగదారులను పెంచుకోవడంపై దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. కాగా.. బీఎస్ఎన్ఎల్ మొబిలిటీ, ఫైబర్ టు హోమ్(ఎఫ్టీటీహెచ్), లీజ్డ్ లైన్ సరీ్వసులలో 14–18 శాతం వృద్ధిని సాధించినట్లు సిందియా తెలిపారు. మరోవైపు సబ్స్క్రయిబర్ల సంఖ్య సైతం 2024 డిసెంబర్లో 9 కోట్లకు ఎగసినట్లు వెల్లడించారు. జూన్‌లో ఈ సంఖ్య 8.4 కోట్లు మాత్రమే. -
ధరలు, ప్రపంచ పరిస్థితులు కీలకం
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసిక ఫలితాల సీజన్ ముగింపునకు వస్తున్న నేపథ్యంలో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు పలు ఇతర అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ప్రధానంగా ద్రవ్యోల్బణ గణాంకాలు, ప్రపంచ స్టాక్ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులు ప్రభావం చూపనున్నట్లు పేర్కొన్నారు. వీటితోపాటు యూఎస్ రిటైల్ సేల్స్, యూకే జీడీపీ గణాంకాలు తదితరాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు వివరించారు. ఇతర వివరాలు చూద్దాం.. క్యూ3 ఫలితాలకు రెడీ ఇప్పటికే అక్టోబర్–డిసెంబర్(క్యూ3) ఫలితాల సీజన్ ముగింపునకు వచ్చింది. ఈ బాటలో మరికొన్ని కంపెనీలు క్యూ3 పనితీరు ప్రకటించనున్నాయి. జాబితాలో ఐషర్ మోటార్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, వొడాఫోన్ ఐడియా, సెయిల్, నాల్కో, లుమాక్స్, అపోలో హాస్పిటల్స్, అశోకా బిల్డ్‌కాన్, అవంతీ ఫీడ్స్, రెయిన్బో చి్రల్డన్స్, బిర్లా కేబుల్, బామర్‌లారీ, బాటా, ఎస్కార్ట్స్, గలక్సీ సర్ఫక్టేంట్స్, జిలెట్ తదితరాలున్నట్లు మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునీత్ సింఘానియా పేర్కొన్నారు. 12న గణాంకాలు బుధవారం(12న) జనవరి నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ), డిసెంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐసీ) గణాంకాలు వెలువడనున్నాయి. డిసెంబర్లో సీపీఐ 5.22 శాతంగా నమోదైంది. ఇక నవంబర్‌లో ఐఐపీ 3.5 శాతం వృద్ధిని చూపింది. ఈ బాటలో జనవరి నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) గణాంకాలు 14న విడుదలకానున్నాయి. డిసెంబర్లో డబ్ల్యూపీఐ 2.37 శాతంగా నమోదైంది. ఇదే విధంగా జనవరి వాణిజ్య గణాంకాలు వెల్లడికానున్నాయి. డిసెంబర్లో వాణిజ్య లోటు 21.94 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అంతర్జాతీయంగా యూఎస్ రిటైల్ అమ్మకాలు, ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ ప్రసంగం, యూకే జీడీపీ గణాంకాలూ కీలకంగా నిలవనున్నట్లు సింఘానియా తెలియజేశారు. ఫెడ్ గత పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లను యథాతథంగా 4.25–4.5 శాతంవద్దే కొనసాగించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇవికాకుండా డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, ముడిచమురు ధరలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) తీరు సైతం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు వివరించారు. గత వారమిలా గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్ 354 పాయింట్లు(0.5 శాతం) బలపడి 77,860 వద్ద ముగిసిది. నిఫ్టీ 78 పాయింట్లు(0.3%) పుంజుకుని 23,560 వద్ద స్థిరపడింది. చివరికి ఢిల్లీ కోటలో పాగా దాదాపు మూడు దశాబ్దాల తదుపరి మళ్లీ న్యూఢిల్లీ కోటలో బీజేపీ పాగా వేసింది. తాజా అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ దశాబ్ద కాలం పాలనకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చెక్ పెట్టింది. పార్లమెంట్ ఎన్నికల బాటలో రాష్ట్రంలోనూ సీట్లు సాధించడంతో స్థానికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. దీంతో స్టాక్ మార్కెట్లలో స్వల్ప కాలానికి సెంటిమెంటు బలపడనున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్ పేర్కొన్నారు. ప్రో త్సాహకర బడ్జెట్, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత దీనికి జత కలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. అమ్మకాలు వీడని ఎఫ్‌పీఐలు ఇటీవల దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే ప్రాధాన్యమిస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) గత వారం సైతం ఇదే బాటలో సాగారు. ఫిబ్రవరి తొలి వారంలో నికరంగా రూ. 7,300 కోట్ల(84 కోట్ల డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. జనవరిలోనూ ఎఫ్‌పీఐలు నగదు విభాగంలో రూ. 78,027 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. అయితే అంతకుముందు అంటే డిసెంబర్ మధ్యలో అమ్మకాలను వీడి కొనుగోళ్లు చేపట్టారు. దీంతో 2024 చివరి నెలలో నికరంగా రూ. 15,446 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! -
ఎయిర్టెల్ లాభాల ట్యూన్
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 5 రెట్లు పైగా దూసుకెళ్లి రూ. 16,135 కోట్లకు చేరింది. గతేడాది (2023–24) ఇదే కాలంలో కేవలం రూ.2,876 కోట్లు ఆర్జించింది. ఇండస్ టవర్స్ బిజినెస్ కన్సాలిడేషన్ కారణంగా రూ. 14,323 కోట్లు ఆర్జించినట్లు కంపెనీ పేర్కొంది. రూ. 1,194 కోట్ల విదేశీ మారక లాభం అందుకుంది. మరోపక్క రూ. 128 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లభించింది. మొత్తం ఆదాయం సైతం 19% ఎగసి రూ. 45,129 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 37,900 కోట్ల టర్నోవర్ అందుకుంది. ఈ కాలంలో ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం (ఏఆర్పీయూ) రూ. 233 నుంచి రూ. 245కు బలపడింది. ప్రస్తుత సమీక్షా కాలంలో ఎయిర్టెల్ దేశీ బిజినెస్ 25%జంప్‌చేసి రూ. 34,654 కోట్లను తాకింది. దాదాపు రూ. 7,546 కోట్ల అనూహ్య లాభాలు ఆర్జించింది.ఫలితాల నేపథ్యంలో షేరు 2.5% క్షీణించి రూ. 1,620 వద్ద ముగిసింది. -
ఎస్బీఐ లాభం హైజంప్
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (2024–25,క్యూ3)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. స్టాండెలోన్ నికర లాభం 84% దూసుకెళ్లి రూ. 16,891 కోట్లను తాకింది. గతేడాది (2023–24) ఇదే కాలంలో రూ. 9,164 కోట్లు ఆర్జించింది. పెన్షన్ చెల్లింపులకు రూ. 7,100 కోట్ల మేర ప్రొవిజన్ చేపట్టడం ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది క్యూ2(జూలై–సెప్టెంబర్)లో ఎస్బీఐ రూ. 18,331 కోట్ల లాభం ఆర్జించింది. కాగా.. మొత్తం ఆదాయం రూ. 1,18,193 కోట్ల నుంచి రూ. 1,28,467 కోట్లకు బలపడింది. నికర వడ్డీ ఆదాయం 4% పుంజుకుని రూ. 41,446 కోట్లకు చేరింది. రుణాల్లో 14% వృద్ధి నమోదైనప్పటికీ నికర వడ్డీ మార్జిన్లు 0.19% నీరసించి 3.15%కి పరిమితమయ్యాయి. కాసాకు బదులు కస్టమర్లు అధిక రాబడినిచ్చే ఫిక్స్డ్ డిపాజిట్లకు మొగ్గు చూపడం ఇందుకు కారణమైనట్లు బ్యాంక్ చైర్మన్ సీఎస్ శెట్టి పేర్కొన్నారు.ఎన్పీఏలు తగ్గాయ్: ప్రస్తుత సమీక్షా కాలంలో ఎస్బీఐ కన్సాలిడేటెడ్ నికర లాభం 70 శాతం జంప్‌చేసి రూ. 18,853 కోట్లను తాకింది. గతేడాది క్యూ3లో రూ. 11,064 కోట్ల లాభం ఆర్జించింది. ఆదాయం రూ. 1,53,072 కోట్ల నుంచి రూ. 1,67,854 కోట్లకు ఎగసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.42 శాతం నుంచి 2.07 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు 0.64 శాతం నుంచి 0.53 శాతానికి తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో ఎస్బీఐ షేరు 1.8% క్షీణించి రూ. 752 వద్ద క్లోజైంది. -
తగ్గిన ఓఎన్జీసీ లాభం
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఓఎన్జీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 17 శాతం క్షీణించి రూ. 8,240 కోట్లకు పరిమితమైంది. ముడిచమురు ధరలు నీరసించడం ప్రభావం చూపింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 9,892 కోట్లు ఆర్జించింది. కంపెనీ బోర్డు.. వాటాదారులకు షేరుకి రూ. 5 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. గడిచిన నవంబర్‌లో రూ. 6 చెల్లించిన సంగతి తెలిసిందే. కాగా.. మొత్తం ఆదాయం సైతం 3 శాతం వెనకడుగుతో రూ. 33,771 కోట్లకు చేరింది. ఈ కాలంలో బ్యారల్‌కు ముడిచమురు ధర 72.57 డాలర్లు చొప్పున అందుకుంది. గత క్యూ3లో 81.13 డాలర్లు చొప్పున లభించింది. నేచురల్ గ్యాస్ ఒక్కో ఎంబీటీయూ 6.5 డాలర్లు చొప్పున విక్రయించింది. ముడిచమురు ఉత్పత్తి స్వల్పంగా 2 శాతం పెరిగి 4.653 మిలియన్ టన్నులను తాకింది. నేచురల్ గ్యాస్ ఉత్పత్తి నామమాత్ర వృద్ధితో 4.978 బీసీఎంకు చేరింది. -
అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు బొగ్గు సెగ
న్యూఢిల్లీ: బొగ్గు అమ్మకాలు గణనీయంగా పడిపోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అదానీ ఎంటర్ప్రైజెస్ (ఏఈఎల్) నికర లాభం ఏకంగా 97 శాతం క్షీణించింది. రూ. 58 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో కంపెనీ నికర లాభం రూ. 1,888 కోట్లుగా నమోదైంది. ప్రధాన వినియోగదారయిన విద్యుత్ రంగంలో పునరుత్పాదక వనరుల వాటా పెరిగి బొగ్గుకు డిమాండ్ తగ్గడంతో అమ్మకాల పరిమాణం ఏకంగా 42 శాతం మేర క్షీణించింది. ఇక ఆ్రస్టేలియా కార్యకలాపాలకు సంబంధించి విదేశీ మారకంపరంగా నష్టాలు నమోదు కావడం కూడా తాజా పనితీరుకు కారణమయ్యాయి. సమీక్షాకాలంలో కంపెనీ ఆదాయం 9 శాతం తగ్గి రూ. 22,848 కోట్లకు పరిమితమైంది. మరోవైపు, ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో ఆదాయం 6 శాతం పెరిగి రూ. 72,763 కోట్లకు చేరగా, నికర లాభం 17 శాతం వృద్ధి చెంది రూ. 3,254 కోట్లకు ఎగిసింది. గురువారం బీఎస్ఈలో ఏఈఎల్ షేరు సుమారు మూడు శాతం క్షీణించి రూ. 2,253 వద్ద క్లోజయ్యింది. -
ఇండిగో లాభం నేలచూపు
న్యూఢిల్లీ: విమానయాన రంగ దిగ్గజం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 18 శాతం క్షీణించి రూ. 2,450 కోట్లకు పరిమితమైంది. ప్రధానంగా కరెన్సీ ఆటుపోట్లు లాభాలను దెబ్బతీశాయి. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 2,998 కోట్లు ఆర్జించింది. అయితే ఇండిగో బ్రాండ్ విమాన సరీ్వసుల కంపెనీ మొత్తం ఆదాయం మాత్రం రూ. 20,062 కోట్ల నుంచి రూ. 22,993 కోట్లకు ఎగసింది. కాగా.. ఇంధన వ్యయాలు తగ్గడానికితోడు ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడంతో రూ. 3,850 కోట్ల లాభం ఆర్జించినట్లు కంపెనీ పేర్కొంది. ఈ కాలంలో 3.11 కోట్లమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసినట్లు వెల్లడించింది. బీఎస్ఈలో ఇండిగో షేరు 0.6 శాతం బలపడి రూ. 4,163 వద్ద ముగిసింది. -
రిలయన్స్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 7 శాతంపైగా వృద్ధితో రూ. 18,540 కోట్లను తాకింది. ప్రధానంగా టెలికం, రిటైల్ విభాగాలకుతోడు చమురు, పెట్రోకెమ్ బిజినెస్ నిలకడైన వృద్ధి ఇందుకు సహకరించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 17,265 కోట్లు ఆర్జించింది. ఈ ఏడాది జులై–సెపె్టంబర్(క్యూ2)లో ఆర్జించిన రూ. 16,563 కోట్లతో పోలి్చనా నికర లాభం బలపడింది. మొత్తం ఆదాయం సైతం 7 శాతం అధికంగా రూ. 2.67 లక్షల కోట్లకు చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా) 8 శాతం పుంజుకుని రూ.48,003 కోట్లకు చేరుకుంది. రిటైల్, ఆయిల్ గుడ్... రిటైల్ విభాగం రిలయన్స్ రిటైల్ వెంచర్స్ నికర లాభం క్యూ3లో 10 శాతం వృద్ధితో రూ. 3,458 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 9 శాతం పెరిగి రూ. 90,333 కోట్లయ్యింది. కొత్తగా 779 స్టోర్లను ఏర్పాటు చేయడంతో వీటి సంఖ్య 19,102కు చేరింది. జామ్‌నగర్ రిఫైనరీ, పెట్రోకెమికల్ ప్లాంట్లతోకూడిన ఆయిల్ టు కెమికల్స్ బిజినెస్ ఇబిటా 2 శాతం పుంజుకుని రూ. 14,402 కోట్లను తాకింది. ఇంధన రిటైల్ విభాగం జియో–బీపీ రికార్డ్ అమ్మకాలు(పెట్రోల్, డీజిల్) సాధించినట్లు ఆర్ఐఎల్ పేర్కొంది. కేజీ డీ6 బ్లాకు నుంచి తగ్గిన గ్యాస్ ఉత్పత్తి కారణంగా ఇబిటా 4 శాతం నీరసించి రూ. 5,565 కోట్లకు పరిమితమైంది. సగటున గ్యాస్ ఉత్పత్తి రోజుకి 28.04 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్లుకాగా.. 21,000 బ్యారళ్ల చమురు ఉత్పత్తిని సాధించింది. యూఎస్ లగ్జరీ స్టోర్లు: ఫ్రాంచైజీ ఒప్పందం ద్వారా యూఎస్ లగ్జరీ రిటైలర్ ‘శాక్స్ ఫిఫ్త్ ఎవెన్యూ’ స్టోర్లకు దేశీయంగా తెరతీయనున్నట్లు రిలయన్స్ రిటైల్ పేర్కొంది. వెరసి అమెరికన్ లగ్జరీ డిపార్ట్మెంట్ స్టోర్లను దేశీయంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేసింది. ఇదేవిధంగా మదర్‌కేర్ పీఎల్సీతో జేవీని నెలకొల్పనున్నట్లు వెల్లడించింది. తద్వారా తల్లిదండ్రులు, పిల్లల ఉత్పత్తులందించే మదర్‌కేర్ బ్రాండును దేశీయంగా పరిచయం చేయనున్నట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో ఎన్ఎస్ఈలో ఆర్ఐఎల్ షేరు 2% లాభంతో రూ. 1,275 వద్ద ముగిసింది.జియో దూకుడు ఆర్ఐఎల్ టెలికం విభాగం రిలయన్స్ జియో ఈ ఏడాది క్యూ3లో రూ. 6,477 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ3లో సాధించిన రూ. 5,208 కోట్లతో పోలిస్తే 24 శాతం ఎగసింది. ప్రధానంగా టారిఫ్‌ల పెంపు ఇందుకు దోహదపడింది. మొత్తం ఆదాయం సైతం రూ. 25,368 కోట్ల నుంచి రూ. 29,307 కోట్లకు జంప్ చేసింది. త్రైమాసికవారీగా కస్టమర్ల సంఖ్య 47.88 కోట్ల నుంచి 48.21 కోట్లకు బలపడగా.. ఒక్కో యూజర్‌పై సగటు ఆదాయం (ఏఆర్పీయూ) రూ. 195.1 నుంచి రూ. 203.3కు ఎగసింది. టెలికం, డిజిటల్ విభాగాల జియో ప్లాట్‌ఫామ్స్ కన్సాలిడేటెడ్ నికర లాభం 26 శాతం జంప్‌చేసి రూ. 6,861 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 19% అధికమై రూ. 38,750 కోట్లకు చేరింది. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం ప్లస్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్లో నికర లాభం 5.5 శాతం బలపడి రూ. 4,591 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 4,350 కోట్లు ఆర్జించింది. పూర్తి ఏడాదికి ఆదాయ ఆర్జన అంచనా(గైడెన్స్)ను తాజాగా 4.5–5 శాతానికి సవరించింది. ఇంతక్రితం 3.5–5 శాతంగా అంచనా వేసిన సంగతి తెలిసిందే. డిమాండ్ వాతావరణంతోపాటు విచక్షణా వ్యయాలు పెరుగుతున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ సి.విజయకుమార్ పేర్కొన్నారు. దీంతో గైడెన్స్‌ను మెరుగుపరచినట్లు తెలియజేశారు. తాము అందిస్తున్న డిజిటల్, ఏఐ సేవలపట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా.. మొత్తం ఆదాయం సైతం 5 శాతం పుంజుకుని రూ. 28,446 కోట్లకు చేరింది. త్రైమాసికవారీగా ఆదాయం 8.4 శాతం, నికర లాభం 3.6 శాతం చొప్పున వృద్ధి చూపాయి. వాటాదారులకు షేరుకి రూ. 18 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. దీనిలో రూ.6 ప్రత్యేక డివిడెండ్ కలసి ఉంది. ఆర్డర్లు ఓకే క్యూ3లో హెచ్‌సీఎల్ టెక్ 2.1 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ కుదుర్చుకుంది. క్యూ3లో 2,134 మంది ఉద్యోగులను జత చేసుకోగా.. మొత్తం సిబ్బంది సంఖ్య 2,20,755కు చేరింది. జనవరి–మార్చి(క్యూ4)లో 1,000 మందికి కొత్తగా ఉపాధి కల్పించనున్నట్లు హెచ్ఆర్ అధికారి ఆర్ సుందరరాజన్ తెలియజేశారు. వచ్చే ఏడాది(2025–26) ఉద్యోగులను తీసుకోవడంకంటే స్పెషలైజేషన్‌పై అధిక దృష్టి పెట్టనున్నట్లు వివరించారు. యూఎస్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై స్పందిస్తూ అక్కడి తమ ఉద్యోగుల్లో 80 శాతం స్థానికులేనని విజయకుమార్ వెల్లడించారు. దీంతో హెచ్1బీ వీసాలపై అతితక్కువగానే ఆధారపడుతున్నట్లు తెలియజేశారు. ఇవి ఏడాదికి 500–1,000వరకూ మాత్రమే ఉంటాయని తెలియజేశారు. వెరసి తమ బిజినెస్‌పై ఇలాంటి అంశాలు ప్రభావం చూపబోవని స్పష్టం చేశారు. ఫలితాల నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్ షేరు బీఎస్ఈలో 0.5 శాతం నష్టంతో రూ. 1,985 వద్ద ముగిసింది. -
టీసీఎస్ లాభం అప్ క్యూ3లో రూ. 12,380 కోట్లు
ముంబై: ఐటీ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్విసెస్(టీసీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసిక ఫలితాలు వెల్లడించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 12 శాతం ఎగసి రూ. 12,380 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 11,058 కోట్లు ఆర్జించింది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్(క్యూ2)లో సాధించిన రూ. 11,909 కోట్ల లాభంతో పోలిస్తే త్రైమాసికవారీగా 4 శాతం పుంజుకుంది. మొత్తం ఆదాయం 6 శాతం బలపడి రూ. 63,973 కోట్లకు చేరింది. గతేడాది క్యూ3లో రూ. 60,583 కోట్ల టర్నోవర్ అందుకుంది. వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 66 ప్రత్యేక డివిడెండ్‌తో కలిపి మొత్తం రూ. 76 చెల్లించనుంది. విభాగాలవారీగా ప్రధాన విభాగం బీఎఫ్ఎస్ఐసహా కన్జూమర్ బిజినెస్ వృద్ధి బాట పట్టినట్లు కంపెనీ పేర్కొంది. కొన్ని విభాగాలలో విచక్షణాధారిత వినియోగం పుంజుకుంటున్నట్లు తెలియజేసింది. వీటికితోడు ప్రాంతీయ మార్కెట్ల నుంచి డిమాండ్ బలపడుతున్నట్లు వివరించింది. వెరసి భవిష్యత్ వృద్ధి పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. కంపెనీ ప్రణాళికలకు అనుగుణంగా క్యాంపస్ ప్లేస్మెంట్లు చేపడుతున్నట్లు మానవ వనరుల ప్రధాన అధికారి మిలింద్ లక్కడ్ తెలియజేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26)లో మరింత మందికి ఉపాధి కలి్పంచే సన్నాహాల్లో ఉన్నట్లు వెల్లడించారు. రూ. 1,625 కోట్లు వెచ్చించి టాటా గ్రూప్ కంపెనీ నుంచి బెంగళూరులో భూమిని కొనుగోలు చేసినట్లు టీసీఎస్ పేర్కొంది.ఇతర విశేషాలు → కొత్తగా 10.2 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు పొందింది. → ఉద్యోగుల సంఖ్యలో నికరంగా 5,370 కోతపడింది. → మొత్తం సిబ్బంది సంఖ్య 6,07,354 మందికి చేరింది.→ ఈ ఏడాది 40,000 క్యాంపస్ ప్లేస్మెంట్ల సాధనవైపు సాగుతోంది. → డివిడెండుకు రూ. 21,500 కోట్లు వెచ్చించనుంది. → నిర్వహణ లాభ మార్జిన్లు 0.4 శాతం మెరుగుపడి 24.5 శాతాన్ని తాకాయి. → ఐటీ సర్విసుల ఉద్యోగ వలసల రేటు 13 శాతంగా నమోదైంది. మార్కెట్లు ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో టీసీఎస్ షేరు 1.7% క్షీణించి రూ. 4,037 వద్ద ముగిసింది. ఆర్డర్ల జోరు పండుగల సీజన్ కారణంగా అధిక సెలవులున్నప్పటికీ భారీ కాంట్రాక్టులను సాధించాం. విభిన్న రంగాలు, వివిధ ప్రాంతాలు, వివిధ లైన్లలో ఆర్డర్లు పొందాం. కంపెనీ దీర్ఘకాలిక వృద్ధిని ఇవి ప్రతిబింబిస్తున్నాయి. – కె.కృతివాసన్, సీఈవో, టీసీఎస్ -
క్రిసిల్ లాభం జూమ్
న్యూఢిల్లీ: రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ ఈ ఏడాది(2024) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 13 శాతం వృద్ధితో రూ. 172 కోట్లకు చేరింది. గతేడాది(2023) ఇదే కాలంలో రూ. 152 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 772 కోట్ల నుంచి రూ. 833 కోట్లకు బలపడింది. కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించే సంగతి తెలిసిందే. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 15 చొప్పున మూడో మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఈ షేరు బీఎస్ఈలో 2% లాభంతో రూ. 4,790 వద్ద ముగిసింది. -
భారత్ దూకుడు
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ దూసుకుపోతోంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) అంచనాలకు మించి 8.4 శాతంగా నమోదయ్యింది. ఎస్బీఐ రీసెర్చ్, జర్మనీ బ్రోకరేజ్– డాయిష్ బ్యాంక్ వంటి సంస్థలు 7 శాతం వరకూ వృద్ధి అంచనాలను వెలువరించాయి. తాజా ప్రోత్సాహకర ఎకానమీ ఫలితాల నేపథ్యంలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.6 శాతం నమోదవుతుందని విశ్వసిస్తున్నట్లు కేంద్ర గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) ప్రకటించింది. ఈ మేరకు తన రెండవ అడ్వాన్స్ అంచనాలను వెలువరించింది. మొదటి అడ్వాన్స్ అంచనాలు 7.3 శాతం. సమీక్షా కాలంలో (క్యూ3)లో తయారీ, మైనింగ్ అండ్ క్వారీ, నిర్మాణ రంగాలు మంచి పనితనాన్ని ప్రదర్శించినట్లు ఎన్ఎస్ఓ పేర్కొంది. కాగా, వ్యవసాయ రంగం తీవ్ర విచారకరమైన రీతిలో 0.8 శాతం క్షీణ రేటును నమోదుచేసుకుంది. ఇదిలావుండగా, గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో (క్యూ3) వృద్ధి రేటు 4.3 శాతం. క్యూ1, క్యూ2 శాతాలు అప్.. 2022–23 వృద్ధి అంచనాలను 7.2 శాతం నుంచి 7 శాతానికి ఎన్ఎస్ఓ తగ్గించడం మరో అంశం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఒకటి, రెండు త్రైమాసికాలకు సంబంధించి వృద్ధి అంకెలు వరుసగా 7.8 శాతం (క్యూ1), 7.6 శాతాలుగా (క్యూ2)నమోదయ్యాయి. అయితే ఈ అంకెలను ఎగువముఖంగా 8.2 శాతం, 8.1 శాతాలుగా ఎన్ఎస్ఓ సవరించడం మరో సానుకూల అంశం. తాజా ప్రోత్సాహకర ఫలితంతో 2023 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ఎకానమీ 8.2 శాతం పురోగమించినట్లు కేంద్ర గణాంకాల కార్యాలయం పేర్కొంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి 7.3 శాతం. 8.4 శాతం వృద్ధి ఎలా అంటే.. 2022–23 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి విలువ (ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటూ... 2011–12 బేస్ ఇయర్ ప్రాతిపదిక వాస్తవిక జీడీపీ) రూ.40.35 లక్షల కోట్లు. తాజా 2023–24 ఇదే త్రైమాసికంలో ఈ విలువ 43.72 లక్షల కోట్లకు పెరిగింది. అంటే అంకెల్లో వృద్ధి 8.4 శాతం అన్నమాట. ఇక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోని కరెంట్ ప్రైస్ ప్రకారం ఈ విలువ రూ.68.58 లక్షల కోట్ల నుంచి రూ.75.49 లక్షల కోట్లకు ఎగసింది. ఈ ప్రాతిపదిక వృద్ధి రేటు 10.1 శాతంగా ఉంది. ఆర్థిక సంవత్సరం 7.6 శాతం అంచనాలు చూస్తే.. (వాస్తవ వృద్ధి) జీడీపీ విలువ రూ.160.71 లక్షల కోట్ల నుంచి రూ.172.90 లక్షల కోట్లకు పెరగనుంది. కరెంట్ విలువ ప్రాతిపదికన ఈ వృద్ధి అంచనా 9.1 శాతంగా ఉంది. విలువల్లో రూ.269.50 లక్షల కోట్ల నుంచి రూ.293.90 లక్షల కోట్లకు జీడీపీ విలువ పెరగనుంది. జనవరిలో మౌలిక రంగం నిరాశ 8 పరిశ్రమల గ్రూప్ 3.6 శాతం వృద్ధి ఎనిమిది పరిశ్రమల మౌలిక రంగం గ్రూప్ జనవరిలో 15 నెలల కనిష్ట స్థాయిలో 3.6 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. 2023 జనవరిలో ఈ రేటు 4.9 శాతం. ఏప్రిల్ నుంచి జనవరి మధ్య కాలంలో ఈ గ్రూప్ వృద్ధి రేటు 8.3 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో ఈ గ్రూప్ వాటా దాదాపు 40 శాతం. సమీక్షా కాలంలో రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువుల రంగాల్లో వృద్ధి లేకపోగా, క్షీణత నమోదయ్యింది. బొగ్గు, స్టీల్, విద్యుత్ రంగాల్లో వృద్ధి మందగించింది. క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, సిమెంట్ రంగాల్లో వృద్ధి రేటు సానుకూలంగా ఉంది. తలసరి ఆదాయాలు ఇలా... మరోవైపు వాస్తవ గణాంకాల (ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని) ప్రాతిపదికన 2021–22లో దేశ తలసరి ఆదాయం రూ.1,50,906కాగా, 2022–23లో ఈ విలువ రూ. 1,69,496కు ఎగసినట్లు ఎన్ఎస్ఓ పేర్కొంది. కరెంట్ ప్రైస్ ప్రకారం చూస్తే ఈ విలువలు రూ.1,05,092 నుంచి రూ.1,18,755కు ఎగశాయి. -
ICRA: డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ 6 శాతం
న్యూఢిల్లీ: భారత్ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (2023 అక్టోబర్–డిసెంబర్) 6 శాతానికి తగ్గుతుందని రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (2023జూలై–సెపె్టంబర్)లో 7.6 శాతంగా ఉన్నట్టు గుర్తు చేసింది. వ్యవసాయం, పరిశ్రమల పనితీరు స్తబ్దుగా ఉన్నట్టు తెలిపింది. పారిశ్రామిక రంగంలో వృద్ధి తగ్గుముఖం పట్టడానికి గతంలో బేస్ ప్రభావం అధికంగా ఉండడానికితోడు, అమ్మకాల పరిమాణం తగ్గడాన్ని ప్రస్తావించింది.. భారత ప్రభుత్వం, 25 రాష్ట్రాల వ్యయాలు అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో 0.2 శాతం మేర తగ్గడం జీవీఏ వృద్ధిని వెనక్కి లాగడానికి కారణాల్లో ఒకటిగా పేర్కొంది. ‘‘పారిశ్రామిక రంగంలో అమ్మకాల పరిమాణం తగ్గడం, పెట్టుబడులపైనా కొంత స్తబ్దత, ప్రభుత్వ వ్యయాలు తగ్గడం, రుతుపవనాలు అసాధారణం ఉండడం వంటివి జీడీపీ వృద్ధిని 2023–24లో మూడో త్రైమాసికంలో 6 శాతానికి తగ్గిస్తాయి’’అని వివరించింది. ఇక సేవల రంగానికి సంబంధించి జీవీఏ (స్థూల అదనపు విలువ) మాత్రం 2023–24లో రెండో త్రైమాసికంలో ఉన్న 5.8 శాతం నుంచి మూడో త్రైమాసికంలో 6.5 శాతానికి వృద్ధి చెందుతుందని ఇక్రా అంచనా వేసింది. హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్, ప్రసార సేవలు ఇందుకు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. -
ఈజీ ట్రిప్ ప్లానర్స్ లాభం అప్
న్యూఢిల్లీ: ఆన్లైన్ ట్రావెల్ సరీ్వసుల కంపెనీ ఈజీ ట్రిప్ ప్లానర్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 10 శాతం వృద్ధితో రూ. 46 కోట్లకు చేరింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 42 కోట్లు ఆర్జించింది. ఈజ్‌మైట్రిప్ బ్రాండుతో సరీ్వసులందించే కంపెనీ మొత్తం ఆదాయం సైతం రూ. 136 కోట్ల నుంచి 161 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 83 కోట్ల నుంచి రూ. 105 కోట్లకు పెరిగాయి. ఎయిర్ టికెటింగ్ బిజినెస్‌కుతోడు హోటళ్లు, హాలిడేస్, ట్రాన్స్‌పోర్టేషన్ తదితర విభాగాలలోనూ సేవలను విస్తరిస్తున్నట్లు కంపెనీ సహవ్యవస్థాపకుడు, సీఈవో నిశాంత్ పిట్టి పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో ఈజీ ట్రిప్ షేరు బీఎస్ఈలో 3 శాతం పతనమై రూ. 51 వద్ద ముగిసింది. -
అపోలో హాస్పిటల్స్ లాభం 60 శాతం అప్..
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అధిక ఆదాయ ఊతంతో అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ (కన్సాలిడేటెడ్) నికర లాభం 60 శాతం పెరిగి రూ. 245 కోట్లకు చేరింది. క్రితం క్యూ3లో సంస్థ లాభం రూ. 153 కోట్లు. ఇక సమీక్షాకాలంలో ఆదాయం రూ. 4,264 కోట్ల నుంచి 14 శాతం పెరిగి రూ. 4,851 కోట్లకు చేరింది. షేరు ఒక్కింటికి రూ. 6 చొప్పున అపోలో హాస్పిటల్స్ మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ప్రివెంటివ్ హెల్త్‌కేర్, వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ విషయంలో ప్రజలకు సాధికారత కల్పించడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు సంస్థ అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి తెలిపారు. డిసెంబర్ 31 నాటికి అపోలో నెట్వర్క్ నిర్వహణలోని పడకల సంఖ్య 7,911కి చేరింది. ఆక్యుపెన్సీ 65 శాతానికి చేరింది. మూడో త్రైమాసికంలో ఫార్మసీకి సంబంధించి అపోలో హెల్త్ నికరంగా 119 కొత్త స్టోర్స్ ప్రారంభించడంతో మొత్తం స్టోర్స్ సంఖ్య 5,790కి చేరింది. గురువారం బీఎస్ఈలో కంపెనీ షేరు సుమారు 3 శాతం పెరిగి రూ. 6,432 వద్ద క్లోజయ్యింది. -
హీరో మోటో డివిడెండ్ రూ. 100
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 50 శాతం జంప్‌చేసి రూ. 1,093 కోట్లను తాకింది. వివిధ ప్రాంతాలలో అమ్మకాలు పుంజుకోవడం లాభాలకు దోహదపడింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 726 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 8,300 కోట్ల నుంచి రూ. 10,031 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో 18 శాతం అధికంగా 14.6 లక్షల మోటార్‌సైకిళ్లు, స్కూటర్లను విక్రయించింది. కంపెనీ చైర్మన్ ఎమెరిటస్ బ్రిజ్మోహన్ లాల్ ముంజాల్ శత జయంతి సందర్భంగా రూ. 25 ప్రత్యేక డివిడెండుతో కలిపి వాటాదారులకు కంపెనీ బోర్డు మొత్తం షేరుకి రూ. 100 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. రూ. 600 కోట్లు వెచి్చంచడం ద్వారా విడిభాగాలు, యాక్సెసరీస్, మెర్కండైజ్ బిజినెస్‌ను విస్తరించే ప్రణాళికల్లో ఉన్నట్లు హీరో మోటోకార్ప్ తాజాగా వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో హీరో మోటోకార్ప్ షేరు 2 శాతం లాభంతో రూ. 4,909 వద్ద ముగిసింది. -
ఎస్బీఐ లాభం 35% డౌన్
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (2023–24, క్యూ3)లో రూ. 9,164 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.14,205 కోట్లతో పోలిస్తే లాభం 35 శాతం తగ్గింది. ప్రధానంగా వేతనాలు, పెన్షన్ల కోసం వన్‌టైమ్ ప్రొవిజనింగ్ బ్యాంక్ లాభదాయకతకు గండి కొట్టింది. ఉద్యోగ సంఘాలతో కుదుర్చుకున్న 17% వేతన సెటిల్మెంట్ కారణంగా వేతనాలు, పెన్షన్ల కోసం అదనపు వన్‌టైమ్ ప్రొవిజనింగ్‌ను చేయాల్సి వచి్చందని, ఇది గనుక లేకపోతే నికర లాభం రూ.16,264 కోట్లుగా ఉండేదని ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా పేర్కొన్నారు. ప్రస్తుత లాభదాయకత ప్రకారం, రూ.40,000 కోట్లను సులభంగా సమీకరించగమని ఖారా చెప్పారు. అవి లేకుండా కూడా అదనంగా రూ.7.5 లక్షల కోట్ల రుణాలిచ్చే లిక్విడిటీ బఫర్ ఉందని ఆయన వివరించారు. మొండి బకాయిలు దిగొచ్చాయ్... క్యూ3లో స్థూల మొండి బకాయిలు 72 బేసిస్ పాయింట్లు దిగొచ్చి 2.42 శాతానికి (రూ.86,749 కోట్లు) తగ్గాయి. /æక నికర మొండి బకాయిలు కూడా 13 బేసిస్ పాయింట్లు తగ్గి 0.64 శాతానికి (రూ.22,408 కోట్లు) చేరాయి. ఇది పదేళ్ల కనిష్ట స్థాయి అని ఖారా పేర్కొన్నారు. కాగా, బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్ 1 శాతం తగ్గి 3.28 శాతానికి పరిమితమైంది. మొత్తం రుణాలు 14.38 శాతం ఎగబాకి రూ.35.84 లక్షల కోట్లకు చేరగా, మొత్తం డిపాజిట్లు 13.02 శాతం పెరిగి రూ. 47.62 లక్షల కోట్లకు ఎగిశాయి. పేటీఎం కస్టమర్లకు స్వాగతం... మార్చి 1 నుండి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలను దాదాపు నిలిపేయాలంటూ ఆర్బీఐ ఆదేశించిన నేపథ్యంలో, పేటీఎం కస్టమర్లకు (ఎక్కువ మంది వ్యాపారులే) సాయపడేందుకు ఎస్బీఐ సిద్ధంగా ఉందని చైర్మన్ ఖారా చెప్పారు. -
ఇండిగో లాభం రెట్టింపు
న్యూఢిల్లీ: విమానయాన రంగ దిగ్గజం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 2,998 కోట్లను అధిగమించింది. వెరసి వరుసగా ఐదో త్రైమాసికంలోనూ లాభదాయక పనితీరును ప్రదర్శించింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 1,423 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 15,410 కోట్ల నుంచి రూ. 20,062 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో 15.4 శాతం నికర లాభ మార్జిన్లు ఆర్జించినట్లు ఇండిగో బ్రాండు విమానయాన సేవల కంపెనీ సీఈవో పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నారు. వరుసగా ఐదు క్వార్టర్లపాటు లాభాలు సాధించడంతో కోవిడ్–19 కారణంగా నమోదైన నష్టాల నుంచి రికవర్ అయినట్లు తెలియజేశారు. సానుకూల నెట్‌వర్త్‌కు చేరినట్లు వెల్లడించారు. ఈ క్యూ3లో ప్రయాణికుల టికెట్ ఆదాయం 30 శాతంపైగా జంప్‌చేసి రూ. 17,157 కోట్లను తాకగా.. అనుబంధ విభాగాల నుంచి 24 శాతం అధికంగా రూ. 1,760 కోట్లు లభించినట్లు తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో ఇండిగో షేరు బీఎస్ఈలో 2 శాతం పుంజుకుని రూ. 3,127 వద్ద ముగిసింది. -
మారుతీ లాభం స్పీడ్
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికం(క్యూ3) లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 33 శాతం వృద్ధితో రూ. 3,207 కోట్లను తాకింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 2,406 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 15 శాతం పుంజుకుని రూ. 33,513 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 29,251 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. ఈ కాలంలో 8 శాతం అధికంగా 5,01,207 వాహనాలను విక్రయించింది. వీటిలో దేశీ అమ్మకాలు 4,29,422 యూనిట్లుకాగా.. 71,785 వాహనాలను ఎగుమతి చేసింది. ఇవి ఒక త్రైమాసికానికి కంపెనీ చరిత్రలోనే అత్యధికంకాగా.. గత క్యూ3లో దేశీయంగా 4,03,929, విదేశాలలో 61,982 యూనిట్ల చొప్పున విక్రయించింది. ఈ ఏడాది తొలి 9 నెలల్లో(ఏప్రిల్–డిసెంబర్) మారుతీ సుజుకీ 7 శాతం వృద్ధితో మొత్తం 15,51,292 వాహనాలను విక్రయించింది. ఇది సరికొత్త రికార్డుకాగా.. ఆదాయం, నికర లాభాల్లోనూ రికార్డులు నమోదయ్యాయి. మొత్తం ఆదాయం రూ. 1,03,387 కోట్లను తాకగా.. నికర లాభం 9,536 కోట్లు ఆర్జించింది. ఫలితాల నేపథ్యంలో మారుతీ షేరు 2.3 శాతం బలపడి రూ. 10,183 వద్ద ముగిసింది. -
సన్ ఫార్మా లాభం అప్
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ రంగ దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 17 శాతం వృద్ధితో రూ. 2,524 కోట్లను తాకింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 2,166 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 11,241 కోట్ల నుంచి రూ. 12,381 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 8,943 కోట్ల నుంచి రూ. 9,561 కోట్లకు పెరిగాయి. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 8.5 చొప్పున మధ్యంతర డివిడెండు ప్రకటించింది. గ్లోబల్ స్పెషాలిటీసహా విస్తారిత వృద్ధిని సాధించినందుకు సంతోíÙస్తున్నట్లు కంపెనీ ఎండీ దిలీప్ సంఘ్వీ పేర్కొన్నారు. రానున్న నెలల్లో నైడెల్జీ ఈఎంఏ ఫైలింగ్‌పై దృష్టిపెట్టనున్నట్లు తెలియజేశారు. మెలనోమాతోపాటు, మెలనోమాయేతర చర్మ కేన్సర్ల చికిత్సలో వినియోగించే బయోఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్ ఇది. విభాగాలవారీగా ప్రస్తుత సమీక్షా కాలంలో దేశీయంగా సన్ ఫార్మా ఫార్ములేషన్ల అమ్మకాలు 11 శాతంపైగా పుంజుకుని రూ. 3,779 కోట్లకు చేరాయి. టారోసహా యూఎస్ విక్రయాలు 13 శాతం ఎగసి 47.7 కోట్ల డాలర్లను తాకాయి. వర్ధమాన మార్కెట్లలో ఇవి 2 శాతం నీరసించి 25.2 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. ఇతర ప్రపంచ మార్కెట్ల నుంచి 13 శాతం అధికంగా 21.4 కోట్ల డాలర్ల అమ్మకాలు సాధించింది. ఏపీఐ విక్రయాలు 10 శాతం క్షీణించి రూ. 466 కోట్లకు చేరాయి. ఈ కాలంలో పరిశోధన, అభివృద్ధిపై రూ. 825 కోట్ల పెట్టుబడులు వెచి్చంచింది. గత క్యూ3లో ఇవి రూ. 670 కోట్లు మాత్రమే. ఫలితాల నేపథ్యంలో సన్ ఫార్మా షేరు బీఎస్ఈలో 3.5 శాతం లాభపడి రూ. 1,419 వద్ద ముగిసింది. -
ఐటీసీ లాభం రూ. 5,401 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 6 శాతంపైగా వృద్ధితో రూ. 5,401 కోట్లను తాకింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 5,070 కోట్లు ఆర్జించింది. సిగరెట్లుసహా ఎఫ్ఎంసీజీ బిజినెస్ లాభాలకు దన్నునిచి్చంది. వాటాదారులకు షేరుకి రూ. 6.25 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఇందుకు ఫిబ్రవరి 8 రికార్డ్ డేట్‌గా ప్రకటించింది. కాగా.. నాన్‌ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అతుల్ సింగ్, స్వతంత్ర డైరెక్టర్‌గా పుష్ప సుబ్రహ్మణ్యంను బోర్డు ఎంపిక చేసినట్లు ఐటీసీ పేర్కొంది. 2024 ఏప్రిల్ 2 నుంచి ఐదేళ్లపాటు బాధ్యతలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఆదాయం అప్ ప్రస్తుత సమీక్షా కాలంలో ఐటీసీ స్థూల ఆదాయం 2 శాతం పుంజుకుని రూ. 19,338 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 18,902 కోట్ల టర్నోవర్ నమోదైంది. కాగా.. మొత్తం కార్యకలాపాల టర్నోవర్ రూ. 19,484 కోట్లుగా నమోదైంది. ఆదాయంలో సిగరెట్లతోపాటు ఎఫ్ఎంసీజీ బిజినెస్ నుంచి 4.5 శాతం అధికంగా రూ. 13,513 కోట్లు లభించగా.. సిగరెట్ల నుంచి 3 శాతం వృద్ధితో రూ. 8,295 కోట్లు సమకూర్చుకుంది. ఎఫ్ఎంసీజీలో ఇతర విభాగాలు 8 శాతం ఎగసి రూ. 5,218 కోట్ల టర్నోవర్‌ను సాధించాయి. ఐటీసీ హోటళ్ల నుంచి 18 శాతం అధికంగా రూ. 872 కోట్ల ఆదాయం లభించింది. ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు 1.5 శాతం నష్టంతో రూ. 449 వద్ద ముగిసింది. -
ఎస్బీఐ కార్డ్ లాభం ప్లస్
న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డుల దిగ్గజం ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సరీ్వసెస్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో నికర లాభం 8 శాతం వృద్ధితో రూ. 549 కోట్లను తాకింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 509 కోట్లు ఆర్జించింది. పీఎస్‌యూ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ప్రమోట్ చేసిన కంపెనీ మొత్తం ఆదాయం సైతం రూ. 3,656 కోట్ల నుంచి రూ. 4,742 కోట్లకు ఎగసింది. అయితే నిర్వహణ వ్యయాలు 23 శాతం పెరిగి రూ. 2,426 కోట్లకు చేరాయి. గత క్యూ3లో ఇవి రూ. 1,974 కోట్లుగా నమోదయ్యాయి. స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 2.22% నుంచి 2.64 శాతానికి, నికర ఎన్పీఏలు 0.8% నుంచి 0.96 శాతానికి పెరిగాయి. దీంతో అనుకోని నష్టాలు, మొండి రుణాల వ్యయాలు రూ. 533 కోట్ల నుంచి రూ. 883 కోట్లకు పెరిగాయి. కాగా.. డిసెంబర్‌కల్లా కనీస మూలధన నిష్పత్తి 23.1 శాతంగా నమోదైంది. 2023 మార్చిలో 18.4 శాతం సీఏఆర్ సాధించింది. -
అదానీ పవర్ ఆకర్షణీయం
న్యూఢిల్లీ: అదానీ పవర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.9 కోట్లతో పోల్చి చూసినప్పుడు ఎన్నో రెట్ల వృద్ధితో రూ.2,738 కోట్లకు దూసుకుపోయింది. మొత్తం ఆదాయం సైతం రూ.8,290 కోట్ల నుంచి రూ.13,355 కోట్లకు వృద్ధి చెందింది. మహన్ వద్ద 1,600 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం ప్రణాళిక ప్రకారమే కొనసాగుతున్నట్టు కంపెనీ తెలిపింది. ఇనార్గానిక్ (ఇతర సంస్థల కొనుగోళ్లు) మార్గంలో తమ నాయకత్వ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోనున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ త్రైమాసికంతోపాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొమ్మిది నెలల్లో ముంద్రా, ఉడుపి, రాయిపూర్, మహన్ ప్లాంట్లు అధిక విక్రయాలకు సాయపడినట్టు తెలిపింది. అదే సమయంలో గొడ్డా ప్లాంట్ నుంచి అదనపు ఉత్పత్తి తోడైనట్టు వివరించింది. బంగ్లాదేశ్ విద్యుత్ సరఫరా వ్యవస్థలో ఇది (గొడ్డా ప్లాంట్) కీలక భాగంగా మారినట్టు పేర్కొంది. మూడో త్రైమాసికంలో 21.5 బిలియన్ యూనిట్ల విద్యుత్‌ను విక్రయించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 11.8 బిలియన్ యూనిట్లుగానే ఉంది. రుణాలకు చేసే వ్యయాలు క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.946 కోట్ల నుంచి రూ.797 కోట్లకు తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంత్సరం డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి నికర లాభం 230 శాతం పెరిగి రూ.18,092 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ.5,484 కోట్లుగా ఉంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో అదానీ పవర్ షేరు 4 శాతానికి పైగా లాభపడి రూ.542 వద్ద ముగిసింది. -
ఎస్బీఐ లైఫ్ లాభం అప్
ముంబై: ప్రయివేట్ రంగ జీవిత బీమా దిగ్గజం ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 15 శాతం ఎగసి రూ. 1,083 కోట్లకు చేరింది. ప్రీమియం ఆదాయం, మార్జిన్లు పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. వ్యక్తిగత కొత్త బిజినెస్ ప్రీమియం 17 శాతం జంప్‌చేసి రూ. 17,762 కోట్లను తాకింది. వార్షిక ప్రీమియం పాలసీల ఆదాయం(ఏపీఈ) 17 శాతం పుంజుకుని రూ. 14,389 కోట్లయ్యింది. కొత్త బిజినెస్ విలువ(వీఎన్‌బీ) 11 శాతం బలపడి రూ. 4,038 కోట్లకు చేరింది. వీఎన్‌బీ మార్జిన్ 28.1 శాతంగా నమోదైంది. కొత్త బిజినెస్ ప్రీమియం రూ. 21,512 కోట్ల నుంచి రూ. 26,000 కోట్లకు పురోగమించింది. రక్షణ సంబంధ కొత్త బిజినెస్ ప్రీమియం 17 శాతం అధికమై రూ. 2,972 కోట్లుగా నమోదైంది. యాన్యుటీ, పెన్షన్ కొత్త బిజినెస్ 12 శాతం వృద్ధితో రూ. 6,787 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో ఎస్బీఐ లైఫ్ షేరు బీఎస్ఈలో 2 శాతం క్షీణించి రూ. 1,381 వద్ద ముగిసింది. -
కరూర్ వైశ్యా లాభం హైజంప్
ముంబై: ప్రైవేట్ రంగ సంస్థ కరూర్ వైశ్యా బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 43 శాతం జంప్‌చేసి రూ. 412 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 289 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 2,013 కోట్ల నుంచి రూ. 2,497 కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.12 శాతం మెరుగుపడి 1.58 శాతానికి చేరాయి. గత క్యూ3లో 2.7 శాతంగా నమోదయ్యాయి. నికర ఎన్పీఏలు సైతం 0.9 శాతం నుంచి 0.42 శాతానికి దిగివచ్చాయి. వృద్ధి, లాభదాయకత, రుణాల నాణ్యత తదితర అంశాలలో మరోసారి నిలకడైన, పటిష్ట పనితీరును ప్రదర్శించగలిగినట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో బి.రమేష్ బాబు పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో శనివారం కరూర్ వైశ్యా బ్యాంక్ షేరు బీఎస్ఈలో 0.3 శాతం బలపడి రూ. 170 వద్ద ముగిసింది. -
డీమార్ట్ లాభం అప్ క్యూ3లో రూ. 690 కోట్లు
న్యూఢిల్లీ: డీమార్ట్ స్టోర్ల రిటైల్ చైన్ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికం(క్యూ3)లో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో నికర లాభం 17 శాతం బలపడి రూ. 690 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 590 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 17 శాతంపైగా పుంజుకుని రూ. 13,572 కోట్లను అధిగమించింది. గత క్యూ3లో రూ. 11,569 కోట్ల టర్నోవర్ సాధించింది. అయితే మొత్తం వ్యయాలు 17 శాతం పెరిగి రూ. 12,656 కోట్లను తాకాయి. డిసెంబర్ చివరికల్లా మొత్తం స్టోర్ల సంఖ్య 341కు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. హరీష్చంద్ర ఎం.భారుకాను స్వతంత్ర డైరెక్టర్‌గా బోర్డు ఎంపిక చేసినట్లు కంపెనీ తాజాగా పేర్కొంది. -
వ్యాపార ఆశావాదం జూమ్
హైదారాబాద్: వ్యాపార ఆశావాదం మెరుగుపడినట్టు టీఆర్ఏ మార్కెటింగ్ డెసిషన్ ఇండెక్స్ ప్రకటించింది. 2023 మూడో త్రైమాసికం (జూలై–సెప్టెంబర్) విషయంలో వ్యాపార ఆశావహం ఎంతో ఎక్కువగా ఉంటుందని తాజా నివేదికలో వెల్లడించింది. వరుసగా మూడో త్రైమాసికంలోనూ అధిక సానుకూలత వ్యక్తమైనట్టు తెలిపింది. టీఆర్ఏ మార్కెటింగ్ డెసిషన్ ఇండెక్స్ (ఎండీఐ) 2023 క్యూ2లో 89.37గా ఉంటే క్యూ3 అంచనాలు 92.68 పాయింట్లకు చేరింది. 50కిపైన సానుకూలంగా, 50కి దిగువ ప్రతికూలంగా పరిగణిస్తుంటారు. ఈ ప్రకారం మూడో త్రైమాసికానికి వ్యాపార ఆశావహం ఎంతో మెరుగ్గా ఉంటుందని ఎండీఐ తెలిపింది. నివేదికలోని అంశాలు.. ► కంపెనీలకు సంబంధించి మార్కెటింగ్ బడ్జెట్ గణనీయంగా పెరగొచ్చు. ఇందుకు సంబంధించి సూచీ 8.8 శాతం పెరిగి 85.1 నుంచి 92.6 పాయింట్లకు క్యూ3లో చేరుకోవచ్చు. ► ప్రాంతీయ ప్రింట్ ప్రకటనల వాటా మార్కెటింగ్ బడ్జెట్లో అధికంగా ఉంటుంది. అవుట్ ఆఫ్ హోమ్ అడ్వర్టైజింగ్ (ఓఓహెచ్) వాటా 11 శాతం, జాతీయ టీవీల ప్రకటనలు, రేడియో ప్రకటనలు చెరో 10 శాతం వాటా ఆక్రమించనున్నాయి. ► లోకల్ టీవీ ప్రకటనలు, ఇంగ్లిష్ ప్రింట్ ప్రకటనల వాటా 9 శాతం, సోషల్ మీడియా ప్రకటనల వాటా 7 శాతం మేర ఉండనుంది. డిజిటల్ సెర్చ్, డిజిటల్ యాడ్ 6 శాతం ఉండొచ్చని ఎండీఐ నివేదిక అంచనా వేసింది. -
దివాలా పరిష్కారాలు అంతంతే
ముంబై: కంపెనీ చట్ట ట్రిబ్యునళ్లలో దాఖలైన దివాలా కేసులు ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికం(క్యూ3)లో అంతంతమాత్రంగానే పరిష్కారమయ్యాయి. వెరసి క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో దివాలా పరిష్కారాలు(రిజల్యూషన్లు) 15 శాతంగా నమోదయ్యాయి. ఇన్సాల్వెన్సీ, దివాలా బోర్డు(ఐబీబీఐ) గణాంకాల ప్రకారం 267 దివాలా కేసులలో 15 శాతమే రిజల్యూషన్ల స్థాయికి చేరాయి. ఇక క్లెయిమ్ చేసిన రుణాలలో 27 శాతమే రికవరీ అయినట్లు గణాంకాలు వెల్లడించాయి. 45 శాతం కేసులు లిక్విడేషన్ ద్వారా ముగిసినట్లు ఐబీబీఐ గణాంకాలను విశ్లేషించిన కొటక్ సెక్యూరిటీస్ పేర్కొంది. త్రైమాసికవారీగా చూస్తే ఈ ఏడాది క్యూ2(జులై–సెప్టెంబర్)లో కేసులు 256కు దిగివచ్చాయి. 2019–20లో నమోదైన 2,000 కేసుల రన్‌రేట్‌తో పోలిస్తే భారీగా తగ్గాయి. కాగా.. ఎలాంటి రిజల్యూషన్ ప్రణాళికలు లభించకపోవడంతో లిక్విడేషన్లలో మూడో వంతు కేసులు ముగిసినట్లు కొటక్ విశ్లేషణ వెల్లడించింది. మొత్తం 1,901 కేసులు పరిష్కారంకాగా.. 1,229 కేసులు లిక్విడేషన్కే బ్యాంకర్లు ఓటేశారు. మరో 600 కేసులలో ఎలాంటి పరిష్కార ప్రణాళికలూ దాఖలు కాలేదు. 56 కేసుల విషయంలో నిబంధలకు అనుగుణంగాలేక తిరస్కరణకు గురికాగా.. 16 కేసుల్లో పరిష్కార ప్రొవిజన్లకు రుణదాతలు అనుమతించలేదు. ఇక లిక్విడేషన్ కేసులలో 76 శాతం కంపెనీ మూతపడటం లేదా ఆర్థిక పునర్వ్యవస్థీకరణ(బీఐఎఫ్ఆర్) వల్ల నమోదుకాగా.. మిగిలినవి ఇతర కారణాలతో జరిగినట్లు కొటక్ వివరించింది. కేసుల పరిష్కారం ఆలస్యమవుతున్నప్పటికీ 2021 క్యూ2 (కరోనా మహమ్మారి కాలం)తో పోలిస్తే తగ్గినట్లే. 270 రోజులకుపైగా ఈ ఏడాది క్యూ3లో దాఖలైన కేసులలో 64% 270 రోజులను దాటేశాయి. మరో 14% కేసులు నమోదై 180 రోజులైంది. వెరసి లిక్విడేషన్ కేసులు అధికమయ్యే వీలున్నట్లు కొటక్ విశ్లేషించింది. రుణ పరిష్కార సగటు 590 రోజులుగా తెలియజేసింది. కొత్త కేసుల విషయంలో 50 శాతంవరకూ నిర్వాహక రుణదాతలు చేపడుతుంటే, 40 శాతం ఫైనాన్షియల్ క్రెడిటర్లకు చేరడం క్యూ3లో కనిపిస్తున్న కొత్త ట్రెండుగా తెలియజేసింది. తాజా త్రైమాసికంలో దాఖౖ లెన కేసులలో 42 శాతం తయారీ రంగం నుంచికాగా, 18 శాతం రియల్టీ, 13 శాతం రిటైల్, హోల్‌సేల్ వాణిజ్యం, 7 శాతం నిర్మాణం నుంచి నమోదయ్యాయి. ఐబీసీ ప్రాసెస్ తొలి నాళ్లలో భారీ కార్పొరేట్ కేసులు అధికంగా నమోదుకాగా.. ప్రస్తుతం దేశీ కార్పొరేట్ పరిస్థితులు పటిష్ట స్థితికి చేరుతు న్నట్లు విశ్లేషణ పేర్కొంది. కొత్త కేసులలో కరోనా మహమ్మారి ప్రభావంపడిన మధ్య, చిన్నతరహా సంస్థల నుంచి నమోదవుతున్నట్లు తెలియజేసింది. ఐబీసీ ద్వారా మొత్తం రుణ పరిష్కార విలువ రూ. 8.3 లక్షల కోట్లకు చేరగా.. ఫైనాన్షియల్ క్రెడిటర్లు 73 శాతం హెయిర్‌కట్‌ను ఆమోదించాయి. -
పెద్ద పట్టణాల్లో ఇళ్ల అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో 11 శాతం పెరిగినట్టు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ఏడు పట్టణాల్లో 149 మిలియన్ చదరపు అడుగులు (ఎంఎస్ఎఫ్) అమ్ముడుపోయినట్టు వెల్లడించింది. గత పదేళ్లలో ఒక త్రైమాసికం వారీ అత్యధిక విక్రయాలు ఇవేనని పేర్కొంది. డిమాండ్ మెరుగ్గా ఉండడమే వృద్ధికి మద్దతునిచ్చినట్టు తెలిపింది. 2022–23 మొదటి తొమ్మిది నెలల్లో (2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు) ఈ ఏడు ప్రధాన పట్టణాల్లో 412 ఎంఎస్ఎఫ్ అడుగుల ఇళ్లను విక్రయించినట్టు ఇక్రా తెలిపింది. అంతక్రితం ఏడాది ఇదే తొమ్మిది నెలల్లో విక్రయాలు 307 ఎంఎస్ఎఫ్తో పోలిస్తే 30 శాతానికి పైగా వృద్ధి నమోదైంది. కరోనా మహమ్మారి తర్వాత కొనుగోలుదారుల ప్రాధాన్యతల్లో మార్పు వచ్చిందంటూ.. లగ్జరీ, మధ్య స్థాయి ధరల ఇళ్ల వాటా పెరిగినట్టు వివరించింది. 2019–20లో లగ్జరీ ఇళ్ల వాటా 14 శాతం, మధ్యస్థాయి ధరల ఇళ్ల వాటా 36 శాతం చొప్పున ఉంటే.. 2022–23 ఏప్రిల్–డిసెంబర్ కాలానికి లగ్జరీ ఇళ్ల అమ్మకాల వాటా 16 శాతానికి పెరిగితే, మధ్యస్థాయి ఇళ్ల విక్రయాల వాటా 42 శాతానికి చేరింది. హైదరాబాద్‌తోపాటు, చెన్నై బెంగళూరు, కోల్‌కతా, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, నేషనల్ క్యాపిటల్ రీజియన్, పుణె పట్టణాలకు సంబంధించి ఇక్రా గణాంకాలు విడుదల చేసింది. 2023–24లో 16 శాతం.. ‘‘రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ అమ్మకాలు విలువ పరంగా 2022–23లో 8–12 శాతం మేర వృద్ధి చెందొచ్చు. 2023–24లో 14–16 శాతం మధ్య పెరగొచ్చు’’అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్, కో గ్రూప్ హెడ్ అనుపమ రెడ్డి తెలిపారు. టాప్–12 డెవలపర్ల ప్రాథమిక గణాంకాల ఆధారంగా వేసిన అంచనాలుగా ఇక్రా పేర్కొంది. ఆర్బీఐ వడ్డీ రేట్ల పెరుగుదల గృహ కొనుగోళ్లపై లేదని తెలిపింది. ‘‘కరోనా ముందున్న నాటి రేట్ల కంటే ఇప్పటికీ గృహ రుణాలపై రేట్లు తక్కువే ఉన్నాయి. కనుక కొనుగోలు శక్తి ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉంది. తక్కువ నిల్వలు, డెవలపర్లు తమకు అనుకూలంగా ప్రాజెక్టులు ప్రారంభించడం, ఉద్యోగ మార్కెట్లో మందగమనం, వడ్డీ రేట్లు మరింత పెరుగుదల కొనుగోలు శక్తిపై చూపించే అంశాలు’’అని పేర్కొంది. 2022 డిసెంబర్ నాటికి అమ్ముడుపోని ఇళ్ల పరిమాణం 839 ఎంఎస్ఎఫ్గా ఉందని ఇక్రా తెలిపింది. 2021 డిసెంబర్లో విక్రయం కాని ఇళ్లు 923 ఎంఎస్ఎఫ్తో పోలిస్తే తక్కువేనని గుర్తు చేసింది. వార్షికంగా చూస్తే 2022 డిసెంబర్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు 10 శాతం పెరిగినట్టు పేర్కొంది. పెరిగిన నిర్మాణ వ్యయాలను కస్టమర్లకు బదిలీ చేయడమే ధరల పెరుగుదలకు కారణంగా తెలిపింది. -
‘ఆటో’కు తీరని చిప్ చిక్కులు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో వాహనాల పరిశ్రమకు మొదలైన సెమీ కండక్టర్ల కష్టాలు ఇంకా పూర్తిగా తీరలేదు. గతంతో పోలిస్తే తీవ్రత కొంత తగ్గినా ఇప్పటికీ చిప్‌ల కొరత వెన్నాడుతూనే ఉంది. దీంతో ఆర్డర్లు పుష్కలంగా ఉన్నా ఆటోమొబైల్ కంపెనీలు ఉత్పత్తిని పెంచుకోలేకపోతున్నాయి. ఫలితంగా పెండింగ్ ఆర్డర్లు పేరుకుపోతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఆటోమొబైల్ కంపెనీలు దాదాపుగా ఇవే విషయాలను ప్రస్తావించాయి. రెండో త్రైమాసికంతో పోలి స్తే మూడో క్వార్టర్లో పరికరాల సరఫరాపరమైన సమస్య స్వల్పంగా పెరిగిందని మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐఎల్) పేర్కొంది. క్యూ3లో దా దాపు 46,000 వాహనాలను ఉత్పత్తి చేయలేకపోయినట్లు తెలిపింది. ఎలక్ట్రానిక్ పరికరాల లభ్యతపై స్పష్టత లేకపోవడంతో ఉత్పత్తి ప్రణాళికలు వేసుకోవడం సవాలుగా మారిందని ఎంఎస్ఐఎల్ వివరించింది. దీనితో మూడో త్రైమాసికం ఆఖరు నాటికి 3,63,000 వాహనాల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయని.. వీటిలో 1,19,000 ఆర్డర్లు ఇటీవల ప్రవేశపెట్టిన మోడల్స్వే ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. అదే పరిస్థితిలో మరిన్ని సంస్థలు .. మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) కూడా దాదాపు ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది. కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం తెలంగాణ, మహారాష్ట్రలో దాదాపు రూ. 11,000 కోట్లతో పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించినప్పటికీ ప్రస్తుతమున్న ప్లాంట్ల సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థల్లో ఆటంకాలే ఇందుకు కారణమని కంపెనీ ఈడీ రాజేశ్ జెజూరికర్ వెల్లడించారు. స్కార్పియో, ఎక్స్‌యూవీ700 వంటి వాహనాల తయారీలో దాదాపు 200 రకాల సెమీకండక్టర్ చిప్స్ అవసరమవుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఎంఅండ్ఎం వద్ద 2,66,000 వాహనాలకు ఆర్డర్లు ఉన్నాయి. ఇక చిప్లపరమైన సవాళ్లు 2023లో కూడా కొనసాగవచ్చని జేఎల్ఆర్ పేర్కొంది. చిప్‌ల సరఫరాను మెరుగుపర్చుకునే దిశ గా మంచి పురోగతే సాధించామని .. అయినప్పటికీ కొన్ని సవాళ్లు నెలకొన్నాయని తెలిపింది. చైనాలో మళ్లీ కోవిడ్ ప్రబలడం, మార్కెట్లో అధిక రేట్లకు చిప్‌లు కొనాల్సి వస్తుండటం తదితర సవాళ్లు ఉన్న ట్లు వివరించింది. 2023లో డిమాండ్ సానుకూలంగానే ఉంటుందని భావిస్తున్నామని అయితే వాహనాలను ఎంత మేరకు అందించగలమనేది చిప్‌ల సరఫరా అంశమే నిర్దేశిస్తుందని స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ఎండీ పియుష్ ఆరోరా తెలిపారు. -
క్యూ3లో మార్జిన్ల నేలచూపు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో దేశీ కార్పొరేట్ల నిర్వహణ లాభ మార్జిన్లు మందగించనున్నట్లు రేటింగ్ దిగ్గజం ఇక్రా తాజాగా అంచనా వేసింది. ఇందుకు ద్రవ్యోల్బణం, ఇంధన వ్యయాలు కారణంకానున్నట్లు పేర్కొంది. వెరసి అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో వార్షిక ప్రాతిపదికన ఇబిటా మార్జిన్లు 2.37 శాతం క్షీణించి 16.3 శాతానికి పరిమితంకానున్నాయి. అయితే త్రైమాసికవారీగా అంటే జులై–సెప్టెంబర్(క్యూ2)తో పోల్చి చూస్తే 1.8 శాతం బలపడనున్నట్లు ఇక్రా రేటింగ్స్ అభిప్రాయపడింది. ఇందుకు ముడివ్యయాలు తగ్గడం, పలు కంపెనీలు ప్రొడక్టుల ధరలను పెంచడం దోహదపడనున్నట్లు తెలియజేసింది. త్రైమాసికవారీగా ముడివ్యయాలు నీరసించడంతోపాటు.. ఉత్పత్తుల విక్రయ ధరలు మెరుగుపడటంతో సమీప కాలంలో మార్జిన్లు బలపడనున్నట్లు వివరించింది. అయితే భౌగోళిక రాజకీయ ఆందోళనలు, ఆర్థిక మాంద్య భయాలు, ఫారెక్స్ హెచ్చుతగ్గుల కారణంగా రిస్కులు ఎదురుకావచ్చని పేర్కొంది. ఫైనాన్షియల్ మినహా.. ఫైనాన్షియల్ రంగ సంస్థలు మినహా ఇతర కంపెనీల ఆదాయం 17.2 శాతం పుంజుకోనున్నట్లు ఇక్రా అంచనా వేసింది. హోటళ్లు, చమురు గ్యాస్, ఆటో, ఎయిర్‌లైన్స్, విద్యుత్ రంగాలు ఆదాయ వృద్ధిలో ముందు నిలవనున్నట్లు తెలియజేసింది. త్రైమాసికవారీగా మాత్రం ఆదాయంలో 1.4 శాతమే వృద్ధి నమోదుకావచ్చని అభిప్రాయపడింది. ఇందుకు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, కన్జూమర్ సెంటిమెంట్లు ప్రభావం చూపనున్నట్లు తెలియజేసింది. ఇంధన వ్యయాల ద్రవ్యోల్బణం, అభివృద్ధి చెందిన దేశాలలో మాంద్య పరిస్థితులు, ఎగుమతి, దిగుమతి కంపెనీలపై విదేశీ మారక ఆటుపోట్లు వంటి అంశాలను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో దేశీ కార్పొరేట్ ఫలితాలు ఆధారపడి ఉంటాయని ఇక్రా నిపుణులు శ్రుతి థామస్ తెలియజేశారు. -
బ్యాంకులకు దండిగా వడ్డీ ఆదాయం
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో బ్యాంకుల వడ్డీ ఆదాయం గణనీయంగా వృద్ధి చెందింది. 25.5 శాతం పెరిగి రూ.1.78 లక్షల కోట్లుగా నమోదైంది. ఇచ్చిన రుణాలపై అధిక మార్జిన్, అధికంగా రుణాల వితరణ దీనికి కలిసొచ్చింది. నికర వడ్డీ మార్జిన్ (నిమ్) 0.17 శాతం పెరిగి 3.28 శాతానికి చేరింది. ప్రస్తుత రుణాలపై రేట్లను పెంచడంతోపాటు, కొత్తగా ఇచ్చే రుణాలపైనా రేట్లు పెంచడం, డిపాజిట్ రేట్లను పెద్దగా మార్చకుండా అదే స్థాయిలో కొనసాగించడం వడ్డీ ఆదాయం వృద్ధికి సానుకూలించినట్టు కేర్ రేటింగ్స్ తెలిపింది. బ్యాంకుల ఆదాయంపై ఈ సంస్థ ఓ అధ్యయన నివేదికను విడుదల చేసింది. నిమ్ వృద్ధిలో ప్రైవేటు బ్యాంకుల పాత్ర ఎక్కువగా ఉంది. మెరుగైన నిర్వహణ సామర్థ్యాల వల్ల ప్రైవేటు బ్యాంకుల నిమ్ 0.15 శాతం పెరిగి 4.03 శాతానికి చేరుకుంది. ప్రభుత్వరంగ బ్యాంకుల నిమ్ 0.17 శాతం వృద్ధితో 2.85 శాతంగా ఉంది. బ్యాంకులు సమీకరించిన డిపాజిట్లు/నిధులపై చెల్లించే రేటుకు, ఈ నిధులను రుణాలుగా ఇచ్చి వసూలు చేసే వడ్డీ రేటుకు మధ్య వ్యత్యాసమే నికర వడ్డీ మార్జిన్. పెద్ద బ్యాంకులు డిపాజిట్లపై అధిక రాబడులను ఆఫర్ చేయడం ఆరంభించాయని, రుణాలకు రెండంకెల స్థాయిలో డిమాండ్ ఉండగా, అదే స్థాయిలో డిపాజిట్లు రావడం లేదని క్రిసిల్ నివేదిక తెలిపింది. కనుక నిమ్ ఈ స్థాయిలో స్థిరపడొచ్చని అంచనా వేసింది. ఆర్బీఐ గతేడాది మే నుంచి 2.5 శాతం మేర పెరో రేటును పెంచడం తెలిసిందే. రుణాల్లో చక్కని వృద్ధి డిసెంబర్ క్వార్టర్లో బ్యాంకులు రుణాల్లో 18.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి. రుణ వితరణలో ప్రభుత్వరంగ బ్యాంకులది పైచేయిగా ఉంది. ప్రభుత్వరంగ బ్యాంకులు 18.9 శాతం అధికంగా రుణాలను మంజూరు చేయగా, ప్రైవేటు రంగ బ్యాంకుల రుణ వితరణలో 17.9 శాతం వృద్ధిని చూపించాయి. నికర వడ్డీ మార్జిన్లో మాత్రం ప్రభుత్వరంగ బ్యాంకుల కంటే ప్రైవేటు బ్యాంకుల పనితీరు మెరుగ్గా ఉంది. వడ్డీ వ్యయాలు ప్రైవేటు రంగ బ్యాంకులకు 27.3 శాతానికి పెరిగితే, ప్రభుత్వరంగ బ్యాంకులకు 22.6 శాతానికి చేరాయి. సగటు రుణ రేటు 1.2 శాతం పెరిగి 8.9 శాతంగా ఉంది. డిపాజిట్ల కోసం బ్యాంకుల మధ్య పోటీ ఉండడం, ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు నేపథ్యంలో రానున్న రోజుల్లో డిపాజిట్ రేట్లు పెరుగుతాయని అంచనా వేసింది. 12 ప్రభుత్వరంగ, 18 ప్రైవేటు రంగ బ్యాంకుల గణాంకాల ఆధారంగా కేర్ రేటింగ్స్ ఈ వివరాలను రూపొందించింది. -
లాభాల్లోకి అదానీ ఎంటర్ప్రైజెస్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్ప్రైజెస్ మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించింది. రూ. 820 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 12 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం 42 శాతం జంప్‌చేసి రూ. 26,612 కోట్లను అధిగమించింది. అయితే మొత్తం వ్యయాలు 37 శాతం పెరిగి రూ. 26,171 కోట్లను దాటాయి. కంపెనీకి ప్రధానమైన ఇంటిగ్రేటెడ్ రీసోర్స్ మేనేజ్మెంట్ విభాగం పన్నుకుముందు లాభం 370 శాతం దూసుకెళ్లి రూ. 669 కోట్లను తాకింది. ఈ బాటలో మైనింగ్, న్యూఎనర్జీ లాభాలు 3 రెట్లు ఎగసినట్లు కంపెనీ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు ఎన్ఎస్ఈలో 2 శాతం బలపడి రూ. 1,750 వద్ద ముగిసింది. -
ఎంఅండ్ఎం లాభం రూ. 1,528 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) రూ. 1,528 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో నమోదైన రూ. 1,335 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 14 శాతం అధికం. ఇక క్యూ3లో ఆదాయం రూ. 15,349 కోట్ల నుంచి సుమారు 41 శాతం వృద్ధి చెంది రూ. 21,654 కోట్లకు చేరింది. ఆటో విభాగం, ఫార్మ్ విభాగాలు మెరుగైన పనితీరు కొనసాగిస్తున్నాయని శుక్రవారమిక్కడ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఎంఅండ్ఎం ఎండీ అనీష్ షా చెప్పారు. నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపర్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కంపెనీ ఈడీ రాజేశ్ జెజూరికర్ తెలిపారు. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మహీంద్రా గ్రూప్ నికర లాభం 34 శాతం పెరిగి రూ. 2,677 కోట్లకు చేరింది. ఆదాయం రూ. 23,594 కోట్ల నుంచి రూ. 30,620 కోట్లకు ఎగిసింది. కాగా, జహీరాబాద్ ప్లాంటులో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రానికి సంబంధించిన పనులు వచ్చే రెండు, మూడు నెలల్లో ప్రారంభమవుతాయని జెజూరికర్ తెలిపారు. సుమారు రెండేళ్లలో యూనిట్ పూర్తిగా అందుబాటులోకి రాగలదన్నారు. -
ఎల్ఐసీ లాభం హైజంప్
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. నికర లాభం అత్యంత భారీగా దూసుకెళ్లి రూ. 8,334 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 235 కోట్లు ఆర్జించింది. నికర ప్రీమియం ఆదాయం రూ. 97,620 కోట్ల నుంచి రూ. 1,11,788 కోట్లకు జంప్ చేసింది. అయితే గత కాలంలో కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్కానందున ఫలితాలు పోల్చి చూడటం తగదని ఎల్ఐసీ పేర్కొంది. కాగా.. పెట్టుబడుల ఆదాయం రూ. 76,574 కోట్ల నుంచి రూ. 84,889 కోట్లకు ఎగసింది. అదానీ గ్రూప్‌పై.. క్యూ3లో వాటాదారుల నిధికి రూ. 2,000 కోట్లను ప్రొవిజన్లకింద బదిలీ చేయడంతో నికర లాభం రూ. 6,334 కోట్లుగా నమోదైనట్లు ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ వెల్లడించారు. అదానీ గ్రూ ప్ యాజమాన్యంతో సమావేశం కానున్నట్లు వెల్లడించారు. కొద్ది రోజులుగా అదానీ గ్రూప్ కంపెనీలలో తలెత్తిన సంక్షోభంపై ఇన్వెస్టర్ బృందం ద్వారా వివరణను కోరనున్నట్లు తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో ఎల్ఐసీ షేరు ఎన్ఎస్ఈలో 0.5% పుంజుకుని రూ. 614 వద్ద ముగిసింది. -
హెచ్‌పీసీఎల్ లాభం క్షీణత
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్) ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం భారీగా క్షీణించి రూ. 172 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 869 కోట్లు ఆర్జించింది. అయితే అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను సవరించకపోవడంతో వరుసగా రెండు త్రైమాసికాలలో నష్టాలు నమోదైనట్లు కంపెనీ పేర్కొంది. కాగా.. చమురు ధరలు క్షీణించడంతో తిరిగి మూడో క్వార్టర్లో నష్టాలను పూడ్చుకునేందుకు వీలు చిక్కినట్లు తెలియజేసింది. ప్రస్తుత సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం రూ. 1.03 లక్షల కోట్ల నుంచి రూ. 1.15 లక్షల కోట్లకు ఎగసింది. ఈ కాలంలో ఒక క్వార్టర్‌కు కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 4.83 మిలియన్ టన్నుల(ఎంటీ) ముడిచమురును ప్రాసెస్ చేసింది. గత క్యూ3లో ఇది 4.24 ఎంటీగా నమోదైంది. అమ్మకాల పరిమాణం 7 శాతం పుంజుకుని 11.25 ఎంటీకి చేరింది. ఒక్కో బ్యారల్ చమురుపై స్థూల రిఫైనింగ్ మార్జిన్లు 11.4 డాలర్లకు ఎగశాయి. గత క్యూ3లో ఇవి 4.5 డాలర్లు మాత్రమే. విశాఖ రిఫైనరీ నవీకరణ ప్రాజెక్టు చివరి దశకు చేరుకున్నట్లు కంపెనీ పేర్కొంది. దీనిలో భాగంగా 8.3 ఎంటీ రిఫైనింగ్ సామర్థ్యాన్ని 15 ఎంటీకి విస్తరిస్తున్న విషయం విదితమే. 5 ఎంటీ ఎల్ఎన్జీ టెర్మినల్ సైతం పూర్తికావస్తున్నట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో హెచ్‌పీసీఎల్ షేరు ఎన్ఎస్ఈలో యథాతథంగా రూ. 232 వద్ద ముగిసింది. -
సింఫనీ లాభం హైజంప్
న్యూఢిల్లీ: ఎయిర్‌కూలర్లు, ఇతర అప్లయెన్సెస్ దిగ్గజం సింఫనీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 86 శాతం జంప్‌చేసి రూ. 39 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 21 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 35 శాతంపైగా ఎగసి రూ. 277 కోట్లను తాకింది. దేశీ విభాగం నుంచి రూ. 198 కోట్లు లభించింది. గతేడాది క్యూ3లో రూ. 205 కోట్ల టర్నోవర్ నమోదైంది. అయితే మొత్తం వ్యయాలు 32 శాతం పెరిగి రూ. 243 కోట్లకు చేరాయి. కాగా.. షేరుకి రూ. 2,000 ధర మించకుండా 10 లక్షల ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు(బైబ్యాక్) చేసేందుకు బోర్డు అనుమతించినట్లు కంపెనీ వెల్లడించింది. ఇందుకు రూ. 200 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో సింఫనీ షేరు బీఎస్ఈలో 8.5 శాతం దూసుకెళ్లి రూ. 1,047 వద్ద ముగిసింది. -
టాటా పవర్ లాభం ప్లస్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ విద్యుత్ దిగ్గజం టాటా పవర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం దాదాపు రెట్టింపై రూ. 1,052 కోట్లను అధిగమించింది. గతేడాది (2021–22) ఇదే కాలంలో రూ. 552 కోట్లు మాత్ర మే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 11,019 కోట్ల నుంచి రూ. 14,402 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో హరిత ఇంధనం, విద్యుత్ ప్రసారం, పంపిణీ తదితర విభిన్న బిజినెస్‌లలో ప్రస్తావించదగ్గస్థాయిలో అడుగులు వేసినట్లు కంపెనీ సీఈవో, ఎండీ ప్రవీర్ సిన్హా పేర్కొన్నారు. పునరుత్పాదకాలు, ఒడిషా వి ద్యుత్ పంపిణీలలో పెట్టుబడులకు కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు. రూఫ్‌టాప్ సోలార్, ఈవీ చార్జింగ్ విభాగాలను మరింత పటిష్టం చేస్తున్నట్లు తెలియజేశారు. టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ రూ. 15,440 కోట్ల విలువైన 3.9 గిగావాట్ల థర్డ్‌పార్టీ ప్రాజెక్టులతో కలిపి ఆర్డర్లను కలిగి ఉన్నట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో టాటా పవర్ షేరు ఎన్ఎస్ఈలో 0.4 శాతం నీరసించి రూ. 206 వద్ద ముగిసింది. -
ఇండిగో దూకుడు
న్యూఢిల్లీ: ఇండిగో బ్రాండు విమానయాన సేవల దిగ్గజం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 1,423 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 130 కోట్లు ఆర్జించింది. విదేశీమారక నష్టాలను మినహాయిస్తే రూ. 2,009 కోట్ల లాభం సాధించినట్లు కంపెనీ పేర్కొంది. విమానయానానికి ఊపందుకున్న డిమాండ్ ఇందుకు దోహదపడినట్లు కంపెనీ సీఈవో పీటర్ ఎల్బెర్స్ తెలియజేశారు. మొత్తం ఆదాయం సైతం రూ. 9,480 కోట్ల నుంచి రూ. 15,410 కోట్లకు ఎగసింది. ఒక క్వార్టర్‌కు ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికమని పీటర్ పేర్కొన్నారు. కంపెనీలో తీసుకున్న పలు చర్యలు ఫలితాలు అందిస్తున్నట్లు తెలియజేశారు. ప్రయాణాలకు పెరిగిన డిమాండును ప్రతిఫలిస్తూ 26 శాతం అధికంగా 2.23 కోట్లమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్లు వెల్లడించారు. సీట్ల ఆక్యుపెన్సీ 79.7 శాతం నుంచి 85.1 శాతానికి పుంజుకుంది. 300 ఆధునిక విమానాలతో సర్వీసులందిస్తున్నట్లు తెలియజేశారు. డీజీసీఏ గణాంకాల ప్రకారం దేశీయంగా 55.7 శాతం మారెŠక్ట్ వాటా కలిగి ఉన్నట్లు ప్రస్తావించారు. కంపెనీ రూ. 10,612 కోట్లు చేతిలో నగదుసహా రూ. 21,925 కోట్ల నగదు నిల్వలు కలిగి ఉంది. ఇదే సమయంలో రూ. 41,042 కోట్ల లీజ్ లయబిలిటీలతో కలిపి రూ. 44,475 కోట్ల రుణాలున్నాయి. ఫలితాల నేపథ్యంలో ఇండిగో షేరు బీఎస్ఈలో 1.2 శాతం నష్టంతో రూ. 2,100 వద్ద ముగిసింది. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రికార్డ్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో భారీ రుణ వృద్ధి నేపథ్యంలో ఎన్బీఎఫ్సీ దిగ్గజం బజాజ్ ఫైనాన్స్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 40 శాతం జంప్‌చేసి రూ. 2,973 కోట్లను తాకింది. కంపెనీ చరిత్రలోనే ఒక క్వార్టర్‌కు ఇది అత్యధికంకాగా.. నికర వడ్డీ ఆదాయం 28 శాతం ఎగసి రూ. 7,435 కోట్లకు చేరింది. ఈ కాలంలో కొత్తగా 3.14 మిలియన్ల క్రెడిట్ కస్టమర్ల(రుణగ్రహీతలు)ను జత చేసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాది ఇప్పటివరకూ 7.84 మిలియన్ల కస్టమర్లను కొత్తగా పొందినట్లు తెలియజేసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.73 శాతం నుంచి 1.14 శాతానికి, నికర ఎన్పీఏలు 0.78 శాతం నుంచి 0.41 శాతానికి దిగివచ్చాయి. బజాజ్ ఫైనాన్స్ షేరు ఎన్ఎస్ఈలో 0.5 శాతం నీరసించి రూ. 5,770 వద్ద ముగిసింది. -
స్టెరిలైట్ టెక్ టర్న్అరౌండ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ఆప్టికల్, డిజిటల్ సొల్యూషన్ల కంపెనీ స్టెరిలైట్ టెక్నాలజీస్ టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నష్టాలను వీడి రూ. 50 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో వన్‌టైమ్ ప్రొవిజన్‌తో కలిపి రూ. 138 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం 46 శాతం జంప్‌చేసి రూ. 1,882 కోట్లను తాకింది. మొత్తం ఆర్డర్‌బుక్ రూ. 12,054 కోట్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. వృద్ధి అవకాశాలపై దృష్టి పెట్టడం, నిర్వహణా సామర్థ్యాల మెరుగు, పెట్టుబడుల వ్యూహాత్మక కేటాయింపు వంటి అంశాలు పటిష్ట పనితీరుకు సహకరించినట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో స్టెరిలైట్ టెక్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 2.6 శాతం నష్టంతో రూ. 175 వద్ద ముగిసింది. -
లాభాల్లోకి టాటా మోటార్స్
న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించింది. రూ. 3,043 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 1,451 కోట్ల నికర నష్టం ప్రకటించింది. విభిన్న మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకోవడం ఇందుకు దోహదపడింది. మొత్తం ఆదాయం సైతం రూ. 72,229 కోట్ల నుంచి రూ. 88,489 కోట్లకు ఎగసింది. కాగా.. స్టాండెలోన్ నికర లాభం దాదాపు మూడు రెట్లు జంప్‌చేసి రూ. 506 కోట్లను తాకింది. గత క్యూ3లో కేవలం రూ. 176 కోట్లు ఆర్జించింది. జేఎల్ఆర్ జూమ్ ప్రస్తుత సమీక్షా కాలంలో టాటా మోటార్స్ లగ్జరీ కార్ల విభాగం జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) ఆదాయం 28 శాతం పుంజుకుని 600 కోట్ల పౌండ్లకు చేరింది. మెరుగుపడ్డ సరఫరాలు, పటిష్ట మోడళ్లు, వీటికి తగిన ధరలు ఉత్తమ పనితీరుకు కారణమైనట్లు కంపెనీ పేర్కొంది. వెరసి 26.5 కోట్ల పౌండ్ల పన్నుకుముందు లాభం ఆర్జించింది. గతేడాది క్యూ3లో 9 మిలియన్ పౌండ్ల పన్నుకుముందు నష్టం ప్రకటించిన సంగతి తెలిసిందే. చైనాలో లాక్డౌన్ల కారణంగా హోల్‌సేల్ అమ్మకాలు ప్రభావితమైనట్లు కంపెనీ పేర్కొంది. జనవరి నుంచి పరిస్థితులు మెరుగుపడగలవని అంచనా వేసింది. చిప్‌ల కొరత తగ్గడం, ఉత్పత్తి, హోల్‌సేల్ అమ్మకాలు పుంజుకోవడం కంపెనీ టర్న్‌అరౌండ్‌కు దోహదం చేసినట్లు జేఎల్ఆర్ తాత్కాలిక సీఈవో ఆడ్రియన్ మార్డెల్ పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో టాటా మోటార్స్ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం నష్టంతో రూ.419 వద్ద ముగిసింది. -
యస్ బ్యాంక్‌కు మొండి బాకీల భారం
ముంబై: గత మొండిపద్దులకు భారీగా కేటాయింపులు జరపాల్సి రావడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ నికర లాభం 79 శాతం క్షీణించింది. రూ. 55 కోట్లకు పరిమితమైంది. ప్రొవిజనింగ్ రూ. 375 కోట్ల నుంచి రూ. 845 కోట్లకు ఎగిసింది. భవిష్యత్తులోనూ పాత మొండి బాకీలకు సంబంధించి మరింతగా ప్రొవిజనింగ్ చేయాల్సి రావచ్చని బ్యాంక్ సీఈవో ప్రశాంత్ కుమార్ తెలిపారు. రుణ వృద్ధి ఊతంతో సమీక్షాకాలంలో నికర వడ్డీ ఆదాయం సుమారు 12 శాతం పెరిగి రూ. 1,971 కోట్లకు చేరింది. సింహ భాగం మొండి బాకీలను జేసీ ఫ్లవర్స్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి బదలాయించడంతో స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి అంతక్రితం త్రైమాసికంలోని 13 శాతంతో పోలిస్తే 2 శాతానికి తగ్గింది. బ్యాంకు ఇప్పటివరకు రూ. 4,300 కోట్ల రుణాలు రాబట్టగా, చివరి క్వార్టర్లో మరో రూ. 1,000 కోట్ల రికవరీకి అవకాశం ఉందని కుమార్ వివరించారు. రూ. 8,400 కోట్ల ఏటీ–1 బాండ్ల రద్దు చెల్లదంటూ బాంబే హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలను సవాలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
ఐసీఐసీఐ లాభం జూమ్
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 8,792 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 8,312 కోట్లతో పోలిస్తే ఇది 34 శాతం అధికం. నికర వడ్డీ ఆదాయం సైతం 35 శాతం జంప్‌చేసి రూ. 16,465 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 0.7 శాతం బలపడి 4.65 శాతానికి చేరాయి. త్రైమాసికవారీగా స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.19 శాతం నుంచి 3.07 శాతానికి తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి 16.26 శాతంగా నమోదైంది. అనుబంధ సంస్థలలో జీవిత బీమా లాభం రూ. 331 కోట్ల నుంచి రూ. 221 కోట్లకు క్షీణించింది. సాధారణ బీమా లాభం 11 శాతం మెరుగై రూ. 353 కోట్లను తాకింది. అసెట్ మేనేజ్మెంట్ లాభం రూ. 334 కోట్ల నుంచి రూ. 420 కోట్లకు వృద్ధి చూపింది. బ్రోకింగ్ విభాగం లాభం రూ. 281 కోట్లకు పరిమితమైంది. స్లిప్పేజీలు ఇలా... క్యూ3లో ఐసీఐసీఐ బ్యాంక్ స్థూల స్లిప్పేజీలు రూ. 5,723 కోట్లను తాకాయి. వీటిలో రిటైల్, రూరల్ బ్యాంకింగ్ విభాగం నుంచి రూ. 4,159 కోట్లు, కార్పొరేట్ల నుంచి రూ. 1,500 కోట్లు చొప్పున నమోదయ్యాయి. ఇక రూ. 2,257 కోట్లమేర ప్రొవిజన్లు చేపట్టింది. వీటిలో ప్రుడెన్షియల్ కేటాయింపులకింద రూ. 1,500 కోట్లు పక్కనపెట్టింది. దీంతో మొత్తం బఫర్ రూ. 11,500 కోట్లకు చేరింది. ఈ కాలంలో కొత్తగా ఏర్పాటు చేసిన 300తో కలిపి మొత్తం బ్రాంచీల సంఖ్య 5,700కు చేరింది. -
మైక్రోసాఫ్ట్‌లో 10 వేల ఉద్యోగాల కోత
న్యూయార్క్: టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. తాజాగా మైక్రోసాఫ్ట్ 10,000 మంది సిబ్బందిని తొలగించనుంది. ఇది కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిబ్బందిలో సుమారు అయిదు శాతం. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల బుధవారం ఈ విషయం వెల్లడించారు. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్న నేపథ్యంలో కంపెనీ ముందుకు సాగాలంటే ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని ఆయన పేర్కొన్నారు. ‘ప్రస్తుతం చేపడుతున్న మార్పుల కారణంగా 2023 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఆఖరు నాటికి మొత్తం మీద 10,000 ఉద్యోగాలు తగ్గనున్నాయి. ఇది మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 5 శాతం లోపే ఉంటుంది‘ అని సిబ్బందికి పంపిన ఈమెయిల్లో సత్య నాదెళ్ల వివరించారు. తొలగించే ఉద్యోగులకు చెల్లించే పరిహారాలు మొదలైన వాటికి సంబంధించి 1.2 బిలియన్ డాలర్ల వ్యయాలను రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో మైక్రోసాఫ్ట్ చూపనుంది. ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు పరిహారం, ఆరు నెలల పాటు ఆరోగ్య సంరక్షణ కవరేజీ మొదలైనవి ప్రయోజనాలు దక్కుతాయి. ప్రస్తుతం పరిస్థితులు గణనీయంగా మారిపోతున్నాయని నాదెళ్ల పేర్కొన్నారు. కొన్ని దేశాల్లో ఇప్పటికే మాంద్యం నెలకొనగా, మరికొన్నింటిలో మాంద్యం తలెత్తవచ్చన్న అంచనాలుండటంతో కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయని వివరించారు. ఇప్పటికే ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ తదితర సంస్థలు 11,000 పైచిలుకు ఉద్యోగాల్లో కోత విధించాయి. అమెజాన్ కూడా 18,000 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. -
డీమార్ట్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో రిటైల్ రంగ దిగ్గజం ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 7 శాతం వృద్ధితో రూ. 590 కోట్లకు చేరింది. డీమార్ట్ స్టోర్ల కంపెనీ గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 553 కోట్లు ఆర్జించింది. ఇక మొత్తం ఆదాయం మరింత అధికంగా 26 శాతం ఎగసి రూ. 11,569 కోట్లను తాకింది. గతేడాది క్యూ3లో రూ. 8,494 కోట్ల ఆదాయం నమోదైంది. ఈ కాలంలో ఈకామర్స్ బిజినెస్(డీమార్ట్ రెడీ)ను మరో 4 నగరాలకు విస్తరించినట్లు కంపెనీ సీఈవో, ఎండీ నెవిల్లే నోరోనా పేర్కొన్నారు. వెరసి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24 నగరాలలో సేవలు అందిస్తున్నట్లు తెలియజేశారు. అనుబంధ సంస్థ రిఫ్లెక్ట్ హెల్త్‌కేర్ అండ్ రిటైల్ ద్వారా షాప్ ఇన్ షాప్కింద పరిశీలనాత్మకంగా ఒక స్టోర్ లో ఫార్మసీని ప్రారంభించినట్లు వెల్లడించారు. డి సెంబర్కల్లా కంపెనీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణసహా దేశవ్యాప్తంగా 306 డీమార్ట్ స్టోర్లను నిర్వహిస్తోంది. ఫలితాల నేపథ్యంలో డీమార్ట్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం పతనమై రూ. 3,680 వద్ద ముగిసింది. -
ఫెడరల్ బ్యాంక్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 54 శాతం దూసుకెళ్లి రూ. 804 కోట్లను తాకింది. అధిక వడ్డీ ఆదాయం, రుణాల నాణ్యత మెరుగుపడటం ఇందుకు సహకరించాయి. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 522 కోట్లు ఆర్జించింది. ఇక మొత్తం ఆదాయం సైతం రూ. 3,927 కోట్ల నుంచి రూ. 4,967 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 27 శాతం పుంజుకుని రూ. 1,957 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 0.22 శాతం మెరుగై 3.49 శాతాన్ని తాకాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.06 శాతం నుంచి 2.43 శాతానికి తగ్గాయి. ఈ బాటలో నికర ఎన్పీఏలు 1.24 శాతం నుంచి 0.73 శాతానికి నీరసించాయి. బాసెల్–3 నిబంధనల ప్రకారం కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) స్వల్ప వెనకడుగుతో 13.35 శాతంగా నమోదైంది. తొలి 9 నెలల్లో 60 బ్రాంచీలను జత చేసుకోగా క్యూ4లో మరో 20 ప్రారంభించనున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో ఫెడరల్ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 1.2 శాతం బలపడి రూ. 140 వద్ద ముగిసింది. -
ఆనంద్ రాఠీ వెల్త్ లాభం జూమ్
న్యూఢిల్లీ: నాన్‌బ్యాంక్ వెల్త్ సొల్యూషన్స్ కంపెనీ ఆనంద్ రాఠీ వెల్త్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 35 శాతం జంప్‌చేసి రూ. 43 కోట్లను అధిగమించింది. గతేడాది (2021– 22) ఇదే కాలంలో రూ. 32 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 29 శాతం ఎగసి రూ. 140 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 109 కోట్ల టర్నోవర్ నమోదైంది. కంపెనీ నిర్వహణలోని ఆస్తులు(ఏయూ ఎం) 20 శాతం వృద్ధితో రూ. 38,517 కోట్లకు చేరాయి. మ్యూచువల్ ఫండ్స్ పంపిణీ, ఫై నాన్షియల్ ప్రొడక్టుల విక్రయం తదితర ఫైనాన్షియల్ సర్వీసులను కంపెనీ అందిస్తోంది. ఫలితాల నేపథ్యంలో ఆనంద్ రాఠీ వెల్త్ షేరు ఎన్ఎస్ఈలో 2.4 శాతం జంప్‌చేసి రూ. 773 వద్ద ముగిసింది. తొలుత రూ. 780 వద్ద 52 వారాల గరిష్టానికి చేరింది. -
మూడేళ్ల కనిష్టానికి దేశీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్
న్యూఢిల్లీ: దేశీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో 10 శాతం క్షీణించింది. అమ్మకాలు మూడేళ్ల కనిష్టం 4.3 కోట్ల స్థాయికి పడిపోయాయి. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) సోమవారం ఈ అంశాలు వెల్లడించింది. 2019 తర్వాత ఒక మూడో త్రైమాసికంలో ఇంత తక్కువ స్థాయి నమోదు కావడం ఇదే ప్రథమం అని తెలిపింది. బలహీనపడుతున్న డిమాండ్, పెరుగుతున్న ధరలు వెరసి పండుగ కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావం చూపినట్లు వివరించింది. నిల్వలు పేరుకుపోవడం, పండుగ సీజన్ తర్వాత డిమాండ్ తగ్గుముఖం పట్టడం తదితర అంశాలతో డిసెంబర్ త్రైమాసికంలో అమ్మకాలు నెమ్మదించవచ్చని ఐడీసీ డివైజ్ రీసెర్చ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ నవ్కేందర్ సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో 2022 వార్షిక అమ్మకాలు 8–9 శాతం క్షీణించి 15 కోట్ల యూనిట్లకు పరిమితం కావచ్చని పేర్కొన్నారు. పెరుగుతున్న డివైజ్‌ల ధరలు, ఇతరత్రా ద్రవ్యోల్బణం, ఫీచర్ ఫోన్ నుండి స్మార్ట్‌ఫోన్‌కు మారడం నెమ్మదించడం తదితర అంశాలు 2023లో డిమాండ్‌కి ప్రధాన సవాళ్లుగా ఉండవచ్చని తెలిపారు. అయితే, 4జీ నుండి 5జీకి మారుతుండటం మిడ్–ప్రీమియం, అంతకు మించిన సెగ్మెంట్లలో వృద్ధికి కొంత దోహదపడవచ్చని సింగ్ వివరించారు. నివేదికలో మరిన్ని వివరాలు.. ► సెప్టెంబర్ త్రైమాసికంలో అమ్మకాల్లో ఆన్లైన్ పోర్టల్స్ వాటా అత్యధికంగా 58 శాతంగా నమోదైంది. ఈ–టెయిలర్లు పలు విడతలుగా నిర్వహించిన ’సేల్స్’ (ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్, అమెజాన్‌లో గ్రేట్ ఇండియా ఫెస్టివల్ మొదలైనవి) ఇందుకు దోహదపడ్డాయి. ఆన్లైన్ ఎక్స్‌క్లూజివ్ డీల్స్, ఆఫర్లు, డిస్కౌంట్లు ఇందుకు సహాయపడ్డాయి. ఆన్‌లైన్‌తో పోటీపడుతూ డిమాండ్‌ను అందుకోవడంలో ఆఫ్‌లైన్ స్టోర్స్ విఫలమయ్యాయి. దీంతో ఆఫ్‌లైన్ విక్రయాలు 20 శాతం క్షీణించాయి. ► మీడియాటెక్ ఆధారిత స్మార్ట్ఫోన్ల మార్కెట్ వాటా 47 శాతానికి పెరిగింది. క్వాల్కామ్ వాటా 25 శాతానికి తగ్గింది. ► 21.2 శాతం వాటాతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు షావోమీ సారథ్యం వహించింది. 18.5% మార్కె ట్ వాటాతో శాంసంగ్ రెండో స్థానాన్ని తిరిగి దక్కించుకుంది. వివో (14.6%), రియల్‌మి (14.2%), ఒప్పో (12.5%) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ప్రీమియం కేటగిరీలో 63 శాతం వాటాతో యాపిల్ అగ్రస్థానంలో నిల్చింది. షావోమీ టాప్ ప్లేస్లోనే ఉన్నప్పటికీ అమ్మకాలు 18 శాతం క్షీణించాయి. మొత్తం స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో 5జీ ఫోన్ల వాటా 36 శాతానికి చేరింది. 1.6 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. -
World Gold Council: కరోనా పూర్వపు స్థాయికి బంగారం డిమాండ్
ముంబై: బంగారం డిమాండ్ భారత్‌లో కరోనా ముందు నాటి స్థాయికి చేరుకుందుని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో డిమాండ్, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 14 శాతం పెరిగి 191.7 టన్నులుగా నమోదైనట్టు ప్రకటించింది. ‘బంగారం డిమాండ్ తీరు క్యూ3, 2022’ పేరుతో మంగళవారం ఓ నివేదిక విడుదల చేసింది. క్రితం ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో బంగారం డిమాండ్ 168 టన్నులుగా ఉంది. విలువ పరంగా చూస్తే ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో బంగారం డిమాండ్ 19 శాతం పెరిగి రూ.85,010 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.71,630 కోట్లు కావడం గమనార్హం. ఆభరణాల డిమాండ్ తీరు.. బంగారం ఆభరణాల డిమాండ్ మూడో క్వార్టర్లో 17 శాతం పెరిగి 146.2 టన్నులుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 125 టన్నులుగా ఉంది. విలువ పరంగా క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఉన్న రూ.53,300 కోట్ల డిమాండ్‌తో పోలిస్తే 22 శాతం పెరిగి రూ.64,800 కోట్లుగా ఉంది. ‘‘రుణ సదుపాయాలు విస్తరించడం ఈ డిమాండ్‌కు ప్రేరణనిస్తోంది. బ్యాంకు రుణ వితరణలో వృద్ధి తొమ్మిదేళ్ల గరిష్టానికి చేరింది. ముఖ్యంగా దక్షిణ భారత్‌లో వృద్ధి బలంగా ఉంది. దీంతో ఆభరణాలకు డిమాండ్ 17 శాతం పెరిగింది’’అని డబ్ల్యూజీసీ భారత్ హెడ్ పీఆర్ సోమసుందరం తెలిపారు. వర్షాలు, ద్రవ్యోల్బణం తదితర అంశాలతో గ్రామీణ ప్రాంతాల్లో బంగారం డిమాండ్‌పై ప్రభావం ఉన్నట్టు చెప్పారు. పెరిగిన పెట్టుబడులు.. ఇక బార్, కాయిన్ల డిమాండ్ సెప్టెంబర్ క్వార్టర్లో 6 శాతం పెరిగి 45.4 టన్నులుగా (విలువ పరంగా రూ.20,150 కోట్లు) ఉంది. ‘‘బంగారం ధరలు తగ్గడం, బలహీన ఈక్విటీ మార్కెట్లు, పండుగలతో ఇన్వెస్టర్లు బంగారంపై ఇన్వెస్ట్‌మెంట్‌కు ఆసక్తి చూపించారు. పెరుగుతున్న వడ్డీ రేట్ల వాతావరణం, రూపాయి బలహీనత వంటి అంశాలతో సురక్షిత సాధనమైన బంగారంలో రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతాయి. ఈ ఏడాది మిగిలిన కాలంపై ఆశావహ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే వివాహాలు, దీపావళి డిమాండ్ నాలుగో త్రైమాసికం గణాంకాల్లో ప్రతిఫలిస్తుంది. అయితే గతేడాది ఇదే కాలంలో కనిపించిన రికార్డు స్థాయి పనితీరు సాధ్యపడకపోవచ్చు. ఈ ఏడాది మొత్తం మీద బంగారం డిమాండ్ 750–800 టన్నులుగా ఉంటుంది’’అని సోమసుందరం వివరించారు. 2021లో బంగారం దిగుమతులు 1,003 టన్నులుగా ఉండగా, ప్రస్తుత మార్కెట్ సెంటిమెంట్‌ను పరిశీలిస్తే గతేడాది గణాంకాలను మించదని ఆయన అంచనా వేశారు. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో (సెప్టెంబర్ వరకు) 559 టన్నుల బంగారం దిగుమతి అయినట్టు చెప్పారు. రెండు, మూడో త్రైమాసికంలో బంగారం ధరలు 4 శాతం తగ్గినట్టు.. సెప్టెంబర్ క్వార్టర్లో 10 గ్రాముల బంగారం సగటు ధర రూ.44,351గా ఉన్నట్టు చెప్పారు. -
ఈక్విటీల్లో ఎఫ్‌పీఐల వాటా డౌన్
న్యూఢిల్లీ: దేశీ ఈక్విటీలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) వాటాల విలువ వరుసగా మూడో త్రైమాసికంలోనూ క్షీణించింది. మార్నింగ్‌స్టార్ నివేదిక ప్రకారం 2022 ఏప్రిల్–జూన్(క్యూ1)లో 14 శాతం నీరసించి 523 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అంతకుముందు క్వార్టర్లో ఈ విలువ 612 బిలియన్ డాలర్లుకాగా.. 2021 జూన్ క్వార్టర్‌కల్లా 592 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఈ ఏడాది ప్రారంభం నుంచీ విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దేశ, విదేశాలలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల ప్రభావంతో పెట్టుబడుల్లో వెనకడుగు వేస్తున్నారు. దేశీ ఈక్విటీ మార్కెట్ల విలువలోనూ ఎఫ్‌పీఐల వాటా మార్చిలో నమోదైన 17.8 శాతం నుంచి 16.9 శాతానికి నీరసించింది. 2022 జూన్ త్రైమాసికంలో ఎఫ్‌పీఐలు 13.85 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను విక్రయించారు. మార్చి క్వార్టర్లో వెనక్కి తీసుకున్న పెట్టుబడులు 14.59 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇవి తక్కువే కావడం గమనార్హం! యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కఠిన విధాన నిర్ణయాల నేపథ్యంలో ఎఫ్‌పీఐల సెంటిమెంటు బలహీనపడినట్లు నివేదిక పేర్కొంది. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు కారణంగా బాండ్ల ఈల్డ్స్ సైతం జోరందుకున్నట్లు తెలియజేసింది. వీటికి చమురు హెచ్చుతగ్గులు, కమోడిటీ ధరల పెరుగుదల, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు జత కలిసినట్లు వివరించింది. -
స్టార్టప్‌లకు ఫండింగ్ బూస్ట్
ముంబై: దేశీ స్టార్టప్ వ్యవస్థలోకి నిధుల ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రస్తుత క్యాలండర్ ఏడాది(2022) తొలి మూడు నెలల్లోనే ఏకంగా 14 యూనికార్న్‌లు ఆవిర్భవించాయి. వెరసి వరుసగా మూడో క్వార్టర్లోనూ యూనికార్న్‌ల స్పీడ్ కొనసాగింది. పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక ప్రకారం 334 లావాదేవీల ద్వారా 10 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 75,000 కోట్లు) తాజా పెట్టుబడులు లభించాయి. బిలియన్ డాలర్ల విలువను అందుకున్న స్టార్టప్‌లను యూనికార్న్‌లుగా వ్యవహరించే సంగతి తెలిసిందే. కాగా.. మార్చిచివరికల్లా దేశీయంగా వీటి సంఖ్య 84ను తాకింది. ఒక త్రైమాసికంలో 10 బిలియన్ డాలర్ల నిధులు దేశీ స్టార్టప్ వ్యవస్థలోకి ప్రవహించడం వరుసగా ఇది మూడోసారికావడం విశేషం! వెరసి ఈ క్యూ1(జనవరి–మార్చి)లో స్టార్లప్‌లు మొత్తం 10.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. సాస్ హవా నివేదిక ప్రకారం సాఫ్ట్‌వేర్‌నే సర్వీసులుగా అందించే(సాస్) కంపెనీలు అత్యధికంగా పెట్టుబడులను అందుకున్నాయి. 3.5 బిలియన్ డాలర్లకు మించిన నిధులు ప్రవహించాయి. దీంతో క్యూ1లో ఐదు యూనికార్న్‌లు సాస్ విభాగంనుంచే ఆవిర్భవించాయి. ప్రపంచ ఆర్థిక వాతావరణం అనిశ్చితిగా ఉన్నప్పటికీ దేశీ స్టార్టప్ వ్యవస్థ పెట్టుబడులను ఆకట్టుకుంటున్నట్లు కన్సల్టెన్సీ స్టార్టప్స్ విభాగం చీఫ్ అమిత్ నాకా పేర్కొన్నారు. వృద్ధికి పెట్టుబడులు అవసరమైన స్థాయిలో నిధులు లభించడం ప్రస్తావించదగ్గ అంశమని తెలియజేశారు. సుపరిపాలన దేశీయంగా స్టార్టప్‌లు భారీ వృద్ధిని అందుకుంటున్న నేపథ్యంలో కార్పొరేట్ సుపరిపాలనకు ప్రాధాన్యత పెరుగుతున్నట్లు అమిత్ పేర్కొన్నారు. దీంతో స్టార్టప్‌లకు కార్పొరేట్ గవర్నెన్స్‌పై మార్గదర్శకాల రూపకల్పనపై చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు. వ్యవస్థాగతంగా విస్తరణపై ఆశలున్న కంపెనీలు ఇందుకు తగిన విధంగా సన్నద్ధంకావలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. సాస్ ఎకోసిస్టమ్‌లోకి గత మూడేళ్లలోనే మూడు రెట్లు అధిక పెట్టుబడులు తరలిరాగా.. కరోనా మహమ్మారి ఇందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సాహాన్నిచ్చినట్లు వివరించారు. మారుమూల ప్రాంతాల నుంచీ పనిచేసే పరిస్థితులతోపాటు, ఉత్పాదకత పెరగడం, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రాధాన్యత ఇందుకు సహకరిస్తున్నాయి. 15 సంస్థలు సాస్ విభాగంలో గత మూడేళ్ల కాలంలో 15 యూనికార్న్‌లు పుట్టుకొచ్చాయి. ఈ జాబితాలో డార్విన్‌బాక్స్, ఫ్రాక్టల్, యూనిఫోర్, హసురా, అమగీ మీడియా ల్యాబ్స్ తదితరాలున్నాయి. 2021 చివర్లో ఫ్రెష్‌వర్క్స్ నాస్డాక్లో బంపర్ లిస్టింగ్‌ను సాధించడంతో సాస్ సంస్థలకు కొత్త జోష్ వచ్చినట్లు అమిత్ ప్రస్తావించారు. పలు కంపెనీలు పబ్లిక్ లిస్టింగ్‌పై దృష్టిపెడుతున్నట్లు పేర్కొన్నారు. విలీనాలు.. దేశీ స్టార్టప్ వ్యవస్థలో విలీనాలు, కొనుగోళ్ల(ఎంఅండ్ఏ) లావాదేవీలు క్యూ1లో ఈకామర్స్ విభాగంలో అధికంగా జరిగాయి. క్యూర్‌ఫుడ్స్, మెన్సా బ్రాండ్స్, గ్లోబల్బీస్, మైగ్లామ్ ఎంఅండ్ఏలో భాగమయ్యాయి. వీటి కీలక వ్యాపార వ్యూహాలకు ప్రాధాన్యత లభించగా.. అప్స్కాలియో, ఈవెన్‌ఫ్లో తదితర కంపెనీలు సైతం రేసులో చేరాయి. 38 శాతం ఎంఅండ్ఏలు ఈకామర్స్, డైరెక్ట్‌టు కన్జూమర్ విభాగంలో నమోదుకాగా.. 22 శాతం డీల్స్‌కు సాస్ రంగంలో తెరలేచింది. వృద్ధి, చివరి దశ స్టార్టప్‌లు విలువరీత్యా 89 శాతం పెట్టుబడులు అందుకోగా.. మొత్తం లావాదేవీల్లో 44 శాతం వాటాను ఆక్రమించాయి. గత మూడు త్రైమాసికాలలో వృద్ధిస్థాయి నిధులు 6.5–7 బిలియన్ డాలర్లకు చేరగా.. సగటు టికెట్ పరిమాణం 5.5–7 కోట్ల డాలర్లుగా నమోదైంది. తొలి దశ పెట్టుబడుల విషయానికివస్తే 4 మిలియన్ డాలర్ల సగటు టికెట్ పరిమాణంలో 76.1 కోట్ల డాలర్లు లభించాయి. లావాదేవీల పరిమాణంలో ఇవి 55 శాతంగా నివేదిక తెలియజేసింది. -
వృద్ధి వేగంలో భారత్ టాప్
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మూడవ త్రైమాసికంలో (అక్టోబర్, నవంబర్, డిసెంబర్) 5.4 శాతం పురోగమించింది. వృద్ధి ఈ స్థాయిలో ఉన్నప్పటికీ, డిసెంబర్ త్రైమాసికంలో ఈ స్థాయి ఎకానమీ పురోగతి ఏ దేశం సాధించలేదు. దీనితో ప్రపంచంలో వేగంగా పురోగమిస్తున్న దేశాల్లో మొదటి స్థానంలో ఆసియా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నిలిచింది. భారత్ తర్వాత చైనా మూడవ త్రైమాసికంలో 4 శాతం ఎకానమీ వృద్ధి రేటును నమోదుచేసుకుంది. ఇక ఆర్థిక వ్యవస్థలో కీలకమైన తయారీ, వ్యవసాయం, నిర్మాణ, ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సేవా రంగాల వేగం తాజా గణాంకాల ప్రకారం ఇంకా తక్కువగానే ఉండడం గమనార్హం. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) ఈ మేరకు తాజా గణాంకాలను ఆవిష్కరించింది. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. మూడు త్రైమాసికాలు ఇలా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) జీడీపీ వృద్ధి రేటు 20.3 శాతంగా నమోదుకాగా, రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) 8.5 శాతంగా ఉంది. ప్రస్తుత సమీక్ష క్వార్టర్లో 5.4 శాతం పురోగతి ఉంది. 2020–21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికాల్లో ఎకానమీ పరిస్థితి చూస్తే, కరోనా సవాళ్ల నేపథ్యంలో వృద్ధిలేకపోగా ఏప్రిల్–జూన్, జూలై–సెప్టెంబర్ త్రైమాసికాల్లో వరుసగా 23.8%, 6.6% క్షీణతలు నమోదయ్యాయి. అయితే అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో స్వల్పంగా 0.7% పురోగతి చోటుచేసుకుంది. వృద్ధి అంచనాలకు ‘మూడవ వేవ్’ కోత! ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంగా 9.2 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని జనవరిలో వేసిన తొలి అంచనాలను ఎన్ఎస్ఓ తాజాగా (సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్‌లో) 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. 2021–22 ఎకానమీ వృద్ధి అంచనాలను 8.9 శాతానికి కుదించింది. భారత్‌లో మూడవవేవ్ సవాళ్లు దీనికి ప్రధాన కారణం. తాజా అంచనాల ప్రకారం, 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ విలువ రూ.135.58 లక్షల కోట్ల నుంచి రూ.147.72 లక్షల కోట్లకు పెరుగుతుంది. 2020–21లో క్షీణత 6.6 శాతమే! ఇక కరోనా సవాళ్లతో 2020–21 ఆర్థిక సంవత్సరం ఎకానమీ 7.3 శాతం క్షీణించిందని తొలి అంచనా గణాంకాలు పేర్కొనగా, ఈ క్షీణ రేటను 6.6 శాతానికి తగ్గిస్తూ తాజా లెక్కలను ఎన్ఎస్ఓ విడుదల చేసింది. అయితే 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ ‘6.6 శాతం క్షీణ బాట’ నుంచి ‘8.9 శాతం వృద్ధి’ బాటకు మారుతుందన్నమాట. 5.4 శాతం వృద్ధి ఎలా? 2011–12 ధరలను బేస్‌గా తీసుకుంటూ, ద్రవ్యోల్బణం ప్రాతిపదికన పరిశీలిస్తే, 2020–21 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో ఎకానమీ విలువ రూ.36,22,220 కోట్లు. 2021–22 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో (అక్టోబర్–డిసెంబర్) ఈ విలువ రూ. 38,22,159 కోట్లకు పెరిగింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మూడవ క్వార్టర్లో 5.4 శాతమన్నమాట. వివిధ రంగాల తీరిది.. ► తయారీ: గణాంకాల ప్రకారం, ఉత్పత్తి స్థాయి వరకూ పరిశీలించే గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ) విలువల వృద్ధి రేటు తయారీ రంగానికి సంబంధించి మూడవ త్రైమాసికంలో కేవలం 0.2 శాతంగా ఉంది. 2020–21 ఇదే కాలంలో ఈ వృద్ధి 8.4 శాతం. ► వ్యవసాయం: వ్యవసాయ రంగం వృద్ధి రేటు కూడా 4.1 శాతం నుంచి 2.6 శాతానికి తగ్గింది. ► నిర్మాణం: ఈ రంగంలో 6.6 శాతం వృద్ధి బాట నుంచి 2.8 శాతం క్షీణతకు మారింది. ► మైనింగ్: ఈ రంగం చక్కటి పురోగతి సాధించింది. 5.3 శాతం క్షీణ రేటు 8.8 శాతం వృద్ధికి మారింది. ► ఎలక్ట్రిసిటీ, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవలు: 1.5 శాతం క్షీణత 3.7 శాతం వృద్ధి బాటకు మారింది. ► ట్రేడ్, హోటెల్, రవాణా, కమ్యూనికేషన్లు, బ్రాడ్‌కాస్టింగ్ సంబంధిత సేవలు: 10.1 శాతం క్షీణ రేటు 6.1 శాతం వృద్ధికి మెరుగుపడింది. ► ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సేవలు: 10.3 శాతం వృద్ధి రేటు 4.6 శాతానికి తగ్గింది. ► పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ, ఇతర సేవలు: 2.9 శాతం క్షీణ రేటు భారీగా మెరుగుపడి 16.8 శాతం వృద్ధి బాటకు పురోగమించింది. -
ముత్తూట్ ఫైనాన్స్ లాభం అప్
న్యూఢిల్లీ: గోల్డ్ ఫైనాన్సింగ్ దిగ్గజం ముత్తూట్ ఫైనాన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 4 శాతం పుంజుకుని రూ. 1,044 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,007 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 5 శాతం వృద్ధితో రూ. 3,168 కోట్లను అధిగమించింది. గత క్యూ3లో రూ. 3,016 కోట్ల టర్నోవర్ నమోదైంది. వడ్డీ ఆదాయం 5 శాతం బలపడి రూ. 3,087 కోట్లకు చేరింది. నిర్వహణలోని స్థూల గోల్డ్ లోన్ ఆస్తులు రూ. 54,688 కోట్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. కంపెనీ ఫలితాలలో ముత్తూట్ హోమ్‌ఫిన్(ఇండియా), బెల్‌స్టార్ మైక్రోఫైనాన్స్, ముత్తూట్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ తదితర అనుబంధల సంస్థల పనితీరు కలసి ఉన్నట్లు పేర్కొంది. -
నష్టాన్ని గణనీయంగా తగ్గించుకున్న జొమాటో
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ల స్వీకరణ, డెలివరీ సంస్థ జొమాటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో నష్టాన్ని గణనీయంగా తగ్గించుకుంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నష్టం రూ.352 కోట్లుగా ఉంటే, తాజాగా అది రూ.67 కోట్లకు పరిమితమైంది. అయితే ఏ రూపంలో నష్టాలు తగ్గాయన్న? సందేహం రావచ్చు. కంపెనీ ఫిట్సో అనే ప్లాట్ఫామ్లో తనకున్న వాటాలను విక్రయించింది. ఈ రూపంలో రూ.316 కోట్లు సమకూరాయి. ఇది మినహాయించి చూస్తే నష్టం రూ.383 కోట్ల నష్టం కార్యకలాపాలపై వచ్చినట్టు తెలుస్తోంది. ఆదాయం సైతం అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.609 కోట్ల నుంచి రూ.1,112 కోట్లకు ఎగసింది. వ్యయాలు కూడా రూ.755 కోట్ల నుంచి రూ.1,642 కోట్లకు చేరాయి. ఫుడ్ డెలివరీ విభాగంలో వచ్చే రెండేళ్లలో 400 మిలియన్ డాలర్లు (రూ.3,000 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్టు ప్రకటించింది. కస్టమర్ డెలివరీ చార్జీలు తగ్గించడం, కరోనా తర్వాత రీఓపెనింగ్ ప్రభావం, డెలివరీ నుంచి రెస్టారెంట్ డైనింగ్ అవుట్‌కు కొంత వ్యాపారం బదిలీ కావడం స్థూల ఆర్డర్ విలువ (జీవోవీ) వృద్ధి బలహీనంగా ఉండడానికి దారితీసినట్టు జొమాటో వివరించింది. జీవోవీ క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 84 శాతం అధికంగా, సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే 1.7 శాతం పెరిగి రూ.5,500 కోట్లుగా ఉంది. మరింత విస్తరణే లక్ష్యం ‘‘దీర్ఘకాలంలో ఫుడ్ ఆర్డర్, డెలివరీ వ్యాపారం వృద్ధి పట్ల పెద్ద అంచనాలతోనే ఉన్నాం. రెస్టారెంట్ పరిశ్రమలో మార్పులకు అందిస్తున్న సహకారం ద్వారా జొమాటో ప్రయోజనం పొందుతుంది’’ అని జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ తెలిపారు. మరిన్ని కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్న తీరుపై స్పందిస్తూ.. తమ వ్యాపారం వృద్ధిని వేగవంతం చేసే వ్యాపారాల్లో మైనారిటీ వాటాల కొనుగోలుకు పెట్టుబడులు కొనసాగిస్తామని చెప్పారు. కంపెనీ బ్యాలన్స్ షీటులో 1.7 బిలియన్ డాలర్లు ఉన్నాయని, నిధుల సమీకరణ అవసరం లేదని స్పష్టం చేశారు. డిసెంబర్ త్రైమాసికంలో అర్బన్పైపర్లో 5 మిలియన్ డాలర్లు, అడోన్మోలో 15 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. అంతకుముందు బ్లింకిట్ (గ్రోఫర్), షిప్‌రాకెట్, క్యూర్‌ఫిట్ తదితర కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. -
ఎంఅండ్ఎం లాభం జూమ్
న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో స్టాండెలోన్ నికర లాభం రెండున్నర రెట్లు ఎగసి రూ. 1,353 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 531 కోట్లు ఆర్జించింది. శాంగ్యాంగ్ మోటార్ దివాలా కారణంగా రూ. 1,210 కోట్లమేర ప్రొవిజన్లు చేపట్టడం గతేడాది క్యూ3పై ప్రభావం చూపింది. ఇక మొత్తం ఆదా యం 8% వృద్ధితో రూ. 15,239 కోట్లకు చేరింది. ట్రాక్టర్ అమ్మకాలు డీలా... ప్రస్తుత సమీక్షా కాలంలో ఎంఅండ్ఎం 2 శాతం తక్కువగా 1,18,174 వాహనాలను విక్రయించింది. ట్రాక్టర్ల అమ్మకాలు 9% క్షీణించి 91,769 యూనిట్లకు పరిమితమయ్యాయి. కాగా.. ఇదే కాలంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం రూ. 1,268 కోట్ల నుంచి రూ. 1,987 కోట్లకు జంప్‌చేయగా.. మొత్తం ఆదాయం రూ. 21,626 కోట్ల నుంచి రూ. 23,594 కోట్లకు పుంజుకుంది. ఈవీ విభాగంలో ఇప్పటికే త్రిచక్ర వాహనాలతో పట్టు సాధించగా.. ఫోర్‌వీలర్ మార్కెట్లోనూ నాయకత్వ స్థాయికి ఎదిగే వీలున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో అనిష్ షా పేర్కొన్నారు. క్యూ3లో సెమీకండక్టర్ కొరతతో 20,000 యూనిట్ల ఉత్పత్తి నష్టం ఏర్పడినట్లు కంపెనీ ఆటో విభాగం సీఈవో వీజే నక్రా వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో ఎంఅండ్ఎం షేరు 1.5 శాతం నీరసించి రూ. 853 వద్ద ముగిసింది. -
టీవీఎస్ మోటార్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ద్విచక్ర వాహన దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 18 శాతం క్షీణించి రూ. 237 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 290 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 6,095 కోట్ల నుంచి రూ. 6,597 కోట్లకు ఎగసింది. రాల్ఫ్ డైటర్ స్పేథ్ను చైర్మన్ పదవికి ఎంపిక చేసినట్లు కంపెనీ బోర్డు పేర్కొంది. 2022 ఏప్రిల్ 1 నుంచి నియామకం అమల్లోకిరానుండగా.. చైర్మన్ ఎమిరిటస్ హోదాలో వేణు శ్రీనివాసన్ కంపెనీ ఎండీ బాధ్యతలు కొనసాగించనున్నట్లు తెలియజేసింది. కాగా.. క్యూ3లో స్టాండెలోన్ నికర లాభం రూ. 266 కోట్ల నుంచి రూ. 288 కోట్లకు పుంజుకుంది. వాహన విక్రయాలు ఇలా: తాజా సమీక్షా కాలంలో మొత్తం ద్విచక్ర వాహన విక్రయాలు 9.52 లక్షల యూనిట్ల నుంచి 8.35 లక్షలకు తగ్గినట్లు టీవీఎస్ మోటార్ వెల్లడించింది. వీటిలో ఎగుమతులు 12 శాతం వృద్ధిని సాధించగా.. మోటార్ సైకిళ్ల అమ్మకాలు 4.26 లక్షల యూనిట్ల నుంచి 4.46 లక్షల యూనిట్లకు పుంజుకున్నాయి. ఫలితాల నేపథ్యంలో టీవీఎస్ మోటార్ షేరు 2.5 శాతం నష్టంతో రూ. 637 వద్ద ముగిసింది. -
నాల్కో హైజంప్
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం నేషనల్ అల్యూమినియం కంపెనీ(నాల్కో) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం మూడు రెట్లుపైగా ఎగసి రూ. 831 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 240 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,415 కోట్ల నుంచి రూ. 3,845 కోట్లకు జంప్ చేసింది. తాజాగా వాటాదారులకు షేరుకి రూ. 1 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఇప్పటికే రూ. 2.50 డివిడెండును చెల్లించిన సంగతి తెలిసిందే. ఫలితాల నేపథ్యంలో నాల్కో షేరు బీఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 119 వద్ద ముగిసింది. -
జిందాల్ స్టెయిన్లెస్ జూమ్...
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ మెటల్ దిగ్గజం జిందాల్ స్టెయిన్లెస్(జేఎస్‌ఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం దాదాపు మూడు రెట్లు ఎగసి రూ. 442 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 170 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 3,592 కోట్ల నుంచి రూ. 5,682 కోట్లకు జంప్ చేసింది. రుణ సెక్యూరిటీల జారీ ద్వారా రూ. 3,500 కోట్లు సమీకరించేందుకు బోర్డు అనుమతించినట్లు కంపెనీ వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో జేఎస్‌ఎల్ షేరు బీఎస్ఈలో 0.5 శాతం బలపడి రూ. 218 వద్ద ముగిసింది. -
ఇండియన్ బ్యాంక్ ప్లస్... క్యూ3లో రూ. 690 కోట్లు
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం ఇండియన్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో స్టాండెలోన్ నికర లాభం 34 శాతం ఎగసి రూ. 690 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 514 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం నామమాత్ర వృద్ధితో రూ. 11,482 కోట్లయ్యింది. అయితే స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 9.04 శాతం నుంచి 9.13 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు సైతం 2.35 శాతం నుంచి 2.72 శాతానికి పెరిగాయి. నికర వడ్డీ ఆదాయం స్వల్పంగా 2 శాతం బలపడి రూ. 4,395 కోట్లను తాకింది. వడ్డీయేతర ఆదాయం 36 శాతం జంప్‌చేసి రూ. 1,556 కోట్లయ్యింది. ప్రొవిజన్లు అప్ తాజా సమీక్షా కాలంలో మొత్తం ప్రొవిజన్లు 11 శాతం అధికమై రూ. 2,598 కోట్లకు చేరినట్లు ఇండియన్ బ్యాంక్ తెలియజేసింది. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 15.47 శాతంగా నమోదైంది. దేశీయంగా నికర వడ్డీ మార్జిన్లు 0.1 శాతం నీరసించి 3.03 శాతానికి చేరాయి. రూ. 2,732 కోట్లమేర తాజా స్లిప్పేజీలు నమోదయ్యాయి. రూ. 5,400 కోట్ల విలువైన 34 మొండి ఖాతాలను గుర్తించినట్లు బ్యాంక్ ఈ సందర్భంగా వెల్లడించింది. వీటిలో తొలి దశకింద జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ(ఎన్ఏఆర్సీఎల్)కు రూ. 1,200 కోట్ల విలువగల 5 ఖాతాలను బదిలీ చేయనున్నట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో ఇండియన్ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 6 శాతం పతనమై రూ. 159 వద్ద ముగిసింది. -
యూనియన్ బ్యాంక్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పీఎస్‌యూ దిగ్గజం యూనియన్ బ్యాంక్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 49 శాతం జంప్‌చేసి రూ. 1,085 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 727 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 20,103 కోట్ల నుంచి రూ. 19,454 కోట్లకు క్షీణించింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 13.49 శాతం నుంచి 11.62 శాతానికి వెనకడుగు వేశాయి. అయితే నికర ఎన్పీఏలు 3.27 శాతం నుంచి 4.09 శాతానికి పెరిగాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 5,210 కోట్ల నుంచి సగానికి తగ్గి రూ. 2,549 కోట్లకు పరిమితమయ్యాయి. ఫలితాల నేపథ్యంలో యూనియన్ బ్యాంక్ షేరు 1 శాతం నీరసించి రూ. 48 వద్ద ముగిసింది. -
బీవోబీ లాభం రెట్టింపు
ముంబై: పీఎస్‌యూ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో స్టాండెలోన్ నికర లాభం రెట్టింపై రూ. 2,197 కోట్లను తాకింది. గతేడాది(2020–21) క్యూ3లో రూ. 1,061 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇందుకు వడ్డీ ఆదాయం పెరగడం, ప్రొవిజన్లు తగ్గడం దోహదపడింది. తాజా సమీక్షా కాలంలో నికర వడ్డీ ఆదాయం 14 శాతం ఎగసి రూ. 8,552 కోట్లకు చేరింది. ఫీజు ఆదాయం 15 శాతంపైగా పుంజుకుని రూ. 1,557 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 2.77 శాతం నుంచి 3.13 శాతానికి బలపడ్డాయి. ఎన్పీఏలకు చెక్ ఈ ఏడాది క్యూ3లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 8.48 శాతం నుంచి 7.25 శాతానికి ఉపశమించాయి. నికర ఎన్పీఏలు సైతం 2.39 శాతం నుంచి 2.25 శాతానికి వెనకడుగు వేశాయి. తాజా స్లిప్పేజీలు రూ. 2,830 కోట్లుకాగా.. రికవరీలు రూ. 20,32 కోట్లు, అప్గ్రెడేషన్లు రూ. 1,272 కోట్లకు చేరాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 3,450 కోట్ల నుంచి రూ. 2,506 కోట్లకు తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి 15.47 శాతంగా నమోదైంది. నికర వడ్డీ ఆదాయం, మార్జిన్లు, ఫీజు ఆదాయంలో నమోదైన వృద్ధిని ఇకపైనా కొనసాగించే వీలున్నట్లు బీవోబీ ఎండీ, సీఈవో సంజీవ్ చద్దా పేర్కొన్నారు. -
పేటీఎమ్‌కు పెరిగిన నష్టాలు
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులు, ఫైనాన్షియల్ సర్వీసుల దిగ్గజం వన్97 కమ్యూనికేషన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర పనితీరు చూపింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 778 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. పేటీఎమ్ బ్రాండు సర్వీసుల ఈ కంపెనీ గతేడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 536 కోట్ల నష్టం ప్రకటించింది. అయితే మొత్తం టర్నోవర్ మాత్రం 88 శాతం జంప్‌చేసి రూ. 1,456 కోట్లయ్యింది. వినియోగదారులకు అందించిన పేమెంట్ సర్వీసుల ద్వారా లభించిన ఆదాయం 60 శాతం ఎగసి రూ. 406 కోట్లకు చేరింది. -
ఎస్బీఐ లాభం జూమ్
ముంబై: బ్యాంకింగ్ రంగ పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో స్టాండెలోన్ నికర లాభం 62 శాతంపైగా జంప్ చేసి రూ. 8,432 కోట్లను తాకింది. బ్యాంక్ చరిత్రలోనే ఒక త్రైమాసికంలో ఇది అత్యధికంకాగా.. గతేడాది(2020–21) క్యూ3లో కేవలం రూ. 5,196 కోట్లు ఆర్జించింది. ఇందుకు ప్రొవిజన్లు తగ్గడం సహకరించింది. తాజా సమీక్షా కాలంలో ని కర వడ్డీ ఆదాయం 6.5 శాతం పుంజుకుని రూ.30 ,687 కోట్లకు చేరింది. దేశీయంగా నికర వడ్డీ మా ర్జి న్లు 3.34 శాతం నుంచి 3.4 శాతానికి బలపడ్డాయి. తగ్గిన ప్రొవిజన్లు ఈ ఏడాది క్యూ3లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.77 శాతం నుంచి 4.5 శాతానికి ఉపశమించాయి. నికర ఎన్పీఏలు మాత్రం 1.23 శాతం నుంచి 1.34 శాతానికి పెరిగాయి. తాజా స్లిప్పేజీలు రూ. 2,334 కోట్లుకాగా.. రికవరీ, అప్గ్రెడేషన్లు 59 శాతం నీరసించి రూ. 2,306 కోట్లకు పరిమితమయ్యాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 12,137 కోట్ల నుంచి రూ. 10,090 కోట్లకు తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి 13.23 శాతంగా నమోదైంది. కోవిడ్ రిజల్యూషన్ ప్రణాళిక 1, 2లలో భాగంగా రూ. 32,895 కోట్ల రుణాల పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు బ్యాంక్ పేర్కొంది. ఇవి మొత్తం లోన్‌బుక్‌లో 1.2 శాతానికి సమానం. ఆరు ఖాతాల అమ్మకం ఆస్తుల పునర్వ్యవస్థీకరణ కంపెనీల(ఏఆర్‌సీలు)కు విక్రయించేందుకు ఆరు మొండి(ఎన్పీఏ) ఖా తా ల ను ఎంపిక చేసినట్లు ఎస్బీఐ వెల్లడించింది. వీటి వి లువ రూ. 406 కోట్లుకాగా.. జాబితాలో పాట్నా బ క్తియార్‌పూర్ టోల్‌వే(రూ. 231 కోట్లు), స్టీల్‌కో గు జరాత్(రూ. 68 కోట్లు), జీవోఎల్ ఆఫ్‌షోర్(రూ. 5 1 కోట్లు), ఆంధ్రా ఫెర్రో అలాయ్స్(రూ. 27 కో ట్లు), గురు ఆశిష్ ట్యాక్స్‌ఫ్యాబ్(రూ. 17 కోట్లు)లను పేర్కొంది. పలు అంశాల్లో ప్లస్ బిజినెస్, లాభదాయకత, ఆస్తుల(రుణాలు) నాణ్యతలో బ్యాంక్ నిరవధికంగా మెరుగుపడుతోంది. ట్రెజరీ ఆదాయంలో స్వల్ప సమస్యలున్నప్పటికీ.. వడ్డీ, ఇతర ఆదాయాల్లో వృద్ధి సాధించింది. రుణ నాణ్యత తక్కువ ప్రొవిజన్లకు దారి చూపింది. అనిశ్చితుల కారణంగా భవిష్యత్‌లో ఎలాంటి సవాళ్లు ఎదురైనా అధిగమించేందుకు తగిన స్థాయిలో కంటింజెన్సీ కేటాయింపులు చేపట్టాం. రూ. 1,700 కోట్ల అదనపు ప్రొవిజన్లు చేపట్టాం. – ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా -
బీవోఐ జూమ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పీఎస్‌యూ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 90 శాతం జంప్‌చేసి రూ. 1,027 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 541 కోట్లు మాత్రమే ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 12,311 కోట్ల నుంచి రూ. 11,211 కోట్లకు క్షీణించింది. నికర వడ్డీ ఆదాయం సైతం రూ. 3,739 కోట్ల నుంచి రూ. 3,408 కోట్లకు బలహీనపడింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 13.25 శాతం నుంచి 10.46 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు మాత్రం 2.46 శాతం నుంచి 2.66 శాతానికి పెరిగాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 1,810 కోట్ల నుంచి భారీగా తగ్గి రూ. 335 కోట్లకు పరిమితమయ్యాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 16.66 శాతంగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో బీవోఐ షేరు ఎన్ఎస్ఈలో 3.5 శాతం పతనమై రూ. 56.4 వద్ద ముగిసింది. -
ఇండిగో టర్న్అరౌండ్
న్యూఢిల్లీ: ప్రైయివేట్ రంగ విమానయాన దిగ్గజం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 130 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 620 కోట్ల నష్టం ప్రకటించింది. ఇండిగో బ్రాండు విమానయాన సర్వీసుల ఈ కంపెనీ మొత్తం ఆదాయం సైతం రూ. 4,910 కోట్ల నుంచి రూ. 9,295 కోట్లకు జంప్‌చేసింది. ప్యాసిజింజర్ టికెట్ల విక్రయాల ద్వారా 98 శాతం అధికంగా రూ. 8,073 కోట్ల ఆదాయం లభించినట్లు ఇండిగో వెల్లడించింది. కాగా.. వెనువెంటనే అమల్లోకి వచ్చే విధంగా కంపెనీ సహవ్యవస్థాపకుడు రాహుల్ భాటియాను ఎండీగా నియమిస్తున్నట్లు ఇండిగో బోర్డు తాజాగా తెలియజేసింది. ఎండీగా భాటియా కంపెనీ అన్ని విభాగాలకూ సారథ్యం వహించనున్నట్లు ఇండిగో చైర్మన్ ఎం.దామోదరన్ పేర్కొన్నారు. మేనేజ్మెంట్ టీమ్‌ను ముందుండి నడిపించనున్నట్లు తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో ఇండిగో షేరు ఎన్ఎస్ఈలో 1.5 శాతం బలపడి రూ. 1,971 వద్ద ముగిసింది. -
హెచ్డీఎఫ్సీ లాభం అప్
ముంబై: ప్రైవేట్ రంగ మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 13 శాతం పుంజుకుని రూ. 5,837 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 39,268 కోట్ల నుంచి రూ. 31,308 కోట్లకు క్షీణించింది. ఇక స్టాండెలోన్ నికర లాభం 11 శాతం వృద్ధితో రూ. 3,261 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,926 కోట్లు ఆర్జించింది. కాగా.. నికర వడ్డీ ఆదాయం రూ. 4,005 కోట్ల నుంచి రూ. 4,284 కోట్లకు బలపడింది. ఏయూఎం ప్లస్: గృహ రుణాల్లో విలువరీత్యా 13 శాతం వరకూ ఆర్థికంగా వెనుకబడినవారు, తక్కువ ఆదాయం గలవారికి మంజూరు చేసినట్లు హెచ్డీఎఫ్సీ వైస్‌చైర్మన్, సీఈవో కేకి ఎం. మిస్త్రీ పేర్కొన్నారు. ఈ విభాగంలో సగటు రుణ పరిమాణం రూ. 11.1–19.5 లక్షలుగా వెల్లడించారు. గృహ రుణ కస్టమర్లలో 2.7 లక్షల మంది రుణ ఆధారిత సబ్సిడీలను అందుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ పథకంకింద రూ. 45,914 కోట్ల రుణాలు విడుదల చేయగా.. సబ్సిడీ మొత్తం రూ. 6,264 కోట్లని తెలియజేశారు. క్యూ3లో నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) రూ. 5,52,167 కోట్ల నుంచి రూ. 6,18,917 కోట్లకు బలపడినట్లు హెచ్డీఎఫ్సీ తెలియజేసింది. వీటిలో వ్యక్తిగత రుణాల వాటా 79 శాతంకాగా.. అనుబంధ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు రూ. 7,468 కోట్ల రుణాలను అసైన్ చేసినట్లు వెల్లడించింది. అందుబాటు ధరల గృహాలతోపాటు.. అధిక విలువలుగల ప్రాపర్టీల రుణాలకు సైతం భారీ డిమాండ్ కనిపిస్తున్నట్లు మిస్త్రీ పేర్కొన్నారు. కంపెనీ కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 22.4 శాతంగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ షేరు 2 శాతం లాభపడి రూ. 2,617 వద్ద ముగిసింది. -
డాక్టర్ రెడ్డీస్ లాభం రూ. 707 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) రూ. 707 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నమోదైన సుమారు రూ. 20 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 3,468 శాతం అధికం. నిర్దిష్ట ఉత్పత్తులకు సంబంధించి దాదాపు రూ. 597 కోట్ల మేర కేటాయింపులు జరపడం వల్ల గత క్యూ3లో లాభం తక్కువగా నమోదైంది. తాజా సమీక్షాకాలంలో ఈ తరహా కేటాయింపులు రూ. 4.7 కోట్లకు పరిమితమయ్యాయి. మరోవైపు, సమీక్షాకాలంలో గ్లోబల్ జనరిక్స్ విభాగం ఊతంతో ఆదాయం రూ. 4,930 కోట్ల నుంచి రూ. 5,320 కోట్లకు పెరిగింది. కోవిడ్–19 నివారణ, చికిత్సలకు సంబంధించి టీకాలతో పాటు పలు ఔషధాలను ప్రవేశపెడుతున్నామని సంస్థ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ శుక్రవారం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా తెలిపారు. మోల్నుపిరావిర్ ఔషధానికి మరో ఆరు దేశాల్లో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా రెండు దేశాల్లో ఆమోదం లభించిందని కంపెనీ సీఈవో (ఏపీఐ, సర్వీసులు విభాగం) దీపక్ సప్రా పేర్కొన్నారు. 12–18 ఏళ్ల వయస్సు గల వారి కోసం ఉద్దేశించిన స్పుత్నిక్ ఎం టీకాను భారత్‌లో ప్రవేశపెట్టడంపై త్వరలో ఔషధ రంగ నియంత్రణ సంస్థను సంప్రదించనున్నామని ఆయన వివరించారు. అవసరమైతే దేశీయంగా దీనికి మరో విడత క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే అవకాశం ఉందని సప్రా తెలిపారు. ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో శుక్రవారం బీఎస్ఈలో షేరు దాదాపు 1% క్షీణించి రూ. 4,218 వద్ద క్లోజయ్యింది. -
ఎస్బీఐ కార్డ్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ దిగ్గజం ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 84 శాతం జంప్ చేసి రూ. 386 కోట్లను తాకింది. ఇందుకు కార్డుల వినియోగం పుంజుకోవడం, మొండి రుణాలు తగ్గడం, ఇతర ఆదాయం పెరగడం వంటి అంశాలు సహకరించాయి. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 210 కోట్లు మాత్రమే ఆర్జించింది. కాగా.. మొత్తం ఆదాయం 24 శాతం ఎగసి రూ. 3,140 కోట్లకు చేరింది. ప్రస్తుత సమీక్షా కాలంలో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.51 శాతం నుంచి 2.40 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు సైతం 1.60 శాతం నుంచి 0.83 శాతానికి నీరసించాయి. అయితే ఫైనాన్స్ వ్యయాలు 6 శాతం అధికమై రూ. 277 కోట్లను తాకాయి. మొత్తం నిర్వహణ వ్యయాలు 28 శాతం పెరిగి రూ. 1,719 కోట్లకు చేరాయి. ఫలితాల నేపథ్యంలో ఎస్బీఐ కార్డ్ షేరు బీఎస్ఈలో 4.3 శాతం పతనమై రూ. 814 వద్ద ముగిసింది. -
యాక్సిస్ బ్యాంక్ లాభాల బాట..
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం మూడు రెట్లు జంప్ చేసి రూ. 3,973 కోట్లను తాకింది. ఇక స్టాండెలోన్ నికర లాభం సైతం ఇదే స్థాయిలో ఎగసి రూ. 3,614 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,116 కోట్లు మాత్రమే ఆర్జించింది. కాగా.. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 17 శాతం పుంజుకుని రూ. 8,653 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 1.2 శాతం క్షీణించి రూ. 704 వద్ద ముగిసింది. -
యస్ బ్యాంక్.. 80 % జూమ్
ముంబై: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 266 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధితో పోలిస్తే లాభం ఏకంగా 80 శాతం ఎగిసింది. మొండిబాకీలకు ప్రొవిజనింగ్ గణనీయంగా తగ్గడం ఇందుకు తోడ్పడింది. నికర వడ్డీ మార్జిన్ 0.25 శాతం వృద్ధి చెంది 2.4 శాతానికి పెరిగినప్పటికీ .. రుణ వృద్ధి అంతంత మాత్రంగానే ఉండటంతో కీలకమైన నికర వడ్డీ ఆదాయం 31 శాతం క్షీణించి రూ. 1,764 కోట్లకు పరిమితమైంది. సమీక్షాకాలంలో రుణ వృద్ధి 4 శాతంగా నమోదైంది. క్యూ3లో ప్రొవిజనింగ్ రూ. 2,089 కోట్ల నుంచి ఏకంగా 82 శాతం తగ్గింది. రూ. 375 కోట్లకు పరిమితమైనట్లు బ్యాంకు ఎండీ, సీఈవో ప్రశాంత్ కుమార్ తెలిపారు. భారీ విలువ రుణాలను తగ్గించుకోవడంతో పాటు కార్పొరేట్లు రుణాల భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి గైడెన్స్‌ను 10 శాతానికి కుదించుకున్నట్లు ఆయన వివరించారు. గతంలో ఇది 15 శాతంగా ఉండవచ్చని అంచనా వేశారు. -
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం 19% అప్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం దాదాపు 19 శాతం ఎగిసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 6,536 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ), గణనీయంగా పెరగడం, ప్రొవిజనింగ్ తగ్గడం ఇందుకు దోహదపడ్డాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో బ్యాంక్ నికర లాభం రూ. 5,498 కోట్లు. మరోవైపు, సమీక్షాకాలంలో ఆదాయం రూ. 40,419 కోట్ల నుంచి రూ. 39,866 కోట్లకు తగ్గింది. ‘‘అన్ని విభాగాల్లోనూ వృద్ధి నమోదు చేశాం. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 23 శాతం, ప్రధానమైన ఆపరేటింగ్ లాభం 25 శాతం మేర పెరిగాయి. ప్రొవిజన్లు 27 శాతం తగ్గాయి’’ అని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ బాత్రా తెలిపారు. క్యూ3లో ఎన్ఐఐ రూ. 9,912 కోట్ల నుంచి రూ. 12, 236 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 3.67 శాతం నుంచి 3.96 శాతానికి చేరింది. స్థూల మొండిబాకీలు (జీఎన్‌పీఏ) నిష్పత్తి 4.38 శాతం నుంచి 4.13 శాతానికి దిగి వచ్చింది. నికర ఎన్పీఏలు 0.63 శాతం నుంచి 0.85 శాతానికి చేరాయి. మరోవైపు, స్టాండెలోన్ ప్రాతిపదికన ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం 25 శాతం పెరిగి రూ. 4,940 కోట్ల నుంచి రూ. 6,194 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 24,416 కోట్ల నుంచి రూ. 28,070 కోట్లకు పెరిగింది. -
అల్ట్రాటెక్ లాభం 8 శాతం అప్
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం అల్ట్రాటెక్ సిమెంట్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 8 శాతం ఎగసి రూ. 1,710 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,585 కోట్లు ఆర్జించింది. ఆదాయం 6% ఎగసి రూ. 12,985 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 12,262 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. ఈ కాలంలో వ్యయాలు 12% పెరిగి రూ. 11,422 కోట్లను తాకాయి. బిర్లా వైట్..: బిర్లా వైట్ బ్రాండు వైట్ సిమెంట్ ఉత్పత్తి సామర్థ్య విస్తరణ, ఆధునీకరణకు రూ. 965 కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు అల్ట్రాటెక్ వెల్లడించింది. తద్వారా ప్రస్తుత 6.5 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యాన్ని దశలవారీగా 12.53 ఎల్టీపీఏకు చేర్చేందుకు తాజా సమావేశంలో బోర్డు అనుమతించినట్లు పేర్కొంది. 1.2 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం అందుకోవడంతో భారీ మౌలిక ప్రాజెక్టుల ద్వారా బల్క్ సిమెంట్ అమ్మకాలను మరింత పెంచుకోగలమని కంపెనీ అభిప్రాయపడింది. ఇక యూపీలో బారా గ్రైండింగ్ లైన్–2 యూనిట్ ప్రారంభంతో సిమెంట్ ఉత్పాదక సామ ర్థ్యం 114.55 ఎంటీపీఏను తాకినట్లు తెలిపింది. రుణ చెల్లింపులు..: 2021 అక్టోబర్‌లో అమ్మకాలు ఊపందుకున్నప్పటికీ ఎన్సీఆర్లో నిర్మాణాలపై నిషేధం, వర్షాలు, దీపావళి సెలవులు తదితర అంశాలు తదుపరి డిమాండును దెబ్బతీసినట్లు అల్ట్రాటెక్ వివరించింది. వెరసి క్యూ3లో కన్సాలిడేటెడ్ అమ్మకాలు 3 శాతం నీరసించి 23.13 మిలియన్ మెట్రిక్ టన్నులకు పరిమితమయ్యాయి. క్యూ3లో అంతర్గత వనరుల ద్వారా రూ. 3,459 కోట్ల రుణాలను తిరిగి చెల్లించినట్లు వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో అల్ట్రాటెక్ సిమెంట్ షేరు బీఎస్ఈలో దాదాపు 3 శాతం ఎగసి రూ. 7,868 వద్ద ముగిసింది. -
మెట్రో బ్రాండ్స్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: ఫుట్‌వేర్ రిటైల్ చైన్ మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్ నికర లాభం మూడో త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 55 శాతం జంప్‌చేసి రూ. 101 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 65 కోట్లు మాత్రమే ఆర్జించింది. మెట్రో షూస్ బ్రాండుగల కంపెనీ మొత్తం ఆదాయం సైతం 59 శాతం దూసుకెళ్లి దాదాపు రూ. 484 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 304 కోట్ల టర్నోవర్ నమోదైంది. మొత్తం వ్యయాలు 47 శాతం పెరిగి రూ. 363 కోట్లయ్యాయి. త్రైమాసిక ప్రాతిపదికన ఇవి అత్యుత్తమ గణాంకాలని కంపెనీ సీఈవో నిస్సన్ జోసఫ్ పేర్కొన్నారు. 2021 డిసెంబర్‌కల్లా కంపెనీ 140 పట్టణాలలో 629 స్టోర్లను నిర్వహిస్తోంది. వారాంతాన బీఎస్ఈలో మెట్రో బ్రాండ్స్ షేరు 1.5 శాతం బలపడి రూ. 508 వద్ద ముగిసింది -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో స్టాండెలోన్ నికర లాభం 18 శాతం పెరిగి రూ. 10,342 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) క్యూ3లో కే. 8,758 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 37,523 కోట్ల నుంచి రూ. 40,652 కోట్లకు బలపడింది. వడ్డీయేతర ఆదాయం 10 శాతం వృద్ధితో రూ. 8,184 కోట్లను తాకింది. ఇక నికర వడ్డీ ఆదాయం 13 శాతం ఎగసి రూ. 18,443 కోట్లను దాటింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 21 శాతం జంప్‌చేసి రూ. 10,591 కోట్లయ్యింది. మొత్తం ఆదాయం రూ. 39,839 కోట్ల నుంచి రూ. 43,365 కోట్లకు పురోగమించింది. డిపాజిట్లు జూమ్ క్యూ3లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 0.81 శాతం నుంచి 1.26 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు 0.09 శాతం నుంచి 0.4 శాతానికి పెరిగాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 3,414 కోట్ల నుంచి రూ. 2,994 కోట్లకు తగ్గాయి. డిపాజిట్లు దాదాపు 14 శాతం ఎగసి రూ. 14,45,918 కోట్లకు చేరగా.. అడ్వాన్సులు(రుణాలు) 16.5 శాతం వృద్ధితో 12,60,863 కోట్లను తాకాయి. గత 12 నెలల్లో 294 బ్రాంచీలతోపాటు 16,852 మంది ఉద్యోగులను జత చేసుకున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. నిర్వహణ వ్యయాలు 15 శాతం అధికమై 9,851 కోట్లకు చేరాయి. -
మైండ్‌ట్రీ లాభం జూమ్...
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల కంపెనీ మైండ్‌ట్రీ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో నికర లాభం 34% జంప్‌చేసి రూ. 437 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 326 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 36 శాతం పురోగమించి రూ. 2,750 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 2,024 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. డాలర్ల రూపేణా ఈ ఏడాది క్యూ3లో మైండ్‌ట్రీ డాలర్ల రూపేణా 58.3 మిలియన్ డాలర్ల నికర లాభం ఆర్జించింది. ఇది 32 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం 34 శాతం పుంజుకుని 366.4 మిలియన్ డాలర్లకు చేరింది. డిసెంబర్ చివరికల్లా కంపెనీ యాక్టివ్ క్లయింట్ల సంఖ్య 265ను తాకగా.. 31,959 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. తాజా త్రైమాసికంలో 4,500 మంది ఉద్యోగులను చేర్చుకుంది. వచ్చే ఏడాది(2022–23)లో క్యాంపస్‌ల ద్వారా మరింత మందిని ఎంపిక చేసుకోనున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ దేవశిష్ చటర్జీ పేర్కొన్నారు. గత 12 నెలల్లో ఉద్యోగ వలసల రేటు 21.9 శాతంగా నమోదైనట్లు తెలియజేశారు. కోయంబత్తూర్, వరంగల్‌లో కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో మైండ్‌ట్రీ షేరు బీఎస్ఈలో 2.4% లాభపడి రూ. 4,744 వద్ద ముగిసింది. -
విప్రో.. ఓకే
న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల దిగ్గజం విప్రో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం యథాతథంగా రూ. 2,969 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,968 కోట్లు ఆర్జించింది. అయితే క్యూ2తో పోలిస్తే 1.3 శాతం పుంజుకుంది. మొత్తం ఆదాయం దాదాపు 30 శాతం ఎగసి రూ. 20,314 కోట్లకు చేరింది. గతేడాది క్యూ3లో రూ. 15,670 కోట్ల టర్నోవర్ మాత్రమే సాధించింది. అయితే క్యూ2లో నమోదైన రూ. 19,667 కోట్లతో పోలిస్తే ఆదాయంలో 3.2 శాతం వృద్ధి సాధించింది. 2–4 శాతం మధ్య ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(జనవరి–మార్చి)లో ఐటీ సర్వీసుల ఆదాయం 2–4 శాతం మధ్య పుంజుకోనున్నట్లు విప్రో తాజాగా అంచనా వేసింది. వెరసి 269.2–274.5 కోట్ల డాలర్ల మధ్య టర్నోవర్ నమోదయ్యే వీలున్నట్లు పేర్కొంది. త్రైమాసికవారీగా తాజా గైడెన్స్‌ను ప్రకటించింది. కాగా.. క్యూ3లో ఐటీ సర్వీసుల ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన 2.3 శాతం వృద్ధితో దాదాపు 264 కోట్ల డాలర్లకు చేరింది. జీతాల పెంపు నేపథ్యంలోనూ పటిష్ట నిర్వహణ మార్జిన్లను సాధించగలిగినట్లు కంపెనీ సీఎఫ్‌వో జతిన్ దలాల్ పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం(2022–23)లో కొత్తగా 30,000 మంది ఫ్రెషర్స్‌ను ఉద్యోగాలలోకి తీసుకునే వీలున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్, సీహెచ్ఆర్వో సౌరభ్ గోవిల్ వెల్లడించారు. ఇతర హైలైట్స్ ► క్యూ3లో 10,306 మంది ఉద్యోగులను నియమించుకుంది. ► డిసెంబర్‌కల్లా ఐటీ సర్వీసుల మొత్తం సిబ్బంది సంఖ్య 2,31,671కు చేరింది. ► వార్షికంగా 41,363 మందికి ఉపాధి కల్పించింది. ► షేరుకి రూ. 1 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ► క్యూ3లో 80 శాతంమంది రెండోసారి ఉద్యోగులకు జీతాల పెంపు ► గత 12 నెలల్లో 80 శాతంమంది సిబ్బందికి మూడు విడతల్లో ప్రమోషన్లు ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు బీఎస్ఈలో స్వల్ప నష్టంతో రూ. 691 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిశాక కంపెనీ ఫలితాలు విడుదల చేసింది. పటిష్ట పనితీరు ఆదాయం, మార్జిన్లలో వరుసగా ఐదో త్రైమాసికంలోనూ కంపెనీ పటిష్ట పనితీరును ప్రదర్శించింది. ఆర్డర్ బుకింగ్స్ సైతం ఊపందుకున్నాయి. గత 12 నెలల్లో 10 కోట్ల డాలర్ల ఆదాయ లీగ్‌లో 7 సంస్థలను(క్లయింట్లు) జత చేసుకున్నాం. క్యూ3లో ఎడ్జైల్, లీన్‌స్విఫ్ట్ సొల్యూషన్స్ కొనుగోళ్లను పూర్తిచేశాం. తద్వారా సామర్థ్యాలను మరింత మెరుగుపరుచుకోగలిగాం. – థియరీ డెలాపోర్ట్, సీఈవో, ఎండీ, విప్రో లిమిటెడ్ -
ఇన్ఫోసిస్ భేష్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవలకు దేశంలోనే రెండో పెద్ద కంపెనీ ఇన్ఫోసిస్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 11.8 శాతం పుంజుకుని రూ. 5,809 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 5,197 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 23 శాతం ఎగసి రూ. 31,867 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 25,927 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. భారీ డీల్స్‌ను గెలుచుకోవడం ద్వారా క్యూ3లో మొత్తం కాంట్రాక్టు విలువ(టీసీవీ) 2.53 బిలియన్ డాలర్లను తాకినట్లు వెల్లడించింది. 20 శాతం వరకూ మార్చితో ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 19.5–20 శాతం స్థాయిలో పుంజుకోనున్నట్లు ఇన్ఫోసిస్ తాజాగా అంచనా వేసింది. వెరసి ఇంతక్రితం అక్టోబర్‌లో ఇచ్చిన 16.5–17.5 శాతం అంచనాలను ఎగువముఖంగా సవరించింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన కంపెనీ ఆదాయ అంచనాలను ప్రకటించే సంగతి తెలిసిందే. సరఫరా సవాళ్ల నేపథ్యంలో వ్యయాలు పెరిగినప్పటికీ మరోసారి మెరుగైన మార్జిన్లను సాధించగలిగినట్లు కంపెనీ సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ పేర్కొన్నారు. నైపుణ్యాలను సొంతం చేసుకోవడం, అభివృద్ధిలపై పెట్టుబడులకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలియజేశారు. వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ప్రపంచస్థాయిలో నియమించుకుంటున్న గ్రాడ్యుయేట్ల సంఖ్య ఈ ఏడాది 55,000కుపైగా చేరనున్నట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో ఇన్ఫోసిస్ షేరు 1.2% బలపడి రూ. 1,878 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిశాక కంపెనీ ఫలితాలు విడుదల చేసింది. క్లయింట్లకున్న విశ్వాసం పటిష్ట పనితీరుతోపాటు, మార్కెట్ వాటాను పెంచుకోవడం వంటి అంశాలు డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో కంపెనీ సర్వీసులపట్ల క్లయింట్లకున్న విశ్వాసానికి ప్రతీకలు. నాలుగేళ్లుగా డిజిటల్, క్లౌడ్ సేవలలో నిలకడైన వ్యూహాలతో ప్రత్యేక దృష్టిపెట్టడం ద్వారా క్లయింట్లకు మెరుగైన సేవలు అందిస్తున్నాం. ఎప్పటికప్పుడు నైపుణ్యాల పెంపు, లోతైన సంబంధాలతో క్లయింట్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాం. ఇది కంపెనీ గైడెన్స్ పెంపులో ప్రతిఫలిస్తోంది. డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్స్‌పై భారీ కార్పొరేట్ల వ్యయాలు కొనసాగే వీలుంది. కొత్త ఐటీ పోర్టల్‌కు సంబంధించి తదుపరి దశలో మరోసారి ఆదాయపన్ను శాఖతో కలసి పనిచేస్తాం. మరిన్ని సౌకర్యాలు(మాడ్యూల్స్) సమకూర్చుతాం. డిసెంబర్‌కల్లా 5.89 కోట్ల ఐటీ రిటర్నులు దాఖలయ్యాయి. డిసెంబర్ 31నే 46.11 లక్షల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. – సలీల్ పరేఖ్, సీఈవో, ఎండీ, ఇన్ఫోసిస్ లిమిటెడ్ -
లండన్‌లో మ్యాక్రోటెక్ విక్రయాలు
న్యూఢిల్లీ: రియల్టీ రంగ దిగ్గజం మ్యాక్రోటెక్ డెవలపర్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో లండన్‌లో రూ. 1,900 కోట్ల విలువైన బుకింగ్స్‌ను సాధించినట్లు వెల్లడించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రెండు ప్రాజెక్టుల నుంచి తాజా అమ్మకాలు నమోదైనట్లు తెలియజేసింది. దేశీయంగా లోధా బ్రాండుతో రియల్టీ ఆస్తులను అభివృద్ధి చేసే కంపెనీ యూకే ప్రాజెక్టుల ద్వారా ఒక త్రైమాసికంలో తొలిసారి 19.1 కోట్ల పౌండ్ల(రూ. 1,900) అమ్మకాలు అందుకున్నట్లు వెల్లడించింది. 2013లో కెనడా ప్రభుత్వం నుంచి 30 కోట్ల పౌండ్ల(రూ. 3,100 కోట్లు)కు మ్యాక్‌డొనాల్డ్ హౌస్‌ను కొనుగోలు చేయడం ద్వారా మ్యాక్రోటెక్.. లండన్ ప్రాపర్టీ మార్కెట్లో ప్రవేశించింది. లోధా డెవలపర్స్ పేరుతో కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీ తదుపరి 2014లో 9 కోట్ల పౌండ్లకు న్యూ కోర్టు స్థలాన్ని సొంతం చేసుకుంది. ఇక్కడ గత రెండు త్రైమాసికాల్లో సాధించిన పటిష్ట బుకింగ్స్‌తో రానున్న నాలుగు నెలల్లోగా 22.5 కోట్ల డాలర్ల విలువైన బాండ్లను పూర్తిగా తిరిగి చెల్లించే వీలున్నట్లు కంపెనీ పేర్కొంది. వీటి గడువు 2023 మార్చికాగా.. అంతకంటే ముందుగానే చెల్లించే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. బీఎస్ఈలో మ్యాక్రోటెక్ డెవలపర్స్ షేరు స్వల్ప లాభంతో రూ. 1,238 వద్ద ముగిసింది. -
ఐటీ కంపెనీల పనితీరు భేష్!
ముంబై: ఎగుమతుల ఆధారిత సాఫ్ట్వేర్ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పటిష్ట వృద్ధిని సాధించనున్నాయి. సీజనల్‌గా చూస్తే నిజానికి సాఫ్ట్వేర్ పరిశ్రమలో అక్టోబర్–డిసెంబర్(క్యూ3) బలహీన కాలంగా విశ్లేషకులు పేర్కొంటుంటారు. అయితే క్యూ3లో త్రైమాసికవారీగా ఆదాయాలు సగటున 2.6–6 శాతం మధ్య పుంజుకునే వీలున్నట్లు కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ నివేదిక అంచనా వేసింది. ట్రాన్స్‌ఫార్మేషన్‌పై వ్యయాలు పెరగడం ఇందుకు సహకరించనున్నట్లు పేర్కొంది. ఈ వారాంతం లేదా వచ్చే వారం నుంచీ ఐటీ దిగ్గజాల క్యూ3 ఫలితాల విడుదల ప్రారంభంకానుంది. బ్లూచిప్ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్ తొలుత ఫలితాలు ప్రకటించనున్నాయి. కాగా.. వార్షిక ప్రాతిపదికన క్యూ3 ఆదాయ అంచనాలను కొటక్ నివేదిక వెల్లడించనప్పటికీ షేరువారీ ఆర్జన(ఈపీఎస్)పై మిశ్రమంగా స్పందించింది. కొన్ని కంపెనీల ఈపీఎస్‌లో 15 శాతం క్షీణతకు అవకాశముంటే.. మరికొన్ని దిగ్గజాలు 11 శాతంవరకూ వృద్ధిని అందుకోవచ్చని అభిప్రాయపడింది. సాఫ్ట్వేర్ రంగం ఎగుమతుల ఆధారితంకావడంతో డాలరు బలపడటం లాభించనున్నట్లు పేర్కొంది. ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు పుంజుకోవడంతో 20–90 బేసిస్ పాయింట్లమేర మార్జిన్లు మెరుగుపడే వీలున్నట్లు తెలియజేసింది. వృద్ధి బాటలో... కొటక్ నివేదిక ప్రకారం లార్జ్ క్యాప్స్‌లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో, టెక్ మహీంద్రా.. మిడ్ క్యాప్స్‌లో ఎల్టీ ఇన్ఫోటెక్ ముందుండే అవకాశముంది. ఆయా కంపెనీలు ఇటీవల సిబ్బందిని పెంచుకోవడం, ఫ్రెషర్లకు అవకాశాలు ఇవ్వడం వంటి అంశాలను ఇందుకు ప్రస్తావించింది. ఉద్యోగ వలసలు(ఎట్రిషన్) వేధిస్తున్నప్పటికీ డీల్స్ కుదుర్చుకోవడంలో సఫలంకావడం సానుకూలతలుగా పేర్కొంది. స్థిరకరెన్సీ ప్రాతిపదికన విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ 4.5 శాతం పురోగతి సాధించనుండగా.. ఇన్ఫోసిస్ 3.7 శాతం, టీసీఎస్ 2.6 శాతం చొప్పున వృద్ధి చూపవచ్చని బ్రోకింగ్ సంస్థ కొటక్ అంచనా వేసింది. మధ్యస్థాయి కంపెనీలు 5–6 శాతం పుంజుకోవచ్చని, వార్షికంగా చూస్తే మరింత అధికంగా సగటున 20–34 శాతం మధ్య ఆదాయాల్లో వృద్ధి నమోదుకావచ్చని విశ్లేషించింది. అయితే ఈపీఎస్ వృద్ధిలో విప్రో యథాతథంగా, ఇన్ఫోసిస్ 6 శాతం, టీసీఎస్, టెక్ మహీంద్రా 13–14 శాతం చొప్పున సాధించే వీలుండగా.. హెచ్‌సీఎల్ క్షీణతను చవిచూడవచ్చని పేర్కొంది. ఇబిట్ నీరసం... క్యూ3లో వార్షికంగా సగటున అన్ని కంపెనీల నిర్వహణ (ఇబిట్) మార్జిన్లు మందగించవచ్చని కొటక్ నివేదిక అభిప్రాయపడింది. నివేదిక ప్రకారం ఇందుకు ఎట్రిషన్ (ఉద్యోగుల వలసలు) రేటు, సీనియర్ల నియామకాలు, యుటిలైజేషన్ తగ్గడం, వ్యయాలు పెరగడం వంటివి ప్రభావం చూపనున్నాయి. కాగా.. ఇన్ఫోసిస్ గైడెన్స్‌ను 1 శాతంమేర పెంచి 17–17.5 శాతంగా ప్రకటించవచ్చు. తొలుత 12–14 శాతం వృద్ధి అంచనాలతో ఏడాదిని ప్రారంభించడం గమనార్హం. ఇక హెచ్‌సీఎల్ రెండంకెల ఆదాయ వృద్ధిని అంచనా వేసింది. 12 శాతం పురోగతిని అందుకునే వీలుంది.