క్యూ3లో రూ. 8,240 కోట్లు
షేరుకి రూ. 5 డివిడెండ్
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఓఎన్‌జీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 17 శాతం క్షీణించి రూ. 8,240 కోట్లకు పరిమితమైంది. ముడిచమురు ధరలు నీరసించడం ప్రభావం చూపింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 9,892 కోట్లు ఆర్జించింది. కంపెనీ బోర్డు.. వాటాదారులకు షేరుకి రూ. 5 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది.
గడిచిన నవంబర్‌లో రూ. 6 చెల్లించిన సంగతి తెలిసిందే. కాగా.. మొత్తం ఆదాయం సైతం 3 శాతం వెనకడుగుతో రూ. 33,771 కోట్లకు చేరింది. ఈ కాలంలో బ్యారల్‌కు ముడిచమురు ధర 72.57 డాలర్లు చొప్పున అందుకుంది. గత క్యూ3లో 81.13 డాలర్లు చొప్పున లభించింది. నేచురల్ గ్యాస్ ఒక్కో ఎంబీటీయూ 6.5 డాలర్లు చొప్పున విక్రయించింది. ముడిచమురు ఉత్పత్తి స్వల్పంగా 2 శాతం పెరిగి 4.653 మిలియన్ టన్నులను తాకింది. నేచురల్ గ్యాస్ ఉత్పత్తి నామమాత్ర వృద్ధితో 4.978 బీసీఎంకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment