ONGC
-
ఓఎన్‌జీపీఎల్ చేతికి అయానా రెన్యూవబుల్
న్యూఢిల్లీ: ఓఎన్జీసీ–ఎన్టీపీసీ గ్రీన్ (ఓఎన్‌జీపీఎల్) తాజాగా అయానా రెన్యూవబుల్ పవర్‌ను కొనుగోలు చేయనుంది. ఇందుకోసం ఈక్విటీ, రుణభారాన్ని కూడా కలిపి కంపెనీ విలువను (ఎంటర్ప్రైజ్ వేల్యూ) రూ.19,500 కోట్లుగా (2.3 బిలియన్ డాలర్లు) లెక్కగట్టారు. ఓఎన్‌జీపీఎల్ నిర్దిష్ట మొత్తాన్ని అయానా యజమానులకు చెల్లించి, కంపెనీ రుణాలను తనకు బదలాయించుకునే విధంగా ఒప్పందం కుదిరింది. అయితే, ఎంత మొత్తం చెల్లించేదీ వెల్లడి కాలేదు.ఈ వ్యవహారానికి సంబంధించి అయానా ప్రస్తుత షేర్‌హోల్డర్లయిన నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (51 శాతం), బ్రిటీష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్..దాని అనుబంధ సంస్థలు (32 శాతం), ఎవర్‌సోర్స్ క్యాపిటల్ (17 శాతం) నుంచి 100 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు ఓఎన్‌జీపీఎల్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2024 నవంబర్‌లో ఏర్పాటైన తర్వాత తమ సంస్థకు ఇది తొలి వ్యూహాత్మక పెట్టుబడని ఓఎన్‌జీపీఎల్ తెలిపింది. పునరుత్పాదక ఇంధన విభాగంలో ఇది రెండో అతి పెద్ద డీల్‌గా నిలవనుంది. 2021 అక్టోబర్‌లో సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్ప్, భారతి గ్రూప్ నుంచి ఎస్బీ ఎనర్జీ ఇండియాను అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్) కొనుగోలు చేసింది. అప్పట్లో ఆ డీల్ విలువ ఏకంగా 3.5 బిలియన్ డాలర్లు. ఇక గతేడాది డిసెంబర్లో ఓ2 పవర్ పూలింగ్ అనే రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాట్‌ఫాంను జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ దక్కించుకుంది. ఇందుకోసం ఎంటర్ప్రైజ్ విలువను రూ. 12,468 కోట్లుగా (1.47 బిలియన్ డాలర్లు) లెక్కగట్టారు.ఇదీ చదవండి: కొత్త పన్ను చట్టం.. ఎంతో సులభతరం!4.1 గిగావాట్ల సామర్థ్యం..అయానాకు 4.1 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ అసెట్లు ఉన్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే పని చేస్తుండగా మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. మరోవైపు, చమురు..గ్యాస్ దిగ్గజం ఓఎన్జీసీ, విద్యుదుత్పత్తి దిగ్గజం ఎన్టీపీసీ కలిసి జాయింట్ వెంచర్‌గా ఓఎన్జీపీఎల్ను ఏర్పాటు చేశాయి. ఇందులో రెండు సంస్థలకూ చెరి 50 శాతం వాటాలు ఉన్నాయి. 2038 నాటికి కర్బన ఉద్గారాలను తటస్థ స్థాయికి తగ్గించుకునే దిశగా హరిత హైడ్రోజన్ ప్లాంట్లు, పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడంపై రూ. 2 లక్షల కోట్లు వెచ్చించనున్నట్లు ఓఎన్జీసీ గతేడాది వెల్లడించింది. -
తగ్గిన ఓఎన్జీసీ లాభం
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఓఎన్జీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 17 శాతం క్షీణించి రూ. 8,240 కోట్లకు పరిమితమైంది. ముడిచమురు ధరలు నీరసించడం ప్రభావం చూపింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 9,892 కోట్లు ఆర్జించింది. కంపెనీ బోర్డు.. వాటాదారులకు షేరుకి రూ. 5 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. గడిచిన నవంబర్‌లో రూ. 6 చెల్లించిన సంగతి తెలిసిందే. కాగా.. మొత్తం ఆదాయం సైతం 3 శాతం వెనకడుగుతో రూ. 33,771 కోట్లకు చేరింది. ఈ కాలంలో బ్యారల్‌కు ముడిచమురు ధర 72.57 డాలర్లు చొప్పున అందుకుంది. గత క్యూ3లో 81.13 డాలర్లు చొప్పున లభించింది. నేచురల్ గ్యాస్ ఒక్కో ఎంబీటీయూ 6.5 డాలర్లు చొప్పున విక్రయించింది. ముడిచమురు ఉత్పత్తి స్వల్పంగా 2 శాతం పెరిగి 4.653 మిలియన్ టన్నులను తాకింది. నేచురల్ గ్యాస్ ఉత్పత్తి నామమాత్ర వృద్ధితో 4.978 బీసీఎంకు చేరింది. -
ఓఎన్జీసీ నుంచి పవన్ హన్స్‌కు భారీ ఆర్డర్
ప్రభుత్వ యాజమాన్యంలోని హెలికాప్టర్ సేవల ఆపరేటర్ పవన్ హన్స్ తాజాగా ఓఎన్జీసీ నుంచి భారీ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఇందులో భాగంగా ఓఎన్జీసీ ఆఫ్–షోర్ కేంద్రాలకు సిబ్బందిని తరలించడానికి నాలుగు హెలికాప్టర్లను పవన్ హన్స్ సమకూరుస్తుంది. ఈ డీల్ విలువ రూ.2,141 కోట్లు. 10 ఏళ్లపాటు పవన్ హన్స్ ఈ సేవలను అందించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ పోటీ బిడ్డింగ్ ద్వారా కాంట్రాక్ట్ దక్కించుకున్నట్టు పవన్ హన్స్ వెల్లడించింది.ఇదీ చదవండి: హైదరాబాద్ ‘రియల్’ ట్రెండ్హెచ్ఏఎల్ తయారీ అత్యాధునిక ధ్రువ్ ఎన్జీ హెలికాప్టర్లను పవన్ హన్స్ వినియోగించనుంది. ‘దేశీయంగా తయారు చేసిన ధృవ్ ఎన్జీ అనేది అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్) ఎంకే–3 యొక్క సివిల్ వేరియంట్. ఏఎల్‌హెచ్ ఎంకే–3ని ప్రస్తుతం భారత రక్షణ దళాలు ఉపయోగిస్తున్నాయి. ఈ సైనిక హెలికాప్టర్లు నిరూపితమైన ట్రాక్ రికార్డును కలిగి ఉన్నాయి. ఇప్పటి వరకు 335 కంటే ఎక్కువ హెలికాప్టర్లు రంగ ప్రవేశం చేశాయి. ఇవన్నీ కలిపి మొత్తం 3,75,000 గంటలపాటు గగనతల విహారం చేశాయి’ అని పవన్ హన్స్ తెలిపింది. సంస్థ వద్ద ప్రస్తుతం 46 హెలికాప్టర్లు ఉన్నాయి. ఇవి చమురు, సహజ వాయువు అన్వేషణ, పోలీసు, కేంద్ర బలగాలు తరలింపు, యుటిలిటీ రంగంతోపాటు మారుమూల, కొండ ప్రాంతాలకు కనెక్టివిటీని అందిస్తున్నాయి. -
ఓఎన్జీసీ లాభం అదుర్స్.. షేరుకి రూ.6 డివిడెండ్
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 17 శాతం జంప్‌చేసి రూ. 11,948 కోట్లను తాకింది. చమురు ధరలు నీరసించినప్పటికీ విండ్ఫాల్సహా ఇతర పన్నులు తగ్గడం ఇందుకు సహకరించింది.గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 10,238 కోట్లు మాత్రమే ఆర్జించింది. చట్టబద్ధ సుంకాలు రూ. 10,791 కోట్ల నుంచి రూ. 7,830 కోట్లకు క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరిగితే ప్రభుత్వం విండ్‌ఫాల్ లాభాల పన్ను విధిస్తుంది. వాటాదారులకు షేరుకి రూ. 6 చొప్పున తొలి మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది.78.33 డాలర్లు తాజా సమీక్షా కాలంలో ఓఎన్జీసీ ఒక్కో బ్యారల్ చమురు విక్రయంపై 78.33 డాలర్ల ధరను అందుకుంది. గత క్యూ2లో 84.84 డాలర్లు చొప్పున లభించింది. అయితే కంపెనీ ఉత్పత్తి చేసిన గ్యాస్ ధరలు ఒక్కో ఎంబీటీయూకి 6.5 డాలర్లుగా కొనసాగాయి. చమురు వెలికితీత నామమాత్ర వృద్ధితో 4.576 మిలియన్ టన్నులుగా నమోదైంది. 2 శాతం తక్కువగా 4.912 బిలియన్ ఘనపు మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేసింది.ఇకపై ముడిచమురు ఉత్పత్తి పెరగనున్నట్లు కంపెనీ తెలియజేసింది. కేజీ బేసిన్ బ్లాక్ కేజీ–డీడబ్ల్యూఎన్ 98/2లో ఉత్పత్తి పుంజుకోనుండటం ఇందుకు తోడ్పడనున్నట్లు పేర్కొంది. కాగా.. మొత్తం ఆదాయం రూ. 35,163 కోట్ల నుంచి రూ. 33,881 కోట్లకు క్షీణించింది. అయితే ఇతర ఆదాయం రెట్టింపై రూ. 4,766 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ఓఎన్జీసీ షేరు బీఎస్ఈలో 2 శాతం క్షీణించి రూ. 257 వద్ద ముగిసింది. -
ఎన్టీపీసీతో చేతులు కలిపిన ఓఎన్జీసీ: ఎందుకంటే..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజాలు ఎన్టీపీసీ, ఓఎన్జీసీ తాజాగా చేతులు కలిపాయి. తద్వారా నూతన, పునరుత్పాదక ఇంధన విభాగంలో అవకాశాలను అన్వేషించనున్నాయి. ఇందుకు అనుగుణంగా గ్రీన్ ఎనర్జీ అనుబంధ సంస్థల ద్వారా భాగస్వామ్య కంపెనీ(జేవీ)కి తెరతీయనున్నాయి.చమురు దిగ్గజం ఓఎన్జీసీ సహకారంతో కొత్తతరం ఇంధన అవకాశాలను అందిపుచ్చుకోనున్నట్లు విద్యుత్ రంగ దిగ్గజం ఎన్టీపీసీ పేర్కొంది. ఓజీఎల్తో సమాన భాగస్వామ్య(50:50 వాటా) కంపెనీ(జేవీసీ) ఏర్పాటుకు వీలుగా కార్పొరేట్ వ్యవహారాల శాఖకు ఎన్జీఈఎల్ దరఖాస్తు చేసినట్లు తెలియజేసింది.సోలార్, విండ్, ఎనర్జీ స్టోరేజీ, ఈమొబిలిటీ, కార్బన్ క్రెడిట్స్ తదితర న్యూ ఎనర్జీ అవకాశాలపై జేవీ పనిచేయనున్నట్లు వివరించింది. పునరుత్పాదక ఇంధన ఆస్తుల కొనుగోలుతోపాటు.. తమిళనాడు, గుజరాత్‌లలో రాబోయే ఆఫ్‌షోర్ విండ్ టెండర్లలో పాలుపంచుకునే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. -
ఆయిల్, గ్యాస్ బ్లాకుల కోసం పోటాపోటీ
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ఆయిల్, గ్యాస్ బ్లాకుల వేలంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు పాలు పంచుకున్నాయి. ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ పాలసీ (ఓఏఎల్‌పీ–8) ఎనిమిదో దశ వేలంలో భాగంగా కేంద్ర సర్కారు 28 బ్లాకులను వేలానికి పెట్టింది. ఇవి 1.36 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి.ప్రైవేటు రంగంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్–బీపీ సంస్థలు మొదటిసారి ఓఎన్జీసీతో కలసి గుజరాత్ తీరంలోని ఓ బ్లాక్‌కు బిడ్ వేశాయి. ఓఎన్జీసీతోపాటు మరో ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్, వేదాంత, రిలయన్స్ ఇండస్ట్రీస్–బీపీ జేవీ, సన్ పెట్రోకెమికల్స్ ఇందులో పాల్గొన్నాయి. ఎనిమిదో విడత ఓఏఎల్‌పీలో 28 బ్లాక్‌లకు బిడ్ల దాఖలు గడువు సెప్టెంబర్ 21తో ముగిసింది. దీంతో ఈ వివరాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) విడుదల చేసింది.ఓఎన్జీసీ తాను సొంతంగా 14 బ్లాకులకు బిడ్లు దాఖలు చేసింది. ఆయిల్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌తో కలసి మరో నాలుగు బ్లాక్‌లకు బిడ్లు వేసింది. రిలయన్స్–బీపీతో కలసి వేసిన మరో బిడ్ కూడా కలిపి చూస్తే మొత్తం 19 బ్లాక్‌లకు ఓఎన్జీసీ పోటీ పడుతోంది. ఇక అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత లిమిటెడ్ మొత్తం 28 బ్లాకులకు సొంతంగా బిడ్లు సమర్పించింది. సన్ పెట్రోకెమికల్స్ ఏడు బ్లాకులకు బిడ్లు వేసింది. మొత్తం మీద నాలుగు బ్లాక్‌లకు మూడేసి చొప్పున బిడ్లు రాగా, మిగిలిన వాటికి రెండేసి చొప్పున దాఖలయ్యాయి. -
AP: గోదావరి నదిలో భారీగా గ్యాస్ లీక్.. భయాందోళనలో స్థానికులు
సాక్షి, కాకినాడ జిల్లా: గోదావరి నదిలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కొనసాగుతోంది. యానాం దరియాలతిప్ప వద్ద గౌతమీ నది(గోదావరి)లో ఓఎన్జీసీ పైపు లైన్ లీక్ కావడంతో గ్యాస్ నదిలో పొంగుతూ బుడగలుగా బయటకు వెళ్తుంది. లీకేజీని ఆపేందకు ఓఎన్జీసీ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కూడా లీకేజీ అదుపులోకి రావడం లేదు.యానాం దరియాలతిప్ప, కాట్రేనికోన మండలం బలుసుతిప్ప మధ్యలో ఈ లీకేజీ చోటుచేసుకుంది. చుట్టుపక్కల కిలోమీటర్ల మేర ఈ గ్యాస్ వ్యాపించిందని, మంటలు ఎగసిపడే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నది ముఖ ద్వారానికి సమీపంలో గ్యాస్ లీకేజీ కావడంతో గోదావరి, సముద్ర జలాలు కలుషితమవుతున్నాయి. దీంతో మత్స్య సంపద మనుగడ ప్రశ్నార్థకం కానుందని గ్యాస్ లీకేజీపై గంగపుత్రులు ఆందోళన చెందుతున్నారు.గోదావరి జిల్లాల్లో గతంలోనూ ఇలాంటి గ్యాస్ లీక్ కారణంగా భారీ నష్టమే జరిగిందని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ లీకేజీని ఆపేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.ఇదీ చదవండి: డైవర్షన్ చంద్రబాబుకి దెబ్బపడింది అక్కడే! -
కాలుష్య కట్టడికి రూ.25 వేలకోట్లు
ప్రభుత్వ ఆధీనంలోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ 2040 నాటికి తన ఉత్పత్తుల తయారీలో ఎలాంటి కర్బన ఉద్గారాలు విడుదల కాకుండా ప్రయత్నాలు చేపట్టింది. అందుకోసం రూ.25,000 కోట్ల పెట్టుబడితో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సంస్థ ఛైర్మన్ రంజిత్ రాత్ తెలిపారు.ఈ సందర్భంగా రంజిత్ రాత్ మాట్లాడుతూ..‘క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటులో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు, బయోగ్యాస్, ఇథనాల్ ప్లాంట్లను నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశాం. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే ప్రణాళికలున్నాయి. దాంతో నికర జీరో కర్బన ఉద్గారాలు లక్ష్యంగా పెట్టుకున్నాం. మార్చి 31, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 65 లక్షల టన్నుల ముడి చమురు ఉత్పత్తి చేశాం. 2025-26 నాటికి ఇది 90 లక్షల టన్నులకు చేరుతుంది. అస్సాంలోని రవాణా, పరిశ్రమలకు ఉపయోగపడే ద్రవ ఇంధనాల స్థానంలో సహజ వాయువులు వాడేందుకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి 80 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇప్పటికే అస్సాంలో 640 మెగావాట్లు, హిమాచల్ ప్రదేశ్‌లో మరో 150 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేశాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: వంటనూనె ధరలు పెంపు..?ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) అన్ని విభాగాల్లో 2046 నాటికి నికర జీరో కర్బన ఉద్గారాలు లక్ష్యంగా నిర్ణయించుకుంది. చమురు, గ్యాస్ ఉత్పత్తిదారైన ఓఎన్జీసీ 2038 నాటికి అదే లక్ష్యాన్ని సాధించడానికి రూ.2 లక్షల కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), గెయిల్ ఇండియా లిమిటెడ్ తమ కార్యకలాపాల్లో నికర సున్నా కర్బన ఉద్గారాలను సాధించడానికి 2040 లక్ష్యంగా పెట్టుకున్నాయి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) 2046 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ణయించింది. -
కేజీ బేసిన్లో మరో బావి నుంచి ఉత్పత్తి
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ లిమిడెట్ (ఓఎన్జీసీ) ముడిచమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌కు చెందిన కేజీ-డీ5 బ్లాక్‌లో ఐదు నంబర్ బావి నుంచి ఉత్పత్తి ప్రారంభించినట్లు ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. దీనివల్ల రానున్న రోజుల్లో కంపెనీ ఆదాయం పెరగనుందని పేర్కొంది.ఓఎన్జీసీ తెలిపిన వివరాల ప్రకారం..కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్లో లోతైన సముద్ర ప్రాజెక్ట్‌లో ఐదో నంబర్ బావి నుంచి ఉత్పత్తి ప్రారంభించింది. ఈ ఏడాది జనవరిలో కేజీ-డీ5 బ్లాక్ నుంచి చమురు ఉత్పత్తి చేస్తున్నారు. అయితే ఇందులో నాలుగు బావుల నుంచి ఇప్పటి వరకు చమురు, గ్యాస్ వెలికి తీసేవారు. కానీ తాజాగా కేజీ-డీడబ్ల్యూఎన్-98/2 క్లస్టర్-2 అసెట్‌లో ఐదో చమురు బావిలో ఉత్పత్తి ప్రారంభమైనట్లు ఓఎన్జీసీ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. ఈ కొత్త బావి వల్ల ముడిచమురు, సహజ వాయువు ఉత్పత్తి పెరుగుతుందని తెలిపింది.ఇదీ చదవండి: ప్రభుత్వ కంపెనీలకు జరిమానా!ఇదిలా ఉండగా, కొత్త బావి నుంచి ఎంత మొత్తంలో చమురు ఉత్పత్తి చేస్తారనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఈ బావి ద్వారా చేస్తున్న చమురు, గ్యాస్ ఉత్పత్తి వల్ల దిగుమతులు తగ్గే అవకాశం ఉన్నట్లు కంపెనీ తెలిపింది. దాంతో రానున్న రోజుల్లో సంస్థ లాభాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. -
వాస్తవ రూపంలోకి ఓఎన్జీసీ భారీ పెట్టుబడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) పెట్టుబడులు వాస్తవ రూపంలోకొస్తున్నాయి. బంగాళాఖాతంలోని కృష్ణా గోదావరి బేసిన్ పరిధిలో ఈ ఏడాది జనవరిలో 4 చమురు బావుల నుంచి ఉత్పత్తి ప్రారంభించిన ఓఎన్జీసీ తాజాగా అయిదో బావి నుంచి చమురు ఉత్పత్తిని ప్రారంభించింది. కేజీ డీ–5 బ్లాక్‌లోని క్లస్టర్–2లోని ఐదో బావి నుంచి విజయవంతంగా చమురును వెలికి తీసినట్లు ఆదివారం స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు తెలిపింది. ముడి చమురును వెలికి తీయడమే కాకుండా దాన్ని పెట్రోల్, డీజిల్, ఇతర ఉత్పత్తులుగా రిఫైనరీ చేసి ఫ్లోటింగ్ ప్రొడక్షన్, స్టోరేజ్, ఆఫ్ లోడింగ్ వెజల్ (ఎఫ్‌పీఎస్‌వో) ద్వారా సముద్రం నుంచి తీరానికి చేరుస్తోంది. ఇందుకోసం ఆర్మదా స్టెర్లింగ్–వీ ఫ్లోటింగ్ రిఫైనరీని ఓఎన్జీసీ అద్దెకు తీసుకుంది. క్లస్టర్–2లో అభివృద్ధి చేస్తోన్న ఈ బావులు ద్వారా 23.52 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు, 50.70 బిలియన్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువు ఉత్పత్తి అవుతుందని ఓఎన్జీసీ అంచనా. ఓఎన్జీసీ కేజీ బేసిన్లో మొత్తం చమురు సహజ వాయువు అన్వేషణ కోసం 26 చోట్ల డ్రిల్లింగ్ చేసింది. అందులో 13 చమురు బావులు, 7 సహజ వాయువు బావులను అభివృద్ధి చేస్తోంది. రిలయన్స్ కేజీడీ–6 బ్లాక్‌కు కూత వేటు దూరంలోనే ఓఎన్జీసీ కేజీ–డీ5 బ్లాక్‌ను అభివృద్ధి చేస్తోంది. తీరానికి 35 కి.మీ దూరంలో 300–3,200 మీటర్ల లోతులో వీటిని అభివృద్ధి చేస్తోంది. బావులను 3 క్లస్టర్లుగా విభజించిన ఓఎన్జీసీ మొదటి రెండు క్లస్టర్‌ల్లోని బావులను అభివృద్ధి చేస్తోంది. అక్టోబర్ నాటికి గ్యాస్ బావులతో పాటు మార్చి, 2025కి మొత్తం బావుల నుంచి ఉత్పత్తి ప్రారంభించాలన్నది లక్ష్యం. ఇందుకోసం రూ.42,081 కోట్లను వ్యయం చేస్తోంది.గత ప్రభుత్వ అండతో.. తూర్పు తీర ప్రాంతంలో తన పట్టును పెంచుకునేందుకు ఓఎన్జీసీ కృష్ణా గోదావరి బేసిన్‌పై ప్రధానంగా దృష్టి సారించింది. జగన్ సీఎం అవగానే కేజీ–డీ5 బ్లాక్ అభివృద్ధికి మద్దతి వ్వాల్సిందిగా ఓఎన్జీసీ అధికారులు కోరారు. నవంబర్1, 2019లో ఓఎన్జీసీ ఈడీ ఏజే మార్బుల్ నేతృత్వంలోని బృందం అప్పటి సీఎం జగన్‌ను కలిసి కేజీ–డీ5 ఇన్వెస్ట్మెంట్ ప్రణాళికలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల మద్దతు ఉంటుందని చెప్పడమే కాకుండా వేగంగా అనుమతులు మంజూరు చేయడంతో పనులు శరవేగంగా జరిగాయి. 2021కే ఉత్పత్తి ప్రారంభించాలని ఓఎన్జీసీ లక్ష్యంగా పెట్టుకోగా కోవిడ్ పరిణామాలతో పనులు ఆలస్యమయ్యాయి. ఆ తర్వాత ఓఎన్జీసీ చైర్మన్ సుభాష్ కుమార్, కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి తరుణ్ కపూర్‌తో కలిసి సెప్టెంబర్22, 2021న నాటి సీఎం జగన్‌ను కలిసి కేజీ బేసిన్లో జరుగుతున్న పనులను వివరించారు. దీంతో 2024 ప్రారంభం నుంచి ఒకొక్క బావి నుంచి ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వస్తున్నాయి. -
అల.. హడలెత్తిస్తోంది
అల్లవరం: సహజ వనరుల నిక్షేపాల కేంద్రాన్ని సముద్రం చుట్టేస్తోంది. కోనసీమలో ఓఎన్జీసీ టెర్మినల్‌కు భారీ ముప్పు పొంచి ఉంది. కృష్ణా – గోదావరి బేసిన్‌లోని సముద్ర జలాల అడుగు భాగంలోని గ్యాస్, చమురు నిక్షేపాలను నాలుగు దశాబ్దాలుగా ఓఎన్జీసీ వెలికితీస్తోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు తీరానికి సుమారు 20 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంపై ఉన్న ఆఫ్‌షోర్ టెర్మినల్ నుంచి రిగ్గుల ద్వారా సుమారు 15 లక్షల క్యూబిక్ మీటర్ల చమురు నిక్షేపాలను రోజూ వెలికి తీస్తోంది. ఇలా తీసిన నిక్షేపాలను పైపుల ద్వారా ఓడలరేవులోని ఆన్‌షోర్ టెర్మినల్‌కు తరలిస్తుంది. పొంచి ఉన్న ప్రమాదం సముద్ర అలల కారణంగా ఇప్పుడు ఈ ప్రాంతానికి ప్రమాదం పొంచి ఉంది. ఓడలరేవు గ్రామంలో 370 ఎకరాల్లో ఓఎన్జీసీ ఆన్‌షోర్ టెర్మినల్ విస్తరించి ఉంది. గ్యాస్, చమురు నిక్షేపాలను ఈ ఆన్‌షోర్ టెర్మినల్‌లో శుద్ధి చేసి గ్యాస్‌ను, చమురును ఆ కలెక్షన్ సెంటర్లకు మళ్లిస్తారు. ఈ టెర్మినల్‌కు రక్షణగా 2017లో చుట్టూ ప్రహరీ నిర్మించారు. టెర్మినల్‌కు దక్షిణంగా సముద్రం ఉంది. అప్పట్లో ప్రహరీకి సముద్రం కనీసం వంద మీటర్ల దూరం ఉండేది. మారిన వాతావరణ పరిస్థితులు, తుపానులు, అల్పపీడనాలతో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాలకు తీరం కోతకు గురవుతోంది. ఏడేళ్లలో సముద్రం వంద మీటర్ల ముందుకు వచ్చి0ది. ప్రస్తుతం టెర్మినల్ ప్రహరీని సముద్రం తాకుతోంది. దక్షిణ, పశి్చమం రెండు వైపులా ప్రహరీని భారీ అలలు చుట్టేస్తున్నాయి. ప్రహరీ చుట్టూ నిర్మించిన బీటీ (తారు) రోడ్డు, డ్రైనేజీని సముద్రం తనలో కలిపేసుకుంది. కెరటాల ఉధృతికి ప్రహరీ కూలితే టెర్మినల్‌కు పెనుముప్పు సంభవించే అవకాశం ఉంది. అదే జరిగితే రూ.కోట్ల విలువ చేసే టెర్మినల్‌కు భారీ నష్టం తప్పదు. సరుగుడు తోటలు నరికేసి.. ఓడలరేవులో వైనతేయ నది సముద్రంలో కలిసే సంగమం నుంచి కిలోమీటరు పొడవునా సరుగుడు తోటలు విస్తరించి ఉండేవి. కాలక్రమేణా ఈ తోటలను నరికేశారు. వేరు వ్యవస్థ కనుమరుగు కావడంతో భారీ అలల తాకిడికి తీరం కోతకు గురైంది. ఆన్షోర్పై టెర్మినల్ నిర్మాణానికి ముందు సముద్రం ఒక కిలోమీటర్ దూరంలో ఉండేదని, ప్రస్తుతం ప్రహరీని తాకుతోందని స్థానికులు చెబుతున్నారు. అంటే నాలుగు దశాబ్దాల కాలంలో సముద్ర తీరం ఏ స్థాయిలో కోతకు గురైందో ప్రస్తుత పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. స్పందించకుంటే ప్రమాదమే.. ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఓడలరేవు నుంచి కొమరగిరిపట్నం యడ్లరేవు వరకూ తీరం పొడవునా నాలుగు కిలోమీటర్ల వరకూ రూ.100 కోట్లతో రక్షణ గోడ నిర్మించాలని ప్రతిపాదనలు చేశారు. దీనికి ఓఎన్జీసీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఆ తర్వాత ఓఎన్జీసీ అధికారులు శ్రద్ధ చూపకపోవడంతో రక్షణ గోడ నిర్మాణం అటకెక్కింది. ఇటీవల కాలంలో కోతకు గురైన ప్రాంతంలో స్క్వేర్ ట్యూబ్‌ను ఏర్పాటు చేశారు. భారీ తుపాన్ల సమయాల్లో అలలకు స్క్వేర్ ట్యూబులను సైతం సముద్రం తనలో కలిపేసుకునే పరిస్థితి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఓఎన్జీసీ, ప్రజాప్రతినిధులు స్పందించి రక్షణ చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో టెర్మినల్‌కు ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఓఎన్జీసీ నిర్లక్ష్యం గ్లోబర్ వార్మింగ్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. దీనివల్ల ఓడలరేవులోని ఓఎన్జీసీ టెర్మినల్ ప్రహరీని అలలు తాకుతున్నాయి. అయినా ఓఎన్జీసీ ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందో అర్థం కావడం లేదు. 2004లో సునామీ తర్వాత ఇక్కడి సముద్ర తీరం భారీ కోతకు గురైంది. వందలాది ఎకరాలు సముద్రంలో కలిసిపోయాయి. శాస్త్రవేత్తల బృందం ఇక్కడి పరిస్థితులపై అధ్యయనం చేసి దానికి అనుగుణంగా జియో ట్యూబ్, గ్రోయిన్లు, లేదా రక్షణ గోడ నిర్మించాలని సూచించింది. ఓఎన్జీసీ ఈడీగా మార్బుల్ ఉన్న సమయంలో తీరం పొడవునా రక్షణ గోడ నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. అది ఇప్పటి వరకూ కార్యరూపం దాల్చలేదు. – పాల వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయుడు, ఓడలరేవు, అల్లవరం మండలం -
కోనసీమ జిల్లాలో గ్యాస్ లీకేజీ కలకలం
సాక్షి,అంబేద్కర్ కోనసీమ జిల్లా : కోనసీమ జిల్లా రాజోలు మండలం ములికిపల్లిలో గ్యాస్ లీకేజీ కలకలం సృష్టిస్తోంది. ఆక్వా చెరువుల వద్ద గతంలో వేసిన బోరు బావి నుంచి గ్యాస్ ఎగిసిపడుతోంది.బోర్ బావి నుంచి 15 మీటర్ల మేర పైకి ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గ్యాస్‌ను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. -
ఖజానాకు అంచనాలను మించి డివిడెండ్లు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల (సీపీఎస్ఈ) నుంచి ఖజానాకు బడ్జెట్ అంచనాలను మించిన స్థాయిలో డివిడెండ్లు అందాయి. 2023–24లో కోల్ ఇండియా, ఓఎన్జీసీ, పవర్‌గ్రిడ్, గెయిల్ వంటి దిగ్గజాలు ఏకంగా రూ. 63,000 కోట్లు చెల్లించాయి. సవరించిన బడ్జెట్ అంచనాలకన్నా ఇది 26 శాతం అధికం. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం 2023–24లో సీపీఎస్ఈల నుంచి రూ. 50,000 కోట్ల డివిడెండ్లు రావొచ్చని అంచనాలను సవరించారు. అయితే, పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం దీపమ్ వెబ్సైటు ప్రకారం కేంద్రానికి మొత్తం రూ. 62,929.27 కోట్లు వచ్చాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో (2022–23)లో డివిడెండ్ వసూళ్లు రూ. 59,952.84 కోట్లకు పరిమితమయ్యాయి. మార్చి నెలలో ఓఎన్జీసీ రూ. 2,964 కోట్లు, కోల్ ఇండియా రూ. 2,043 కోట్లు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూ. 2,149 కోట్లు, ఎన్ఎండీసీ రూ. 1,024 కోట్లు, హెచ్ఏఎల్ రూ. 1,054 కోట్లు, గెయిల్ రూ. 1,863 కోట్లు చెల్లించాయి. సీపీఎస్ఈలు అధిక మొత్తంలో డివిడెండ్ల చెల్లించడమనేది వాటి పటిష్టమైన పనితీరును ప్రతిబింబిస్తుంది. ఇది రిటైల్, సంస్థాగత వాటాదారులకు లబ్ధి చేకూర్చడంతో పాటు ఆయా సంస్థల షేర్లపై ఆసక్తిని పెంచేందుకు కూడా ఉపయోగపడగలదు. -
మత్య్సకారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్ (ఫోటోలు)
-
మత్య్సకారుల ఖాతాల్లో రూ. 161.86 కోట్లు జమ చేసిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఓఎన్జీసీ పైపులైను కారణంగా ఉపాధి కోల్పోయిన 23,459 కుటుంబాలకు ఐదో విడతగా రూ.161.86 కోట్లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమచేశారు. దాంతో ఇప్పటివరకూ ఐదు విడతల్లో రూ.647.44 కోట్లను సీఎం జగన్ ప్రభుత్వం మత్య్సకారుల ఖాతాల్లో జమ చేసినట్లయ్యింది. 4:15PM, Mar 12th, 2024 మత్య్సకారులకు పరిహారం జమ చేసే కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. మత్స్యకారులను ఆదుకునే విషయంలో ఓఎన్జీసీ ప్రోయాక్టివ్‌గా పనిచేస్తోంది ఒక్కో మత్స్యకార కుటుంబానికి నెలకు రూ.11,500 చొప్పున అందిస్తున్నాం మత్స్యకారు కుటుంబాలకు నష్టం జరగకూడదనే ఈ అడుగులు వేస్తున్నాం ఎమ్మెల్యే సతీష్ క్రమం తప్పకుండా డబ్బు విడుదలకు ఒత్తిడి తీసుకువస్తూనే ఉన్నారు అధికారులు కూడా చొరవగా ముందుకు అడుగులు వేసి మత్స్యకారులను ఆదుకోవడానికి చర్యలు తీసుకున్నారు మత్స్యకారులకు అందించే ఈ సహాయం ఐదోవిడత సహాయం దాదాపు రూ.162 కోట్లు అందిస్తున్నాం బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేస్తున్నాం ఇప్పటివరకూ రూ.644 కోట్లు ఇచ్చాం ఉపాధి కోల్పోయిన వీరందరికీ కూడా మంచి చేస్తున్నాం 2012కు సంబంధించి రూ.8 కోట్లు జీఎస్పీసీ ఇవ్వాల్సి ఉంది కానీ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు మన అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లో మత్స్యకారులకు మేలు చేస్తూ 78 కోట్లు 16 వేలకుపైగా మత్స్యకార కుటుంబాలకు ఇచ్చాం మత్స్యకారులకు తోడుగా ఉండే విషయంలో రాష్ట్రప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను అధికారంలోకి వచ్చిన నాటినుంచి కల్పిస్తూనే ఉన్నాం 1.07 లక్షల కుటుంబాలకు ఈ ఐదేళ్లలో మత్స్యకార భరోసాగా అందించిన సహాయం రూ.538 కోట్లు అందించాం వేట నిషేధ సమయంలో వారికి సహాయాన్ని అందించాం ఈ ప్రభుత్వం రాకముందు చంద్రబాబు హయాంలో ఐదేళ్లకాలంలో మత్స్యకార సోదరులకు ఇచ్చింది కేవలం రూ.104 కోట్లు మాత్రమే రూ.4వేల నుంచి రూ.10వేలకు పెంచి ఒక్కో కుటుంబానికి అందిస్తున్నాం దేశంలో ఏ రాష్ట్రంలోనూ మత్స్యకారులకు ఇంత సహాయం అందించడం లేదు గతంలో డీజిలుపై లీటరు మీద రూ.6లు సబ్సిడీ ఇస్తే, మనం రూ.9లకు పెంచాం గతంలో ఆ సబ్సిడీ ఎప్పుడు ఇస్తారో తెలిసేది కాదు ఇప్పుడు డీజిలు పోయించుకున్నప్పుడే సబ్సిడీ ఇస్తున్నాం ఈ విషయంలో గొప్ప విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం డీజిల్ సబ్సిడీని మరిన్ని బోట్లకు అందించాం దాదాపు 20 వేల బోట్లకు రూ.130 కోట్లుకు పైగా సబ్సిడీ ఇచ్చాం వేటకు వెళ్తే మత్స్యకారులు మరణిస్తే.. ఎక్స్‌గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచి ఇస్తున్నాం గతంలో ఎక్స్‌గ్రేషియా ఎప్పుడు వచ్చేదో తెలిసేది కాదు నిర్ణీత కాలంలో ఈ డబ్బు అందేలా చేస్తున్నాం 175 కుటుంబాలకు ఇప్పటివరకూ సహాయాన్ని అందించాం ఈమూడు కార్యక్రమాలే కాకుండా.. డ్రిల్లింగ్ కారణంగా నష్టపోయిన మత్స్యకారులకు ఉపాధి ఇస్తున్నాం అలాగే ఆక్వా రైతులకు రూపాయిన్నరకే విద్యుత్ సబ్సిడీని అందిస్తున్నాం దాదాపుగా రూ.3500 కోట్లు సబ్సిడీగా ఇచ్చాం ఈ ఆరు పథకలు రూ.4913 కోట్లు అందించాం ఇవికాకుండా నవరత్నాలు ద్వారా అందిస్తున్న సహాయం అదనం తమ కాళ్లమీద తాము నిలబడాలనే ఉద్దేశంతో ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు కాని, ఫిషింగ్ హార్బర్ లేదా, ల్యాండింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం 10 హార్బర్లు, 6 ల్యాండింగ్ సెంటర్లు, 4 పోర్టులు వాయు వేగంతో నిర్మాణం చేస్తున్నాం తీరంవెంబడి మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచాం బ్లూ ఎకనామీని పెంచేలా చర్యలు తీసుకున్నాం ఇవాళ జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రారంభించాలని అనుకున్నాం వీసీ ద్వారా కాకుండా నేరుగా అక్కడకు వెళ్లే ప్రారంభిస్తాను ప్రభుత్వం తీసుకున్న చర్యలు కారణంగా మత్స్యకారులు ఏవిధంగా లబ్ధి పొందుతున్నారో తెలియాలనే ఉద్దేశంతో నేనే స్వయంగా ఆ హార్బర్‌ను ప్రారంభిస్తాను దీంతో ఇవ్వాళ్టి కార్యక్రమాన్ని వాయిదా వేశాం 4:10PM, Mar 12th, 2024 జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్ క్యాంప్ ఆఫీసు నుండి వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్ రూ.289 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం 1,250 మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిలిపే సామర్ధ్యం 25 వేల మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం ఏడాదికి 41,250 టన్నుల మత్స్య ఉత్పత్తికి అవకాశం ఓఎన్టీసీ పైప్‌లైన్‌తో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు రూ.161.86 కోట్ల పరిహారం బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్ 3:30PM, Mar 12th, 2024 కాసేపట్లో జువ్వలదిన్నె హార్బర్ ప్రారంభం క్యాంప్ ఆఫీసు నుండి వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్ రూ.289 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం 1,250 మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిలిపే సామర్ధ్యం 25 వేల మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం ఏడాదికి 41,250 టన్నుల మత్స్య ఉత్పత్తికి అవకాశం ఓఎన్జీసీ పైప్‌లైన్‌తో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు రూ.161.86 కోట్ల పరిహారం బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్ సాక్షి, తాడేపల్లి:సముద్రాన్ని ఆధారంగా చేసుకొని చేపల వేట సాగించే రాష్ట్ర మత్స్యకారుల స్థితిగతులు పూర్తిగా మారిపోనున్నాయి. చేపల వేటకు పొరుగు రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా స్థానికంగానే వేట కొనసాగించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.3,793 కోట్లతో నిర్మిస్తున్న పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్సెంటర్లలో మొదటిది అందుబాటులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె వద్ద రూ.289 కోట్లతో నిర్మించిన ఫిషింగ్ హార్బర్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ప్రారంభించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రారంభించనున్నారు. ఈ హార్బరు ద్వారా 25,000 మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది.1250 మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిలిపేలా ఈ హార్బర్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దారు. ఈ హార్బర్ ద్వారా ఏటా 41,250 టన్నుల మత్స్య సంపద అదనంగా అందుబాటులోకి వస్తుంది. హార్బర్‌లోనే కోల్డ్ చైన్, ఐస్‌ప్లాంటు, చిల్ రూమ్ వంటి మౌలిక వసతులు, బోట్ రిపేర్ వర్క్‌షాపులు, గేర్‌షెడ్‌లు, నెట్ మెండింగ్ షెడ్లు వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఫిషింగ్ హార్బర్లతో పాటు రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే విధంగా రూ.16,000 కోట్లతో చేపట్టిన నాలుగు పోర్టుల నిర్మాణ పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి. ఈ పోర్టుల నిర్మాణంతో పెద్ద ఎత్తున ఉపాధి, తక్కువ రవాణా వ్యయంతో ఎగుమతులు చేసుకునే అవకాశం వస్తుంది. 23,458 మత్స్యకార కుటుంబాలకు రూ.161.86 కోట్ల పరిహారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ కారణంగా ఓఎన్జీసీ పైప్‌లైన్ నిర్మాణం ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు లబ్ధి చేకూరనుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన 23,458 మత్యకారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి నెలకు రూ.11,500 చొప్పున పరిహారం ఇప్పించేలా ఓఎన్జీసీని ప్రభుత్వం ఒప్పించింది. ఐదో విడత నష్టపరిహారం విడుదలలో భాగంగా ఆరు నెలల కాలానికి ఒక్కొక్కరికి రూ.69,000 చొప్పున మొత్తం రూ.161.86 కోట్ల ఆరి్థక సాయాన్ని సీఎం క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కడం ద్వారా నేరుగా లబ్థిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఐదు విడతల కింద ఇప్పటివరకు రూ.647.44 కోట్ల పరిహారాన్ని మత్స్యకారులకు ఈ ప్రభుత్వం అందజేసింది. ఈ 58 నెలల కాలంలో మత్స్యరంగానికి వివిధ పథకాల ద్వారా రూ.4,913 కోట్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం లబ్థి చేకూర్చింది. -
చమురు, గ్యాస్ ధరల ఎఫెక్ట్.. పడిపోయిన ఓఎన్జీసీ లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 9,536 కోట్ల లాభం (స్టాండెలోన్) ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో నమోదైన రూ. 11,045 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 14 శాతం తక్కువ. సమీక్షాకాలంలో చమురు, గ్యాస్ ధరలు తగ్గడమే.. లాభాల క్షీణతకు కారణమని సంస్థ తెలిపింది. క్యూ3లో క్రూడాయిల్ ఉత్పత్తి 3.3 శాతం తగ్గి 5.2 మిలియన్ టన్నులకు పరిమితం కాగా, గ్యాస్ ఉత్పత్తి 4.3 శాతం క్షీణించి 5.12 బిలియన్ ఘనపు మీటర్లుగా నమోదైంది. క్యూ3లో స్థూల ఆదాయం 10 శాతం తగ్గి రూ. 34,789 కోట్లుగా నమోదైంది. సమీక్షాకాలానికి షేరు ఒక్కింటికి రూ. 4 చొప్పున కంపెనీ రెండో మధ్యంతర డివిడెండు ప్రకటించింది. ఇందుకోసం సుమారు రూ. 5,032 కోట్లు అవుతుందని తెలిపింది. -
ఓఎన్జీసీ, ఎన్టీపీసీ జేవీ
గోవా: దేశీ చమురు–గ్యాస్ ఉత్పత్తి దిగ్గజం ఓఎన్జీసీ, అతిపెద్ద విద్యుత్ సంస్థ ఎన్టీపీసీ జాయింట్ వెంచర్ ఒప్పందంపై ఇండియా ఎనర్జీ వీక్ కార్యక్రమం వేదికగా బుధవారం సంతకం చేశాయి. ఈ జేవీ ద్వారా భారత్‌తోపాటు విదేశాల్లో పవన విద్యుత్ ప్రాజెక్టులను ఇరు సంస్థలు కలిసి ఏర్పాటు చేస్తాయి. స్టోరేజ్, ఈ–మొబిలిటీ, కార్బన్ క్రెడిట్, గ్రీన్ క్రెడిట్, గ్రీన్ హైడ్రోజన్ వ్యాపారంతోపాటు గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మిథనాల్ వంటి విభాగాల్లోకి ప్రవేశించే అవకాశాలను పరిశీలిస్తాయి. -
కేజీ బేసీన్లో చమురు ఉత్పత్తి ప్రారంభం
న్యూఢిల్లీ: రాష్ట్రాల ఆధీనంలో ఉండే ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థ ఆయిల్, నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) డీప్ వాటర్ ప్రాజెక్టులో భాగంగా ఆదివారం చమురు ఉత్పత్తిని ప్రారంభించింది. తూర్పు తీరంలోని కృష్ణా గోదావరి బేసిన్లో ప్రధానమైన డీప్‌వాటర్ ప్రాజెక్ట్ నుంచి చమురు ఉత్పత్తిని ఓఎన్జీసీ మొదలుపెట్టింది. అయితే మొదటిసారి బంగాళాఖాతం సముద్ర తీరంలో కష్టతమరైన డీప్ వాటర్ KG-DWN-98/2 బ్లాక్ నుంచి చమురు ఉత్పత్తిని ప్రారంభించినట్లు కేంద్ర కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి మంత్రి హర్దీప్ సింగ్ పూరి ‘ఎక్స్’ ట్విటర్లో తెలిపారు. దీంతో దేశంలోని ఇంధన ఉత్పత్తి కృష్ణా గోదావరి బేసిన్ (KGB)లోని లోతైన సరిహద్దుల నుంచి పెరగటం ప్రారంభమైందని కేంద్ర మంత్రి తెలిపారు. बधाई भारत! #ONGCJeetegaToBharatJeetega! As India powers ahead as the fastest growing economy under leadership of PM @NarendraModi Ji, our energy production is also set to rise from the deepest frontiers of #KrishnaGodavari “First Oil” production commences from the complex &… pic.twitter.com/gN2iPSs0YZ — Hardeep Singh Puri (@HardeepSPuri) January 7, 2024 ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోందని తెలిపారు. చమురు ఉత్పత్తి కృష్ణగోదావరి బేసిన్లో లోతైన సరిహద్దుల నుంచి పెరగడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఉత్పత్తి రోజుకు 45,000 బ్యారెల్స్, 10 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేయవచ్చని అంచనా వేస్తున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుత జాతీయ చమురు ఉత్పత్తికి 7 శాతం, జాతీయ సహజ వాయువు ఉత్పత్తికి 7 శాతం అదనంగా ఉత్పత్తిని సమకూర్చుతుందని తెలిపారు. చదవండి: మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవుల హైకమిషనర్‌కు భారత్ సమన్లు -
ఓఎన్జీసీ చేతికి 7 బ్లాకులు.. చమురు నిక్షేపాల తవ్వకాల్లో రిలయన్స్
న్యూఢిల్లీ: ఓపెన్ ఏకరేజ్ లైసెన్స్ పాలసీ(ఓఏఎల్‌పీ)లో భాగంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ) 7 బ్లాకులను గెలుచుకుంది. ప్రయివేట్ రంగ కన్సార్షియం రిలయన్స్–బీపీ, ఇంధన రంగ పీఎస్‌యూ ఆయిల్ ఇండియా, సన్పెట్రోకెమికల్స్ ఒక్కో క్షేత్రం చొప్పున సాధించాయి. చమురు, గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తికి సంబంధించి 8వ రౌండ్లో భాగంగా 10 బ్లాకులను ఆఫర్ చేసినట్లు చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు. వెరసి ఓఏఎల్‌పీ–8లో తాజాగా 10 బ్లాకులకు సంతకాలు జరిగినట్లు వెల్లడించారు. ఇదేసమయంలో మూడు కోల్బెడ్ మిథేన్(సీబీఎం) బ్లాకులను సైతం కేటాయించినట్లు తెలియజేశారు. అంతేకాకుండా ఓఏఎల్‌పీ–9వ రౌండ్ బిడ్డింగ్‌కు తెరతీసినట్లు తెలియజేశారు. తాజాగా ఆఫర్ చేసిన బ్లాకుల అన్వేషణ కార్యకలాపాలకు 23.3 కోట్ల డాలర్ల పెట్టుబడులు వెచ్చించవచ్చని భావిస్తున్నట్లు అధికారిక నోట్లో చమురు శాఖ పేర్కొంది. 2022 జులైలో ఓఎల్‌ఏపీ–8వ రౌండ్‌కు బిడ్డింగ్‌ను తెరిచిన సంగతి తెలిసిందే. చమురు శాఖ మొత్తం 10 బ్లాకులను ఆఫర్ చేసింది. పలు దఫాలు గడువు తేదీని సవరించాక 2023 జులైలో బిడ్డింగ్‌ను ముగించింది. హైడ్రోకార్బన్స్ డైరెక్టరేట్ జనరల్(డీజీహెచ్) వివరాల ప్రకారం ఓఎన్జీసీసహా వేదాంతా లిమిటెడ్, ఆయిల్ ఇండియా, సన్ పెట్రోకెమికల్స్, రిలయన్స్–బీపీ ఎక్స్‌ప్లొరేషన్(అల్ఫా) ఉమ్మడిగా 13 బిడ్స్ దాఖలు చేశాయి. బిడ్స్ తీరిలా కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేసిన 10 బ్లాకులలో ఏడింటికి ఒక్కొక్క బిడ్ దాఖలుకాగా.. మిగిలిన మూడు క్షేత్రాలకు రెండేసి బిడ్స్ లభించాయి. గ్లోబల్ ఇంధన దిగ్గజాలు ఎక్సాన్‌మొబిల్, షెవ్రాన్, టోటల్ఎనర్జీస్ బిడ్ చేయలేదు. మొత్తం 9 బ్లాకులకు బిడ్ చేసినఓఎన్జీసీ 6 బ్లాకులకు ఒంటరిగా రేసులో నిలిచింది. రిలయన్స్–బీపీ కేజీ బేసిన్‌లోని లోతైన సముద్రగర్భ బ్లాక్‌కు బిడ్ వేసింది. దశాబ్ద కాలంగా భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్న రిలయన్స్–బీపీ గత ఓఏఎల్‌పీ రౌండ్లలోనూ ఒక బ్లాకును గెలుచుకున్నాయి. చమురు దిగుమతుల బిల్లును తగ్గించుకునే లక్ష్యంతో ప్రభుత్వం 2016లో ఓఏఎల్పీకి తెరతీసింది. తద్వారా చమురు సంస్థలు ఇంధన అన్వేషణకు గుర్తించిన ప్రాంత పరిధిని దాటి ఏ ఇతర ప్రాంతాన్నయినా ఎంపిక చేసుకునేందుకు వీలు కల్పించింది. ప్రత్యేక సీబీఎం బిడ్ రౌండ్–2022లో భాగంగా 3 బ్లాకుల కేటాయింపునకు సంతకాలు పూర్తయినట్లు మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు. -
ఓఎన్జీసీ రూ. లక్ష కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థ ఆయిల్, నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) రెండు పెట్రోకెమికల్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముడి చమురును నేరుగా అధిక విలువైన రసాయన ఉత్పత్తులుగా మార్చడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ.1 లక్ష కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్టు కంపెనీ రెండవ త్రైమాసిక ఫలితాలపై ఇన్వెస్టర్ కాల్ సందర్భంగా ఓఎన్జీసీ ఫైనాన్స్ డైరెక్టర్ పోమిలా జస్పాల్ వెల్లడించారు. వేర్వేరు రాష్ట్రాల్లో రెండు ప్రాజెక్టులకుగాను 2028 లేదా 2030 నాటికి రూ.10,000 కోట్లు వెచ్చించనున్నట్టు సంస్థ ఈడీ డి.అధికారి తెలిపారు. పెట్రోకెమికల్స్ సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 4.2 మిలియన్ టన్నుల నుంచి 2030 నాటికి 8.5–9 మిలియన్ టన్నులకు చేర్చాలన్నది ప్రణాళిక అని పేర్కొన్నారు. ఒక ప్రాజెక్టు సొంతంగా, మరొకటి భాగస్వామ్యంలో నెలకొల్పనున్నట్టు తెలిపారు. -
ఓఎన్జీసీ లాభం డౌన్
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జూలై–సెప్టెంబర్‌లో నికర లాభం 20 శాతం క్షీణించి రూ. 10,216 కోట్లకు పరిమితమైంది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 12,826 కోట్ల నికర లాభం ఆర్జించింది. చమురు ఉత్పత్తితోపాటు ధరలు తగ్గడం ప్రభావం చూపింది. ఈ ఏడాది క్యూ1 (ఏప్రిల్–జూన్)లోనూ నికర లాభం 34 శాతం వెనకడుగు వేయడం గమనార్హం! కాగా.. ప్రతీ బ్యారల్ చమురుకు 84.84 డాలర్లు లభించగా.. గత క్యూ2లో 95.5 డాలర్లు సాధించింది. రష్యా–ఉక్రెయిన్ మధ్య తలెత్తిన యుద్ధం కారణంగా క్యూ1లో చమురు ధరలు పెరిగినప్పటికీ తిరిగి క్యూ2లో కొంతమేర నీరసించాయి. ఫలితాల నేపథ్యంలో ఓఎన్జీసీ షేరు 0.6% నీరసించి రూ. 196 వద్ద ముగిసింది. -
ఓఎన్జీసీ చేతికి పీటీసీ ఎనర్జీ
న్యూఢిల్లీ: పవర్ ట్రేడింగ్ సొల్యూషన్స్ సంస్థ పీటీసీ ఇండియా తమ అనుబంధ సంస్థ పీటీసీ ఎనర్జీలో పూర్తి వాటాలను ప్రభుత్వ రంగ ఓఎన్జీసీకి విక్రయించనుంది. ఇందుకోసం సంస్థ విలువను రూ. 2,021 కోట్లుగా లెక్కగట్టినట్లు సంస్థ తెలిపింది. పీటీసీ ఎనర్జీలో 100 శాతం వాటాల కొనుగోలు కోసం ఓఎన్జీసీ రూ. 925 కోట్లు నగదు చెల్లించేందుకు బిడ్‌ను దాఖలు చేసిందని, దీని ప్రకారం సంస్థ విలువ రూ. 2,021 కోట్లుగా (రుణాలు, ఈక్విటీ విలువ మొదలైనవన్నీ కలిపి) ఉంటుందని పీటీసీ ఇండియా తెలిపింది. మిగతా బిడ్డర్లతో పోలిస్తే ఓఎన్జీసీ అత్యధికంగా బిడ్ చేయడంతో దాన్ని ఎంపిక చేసినట్లు వివరించింది. సంబంధిత నిబంధనలు, షేర్‌హోల్డర్ల ఆమోదం మేరకు ఈ ఒప్పందం ఉంటుందని సంస్థ పేర్కొంది. 2008లో ఏర్పాటైన పీఈఎల్ .. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటకల్లో 288.8 మెగావాట్ల సామర్ధ్యంతో ఏడు పవన విద్యుత్ ప్రాజెక్టులను నెలకొలి్పంది. -
రూ.5,000 కోట్లతో రష్యా చమురు కొనుగోలు
న్యూఢిల్లీ: రష్యా వద్ద నిలిచిపోయిన 600 మిలియన్ డాలర్ల (సుమారు రూ.5వేల కోట్లు) డివిడెండ్‌తో అక్కడి నుంచి చమురు కొనుగోలు చేయాలనే ప్రతిపాదనతో ప్రభుత్వరంగ చమురు సంస్థలు ఉన్నాయి. రష్యా ఆయిల్ అండ్ గ్యాస్ క్షేత్రాల్లో తమ పెట్టుబడులకు సంబంధించిన డివిడెండ్ ఆదాయం ఇండియన్ ఆయిల్, ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ విదేశ్ రావాల్సి ఉంది. రష్యా బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తం ఉండిపోయింది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణతో పశి్చమ దేశాలు ఆంక్షలు విధించడంతో భారత చమురు సంస్థలు రష్యా బ్యాంకుల నుంచి డివిడెండ్ నిధులను తెచ్చుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో న్యాయపరమైన, ఆర్థిక పరమైన చిక్కుల గురించి అధ్యయనం చేస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. రష్యాలోని ఆయిల్ అండ్ గ్యాస్ క్షేత్రాల్లో భారత కంపెనీలు 5.46 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టాయి. ఆయా క్షేత్రాల నుంచి ఉత్పత్తయ్యే చమురు, గ్యాస్ విక్రయంపై వచ్చే లాభాల నుంచి తమ వంతు వాటా వీటికి వస్తుంటుంది. రష్యాపై ఆంక్షల తర్వాత అక్కడి నుంచి నిధుల బదిలీకి అవకాశం లేకుండా పోయింది. కరెన్సీ విలువల్లో అస్థిరతలకు చెక్ పెట్టేందుకు తమ దేశం నుంచి డాలర్లను వెనక్కి తీసుకెళ్లే విషయంలో రష్యా ఆంక్షలు విధించడం కూడా ఇందుకు కారణం. రష్యా బ్యాంకుల్లోని ఖాతాల్లో తమకు రావాల్సిన 150 మిలియన్ డాలర్ల డివిడెండ్ ఆదాయం చిక్కుకుపోయినట్టు ఆయిల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్, ఎండీ రంజిత్ రథ్ తెలిపారు. ఐవోసీ, భారత్ పెట్రో రీసోర్సెస్‌తో కలిపితే రావాల్సిన డివిడెండ్ 450 మిలియన్ డాలర్లుగా ఉన్నట్టు చెప్పారు. -
ఓపీఏఎల్‌లో ఓఎన్జీసీ రూ.15,000 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ).. ఓఎన్జీసీ పెట్రో–అడిషన్స్ లిమిటెడ్‌కు (ఓపీఏఎల్) సుమారు రూ.15,000 కోట్ల నిధులు సమకూర్చాలని నిర్ణయించింది. అధిక రుణభారం కారణంగా నష్టపోతున్న ఓపీఏఎల్కు ఆర్థిక పునర్ వ్యవస్థీకరణకు ఓఎన్జీసీ బోర్డు గత వారం ఆమోదం తెలిపింది. గుజరాత్‌లోని దహేజ్ వద్ద భారీ పెట్రోకెమికల్ ప్లాంట్‌ను నిర్వహిస్తున్న ఓపీఏఎల్‌లో ఓఎన్జీసీకి 49.36 శాతం, గెయిల్ ఇండియాకు 49.21, గుజరాత్ స్టేట్ పెట్రోకెమికల్ కార్ప్‌నకు (జీఎస్పీసీ) 1.43 శాతం వాటా ఉంది. ఓపీఏఎల్కు ఆర్థిక పునర్ వ్యవస్థీకరణలో భాగంగా షేర్ వారెంట్లను ఈక్విటీగా ఓఎన్జీసీ మారుస్తుంది. రూ.7,778 కోట్ల విలువైన కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్లను బైబ్యాక్ చేస్తుంది. అలాగే ఈక్విటీ రూపంలో అదనంగా రూ.7,000 కోట్లు పెట్టుబడిగా పెడుతుంది. తద్వారా ఓపీఏఎల్‌లో దాదాపు 95 శాతం వాటా సమకూరుతుందని స్టాక్ ఎక్సే్ఛంజ్ ఫైలింగ్‌లో ఓఎన్జీసీ వెల్లడించింది. ఇది అమలు చేసిన తర్వాత ఓఎన్జీసీకి ఓపీఏఎల్ అనుబంధ సంస్థగా మారుతుందని పేర్కొంది. ‘ఆర్థిక పునరి్నర్మాణంతో ఓపీఏఎల్‌లో ఓఎన్జీసీ హోల్డింగ్‌ను పెంచుతుంది. ఓపీఏఎల్ మరింత లాభదాయకంగా మారుతుంది. మొత్తం కొనుగోలు వ్యయం రూ.14,864 కోట్లుగా ఉంటుంది’ అని ఓఎన్జీసీ పేర్కొంది. పునర్ వ్యవస్థీకరణ తరువాత ఓపీఏఎల్‌లో గెయిల్, జీఎస్పీసీ వాటా 5 శాతానికి పరిమితం అవుతుంది. 2008లో ఓపీఏఎల్‌లో గెయిల్ వాటాను కైవసం చేసుకుంది. దహేజ్ ప్లాంట్ ప్రణాళిక సమయంలో రూ.12,440 కోట్లతో అంచనా వేశారు. కానీ 2017లో దాదాపు రూ.30,000 కోట్లతో పూర్తయింది. ప్లాంటుకు భారీ వ్యయం, నిర్మాణం ఆలస్యం కావడంతో గెయిల్ తన ఈక్విటీ వాటాను రూ.996.28 కోట్లకు పరిమితం చేయాలని నిర్ణయించుకుంది. ఓపీఏఎల్ నష్టాలు 2023 మార్చి నాటికి రూ.13,000 కోట్లకు చేరుకున్నాయి. -
ఓఎన్జీసీ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: తక్కువ కర్బన ఇంధన సంస్థగా అవతరించే లక్ష్యంతో ప్రభుత్వరంగ ఓఎన్జీసీ ఈ దశాబ్దం చివరికి రూ.లక్ష కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. పునరుత్పాదక ఇంధనాలు, గ్రీన్ హైడ్రోజన్ కంపెనీ ప్రణాళికల్లో భాగంగా ఉన్నాయి. తక్కువ కర్బన ఇంధనాల పోర్ట్‌ఫోలియోను పెంచుకునే స్పష్టమైన కార్యాచరణతో ఉన్నట్టు ఓఎన్జీసీ తాజాగా ప్రకటించింది. ‘‘దేశ ప్రతిష్టాత్మక లక్ష్యాలకు అనుగుణంగా ఓఎన్జీసీ సైతం అడుగులు వేస్తుంది. బిలియన్ టన్నుల మేర కర్బన ఉద్గారాల విడుదలను కట్టడి చేయడం, 2030 నాటికి కర్బన తీవ్రతను 45 శాతానికి తగ్గించడం కోసం కృషి చేస్తాం’’అని ఓఎన్జీసీ తెలిపింది. సుస్థిర విధానాలను అనుసరించడం వల్ల గడిచిన ఐదేళ్లలో స్కోప్–1, స్కోప్–2 ఉద్గారాల విడుదలను 17 శాతం తగ్గించినట్టు పేర్కొంది. 2022–23లోనే ఉద్గారాల విడుదలను 2.66 శాతం తగ్గించుకున్నట్టు వివరించింది. 2038 నాటికి స్కోప్–1, స్కోప్–2 ఉద్గారాలను సున్నా స్థాయికి తీసుకురానున్నట్టు ప్రకటించింది. తక్కువ కర్బన ఇంధనాల కోసం ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంటున్నట్టు తెలిపింది. రెండు గ్రీన్‌ఫీల్డ్ ఆయిల్2కెమికల్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. 2030 నాటికి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టడంతోపాటు, పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 10 గిగావాట్లకు చేర్చనున్నట్టు తెలిపింది. -
ముడి చమురు, సహజ వాయువు బ్లాక్‌ల వేలం.. ఓన్జీసీ,రిలయన్స్ పోటీ
న్యూఢిల్లీ: తాజా విడత ముడి చమురు, సహజ వాయువు బ్లాక్‌ల వేలంలో ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ, వేదాంత, రిలయన్స్ ఇండస్ట్రీస్ కన్సార్షియం, ఆయిల్ ఇండియా, సన్ పెట్రోకెమికల్స్ మొదలైన అయిదు సంస్థలు పాల్గొన్నాయి. 10 బ్లాక్‌లకు సంబంధించి 13 బిడ్లు దాఖలు చేశాయి. అయితే, ఎక్సాన్‌మొబిల్, షెవ్రాన్, టోటల్ఎనర్జీస్ వంటి విదేశీ దిగ్గజాలు మాత్రం వేలానికి దూరంగా ఉన్నాయి. చమురు, గ్యాస్ రంగ నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) ఈ వివరాలు వెల్లడించింది. ఓపెన్ ఎక్రేజ్ లైసెన్సింగ్ పాలసీ (ఓఏఎల్‌పీ) ప్రకారం కేంద్రం గతేడాది జూలైలో ఎనిమిదో విడత కింద 10 బ్లాకులను వేలానికి ఉంచింది. డెడ్‌లైన్‌ను పలుమార్లు పొడిగించిన తర్వాత మొత్తానికి గత వారం బిడ్డింగ్ ముగిసింది. డీజీహెచ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఏడు బ్లాకులకు ఒక్కోటి చొప్పున, మిగతా మూడు బ్లాకులకు రెండు చొప్పున బిడ్లు వచ్చాయి. ఆరు బ్లాకుల్లో ఏకైక బిడ్డరుగా నిల్చిన ఓఎన్జీసీ మొత్తం మీద పదింటిలో తొమ్మిది బ్లాకులకు బిడ్ చేసింది. రిలయన్స్–బీపీ బిడ్ చేసిన కేజీ బేసిన్ బ్లాకు కోసం పోటీపడలేదు. మరోవైపు, వేదాంత, ఆయిల్, సన్ పెట్రోకెమికల్స్ తలో బ్లాక్ కోసం బిడ్ చేసి ఓఎన్జీసీకి పోటీదార్లుగా నిల్చాయి. చమురు, గ్యాస్ నిక్షేపాలు మరింతగా అందుబాటులోకి వస్తే 157 బిలియన్ డాలర్ల చమురు దిగుమతుల భారం తగ్గుతుందని కేంద్రం ఆశిస్తోంది. ఇంధన నిల్వలకు అవకాశమున్న ప్రాంతాలను అన్వేషణ కోసం వేలం వేస్తోంది. ఈ క్రమంలోనే 2016లో కేంద్రం ఓఏఎల్‌పీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటివరకూ 144 బ్లాక్‌లను వేలంలో కేటాయించింది. ఇవి 2.44 లక్షల చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్నాయి. -
ఓఎన్జీసీ రూ. లక్ష కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి దిగ్గజం ఓఎన్జీసీ 2030 నాటికి ఇంధన పరివర్తన ప్రాజెక్టులపై రూ. 1 లక్ష కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. 2038 నాటికి నెట్ జీరో ఎమిషన్స్ (కర్బన ఉద్గారాల విడుదల, తగ్గింపు మధ్య సమతౌల్యం పాటించడం) లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. తద్వారా నెట్ జీరో ఎమిషన్స్‌కు మార్గదర్శ ప్రణాళికలను వేసుకుంటున్న తోటి సంస్థలు ఇండియన్ ఆయిల్, హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్), గెయిల్, భారత్ పెట్రోలియం (బీపీసీఎల్) మొదలైన వాటి సరసన చేరనుంది. కంపెనీ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ ఈ విషయాలు వెల్లడించారు. తాము అంతర్గతంగా నెట్–జీరోపై కసరత్తు చేసి 2038 లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ఆయన తెలిపారు. 2030 నాటికి పునరుత్పాదక వనరుల ద్వారా విద్యుదుత్పత్తిని 189 మెగావాట్ల నుంచి 1 గిగావాట్లకు పెంచుకోవాలని ఓఎన్జీసీ నిర్దేశించుకుంది. ఇప్పటికే రాజస్థాన్‌లో 5 గిగావాట్ల ప్రాజెక్టును ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉండగా.. అదే స్థాయిలో మరో ప్రాజెక్టును నెలకొల్పే అంశం పరిశీలనలో ఉన్నట్లు సింగ్ వివరించారు. మంగళూరులో వార్షికంగా 1 మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా ప్లాంటును ఏర్పాటు చేయడంపైనా దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. వీటన్నింటికీ మొత్తం మీద రూ. 1 లక్ష కోట్ల వరకు పెట్టుబడులు ఉంటాయని సింగ్ వివరించారు. ఆయిల్ ఉత్పత్తి అప్.. 2022–23లో ఓఎన్జీసీ 19.584 మిలియన్ టన్నుల (ఎంటీ) చమురు ఉత్పత్తి చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది 21.263 ఎంటీకి, తదుపరి 21.525 ఎంటీ, ఆ తర్వాత ఆర్థిక సంవత్సరంలో 22.389 ఎంటీకి చేరనుంది. 2021–22లో చమురు ఉత్పత్తి 19.545 ఎంటీగా నమోదైంది. మరోవైపు సహజ వాయువు ఉత్పత్తి 2022–23లో 20.636 బీసీఎం (బిలియన్ ఘనపు మీటర్లు)గా ఉండగా, 2023–24లో 23.621 బీసీఎం, తర్వాత ఏడాది 26.08 బీసీఎం, 2025–26లో 27.16 బీసీఎంకు చేరనుంది. తూర్పు, పశ్చిమ తీరాల్లోని ప్రాజెక్టుల్లో ఉత్పాదకతను పెంచుకోవడంతో పాటు కొత్త నిక్షేపాలను కూడా అభివృద్ధి చేస్తుండటంతో ఉత్పత్తి పెరగడానికి దోహదపడుతోంది. ఇదీ చదవండి: ఆర్‌క్యాప్ నష్టాలు తగ్గాయ్ -
కేజీ బేసిన్లో ఓఎన్జీసీ చమురు ఉత్పత్తి
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) కృష్ణా గోదావరి బేసిన్ (కేజీ బేసిన్)లోని కేజీ డీ5 ప్రాజెక్ట్ పరిధిలో చమురు ఉత్పత్తిని ఈ ఏడాది మే నెలలో ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. సహజ వాయువు ఉత్పత్తిని ఏడాది తర్వాత ప్రారంభిస్తామని ఓఎన్జీసీ డైరెక్టర్ (ఉత్పత్తి విభాగం) పంకజ్ కుమార్ వెల్లడించారు. ముందుగా అనుకున్న ప్రకారం అయితే కేజీ డీ5 పరిధిలోని డీడబ్ల్యూఎన్–98/2 క్లస్టర్–2 క్షేత్రాల నుంచి గ్యాస్ ఉత్పత్తిని 2019 జూన్‌లోనే మొదలు పెట్టాలి. అదే విధంగా ఆయిల్ ఉత్పత్తిని 2020 మార్చిలో ఆరంభించాల్సి ఉంది. కానీ, ఈ లక్ష్యాలను ఓఎన్జీసీ చేరుకోలేకపోయింది. కరోనా మహమ్మారితో కాంట్రాక్టు, సరఫరా చైన్ సమస్యలను కారణాలుగా పేర్కొంటూ చమురు ఉత్పత్తిని 2021 నవంబర్‌కు వాయిదా వేసింది. ఆ తర్వాత 2022 మూడో త్రైమాసికానికి, ఇప్పడు మే నెలకు వాయిదా వేసుకుంది. గ్యాస్ ఉత్పత్తిని 2021 మే నెలకు వాయిదా వేసుకోగా, అది కూడా సాధ్యపడలేదు. ఆ తర్వాత 2023 మే నెలకు వాయిదా వేయగా, ఇప్పుడు 2024 మేలోనే గ్యాస్ ఉత్పత్తి సాధ్యమవుతుందని ఓఎన్జీసీ చెబుతోంది. ఫ్లోటింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేశాం ఇప్పటికే సముద్ర జలాల్లో ఫ్లోటింగ్ (నీటిపై తేలి ఉండే) ఉత్పత్తి యూనిట్‌ను (ఎఫ్‌పీఎస్‌వో) ఏర్పాటు చేసినట్టు ఓఎన్జీసీ డైరెక్టర్ పంకజ్ కుమార్ తెలిపారు. చమురు ఉత్పత్తి మే నుంచి ప్రారంభిస్తామని ప్రకటించారు. ‘‘రోజువారీ 10,000 నుంచి 12,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తి మొదలు పెడతాం. రెండు నుంచి మూడు నెలల్లో రోజువారీ 45,000 బ్యారెళ్ల గరిష్ట ఉత్పత్తికి తీసుకెళతాం. చమురుతోపాటు 2 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్ కూడా బయటకు వస్తుంది. వాస్తవంగా గ్యాస్ ఉత్పత్తిని 2024 మే నెలలో మొదలు పెడతాం. అప్పుడు రోజువారీగా 7–8 ఎంఎంఎస్‌సీఎండీ ఉత్పత్తి సాధ్యపడుతుంది’’అని వివరించారు. వాస్తవంగా వేసుకున్న ఉత్పత్తి అంచనాల కంటే ఇవి తక్కువ కావడం గమనించాలి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో చమురు ఉత్పత్తి తగ్గకుండా చర్యలు తీసుకుంటామని, అదే సమయంలో సహజ వాయువు ఉత్పత్తి పెరుగుతుందని పంకజ్ కుమార్ తెలిపారు. -
డీజిల్ ఎగుమతిపై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు
న్యూఢిల్లీ: డీజిల్ ఎగుమతిపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ను లీటరుకు రూపాయి పెంచుతూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే దేశీయంగా ఉత్పత్తయిన ముడి చమురుపై పన్నును ఐదో వంతు తగ్గించినట్లు అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వుల ప్రకారం చమురు, సహజ వాయువుల సంస్థ (ఓఎన్జీసీ) వంటి కంపెనీలు ఉత్పత్తి చేసే ముడి చమురుపై లెవీ టన్నుకు రూ.4,400 నుంచి రూ.3,500కి తగ్గింది. భారత్ 2022 జూలై 1వ తేదీన విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా అంతర్జాతీయంగా ధరలు పెరుగుదల వల్ల ఇంధన కంపెనీలకు అనూహ్యంగా వచ్చే భారీ లాభాలపై పన్ను విధిస్తున్న పలు దేశాల సరసన చేరింది. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ప్రతి పదిహేను రోజులకు ఈ పన్ను మదింపు, నిర్ణయం జరుగుతోంది. అటువంటి లెవీ ప్రస్తుతం ఉన్న అన్ని ఇతర పన్నులకు అదనం. దేశీయ చమురు అన్వేషణకు విఘాతం కలుగుతుందని పేర్కొంటూ ఈ పన్నును రద్దు చేయాలని ఫిక్కీ వంటి పారిశ్రామిక సంస్థలు తమ ప్రీ–బడ్జెట్ మెమోరాండంలో ప్రభుత్వాన్ని కోరాయి. -
ఓఎన్జీసీతో టోటల్ఎనర్జీస్ జట్టు
న్యూఢిల్లీ: చమురు, గ్యాస్ క్షేత్రాల్లో కొత్త నిక్షేపాల వెలికితీతకు అవసరమైన సాంకేతిక సహకారం కోసం ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ అంతర్జాతీయ సంస్థలతో చేతులు కలుపుతోంది. ఇందులో భాగంగా తాజాగా మహానది, అండమాన్ క్షేత్రాలకు సంబంధించి ఫ్రాన్స్‌కి చెందిన టోటల్‌ఎనర్జీస్‌తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. సముద్ర లోతుల్లో నిక్షేపాల అన్వేషణకు కావాల్సిన సాంకేతిక సహకారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ (ఓఎన్జీసీ) ట్విటర్లో వెల్లడించింది. ఎక్సాన్‌మొబిల్, షెవ్రాన్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలతో ఓఎన్జీసీ ఇప్పటికే ఈ తరహా ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇవన్నీ ఇంకా పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చాల్సి ఉంది. ఓఎన్జీసీకి వివిధ ప్రాంతాల్లో గ్యాస్, చమురు నిక్షేపాల వెలికితీత, ఉత్పత్తికి లైసె న్సు ఉంది. అయితే, కంపెనీకి కేటాయించిన క్షేత్రా ల్లో ఉత్పత్తి తగ్గిపోతుండటంతో పాటు కొత్తగా మరే నిక్షేపాలు ఇటీవలి కాలంలో బైటపడటం లేదు. దీంతో సంక్లిష్టమైన క్షేత్రాల్లో గ్యాస్, చమురు నిల్వలను అన్వేషించేందుకు, ఉత్పత్తిని పెంచుకునేందుకు ఓఎన్జీసీ ఇతర సంస్థలతో జట్టు కడుతోంది. -
ఓఎన్జీసీ రూ.16వేల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఓఎన్జీసీ చమురు, గ్యాస్ ఉత్పత్తి పెంపుపై దృష్టి పెట్టింది. అరేబియా సముద్రంలో 103 బావుల్లో వచ్చే 2–3 ఏళ్లలో డ్రిల్లింగ్ చేయనున్నట్టు ప్రకటించింది. ‘‘దీనివల్ల 100 మిలియన్ టన్నుల ఆయిల్, గ్యాస్ అదనంగా ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. అదనంగా ఉత్పత్తయ్యే మేర దిగుమతుల భారం తగ్గుతుంది’’ అని ఓఎన్జీసీ ప్రకటించింది. మనదేశ చమురు అవసరాల్లో 85 శాతం మేర దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. అలాగే సహజవాయువు అవసరాల్లో సగం మేర దిగుమతులైనే ఆధారపడి ఉన్నాం. దేశీయంగా చమురు, గ్యాస్ ఉత్పత్తి పెంపుపై దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చమురు కంపెనీలను కోరడం గమనార్హం. ఓఎన్జీసీ ఉత్పత్తి గత కొన్నేళ్లుగా తగ్గుతూ వస్తోంది. కానీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఉత్పత్తి క్షీణత ఉండదని ఓఎన్జీసీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చమురు ఉత్పత్తి 22.83 మిలియన్ టన్నులుగా, గ్యాస్ ఉత్పత్తి 22.099 బీసీఎంకు పెరుగుతుందని భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో చమురు ఉత్పత్తి 24.63 మిలియన్ టన్నులు, గ్యాస్ ఉత్పత్తి 25.68 బీసీఎంకు చేరుకుంటుందన్న అంచనాతో ఉంది. -
లక్షల కోట్లలో.. లాభాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థల (పీఎస్‌యూలు/పీఎస్ఈలు) నికర లాభం గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2021–22) 51 శాతం పెరిగి రూ.2.49 లక్షల కోట్లుగా ఉంది. ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్ (ఐవోసీ), పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, సెయిల్ అత్యధిక లాభాలను తెచ్చిపెడుతున్నాయి. 2020–21లో ప్రభుత్వరంగ సంస్థల నికర లాభం రూ.1.65 లక్షల కోట్లుగా ఉంది. ఇక నష్టాలతో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థల నష్టం అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.23వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్లకు తగ్గింది. అంటే నష్టాన్ని 38 శాతం తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఎయిర్ ఇండియా అస్సెట్ హోల్డింగ్స్, ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్, అలయన్స్ ఎయిర్ ఏవియేషన్ ఎక్కువ నష్టాలతో నడుస్తున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల స్థూల ఆదాయం 2021–22లో రూ.31.95 లక్షల కోట్లుగా ఉంది. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో రూ.24.08 లక్షల కోట్లుగా ఉండడం గమనించాలి. అంటే ఏడాదిలో 33 శాతం వృద్ధి చెందింది. ముఖ్యంగా పెట్రోలియం రిఫైనరీ మార్కెటింగ్, ట్రేడింగ్ అండ్ మార్కెటింగ్, పవర్ జనరేషన్ కంపెనీలే ఆదాయంలో 69 శాతం వాటా సమకూరుస్తున్నాయి. ప్రభుత్వానికి భారీ ఆదాయం.. 2021–22 సంవత్సరానికి ప్రభుత్వరంగ సంస్థలు ప్రకటించిన డివిడెండ్ రూ.1.15 లక్షల కోట్లుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్ రూ.73వేల కోట్లుగానే ఉంది. ఇక ప్రభుత్వరంగ సంస్థలు ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్ డ్యూటీ, జీఎస్టీ, కార్పొరేట్ పన్ను, కేంద్ర ప్రభుత్వ రుణాలపై వడ్డీ చెల్లింపులు, డివిడెండ్, ఇతర సుంకాల రూపంలో కేంద్ర ప్రభుత్వ ఖజానాకు 2021–22లో రూ.5.07 లక్షల కోట్ల భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.4.97 లక్షల కోట్లుగా ఉంది. ఇలా ఎక్కువ ఆదాయాన్ని తెచ్చి పెట్టిన టాప్–5 కంపెనీల్లో ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ ఒమన్ రిఫైనరీస్, చెన్నై పెట్రోలియం ఉన్నాయి. ఇక కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అర్హులైన కంపెనీలు చేసిన ఖర్చు గత ఆర్థిక సంవత్సరంలో రూ.4,600 కోట్లుగా ఉంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.4,483 కోట్లు కావడం గమనార్హం. సామాజిక కార్యక్రమాలకు చేయూతలో ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఇండియన్ ఆయిల్, ఎన్ఎండీసీ, పవర్‌గ్రిడ్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. -
ఏపీలో ఓఎన్జీసీ కొత్తగా అన్వేషణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో చమురు, సహజ వాయువు నిక్షేపాల కోసం ఆయిల్, నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) మొత్తం 53 చోట్ల కొత్తగా అన్వేషణ సాగించనుంది. ఇందుకోసం రూ.2,150 కోట్లు ఖర్చు చేస్తోంది. పర్యావరణ అనుమతుల కోసం ఓఎన్జీసీ చేసిన రెండు వేర్వేరు ప్రతిపాదనలను గత నెలలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ (ఎస్ఈఐఏఏ) ఆమోదించింది. బావుల నిర్వహణ కారణంగా నష్టపోయిన సందర్భంలో రైతులు, ఆస్తి హక్కుదారులకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఓఎన్జీసీకి ఉంటుందని అథారిటీ స్పష్టం చేస్తూ షరతు విధించింది. కేజీ బేసిన్లో 2028 నాటికి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 50 ప్రాంతాల్లో, అలాగే 2024 కల్లా కడప బేసిన్లో కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో మూడుచోట్ల నిక్షేపాల అన్వేషణ కోసం తవ్వకాలను చేపట్టనుంది. వాణిజ్యపరంగా లాభదాయకమని రుజువైతే ఈ బావులను అభివృద్ధి చేసి, సమీపంలోని ప్రారంభ ఉత్పత్తి వ్యవస్థ/గ్యాస్ సేకరణ కేంద్రాలకు అనుసంధానిస్తారు. ఓఎన్జీసీ ప్రస్తుతం కేజీ బేసిన్లో రోజుకు 4.4 మిలియన్ల ప్రామాణిక క్యూబిక్ అడుగుల గ్యాస్, 700 టన్నులకుపైగా చమురు ఉత్పత్తి చేస్తోంది. -
సహజ వాయువు ధరపై నియంత్రణలు
న్యూఢిల్లీ: దేశంలో సహజ వాయువు ధరలు అసాధారంగా పెరిగిపోకుండా కిరీట్ పారిఖ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. లెగసీ క్షేత్రాల నుంచి (నామినేషన్‌పై ప్రభుత్వం కేటాయించిన) ఉత్పత్తి అయ్యే సహజ వాయువు ధరలకు కనిష్ట, గరిష్ట పరిమితులను సూచించింది. దీనివల్ల దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం సహజ వాయువులో రెండొంతులపై (పాత క్షేత్రాల నుంచి) కచ్చితమైన ధరల విధానం ఉంటుందని అభిప్రాయపడింది. తయారీ సంస్థలకు ధరలపై స్పష్టత ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వరంగ సంస్థలైన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా ఈ తరహా క్షేత్రాలను నిర్వహిస్తున్నాయి. కేజీ డీ6 తదితర రిలయన్స్, బీపీ ఇతర సంస్థలు ఉత్పత్తి చేస్తున్న వాటికి ఈ ధరల పరిమితి వర్తించదు. తాజా సూచనలతో 70 శాతం మేర పెరిగిపోయిన ధరలు కొంత దిగి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాకు నామినేషన్‌పై ఇచ్చిన క్షేత్రాల నుంచి ఉత్పత్తి అయ్యే గ్యాస్‌కు, దిగుమతి చేసుకునే గ్యాస్ ధరనే చెల్లించాలని సిఫారసు చేసింది. అంతేకానీ, అంతర్జాతీయ ధరలను చెల్లించొద్దని సూచించింది. మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (ఎంబీటీయూ)కు కనీసం 4 డాలర్లు, గరిష్టంగా 6.5 డాలర్ల చొప్పున పరిమితులు సూచించింది. దీనికి ఏటా 0.05 డాలర్లను పెంచుకోవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఎంబీటీయూ ధర 8.57 డాలర్లు ఉంది. లోతైన సముద్ర ప్రాంతాలు, అధిక ఉష్ణోగ్రతలు ఉండే జోన్లకు ప్రస్తుతం భిన్న రేట్ల విధానం అమల్లో ఉంది. వీటికి సంబంధించి సైతం ఎంబీటీయూ గరిష్ట ధర 12.46 డాలర్లు మించకూడదని పారిఖ్ కమిటీ సిఫారసు చేసింది. ఇక 2026 జనవరి 1 నుంచి ధరలపై ఎలాంటి పరిమితుల్లేని స్వేచ్ఛా విధానాన్ని సూచించింది. -
ప్రభుత్వానికి దన్ను: ఓఎన్జీసీ భారీ డివిడెండ్
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్జీసీ నుంచి ప్రభుత్వానికి డివిడెండ్ రూపేణా రూ. 5,001 కోట్లు లభించింది. వెరసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(సీపీఎస్ఈ)ల నుంచి ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో ఇప్పటివరకూ ప్రభుత్వం డివిడెండ్ల ద్వారా దాదాపు రూ. 23,797 కోట్లు అందుకుంది. ఈ విషయాలను దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంతా పాండే తాజాగా ట్వీట్ ద్వారా వెల్లడించారు. 2020లో నిలకడైన డివిడెండ్ల చెల్లింపు విధానాలను అవలంబించమంటూ సీపీఎస్ఈలకు దీపమ్ సూచించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా లాభదాయకత, పెట్టుబడి అవసరాలు, నగదు నిల్వలు, నెట్‌వర్త్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే అధిక డివిడెండ్ చెల్లింపులకు ఆదేశించింది. ప్రభు త్వ మార్గదర్శకాల ప్రకారం సీపీఎస్ఈలు వార్షికంగా నికర లాభాల నుంచి కనీసం 30% లేదా నెట్‌వర్త్‌లో 5% డివిడెండ్లుగా ప్రకటించవలసి ఉంటుంది. -
తూర్పు తీరంపై ఓఎన్జీసీ పట్టు! ఈస్ట్రన్ ఆఫ్‌షోర్‌లో వేల కోట్ల పెట్టుబడి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కృష్ణా, గోదావరి బేసిన్‌లోని అతిపెద్ద ఆయిల్ బ్లాక్‌గా ఉన్న ‘ఈస్ట్రన్ ఆఫ్‌షోర్’(తూర్పు తీరం)పై పట్టు సాధించే దిశగా ఓఎన్జీసీ అడుగులు వేస్తోంది. రిలయన్స్, కెయిర్న్ ఎనర్జీ వంటి ప్రైవేటు చమురు సంస్థలతో పోటీపడి.. నిలిచే దిశగా అడుగులు వేస్తోంది. ఈస్ట్రన్ ఆఫ్ షోర్లో డ్రిల్లింగ్ కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు రూ.కోట్లు కుమ్మరిస్తోంది. తొలి దశలో భాగంగా ఇక్కడ చమురు, సహజవాయువు అన్వేషణ కోసం రూ.53 వేల కోట్ల పెట్టుబడి పెట్టింది. కాకినాడలోని ఈస్ట్రన్ ఆఫ్‌షోర్ కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలోని అల్లవరం మండలం ఓడలరేవులో 300 ఎకరాల్లో భారీ టెరి్మనల్‌ను ఏర్పాటు చేసింది. ఈ టెరి్మనల్ ద్వారా రోజుకు 15 వేల మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సహజవాయువు, 78 వేల బ్యారెల్స్ క్రూడ్ వెలికితీయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఓడలరేవు టెర్మినల్‌తో పాటు యానాం సమీపంలోని గాడిమొగలో ఉన్న గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ టెరి్మనల్‌ను టేకోవర్ చేసి ఈస్ట్రన్ ఆఫ్‌షోర్‌లో విలీనం చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా సముద్ర గర్భంలో 425 కిలోమీటర్ల పైప్‌లైన్ చేపట్టాలి. ఇప్పటికే ఆఫ్‌షోర్‌లో డ్రిల్లింగ్ పూర్తయిన బావులను అనుసంధానిస్తూ 300 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ నిర్మాణాన్ని దాదాపు పూర్తి చేసినట్లు ఓఎన్జీసీ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు డ్రిల్లింగ్ ప్రక్రియను పూర్తి చేసిన 45 బావులలో సహజవాయువును వెలికి తీస్తున్నారు. ఈ బావుల నుంచి రోజుకు 35 వేల బ్యారెల్స్ క్రూడ్, సహజవాయువు ఉత్పత్తిని ఓఎన్జీసీ ప్రారంభించింది. భారీ లక్ష్యంతో ముందుకు.. ఇప్పటివరకు కేజీ బేసిన్లో రాజమండ్రి అసెట్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ వచి్చంది. అక్కడ నిల్వలు నిండుకోవడంతో ఇదే బేసిన్‌లోని ఆఫ్‌షోర్‌లో రిలయన్స్, కెయిర్న్ ఎనర్జీ వంటి ప్రైవేటు చమురు సంస్థలతో పోటీపడుతోంది. ఆ సంస్థలకు ధీటుగా విదేశీ పరిజ్ఞానంతో రికార్డు స్థాయిలో 1,45,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో కార్యకలాపాలను ముమ్మరం చేసింది. సహజంగా తీరం నుంచి 80 మీటర్ల వరకు డ్రిల్లింగ్ నిర్వహిస్తారు. ఈ బ్లాక్‌లో నార్తరన్ డిస్కవరీ ఏరియాలో 1,800 మీటర్లు, సదరన్ డిస్కవరీ ఏరియాలో 3,100 మీటర్ల లోతున డ్రిల్లింగ్ చేయాల్సి ఉంది. డ్రిల్లింగ్ పూర్తయిన 45 బావుల నుంచి ఉత్పత్తి ప్రారంభించేందుకు వీలుగా ఫ్లోటింగ్ ప్రొడక్షన్ స్టోరేజ్, లోడింగ్ ఫ్లాట్ఫార్మ్లను అభివృద్ధి చేసింది. ఈ బేసిన్లో నిర్వహిస్తోన్న డ్రిల్లింగ్‌తో 2024 నాటికి 1.22 లక్షల మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఓఎన్జీసీ ముందుకెళ్తోంది. -
కేంద్రానికి ఓఎన్జీసీ రూ.5,001 కోట్ల డివిడెండు
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్జీసీ నుంచి ప్రభుత్వానికి డివిడెండ్ రూపేణా రూ. 5,001 కోట్లు లభించింది. వెరసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(సీపీఎస్ఈ)ల నుంచి ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో ఇప్పటివరకూ ప్రభుత్వం డివిడెండ్ల ద్వారా దాదాపు రూ. 23,797 కోట్లు అందుకుంది. ఈ విషయాలను దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంతా పాండే తాజాగా ట్వీట్ ద్వారా వెల్లడించారు. 2020లో నిలకడైన డివిడెండ్ల చెల్లింపు విధానాలను అవలంబించమంటూ సీపీఎస్ఈలకు దీపమ్ సూచించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా లాభదాయకత, పెట్టుబడి అవసరాలు, నగదు నిల్వలు, నెట్‌వర్త్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే అధిక డివిడెండ్ చెల్లింపులకు ఆదేశించింది. ప్రభు త్వ మార్గదర్శకాల ప్రకారం సీపీఎస్ఈలు వార్షికంగా నికర లాభాల నుంచి కనీసం 30% లేదా నెట్‌వర్త్‌లో 5% డివిడెండ్లుగా ప్రకటించవలసి ఉంటుంది. -
ఓఎన్జీసీ లాభంలో క్షీణత
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఓఎన్జీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–2) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 30 శాతం క్షీణించి రూ. 12,826 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 18,348 కోట్లు ఆర్జించింది. అనూహ్య(విండ్‌ఫాల్) లాభాల పై ప్రభుత్వం పన్ను విధింపు ప్రభావం చూపింది. మొత్తం ఆదాయం మాత్రం 57%పైగా జంప్‌చేసి రూ.38,321 కోట్లకు చేరింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 6.75 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. కంపెనీలో ప్రభుత్వానికి దాదాపు 59 శాతం వాటా ఉంది. విక్రయ ధరలు అప్ ఉత్పత్తి చేసిన ప్రతీ బ్యారల్ చమురుకు స్థూలంగా 95.49 డాలర్లు లభించినట్లు ఓఎన్జీసీ పేర్కొంది. గత క్యూ2లో ఇది 69.36 డాలర్లు మాత్రమే. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ముడిచమురు ధరలు భారీగా ఎగసిన విషయం విదితమే. అయితే ప్రభుత్వం పెరిగిన ధరలపై జూలై 1 నుంచీ కొత్తగా విండ్‌ఫాల్ పన్ను విధించింది. ప్రస్తుత సమీక్షా కాలంలో రూ. 6,400 కోట్లమేర ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని చెల్లించినట్లు కంపెనీ ఫైనాన్స్ డైరెక్టర్ పోమిలా జస్పాల్ పేర్కొన్నారు. వెరసి ప్రతీ బ్యారల్‌కు 75–76 డాలర్లు లభించినట్లు తెలియజేశారు. ఇక నేచురల్ గ్యాస్‌పై ఒక్కో ఎంబీటీయూకి 6.1 డాలర్లు లభించగా.. గత క్యూ2లో కేవలం 1.79 డాలర్లు పొందింది. ఈ కాలంలో చమురు ఉత్పత్తి 5.47 మిలియన్ టన్నుల నుంచి 5.36 ఎంటీకి తగ్గింది. గ్యాస్ ఉత్పత్తి సైతం 5.46 బిలియన్ ఘనపు మీటర్ల నుంచి 5.35 బీసీఎంకు మందగించింది. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో కేజీ బేసిన్లో ఆరు డిస్కవరీలకు తెరతీసింది. ఫలితాల నేపథ్యంలో ఓఎన్జీసీ షేరు ఎన్ఎస్ఈలో 2.3 శాతం బలపడి రూ. 142 వద్ద ముగిసింది. -
గ్యాస్ రేట్ల సమీక్షకు పారిఖ్ కమిటీ ఏర్పాటు
న్యూఢిల్లీ: ఓఎన్జీసీ, రిలయన్స్ తదితర సంస్థలు ఉత్పత్తి చేసే సహజ వాయువు రేట్లను సమీక్షించి, తగు సిఫార్సులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు కిరీట్ పారిఖ్ సారథ్యం వహిస్తారు. నెలాఖరులోగా కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. దేశీయంగా ఉత్పత్తి చేసే గ్యాస్ రేట్లను నిర్ణయించేందుకు ప్రభుత్వం నిర్దిష్ట ఫార్ములాను ఉపయోగిస్తుంది. ఏటా రెండు సార్లు .. ఏప్రిల్ 1న, అక్టోబర్ 1న సమీక్షిస్తోంది. దీని ప్రకారం ఒకోసారి ఉత్పత్తి వ్యయాల కన్నా కూడా ధర తక్కువగా ఉండేది. అయితే, ఈ ఏడాది మార్చి నుంచి అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో దేశీయంగాను క్రూడాయిల్, గ్యాస్ రేట్లు పెరిగాయి. అటు వినియోగదారులకు భారం కాకుండా ఇటు ఉత్పత్తి కంపెనీలూ దెబ్బతినకుండా సముచిత రేటును సిఫార్సు చేసేందుకు పారిఖ్ కమిటీ ఏర్పాటైంది. -
ఎగ్జాన్‌మొబిల్‌తో ఓఎన్జీసీ జత
న్యూఢిల్లీ: గ్లోబల్ చమురు దిగ్గజం ఎగ్జాన్‌మొబిల్‌తో ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం ఓఎన్జీసీ చేతులు కలిపింది. తద్వారా దేశ తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాల సముద్రగర్భం నుంచి చమురు, గ్యాస్ వెలికితీత కార్యక్రమాలను చేపట్టనుంది. ఇందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఒక ప్రకటనలో ఓఎన్జీసీ పేర్కొంది. తూర్పు తీరప్రాంతంలో కృష్ణా గోదావరి, కావేరీ బేసిన్లపై దృష్టి సారించనున్నాయి. ఇదేవిధంగా పశ్చిమ తీరప్రాంతంలో కచ్–ముంబై వద్ద కార్యకలాపాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఓఎన్జీసీ వెల్లడించింది. అయితే భాగస్వామ్య ఒప్పందంపై వివరాలు తెలియచేయలేదు. కంపెనీకి గల బ్లాకులలో ఎగ్జాన్‌మొబిల్ వాటాలు తీసుకుంటుందా తదితర వివరాలు వెల్లడికాలేదు. ఎగ్జాన్‌మొబిల్‌తో జత కట్టడం వ్యూహాత్మకంగా మేలు చేస్తుందని, దేశ తూర్పు, పశ్చిమ తీరప్రాంతాలలో కంపెనీకి గల అనుభవం ఇందుకు సహకరిస్తుందని ఓఎన్జీసీ ఈ సందర్భంగా పేర్కొంది. దేశీయంగా చమురు అవసరాల కోసం 85 శాతంవరకూ దిగుమతులపై ఆధారపడుతున్న నేపథ్యంలో విదేశీ ఇంధన దిగ్గజాల నుంచి దేశీ సంస్థలు సాంకేతిక, ఆర్థికపరమైన మద్దతును ఆశిస్తున్నాయి. తద్వారా కొత్త వనరుల నుంచి దేశీయంగా ఇంధన ఉత్పత్తిని పెంచాలని ఆశిస్తున్నాయి. కాగా.. గత కొన్నేళ్ల చర్చల ప్రభావంతో 2019లో ఎగ్జాన్‌మొబిల్, ఓఎన్జీసీ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా భవిష్యత్ వేలంలో రెండు కంపెనీలు సంయుక్త పరిశోధన, సంయుక్త బిడ్డింగ్ వంటివి చేపట్టేందుకు నిర్ణయించాయి. -
ఓఎన్జీసీకి ఎన్జీటీ భారీ జరిమానా
అమరావతి: కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ లిమిటెడ్(ఓఎన్జీసీ)కి భారీ జరిమానా విధించింది జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ). కోనసీమ జిల్లాలో జల, భూ కాలుష్యానికి కారణమైనందున రూ.22.76 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది. ఓఎన్జీసీపై చర్యలకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆదేశించింది. సీఎస్ఆర్ ఫండ్స్‌ను ప్రాజెక్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఖర్చు చేయాలని స్పష్టం చేసింది. సంయుక్త కమిటీ నివేదిక ఆధారంగా ఓఎన్జీసీకి భారీ జరిమానా విధించినట్లు తెలిపింది. యెనుమల వెంకటపతి రాజు పిటిషన్‌పై విచారణ చేపట్టిన హరిత ట్రైబ్యునల్- (ఎన్జీటీ) తీర్పు వెలువరించింది. పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలపై ఈ జరిమానా విధించింది. ఇదీ చదవండి: ‘విద్యారంగంలో దేశంలోనే ఎవరు చేపట్టనన్ని సంస్కరణలు తెచ్చాం’ -
కేంద్రం కొత్త పన్నుల షాక్, రిలయన్స్, ఓఎన్జీసీ ఢమాల్!
సాక్షి, ముంబై: కేంద్ర ప్రభుత్వం కొత్తగా విధించిన పన్ను పోటుతో రిలయన్స్, ఓఎన్జీసీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. అంతర్గతంగా ఇంధన కొరతను నివారించేందుకు ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎగుమతి పన్నులు, దేశీయ ముడి చమురు ఉత్పత్తిపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం లేదా విండ్‌ఫాల్ పన్ను విధించింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓఎన్జీసీ షేర్లు శుక్రవారం కుప్పకూలాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు రికార్డ్ స్థాయికి చేరడంతో భారీగా లాభపడిన చమురు ఉత్పత్తిదారులపై ఇండియా విండ్‌ఫాల్ పన్నును ప్రవేశ పెట్టింది. అలాగే గ్యాసోయిల్, గ్యాసోలిన్ జెట్ ఇంధనం దిగుమతులపై సుంకాలను విధించింది. దీంతో రిలయన్స్ స్టాక్ 8.7 శాతం వరకు పడిపోయింది. 2020, నవంబర్ 2 తరువాత ఇదే అతిపెద్ద ఇంట్రాడే పతనం. ఫలితంగా దేశంలోని ఆయిల్-టు-రిటైల్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ విలువలో 19.35 బిలియన్ డాలర్ల మేర తగ్గిందని రాయిటర్స్ నివేదించింది. బీఎస్ఈలో రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ 16.5 లక్షల కోట్లుగా ఉంది. ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఓఎన్జీసీ ఏకంగా 12.3 శాతం క్షీణించింది 2020 మార్చి 23 తరువాత ఇదే అతిపెద్ద పతనం. ఆయిల్ ఇండియా దాదాపు 11 శాతం క్షీణించగా, మంగళూరు రిఫైనరీ, పెట్రోకెమికల్ 10 శాతం క్షీణించాయి. కాగాపెట్రోల్, ఏటీఎఫ్ ఎగుమతులపై లీటరుకు రూ. 6, డీజిల్ ఎగుమతిపై లీటర్‌కు రూ. 13 పన్ను విధించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై టన్నుకు రూ. 23,250 అదనపు పన్ను విధించింది. మరోవైపు డాలర్‌తో రూపాయి శుక్రవారం మరో ఆల్‌టైమ్ కనిష్టం 79.11కి చేరుకుంది, గత కొన్ని వారాలుగా ఆల్ టైమ్ కనిష్టానికి చేరుతున్న సంగతి తెలిసిందే. -
క్రూడ్ విక్రయాల్లో ఓఎన్జీసీ, వేదాంతకు స్వేచ్ఛ!
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసిన ముడి చమురును ఏ భారతీయ రిఫైనరీకైనా విక్రయించుకునేలా ఓఎన్జీసీ, వేదాంత సంస్థలకు స్వేచ్ఛ కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన నియంత్రణలను ఎత్తివేసే ప్రతిపాదనకు బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేసినట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. అక్టోబర్ 1నుంచి కంపెనీలకు క్రూడాయిల్‌ను దేశీ మార్కెట్లో విక్రయించుకునేందుకు స్వేచ్ఛ ఉంటుందని వివరించారు. ముడిచమురు ఎగుమతులపై మాత్రం నిషేధం కొనసాగుతుందని పేర్కొన్నారు. 1999 తర్వాత కేటాయించిన క్షేత్రాల ఉత్పత్తిదారులకు విక్రయాల్లో స్వేచ్ఛ ఉన్నప్పటికీ అంతకన్నా ముందు కేటాయించిన క్షేత్రాలకు (ముంబై హై– ఓఎన్జీసీ, రవ్వ – వేదాంత) మాత్రం కొనుగోలుదారులను ప్రభుత్వమే నిర్దేశిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. -
సముద్రంలో ఓఎన్జీసీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి,ముంబై: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్జీసీ)కి చెందిన హెలికాప్టర్ ముంబైలోని అరేబియా సముద్రంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. 9 మంది వ్యక్తులతో ప్రయాణిస్తున్న (ఏడుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు) హెలికాప్టర్లో లోపం కారణంగా ఎమర్జెన్సీ ల్యాండ్ చేయాల్సి వచ్చిందని ఓఎన్జీసీ ట్వీట్ చేసింది. అయితే సాగర్ కిరణ్ రెస్క్యూ బోటు ద్వారా ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలతో బయటపడగా, మిగిలిన వారిని రక్షించే చర్యలు కొనసాగుతున్నాయి. #Helicopter carrying 7 passengers & 2 pilots makes emergency landing in #Arabian Sea near #ONGC rig Sagar Kiran in #Mumbai High. Four rescued. Rescue operations in full swing. @HardeepSPuri @Rameswar_Teli @PetroleumMin — Oil and Natural Gas Corporation Limited (ONGC) (@ONGC_) June 28, 2022 ముంబైలో సాగర్ కిరణ్ వద్ద రిగ్ సమీపంలో ఏడుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లతో కూడిన హెలికాప్టర్ అరేబియా సముద్రంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారని కంపెనీ ఒక ట్వీట్లో తెలిపింది. ఇప్పటి వరకు నలుగర్ని రక్షించామని ట్వీట్ చేసింది. ఆ తరువాత రెస్క్యూ బోట్ మరో ఇద్దరిని రక్షించారు. రక్షణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు ముంబైలోని మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ ద్వారా ఇంటర్నేషనల్ సేఫ్టీ నెట్‌ను యాక్టివేట్ చేశామని, ఇండియన్ నేవీ, ఓఎన్జీసీ సమన్వయంతో పనిచేస్తున్నామని అధికారులు తెలిపారు. మరో నౌక ముంబై నుంచి సహాయక చర్యల్లో నిమగ్నమైందన్నారు. -
గ్లోబల్ ఆయిల్ సెగ: ఆయిల్ షేర్లు ఢమాల్
సాక్షి, ముంబై: గ్లోబల్‌గా చమురు ధరలు పడిపోవడంతో దేశీయమార్కెట్లో ఆయిల్ రంగ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఫెడ్ రేటు వడ్డీ రేటు భారీ పెంపు, గ్లోబల్‌గా ఇంధన డిమాండ్ తగ్గిపోవచ్చన్న భయాలతో శుక్రవారం ముడి చమురు నాలుగు వారాల కనిష్ట స్థాయికి 7 శాతానికి పడిపోయింది. ఇదే ధోరణి కనొసాగుతోంది. బ్యారెల్‌కు 125 డాలర్ల ఇటీవలి గరిష్ట స్థాయి నుండి 11 డాలర్లు తక్కువ. దీంతో ఇన్వెస్టర్లలో మరింత ఆందోళన నెలకొంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు శుక్రవారం 5 శాతానికి పైగా క్షీణించాయి. ముదురుతున్న ప్రపంచ మాంద్యం భయాలతో గతకొన్ని సెషన్లలో దాదాపు 10 శాతం పడిపోయాయి. దీంతో దేశీయ మార్కెట్లో ఆయిల్ ఇండియా ఏకంగా 12శాతం, ఓఎన్జీసీ 7 శాతం కుప్పకూలాయి. మంగళూరు రిఫైనరీ & పెట్రోకెమికల్స్ దాదాపు 19 శాతం, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ 18 శాతంపైగా క్షీణించింది. ఇంకా గోవా కార్బన్, హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ 6 - 8 శాతం వరకు తగ్గాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 12 పైసలు 77.98 వద్ద బలంగా ప్రారంభమైంది. ప్రస్తుతం నష్టాల్లోకి జారుకుంది. మునుపటి సెషన్లో రూపాయి డాలర్‌తో పోలిస్తే 5 పైసలు పురోగమించి 78.05 వద్ద స్థిరపడింది. అయితే, విదేశీ నిధుల తరలింపు, దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఊగిసలాట ధోరణి, డాలరు బలం కారణంగా లాభాలు పరిమితమవుతున్నట్టు ఫారెక్స్ డీలర్లు తెలిపారు. మరోవైపు ఆరు కరెన్సీల బాస్కెట్లో డాలర్ ఇండెక్స్ 0.30 శాతం పడిపోయి 104.38కి చేరుకుంది. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.26 శాతం పడిపోయి 112.83డాలర్ల వద్ద ఉంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు శుక్రవారం క్యాపిటల్ మార్కెట్లో నికర విక్రయదారులుగా ఉన్నారు. ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం రూ. 7,818.61 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభ లాభాలును కోల్పోయాయి. సెన్సెక్స్ 223 పాయింట్లు, నిఫ్టీ 42 పాయింట్ల లాభాలకు పరిమితమయ్యాయి. -
లాభాల్లో రిలయన్స్ తర్వాత అతిపెద్ద కంపెనీ ఇదే.. టాటాలకు షాక్?
ప్రైవేటీకరణ యత్నాలు జోరుగా సాగుతున్న కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పటికీ లాభాలు సాధించడంలో జోరు చూపుతున్నాయి. మార్కెట్లో ఉన్న ఒడిదుడుకులను తట్టుకుంటూ ప్రైవేటు కంపెనీలకు ధీటుగా ఫలితాలు సాధిస్తున్నాయి. లాభాల్లో రికార్డు ఆర్థిక సంవత్సరం 2021-22 నాలుగో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాల్లో ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పోరేషన్ (ఓఎన్జీసీ) దుమ్మురేపింది. తాజాగా ప్రకటించిన ఫలితాల్లో క్యూ 4లో రూ.40,305 కోట్ల లాభాలను సాధించినట్టు ఓఎన్జీసీ సంస్థ ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇదే అత్యధికం. మిగిలిన మహారత్న, నవరత్న, మినీరత్నాలన్నీ ఓఎన్జీసీ తర్వాతే నిలిచాయి. టాటా వెనక్కి ఇక ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలకు సంబంధించిన ఫలితాలను పరిశీలించినా ఓఎన్జీసీ అదిరిపోయేలా ఫలితాలు సాధించింది. ఓఎన్జీసీ కంటే కేవలం రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రమే అధిక లాభాలు గడిచింది. ఇప్పటి వరకు లాభాల్లో అగ్రభాగాన కొనసాగుతూ వస్తోన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు వంటి వాటిని వెనక్కి నెట్టింది. యుద్ధం ఎఫెక్ట్ ఉక్రెయిన్ రష్యాల మధ్య తలెత్తిన యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ సంక్షోభం తలెత్తింది. దీంతో ఒక్కసారిగా ఆయిల్ ధరలు ఎగిసిపడ్డాయి. ఫలితంగా ఓఎన్జీసీ లాభాలు కూడా చివరి త్రైమానికంలో ఆకాశాన్ని తాకాయి. ఇండియాలో అత్యధిక ఆయిల్ ఉత్పత్తి సామర్థ్యం ఓఎన్‌జీసీకే ఉంది. చదవండి: మాయదారి ట్విటర్..కరిగిపోతున్న మస్క్ సంపద! -
ఓఎన్జీసీకి చమురు లాభాలు
న్యూఢిల్లీ: ఆయిల్, గ్యాస్ అన్వేషణ ఉత్పత్తి సంస్థ ఓఎన్జీసీ మార్చి త్రైమాసికానికి రూ.8,859 కోట్ల స్టాండలోన్ లాభాన్ని ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్లో అధిక ధరలు కంపెనీ లాభాల వృద్ధికి అనుకూలించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలం లో లాభం రూ.6,734 కోట్లతో పోల్చి చూస్తే 30 శాతానికి పైగా వృద్ధి చెందినట్టు తెలుస్తోంది. షేరు వారీ ఆర్జన మార్చి క్వార్టర్‌కు రూ.7.04గా ఉంది. ఆదాయం రూ.34,497 కోట్లకు దూసుకుపోయింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.21,189 కోట్లతో పోలిస్తే 50 శాతానికి పైగా పెరిగింది. ఇక 2021–22 ఆర్థిక సంవత్సరానికి ఓఎన్జీసీ లాభం రికార్డు స్థాయిలో రూ.40,306 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.11,246 కోట్లతో పోలిస్తే మూడు రెట్లు వృద్ధి చెందింది. 2021 చివర్లో చమురు ధరలు పెరగడం మొదలు కాగా.. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర తర్వాత ధరలు మరింత ఎగిశాయి. చమురు, గ్యాస్ ఉత్పత్తి చేసే ఓఎన్జీసీకి ఇది అనుకూలించింది. అనుబంధ సంస్థలైన హెచ్‌పీసీఎల్, ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ ఫలితాలను కూడా కలిపి చూస్తే.. కన్సాలిడేటెడ్ లాభం మార్చి త్రైమాసికంలో రూ.12,061 కోట్లు, 2021–22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.49,294 కోట్లుగా ఉన్నాయి. -
కేజీ బ్లాకులో వాటా విక్రయం
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్జీసీ కేజీ బేసిన్‌లోని గ్యాస్ బ్లాకులో వాటాను విదేశీ సంస్థలకు విక్రయించనుంది. సముద్ర అంతర్భాగంలో అత్యధిక పీడనం, అధిక టెంపరేచర్‌గల ఈ బ్లాకులో వాటాను గ్లోబల్ సంస్థలకు ఆఫర్ చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు టెండర్లకు తెరతీసింది. సవాళ్లతో కూడిన ఈ గ్యాస్ డిస్కవరీ నుంచి ఉత్పత్తిని చేపట్టేందుకు వీలుగా సాంకేతికత, ఆర్థిక సామర్థ్యంగల సంస్థల కోసం చూస్తోంది. ఈ బాటలో గ్లోబల్ దిగ్గజాలకు ఆహ్వానం పలుకుతోంది. దీన్ దయాళ్ వెస్ట్(డీడీడబ్ల్యూ) బ్లాకుతోపాటు కేజీ–డీ5 ప్రాంతంలోని క్లస్టర్–3లో అత్యంత లోతైన డిస్కవరీల నుంచి గ్యాస్‌ను వెలికితీసేందుకు భాగస్వామ్యం కోసం ప్రాథమిక టెండర్లను ప్రకటించింది. వచ్చే నెల(జూన్) 16కల్లా ఆసక్తిగల సంస్థలు తమ సంసిద్ధత(ఈవోఐ)ను వ్యక్తం చేస్తూ బిడ్స్‌ను దాఖలు చేయవలసిందిగా ఆహ్వానించింది. భాగస్వాములపై కన్ను: కేజీ–55 బ్లాకులోని యూడీ–1 డిస్కవరీలో గ్యాస్ నిల్వలను కనుగొన్న ఓఎన్జీసీ 2017 ఆగస్ట్‌లో 80 శాతం వాటాను సొంతం చేసుకుంది. గుజరాత్ ప్రభుత్వ కంపెనీ జీఎస్పీసీ నుంచి ఈ వాటాను రూ. 7,738 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. మరోవైపు యూడీ డిస్కవరీ అభివృద్ధి విషయంలో కంపెనీకి అవసరమైన నైపుణ్యం, సాంకేతికత లేకపోవడంతో అత్య ధిక ఒత్తిడి, టెంపరేచర్‌గల డీడీడబ్ల్యూ బ్లాకులోనూ తగినస్థాయిలో విజయవంతం కాలేకపోయింది. ఓఎన్జీసీ రూ.31,000 కోట్ల పెట్టుబడులు ఇంధన రంగంలో దేశ అవసరాలను మరింతగా తీర్చే లక్ష్యంతో రానున్న మూడేళ్లలో రూ.31,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు ఓఎన్జీసీ ప్రకటించింది. భవిష్యత్తు ఉత్పత్తి విధానానికి గురువారం ఓఎన్జీసీ బోర్డు ఆమోదం తెలిపింది. చమురు, గ్యాస్ వెలికితతకు సంబంధించి సమగ్రమైన కార్యాచరణను సంస్థ రూపొందించింది. -
తగ్గిన భారత్ ముడి చమురు ఉత్పత్తి
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగం నిర్వహిస్తున్న క్షేత్రాల నుండి తక్కువ ఉత్పత్తి కారణంగా ఏప్రిల్‌లో భారత్ ముడి చమురు ఉత్పత్తి 1 శాతం పడిపోయిందని అధికారిక డేటా వెల్లడించింది. 2021 ఏప్రిల్‌లో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి 2.5 మిలియన్ టన్నులుకాగా, 2022 ఏప్రిల్‌లో ఈ పరిమాణం 2.47 మిలియన్ టన్నులకు తగ్గినట్లు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వశాఖ పేర్కొంది. ప్రైవేట్ రంగం నిర్వహిస్తున్న క్షేత్రాల నుంచి వార్షికంగా చూస్తే 7.5 శాతం తక్కువ ముడి చమురు (5,67,570 టన్నులు) ఉత్పత్తి జరిగింది. ప్రభుత్వ రంగం దూకుడు.. కాగా వేర్వేరుగా చూస్తే, ఏప్రిల్‌లో ప్రభుత్వ రంగ సంస్థల ఉత్పత్తి పెరిగింది. చమురు, సహజ వాయువుల కార్పొరేషన్ (ఓఎన్జీసీ) గత ఏడాది ఏప్రిల్ నెల ఉత్పత్తి 1.63 మిలియన్ టన్నులుకాగా, ఈ పరిమాణం తాజా సమీక్షా నెలలో 1.65 మిలియన్ టన్నులకు చేరింది. పెరుగుదల 0.86 శాతంకాగా, ఓఎన్జీసీ నిర్దేశించుకున్న లక్ష్యంకన్నా ఈ పరిమాణం 5 శాతం అధికం. ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్) 3.6 శాతం ఎక్కువ ముడి చమురును ఉత్పత్తి చేసింది. పరిమాణంలో ఇది 2,51,460 టన్నులు. సహజ వాయువు ఉత్పత్తి ఇలా... కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్. బీపీ కృష్ణా గోదావరి–డీ 6 బ్లాక్‌కు నిలయమైన తూర్పు ఆఫ్‌షోర్ నుండి అధిక ఉత్పత్తి కారణంగా సహజ వాయువు ఉత్పత్తి 6.6 శాతం పెరిగి 2.82 బిలియన్ క్యూబిక్ మీటర్ల (బీసీఎం)కు చేరుకుంది. ఓఎన్జీసీ సహజ వాయువు ఉత్పత్తి ఒక శాతం తగ్గి 1.72 బీసీఎంగా నమోదయ్యింది. అయితే తూర్పు ఆఫ్‌షోర్ అవుట్‌పుట్ 43 శాతం పెరిగి 0.6 బీసీఎంలకు చేరినట్లు డేటా పేర్కొంటోంది. క్షేత్రం వారీగా ఉత్పత్తి వివరాలు తెలియరాలేదు. రిఫైనరీల పరిస్థితి ఇలా... డిమాండ్ మెరుగుపడ్డంతో రిఫైనరీలు ఏప్రిల్‌లో 8.5 శాతం ఎక్కువ ముడి చమురును ప్రాసెస్ చేశాయి. ఈ పరిమాణం 21.6 మిలియన్ టన్నులు గా ఉంది. ప్రభుత్వ రంగ రిఫైనరీలు 12.8 శాతం ఎక్కువ ముడి చమురును ఇంధనంగా మార్చాయి. ప్రైవేట్, జాయింట్ సెక్టార్ యూనిట్ల క్రూడ్ ఉత్పత్తి 1.8 శాతం పెరిగింది. రిఫైనరీలు ఏప్రిల్‌లో 22.8 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులు జరి పాయి. 2021 ఇదే నెలతో పోల్చితే ఇది 9 శాతం అధికం. ప్రభుత్వ రంగ యూనిట్ల నుండి ఇంధన ఉత్పత్తి దాదాపు 12 శాతం పెరిగి 13 మిలియన్ టన్నులకు చేరుకోగా, ప్రైవేట్ రంగ యూనిట్లు 7 శాతం అధికంగా 9.6 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేశాయి. ఏప్రిల్‌లో ఇంధన డిమాండ్‌ను తీర్చడానికి రిఫైనరీలు వాటి స్థాపిత సామర్థ్యంలో 104.5 శాతంతో పనిచేశాయి. కేంద్రం నజర్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికిగాను చమురు, గ్యాస్ దేశీయ ఉత్పత్తిని పెంచడంపై కేంద్రం మరోవైపు దృష్టి సారిస్తోంది. భారతదేశం తన చమురు అవసరాలలో 85 శాతం, సహజ వాయువు అవసరాలలో సగం దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. చదవండి: ప్లీజ్.. భారత్‌ను బతిమాలుతున్నాం, ఆ నిషేధాన్ని ఎత్తేయండి: ఐఎంఎఫ్ చీఫ్ -
ఓఎన్‌జీసీకే మెజారిటీ ఆయిల్, గ్యాస్ బ్లాకులు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఓఎన్జీసీ ఆరో విడత వేలంలో మెజారిటీ ఆయిల్, గ్యాస్ బ్లాకులను సొంతం చేసుకుంది. మొత్తం 21 ప్రాంతాలకు సంబంధించి ఓపెన్ యాక్రేజ్ లైసెన్సింగ్ పాలసీ కింద చమురు అన్వేషణ, ఉత్పత్తి హక్కులకు పెట్రోలియం శాఖ వేలం నిర్వహించింది. ఇందులో 18 ఓఎన్జీసీ గెలుచుకోగా, రెండు బ్లాకులను మరో ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ ఇండియా సొంతం చేసుకుంది. మరొక బ్లాకును సన్ పెట్రోకెమికల్స్ ప్రైవేటు లిమిటెడ్ దక్కించుకుంది. ఈ వివరాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ప్రకటించింది. మొత్తం 21 బ్లాకుల్లో 18 బ్లాకులకు ఒక్కో బిడ్ మాత్రమే దాఖలైంది. 16 బ్లాకులకు ఒక్క ఓఎన్‌జీసీయే బిడ్ వేసింది. ఆశ్చర్యకరంగా గత వేలాల్లో దూకుడుగా పాల్గొని మెజారిటీ బ్లాకులను సొంతం చేసుకున్న వేదాంత ఈ విడత వేలానికి దూరంగా ఉండిపోయింది. రిలయన్స్ బీపీ సంయుక్త సంస్థ కూడా పాల్గొనలేదు. చదవండి: తప్పని పరిస్థితిలోనే ఒంటరి ప్రయాణం -
ఓఎన్జీసీ కొత్త ప్రాజెక్టులు షురూ
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్జీసీ సుమారు రూ. 6,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించింది. దీంతో 7.5 మిలియన్ టన్నుల చమురు, 1 బిలియన్ ఘనపు మీటర్ల గ్యాస్ ఉత్పత్తి జత కలవనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ముంబై హై క్షేత్రాల జీవితకాలాన్ని హెచ్చించడం ద్వారా ఉత్పత్తి పెరిగేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ముంబై హై సౌత్ పునరాభివృద్ధి నాలుగో దశలో భాగంగా రూ. 3,740 కోట్లను వెచ్చించగా, ముంబై హైవద్ద క్లస్టర్–8 మార్జినల్ ఫీల్డ్ అభివృద్ధి ప్రాజెక్టుపై రూ. 2,292 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేసినట్లు వివరించింది. ఈ రెండు ప్రధాన ప్రాజెక్టులను చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ జాతికి అంకితం చేసినట్లు పేర్కొంది. -
దేశంలో పెరిగిన గ్యాస్ ధరలు, ఓఎన్జీసీ..రిలయన్స్‌కు లాభాలే లాభాలు!
న్యూఢిల్లీ: సహజవాయువు ధరలు రెట్టింపు కావడం, చమురు ధరల పెరుగుదల ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థలకు (అప్‌స్ట్రీమ్ కంపెనీలు) భారీ లాభాలను తెచ్చిపెట్టనున్నట్లు ఫిచ్ రేటింగ్స్ తన నివేదికలో పేర్కొంది. ఓఎన్జీసీ వంటి సంస్థలు ఉత్పత్తి చేసే గ్యాస్ రేటును యూనిట్‌కు 2.9 డాలర్ల నుంచి 6.10 డాలర్లకు, సంక్లిష్ట క్షేత్రాల నుండి రిలయన్స్ వంటి కంపెనీలు వెలికితీసే గ్యాస్ ధరను యూనిట్‌కు 6.1 డాలర్ల నుండి 9.92 డాలర్లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1 నుండి ఇవి ఆరు నెలల పాటు అమల్లో ఉంటాయి. దేశీయ గ్యాస్, చమురు ధర నిర్ణయం గత 12 నెలల్లో నాలుగు గ్లోబల్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ బెంచ్‌మార్క్‌ల ధరలపై ఆధారపడి ఉంటుంది. వీటి ఆధారంగా తాజా ధరల పెరుగుదలకు సంబంధించి ఫిచ్ మంగళవారంనాటి విశ్లేషణలను పరిశీలిస్తే.. ► భారత ప్రభుత్వం సహజవాయువు ధరలను పెంచడంతోపాటు, 2022లో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారల్ అంచనాలను గత 70 డాలర్ల నుంచి 100 డాలర్లకు, 2023లో 60 డాలర్ల నుంచి 80 డాలర్లకు పెంచింది. ఈ నిర్ణయం ఫిచ్ రేటింగ్ ఇస్తున్న భారత్ అప్‌స్ట్రీమ్ కంపెనీల లాభదాయకత, అలాగే వారి పెట్టుబడి వ్యయ పటిష్టత, వాటాదారుల డివిడెండ్ పంపిణీల వంటి అంశాలకు మద్దతును అందిస్తుంది. ► అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో, తాజా ధరల పెంపు ముందు ఊహించిందే. అక్టోబర్ 2022లో తదుపరి ధర నిర్ణయంలో రేట్లు మరింత పెరుగుతాయని భావిస్తున్నాం. అధిక గ్యాస్ ధరల స్థితి కొనసాగుతుందని భావించడం దీనికి కారణం. ► అధిక గ్యాస్ ధరలు ఆయిల్ ఇండియా లిమిటెడ్ క్రెడిట్ రేటింగ్ పెరగడానికి దోహదపడుతుంది. అలాగే ఆ సంస్థ మూలధనం తన అనుబంధ సంస్థ– నుమాలిగర్ రిఫైనరీ లిమిటెడ్ సామ ర్థ్యాన్ని విస్తరించేందుకు దోహదపడుతుంది. ► కేజీ బేసిన్ నుండి గ్యాస్ ఉత్పత్తి చేసే రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీలు ధరల పరిమితి (లోతైన నీరు, ఇతర క్లిష్టమైన క్షేత్రాలకు) పెంపు నుండి ప్రయోజనం పొందుతాయి. మొత్తం రాబడి పెరుగుదలకు కొంత మేర ఈ నిర్ణయం దోహదపడుతుంది. క్రెడిట్ ప్రొఫైల్స్ రెండు సంస్థలు పటిష్టంగా కొనసాగనున్నాయి. ► అధిక చమురు, గ్యాస్ ధరలు– వినియోగ రంగంలోకి తయారీ సంస్థలపై ముడి పదార్థాల ధరల పెరుగుదలకు దారితీస్తుంది. రవాణా వంటి కీలక రంగాలకు ఈ బిల్లు భారంగా మారే వీలుంది. ► దేశీయంగా ఉత్పత్తి చేయబడిన గ్యాస్.. కొన్ని రంగాలకు ప్రాధాన్యతా ప్రాతిపదికన సరఫరా అవుతుంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఉత్పత్తిలో విద్యుత్ ఉత్పత్తిదారులు 30 శాతం, ఎరువుల రంగం దాదాపు 27 శాతం, సిటీ–గ్యాస్ పంపిణీదారులు 19 శాతం వినియోగించారు. ► గ్యాస్ ధరల పెరుగుదల వల్ల ఎరువుల రంగం వర్కింగ్–క్యాపిటల్ అవసరాలను పెంచుతుంది. ఈ రంగం లాభదాయకతను ఈ నిర్ణయం దెబ్బతీస్తుంది. పెరుగుతున్న ముడి చమురు ధరల కారణంగా అధిక దిగుమతి వ్యయాలను కూడా ఈ రంగం ఎదుర్కొంటుంది. ► ఆటో గ్యాస్ ఇంధన ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే ఇది ద్రవ ఇంధనాల ధరలకు సంబంధించి పోటీ తత్వాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ► కేంద్రం తాజా పెంపు నిర్ణయం వల్ల గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది.ఇది వినియోగదారుపై ప్రభావం చూపే అంశం. మోర్గాన్ స్టాన్లీదీ ఇదే మాట... దేశీయంగా ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరను కేంద్రం పెంచడంతో ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ, ప్రైవేట్ రంగ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) గణనీయంగా ప్రయోజనం పొందుతాయని ఆర్థిక సేవల దిగ్గజం– మోర్గాన్ స్టాన్లీ కూడా అంచనా వేస్తోంది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) వార్షిక ఆదాయం 3 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 23,000 కోట్లు), రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆదాయం 1.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 11,500 కోట్లు) మేర పెరగవచ్చని ఆ సంస్థ ఒక నివేదికలో పేర్కొంది. మార్కెట్లో నిల్వలు, పెట్టుబడులు తగ్గడం మరోవైపు దాదాపు దశాబ్దం తర్వాత దేశీయంగా సహజ వాయువు ఉత్పత్తి పెరుగుతుండటం ఆయిల్ కంపెనీల లాభాలకు తోడ్పడనుందని తెలిపింది. గ్యాస్ ధర యూనిట్‌కు 1 డాలర్ పెరిగితే ఓఎన్జీసీ ఆదాయాలు 5–8 శాతం మేర పెరుగుతాయని అంచనా. మార్కెట్లో గ్యాస్ కొరత నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్‌లో మరోసారి నిర్వహించే ధరల సమీక్షలో గ్యాస్ రేటును ఇంకో 25 శాతం మేర కేంద్ర ప్రభుత్వం పెంచవచ్చని కూడా మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో విశ్లేషించింది. -
గ్యాస్ ధరను పెంచిన కేంద్రం, భారీగా పెరగనున్న రిలయన్స్..ఓఎన్జీసీల ఆదాయం!
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరను కేంద్రం పెంచడంతో ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ, ప్రైవేట్ రంగ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) గణనీయంగా ప్రయోజనం పొందనున్నాయి. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) వార్షిక ఆదాయం 3 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 23,000 కోట్లు), రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆదాయం 1.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 11,500 కోట్లు) మేర పెరగవచ్చని మోర్గాన్ స్టాన్లీ ఒక నివేదికలో పేర్కొంది. ఓవైపు మార్కెట్లో నిల్వలు, పెట్టుబడులు తగ్గడం మరోవైపు దాదాపు దశాబ్దం తర్వాత దేశీయంగా సహజ వాయువు ఉత్పత్తి పెరుగుతుండటం తాజాగా ఆయిల్ కంపెనీల లాభాలకు తోడ్పడనుందని తెలిపింది. ఓఎన్జీసీ వంటి సంస్థలు ఉత్పత్తి చేసే గ్యాస్ రేటును యూనిట్‌కు 2.9 డాలర్ల నుంచి 6.10 డాలర్లకు, మరింత సంక్లిష్ట క్షేత్రాల నుండి రిలయన్స్ వంటి కంపెనీలు వెలికితీసే గ్యాస్ ధరను యూనిట్‌కు 3.8 డాలర్ల నుండి 9.92 డాలర్లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1 నుండి ఇవి ఆరు నెలల పాటు అమల్లో ఉంటాయి. గ్యాస్ ధర యూనిట్‌కు 1 డాలర్ పెరిగితే ఓఎన్జీసీ ఆదాయాలు 5–8 శాతం మేర పెరుగుతాయని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. చదవండి: గ్యాస్ ధరలు డబుల్...! సామాన్యులపై ప్రభావం ఎంతంటే..? -
ఓఎన్జీసీ అమ్మకానికి వేళాయే, కేంద్రం చేతికి వేలకోట్లు!
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్జీసీలో ప్రభుత్వం విక్రయానికి ఉంచిన 1.5 శాతం వాటా పూర్తి స్థాయిలో సబ్స్క్రయిబ్ అయ్యింది. దీంతో ప్రభుత్వానికి రూ. 3,000 కోట్లు లభించనున్నాయి. ఈ నిధులు వచ్చే ఆర్థిక సంవత్సరం (2022–23)లో లెక్కకురానున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లకు షేరుకి రూ.159 ఫ్లోర్ ధరలో ప్రభుత్వం 1.5% వాటాకు సమానమైన 1.88 కోట్ల షేర్లను ఆఫర్ చేసింది. గురువారం(31) ఆఫర్ ప్రారంభంకావడంతో 1.33 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలయ్యాయి. మిగిలిన షేర్లను సంస్థాగత ఇన్వెస్టర్లకు ప్రభుత్వం కేటాయించనుంది. 30న ప్రారంభమైన సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగంలో 8.49 కోట్ల షేర్లను అమ్మకానికి ఉంచగా.. రూ.159.91 సగటు ధరలో 30.35 కోట్ల షేర్లకు డిమాండ్ కనిపించింది. వెరసి మూడున్నర రెట్లు అధిక సబ్స్క్రిప్షన్ నమోదైంది. ఈ బిడ్స్ మొత్తం విలువ రూ.4,854 కోట్లు! కాగా.. ఆఫర్‌కు అధిక డిమాండ్ కనిపిస్తే గ్రీన్‌షూ ఆప్షన్‌కింద రెట్టింపు షేర్ల(18.86 కోట్లు)ను విక్రయించేందుకు ప్రభుత్వానికి వీలుంది. ఆఫర్లో భాగంగా తొలుత 9.43 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచిన విషయం విదితమే. ఈ వార్తల నేపథ్యంలో ఓఎన్జీసీ షేరు 1 శాతం బలపడి రూ.164 వద్ద ముగిసింది. -
సహజ వాయువ ధర రెట్టింపు
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరను రెట్టింపు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి ఆరు నెలల పాటు కొత్త రేట్లు అమల్లో ఉంటాయి. వీటి ప్రకారం .. ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాకు కేటాయించిన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ రేటు రికార్డు స్థాయిలో యూనిట్‌కు (మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్) 6.10 డాలర్ల స్థాయికి పెరిగింది. ఇప్పటిదాకా ఇది 2.90 డాలర్లుగా ఉండేది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధర (యూనిట్‌కు) 6.13 డాలర్ల నుంచి 9.92 డాలర్లకు చేరింది. అంతర్జాతీయంగా ఇంధన రేట్లు ఎగిసిన నేపథ్యంలో ఈ మేరకు ధరలను సవరిస్తూ కేంద్ర చమురు శాఖలో భాగమైన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఏటా ఆరు నెలలకోసారి కేంద్రం ఈ ధరలను సవరిస్తుంది. పెరగనున్న ద్రవ్యోల్బణం.. తాజా పరిణామంతో సీఎన్జీ, పైప్డ్ గ్యాస్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే గత పది రోజుల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు తొమ్మిది సార్లు పెంచడంతో ఇంధనాల ధర లీటరుకు రూ. 6.4 స్థాయిలో పెరిగింది. వంట గ్యాస్ ధర కూడా సిలిండర్‌కు రూ. 50 చొప్పున పెరిగింది. ఇక గ్యాస్ ధర కూడా పెరగడంతో ద్రవ్యోల్బణం మరింత ఎగిసే అవకాశం ఉందన్న ఆందోళనలు నెలకొన్నాయి. సహజ వాయువును విద్యుత్, ఎరువుల ఉత్పత్తితో పాటు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ), గృహాలకు పైపుల ద్వారా సరఫరా చేసే పైప్డ్ గ్యాస్ అవసరాల కోసం కూడా వినియోగిస్తున్నారు. అయితే, గ్యాస్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చాలా తక్కువ స్థాయిలోనే ఉన్నందువల్ల విద్యుదుత్పత్తి వ్యయాలపై అంతగా ప్రభావం పడదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అలాగే ఎరువులకు సంబంధించి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నందున ఆ మేరకు ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉండబోదని పేర్కొన్నాయి. -
గ్యాస్ ధరలు డబుల్...! సామాన్యులపై ప్రభావం ఎంతంటే..?
ఇంధన ధరల పెంపుతో ఇప్పటికే సామాన్యులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వీటికి తోడుగా నేచురల్ గ్యాస్ ధరలు భారీగా పెరగనున్నట్లు సమాచారం. కొత్త ధరలు ఏప్రిల్ 1 నుంచి..! ఏప్రిల్ 1 నుంచి నేచురల్ గ్యాస్ ధరలు రెండింతలు పెరగనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా స్థానికంగా ఉత్పత్తి అయ్యే గ్యాస్ ధరలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. నేచురల్ గ్యాస్ ధరల పెంపుతో భారత్‌ను ద్రవ్యోల్భణ భయాలు మరింత ఎక్కువయ్యేలా కన్పిస్తోంది. ఏప్రిల్-సెప్టెంబర్ కాలానికి గాను నేచురల్ గ్యాస్ ధరలు ఒక్కో మిలియన్ మెట్రిక్ బ్రిటిష్ థర్మల్ యూనిట్స్(ఎంఎంబీటీయూ) ధరను 6.1 డాలర్లకు చేరనుంది. కాగా ప్రస్తుతం నేచురల్ గ్యాస్ ధర ఒక్కో ఎంఎంబీటీయూ 2.90 డాలర్లుగా ఉండేది. రిలయన్స్, ఓఎన్‌జీసీలకు బొనాంజా..! నేచురల్ గ్యాస్ ధరల పెంపుతో రిలయన్స్, ఓఎన్జీసీ సంస్థలు భారీగా లాభపడనున్నాయి. కేజీ గ్యాస్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఒక్కో ఎంఎంబీటీయూపై సుమారు 10 డాలర్లు లభించనుంది. దాంతో పాటుగా ప్రభుత్వ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్జీసీ), లబ్ధి చేకూరనుంది. సామన్యులపై ప్రభావం ఎంతంటే..? 2021 జనవరి-డిసెంబర్ కాలంలో అంతర్జాతీయంగా గ్యాస్ ధరలను బట్టి ఈ ఏడాది ఏప్రిల్ 1–సెప్టెంబర్ 30 మధ్య కాలానికి ప్రభుత్వం రేటు నిర్ణయిస్తుంది. గతేడాది రేటు భారీగా పెరిగిపోవడంతో ఆ ప్రభావం ఈ ఏడాది నిర్ణయించే గ్యాస్ ధరలపై పడనుంది. గ్యాస్ రేటు పెరగడం వల్ల ఎరువుల ఉత్పత్తి వ్యయం పెరగనుంది. కాగా ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తున్నందున రేట్ల పెంపు పెద్దగా ఉండకపోవచ్చునని తెలుస్తోంది. చదవండి: సామాన్యులకు మరో షాక్..భారీగా పెరగనున్న బిస్కెట్ ధరలు..! -
ఓఎన్జీసీ ఓఎఫ్ఎస్కి భారీ స్పందన
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓఎన్జీసీలో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా 1.5 శాతం వాటాల విక్రయానికి భారీ స్పందన లభిస్తోంది. బుధవారం తొలి రోజున సంస్థాగత ఇన్వెస్టర్ల వాటా ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యింది. వారికి 8.49 కోట్ల షేర్లను కేటాయించగా 3.57 రెట్లు అధికంగా 30.35 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. షేరు ఒక్కింటికి ప్రతిపాదించిన రూ. 159 రేటు ప్రకారం వీటి విలువ రూ. 4,854 కోట్లుగా ఉంటుంది. రెండు రోజుల పాటు కొనసాగే ఓఎఫ్ఎస్ కింద ఓఎన్జీసీలో 1.5 శాతం వాటాల (9.43 కోట్ల షేర్లు) విక్రయం ద్వారా కేంద్రం సుమారు రూ. 3,000 కోట్లు సమీకరించనుంది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 94.35 లక్షల షేర్లను కేటాయించారు. ఈ విభాగం ఓఎఫ్ఎస్ గురువారం ప్రారంభమవుతుంది. ఆఫర్ ఫర్ సేల్కు నాన్–రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన వచ్చిందని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే.. ట్వీట్ చేశారు. షేరు 5 శాతం డౌన్.. ఓఎఫ్ఎస్ కోసం షేరు ధరను మంగళవారం నాటి ముగింపు రేటు రూ. 171.05తో పోలిస్తే 7 శాతం డిస్కౌంటుతో విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో బుధవారం బీఎస్ఈలో ఓఎన్జీసీ షేరు 5 శాతం క్షీణించి రూ. 162.25 వద్ద ముగిసింది. ఫలితంగా రూ. 11,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆవిరైంది. -
రిలయన్స్, ఓఎన్జీసీకి బొనాంజా
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే సహజ వాయువుకు ప్రభుత్వం నిర్దేశించిన ధరలు ఏప్రిల్ 1 నుంచి మారనున్నాయి. గతేడాది కాలంగా ఇంధన ధరలు గణనీయంగా ఎగియడాన్ని పరిగణనలోకి తీసుకోనుండటంతో రేట్లు భారీగా పెరగనున్నాయి. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ తదితర గ్యాస్ ఉత్పత్తి సంస్థలకు ప్రయోజనం చేకూరనుంది. ఓఎన్జీసీకి నామినేషన్ ప్రాతిపదికన కేటాయించిన క్షేత్రాల నుంచి వెలికితీసే గ్యాస్ రేటు ప్రస్తుత 2.9 డాలర్ల నుంచి 5.93 డాలర్లకు (యూనిట్ – ఎంబీటీయూ) పెరగనుంది. అలాగే రిలయన్స్, దాని భాగస్వామ్య సంస్థ బీపీకి చెందిన కేజీ–డీ6 బ్లాక్‌లో సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధర 6.13 డాలర్ల నుంచి 9.9–10.1 డాలర్లకు పెరగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2019 ఏప్రిల్ తర్వాత ఈ గ్యాస్ రేట్లు పెరగడం ఇది రెండోసారి. అమెరికా, రష్యా తదితర గ్యాస్ మిగులు దేశాల్లో నిర్దిష్ట కాలంలో ధరలకు అనుగుణంగా దేశీయంగా సహజ వాయువు రేట్లను కేంద్రం ఆర్నెల్లకోసారి (ఏప్రిల్ 1, అక్టోబర్ 1) రేట్లను సవరిస్తుంది. ప్రస్తుతం 2021 జనవరి–డిసెంబర్ మధ్య కాలంలో అంతర్జాతీయంగా గ్యాస్ ధరలను బట్టి ఈ ఏడాది ఏప్రిల్ 1–సెప్టెంబర్ 30 మధ్య కాలానికి ప్రభుత్వం రేటు నిర్ణయించనుంది. గతేడాది రేటు భారీగా పెరిగిపోవడంతో ఆ ప్రభావం ఈ ఏడాది నిర్ణయించే గ్యాస్ ధరలపై పడనుంది. గ్యాస్ రేటు పెరగడం వల్ల ఎరువుల ఉత్పత్తి వ్యయం పెరగనుంది. అయితే, ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తున్నందున రేట్ల పెంపు పెద్దగా ఉండకపోవచ్చు. అలాగే, విద్యుదుత్పత్తి వ్యయాలూ పెరిగినా.. దేశీయంగా గ్యాస్ నుంచి విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా లేనందున.. వినియోగదారులపై అంతగా ప్రభావం ఉండదు. -
ఓఎన్జీసీ ఫర్ సేల్.. వాటా విక్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ)లో కేంద్రం రూ. 1.5 శాతం వాటాలు విక్రయించాలని నిర్ణయించింది. తద్వారా రూ. 3,000 కోట్లు సమీకరించనుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో షేర్ల విక్రయం ఉండనుంది. మార్చి 30, 31 తారీఖుల్లో ఓఎఫ్ఎస్ నిర్వహించనున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు కంపెనీ తెలియజేసింది. ఆఫర్ ఫర్ సేల్ కోసం ఫ్లోర్ ధరను షేరు ఒక్కింటికి రూ. 159గా నిర్ణయించినట్లు పేర్కొంది. మంగళవారం బీఎస్ఈలో స్టాక్ ముగింపు ధర రూ. 171.05తో పోలిస్తే ఇది 7 శాతం డిస్కౌంటు. ఓఎన్జీసీలో ప్రభుత్వానికి 60.41 శాతం వాటాలు ఉన్నాయి. ఓఎఫ్ఎస్ కింద కనీసం 25 శాతం షేర్లను మ్యూచువల్ ఫండ్స్.. బీమా కంపెనీలకు, 10 శాతం షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించనున్నారు. ఓఎన్జీసీ ఉద్యోగులు తలో రూ. 5 లక్షల విలువ చేసే షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఓఎఫ్ఎస్ కింద విక్రయిస్తున్న 0.075 శాతం షేర్లను అర్హులైన ఉద్యోగులకు కటాఫ్ ధరకు కేటాయించనున్నట్లు కంపెనీ వివరించింది. -
తగ్గేదేలే అంటున్న మేఘా.. ఆ సెక్టార్లో సక్సెస్ బాట
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణ రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్).. ఓఎన్జీసీకి రిగ్స్ సరఫరాను వేగవంతం చేసింది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి వద్ద ఉన్న ఓఎన్జీసీ చమురు క్షేత్రానికి 2,000 హెచ్‌పీ సామర్థ్యం గల అత్యాధునిక ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్‌ను అందించింది. ఇది 3,000 హెచ్‌పీ సామర్థ్యంతో పనిచేసే సంప్రదాయ రిగ్ కన్నా అధిక పనితీరును కనబరుస్తుందని ఎంఈఐఎల్ రిగ్స్ ఇంచార్జ్ సత్యనారాయణ తెలిపారు. ‘6,000 మీటర్ల లోతు వరకు ఇది తవ్వగలదు. ఇప్పటి వరకు 10 ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్స్‌ను ఎంఈఐఎల్ సరఫరా చేసింది. ఇందులో మూడు ఇప్పటికే పనిచేస్తున్నాయి. మిగిలిన ఏడు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ రిగ్స్ మరో నాలుగైదు వారాల్లో ఓఎన్జీసీ చమురు క్షేత్రాల్లో పనిచేయడం ప్రారంభిస్తాయి. పోటీ బిడ్డింగ్‌లో 47 రిగ్స్ సరఫరాకై ఓఎన్జీసీ నుంచి ఆర్డర్‌ను ఎంఈఐఎల్ దక్కించుకుంది’ అని ఎంఈఐఎల్ రిగ్స్ ఇంచార్జ్ సత్యనారాయణ వివరించారు. -
ప్రపంచంలోనే పవర్ ఫుల్ ఆయిల్ రిగ్‌లు ఏపీ ఓఎన్జీసీకి సరఫరా..!
నిర్మాణరంగ దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో ఆయిల్ రిగ్‌లను తయారు చేసి రికార్డ్ సృష్టించింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రిగ్‌లను విజయవంతంగా డ్రిల్లింగ్ కార్యకలాపాలకు వినియోగిస్తుంది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ) నుంచి రూ.6000 కోట్ల విలువైన 47 ఆయిల్ రిగ్ ఆర్డర్ పొందిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరంలోని ఓఎన్జీసీకి మరో రిగ్‌ను అందజేసింది. ఇది అత్యాధునిక స్వదేశీ ఆయిల్ రిగ్. 2,000 హెచ్‌పీ సామర్ధ్యం గల రిగ్ 3,000 హెచ్‌పీ సామర్ధ్యం గల సంప్రదాయ రిగ్లకు సమానమైన పనితీరును కనబరుస్తుంది. ఇది 6,000 మీటర్ల(6 కి.మీ) లోతు వరకు భూమిలోకి డ్రిల్ చేయగలదు. "మేక్ ఇన్ ఇండియా" & "ఆత్మనీర్ భర్ భారత్" కార్యక్రమాల కింద స్వదేశీ టెక్నాలజీతో అత్యంత సమర్థవంతమైన ఆయిల్ డ్రిల్లింగ్ రిగ్‌లను తయారు చేస్తున్న తొలి దేశీయ ప్రైవేట్ కంపెనీ ఎంఈఐఎల్. చమురు నిక్షేపాలను వెలికి తీసేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఈ రిగ్‌లు అత్యంత వేగంతో భూ పొరలను సులభంగా తవ్వుతుంది. వీటిని పూర్తిగా ఆటోమేటేడ్ టెక్నాలజీతో రూపొందించారు. సమీప భవిష్యత్తులో మనదేశంలో చమురు, సహజవాయువు రంగాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలనేది తమ లక్ష్యమని డ్రిల్మెక్ ఛైర్మన్ బొమ్మారెడ్డి శ్రీనివాస్ వివరించారు. అస్సాం (సిబ్సాగర్, జోరహత్), ఆంధ్రప్రదేశ్ (రాజమండ్రి), గుజరాత్ (అహ్మదాబాద్, అంకాలేశ్వర్, మెహసనా మరియు క్యాంబే), త్రిపుర (అగర్తలా), తమిళనాడు (కరైకల్) లోని ఓఎన్జీసీ ఆయిల్ డ్రిల్లింగ్ క్షేత్రాలకు ఎంఈఐఎల్ అన్ని రిగ్‌లను తయారు చేసి సరఫరా చేస్తుంది. మేఘా గ్రూప్ ఆధ్వర్యంలో తొలిసారిగా దేశీయంగా వీటిని ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం కాకినాడ, హైదరాబాద్‌లలోని కేంద్రాల్లో రిగ్‌లను డ్రిల్మెక్ ఉత్పత్తి చేస్తోంది. చమరు ధరలు ఆకాశాన్ని తాకుతున్న సమయంలో వీటి అవసరం ఎంతగానే ఉంటుంది. (చదవండి: కొత్త ఇల్లు కొనేవారికి షాక్.. ఏప్రిల్ 1 తర్వాత రూ.1.5 లక్షల రాయితీ రానట్లే!) -
ఓఎన్జీసీ లాభం హైజంప్
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్జీసీ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలను సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం ఆరు రెట్లుకపైగా(597 శాతం) దూసుకెళ్లి రూ. 8,764 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 1,258 కోట్లు ఆర్జించింది. ఇంధన ఉత్పత్తి తగ్గినప్పటికీ భారీగా బలపడిన చమురు, గ్యాస్ ధరలు అధిక లాభాలకు దోహదం చేశాయి. ముడిచమురు విక్రయాలలో ఒక్కో బ్యారల్‌కు 75.73 డాలర్ల ధర లభించగా.. గత క్యూ3లో 43.2 డాలర్లు చొప్పున మాత్రమే ఆర్జించింది. ఇక గ్యాస్ ధరలు సైతం ఒక్కో ఎంబీటీయూకి 2.9 డాలర్లు చొప్పున ఆర్జించింది. గత క్యూ3లో 1.79 డాలర్లు మాత్రమే లభించింది. కాగా.. కంపెనీ బోర్డు వాటా దారులకు షేరుకి రూ. 1.75 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఇంతక్రితం 2021 నవంబర్‌లో షేరుకి రూ. 5.5 చొప్పున తొలి డివిడెండును చెల్లించింది. తగ్గిన ఉత్పత్తి ప్రస్తుత సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం 67 శాతం జంప్‌చేసి రూ. 28,474 కోట్లను తాకింది. ఈ కాలంలో చమురు ఉత్పత్తి 3.2 శాతం తగ్గి 5.45 మిలియన్ టన్నులకు పరిమితమైంది. గ్యాస్ ఉత్పత్తి సైతం 4.2 శాతం నీరసించి 4.5 బిలియన్ ఘనపు మీటర్లకు పరిమితమైంది. ప్రధానంగా తౌకటే తుఫాన్, కోవిడ్–19 ప్రభావాలతో చమురు ఉత్పత్తి తగ్గినట్లు కంపెనీ పేర్కొంది. చదవండి: స్థిరాస్తులపై కొత్త నిబంధనలు..అమ్మకాలు, కొనుగోలు చేసేటప్పుడు.. -
Alka Mittal: డాక్టర్ అల్కా మిట్టల్... ఈ పేరే ఓ రికార్డు... తొలి మహిళగా
Alka Mittal Successful Journey: అది 1956. భారత ప్రభుత్వం ఓఎన్జీసీకి రూపకల్పన చేసింది. ఆ సంస్థ 65 ఏళ్ల మహోన్నత చరిత్రను రాసుకుంది. ఇప్పుడు... ఆ చరిత్రను ఓ మహిళ తిరగరాసింది. ఇప్పుడు దేశమంతా ఆమెనే చూస్తోంది. ఆమె ఓఎన్జీసీ సీఎండీ డాక్టర్ అల్కా మిట్టల్. డాక్టర్ అల్కా మిట్టల్... ఈ పేరే ఓ రికార్డు. ప్రసిద్ధ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ)కు సీఎండీగా నియమితులయ్యారామె. ఓఎన్జీసీ చరిత్రలో ఒక మహిళ సీఎండీ బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. గత రెండు రోజులుగా వార్తల్లో ప్రధానవ్యక్తిగా నిలిచారామె. ఎవరీ అల్కా మిట్టల్ అని, ఆమె వయసెంత అని, ఇంత పెద్ద బాధ్యతలు చేపట్టగలగడానికి ఆమె ఏం చదువుకున్నారు అనే ప్రశ్నలు గూగుల్‌ని శోధిస్తున్నాయి. ఆమె ఈ నెల ఒకటవ తేదీన అల్కా మిట్టల్‌ను సీఎండీగా అదనపు బాధ్యతల్లో నియమించినట్లు సోమవారం ఆ సంస్థ ట్విటర్లో ప్రకటించింది. అదేరోజు ఆమె సీఎండీగా అదనపు బాధ్యతలను స్వీకరించారు. ఆమె ఆ బాధ్యతల్లో ఆరునెలల పాటు ఉంటారు. ఒకవేళ ఈలోపు పూర్తిస్థాయిలో సీఎండీ నియామకం జరిగినట్లయితే అప్పటి వరకు ఆమె సీఎండీగా అదనపు బాధ్యతలను నిర్వహిస్తారు. చదవడం హాబీ డాక్టర్ అల్కా మిట్టల్ వయసు 56. పర్యటనలు, పుస్తక పఠనం, రాయడం అల్కామిట్టల్ హాబీలు. అలా హాబీగా చాలా చదివేశారామె. డెహ్రాడూన్‌లోని ఎంకేపీ పీజీ కాలేజ్ నుంచి 1983లో ఎకనమిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. రాజ్‌గురు మహావిద్యాలయ నుంచి ఎంబీఏ (హెచ్ఆర్), ఆ తర్వాత ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా నుంచి బిజినెస్, కామర్స్, కార్పొరేట్ గవర్నెన్స్‌లో 2001లో పీహెచ్డీ పట్టా అందుకున్నారు. అదీ రికార్డే ప్రస్తుతం ఓఎన్జీసీ సంస్థ చైర్పర్సన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా కొత్త బాధ్యతలు చేపట్టడానికి మునుపు 2018 నుంచి ఆమె ఆ సంస్థలో హెచ్ఆర్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ సంస్థలో పూర్తిస్థాయి డైరెక్టర్‌గా నియమితమైన రికార్డు కూడా ఆమెదే. ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ రంగంలో ప్రసిద్ధ సంస్థ ఓఎన్జీసీకి సీఎండీగా ఒక మహిళ బాధ్యతలు చేపట్టడం అనేది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ స్థాయి ఆమెకు ఏ ఒక్కరోజులోనో వచ్చి వాలిన హోదా కాదు. గ్రాడ్యుయేట్ ట్రైనీగా 1985లో ఓఎన్జీసీలో చేరిన అల్కామిట్టల్ మూడున్నర దశాబ్దాలుగా రకరకాల విధులు నిర్వర్తించారు. ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, ఓఎన్జీసీ మంగుళూరు పెట్రో కెమికల్స్‌లో బోర్డు మెంబర్‌గా క్రియాశీలకంగా వ్యవహరించారు. అల్కా మిట్టల్ ఉత్తరాది రీజియన్‌కు చెందిన ‘ఫోరమ్ ఫర్ ఉమెన్ ఇన్ ద పబ్లిక్ సెక్టార్’ ప్రెసిడెంట్‌గా మహిళలకు క్షేమకరమైన పని వాతావరణం కల్పించడానికి అవసరమైన సూచనలు చేశారు. వడోదర, ముంబయి, ఢిల్లీ, జోర్హాత్లలో హెచ్ఆర్ విధులు నిర్వర్తించి ఉన్నారు. ఓఎన్జీసీలో ఆమె చీఫ్ స్కిల్ డెవలప్మెంట్ (సీఎస్డీ)గా అత్యంత క్రియాశీలకంగా పని చేశారు. దేశవ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి ఐదు వేల మందికి ‘నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్’ ద్వారా స్కిల్ ట్రైనింగ్ ఇప్పించారు. దేశంలో ఉన్న అన్ని ఓఎన్జీసీ శాఖల్లో పని చేసే వాళ్లకు ఒకేరకమైన తర్ఫీదు అవసరం అనే ఉద్దేశంతో ఆమె ఈ ప్రత్యేక ప్రోగ్రామ్‌కు రూపకల్పన చేశారు. ఆఫ్‌షోర్ (చమురు నిక్షేపాలను తవ్వి వెలికి తీయడానికి సముద్ర గర్భంలోకి వెళ్లడం) బాధ్యతలను కూడా సమర్థంగా నిర్వర్తించారామె. తొలి తరం మహిళ అల్కా మిట్టల్‌ను సీఎండీగా నియమించడానికి ముందు ఆ సంస్థ తొమ్మిది మందిని ఇంటర్వ్యూ చేసింది. అందులో ఇద్దరు విధుల్లో ఉన్న ఐఏఎస్‌లు కూడా ఉండడం విశేషం. మహిళలు అన్ని రంగాల్లో విశేషమైన సేవలందిస్తూ కెరీర్లో దూసుకుపోతున్నారు. కానీ కంపెనీ హెడ్ హోదాలో మాత్రం నూటికి తొంబై కంపెనీల్లో మగవాళ్లే ఉంటున్నారనేది కాదనలేని సత్యం. మహిళలు ఉద్యోగులుగా సేవలందించడానికే పరిమితమవుతున్నారనే నివేదికలను కాదనలేం. అయితే గ్లాస్ సీలింగ్‌ను బ్రేక్ చేసిన అతికొద్ది మంది మహిళల జాబితాలో చేరారు అల్కామిట్టల్. మహిళలు పెద్దగా ఆసక్తి చూపించని ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో అడుగుపెట్టిన తొలితరం మహిళగా ఆమెను చెప్పుకోవచ్చు. అలాగే సీఎండీగా అల్కా మిట్టల్ నియామకం ద్వారా ఆ కంపెనీ మహిళలు, మగవాళ్లకు సమాన అవకాశాలు కల్పించే ‘ఈక్వల్ ఆపర్చునిటీ ఎంప్లాయర్’ అనే గౌరవాన్ని దక్కించుకుంది. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో...తొలి మహిళలు ►విక్కీ హోలబ్, సీఈవో, యూఎస్‌లోని ఆక్సిడెంటల్ పెట్రోలియమ్ ఆయిల్ కంపెనీ ►లిండా కుక్, సీఈవో, నార్త్ సీ ఆయిల్.. ప్రొడ్యూసర్ ప్రీమియర్ ఆయిల్ క్రెసోర్ హోల్డింగ్ ►కేథరీన్ రో, సీఈవో, వెంట్వర్త్ రీసోర్సెస్, టాంజానియా ►మారియానా జార్జ్, సీఈవో, దక్షిణ, తూర్పు యూరప్‌లో అతి పెద్ద ఎనర్జీ కంపెనీ ఓఎమ్వీ పెట్రోమ్ ఆఫ్ ఆస్ట్రియా ►మనదేశంలో అల్కామిట్టల్కంటే ముందు ఈ రంగంలో నిషి వాసుదేవ రికార్డు సృష్టించారు. ఆమె 2014 మార్చిలో హిందూస్థాన్ పెట్రోలియమ్ కంపెనీలో కీలక బాధ్యతలను స్వీకరించారు. చదవండి: మంచు ఖండంలో మెరిసిన వజ్రం -
ఓఎన్జీసీ లాభాల రికార్డ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం ఓఎన్జీసీ లిమిటెడ్ కంపెనీ చరిత్రలోనే ఒక త్రైమాసికానికి అత్యధిక లాభాలను సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో క్వార్టర్లో రూ. 18,347 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. గతేడాది ఇదే కాలం(జూలై–సెప్టెంబర్)లో రూ. 2,758 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇందుకు ప్రధానంగా వన్‌టైమ్ పన్ను లాభం దోహదపడింది. గతేడాది(2020–21) పూర్తికాలంలో ఓఎన్జీసీ కేవలం రూ. 11,246 కోట్ల లాభం సాధించింది. దీంతో పోల్చినా తాజా సమీక్షా కాలంలో భారీ లాభాలు ఆర్జించగా.. దేశీయంగా మరే ఇతర కంపెనీ ఒక త్రైమాసికంలో ఈ స్థాయి నికర లాభం ఆర్జించకపోవడం గమనార్హం! వాటాదారులకు షేరుకి రూ. 5.50 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. అంతక్రితం 2013 జనవరి–మార్చిలో మరో పీఎస్‌యూ దిగ్గజం ఐవోసీ ఈ స్థాయిలో అంటే రూ. 14,513 కోట్లు ఆర్జించింది. పన్ను దన్ను: అధిక చమురు ధరలకుతోడు రూ. 8,541 కోట్లమేర లభించిన వన్‌టైమ్ పన్ను ఆదాయం ఓఎన్జీసీ రికార్డ్ లాభాలకు సహకరించింది. సర్చార్జికాకుండా 22 శాతం కార్పొరేట్ పన్ను రేటును చెల్లించేందుకు ఉన్న అవకాశాన్ని వినియోగించుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో ఓఎన్జీసీ షేరు బీఎస్ఈలో నామమాత్ర లాభంతో రూ. 155 వద్ద ముగిసింది. -
మహారత్న కంపెనీపై ప్రైవేటీకరణ కత్తి.. ఓఎన్జీసీపై కేంద్రం ఒత్తిడి
న్యూఢిల్లీ: చమురు, గ్యాస్ ఉత్పత్తిని మరింతగా పెంచే దిశగా ప్రైవేట్ భాగస్వాములతో కలిసి పనిచేసేలా ప్రభుత్వ రంగ ఓఎన్జీసీపై కేంద్రం ఒత్తిడి పెంచుతోంది. ఇందులో భాగంగా సాధ్యమైన చోట్ల ప్రైవేట్ రంగ కంపెనీలు, సర్వీస్ ప్రొవైడర్లను కూడా భాగస్వాములను చేయాలని ఓఎన్జీసీకి ప్రభుత్వం సూచించినట్లు పెట్రోలియం శాఖ కార్యదర్శి తరుణ్ కపూర్ తెలిపారు. ‘దేశీయంగా మరిన్ని చమురు, గ్యాస్ నిక్షేపాలను వెలికితీసేందుకు, ఉత్పత్తిని పెంచేందుకు ఓఎన్జీసీ మరింతగా అన్వేషించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టమైన వైఖరితో ఉంది. ఓఎన్జీసీ మరింతగా కృషి చేయాలి‘ అని ఆయన పేర్కొన్నారు. తాను స్వంతంగా అన్వేషించలేని సంక్లిష్టమైన ప్రదేశాల్లో ఓఎన్జీసీ ప్రైవేట్, విదేశీ కంపెనీలతో కలిసి పనిచేయాలని కపూర్ సూచించారు. సాంకేతిక సహకారం తీసుకోవడం మొదలుకుని పాక్షికంగా అన్వేషించిన, పూర్తిగా అభివృద్ధి చేయని నిక్షేపాలను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం మొదలైన అంశాలు పరిశీలించాలని పేర్కొన్నారు. ప్రస్తుత క్షేత్రాల నుంచి ఉత్పత్తిని మరింత పెంచుకోవడంలోనూ ప్రైవేట్ రంగాన్ని భాగస్వామిని చేయవచ్చని తెలిపారు. మహారత్న కంపెనీ అయినందున ఓఎన్జీసీకి ప్రభుత్వం సూచనలు మాత్రమే చేయగలదని, అంతిమ నిర్ణయం కంపెనీ బోర్డ్ తీసుకోవాల్సి ఉంటుందని కపూర్ తెలిపారు. ముంబై హై, బసేన్ అండ్ శాటిలైట్ (బీ అండ్ ఎస్) వంటి కీలక క్షేత్రాల్లో ప్రైవేట్ సంస్థలకు 60 శాతం దాకా వాటాను ఇవ్వడం పరిశీలించాలంటూ పెట్రోలియం శాఖ అదనపు కార్యదర్శి అమర్నాథ్ ఇటీవలే ఓఎన్జీసీకి లేఖ రాసిన నేపథ్యంలో కపూర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
‘మీతోని కాదు.. విదేశీ సంస్థలకే అప్పగించండి’! ఓన్జీసీకి పెట్రోలియం శాఖ సలహా
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ చేతిలోని చమురు, గ్యాస్ క్షేత్రాలను ప్రైవేటీకరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తాజాగా ముంబై హై, బసేన్ క్షేత్రాల్లో 60 శాతం పైగా వాటాలను (పీఐ), నిర్వహణ అధికారాలను విదేశీ కంపెనీలకు అప్పగించాలంటూ కంపెనీకి పెట్రోలియం, సహజ వాయువు శాఖ సూచించింది. లేఖలో సంచనల విషయాలు ఓన్జీసీ ఆధ్వర్యంలో ఉన్న చమురు క్షేత్రాల్లో ఉత్పాదకత చాలా తక్కువగా ఉంటోందని, ఈ నేపథ్యంలో ఉత్పత్తి పెంచే దిశగా అంతర్జాతీయ భాగస్వాములను ఆహ్వానించాలంటూ ఓఎన్జీసీ సీఎండీ సుభాష్ కుమార్‌కు పెట్రోలియం శాఖ (ఎక్స్‌ప్లోరేషన్ విభాగం) అదనపు కార్యదర్శి అమర్ నాథ్ లేఖ రాశారు. వచ్చే ఏడాది సుభాష్ కుమార్ స్థానంలో సీఎండీగా బాధ్యతలు చేపట్టే అవకాశమున్న నాథ్ అధికారికంగా ఇటువంటి లేఖ రాయడం ఏప్రిల్ తర్వాత ఇది రెండోసారి. ‘ముంబై హై క్షేత్రంలో ఉత్పత్తికి గణనీయంగా ఆస్కారం ఉంది. కానీ పాతబడిన మౌలిక వనరులు, సత్వరం నిర్ణయాలు తీసుకోలేని ప్రక్రియాపరమైన సమస్యల కారణంగా ఉత్పత్తిని పెంచడంలో ఓఎన్జీసీ సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దేశీ గ్యాస్, చమురు క్షేత్రాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు అంతర్జాతీయ కంపెనీలకు తగు మార్గం చూపించడం ద్వారా ఇటు ఉత్పత్తిని కూడా పెంచేందుకు ఓఎన్జీసీ ప్రణాళికలు వేయవచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు. అసెట్స్ భారం తగ్గించుకోండి దేశీయంగా ముంబై హై, బసేన్ క్షేత్రాల్లో చమురు, గ్యాస్ అత్యధికంగా ఉత్పత్తి అవుతోంది. ఓఎన్జీసీకి ఈ రెండే కీలకం. వీటిని పక్కన పెడితే కంపెనీ వద్ద ఏవో చిన్నా, చితకా క్షేత్రాలు మాత్రమే మిగులుతాయి. ఇక ఓఎన్జీసీ తన డ్రిల్లింగ్, బావుల సర్వీసుల విభాగాలను కూడా విక్రయించేసి, అసెట్స్ భారాన్ని తగ్గించుకోవాలని కూడా నాథ్ సూచించారు. ఏప్రిల్ 1న రాసిన లేఖలో కూడా రత్న ఆర్–సిరీస్ లాంటి చమురు క్షేత్రాలను ప్రైవేట్ సంస్థలకు విక్రయించడం, కేజీ బేసిన్ గ్యాస్ క్షేత్రాల్లో విదేశీ భాగస్వాములను తెచ్చుకోవడం వంటి ప్రతిపాదనలు చేశారు. చదవండి: ఓఎన్జీసీ లాభం హైజంప్ -
మరో వడ్డన.. భారీగా పెరిగిన సీఎన్జీ గ్యాస్ ధరలు
CNG Gas Price Increased : పెట్రోలు, డీజిల్, ఎల్పీజీల ధరలు పెంచుకుంటూ పోయిన కేంద్రం తాజాగా మరో షాక్ ఇచ్చింది. సీఎన్జీ గ్యాస్ ధరలను ఒకే సారి 62 శాతం పెంచింది. పెరిగిన ధరలు అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. యూనిట్‌కి 2.90 డాలర్ల పెంపు దేశీయ చమురు క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరను కేంద్రం భారీగా 62 శాతం పెంచింది. దీంతో అక్టోబర్ 1 నుంచీ ఒక్కో మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్‌కు (ఎంఎంబీటీయూ) 2.90 డాలర్ల వరకు ధర పెరగనుంది. 10 శాతం వరకు దీనివల్ల సీఎన్సీ, పీఎన్జీ ధరలు ప్రత్యేకించి ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో 10 నుంచి 11 శాతం పెరగవచ్చన్నది పరిశ్రమ అంచనా. అలాగే కరోనా కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విద్యుత్, ఎరువుల రంగాలపై కూడా ధరల భారం పడనుంది. అక్టోబర్ నుంచి మార్చి వరకూ ఆరు నెలలు ఈ ధర అమల్లో ఉంటుంది. గత రెండేళ్లలో ఈ ధర పెరగడం ఇదే తొలిసారి. పెరిగిన భారం కేంద్రం నిర్ణయం వల్ల సీఎన్జీ (ఆటోమొబైల్‌లో వినియోగించే), పీఎన్జీ (పైప్ ద్వారా వంట గ్యాస్) ధరలు పెరిగి వినియోగదారులపై భారం పెరుగుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఓవైపు వాతావరణ కాలుష్యం తగ్గించాలని చెబుతూ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇలాంటి తరుణంలో కాలుష్య రహిత వాహనాలుగా పేరొందిన సీఎన్జీ వాహనాలకు తాజా నిర్ణయం షాక్ ఇస్తోంది. పెట్రోలు, డీజిల్ ధరల తరహాలోనే సీఎన్జీ ధరలు పెడగంతో ఢిల్లీ వంటి నగరాల్లో సీఎన్జీ వినియోగదారులపై అధిక భారం పడనుంది. వారికే లాభం కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం ప్రభుత్వ రంగంలోని ఓఎన్జీసీ సహా రిలయన్స్ ఇండస్ట్రీస్, కెయిర్న్ వంటి ఉత్పత్తిదారులకు ఆదాయాలను పెంచనుండడం గమనార్హం. కాగా డీప్సీ వంటి క్లిష్ట క్షేత్రాల నుంచి గ్యాస్ ఉత్పత్తికి సంబంధించిన ధరను ఎంఎంబీటీయూకు ప్రస్తుత 3.62 డాలర్ల నుంచి 6.13 డాలర్లకు పెంచుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
ఆగస్టులో తగ్గిన క్రూడ్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: దేశీయంగా ముడిచమురు ఉత్పత్తి గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఆగస్టులో 2.3 శాతం క్షీణించింది. అదే సమయంలో రిలయన్స్–బీపీకి చెందిన కేజీ–డీ6 క్షేత్రాల ఊతంతో సహజ వాయువు ఉత్పత్తి పెరిగింది. కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఆగస్టులో ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ క్షేత్రాల్లో ఉత్పత్తి తగ్గడంతో క్రూడాయిల్ ఉత్పత్తి 2.51 మిలియన్ టన్నులకు పరిమితమైంది. మరోవైపు సహజ వాయువు ఉత్పత్తి 20.23 శాతం పెరిగి 2.9 బిలియన్ ఘనపు మీటర్లుగా నమోదైంది. ప్రైవేట్ ఆపరేటర్ల క్షేత్రాల్లో ఉత్పత్తి 186 శాతం పెరగడం ఇందుకు దోహదపడింది. ముడిచమురును పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలుగా మారుస్తారు. భారత్ తన క్రూడాయిల్ అవసరాల్లో 85 శాతం భాగాన్ని దిగుమతి చేసుకుంటోంది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, దేశీయంగా ఉత్పత్తిని పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. 14 శాతం అధికంగా ప్రాసెసింగ్.. ఇంధనాలకు డిమాండ్ పుంజుకుంటూ ఉండటంతో చమురు రిఫైనరీలు ఆగస్టులో 14.17 శాతం అధికంగా 18.4 మిలియన్ టన్నుల క్రూడాయిల్‌ను ప్రాసెస్ చేశాయి. ప్రభుత్వ రంగ రిఫైనరీలు 13.6 శాతం, ప్రైవేట్ రంగ రిఫైనరీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 16.4 శాతం అధికంగా ముడిచమురును శుద్ధి చేశాయి. రిఫైనరీలు ఆగస్టులో 19.5 మిలియన్ టన్నుల మేర పెట్రోలియం ఉత్పత్తులను తయారు చేశాయి. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఇది 9 శాతం అధికం. ఇక ఏప్రిల్–ఆగస్టు మధ్య కాలంలో 12 శాతం అధికంగా 100.2 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను ఉత్పత్తి చేశాయి. రిఫైనరీలు గతేడాది ఆగస్టులో స్థాపిత సామర్థ్యంలో 76.1 శాతం స్థాయిలో పనిచేయగా.. ఈ ఏడాది 87 శాతం మేర పనిచేశాయి. చదవండి: కూకటివేళ్లు కదిలినా.. ముఖేష్ అంబానీ కుబేరుడే! -
సీఎం జగన్‌ను కలిసిన కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి, ఓఎన్జీసీ ఛైర్మన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి తరుణ్ కపూర్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) ఛైర్మన్ సుభాశ్ కుమార్ కలిశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను మంగళవారం వారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌పై సీఎంతో చర్చించారు. చదవండి: సీఎం జగన్‌కు బాలాపూర్ లడ్డూ అందించిన ఎమ్మెల్సీ రమేశ్ చదవండి: కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు.. రేవంత్‌కు కోర్టు ఆదేశం -
వోస్తోక్ ప్రాజెక్ట్‌పై ఓవీఎల్ దృష్టి
న్యూఢిల్లీ/ మాస్కో: విదేశీ అనుబంధ సంస్థ ద్వారా ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ.. రష్యాకు చెందిన భారీ ప్రాజెక్ట్ వోస్తోక్ ఆయిల్లో మైనారిటీ వాటా కొనుగోలు చేయాలని చూస్తోంది. ఇందుకు ఇప్పటికే ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్(ఓవీఎల్) చర్చలు నిర్వహిస్తున్నట్లు చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. మరోపక్క లిక్విఫైడ్ గ్యాస్ ప్రాజెక్ట్ ఆర్కిటిక్ ఎల్ఎన్జీ–2లో మైనారిటీ వాటాను సొంతం చేసుకునే ప్రణాళికల్లో పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఉన్నట్లు పేర్కొన్నారు. ఆర్కిటిక్‌లో 9.9 శాతం వాటాను నోవాటెక్ నుంచి కొనుగోలు చేసేందుకు పెట్రోనెట్ చర్చలు చేపట్టినట్లు వెల్లడించారు. వోస్తోక్ ఆయిల్ ప్రాజెక్టు 6 బిలియన్ టన్నులు లేదా 44 బిలియన్బ్యారళ్ల ప్రీమియం చమురు నిక్షేపాలు(రీసోర్సెస్) కలిగి ఉంది. ఇక ఎల్ఎన్జీ ఉత్పత్తికి రష్యాలో అతిపెద్ద సంస్థగా నిలుస్తున్న నోవాటెక్ 11 బిలియన్ డాలర్ల విలువైన ఆర్కిటిక్ ప్రాజెక్టులో 60 శాతం వాటాను కలిగి ఉంది. ఫ్రాన్స్ దిగ్గజం టోటల్, జపనీస్ కన్సార్షియం విడిగా 10 శాతం చొప్పున వాటాలను పొందాయి. చైనా కంపెనీ సీఎన్పీసీ, సీనూక్ లిమిటెడ్ మిగిలిన 20 శాతం వాటాను సమానంగా పంచుకున్నాయి. 2023కల్లా ఆర్కిటిక్ తొలి కన్సైన్మెంట్ను ప్రారంభించగలదని అంచనా. ఈ బాటలో 2025కల్లా 19.8 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని అందిపుచ్చుకోగలదని భావిస్తున్నారు. కొత్త పెట్టుబడులు..: రష్యాలో జరుగుతున్న తూర్పుప్రాంత ఆరి్థక వేదిక సమావేశాలకు హాజరైన హర్దీప్ సింగ్ ఢిల్లీకి తిరిగి వచ్చేముందు మాస్కోలో విలేకరులతో పలు అంశాలను ప్రస్తావించారు. వోస్తోక్ ఆయిల్, ఆర్కిటిక్ ఎల్ఎన్జీ–2లో పెట్టుబడి అవకాశాలపై చర్చించినట్లు తెలియజేశారు. ఈ వివరాలను తాజాగా వెల్లడించారు. వోస్తోక్, ఆర్కిటిక్ పెట్టుబడులు భారత్, రష్యాల మధ్య బంధాలను మరింత బలోపేతం చేసేందుకు దారిచూపనున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
ఓఎన్జీసీ స్కాలర్షిప్స్.. అప్లై చేయండి ఇలా..
ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించే ఉద్దేశంతో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ) ఫౌండేషన్ సీఎస్ఆర్ కింద స్కాలర్షిప్స్ అందిస్తోంది. దీనిలో భాగంగా 2021–21 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం మెరిటోరియస్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. (ఏపీఈపీడీసీఎల్: జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు) అర్హతలు ► ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంబీబీఎస్ లేదా మాస్టర్స్ ఇన్ జియోఫిజిక్స్/జియాలజీ ప్రోగ్రామ్స్‌లలో మొదటి ఏడాది చదివే వారు, అలాగే గత అకడమిక్ పరీక్షల్లో కనీసం 60 శాతం సీజీపీఏ/ఓజీపీఏ సాధించిన విద్యార్థులు ఈ స్కాలర్షిప్ దరఖాస్తు అర్హులు. (ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► జనరల్/ఓబీసీ కుటుంబ వార్షికదాయం రూ. 2 లక్షలకు మించకుండా ఉండాలి. ఎస్సీ/ఎస్టీలు అయితే రూ.4.5లక్షలకు మించకూడదు. ► వయసు: జులై 1 నాటికి 30ఏళ్లకు మించకుండా ఉండాలి. స్కాలర్షిప్ ► ప్రోగ్రామ్ కింద అర్హులైన 500 మంది విద్యార్థులను ఎంపిక చేసి.. ఏడాదికి రూ.48000 అంటే నెలకు రూ.4000 చొప్పున స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. ఇందులో 50 శాతం స్కాలర్‌షిప్స్‌ను అమ్మాయిలకు కేటాయిస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ అండ్ పోస్ట్ ద్వారా పంపాలి. ► దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 5, 2021 ► వెబ్సైట్: https://ongcscholar.org/#/ -
ఈ ఏడాదే ఓఎన్జీసీకి 23 రిగ్గులు: మేఘా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్వదేశీ పరిజ్ఞానంతో కంపెనీ తయారు చేసిన రిగ్గు విజయవంతంగా డ్రిల్లింగ్ కార్యకలాపాలను కొనసాగిస్తోందని మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) గురువారం వెల్లడించింది. మరో రిగ్గు ఓఎన్జీసీకి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉందని గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన మీడియా సమావేశంలో కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. రిగ్గుల విక్రయం ద్వారా రానున్న రోజుల్లో దేశీయంగా, అంతర్జాతీయంగా రూ.14,800 కోట్ల విలువ గల వ్యాపార అవకాశాలను సొంతం చేసుకోనున్నామని మేఘా అనుబంధ కంపెనీ, ఆయిల్ రిగ్గుల తయారీలో ఉన్న డ్రిల్ మెక్ చైర్మన్ బొమ్మారెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. ఓఎన్జీసీకి సరఫరా చేయాల్సిన 47 రిగ్గులలో డిసెంబరుకల్లా 23 అప్పగిస్తామన్నారు. చమురు, ఇంధనం వెలికితీసే రిగ్గులను తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి వినియోగంలోకి తెచ్చిన ఘనత మేఘా ఇంజనీరింగ్ సొంతం చేసుకుందని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ పి.రాజేష్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్, కాకినాడతోపాటు ఇటలీ, యూఎస్‌లోని ప్లాంట్లలో వీటిని తయారు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం 70కి పైగా రిగ్గులను ఉత్పత్తి చేస్తున్నామని వివరించారు. 1500 హెచ్‌పీ సామర్థ్యం గల రిగ్గు అత్యాధునిక హైడ్రాలిక్ వ్యవస్థతో పనిచేస్తుంది. 4,000 మీటర్ల లోతు వరకు సులభంగా, వేగంగా తవ్వుతుందని ఆయిల్ రిగ్స్ డివిజన్ అధిపతి కృష్ణ కుమార్ తెలిపారు. -
జులైలో ముడి చమురు ఉత్పత్తి తగ్గింది
న్యూఢిల్లీ: దేశీయంగా ముడిచమురు ఉత్పత్తి జులైలోనూ క్షీణించింది. గతేడాది(2020) ఇదే నెలతో పోలిస్తే 3.2 శాతం తగ్గి 2.5 మిలియన్ టన్నులకు పరిమితమైంది. ప్రధానంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ లక్ష్యాన్ని అందుకోలేకపోవడం ప్రభావం చూపింది. ఈ ఏడాది(2021–22) తొలి 4 నెలల్లో సైతం దేశీ చమురు ఉత్పత్తి 3.4 శాతం నీరసించి 9.9 మిలియన్ టన్నులకు చేరింది. పెట్రోలియం, సహజవాయు శాఖ విడుదల చేసిన గణాంకాలివి. గత నెలలో ఓఎన్జీసీ 4.2 శాతం తక్కువగా 1.6 మిలియన్ టన్నుల చమురును వెలికి తీసింది. ఇక ఏప్రిల్–జులై మధ్య 4.8 శాతం క్షీణించి 6.4 మిలియన్ టన్నులకు పరిమితమైంది. అయితే నేచురల్ గ్యాస్ ఉత్పత్తి పుంజుకుంది. చదవండి : Flipkart: కిరాణా వర్తకులకు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్ -
ఓఎన్జీసీ లాభం హైజంప్
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్జీసీ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి క్వార్టర్లో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 772 శాతం దూసుకెళ్లి రూ. 4,335 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 497 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఈ క్యూ1లో ఉత్పత్తి తగ్గినప్పటికీ చమురు ధరలు రెట్టింపునకుపైగా పుంజుకోవడం ప్రభావం చూపింది. స్థూల ఆదాయం సైతం 77 శాతం జంప్‌చేసి రూ. 23,022 కోట్లకు చేరింది. కాగా.. ముడిచమురుపై ప్రతీ బ్యారల్‌కు 65.59 డాలర్ల చొప్పున ధర లభించినట్లు కంపెనీ పేర్కొంది. గత క్యూ1లో బ్యారల్‌కు 28.87 డాలర్ల ధర మాత్రమే సాధించింది. అయితే ధరలు తగ్గడంతో గ్యాస్‌పై ఒక్కో ఎంబీటీయూకి 1.79 డాలర్లు చొప్పున మాత్రమే ఆర్జించింది. ఉత్పత్తి తగ్గింది. క్యూ1లో ఓఎన్జీసీ 5 శాతం తక్కువగా 5.4 మిలియన్ టన్నుల చమురును ఉత్పత్తి చేసింది. గ్యాస్ ఉత్పత్తి సైతం 4 శాతంపైగా నీరసించి 5.3 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పరిమితమైంది. సొంత క్షేత్రాల నుంచి 4.6 మిలియన్ టన్నుల చమురును ఉత్పత్తి చేయగా.. జేవీల ద్వారా 0.55 ఎంటీని వెలికితీసింది. ఇక సొంత క్షేత్రాల నుంచి 5.1 బీసీఎం గ్యాస్ ఉత్పత్తి నమోదుకాగా.. ఇతర ఫీల్డ్స్ నుంచి 0.2 బీసీఎం సాధించింది. -
ప్రాణాలు పోవడానికి పది సెకన్ల ముందు
ముంబై: సూదుల్లా గుచ్చుకునే వర్షపు చినుకులు... రెప్పలు తెరిస్తే కనుగుడ్లనే పెకిలించేలా వస్తున్న హోరుగాలి..... ఆకాశాన్ని తాకేలా ఎగిసిపడుతున్న రాకాసి అలలు.. తుపాను తీవ్రత అతాలకుతలం అవుతూ ఏక్షణమైనా మునిగిపోయేందుకు సిద్ధంగా ఉన్న పడవ... మృత్యువు ముంగిన నిలిచినప్పుడు... జీవితపు చివరి క్షణాల్లో ఓ నౌక సిబ్బంది తీసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ప్రమాదం ముంగిట టౌటే తుపాను ధాటికి ముంబై తీరంలో ఓఎన్జీసీకి చెందిన నాలుగు నౌకలు మునిగిపోయాయి. దాదాపు 70 మంది వరకు చనిపోగా మరో 20 వరకు ఆచూకీ ఇంకా దొరకలేదు. అయితే మునిగిపోయిన నాలుగు పడవల్లో వరప్రద కూడా ఒకటి. ప్రమాద సమయంలో పడవలో 13 మంది ఉండగా కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బతికారు. అయితే తుపాను ధాటికి ఈ పడవ మునిగిపోతున్నప్పుడు ఓ వ్యక్తి ఆ దృశ్యాలు వీడియో తీశాడు. నేవీ అధికారులకు ఆ ఫోన్ లభించగా అందులో వీడియోను రిలీజ్ చేశారు. Breath taking video of Tug Varaprada @ABPNews @abpmajhatv pic.twitter.com/ISmvTzO7Kl — Ganesh Thakur (@7_ganesh) May 25, 2021 -
కిడ్నాపైన ఓఎన్జీసీ ఉద్యోగి విడుదల
గువాహటి: నిషేధిత ఉల్ఫా (ఐ) ఉగ్రసంస్థ కిడ్నాప్ చేసిన ఓఎన్జీసీ ఉద్యోగిని శనివారం విడుదల చేసింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ విజ్ఞప్తి మేరకు ఉద్యోగి రితుల్ సైకియాను వారు విడిచిపెట్టారు. శనివారం ఉదయం మయన్మార్ సరిహద్దుల వద్ద వదిలిపెట్టారు. అనంతరం ఆర్మీ, పోలీసులు కలసి రితుల్‌ను రక్షించారు. దాదాపు నెల నుంచి ఆయన ఉగ్రవాదుల అదుపులోనే ఉన్నాడు. దీంతో పూర్తిగా బక్కచిక్కి నీరసంగా ఉన్నాడని పోలీసులు చెప్పారు. గత నెల 21న ఓఎన్జీసీకి చెందిన ముగ్గురు ఉద్యోగులను ఉల్ఫా(ఐ) ఉగ్రసంస్థ కిడ్నాప్ చేసింది. అనంతరం జరిగిన ఓ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉద్యోగులను బలగాలు రక్షించాయి. రితుల్ విడుదలను సీఎం హిమంత స్వాగతించారు. ఆయన్ను విడుదల చేయించేందుకు అవసరమైన మార్గదర్శకాన్ని అందించిన హోం మంత్రి అమిత్‌షాకు ధన్యవాదాలు తెలిపారు. Heartily welcome release of Ritul Saikia, ONGC employee abducted by ULFA, early today! Grateful to Honble UHM @AmitShah for constant guidance. Hope an era of peace & development is firmly established in state with cooperation of one and all. Pray to Almighty for His Blessings pic.twitter.com/9kjuVTNKhb — Himanta Biswa Sarma (@himantabiswa) May 22, 2021 -
టౌటే తుపాను: నౌక ప్రమాదంలో 22 మంది మృతి
ముంబై: రెండు రోజుల క్రితం ‘టౌటే’ తుపాను ధాటికి ముంబై తీరానికి 35 నాటికల్ మైళ్ల దూరంలో 261 మంది ప్రయాణిస్తున్న బార్జ్ పీ-305 భారీ నౌక పెద్ద బండ రాయిని ఢీకొనడంతో మునిగిపోయిన సంగతి తెలిసిందే. అరేబియా సముద్రంలో మునిగిపోయిన ఈ ఘటనలో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌కు నాయకత్వం వహిస్తున్న నేవీ 22 మంది మృతదేహాలను బుధవారం గుర్తించి వెలికి తీసింది. ఇప్పటి వరకు బార్జ్ పీ-305లో నౌకలో ప్రయాణిస్తున్న 188 మందిని నావికా దళ సిబ్బంది కాపాడింది. మిగిలిన వారిని గుర్తించి, రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇంకా 51 మంది ఒఎన్జీసీ కార్మికులు కనిపించలేదు. నావికా నౌకలు టెగ్, బెట్వా, బియాస్, అలాగే పీ 8ఐ విమానం, సీ కింగ్ హెలికాప్టర్లు సెర్చ్ & రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నట్లు నావికా దళం పేర్కొంది. అలల ధాటికి గత సోమవారం సాయంత్రం పీ-305 సహా మూడు బార్జ్‌లు, ఒక ఆయిల్ రిగ్ కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. గాల్ కన్స్ట్రక్టర్కు చెందిన బార్జ్ కొట్టుకుపోగా.. అందులోని 137 మందిని నేవీ సిబ్బంది రక్షించారు. ఎస్ఎస్-3 అనే బార్జ్‌పై ఉన్న 196 మంది సిబ్బంది, ఓఎన్జీసీ డ్రిల్లింగ్ రిగ్ ‘సాగర్‌భూషణ్’పై ఉన్న 101 మంది సురక్షితంగా ఉన్నట్లు నౌకాదళ అధికారులు వెల్లడించారు. సముద్రంలో నెలకొన్న కఠిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సహాయక చర్యలు ఆలస్యమవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. చదవండి: ముంబైని అతలాకుతలం చేసిన తుపాను -
ఓఎన్జీసీ సైట్లో అగ్నిప్రమాదం
-
ఓఎన్జీసీ సైట్లో అగ్నిప్రమాదం
సాక్షి, తూర్పుగోదావరి: అయినవిల్లి మండలం మడుపల్లి ఓఎన్జీసీ సైట్ వద్ద అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు ఆయిల్ ట్యాంకర్లు దగ్ధమయ్యాయి. ఓఎన్జీసీ అధికారులు కనీస జాగ్రత్తలు పాటించలేదు. టెస్టింగ్ పేరుతో వారం నుంచి భారీశబ్దంతో గ్యాస్ విడుదల చేస్తున్నారు. గత కొన్నిరోజుల నుంచి సమీప గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవట్లేదని గ్రామస్థుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద విషయం తెలిసి.. అధికారులను ఎమ్మెల్యే చిట్టిబాబు అప్రమత్తం చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. చదవండి: ముస్లిం యువత మానవత్వం.. హత్యా..ఆత్మహత్యా?: బాలిక అనుమానాస్పద మృతి -
ముగ్గురు ఓఎన్జీసీ సిబ్బందిని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు
న్యూఢిల్లీ: అస్సాంలోని ఆయిల్ అండ్ నేచరల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ)కు చెందిన ముగ్గురు ఉద్యోగులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఆయుధాలు కలిగిన అయిదుగురు ఉగ్రవాదులు శివసాగర్‌లోని కార్యాలయంలోకి ప్రవేశించి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. కంపెనీకి చెందిన ఎమర్జెన్సీ కమ్ మెడికల్ వాహనంలో ఎక్కించుకొని తీసుకెళ్లారని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. అనంతరం ఆ వాహనాన్ని నిమోనగర్ అడవి వద్ద వదిలేశారని వెల్లడించారు. ఈ అడవి అస్సాం–నాగాలాండ్ సరిహద్దులో ఉంది. ఈ ఘటనానంతరం ఉన్నత స్థాయి రివ్యూ సమా వేశం నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు -
అసోంలో ముగ్గురు ఓఎన్జీసీ అధికారుల అపహరణ
-
ఆయిల్ మాఫియా ఆగడాలు: మరోసారి ‘వెల్’గులోకి..
సాక్షి, ఉప్పలగుప్తం: కోనసీమలో ఆయిల్మాఫియా ఆగడాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఒకప్పుడు జోరుగా సాగే వైట్ ఆయిల్ రాకెట్ గుట్టురట్టు కావడంతో కొన్నాళ్లుగా ఆయిల్ చోరీకి బ్రేక్ పడింది. అప్పట్లో ఓఎన్జీసీ పైప్‌లైన్, ఆయిల్ ట్యాంకర్ల నుంచి ఆయిల్ చోరీ జరిగితే.. ఇప్పుడు ఏకంగా చమురు సహజవాయు నిక్షేపాల వెలికితీతకు డ్రిల్ చేసిన ప్రాంతాల్లోని వెల్(టెర్మినేటర్) నుంచి దర్జాగా పైపులైన్ వేసుకుని ఆయిల్ చోరీ చేసే స్థాయికి మాఫియా ఎదిగిపోయింది. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి పంచాయతీ వాసాలతిప్ప తీరంలో గతేడాది ఓఎన్జీసీ ఏర్పాటు చేసిన డ్రిల్ సైట్ ఈ ఆయిల్ మాఫియాకు అడ్డాగా మారింది. రోజుకు వెయ్యి నుంచి రెండు వేల లీటర్ల వైట్ ఆయిల్ అక్రమరవాణా అవుతోంది. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లిపంచాయతీ వాసాలతిప్ప సముద్ర తీరంలో ఉన్న ఓఎన్జీసీ జీఎస్ 15 డ్రిల్ సైట్ నుంచి వెల్ నుంచి నేరుగా గోపవరం పంచాయతీలో ఉన్న జగ్గరాజుపేట స్టోరేజ్‌కు పైపులైన్ల ద్వారా క్రూడాయిల్, గ్యాస్‌లను తరలిస్తున్నారు. ఏడాదిగా వెల్ నుంచి ముడిచమురు గ్యాస్ పైపులైన్ల ద్వారా రవాణా అవుతుంది. గ్రామానికి దూరంగా ఉన్న ఈ సైట్‌ను కేంద్రంగా చేసుకుని ఆయిల్ మాఫియా ఆరు నెలల నుంచి చోరీకి పాల్పడుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి 20న ఆయిల్ చోరీ జరుగుతుందని అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదై ఉంది. ఓఎన్జీసీ అధికారులు సెక్యూరిటీ ఏర్పాటుకు సదరు సంస్థకు ప్రతిపాదించి చేతులు దులుపుకొన్నారు. అయితే వాసాలతిప్ప గ్రామస్తులు మాత్రం ముఠాపై కన్నేశారు. ఈ క్రమంలోనే బుధవారం అర్ధరాత్రి ఆయిల్ చోరీని గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముఠాను పట్టుకునే ప్రయత్నం చేయగా, వారు చోరీకి ఉపయోగించే మోటార్లు, పైపులు, స్టోరేజ్ టిన్నులు, మారుతీ ఓమ్నీ వ్యాను వదిలి పరారయ్యారు. చోరీ ముఠాలో ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించినట్టు తెలిసింది. అయితే గురువారం తెల్లవారు జామున ఎస్సై జి.వెంకటేశ్వరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తమ అదుపులో ఎవరూ లేరని పోలీసులు చెబుతున్నారు. అధికారుల పరిశీలన ఓఎన్జీసీ ఏరియా మేనేజర్ ప్రసాదరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామన్నారు. అమలాపురం రూరల్ సీఐ జి.సురేష్‌బాబు పరిశీలించి, ఓఎన్జీసీ సెక్యూరిటీ అధికారి తో మాట్లాడారు. ఓఎన్జీసీ ఐఎం జగన్నాథరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. గ్రామస్తుల ఆందోళన వాసాలతిప్ప వచ్చిన ఓఎన్జీసీ అధికారులను స్థానికులు నిలదీశారు. స్థానిక సమస్యలపై మీరిచ్చిన హామీలు ఏం చేశారంటూ ఆందోళనకు దిగారు. స్థానిక నాయకులు పినిపే జయరాజ్, ఇసుకపట్ల రఘుబాబు, గెడ్డం సంపదరావు, పట్టా శ్రీను తదితరులు నచ్చజెప్పి, డిమాండ్ల పరిష్కారానికి హామీ తీసుకున్నారు. రూ.లక్ష విలువైన ఆయిల్ చోరీ... రోజుకు రూ.లక్ష విలువైన ఆయిల్ చోరీ జరుగుతున్నట్టు తెలుస్తోంది. దాదాపు 30 టిన్నులు(ఒక్కొక్కటి 50 లీటర్లు) ఆయిల్ ఇక్కడి నుంచి రవాణా అవుతోంది. ఇక్కడి నుంచి మామిడికుదురు మండలంలో ఓ వ్యాపారి లీటరు ఆయిల్ రూ.50 నుంచి రూ.60కి హోల్‌సేల్ రేటుగా తీసుకుంటున్నట్టు తెలిసింది. ఆయిల్ చోరీ ఆలస్యంగా బయటకు వచ్చినా దీని వెనుక ఇంటి దొంగల హస్తం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానంతో చోరీ.. ఓఎన్జీసీ డ్రిల్ సైట్ వెల్ నుంచి వెలువడే గ్యాస్, ముడిచమురు, నీరును చాకచక్యంగా విభజించి నేరుగా వైట్ ఆయిల్ టిన్నుల్లోకి నింపడం సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పని. పోలీసులు స్వాధీనం చేసుకున్న సామగ్రిలో (సెపరేటర్)గ్యాస్ విడిగా, వాటర్ విడిగా పోయి ఆయిల్ మాత్రమే నింపేలా తయారైన యంత్ర పరికరాలు లభించడం చోరీలో నైపుణ్యం గల వ్యక్తులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ( చదవండి: సైబర్ నేరగాళ్ల చేతి వాటం.. రూ.1.2 లక్షలు స్వాహా ) -
ఆక్వా చెరువుల్లోకి ఓఎన్జీసీ వ్యర్థాలు
ఉప్పలగుప్తం: తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి పంచాయతీ జగ్గరాజుపేటలోని జీఎంఏఏ ఓఎన్జీసీ సైట్ నుంచి వెలువడిన వ్యర్థ జలాలు పంట కాలువలో చేరి ఆక్వా, చేపల చెరువులకు తీవ్ర నష్టం వాటిల్లటంతో రైతులు ఆదివారం ఉదయం ఆందోళన చేపట్టారు. ఓఎన్జీసీ సైట్‌కు వెళ్లే ఉద్యోగులను అడ్డుకుని ధర్నా నిర్వహించారు. గోపవరం గ్యాదరింగ్ స్టేషన్ (జీజీఎస్)గా వ్యవహరించే ఈ సైట్లో ముడిచమురుతో వచ్చే వ్యర్థ జలాలను సెపరేటర్ల ద్వారా శుద్ధి ప్లాంటుకు తరలిస్తారు. రెండు మూడు రోజులుగా వ్యర్థ జలాలు పంట కాలువలోకి చేరుతున్నాయి. శనివారం రాత్రి లీకేజీ ఎక్కువ కావడంతో కాలువ నిండా వ్యర్థ జలాలు చేరాయి. ఈ విషయం తెలియని ఆక్వా రైతులు కాలువలోని నీటిని చెరువుల్లోకి తోడారు. సుమారు 3 వందల ఎకరాల ఆయకట్టున్న ప్రాంతంలో 50 నుంచి 60 ఎకరాలకు ఇంజన్లతో ఆ నీటిని తోడారు. దీంతో పలు చెరువుల్లో చేపలు చనిపోయి పైకి తేలగా రొయ్యలు మృత్యువాత పడి అడుగు భాగానికి చేరినట్లు గుర్తించారు. దీంతో రైతులు అల్లూరి రమేష్‌రాజు, సామంతకూరి జగన్రాజు తదితరులు స్థానిక నాయకుడు ఇసుకపట్ల రఘుబాబు ఆధ్వర్యంలో జగ్గరాజుపేటలో ధర్నాకు దిగారు. ఎకరాకు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని, ఆమేరకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చల్లపల్లి సర్పంచ్ ఇసుకపట్ల జయమణి ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో వినతిపత్రాన్ని అందించారు. ఓఎన్జీసీ ఇన్స్టలేషన్ మేనేజర్ (ఐఎం) పి.జగన్నాథరావు అక్కడకు చేరుకుని వారితో చర్చించారు. సాంకేతిక బృందం నివేదిక మేరకు పరిహారం అందజేస్తామని చెప్పారు. -
నష్టాలు ఒకరోజుకే పరిమితం
ముంబై: స్టాక్ మార్కెట్‌కు నష్టాలు ఒకరోజుకే పరిమితం అయ్యాయి. సూచీలు మళ్లీ రికార్డుల బాట పట్టాయి. సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేయడంతో పాటు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో పీఎస్‌యూ బ్యాంక్స్, మెటల్, ఎఫ్ఎంజీసీ షేర్లు రాణించాయి. ఫలితంగా సెన్సెక్స్ 139 పాయింట్లను ఆర్జించి 46 వేలపైన 46,099 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 36 పాయింట్లను ఆర్జించి 13,514 వద్ద నిలిచింది. ఫార్మా, ఐటీ, ఆటో షేర్లు మాత్రం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 46,310 వద్ద గరిష్టాన్ని, 45,706 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ సైతం 13,579–13,403 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 4,195 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,359 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్ 1019 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 255 పాయింట్లను ఆర్జించింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 604 పాయింట్ల రేంజ్లో, నిఫ్టీ 176 పాయింట్ల పరిధిలో కదలాడాయి. ప్రభుత్వ రంగ కంపెనీ కౌంటర్లలో సందడి..: కొన్ని రోజులుగా స్తబ్దుగా ట్రేడ్ అవుతున్న ప్రభుత్వరంగ కంపెనీల కౌంటర్లో శుక్రవారం సందడి నెలకొంది. ఫలితంగా ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, గెయిల్, కోల్ ఇండియా షేర్లు 5 శాతం నుంచి 3 శాతం దాకా లాభపడ్డాయి. ఆరుశాతం పెరిగి స్పైస్‌జెట్... స్పైస్‌జెట్ కంపెనీ షేరు బీఎస్ఈలో ఆరుశాతం లాభపడింది. కోవిడ్–19 వ్యాక్సిన్ల సరఫరాకు రవాణా సంస్థలైన ఓం లాజిస్టిక్స్, స్నోమన్ లాజిస్టిక్స్‌తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో ఇందుకు కారణమైంది. ఇంట్రాడేలో ఎనిమిది శాతం ర్యాలీ రూ.108 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 6.52 శాతం లాభంతో రూ. వద్ద స్థిరపడింది. బర్గర్ కింగ్ లిస్టింగ్ సోమవారం: గతవారంలో పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసుకున్న బర్గర్ కింగ్ షేర్లు సోమవారం స్టాక్ ఎక్చ్సేంజీల్లో లిస్ట్ కానున్నాయి. -
సూరత్: భారీ అగ్ని ప్రమాదం
-
సూరత్‌లో భారీ అగ్ని ప్రమాదం
గాంధీనగర్: గుజరాత్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) ప్లాంట్‌లో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం నేడు తెల్లవారుజామున 3:30 గంటలకు సూరత్‌లోని హజీరా ఆధారిత ఓఎన్జీసీ ప్లాంట్‌లోని రెండు టెర్మినల్స్ వద్ద పేలుడు సంభవించింది. భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. పేలుడు శబ్దం 10 కిలోమీటర్ల వరకు వినిపించిందని స్థానికులు తెలిపారు. ఎంతో దూరం వరకు మంటలు కనిపించాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలతో పాటు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. (చదవండి: పాపం.. శానిటైజర్ ఎంత పని చేసింది!) -
కేజీ బేసిన్లో తొలి అగ్రిసోలార్ ప్లాంట్
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: కృష్ణా, గోదావరి(కేజీ) బేసిన్లో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) విద్యుత్ స్వయం సమృద్ధి వైపు అడుగులు వేస్తోంది. స్వీయ అవసరాలతోపాటు కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతాల్లో స్థానికులకు విద్యుత్తు సరఫరాలో భాగస్వామ్యం వహించే దిశగా చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని తాటిపాక ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్‌లో ఐదు మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. మన రాష్ట్రంలో తొలి ప్రయోగాన్ని ఇది వరకే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చేసింది. అదీ కూడా కేవలం విద్యుత్ సరఫరా మాత్రమే. నగరం గ్రామంలో రెండో ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టింది. కేరళలో ఇదివరకే ఏర్పాటైన అగ్రిసోలార్ ప్లాంట్(పైన సోలార్ ప్యానల్స్, భూమిపై వ్యవసాయం) మాదిరిగానే ఈ సోలార్ ప్లాంట్ ఏర్పాటవుతోంది. 23.50 ఎకరాలు.. రూ.24 కోట్లు విద్యుత్ ప్లాంట్ కోసం ఓఎన్జీసీ సుమారు రూ.24 కోట్లు వెచ్చిస్తోంది. 23.50 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ నిర్మాణ బాధ్యతలను ఫోటాన్ ఎనర్జీ సిస్టమ్స్‌కు అప్పగించింది. ఈ ప్లాంట్‌కు అనుబంధంగా 33 కేవీ సబ్‌స్టేషన్, రెండు మెగావాట్ల సామర్థ్యం కలిగిన అత్యాధునికమైన మూడు పవర్ ట్రాన్స్ఫార్మర్లు, 18,450 సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఆరు మెగావాట్స్ డీసీ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దానిని ఇన్వర్టర్ల ద్వారా ఐదు మెగావాట్స్ ఏసీ విద్యుత్‌గా మార్చే విధంగా డిజైన్ చేశారు. ఈ సోలార్ ప్లాంట్ ద్వారా రోజుకు 20 వేల నుంచి 25 వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలనేది ఓఎన్జీసీ లక్ష్యం. ఆ పల్లెల్లో ఇక సోలార్ వెలుగులు... రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లోని 12 గ్రామాల్లో సౌర వెలుగులు ప్రసరించనున్నాయి. తాటిపాక, పొదలాడ, మామిడికుదురు, గెద్దాడ, పెదపట్నంలంక, పెదపట్నం, నగరం, మొగలికుదురు, పాశర్లపూడి, పాశర్లపూడిలంక, అప్పనపల్లి, బి.దొడ్డవరం తదితర గ్రామాల్లో ఈ ప్లాంట్ వెలుగులు ప్రసరించనున్నాయి. ఆనందంగా ఉంది మా గ్రామంలో ప్లాంట్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఈ తరహా సమస్యలు తొలగనున్నాయి. – మట్టపర్తి రెడ్డి, రిటైర్డ్ ఉద్యోగి, నగరం గ్రామం అభివృద్ధి చెందుతుంది ప్లాంట్ ఏర్పాటు వల్ల మా గ్రామం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుంది. మా విద్యుత్ అవసరాలు తీరడంతోపాటు నాణ్యమైన విద్యుత్‌ను పొందే అవకాశం దక్కుతుంది. – బత్తుల ప్రకాశం, నగరం, టీచర్ -
అసోం ఓఎన్జిసీలో ఎగసిపడుతున్న మంటలు
-
ఓఎన్జీసీ డివిడెండ్ రూ.5
న్యూఢిల్లీ: ముడి చమురు ధరలు తీవ్రమైన ఒడిదుడుకుల్లో ట్రేడ్ అవుతున్నప్పటికీ, కార్యకలాపాలు కొనసాగించడానికి తగిన నిధులు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వ రంగ చమురు సంస్థ, ఓఎన్జీసీ భరోసానిచ్చింది. అంతే కాకుండా 100 శాతం మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. రూ.5 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.5 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని ఓఎన్జీసీ తెలిపింది. కేంద్రానికి 62.78 శాతం వాటా ఉండటంతో కేంద్ర ఖజానాకు రూ.3,949 కోట్లు డివిడెండ్ ఆదాయం లభించగలదని వివరించింది. -
ఏప్రిల్ నుంచి పెట్రోలు ధరల మోత?
సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే ఏప్రిల్‌నుంచి ఇంధన ధరలు మోతమోగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న బీఎస్-6 ఉద్గాన నిబంధనల నేపథ్యంలో పెట్రోలు ధరలు లీటరుకు 70-120 పైసలు పెంచవలసి వుంటుందని కంపెనీలు భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు తక్కువ ఉద్గారాలతో బీఎస్-6 ఇంధనాలను సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని, తద్వారా రిటైల్ ధరలలో స్వల్ప పెరుగుదల ఉండనుందని ఐవోసీ ప్రకటించడం ఈ అంచనాలకు మరింత బలాన్నిచ్చింది. కొన్నిరిమోట్ ప్రదేశాల్లో తప్ప దేశం అంతా కొత్త ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఇంధన సరఫరాకు తాము సిద్ధంగా ఉన్నామని జాతీయ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) శుక్రవారం వెల్లడించింది. అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉన్న ఐవోసీ తమ రిఫైనరీలను తక్కువ సల్ఫర్ డీజిల్, పెట్రోల్ ఉత్పత్తి చేసేలా అప్‌గ్రేడ్ చేయడానికి రూ .17వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని కంపెనీ చైర్మన్ సంజీవ్ సింగ్ మీడియాకు వివరించారు. ధరల పెంపు సంకేతాలను ధృవీకరించిన సంజీవ్ సింగ్ ఏ మేరకు పెంపు వుంటుందనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. ఏప్రిల్ 1 నుండి ఇంధనాల రిటైల్ ధరలలో స్వల్ప పెరుగుదల ఉంటుందని మాత్రం ప్రకటించారు. అయితే వినియోగదారులపై భారం పెద్దగా ఉండదదని హామీ ఇచ్చారు. ఇక దేశం మొత్తం కొత్త ఇంధనాలపై నడుస్తుందనీ, గతంలో 50 పీపీఎంతో పోలిస్తే సల్ఫర్ కంటెంట్ 10 పీపీఎం మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. తమ చమురు శుద్ధి కర్మాగారాలను అప్‌గ్రేడ్ చేయడానికి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీ) రూ .35,000 కోట్లు పెట్టుబడి పెట్టగా, అందులో రూ.17 వేల కోట్లు ఐఓసి ఖర్చు చేసిందని చెప్పారు. కాగా బీపీసీఎల్ సుమారు 7,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టగా, ఓఎన్జీసీకి చెందిన హెచ్‌పీసీఎల్ పెట్టబడులపై ఎలాంటి సమాచారం లేదు. అయితే బీఎస్-6 సంబంధిత ఇంధనాలతో ఫిబ్రవరి 26-27నుంచే సిద్ధంగా ఉన్నామని మార్చి 1 నుంచి కొత్త ఇంధనాలను మాత్రమే విక్రయిస్తామని హెచ్‌పీసీఎల్ ఇప్పటికే ప్రకటించింది. -
కేజీ బేసిన్లో అడుగంటిన క్రూడాయిల్
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: కృష్ణా గోదావరి(కేజీ) బేసిన్లో గత మూడేళ్లుగా ముడిచమురు(క్రూడాయిల్) నిల్వలు పడిపోతుండడంతో ఓఎన్జీసీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. క్రూడాయిల్ నిల్వల తగ్గుదలతో ఈ బేసిన్లో ఓఎన్జీసీ సగటున రోజుకు రూ.కోటి వరకూ ఆదాయం కోల్పోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇంతవరకూ కేజీ బేసిన్లో సుమారు 500 బావుల్ని గుర్తించగా.. కేవలం 112 బావుల్లో మాత్రమే ఉత్పత్తి కొనసాగుతోంది. వాటిలో అధికశాతం సహజ వాయువు ఉత్పత్తి చేస్తుండగా.. ఉన్న కొద్దిపాటి బావుల్లో చమురు ఉత్పత్తి మందగించింది. ఈ పరిస్థితుల్లో మరింత లోతుకు బావులు తవ్వాలని ఓఎన్జీసీ యోచిస్తున్నా.. ఖర్చు నాలుగు రెట్లకు పైగా అవుతుందనే అంచనాలతో వెనుకడుగు వేస్తోంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పతనమవడంతో.. అంత ఖర్చుచేయడం గిట్టుబాటవుతుందా? అన్న ఆలోచనలోనూ ఉంది. ఒకప్పుడు రికార్డు స్థాయిలో ఉత్పత్తి రాష్ట్రంలోని ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల వరకూ విస్తరించిన కేజీ బేసిన్.. ముంబై హై తర్వాత ఓఎన్జీసీకి తలమానికంగా నిలిచింది. దీని పరిధి సుమారు 50 వేల చదరపు కిలోమీటర్లు విస్తరించింది. ఈ ప్రాంతంలో నాలుగు దశాబ్దాలుగా ఓఎన్జీసీ చమురు, సహజవాయువును వెలికితీస్తోంది. కేజీ బేసిన్లో కోనసీమలోనే చమురు బావులు ఎక్కువగా ఉన్నాయి. గత ఐదేళ్లుగా సాగిస్తున్న అన్వేషణలో భాగంగా కృష్ణా జిల్లా నాగాయలంక, బంటుమిల్లి, మల్లేశ్వరం తదితర ప్రాంతాలలో ఓఎన్జీసీ చమురు నిల్వల్ని కనుగొంది. దీంతో కొత్త ఆశలు చిగురించాయి. అయితే కోనసీమ స్థాయిలో అక్కడ చమురు ఉత్పత్తి లేకపోవడంతో డీలాపడింది. కొన్నేళ్ల క్రితం వరకూ కేజీ బేసిన్లో క్రూడాయిల్ ఉత్పత్తి రికార్డు స్థాయిలో జరిగేది. ఆ సంస్థ మొత్తం ఉత్పత్తిలో ఈ బేసిన్ వాటా 15 శాతంగా ండేది. అయితే 2017 నుంచి 50 శాతం మేర క్రూడాయిల్ ఉత్పత్తి పడిపోయింది. ఈ లెక్కన ఓఎన్జీసీ కొన్నాళ్లుగా సుమారు రూ.1080 కోట్ల వరకూ ఆదాయాన్ని కోల్పోయిందని ప్రాథమిక అంచనా. 4 వేల మీటర్ల దిగువకు డ్రిల్లింగ్ చేస్తేనే.. కేజీ బేసిన్లో ప్రస్తుతం భూ ఉపరితలం నుంచి 3000 మీటర్ల లోతున మాత్రమే ఓఎన్జీసీ చమురు అన్వేషణ, ఉత్పత్తి సాగిస్తోంది. ఆ ప్రాంతంలో 2000 పీఎస్ఐ(పౌండ్ పర్ స్క్వేర్ ఇంచ్)ఒత్తిడి, 80 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని ఓఎన్జీసీ సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఈ బావుల ద్వారా సముద్రంలో 4000 మీటర్ల దిగువన డ్రిల్లింగ్ నిర్వహించి చమురు అన్వేషణ, ఉత్పత్తికి ఓఎన్జీసీ తటపటాయిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అంతలోతుకు వెళ్తేగానీ కొత్త చమురు నిల్వలు కనుగొనలేని పరిస్థితి. 4000 నుంచి 4200 మీటర్ల లోతున డ్రిల్లింగ్ చేయాలంటే అక్కడ భూమి పొరల్లో 5 వేల పీఎఫ్ఐ(పౌండ్ పర్ స్క్వేర్ ఇంచ్)ఒత్తిడి, 200 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చాలా ఖరీదుతో కూడుకున్నది. ఒక్కో బావిలో ప్రస్తుతం జరుగుతున్న డ్రిల్లింగ్కు రూ.కోటి నుంచి రూ.1.20 కోట్లు ఖర్చవుతుందని అంచనా. మరింత లోతుకు వెళ్లి డ్రిల్లింగ్ చేయాలంటే ఒక్కో బావికి సుమారు రూ.5 కోట్ల నుంచి 5.50 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని ఓఎన్జీసీ అంచనా వేస్తోంది. ఎక్కువ శాతం బావుల్లో సహజవాయువు ఉత్పత్తే.. తాటిపాక జీజీఎస్(గ్రూప్ గేదరింగ్ స్టేషన్) బావుల్లో క్రూడ్ ఉత్పత్తి తగ్గిపోయింది. ఒక్క కేశనపల్లిలో మాత్రమే కొంత ఆశావహ పరిస్థితి ఉంది. మోరి జీజీఎస్‌లో 58 బావులుంటే 40 బావుల్లో ఎక్కువ శాతం సహజవాయువు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. అడవిపాలెంలోను దాదాపు ఇదే పరిస్థితి. దీంతో కోనసీమ ప్రాంతంలో క్రూడ్ ఉత్పత్తి దాదాపు పడిపోయిందని చెబుతున్నారు. పొన్నమండ, మండపేట, నర్సాపురం జీజీఎస్‌లో కూడా క్రూడ్ ఉత్పత్తి పడిపోయింది. ఈ పరిస్థితుల్లో విదేశీ చమురు అన్వేషణ సంస్థల సాయం తీసుకునే యోచనలో ఓఎన్జీసీ ఉంది. -
అదుపులోకి గ్యాస్ బ్లోఅవుట్
ఉప్పూడి నుంచి సాక్షి ప్రతినిధి: కోనసీమ వాసులకు కంటిపై కునుకు లేకుండా చేసిన ఉప్పూడి గ్యాస్ బ్లోఅవుట్ ఎట్టకేలకు అదుపులోకి వచ్చింది. 42 గంటలపాటు ఉత్కంఠ రేకెత్తించిన గ్యాస్ విస్ఫోటనాన్ని కట్టడిచేయడంలో ఓఎన్జీసీ రెస్క్యూటీమ్ మంగళవారం విజయవంతమైంది. ఓఎన్జీసీకి తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలంలోని అడవిపేట రిగ్ పరిధిలోని ఉప్పూడి–1 బావిలో ఆదివారం గ్యాస్ బ్లోఅవుట్ సంభవించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బావి నుంచి ఎగసిపడుతున్న గ్యాస్‌ను కట్టడి చేసేందుకు ఓఎన్జీసీ రెస్క్యూటీమ్ ప్రయత్నించింది. ప్లాన్–ఏలో భాగంగా నీటిని ఎగసిపడుతున్న గ్యాస్ బావిపైకి ఎగజిమ్ముతూ నియంత్రించాలనుకున్నారు. అది ఫలించకపోవడంతో మంగళవారం ప్లాన్–బి ప్రకారం రసాయనాలతో కూడిన మడ్‌ను పంపింగ్ చేయడం ద్వారా ఎగసిపడుతున్న గ్యాస్‌ను అదుపులోకి తీసుకురావాలనుకున్నారు. అయితే ఓఎన్జీసీ రెస్క్యూటీమ్‌ను పర్యవేక్షిస్తున్న ఓఎన్జీసీ ఆపరేషన్ గ్రూపు జనరల్ మేనేజర్ ఆదేశ్‌కుమార్, ఆపరేషన్స్ ఏరియా మేనేజర్ బి.ప్రసాదరావు సూచన మేరకు ప్లాన్– ఏ నే మెరుగైన పద్ధతిలో అమలు చేయాలని నిర్ణయించారు. 360 డిగ్రీల పీడనంతో అంబ్రిల్లా (గొడుగు మాదిరిగా)లా నీటిని గ్యాస్ బావిపై పంపింగ్ చేయడం ద్వారా నియంత్రించారు. ఈ ప్రక్రియను ఉదయం 9.30 గంటలకు ప్రారంభించి 10.40 గంటలకు ముగించారు. వెనువెంటనే రిస్క్ మేనేజ్మెంట్ టీమ్ డీజీఎం ఏబీ రామారావు వీపునకు ఆక్సిజన్ సిలెండర్‌ను తగిలించుకుని వెల్ మౌత్ వద్దకు వెళ్లి వెల్‌కేప్‌ను మూసేయడం ద్వారా ఆపరేషన్‌ను ముగించారు. మంత్రి పినిపే విశ్వరూప్ డీజీఎంతో కలిసి బావి వద్దకు వెళ్లి పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్, కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి, ఎస్పీ నయీం అస్మి ఓఎన్జీసీ అధికారులతో కలిసి విజయోత్సవాన్ని పంచుకున్నారు. ఈ ఆపరేషన్‌లో ఏడు బృందాలలో సుమారు 70 మంది పాల్గొన్నారు. 42 గంటల తరువాత గ్యాస్ అదుపులోకి రావడంతో ఉప్పూడి సహా కోనసీమ వాసులు ఊపిరిపీల్చుకున్నారు. పోలీసు కేసు నమోదు: ఉప్పూడి–1 బావిని నిర్వహిస్తున్న ప్రైవేటు సంస్థ పీఎఫ్‌హెచ్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైవేటు లిమిటెడ్‌పై పోలీసు కేసు నమోదైంది. చట్టం ప్రకారం చర్యలు తీసుకోనున్నట్టు ఎస్పీ ప్రకటించారు. చమురు సంస్థల అన్వేషణతో జరుగుతున్న ప్రమాదాలపై సీఎం వైఎస్ జగన్‌కు అందజేసేందుకు నివేదిక సిద్ధం చేయాలని యంత్రాంగాన్ని మంత్రులు ఆదేశించారు. -
ఉప్పూడిలో అదుపులోకి వచ్చిన గ్యాస్ లీక్
సాక్షి, తూర్పు గోదావరి : జిల్లాలోని కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామంలో గ్యాస్ లీకేజ్ అదుపులోకి వచ్చింది. ముంబై నుంచి వచ్చిన ప్రత్యేక బృందం మంగళవారం నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమయింది. మడ్ పంపింగ్ ద్వారా ముంబై నుంచి వచ్చిన స్పెషల్ టీమ్ గ్యాస్ బ్లో అవుట్‌ను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో ఉప్పూడి పరిసరప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, రెండు రోజులుగా ఉప్పూడి సమీపంలోని ప్రజలను గ్యాస్ బ్లో అవుట్ వణికించిన సంగతి తెలిసిందే. దీనిని అదుపు చేసేందుకు సోమవారం ఓఎన్జీసీ అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ముంబై నుంచి వచ్చిన ప్రత్యేక బృందం రెస్క్యూ మంగళవారం ఆపరేషన్ కొనసాగించారు. గ్యాస్ లీక్‌ను అదుపు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు. 2.2 కి.మీల లోతులో ఉన్న గ్యాస్ బావిలోకి నిరంతారాయంగా వాటర్ పంపింగ్ చేపట్టారు. చివరకు మడ్పంపింగ్ ద్వారా గంటన్నలోపే గ్యాస్ లీకేజ్‌ను అదుపులోని తెచ్చారు. అంతకుముందు గ్యాస్ లీకేజీ దృష్ట్యా ఘటన స్థలికి 2 కి.మీ పరిధిలోని ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు. కాట్రేనికోనలో నిన్నటి నుంచి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. -
అదుపులోకి రాని గ్యాస్ లీక్
-
అదుపులోకి రాని గ్యాస్ బ్లో అవుట్
ఉప్పూడి నుంచి సాక్షి ప్రతినిధి: తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం ఉప్పూడి వద్ద గ్యాస్ బ్లో అవుట్‌ను అదుపు చేసేందుకు సోమవారం ఓఎన్జీసీ రెస్క్యూ టీమ్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. బావిలోని గ్యాస్ నిట్టనిలువుగా మూడు కిలోమీటర్ల మేర సిమెంట్ కేసింగ్ కిందకు తన్నుకుని, అదే ఒత్తిడితో బయటకు ఎగదన్నుతోంది. దీనివల్ల వెల్‌క్యాప్ ఎక్కడ ఉందన్న అంచనాకు రాలేకపోతున్నారు. వెల్‌క్యాప్‌ను గుర్తించగలిగితే గ్యాస్ ఒత్తిడి అదుపులోకి వచ్చిన మరుక్షణం ఆ వెల్‌క్యాప్‌ను మూసేయడం సులువవుతుందని ఓఎన్జీసీ అధికారులు చెబుతున్నారు. ఇందుకు రెండు పద్ధతులు అనుసరించాలని రెస్క్యూ టీమ్ నిర్ణయించుకుంది. ప్లాన్–ఏ ప్రకారం నీటిని పంపింగ్ చేస్తూ గ్యాస్ ఒత్తిడిని తగ్గించి బావిని నియంత్రణలోకి తేవాలనుకుంది. దీనికి అనుగుణంగా ఉదయం నుంచి రాత్రి వరకూ నీటిని పంపింగ్ చేశారు. ప్రయోజనం లేకపోవడంతో ప్లాన్–బి అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకు రసాయనాలతో కూడిన 40 వేల లీటర్ల మడ్‌ను సిద్ధం చేశారు. మరో 40 వేల లీటర్ల మడ్‌ను అందుబాటులో ఉంచారు. దీనిని పంపింగ్ చేసే ప్రక్రియ మంగళవారం చేపడతారు. ఆపరేషన్–బి ప్రారంభించిన రెండు గంటల్లోనే గ్యాస్‌ను నియంత్రించవచ్చని ఓఎన్జీసీ జీఎం ఆదేశ్‌కుమార్ చెప్పారు. రెండురోజు కూడా గ్యాస్ అదుపులోకి రాకపోవడంతో పునరావాస కేంద్రంలో ఉన్న బాధితులు ఆందోళన చెందుతున్నారు. మనోధైర్యం కల్పించండి : సీఎం వైఎస్ జగన్ ఘటనపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రి పినిపే విశ్వరూప్, ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌తో రెండు పర్యాయాలు మాట్లాడారు. ఉప్పూడి గ్రామస్తులకు చెయ్యేరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుని గ్రామస్తులకు మనోధైర్యాన్ని కలిగించాలని సీఎం ఆదేశించారు. మంత్రులు ఘటనా స్థలంలోనే మకాం వేసి పరిస్థితిని పర్యవేక్షించారు. -
‘గ్యాస్ నిర్వహణకు సీఎం జగన్‌తో చర్చిస్తాం’
సాక్షి, తూర్పుగోదావరి, కాకినాడ: జిల్లాలోని కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామంలో ఆదివారం ఓఎన్జీసీ బావి నుంచి ఒక్కసారిగా గ్యాస్ పెద్ద శబ్దంతో ఎగసిపడిన విషయం తెలిసిందే. అయితే ఉప్పూడి ఓఎన్జీసీ గ్యాస్ లీక్ ప్రదేశాన్ని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లీకవుతున్న గ్యాస్ ఫైర్ అయ్యే అవకాశం లేదన్నారు. సోమవారం సాయత్రం వరకు లీక్ అవుతున్న గ్యాస్‌ను అదుపుచేయాలని అధికారులను ఆదేశించారు. గ్యాస్ లీక్‌ను అదుపు చేసేందుకు ఓఎన్జీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. చడవండి: కోనసీమలో గ్యాస్ బ్లో అవుట్ ఉప్పుడి గ్యాస్ సంఘటన మానవ తప్పిదం వల్లే జరిగిందని మంత్రి విశ్వరూప్ అన్నారు. నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుందన్నారు. ఓఎన్జీసీ అధికారులు గ్యాస్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రెండు పద్ధతుల్లో గ్యాస్‌ను అదుపు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. మూడు నాలుగు గంటల్లో అదుపు చేయడానికి అవకాశం ఉందని విశ్వరూప్ చెప్పారు. కోనసీమలో గ్యాస్ తవ్వకాలు, నిర్వహణకు సంబంధించి సీఎం జగన్మోహన్రెడ్డితో చర్చిస్తామని మంత్రి విశ్వరూప్ తెలిపారు. -
సకాలంలో ఓఎన్జీసీ కీలక ప్రాజెక్టు పూర్తి
ఎంఇఐఎల్ మరో కీలక ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేసింది. చమురు రంగంలో వచ్చే మూడు దశాబ్దాల కాలానికి తగిన సామర్ధ్యంతో కూడిన నిర్వహణ వ్యవస్థను రూపొందించేందుకు ఉద్దేశించిన కార్యక్రమం అసోం రెన్యూవల్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఈపీసీ విధానంలో ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకున్న మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఇఐఎల్) అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అధునాతన పద్ధతిలో ఈ ప్రాజెక్టును పునర్ నిర్మించింది. భారత్‌లో ముడి చమురు, ఉత్పత్తి రవాణా వ్యవస్థల్లో ఓఎన్జీసీకి ఈ చెందిన ఆన్‌షోర్ వ్యవస్థ అతి భారీది. మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన వ్యవస్థ ప్రస్తుత అవసరాలకు సరిపోకపోవడం, మరో వైపు వచ్చే 30 ఏళ్ల అవసరాలు దృష్టిలో పెట్టుకొని అసోం ప్రాజెక్టు పునర్ నిర్మాణాన్ని ఓఎన్జీసీ చేపట్టింది. రూ.2400 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఈ ప్రతిష్టాత్మకమైన కాంట్రాక్టును ఈపీసీ పద్ధతిలో ఎంఇఐఎల్ దక్కించుకుంది. ప్రాజెక్టులో భాగంగా అసోంలోని నిర్మించిన లఖ్వా గ్రూప్ గ్యాదరింగ్ స్టేషన్ (జీజీఎస్) ఇప్పటికే జాతికి అంకితమివ్వడం జరిగింది. తాజాగా ప్రాజెక్టు పనులన్నీ పూర్తికావడంతో డిసెంబర్ 26, 2019న ప్రయోగాత్మక పరిశీలన నిర్వహించడం ద్వారా దీన్ని వాణిజ్యపరంగా వినియోగంలోకి తీసుకువచ్చారు. అసోం రెన్యూవల్ ప్రాజెక్టు ఆధునీకరణ ద్వారా ఓఎన్జీసీ ముడి చమురు, ఇంధన ప్రాసెసింగ్ సామర్ధ్యం భారీగా పెరుగుతుంది. రెన్యూవల్‌కు ముందు ఈ ప్రాజెక్టు ఉత్పత్తి సామర్ధ్యం ఏటా 1.4 ఎంటీపీఎ (మిలియన్ టన్స్ ఫర్ ఇయర్) అంటే 1.03 కోట్ల బ్యారెల్స్ (ఒక బ్యారెల్ అంటే ఇంచుమించు 159 లీటర్లు). పునర్నిర్మాణం తర్వాత ఈ సామర్ధ్యం 1.83 కోట్ల బ్యారెల్స్‌కు పెరుగుతుంది. అంటే దాదాపు రెట్టింపు. ఆధునీకరణలో భాగంగా అత్యంత నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గతంలో ఉన్న 800 కిలోమీటర్ల పైప్‌లైన్‌ను 560 కిలోమీటర్లకు ఎంఇఐఎల్ తగ్గించింది. గతంలోని విధానంలో 21 నిర్మాణాలు ఉండగా ప్రస్తుతం అవి 9కి తగ్గాయి. వాటిని కూడా ఆధునిక ఇంటిగ్రేటెడ్ కేంద్రాలుగా మార్చి వ్యవస్థలోని సంక్లిష్టతలను తగ్గించి సరళతరం చేసింది ఎంఇఐఎల్. ఒప్పందంలో భాగంగా రెన్యూవల్ ప్రాజెక్టులో కీలకమైన 5 గ్యాస్ సేకరణ కేంద్రాలను ఎంఇఐఎల్ నిర్మించింది. ఈ ఆధునిక వ్యవస్థ నిర్వహణకు తగినట్టుగా 2 నీటి శుద్ధికేంద్రాలు, 2 వాటర్ ఇంజెక్షన్ ప్లాంట్లు నిర్మించింది. సేకరించిన గ్యాసును కంప్రెస్ చేసే నిల్వ చేసేందుకు రెండు ప్లాంట్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ నవీకరణ ప్రాజెక్టులో భాగంగా ముడి చమురు నుంచి ఉత్పత్తయ్యే అన్నింటిని నిల్వ చేయడం, ప్రాసెస్ చేయడం, రవాణా వ్యవస్థ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యవస్థలో అత్యంత కీలకమైన గ్యాస్ కండిషనింగ్ కోసం గ్యాస్ డీహ్రైడేషన్ యూనిట్ నిర్మాణం కూడా జరిగింది. ఎకో ఫ్రెండ్లీగా వ్యవస్థను తీర్చిదిద్దేందుకు ఇక్కడ ఉత్పత్తయ్యే వ్యర్థాలన్నింటినీ నిర్మూలించేందుకు ప్రత్యేక వ్యవస్థ కూడా అందుబాటులో ఉంది. -
ఓఎన్జీసీకి చమురు క్షేత్రాల అప్పగింత
ముంబై : పన్నా- ముక్తా చమురు సహజ వాయు క్షేత్రాలపై పాతిక సంవత్సరాల పాటు పనిచేసిన అనంతరం షెల్, రిలయన్స్, ఓఎన్‌జీసీలతో కూడిన జాయింట్ వెంచర్ ఆ చమురు క్షేత్రాలను తిరిగి ఓఎన్జీసీకి అప్పగించింది. ఈ ఏడాది డిసెంబర్ 21న ఒప్పందం ముగియటంతో వీటిని జాయింట్‌వెంచర్ సంస్థ ఓఎన్జీసీకి తిరిగి బదలాయించింది. ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ర్టీస్ ప్రెసిడెంట్ (ఈఅండ్‌పీ) బి. గంగూలీ మాట్లాడుతూ పన్నా-ముక్తా చమురు క్షేత్రం నుంచి దేశీ చమురు ఉత్పాదనలో దాదాపు ఆరు శాతం సమకూర్చామని ఇక 2007-08లో దేశ గ్యాస్ ఉత్పత్తిలో దాదాపు ఏడు శాతం ఇక్కడి గ్యాస్ క్షేత్రాల నుంచి సమకూరిందని చెప్పారు. దేశ చమురు, గ్యాస్ రంగంలో ఇతోథిక వృద్ధికి ఇంధనం సమకూర్చడం ద్వారా మెరుగైన పయనంలో రిలయన్స్ భాగస్వామిగా ఉందని అన్నారు. ఇక బీజీఈపీఐల్ ఎండీ త్రివిక్రమ్ అరుణ్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ ఓఎన్జీసీతో ప్రైవేట్ రంగ రిలయన్స్, అంతర్జాతీయ ఆయిల్ దిగ్గజం షెల్‌తో కలిసి ఏర్పాటైన ఈ జాయింట్ వెంచర్ ఇంధన రంగంలో అద్భుత ఉదాహరణగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. ఒప్పందం ముగియగానే చమురు, సహజవాయు క్షేత్రాలను తిరిగి సురక్షితంగా ఓఎన్జీసికి అప్పగించామని వెల్లడించారు. -
దేశీయ గ్యాస్ కంపెనీల కీలక నిర్ణయం
దేశీయ గ్యాస్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. గ్యాస్ క్షేత్రాలైన షెల్, రిలయన్స్, ఓఎన్జీసీ జేవీ పన్నా ముక్త క్షేత్రాలను ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ)కి డిసెంబర్21, 2019న అప్పగించనున్నారు. 25ఏళ్ల కార్యకలాపాల తర్వాత పన్నాముక్త క్షేత్రాలను ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీకి బదిలీ చేయనున్నారు. పన్నా ముక్త, పన్నా ముక్త తప్తి (పిఎంటి) జాయింట్ వెంచర్ భాగస్వాములుగా పన్నా ముక్త క్షేత్రాలను ఓఎన్జీసీకి అప్పగించనున్నారు. పీఎమ్టీ జేవీ విభాగాలలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు (ఓఎన్జీసీ)40శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు(ఆర్ఐఎల్)30శాతం, బీజీ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ ఇండియా లిమిటెడ్‌కు(బీజీఈపీఐఎల్)30 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బీజీఈపీఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ త్రివిక్రమ్ అరుణ్ మాట్లాడుతూ భారతదేశపు అతిపెద్ద జాతీయ ఆయిల్ కంపెనీ (ఒఎన్‌జిసి), అతిపెద్ద ప్రైవేట్ సంస్థ (రిలయన్స్) అంతర్జాతీయ ఆయిల్ కంపెనీల (షెల్)మధ్య విజయవంతమైన భాగస్వామ్యానికి పీఎమ్టీ జేవీ గొప్ప ఉదాహరణగా నిలిచిందని తెలిపారు. పన్నాముక్త క్షేత్రాలను ఓఎన్జీసీకి సురక్షితంగా అప్పగించేలా తమ బృందాలు కృషి చేశాయని అరుణ్ కొనియాడారు. దేశంలోని చమురు ఉత్పత్తిలో పన్నా ముక్తా క్షేత్రాలు దాదాపు 6%, గ్యాస్ ఉత్పత్తిలో 7% దోహదం చేసిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ బీ గంగూలీ పేర్కొన్నారు. -
రిలయన్స్ మరో ఘనత టాప్‌లోకి
న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మరో ఘనతను సాధించింది. తాజాగా ఫార్చూన్ ఇండియా– 500 జాబితాలో అగ్ర స్థానానికి చేరుకుంది. ఆదాయం పరంగా వెలువడిన ఈ జాబితాలో ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ను (ఐఓసీ) వెనక్కు నెట్టి తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఆర్ఐఎల్ రూ. 5.81 లక్షల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసినట్లు ఫార్చూన్ ఇండియా పేర్కొంది. వృద్ధి 41.5 శాతం ఉండగా.. పోటీ సంస్థ ఐఓసీతో పోల్చితే ఈ కంపెనీ వృద్ధి 8.4 శాతం అధికంగా ఉంది. ఐఓసీ అమ్మకాలు రూ.5.36 లక్షల కోట్లు కాగా, వృద్ధి 26.6 శాతం, లాభం రూ.39,588 కోట్లుగా ఉన్నాయి. ఇక గడిచిన 10 ఏళ్ల సగటు పరంగా చూస్తే.. ఈ కాలంలో ఐఓసీ ఆదాయం కంటే ఆర్ఐఎల్ ఆదాయం 3 రెట్లు అధికం. ఇక, 2015 ఆర్థిక సంవత్సరంలో ఐఓసీ రూ. 4,912 కోట్ల లాభాన్ని నమోదుచేయగా.. ఆర్ఐఎల్ 4 రెట్లు అధికంగా రూ. 23,566 కోట్ల లాభాన్ని కళ్లచూడటం విశేషం. ఓఎస్జీసీ స్థానం పదిలం గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా ఓఎన్జీసీ మూడవ స్థానంలో నిలిచింది. ఎస్బీఐ(4), టాటా మోటార్స్ (5), బీపీసీఎల్ (6) స్థానాల్లో ఉన్నాయి. అంతక్రితం ఏడాదిలో కూడా ఈ కంపెనీల జాబితా ఇదే వరుసలో ఉంది. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ 2019 జాబితాలో 7వ స్థానానికి చేరుకుంది. టాటా స్టీల్, కోల్ ఇండియా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), లార్సెన్ అండ్ టూబ్రో వరుసగా 8, 9, 10, 11 వ స్థానంలో ఉన్నాయి. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ రెండు మెట్లు ఎక్కి 12వ స్థానంలో నిలిచింది. ఆ తరువాత వరుస స్థానాల్లో హిందాల్కో ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉన్నాయి. కాగా, ఫార్చూన్ ఇండియా జాబితాలోని 500 కంపెనీల 2019 సగటు ఆదాయం 9.53 శాతం పెరగ్గా, లాభం 11.8 శాతం వృద్ధి చెందింది. -
‘మత్స్య సంపదకు ఇబ్బంది రాకూడదు’
సాక్షి, అమరావతి : తీర ప్రాంతాలలో జరిపే తవ్వకాల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే అనుమతులను మంజూరు చేస్తామని పంచాయతీరాజ్, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి హామీ ఇచ్చారు. గురువారం సచివాలయంలో ఓఎన్జీసీ, గెయిల్ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తీర ప్రాంతాల్లో ఆయిల్ నిక్షేపాలను వెలికి తీస్తున్న సంస్థలు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద మత్స్యకారుల సంక్షేమానికి తాము చేస్తున్న పనుల్లో రెండు శాతం తప్పని సరిగా చెల్లించాలని కోరారు. ఓఎన్జీసీ, గెయిల్ గతంలో మత్స్యకారుల అభివృద్ధి కోసం రూ. 150 కోట్లు ఇవ్వడానికి అంగీకరించినట్లు తెలిపారు. దానిలో చెల్లించాల్సిన బకాయిలు రూ.82.12 కోట్లు వెంటనే విడుదల చేయాలని సూచించారు. ఆయిల్ నిక్షేపాల వెలికితీత కారణంగా ఏర్పడే కాలుష్యం వల్ల మత్స్యకారుల వేటకు, వారు వేటాడే ప్రాంతాల్లోని మత్స్య సంపదకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
పర్యావరణం కలుషితం కాకుండా...
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రో మెకానికల్ ఇంజనీరింగ్ రంగంలో ప్రపంచంలోని తనదైన ముద్రవేసుకున్న మేఘా ఇంజనీరింగ్ ఇప్పుడు తాజాగా గ్యాస్ సరఫరా, పంపిణీకి విస్తృతం చేయనుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని మూడు జిల్లాలో ఆటోమొబైల్ గ్యాస్ సరఫరా చేస్తున్న మేఘా తాజాగా మరో శకాన్ని ప్రారంభించబోతోంది. మేఘా గ్యాస్ బ్రాండ్ పేరుతో గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారుకు పైపుల ద్వారా నేచురల్ గ్యాస్‌ను పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం పర్యావరణం కలుషితం కాకుండా... కేంద్రం కలను సాకారం చేసేలా మేఘా హైడ్రోకార్బన్స్ డివిజన్ సమగ్ర ప్రణాళికను రూపొందించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం 16 జిల్లాల్లో గ్యాస్ పంపిణీ కోసం ఏర్పాట్లు ప్రారంభించింది. ఇప్పటికే పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ నుంచి అనుమతులను పొందింది. అలాగే ఆటోమోబైల్ రంగానికి గ్యాస్ సరఫరా కోసం ఇప్పటికే 9 సీఎన్జీ స్టేషన్లను ప్రారంభించిన మేఘా ఇంజనీరింగ్ మరో అయిదు స్టేషన్లను వచ్చే మూడు నెలల్లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, కర్ణాటకలోని తూంకూరు, బెల్గాం జిల్లాల్లో గ్యాస్ పంపిణీని ప్రారంభించగా.. త్వరలో తెలంగాణ లో పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. నాగాయలంక, వెస్ట్ పెనుగొండ క్షేత్రాలు కీలకం కృష్ణా జిల్లా నాగాయలంక, వెస్ట్ పెనుగొండ ఆన్‌షోర్ గ్యాస్ క్షేత్రాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్యాస్ గ్రిడ్‌ను అభివృద్ధి పరిచేందుకు ఓఎన్జీసీ నుంచి వ్యూహాత్మకంగా పొందింది. ఈ గ్యాస్ క్షేత్రాల నుంచి రోజుకి లక్షా 30 వేల ఎస్సీఎం గ్యాస్‌ను తరలించనుంది. ఇందుకోసం అమెరికా నుంచి రప్పించిన మెకానికల్ రిఫ్రిజేషన్ యూనిట్లు, కంప్రెసర్లు వంటి అత్యధునిక యంత్రాలను ఉపయోగిస్తోంది. నాగాయలంక క్రేత్రం నుంచి నేచురల్ గ్యాస్‌ను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్టాజిల్లాలోని వినియోగదారులకు పంపిణీ చేస్తున్నది. ఏపీ, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలో ఇప్పటికే 1200 కిలోమీటర్ల పైప్‌లైన్ వేసింది. భవిష్యత్తు అవసరాల కోసం మరో 5000 కిలోమీటర్ల పైప్‌లైన్ వేయనుంది. గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం పైపుల ద్వారా నేచురల్ గ్యాస్ (పీఎన్జీ)ను, ఆటో మోబైల్ రంగానికి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ)ని సరఫరా చేయనుంది. తెలంగాణాలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అతి త్వరలో గ్యాస్ పంపిణీకి సన్నహాలను చేస్తున్నది. ఇప్పటికే యాదాద్రి భువనగిరి, వరంగల్ రూరల్ జిల్లాల్లో 12 కిలోమీటర్ల మేర పైపులైను వేయగా వచ్చే మూడు నెలల్లో మిగతా జిల్లాల్లో పైప్‌లైను పనులను విస్తరించి సేవలను ప్రారంభించడానికి సన్నద్ధం అవుతున్నది. మేఘా సీఎన్జీ స్టేషన్లు... కృష్ణా జిల్లాలో ఆటోమోబైల్ రంగానికి ఇప్పటికే 9 సీఎన్జీ స్టేషన్లను ప్రారంభించిన మేఘా గ్యాస్ మూడు నెలల్లో మరో ఐదు సీఎన్జీ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉన్న 9 సీఎన్జీ స్టేషన్ల ద్వారా ప్రతి నెలా నాలుగున్నర లక్షల ఎస్సీఎం గ్యాస్‌ను విక్రయిస్తున్నది. కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన ఐదు సీఎన్జీ స్టేషన్ల ద్వారా మరో మూడు లక్షల ఎస్సీఎం గ్యాస్ ను సరఫరా చేసే అవకాశం వుంది. అంచనాలకు మించి కర్ణాటకలోని బెల్గాం, తూంకూరు జిల్లా గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. తూంకూరు జిల్లాలోనే మొత్తం 12,500 మంది వినియోగదారులకు ప్రస్తుతం పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేస్తుండగా, ఈ నెలాఖారుకు మరో నాలుగు వేల గ్యాస్ కనెక్షన్లను ఇవ్వనుంది. వాణిజ్య వినియోగదారుల నుంచి ప్రతి నెలా లక్షా 40 వేల ఎస్సీఎం గ్యాస్ పంపిణీ చేస్తుండగా, త్వరలోనే ఈ డిమాండ్ రెట్టంపు కానుంది. -
ఓఎన్జీసీలో మరోసారి గ్యాస్‌లీక్ వార్తలు, కలకలం
సాక్షి, ముంబై: ముంబైలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో మరోసారి ప్రమాదం సంభవించిందన్నవార్తలు కలకలం రేపాయి. గ్యాస్ లీక్ అవుతోందని, చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నట్టు వచ్చిన వార్తలు ప్రకంపనలు పుట్టించాయి. నవీ ముంబైలోని యురాన్ ప్లాంట్ అగ్నిప్రమాదం విషాదం జరిగిన 20 రోజుల్లోనే మరో ఉదంతం అంటూ వచ్చిన పలు నివేదికలు స్థానికుల్లో ఆందోళన పుట్టింటాయి. అయితే ఈ నివేదికలపై ప్రభుత్వ యాజమాన్య సంస్థ స్పందించింది. అలాంటి దేమీలేదని ఆందోళన వద్దని తెలిపింది. సీనియర్ అధికారులు దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. గ్యాస్‌లీక్ లాంటి సంఘటన ఏదీ సంభవించలేదని సంస్థ ట్వీటర్ ద్వారా వివరణ ఇచ్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సెప్టెంబరు 25 ఉదయం హైడ్రోకార్బన్ వాసన వ్యాపించిందని పేర్కొంది. ఈ విషయంలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ప్రకటించింది. అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, ప్లాంట్ సాధారణంగా నడుస్తుందని కంపెనీ తెలిపింది. కాగా నవీ ముంబైలోని యురాన్‌లోని ఓఎన్జిసి ప్లాంట్‌లో సెప్టెంబర్ 3న భారీగా మంటలు చెలరేగినఘటనలో నలుగురు మృతి చెందారు. మరణించిన నలుగురిలో ముగ్గురు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్ఎఫ్) సిబ్బంది ఉన్న సంగతి తెలిసిందే. చదవండి : ఓఎన్జీసీ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం At #ONGC Uran plant smell of hydrocarbon felt early Morning which was spread due to incessant rains. There is no leakage. All precautionary measures in place. Plant is running normal.There is nothing to panic. @CMD_ONGC @pallab_ongc — ONGC (@ONGC_) September 25, 2019 -
అసోంలో ఓఎన్జీసీ రూ.13,000 కోట్ల పెట్టుబడి..
గౌహతి: అస్సామ్‌లో చమురు అన్వేషణ, ఉత్పత్తి నిమిత్తం ఐదేళ్లలో రూ.13,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని ఓఎన్జీసీ తెలిపింది. ఈ విషయమై అస్సామ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని ఓఎన్జీసీ(ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్) వెల్లడించింది. 2022 కల్లా దిగుమతులను 10% మేర తగ్గించుకోవాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈ పెట్టుబడులు పెడుతున్నామని పేర్కొంది. నార్త్ఈస్ట్ హైడ్రోకార్బన్ విజన్ 2030లో భాగంగా ఈ పెట్టుబడుల ప్రణాళికను రూపొందించామని ఓఎన్జీసీ వివరించింది. అస్సామ్‌లోని జోర్హాట్, గోల్హాట్ జిల్లాల్లో ఆరు బావులు, ఐదు మైనింగ్ బ్లాక్‌ల్లో డ్రిల్లింగ్ కోసం ఆమోదాలు పొందామని తెలిపింది. ఇలాంటి 12 బావుల్లో డ్రిల్లింగ్ నిమిత్తం అనుమతుల కోసం వేచి చూస్తున్నామని పేర్కొంది. -
ఓఎన్జీసీ లాభం రూ.5,904 కోట్లు
న్యూఢిల్లీ: తగ్గిన చమురు ధరల ప్రభావం ఓఎన్జీసీ లాభాలపై పడింది. అయినప్పటికీ లాభాల క్షీణతను 4 శాతానికి పరిమితం చేసి జూన్ క్వార్టర్లో రూ.5,904 కోట్లను ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.6,144 కోట్లుగా ఉండడం గమనార్హం. ఆదాయం 2.4 శాతం తగ్గి రూ.26,555 కోట్లకు పరిమితం అయింది. ప్రతీ బ్యారెల్ చమురును ఉత్పత్తి చేసి విక్రయించడం ద్వారా రూ.66.30 డాలర్లను ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది ప్రతీ బ్యారెల్‌పై 71.49 డాలర్లుగా ఉంది. సహజ వాయివు ధర మాత్రం ప్రతీ మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్‌పై 3.69 డాలర్లకు పెరిగింది. చమురు ఉత్పత్తి 5 శాతం వరకు తగ్గి 4.8 మిలియన్ టన్నులుగా ఉందని, దీర్ఘకాలంగా ఉత్పత్తి జరుగుతున్న క్షేత్రాల్లో ఉత్పత్తి సహజంగానే తగ్గిందని తెలిపింది. సహజ వాయివు ఉత్పత్తి మాత్రం 4 శాతం పెరిగి 6.15 బిలియన్ క్యుబిక్ మీటర్లుగా ఉన్నట్టు వెల్లడించింది. జూన్ త్రైమాసికంలో కొత్తగా నాలుగు క్షేత్రాల్లో నిక్షేపాలను గుర్తించినట్టు తెలిపింది. మంగళవారం బీఎస్ఈలో ఓఎన్జీసీ షేరు 1.72% దిగజారి రూ. 128 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయి రూ.126ని తాకింది. -
కేజీ బేసిన్.. చమురు నిక్షేపాలు దొరికెన్!
నరసాపురం: కృష్ణా, గోదావరి (కేజీ) బేసిన్ పరిధిలోని ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో చమురు నిక్షేపాల కోసం ప్రభుత్వరంగ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) అధికారులు రెండేళ్లుగా చేస్తున్న అన్వేషణ సత్ఫలితాలనిచ్చింది. తాజాగా చమురు నిక్షేపాల కోసం అధికారులు వేగం పెంచి విస్తృతంగా అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లాలో నాలుగుచోట్ల అపారంగా గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. ఇవన్నీ కొత్త బావులు కావడం విశేషం. ఇప్పటికే రెండుచోట్ల సర్వే డ్రిల్లింగ్ పనులు పూర్తి చేశారు. మిగిలిన రెండు చోట్ల కూడా గ్యాస్ వెలికితీతకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేజీ బేసిన్ పరిధిలో నరసాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో మూడు దశాబ్దాలుగా తవ్వుతున్న బావులు ఖాళీ అయ్యాయి. దీంతో ఉత్పత్తిని పెంచేందుకు ఓఎన్జీసీ రెండేళ్ల నుంచి నరసాపురం, పాలకొల్లు, యలమంచిలి, మార్టేరు, పెనుగొండ, భీమవరం ప్రాంతాల్లో అన్వేషణ ప్రారంభించింది. మార్టేరు, పెనుగొండ ప్రాంతాల్లో పెద్దస్థాయిలో, మొగల్తూరు మండలం ఆకెనవారితోట, భీమవరం సమీపంలోని మహాదేవపట్నం, వేండ్ర వద్ద మొత్తం నాలుగుచోట్ల చమురు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించి, వెలికితీతకు ఉపక్రమించారు. నాలుగు దశాబ్దాలుగా కార్యకలాపాలు నాలుగు దశాబ్దాలుగా నరసాపురం కేంద్రంగా ఓఎన్జీసీ కార్యకలాపాలు సాగుతున్నాయి. అయితే మూడు దశాబ్దాల పాటు ఓఎన్జీసీ కేవలం ఆన్షోర్పైనే దృష్టి పెట్టింది. రిలయన్స్, గెయిల్ వంటి ప్రైవేట్ ఆయిల్‌రంగ సంస్థలు రంగప్రవేశం చేయడంతో వాటి పోటీని తట్టుకోవడానికి ఓఎన్జీసీ 2006 నుంచి సముద్రగర్భంలో అన్వేషణలపై దృష్టి సారించింది. ప్రస్తుతం నరసాపురం నుంచి కాకినాడ వరకు సముద్రగర్భంలో డ్రిల్లింగ్ జరుగుతోంది. నరసాపురం మండలం చినమైనవానిలంక తీరానికి సమీపంగా సముద్రగర్భంలో గ్యాస్ వెలికితీత ప్రారంభమైంది. అదనపు ఉత్పత్తిలో లక్ష్యాన్ని చేరుకోవడానికి ఓఎన్జీసీ ప్రస్తుతం ఇదే ప్రధాన వనరుగా భావిస్తోంది. ఆన్‌షోర్‌కు సంబంధించి పశ్చిమగోదావరి జిల్లాలో కవిటం, నాగిడిపాలెం, ఎస్–1 వశిష్టాబ్లాక్, 98–2 ప్రాజెక్ట్‌లో, తూర్పుగోదావరి జిల్లా కేశనపల్లి, కృష్ణా జిల్లా బంటుమిల్లి, నాగాయలంక ప్రాంతాల్లో గత కొంతకాలంగా చేపట్టిన అన్వేషణలు పూర్తయ్యాయి. మరో రెండు, మూడు నెలల్లో వీటి ద్వారా ఉత్పత్తి ప్రారంభమవుతుందని ఓఎన్జీసీ అధికారులు చెపుతున్నారు. 25 శాతం ఉత్పత్తి పెంపు లక్ష్యంగా.. రానున్న ఏడాది మరో 25 శాతం ఉత్పత్తి పెంపు కోసం ఓఎన్జీసీ ప్రయత్నాలు సాగిస్తోంది. రోజుకు 35 నుంచి 40 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్, 1,400 టన్నుల ఆయిల్ వెలికితీయడమే లక్ష్యంగా ముందుకెళుతోంది. గ్యాస్ వెలికితీతలో ఇప్పటికే దేశంలో మొదటి స్థానాన్ని దక్కించుకున్న ఓఎన్జీసీ.. ఇదే దూకుడుతో లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఆఫ్‌షోర్ (సముద్రగర్భం)లో అన్వేషణలకు సంబంధించి నరసాపురం తీరంలో చురుగ్గా కార్యకలాపాలు సాగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాదే అగ్రస్థానం కొత్తగా జిల్లాలో కనుగొన్న బావుల నుంచి ఉత్పత్తి ప్రారంభమైతే, రోజుకు ఇక్కడి నుంచి 4 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ వెలికితీయవచ్చని ఓఎన్జీసీ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కేజీ బేసిన్లో ఓఎన్జీసీ రోజుకు 33 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్, 900 టన్నుల ఆయిల్‌ను వెలికితీస్తోంది. ఇందులో పశ్చిమగోదావరి జిల్లా నుంచే రోజుకు 10 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. కొత్త బావుల ద్వారా మరో 4 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి ఇక్కడి నుంచి పెరిగితే ఈ జిల్లాదే అగ్రస్థానం అవుతుంది. -
అక్షరాభ్యాసం చేయుంచిన మహిళా మంత్రి
సాక్షి, కొవ్వూరు: ఐసీడీఏస్ కొవ్వూరులోని లిటరి క్లబ్లో పోషక పదార్థాలు కలిగిన తినుబండారాల స్టాల్‌ను నిర్వహించింది. ఓఎన్జీసీ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ స్టాల్లో ఐసీడీఎస్ వివిధ రకాల పోషకాహర పదార్థాలను ఏర్పాటు చేసింది. గర్భిణి స్ర్తీలకు, పిల్లలకు పోషక పదార్థాలు అందేలా చూసి, వారికి అవగాహన కల్పించడంమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. మంత్రి తానేటి వనిత స్టాల్స్‌ను సందర్శించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే అంగన్వాడి విద్యార్థులకు తన చేతుల మీదుగా అక్షరాభ్యాసం చేయించి ఆనంతరం ఆమె పిల్లలకు స్కూల్ బ్యాగ్‌లను, పలకలను పంపిణీ చేశారు. -
ఆయిల్, చమురు బ్లాక్‌ల వేలం...
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ఇండియా, ఓఎన్ జీసీతోపాటు అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత లిమిటెడ్ తాజాగా ముగిసిన చమురు, గాయ్స్ బ్లాక్‌ల వేలంలో టాప్–3గా నిలిచాయి. రెండో దశ ఓపెన్ యాక్రేజ్ లైసెన్సింగ్ పాలసీ (ఓఏఎల్‌పీ) కింద 14 ఆయిల్, గ్యాస్ బ్లాక్‌లు, మూడో దశ ఓఏఎల్‌పీ కింద మరో 18 ఆయిల్, గ్యాస్, 5 కోల్బెడ్ మీథేన్ బ్లాక్‌లను కేంద్రం ప్రభుత్వం వేలానికి ఉంచింది. వీటిల్లో ఆయిల్ ఇండియాకు 12, ఓఎన్ జీసీకి 9, వేదాంతకు తొమ్మిది చొప్పున మొత్తం 30 బ్లాక్‌లు ఈ మూడు కంపెనీలకే దక్కనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. రిలయన్స్–బీపీ సంయుక్తంగా కృష్టా గోదావరి బేసిన్ (కేజీ బేసిన్ )లో ఓ బ్లాక్‌ను దక్కించుకోనున్నాయి. ఈ బ్లాక్‌ను ఓఎన్ జీసీ కంటే మించి బిడ్ చేయడం ద్వారా రిలయన్స్–బీపీలు దక్కించుకోవడం విశేషం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స వివిధ కంపెనీలు సమర్పించిన బిడ్లను పరిశీలన పూర్తి చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో ఓఎన్ జీసీ, వేదాంత తొమ్మిది బ్లాకుల్లో టాప్ బిడ్డర్లుగా, 12 బ్లాక్‌ల్లో ఆయిల్ ఇండియా టాప్‌లో ఉన్నట్టు చెప్పాయి. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం అనంతరం విజేతలను ప్రకటించనున్నట్టు తెలిపాయి. 2017 జూలైలో కేంద్రం నూతనంగా ఓఏఎల్‌పీ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద కంపెనీలు తమంతట తామే ఫలానా ప్రాంతంలో అన్వేషణ, ఉత్పత్తి విషయంలో ఆసక్తిని తెలియజేయవచ్చు. -
కుమురం భీం జిల్లాలో ఆయిల్ నిక్షేపాలు!
సిర్పూర్(టి): కుమురంభీం, మంచిర్యాల జిల్లాల పరిసరప్రాంతాల్లో ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో తేలడంతో నిపుణులు సర్వే చేస్తున్నారు. ఓఎన్జీసీఆధ్వర్యంలో చేపట్టిన ఈసర్వేలో కుమురంభీం జిల్లా పరిధిలో నికాగజ్నగర్, సిర్పూర్(టీ), దహెగాం, పెంచికల్ పేటమండలాల్లో ఈ నిక్షేపాలు ఉన్నట్లుగుర్తించారు. గత నాలుగు రోజులుగా ఇక్కడ నిపుణుల ఆధ్వర్యంలో సర్వేపనులు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో కేబుల్ కనెక్షన్లు వేసి అధునాతన పరికరాలతో చేస్తున్న సర్వే మొదటిదశపూర్తికావస్తోంది. ప్రస్తుతం అందుతున్న వివరాల ప్రకారంఎనిమిదినెలలపాటుపరీక్షలునిర్వహించినిక్షేపాలుకచ్చితంగా లభ్యమయ్యేప్రాంతాలనుగుర్తిస్తామనిఓఎన్జీసీఅధికారులుచెబుతున్నారు. శుక్రవారంసిర్పూర్(టీ) మండలకేంద్రంలోనిదుబ్బగూడకాలనీప్రాంతంలోసర్వేనిర్వహించడంతోపాటుఎంపికచేసినస్థలాల్లోడ్రిల్లింగ్చేసిపరీక్షలు నిర్వహించారు. అలాగేశనివారంసిర్పూర్(టీ), నవేగాం, హుడ్కిలిగ్రామాల్లోకేబుళ్లనుఅమర్చికంప్యూటర్లలో పరిశీలిస్తూ, డ్రిల్లింగ్‌చేశారు. దీనికిముందుగాకాగజ్నగర్మండలంలోనిఅనుకోడ, చుంచుపల్లి, గన్నారం, చింతకుంటగ్రామాలమీదుగాకేబుల్లైన్లువేస్తూసర్వేనిర్వహించారు. డ్రిల్లింగ్చేయగావచ్చేధ్వనితరంగాలద్వారానిక్షేపాలనుపసిగడుతున్నట్లు తెలుస్తోంది. కుమురంభీం– మంచిర్యాల– భద్రాచలంమీదుగా.. రెండవదశ సర్వేకాగజ్నగర్ మండలంలోని పెద్దవాగునుంచి కుమురంభీం జిల్లాతోపాటు మంచిర్యాలజిల్లా మీదుగా భద్రాచలం జిల్లాల్లో ప్రాథమిక సర్వేలునిర్వహిస్తామని సంస్థ అధికారులు తెలిపారు. ఈ జిల్లాల్లోని అన్ని మండలాల్లో ప్రాథమిక పరీక్షలు నిర్వహించి 8 నెలలపాటు సర్వే చేయనున్నట్లువెల్లడించారు. నిక్షేపాలున్న స్థలాలను గుర్తించి పూర్తిస్థాయి సర్వేలుచేపడతామని తెలిపారు. కుమురంభీంజిల్లాతోపాటు మంచిర్యాల పరిసరప్రాంతాల్లోని భీమిని మండలంనందుగులగూడ గ్రామ పరిసరాల్లో ఆయిల్, గ్యాస్ నిక్షేపాలున్నట్లు పేర్కొన్నారు. పూర్తిస్థాయిసర్వేలు చేపడతాం కుమురం భీంజిల్లాలోనిపలుగ్రామాల్లోఓఎన్జీసీఆధ్వర్యంలో ఆయిల్, గ్యాస్ నిక్షేపాల కోసంప్రాథమికసర్వేలు చేపడుతున్నాం. సర్వేల రిపోర్టు లు, డ్రిల్లింగ్‌లో వెల్లడైన ఫలితాల ఆధారంగా 8 నెలలపాటు పూర్తిస్థాయి సర్వేలు చేపడతాం. నిక్షేపాల తీరునుబట్టి స్థానికంగా వెలికితీత ప్రారం భమవుతుంది. – సత్తిబాబు, ఓఎన్జీసీ, పీఆర్వో -
గ్యాస్, యూరియా రేట్లకు రెక్కలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సహజ వాయువు ధరలు 10 శాతం మేర పెరగనున్నాయి. మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరనున్నాయి. దీంతో సీఎన్జీ, పైపుల ద్వారా సరఫరా చేసే వంట గ్యాస్ రేట్లతో పాటుయూరియా ఉత్పత్తి వ్యయాలు కూడా పెరగనున్నాయి. ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య ఆర్నెల్ల వ్యవధికి గాను దేశీయంగా ఉత్పత్తి చేసే సహజవాయువు రేటు మిలియన్ బ్రిటీష్ థర్మల్ యూనిట్‌కు (ఎంఎంబీటీయూ) 3.69 డాలర్లకి చేరనుంది. ప్రస్తుతం ఇది యూనిట్‌కు 3.36 డాలర్లుగా ఉంది. మరోవైపు, సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధర యూనిట్‌కు 7.67 డాలర్ల స్థాయి నుంచి 9.32 డాలర్లకు పెరగనుంది. గ్యాస్ రేట్లను పెంచడం ఇది వరుసగా నాలుగోసారి. 2015 అక్టోబర్– 2016 మార్చి మధ్య కాలంలో గ్యాస్ రేటు అత్యధికంగా యూనిట్‌కు 3.82 డాలర్లుగా నమోదైంది. ధర పెంపునకు సంబంధించి ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. ప్రతి ఆరు నెలలకోసారి గ్యాస్ ధరను సవరించడం సాధారణంగా జరిగేదే. అయితే, ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నోటిఫికేషన్‌కు ఎన్నికల సంఘం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందా అన్న అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఓఎన్జీసీ, రిలయన్స్‌కు మేలు.. సాధారణంగా ప్రతి ఆర్నెల్లకోసారి ఏప్రిల్ 1న, అక్టోబర్ 1న దేశీయంగా ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరలను సవరిం చడం జరుగుతుంది. మిగులు గ్యాస్ ఉన్న అమెరికా, రష్యా, కెనడా వంటి దేశాల సగటు రేట్ల ప్రాతిపదికన గ్యాస్ రేటును సవరిస్తారు. అమెరికాలోని హెన్రీ హబ్, బ్రిటన్‌లోని నేషనల్ బ్యాలెన్సింగ్ పాయింట్, అల్బెర్టా(కెనడా), రష్యాల్లో గత త్రైమాసికంలో ఉన్న సగటు రేటు ఆధారంగా దేశీ గ్యాస్ ధరను లెక్కేస్తారు. ధర పెంచడం వల్ల సహజ వాయువు ఉత్పత్తి చేసే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ), రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి సంస్థల ఆదాయాలు పెరగనుండగా, మరోవైపు.. సహజవాయువు ముడివనరుగా తయారయ్యే ఎరువులు, పెట్రోకెమికల్స్, సీఎన్జీ, పైప్డ్ గ్యాస్ మొదలైనవి భారం కానున్నాయి. గ్యాస్ ధర 1 డాలరు మేర పెరిగితే వార్షికంగా ఓఎన్జీసీ వంటి సంస్థకు రూ. 4,000 కోట్ల అదనపు ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం భారత్ సహజ వాయువు అవసరాల్లో దాదాపు సగభాగాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఇందుకోసం దేశీయంగా ఉత్పత్తయ్యే గాయ్స్ కన్నా రెట్టింపు రేటు చెల్లించాల్సి వస్తోంది. -
ఐవోసీ, ఓఎన్జీసీపై డివిడెండ్ ఒత్తిడి
న్యూఢిల్లీ: పన్ను ఆదాయాలు ఆశించినంత స్థాయిలో కనిపించని నేపథ్యంలో ఆ లోటును భర్తీ చేసుకునే మార్గాలపై కేంద్రం దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండోసారి మధ్యంతర డివిడెండ్ ఇచ్చేలా ప్రభుత్వ రంగ దిగ్గజాలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ)లపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ అంశంపై చర్చించేందుకు మార్చి 19న ఐవోసీ బోర్డు సమావేశం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, నెల రోజుల వ్యవధిలో మరోసారి మధ్యంతర డివిడెండ్ చెల్లించేంతగా మిగులు నిధులు తమ వద్ద లేవని కేంద్రానికి ఓఎన్జీసీ తెలిపినట్లు సమాచారం. ఐవోసీ డిసెంబర్లో షేరు ఒక్కింటికి రూ. 6.75 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించడంతో పాటు షేర్ల బైబ్యాక్ ద్వారా రూ. 4,435 కోట్ల ప్రభుత్వానికి అందించింది. ఇక ఫిబ్రవరి 14న ఓఎన్జీసీ షేరుకి రూ. 5.25 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. అలాగే రూ. 4,022 కోట్ల మేర షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు కూడా ఆమోదముద్ర వేసింది. నిబంధనల ప్రకారం కేవలం నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు మధ్యంతర డివిడెండ్ ఇవ్వడం కుదరదు. ఇందుకోసం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని, ఒకవేళ ఆమోదం లభించినా.. ఇప్పటికే ప్రకటించిన మధ్యంతర డివిడెండు, షేర్ల బైబ్యాక్‌కు నిధులు ఖర్చు చేసేస్తే రెండో మధ్యంతర డివిడెండ్ ఇచ్చేంత నిధులు ఉండవని ఓఎన్జీసీ చెబుతోంది. వస్తు, సేవల పన్నుల వసూళ్లు రూ. 30,000–40,000 కోట్లు, ప్రత్యక్ష పన్నుల వసూళ్లు కూడా దాదాపు అదే స్థాయిలో తక్కువగా ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో నిర్దేశిత ద్రవ్య లోటు లక్ష్యం 3.4 శాతంలోపు కట్టడి చేసేందుకు కేంద్రం నానా తంటాలు పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆదాయ లోటు భర్తీకి మార్గాలు అన్వేషిస్తోంది. -
ఓఎన్జీసీ, ఆర్ఐఎల్కు గ్యాస్ ధరల్లో స్వేచ్ఛ!
న్యూఢిల్లీ: ఉత్పత్తి లాభసాటి కాదని గ్యాస్ క్షేత్రాలను పక్కన పెట్టిన ఓఎన్జీసీ, ఆర్ఐఎల్... వాటి విషయంలో పునరాలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే దేశీయంగా గ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు ధరల్లో స్వేచ్ఛనివ్వటం, తక్కువ రాయల్టీని వసూలు చేయటం వంటి కీలక నిర్ణయాలను కేంద్రం తీసుకుంది. అన్వేషణ పూర్తయి అభివృద్ధి చేయాల్సిన క్షేత్రాల విషయంలో ఈ కంపెనీలకు ధరల పరంగా పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలని కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. అలాకాకుండా ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న క్షేత్రాల్లో గనక ఉత్పత్తిని పెంచితే... వాటిపై తక్కువ రాయల్టీని వసూలు చేయాలని నిర్ణయించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ కొత్త అన్వేషణ విధానాన్ని ఆమోదించామని, ఇందులో దేశీయంగా చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు పలు ప్రోత్సాహకాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఓఎన్జీసీ 12 ఆవిష్కరణలను (గ్యాస్/చమురు క్షేత్రాల్లో) ఉత్పత్తి లేకుండా పక్కన పెట్టింది. ప్రభుత్వం నిర్ణయించిన ప్రస్తుత ధరల కంటే ఈ క్షేత్రాల్లో ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉండడమే దీనికి కారణం. రిలయన్స్ ఈస్ట్‌కోస్ట్ బ్లాక్ ఎన్ఈసీ–25 వద్ద ఆవిష్కరణల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక, ప్రభుత్వరంగ ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాలకు కేటాయించిన క్షేత్రాల్లో అదనపు ఉత్పత్తిపై 10% రాయల్టీ తగ్గింపు ఇవ్వనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వానికి అధిక వాటా ఆఫర్ చేసే కంపెనీలకు చమురు, గ్యాస్ బ్లాక్‌లను కేటాయించే ప్రస్తుత విధానం నుంచి, గతంలో అనుసరించిన అన్వేషణ పనితీరు ఆధారిత కేటాయింపులకు మళ్లాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వెల్లడించాయి. ఇప్పటికే వాణిజ్య ఉత్పత్తిని గుర్తించిన కేటగిరీ–1లోని బ్లాక్‌లను పనితీరుతోపాటు 70:30 రేషియోలో వాటాల పంపిణీపై కేటాయించనున్నట్టు తెలిపాయి. 2, 3వ కేటగిరీల్లోని బ్లాక్‌లను మాత్రం పూర్తిగా కంపెనీల అన్వేషణ, ఉత్పత్తి పనితీరు ఆధారంగానే కేటాయించనున్నట్టు చెప్పాయి. -
ఓఎన్జీసీ లాభం 8,267 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం, ఓఎన్జీసీ ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో భారీ నికర లాభాన్ని సాధించింది. గత క్యూ3లో రూ.5,015 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో 65 శాతం ఎగసి రూ.8,263 కోట్లకు పెరిగిందని ఓఎన్జీసీ తెలిపింది. షేర్ పరంగా చూస్తే, ఒక్కో షేర్‌కు నికర లాభం రూ.3.91 నుంచి రూ.6.44కు పెరిగిందని పేర్కొంది. చమురు ఉత్పత్తి తగ్గినా, ధరలు అధికంగా ఉండటంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని వివరించింది. గత క్యూ3లో రూ.22,996 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో రూ.27,694 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఒక్కో షేర్‌కు రూ.5.25 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది. మొత్తం డివిడెండ్ చెల్లింపులు రూ.6,605 కోట్లుగా ఉంటాయని పేర్కొంది. ∙గత క్యూ3లో బ్యారెల్ చమురును 58.42 డాలర్లకు ఈ కంపెనీ విక్రయించింది. ఈ క్యూ3లో ధర 14% ఎగసి 66.38 డాలర్లకు పెరిగింది. గ్యాస్ ధర 163% వృద్ధితో 3.36 డాలర్లకు ఎగిసింది. ∙క్యూ3లో క్రూడ్ ఉత్పత్తి 5% క్షీణించి 6.03 మిలియన్ టన్నులకు తగ్గింది. గ్యాస్ ఉత్పత్తి 7% ఎగసి 6.7 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పెరిగింది. ∙కచ్ తీరంలో, మధ్య ప్రదేశ్‌లోని వింధ్య బేసిన్లో, అస్సామ్, పశ్చిమ తీర ప్రాంతాల్లో చమురు, గ్యాస్ నిక్షేపాలను ఈ కంపెనీ కొనుగొన్నది. ∙ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా మొత్తం 11 చోట్ల చమురు,గ్యాస్ నిక్షేపాలను కనుగొనగా, ఈ క్యూ3లో 4 కొత్త అన్వేషణలను కనుగొన్నది. -
ఎట్టకేలకు చేరింది
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం రూరల్: ఓఎన్జీసీలో చమురు, గ్యాస్ తవ్వకాలకు వినియోగించే శక్తిమంతమైన రేడియోధార్మిక మూలకం సీఎస్–137 కంటైనర్ సురక్షితంగా గురువారం తెల్లవారుజామున ఓఎన్జీసీ బేస్‌కాంప్లెక్స్‌కు చేర్చారు. మాయమైన మూలకం కంటైనర్‌ను కృష్ణాజిల్లా కలిదిండిలో గుర్తించిన విషయం తెలిసిందే. ఈనెల 12న కృష్ణాజిల్లా మల్లేశ్వరానికి ప్రత్యేక వాహనంలో తీసుకువెళ్లి, తిరిగి ఈనెల 14న బేస్‌కాంప్లెక్స్‌కు తీసుకువచ్చారు. ఈనెల 16న పరిశీలించగా లాగింగ్ యూనిట్‌కు ఉండాల్సిన రేడియోధార్మిక మూలకం సీఎస్–137 కంటైనర్ కనిపించలేదు. దీంతో ఈనెల 17వతేదీన ఓఎన్జీసీ అధికారులు బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్బన్ జిల్లా ఎస్పీ షిమూషీబాజ్‌పాయ్ ఆదేశాల మేరకు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టి కృష్ణాజిల్లా కలిదిండి పాత ఇనుపదుకాణంలో ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ టీమ్, ఓఎన్జీసీ అధికారులు సంయుక్తంగా రేడియో ధార్మికమూలకం సీఎస్–137 కంటైనర్‌ను సురక్షితంగా ఓఎన్జీసీ బేస్‌కాంప్లెక్స్‌కు చేర్చారు. జాకీగా భావించి రూ.540కు విక్రయం రేడియోధార్మిక మూలకం సీఎస్–137 ఓఎన్జీసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రోడ్డుపై జారిపడిపోయినట్టు భావిస్తున్నారు. అది వ్యక్తికి దొరకగా దానిని లారీటైర్లు విప్పే జాకీగా భావించి కలిదిండి గ్రామంలోని పాత ఇనుపసామాన్ల దుకాణంలో 27కిలోల కంటైనర్‌ను కిలో రూ.20 చొప్పున రూ.540కు విక్రయించినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అధికారుల ఫిర్యాదులో పేర్కొన్న విధంగా రూ.35లక్షలు దానిని రూ.540కు విక్రయించడం గమనార్హం. -
రేడియోధార్మిక పరికరం మిస్సింగ్ కేసును చేధించాం
-
సీఎస్-137 మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులు
సాక్షి, రాజమండ్రి: ప్రమాదకరమైన రేడియో ధార్మిక పదార్థం సీఎస్-137 మిస్సింగ్ కేసును పోలీసులు చేధించారు. రాజమండ్రిలోని ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ నుంచి ఈ రేడియో ధార్మిక పదార్థం వారం క్రితం చోరికి గురైంది. దీంతో ఓఎన్జీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు కృష్ణా జిల్లా కలిదిండిలోని పాత ఇనుప సామాగ్రి దుకాణంలో ఈ పరికరాన్ని గుర్తించారు. ఈ ఘటనపై రాజమండ్రి అర్బన్ ఎస్పీ షిమోషి మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 16వ తేదీన ఓఎన్జీసీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. సీఎస్-137 ప్రస్తుతం సేఫ్‌గానే ఉందని వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్, ఓఎన్జీసీ సహకారంతో ఈ రేడియో ధార్మిక పరికరాన్ని జాగ్రత్తగా కృష్ణా జిల్లా నుంచి రాజమండ్రికి తరలిస్తామని పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుల వివరాల విచారణ అనంతరం బయటపెడతామని అన్నారు. కాగా ఈ రేడియో ధార్మిక పదార్థం వాతావరణంలో అత్యంత వేగంగా కలిసిపోతుందని, దాని ప్రభావం మనుషులతో పాటు ఇతర జీవులు, వాతావరణంపై కూడా ఉంటుందని రసాయన శాస్త్ర నిపుణులు హెచ్చరించారు. దీంతో ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు ఈ కేసు విజయవంతంగా చేధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
ఎన్ఎండీసీ షేర్ల బైబ్యాక్‌కు కేంద్రం ఓకే
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇనుప ఖనిజ మైనింగ్ కంపెనీ ఎన్ఎండీసీ.. రూ.1,000 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేయనుంది. ఆర్థిక శాఖ మంగళవారం దీనికి ఆమోదం తెలిపింది. బైబ్యాక్ విధి విధానాలు, తేదీలను ఎన్ఎండీసీ డైరెక్టర్ల బోర్డ్ నిర్ణయించనుంది. బైబ్యాక్ కారణంగా ఎన్ఎండీసీలో 72.43% వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి ప్రయోజనం కలుగుతుంది. డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్య సాధన కోసం షేర్లను బైబ్యాక్ చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ఒత్తిడిచేస్తోంది. దీంట్లో భాగంగా ఇప్పటికే 9కు పైగా ప్రభుత్వ రంగ కంపెనీలు షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించాయి. ఈ జాబితాలో ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, ఐఓసీ, ఎన్‌హెచ్‌పీసీ, భెల్, నాల్కో, కొచ్చిన్ షిప్‌యార్డ్, ఎన్‌ల్‌సీ, కేఐఓసీఎల్‌లు ఉన్నాయి. ఈ కంపెనీల షేర్ల బైబ్యాక్ కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ.9,000 కోట్లు సమకూరుతాయని అంచనా. కాగా, బీఎస్ఈలో ఎన్ఎండీసీ షేర్ 0.1 శాతం తగ్గి రూ.95 వద్ద ముగిసింది. -
ఐఓసీ, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ... బెస్ట్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలో 2017–18 సంవత్సరంలో అత్యంత లాభదాయక కంపెనీలుగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ ముందున్నాయి. అదే సమయంలో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఎయిర్ ఇండియా అధిక నష్టాలతో ఉన్నవిగా నిలిచాయి. పార్లమెంటు ముందు ప్రభుత్వం ఉంచిన పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సర్వేలో ఈ వివరాలు పేర్కొన్నారు. ప్రభుత్వరంగ కంపెనీల పనితీరుకు సంబంధించి సమగ్ర వివరాలు చూస్తే... ► ప్రభుత్వానికి ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టిన వాటిల్లో ఐవోసీఎల్ వాటా 13.37 శాతం, ఓఎన్జీసీ 12.49 శాతం, ఎన్టీపీసీ 6.48 శాతం వాటా కలిగి ఉన్నాయి. కోల్ ఇండియా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ లాభదాయత పరంగా నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచాయి. ► టాప్–10 లాభదాయక ప్రభుత్వ కంపెనీల్లో పవర్ ఫైనాన్స్ కూడా చోటు సంపాదించింది. ► ప్రభుత్వరంగంలో 184 కంపెనీలు లాభాలను నమోదు చేస్తే, ఈ లాభాల్లో 61.83 శాతం అగ్ర స్థాయి 10 కంపెనీలదే. ► 2017–18లో 71 ప్రభుత్వరంగ కంపెనీలు నష్టాలను నమోదు చేయగా, మొత్తం నష్టాల్లో 84.71 శాతం టాప్–10 కంపెనీలవే ఉన్నాయి. ఇందులోనూ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఎయిర్ఇండియా ఉమ్మడి నష్టాలే 52.15 శాతం. ► భారత్ కోకింగ్ కోల్, ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్, ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ నష్టాలను ఎదుర్కొంటున్న జాబితాలో ఉన్నాయి. ► స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన 52 ప్రభుత్వరంగ సంస్థల ఉమ్మడి మార్కెట్ క్యాప్ ఈ ఏడాది మార్చి నాటికి రూ.15.22 లక్షల కోట్లు. ప్రభుత్వ ఖజానాకు రూ.3.5 లక్షల కోట్లు ఇక ప్రభుత్వరంగ సంస్థల ద్వారా 2017–18 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి రూ.3.5 లక్షల కోట్ల ఆదాయం సమకూరినట్టు ప్రభుత్వ సర్వే తెలియజేసింది. ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, జీఎస్టీ, కార్పొరేట్ పన్ను, డివిడెండ్ రూపంలో ఈ మొత్తాన్ని సమకూర్చాయి. అయితే, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయంతో చూస్తే 2.98 శాతం తక్కువ. 2016–17లో ప్రభుత్వరంగ కంపెనీల నుంచి వచ్చిన ఆదాయం రూ.3.6 లక్షల కోట్లు.. గత ఆర్థిక సంవత్సరంలో ఒక్క డివిడెండ్ రూపంలోనే రూ.76,578 కోట్లు సమకూరింది. క్యాజువల్, కాంట్రాక్టు కార్మికులకు అదనంగా 10.88 లక్షల మందికి ప్రభుత్వరంగ సంస్థలు ఉపాధి కల్పిస్తున్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న 11.35 లక్షల మందితో పోలిస్తే 4.14 శాతం తగ్గింది. కానీ, అదే సమయంలో వేతనాల బిల్లు రూ.1,40,956 కోట్ల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,57,621 కోట్లకు పెరిగింది. -
ఓఎన్జీసీ బైబ్యాక్ రూ.4,022 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ కంపెనీ రూ.4,022 కోట్ల షేర్లను బైబ్యాక్ చేయనున్నది. ఈ షేర్ల బైబ్యాక్‌కు కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని ఓఎన్జీసీ వెల్లడించింది. షేర్ల బైబ్యాక్‌లో భాగంగా 1.97 శాతం వాటాకు సమానమైన 25.29 కోట్ల షేర్లను, ఒక్కో షేర్‌ను రూ.159కు కొనుగోలు చేస్తామని పేర్కొంది. ఓఎన్జీసీలో కేంద్ర ప్రభుత్వానికి 65.64 శాతం వాటా ఉండటంతో ఓఎన్జీసీ షేర్ల బైబ్యాక్ కారణంగా ప్రభుత్వానికి రూ.2,640 కోట్ల నిధులు వస్తాయని అంచనా. కాగా మూలధన పెట్టుబడుల కోసం నిధులు ఖర్చుకాగా ఈ సారి మధ్యంతర డివిడెండ్‌ను ఓఎన్జీసీ చెల్లించడం లేదని సమాచారం. షేర్ల బైబ్యాక్‌లో భాగంగా కంపెనీ తాను జారీ చేసిన షేర్లను తిరిగి కొనుగోలు చేస్తుంది. ఇటీవలే ఇండియన్ ఆయిల్ కార్పొ (ఐఓసీ) కంపెనీ రూ.4,435 కోట్ల మేర షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా రూ.6,556 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను కూడా ప్రకటించింది. కేంద్రం ఒత్తిడి... నగదు నిల్వలు పుష్కలంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల షేర్లను బైబ్యాక్ చేయాలని, అధిక డివిడెండ్‌ను చెల్లించాలని కేంద్రం ఒత్తిడి చేస్తోంది. ఈ సంస్థల్లో అధిక వాటా ఉండటంతో షేర్ల బైబ్యాక్ కారణంగా ప్రభుత్వానికి భారీగా నిధులు లభిస్తాయి. ఈ నిధులను బడ్జెట్ లోటు పూడ్చుకోవడానికి వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే డజనుకు పైగా ప్రభుత్వ రంగ కంపెనీలు షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించాయి. ఐఓసీ, నాల్కో, భెల్, ఆయిల్ ఇండియా, కోల్ ఇండియా, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్ఎల్సీ, కొచ్చిన్ షిప్‌యార్డ్, కేఐఓసీఎల్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల షేర్ల బైబ్యాక్ కారణంగా కనీసం రూ.5,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే నెల 1 నుంచి ఎన్‌హెచ్‌పీసీ షేర్ల బైబ్యాక్ ఎన్‌హెచ్‌పీసీ షేర్ల బైబ్యాక్ వచ్చే నెల 1 నుంచి ప్రా రంభమవుతోంది. అదే నెల 14న ముగిసే ఈ షేర్ల బైబ్యాక్‌లో భాగంగా 2.09% వాటాకు సమానమైన 21.42 కోట్ల షేర్లను ఒక్కోటి రూ.28 ధరకు ఈ కంపెనీ కొనుగోలు చేయనున్నది. ఈ షేర్ల బైబ్యాక్‌కు రికార్డ్ తేదీగా గత నెల 30ని కంపెనీ నిర్ణయించింది. -
ఆయిల్ మాఫియా కేసు కొత్త మలుపు
ఓఎన్జీసీ పైపులైన్లకు కన్నం వేసి... ట్యాంకర్ల నుంచి చమురు కాజేస్తున్న ఆయిల్ మాఫియా కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. మొన్నటి దాకా ఈ చమురు జిడ్డు కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు, ఓఎన్జీసీలోనే ఇంటి దొంగలు, రాజమహేంద్రవరానికి చెందిన చమురు ట్యాంకర్ల యాజమాని, ఆయన కుటుంబీకులకే అంటుకుంది. తాజాగా ఆ జిడ్డు పోలీసులకు అంటుకుంటోంది. ఈ కేసుల్లో పోలీసులకూ భారీగా ముడుపులు అందుతున్నాయన్న ఆరోపణలతో కోనసీమ పోలీసు శాఖలోనే కాదు ఈ సీమ ప్రజల్లోనూ చర్చనీయాంశమవుతోంది. తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: రెండు నెలల కిందట అల్లవ రం మండలం ఓడలరేవు గ్రామంలో ఓఎన్జీసీ పైపులైన్లకు కన్నం వేసి బైపాస్ పైపుల ద్వారా సమీపంలోని జీడిమామిడి తోటలో సిన్టెక్స్ ట్యాంక్‌లో నింపుతుండగా ఆయిల్ చోరీ వెలుగు చూసింది. ఓఎన్జీసీ సెక్యూరిటీ విభాగం నిఘాలో బయటపడ్డ ఈ అక్రమ భాగోతంలో దొరికిన తీగను లాగిన పోలీసులు కేజీ బేసిన్లో ఉన్న ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఉన్న పలు ఓఎన్జీసీ బావుల నుంచి ఉప్పలగుప్తం మండలం ఎస్.యానంలోని ఆన్ లోడింగ్ పాయింట్‌కు వస్తున్న చమురు ట్యాంకర్ల ద్వారా కూడా భారీ స్థాయిలో చమురు చోరీ అవుతున్నట్లు గుర్తించారు. 2014 నుంచి దాదాపు రూ.200 కోట్ల విలువైన చమురు చోరీకి గురై ఉంటుందని అనధికార అంచనా కూడా వేశారు. ఈ కేసుల్లో పోలీసులు ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఆరు చమురు ట్యాంకర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఇదంతా పాత ఎపిసోడ్. వెలుగులోకి ముడుపుల ఆరోపణలు తాజాగా ముడుపుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అమలాపురం నుంచి ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులకు రూ.లక్షల్లో ముడుపులు అందినట్లు ఆరోపణలు తెర మీదకు వచ్చాయి. ఈ కేసులో మొత్తం రూ.30 లక్షల డీల్ జరిగిందని ప్రచారం కూడా జరుగుతోంది. దీనికి తోడు ఆ ముడుపులపై కొన్ని పత్రికల్లో అమరావతి నుంచి కథనాలు రావడంతో కోనసీమలో ఈ ఆరోపణలు చర్చనీయాంశమవుతున్నాయి. ఈ ఆరోపణలతో అమలాపురం డివిజన్ పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ కేసులో నిందితుడైన దాదాపు 70 వరకూ చమురు ట్యాంకర్లు ఉన్న రాజమహేంద్రవరానికి చెందిన వ్యక్తి తనను, తన కుటుంబీకులను ఈ కేసు నుంచి తప్పించేందుకు పోలీసులకు రూ.30 లక్షలు ఆఫర్ చేశాడని... దానిని పోలీసు అధికారులు తిరస్కరించారని పోలీసు వర్గాలే చెబుతున్నాయి. అలాగే ఆయిల్ మాఫియా బాస్‌ల నుంచి స్థాయిని బట్టి ఒక్కో పోలీసు అధికారికి రూ.10 లక్షలు, రూ.5 లక్షలు, రూ.2 లక్షల వంతున నెలవారీ మామూళ్లు అందుతున్నాయన్న ఆరోపణలపై అమలాపురం డివిజన్ పోలీసులు చర్చించుకుంటున్నారు. అయితే అమలాపురం పోలీసు అధికారులు మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తూనే ఈ ప్రాంతానికి చెందిన ఓ పోలీసు అధికారికి డిపార్ట్మెంట్లోనే అంతర్గతం ఉన్న శత్రువులైన అధికారులు లీకులు ఇచ్చి ముడుపుల ప్రచారం చేయిస్తున్నారని వివరణ ఇస్తున్నారు. ఇదే సమయంలో ఆయిల్ మాఫియాపై ఓఎన్జీసీ అధికారులే సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు... ఆ సంస్థ త్వరలోనే దర్యాప్తు ప్రారంభిస్తుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఇది వాస్తవమే అయితే ఆయిల్ మాఫియా కేసులో ముగ్గురు పోలీసు అధికారులపై వేటు పడడం ఖాయమని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఎట్టకేలకు ఫిర్యాదు చేసిన ఓఎన్జీసీ అధికారులు ఆయిల్ చోరీ కేసు దర్యాప్తుకి ఓఎన్జీసీ అధికారులు తమకు ఆది నుంచి సహకరించడం లేదని పోలీసు అధికారులు అంటున్నారు. పైపులైన్లకు కన్నం వేసి... ట్యాంకర్ల ద్వారా జరుగుతున్న చమురు చోరీలపై తమకు ఫిర్యాదు చేస్తే ఈ కేసు ఆధారంగా దర్యాప్తు చేస్తామని పోలీసు అధికారులు అడుగుతూనే ఉన్నారు. ఎట్టకేలకు వారం రోజుల కిందట ఆ సంస్థ అధికారులు ఆయిల్ చోరీలపై ఫిర్యాదు చేయడం కొత్త పరిణామం. చమురు బావుల వద్ద లోడింగ్ పాయింట్లు, ఎస్.యానాం అన్లోడింగ్ పాయింట్ల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ, నిఘాతో ఆ సంస్థ అధికారులు విధుల్లో ఉంటారు. ట్యాంకర్ల నుంచి వచ్చిన చమురు ఎంత పరిమాణంలో వచ్చింది... అంతే పరిమాణంలో దిగుమతి అవుతుందా లేదా...? అనే ఖచ్చితమైన గణాంకాలు ఆ అధికారులకు అధికారిక నమోదుతో సమాచారం ఉంటుంది. అయినా చోరీలు సాగుతున్నాయంటే పరోక్షంగా ఇంటి దొంగల వత్తాసు లేకుండా ఇన్ని అక్రమాలు ఎలా జరుగుతాయన్నది ప్రశ్నార్థకమే. ఆ దిశగా ఓఎన్జీసీ నుంచి కనీస ఆరా గాని... చర్యలు లేవంటే ఇంటి దొంగలకు ఎంతటి అండదండలు ఉన్నాయో అంచనా వేయవచ్చు. రాజమహేంద్రవరానికి చెందిన చమురు ట్యాంకర్ల యాజమానికి చెందిన కొన్ని ట్యాంకర్లలో అక్రమ అదనపు ట్యాంకు, ట్యాంకర్లలో ఆయిల్ చాంబర్లకు వేసే ఓఎన్జీసీ తాళం కప్పలకు డూప్లికేట్ తాళాలు వంటి మోసాలు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసిన సంగతి తెలిసిందే. -
కేంద్రం నిధుల వేట వేగవంతం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, వాటాల విక్రయం ద్వారా 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.80,000 కోట్లను సమీకరించాలని నిర్ణయించిన కేంద్రం అందుకు ఆపసోపాలు పడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఇంకా నాలుగు నెలల కాలమే మిగిలి ఉంది. కానీ, ప్రభుత్వం ఇప్పటి వరకు సమీకరించిన మొత్తం రూ.20,000 కోట్లను దాటలేదు. దీంతో మిగిలిన భారీ లక్ష్యాన్ని తక్కువ వ్యవధిలోనే చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పలు ప్రతిపాదనలను వేగవంతం చేస్తోంది. ఓఎన్జీసీ, ఐవోసీ, ఆయిల్ ఇండియాల్లో వాటాల అమ్మకం ద్వారా త్వరలోనే రూ15,000 కోట్లకు పైగా సమీకరించాలన్నది ఒక ప్రతిపాదన అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. అలాగే, ఇవే కంపెనీల నుంచి షేర్ల బైబ్యాక్ ద్వారా మరో రూ.10,000 కోట్లు కూడా రాబట్టుకోవాలన్న (కేంద్రం తన వాటాలను బైబ్యాక్‌లో విక్రయించి) ఆలోచనతో కేంద్రం ఉంది. ప్రస్తుతం ఓఎన్జీసీలో 67.48 శాతం, ఐవోసీలో 56.75 శాతం, ఆయిల్ ఇండియాలో 66.13 శాతం చొప్పున కేంద్ర ప్రభుత్వానికి వాటాలు ఉన్నాయి. నిధుల సమీకరణ... ఓఎన్జీసీలో 5 శాతం, ఐవోసీలో 3 శాతం, ఆయిల్ ఇండియాలో 10 శాతం వాటాలను ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో విక్రయించాలన్నది కేంద్రం పరిశీలిస్తున్న ప్రతిపాదన. దీని ప్రకారం ఓఎన్జీసీలో వాటాల విక్రయం ద్వారా రూ.10,000 కోట్లు, ఐవోసీ వాటాల అమ్మకంతో రూ.4,200 కోట్లు, ఆయిల్ ఇండియాలో వాటాల అమ్మకం ద్వారా రూ.2,300 కోట్లు సమకూరే అవకాశం ఉంది. అయితే, కచ్చితంగా ఎంత వాటా విక్రయిస్తారు? ఎన్ని నిధులు సమీకరిస్తారు? అన్నది ఆఫర్ ప్రారంభం నాటికే తెలుస్తుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. ఈ నెల మొదట్లో కోల్ ఇండియాలో 3 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా కేంద్రం విక్రయించిన విషయం తెలిసిందే. ఆయిల్ ఇండియా షేర్ల బైబ్యాక్ ఆఫర్ ఫర్‌సేల్ మార్గంలో వాటాల అమ్మకంతోపాటు మరోవైపు షేర్ల బైబ్యాక్ చేపట్టాలని కూడా కేంద్రం కోరుతోంది. ఈ నేపథ్యంలో బైబ్యాక్ ప్రతిపాదన పరిశీలించేందుకు ఈ నెల 19న బోర్డు సమావేశం నిర్వహించనున్నట్టు ఆయిల్ ఇండియా తెలిపింది. రూ.1,100 కోట్ల మేర బైబ్యాక్ చేపట్టే అవకాశం ఉందని అంచనా. అలాగే, ఓఎన్జీసీ రూ.4,800 కోట్లు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ.4,000 కోట్ల చొప్పున బైబ్యాక్ ఆఫర్ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు కోల్ ఇండియా షేర్ల బైబ్యాక్ ఆఫర్ జనవరి చివరికి ఉండొచ్చని అధికార వర్గాల సమాచారం. -
ఓఎన్జీసీలో వాటా విక్రయం!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవటంలో (డిజిన్వెస్ట్‌మెంట్) భాగంగా చమురు దిగ్గజం ఓఎన్జీసీలో 5 శాతం దాకా వాటాను విక్రయించడానికి కేంద్రం ప్రయత్నాలు మొదలెట్టింది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో ఈ విక్రయం ఉండనుంది. ఓఎఫ్ఎస్ వైపు ఇన్వెస్టర్లను ఆకర్షించే క్రమంలో పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) గతవారం అమెరికాలో రోడ్‌షో కూడా నిర్వహించింది. నిర్దిష్టంగా ఎంత మొత్తం వాటాలు విక్రయిస్తుందన్నదీ వెల్లడికాకపోయినా సుమారు 3–5% మేర డిజిన్వెస్ట్‌మెంట్ ఉండొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఓఎన్జీసీ ప్రస్తుత షేరు ధర ప్రకారం దీని ద్వారా ఖజానాకు దాదాపు రూ. 11,300 కోట్ల దాకా రావొచ్చు. ఓఎన్జీసీలో కేంద్రానికి మొత్తం 67.45 శాతం వాటా ఉంది. గతంలో 5 శాతం విక్రయం... 2011–12 ఆర్థిక సంవత్సరంలో కూడా ఓఎన్జీసీలో కేంద్రం దాదాపు 5 శాతం వాటాల విక్రయించి రూ.12,750 కోట్లు సమీకరించింది. అప్పట్లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఆదుకోవడంతో ఈ విక్రయ ప్రతిపాదన గట్టెక్కింది. ఆ తర్వాత మళ్లీ మరిన్ని వాటాలు విక్రయించడానికి ప్రయత్నించినప్పటికీ.. సబ్సిడీల భారంతో ఓఎన్జీసీ షేరుపై ప్రతికూల ప్రభావాల కారణంగా కుదరలేదు. అయితే, బ్యారెల్ క్రూడాయిల్ రేటు 70 డాలర్ల పైకి చేరిన పక్షంలో సబ్సిడీ భారాన్ని పంచుకోవాలంటూ ఓఎన్జీసీని అడగాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పక్కన పెట్టడం ప్రస్తుతం సంస్థ షేరుకు సానుకూలంగా ఉంటుందనే అంచనాలున్నాయి. దీంతో వాటాల విక్రయం సజావుగా జరగొచ్చని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. 2016 ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీ భారంలో వాటాల విధానాన్ని ఉపసంహరించారు. దీంతో అప్పటిదాకా 60 శాతం దాకా వాటాలు భరిస్తున్న ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాల సబ్సిడీ భారం ఆ సంవత్సరం 10 శాతానికి తగ్గిపోయింది. ఆ తర్వాత పూర్తిగా తొలిగిపోయింది. ఈసారి డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ. 80వేల కోట్లు.. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరం రూ. 80,000 కోట్లు సమీకరించాలని నిర్దేశించుకుంది. డిజిన్వెస్ట్‌మెంట్ మార్గంలో గతేడాది రికార్డు స్థాయిలో రూ. లక్ష కోట్లు సమీకరించింది. ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్లో కేంద్రానికి ఉన్న 51 శాతం వాటాను ఓఎన్జీసీ గతేడాది రూ. 36,915 కోట్లకు కొనుగోలు చేయడం కూడా ఇందుకు దోహదపడింది. అయితే, ఈసారి ఇప్పటిదాకా డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా కేవలం రూ. 9,220 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో సమీకరించిన నిధుల్లో ఇది కేవలం సగమే కావడం గమనార్హం. దీంతో ఇన్వెస్టర్ల సామర్థ్యానికి అనుగుణంగా.. మార్కెట్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఏర్పడకుండా స్వల్ప స్థాయిల్లో డిజిన్వెస్ట్‌మెంట్ నిర్వహించే వ్యూహాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఓఎన్జీసీతో పాటు కోల్ ఇండియాలో 5 శాతం వాటాలు విక్రయించాలని కూడా కేంద్రం యోచిస్తోంది. కోల్ ఇండియా ప్రస్తుత షేరు ధర ప్రకారం మరో రూ. 9,100 కోట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సంస్థ ఓఎఫ్ఎస్ కోసం ఈ ఏడాది జూన్‌లో దీపం విభాగం విదేశాల్లో రోడ్‌షోలు నిర్వహించింది. అటు ఇండియన్ ఆయిల్ (3%), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (10% దాకా)లో సైతం డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా భారీగాగా నిధులు సమకూర్చుకోవచ్చని కేంద్రం యోచిస్తోంది. -
ఓవీఎల్‌ను లిస్ట్ చేయండి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు సంస్థ, ఓఎన్జీసీ.. తన విదేశీ అనుబంధ సంస్థ, ఓఎన్జీసీ విదేశ్‌ను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలని ప్రభుత్వం ఒక లేఖ రాసింది. ఓఎన్జీసీ విదేశ్(ఓవీఎల్)ను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయడం ద్వారా వచ్చిన నిధులను స్పెషల్ డివిడెండ్‌గా చెల్లించాలని, తద్వారా ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని చేరుకునేలా చూడాలని ప్రభుత్వం ఓఎన్జీసీకి తెలిపింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్(దీపమ్) గత వారం ఓఎన్జీసీకి ఒక లేఖ రాసింది. ఓవీఎల్‌ను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయడం వల్ల ఆ సంస్థ కార్పొరేట్ గవర్నెన్స్, సమర్థతలు మరింతగా మెరుగుపడతాయని ఈ లేఖలో దీపమ్ పేర్కొంది. ఓఎన్జీసీ వంద శాతం అనుబంధ సంస్థగా ఓఎన్జీసీ విదేశ్ 20కు పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 41 ప్రాజెక్ట్‌లను నిర్వహిస్తోంది. ఓవీఎల్‌లో ఓఎన్జీసీ ఇప్పటిదాకా రూ.1.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టింది. కాగా ఓఎన్జీసీలో కేంద్ర ప్రభుత్వానికి 67.45 శాతం వాటా ఉంది. కాగా 2015లోనే ఓవీఎల్‌ను లిస్ట్ చేయాలని ఓఎన్జీసీని ప్రభుత్వం అడిగింది. కానీ చమురు ధరలు మందగమనంగా ఉన్నాయని, లిస్టింగ్‌కు సరైన సమయం కాదని ఓఎన్జీసీ ఆ ప్రతిపాదనను తోసిపుచ్చింది. ఇప్పుడు లిస్టింగ్ ఎందుకంటే.... గత ఆర్థిక సంవత్సరంలో హెచ్పీసీఎల్లో 51.1 శాతం వాటాను ఓఎన్జీసీ రూ.36,915 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో గత ఆర్థిక సంవత్సరం డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని ప్రభుత్వం సునాయాసంగా సాధించింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.80,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ జూలై 5 నాటికి రూ.9,220 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. -
పవన్ హన్స్ వాటా విక్రయానికి ఓకే
న్యూఢిల్లీ: హెలికాప్టర్ క్యారియర్ సంస్థ పవన్ హన్స్లో ఓఎన్జీసీకి ఉన్నటువంటి 49% వాటా విక్రయానికి కంపెనీ బోర్డ్ అంగీకారం తెలిపింది. కేంద్ర ప్రభుత్వానికి పవన్ హన్స్లో ఉన్న 51% వాటాతో కలిపి మొత్తం ఒకేసారి ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ప్రైవేటు సంస్థకు అమ్మివేయడం ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకోవాలన్న ప్రభుత్వ ఆలోచనకు మార్గం సుగమమైంది. గడిచిన పది నెలల్లో పవన్ హన్స్లో కేంద్ర ప్రభుత్వం తనకున్న 51% వాటాలను రెండు సార్లు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించేందుకు ప్రయత్నించింది. అయితే, ఆ ప్రయత్నాలు విఫలమవగా.. ఈసారి ఓఎన్జీసీ వాటాను కూడా కలిపి వంద శాతం ఒకేసారి అమ్మేందుకు చేయనున్న ప్రయత్నాలు ఫలిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ఆయిల్ అండ్ గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తిపై దృష్టిసారించి ఇతర వ్యాపారాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నామని.. ఇందులో భాగంగానే పవన్ హన్స్లో వాటా విక్రయిస్తున్నామని ఓఎన్జీసీ బోర్డ్ తెలిపింది. పవన్ హన్స్‌కు 46 హెలికాప్టర్లు ఉన్నాయి. -
ఓఎన్జీసీ లాభం 6,144 కోట్లు
న్యూఢిల్లీ: చమురు, గ్యాస్ ధరలు పెరగడం ఓఎన్జీసీకి లాభాల పంట పడించింది. ఈ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.6,144 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం (రూ.3,885 కోట్లు)తో పోల్చితే 58 శాతం వృద్ధి సాధించామని ఓఎన్జీసీ తెలిపింది. నాలుగున్నరేళ్ల కాలంలో ఈ కంపెనీకి ఇదే అత్యధిక త్రైమాసిక లాభం. 2013, డిసెంబర్ క్వార్టర్లో ఈ కంపెనీ రూ.7,126 కోట్ల నికర లాభం సాధించింది. నికర లాభం ఒక్కో షేర్ పరంగా రూ.3.03 నుంచి రూ.4.79కి పెరిగిందని పేర్కొంది. ఇక ఈ క్యూ1లో కార్యకలాపాల ఆదాయం 43 శాతం వృద్ధితో రూ.27,213 కోట్లకు ఎగసిందని ఓఎన్జీసీ వివరించింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన చూస్తే, 14 శాతం వృద్ధి సాధించామని తెలిపింది. ఇబిటా రూ.8,775 కోట్ల నుంచి 58 శాతం వృద్ధితో రూ.రూ.13,893 కోట్లకు పెరిగిందని పేర్కొంది. నిర్వహణ మార్జిన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 47.4 శాతం నుంచి 54 శాతానికి పెరిగిందని తెలిపింది. 48 శాతం పెరిగిన రియలైజేషన్.. ఒక్కో బ్యారెల్ ముడి చమురు ఉత్పత్తిపై 71.48 డాలర్ల రియలైజేషన్‌ను ఈ క్యూ1లో సాధించామని ఓఎన్జీసీ తెలిపింది. గత క్యూ1లో సాధించిన రియలైజేషన్ (48.42 డాలర్లు)తో పోల్చితే ఇది 48 శాతం అధికమని వివరించింది. సహజ వాయువు రియలైజేషన్ 2.48 డాలర్ల నుంచి 3.06 డాలర్లకు పెరిగిందని పేర్కొంది. ఈ క్యూ1లో ముడి చమురు ఉత్పత్తి 5 శాతం తగ్గి 5 మిలియన్ టన్నులకు చేరిందని పేర్కొంది. అయితే జాయింట్ వెంచర్ చమురు క్షేత్రాల్లో ముడి చమురు ఉత్పత్తి 2.5 శాతం పెరిగిందని వివరించింది. సహజ వాయువు ఉత్ప్తతి 3.4 శాతం వృద్ధితో 5.9 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పెరిగిందని పేర్కొంది. రాయల్టీపై సర్వీస్ ట్యాక్స్, జీఎస్టీ కింద రూ.2,695 కోట్లు ప్రభుత్వానికి చెల్లించామని ఓఎన్జీసీ వెల్లడించింది. . అయితే రాయల్టీపై సర్వీస్ ట్యాక్స్/జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదని న్యాయ నిపుణుల అభిప్రాయమని, ఈ మేరకు సంబంధిత అధికారులకు తెలిపామని, అయినా ముందు జాగ్రత్త చర్యగా ఈ మొత్తాన్ని చెల్లించామని తెలిపింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఓఎన్జీసీ షేర్ 0.4 శాతం నష్టపోయి రూ.166 వద్ద ముగిసింది. -
కేజీ బేసిన్ గ్యాస్ ఉత్పత్తి... ఆరు నెలలు వాయిదా: ఓఎన్జీసీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ).. కేజీ బేసిన్‌లోని కేజీ–డీ5 బ్లాక్ నుంచి గ్యాస్ ఉత్పత్తిని 2019 డిసెంబర్ దాకా వాయిదా వేసింది. కొత్తగా అమల్లోకి వచ్చిన వస్తు, సేవల పన్నులు (జీఎస్టీ), స్థానిక ఉత్పత్తుల కొనుగోలు మొదలైన విధానాలకు అనుగుణంగా ప్రణాళికలను సవరించాల్సి రావడమే ఇందుకు కారణం. ముందస్తు ప్రణాళికల ప్రకారం కేజీ–డీ5 బ్లాక్ నుంచి 2019 జూన్ నాటికి గ్యాస్, 2020 మార్చి నాటికి చమురు ఉత్పత్తి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ సవరించిన వాటిని బట్టి గ్యాస్ ఉత్పత్తి 2019 డిసెంబర్ నాటికి, చమురు ఉత్పత్తి 2021 మార్చి నాటికి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి కొత్త తేదీలను కొన్ని నెలల క్రితమే నిర్ణయించినట్లు, జూన్ 29 నాటి సమావేశంలో బోర్డు ఆమోదానికి సమర్పించినట్లు ఓఎన్జీసీ డైరెక్టర్ (ఆఫ్‌షోర్) రాజేశ్ కక్కర్ తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన కేజీ–డీ6 బ్లాక్‌కి పక్కనే గల కేజీ–డీ5 బ్లాక్ దాదాపు 7,294.6 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. దీన్ని ఉత్తర డిస్కవరీ ఏరియా (ఎన్డీఏ–3,800.6 చ.కి.మీ.) దక్షిణ డిస్క వరీ ఏరియా (ఎస్డీఏ–3,494 చ.కి.మీ.) కింద విభజించారు. ఎన్డీఏలో 11 చమురు, గ్యాస్ నిక్షేపా లు ఉండగా, ఎస్డీఏలో ఏకైక అల్ట్రా–డీప్ సీ బ్లాకు యూడీ–1 ఉంది. వీటన్నింటినీ క్లస్టర్–ఐ, క్లస్టర్–ఐఐ, క్లస్టర్–ఐఐఐ కింద వర్గీకరించారు. అయితే, రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో వివాదం నేపథ్యంలో క్లస్టర్– ఐ నుంచి ఉత్పత్తి జోలికెళ్లడం లేదు. రెండో క్లస్టర్‌నే ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండోసారి..: కేజీ–డీ5 బ్లాక్ నుంచి ఉత్పత్తిని ప్రారంభించే డెడ్‌లైన్ వాయిదాపడటం ఇది రెండోసారి. 2014 ప్రణాళికల ప్రకారం గ్యాస్ ఉత్పత్తి 2018 నుంచి, చమురు ఉత్పత్తి 2019 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, సముద్ర గర్భ క్షేత్రాల నుంచి వెలికితీసే ఇంధనాలకు ప్రభుత్వం లాభసాటి రేటును నిర్దేశించే దాకా పెట్టుబడి పణ్రాళికను ఓఎన్జీసీ వాయిదా వేసింది. 2016లో ప్రభుత్వం రేటు ను నిర్దేశించిన తర్వాత 5.07 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో అభివృద్ధి ప్రణాళికను ఆమోదించింది. -
ఓఎన్జీసీలో ఉద్యోగాలంటూ గోల్మాల్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ కేంద్రంగా ఏర్పాటైన ఓ ఏజెన్సీ ఓఎన్జీసీలో ఉద్యోగాల పేరుతో దేశ వ్యాప్తంగా నిరుద్యోగులకు ఎర వేసింది. దీనికి హైదరాబాద్‌లోనూ సబ్ ఏజెన్సీ ఉంది. కొందరు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు, మెడికల్ టెస్ట్‌లు సైతం పూర్తి చేసింది. ఈ గ్యాంగ్ జారీ చేసిన బోగస్ నియామక పత్రాలతో అనేక మంది ఢిల్లీలోని ఓఎన్జీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఇలా విషయం బయటకు రావడంతో అక్కడి వసంత్‌కుంజ్, క్రైమ్ బ్రాం చ్ల్లో కేసులు నమోదయ్యాయి. పోలీసులు గుర్తించిన బాధితుల్లో ఏడుగురు హైదరాబాద్‌కు చెందిన వారూ ఉన్నట్లు తెలిసింది. ఢిల్లీ కేంద్రంగా ఏర్పాటైన ఓ ప్లేస్ మెంట్ ఏజెన్సీ దేశంలోని ప్రధాన నగరాల్లో సబ్ ఏజె న్సీలు, ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంది. దీనిలో సత్బీర్ కీలకంగా వ్యవహరించారు. తమకు రాజకీయ, అధికార వర్గాల్లో భారీ పలుకుబడి ఉందంటూ ప్రచారం చేసుకున్నారు. ఓఎన్జీసీలో అనేక ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, మినిస్ట్రీ కోటా పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయరంటూ నమ్మించాడు. వీటిని రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు మాత్రమే భర్తీ చేస్తారంటూ ప్రచారం చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఉన్న సబ్ ఏజెన్సీ సైతం ఇలానే చెప్పింది. ఆకర్షితులైన వారి నుంచి తొలుత కొంత మొత్తం అడ్వాన్స్‌గా తీసుకున్నారు. ఆపై వీరికి ప్రాథమిక మౌఖిక పరీక్షలు పూర్తి చేసి ఢిల్లీకి తరలించారు. అక్కడి కృషి భవన్లో తుది దశ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఆ కార్యాలయం లాబీలో ఉన్న మోసగాళ్ల ఏజెంట్లు తామే ఓఎన్జీసీ అధికారులమని నమ్మించి, అక్కడే తతంగం పూర్తి చేశారు. ఇది జరిగిన తర్వాత వారికి గ్రేటర్ నోయిడాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేయించి సర్టిఫికెట్లు జారీ చేశారు. తర్వాత మిగిలిన మొత్తం వసూలు చేసి ఓఎన్జీసీ లోగోతో కూడిన బోగస్ నియామక పత్రాలు జారీ చేశారు. ఒక్కో ప్రాంతానికి చెందిన వారికి ఒక్కో తేదీ ఇస్తూ, ఢిల్లీలో ఉన్న ఓఎన్జీసీ కార్యా లయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా సూచించారు. అక్కడకు వెళ్లిన బాధితుల్లో ఏడుగురు నగరానికి చెందిన వారున్నారు. ఒక్కొక్కరూ రూ.10 లక్షల చొప్పున మోసగాళ్లకు చెల్లించారు. ఈ లేఖలు చూసిన ఓఎన్జీసీ అధికారులు పోలీసులకు సమాచారమిచ్చారు. దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉన్న ముఠా చేసిన స్కాంగా తేల డంతో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు ప్రారంభించింది. -
ఓఎన్జీసీ లాభం 5,915 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు సంస్థ, ఓఎన్జీసీ జనవరి–మార్చి క్వార్టర్లో రూ.5,915 కోట్ల నికర లాభం సాధించింది. గత నాలుగేళ్లలో ఇదే అత్యధిక నికర లాభమని ఓఎన్జీసీ తెలిపింది. 2016–17 నాలుగో క్వార్టర్లో రూ.4,340 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ సారి 37 శాతం వృద్ధితో రూ.5,915 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ముడి చమురు ధరలు అధికంగా ఉండడం, సుంకాలు తక్కువగా ఉండటం వల్ల నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కంపెనీ పేర్కొంది. ఏడాది కాలంలో అంతర్జాతీయంగా చమురు దరలు 60 శాతం వరకూ పెరగడంతో ఓఎన్జీసీ వంటి చమురు ఉత్పత్తి సంస్థల ఆదాయం, లాభాలు జోరుగా పెరిగాయి. ఆదాయం 10 శాతం వృద్ధితో రూ.23,969 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు 6 శాతం తగ్గి రూ.19,463 కోట్లకు పరిమితమయ్యాయి. బ్యారెల్ ముడి చమురు ఉత్పత్తి రియలైజేషన్లు 54.91 డాలర్ల నుంచి 66.71 డాలర్లకు పెరిగినట్లు సంస్థ తెలియజేసింది. అలాగే గ్యాస్ ధర రియలైజేషన్ 16 శాతం వృద్ధితో 2.89 డాలర్లకు ఎగసింది. ముడి చమురు ఉత్పత్తి 3 శాతం తగ్గి 6.2 మిలియన్ టన్నులకు చేరింది. ఒక్కో షేర్‌కు రూ.1.35 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది. ఇప్పటికే రెండు దశలో ఒక్కో షేర్‌కు రూ.5.25 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించామని తెలిపింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, నికర లాభం 11 శాతం వృద్ధితో రూ.19,945 కోట్లకు, టర్నోవర్ 5 శాతం వృద్ధితో రూ.27,704 కోట్లకు పెరిగాయి. 2017–18లో మొత్తం 12 చమురు, గ్యాస్ అన్వేషణలను కనుగొన్నామని తెలిపింది. మార్కెట్ ముగిసిన తర్వాత కంపెనీ ఫలితాలను వెల్లడించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఓఎన్జీసీ షేర్ 0.85 శాతం నష్టంతో రూ.174 వద్ద ముగిసింది. -
ఓఎన్జీసీ హెలికాఫ్టర్‌కు తప్పిన ప్రమాదం
సాక్షి, రాజమండ్రి: రాజమండ్రిలో ఓఎన్జీసీ హెలికాఫ్టర్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం ఓఎన్జీసీకి చెందిన హెలికాఫ్టర్ రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణంతో ల్యాండింగ్ కష్టమై ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. అయితే స్థానికంగా ఉన్న రావులపాలెం వద్ద పొలాల్లో హెలికాఫ్టర్‌ను ఫైలట్ సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం తప్పడంతో హెలికాఫ్టర్‌లో ఉన్న సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఈరోజు ఉదయం నుంచి రాజమండ్రిలో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో పలు చోట్టు చెట్లు, భారీ హోర్డింగ్‌లు విరిగిపడ్డాయి. మరోవైపు ఆకాశం మేఘావృతం కావడంతో పట్టపగలే చిమ్మచీకటిని తలపిస్తోంది. -
కొచ్చి షిప్‌యార్డ్‌లో ప్రమాదం
కొచ్చి: ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ (ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్)కి చెందిన ఓ నౌకలో అగ్ని ప్రమాదం జరిగి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఏడుగురు గాయపడ్డారు. సముద్ర గర్భం నుంచి ముడిచమురును బయటకు తీయడానికి ఉపయోగించే నౌకకు కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో మంగళవారం మరమ్మతులు నిర్వహిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన వారంతా ఒప్పంద కార్మికులేనని భావిస్తున్నట్లు షిప్‌యార్డ్ అధికారి ఒకరు చెప్పారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ‘సాగర్ భూషణ్’∙నౌకకు మరమ్మతులు నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగినట్లు ఓఎన్జీసీ ఓ ప్రకటనలో తెలిపింది. మంటల వల్ల వచ్చిన పొగను పీల్చడం వల్లే ఐదుగురు చనిపోయి ఉంటారని భావిస్తున్నామనీ, ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారి చెప్పారు. ప్రమాదంపై తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా షిప్‌యార్డ్ ఎండీని కేంద్ర నౌకాయాన మంత్రి గడ్కరీ ఆదేశించారు. కేరళ సీఎం విజయన్ మృతులకు సంతాపం తెలిపారు. కాగా, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారాన్ని కొచ్చిన్ షిప్‌యార్డ్ ప్రకటించింది. -
అబుదాబి ఆయిల్‌ఫీల్డ్‌లో ఓఎన్జీసీ విదేశ్‌కి వాటా
న్యూఢిల్లీ: ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్, దాని భాగస్వామ్య కంపెనీలు కలసి అబుదాబిలోని అతిపెద్ద ఆఫ్‌షోర్ చమురు క్షేత్రం(లోయర్ జుకమ్)లో 10% వాటాను చేజిక్కించుకున్నాయి. ఈ కొనుగోలు విలువ 600 మిలియన్ డాలర్లు (రూ.3,840 కోట్లు). చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్న యూఏఈలోకి ఓ భారత కంపెనీ అడుగుపెట్టడం ఇదే ప్రథమం. ప్రధాని మోదీ, అబుదాబి రాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ సమక్షంలో ఈ శనివారం ఈ ఒప్పందం కుదిరింది. ఓఎన్జీసీ విదేశ్‌తోపాటు ఐవోసీ, బీపీసీఎల్ ఈ ఒప్పందంలో భాగస్వాములుగా ఉన్నాయి. రాయితీలతో కూడిన ఈ ఒప్పందం 40 ఏళ్లు అమల్లో ఉంటుంది. ప్రస్తుతం లోయర్‌జుకమ్ ఆయిల్ ఫీల్డ్‌లో నిత్యం 4 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి జరుగుతోంది. 2025 నాటికి రోజుకు ఉత్పత్తిని 4.5 లక్షల బ్యారెళ్లకు తీసుకెళ్లాలన్నది లక్ష్యం. ఓఎన్జీసీ గ్రూపు చైర్మన్ శశి శంకర్, అడ్నాక్ గ్రూప్ చీఫ్ సుల్తాన్ అహ్మద్ ఆల్ జబీర్ ఒప్పందంపై సంతకాలు చేశారు. మరో 30% వాటా కొనుగోలుకు సామర్థ్యం కలిగిన భాగస్వాముల ఎంపిక జరుగుతోందని ఆల్ జబీర్ పేర్కొన్నారు. -
ఓఎన్జీసీకి అధిక ధరల బాసట
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.5,015 కోట్ల నికర లాభాన్ని (స్డాండ్ అలోన్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం రూ.4,352 కోట్లతో పోలిస్తే 15 శాతం వృద్ధి సాధించామని ఓఎన్జీసీ తెలిపింది. ఉత్పత్తి తగ్గినా ధరలు అధికంగా ఉండటంతో ఈ స్థాయిలో నికర లాభం సాధించినట్లు తెలియజేసింది. మొత్తం ఆదాయం కూడా 15 శాతం వృద్ధితో రూ.24,122 కోట్లకు పెరిగింది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన ఇబిటా 20 శాతం వృద్ధితో రూ.10,919 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఇబిటా మార్జిన్ మాత్రం స్వల్పంగా తగ్గి 47.5 శాతానికి చేరింది. తగ్గిన చమురు ఉత్పత్తి: గత క్యూ3లో 51.80 డాలర్లుగా ఉన్న బ్యారెల్ ముడి చమురు ఉత్పత్తి వ్యయం ఈ క్యూ3లో 60.58 డాలర్లకు పెరిగింది. ముడి చమురు ఉత్పత్తి 1% తగ్గి 5.2 మిలియన్ టన్నులకు తగ్గిందని, అయితే గ్యాస్ ఉత్పత్తి మాత్రం 4.5% వృద్ధితో 6 బిలియన్ క్యూబిక్ మీటర్లకు చేరిందని సంస్థ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పది చమురు, గ్యాస్ క్షేత్రాల్లో నిక్షేపాలు కనుగొన్నామని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఓఎన్జీసీ షేర్ 0.4% తగ్గి రూ.188 వద్ద ముగిసింది. -
హెచ్‌పీసీఎల్ కొనుగోలుకు ఓఎన్జీసీ రుణ సమీకరణ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని ఓఎన్జీసీ, ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ.4,000 కోట్ల రుణాన్ని తీసుకుంది. హెచ్పీసీఎల్లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న 51.11 వాటాను ఓఎన్జీసీ కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం రూ.36,915 కోట్లు ఓఎన్జీసీకి అవసరమవుతాయి. ఇప్పటికే మూడు బ్యాంకుల నుంచి రూ.18,060 కోట్లను ఓఎన్జీసీ రుణాలుగా తీసుకునేందుకు ఒప్పందాలు చేసుకుంది. పీఎన్బీ నుంచి రూ.10,600 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 4,460 కోట్లు తీసుకుంటుండగా, యాక్సిస్ బ్యాంకు మరో రూ.3,000 కోట్ల మేర సమకూర్చనుంది. రూ.25,000 కోట్ల నుంచి రూ.35,000 కోట్ల వరకు రుణాలు తీసుకునేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపినట్టు ఓఎన్జీసీ చైర్మన్, ఎండీ శశి శేఖర్ రెండు రోజుల క్రితమే తెలిపారు. తమ దగ్గరున్న రూ.12,000–13,000 కోట్ల నగదు నిల్వల్ని వినియోగించిన తర్వాత లిక్విడ్ ఆస్తుల గురించి ఆలోచిస్తామని, ఆ తర్వాతే రుణం రూపంలో అవసరమైన మేర తీసుకోవడం ఉంటుందన్నారు. హెచ్‌పీసీఎల్ కొనుగోలుతో ఓఎన్జీసీ సమగ్ర చమురు కంపెనీగా అవతరించనుంది. అంతేకాదు, ఈ సంస్థకు ఇదే అతిపెద్ద కొనుగోలు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్‌కు కేజీ బేసిన్లో ఉన్న 80 శాతం వాటాను ఓఎన్జీసీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఓఎన్జీసీకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో 13.77 శాతం వాటా ఉండగా, దీని మార్కెట్ విలువ రూ.26,000 కోట్లు. గెయిల్ ఇండియాలోనూ 4.86 శాతం వాటా ఉంది. దీని మార్కెట్ విలువ రూ.3,800 కోట్లు. -
గెయిల్, ఐవోసీ నుంచి ఓఎన్జీసీ ఔట్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలైన ఐవోసీ, గెయిల్‌లో తనకున్న వాటాలను విక్రయించడానికి ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) సిద్ధమయింది. ఇందుకోసం కేంద్రం నుంచి అనుమతి పొందింది. ‘‘మా ప్రతిపాదనకు కేంద్రం ఇటీవలే ఆమోదముద్ర వేసింది. అయితే షేర్ల విక్రయానికి సరైన సమయం కోసం వేచి చూస్తున్నాం’’ అని ఓఎన్జీసీ వర్గాలు తెలియజేశాయి. ఈ వాటాల విక్రయం ద్వారా వచ్చిన నిధులను హెచ్‌పీసీఎల్ కొనుగోలు కోసం ఓఎన్జీసీ ఉపయోగించుకోనుంది. దేశీయంగా అతి పెద్ద రిఫైనరీ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఓఎన్జీసీకి 13.77 శాతం వాటాలున్నాయి. మంగళవారం నాటి షేరు ధర ప్రకారం వీటి విలువ సుమారు రూ. 26,200 కోట్లు. ఇక గెయిల్ ఇండియాలో ఓఎన్జీసీకి రూ.3,847 కోట్ల విలువ చేసే 4.86 శాతం వాటాలున్నాయి. చమురు రిఫైనింగ్, మార్కెటింగ్ సంస్థ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్లో (హెచ్‌పీసీఎల్) కేంద్ర ప్రభుత్వానికి చెందిన 51.11 శాతం వాటాలను ఓఎన్జీసీ కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం రూ.36,915 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఓఎన్జీసీ దగ్గర ఇప్పటికే రూ.12,000 కోట్ల పైగా నగదు నిల్వలున్నాయి. హెచ్‌పీసీఎల్ కొనుగోలుకు సంబంధించి రూ. 18,060 కోట్ల రుణ సమీకరణ కోసం మూడు బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఓఎన్జీసీ తెలిపింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్‌లు ఇందులో ఉన్నాయని స్టాక్ ఎక్సే్చంజీలకు వివరించింది. పీఎన్బీ నుంచి రూ. 10,600 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ. 4,460 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ నుంచి రూ. 3,000 కోట్లు సమీకరిస్తున్నట్లు తెలిపింది. -
ఓఎన్జీసీ, హెచ్‌పీసీఎల్ మెగా డీల్
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణల వ్యూహంలో మెగా మెర్జర్‌కు పునాది పడింది. ముఖ్యంగా 2018 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని చేరుకునే లక్ష్యంలో భాగంగా ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ లో మెగా డీల్ కుదిరింది. హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్లో (హెచ్‌పీసిఎల్) లో ప్రభుత్వం మొత్తం వాటాను కొనుగోలు చేసేందుకు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ (ఒఎన్జీసీ) ఆమోదం తెలిపింది. అంతేకాదు గతంలో ప్రకటించిన 25 వేలకోట్ల రూపాయల ఆఫర్‌ను 35వేల కోట్ల రూపాయలకు పెంచి మరీ ప్రభుత్వ వాటాను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు బోర్డు ఆమోదం లభించిందని ఓఎన్జీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శశి శంకర్ తెలిపారు. ఈ డీల్ భాగంగా మొత్తం 51.11 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఒఎన్జీసీ అంగీకరించింది. ఇందుకు రూ. 36,915 కోట్లను చెల్లించనున్నామని ఓఎన్జీసీ వర్గాలు రెగ్యులైటరీ ఫైలింగ్‌లో ప్రకటించాయి. మొత్తం నగదు రూపంలో జరిగే ఒప్పందం ఈ నెలాఖరుకు పూర్తికానుందని, ఒక్కో షేరుకు రూ. 473.97 చొప్పున ప్రభుత్వానికి చెల్లిస్తామని ఓఎన్జీసీ తెలిపింది. ఈ డీల్ ప్రభావంతో ఓఎన్జీసీ కౌంటర్ భారీగా లాభపడుతోంది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో 4.93 శాతం లాభంతో ట్రేడవుతోంది. మరోవైపు హెచ్‌పీసీఎల్ 2 శాతం నష్టపోతోంది. -
ఓఎన్జీసీ చేతికి హెచ్‌పీసీఎల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు రిఫైనింగ్ సంస్థ హెచ్పీసీఎల్లో ప్రభుత్వ వాటాలను ఓఎన్జీసీ కొనుగోలు చేయనుంది. ‘రూ.36,915 కోట్లకు హెచ్పీసీఎల్లో 51.11 శాతం వాటాల వ్యూహాత్మక విక్రయానికి సంబంధించి శనివారం ఓఎన్జీసీతో కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది’ అని కేంద్ర ఆర్థిక శాఖ ట్విటర్లో పేర్కొంది. పూర్తి నగదు చెల్లింపుల రూపంలో ఉండే ఈ ఒప్పందం జనవరి చివరి వారం కల్లా పూర్తి కానుంది. ఓఎన్జీసీ వద్ద ఇప్పటికే రూ.12,000 కోట్ల నగదు నిల్వలుండగా, మిగిలిన మొత్తాన్ని రుణం రూపంలో సమీకరించనుంది. ఈ కొనుగోలుతో ఇటు చమురు ఉత్పత్తి నుంచి రిటైల్ విక్రయాల దాకా అన్ని విభాగాల్లోనూ కార్యకలాపాలున్న దిగ్గజంగా ఓఎన్జీసీ అవతరించనుంది. హెచ్‌పీసీఎల్ దేశీయంగా మూడో అతి పెద్ద చమురు రిఫైనింగ్, ఇంధన మార్కెటింగ్ కంపెనీ. దీనికి దేశవ్యాప్తంగా 15,000 పెట్రోల్ బంకులు ఉన్నాయి. -
రెండు నెలల్లో రెగ్యులరైజ్ చేయాలి
సాక్షి, హైదరాబాద్: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొ రేషన్ (ఓఎన్జీసీ)లో నిర్దిష్ట కాలపరిమితితో 2008లో నియమితులైన ఫీల్డ్ ఆపరేటర్ల సర్వీసులను క్రమబద్ధీకరించాలని హైకోర్టు తీర్పు వెలువరించింది. ప్రస్తుతం వారు పనిచేస్తున్న పోస్టుల్లోనే కొనసాగించాలని 2016లో సింగిల్ జడ్జి చెప్పిన తీర్పును సమర్థించింది. కాకినాడ ఓఎన్జీసీలో పని చేస్తున్న తమ సర్వీసుల్ని క్రమబద్ధీకరించాలని తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ఔట్సోర్సింగ్ ఫీల్డ్ ఆపరేటర్లు పిటిషన్లు దాఖలు చేశారు. వారి సర్వీసుల్ని రెగ్యులరైజ్ చేయాలని సింగిల్ జడ్జి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్ర రావు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఓఎన్జీసీ అప్పీల్ చేసిన వ్యాజ్యాన్ని ఉమ్మడి హైకోర్టు న్యాయ మూర్తులు జస్టిస్ వి.రామసుబ్రహ్మణియన్, జస్టిస్ ఎం.గంగా రావులతో కూడిన ధర్మాసనం కొట్టేసింది. -
హెలికాప్టర్ గల్లంతు ; విషాదాంతం
సాక్షి, ముంబై: ముంబై తీరంలో పవన్‌హన్స్ సంస్థకు చెందిన హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. ఇద్దరు గల్లంతయ్యారు. ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఓఎన్జీసీకి చెందిన ఐదుగురు అధికారులు, ఇద్దరు పైలట్లు సహా ఏడుగురితో ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. జుహూలోని పవన్ హన్స్ విమానాశ్రయం నుంచి శనివారం ఉదయం 10.20 గంటలకు ఓఎన్జీసీకి చెందిన డీజీఎం స్థాయి అధికారులు సహా ఐదుగురు సిబ్బంది, ఇద్దరు పైలట్లతో హెలికాప్టర్ టేకాఫ్ అయ్యింది. 10.30 గంటల సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)తో సంబంధాలు తెగిపోయాయి. వెంటనే ఓఎన్జీసీ, కోస్ట్‌గార్ట్, నేవీ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. గాలింపు చర్యల అనంతరం డహాణు సమీపంలో హెలికాప్టర్ అవశేషాలను గుర్తించారు. ఐదు మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన ఇద్దరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కాగా, ఓఎన్జీసీకి ముంబై తీరంలో కీలకమైన చమురు నిక్షేపాలు ఉన్నాయి. -
భారీ ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు కనుగొన్న ఓఎన్జీసీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ కంపెనీ, అరేబియా సముద్రంలో భారీ ఆయిల్, గ్యాస్ నిక్షేపాలను కనుగొంది. అరేబియా సముద్రంలోని ముంబై హై చమురు క్షేత్రాల్లో ఓఎన్జీసీ ఈ నిక్షేపాలను కనుగొన్నట్లు చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ముంబై హై చమురు క్షేత్రంలో పశ్చిమ ప్రాంతంలో ఈ నిక్షేపాలను ఓఎన్జీసీ కనుగొన్నదని లోక్‌సభకు లిఖిత పూర్వకంగా వెల్లడించిన సమాధానంలో ప్రధాన్ పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణల్లో 29.74 మిలియన్ టన్నుల ఆయిల్, ఆయిల్ సమానమైన గ్యాస్ నిక్షేపాలున్నట్లు అంచనా వేస్తున్నారు. భారత ప్రధాన చమురు క్షేత్రమైన ముంబై హైలో రోజుకు 2,05,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తి అవుతోంది. ఈ కొత్త నిక్షేపాలు కూడా జత అయితే ఈ ఉత్పత్తి మరింతగా పెరుగుతుంది. ముంబై హైలో ఓఎన్జీసీ గత 50 ఏళ్ల నుంచి ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కొత్త నిక్షేపాల కారణంగా కంపెనీ ఉత్పత్తి గతంలో అంచనా వేసినదానికంటే దీర్ఘకాలం కొనసాగనున్నది. -
‘గెయిల్’పై దిగ్గజాల కన్ను!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ(పీఎస్‌యూ) చమురు–గ్యాస్ రంగంలో విలీనాలు మరింత జోరందుకోనున్నాయి. పీఎస్‌యూ గ్యాస్ అగ్రగామి గెయిల్‌ను కొనుగోలు చేసేందుకు ఆయిల్ మార్కెటింగ్ దిగ్గజాలు ఆసక్తి చూపుతున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) ఈ విషయంలో పోటీపడుతున్నాయి. సహజవాయువు ప్రాసెసింగ్, పంపిణీ చేసే గెయిల్‌ను కొనుగోలు చేయడం ద్వారా సమగ్ర ఇంధన వనరుల సంస్థగా ఎదగాలని ఈ కంపెనీలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా ఐవోసీ, బీపీసీఎల్.. కేంద్ర చమురు శాఖకు తమ ప్రతిపాదనలు పంపించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే, గెయిల్ మాత్రం ప్రభుత్వ రంగ గ్యాస్, చమురు దిగ్గజం ఓఎన్జీసీలో విలీనమే సరైన నిర్ణయం కాగలదని భావిస్తోంది. గ్యాస్ ఉత్పత్తి చేసే దిగ్గజానికి తమ రవాణా, మార్కెటింగ్ నెట్వర్క్ తోడైతే.. సమగ్రమైన ఇంధన సంస్థగా ఎదగవచ్చని యోచిస్తోంది. గెయిల్‌లో ప్రభుత్వానికి 54.89 శాతం వాటా ఉంది. దీని విలువ సుమారు రూ. 46,700 కోట్లు. ఈ ఏడాది బడ్జెట్లో బీజం... దేశ, విదేశాల్లోని ప్రైవేట్ రంగ చమురు, గ్యాస్ దిగ్గజ సంస్థలకు దీటుగా ప్రభుత్వ రంగంలోనూ భారీ స్థాయి కంపెనీల రూపకల్పన దిశగా కసరత్తు చేస్తున్నట్లు 2017–18 బడ్జెట్ ప్రసంగంలో పేర్కొనడం ద్వారా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. విలీనాల అవకాశాలను సూచనప్రాయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఒక పీఎస్‌యూని మరో పీఎస్యూలో విలీనం చేయడం ద్వారా వాటిపై నియంత్రణ అధికారం కోల్పోకుండానే.. వాటాల విక్రయం ద్వారా నిధులు సమీకరించుకోవచ్చన్నది ప్రభుత్వ వ్యూహం. అదే సమయంలో అంతర్జాతీయ దిగ్గజాలతో పోటీపడే దీటైన కంపెనీల సృష్టికి, తద్వారా చమురు రేట్లలో హెచ్చుతగ్గులను ఎదుర్కొనడానికి ఇది ఉపయోగపడగలదని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే హెచ్‌పీసీఎల్ విలీన ప్రక్రియలో ఓఎన్జీసీ.. ఓఎన్జీసీ ప్రస్తుతం చమురు రిఫైనింగ్, ఇంధన మార్కెటింగ్ సంస్థ హెచ్‌పీసీఎల్‌ను కొనుగోలు చేసే పనిలో ఉంది. ఈ ప్రతిపాదనకు క్యాబినెట్ ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. హెచ్పీసీఎల్లో ప్రభుత్వానికి ఉన్న 51.11% వాటాలను ఓఎన్జీసీ కొనుగోలు చేస్తోంది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఈ వాటా విలువ దాదాపు రూ. 33,000 కోట్లుగా ఉంటుంది. ఓఎన్జీసీ– హెచ్‌పీసీఎల్ డీల్ పూర్తయిన తర్వాతే.. గెయిల్ అంశాన్ని ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతిపాదనలివీ.. దేశీయంగా అతి పెద్ద చమురు రిఫైనింగ్, ఇంధన మార్కెటింగ్ సంస్థ అయిన ఐవోసీ.. మరో రిఫైనర్‌ని లేదా గెయిల్ వంటి గ్యాస్ కంపెనీని కొనుగోలు చేయాలని యోచిస్తోంది. నగరాల్లో గ్యాస్ సరఫరా ప్రాజెక్టులు, గ్యాస్ మార్కెటింగ్ తదితర కార్యకలాపాలతో పాటు ఎల్ఎన్జీ టెర్మినల్స్ నిర్మాణం మొదలైనవి.. గెయిల్ వంటి గ్యాస్ సంస్థ కొనుగోలుకు తోడ్పడే అంశాలని భావిస్తోంది. దేశంలోనే అతి పెద్ద గ్యాస్ రవాణా, మార్కెటింగ్ కంపెనీ అయిన గెయిల్‌ని దక్కించుకుంటే సమగ్రమైన ఇంధన దిగ్గజంగా ఎదగవచ్చని యోచిస్తోంది. మరోవైపు, గ్యాస్ వ్యాపార విభాగంలో దిగ్గజంగా ఎదగడంపై కసరత్తు చేస్తున్న బీపీసీఎల్ కూడా గెయిల్‌పై తమ ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచింది. కొనుగోలు చేసేందుకు తమ మొదటి ప్రాధాన్యత గెయిల్‌కే ఉంటుందని పేర్కొంది. లేని పక్షంలో రెండో ప్రాధాన్యం కింద ఆయిల్ ఇండియా (ఆయిల్) ఉంటుందని వివరించింది. ప్రస్తుతం ఆయిల్లో కేంద్రానికి 66.13 శాతం వాటాలు ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం దీని విలువ రూ. 18,000 కోట్లు ఉంటుంది. ఈ విలీనాలు పూర్తయితే, ప్రభుత్వ రంగంలో మొత్తం చమురు–గ్యాస్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల సంఖ్య మూడుకు చేరే అవకాశం ఉంది. -
41 చమురు క్షేత్రాలకు ఓఎన్జీసీ, కెయిర్న్ బిడ్లు
న్యూఢిల్లీ: చమురు, గ్యాస్ క్షేత్రాల వేలంలో ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ, కెయిర్న్ ఇండియా సంస్థలు అత్యధిక క్షేత్రాలకు బిడ్లు వేశాయి. ఓపెన్ యాక్రేజ్ లైసెన్సింగ్ విధానం (ఓఏఎల్) కింద తొలిసారిగా నిర్వహించిన వేలంలో ఓఎన్జీసీ 41 క్షేత్రాలకు, వేదాంత గ్రూప్‌లో భాగమైన కెయిర్న్ ఇండియా 15 క్షేత్రాలకు బిడ్లు దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వరంగానికి చెందిన మరో సంస్థ ఆయిల్ ఇండియా, ప్రైవేట్ సంస్థ హిందుస్తాన్ ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ కూడా ఈ వేలంలో పాల్గొన్నాయి. తొలివిడత బిడ్డింగ్‌కి సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు సమర్పించడానికి బుధవారం ఆఖరు రోజు. చివరి రోజు నాటికి 57 బిడ్లు రాగా.. జూలైలోనే అత్యధికంగా 45 బిడ్లు దాఖలయ్యాయి. సెప్టెంబర్‌లో ఒకటి, అక్టోబర్‌లో ఏడు వచ్చాయి. దేశవిదేశాలకు చెందిన పలు దిగ్గజ సంస్థలు ఈ వేలంలో పాల్గొనలేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటన్ సంస్థ బీపీ కూడా దూరంగా ఉన్నాయి. దిగుమతులపై ఆధార పడకుండా దేశీయంగా చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచుకునే దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కేంద్రం ఓఏఎల్ విధానాన్ని రూపొందించింది. గతంలో ప్రభుత్వమే నిర్దిష్ట ప్రాంతాలను ఎంపిక చేసి, వేలం నిర్వహించేది. అయితే, కొత్త విధానంలో ప్రస్తుతం ఉత్పత్తి జరగని ఏ ప్రాంతాన్నైనా కంపెనీలు ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించింది. -
గెయిల్, ఐవోసీలో ఓఎన్జీసీ వాటా విక్రయం..!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం ఓఎన్జీసీ ప్రస్తుతం రిఫైనరీ సంస్థ హెచ్‌పీసీఎల్‌ను కొనుగోలు చేసేందుకు అవసరమైన నిధులను సమీకరించుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, గెయిల్ ఇండియాలో తనకున్న వాటాలను విక్రయించనున్నట్లు కంపెనీ చైర్మన్ డీకే సరాఫ్ చెప్పారు. దేశీయంగా అతి పెద్ద రిఫైనర్ అయిన ఐవోసీలో ఓఎన్జీసీకి 13.77 శాతం వాటా ఉంది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం దీని విలువ సుమారు రూ. 26,600 కోట్లు. ఇక గెయిల్‌లో ఉన్న 4.87 శాతం వాటాల విలువ దాదాపు రూ.1,637 కోట్లు. హెచ్పీసీఎల్లో 51.11 శాతం ప్రభుత్వ వాటాలను కొనుగోలు చేసేందుకు ఓఎన్జీసీకి సుమారు రూ.32,000 కోట్లు కావాలి. స్టాండెలోన్ ప్రాతిపదికన తమకి రుణభారమేదీ లేనందున మార్కెట్ నుంచైనా సమీకరిస్తామని, అలాగే మిగతా చమురు కంపెనీల్లో వాటాలను కూడా విక్రయించి.. హెచ్‌పీసీఎల్ కొనుగోలుకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటామని సరాఫ్ వివరించారు. సంస్థ వద్ద ప్రస్తుతం రూ.10,000 కోట్ల నగదు నిల్వ లుండగా, రూ. 25,000 కోట్ల మేర రుణ సమీకరణ చేసేందుకు కంపెనీ షేర్హోల్డర్లు ఆమోదం తెలిపారని చెప్పారాయన. డిసెంబర్‌లోగా డీల్ ముగిసే అవకాశం ఉందన్నారు. యాజమాన్య బదలాయింపు మొదలైనవేమీ లేనందున ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సిన అవసరం ఉండదని ఆయన స్పష్టం చేశారు. -
అంతర్వేదికరలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్
-
ఓఎన్జీసీ చమురు క్షేత్రాలు ప్రైవేటు పరం?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఓఎన్జీసీకి చెందిన కీలక చమురు క్షేత్రాలను ప్రైవేటీకరణ చేసే ఆలోచనతో ఉంది. చమురు, గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తున్న ముంబై హై తదితర నామినేషన్ బ్లాకుల్లో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు ప్రైవేటు కంపెనీలను అనుమతించాలని అనుకుంటోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను చమురు శాఖ త్వరలోనే కేబినెట్ ముందుకు తీసుకెళ్లనుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం 1999 నుంచి నూతన వెలికితీత లైసెన్స్ విధానం (ఎన్ఈఎల్పీ) కింద వేలంలో కేటాయించిన బ్లాకుల్లోనే ప్రైవేటు కంపెనీలు పాల్గొనేందుకు అనుమతి ఉంది. దీనికి ముందు ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాకు చేసిన కేటాయింపులన్నీ నామినేషన్ విధానంలోనే కొనసాగాయి. ఇప్పుడు ఈ తరహా బ్లాకుల్లోనే మెజారిటీ వాటా కొనుగోలుకు ప్రైవేటు కంపెనీలను అనుమతించనున్నారు. ఓఎన్జీసీ తన మొత్తం చమురు ఉత్పత్తి 25.53 మిలియన్ టన్నుల్లో 87 శాతం నామినేషన్ విధానంలో కేటాయించిన బ్లాకుల నుంచే కావడం గమనార్హం. అలాగే, 23.38 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌లో 95 శాతం ఈ తరహా బ్లాకుల నుంచే వస్తోంది. దేశంలో అతిపెద్ద చమురు క్షేత్రమైన ముంబై హై, అతిపెద్ద గ్యాస్ క్షేత్రం బస్సీన్ కూడా నామినేషన్ విధానంలో కేటాయించినవే. అయితే, ఈ తరహా చమురు, గ్యాస్ క్షేత్రాల్లో ఉత్పత్తి పెరగకుండా ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుండడంతో... ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వల్ల ఉత్పత్తి పెరుగుతుందన్నది కేంద్రం ఉద్దేశంగా ఉంది. ప్రైవేటు సంస్థలు పెట్టుబడులు, టెక్నాలజీతో దీన్ని సాధ్యం చేస్తాయని భావిస్తోంది. ఐవోసీ, గెయిల్‌లో ఓఎన్జీసీ వాటాల అమ్మకం? హెచ్‌పీసీఎల్‌ను కొనేందుకే ఈ నిర్ణయం..! న్యూఢిల్లీ: ఇండియల్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), గెయిల్‌లో తనకున్న వాటాలను విక్రయించే అవకాశం ఉందని ఓఎన్జీసీ తెలిపింది. హెచ్పీసీఎల్లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వాటాను ఓఎన్జీసీ కొంటున్న విషయం తెలిసిందే. ఇందుకు కావాల్సిన రూ.33,000 కోట్ల నిధుల సమీకరణపై కంపెనీ దృష్టి పెట్టింది. కంపెనీకి రుణాలు ఏవీ లేవని, రూ.25,000 కోట్లను రుణాల రూపంలో సమీకరించేందుకు వాటాదారుల అనుమతి తీసుకున్నట్టు ఓఎన్జీసీ చైర్మన్, ఎండీ దినేష్ కె.సరాఫ్ తెలిపారు. ‘‘హెచ్‌పీసీఎల్ కొనుగోలుకు కావాల్సిన నిధుల సమీకరణకు మా ముందు పలు అవకాశాలున్నాయి. స్టాండలోన్‌గా చూసుకుంటే కంపెనీకి ఎటువంటి రుణాలు లేవు. కనుక మార్కెట్ నుంచి రుణాలు తీసుకోగలం. మాకున్న పెట్టుబడులను కూడా అమ్మే అవకాశం ఉంది’’ అని సరాఫ్ వివరించారు. ఐవోసీలో ఓఎన్జీసీకి 13.77 శాతం వాటా ఉంది. దీని మార్కెట్ విలువ రూ.26,450 ఓట్లు. గెయిల్‌లో 4.87 శాతం వాటా ఉండగా, దీని విలువ రూ.1,640 కోట్లు. వాటాల విక్రయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, తమ ముందున్న అవకాశాల్లో ఇదీ ఒకటన్నారు. -
హెచ్‌పీసీఎల్ కొనుగోలు డీల్...
25వేల కోట్లు సమీకరిస్తున్న ఓఎన్జీసీ ► ప్రస్తుతం కంపెనీ వద్ద రూ.13 వేల కోట్ల నగదు నిల్వలు ► కంపెనీ చరిత్రలో తొలిసారి రుణ సమీకరణ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు–గ్యాస్ దిగ్గజం ఓఎన్జీసీ భారీస్థాయిలో రుణ సమీకరణకు సమాయత్తమవుతోంది. మరో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థ హెచ్పీసీఎల్లో కేంద్రానికి ఉన్న 51.11 శాతం వాటాను దక్కించుకోవడం కోసం ఓఎన్జీసీ డైరెక్టర్ల బోర్డు గత నెలలో ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. కేంద్ర కేబినెట్ కూడా దీనికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ కొనుగోలు కోసం దాదాపు రూ.37 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వానికి ఓఎన్జీసీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో స్వదేశీ/విదేశీ మార్కెట్ల నుంచి బాండ్లు, నాన్–కన్వర్టబుల్ డిబెంచర్లు ఇతరత్రా రుణ పత్రాల రూపంలో రూ.25 వేల కోట్ల మొత్తాన్ని సమీకరించడం కోసం త్వరలో వాటాదారుల అనుమతి కోరనుంది. రూపాయి లేదా విదేశీ కరెన్సీ రుణాలు లేదా ఈ రెండింటి ద్వారా ఈ రుణ సమీకరణ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ నెల 27న జరిగే కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) ఈ రుణ సమీకరణపై వాటాదారుల ఓటింగ్ కోసం తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వివరించింది. ప్రస్తుతం ఓఎన్జీసీ వద్ద రూ.13 వేల కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. కంపెనీ చరిత్రలో ఇదే తొలి రుణ సమీకరణ కావడం గమనార్హం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో (ఐఓసీ) ఓఎన్జీసీకి ప్రస్తుతం 13.77% వాటా ఉంది. దీని ప్రస్తుత విలువ సుమారు రూ.28,800 కోట్లు. గెయిల్‌లో ఉన్న 4.83% వాటా విలువ ఇప్పుడు రూ.1,550 కోట్లు. అయితే, హెచ్‌పీసీఎల్ కొనుగోలు కోసం ఇతర పీఎస్‌యూల్లోని తమ వాటాలను విక్రయించబోమని ఓఎన్జీసీ అధికారులు చెబుతున్నారు. డీల్‌కు విధివిధానాలు, సూచనలను బోర్డుకు అందించేందుకుగాను ఆరుగురు సభ్యులతో కంపెనీ ఒక కమిటీని నియమించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగానే(వచ్చే ఏడాది మార్చి నాటికి) ఈ కొనుగోలు పూర్తయ్యే అవకాశం ఉంది. -
సర్కారీ షేర్ల మేళా!
కేంద్రం నుంచి కొత్త ఈటీఎఫ్ ‘భారత్–22’ ► ఆరు రంగాలకు చెందిన షేర్లతో కూర్పు ► ఓఎన్జీసీ, ఐఓసీ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ తదితర 22 షేర్లతో ఏర్పాటు న్యూఢిల్లీ: ‘భారత్–22’ పేరుతో కొత్త ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్)ను ఏర్పాటుచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆరు రంగాల నుంచి ఎంపికచేసిన షేర్లు ఇందులో వుంటాయి. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలతో కూడిన సీపీఎస్ఈ ఈటీఎఫ్‌ను ఏర్పాటుచేసి, మూడు విడతలుగా ఆ యూనిట్లను విక్రయించడం ద్వారా రూ. 8,500 కోట్లు సమీకరించిన ప్రభుత్వం తాజాగా రెండో ఈటీఎఫ్‌కు శ్రీకారం చుట్టింది. ఇంధనం, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్స్, బేస్ మెటల్స్, ఇండస్ట్రియల్, యుటిలిటీస్–ఈ ఆరు రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న షేర్లతో భారత్–22ను నెలకొల్పినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారంనాడిక్కడ మీడియాకు చెప్పారు. ఈ 22 షేర్లలో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వానికి వ్యూహాత్మక వాటా కలిగిన ప్రైవేటు కంపెనీలు వున్నాయి. ఎస్‌యూయూటీఐ (గతంలో యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు చెందిన విభాగం) ద్వారా ప్రభుత్వానికి ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీల్లో వ్యూహాత్మక వాటా వుంది. తాజా ఈటీఎఫ్‌కు ఆయా రంగాలను ఎంపికచేసేటపుడు, ఆ రంగాల్లో జరిగిన సంస్కరణల్ని పరిగణనలోకి తీసుకున్నామని, ఆయా షేర్ల విలువలపై సంస్కరణల సానుకూల ప్రభావం పడుతుందని ఆయన వివరించారు. ప్రభుత్వ బ్యాంకులు కూడా... భారత్–22 జాబితాలో పైన పేర్కొన్న ప్రైవేటు దిగ్గజాలే కాకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు వున్నాయి. ప్రభుత్వ విధానానికి అనుగుణంగా పీఎస్‌యూ బ్యాంకుల్ని భారత్–22లో చేర్చినట్లు జైట్లీ తెలిపారు. పీఎస్‌యూ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను అవసరమైన సమయంలో 52 శాతానికి తగ్గించుకుంటామని ఆయన చెప్పారు. కొత్త ఈటీఎఫ్‌లో ఇంకా ఆయిల్ అండ్ గ్యాస్, కోల్, మైనింగ్ ప్రభుత్వ కంపెనీలైన ఓఎన్జీసీ, ఐఓసీ, బీపీసీఎల్, కోల్ ఇండియా, నాల్కోలు వున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు భారత్ ఎలక్ట్రానిక్స్, ఇంజనీర్స్ ఇండియా, ఎన్బీసీసీ, ఎన్టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, ఎస్జేవీఎన్ఎల్, గెయిల్, పీజీసీఐఎల్, ఎన్ఎల్సీలు కూడా చోటుచేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కొద్దికొద్దిగా ప్రభుత్వ వాటాను ఈటీఎఫ్‌లోకి మళ్లిస్తామని ఆయన వివరించారు. తొలి ఫండ్ ద్వారా ఈటీఎఫ్ ప్రయోగాన్ని ఇండియా విజయవంతంగా అమలుచేసిందని జైట్లీ చెపుతూ ప్రపంచవ్యాప్తంగా ఈటీఎఫ్‌ల కింద 4 ట్రిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నాయన్నారు. పలు పెన్షన్ ఫండ్స్, ప్రభుత్వ ఫండ్స్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులకే మొగ్గుచూపుతున్నందున, వచ్చే నాలుగేళ్లలో ఈ ఆస్తుల విలువ 7 ట్రిలియన్ డాలర్లకు చేరవచ్చన్నది అంచనా అని ఆయన వివరించారు. ఈటీఎఫ్‌లో పెట్టుబడికి రిస్క్ తక్కువని ఆయన అన్నారు. మ్యూచువల్ ఫండ్ తరహాలోనే... మ్యూచువల్ ఫండ్ యూనిట్లలో ఇన్వెస్టర్లు పెట్టుబడి చేసినట్లే..ఈటీఎఫ్ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. ఈ యూనిట్లను కొనుగోలుచేయడం ద్వారా 22 బ్లూచిప్ కంపెనీల్లో ఏకమొత్తంగా ఇన్వెస్ట్ చేసినట్లవుతుంది. ప్రభుత్వం తొలుత ప్రవేశపెట్టిన సీపీఎస్ఈ ఈటీఎఫ్ ద్వారా ఇదేతరహాలో ఇన్వెస్టర్ల నుంచి 3 దశలుగా రూ. 8,506 కోట్లు సమీకరించింది. తొలి ఈటీఎఫ్‌లో ఓఎన్జీసీ, కోల్ఇండియా, ఐఓసీ, గెయిల్, ఆయిల్ ఇండియా, పీఎఫ్సీ, భారత్ ఎలక్ట్రానిక్స్, ఆర్ఈసీ, ఇంజనీర్స్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్లు వున్నాయి. భారత్–22 యూనిట్లను ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా వివిధ దశల్లో ఇన్వెస్టర్లకు విక్రయించనున్నట్లు కేంద్ర పెట్టుబడుల శాఖ కార్యదర్శి నీరజ్ గుప్తా వెల్లడించారు. దీని ద్వారా సేకరించబోయే నిధులకు పరిమితి ఏదీ విధించుకోలేదన్నారు. -
రూ.25వేల కోట్లు చెల్లించండి!
ఓఎన్జీసీ, రిలయన్స్, షెల్‌కు కేంద్రం నోటీసులు న్యూఢిల్లీ: ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, రాయల్ డచ్ షెల్ కంపెనీలకు 3.9 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.25,487 కోట్లు) బకాయిలు చెల్లించాలంటూ కేంద్రం నోటీసులు జారీ చేసింది. దాదాపు రెండు నెలల క్రితం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) జారీ చేసిన ఈ నోటీసు విషయాన్ని తాజాగా ఓఎన్జీసీ ధ్రువీకరించింది. అరేబియా సముద్రంలోని పన్నా–ముక్తా అండ్ తపతీ (పీఎంటీ) చమురు, గ్యాస్ క్షేత్రాల విషయంలో ‘డిఫరెన్షియేట్ గవర్నమెంట్ షేర్ ఆఫ్ ప్రాఫిట్– పెట్రోలియం అండ్ రాయిల్టీ’ కింద చెల్లించాల్సిన మొత్తాల విషయంలో తనకు సానుకూలంగా వచ్చిన ఆర్బిట్రేషన్ అవార్డు అమలు కోసం ప్రభుత్వం తాజా నోటీసులు ఇచ్చినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. పీఎంటీలో ఓఎంజీసీకి 40 శాతం వాటా ఉంది. ఆర్ఐఎల్, షెల్ కంపెనీలకు 30 శాతం చొప్పున వాటా ఉంది. దీనిప్రకారం ఓఎన్జీసీ చెల్లించాల్సిన మొత్తం రూ.10,195 కోట్లు. -
ఓఎన్జీసీ చేతికి హెచ్‌పీసీఎల్
♦ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం ♦ రూ.30,000 కోట్లు కేంద్ర ఖజానాకు ♦ దేశంలో భారీ చమురు కంపెనీ అవతరణ ♦ నేడు పార్లమెంటులో మంత్రి ప్రకటన న్యూఢిల్లీ: దేశంలో భారీ చమురు కంపెనీ ఏర్పాటు దిశగా బుధవారం తొలి అడుగు పడింది. హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో (హెచ్‌పీసీఎల్) కేంద్ర ప్రభుత్వానికి 51.11 శాతం వాటా ఉండగా... ఆ వాటాను ఓఎన్జీసీకి విక్రయించే ప్రతిపాదనకు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఓ అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ విక్రయం వల్ల ప్రభుత్వానికి రూ.26,000 కోట్ల నుంచి రూ.30,000 కోట్ల మేర నిధులు సమకూరనున్నాయి. పెట్టుబడుల ఉపసంహరణతో ఈ ఏడాది రూ.72,500 కోట్లను సమీకరించాలన్న కేంద్ర సర్కారు లక్ష్యంలో సగం ఈ డీల్ ద్వారా రానున్నాయి. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండడంతో కేబినెట్ నిర్ణయాలను బయటకు వెల్లడించలేదు. పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ గురువారం పార్లమెంటులో దీనిపై ఓ ప్రకటన చేస్తారు. ఇతర విలీనాలపై కూడా ఆయన స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. చమురు ఉత్పత్తి నుంచి విక్రయం వరకూ అన్ని కార్యకలాపాలూ నిర్వహించే ఓ అతిపెద్ద కంపెనీని ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఈ ఏడాది బడ్జెట్ ప్రసంగం సందర్భంగా జైట్లీ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. అందుకు సంబంధించిన తొలి అడుగు ఇప్పుడు పడింది. ఈ డీల్ తర్వాత కూడా హెచ్‌పీసీఎల్ లిస్టెడ్ కంపెనీగా ప్రస్తుత తీరులోనే కొనసాగుతుంది. ఓఎన్జీసీతో కలిసి ఒకే లిస్టెడ్ కంపెనీగా కొనసాగే అవకాశం ఉండదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోగా డీల్ పూర్తయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. హెచ్‌పీసీఎల్ బుధవారం నాటి క్లోజింగ్ ధర రూ.384 ప్రకారం ప్రభుత్వానికి రూ.30,000 కోట్లు లభించే అవకాశం ఉండగా, ఏడాది, 26 వారాలు, 60 రోజుల సగటు ధర ఆధారంగా విక్రయ ధర ఉంటుందని ఆ అధికారి తెలిపారు. హెచ్పీసీఎల్లో ఎంఆర్‌పీఎల్ విలీనం! ఈ డీల్ కంటే ముందే ఓఎన్జీసీ అనుబంధ సంస్థగా ఉన్న మంగళూరు రిఫైనరీస్ అండ్ పెట్రోకెమికల్స్‌ను (ఎంఆర్‌పీఎల్) హెచ్‌పీసీఎల్ విలీనం చేసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీంతో ఓఎన్జీసీ పరిధిలోని రిఫైనరీ వ్యాపారం అంతా హెచ్‌పీసీఎల్ నిర్వహణ కిందకు వస్తుంది. ఎంఆర్పీఎల్లో ఓన్జీసీకి 71.63 శాతం వాటా ఉండగా, హెచ్‌పీసీఎల్‌కు 16.96 శాతం వాటా ఉంది. ఎంఆర్‌పీఎల్‌ను తనలో విలీనం చేసుకుంటున్నందున ఓఎన్జీసీకి ఉన్న 71.63 శాతం వాటాకు గాను హెచ్‌పీసీఎల్ సుమారు రూ.16,414 కోట్లను చెల్లించాల్సి రావచ్చు. ఇది కాకుండా ఓఎన్జీసీకి ప్రస్తుతం రూ.13,014 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. ఐవోసీఎల్‌లో 13.77 శాతం వాటా ఉండగా, దాన్ని విక్రయించడం ద్వారా రూ.25,000 కోట్లను సమకూర్చుకునే అవకాశం ఉంది. ఈ రూపేణా హెచ్‌పీసీఎల్ వాటా కొనుగోలుకు అవసరమైన నిధుల సమీకరణకు ఓఎన్జీసీకి అవకాశాలున్నాయి. ఇవేవీ కార్యరూపం దాల్చకుంటే రూ.10,000 కోట్ల మేర రుణాలను సమీకరించాల్సి రావచ్చు. ఓఎన్జీసీ చమురు ఉత్పత్తి కంపెనీ కాగా, హెచ్‌పీసీఎల్ చమురు రిఫైనరీ, రిటైల్ విక్రయాల సంస్థ. తదుపరి మరో విలీనం అంతర్జాతీయంగా చమురు దిగ్గజ కంపెనీలకు పోటీనిచ్చే స్థాయిలో కనీసం ఓ కంపెనీ అయినా ఉండాలన్న ప్రభుత్వ యత్నాలకు తాజా డీల్ కీలకం కానుంది. ఈ మార్గంలో తదుపరి ఆయిల్ ఇండియాను విలీనం చేసుకోవాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్)ను ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. ఆయిల్ ఇండియా ప్రమోటర్ కేంద్రమే. ఇందులో ప్రభుత్వానికి 66.13% వాటా ఉంది. అలాగే, గెయిల్‌లో బీపీసీఎల్‌ను విలీనం చేసే అవకాశాలున్నాయి. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలను విలీనం చేస్తే ఉపయోగమేంటన్న సందేహాలు రావచ్చు. దీనివల్ల వాటి సమర్థత మెరుగుపడడానికి అవకాశం ఉంది. ఒకే కంపెనీ చేతిలో అధిక సామర్థ్యం ఉండడంతో సవాళ్లను తట్టుకునే శక్తి పెరుగుతుంది. అంతర్జాతీయంగా ఆయిల్ మార్కెట్లలోని అస్థిరతలను తట్టుకోగలదు. ఈటీఎఫ్‌లపై ప్రత్యామ్నాయ యంత్రాంగం న్యూఢిల్లీ: ఎక్సే్ఛంజీ ట్రేడెడ్ ఫండ్ల (ఈటీఎఫ్) మార్గంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో (సీపీఎస్ఈ) వాటాల్ని విక్రయించే విషయమై నిర్ణయానికి ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ ప్రత్యామ్నాయ యంత్రాంగానికి అరుణ్‌జైట్లీ సారథ్యంలోని మంత్రుల బృందం నాయకత్వం వహిస్తుంది. దీన్లో రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీతో పాటు సంబంధిత శాఖల మంత్రులు సభ్యులుగా ఉంటారు. ఏయే లిస్టెడ్ ఆర్థిక సంస్థల షేర్లను ఈటీఎఫ్‌లో చేర్చాలి వంటి అంశాలను ప్రత్యామ్నాయ యంత్రాంగం ఖరారు చేస్తుంది. మరోవైపు, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్లో 51.11 శాతం ప్రభుత్వ వాటాలను ఓఎన్జీసీకి విక్రయించే ప్రతిపాదనకు కూడా సీసీఈఏ ఆమోదముద్ర వేసింది. -
3 బిలియన్ డాలర్లు కట్టండి
పీఎంటీ క్షేత్రాలపై ఆర్ఐఎల్, షెల్, ఓఎన్జీసీకి ప్రభుత్వం నోటీసులు న్యూఢిల్లీ: పన్నా/ముక్తా, తపతి (పీఎంటీ) చమురు, గ్యాస్ క్షేత్రాల్లో ఉత్పత్తి వ్యయాల రికవరీకి సంబంధించి 3 బిలియన్ డాలర్లు చెల్లించాలంటూ ఆపరేటర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, రాయల్ డచ్ షెల్, ఓఎన్జీసీ సంస్థలకు డీజీహెచ్ నోటీసులు పంపింది. 2016 అక్టోబర్ నాటి ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ పాక్షిక ఉత్తర్వుల ప్రకారం అసలు, వడ్డీ, ఇతర చార్జీలతో కలిపి ఈ మొత్తం చెల్లించాలని మే ఆఖరులో పంపిన డిమాండ్ నోటీసులో సూచించింది. అయితే, ఇందుకు ఆఖరు తేదీ, చెల్లించకపోతే పర్యవసానాలు వంటివేమీ అందులో పేర్కొనలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ తుది ఉత్తర్వులు వెలువరించడానికి ముందుగానే ‘పాక్షిక’ ఆర్బిట్రేషన్ అవార్డు ఆధారంగా డీజీహెచ్ ఈ నోటీసు జారీ చేసినట్లు వివరించాయి. మరోవైపు పరిహార మొత్తాన్ని (ఏదైనా కట్టాల్సింది ఉంటే) ఆర్బిట్రేషన్ ప్యానెల్ పూర్తిగా ఖరారు చేయకముందే ఇటువంటి చర్యలు సరికాదని ఆర్ఐఎల్ వర్గాలు పేర్కొన్నాయి. నోటీసులకు తగు వివరణ ఇప్పటికే పంపినట్లు తెలిపాయి. వివరాల్లోకి వెడితే.. పీఎంటీలో ఆర్ఐఎల్, బీజీ ఎక్స్‌ప్లొరేషన్‌కు చెరి 30 శాతం, ఓఎన్జీసీకి మిగతా వాటాలు ఉన్నాయి. బీజీని టేకోవర్ చేసిన షెల్ ఆ తర్వాత దాని స్థానంలో వాటాలు దక్కించుకుంది. వ్యయాల రికవరీ, లాభాల్లో వాటాలు, ఉత్పత్తి పంపక ఒప్పందంలోని (పీఎస్సీ) అకౌంటింగ్ విధానాలు మొదలైన అంశాలపై ఆపరేటర్లకు, ప్రభుత్వానికి మధ్య వివాదం తలెత్తింది. దీనిపై 2010లో ఆర్ఐఎల్ .. ప్రభుత్వంపై ఆర్పిట్రేషన్ ట్రిబ్యునల్‌కు వెళ్లగా 2012లో దానికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. అయితే, ప్రభుత్వం వీటిని సవాలు చేసింది. తదుపరి బ్రిటన్‌లో ఆర్బిట్రేషన్ కమిటీ.. ప్రభుత్వానికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. -
అంతర్వేదిలో మళ్లీ గ్యాస్ లీక్
సఖినేటిపల్లి: ఓఎన్జీసీ బావి నుంచి గ్యాస్ లీక్ అవుతుండటంతో స్థానికం భయాందోళనలకు గురవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదికర గ్రామ శివారులోని 20వ నెంబర్ బావి నుంచి శుక్రవారం ఉదయం గ్యాస్ లీక్ అవుతుండటంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మరమ్మతులు చేస్తున్నారు. గ్యాస్ లీక్ ను అదుపులోకి తీసుకురావడానికి యత్నిస్తున్నారు.