
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జూలై–సెప్టెంబర్‌లో నికర లాభం 20 శాతం క్షీణించి రూ. 10,216 కోట్లకు పరిమితమైంది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 12,826 కోట్ల నికర లాభం ఆర్జించింది.
చమురు ఉత్పత్తితోపాటు ధరలు తగ్గడం ప్రభావం చూపింది. ఈ ఏడాది క్యూ1 (ఏప్రిల్–జూన్)లోనూ నికర లాభం 34 శాతం వెనకడుగు వేయడం గమనార్హం! కాగా.. ప్రతీ బ్యారల్ చమురుకు 84.84 డాలర్లు లభించగా.. గత క్యూ2లో 95.5 డాలర్లు సాధించింది. రష్యా–ఉక్రెయిన్ మధ్య తలెత్తిన యుద్ధం కారణంగా క్యూ1లో చమురు ధరలు పెరిగినప్పటికీ తిరిగి క్యూ2లో కొంతమేర నీరసించాయి.
ఫలితాల నేపథ్యంలో ఓఎన్‌జీసీ షేరు 0.6% నీరసించి రూ. 196 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment