second quarter results
-
టాటా మోటార్స్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 10 శాతం క్షీణించి రూ. 3,450 కోట్లకు పరిమితమైంది. అమ్మకాలు తగ్గడం ప్రభావం చూపింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 3,832 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 1,04,444 కోట్ల నుంచి రూ. 1,00,534 కోట్లకు వెనకడుగు వేసింది. మొత్తం వ్యయాలు సైతం రూ. 1,00,649 కోట్ల నుంచి రూ. 97,330 కోట్లకు తగ్గాయి. ప్యాసింజర్ వాహన విభాగం నుంచి 4 శాతం తక్కువగా రూ. 11,700 కోట్ల ఆదాయం లభించగా.. అమ్మకాలు 6% నీరసించి 1,30,500 యూనిట్లకు పరిమితమైనట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. వాణిజ్య వాహన(సీవీ) అమ్మకాలు 20 శాతం క్షీణించి 79,800 యూనిట్లను తాకాయి. ఎగుమతులు 11% తగ్గి 4,400 యూనిట్లకు చేరాయి. సీవీ బిజినెస్ ఆదాయం 14% తక్కువగా రూ. 17,300 కోట్లకు పరిమితమైంది. జేఎల్ఆర్ డీలా లగ్జరీ కార్ల బ్రిటిష్ అనుబంధ సంస్థ జేఎల్ఆర్ ఆదాయం 6 శాతం నీరసించి 6.5 బిలియన్ పౌండ్లకు పరిమితమైనట్లు టాటా మోటార్స్ పేర్కొంది. అల్యూమినియం సరఫరాల తాత్కాలిక సమస్యలతో లాభాలు ప్రభావితమైనట్లు తెలియజేసింది. వీటికితోడు 6,029 వాహనాలను అదనపు నాణ్యతా సంబంధ పరిశీలనలకోసం నిలిపిఉంచినట్లు వెల్లడించింది. దీంతో డిమాండుకు అనుగుణంగా వాహన డెలివరీలను చేపట్టలేకపోయినట్లు తెలియజేసింది. ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తి కోసం యూకే హేల్ఉడ్ ప్లాంట్‌పై 25 కోట్ల పౌండ్లను ఇన్వెస్ట్ చేసినట్లు జేఎల్ఆర్ సీఈవో అడ్రియన్ మార్డెల్ పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో టాటా మోటార్స్ షేరు బీఎస్ఈలో 1.7 శాతం నష్టంతో రూ. 806 వద్ద ముగిసింది. -
ఎస్బీఐ లాభం రయ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 23 శాతం జంప్‌చేసి రూ. 19,782 కోట్లను తాకింది. వడ్డీయేతర ఆదాయం, ట్రెజరీ లాభాలు పుంజుకోవడం ఇందుకు తోడ్పాటునిచ్చాయి. స్టాండెలోన్ లాభం సైతం రూ. 18,331 కోట్లకు ఎగసింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 14,330 కోట్లు మాత్రమే ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం 5 శాతంపైగా పుంజుకుని రూ. 41,620 కోట్లకు చేరింది. రుణాల్లో 15 శాతం వృద్ధి ఇందుకు సహకరించినప్పటికీ నికర వడ్డీ మార్జిన్లు 0.15% నీరసించి 3.14 శాతానికి పరిమితమయ్యాయి. ఫారెక్స్, ట్రెజరీ మద్దతుతో వడ్డీయేతర ఆదాయం 42% జంప్‌చేసి రూ. 15,721 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం రూ. 1.29 లక్షల కోట్లకు చేరింది. రుణాల్లో 14–16% వృద్ధిని అంచనా వేస్తున్నట్లు బ్యాంక్ చైర్మన్ సీఎస్ శెట్టి పేర్కొన్నారు. అయితే డిపాజిట్లలో వృద్ధి 10 శాతానికి పరిమితంకావచ్చని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో(ఏప్రిల్–సెపె్టంబర్) రూ. 63,895 కోట్ల నిర్వహణ లాభం సాధించినట్లు తెలియజేశారు. ఈ బాటలో నికర లాభాల్లోనూ రూ. లక్ష కోట్ల మార్క్‌ను చేరుకునే లక్ష్యంతో ఉన్నట్లు పేర్కొన్నారు. ఎన్పీఏలు తగ్గాయ్... ప్రస్తుత సమీక్షా కాలంలో ఎస్బీఐ తాజా స్లిప్పేజీలు రూ. 3,831 కోట్లకు పరిమితంకాగా.. రూ. 2,300 కోట్ల రికవరీలు అందుకుంది. త్రైమాసికవారీగా స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 2.21 శాతం నుంచి 2.13 శాతానికి తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి 13.76 శాతంగా నమోదైంది. అనుబంధ సంస్థల విషయానికొస్తే జీవిత బీమా విభాగం నికర లాభం ఆరు నెలల్లో రూ. 761 కోట్ల నుంచి రూ. 1,049 కోట్లకు జంప్‌చేసింది. క్రెడిట్ కార్డుల విభాగం లాభం మాత్రం రూ. 1,196 కోట్ల నుంచి రూ. 999 కోట్లకు తగ్గింది. ఏఎంసీ నికర లాభం రూ. 940 కోట్ల నుంచి రూ. 1,374 కోట్లకు పెరిగింది. ఇక సాధారణ బీమా సంస్థ లాభం రూ. 60 కోట్ల నుంచి రూ.414 కోట్లకు ఎగసింది. ఫలితాల నేపథ్యంలో ఎస్బీఐ షేరు ధర 2 శాతం నష్టంతో రూ.843 వద్ద ముగిసింది. -
ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ లాభం డౌన్
న్యూఢిల్లీ: మురుగప్ప గ్రూప్ కంపెనీ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 14 శాతం క్షీణించి రూ. 299 కోట్లకు పరిమితమైంది. అధిక వ్యయాలు ప్రభావం చూపాయి. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 346 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 4,169 కోట్ల నుంచి రూ. 4,783 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు సైతం రూ. 3,868 కోట్ల నుంచి రూ. 4,569 కోట్లకు పెరిగాయి. కాగా.. ఆదాయంలో ఇంజినీరింగ్ విభాగం నుంచి రూ. 1,323 కోట్లు లభించగా.. మెటల్ ఆధారిత ప్రొడక్టుల నుంచి రూ. 404 కోట్లు, మొబిలిటీ బిజినెస్ నుంచి రూ. 168 కోట్లు చొప్పున అందుకుంది. ఫలితాల నేపథ్యంలో టీఐఇండియా షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 4 శాతం పతనమై రూ. 4,312 వద్ద ముగిసింది. -
నష్టాల్లోకి ఇండిగో
న్యూఢిల్లీ: విమానయాన రంగ దిగ్గజం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు వెల్లడించింది. ఏడు త్రైమాసికాల తదుపరి జులై–సెపె్టంబర్(క్యూ2)లో లాభాలను వీడింది. రూ. 986 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అధిక ఇంధన వ్యయాలు, ఇంజిన్ సమస్యలతో కొన్ని విమానాలు నిలిచిపోవడం లాభాలను దెబ్బతీశాయి. విదేశీ మారక ప్రభావాన్ని మినహాయిస్తే రూ. 746 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. ఇండిగో బ్రాండుతో సరీ్వసులందిస్తున్న కంపెనీ గతేడాది(2023–24) ఇదే కాలంలో నికరంగా రూ. 189 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 15 శాతం పుంజుకుని రూ. 17,800 కోట్లను తాకింది. ఇంధన వ్యయాలు 13 శాతం పెరిగి రూ. 6,605 కోట్లకు చేరాయి. కొత్త బిజినెస్ క్లాస్: ఢిల్లీ–ముంబై మార్గంలో కస్టమర్ల అవసరాలకు అనుగుణమైన బిజినెస్ క్లాస్‌ను ప్రవేశపెడుతున్నట్లు ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నారు. తదుపరి దశలో 40కుపైగా విమానాలను 12 మెట్రో రూట్లలో ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేశారు. మరిన్ని విదేశీ రూట్లకు సరీ్వసులను విస్తరించనున్నట్లు వెల్లడించారు. ఇండిగో ప్రస్తుతం 410 విమానాలను కలిగి ఉంది. వెరసి మొత్తం వ్యయాలు 22 శాతం పెరిగి రూ. 18,666 కోట్లను తాకాయి. 6%అధికంగా 2.78 కోట్ల ప్యాసింజర్లు ప్రయాణించగా.. టికెట్ల ఆదాయం 10 శాతం ఎగసి రూ. 14,359 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ఇండిగో షేరు బీఎస్ఈలో 3.5 శాతం క్షీణించి రూ. 4,365 వద్ద ముగిసింది. -
ఎన్టీపీసీ రూ. 2.50 డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్టీపీసీ లాభం 14 శాతం ఎగిసి రూ. 5,380 కోట్లకు చేరింది. గత క్యూ2లో ఇది రూ. 4,726 కోట్లు. అయితే, ఆదాయం రూ. 45,385 కోట్ల నుంచి రూ. 45,198 కోట్లకు తగ్గింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 10 ముఖ విలువ గల షేర్లపై రూ. 2.50 చొప్పున తొలి మధ్యంతర డివిడెండ్ ఇచ్చే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. డివిడెండ్ చెల్లింపు తేదీ నవంబర్ 18గా ఉంటుంది. లడఖ్‌లోని చుషుల్‌లో సోలార్ హైడ్రోజన్ ఆధారిత మైక్రోగ్రిడ్‌ను ఏర్పాటు చేసేందుకు భారతీయ ఆర్మీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ తెలిపింది. రెండో త్రైమాసికంలో స్థూల విద్యుదుత్పత్తి 90.30 బిలియన్ యూనిట్ల నుంచి 88.46 యూనిట్లకు తగ్గింది. క్యాప్టివ్ బొగ్గు గనుల నుంచి ఉత్పత్తి 5.59 మిలియన్ టన్నుల నుంచి 9.03 ఎంఎంటీకి పెరిగింది. గ్రూప్ స్థాయిలో స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 73,824 మెగావాట్ల నుంచి 76,443 మెగావాట్లకు చేరింది. -
ఐటీసీ లాభం ఫ్లాట్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జూలై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం స్వల్పంగా 2 శాతం పెరిగి రూ. 5,054 కోట్లను అధిగమించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 4,965 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 16 శాతం ఎగసి రూ. 22,282 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 19,270 కోట్ల టర్నోవర్ సాధించింది. హోటళ్ల బిజినెస్ ఏకీకృతం ప్రస్తుతం హోటళ్ల బిజినెస్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీసే ప్రణాళికల్లో ఉన్న ఐటీసీ బోర్డు తాజాగా ప్రత్యర్థి సంస్థలలో గల వాటాలను ఏకీకృతం చేసే ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. సొంత అనుబంధ సంస్థ రస్సెల్ క్రెడిట్(ఆర్సీఎల్) ద్వారా ఆతిథ్య రంగ దిగ్గజాలు ఒబెరాయ్, లీలా హోటళ్లలోగల వాటాలను కొనుగోలు చేయనుంది. ఈఐహెచ్(ఒబెరాయ్) లిమిటెడ్‌లో 1.52 కోట్ల ఈక్విటీ షేర్లను, హెచ్ఎల్వీ(లీలా)లో 34.6 లక్షల షేర్లను బుక్ విలువ ఆధారంగా కొనుగోలు చేయనుంది. దీంతో ఈఐహెచ్‌లో ఐటీసీకి 16.13 శాతం, హెచ్ఎల్వీలో 8.11 శాతం చొప్పున వాటా లభించనుంది. ప్రస్తుతం ఈఐహెచ్‌లో ఐటీసీకి 13.69 శాతం, ఆర్సీఎల్కు 2.44 శాతం చొప్పున వాటా ఉంది. ఇక హెచ్ఎల్వీలో ఐటీసీకి 7.58 శాతం వాటా ఉంది. ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు బీఎస్ఈలో 2 శాతం క్షీణించి రూ. 472 వద్ద ముగిసింది. -
హెచ్‌యూఎల్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం స్వల్పంగా 2 శాతంపైగా క్షీణించి రూ. 2,595 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 2,657 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు షేరుకి రూ. 19 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. దీనికి జతగా మరో రూ. 10 ప్రత్యేక డివిడెండ్‌ను చెల్లించేందుకు బోర్డు అనుమతించింది. దీంతో మొత్తం రూ. 29 (రూ.6,814 కోట్లు) డివిడెండ్ చెల్లించనుంది.ఆదాయం ప్లస్...తాజా క్యూ2లో హెచ్‌యూఎల్ మొత్తం టర్నోవర్ 2%పైగా బలపడి రూ. 16,145 కోట్లను తాకింది. దీనిలో ప్రొడక్టుల విక్రయాలు 2 శాతం వృద్ధితో రూ. 15,703 కోట్లకు చేరాయి. పట్టణాల్లో డిమాండ్ తగ్గినా గ్రామీణ ప్రాంతాలలో క్రమంగా పుంజుకుంటున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ రోహిత్ జావా పేర్కొన్నారు.ఐస్‌క్రీమ్ బిజినెస్ విడదీత..: క్వాలిటీ వాల్స్, కార్నెటో, మ్యాగ్నమ్ బ్రాండ్లను కలిగిన ఐస్‌క్రీమ్ బిజినెస్‌ను విడదీయనున్నట్లు హెచ్‌యూఎల్ వెల్లడించింది. స్వతంత్ర కమిటీ సలహామేరకు ఐస్‌క్రీమ్ బిజినెస్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీసేందుకు నిర్ణయించినట్లు హెచ్‌యూఎల్ సీఎఫ్‌వో రితేష్ తివారీ చెప్పారు.ఫలితాల నేపథ్యంలో హెచ్‌యూఎల్ షేరు బీఎస్ఈలో 1 శాతం నష్టంతో రూ. 2,658 వద్ద ముగిసింది. -
క్యూ2 ఫలితాలదే పైచేయి
దేశీ స్టాక్ మార్కెట్లను ఈ వారం ప్రధానంగా కార్పొరేట్ ఫలితాలు నిర్దేశించనున్నాయి. గత వారాంతాన పలు దిగ్గజాలు జులై–సెపె్టంబర్(క్యూ2) ఫలితాలు వెల్లడించాయి. బ్యాంకింగ్ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ, కొటక్ మహీంద్రాసహా ఆర్బీఎల్ బ్యాంక్, యుకో బ్యాంక్, ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికం పనితీరు ప్రకటించాయి. దీంతో సోమవారం ప్రధానంగా ఈ కౌంటర్లలో యాక్టివిటీ కనిపించనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. కాగా.. ఈ వారం మరిన్ని రంగాలకు చెందిన బ్లూచిప్ కంపెనీలు క్యూ2 ఫలితాలు వెల్లడించనున్నాయి. జాబితాలో ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు ఐటీసీ, హచ్‌యూఎల్, రిఫైనరీ దిగ్గజాలు బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, సిమెంట్ దిగ్గజం అల్ట్రాటెక్ తదితరాలున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. ఇదేవిధంగా ఫైనాన్స్ దిగ్గజాలు బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఇటీవలే స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌తోపాటు.. అదానీ గ్రీన్ ఎనర్జీ, వన్97 కమ్యూనికేషన్స్(పేటీఎమ్), జొమాటో, బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) సైతం ఫలితాలు ప్రకటించనున్నాయి. చమురు ధరలు సైతం ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ముదిరిన వివాదాలతో ఇటీవల ముడిచమురు ధరలకు రెక్కలొస్తున్నాయి. వారాంతాన బ్రెంట్ చమురు బ్యారల్ 75 డాలర్లకు చేరింది. దీనికిజతగా అన్నట్లు విదేశీ మార్కెట్లో పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 2,730 డాలర్ల ఆల్‌టైమ్ గరిష్టాన్ని దాటింది. చమురు, పసిడి ధరల పెరుగుదల వాణిజ్యలోటును పెంచే వీలుంది. దీనికితోడు ఇటీవల డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడుతోంది. చరిత్రత్మాక కనిష్టం 84కు బలహీనపడి కదులుతోంది. ఇవి ప్రతికూల అంశాలుగా మార్కెట్ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. ఇరాన్– ఇజ్రాయెల్ యుద్ధ భయాలు, చమురు ధరల సెగ మార్కెట్లలో ఆటుపోట్లకు కారణమయ్యే అవకాశమున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేష్ గౌర్ తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు కార్పొరేట్ ఫలితాలను నిశితంగా గమనిస్తారని మిశ్రా చెబుతున్నారు. గత వారమిలా పలు ఆటుపోట్ల మధ్య గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్ప వెనకడుగు వేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 157 పాయింట్లు(0.2 శాతం) క్షీణించి 81,225 వద్ద ముగిసింది. నిఫ్టీ కొంత అధికంగా 110 పాయింట్లు(0.4 శాతం) నీరసించి 24,854 వద్ద నిలిచింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.2 శాతమే నష్టపోగా.. స్మాల్ క్యాప్ 1 శాతంపైగా క్షీణించింది. ఎఫ్‌పీఐ అమ్మకాలు భౌగోళిక, రాజకీయ అనిశి్చతులు, చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా సెంటిమెంటు బలహీనపడినట్లు మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్(రీసెర్చ్) ప్రశాంత్ తాప్సే పేర్కొన్నారు. మరోపక్క దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) నిరవధిక అమ్మకాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలకు తెరతీస్తున్నట్లు వివరించారు. ఈ నెలలో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్స్‌లో నికరంగా రూ. 74,700 కోట్ల విలువైన అమ్మకాలు చేట్టారు. అయితే ఇందుకు ధీటుగా దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(డీఐఐలు) కొనుగోళ్లు చేపడుతుండటం గమనార్హం! ఈ ట్రెండ్ సమీపకాలంలో కొనసాగవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. చైనా స్టాక్స్ చౌకగా లభిస్తుండటం, దేశీ మార్కెట్లు అధిక విలువలకు చేరుకోవడం ఎఫ్‌పీఐలపై ప్రభావం చూపుతున్నట్లు విశ్లేíÙంచారు. కాగా.. క్యూ2లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 6 శాతం వృద్ధితో రూ. 17,286 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కొటక్ బ్యాంక్ 13 శాతం అధికంగా రూ. 5,044 కోట్ల నికర లాభం ఆర్జించింది. టెక్ మహీంద్రా 60.3 కోట్ల డాలర్ల(రూ. కోట్లు) విలువైన కొత్త డీల్స్ కుదుర్చుకుంది. ఈ వివరాలు శనివారం(19న) వెల్లడయ్యాయి. వీటి ప్రభావం నేడు(21న) ఆయా స్టాక్స్‌పై కనిపించనున్నట్లు విశ్లేషకులు అంచనా వేశారు.క్యూ2 ఫలితాలదే పైచేయిఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సొల్యూషన్స్ అందించే బ్లూ క్లౌడ్ సాఫ్టెక్ సంస్థ తమ షేర్లను 2:1 నిష్పత్తిలో విభజించనుంది. ఈ ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపినట్లు వివరించింది. దీని ప్రకారం రూ. 2 ముఖ విలువ ఉండే ఒక్కో షేరును రూ. 1 ముఖ విలువ ఉండే షేరుగా విభజిస్తారు. కంపెనీ ఇటీవలే బ్లూహెల్త్ అప్లికేషన్, బ్లూరా, ఎడ్యుజీనీ, బయోస్టర్ పేరిట నాలుగు ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఉత్పత్తులను ఆవిష్కరించింది.నవంబర్ 1న ముహూరత్ ట్రేడింగ్దీపావళి సందర్భంగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈ రెడీ స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ దీపావళి పండుగ సందర్భంగా యథావిధిగా ముహూరత్(మూరత్) ట్రేడింగ్‌ను చేపట్టనున్నాయి. ఇందుకు నవంబర్ 1న(శుక్రవారం) సాయంత్రం 6 నుంచి 7వరకూ గంటపాటు ప్రత్యేక ట్రేడింగ్‌కు తెరతీయనున్నాయి. తద్వారా స్టాక్ మార్కెట్‌కు కొత్త ఏడాది సంవత్ 2081 ప్రారంభంకానున్నట్లు ఎక్సే్ఛంజీలు ఒక ప్రకటనలో తెలియజేశాయి. హిందువుల క్యాలండర్ ప్రకారం దీపావళికి ప్రారంభమయ్యే కొత్త ఏడాది తొలి రోజు చేపట్టే ముహూరత్ ట్రేడింగ్ ఆర్థికంగా శుభాన్ని, లాభాన్ని కలగజేస్తుందని స్టాక్ మార్కెట్ వర్గాలు భావిస్తుంటాయి. కాగా.. దీపావళి రోజు మార్కెట్లలో సాధారణ ట్రేడింగ్ ఉండదు. దీనిస్థానే సాయంత్రం గంటపాటు ప్రత్యేక ట్రేడింగ్‌ను నిర్వహిస్తారు. 5.45కల్లా ప్రీఓపెనింగ్ సెషన్ ప్రారంభమవుతుంది. ఈక్విటీ, ఎఫ్‌అండ్‌వో, కమోడిటీ, కరెన్సీ డెరివేటివ్స్ ట్రేడింగ్‌కు వీలుంటుంది.పీఎస్‌యూలలో ట్రేడింగ్‌కు నో ప్రభుత్వ అధికారులకు దీపమ్ ఆదేశాలుప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)ల షేర్లలో ట్రేడింగ్ చేపట్టవద్దంటూ ఆర్థిక శాఖ నిర్వహణలోని దీపమ్ అంతర్గత ఆదేశాలు జారీ చేసింది. ఆయా కంపెనీలకు సంబంధించిన మార్కెట్లపై ప్రభావం చూపగల రహస్య సమాచారం అందుబాటులో ఉంటుందన్న యోచనతో దీపమ్ తాజా నిర్ణయం తీసుకుంది. ఆయా శాఖలలో చేరేందుకు ఎంపికయ్యే వ్యక్తులు పీఎస్‌యూలలో షేర్లను కలిగి ఉంటే ముందుగానే వెల్లడించవలసిందిగా తెలియజేసింది. అధికారిక అనుమతులు పొందాక మాత్రమే వీటిని విక్రయించేందుకు వీలుంటుందని వివరించింది. పీఎస్‌యూలలో ప్రభుత్వ ఈక్విటీని దీపమ్ మేనేజ్ చేస్తుంటుంది. అంతేకాకుండా పీఎస్‌యూలలో ప్రభుత్వానికి చెందిన మైనారిటీ వాటా లేదా వ్యూహాత్మక వాటాల విక్రయం, ఎంపిక చేసిన కంపెనీల ప్రయివేటైజేషన్ తదితరాలను చేపట్టే సంగతి తెలిసిందే. వెరసి షేర్ల ధరలను ప్రభావితం చేయగల సమాచారం అందుబాటులో ఉంటుందన్న కారణంతో పీఎస్‌యూలలో ట్రేడింగ్ చేపట్టవద్దంటూ ప్రభుత్వ అధికారులకు అంతర్గత ఆదేశాల ద్వారా దీపమ్ స్పష్టం చేసింది. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ప్రభుత్వం గతేడాది(2023–24) రూ. 16,507 కోట్ల విలువైన సీపీఎస్ఈ షేర్లను విక్రయించిన విషయం విదితమే. అంతక్రితం ఏడాది(2022–23)లోనూ రూ. 35,294 కోట్లు సమీకరించింది. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) జీఐసీ, కొచిన్ షిప్‌యార్డ్‌లలో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా రూ. 5,160 కోట్లు అందుకుంది.చిన్నషేర్ల ఫండ్స్‌కు భారీ పెట్టుబడులు 6 నెలల్లో రూ. 30,352 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి ఆరు నెలల్లో మధ్య, చిన్నతరహా షేర్ల ఫండ్స్‌కు మరోసారి పెట్టుబడులు భారీగా తరలివచ్చాయి. వెరసి ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌కు రూ. 30,352 కోట్లు ప్రవహించాయి. మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్(యాంఫీ) వివరాల ప్రకారం మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ. 14,756 కోట్లు, స్మాల్‌క్యాప్ ఫండ్స్ రూ. 15,586 కోట్లు చొప్పున పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. ఇందుకు మధ్య, చిన్నతరహా షేర్ల విభాగాలు ఆకట్టుకునే స్థాయిలో రిటర్నులు సాధించడం ప్రభావం చూపింది. గతేడాది(2023–24) తొలి ఆరు నెలల్లోనూ మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌కు రూ. 32,924 కోట్ల పెట్టుబడులు లభించాయి. ఓవైపు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఈ అంశంపై ఆందోళనలు వ్యక్తం చేసినప్పటికీ ఈ ఏడాది పెట్టుబడులు కొనసాగడం గమనార్హం! అధిక రిటర్నులు మిడ్, స్మాల్ క్యాప్స్ అత్యధిక లాభాలు అందించగలవన్న ఇన్వెస్టర్ల విశ్వాసమే ఇందుకు కారణమని ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) సీఈవో సందీప్ బాగ్లా, ట్రేడ్జినీ సీవోవో ట్రివేష్ పేర్కొన్నారు. ఇకపైన కూడా చిన్న షేర్లు వేగవంతంగా వృద్ధి చెందనున్నట్లు అభిప్రాయపడ్డారు. అధిక వృద్ధిగల రంగాలలో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు. వెరసి స్మాల్ క్యాప్ ఫండ్స్ పోర్ట్‌ఫోలియో కేటాయింపుల్లో భాగమైపోయినట్లు వివరించారు. ఈ ఏడాది ఇప్పటివరకూ మిడ్ క్యాప్ ఇండెక్స్ 20 శాతం, స్మాల్ క్యాప్ 24 శాతం చొప్పున ర్యాలీ చేశాయి. తద్వారా నిఫ్టీ, లార్జ్‌క్యాప్ ఇండెక్సులను అధిగమించాయి. 2024 మార్చిలో స్ట్రెస్ టెస్ట్ సైతం ఇందుకు కీలకపాత్ర పోషించినట్లు ఆనంద్ రాఠీ వెల్త్ డిప్యూటీ సీఈవో ఫిరోజ్ అజీజ్ తెలియజేశారు. దీంతో ఫండ్ మేనేజర్లు మార్కెట్ ఆటుపోట్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధపడినట్లు వివరించారు.సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఒక షేర్ ఉంటే మరో షేర్ ఉచితం
ముంబై: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం విప్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 21 శాతంపైగా ఎగసి రూ. 3,209 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 2,646 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం నామమాత్రంగా తగ్గి రూ. 22,302 కోట్లకు పరిమితమైంది. గత క్యూ2లో రూ. 22,516 కోట్ల టర్నోవర్ అందుకుంది. వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయనుంది. ఇందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వెరసి వాటాదారులవద్దగల ప్రతీ షేరుకి మరో షేరుని డిసెంబర్ 15కల్లా ఉచితంగా కేటాయించే వీలుంది. గైడెన్స్ వీక్ ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో పనిదినాలు తగ్గడం, సీజనల్ బలహీనతలు ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు విప్రో సీఈవో, ఎండీ శ్రీని పల్లియా పేర్కొన్నారు. దీంతో క్యూ3 ఆదాయంలో వృద్ధి అంచనా(గైడెన్స్)లను –2 నుంచి 0 శాతానికి సవరించారు. ఇంతక్రితం –1 నుంచి +1% గైడె న్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాన క్లయింట్లను పెంచుకోవడంతోపాటు.. మరోసారి భారీ డీల్స్ బుకింగ్స్ బిలియన్ డాలర్లను దాటినట్లు పల్లియా వెల్లడించారు. ఆన్‌బోర్డింగ్ పూర్తిచేస్తాం ఈ డిసెంబర్‌కల్లా మొత్తం రిక్రూట్మెంట్ బ్యాక్‌లాగ్స్‌ను పూర్తి చేయనున్నట్లు విప్రో చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ పేర్కొన్నారు. ఐటీ కంపెనీలు 6 నెలల నుంచి 2ఏళ్లవరకూ ఆన్‌బోర్డింగ్‌ను ఆలస్యం చేస్తున్నట్లు వెలువడుతున్న విమర్శలకు చెక్ పెడుతూ గోవిల్ క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో అన్ని ఆఫర్లను క్లియర్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ప్రతీ త్రైమాసికంలోనూ 2,500–3,000 మంది ఫ్రెషర్స్‌ను తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రస్తుతం విప్రో మొత్తం సిబ్బంది సంఖ్య 2,33,889ను తాకింది. 44,000 మందికి శిక్షణ క్యాప్కో పురోగతి కొనసాగుతున్నట్లు పల్లియా పేర్కొన్నారు. బీఎఫ్ఎస్ఐ, కన్జూమర్, టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ రంగాలలో వృద్ధిని అందుకున్నట్లు తెలియజేశారు. ఏఐ ఆధారిత విప్రోను పటిష్టపరచేందుకు పెట్టుబడులు కొనసాగిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం అడ్వాన్స్డ్ ఏఐలో 44,000మంది ఉద్యోగులకు శిక్షణ పూర్తిచేసినట్లు వెల్లడించారు. సెపె్టంబర్లో ప్రతిభ ఆధారిత వేతన పెంపును చేపట్టినట్లు తెలియజేశారు. షేరు బీఎస్ఈలో 0.7% నీరసించి రూ. 529 వద్ద ముగిసింది. -
ఇన్ఫోసిస్ 20 వేలమంది ఫ్రెషర్స్‌కు ఛాన్స్
ముంబై: సాఫ్ట్వేర్ సేవల ఎగుమతుల దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 5 శాతం పుంజుకుని రూ. 6,506 కోట్లను తాకింది. 4.4 శాతం అధికంగా రూ. 8,649 కోట్ల నిర్వహణ లాభం(ఇబిట్) ఆర్జించింది. 21.1 శాతం ఇబిట్ మార్జిన్లు సాధించింది. మొత్తం ఆదాయం సైతం 5 శాతం ఎగసి రూ. 40,986 కోట్లకు చేరింది. పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాల(గైడెన్స్)ను తాజాగా మెరుగుపరచింది. 3.75–4.5 శాతం మధ్య వృద్ధి సాధించగలమని ప్రకటించింది. ఇంతక్రితం క్యూ1 ఫలితాల సమయంలోనూ ఆదాయ వృద్ధి అంచనాలను 1–3 శాతం నుంచి 3–4 శాతానికి పెంచిన విషయం విదితమే. వాటాదారులకు షేరుకి రూ. 21 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. రికార్డ్ డేట్ ఈ నెల 29కాగా.. నవంబర్ 8కల్లా చెల్లించనుంది. డాలర్లలో ఆదాయం త్రైమాసికవారీగా 4 శాతం ఎగసి 4.89 బిలియన్లను అధిగమించింది. ఇతర విశేషాలు.. → మొత్తం 2.4 బిలియన్ డాలర్ల విలువైన భారీ డీల్స్‌ను కుదుర్చుకుంది. → ఆరు త్రైమాసికాలుగా ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ వస్తున్న ట్రెండ్‌కు క్యూ2లో చెక్ పడింది. నికరంగా 2,500 మందిని జత చేసుకుంది. → సెప్టెంబర్‌కల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 3,17,788 కు చేరుకుంది. → ఉద్యోగ వలసల రేటు 14.6% నుంచి 12.9 శాతానికి తగ్గింది. → ఈ ఏడాది 15,000–20,000 మంది ఫ్రెషర్స్‌ను నియమించుకోనుంది. ఇప్పటికే తొలి అర్ధభాగంలో కొంత మందికి చోటిచి్చంది. డిమాండ్ జూమ్ అన్నివైపుల నుంచి సాఫ్ట్వేర్ సేవలకు డిమాండ్ బలపడటం మెరుగైన గైడెన్స్‌కు సహకరించింది. ప్రధానంగా ఐటీ పరిశ్రమలో కీలకమైన ఫైనాన్షియల్ రంగ క్లయింట్ల నుంచి భారీ డీల్స్ పెరుగుతుండటం ప్రభావం చూపింది. కోబాల్ట్‌తో క్లౌడ్, టోపజ్తో జెన్ఏఐ ద్వారా కంపెనీ సామర్థ్యాలు మరింత బలపడ్డాయి. దీంతో క్లయింట్లు ఇన్ఫోసిస్‌తో జత కట్టేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. – సలీల్ పరేఖ్, సీఈవో, ఎండీషేరు బీఎస్ఈలో 3% బలపడి రూ. 1,975 వద్ద ముగిసింది. -
రిలయన్స్‌కు జియో దన్ను
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ఈ ఆరి్థక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసిక ఫలితాలు వెల్లడించింది. జూలై– సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 5 శాతం క్షీణించి రూ. 16,563 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 17,394 కోట్లు ఆర్జించింది. చమురు శుద్ధి, పెట్రోకెమికల్ బిజినెస్‌లు నీరసించడంతో ప్రభావం చూపింది. రిటైల్, టెలికం బిజినెస్‌లు మాత్రం పటిష్ట పనితీరును ప్రదర్శించాయి. రష్యా చౌక చమురుతో చైనా పెట్రోలియం ప్రొడక్టుల సరఫరాలు పెరిగి ఓటూసీ బిజినెస్ మార్జిన్లు మందగించాయి. రిటైల్ సైతం పెద్దగా వృద్ధి సాధించలేదు. కంపెనీ ఇబిటా 2 శాతం తగ్గి రూ. 43,934 కోట్లకు చేరింది. ఫైనాన్స్ వ్యయాలు 5 శాతం పెరిగి రూ. 6,017 కోట్లను తాకాయి. కాగా.. మొత్తం ఆదాయం రూ. 2.38 లక్షల కోట్ల నుంచి రూ. 2.4 లక్షల కోట్లకు బలపడింది. రుణ భారం రూ. 3.36 లక్షల కోట్లకు చేరింది. చేతిలో ఉన్న నగదును పరిగణిస్తే నికర రుణ భారం రూ. 1.16 లక్షల కోట్లకు పరిమితమైనట్లు కంపెనీ వెల్లడించింది. టెలికం జోరుఈ ఏడాది క్యూ2లో ఆర్ఐఎల్ టెలికం, డిజిటల్ బిజినెస్‌ల విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ నికర లాభం 23 శాతంపైగా జంప్‌చేసి రూ. 6,539 కోట్లను తాకింది. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) 7.4 శాతం మెరుగై రూ. 195.1కు చేరింది. టారిఫ్‌ల పెంపుతో రానున్న 2–3 క్వార్టర్లలో మరింత పుంజుకోనుంది. స్థూల ఆదాయం 18 శాతం ఎగసి రూ. 37119 కోట్లుగా నమోదైంది. 14.8 కోట్ల 5జీ వినియోగదారులతో అతిపెద్ద టెలికం ఆపరేటర్‌గా ఆవిర్భవించింది. సబ్్రస్కయిబర్ల సంఖ్య 4 శాతం పెరిగి 47.88 కోట్లను తాకింది. రిటైల్ ఓకేరిలయన్స్ రిటైల్ నికర లాభం స్వల్ప వృద్ధితో రూ. 2,836 కోట్లకు చేరింది. ఇబిటా నామమాత్రంగా బలపడి రూ. 5,675 కోట్లయ్యింది. స్థూల ఆదాయం స్వల్పంగా నీరసించి రూ. 76,302 కోట్లకు పరిమితమైంది. స్టోర్ల సంఖ్య 464 పెరిగి 18,946ను తాకింది. ఫలితాల నేపథ్యంలో ఆర్ఐఎల్ షేరు బీఎస్ఈలో స్వల్ప లాభంతో రూ. 2,745 వద్ద ముగిసింది.డైవర్సిఫైడ్ బిజినెస్‌ల పోర్ట్‌ఫోలియో మరోసారి పటిష్ట పనితీరును చూపింది. – ముకేశ్ అంబానీ, ఆర్ఐఎల్ చైర్మన్, ఎండీ -
ఓఎన్జీసీ లాభం డౌన్
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జూలై–సెప్టెంబర్‌లో నికర లాభం 20 శాతం క్షీణించి రూ. 10,216 కోట్లకు పరిమితమైంది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 12,826 కోట్ల నికర లాభం ఆర్జించింది. చమురు ఉత్పత్తితోపాటు ధరలు తగ్గడం ప్రభావం చూపింది. ఈ ఏడాది క్యూ1 (ఏప్రిల్–జూన్)లోనూ నికర లాభం 34 శాతం వెనకడుగు వేయడం గమనార్హం! కాగా.. ప్రతీ బ్యారల్ చమురుకు 84.84 డాలర్లు లభించగా.. గత క్యూ2లో 95.5 డాలర్లు సాధించింది. రష్యా–ఉక్రెయిన్ మధ్య తలెత్తిన యుద్ధం కారణంగా క్యూ1లో చమురు ధరలు పెరిగినప్పటికీ తిరిగి క్యూ2లో కొంతమేర నీరసించాయి. ఫలితాల నేపథ్యంలో ఓఎన్జీసీ షేరు 0.6% నీరసించి రూ. 196 వద్ద ముగిసింది. -
భారీ లాభాల్లో సెయిల్
న్యూఢిల్లీ: మెటల్ రంగ ప్రభుత్వ దిగ్గజం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(సెయిల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్‌లో నష్టాలను వీడి రూ. 1,306 కోట్ల నికర లాభం ఆర్జించింది. అమ్మకాలు పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 329 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 26,642 కోట్ల నుంచి రూ. 29,858 కోట్లకు జంప్‌చేసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 27,201 కోట్ల నుంచి రూ. 27,769 కోట్లకు పెరిగాయి. కంపెనీ మొత్తం స్టీల్ ఉత్పాదక వార్షికం సామర్థ్యం 20 ఎంటీకాగా.. ఈ కాలంలో ముడిస్టీల్ ఉత్పత్తి 4.3 మిలియన్ టన్నుల నుంచి 4.8 ఎంటీకి బలపడింది. అమ్మకాలు 4.21 ఎంటీ నుంచి 4.77 ఎంటీకి ఎగశాయి. ఫలితాల నేపథ్యంలో సెయిల్ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 88 వద్ద ముగిసింది. -
ఎస్బీఐ లాభం అప్
ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 9 శాతం పుంజుకుని రూ. 16,100 కోట్లకు చేరింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 8 శాత వృద్ధితో రూ. 14,330 కోట్లను తాకింది. వేతనాలు, పెన్షన్లు సవరించేందుకు కొంత మొత్తాన్ని కేటాయించడంతో లాభాల్లో వృద్ధి పరిమితమైంది. కాగా.. నికర వడ్డీ ఆదాయం 12 శాతంపైగా ఎగసి రూ. 39,500 కోట్లకు చేరింది. అయితే డిపాజిట్ వ్యయాల కారణంగా నికర వడ్డీ మార్జిన్లు 0.12 శాతం నీరసించి 3.43 శాతానికి చేరాయి. వేతనాలు, పెన్షన్లకు ప్రొవిజన్లు రూ. 5,900 కోట్లమేర పెరగడంతో నిర్వహణ లాభం 8 శాతం క్షీణించి రూ. 19,417 కోట్లకు పరిమితమైనట్లు ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా వెల్లడించారు. కాగా.. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) గత దశాబ్ద కాలంలోనే అతితక్కువగా 2.55 శాతాన్ని తాకాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికల్లా 600 బ్రాంచీలను కొత్తగా ఏర్పాటు చేయనున్నట్లు ఖారా తెలియజేశారు. ఎస్బీఐ ప్రస్తుతం 22,400 బ్రాంచీలను కలిగి ఉంది. కనీస మూలధన నిష్పత్తి 14.28 శాతంగా నమోదైంది. -
టైటన్ లాభం అప్
న్యూఢిల్లీ: జ్యువెలరీ, వాచీల తయారీ దిగ్గజం టైటన్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జూలై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 10 శాతం వృద్ధితో రూ. 916 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 835 కోట్లు ఆర్జించింది. నికర అమ్మకాలు సైతం 25 శాతం జంప్‌చేసి రూ. 10,708 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 8,567 కోట్ల అమ్మకాలు సాధించింది. అయితే మొత్తం వ్యయాలు 41 శాతం పెరిగి రూ. 11,402 కోట్లకు చేరాయి. ఇక మొత్తం కన్సాలిడేటెడ్ ఆదాయం 37 శాతం ఎగసి రూ. 12,653 కోట్లయ్యింది. దీనిలో జ్యువెలరీ విభాగం ఆదాయం 39 శాతం జంప్‌చేసి రూ. 11,081 కోట్లను తాకగా.. వాచీలు తదితర బిజినెస్ 32 శాతం వృద్ధితో రూ. 1,092 కోట్లకు చేరింది. వెరసి వాచీలు, వేరబుల్స్ విభాగం తొలిసారి రూ. 1,000 కోట్ల టర్నోవర్‌ను అందుకున్నట్లు కంపెనీ పేర్కొంది. ఐకేర్ ఆదాయం 13 శాతం బలపడి రూ. 189 కోట్లయ్యింది. ఈ కాలంలో కొత్తగా 10 టైటన్ వరల్డ్ స్టోర్లతోపాటు, హీలియోస్ 5, ఫాస్ట్‌ట్రాక్ 5 చొప్పున స్టోర్లను ఏర్పాటు చేసింది. ఫలితాల నేపథ్యంలో టైటన్ షేరు బీఎస్ఈలో 2.3 శాతం బలపడి రూ. 3,273 వద్ద ముగిసింది. -
మళ్లీ లాభాల్లో ఇండిగో.. క్యూ2లో రూ. 189 కోట్లు
న్యూఢిల్లీ: ఎయిర్‌లైన్స్ దిగ్గజం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెపె్టంబర్(క్యూ2)లో రూ. 189 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,583 కోట్ల నికర నష్టం ప్రకటించింది. సామర్థ్యం పెంపు, అధిక ట్రాఫిక్ ఇందుకు సహకరించాయి. వెరసి ఇండిగో బ్రాండు సరీ్వసుల కంపెనీ వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ లాభాలను ప్రకటించగలిగింది. అయితే ఈ కాలంలో విదేశీ మారక నష్టం రూ. 806 కోట్లను మినహాయించి లాభాలు ప్రకటించింది. కాగా.. మొత్తం ఆదాయం 21 శాతం జంప్‌చేసి రూ. 15,503 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 12,852 కోట్ల టర్నోవర్ నమోదైంది. ఈ క్యూ2లో ప్రయాణికుల సంఖ్య 26.3 మిలియన్ల నుంచి 33.4 మిలియన్లకు ఎగసింది. సెపె్టంబర్‌కల్లా విమానాల సంఖ్య 334కు చేరగా.. రూ. 30,666 కోట్ల నగదు నిల్వలు కలిగి ఉంది. ఫలితాల నేపథ్యంలో ఇండిగో షేరు 1% బలపడి రూ. 2,509 వద్ద ముగిసింది. -
లాభాల్లోకి టాటా మోటార్స్
న్యూఢిల్లీ: ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై– సెపె్టంబర్(క్యూ2)లో రూ. 3,783 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 1,004 కోట్ల నికర నష్టం ప్రకటించింది. బ్రిటిష్ లగ్జరీ కార్ల అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) పనితీరు లాభాలకు దోహదపడింది. వెరసి వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ లాభాలను ప్రకటించగలిగింది. ఆదాయం రూ. 79,611 కోట్ల నుంచి రూ. 1,05,128 కోట్లకు దూసుకెళ్లింది. ఇక స్టాండెలోన్ ప్రాతిపదికన సైతం రూ. 1,270 కోట్ల నికర లాభం సాధించగా.. గతేడాది క్యూ2 లో రూ. 293 కోట్ల నికర నష్టం నమోదైంది. ఇకపై మరింత దూకుడు: తాజా సమీక్షా కాలంలో జేఎల్ఆర్ ఆదాయం 30 శాతం జంప్ చేసి 6.9 బిలియన్ పౌండ్లకు చేరింది. హోల్‌సేల్ అమ్మకాలు, కొత్త ప్రొడక్టులు, వ్యయ నియంత్రణలు, డిమాండుకు అనుగుణమైన పెట్టుబడులు ఇందుకు సహకరించాయి. కాగా.. ఈ ఏడాది ద్వితీయార్ధం(అక్టోబర్–మార్చి)లో హోల్‌సేల్ అమ్మకాలు క్రమంగా జోరందుకోనున్నట్లు కంపెనీ అంచనా వేస్తోంది. నిర్వహణ(ఇబిట్) మార్జిన్లు గత 6 శాతం అంచనాలకంటే అధికంగా 8 శాతాన్ని తాకవచ్చని భావిస్తోంది. ఈ ఏడాది 2 బిలియన్ పౌండ్ల ఫ్రీ క్యాష్‌ఫ్లోను సాధించగలదని ఆశిస్తోంది. వెరసి మార్చికల్లా నికర రుణ భారం బిలియన్ పౌండ్లకంటే దిగువకు చేరవచ్చని అభిప్రాయపడింది. ఫలితాల నేపథ్యంలో టాటా మోటార్స్ షేరు 1.5% బలపడి రూ. 637 వద్ద ముగిసింది. -
రెయిన్బో చిల్డ్రన్స్ లాభం రూ. 63 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ (ఆర్‌సీఎంఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సుమారు రూ. 63 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత క్యూ2లో ఇది రూ. 61 కోట్లు. ఆదాయం రూ. 313 కోట్ల నుంచి రూ. 333 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కోవిడ్ అనంతరం అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, దానితో పోలిస్తే ప్రస్తుత క్యూ2లో కంపెనీ పటిష్టమైన పనితీరే కనపర్చిందని ఆర్‌సీఎంఎల్ సీఎండీ రమేష్ కంచర్ల తెలిపారు. హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్‌లో కొత్తగా ప్రారంభించిన శాఖ.. అంచనాలకు అనుగుణంగానే రాణిస్తోందని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మిగతా అయిదు నెలల్లో మూడు కొత్త ఆస్పత్రులను నెలకొల్పడంతో పాటు ప్రస్తుత ఆస్పత్రిలో అదనంగా మరో బ్లాకును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కంపెనీ చేతిలో నగదు, తత్సమాన నిల్వలు రూ. 472 కోట్ల మేర ఉన్నట్లు, ఆ నిధులను పెట్టుబడి ప్రణాళిక కోసం వెచి్చంచనున్నట్లు సంస్థ తెలిపింది. క్యూ2లో పెట్టుబడి వ్యయాల కింద రూ. 55 కోట్లు వెచి్చంచనున్నట్లు పేర్కొంది. రెండో త్రైమాసికం ఆఖరు నాటికి సంస్థ పడకల సంఖ్య 1,555 నుంచి 1,655కి పెరిగింది. -
ఇండియన్ హోటల్స్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ టాటా గ్రూప్ దిగ్గజం ఇండియన్ హోటల్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్లో కన్సాలిడేటెడ్ నికర లాభం 37 శాతం జంప్‌చేసి రూ. 167 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 122 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,258 కోట్ల నుంచి రూ. 1,481 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 1,101 కోట్ల నుంచి రూ. 1,249 కోట్లకు పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో కొత్తగా 8 హోటళ్లను తెరవడంతోపాటు.. మరో 17 ప్రారంభించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో పునీత్ చాట్వల్ పేర్కొన్నారు. అనుబంధ సంస్థ పియమ్ హోటల్స్‌లో న్యూ వెర్నాన్ ప్రయివేట్ నుంచి 6.8 శాతం వాటాకు సమానమైన 2.59 లక్షల ఈక్విటీ షేర్లను షేర్ల స్వాప్, నగదు ద్వారా సొంతం చేసుకున్నట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో ఇండియన్ హోటల్స్ షేరు ఎన్ఎస్ఈలో యథాతథంగా రూ. 375 వద్ద ముగిసింది. -
లాభాల్లోకి ఏసీసీ
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో సిమెంట్ రంగ దిగ్గజం ఏసీసీ లిమిటెడ్ టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెపె్టంబర్లో నష్టాలను వీడి రూ. 388 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇందుకు అమ్మకాలు పుంజుకోవడం, ఇంధన వ్యయాలు తగ్గడం, ప్రీమియం ప్రొడక్టులకు పెరిగిన డిమాండ్, నిర్వహణా సామర్థ్యం తోడ్పాటునిచ్చాయి. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 87 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం 11 శాతంపైగా పుంజుకుని రూ. 4,435 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 3,987 కోట్ల టర్నోవర్ నమోదైంది. ఈ కాలంలో సిమెంట్, క్లింకర్ అమ్మకాలు 17 శాతంపైగా ఎగసి 8.1 మిలియన్ టన్నులను తాకాయి. మొత్తం వ్యయాలు స్వల్పంగా తగ్గి రూ. 4,127 కోట్లకు పరిమితమయ్యాయి. ఫలితాల నేపథ్యంలో ఏసీసీ షేరు ఎన్ఎస్ఈలో 1.2 శాతం బలపడి రూ. 1,913 వద్ద ముగిసింది. -
ఇండియన్ బ్యాంక్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో నికర లాభం 62 శాతం జంప్‌చేసి రూ. 1,988 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,225 కోట్లు మాత్రమే ఆర్జించింది. వడ్డీ ఆదాయం సైతం రూ. 10,710 కోట్ల నుంచి రూ. 13,743 కోట్లకు ఎగసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 7.3 శాతం నుంచి రూ. 4.97 శాతానికి దిగివచ్చాయి. ఫలితాల నేపథ్యంలో ఇండియన్ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 2 శాతం బలహీనపడి రూ. 400 వద్ద ముగిసింది. -
యాక్సిస్ బ్యాంక్ లాభం ప్లస్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జూలై–సెపె్టంబర్(క్యూ2)లో నికర లాభం 10 శాతం బలపడి రూ. 5,864 కోట్లను తాకింది. వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 5,330 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 24,094 కోట్ల నుంచి రూ. 31,660 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 19 శాతం వృద్ధితో రూ. 12,315 కోట్లకు చేరింది.ప్రపంచ భౌగోళిక, రాజకీయ ఆటుపోట్ల మధ్య భారత్ వృద్ధి బాటలోనే సాగుతున్నట్లు యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈవో అమితాబ్ చౌదరీ పేర్కొన్నారు. ఎన్పీఏలు డౌన్ ప్రస్తుత సమీక్షా కాలంలో యాక్సిస్ బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్లు 0.15% మెరుగై 4.11 శాతాన్ని తాకాయి. త్రైమాసికవారీగా స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.96% నుంచి రూ. 1.73 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 0.41 % నుంచి 0.36 శాతానికి వెనకడుగు వేశాయి. ఫలితాల నేపథ్యంలో ఈ షేరు బీఎస్ఈలో 1% నీరసించి రూ. 955 వద్ద ముగిసింది. -
టెక్ మహీంద్రా లాభం డౌన్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెపె్టంబర్ (క్యూ2)లో నికర లాభం 61 శాతం క్షీణించి రూ. 505 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,299 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం స్వల్పంగా 2 శాతం నీరసించి రూ. 12,864 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 13,130 కోట్ల టర్నోవర్ సాధించింది. ఎన్నో ఆటుపోట్లను చవిచూసిన తన కెరీర్‌లోకెల్లా గత కొన్ని త్రైమాసికాలు అత్యంత క్లిష్టమైనవంటూ టెక్ మహీంద్రా సీఈవో, ఎండీ సీపీ గుర్నానీ పేర్కొన్నారు. ► త్రైమాసికవారీగా 78% వృద్ధితో రూ. 5,300 కోట్లు(64 కోట్ల డాలర్లు) విలువైన డీల్స్ కుదుర్చుకుంది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్–జూన్)లో రూ. 2,980 కోట్ల విలువైన ఆర్డర్లు పొందింది. ► మొత్తం సిబ్బంది సంఖ్య 8 శాతంపైగా క్షీణించి 1,50,604కు పరిమితమైంది. గతేడాది క్యూ2 లో ఈ సంఖ్య 1,63,912గా నమోదైంది. ► ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు వార్షిక ప్రాతిపదికన 20% నుంచి 11%కి దిగివచి్చంది. ఫలితాల నేపథ్యంలో టెక్ మహీంద్రా షేరు 1.4% నష్టంతో రూ. 1,140 వద్ద ముగిసింది. -
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం (2023–24) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జూలై–సెపె్టంబర్ (క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 36% జంప్‌చేసి రూ. 10,896 కోట్లను తాకింది. ప్రొవిజన్లు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. స్టాండెలోన్ లాభం సైతం రూ.7,558 కోట్ల నుంచి రూ. 10,261 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం రూ. 31,088 కోట్ల నుంచి రూ. 40,697 కోట్లకు దూసుకెళ్లింది. నికర వడ్డీ ఆదాయం 24 శాతం వృద్ధితో రూ. 18,308 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 4.31 శాతం నుంచి 4.53 శాతానికి బలపడ్డాయి. ట్రెజరీ మినహా వడ్డీయేతర ఆదాయం 14 శాతం అధికమై రూ. 5,861 కోట్లయ్యింది. ఎన్పీఏలు డౌన్... తాజా సమీక్షా కాలంలో ఐసీఐసీఐ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.19 శాతం నుంచి రూ. 2.48 శాతానికి తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 16.07 శాతంగా నమోదైంది. -
క్యూ2లో పీవీఆర్ ఐనాక్స్ జోరు
న్యూఢిల్లీ: మలీ్టప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ ఐనాక్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెపె్టంబర్(క్యూ2)లో నష్టాలను వీడి రూ. 166 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 71 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 686 కోట్ల నుంచి రూ. 2,000 కోట్లకు దూసుకెళ్లింది. 2023 ఫిబ్రవరి 6నుంచి పీవీఆర్, ఐనాక్స్ విలీనం అమలులోకి రావడంతో ఫలితాలను పోల్చి చూడతగదని కంపెనీ పేర్కొంది. కాగా.. మొత్తం వ్యయాలు రూ. 1,802 కోట్లుగా నమోదయ్యాయి. విలీనం తదుపరి పీవీఆర్ ఐనాక్స్ చరిత్రలోనే అత్యధికంగా ఒక త్రైమాసికంలో 4.84 కోట్ల మంది సినిమా హాళ్లను సందర్శించినట్లు కంపెనీ వెల్లడించింది. ఇక సగటు టికెట్ ధర అత్యధికంగా రూ. 276కు చేరగా.. ఆహారం, పానీయాల సగటు వ్యయం సైతం రికార్డ్ నెలకొల్పుతూ రూ. 136ను తాకింది. ఈ కాలంలో 37 తెరలను కొత్తగా ఏర్పాటు చేసింది. దీంతో శ్రీలంకసహా 115 పట్టణాలలో మొత్తం స్క్రీన్ల సంఖ్య 1,702కు చేరింది. అయితే ఈ ఏడాది తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెపె్టంబర్)లో సరైన ఆదరణలేని మొత్తం 33 స్క్రీన్లను తొలగించింది. మరోవైపు పూర్తి ఏడాదిలో 150–160 కొత్త స్క్రీన్ల ఏర్పాటు బాటలో సాగుతున్నట్లు వెల్లడించింది. ఈ కాలంలో ప్రధానంగా హిందీ సినిమాలు అత్యధిక వసూళ్లను సాధించినట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో పీవీఆర్ ఐనాక్స్ షేరు బీఎస్ఈలో 2 శాతం క్షీణించి రూ. 1,742 వద్ద ముగిసింది. -
వోల్టాస్ లాభం రూ.36 కోట్లు
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ కంపెనీ వోల్టాస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికానికి రూ.36 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.6 కోట్ల నష్టాన్ని నమోదు చేయడం గమనార్హం. దీంతో పోలిస్తే పనితీరు మెరుగుపడినట్టు తెలుస్తోంది. మొత్తం ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,833 కోట్ల నుంచి రూ.2,364 కోట్లకు వృద్ధి చెందింది. రెడీమబుల్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్సీడీలు) జారీ చేయడం ద్వారా రూ.500 కోట్లు సమీకరించాలని వోల్టాస్ బోర్డు నిర్ణయించింది. చైన్నై, గుజరాత్‌లోని వాఘోడియాలో నూతన ప్లాంట్లపై ఈ నిధులను వ్యయం చేయనున్నట్టు తెలిపింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో వోల్టాస్ షేరు ఒక శాతం లోపు పెరిగి రూ.839 వద్ద ముగిసింది. -
విప్రో లాభం ఫ్లాట్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్ (క్యూ2)లో నికర లాభం నామమాత్ర వృద్ధితో రూ. 2,667 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 2,649 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం నామమాత్ర క్షీణతతో రూ. 22,516 కోట్లకు పరిమితమైంది. గత క్యూ2లో రూ. 22,540 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. ఐదు అనుబంధ సంస్థలను కంపెనీలో విలీనం చేసుకునేందుకు బోర్డు అనుమతించినట్లు విప్రో తాజాగా వెల్లడించింది. వీటిలో విప్రో హెచ్ఆర్, ఓవర్సీస్ ఐటీ, టెక్నాలజీ ప్రొడక్టు సరీ్వసులు, వీఎల్ఎస్ఐ డిజైన్ సరీ్వసులు, విప్రో ట్రేడ్‌మార్క్ హోల్డింగ్ ఉన్నాయి. గైడెన్స్ వీక్.. ప్రస్తుత త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)క్యూ3లో ఐటీ సర్వీసుల ఆదాయం 3.5–1.5 శాతం మధ్య క్షీణించవచ్చంటూ విప్రో తాజా అంచనాల(గైడెన్స్)ను ప్రకటించింది. వెరసి కరెన్సీ నిలకడ ప్రాతిపదికన 261.7–267.2 కోట్ల డాలర్ల స్థాయిలో ఆదాయాన్ని ఊహిస్తోంది. అంటే రూ. 21,643–22,097 కోట్ల మధ్య టర్నోవర్‌ను అంచనా కట్టింది. ప్రస్తుత బలహీన ప్రపంచ ఆర్థిక ఔట్లుక్ నేపథ్యంలో తాజా గైడెన్స్‌ను ప్రకటించింది. ఇతర విశేషాలు ► నిర్వహణ మార్జిన్లు నామమాత్ర వృద్ధితో 16.1 శాతానికి చేరాయి. ► 3.78 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులను కుదుర్చుకుంది. ► క్యూ2కల్లా సిబ్బంది సంఖ్య 7 శాతం తగ్గి 2,44,707కు చేరింది. ► ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు గత 6 త్రైమాసికాల్లోనే తక్కువగా 15.5%కి పరిమితమైంది. అనిశి్చతులు ఉన్నాయ్... బిజినెస్ వాతావరణం అనిశి్చతిగా ఉన్నట్లు ఫలితాల విడుదల సందర్భంగా విప్రో సీఈవో థియరీ డెలాపోర్ట్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు గరిష్టస్థాయిలలో కొనసాగుతున్నాయని, పెట్టుబడులపట్ల క్లయింట్లు మరింత కఠిన వైఖరిని ప్రదర్శిస్తున్నారని తెలియజేశారు. ప్రస్తుత పెట్టుబడుల గరిష్ట వినియోగంపై దృష్టి పెడుతూనే కొత్త పెట్టుబడులపై వేగవంత రిటర్నులను ఆశిస్తున్నట్లు వివరించారు. విచక్షణా వ్యయాలు, ఆర్డర్లు నెమ్మదిస్తున్నట్లు వెల్లడించారు. ఇది ఆదాయ వృద్ధిపై ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. అయితే మార్జిన్లు నిలుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం నీరసించి రూ. 408 వద్ద ముగిసింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ జోరు
ముంబై: మార్టిగేజ్ దిగ్గజం, మాతృ సంస్థ.. హెచ్డీఎఫ్సీ విలీనం తదుపరి ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర పనితీరు చూపింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్ (క్యూ2)లో రూ. 16,811 కోట్ల నికర లాభం ఆర్జించింది. స్టాండెలోన్ నికర లాభం రూ. 15,976 కోట్లకు చేరింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో విలీన సంస్థ నికర లాభం రూ. 11,162 కోట్లుగా మదింపు వేసింది. ఇక గత క్యూ2 స్టాండెలోన్ లాభం రూ. 10,606 కోట్లుగా లెక్కకట్టింది. మార్జిన్లు డీలా గతంలో 4 శాతానికిపైగా నికర వడ్డీ మార్జిన్లు సాధిస్తూ వచ్చిన నంబర్ వన్ ప్రైవేట్ రంగ బ్యాంక్.. హెచ్డీఎఫ్సీ ప్రస్తుత సమీక్షా కాలంలో 3.4 శాతం మార్జిన్లు ప్రకటించింది. ఇందుకు విలీనం తదుపరి బ్యాలన్స్షీట్లో తక్కువ ఈల్డ్స్ ఆర్జించే సెక్యూర్డ్ ఆస్తులు(రుణాలు) పెరగడం ప్రభావం చూపింది. అంతేకాకుండా విలీనానికి మార్కెట్ రుణ సమీకరణ వ్యయాలు సైతం పెరిగాయి. అయితే నికర వడ్డీ మార్జిన్లు పుంజుకోనున్నట్లు బ్యాంక్ సీఎఫ్‌వో శ్రీనివాసన్ వైద్యనాథన్ పేర్కొన్నారు. అధిక ఈల్డ్స్ అందించే ఆస్తులు పెరగడం, చౌకగా సమీకరించిన డిపాజిట్లతో మార్కెట్ రుణాలను రీప్లేస్ చేసిన తదుపరి మార్జిన్లు మెరుగుపడనున్నట్లు వివరించారు. 30 శాతం అప్ ఈ ఏడాది క్యూ2లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 30 శాతం జంప్‌చేసి రూ. 27,385 కోట్లను తాకింది. గతేడాది క్యూ2లో రూ. 21,021 కోట్ల వడ్డీ ఆదాయాన్ని సాధించాయి. ఇక ఇతర ఆదాయం రూ. 7,596 కోట్ల నుంచి రూ. 10,708 కోట్లకు జంప్ చేసింది. అటు డిపాజిట్లు, ఇటు అడ్వాన్సులు(రుణాలు).. రూ. లక్ష కోట్ల చొప్పున నమోదయ్యాయి. డిపాజిట్లు 5.3 శాతం, అడ్వాన్సులు 4.9 శాతం చొప్పున వృద్ధి చూపాయి. స్థూల మొండిబకాయిలు 1.41 శాతం నుంచి 1.34 శాతానికి తగ్గాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 3,240 కోట్ల నుంచి రూ. 2,903 కోట్లకు వెనకడుగు వేశాయి. ఎడ్యుకేషన్ రుణాలందించే క్రెడిలా విక్రయాన్ని పూర్తి చేయవలసి ఉన్నట్లు వైద్యనాథన్ పేర్కొన్నారు. ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ లిస్టింగ్ ప్రణాళికలేవీ లేవని స్పష్టం చేశారు. నికరంగా 16,000 మంది ఉద్యోగులను తీసుకోవడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 1.98 లక్షలకు చేరినట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 0.5 శాతం క్షీణించి రూ. 1,530 వద్ద ముగిసింది. -
క్యూ 2 లో టీసి 'ఎ స్'!
ముంబై: దేశీ సాఫ్ట్వేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్).. మెరుగైన ఫలితాలతో బోణీ కొట్టింది. ఈ ఆరి్థక సంవత్సరం సెపె్టంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో (2023–24, క్యూ2) కంపెనీ రూ. 11,342 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 10,431 కోట్లతో పోలిస్తే 8.7 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం సైతం 7.9 శాతం పెరుగుదలతో రూ. 55,309 కోట్ల నుండి రూ.59,692 కోట్లకు ఎగబాకింది. ఇక వాటాదారులకు టీసీఎస్ మరోసారి భారీ బైబ్యాక్ ఆఫర్‌ను ప్రకటించడం విశేషం. మరోపక్క, మందకొడి ఆరి్థక పరిస్థితుల నేపథ్యంలో ఐటీ రంగానికి ప్రతికూలతలు కొనసాగుతాయని కూడా కంపెనీ స్పష్టం చేసింది. త్రైమాసిక ప్రాతిపదికన ఇలా... ఈ ఆరి్థక సంవత్సరం జూన్ క్వార్టర్ (క్యూ1లో) నమోదైన రూ.11,074 కోట్లతో పోలిస్తే త్రైమాసిక ప్రాతిపదికన క్యూ2లో నికర లాభం 2.5% వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం క్యూ1లో రూ.59,381 కోట్లతో పోలిస్తే క్యూ2లో అర శాతం పెరిగింది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలు... ► క్యూ2లో కంపెనీ నిర్వహణ లాభం 9.1 శాతం వృద్ధితో రూ.14,483 కోట్లకు పెరిగింది. అదేవిధంగా నిర్వహణ మార్జిన్లు పావు శాతం పెరిగి 24.3 శాతానికి చేరాయి. ► భౌగోళికంగా చూస్తే, యూకే నుండి ఆదాయం 10.7 శాతం ఎగబాకగా, ఉత్తర అమెరికా నుండి స్వల్పంగా 0.1 శాతం వృద్ధి చెందింది. వర్ధమాన మార్కెట్లలో మధ్యప్రాచ్యం, ఆఫ్రికా ఆదాయం 15.9 శాతం వృద్ధి నమోదు కాగా, లాటిన్ అమెరికా 13.1 శాతం, ఆసియా పసిఫిక్ 4.1 శాతం, భారత్ ఆదాయం 3.9 శాతం చొప్పున పెరిగాయి. ► విభాగాల వారీగా.. ఇంధనం, వనరులు, యుటిలిటీల నుండి ఆదాయం 14.8 శాతం పెరిగింది. తయారీ రంగం నుండి ఆదాయం 5.8 శాతం, లైఫ్ సైన్సెస్–హెల్త్‌కేర్ 5 శాతం పెరగ్గా, బ్యాంకింగ్–ఫైనాన్షియల్ సరీ్వసెస్ (బీఎఫ్ఎస్ఐ) మాత్రం మైనస్ 0.5 శాతంగా నమోదైంది. ► సెపె్టంబర్ చివరి నాటికి టీసీఎస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,08,985కు చేరింది. క్యూ2లో నికరంగా 6,000 మంది సిబ్బంది తగ్గారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలన్న లక్ష్యంలో ఎలాంటి మార్పు లేదని టీసీఎస్ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ చెప్పారు. క్యాంపస్ నియమకాలపై ఇప్పటికే దృష్టి పెట్టామన్నారు. ► క్యూ2లో కంపెనీ 11.2 బిలియన్ డాలర్ల విలువైన కొత్త కాంట్రాక్టులను కుదుర్చుకుంది. ఇందులో బీఎస్ఎన్ఎల్ 4జీ/5జీ, వాహన దిగ్గజం జేఎల్ఆర్కు సంబంధించిన డీల్స్ ప్రధానంగా ఉన్నాయి. ► ఇజ్రాయెల్‌లో 250 మంది కంపెనీ ఉద్యోగులు పని చేస్తున్నారని, యుద్ధ ప్రభావం అక్కడ తమ వ్యాపారాలపై పెద్దగా ప్రభావం చూపలేదని టీసీఎస్ సీఎఫ్ఓ ఎన్. గణపతి సుబ్రమణ్యం చెప్పారు. ► రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై కంపెనీ రూ. 9 చొప్పన రెండో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. దీనికి రికార్డు తేదీ అక్టోబర్ 19 కాగా, నవంబర్ 7న చెల్లించనుంది. దాదాపు రూ.3,300 కోట్లు ఇందుకు వెచి్చంచనుంది. టీసీఎస్ షేరు ధర బుధవారం బీఎస్ఈలో అర శాతం నష్టంతో రూ. 3,610 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చాయి. బైబ్యాక్ బొనాంజా @ రూ.17,000 కోట్లు టీసీఎస్ బైబ్యాక్ పరంపరను కొనసాగిస్తోంది. రూ. 17,000 కోట్ల విలువైన షేర్లను వాటాదారుల నుంచి తిరిగి కొనుగోలు చేసేందుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. బైబ్యాక్ షేరు ధరను రూ. 4,150గా నిర్ణయించింది. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ‘టాటా’ కరోనా మహమ్మారి కారణంగా కల్పించిన రిమోట్ వర్కింగ్ (వర్క్ ఫ్రమ్ హోమ్) సదుపాయానికి టీసీఎస్ టాటా చెప్పింది. ఇకపై తమ ఉద్యోగులందరూ ఆఫీసుల నుంచే విధులు నిర్వర్తించాలని కంపెనీ బుధవారం ప్రకటించింది. కో–వర్కింగ్ వల్ల వ్యవస్థ విస్తృతం అవుతుందని, ఉత్పాదకత పెరుగుతుందని టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ పేర్కొన్నారు. మా సరీ్వస్‌లకు కొనసాగుతున్న డిమాండ్, క్లయింట్లు దీర్ఘకాల ప్రాజెక్టులకు కట్టుబడి ఉండటం, జెన్ ఏఐ ఇంకా ఇతర కొత్త టెక్నాలజీలను ప్రయోగాత్మకంగా ఉపయోగించేందుకు చూపుతున్న ఆసక్తి.. మా దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలపై భరోసా కలి్పస్తోంది. ఆరి్థక అనిశ్చితి కొనసాగుతోంది. దీనివల్లే ఆదాయ వృద్ధి అంతంతమాత్రంగా నమోదైంది. అయితే పటిష్టమైన డీల్స్ జోరుతో ఆర్డర్ బుక్ భారీగా వృద్ధి చెందింది. మొత్తం కాంట్రాక్ట్ విలువ (టీసీవీ) పరంగా క్యూ2లో రెండో అత్యధిక స్థాయిని నమోదు చేసింది. – కె. కృతివాసన్, టీసీఎస్ సీఈఓ -
వృద్ధి వేగవంతం.. ధరలే దారుణం
ముంబై: భారత ఆరి్థక వ్యవస్థ రెండో త్రైమాసికంలో ఊపందుకుంటోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆర్టికల్ ఒకటి పేర్కొంది. అయితే వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం కేంద్రం ఆర్బీఐకి నిర్దేశిస్తున్న స్థాయికి మించి (6 శాతం) సగటున కొనసాగుతుండడమే ఆందోళన కరమైన అంశమని ఆర్బీఐ నెలవారీ బులెటిన్‌లో వెలువడిన ఒక కథనం పేర్కొంది. జూన్‌లో 4.87 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బనం జూలైలో 15 నెలల గరిష్ట స్థాయి 7.44 శాతానికి ఎగసిన నేపథ్యంలో తాజా కథనం వెలువడ్డం గమనార్హం. సమీక్షా నెల్లో టమాటా, కూరగాయలు, ఇతర ఆహార ఉత్పత్తుల ధరలు తీవ్ర స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ధరల తీవ్రత విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలోసైతం ప్రస్తావిస్తూ, సమస్యను తగ్గించడానికి తగిన మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆర్బీఐ అభిప్రాయాలు కావు... రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం ఈ కథనాన్ని రచించింది. అయితే, ఆరి్టకల్‌లో వ్యక్తీకరించిన అభిప్రాయాలు రచయితలవి మాత్రమేనని, వీటిని రిజర్వ్ బ్యాంక్ అభిప్రాయాలుగా పరిగణించరాదని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. వెలువడిన ఆరి్టకల్లోని కొన్ని అంశాలు పరిశీలిస్తే.. మొదటి త్రైమాసికంలో పటిష్టమైన పనితీరు తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా మందగించింది. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, భారత్‌లో వినియోగ డిమాండ్ బాగుంది. పెట్టుబడుల పరిస్థితి ప్రోత్సాహకరంగా కొనసాగుతోంది. ఆయా అంశాలు భారత్‌కు లాభిస్తున్నాయి. అంతర్జాతీయ మందగమన పరిస్థితులతో కుంటుపడిన ఎగుమతుల క్షీణబాట ప్రతికూలతలను అధిగమించగలుగుతున్నాం. -
ఎయిర్టెల్ లాభం జూమ్
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 89% జంప్‌చేసి రూ. 2,145 కోట్లను తాకింది. అనూహ్య రాబడిని మినహాయిస్తే రూ. 2,052 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) క్యూ2లో కేవలం రూ.11,340 కోట్లు ఆర్జించింది. 4జీ లాభదాయకత, వినియోగదారుపై సగటు ఆదాయం (ఏఆర్పీయూ), డేటా వినియోగం పుంజుకోవడం అధిక లాభాలకు దోహదం చేసింది. మొత్తం ఆదాయం సైతం 22% ఎగసి రూ. 34,527 కోట్లకు చేరింది. ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల కస్టమర్లను అధిగమించడంతోపాటు.. నిలకడైన పటిష్ట పనితీరును చూపగలిగినట్లు కంపెనీ పేర్కొంది. పరిశ్రమలోనే అత్యుత్తమంగా రూ. 190 ఏఆర్పీయూను సాధించింది. గత క్యూ2లో ఇది రూ. 153 మాత్రమే. 20 జీబీ వినియోగం: 5జీ ప్రారంభించనున్న నేపథ్యంలో మరింత ఉత్తమ సేవలు అందించగలమని ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విఠల్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే చౌక ధరల కారణంగా తక్కువ ఆర్వోసీఈని నమోదు చేస్తున్నట్లు తెలియజేశారు. కంపెనీ 8 పట్టణాలలో 5జీ సేవలకు శ్రీకారం చుట్టింది. కాగా ప్రస్తుత సమీక్షా కాలంలో 1.78 కోట్లమంది 4జీ కస్టమర్లు లభించగా.. ఒక్కొక్కరి నెలవారీ సగటు డేటా వినియోగం 20.3 జీబీకి చేరింది. ఫలితాల నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు 2 శాతం లాభపడి రూ. 832 వద్ద ముగిసింది. -
డాక్టర్ రెడ్డీస్ లాభం రూ. 1,113 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 1,113 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో నమోదైన రూ. 992 కోట్లతో పోలిస్తే ఇది 12% అధికం. అటు ఆదాయం 9% పెరిగి రూ. 5,763 కోట్ల నుంచి రూ. 6,306 కోట్లకు చేరింది. శుక్రవారం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ, సీఎఫ్‌వో పరాగ్ అగర్వాల్ ఈ విషయాలు తెలిపారు. అమెరికా మార్కెట్లో ఎక్స్‌క్లూజివ్ హక్కులు లభించిన జనరిక్ ఔషధం రెవ్లిమిడ్ సహా కొత్తగా ప్రవేశపెట్టిన ఉత్పత్తుల ఊతంతో ఆదాయాలు, లాభాలు గణనీయంగా పెరిగాయని పరాగ్ వివరించారు. అలాగే వ్యయాలను సమర్ధంగా నియంత్రించుకోవడం కూడా దోహదపడిందని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 25 పైగా కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. మరోవైపు, రెండో త్రైమాసికంలో పటిష్టమైన పనితీరు సాధించడం సంతృప్తి కలిగించిందని సంస్థ సహ–చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ ఈ సందర్భంగా తెలిపారు. అంతర్జాతీయంగా చౌకగా మరిన్ని ఔషధాలను అందుబాటులోకి తేవడంపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు ఆయన వివరించారు. ఇందులో భాగంగా కొనసాగిస్తున్న పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై రెండో త్రైమాసికంలో కంపెనీ సుమారు రూ. 490 కోట్లు వెచ్చించింది. ఫలితాల్లో ఇతర విశేషాలు.. ► క్యూ2లో గ్లోబల్ జనరిక్స్ ఆదాయాలు 18 శాతం పెరిగి రూ. 5,595 కోట్లకు చేరాయి. ఉత్తర అమెరికా మార్కెట్లో అమ్మకాలు 48 శాతం వృద్ధి చెంది రూ. 2,800 కోట్లకు పెరిగాయి. కొన్ని ఔషధాల రేట్లు తగ్గినప్పటికీ .. కొత్త ఉత్పత్తులు, సానుకూల ఫారెక్స్ రేట్ల ప్రభావంతో కంపెనీ ఆ ప్రతికూలతలను అధిగమించింది. ► భారత మార్కెట్లో అమ్మకాలు స్వల్పంగా పెరిగి రూ. 1,150 కోట్లకు పరిమితమయ్యాయి. ► ఫార్మా సర్వీసెస్, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం 23 శాతం క్షీణించి రూ. 643 కోట్లకు తగ్గింది. శుక్రవారం బీఎస్ఈలో కంపెనీ షేరు స్వల్పంగా తగ్గి రూ. 4,461 వద్ద క్లోజయ్యింది. -
ఐజీఎల్ ఆదాయం రూ.3,922 కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ దిగ్గజం ఇంద్రప్రస్థ గ్యాస్(ఐజీఎల్) పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 4 శాతం వృద్ధితో రూ. 416 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 4,01 కోట్లు ఆర్జించింది. సహజవాయు ధరలు పెరగడంతో మార్జిన్లు బలహీనపడినట్లు కంపెనీ పేర్కొంది. ఇక మొత్తం ఆదాయం దాదాపు రెట్టింపై రూ. 3,922 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 2,016 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గ్యాస్ ధరలు 100 శాతం పెరిగిపోయినట్లు కంపెనీ తెలియజేసింది. దీంతో నేచురల్ గ్యాస్ కొనుగోలు వ్యయాలు రూ. 930 కోట్ల నుంచి రూ. 2,610 కోట్లకు ఎగశాయి. అయితే గ్యాస్ రోజువారీ సగటు అమ్మకాలు 7.24 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల నుంచి 8.09 ఎంఎంఎస్‌సీఎండీకి బలపడినట్లు వెల్లడించింది. సీఎన్జీ అమ్మకాలలో 15 శాతం, పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ) విక్రయాలలో 3 శాతం వృద్ధి నమోదైనట్లు పేర్కొంది. -
కరూర్ వైశ్యా బ్యాంక్ లాభం 52 శాతం అప్
చెన్నై: ప్రైవేట్ రంగ కరూర్ వైశ్యా బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 250 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత క్యూ2లో నమోదైన రూ. 165 కోట్లతో పోలిస్తే సుమారు 52 శాతం వృద్ధి సాధించింది. ఇక నికర వడ్డీ ఆదాయం దాదాపు 21 శాతం పెరిగి రూ. 680 కోట్ల నుంచి రూ. 821 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ 3.74 శాతం నుంచి 4.07 శాతానికి పెరిగింది. నికర మొండి బాకీలు (ఎన్పీఏ) 2.99 శాతం నుంచి 1.36 శాతానికి దిగివచ్చినట్లు బ్యాంకు ఎండీ బి. రమేష్ బాబు తెలిపారు. సెప్టెంబర్ ఆఖరు నాటికి మొత్తం వ్యాపార పరిమాణం దాదాపు 14 శాతం పెరిగి రూ. 1,35,460 కోట్లకు చేరినట్లు వివరించారు. దశాబ్ద కాలంలో వ్యాపారం రెట్టింపైనట్లు పేర్కొన్నారు. -
బెస్ట్ ఆగ్రోలైఫ్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆగ్రోకెమికల్స్ సంస్థ బెస్ట్ ఆగ్రోలైఫ్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 5 రెట్లు దూసుకెళ్లి రూ. 130 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 25 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 702 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 325 కోట్ల టర్నోవర్ మాత్రమే నమోదైంది. తమ ప్లాంట్లు గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు కంపెనీ ఎండీ విమల్ అలవాధి పేర్కొన్నారు. కొత్తగా విడుదల చేసిన ప్రొడక్టులకు మంచి స్పందన లభించినట్లు తెలియజేశారు. భవిష్యత్‌లో మరిన్ని విప్లవాత్మక ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఆర్అండ్డీ బృందం నూతన మాలిక్యూల్స్‌ను ఆవిష్కరించడంలో ప్రత్యేకత కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. ఎన్ఎస్ఈలో బెస్ట్ ఆగ్రోలైఫ్ షేరు వారాంతాన 1 శాతం బలపడి రూ. 1,526 వద్ద ముగిసింది. -
హిందుస్తాన్ జింక్ లాభం అప్
న్యూఢిల్లీ: వేదాంతా గ్రూప్ మెటల్ దిగ్గజం హిందుస్తాన్ జింక్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలతాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 33 శాతం ఎగసి రూ. 2,680 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 2,017 కోట్లు ఆర్జించింది. అధిక అమ్మకాల పరిమాణం, ధరలు ఇందుకు దోహదపడినట్లు కంపెనీ పేర్కొంది. కమోడిటీ ధరలు బలపడటంతో ముడివ్యయాలు పెరిగినప్పటికీ వ్యూహాత్మక హెడ్జింగ్, విదేశీ మారక లాభాలు ఆదుకున్నట్లు తెలియజేసింది. కాగా.. క్యూ2లో మొత్తం ఆదాయం రూ. 5,958 కోట్ల నుంచి రూ. 8,127 కోట్లకు జంప్‌చేసింది. ఈ కాలంలో మైన్డ్ మెటల్ ఉత్పత్తి దాదాపు 3 శాతం వృద్ధితో 2,55,000 టన్నులను తాకింది. దీంతో సమీకృత మెటల్ ఉత్పత్తి మరింత అధికంగా 17.5 శాతం మెరుగుపడి 2,460,000 టన్నులకు చేరింది. కంపెనీ దేశంలోనే జింక్, లెడ్, సిల్వర్‌ను ఉత్పత్తి చేస్తున్న ఏకైక సంస్థగా నిలుస్తున్న విషయం విదితమే. ఫలితాల నేపథ్యంలో హిందుస్తాన్ జింక్ షేరు 0.7% లాభపడి రూ. 280 వద్ద ముగిసింది. -
బజాజ్ ఆటో లాభం 16% డౌన్
న్యూఢిల్లీ: వాహనాల దిగ్గజం బజాజ్ ఆటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 1,719 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) ప్రకటించింది. గత క్యూ2లో నమోదైన రూ. 2,040 కోట్లతో పోలిస్తే లాభం 16 శాతం తగ్గింది. విదేశాలకు ఎగుమతులు 25 శాతం క్షీణించడమే ఇందుకు కారణమని సంస్థ తెలిపింది. మరోవైపు మొత్తం ఆదాయం రూ. 8,762 కోట్ల నుంచి రూ. 10,203 కోట్లకు చేరింది. స్టాండెలోన్ ప్రాతిపదికన మాత్రం లాభం రూ. 1,275 కోట్ల నుంచి రూ. 1,530 కోట్లకు పెరిగింది. రెండో త్రైమాసికంలో మొత్తం వాహన విక్రయాలు 11,44,407 యూనిట్ల నుంచి నామమాత్రంగా 1 శాతం వృద్ధితో 11,51,012 యూనిట్లకు పెరిగాయి. దేశీయంగా ద్విచక్ర, త్రిచక్ర వాహనాల విక్రయాలు 5,32,216 యూనిట్ల నుంచి 30 శాతం వృద్ధి చెంది 6,94,375 యూనిట్లకు చేరాయి. అయితే ఎగుమతులు మాత్రం 6,12,191 యూనిట్ల నుంచి 4,56,637 యూనిట్లకు తగ్గాయి. విదేశీ మార్కెట్లలో స్థూలఆర్థిక పరిస్థితులపరమైన సవాళ్లు ఇందుకు కారణమని బజాజ్ ఆటో పేర్కొంది. ఆగ్నేయాసియా దేశాల్లో మాత్రం విక్రయాలు పుంజుకున్నాయని వివరించింది. శుక్రవారం బీఎస్ఈలో బజాజ్ ఆటో షేర్లు 1% క్షీణించి రూ. 3,569 వద్ద క్లోజయ్యాయి. -
టీసీఎస్ లాభం రూ. 10 వేల కోట్లు
ముంబై: దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అంచనాలకు అనుగుణమైన లాభాలతో రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాల సీజన్‌కు బోణీ కొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో కంపెనీ లాభం 8.4 శాతం పెరిగి రూ. 10,431 కోట్లుగా నమోదైంది. టీసీఎస్ లాభాలు ఒక త్రైమాసికంలో రూ. 10వేల కోట్ల మైలురాయిని అధిగమించడం ఇదే ప్రథమం. ఇక సమీక్షా కాలంలో ఆదాయం 18 శాతం ఎగిసి రూ. 55,309 కోట్లకు చేరింది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ. 46,867 కోట్ల ఆదాయంపై రూ. 9,624 కోట్ల లాభం నమోదు చేసింది. సీక్వెన్షియల్‌గా చూస్తే లాభం 10 శాతం, ఆదాయం 5 శాతం పెరిగాయి. ‘మా సర్వీసులకు డిమాండ్ పటిష్టంగా ఉంది. వివిధ విభాగాలు, మార్కెట్లలో లాభదాయకతపరంగా మెరుగైన వృద్ధి నమోదు చేశాం‘ అని సంస్థ సీఈవో రాజేశ్ గోపీనాథన్ తెలిపారు. అయితే, వ్యాపార పరిస్థితులు ‘సవాళ్లతో‘ కూడుకుని ఉన్నాయని, మరింత ‘అప్రమత్తంగా‘ వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా అనిశ్చితి రిస్కుల ప్రభావం కంపెనీపై పడకుండా సాధ్యమైన ప్రయత్నాలన్నీ చేస్తామని స్పష్టం చేశారు. భౌగోళిక, రాజకీయపరమైన సవాళ్లపై ఆందోళనల కారణంగా క్లయింట్లు దీర్ఘకాలిక డీల్స్‌కు దూరంగా ఉంటున్నారని సీవోవో గణపతి సుబ్రమణియం చెప్పారు. ధరలపరంగా పరిస్థితి స్థిరంగానే ఉందని, రూపా యి క్షీణత కారణంగా ఒత్తిళ్లేమీ లేవని పేర్కొన్నారు. మరిన్ని విశేషాలు.. ► షేరు ఒక్కింటికి రూ. 8 చొప్పున టీసీఎస్ రెండో మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. రికార్డు తేదీ అక్టోబర్ 18 కాగా, నవంబర్ 7న చెల్లిస్తుంది. ► క్యూ2లో నిర్వహణ మార్జిన్ 1.6% క్షీణించి 24%కి పరిమితమైంది. నాలుగో త్రైమాసికం నాటికి దీన్ని 25%కి పెంచుకోవాలని.. తర్వాత 26–28%కి చేరుకోవాలని సంస్థ నిర్దేశించుకుంది. ► విభాగాల వారీగా చూస్తే సమీక్షా కాలంలో రిటైల్, సీపీజీ (కన్జూమర్ ప్యాకేజ్డ్ గూడ్స్) 22.9%, కమ్యూనికేషన్స్.. మీడియా 18.7 శాతం, టెక్నాలజీ .. సర్వీసులు 15.9 శాతం, తయారీ 14.5 శాతం, బీఎఫ్ఎస్ఐ 13.1% మేర వృద్ధి నమోదు చేశాయి. ► కంపెనీ ఆర్డరు బుక్ విలువ సెప్టెంబర్ త్రైమాసికంలో 8.1 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో 400 మిలియన్ డాలర్ల ఒప్పందమే అతి పెద్దది. ► క్యూ2లో కొత్తగా 9,840 మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 6,16,171కి చేరింది. మహిళా సిబ్బంది వాటా 35.7 శాతంగా ఉంది. అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) జూన్ త్రైమాసికంలో 19.7 శాతంగా ఉండగా క్యూ2లో 21.5 శాతానికి చేరింది. అయితే, ఇది దాదాపు గరిష్ట స్థాయికి చేరినట్లేనని, ఇక్కడి నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టవచ్చని లక్కడ్ తెలిపారు. టీసీఎస్ షేరు సోమవారం 2% పెరిగి 3,121 వద్ద క్లోజైంది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వచ్చాయి. -
క్యూ2 ఫలితాలు, గణాంకాలపై కన్ను
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారం కార్పొరేట్ ఫలితాలు, ఆర్థిక గణాంకాల ఆధారంగా ట్రేడయ్యే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభంకానుంది. సోమవారం(10న) సాఫ్ట్వేర్ సేవల నంబర్‌వన్ కంపెనీ టీసీఎస్ జులై–సెప్టెంబర్(క్యూ2) ఫలితాలు ప్రకటించనుంది. ఈ బాటలో ఇతర ఐటీ దిగ్గజాలు విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్(12న), ఇన్ఫోసిస్(13న), ద్విచక్ర వాహన బ్లూచిప్ కంపెనీ బజాజ్ ఆటో(14న), ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్(15న).. క్యూ2 పనితీరును వెల్లడించనున్నాయి. ఇక ఆగస్ట్ నెలకు పారిశ్రామికోత్పత్తి, సెప్టెంబర్ నెలకు రిటైల్ ధరల(సీపీఐ) గణాంకాలు 12న, సెప్టెంబర్ టోకు ధరల (డబ్ల్యూపీఐ) వివరాలు 14న వెలువడనున్నాయి. రూపాయి ఎఫెక్ట్ క్యూ2 ఫలితాల సీజన్ ప్రారంభంకానుండగా.. మరోపక్క ఆర్థిక గణాంకాలూ ట్రెండ్‌ను ప్రభావితం చేయనున్నట్లు స్టాక్ నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా గత వారం డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టం 82ను తాకింది. చమురు దేశాల(ఒపెక్) సరఫరా కోతలతో బ్రెంట్ చమురు ధర మళ్లీ 100 డాలర్లకు చేరువైంది. ఇక డాలరు ఇండెక్స్ కొంతవెనకడుగు వేసినప్పటికీ ఫెడ్ గత పాలసీ సమీక్షా నిర్ణయాల వివరాలు(మినిట్స్) వెలువడనుండటంతో ఇన్వెస్టర్లు వీటిపై దృష్టిపెట్టే అవకాశముంది. వీటికితోడు ఇటీవల విదేశీ ఇన్వెస్ట ర్లు దేశీ స్టాక్స్‌లో అమ్మకాలవైపు మొగ్గుచూపుతున్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ఆర్థిక మాంద్య భయాలు కొనసాగుతుండటంతో ఈ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడనున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ అంశాలన్నీ దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు తెలియజేశారు. విదేశీ అంశాలు అంతర్జాతీయంగా చూస్తే యూఎస్ సీపీఐ గణాంకాలు 11న విడుదల కానున్నాయి. ఫెడ్ ఓపెన్ మార్కెట్ కమిటీ గత పాలసీ మినిట్స్ 12న, కీలక ద్రవ్యోల్బణ గణాంకాలు 13న వెల్లడికానున్నాయి. వారం రోజులపాటు ఐఎంఎఫ్ సాధారణ వార్షిక సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. వెరసి ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు పలు అంశాల ఆధారంగా కదలనున్నట్లు నిపుణులు వివరించారు. గత వారం మూడు వారాల డౌన్‌ట్రెండ్‌కు చెక్ పెడుతూ గత వారం దేశీ మార్కెట్లు జోరందుకున్నాయి. ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైనప్పటికీ సెన్సెక్స్ 764 పాయింట్లు జమ చేసుకుని 58,191 వద్ద నిలవగా.. నిఫ్టీ 220 పాయింట్ల ఎగసి 17,315 వద్ద స్థిరపడింది. ఫలితంగా ప్రధాన ఇండెక్సులు సాంకేతికంగా కీలకమైన 58,000– 17,000 స్థాయిలకు ఎగువనే స్థిరపడ్డాయి. -
స్పందన స్ఫూర్తి క్యూ2 ఫలితాలు
న్యూఢిల్లీ: మైక్రోఫైనాన్స్ కంపెనీ స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్(ఎస్‌ఎస్‌ఎఫ్‌ఎల్) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసిక ఫలితాలను ఆలస్యంగా విడుదల చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో లాభాలను కోల్పోయి నష్టాలలోకి ప్రవేశించింది. వెరసి రూ. 58 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2020–21) క్యూ2లో దాదాపు రూ. 67 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్–జూన్)లోనూ కంపెనీ రూ. 54 కోట్ల నికర లాభం సాధించింది. అయితే క్యూ2లో మొత్తం ఆదాయం మాత్రం రూ. 354 కోట్ల నుంచి రూ. 396 కోట్లకు పుంజుకుంది. క్యూ1లో అందుకున్న రూ. 435 కోట్లతో పోలిస్తే ఆదాయం క్షీణించింది. అప్పటి ఎండీ, వ్యవస్థాపకురాలి రాజీనామాతో యాజమాన్యంలో చేపట్టిన మార్పుల కారణంగా క్యూ2 ఫలితాలను ఆలస్యంగా విడుదల చేయనున్నట్లు కంపెనీ 2021 నవంబర్ 12నే వెల్లడించింది. వెంటనే అమల్లోకి వచ్చే విధంగా కంపెనీ ఎండీ, వ్యవస్థాపకురాలు పద్మజ గంగిరెడ్డి 2021 నవంబర్ 2న రాజీనామా చేసిన విషయం విదితమే. దీంతో కంపెనీ వెనువెంటనే మేనేజ్మెంట్ కమిటీని పునర్వ్యవస్థీకరించింది. ఫలితాల విడుదల నేపథ్యంలో స్పందన స్ఫూర్తి షేరు బీఎస్ఈలో 5 శాతం పతనమై రూ. 415 వద్ద ముగిసింది. -
ఓఎన్జీసీ లాభాల రికార్డ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం ఓఎన్జీసీ లిమిటెడ్ కంపెనీ చరిత్రలోనే ఒక త్రైమాసికానికి అత్యధిక లాభాలను సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో క్వార్టర్లో రూ. 18,347 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. గతేడాది ఇదే కాలం(జూలై–సెప్టెంబర్)లో రూ. 2,758 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇందుకు ప్రధానంగా వన్‌టైమ్ పన్ను లాభం దోహదపడింది. గతేడాది(2020–21) పూర్తికాలంలో ఓఎన్జీసీ కేవలం రూ. 11,246 కోట్ల లాభం సాధించింది. దీంతో పోల్చినా తాజా సమీక్షా కాలంలో భారీ లాభాలు ఆర్జించగా.. దేశీయంగా మరే ఇతర కంపెనీ ఒక త్రైమాసికంలో ఈ స్థాయి నికర లాభం ఆర్జించకపోవడం గమనార్హం! వాటాదారులకు షేరుకి రూ. 5.50 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. అంతక్రితం 2013 జనవరి–మార్చిలో మరో పీఎస్‌యూ దిగ్గజం ఐవోసీ ఈ స్థాయిలో అంటే రూ. 14,513 కోట్లు ఆర్జించింది. పన్ను దన్ను: అధిక చమురు ధరలకుతోడు రూ. 8,541 కోట్లమేర లభించిన వన్‌టైమ్ పన్ను ఆదాయం ఓఎన్జీసీ రికార్డ్ లాభాలకు సహకరించింది. సర్చార్జికాకుండా 22 శాతం కార్పొరేట్ పన్ను రేటును చెల్లించేందుకు ఉన్న అవకాశాన్ని వినియోగించుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో ఓఎన్జీసీ షేరు బీఎస్ఈలో నామమాత్ర లాభంతో రూ. 155 వద్ద ముగిసింది. -
క్యూ2లో టాటా స్టీల్ జోరు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ మెటల్ దిగ్గజం టాటా స్టీల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 12,548 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,665 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 39,158 కోట్ల నుంచి రూ. 60,554 కోట్లకు జంప్‌చేసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 37,000 కోట్ల నుంచి రూ. 47,135 కోట్లకు పెరిగాయి. స్టీల్ ఉత్పత్తి 7.25 మిలియన్ టన్ను(ఎంటీ)ల నుంచి 7.77 ఎంటీకి పుంజుకుంది. విక్రయాలు మాత్రం 7.93 ఎంటీ నుంచి 7.39 ఎంటీకి వెనకడుగు వేశాయి. కాగా.. స్టాండెలోన్ నికర లాభం రూ. 2,539 కోట్ల నుంచి రూ. 8,707 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం రూ. 21,820 కోట్ల నుంచి రూ. 32,964 కోట్లకు జంప్‌చేసింది. నాట్‌స్టీల్ విక్రయం..: సింగపూర్ అనుబంధ సంస్థ నాట్‌స్టీల్ హోల్డింగ్స్‌లో 100 శాతం వాటా విక్రయానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాటా స్టీల్ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ వెల్లడించారు. దేశీ బిజినెస్‌తోపాటు.. యూరోపియన్ కార్యకలాపాలు సైతం పటిష్ట ఫలితాలు సాధించినట్లు పేర్కొన్నారు. అయితే బొగ్గు ధరలు, ఇంధన వ్యయాల కారణంగా భవిష్యత్‌లో మార్జిన్లపై ఒత్తిడి పెరిగే వీలున్నట్లు తెలియజేశారు. 5 ఎంటీ వార్షిక సామర్థ్యంతో చేపట్టిన కళింగనగర్ రెండో దశ విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలియజేశారు. టాటా స్టీల్ బీఎస్ఎల్ విలీనాన్ని త్వరలో పూర్తిచేయనున్నట్లు వివరించారు. కంపెనీ ఇటీవలే అధిక నాణ్యతగల గంధల్పాడ ఇనుపఖనిజ గనులను గెలుచుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాగా.. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో రూ. 11,424 కోట్ల రుణాలను తిరిగి చెల్లించినట్లు కంపెనీ వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో టాటా స్టీల్ షేరు బీఎస్ఈలో యథాతథంగా రూ. 1,299 వద్ద ముగిసింది. రూ. 1,324 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
కల్యాణ్ జ్యుయలర్స్ లాభం రూ. 69 కోట్లు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆభరణాల సంస్థ కల్యాణ్ జ్యుయలర్స్ ఇండియా రూ. 69 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత క్యూ2లో కంపెనీ రూ. 136 కోట్ల నష్టం నమోదు చేసింది. తాజాగా కోవిడ్–19 పరమైన ఆంక్షలు తగ్గడం, ఆర్థిక వ్యవస్థ రికవరీ తదితర అంశాలు అమ్మకాలకు ఊతమిచ్చినట్లు కంపెనీ తెలిపింది. సమీక్షా కాలంలో ఆదాయం రూ. 1,798 కోట్ల నుంచి 61 శాతం ఎగిసి రూ. 2,889 కోట్లకు పెరిగింది. క్యూ2లో కంపెనీ పటిష్టమైన పనితీరు కనపర్చిందని, కోవిడ్–19పరమైన ఆంక్షలు సడలింపుతో పాటు వినియోగదారుల సెంటిమెంట్ మెరుగుపడుతుండటంతో ప్రస్తుత త్రైమాసికంలో కూడా అమ్మకాలు మరింతగా వృద్ధి చెందవచ్చని కల్యాణ్ జ్యుయలర్స్ ఇండియా ఈడీ రమేష్ కల్యాణరామన్ తెలిపారు. బీఎస్ఈలో బుధవారం కంపెనీ షేరు సుమారు 4 శాతం పెరిగి రూ. 81.50 వద్ద క్లోజయ్యింది. -
ఆయిల్ ఇండియాకు లాభాల పంట
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో (క్యూ2) ప్రభుత్వరంగ ఆయిల్ ఇండియా లిమిటెడ్ మంచి ఫలితాలను నమోదు చేసింది. నికర లాభం రెట్టింపునకు పైగా పెరిగి రూ.504 కోట్లకు చేరింది. షేరువారీ ఆర్జన రూ.4.65గా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.239 కోట్లు (షేరువారీ ఆర్జన రూ.2.20)గా ఉండడం గమనార్హం. కంపెనీ ఉత్పత్తి చేసిన ప్రతీ బ్యారెల్ ముడి చమురుపై 71.35 డాలర్ల మేర ధర గిట్టుబాటు కావడం లాభాల వృద్ధికి దోహదపడింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో బ్యారెల్ ముడిచమురు ధర 43 డాలర్ల స్థాయిలో ఉంది. కంపెనీ చమురు ఉత్పత్తిలో పెద్దగా మార్పు లేకుండా 0.76 మిలియన్ టన్నులుగా ఉంటే, సహజ వాయువు ఉత్పత్తి 2 శాతం మేర పెరిగింది. కంపెనీ ఆదాయం రూ.2,281 కోట్ల నుంచి రూ.3,679 కోట్లకు వృద్ధి చెందింది. ఏప్రిల్–సెప్టెంబర్ ఆరు నెలల్లో కంపెనీ నికర లాభం 10 శాతం వృద్ధితో రూ.1,012 కోట్లుగా నమోదైంది. ఎబిట్డా రూ.1,281 కోట్లుగా ఉంది. -
బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం 24% అప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 2,088 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో నమోదైన రూ. 1,679 కోట్ల లాభంతో పోలిస్తే ఇది సుమారు 24 శాతం అధికం. రైటాఫ్ చేసిన ఖాతాల నుంచి అధిక మొత్తం రికవర్ కావడం, మార్జిన్లు స్థిర స్థాయిలో కొనసాగడం తదితర అంశాలు లాభాలు మెరుగుపడటానికి దోహదపడినట్లు బ్యాంక్ ఎండీ సంజీవ్ చడ్ఢా తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ధి 7–10 శాతం స్థాయిలో ఉండవచ్చని, కార్పొరేట్ రుణాలు కూడా వృద్ధి చెందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమీక్షా కాలంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 20,729 కోట్ల నుంచి రూ. 20,271 కోట్లకు తగ్గింది. వడ్డీ ఆదాయం 6.33 శాతం క్షీణించి రూ. 17,820 కోట్ల నుంచి రూ. 16,692 కోట్లకు తగ్గింది. వడ్డీయేతర ఆదాయం 23 శాతం పెరిగి రూ. 2,910 కోట్ల నుంచి రూ. 3,579 కోట్లకు చేరింది. మరోవైపు, ఇచ్చిన మొత్తం రుణాల్లో .. స్థూల నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) పరిమాణం 9.14 శాతం నుంచి 8.11 శాతానికి దిగి వచ్చింది. కానీ నికర ఎన్పీఏలు 2.51 శాతం నుంచి స్వల్పంగా పెరిగి 2.83 శాతానికి చేరాయి. మొండి బాకీలు తదితర అంశాలకు కేటాయింపులు రూ. 2,811 కోట్ల నుంచి రూ. 2,754 కోట్లకు తగ్గాయి. బీఎస్ఈలో బుధవారం బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు 5 శాతం క్షీణించి రూ. 100.65 వద్ద క్లోజయ్యింది. -
వేదాంతా లాభం హైజంప్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ2(జులై–సెప్టెంబర్)లో నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 4,615 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 838 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 21,758 కోట్ల నుంచి రూ. 31,074 కోట్లకు జంప్ చేసింది. అధిక కమోడిటీ ధరలు, బలపడిన మార్జిన్లు, వివిధ విభాగాల అమ్మకాల్లో వృద్ధి కంపెనీ పటిష్ట పనితీరుకు దోహదం చేశాయి. క్యూ2లో రూ. 7,232 కోట్లమేర నికర రుణభారాన్ని తగ్గించుకున్నట్లు వేదాంతా సీఈవో సునీల్ దుగ్గల్ వెల్లడించారు. వాటాదారులకు షేరుకి రూ. 18.5 చొప్పున బోర్డు మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో వేదాంతా షేరు బీఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 304 వద్ద ముగిసింది. -
గెయిల్ లాభం రెట్టింపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం గెయిల్ ఇండియా లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జులై– సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 131 శాతం దూసుకెళ్లి రూ. 2,863 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,240 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 57 శాతం పురోగమించి రూ. 21,515 కోట్లకు చేరింది. నేచురల్ గ్యాస్ అమ్మకాలు టర్న్అరౌండ్ కావడం ఫలితాల మెరుగుకు దోహదపడింది. ఈ విభాగం రూ. 1,079 కోట్ల పన్నుకు ముందు లాభం సాధించింది. అంతక్రితం క్యూ2లో రూ. 364 కోట్ల పన్నుకుముందు నష్టం ప్రకటించింది. గ్యాస్ పంపిణీ పన్నుకు ముందు లాభం సైతం రెట్టింపై రూ. 363 కోట్లను అధిగమించింది. గ్యాస్ పంపిణీ 107.66 ఎంఎంఎస్‌సీఎండీ నుంచి 114.32 ఎంఎంఎస్‌సీఎండీకి పెరిగింది. ఫలితాల నేపథ్యంలో గెయిల్ ఇండియా షేరు బీఎస్ఈలో 1.2 శాతం బలపడి రూ. 149 వద్ద ముగిసింది. -
క్యూ2 లో సెయిల్ దూకుడు
న్యూఢిల్లీ: పీఎస్‌యూ రంగ స్టీల్ దిగ్గజం సెయిల్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో క్వార్టర్లో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 10 రెట్లు ఎగసింది. రూ. 4,339 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో దాదాపు రూ. 437 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 17,098 కోట్ల నుంచి రూ. 27,007 కోట్లకు జంప్ చేసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 16,734 కోట్ల నుంచి రూ. 21,289 కోట్లకు ఎగశాయి. ఈ కాలంలో 4.468 మిలియన్ టన్నుల స్టీల్‌ను తయారు చేయగా.. 4.280 ఎంటీ స్టీల్‌ను విక్రయించినట్లు సెయిల్ తెలియజేసింది. సెప్టెంబర్‌కల్లా స్థూల రుణాలు రూ. 35,350 కోట్ల నుంచి రూ. 22,478 కోట్లకు క్షీణించాయి. వెరసి తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెప్టెంబర్)లో రూ. 12,872 కోట్లమేర రుణ భారాన్ని తగ్గించుకుంది. వాటాదారులకు షేరుకి రూ. 4 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో సెయిల్ షేరు బీఎస్ఈలో యథాతథంగా రూ. 115 వద్ద ముగిసింది. -
డాక్టర్ రెడ్డీస్ లాభం 30 శాతం అప్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 992 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన రూ. 762 కోట్లతో పోలిస్తే ఇది 30 శాతం అధికం. మరోవైపు, ఆదాయం రూ. 4,897 కోట్ల నుంచి రూ. 5,732 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం, అన్ని మార్కెట్లలో విక్రయాలు భారీగా పెరగడం తదితర అంశాలు కంపెనీ మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించడానికి దోహదపడ్డాయి. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఇతర నిర్వహణ ఆదాయం రూ. 15 కోట్లు ఉండగా.. తాజా క్యూ2లో రూ. 170 కోట్లకు పెరిగింది. -
బజాజ్ ఆటో లాభం 71 శాతం అప్..
న్యూఢిల్లీ: వాహనాల తయారీ దిగ్గజం బజాజ్ ఆటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 2,094 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన రూ. 1,194 కోట్లతో పోలిస్తే ఇది 71 శాతం అధికం. ఇక ఆదాయం రూ. 7,442 కోట్ల నుంచి రూ. 9,080 కోట్లకు చేరింది. కేటీఎం ఏజీలో 46.5 శాతం వాటాలను పీరర్ బజాజ్ ఏజీలో 49.9 శాతం వాటా కోసం తమ అనుబంధ సంస్థ బజాజ్ ఆటో ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ మార్పిడి చేసుకున్నట్లు కంపెనీ తెలిపింది. దీనితో సుమారు రూ. 501 కోట్ల మేర ప్రయోజనం చేకూరిందని పేర్కొంది. రెండో త్రైమాసికంలో కంపెనీ మొత్తం 11,44,407 వాహనాలు విక్రయించింది. గత క్యూ2లో విక్రయించిన 10,53,337 యూనిట్లతో పోలిస్తే 9 శాతం వృద్ధి నమోదు చేసింది. -
మారుతీ లాభం స్కిడ్!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం ఏకంగా 66 శాతం క్షీణించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 487 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నికర లాభం రూ. 1,420 కోట్లు. సెమీకండక్టర్ల కొరత, కమోడిటీ ధరల పెరుగుదల తదితర అంశాలు రెండో త్రైమాసికంలో కంపెనీపై ప్రతికూల ప్రభావం చూపాయి. తాజా క్యూ2లో ఆదాయం రూ. 18,756 కోట్ల నుంచి రూ. 20,551 కోట్లకు చేరింది. మొత్తం వాహన విక్రయాలు 3 శాతం క్షీణించి 3,93,130 యూనిట్ల నుంచి 3,79,541 యూనిట్లకు తగ్గాయి. దేశీ విక్రయాలు 3,70,619 యూనిట్ల నుంచి 3,20,133 యూనిట్లకు క్షీణించాయి. అయితే, ఎగుమతులు 22,511 వాహనాల నుంచి ఏకంగా 59,408 వాహనాలకు చేరాయి. త్రైమాసికాలవారీగా ఇది అత్యధికం. లక్ష పైగా వాహనాల ఉత్పత్తికి బ్రేక్ .. ప్రధానంగా దేశీ మోడల్స్‌కు సంబంధించి.. ఎలక్ట్రానిక్స్ విడిభాగాల కొరత కారణంగా దాదాపు 1.16 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయలేకపోయినట్లు కంపెనీ తెలిపింది. రెండో త్రైమాసికం ఆఖరు నాటికి 2 లక్షల పైగా ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయని వివరించింది. డెలివరీలను వేగవంతం చేసేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని పేర్కొంది. ‘గడిచిన ఏడాది వ్యవధిలో చూస్తే.. ఈ త్రైమాసికంలో ఉక్కు, అల్యూమినియం, ఇతరత్రా విలువైన లోహాల ధరలు అసాధారణంగా పెరిగిపోయాయి. ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా ముడి వస్తువుల ధరల పెరుగుదల ప్రభావాన్ని వీలైనంత అధికంగా భరించేందుకు కంపెనీ అన్ని ప్రయత్నాలు చేసింది. కార్ల ధరలు పెంచినా.. వినియోగదారులకు స్వల్ప భారాన్నే బదలాయించింది. నికర లాభం క్షీణించడానికి ఇది కూడా కారణం‘ అని మారుతీ సుజుకీ తెలిపింది. సవాళ్లమయంగా రెండో త్రైమాసికం.. క్యూ2 అత్యంత సవాళ్లమయంగా సాగిందని ఆన్లైన్ విలేకరుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా కంపెనీ చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. ఏడాది ప్రారంభంలో కంపెనీ ఊహించని అనూహ్యమైన పరిణామాలు, సవాళ్లు ఎదురయ్యాయని ఆయన పేర్కొన్నారు. ‘రెండో త్రైమాసికంలో కరోనా పరిస్థితి మరీ తీవ్రంగా లేదు. కానీ సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత .. కమోడిటీల ధరలు అసాధారణంగా పెరిగిపోవడం వంటి అంశాలు మా ముందస్తు అంచనాలను తల్లకిందులు చేశాయి‘ అని భార్గవ తెలిపారు. రెండంకెల వృద్ధి ఉండదు.. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగతా వ్యవధిలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో చెప్పడం ప్రస్తుతం చాలా కష్టమని భార్గవ చెప్పారు. కమోడిటీల ధరలు, ఎలక్ట్రానిక్ విడిభాగాల సరఫరాలను అంచనా వేయడం అంత సులభంగా లేదన్నారు. అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల కొరత నెలకొందని, ఎవరూ దీర్ఘకాలిక సరఫరాల గురించి ఇదమిత్థంగా చెప్పలేకపోతున్నారని భార్గవ తెలిపారు. నాలుగేళ్ల తర్వాతే ఎలక్ట్రిక్ వాహనం ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అంతగా లేదని, 2025 తర్వాతే దేశీయంగా వీటిని తాము ప్రవేశపెట్టే అవకాశం ఉందని భార్గవ చెప్పారు. తాము ఈ విభాగంలోకి ప్రవేశిస్తే నెలకు కనీసం 10,000 యూనిట్లయినా విక్రయించాలని భావిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం బ్యాటరీలు, చార్జింగ్ మౌలిక సదుపాయాలు, విద్యుత్ సరఫరా వంటివి ఇతర సంస్థల చేతుల్లో ఉన్నందున.. ధరను నిర్ణయించడం తమ చేతుల్లో లేదన్నారు. ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టడంపై మాతృ సంస్థ సుజుకీదే తుది నిర్ణయమని చెప్పారు. 2020లో ఎలక్ట్రిక్ వేగన్ఆర్ను విడుదల చేయాలని అనుకున్నప్పటికీ, వివిధ ప్రతికూలతల కారణంగా దాన్ని పక్కన పెట్టింది. -
టెక్ మహీంద్రా లాభం 26% అప్..
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా నికర లాభం 26 శాతం ఎగిసింది. రూ. 1,339 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ. 1,065 కోట్లు. ఇక తాజా సమీక్షాకాలంలో ఆదాయం 16 శాతం వృద్ధి చెంది రూ. 10,881 కోట్లుగా నమోదైంది. జూన్ క్వార్టర్‌తో పోలిస్తే 6.4 శాతం పెరిగింది. ఇది దశాబ్ద కాలంలోనే గరిష్ట వృద్ధి. టెక్ మహీంద్రా షేరు ఒక్కింటికి రూ. 15 చొప్పున ప్రత్యేక డివిడెండ్ ప్రకటించింది. క్యూ2లో కొత్తగా 750 మిలియన్ డాలర్ల డీల్స్ కుదిరాయని, వీటిలో సింహభాగం డిజిటలైజేషన్కి సంబంధించినవే ఉన్నాయని టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ తెలిపారు. రాబోయే రోజుల్లోనూ ఇదే తరహా పనితీరు సాధించగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే 15.2 శాతంగా నమోదైన నిర్వహణ లాభాల మార్జిన్‌ను ఇకపైనా అదే స్థాయిలో లేదా అంతకు మించి సాధించే అవకాశాలు ఉన్నాయని గుర్నానీ చెప్పారు. రెండు సంస్థల కొనుగోలు .. డిజిటల్ ఇంజినీరింగ్ కంపెనీ లోడ్‌స్టోన్‌తో పాటు మరో సంస్థను కొనుగోలు చేస్తున్నట్లు టెక్ మహీంద్రా తెలిపింది. ఇందుకోసం సుమారు 105 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 789 కోట్లు) వెచ్చిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు, బ్రిటన్‌కు చెందిన ఉయ్ మేక్ వెబ్‌సైట్స్ (డబ్ల్యూఎండబ్ల్యూ)ని 9.4 మిలియన్ పౌండ్లకు (సుమారు రూ. 97 కోట్లు) కొనుగోలు చేసినట్లు వివరించింది. అట్రిషన్‌తో సమస్యలు.. నిపుణులకు డిమాండ్ నెలకొనడంతో అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) ఐటీ సంస్థలకు సమస్యాత్మకంగా తయారైందని గుర్నానీ తెలిపారు. అయితే, తమ సంస్థ దీన్ని ఎదుర్కొంటున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. టెక్ మహీంద్రాలో అట్రిషన్ రేటు తాజా క్యూ2లో 21 శాతానికి పెరిగింది. ఇది గత క్యూ2లో 14 శాతంగా ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో 17 శాతానికి చేరింది. హైదరాబాద్, బెంగళూరు, పుణె వంటి పెద్ద నగరాల్లో అట్రిషన్ రేటు అధికంగా ఉండగా.. నాగ్‌పూర్, భువనేశ్వర్ వంటి ప్రాంతాల్లో తక్కువ స్థాయిలో ఉందని గుర్నానీ చెప్పారు. సెప్టెంబర్ క్వార్టర్లో కంపెనీ 14,000 మంది పైచిలుకు ఉద్యోగులను తీసుకోవడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 1.41 లక్షలకు చేరినట్లు గుర్నానీ చెప్పారు. సోమవారం బీఎస్ఈలో టెక్ మహీంద్రా షేరు స్వల్పంగా పెరిగి రూ. 1,524 వద్ద క్లోజయ్యింది. -
Stock Market: కరెక్షన్ కొనసాగొచ్చు
ముంబై: స్టాక్ మార్కెట్లో ఈ వారం కూడా కరెక్షన్ కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్ డెరివేటివ్‌ల గడువు(గురువారం) ముగింపుతో పాటు ఈ వారంలో సుమారు 700కి పైగా కంపెనీలు తమ రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు మొగ్గుచూపవచ్చని వారు అంచనా వేస్తున్నారు. సూచీల గమనాన్ని ప్రపంచ పరిణామాలు నిర్ధేశిస్తాయని అభిప్రాయపడుతున్నారు. అలాగే కరోనా కేసుల నమోదు, వ్యాక్సినేషన్ ప్రక్రియ, విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలు తదితర అంశాలూ ట్రేడింగ్ పై ప్రభావాన్ని చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘‘బ్యాంక్ నిఫ్టీ తొలిసారి 40,000 స్థాయిని అధిగమించింది. అనేక బ్యాంకులు ఈ వారంలో రెండో క్వార్టర్ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్న నేపథ్యంలో బ్యాంకింగ్ రంగ షేర్లు అధిక వ్యాల్యూమ్స్‌తో ట్రేడ్ అవ్వొచ్చు. ఎఫ్అండ్ఓ ముగింపు, కార్పొరేట్ల ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో కరెక్షన్(దిద్దుబాటు) కొనసాగేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మార్కెట్ పతనం కొనసాగితే నిఫ్టీకి దిగువ స్థాయిలో 18,050 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు ఉంది. ఎగువస్థాయిలో 18,300–18,350 శ్రేణిలో వద్ద బలమైన నిరోధం ఉంది’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సరీ్వసెస్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. వరుస నాలుగు రోజుల పతనంతో గతవారం సెన్సెక్స్ 483 పాయింట్లు నిఫ్టీ 224 పాయింట్లు నష్టపోయాయి. క్యూ2 ఫలితాల జాబితా... సూచీలు ముందుగా గత శుక్రవారం విడుదలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, శనివారం వెల్లడైన ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలపై స్పందించాల్సి ఉంటుంది. ఇక ఈ వారంలో నిఫ్టీ–50 ఇండెక్స్‌లోని షేర్లకు చెందిన 20 కంపెనీలతో సహా సుమారు 700కు పైగా కార్పొరేట్లు తమ రెండో త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇందులో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వీసెస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ, టైటాన్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ తదితర కంపెనీలున్నాయి. ఈ వారంలో రెండు ఐపీఓలు... బ్యూటీ ఉత్పత్తుల సంస్థ నైకాతో పాటు ఫినో పేమెంట్స్ బ్యాంక్స్ ఈ వారం పబ్లిక్ ఇష్యూల(ఐపీఓ) ద్వారా మార్కెట్లోకి రానున్నాయి. ఫినోటెక్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీఓ ఈ నెల 29న(శుక్రవారం) ప్రారంభమై.., నవంబర్ 2న ముగుస్తుంది. ధర శ్రేణిని కంపెనీ ఈ వారంలో ప్రకటించనుంది. ఎఫ్ఐఐల ట్రెండ్ రివర్స్... గత రెండు నెలల్లో కనిపించిన పెట్టుబడుల ట్రెండ్‌కు భిన్నంగా విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) దేశీయ ఈక్విటీల అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం నికరంగా అక్టోబర్ నెలలో ఇప్పటివరకూ(అక్టోబర్ 24)ఎఫ్‌పీఐలు రూ. 3,825 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇందులో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.2,331 కోట్ల షేర్లను అమ్మగా., డెట్ మార్కెట్లో రూ.1,494 కోట్లు పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఐటీ షేర్ల పట్ల బేరిష్ వైఖరి కలిగి ఉన్నారు. బ్యాంకింగ్ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఐటీ కంపెనీలు రెండో క్వార్టర్లో మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించినప్పటికీ.., ఈ ఏడాది తొలి భాగంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.5,406 కోట్ల ఐటీ షేర్లను విక్రయించారు. సాధ్యమైనంత తొందర్లో ట్యాపరింగ్ చర్యలను చేపట్టడంతో పాటు కీలక వడ్డీరేట్లను పెంచుతామని ఫెడ్ వ్యాఖ్యలతో విదేశీ ఇన్వెస్టర్లు వర్థమాన దేశాల మార్కెట్లలో లాభాల స్వీకరణకు పాల్పడుతున్నారని జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ ప్రధాన వ్యూహకర్త వీకే విజయ్ కుమార్ తెలిపారు. 28 నుంచి నైకా ఐపీవో షేరు ధర శ్రేణి రూ. 1,085–1,125 సౌందర్య సంరక్షణ ఉత్పత్తుల సంస్థ నైకా మాతృసంస్థ ఎఫ్ఎస్ఎన్ ఈ–కామర్స్ వెంచర్స్ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ అక్టోబర్ 28న ప్రారంభమై నవంబర్ 1న ముగియనుంది. దీనికి సంబంధించి షేరు ధర శ్రేణి రూ. 1,085–1,125గా ఉంటుందని సంస్థ వెల్లడించింది. ఐపీవో ద్వారా కంపెనీ రూ. 5,352 కోట్లు సమీకరించనుంది. ఇందులో భాగంగా తాజాగా రూ. 630 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుండగా, ప్రమోటర్లు.. ప్రస్తుత షేర్హోల్డర్లు 4,19,72,660 షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించనున్నారు. కార్యకలాపాల విస్తరణకు, కొత్త రిటైల్ స్టోర్లు.. గిడ్డంగుల ఏర్పాటు కోసం ఐపీవో నిధులను కంపెనీ వినియోగించనుంది. అలాగే కొంత రుణాన్ని తీర్చడం ద్వారా వడ్డీ వ్యయాలను తగ్గించుకుని, లాభదాయకతను మెరుగుపర్చుకోనుంది. -
ఐసీఐసీఐ రికార్డు లాభాలు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 5,511 కోట్ల నికర లాభం ఆర్జించింది. త్రైమాసికాలవారీగా చూస్తే ఇది రికార్డు గరిష్ట స్థాయి లాభం. వివిధ విభాగాల్లో రుణ వృద్ధి మెరుగుపడటం, మొండి బాకీలు తగ్గడం ఇందుకు దోహదపడ్డాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో బ్యాంక్ రూ. 4,251 కోట్ల లాభం నమోదు చేసింది. తాజా క్యూ2లో ఆదాయం రూ. 23,651 కోట్ల నుంచి రూ. 26,031 కోట్లకు పెరిగింది. ఇవి స్టాండెలోన్ ప్రాతిపదికన ఫలితాలు కాగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన చూస్తే జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో బ్యాంకు అత్యధికంగా రూ. 6,092 కోట్ల నికర లాభం నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఇది రూ. 4,882 కోట్లు. ఇక మొత్తం ఆదాయం స్వల్పంగా వృద్ధి చెంది రూ. 39,290 కోట్ల నుంచి రూ. 39,484 కోట్లకు చేరింది. కనిష్టానికి ఎన్పీఏలు: బ్యాంక్ ఎన్పీఏలు 5.17 శాతం నుంచి 4.82 శాతానికి దిగి వచ్చాయి. ఇక నికర ఎన్పీఏలు 1 శాతం నుంచి 0.99 శాతానికి తగ్గాయి. 2014 డిసెంబర్ 31 తర్వాత నికర ఎన్పీఏలు ఇంత కనిష్టానికి తగ్గడం ఇదే ప్రథమం. -
రిలయన్స్ అదరహో!
సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ మరోసారి పటిష్ట పనితీరు చూపింది. ముడిచమురు ధరలు పుంజుకోవడంతో ఓటూసీ విభాగం జోరు చూపగా.. టెలికం, డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ యథాప్రకారం మెరుగైన లాభాలను సాధించింది. ఇక రిలయన్స్ రిటైల్ సైతం అమ్మకాలను పెంచుకుంది. వివరాలు ఇలా... న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెపె్టంబర్(క్యూ2)లో నికర లాభం 43 శాతం జంప్‌చేసింది. రూ. 13,680 కోట్లను తాకింది. గతేడాది(2020–21) క్యూ2లో రూ, 9,567 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఈ బాటలో మొత్తం ఆదాయం సైతం 49 శాతం పురోగమించి రూ. 1,91,532 కోట్లకు చేరింది. చమురు ధరలు భారీగా పెరగడంతో కంపెనీ లబ్ధి పొందింది. దీనికితోడు రిటైల్ బిజినెస్ జోరందుకోవడం, టెలికం బిజినెస్ పుంజుకోవడం సైతం లాభాలకు దోహదపడ్డాయి. కంపెనీ ప్రధానంగా 4 బిజినెస్ విభాగాలను కలిగి ఉంది. ఇవి ఆయిల్ టు కెమికల్(ఓటూసీ), రిటైల్, డిజిటల్ సర్వీసులు, కొత్త ఇంధన బిజినెస్. విభాగాల వారీగా.. ఆర్ఐఎల్ ఆదాయంలో ఓటూసీ విభాగం రూ. 1.2 లక్షల కోట్లను సాధించింది. ఇది 58 శాతం వృద్ధికాగా.. నిర్వహణ లాభం 44 శాతం ఎగసి రూ. 12,720 కోట్లకు చేరింది. రిఫైనింగ్, పెట్రోకెమికల్ ప్రొడక్టులకు ప్రపంచవ్యాప్తంగా పెరిగిన డిమాండ్ ప్రభావం చూపింది. ఇక రిలయన్స్ రిటైల్ అమ్మకాలు 9 శాతంపైగా పుంజుకుని రూ. 39,926 కోట్లను తాకాయి. నిర్వహణ లాభం 45 శాతం జంప్‌చేసి రూ. 2,913 కోట్లను తాకింది. మార్జిన్లు 1.8 శాతం మెరుగుపడి 7.3 శాతానికి చేరాయి. కొత్తగా 813 స్టోర్లను ప్రారంభించింది. దీంతో స్టోర్ల సంఖ్య 13,635కు చేరింది. జియో జోరు..: టెలికం, డిజిటల్ సరీ్వసుల విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ క్యూ2లో నికర లాభం 23.5% వృద్ధితో రూ. 3,728 కోట్లను తాకింది. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం (ఏఆర్పీయూ) రూ.138.4 నుంచి రూ. 143.6కు మెరుగుపడింది. స్థూల ఆదాయం 15% పెరిగి రూ.23,222 కోట్లకు చేరింది. ఇక చమురు, గ్యాస్ విభాగం ఆదాయం 363% పురోగమించి రూ. 1,644 కోట్లయ్యింది. నిర్వహణ లాభం రూ. 1071 కోట్లకు చేరింది. రోజుకి 18 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల ఉత్పత్తిని సాధించింది. కేజీ–డీ6 బ్లాకులో ఉత్పత్తి ప్రారంభంకావడం ఇందుకు సహకరించింది. ఇతర హైలైట్స్ ► సెప్టెంబర్‌కల్లా కంపెనీ చేతిలో నగదు, తత్సమాన నిల్వల విలువ రూ. 2,59,476 కోట్లుగా నమోదైంది. మరోపక్క రూ. 2,55,891 కోట్ల రుణ భారాన్ని కలిగి ఉంది. వెరసి నికరంగా రుణరహిత కంపెనీగా నిలుస్తోంది. ► క్యూ2లో పెట్టుబడి వ్యయాలు రూ. 39,350 కోట్లుగా నమోదయ్యాయి. ► జియో వినియోగదారులు 23.8 మిలియన్లమేర పెరిగి 429.5 మిలియన్లకు చేరారు. ► దీపావళికల్లా జియోఫోన్ నెక్స్ట్ పేరుతో చౌక స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు గూగుల్‌తో కలసి జియో పనిచేస్తోంది. సంతోషంగా ఉంది.. ఈ ఏడాది క్యూ2లో ఆకర్షణీయ ఫలితాలను సాధించినందుకు సంతోషిస్తున్నాం. కంపెనీ బిజినెస్‌లకున్న సహజసిద్ధ పటిష్టతకు ఇది నిదర్శనం. అంతేకాదు.. దేశ, విదేశీ ఆర్దిక వ్యవస్థల వేగవంత రికవరీని ఫలితాలు ప్రతిఫలిస్తున్నాయి. రిటైల్, ఓటూసీ, డిజిటల్ సరీ్వసుల విభాగాలలో నిలకడైన వృద్ధి కొనసాగింపును మెరుగైన నిర్వహణ, ఆర్దిక పనితీరు సూచిస్తున్నాయి. శుద్ధ ఇంధనంవైపు ప్రపంచ ప్రయాణంలో భారత్ ముందుండే బాటలో పర్యావరణ అనుకూల పెట్టుబడులను చేపడుతున్నాం. ఈ బాటలో ప్రపంచంలోనే ఉత్తమ కంపెనీలతో చేతులు కలుపుతున్నాం. 2035కల్లా నికరంగా జీరో కార్బన్ లక్ష్యాన్ని చేరగలమన్న నమ్మకం మరింత పెరిగింది. – ముకేశ్ అంబానీ, చైర్మన్, ఎండీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ -
ఏషియన్ పెయింట్స్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఏషియన్ పెయింట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 29 శాతం క్షీణించి రూ. 605 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 852 కోట్లు ఆర్జించింది. ముడిసరుకుల వ్యయాలు పెరగడం ప్రధానంగా ప్రభావం చూపింది. కాగా.. మొత్తం ఆదాయం మాత్రం రూ. 5,350 కోట్ల నుంచి రూ. 7,096 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 4,299 కోట్ల నుంచి రూ. 6,418 కోట్లకు పెరిగాయి. వీటిలో మెటీరియల్స్ వ్యయాలు రూ. 2,646 కోట్ల నుంచి రూ. 4,571 కోట్లకు పెరిగాయి. ఈ కేలండర్ ఏడాది(2021) జనవరి నుంచి ముడిసరుకుల ధరలు భారీగా పెరిగినట్లు కంపెనీ ఎండీ, సీఈవో అమిత్ సింగ్లే పేర్కొన్నారు. దీంతో అన్ని విభాగాలలోనూ స్థూల మార్జిన్లు ప్రభావితమైనట్లు తెలియజేశారు. ఫలితంగా ప్రొడక్టుల ధరలను పెంచినట్లు తెలియజేశారు. ఇకపైన కూడా ముడివ్యయాలకు అనుగుణంగా ధరలను పెంచాలని చూస్తున్నట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో ఏషియన్ పెయింట్స్ షేరు బీఎస్ఈలో దాదాపు 5.2 శాతం పతనమై రూ. 3,004 వద్ద ముగిసింది. -
ఎల్అండ్టీ ఫైనాన్స్.. వీక్
న్యూఢిల్లీ: ఎల్అండ్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెపె్టంబర్(క్యూ2)లో నికర లాభం 10 శాతం క్షీణించింది. రూ. 223 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 248 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 3,509 కోట్ల నుంచి రూ. 3,134 కోట్లకు నీరసించింది. క్యూ2లో గ్రామీణ ప్రాంత రుణ విడుదలలో 51 శాతం వృద్ధి నమోదైనట్లు కంపెనీ పేర్కొంది. రూ. 4,987 కోట్లు మంజూరు చేసినట్లు తెలియజేసింది. వీటితోపాటు రిటైల్, రియలీ్ట, ఇన్ఫ్రా విభాగాలలో కలిపి మొత్తం రూ. 7,339 కోట్ల రుణాలను విడుదల చేసినట్లు వెల్లడించింది. కోవిడ్–19 సెకండ్ వేవ్, స్థూల ఆరి్థక పరిస్థితులు బిజినెస్ వాతావరణంపై ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. స్థూల మొండిబకాయిలు 5.74 శాతంగా నమోదుకాగా.. కనీస మూలధన నిష్పత్తి 25.16 శాతానికి బలపడింది. ఫలితాల నేపథ్యంలో ఎల్అండ్టీ ఫైనాన్స్ షేరు బీఎస్ఈలో 1 శాతం నీరసించి రూ. 91.5 వద్ద ముగిసింది. -
జూబిలెంట్ ఫుడ్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో క్విక్ సరీ్వస్ రెస్టారెంట్ల(క్యూఎస్ఆర్) దిగ్గజం జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 58 శాతంపైగా జంప్‌చేసింది. రూ. 120 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) క్యూ2లో రూ. 76 కోట్లు మాత్రమే ఆర్జించింది. డెలివరీ, టేక్ఎవే చానల్స్ పుంజుకోవడం ప్రభావం చూపినట్లు జూబిలెంట్ ఫుడ్ పేర్కొంది. కంపెనీ డోమినోస్ పిజ్జా, డంకిన్ డోనట్స్ తదితర సుప్రసిద్ధ ఫాస్ట్ ఫుడ్ చైన్ స్టోర్లను నిర్వహించే సంగతి తెలిసిందే. కాగా.. క్యూ2లో మొ త్తం ఆదాయం సైతం రూ. 816 కోట్ల నుంచి రూ. 1,116 కోట్లకు ఎగసింది. ఇది 37% వృద్ధికి సమానం. అయితే మొత్తం వ్యయాలు రూ. 747 కోట్ల నుంచి రూ. 963 కోట్లకు పెరిగాయి. ప్రోత్సాహకర ఫలితాల నేపథ్యంలోనూ జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. దీంతో బీఎస్ఈలో ఈ షేరు 8.5 శాతం పతనమైంది. రూ. 3,965 వద్ద ముగిసింది. -
డీమార్ట్ లాభం రెట్టింపు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సర(2021–22) రెండో త్రైమాసికంలో డీమార్ట్ స్టోర్ల నిర్వాహక కంపెనీ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ2(జులై–సెపె్టంబర్)లో నికర లాభం రెట్టింపై దాదాపు రూ. 418 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 196 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 47 శాతం ఎగసి రూ.7,789 కోట్లను తాకింది. అయితే మొత్తం వ్యయాలు 44 శాతం పెరిగి రూ. 7,249 కోట్లయ్యాయి. స్టాండెలోన్ పద్ధతిన డీమార్ట్ ఆదాయం 47 శాతం జంప్‌చేసి రూ. 7,650 కోట్లకు చేరింది. ఈ ఏడాది తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెపె్టంబర్)లో మొత్తం ఆదాయం రూ. 9,189 కోట్ల నుంచి రూ. 12,972 కోట్లకు పురోగమించింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ భేష్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సర(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ2(జులై–సెపె్టంబర్)లో నికర లాభం 18 శాతం ఎగసి రూ. 9,096 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 7,703 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 38,438 కోట్ల నుంచి రూ. 41,436 కోట్లకు పుంజుకుంది. రుణాల విడుదల(అడ్వాన్స్‌లు) 14.7 శాతం పెరిగి రూ. 12,49,331 కోట్లకు చేరింది. స్టాండెలోన్ పద్ధతిలో నికర లాభం 17.6 శాతం మెరుగై రూ. 8,834 కోట్లను అధిగమించింది. నికర వడ్డీ ఆదాయం 12 శాతంపైగా బలపడి రూ. 17,684 కోట్లయ్యింది. కేటాయింపులు ఇలా క్యూ2లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.08 శాతం నుంచి 1.35 శాతానికి పెరిగాయి. ఇక నికర ఎన్పీఏలు సైతం 0.17 శాతం నుంచి 0.40 శాతానికి పెరిగాయి. మొండిరుణాలు, కంటింజెన్సీలకు రూ. 200 కోట్లు అధికంగా రూ. 3,925 కోట్లను కేటాయించింది. కరోనా మహమ్మారి భయాలకుతోడు.. సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు దేశ, విదేశీ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపినట్లు బ్యాంక్ పేర్కొంది. కాగా.. క్యూ2లో కనీస మూలధన నిష్పత్తి 19.1 శాతం నుంచి 20 శాతానికి మెరుగుపడింది. ఈ కాలంలో బాసెల్–3 ప్రమాణ అదనపు టైర్–1 బాండ్ల జారీ ద్వారా బిలియన్ డాలర్లు(రూ. 7,424 కోట్లు) సమీకరించినట్లు బ్యాంక్ వెల్లడించింది. టర్న్అరౌండ్.. డిపాజిట్లు స్వీకరించని అనుబంధ ఎన్బీఎఫ్సీ.. హెచ్డీబీ ఫైనాన్షియల్ సరీ్వసెస్ లిమిటెడ్ క్యూ2లో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేర్కొంది. గత క్యూ2లో రూ. 85 కోట్ల నికర నష్టం ప్రకటించగా.. తాజా సమీక్షా కాలంలో దాదాపు రూ. 192 కోట్ల నికర లాభం ఆర్జించినట్లు వెల్లడించింది. బ్రోకింగ్ అనుబంధ కంపెనీ హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సైతం 44 శాతం వృద్ధితో రూ. 240 కోట్ల నికర లాభం ప్రకటించింది. కాగా.. ఈ ఏడాది తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెపె్టంబర్)లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర లాభం 17% ఎగసి రూ. 16,564 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం రూ. 70,523 కోట్ల నుంచి రూ. 75,526 కోట్లకు పురోగమించింది. -
కార్పొరేట్ల క్యూ2 ఫలితాలు మార్కెట్‌కు కీలకం
ముంబై: కార్పొరేట్ల రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ వారం స్టాక్ మార్కెట్ దిశా నిర్దేశం చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అలాగే ద్రవ్యోల్బణ లెక్కలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చని చెబుతున్నారు. వీటితో పాటు ప్రపంచ పరిణామాలు, దేశీయ మార్కెట్ పట్ల విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి, డాలర్ మారకంలో రూపాయి విలువ, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ కదలికలు తదితర అంశాలూ స్టాక్ సూచీల గమనాన్ని శాసించవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అయితే దసరా పండుగ సందర్భంగా శుక్రవారం(15న) బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఎక్సే్చంజీలకు సెలవు కావడంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. ‘‘నిఫ్టీకి 17450 స్థాయి వద్ద బలమైన మద్దతు లభించిన తర్వాత బౌన్స్‌బ్యాక్స్ అయ్యింది. ఈ సూచీ ఇప్పటికీ అధిక విలువతో ట్రేడ్ అవుతున్నప్పటికీ.., సాంకేతికంగా దిద్దుబాటయ్యే సూచనలు సూచనలు కనిపించడం లేదు. ఈ వారంలో 18,000 స్థాయిని అధిగమించవచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్స్ హెడ్ రీసెర్చ్ వినోద్ నాయర్ తెలిపారు. అధిక వెయిటేజీ దిగ్గజం రిలయన్స్‌తో పాటు ఐటీ, ఆటో షేర్లు రాణించడంతో సెన్సెక్స్ 1,293 పాయింట్లను ఆర్జించింది. నిఫ్టీ 363 పాయింట్లు పెరిగింది. ఈ వారం స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను మరింత విశ్లేషిస్తే... కార్పొరేట్ ఫలితాల సీజన్ మొదలు... ఐటీ దిగ్గజం టీసీఎస్ గత శుక్రవారం క్యూ2 ఆర్థిక గణాంకాలను వెల్లడించి ఫలితాల సీజన్‌కు తెరతీసింది. ఆర్థిక ఫలితాల ప్రభావం సోమవారం (11న) ట్రేడింగ్‌లో ప్రతిఫలించే అవకాశముంది. ఈ వారంలోనే ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, హెచ్‌సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అవెన్యూ సూపర్‌మార్ట్, డెల్టా కార్ప్, హెచ్ఎఫ్సీఎల్, సైయంట్, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్‌తో సహా దాదాపు 50కి పైగా కంపెనీలు తమ రెండో క్వార్టర్ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత కంపెనీల షేర్లు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. ట్రేడర్లు షేరు ఆధారిత ట్రేడింగ్‌కు ఆసక్తి చూపవచ్చు. ద్రవ్యోల్బణ లెక్కలపై దృష్టి ... కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ మంగళవారం(12న) ఆగస్ట్ నెల పారిశ్రామికోత్పత్తి, సెపె్టంబర్ రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలను వెల్లడించనుంది. సెపె్టంబర్ నెల టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) వివరాలు గురువారం(14న) విడుదల కానుంది. సెప్టెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం 4.3 శాతంగా, టోకు ధరల ద్రవ్యోల్బణం 4.3శాతంగా, ఆగస్ట్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు 11.2శాతంగా నమోదుకావచ్చని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. బాండ్ ఈల్డ్స్ భయాలు... భారత పదేళ్ల బాండ్ ఈల్డ్స్ 18 నెలల గరిష్టస్థాయి 6.32 శాతానికి చేరుకుంది. వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడంతో పాటు మార్కెట్లో అధిక ద్రవ్యత లభ్యత ఉండేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ తెలిపింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఒకవేళ ఈల్డ్స్ మరింత పెరిగితే స్టాక్ మార్కెట్‌కు ప్రతికూలాంశంగా మారుతుంది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ లిస్టింగ్ నేడు.. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ లిస్టింగ్ షేర్లు నేడు(సోమవారం) ఎక్సే్చంజీల్లో లిస్ట్‌కానున్నాయి. సెపె్టంబర్ 29 – అక్టోబర్ 1వ తేదిల మధ్య ఇష్యూ పూర్తి చేసుకున్న ఈ ఐపీఓ 5.25 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. ధర శ్రేణిని రూ.712 గా నిర్ణయించి కంపెనీ మొత్తం రూ.2,768 కోట్లను సమీకరించింది. గ్రే మార్కెట్లో ఈ షేర్లు చాలా తక్కువ ప్రీమియం ధరతో ట్రేడ్ అవుతున్నందున ఫ్లాట్ లేదా డిస్కౌంట్లో లిస్టింగ్ ఉండొచ్చని నిపుణుల అభిప్రాయం. బుల్లిష్ వైఖరితో విదేశీ ఇన్వెస్టర్లు... విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) దేశీయ మార్కెట్లో ఈ అక్టోబర్‌లో ఇప్పటికి వరకు రూ.1,997 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇందులో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.1,530 కోట్ల షేర్ల విలువైన షేర్లను కొన్నారు. డెట్ మార్కెట్లో రూ.467 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఇటీవల విదేశీ ఇన్వెస్టర్లు ఐటీ, బ్యాంకింగ్ రంగాల షేర్లను కొనేందుకు ఆస్తకి చూపుతున్నారు. -
అంచనాలకు మించి రికవరీ
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ రికవరీ తొలి అంచనాలకన్నా పటిష్టంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. అయితే కరోనా కేసుల పెరుగుదలే వృద్ధికి ప్రతికూలమనీ ఆయన అన్నారు. రెండవ త్రైమాసిక (జూలై–సెప్టెంబర్) గణాంకాలు . శుక్రవారం (27వ తేదీ) వెలువడుతుండడం, క్యూ2లో క్షీణ రేటు ‘సింగిల్’ డిజిట్‌లోనే (10 శాతంలోపే) ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో గవర్నర్ తాజా వ్యాఖ్యలు చేశారు. కరోనా ప్రేరిత సమస్యలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 23.9 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. విదేశీ మారకానికి సంబంధించి భారత్ డీలర్ల సంఘం (ఎఫ్ఈడీఏఐ) వార్షిక దినోత్సవం సందర్భంగా గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే... ► వృద్ధి రికవరీకి సంబంధించి.. పండుగ సీజన్ అనంతరం డిమాండ్ కొనసాగడం, పెరుగుతున్న కరోనా కేసులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వ్యాక్సిన్ అందుబాటు విషయంలో మార్కెట్ పునఃమదింపు ఎలా ఉంటుం దన్నదీ పరిశీలించాల్సిన ముఖ్యాంశాల్లో ఒకటి. ► తొలి త్రైమాసికంలో భారీ క్షీణత అనంతరం, క్యూ2లో ఆర్థిక క్రియాశీలత ఊహించినదానికన్నా వేగంగా ఉంది. రికవరీలో పటిష్టత నమోదైంది. ► గత కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం లక్ష్యాలను మించి (ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4 శాతం వద్ద రిటైల్ ద్రవ్యోల్బణం ఉండాలన్నది ఆర్బీఐకి కేంద్రం నిర్దేశం) ఉంటోందన్న ఆందోళనలు ఉన్నాయి. ఈ అంశాన్ని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) జాగ్రత్తగా పరిశీలించి రేటు కోతకు సంబంధించి తగిన నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రస్తుత ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు తాత్కాలికమైనవనీ, ధరల తీవ్రత క్రమంగా తగ్గుతుందని అక్టోబర్ పరపతి సమీక్ష అభిప్రాయపడింది. అందువల్ల ఆర్థిక వ్యవస్థ, రేట్ల కోత అంశాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సరళతర విధానాన్నే పాటించాలనీ నిర్దేశించుకుంది. ► తగిన స్థాయిలో విదేశీ మారకద్రవ్య నిల్వలు ఉండడం భారత్‌కు ప్రస్తుతం కలిసి వస్తున్న అంశం. నవంబర్ 13 నాటికి భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు 572.7 బిలియన్ డాలర్లకు చేరాయి. ఏడాది దిగుమతులకు ఇవి సరిపోతాయి. ► 2020 తరహా సంవత్సరాన్ని మనం ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ అవకాశాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. యూరోప్‌లోని కొన్ని అభివృద్ధి చెందిన దేశాలూ ఈ సమస్యను ఎదుర్కొం టున్నాయి. ప్రపంచ వృద్ధికి ప్రతికూలాంశమిది. ► మార్కెట్లపై మహమ్మారి పలు విధాలుగా ప్రతికూల ప్రభావాలు చూపింది. ఆర్థిక మందగమనం, ద్రవ్య లభ్యత, కమర్షియల్ పేపర్, కార్పొరేట్ బాండ్ మార్కెట్ క్షీణత, రూపాయి విలువ వంటి ఎన్నో అంశాల్లో ప్రతికూలతలు ఏర్పాడ్డాయి. -
ఎస్బీఐ లాభం 55% జూమ్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (2020–21, క్యూ2)లో ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) నికర లాభం రూ.5,246 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,375 కోట్లతో పోలిస్తే 55 శాతం దూసుకెళ్లింది. మొత్తం ఆదాయం సైతం రూ.89,348 కోట్ల నుంచి రూ. 95,374 కోట్లకు పెరిగింది. దాదాపు 7 శాతం వృద్ధి చెందింది. ప్రధానంగా మొండిబాకీలు భారీగా తగ్గుముఖం పట్టడం లాభాల జోరుకు దోహదం చేసింది. స్టాండెలోన్‌గా చూస్తే... బ్యాంకింగ్ కార్యకలాపాలు మాత్రమే (స్టాండెలోన్‌గా) లెక్కలోకి తీసుకుంటే ఎస్బీఐ క్యూ2లో రూ.4,574 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది క్యూ2లో లాభం రూ. 3,012 కోట్లతో పోలిస్తే 52 శాతం వృద్ధి చెందింది. ఇక మొత్తం స్టాండెలోన్ ఆదాయం 3.5 శాతం పెరుగుదలతో రూ.72,851 కోట్ల నుంచి రూ. 75,342 కోట్లకు ఎగిసింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 15 శాతం వృద్ధితో రూ. 24,600 కోట్ల నుంచి రూ.28,181 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం (అసాధారణ అంశాలను తీసివేసిన తర్వాత) 12 శాతం ఎగబాకి రూ.14,714 కోట్ల నుంచి రూ.16,460 కోట్లకు పెరిగింది. ఇక నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) కూడా సెప్టెంబర్ క్వార్టర్లో 3.34 శాతానికి మెరుగుపడింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఎన్ఐఎం 3.22 శాతంగా నమోదైంది. మొండిబాకీలు దిగొచ్చాయ్... ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో ఎస్బీఐ మొండిబాకీలు (ఎన్పీఏ) భారీగా తగ్గుముఖం పట్టాయి. మొత్తం రుణాల్లో స్థూల ఎన్పీఏలు 5.58 శాతానికి (పరిమాణం పరంగా రూ.1.25 లక్షల కోట్లు) తగ్గాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఇవి 7.19 శాతంగా (రూ.1.61 లక్షల కోట్లు) నమోదయ్యాయి. ఇక నికర ఎన్పీఏలు కూడా 2.79 శాతం నుంచి 1.59 శాతానికి దిగొచ్చాయి. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ 3న ఎన్పీఏల విభజనపై సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాల ప్రకారం లెక్కగడితే స్థూల ఎన్పీఏలు 5.88 శాతంగా, నికర ఎన్పీఏలు 2.08 శాతంగా ఉంటాయని ఎస్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం కేటాయింపులు (ప్రొవిజనింగ్) 21.74 శాతం తగ్గుదలతో రూ.15,187 కోట్ల నుంచి రూ.11,886 కోట్లకు దిగొచ్చాయి. క్యూ2లో రుణవృద్ధి 6 శాతంగా నమోదుకాగా, డిపాజిట్లు 14.41 శాతం వృద్ధి చెందాయి. ఈ క్యూ2లో కొత్తగా రూ.2,756 కోట్ల విలువైన రుణాలు మొండిబాకీలుగా మారాయి. గతేడాది ఇదే క్వార్టర్లో కొత్తగా మొండిబాకీలుగా మారిన రుణాల పరిమాణం రూ.8,805 కోట్లుగా ఉంది. ఎన్పీఏలకు ప్రొవిజన్ కవరేజీ రేషియో క్యూ2లో 81.23 శాతం నుంచి 88.19 శాతానికి భారీగా మెరుగుపడింది. ఇప్పటివరకూ రూ.6,495 కోట్ల రుణాలకు సంబంధించి వన్‌టైమ్ పునర్వ్యవస్థీకరణ దరఖాస్తులను బ్యాంక్ అందుకుంది. వీటిలో రిటైల్ రుణాలు రూ.2,400 కోట్లు కాగా, మిగినవి కార్పొరేట్ రుణాలు. అందులోనూ రూ.2,400 కోట్లు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలవేనని బ్యాంక్ ఎండీ (రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ షెట్టి చెప్పారు. ఫలితాల నేపథ్యంలో బుధవారం బీఎస్ఈలో ఎస్బీఐ షేరు 1.12 శాతం లాభపడి రూ. 207 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో (ఇంట్రాడేలో) రూ.198 కనిష్ట స్థాయిని, రూ.209 గరిష్టాన్ని తాకింది. పేటీఎం ఎస్బీఐ కార్డ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఎస్బీఐ కార్డ్, డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ పేటీఎం చేతులు కలిపాయి. ఇందులో భాగంగా ఇరు సంస్థలు కలిసి పేటీఎం ఎస్బీఐ కార్డ్, పేటీఎం ఎస్బీఐ కార్డ్ సెలెక్ట్ పేరుతో తదుపరితరం క్రెడిట్ కార్డ్స్‌ను వీసా ప్లాట్‌ఫాంపై అందుబాటులోకి తెచ్చాయి. ఎస్బీఐ కార్డ్ యాప్‌తోపాటు పేటీఎం యాప్‌లోనూ ఈ కార్డులను నియంత్రించే సౌకర్యం ఉంది. కస్టమర్లు ఈ కార్డు ద్వారా పేటీఎం మాల్, మూవీ, ట్రావెల్ టికెట్లపై 5% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. మా అంచనాల ప్రకారం ఆర్థిక కార్యకలాపాల్లో మళ్లీ పురోగతి నెలకొంది. చాలా కంపెనీలు కోవిడ్‌కు ముందున్నప్పటి కార్యకలాపాల స్థాయిల్లో 70–80 శాతాన్ని చేరుకున్నట్లు కనబడుతోంది. ట్రాక్టర్లతో సహా వాహన రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ రికవరీ సంకేతాలకు ఇది నిదర్శనం. కొత్త మొండిబకాయిలు ఎక్కువగా వ్యవసాయం, చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగంలోనే నమోదయ్యాయి. కాగా, ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి మరో రూ.13,000 కోట్ల విలువైన రుణ పునర్వ్యవస్థీకరణ వినతులు రావచ్చని అంచనా వేస్తున్నాం. – దినేష్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ -
హెచ్డీఎఫ్సీ లాభం రూ.4,600 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ రుణ దిగ్గజం హెచ్డీఎఫ్సీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (2020–21, క్యూ2)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన (అనుబంధ సంస్థలన్నిటితో కలిపి) రూ.4,600 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.10,389 కోట్లతో పోలిస్తే 57.5 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం రూ.32,851 కోట్ల నుంచి రూ.34,090 కోట్లకు వృద్ధి చెందింది. ‘2019 సెప్టెంబర్ క్వార్టర్లో అనుబంధ సంస్థ గృహ్ ఫైనాన్స్‌ను బంధన్ బ్యాంక్‌లో విలీనం చేసేందుకు, వాటా విక్రయించిన కారణంగా రూ.8,000 కోట్ల లాభం లభించింది’ అని హెచ్డీఎఫ్సీ పేర్కొంది. ‘వాస్తవానికి, డివిడెండ్ ఆదాయాన్ని, వాటాల విక్రయం, అలాగే అంచనా క్రెడిట్ నష్టం(ఈసీఎల్) కేటాయింపులను తీసివేస్తే, క్యూ2లో నికర లాభం 27 శాతం పెరిగినట్లు లెక్క’ అని హెచ్డీఎఫ్సీ వైస్–చైర్మన్, సీఈఓ కేకి మిస్త్రీ పేర్కొన్నారు. స్టాండెలోన్‌గానూ 28 శాతం తగ్గుదల... కేవలం మార్ట్గేజ్ కార్యకలాపాలపై మాత్రమే చూస్తే (స్టాండెలోన్‌గా), క్యూ2లో హెచ్డీఎఫ్సీ నికర లాభం 28 శాతం తగ్గి రూ.2,870 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,962 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం సైతం రూ.13,494 కోట్ల నుంచి రూ.11,733 కోట్లకు తగ్గింది. నికర వడ్డీ ఆదాయం మాత్రం 21 శాతం పెరుగుదలతో రూ.3,021 కోట్ల నుంచి రూ. 3,647 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ 3.3 శాతంగా ఉంది. ఇక మొండిబాకీ(ఎన్పీఏ)ల విషయానికొస్తే, క్యూ2లో స్థూల ఎన్పీఏలు 1.81 శాతంగా (రూ.8,511 కోట్లు) నమోదయ్యాయి. ఈ ఏడాది ఆగస్టులో సంస్థ రూ.10,000 కోట్ల ఈక్విటీ నిధులను సమీకరించింది. హెచ్డీఎఫ్సీ లైఫ్‌లో వాటా అమ్మకం ద్వారా హెచ్‌డీఎఫ్‌సీకి రూ.1,241 కోట్ల స్థూల లాభం వచ్చింది. కాగా, కోవిడ్ ప్రభావంతో సహా క్యూ2లో కేటాయింపులు (ప్రొవిజనింగ్) రూ.436 కోట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే క్వార్టర్లో కేటాయింపులు రూ.754 కోట్లు. హెచ్డీఎఫ్సీ షేరు సోమవారం బీఎస్ఈలో 6 శాతం పెరిగి రూ. 2,043 వద్ద స్థిరపడింది. -
రిలయన్స్ లాభం 9,567 కోట్లు
న్యూఢిల్లీ: కీలకమైన చమురు, రసాయనాల విభాగం ఆదాయాలు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర లాభం తగ్గింది. లాభం 15 శాతం క్షీణించి రూ. 9,567 కోట్లకు తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ. 11,262 కోట్లు. ఇక ఆదాయం కూడా రూ. 1.56 లక్షల కోట్ల నుంచి రూ. 1.2 లక్షల కోట్లకు తగ్గింది. చమురు, రసాయనాల వ్యాపారం క్షీణించినప్పటికీ.. టెలికం తదితర వ్యాపారాలు మాత్రం మెరుగైన పనితీరు కనపర్చాయి. ‘రెండో త్రైమాసికంలో గ్రూప్ కార్యకలాపాలు, ఆదాయంపై కోవిడ్–19 ప్రభావం పడింది‘ అని రిలయన్స్ వెల్లడించింది. మరోవైపు, సీక్వెన్షియల్‌గా మెరుగైన ఫలితాలు సాధించగలిగామని రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ తెలిపారు. ‘పెట్రోకెమికల్స్, రిటైల్ విభాగం కోలుకోవడం, డిజిటల్ సర్వీసుల వ్యాపార విభాగం నిలకడగా వృద్ధి సాధించడం వంటి అంశాల తోడ్పాటుతో గత క్వార్టర్‌తో పోలిస్తే నిర్వహణ , ఆర్థిక పనితీరు మెరుగుపర్చుకోగలిగాం. దేశీయంగా డిమాండ్ గణనీయంగా పెరగడంతో చాలా మటుకు ఉత్పత్తుల వ్యాపారం దాదాపు కోవిడ్ పూర్వ స్థాయికి చేరింది‘ అని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ ఆఖరు నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ స్థూల రుణ భారం రూ. 2,79,251 కోట్లకు తగ్గింది. అంతకు ముందు త్రైమాసికంలో ఇది రూ. 3,36,294 కోట్లు. ఇక రూ. 1,85,711 కోట్ల నగదు నిల్వలు, వాటాల విక్రయం ద్వారా చేతికి వచ్చిన రూ. 30,210 కోట్లతో పాటు వ్యూహాత్మక ఇన్వెస్టర్ల నుంచి రావాల్సిన రూ. 73,586 కోట్లు కూడా పరిగణనలోకి తీసుకుంటే రుణాలు పోగా సంస్థ దగ్గర సుమారు రూ. 10,256 కోట్ల మిగులు ఉంటుంది. పెట్రోకెమికల్స్ ఆదాయం 23 శాతం డౌన్.. కీలకమైన పెట్రోకెమికల్స్ విభాగం ఆదాయం 23 శాతం క్షీణించి రూ. 29,665 కోట్లకు పరిమితమైంది. పన్ను ముందస్తు లాభం 33 శాతం తగ్గి రూ. 5,964 కోట్లకు క్షీణించింది. రిఫైనింగ్ వ్యాపార ఆదాయం రూ. 97,229 కోట్ల నుంచి రూ. 62,154 కోట్లకు క్షీణించింది. చమురు, గ్యాస్ విభాగ ఆదాయం రూ. 790 కోట్ల నుంచి రూ. 355 కోట్లకు తగ్గింది. రిఫైనింగ్ మార్జిన్ (ప్రతి బ్యారెల్ ముడి చమురును ఇంధనంగా మార్చడం ద్వారా వచ్చే మార్జిన్) 5.7 డాలర్లుగా ఉంది. తగ్గిన రిటైల్ ఆదాయం.. క్యూ2లో రిలయన్స్ రిటైల్ ఆదాయం సుమారు 5 శాతం తగ్గి రూ. 39,199 కోట్లుగా నమోదైంది. నిర్వహణ లాభం దాదాపు 14 శాతం క్షీణించి రూ. 2,009 కోట్లకు పరిమితమైంది. రిటైల్ విభాగం ఇటీవలి కాలంలో సుమారు రూ. 37,710 కోట్ల మేర పెట్టుబడులు సమీకరించింది. సిల్వర్ లేక్, కేకేఆర్, టీపీజీ, జనరల్ అట్లాంటిక్ వంటి దిగ్గజాలు ఇన్వెస్ట్ చేశాయి. రిలయన్స్ షేరు 1% పైగా పెరిగి రూ. 2,054 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వచ్చాయి. జియో జూమ్.. రిలయన్స్ టెలికం విభాగం జియో లాభం దాదాపు మూడు రెట్లు పెరిగింది. రూ. 2,844 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే వ్యవధిలో లాభం రూ. 990 కోట్లు. ఇక ఆదాయం సుమారు 33 శాతం పెరిగి రూ. 13,130 కోట్ల నుంచి రూ. 17,481 కోట్లకు చేరింది. క్యూ2లో కొత్తగా 73 లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్ చేరగా, ప్రతి యూజర్‌పై ఆదాయం రూ. 145కి చేరింది. జియో సహా డిజిటల్ సేవల వ్యాపారం ఆదాయం రూ. 16,717 కోట్ల నుంచి ఏకంగా రూ. 22,679 కోట్లకు ఎగిసింది. -
బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం రూ.1,679 కోట్లు
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (2020–21, క్యూ2) లో స్టాండెలోన్ ప్రాతిపదికన (ఒక్క బ్యాంకింగ్ కార్యకలాపాలపైనే) రూ. 1,679 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 737 కోట్ల లాభాన్ని నమోదుచేయగా, ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో రూ.864 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. కాగా, కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) బ్యాంకు క్యూ2లో రూ.1,771 కోట్ల నికర లాభాన్ని సాధించింది. నికర వడ్డీ ఆదాయం 6.83 శాతం వృద్ధితో రూ.7,508 కోట్లకు చేరగా, నికర వడ్డీ మార్జిన్ 2.96 శాతంగా నమోదైంది. మొండిబాకీలు తగ్గుముఖం...: బీఓబీ స్థూల మొండిబాకీలు (ఎన్పీఏ) ఈ ఏడాది క్యూ2లో 9.14 శాతానికి తగ్గుముఖం పట్టాయి. గతేడాది క్యూ2లో ఇవి 10.25%గా ఉన్నాయి. ఇక నికర ఎన్పీఏలు సైతం 3.91 శాతం నుంచి 2.51%కి దిగొచ్చాయి. మొత్తం కేటాయింపులు (ప్రొవిజన్లు) జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో రూ.4,209 కోట్ల నుంచి రూ.3,002 కోట్లకు తగ్గాయి. క్యూ2లో తాజాగా మొండిబకాయిలుగా చేరిన రుణాలు రూ.899 కోట్లు. ఇక క్యూ2లో రూ.2,500 కోట్లను బ్యాంక్ రికవరీ చేసుకుంది. బీఓబీ షేరు బీఎస్ఈలో 2 శాతం ఎగబాకి రూ.43 వద్ద స్థిరపడింది. -
మారుతీ లాభం రూ.1,419 కోట్లు
న్యూఢిల్లీ: దేశీ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (2020–21)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) రూ.1,420 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,391 కోట్లతో పోలిస్తే 2 శాతం పెరిగింది. మొత్తం ఆదాయం 10.34 శాతం వృద్ధి చెంది రూ. రూ.16,998 కోట్ల నుంచి రూ.18,756 కోట్లకు చేరింది. క్యూ2లో కొంత డిమాండ్ పుంజుకోవడం, సరఫరా పరిస్థితుల్లో క్రమంగా మెరుగుదల కారణంగా పనితీరు గాడిలో పడిందని కంపెనీ పేర్కొంది. స్టాండెలోన్‌గా చూస్తేక్యూ2లో కంపెనీ నికర లాభం స్వల్పంగా రూ.1,359 కోట్ల నుంచి రూ.1,372 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం 9.7 శాతం వృద్ధి చెంది రూ.17,689 కోట్లుగా నమోదైంది. అమ్మకాలు 16 శాతం అప్...: క్యూ2లో మారుతీ మొత్తం అమ్మకాలు 16.2 శాతం వృద్ధితో 3,93,130 యూనిట్లుగా నమోదయ్యాయి. దేశీ వాహన విక్రయాలు 18.6 శాతం పెరిగి 3,70,619 యూనిట్లకు ఎగబాకాయి. క్యూ2లో మొత్తం 22,511 వాహనాలను కంపెనీ ఎగుమతి చేసింది. 12.7 శాతం వృద్ధి సాధించింది. ‘తొలి త్రైమాసికంలో రెండు నెలల పాటు ఉత్పత్తి సున్నా స్థాయికి పడిపోయిన నేపథ్యంలో, దీంతో పోలిస్తే క్యూ2లో మెరుగైన పరిస్థితులు నెలకొన్నాయి. కోవిడ్–19 ప్రతికూలతలు నెమ్మదిగా సద్దుమణుగుతున్నాయి. మా ప్లాంట్లలో ఉత్పత్తి సాధారణ స్థాయికి చేరింది. గ్రామీణ ప్రాంతాల నుంచి రానున్న కాలంలో పటిష్టమైన వృద్ధిని ఆశిస్తున్నాం. వచ్చే కొద్ది నెలల్లో డిమాండ్ మెరుగైన స్థాయిలో నమోదవుతుందన్న అంచనాల నేపథ్యంలో తక్షణం ప్రయాణికుల వాహనాలపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను తగ్గించాల్సిన అవసరం లేదు’ అని కంపెనీ చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో మారుతీ షేరు గురువారం బీఎస్ఈలో 1 శాతం క్షీణించి రూ.7,114 వద్ద స్థిరపడింది. -
టైటాన్ నికర లాభం 38% డౌన్
న్యూఢిల్లీ: టాటా గ్రూపునకు చెందిన టైటాన్‌కు అధిక వ్యయాల సెగ తగిలింది. ఈ ఆర్థిక సంవ త్సరం రెండో త్రైమాసికం (2020–21, క్యూ2)లో కంపెనీ స్టాండెలోన్ నికర లాభం 38 శాతం క్షీణించి రూ.199 కోట్లకు పడిపోయింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.320 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం సైతం 1.72 శాతం తగ్గుదలతో రూ.4,466 కోట్ల నుంచి రూ.4,389 కోట్లకు చేరింది. క్యూ2లో కంపెనీ మొత్తం వ్యయాల్లో భాగంగా రూ.480 కోట్లను నష్టంగా గుర్తించింది. కంపెనీ మొత్తం వ్యయాలు రూ.4,151 కోట్లకు ఎగబాకాయి. క్రితం ఏడాది క్యూ2లో మొత్తం వ్యయాలు రూ.4,037 కోట్లుగా ఉన్నాయి. భారత్‌లో కోవిడ్–19 మహమ్మారి కారణంగా 2020–21 తొలి త్రైమాసికంలో నెలకొన్న తీవ్ర సమస్యల తర్వాత రెండో త్రైమాసికంలో అమ్మకాలు భారీగా 89 శాతం మేర పుంజుకున్నాయని కంపెనీ పేర్కొంది. ‘క్యూ2లో కంపెనీ చవిచూసిన రికవరీ పట్ల సంతృప్తి చెందుతున్నాం. పండుగ సీజన్లో వినియోగదారుల నుంచి సానుకూల సెంటిమెంట్ నెలకొనడం కంపెనీ మొత్తం విభాగాలన్నింటికీ శుభసూచకం. కీలక వ్యాపారాల్లో కంపెనీ మార్కెట్ వాటా పెంపు కొనసాగుతోంది. వ్యయాలు, పెట్టుబడులపై మరింత దృష్టిసారించడం, లాభాలు అదేవిధంగా నగదు ప్రవాహాలు మెరుగయ్యేందుకు దోహదం చేసింది’ అని కంపెనీ ఎండీ సి.కె. వెంకటరామన్ తెలిపారు. ► ఆభరణాల విభాగం ఆదాయం క్యూ2లో రూ.3,446 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.3,528 కోట్లతో పోలిస్తే 2 శాతం తగ్గింది. వాచీలు, వేరబుల్స్ వ్యాపార ఆదాయం 44 శాతం దిగజారి రూ.719 కోట్ల నుంచి రూ.400 కోట్లకు క్షీణించింది. ► కళ్లద్దాల వ్యాపారం ఆదాయం సైతం 39 శాతం క్షీణతతో రూ.154 కోట్ల నుంచి రూ.94 కోట్లకు పడిపోయింది. ఫలితాల నేపథ్యంలో టైటాన్ షేరు బుధవారం బీఎస్ఈలో 1.2 శాతం నష్టంతో రూ.1,218 వద్ద ముగిసింది. -
ఎల్అండ్టీకి కోవిడ్ దెబ్బ
న్యూఢిల్లీ: ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ)కు కోవిడ్–19 ప్రభావం తీవ్రంగానే తాకింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (2020–21, క్యూ2)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) రూ.1,410 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,552 కోట్లతో పోలిస్తే 45 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం సైతం రూ.35,925 కోట్ల నుంచి రూ.31,594 కోట్లకు దిగజారింది. 12 శాతం తగ్గిపోయింది. కాగా, వ్యాపార పరిస్థితులు పుంజుకుంటుండటంతో ఈ ఏడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే (సీక్వెన్షియల్‌గా) లాభం సుమారు 4 రెట్లు మెరుగుపడినట్లు కంపెనీ వెల్లడించింది. ‘కరోనా మహమ్మారి ప్రభావంతో ఆదాయం పడిపోయింది. ఆర్థిక సేవల వ్యాపారంలో అధిక క్రెడిట్ ప్రొవిజన్లు మెట్రో సేవలకు అంతరాయం కారణంగా లాభంలో 45 శాతం క్షీణతకు దారితీసింది’ అని కంపెనీ పేర్కొంది. కాగా, మొత్తం వ్యయాలు సైతం రూ.32,622 కోట్ల నుంచి రూ.29,456 కోట్లకు పడిపోయాయి. అంతర్జాతీయ కార్యకలాపాల ఆదాయం రూ.12,148 కోట్లుగా నమోదైంది. క్యూ2(జూలై–సెప్టెంబర్)లో కంపెనీ తన ఎలక్ట్రికల్, ఆటోమేషన్ (ఈఅండ్‌ఏ) వ్యాపారాన్ని ఫ్రాన్స్‌కు చెందిన ష్నిడర్ ఎలక్ట్రిక్ (ఎస్ఈ)కు విక్రయించింది. క్యూ2లో గ్రూపు స్థాయిలో ఎల్అండ్టీ రూ.28,039 కోట్ల కాంట్రాక్టులను చేజిక్కించుకుంది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 42% తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో ఎల్అండ్టీ షేరు బుధవారం బీఎస్ఈలో 0.12% లాభంతో రూ.984 వద్ద ముగిసింది. -
డాక్టర్ రెడ్డీస్ లాభం 720 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 720 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో నమోదైన రూ. 1,092 కోట్లతో పోలిస్తే లాభం సుమారు 30 శాతం తగ్గింది. కొన్ని ఉత్పత్తులను అవుట్–లైసెన్సింగ్ చేయడం, పన్నుపరమైన ప్రయోజనాలు వంటివి కూడా గతంలో కలిపి చూపించిన నేపథ్యంలో .. దానితో పోల్చితే తాజా క్యూ2లో లాభం తగ్గిందని సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) సౌమేన్ చక్రవర్తి తెలిపారు. ఉత్పాదకత మెరుగుపడటం, సానుకూల విదేశీ మారక రేట్ల ఊతంతో స్థూల లాభాల మార్జిన్‌పై ప్రతికూల ప్రభావం కొంత తగ్గిందని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రవేశపెట్టిన ఉత్పత్తులతో పాటు కోవిడ్ చికిత్సలో ఉపయోగపడే అవకాశాలు ఉన్న పలు ఔషధాలపై తమ పరిశోధన బృందాలు కసరత్తు చేస్తున్నాయని డీఆర్ఎల్ సహ చైర్మన్ జీవీ ప్రసాద్ తెలిపారు. మరిన్ని విశేషాలు.. n కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం తదితర అంశాల ఊతంతో గ్లోబల్ జనరిక్స్ విభాగం ఆదాయం 21 శాతం పెరిగి రూ. 3,980 కోట్లుగా నమోదైంది. n ఉత్తర అమెరికా మార్కెట్ 28% పెరిగి రూ. 1,830 కోట్లకు చేరింది. విదేశీ మారకం రేటు అనుకూలత, కొత్త ఉత్పత్తులు ప్రవేశపెట్టడం ఇందుకు దోహదపడింది. n యూరప్ ఆదాయాలు 36% పెరిగి రూ. 380 కోట్లకు చేరాయి. కొత్తగా ఆస్ట్రియా మార్కెట్లోకి కూడా కంపెనీ ప్రవేశించింది. అటు వర్ధమాన మార్కెట్లలో ఆదాయం 4% వృద్ధితో రూ. 860 కోట్లకు చేరింది. రూబుల్ బలహీనపడటం రష్యాలో ఆదాయంపై ప్రభావం చూపింది. n భారత్ మార్కెట్లో ఆదాయం 21 శాతం వృద్ధి చెంది రూ. 910 కోట్లకు చేరింది. వొకార్డ్ వ్యాపారం కొనుగోలు, కొత్త ఉత్పత్తుల అమ్మకాలు ఇందుకు తోడ్పడ్డాయి. n ఫార్మాసూటికల్ సర్వీసెస్, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయం 20 శాతం పెరిగి రూ. 850 కోట్లుగా నమోదైంది. బీఎస్ఈలో డీఆర్ఎల్ షేరు సుమారు 3 శాతం క్షీణించి రూ. 4,950 వద్ద క్లోజయ్యింది. సైబర్ దాడి ప్రభావమేమీ లేదు అక్టోబర్ 22న కంపెనీ సర్వర్లపై సైబర్ దాడులు చోటుచేసుకోవడంపై చక్రవర్తి స్పందించారు. దీనిపై సత్వరం బైటి సైబర్ సెక్యూరిటీ నిపుణుల సహాయం తీసుకున్నామని, కార్యకలాపాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు పడకుండా జాగ్రత్తపడ్డామని ఆయన తెలిపారు. ఇప్పటిదాకానైతే తమ విచారణలో డేటా చౌర్యం వంటివేమీ జరిగిన దాఖలాలేమీ బైటపడలేదని చక్రవర్తి వివరించారు. కోవిడ్–19 టీకా స్పుత్నిక్ వి రెండో దశ ట్రయల్స్ డిసెంబర్ నాటికి పూర్తి కాగలవని సంస్థ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ తెలిపారు. పరిస్థితులను బట్టి మూడో దశ పరీక్షలు మార్చి ఆఖరు నాటికి పూర్తి కావొచ్చన్నారు. మరోవైపు, సౌమేన్ చక్రవర్తి పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో సీఎఫ్‌వోగా పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారని కంపెనీ తెలిపింది. డిసెంబర్ 1న అగర్వాల్ బాధ్యతలు చేపడతారు. -
క్యూ2లో అమెరికా ఆర్థిక వ్యవస్థ భారీ క్షీణత
వాషింగ్టన్: కరోనా ప్రభావంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ 2020 రెండవ త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) భారీగా మైనస్ 32.9 శాతం క్షీణించింది. 1947 తర్వాత అగ్రరాజ్య స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఈ స్థాయిలో క్షీణించడం ఇదే తొలిసారి. 1958లో 10 శాతం క్షీణత నమోదయ్యింది. జనవరి–మార్చి మధ్య కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థ మైనస్ 5 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. వరుసగా రెండు త్రైమాసికాలు క్షీణత నమోదయినందున దీనిని అధికారికంగా మాంద్యంగానే పరిగణించాల్సి ఉంటుంది. 11 సంవత్సరాల వృద్ధి తర్వాత అమెరికా ఈ తరహా పరిస్థితిని ఎదుర్కొంటోంది. కరోనా వైరస్ ప్రభావం నుంచి ఇంకా దేశం కోలుకోలేదు. వ్యాపారాలు దెబ్బతినడం, ఉపాధి కోల్పోవడం వంటి సవాళ్లు దేశంలో కొనసాగుతున్నాయి. జీడీపీ భారీ పతనం, అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన అమెరికా అధ్యక్ష ఎన్నికల వాయిదా సంకేతాల నేపథ్యంలో వాల్‌స్ట్రీట్ భారీ నష్టాల్లోకి జారిపోయింది. -
ఆర్బీఐ పాలసీ సమీక్ష, అంతర్జాతీయ అంశాలే దిక్సూచి..!
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కేవలం 4.5 శాతం వృద్ధి రేటుకే పరిమితమైంది. గడచిన ఆరేళ్లలో వృద్ధి వేగం ఇంతటి తక్కువ స్థాయిని నమోదుచేయడం ఇదే తొలిసారి కాగా, శుక్రవారం మార్కెట్ ముగిసిన తరువాత వెల్లడైన జీడీపీ గణాంకాలు.. సోమవారం ట్రేడింగ్‌పై ప్రభావం చూపనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వారం మొదటి రోజు ట్రేడింగ్‌పైనే తాజా డేటా ప్రభావం ఉండనుండగా.. మీడియం టెర్మ్‌లో మార్కెట్ పథంలో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ వీపీ రీసెర్చ్ అజిత్ మిశ్రా అన్నారు. ఇక వృద్ధి రేటు కనిష్ట స్థాయిలకు పడిపోయిన నేపథ్యంలో లిక్విడిటీ పెంపు చర్యల్లో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను తగ్గించ వచ్చనే అంచనాలు సూచీలను నిలబెట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీíసీ) సమావేశం 3న (మంగళవారం) ప్రారంభమై, 5న (గురువారం) ముగియనుంది. ఈ సమావేశంలో కీలకమైన రెపో రేటుపై ఎంపీసీ నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రేటు 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గవచ్చని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ రీసెర్చ్ విశ్లేషకులు రాహుల్ గుప్తా అంచనావేశారు. వినియోగదారుల నుంచి డిమాండ్ తగ్గిన కారణంగా తయారీ, పారిశ్రామిక రంగాలు మందగమనంలో ఉన్నందున మళ్లీ వృద్ధి రేటును గాడిలో పెట్టడం కోసం వడ్డీ రేట్లను తగ్గించవచ్చని విశ్లేషించారు. ఇక్రా ప్రిన్సిపల్ ఎకనామిస్ట్ అదితి నాయర్, ప్రభుదాస్ లిల్లాధర్ కూడా పావు శాతం తగ్గింపును అంచనావేస్తున్నట్లు చెప్పారు. ఆటో సేల్స్, ఆర్థికాంశాల ప్రభావం.. ఈ వారంలో ఆటో, టెలికం రంగాల షేర్లు మార్కెట్ దృష్టిని ఆకర్షించనున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. దేశీ ఆటో రంగ నవంబర్ నెల అమ్మకాలు ఆదివారం వెల్లడికాగా.. మారుతీ సుజుకీ విక్రయాలు 1.9%, టాటా మోటార్స్ అమ్మకాలు 25% క్షీణతకే పరిమితం అయ్యాయి. అంతక్రితం నెలల్లో వరుసగా భారీ తగ్గుదలను నమోదుచేసిన ఆటో రంగ కంపెనీలు.. ఇక నుంచి గాడిన పడవచ్చనే సంకేతాలను ఇస్తున్నాయి. మరోవైపు, ట్యారిఫ్లను పెంచుతూ టెలికం రంగాలు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు రంగాల్లో కొనుగోళ్లకు అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలిపారు. కొనసాగుతున్న విదేశీ నిధుల వెల్లువ... భారత్ కాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. వరుసగా 3వ నెల్లోనూ వీరు నికర కొనుగోలుదారులుగా నిలిచారు. నవంబర్ నెల్లో రూ. 22,872 కోట్లు వెచ్చించారు. ఈక్విటీ మార్కెట్లో రూ.25,230 కోట్లు ఇన్వెస్ట్ చేయగా.. డెట్ మార్కె ట్ నుంచి రూ. 2,358 కోట్లు వెనక్కితీసుకున్నారు. -
యూనియన్ బ్యాంక్ నష్టం రూ.1,194 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో భారీగా నష్టాలొచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.139 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ2లో రూ.1,194 కోట్ల నికర నష్టాలు వచ్చాయని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అయితే మొత్తం ఆదాయం మాత్రం రూ.9,438 కోట్ల నుంచి రూ.10,557 కోట్లకు పెరిగిందని పేర్కొంది. తగ్గిన మొండి బకాయిలు...: బ్యాంక్ రుణ నాణ్యత అధ్వాన స్థితిలోనే కొనసాగుతోంది. మొండి బకాయిలు తగ్గినా, కేటాయింపులు మాత్రం పెరిగాయి. గత క్యూ2లో 15.74 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 15.24 శాతానికి తగ్గాయి. నికర మొండి బకాయిలు 8.42 శాతం నుంచి 6.98 శాతానికి చేరాయి. మొండి బకాయిలు తగ్గినా కేటాయింపులు మాత్రం దాదాపు రెట్టింపయ్యాయి. గత క్యూ2లో రూ.1,710 కోట్లుగా ఉన్న మొండి బకాయిలకు కేటాయింపులు ఈ క్యూ2లో రూ.3,328 కోట్లకు పెరిగాయి. మొండి బకాయిలు, ఇతరాలకు కలిపి మొత్తం మీద కేటాయింపులు రూ.1,716 కోట్ల నుంచి రూ.3,859 కోట్లకు పెరిగాయి. బీఎస్ఈలో షేర్ 0.7 శాతం లాభంతో రూ.52.30 వద్ద ముగిసింది. -
సన్ ఫార్మా లాభం రూ.1,064 కోట్లు
న్యూఢిల్లీ: సన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ1,064 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.270 కోట్ల నికర నష్టాలు వచ్చాయని సన్‌ఫార్మా తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.6,938 కోట్ల నుంచి రూ.8,123 కోట్లకు ఎగసిందని పేర్కొంది. స్పెషాల్టీ వ్యాపారంలో పురోగతి...: వ్యయాల ఆదా, సామర్థ్యాల మెరుగుదలపై దృష్టి సారించడం కొనసాగిస్తున్నామని సన్ ఫార్మా ఎమ్డీ దిలీప్ సంఘ్వి పేర్కొన్నారు. మారుతున్న పరిశ్రమ తీరు తెన్నులకు అనుగుణంగా జనరిక్ వ్యాపారంలో కూడా మార్పులు, చేర్పులు చేస్తున్నామని వివరించారు. గ్లోబల్ స్పెషాల్టీ వ్యాపారంలో కూడా మంచి పురోగతి సాధిస్తున్నామన్నారు. 35% పెరిగిన భారత అమ్మకాలు.. భారత్ అమ్మకాలు 35% వృద్ధితో రూ.2,515 కోట్లకు చేరగా, అమెరికా విక్రయాల్లో పెద్దగా పురోగతి లేదన్నారు. వర్థమాన దేశాల్లో అమ్మకాలు 3% వృద్ధితో 20 కోట్ల డాలర్లకు, మిగిలిన దేశాల్లో విక్రయాలు 49% వృద్ధితో 16 కోట్ల డాలర్లకు పెరిగాయి. రూ.1,616 కోట్ల నిర్వహణ లాభం.... పరిశోధన, అభివృద్ధిపై ఈ క్యూ2లో రూ.488 కోట్లు పెట్టుబడులు పెట్టింది. ఇది అమ్మకాల్లో 6 శాతానికి సమానం. నిర్వహణ లాభం 22 శాతం వృద్ధితో రూ.1,616 కోట్లకు పెరిగింది. నిర్వహణ మార్జిన్ మాత్రం 21 శాతం నుంచి 20 శాతానికి తగ్గింది. నికర లాభం రూ.వెయ్యి కోట్లకు పైగా రావడంతో బీఎస్ఈలో సన్ ఫార్మా షేర్ 3 శాతం లాభంతో రూ.440 వద్ద ముగిసింది. -
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం 1,131 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 6 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.1,205 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ క్యూ2లో రూ.1,131 కోట్లకు చేరిందని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.31,915 కోట్ల నుంచి 17 శాతం వృద్ధితో రూ.37,425 కోట్లకు పెరిగిందని పేర్కొంది. స్టాండ్అలోన్ పరంగా చూస్తే, గత క్యూ2లో రూ.909 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో 28 శాతం తగ్గి రూ.655 కోట్లకు తగ్గిందని, ఆదాయం మాత్రం రూ.18,262 కోట్ల నుంచి 25 శాతం వృద్ధితో రూ.22,760 కోట్లకు ఎగసిందని వివరించింది. రూ.3,712 కోట్ల పన్ను వ్యయాల కారణంగా లాభం తగ్గిందని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం రూ.6,417 కోట్ల నుంచి 26 శాతం వృద్ధితో రూ.8,057 కోట్లకు, నికర వడ్డీ మార్జిన్ 3.33 శాతం నుంచి 3.64 శాతానికి చేరిందని తెలిపింది. మెరుగుపడిన రుణ నాణ్యత... నికర లాభం తగ్గినా, ఈ బ్యాంక్ రుణ నాణ్యత మెరుగుపడింది. గత క్యూ2లో 8.54 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 6.37 శాతానికి అలాగే నికర మొండి బకాయిలు 3.65 శాతం నుంచి 1.60 శాతానికి తగ్గాయని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలు తగ్గడంతో కేటాయింపులు కూడా తగ్గాయి. మొత్తం కేటాయింపులు రూ.3,994 కోట్ల నుంచి రూ.2,506 కోట్లకు తగ్గాయి. ఆల్‌టైమ్ హైకి ఐసీఐసీఐ బ్యాంక్... నికర వడ్డీ ఆదాయం, నికర వడ్డీ మార్జిన్లు ఆరోగ్యకరమైన వృద్ధి సాధించడంతో ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ ఆదివారం జరిగిన ప్రత్యేక మూరత్ ట్రేడింగ్‌లో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.473ను తాకింది. చివరకు స్వల్ప నష్టంతో రూ.469 వద్ద ముగిసింది. -
ఎస్బీఐ లాభం... ఆరు రెట్లు జంప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో దాదాపు ఆరు రెట్లు పెరిగింది. గత క్యూ2లో రూ.576 కోట్లుగా ఉన్న లాభం ఈ క్యూ2లో రూ.3,375 కోట్లకు పెరిగింది. తమ అనుబంధ కంపెనీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 4.5% వాటా విక్రయం ద్వారా రూ.3,500 కోట్ల లాభం వచ్చిందని, ఈ లాభానికి తోడు రుణ నాణ్యత మెరుగుపడటం వల్ల కూడా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వివరించారు. మొత్తం ఆదాయం రూ.79.303 కోట్ల నుంచి రూ.89,348 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. నికర వడ్డీ ఆదాయం రూ.23,075 కోట్ల నుంచి 17 శాతం వృద్ధితో రూ.24,600 కోట్లకు పెరిగిందని తెలిపారు. నికర వడ్డీ మార్జిన్ 2.78 శాతం నుంచి 3.22 శాతానికి చేరిందని పేర్కొంది. స్టాండ్అలోన్ లాభం రూ.3,012 కోట్లు స్డాండ్‌అలోన్ పరంగా చూస్తే, గత క్యూ2లో రూ.945 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో మూడు రెట్లకు (212%)పైగా ఎగసి రూ.3,011 కోట్లకు పెరిగింది. ఈ ఏడాది మార్చిలో ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓ ఉంటుందన్నారు. తగ్గిన మొండి బకాయిలు.... గత క్యూ2లో రూ.2.05 లక్షల కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.1.61 లక్షల కోట్లకు తగ్గాయి. శాతం పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 9.95% నుంచి 7.19%కి, నికర మొండి బకాయిలు 4.84 శాతం నుంచి 2.79 శాతానికి దిగొచ్చాయి. నికర లాభం మూడు రెట్లు పెరగడం, రుణ నాణ్యత మెరుగుపడటంతో బీఎస్ఈలో ఎస్బీఐ షేర్ 7.5 శాతం లాభంతో రూ.282 వద్ద ముగిసింది. -
అనిశ్చితిలో రియల్టీ
సాక్షి, హైదరాబాద్: దేశీయ రియల్టీ రంగం గడ్డు పరిస్థితుల్లో కొనసాగుతుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికంలో గృహాల అమ్మకాలు, ప్రారంభాలు రెండింట్లోనూ క్షీణత నమోదైంది. జులై – సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రాజెక్ట్‌ల లాచింగ్స్ 45 శాతం, అమ్మకాల్లో 25 శాతం తగ్గాయని ప్రాప్ టైగర్ నివేదిక తెలిపింది. ఇదే ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోల్చినా సరే ప్రారంభాల్లో 32 శాతం, విక్రయాల్లో 23 శాతం క్షీణత నమోదైందని పేర్కొంది. 6 నెలల కాలంతో పోల్చినా క్షీణతే.. 2018–19 ఆర్ధిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో 170,715 గృహాలు విక్రయం కాగా.. 2019–20 ఆర్ధిక సంవత్సరం నాటికి 151,764 మాత్రమే అమ్ముడుపోయాయి. ఇక, గత ఫైనాన్షియల్ ఇయర్ తొలి అర్ధ వార్షికంలో కొత్తగా 137,146 యూనిట్లు లాంచింగ్స్ కాగా.. ఈ ఆర్ధికం నాటికి 83,662 యూనిట్లకు పడిపోయాయి. అంటే 6 నెలల కాలానికి చూసినా అమ్మకాల్లో 11 శాతం, లాంచింగ్స్‌లో 39 శాతం క్షీణత కనిపించింది. ముంబై, పుణె నగరాల్లో జోష్.. 2018–19 ఆర్ధిక సంవత్సరం జులై – సెప్టెంబర్‌లో 61,679 గృహాలు ప్రారంభం కాగా.. 2019–20 ఆర్ధిక సంవత్సరం ఇదే కాలంలో 33,883 యూనిట్లు మాత్రమే లాంచింగ్స్ అయ్యాయి. ఇందులో 41 శాతం గృహాలు రూ.45 లక్షల లోపు ధర ఉండే అఫడబుల్ గృహాలే. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అత్యధికంగా యూనిట్లు ప్రారంభమైంది పుణేలోనే. ఇక్కడ 10,425 గృహాలు లాంచింగ్స్ అయ్యాయి. ఆ తర్వాత ముంబైలో 8,132 యూనిట్లు స్టార్ట్ అయ్యాయి. 2018–19 ఆర్ధికం జులై – సెప్టెంబర్ కాలంలో 65,799 గృహాలు అమ్ముడుపోగా.. 2019–20 నాటికి 88,078 యూనిట్లకు తగ్గాయి. ముంబైలో అత్యధికంగా 21,985 గృహాలు అమ్ముడుపోగా, పుణెలో 13,644 యూనిట్లు విక్రయమయ్యాయి. హైదరాబాద్‌లో ధరలు 15 శాతం జంప్.. గతేడాదితో పోలిస్తే దేశంలో ఇన్వెంటరీ గృహాలు 13 శాతం తగ్గాయి. ప్రస్తుతం తొమ్మిది ప్రధాన నగరాల్లో ఇన్వెంటరీ 778,627లుగా ఉంది. గుర్గావ్, చెన్నై మినహా అన్ని నగరాల్లో స్థిరాస్తి ధరల్లో వృద్ధి నమోదైంది. గతేడాదితో పోలిస్తే హైదరాబాద్ ధరల్లో 15 శాతం వృద్ధి కనిపించింది. -
బుల్.. ధనాధన్!
ఆరు రోజుల పతనం కారణంగా భారీగా నష్టపోయి ఆకర్షణీయంగా ఉన్న షేర్లలో కొనుగోళ్లు జరగడం(వేల్యూ బయింగ్)తో బుధవారం స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. కంపెనీల ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి నేటి(గురువారం) నుంచి ఆరంభం కానున్నది. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు కారణంగా కంపెనీల నికర లాభాలు పెరిగే అవకాశాలున్నాయన్న అంచనాలతో ఈ క్యూ2 ఫలితాలు బాగానే ఉండగలవన్న ఆశావహంతో కొనుగోళ్ల సునామీ చోటు చేసుకుంది. బీఎస్ఈ సెన్సెక్స్ 38,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,300 పాయింట్లపైకి ఎగబాకాయి. కేంద్ర ప్రభుత్వం డీఏను పెంచడం పండుగ డిమాండ్‌కు మరింత జోష్నివ్వగలదన్న అంచనాలు నెలకొన్నాయి. ముడి చమురు ధరలు తగ్గడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ నష్టాల నుంచి రికవరీ కావడం, నేడు(గురువారం) నిప్టీ వీక్లీ ఆప్షన్లు ఎక్స్పైరీ కానుండటంతో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు చోటు చేసుకోవడం సానుకూల ప్రభావం చూపించాయి. బ్యాంక్, ఆర్థిక, టెలికం షేర్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 646 పాయిం ట్లు లాభపడి 38,178 పాయింట్ల వద్ద, నిఫ్టీ 187 పాయింట్లు లాభపడి 11,313 పాయింట్ల వద్ద ముగిశాయి. ఐటీ, కన్సూమర్ డ్యూరబుల్స్, టెక్నాలజీ సూచీలు మినహా మిగిలిన అన్ని సూచీలు లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ ఐటీ సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి. క్యూ2 ఫలితాలే దిక్సూచి.... ఆరు రోజుల నష్టాల నుంచి మార్కెట్ రికవరీ అయిందని జియోజిత్ ఫైనాన్షియల్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. ఆర్బీఐ మరోసారి రేట్లు తగ్గించే అవకాశాలున్నాయన్న అంచనాలతో బాండ్ల రాబడులు తగ్గాయని, దీంతో బ్యాంక్ షేర్లు పెరిగాయని వివరించారు. రేట్ల తగ్గింపు కారణంగా మరిన్ని నిధులు వ్యవస్థలోకి వస్తాయని, దీంతో డిమాండ్ పుంజుకోగలదన్న ఆశావహంతో కొనుగోళ్లు జోరుగా సాగాయని విశ్లేషించారు. రానున్న క్యూ2 ఫలితాలు మార్కెట్ గతిని నిర్దేశిస్తాయని పేర్కొన్నారు. మధ్యాహ్నం తర్వాత లాభాలు..... దసరా సందర్భంగా మంగళవారం సెలవు. ఒక రోజు విరామం తర్వాత సెన్సెక్స్ స్వల్ప లాభాలతో ఆరంభమైంది. మధ్యాహ్నం వరకూ పరిమిత శ్రేణి లాభాల్లో కదలాడింది. ఆ తర్వాత కొనుగోళ్లు జోరందుకోవడంతో భారీ లాభాల దిశగా కదిలింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 678 పాయింట్లు, నిఫ్టీ 196 పాయింట్ల మేర లాభపడ్డాయి. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం విషయమై అనిశ్చితి చోటు చేసుకోవడంతో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. కంపెనీల ఆర్థిక ఫలితాలపై ఆశావహ అంచనాలు, చైనా అమెరికాతో పరిమిత వాణిజ్య ఒప్పందానికి ఒప్పుకోగలదన్న వార్తల (ఆసియా మార్కెట్లు ముగిశాక ఈ వార్తలు వచ్చాయి)కారణంగా యూరప్ మార్కెట్లు లాభాలతో ఆరంభమై, లాభాల్లోనే ముగిశాయి. బ్యాంక్ షేర్ల జోరు పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్(పీఎమ్‌సీ), లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ల్లో అవకతవకలు వెలుగులోకి రావడంతో గత 6 ట్రేడింగ్ సెషన్లలో బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లు నష్టపోయాయి. ఈ నష్టాల కారణంగా పలు బ్యాంక్ షేర్లు ఆకర్షణీయ ధరల్లో లభిస్తున్నాయి. మరోవైపు నేడు(గురువారం) వెల్లడి కానున్న ఇండస్ఇండ్ బ్యాంక్ క్యూ2 ఫలితాలపై పలు బ్రోకరేజ్ సంస్థలు ఆశావహ అంచనాలను వెలువరించాయి. దీంతో బ్యాంక్ షేర్లు జోరుగా పెరిగాయి. నిఫ్టీ బ్యాంక్ సూచీ 1,018 పాయింట్లు (3.6%) మేర ఎగసింది. ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ 5.4% లాభంతో రూ.1,310 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో అధికంగా లాభపడిన షేర్ ఇదే. మరిన్ని విశేషాలు... ► యస్ బ్యాంక్ షేర్ 5.2% నష్టంతో రూ.43 వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► ప్రమోటార్ల షేర్ల వాటాను డిపాజిటరీ సంస్థ, సీడీఎస్ఎల్ స్తంభింపజేయడంతో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(డీహెచ్ఎఫ్ఎల్) షేర్ 10 శాతం లోయర్ సర్క్యూట్‌తో పదేళ్ల కనిష్ట స్థాయి, రూ.26కు పడిపోయింది. ► షేర్ల బైబ్యాక్ వార్తలతో ఇండియాబుల్స్ వెంచర్స్ 9 శాతం లాభంతో రూ.109కు, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ 5 శాతం లాభంతో రూ.43కు పెరిగాయి. ► ఇండియామార్ట్ ఇంటర్మెష్ మెరుపులు కొనసాగుతున్నాయి. 20% లాభంతో జీవిత కాల గరిష్ట స్థాయి, 2,304ను తాకి.. చివరకు 18% లాభంతో రూ.2,264 వద్ద ముగిసింది. ఇన్వెస్టర్ల సంపద 1.66 లక్షల కోట్లు అప్ స్టాక్ మార్కెట్ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.1.66 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.66 లక్షల కోట్లు పెరిగి రూ.1,43,92,456 కోట్లకు చేరింది. లాభాలు ఎందుకంటే... ► వేల్యూ బయింగ్: గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 4 శాతం మేర నష్టపోయాయి. ఈ ఆరు రోజుల నష్టాల కారణంగా బ్యాంక్, ఆర్థిక, లోహ, వాహన, రియల్టీ రంగ షేర్ల ధరలు తగ్గి ఆకర్షణీయంగా ఉండటంతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. ► కరువు భత్యం(డీఏ) పెంపు: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డీఏను 12 శాతం నుంచి 17 శాతానికి,.. 5 శాతం మేర పెంచింది. ఫలితంగా 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 62 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనున్నది. డీఏ పెంపు కారణంగా కేంద్రంపై రూ.16,000 కోట్ల భారం పడనున్నప్పటికీ, ఆ మేరకు ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ పెరిగి, కొనుగోళ్లు చోటు చేసుకుంటాయని, వినియోగం పుంజుకుంటుందన్న అంచనాలున్నాయి. దీంతో మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు జోష్ రాగలదన్న ఆశాభావంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ► చల్లబడ్డ చమురు ధరలు: అమెరికా... ఇతర దేశాలపై సుంకాలు విధిస్తున్న కారణంగా అంతర్జాతీయంగా వృద్ధి కుంటుపడుతుందన్న ఆందోళనతో ముడి చమురు ధరలు పతనమయ్యాయి. గత మూడు రోజులుగా చమురు ధరలు తగ్గుతున్నాయి. 80 శాతానికి పైగా చమురును దిగుమతి చేసుకుంటున్న మన దేశానికి చమురు ధరలు తగ్గడం సానుకూల ప్రభావం చూపుతుంది. అయితే మన మార్కెట్ ముగిసిన తర్వాత చమురు ధరలు పెరిగాయి. ► రూపాయి రికవరీ: ఫారెక్స్ మార్కెట్లో రోజులో ఎక్కువ భాగం నష్టాల్లో ట్రేడైన డాలర్‌తో రూపాయి మారకం విలువ స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి 8 పైసలు పుంజుకోవడం సానుకూల ప్రభావం చూపించింది. -
27 ఏళ్ల కనిష్టానికి చైనా వృద్ధి రేటు
బీజింగ్: చైనా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు రెండవ త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో కేవలం 6.2 శాతంగా నమోదయ్యింది. గడచిన 27 సంవత్సరాల్లో ఒక త్రైమాసికంలో ఇంత తక్కువ జీడీపీ వృద్ది రేటు నమోదుకావడం చైనాలో ఇదే తొలిసారి. అమెరికా వాణిజ్య యుద్ధం, బలహీన గ్లోబల్ డిమాడ్ వంటి అంశాలు వృద్ధి పడిపోడానికి కారణమని చైనా పేర్కొంది. మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) జీడీపీ రేటు 6.4 శాతంగా నమోదయ్యింది. 2019 మొదటి ఆరు నెలల కాలంలో (జనవరి–జూన్) చైనా జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతంగా నమోదయ్యింది. విలువలో ఇది 45.09 ట్రిలియన్ యన్స్ (దాదాపు 6.56 ట్రిలియన్ డాలర్లు) అని చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్బీఎస్) పేర్కొంది. 2018లో చైనా వృద్ధి రేటు 6.6 శాతం. 2019లో కేవలం 6 నుంచి 6.5 శాతం శ్రేణిలోనే వృద్ధిరేటు ఉంటుందని చైనా అంచనా వేస్తోంది. ఈ అంచనాలకు అనుగుణంగా తాజా గణాంకాలు వెలువడ్డం గమనార్హం. చైనా జీడీపీలో 54.9 శాతం వెయిటేజ్ ఉన్న సేవల రంగం మొదటి ఆరు నెలల కాలంలో 7 శాతం పురోగతిని నమోదుచేసుకుంది. -
మారుతి లాభం 3శాతం జంప్
సాక్షి, ముంబై: కార్ల తయారీ దేశీ దిగ్గజం మారుతీ సుజుకీ ఆసక్తికర ఫలితాలను నమోదు చేసింది. శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో ఈ ఏడాది రెండో క్వార్టర్ నికర లాభం 3 శాతం జంప్ చేసి రూ. 2484 కోట్లను ఆర్జించింది. గత ఏడాది సెప్టెంబర్ లో ఇది రూ. 2,401 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం 22 శాతం ఎగసి రూ, 21,768 కోట్లను ప్రకటించింది. గత ఏడాది ఆదాయం 20, 323గా ఉంది. నికర అమ్మకాలు 22 శాతంఎగిసి రూ.2,438 కోట్లుగా ఉంది. ప్రకటనల వ్యయాలు, కమోడిటీ ధరలు మార్జిన్లను దెబ్బతీసినట్లు ఫలితాల విడుదల సందర్భంగా మారుతీ సుజుకీ పేర్కొంది. ప్రస్తుతం ఫారెక్స్, కమోడిటీ వ్యయాల్లో అనిశ్చితి ఏర్పడినట్లు తెలియజేసింది. ఇకపై చౌకకానున్న వడ్డీ రేట్లు పరిశ్రమను ఆదుకోనున్నట్లు అంచనా వేసింది. జీఎస్టీ నేపథ్యంలోనూ క్యూ2లో వాహన పరిశ్రమ 13 శాతం వృద్ధిని సాధించినట్లు వివరించింది. ఈ ఫలితాల నేపథ్యంలో మారుతీ సుజుకి షేరు 1.5శాతం బలపడి కొనసాగుతోంది.