![L&T Finance Holdings Q2 consolidated net profit declines - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/21/LANDT-FINANCE.gif.webp?itok=y1dHBatU)
న్యూఢిల్లీ: ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెపె్టంబర్(క్యూ2)లో నికర లాభం 10 శాతం క్షీణించింది. రూ. 223 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 248 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 3,509 కోట్ల నుంచి రూ. 3,134 కోట్లకు నీరసించింది. క్యూ2లో గ్రామీణ ప్రాంత రుణ విడుదలలో 51 శాతం వృద్ధి నమోదైనట్లు కంపెనీ పేర్కొంది. రూ. 4,987 కోట్లు మంజూరు చేసినట్లు తెలియజేసింది. వీటితోపాటు రిటైల్, రియలీ్ట, ఇన్‌ఫ్రా విభాగాలలో కలిపి మొత్తం రూ. 7,339 కోట్ల రుణాలను విడుదల చేసినట్లు వెల్లడించింది. కోవిడ్–19 సెకండ్ వేవ్, స్థూల ఆరి్థక పరిస్థితులు బిజినెస్ వాతావరణంపై ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. స్థూల మొండిబకాయిలు 5.74 శాతంగా నమోదుకాగా.. కనీస మూలధన నిష్పత్తి 25.16 శాతానికి బలపడింది.
ఫలితాల నేపథ్యంలో ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్ షేరు బీఎస్‌ఈలో 1 శాతం నీరసించి రూ. 91.5 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment