L&T Finance
-
టూవీలర్ కొనుగోలు దారులకు బంపర్ ఆఫర్!
టూవీలర్ కొనుగోలు దారులకు ఎల్ అండ్ టీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 'వెల్కమ్ 2022' లో భాగంగా కొనుగోలు దారులకు భారీ ఎత్తున లోన్ ఆఫర్ ఇస్తున్నట్లు తెలిపింది. హైపోథికేట్ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం 3నిమిషాల్లో 7.99 శాతం నుంచి వడ్డీతో అందిస్తున్నట్లు వెల్లడించింది. రాయల్ ఎన్ఫీల్డ్ కొనుగోలు చేసిన కొనుగోలు దారులు తీసుకున్న లోన్‌ను 4ఏళ్లలో చెల్లించవచ్చని రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్జిగ్యూటీవ్ డైరక్టెర్ బి. గోవిందరాజన్ చెప్పారు. కంపెనీ డీలర్ల దగ్గర లేదా ఎల్ అండ్ టీ ఫైనాన్స్ బ్రాంచ్ ఆఫీస్‌ల దగ్గర ఈ స్కీమ్‌ను పొందవచ్చు. లేదా కంపెనీ వెబ్సైట్ www.ltfs.com లోకి వెళ్లి ఈ స్కీమ్ కింద లోన్‌కు అప్లై చేసుకోవచ్చు. క్లాసిక్ 350, ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 ట్విన్స్, హిమాలయన్ వంటి బైక్‌లను రాయల్ ఎన్ఫీల్డ్ అమ్ముతుంది. ఎల్ అండ్ టీ ఫైనాన్స్ ప్రకారం బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ టర్నరౌండ్ టైమ్ (టీఏటీ) లో భాగంగా..ఎల్ అండ్ టీ ఫైనాన్స్, రాయల్ ఎన్ఫీల్డ్ మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా టైర్ 1, టైర్ 2, టైర్ 3 నగరాలు,పట్టణాల్లోని కస్టమర్లకు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్‌పై లోన్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. చదవండి: అదిరిపోయిన యమహా ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఎంతో తెలుసా? -
ఎల్అండ్టీ ఫైనాన్స్.. వీక్
న్యూఢిల్లీ: ఎల్అండ్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెపె్టంబర్(క్యూ2)లో నికర లాభం 10 శాతం క్షీణించింది. రూ. 223 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 248 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 3,509 కోట్ల నుంచి రూ. 3,134 కోట్లకు నీరసించింది. క్యూ2లో గ్రామీణ ప్రాంత రుణ విడుదలలో 51 శాతం వృద్ధి నమోదైనట్లు కంపెనీ పేర్కొంది. రూ. 4,987 కోట్లు మంజూరు చేసినట్లు తెలియజేసింది. వీటితోపాటు రిటైల్, రియలీ్ట, ఇన్ఫ్రా విభాగాలలో కలిపి మొత్తం రూ. 7,339 కోట్ల రుణాలను విడుదల చేసినట్లు వెల్లడించింది. కోవిడ్–19 సెకండ్ వేవ్, స్థూల ఆరి్థక పరిస్థితులు బిజినెస్ వాతావరణంపై ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. స్థూల మొండిబకాయిలు 5.74 శాతంగా నమోదుకాగా.. కనీస మూలధన నిష్పత్తి 25.16 శాతానికి బలపడింది. ఫలితాల నేపథ్యంలో ఎల్అండ్టీ ఫైనాన్స్ షేరు బీఎస్ఈలో 1 శాతం నీరసించి రూ. 91.5 వద్ద ముగిసింది. -
ఎల్ అండ్ టీకి బ్లాక్‌డీల్ షాక్
సాక్షి, ముంబై: ఎల్ అండ్ టీ ఫైనాన్స్ హోల్డింగ్స్‌కు బ్లాక్‌డీల్ షాక్ తగిలింది. మార్కెట్ ఆరంభంలోనే బలహీపడిన ఈ షేర్ తరువాత మరింత పతనమైంది.బ్లాక్ డీల్ ద్వారా ఎల్అండ్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్‌లో భారీ స్థాయిలో షేర్లు చేతులు మారడంతో ఈ కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. సగటు రేటు ఎంత అనేది స్పష్టం కానప్పటికీ 58.50 లక్షల షేర్లను విక్రయించింది. దీంతో దాదాపు 3.6 శాతానికిపైగా పతనమైంది. కాగా ప్రైవేట్ ఇక్విటీ సంస్థ బైన్ కాపిటల్ 2.12 శాతం లేదా 5శాతంషేర్లను విక్రయించనుందని తద్వారా రూ. 750 కోట్లను సమకూర్చుకోనుందని ఇటీవల ఎల్ అండ్ టి ఫైనాన్స్ ప్రకటించింది. మరోవైపు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఎల్ అండ్ టీ ఫైనాన్స్‌లో పెట్టుబడి ద్వారా దాదాపురెండేళ్లలో 150 శాతం రిటర్న్స్‌ను బైన్ కాపిటల్ సాధించింది. -
నోట్ల రద్దుతో దీర్ఘకాలంలో లాభమే!!
• ఎల్ అండ్ టీ ఫైనాన్స్ ఎండీ దీనానాథ్ దుబాషి • రియల్టీ ధరలు తగ్గినా.. డిమాండ్ పెరుగుతుంది • గ్రామమాల్లో వారుుదా చెల్లింపుల్లో జాప్యం ఉండొచ్చు • డిఫాల్ట్‌లు మాత్రం ఉండకపోవచ్చు • వర్షాలు బాగాపడటం ఇందుకు అనుకూలిస్తుంది • డిజిటల్ సేవలపై విస్తరణపై మరింతగా దృష్టి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఆర్థిక సేవల రంగానికి దీర్ఘకాలంలో ప్రయోజనకరమైనదేనని ఎల్ అండ్ టీ ఫైనాన్స్ హోల్డింగ్‌స ఎండీ దీనానాథ్ దుబాషి పేర్కొన్నారు. స్వల్ప కాలానికి రియల్టీ ధరలు తగ్గే అవకాశం ఉన్నా... దీనివల్ల ఈ రంగంలో డిమాండ్ పెరుగుతుందన్నారు. పలు అంశాలపై ఆయన ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ... ఆర్థిక సేవల రంగంపై పెద్ద నోట్ల రద్దు ప్రభావమెలా ఉంది? నోట్ల రద్దుతో స్వల్పకాలికంగా లిక్విడిటీ కొరతకు ఏర్పడింది. కానీ దీర్ఘకాలంలో ఆర్థిక సేవల రంగానికిది లాభకరమే. రియల్ ఎస్టేట్ రంగంలో ధరలు తగ్గే కొద్దీ, డిమాండ్ పెరగొచ్చు. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లోకి బ్యాంకింగ్ మరింతగా విస్తరించే కొద్దీ నగదు కలెక్షన్ తదితర నిర్వహణాపరమైన ఖర్చులు గణనీయంగా తగ్గుతారుు. ద్రవ్య లభ్యత పెరిగితే వడ్డీ రేట్లూ తగ్గుతారుు. మా సంస్థ విషయానికొస్తే... మేం బలంగా ఉన్న వ్యాపార విభాగాలపై మరింత దృష్టి పెడుతున్నాం. మా లోన్ బుక్‌లో దాదాపు 90 శాతం భాగం ఎలక్ట్రానిక్ కలెక్షన్ల రూపంలోనే ఉంటోంది. కాబట్టి నోట్ల రద్దు ప్రభావం మాపై పెద్దగా లేదని చెప్పగలం. అరుుతే తాజా పరిణామాలతో కస్టమర్లకు డిజిటల్ మాధ్యమంలో మరింత మెరుగైన సేవలందించడంపై దృష్టి సారించాం. వడ్డీ రేట్లు తగ్గుతున్నారుు కదా! హౌసింగ్ రంగం ఎలా ఉండబోతోంది? హౌసింగ్‌కు సంబంధించి మేం ప్రత్యేకంగా స్వయం ఉపాధి పొందుతున్న వర్గంపై దృష్టి పెడుతున్నాం. ఈ విభాగం అధిక రాబడులందిస్తుందని మా నమ్మకం. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.7,529 కోట్లుగా ఉన్న మా హౌసింగ్ ఫైనాన్స వ్యాపారం ఈసారి క్యూ2లో 51 శాతం ఎగిసి రూ.11,381 కోట్లకు చేరింది. వడ్డీ రేట్ల తగ్గుదల వల్ల రాబోయే రోజుల్లో హౌసింగ్ రంగంలో చెప్పుకోతగ్గ స్థారుులో వృద్ధి కనపడుతుంది. ఇప్పటికిప్పుడు అమ్మకాలు మందగించినప్పటికీ, ప్రాపర్టీ ధరల తగ్గుదల కారణంగా రుణ వితరణపై సానుకూల ప్రభావమే ఉండగలదని అంచనా. ఎన్పీఏలను కట్టడి చేసేందుకు ప్రత్యేక చర్యలేమైనా...? మా స్థూల నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) పరిమాణం 40 బేసిస్ పారుుంట్ల మేర మెరుగుపడింది. గ్రామీణ ప్రాంతాల్లో.. సెప్టెంబర్‌లో ఎన్పీఏలు గణనీయంగా తగ్గారుు. ఇక క్యూ3లో సాధారణంగానే ఇవి పెరిగినా.. మళ్లీ మార్చ్ నాటికల్లా గణనీయంగా తగ్గొచ్చు. మరోవైపు, హోల్‌సేల్, ఇన్ఫ్రా వ్యాపార విభాగాల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. గడ్డుకాలాన్ని దాటినట్లే భావిస్తున్నాం. అరుునప్పటికీ.. వచ్చే 4-5 త్రైమాసికాల్లో నిబంధనల కన్నా అధికంగానే ప్రొవిజనింగ్ చేయడం ద్వారా వ్యాపారాన్ని పటిష్ఠం చేసుకుంటాం. స్థూలంగా చూసినప్పుడు క్యూ2తో పోలిస్తే క్యూ3లో ఎన్పీఏలు మరీ ఎక్కువగా పెరగకపోవచ్చు. క్యూ4లో మాత్రం తగ్గొచ్చు. మైక్రోఫైనాన్స సంస్థల్లో వాటాల కొనుగోలు వంటి యోచనేదైనా..? పెట్టుబడికి తగిన రాబడులందించే అవకాశం ఏదైనా వస్తే అందిపుచ్చుకునేందుకు మేమెప్పుడూ సిద్ధమే. కానీ, ప్రస్తుతానికి మాత్రం అటువంటి ప్రతిపాదనేదీ పరిశీలనలో లేదు. సంస్థ వృద్ధికి ఏయే వ్యాపార విభాగాలు తోడ్పడనున్నారుు? లాభదాయకత, ఆకర్షణీయ పరిశ్రమ, మరింత విలువను రాబట్టగలిగే సామర్ధ్యం... ఈ మూడింటి ఆధారంగానే మా వ్యూహాలుంటారుు. వీటి ప్రాతిపదికన మేం గ్రామీణ, హౌసింగ్, హోల్‌సేల్ రుణాలపై దృష్టి పెడుతున్నాం. దానికి తగ్గట్టే ఈ విభాగాల్లో వ్యాపార వృద్ధి 45 శాతం మేర నమోదైంది. రాబోయే రోజుల్లోనూ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తాం. మరింత మెరుగైన పనితీరు సాధించేలా ఎల్అండ్టీ ఫైనాన్స, ఫ్యామిలీ క్రెడిట్, ఎల్అండ్టీ ఫిన్‌కార్ప్ సంస్థలను విలీనం చేశాం. కంపెనీ సంస్థాగత స్వరూపాన్ని మరింత సరళం చేశాం. ఈ ఏడాది గ్రామాల్లో ఫైనాన్సింగ్ వ్యాపారం ఎలా ఉండొచ్చు? వరుసగా రెండేళ్ల కరువు తర్వాత 2016లో మెరుగైన వర్షం పడి ఖరీఫ్ పంటలకు ఊతమిచ్చింది. కానీ అసలైన గ్రామీణ డిమాండ్ ప్రభావాలనేవి ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలోనే కనిపిస్తారుు. గత క్యూ2తో పోలిస్తే ఈ క్యూ2లో ఈ వ్యాపార విభాగం సుమారు 17 శాతం వృద్ధి కనపరిచింది. గ్రామాల్లో ఫైనాన్సింగ్‌పై నోట్ల రద్దు ప్రభావం తాత్కాలికంగా వారుుదాల చెల్లింపును జాప్యం చేస్తుందేమో కానీ... డిఫాల్ట్‌లు ఉండకపోవచ్చు. 2016 ఖరీఫ్‌తో పోలిస్తే ఈ సారి రబీ పంటలకు... మద్దతు ధర అధికంగా ఉండటం రైతులకు సానుకూలాంశం. వచ్చే రెండేళ్లలో గ్రామీణ ఫైనాన్సింగ్ వ్యాపారం మరింత మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం. 20-22 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా. -
500మంది ఉద్యోగులపై వేటు
ముంబై: ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫినాన్స్ సంస్థ ఎల్ అండ్ టీ ఫినాన్స్ హోల్డింగ్స్ 500 మంది ఉద్యోగులపై వేటు వేసింది. గ్రామీణ ప్రాంతాలలో గృహ, వాహన, రుణాల కల్పలనలో మంచి పట్టు కలిగి వున్న ఈ సంస్థ కరువు కష్టాలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులపై తొలగిస్తూ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ చైర్మన్, ఎండీ డియోస్తలే తెలిపారు. బాధకరమైనా, తప్పలేదని పేర్కొన్నారు. వివిధ సెక్టార్లలో పేలవమైన ప్రదర్శన చూపించిన ఉద్యోగులను తొలగించినట్టు చెప్పారు. ముఖ్యంగా రీటైల్, రూరల్ సెగ్మంట్లలో పూర్ పెర్మాన్స్ కనబర్చిన వారికి ఉద్వాసన పలికినట్టు వెల్లడించారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ఒత్తిడిని ఫేస్ చేస్తున్నట్టు చెప్పారు. ఇది తమ మార్కెట్ పై తీవ్ర ప్రభావాన్ని చూపించిందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రుణాలను తీసుకున్న రైతులు, తిరిగి చెల్లించడంలో విఫలమవుతున్నారన్నారు. రుతుపవనాలు వైఫల్యాలతో ఒత్తిడి చాలా ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పరికరాల ఫైనాన్స్ లో తమ వ్యాపారం క్షీణించిందని తెలిపారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో కరువు కారణంగా పలువురు రైతుల పరిస్థితి దిగజారిందనీ, దీంతో ట్రాక్టర్లకు డిమాండ్ తగ్గడంతో పాటు రుణాల చెల్లింపులో సామర్థ్యం తగ్గిందన్నారు. ఈ పరిస్థితి మరో అయిదారు నెలలు వ్యవసాయ రంగంలో ఒత్తిడి చూడవచ్చన్నారు. ఈ ఏడాది రెండవ సగంలో పరిస్థితి మెరుగుపడవచ్చనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాగా మంగళవారం కంపెనీ ప్రకించిన మార్చి త్రైమాసిక ఫలితాల్లో రూ 237 కోట్ల నికర ఆదాయాన్ని ఆర్జించింది. ఆదాయం వృద్ధిలో 15 శాతం పెరుగుదల నమోదు చేసింది. -
యస్ బ్యాంక్‌పై ఎల్అండ్టీ ఫైనాన్స్ కన్ను!
ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్‌ను కొనుగోలు చేసేందుకు ఎల్అండ్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. యస్ బ్యాంకులో ప్రమోటర్లకుగల 25.55% వాటాను సొంతం చేసుకునే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు వీలుగా బ్యాంకు ప్రమోటర్లు రాణా కపూర్, మధు కపూర్లతో ఎల్అండ్టీ ఫైనాన్స్ యాజమాన్యం చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించాయి. ఇందుకు అనుమతుల విషయమై రిజర్వ్ బ్యాంక్‌ను సైతం ఎల్అండ్టీ ఫైనాన్స్ సంప్రదించినట్లు తెలుస్తోంది. యస్ బ్యాంకులో రాణా కపూర్‌కు 5.5%, మధు కపూర్‌కు 9.7% చొప్పున వాటా ఉంది. కాగా, బ్యాంకింగ్ లెసైన్స్ కోసం రిజర్వ్ బ్యాంక్‌కు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఎల్అండ్టీ ఫైనాన్స్‌కు అవకాశం లభించని సంగతి తెలిసిందే.