నోట్ల రద్దుతో దీర్ఘకాలంలో లాభమే!!
• ఎల్ అండ్ టీ ఫైనాన్స్ ఎండీ దీనానాథ్ దుబాషి
• రియల్టీ ధరలు తగ్గినా.. డిమాండ్ పెరుగుతుంది
• గ్రామమాల్లో వారుుదా చెల్లింపుల్లో జాప్యం ఉండొచ్చు
• డిఫాల్ట్‌లు మాత్రం ఉండకపోవచ్చు
• వర్షాలు బాగాపడటం ఇందుకు అనుకూలిస్తుంది
• డిజిటల్ సేవలపై విస్తరణపై మరింతగా దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో
పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఆర్థిక సేవల రంగానికి దీర్ఘకాలంలో ప్రయోజనకరమైనదేనని ఎల్ అండ్ టీ ఫైనాన్స్ హోల్డింగ్‌స ఎండీ దీనానాథ్ దుబాషి పేర్కొన్నారు. స్వల్ప కాలానికి రియల్టీ ధరలు
తగ్గే అవకాశం ఉన్నా... దీనివల్ల ఈ రంగంలో డిమాండ్ పెరుగుతుందన్నారు. పలు అంశాలపై ఆయన ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ...
ఆర్థిక సేవల రంగంపై పెద్ద నోట్ల రద్దు ప్రభావమెలా ఉంది?
నోట్ల రద్దుతో స్వల్పకాలికంగా లిక్విడిటీ కొరతకు ఏర్పడింది. కానీ దీర్ఘకాలంలో ఆర్థిక సేవల రంగానికిది లాభకరమే. రియల్ ఎస్టేట్ రంగంలో ధరలు తగ్గే కొద్దీ, డిమాండ్ పెరగొచ్చు. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లోకి బ్యాంకింగ్ మరింతగా విస్తరించే కొద్దీ నగదు కలెక్షన్ తదితర నిర్వహణాపరమైన ఖర్చులు గణనీయంగా తగ్గుతారుు. ద్రవ్య లభ్యత పెరిగితే వడ్డీ రేట్లూ తగ్గుతారుు. మా సంస్థ విషయానికొస్తే... మేం బలంగా ఉన్న వ్యాపార విభాగాలపై మరింత దృష్టి పెడుతున్నాం. మా లోన్ బుక్‌లో దాదాపు 90 శాతం భాగం ఎలక్ట్రానిక్ కలెక్షన్ల రూపంలోనే ఉంటోంది. కాబట్టి నోట్ల రద్దు ప్రభావం మాపై పెద్దగా లేదని చెప్పగలం. అరుుతే తాజా పరిణామాలతో కస్టమర్లకు డిజిటల్ మాధ్యమంలో మరింత మెరుగైన సేవలందించడంపై దృష్టి సారించాం.
వడ్డీ రేట్లు తగ్గుతున్నారుు కదా! హౌసింగ్ రంగం ఎలా ఉండబోతోంది?
హౌసింగ్‌కు సంబంధించి మేం ప్రత్యేకంగా స్వయం ఉపాధి పొందుతున్న వర్గంపై దృష్టి పెడుతున్నాం. ఈ విభాగం అధిక రాబడులందిస్తుందని మా నమ్మకం. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.7,529 కోట్లుగా ఉన్న మా హౌసింగ్ ఫైనాన్‌స వ్యాపారం ఈసారి క్యూ2లో 51 శాతం ఎగిసి రూ.11,381 కోట్లకు చేరింది. వడ్డీ రేట్ల తగ్గుదల వల్ల రాబోయే రోజుల్లో హౌసింగ్ రంగంలో చెప్పుకోతగ్గ స్థారుులో వృద్ధి కనపడుతుంది. ఇప్పటికిప్పుడు అమ్మకాలు మందగించినప్పటికీ, ప్రాపర్టీ ధరల తగ్గుదల కారణంగా రుణ వితరణపై సానుకూల ప్రభావమే ఉండగలదని అంచనా.
ఎన్‌పీఏలను కట్టడి చేసేందుకు ప్రత్యేక చర్యలేమైనా...?
మా స్థూల నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) పరిమాణం 40 బేసిస్ పారుుంట్ల మేర మెరుగుపడింది. గ్రామీణ ప్రాంతాల్లో.. సెప్టెంబర్‌లో ఎన్‌పీఏలు గణనీయంగా తగ్గారుు. ఇక క్యూ3లో సాధారణంగానే ఇవి పెరిగినా.. మళ్లీ మార్చ్ నాటికల్లా గణనీయంగా తగ్గొచ్చు. మరోవైపు, హోల్‌సేల్, ఇన్‌ఫ్రా వ్యాపార విభాగాల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. గడ్డుకాలాన్ని దాటినట్లే భావిస్తున్నాం. అరుునప్పటికీ.. వచ్చే 4-5 త్రైమాసికాల్లో నిబంధనల కన్నా అధికంగానే ప్రొవిజనింగ్ చేయడం ద్వారా వ్యాపారాన్ని పటిష్ఠం చేసుకుంటాం. స్థూలంగా చూసినప్పుడు క్యూ2తో పోలిస్తే క్యూ3లో ఎన్‌పీఏలు మరీ ఎక్కువగా పెరగకపోవచ్చు. క్యూ4లో మాత్రం తగ్గొచ్చు.
మైక్రోఫైనాన్‌స సంస్థల్లో వాటాల కొనుగోలు వంటి యోచనేదైనా..?
పెట్టుబడికి తగిన రాబడులందించే అవకాశం ఏదైనా వస్తే అందిపుచ్చుకునేందుకు మేమెప్పుడూ సిద్ధమే. కానీ, ప్రస్తుతానికి మాత్రం అటువంటి ప్రతిపాదనేదీ పరిశీలనలో లేదు.
సంస్థ వృద్ధికి ఏయే వ్యాపార విభాగాలు తోడ్పడనున్నారుు?
లాభదాయకత, ఆకర్షణీయ పరిశ్రమ, మరింత విలువను రాబట్టగలిగే సామర్ధ్యం... ఈ మూడింటి ఆధారంగానే మా వ్యూహాలుంటారుు. వీటి ప్రాతిపదికన మేం గ్రామీణ, హౌసింగ్, హోల్‌సేల్ రుణాలపై దృష్టి పెడుతున్నాం. దానికి తగ్గట్టే ఈ విభాగాల్లో వ్యాపార వృద్ధి 45 శాతం మేర నమోదైంది. రాబోయే రోజుల్లోనూ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తాం. మరింత మెరుగైన పనితీరు సాధించేలా ఎల్‌అండ్‌టీ ఫైనాన్‌స, ఫ్యామిలీ క్రెడిట్, ఎల్‌అండ్‌టీ ఫిన్‌కార్ప్ సంస్థలను విలీనం చేశాం. కంపెనీ సంస్థాగత స్వరూపాన్ని మరింత సరళం చేశాం.
ఈ ఏడాది గ్రామాల్లో ఫైనాన్సింగ్ వ్యాపారం ఎలా ఉండొచ్చు?
వరుసగా రెండేళ్ల కరువు తర్వాత 2016లో మెరుగైన వర్షం పడి ఖరీఫ్ పంటలకు ఊతమిచ్చింది. కానీ అసలైన గ్రామీణ డిమాండ్ ప్రభావాలనేవి ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలోనే కనిపిస్తారుు. గత క్యూ2తో పోలిస్తే ఈ క్యూ2లో ఈ వ్యాపార విభాగం సుమారు 17 శాతం వృద్ధి కనపరిచింది. గ్రామాల్లో ఫైనాన్సింగ్‌పై నోట్ల రద్దు ప్రభావం తాత్కాలికంగా వారుుదాల చెల్లింపును జాప్యం చేస్తుందేమో కానీ... డిఫాల్ట్‌లు ఉండకపోవచ్చు. 2016 ఖరీఫ్‌తో పోలిస్తే ఈ సారి రబీ పంటలకు... మద్దతు ధర అధికంగా ఉండటం రైతులకు సానుకూలాంశం. వచ్చే రెండేళ్లలో గ్రామీణ ఫైనాన్సింగ్ వ్యాపారం మరింత మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం. 20-22 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా.