న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్యాంక్ అకౌంట్లలో భారీ డిపాజిట్లు, ఇందుకు సంబంధించి సకాలంలో ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయడంలో వైఫల్యం వంటి అంశాలపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి సారించింది. రూ.25 లక్షలు పైబడి డిపాజిట్ చేసిన ఈ తరహా 1.16 లక్షల వ్యక్తులు, సంస్థలకు నోటీసులు జారీ చేసింది. సీబీడీటీ (ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్) చైర్మన్ సుశీల్ చంద్ర ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
► పెద్ద నోట్ల తర్వాత భారీ ఎత్తున నగదు డిపాజిట్ చేసి, ఐటీ రిటర్స్‌లు దాఖలు చేసిన వారి అకౌంట్లను కూడా క్షుణ్ణంగా పరిశీలించి, తగిన సమాధానాలు రాబడుతున్నాం.
► తమ బ్యాంక్ ఖాతాల్లో రూ.2.5 లక్షల పైన రద్దయిన రూ.500, రూ. 1000 డిపాజిట్లు చేసిన దాదాపు 18 లక్షల వ్యక్తులు, కంపెనీలకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది.
► వీరిలో కూడా ఐటీ రిటర్స్‌లు దాఖలు చేయని వ్యక్తులు, కంపెనీలను రెండుగా విభజించింది. ఇందులో ఒక విభాగం రూ.25లక్షలకు పైగా డిపాజిట్ చేసిన వర్గం. మరో వర్గం రూ.10 నుంచి 25 లక్షల వరకూ డిపాజిట్ చేసిన వర్గం.
► రూ.25 లక్షల పైబడి డిపాజిట్‌చేసి, రిటర్న్‌లు దాఖలు చేయని వారు 1.16 లక్షలు. వీరందరినీ 30 రోజుల్లోపు రిటర్నులు వేయాలని ఆదేశించాం.
Comments
Please login to add a commentAdd a comment