Money deposit
-
‘కామ్’గా నెట్టేసి.. కోట్లు కొట్టేసి
సాక్షి, హైదరాబాద్: ఒక వెబ్సైట్ అడ్రస్‌కు సంబంధించి చివరలో ఉండే .కామ్‌కు బదులు .నెట్ ఎంటర్ చేస్తే ఏమవుతుంది? ఆ సైట్ తెరుచుకోకపోవడమో లేదా మరో సైట్‌కు కనెక్ట్ కావడమో జరుగుతుంది. అయితే అకౌంట్ టేకోవర్ ఫ్రాడ్స్‌లో ఇలా జరిగితే మాత్రం భారీగా ఆర్థిక నష్టం వస్తుంది. నగరానికి చెందిన వ్యాపారవేత్తలు, సంస్థలు తరచూ ఈ నేరాల బారినపడుతున్నాయి.ఇలాంటి ఓ ఈ–మెయిల్‌ను నమ్మిన రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఇటీవల ఏకంగా రూ.11.4 కోట్లు సైబర్ నేరగాళ్ల ఖాతాకు బదిలీ చేసింది. అమెరికాకు చెందిన బ్యాంకు అప్రమత్తతతో ఈ మొత్తం సేఫ్‌గా ఉన్నా, రాజధాని కేంద్రంగా తరచూ ఈ అకౌంట్ టేకోవర్ ఫ్రాడ్స్ జరుగుతున్నట్టు చెబుతున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ కేవీఎం.ప్రసాద్ ఆన్లైన్ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు.బాధితులుగా మారేది వ్యాపారులు, సంస్థలే..అకౌంట్ టేకోవర్‌గా పిలిచే ఈ సైబర్ నేరాల్లో ఒకప్పుడు బాధితులంతా ఉత్తరాదిలో ఉన్న వ్యాపారులే ఉండేవారు. ఆపై హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఈ తరహా నేరాలు జరుగుతున్నాయి. ఈ సైబర్ నేరం చేయడానికి తొలుత నైజీరియన్లు గ్రూపులుగా ఏర్పడి వ్యాపార/ఆర్థిక లావాదేవీలతో కూడిన ఈ–మెయిల్ ఐడీలను గుర్తించి హ్యాక్ చేస్తారు. అందులో ఉండే లావాదేవీలతోపాటు వారి భాషాశైలి, చెల్లింపులు/వసూళ్ల విధానాన్ని కొంతకాలం పాటు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ప్రధానంగా ఇంపోర్ట్–ఎక్స్పోర్ట్ వ్యాపారం చేసే వారే ఎక్కువగా టార్గెట్ అవుతున్నారు. హ్యకింగ్ చేసిన తర్వాత ఏ దశలోనూ సదరు వ్యాపారికి అనుమానం రాకుండా జాగ్రత్త పడతారు. చిక్కకుండా ఉండేందుకు జాగ్రత్తలుఅకౌంట్ టేకోవర్ స్కామ్స్‌లో టార్గెట్ చేసిన సంస్థ నుంచి డబ్బు డిపాజిట్ చేయించుకోవడానికి బ్యాంకు ఖాతాలు ఎంతో కీలకం. వీటిని వారే నేరుగా తెరిస్తే పోలీసులకు దొరికే అవకాశాలు ఉంటాయి. ఇలా కాకుండా ఉండేందుకు ఇక్కడివే, బోగస్ చిరునామాలతో ఉండేవి తప్పనిసరి. దీనికోసం నైజీరియన్లు భారీ పథక రచన చేస్తున్నారు. నకిలీ పత్రాలతో వీటిని తెరుస్తున్నారు. రాయదుర్గంలోని ఫార్మా స్యూటికల్ సంస్థ నుంచి రూ.11.4 కోట్లు కాజేయడానికి ప్రయతి్నంచిన నేరగాళ్లూ ఇలానే చేశారు.అయితే నగదు రిసీవ్ చేసుకునే సంస్థ పేరుతోనే బ్యాంకు ఖాతా తెరవడం సాధ్యం కాలేదు. కొద్దిగా మార్పులతో కూడిన పేరుతో సంస్థను ఏర్పాటు చేసి ఆ పేరుతో ఖాతా తెరిచారు. రాయదుర్గం సంస్థ నుంచి వెళ్లిన నగదును అమెరికాలోని బ్యాంకు నేరుగా ఈ ఖాతాలోకి బదిలీ చేయాల్సి ఉండగా, కంపెనీ పేరుతో ఉన్న మార్పును గమనించి ఆ మొత్తాన్ని హోల్డ్‌లో పెట్టింది. దీంతో రూ.11.4 కోట్లు నేరగాళ్ల పాలు కాకుండా ఆగాయి. చిన్నచిన్న మార్పులతో మెయిల్ ఐడీలు...సైబర్ నేరగాళ్లు ఇలా హ్యాక్ చేసిన ఈ–మెయిల్‌ను నిరంతరం అధ్యయనం చేయడం ద్వారా వారికి డబ్బు రావాల్సి, చెల్లించాల్సిన సమయం వచ్చే వరకు వేచి చూస్తున్నారు. సరైన టైమ్‌లో నగదు రిసీవ్ చేసుకునే సంస్థ పేరును పోలిన, అదే యూజర్ నేమ్‌తో కూడిన, ఆఖరులో ఉండే .కామ్, .నెట్ తదితరాలను మార్చి ఈ–మెయిల్ ఐడీలు క్రియేట్ చేస్తున్నారు. వీటిని వినియోగించి నగదు పంపాల్సిన సంస్థకు నగదు రిసీవ్ చేసుకునే సంస్థ నుంచి వచి్చనట్టే ఈ–మెయిల్ పంపుతున్నారు. అందులో ఆడిటింగ్, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లతోపాటు సాంకేతిక కారణాలను వివరిస్తూ..నిత్యం నగదు బదిలీ చేసే బ్యాంక్ ఖాతాకు కాకుండా మరో దానికి పంపాల్సిందిగా కోరుతున్నారు. రాయదుర్గంలోని ఫార్మా స్యూటికల్ సంస్థ విషయంలో ఇలానే జరిగింది. ఈ సంస్థకు ముడిసరుకు సరఫరా చేసే అమెరికన్ సంస్థను పోలిన ఈ–మెయిల్ ఐడీ సృష్టించారు. అసలు దానికి చివరలో .కామ్ ఉంటుంది. అయితే సైబర్ నేరగాళ్లు .నెట్‌తో ముగిసేలా మరోటి సృష్టించారు. దీని ఆధారంగా మెయిల్ పంపి రూ.11.4 కోట్లకు సమానమైన అమెరికన్ డాలర్లు తమ ఖాతాల్లో వేయించుకున్నారు. సరిచూసుకోకుంటే నష్టపోవాల్సిందే అకౌంట్ టేకోవర్ నేరాల్లో ప్రతి ఏడాది నగరానికి చెందిన వ్యాపారులు, వ్యాపార సంస్థలు రూ.లక్షలు, కోట్లల్లో నష్టపోతున్నారు. ఈ–మెయిల్స్ విషయంలో చాలామంది దాన్ని పంపిన యూజర్ నేమ్ చూసి ఎదుటివారు తమ వారే అని భావిస్తారు. అనేక ఈ–మెయిల్ ఖాతాలకు ఒకే యూజర్ నేమ్ ఉండవచ్చు. అందులో ప్రధానంగా యూజర్ ఐడీని చూడాలి. ఈ–మెయిల్స్ అవి పంపిన సంస్థల నుంచి వచి్చనట్టు ఉన్నా.. ఆఖరులో .కామ్ ఉందా? .నెట్ ఉందా? అనేది క్షుణ్ణంగా గమనించాలి. సైబర్ నేరగాళ్లు ఎక్కువగా ఇంటర్ నెట్లో ఫ్రీగా దొరికే ‘.ఓఆర్జీ’తో కూడినవి తయారు చేసి వాడతారు. ఈ తరహా నేరాల్లో నిందితులు చిక్కడం, నగదు రికవరీ కావడం కష్టసాధ్యం. - కేవీఎం.ప్రసాద్, డీఎస్పీ,తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోఅకౌంట్ టేకోవర్ నేరాల్లో నష్టపోయిన కొన్ని సంస్థలు...* 2020 జూలై కేపీసీ ఇన్ఫ్రా, హైదరాబాద్ రూ.9.9లక్షలు* 2020 అక్టోబర్ పోకర్ణ ఇంజనీరింగ్ స్టోన్ లిమిటెడ్ రూ.2.09లక్షలు* 2021 ఫిబ్రవరి హేమా ఎల్రక్టానిక్స్, సికింద్రాబాద్ రూ.లక్ష* 2021 జూన్ నిర్మా సిన గ్లాస్ కంపెనీ, మాసబ్‌ట్యాంక్ రూ.55లక్షల స్వాహాకు యత్నం * 2022 ఏప్రిల్ అమీర్‌పేటకు చెందిన ఓ సంస్థ రూ.1.19కోట్లు* 2022 జూలై నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ రూ.64లక్షలు* 2023 ఫిబ్రవరి హెచ్‌బీఎల్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ సంస్థ, బంజారాహిల్స్ రూ.1.16కోట్లు* 2023 మార్చి ఏబీఆర్ ఆర్గానిక్స్ లిమిటెడ్ సంస్థ, బాగ్‌అంబర్‌పేట రూ.7లక్షలు -
టీడీపీలో కోట్లకు సీట్లు
సాక్షి, అమరావతి: టీడీపీలో ‘కోట్లుకు టికెట్లు’ వ్యవహారం రచ్చకెక్కింది. కోరినన్ని కోట్లిస్తేనే ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు చోట్ల డబ్బు డిపాజిట్ చేస్తేనే టికెట్లు ఇస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘మా వాళ్లు బ్రీఫ్డ్ మీ’.. అన్న తరహాలోనే ఇప్పుడూ పెద్ద నేతకు ‘బ్రీఫింగ్’ వెళ్తేనే టికెట్ ఖరారవుతోందని చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పార్టీకి విధేయులుగా ఉండే నేతలు సైతం ఈ డబ్బు దందాపై రగిలిపోతున్నారు. పార్టీ కోసం పని చేసిన వారిని కాదని బయటి వ్యక్తులకు వేలం పాట పెట్టి మరీ సీట్లు అమ్మేసినట్లు టీడీపీ నేతలు వాపోతున్నారు. వారి ఆవేదన హద్దులు దాటి దాడులు చేసే స్థాయికి చేరింది. అనంతపురం అర్బన్ సీటును అక్కడి ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకరచౌదరికి కాకుండా దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌కి ఇవ్వడంపై అనంతపురం టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. పార్టీ కార్యాలయాలపై దాడులు చేసి నిప్పు పెట్టి, చంద్రబాబు, లోకేశ్ ఫొటోలను దహనం చేస్తున్నారు. ఈ సీటును లోకేశ్ రూ.30 కోట్లకు అమ్మేసినట్లు పార్టీ నేతలు మీడియాలోనే చెబుతున్నారు. గుంతకల్లు అసెంబ్లీ సీటును కూడా ఇలాగే వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకి కేటాయించారు. పార్టీ కోసం ఎప్పటి నుంచో పనిచేస్తున్న ఇన్‌ఛార్జి జితేంద్రగౌడ్కి మొండిచేయి చూపి అప్పటికప్పుడు పార్టీలో చేరిన జయరాంకి ఇచ్చేశారు. ఇందుకోసం ఆయన చంద్రబాబు, లోకేశ్‌కి భారీగా డబ్బు ముట్టజెప్పినట్లు టీడీపీ నేతలే చెబుతున్నారు. దర్శి సీటు స్థానికేతరురాలికి ఇవ్వడం వెనుక ! ఒంగోలు జిల్లా దర్శి సీటును కూడా వేరే ప్రాంతానికి చెందిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి కేటాయించారు. నిజానికి ఈ సీటును చాలాకాలం క్రితమే బేరం పెట్టినా కొనేందుకు ఎవరూ రాలేదు. ఇతర పార్టీల నుంచి ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూశారు. ఆఫర్లు ప్రకటించినా లాభం లేకపోయింది. ఈ నేపథ్యంలో నర్సరావుపేట సీటు ఆశించిన డాక్టర్ లక్ష్మి కుటుంబానికి ఆ సీటు కాకుండా దర్శి కేటాయించారు. నిర్దేశించిన రేటు ముట్టజెప్పడంతో స్థానికేతరురాలు అయినా ఆమెకు సీటు ఇచ్చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఏ సీటూ ఇవ్వకూడదనుకున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఆయన కోరుకున్న భీమిలి సీటు ఇవ్వడం వెనుకా భారీ డీల్ ఉన్నట్లు తెలుస్తోంది. గంటాను విశాఖ నుంచి పూర్తిగా దూరంగా పంపడానికి చంద్రబాబు ప్రయత్నించారు. అందుకోసం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పోటీ చేయాలని తీవ్ర ఒత్తిడి చేశారు. ఆయన ససేమిరా అన్నారు. విశాఖ జిల్లాలోనే ఏదో ఒక సీటు కావాలని కోరారు. అందుకు మొదట ఒప్పుకోని చంద్రబాబు.. మొదటి మూడు జాబితాల్లోనూ అవకాశం కల్పించలేదు. ఇక ఆయనకు సీటు రాదనుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే గంటా ఇచ్చిన భారీ ఆఫర్‌కి చంద్రబాబు, లోకేశ్ తలొగ్గినట్లు ఆరోపణలు వస్తున్నాయి. జనసేనకు ఇవ్వాల్సిన భీమిలి సీటును పొత్తులో లేకుండా చేసి మరీ ఆఖరి జాబితాలో గంటాకు కట్టబెట్టారని సమాచారం. ఒంగోలు లోక్‌సభ సీటును ఫిరాయింపు నేత మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఇవ్వడం వెనుకా డబ్బు డీల్ ఉన్నట్లు చెబుతున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి సీటు ఇవ్వడాన్నిబట్టి దానికి గట్టి రేటు పెట్టి డబ్బు దండుకున్నారని పార్టీ నేతలు అంటున్నారు. మొదట ఆయన కుమారుడు రాఘవరెడ్డికి సీటు ఇవ్వడానికి ఒప్పుకున్నా, అరెస్టయి బెయిల్‌పై ఉన్న వ్యక్తికి టికెట్టిస్తే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో శ్రీనివాసులరెడ్డినే పోటీ చేయించాలని నిర్ణయించారు. ఇలా అంతకుముందు ప్రకటించిన లోక్‌సభ సీట్లకు సైతం పెద్దఎత్తున డబ్బు చేతులు మారినట్లు టీడీపీలో చర్చ జరుగుతోంది. ఎంపీ టికెట్ రేటు రూ.100 నుంచి రూ.200 కోట్లు ఏలూరు, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, నంద్యాల ఎంపీ సీట్ల ఖరారు వెనుక వందల కోట్ల డీల్ ఉన్నట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. ఒక్కో ఎంపీ సీటు కోసం రూ.100 నుంచి రూ.200 కోట్ల డీల్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో పని చేసిన నేతలను కాదని ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సీట్లు ఇవ్వడానికి డబ్బు తప్ప మరో కారణం లేదని తెలుస్తోంది. సగానికిపైగా అసెంబ్లీ సీట్ల ఖరారులోనూ ఇదే సూత్రాన్ని పాటించారు. రెండు రకాల డిపాజిట్లు చేస్తేనే కాని సీటు ఖరారు కాలేదని అనంతపురం జిల్లాకు చెందిన ఒక టీడీపీ అభ్యర్థి తన అనుచరుల వద్ద వాపోయారు. ఒక డిపాజిట్ ఎన్నికల్లో ఖర్చు చేయడానికి, మరొకటి చినబాబుకు చేశాకే చాలామంది సీట్లు దక్కించుకున్నారని చెబుతున్నారు. ఇందుకోసం ఆయన వేలం పాట పెట్టి ఎవరు ఎక్కువ ఇస్తామంటే వారికి సీట్లు ఖరారు చేసినట్లు సమాచారం. దీనిపై టీడీపీలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ కోసం అహర్నిశలూ కష్టపడి పని చేస్తే సీట్లతోపాటు తమను కూడా అమ్మేస్తున్నారని వాపోతున్నారు. అందుకే పలుచోట్ల కార్యకర్తలు చంద్రబాబు, లోకేశ్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వారిని బూతులు కూడా తిడుతున్నారు. -
డబ్బు కుమ్మరిస్తేనే టీడీపీ ఎమ్మెల్యే టికెట్!
ఇప్పటికే పీకల్లోతు మునిగిపోయిన పార్టీ. అధికారం వస్తుందో లేదో తెలియదు. రాకుంటే ఉనికి ఉంటుందో లేదో చెప్పలేని పరిస్థితి. ఈ క్రమంలో ఎందుకైనా మంచిదనుకున్నారో ఏమో.. గుట్టుగా డిపాజిట్ల పర్వం మొదలుపెట్టినట్లు తెలిసింది. ‘నోట్ల కట్టలు కొట్టు.. టికెట్ పట్టు’ అంటూ కరాఖండీగా చెబుతున్నారని సమాచారం. అనంతపురం: ‘ఓటుకు నోటు’ కేసుతో దేశంలోనే సంచలనం రేపిన టీడీపీ అధినేత.. తాజాగా ‘సీటుకు నోటు’ అనే కొత్త కాన్సెప్ట్ తెరమీదకు తెచ్చినట్లు తెలిసింది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో పార్టీ టికెట్ కావాలంటే రూ.35 కోట్లు డిపాజిట్ చేయాల్సిందేనని షరతు విధించినట్లు సమాచారం. దీంతో ఆ పార్టీ నేతలు అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. కొందరు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా, లేకున్నా రూ.కోట్లు ఖర్చు చేశామని, ఇప్పటికిప్పుడు అంత పెద్దమొత్తం అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలని ఆశావహులు తమ అనుచరుల వద్ద వాపోతున్నట్లు తెలిసింది. ఆస్తులు అమ్మి లేదా అప్పు చేసి డబ్బు ముట్టజెప్పినా.. ఓడిపోతే ఆ తర్వాత తమ పరిస్థితి ఏంటనే అంతర్మథనం తమ పార్టీ నేతల్లో మొదలైందని జిల్లాలోని ఓ సీనియర్ నేత సన్నిహితుడు తెలిపారు. కబ్జా స్థలం అమ్మకానికి.. కదిరి పట్టణంలోని కదిరి–హిందూపురం రహదారిలో ఉన్న ముస్లిం మైనార్టీలకు చెందిన మూడెకరాల స్థలాన్ని టీడీపీకి చెందిన నియోజకవర్గ కీలక నేత తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కబ్జా చేసి చుట్టూ కంచెవేశారు. టికెట్ కావాలంటే డబ్బు డిపాజిట్ చేయాల్సిందేనని పార్టీ పెద్దలు షరతు విధించడంతో దిక్కుతోచని స్థితిలో సదరు నేత కబ్జా స్థలాన్ని రూ.30 కోట్లకు అమ్మకానికి పెట్టినట్లు ఆ పార్టీ వర్గీయులు పలువురు చెబుతున్నారు. అది కూడా స్థలాన్ని స్థానికులకు కాకుండా స్థానికేతరులకు కట్టబెట్టాలని చూస్తున్నట్లు సమాచారం. మొదట్లో కొనడానికి ఆసక్తి చూపిన కొందరు.. అది కాస్త కబ్జా స్థలమని తెలుసుకుని మెల్లిగా జారుకున్నట్లు తెలిసింది. ఇదేం గోల.. పుట్టపర్తి నియోజకవర్గానికి చెందిన టీడీపీ కీలక నేతకు కదిరిలో కళాశాల ఉంది. కార్పస్ ఫండ్ కోసం స్థానికంగా ఐదెకరాలను చూపి కళాశాల నడుపుతున్నారు. మరణించిన తన కుటుంబ సభ్యురాలి పేరుపై ఉన్న ఆ స్థలాన్ని ఎలాగైనా తన పేరున మార్చుకుని అమ్మేయడం ద్వారా టికెట్ కోసం డబ్బు సమకూర్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ స్థలం మ్యూటేషన్ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ఆయనకు సహకరిస్తున్నారన్న కారణంతో తహసీల్దార్‌ను ఇప్పటికే తప్పించారు. ఇదిలా ఉంటే.. సదరు నేతకు పుట్టపర్తి టికెట్ ఇవ్వకూడదని, ఈ సారి బీ ఫాం బీసీ నేతకే ఇవ్వాలని ఆ పార్టీ నాయకులు పట్టుబడుతున్నారు. ఒకవైపు డబ్బుతో ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు బీసీ గోల ఏంటని సదరు నేత తన అనుచరుల ఎదుట వాపోతున్నట్లు తెలిసింది. సీనియర్ల గుర్రు టికెట్ కోసం డబ్బు డిపాజిట్ చేయడానికి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేతలు ఒప్పుకోవడం లేదు. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడుతుంటే ఇప్పుడు నోట్ల కట్టలు ఉన్న వాళ్లకే టికెట్ అంటే ఎలా అని వారు మండిపడుతున్నట్లు సమాచారం. ధర్మవరం టీడీపీ టికెట్ కోసం రూ.50 కోట్లయినా డిపాజిట్ చేయడానికి సిద్ధమైన ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత బీజేపీ నేత వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారని, అదే జరిగితే ఆయన్ను ఓడించడం ఖాయమని వ్యతిరేక వర్గం అంటోంది. పెనుకొండలో ఇప్పటికే రెండు వర్గాల మధ్య వార్ తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే డబ్బు డిపాజిట్ అంశం ఆ నియోజకవర్గ టీడీపీ నేతల్లో కొత్త చిచ్చు రాజేస్తోంది. చంద్రబాబు డబ్బే ప్రధానమనే భావనతో ముందుకెళితే పార్టీ కనుమరుగు కావడం ఖాయమని ఆ పారీ్టకే చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. -
లాభాల వలవేసి.. డబ్బు లాగేసి..
కర్నూలు: ముచ్చటైన ఆఫర్లు.. కళ్లెదుటే లాభాలు.. చుట్టుపక్కల వాళ్లను జతచేస్తే బోనస్‌లు, ఇన్సెంటివ్‌లు. అకౌంట్లోకి తేరగా వచ్చి పడుతున్న డబ్బును చూసి అందరికీ ఆశ కలిగింది. ఒకరిని చూసి మరొకరుగా చేరుతుండటంతో కొత్త స్కీమ్‌లు తెరపైకి వచ్చాయి. రూ.100 కడితే రూ.2 వేల ఆదాయం వస్తుండటంతో కంపెనీకి విస్తృత ప్రచారం లభించింది. కొత్త అకౌంట్ల సంఖ్య పెరగడంతోపాటు వ్యాపారం రూ.కోట్లకు చేరింది. అంతా సజావుగా సాగుతున్నట్టు అనిపించినా ఒకానొక రాత్రి ఆ కంపెనీ చీకట్లో కలిసిపోయింది. లబోదిబోమంటున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ప్లేస్టోర్‌లో పుట్టుకొచ్చి .. ప్లేస్టోర్ వేదికగా పుట్టుకొచ్చిన కెనడియన్ సోలార్ కంపెనీ ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి ఆన్లైన్ కార్యకలాపాలను ప్రారంభించింది. ఐదు నెలల కాలంలో అందమైన ఆఫర్లతో వేలాది మందిని బుట్టలో వేసుకుంది. కాఫీ తాగుతున్న విదేశీ యువతి ఫొటోను డీపీగా పెట్టుకుని 97904 01505, 44 7467 135 221 నంబర్లతో వాట్సాప్ చాటింగ్ ద్వారా ఖాతాదారులకు కంపెనీ దగ్గరైంది. స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల పేర్లతో ఒకరి తర్వాత ఒకరు లాభాలకు ఆకర్షితులయ్యారు. మొదట్లో డబ్బు చెల్లించడమే తరువాయి.. వెంటవెంటనే డబ్బు వస్తుండటంతో నమ్మకంతోపాటు ఖాతాదారుల సంఖ్య కూడా పెరిగిపోయింది. కొత్త స్కీమ్‌లతో విస్తరణ మొదట 45 రోజుల స్కీమ్‌తో ఈ కంపెనీ ప్రారంభమైంది. ఆ తర్వాత నెల రోజులు.. 15 రోజులు.. 10 రోజులు.. 3 రోజులు.. చివరగా ఒక్క రోజు కాల వ్యవధితోనూ స్కీమ్‌లు నడిపింది. 45 రోజుల స్కీమ్‌లో డబ్బు డిపాజిట్ చేసిన వాళ్లకు వెనువెంటనే ఖాతాల్లోకి డబ్బు చేరుతుండటం.. ఆ వివరాలను చూసి మరికొందరు ఆ స్కీమ్‌లలో చేరడం జరిగిపోయింది. పది రోజుల స్కీమ్‌లో ఒకసారి రూ.47 వేలు కడితే.. 10 రోజుల వరకు రోజూ రూ.21,374 చొప్పున అకౌంట్లలో జమ చేస్తారు. ఒక్క రోజు స్కీమ్ (ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్)లో రూ.13,500 చెల్లిస్తే అదే రోజు రాత్రి 12 గంటలు దాటిన తర్వాత రూ.29,700 చెల్లిస్తామని కంపెనీ నమ్మబలికింది. రెఫర్ చేస్తే బోనస్ ఖాతాదారులను ఆకట్టుకునేందుకు చైన్ లింకును తెరపైకి తెచ్చింది. ఒకరికి లింకు పంపిస్తే బోనస్‌ను నిర్ణయించింది. ఆ లింకు డౌన్లోడ్ చేసుకున్న వ్యక్తి రూ.13,500 చెల్లిస్తే.. చేర్పించిన వ్యక్తికి రూ.1,800 బోనస్, 700 పాయింట్లు, అదనంగా రూ.600 సబ్సిడీ బోనస్ కలిపి రూ.3,500 చెల్లిస్తుంది. ఇలా జాయిన్ చేసిన వారి వివరాలను వాట్సాప్ చాట్‌లో నమోదు చేస్తే ఒక ప్రోమో కోడ్ వస్తుంది. ఆ కోడ్‌ను తమ వద్దనున్న యాప్‌లో రివార్డు కాలమ్‌లో ఎంటర్ చేయగానే బోనస్ మొత్తం అకౌంట్లో జమ అవుతుంది. చీకట్లో కలిసిపోయింది. నమ్మకమే పెట్టుబడిగా ఏర్పాటైన ఈ కంపెనీ చీకట్లో కలిసిపోయింది. ఎంతగా అంటే.. ప్లే స్టోర్‌లో కూడా సమాచారం లేకుండాపోయింది. చివరకు సెల్ఫోన్ల నుంచి కూడా యాప్ దానంతటదే డిలీట్ అయ్యిందంటే కంపెనీ నిర్వాహకుల తెలివితేటలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. స్పందన’లో ఫిర్యాదు కెనడియన్ సోలార్ యాప్‌లో డబ్బులు డిపాజిట్ చేస్తే రెట్టింపు మొత్తం తిరిగి ఇస్తామని చెప్పి మోసం చేశారని కర్నూలు నగరం బుధవారపుపేటకు చెందిన అర్ఫత్ జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌కు ఈ నెల 17న స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. రూ.2.85 లక్షలు ఆన్లైన్లో డిపాజిట్ చేస్తే రూ.13 లక్షలు చెల్లిస్తామని నమ్మించి మోసం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
మాట నిలబెట్టుకున్నాం: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అగ్రి గోల్డ్‌లో డిపాజిట్ చేసి మోసపోయిన లక్షలాది మంది కష్టజీవులను ఆదుకోవాల్సిన గత ప్రభుత్వం మోసం చేస్తే, ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మనందరి ప్రభుత్వం న్యాయం చేసిందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆ సంస్థలో డిపాజిట్ చేసిన వారందరూ కష్టజీవులని, వారికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో అండగా నిలిచామని చెప్పారు. అగ్రి గోల్డ్ వ్యవహారం కోర్టుల్లో కొలిక్కి రాగానే ఆస్తులు అమ్మి, మిగతా బాధితులకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. ప్రైవేట్ కంపెనీ మోసం చేస్తే ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని కష్టజీవులకు న్యాయం చేయడం దేశ చరిత్రలోనే తొలిసారి అని తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని పాదయాత్రలో మాటిచ్చానని, అదే విషయాన్ని మేనిఫేస్టోలో కూడా పెట్టామని.. ఆ మేరకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని డిపాజిట్ దారులకు న్యాయం చేశామన్నారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్లో బటన్ నొక్కి బాధితుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేశారు. గతంలో మిగిలిపోయిన రూ.10 వేల లోపు డిపాజిట్ దారులు మరో 3.86 లక్షల మందికి రూ.207.61 కోట్లు, రూ.10 వేల నుంచి రూ.20 వేల లోపు డిపాజిట్‌దారులైన 3.14 లక్షల మందికి రూ.459.23 కోట్లను చెల్లించారు. హైకోర్టు నిర్దేశించిన విధంగా మొత్తం 7 లక్షల పైచిలుకు అర్హులైన అగ్రిగోల్డ్ బాధితులను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గుర్తించి, సీఐడీ ద్వారా నిర్ధారించి.. రూ.666.84 కోట్లను వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా జిల్లాల్లోని అగ్రిగోల్డ్ బాధితులనుద్దేశించి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. వీడియో కాన్ఫరెన్స్‌లో అగ్రిగోల్డ్ బాధితులతో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ 10.40 లక్షల మందికి రూ.905.57 కోట్లు ► ఈరోజు దేవుడి దయతో దాదాపు 7 లక్షల పైచిలుకు డిపాజిటర్లకు రూ.666.84 కోట్లు నేరుగా వారి అకౌంట్లలో జమ చేస్తున్నాం. మొత్తంగా అగ్రిగోల్డ్ బాధితులకు మొదటి విడత, ఇవాళ ఇస్తున్న రెండో విడత అన్నీ కలుపుకుంటే 10.40 లక్షల మందికి రూ.905.57 కోట్లకుపైనే మన ప్రభుత్వం ఇచ్చింది. ► గత ప్రభుత్వం 2015లోనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి మోసం చేసింది. మనం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, మేనిఫెస్టోలో చెప్పిన మేరకు అడుగులు ముందుకు వేసి బాధితులకు న్యాయం చేశాం. రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన కుటుంబాలు అన్నింటికీ ఆ మొత్తం తిరిగి ఇచ్చేసే కార్యక్రమాన్ని ఈరోజుతో పూర్తి చేస్తున్నాం. ఇలా దేశంలో ఎక్కడా జరగలేదు. గత ప్రభుత్వ మనుషుల కోసం జరిగిన స్కాం ► అగ్రిగోల్డ్ స్కాం అన్నది గత ప్రభుత్వం చేత, గత ప్రభుత్వం వల్ల, గత ప్రభుత్వంలో ఉన్న మనుషుల కోసం జరిగిన స్కాం అని తేలింది. గత ప్రభుత్వంలో ఉన్న వారే అగ్రిగోల్డ్ ఆస్తులను ఏవిధంగా కొట్టేయాలనుకున్నారో సాక్ష్యాధారాలు చూపిస్తూ గతంలో అసెంబ్లీలో చెప్పాం. ► అగ్రి గోల్డ్ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ గత ప్రభుత్వంలోని పెద్దలే. ఆ పెద్దలు ఎంత సేపూ అగ్రి గోల్డ్ ఆస్తులను ఎలా కొట్టేయాలనే ఆలోచించారు. ఈ మల్టీ స్టేట్ స్కాం అనేక రాష్ట్రాల్లో కోర్టుల పరిధిలో విచారణలో ఉంది. కాబట్టి, దీని వల్ల మన రాష్ట్రంలో ఎవరు.. ఎంత నష్టపోయారు? అన్నదాని మీదే ధ్యాస పెట్టాం. రూపాయి కూడా చెల్లించని గత ప్రభుత్వం ► గత ప్రభుత్వం అరకొర లెక్కల ద్వారా రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన బాధితుల సంఖ్యను 8.79 లక్షల మందిగా తేల్చింది. వీరికి రూ.785 కోట్లుగా చెల్లించాలని చెప్పింది. ప్రజలను మోసం చేస్తూ ఎన్నికలకు 2 నెలల ముందు.. 2019 ఫిబ్రవరి 7న జీవో నంబరు 31 జారీ చేసింది. కానీ రూపాయి కూడా చెల్లించలేదు. ► రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ ద్వారా అగ్రిగోల్డ్ వ్యవహారం కోర్టుల్లో ఒక కొలిక్కి రాగానే వారి భూముల్ని, ఆస్తులను అమ్మించి ప్రభుత్వానికి రావాల్సిన డబ్బును తీసుకుని, మిగిలిన డబ్బును డిపాజిట్ దారులకు చెల్లించే దిశగా న్యాయపరంగా వేగంగా అడుగులు వేస్తాం. ► మీ అందరి ఆశీస్సులు, దేవుడి దయ వల్ల మీ సోదరుడు ఈ పని చేయగలుగుతున్నాడు. మీ ఆశీస్సులు మనందరి ప్రభుత్వం మీద కలకాలం ఉండాలని కోరుకుంటున్నా. ► ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమం) పాముల పుష్పశ్రీవాణి, హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్ అండ్ బి మంత్రి ఎం శంకరనారాయణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, సీఐడీ అడిషనల్ డీజీపీ పీ వీ సునీల్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విశాఖ వన్‌టౌన్‌లో సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న అగ్రిగోల్డ్ బాధితులు అది శ్రమ జీవుల కష్టార్జితం ► రూపాయి.. రూపాయి దాచుకుని, కొద్దిగా ఎక్కువ వడ్డీ వస్తుందనే ఆశతో డిపాజిట్ చేసిన కష్టజీవుల సొమ్మే అగ్రిగోల్డ్ డబ్బు. ఇక్కడ డిపాజిట్ చేసింది లక్షలాది మంది కూలి పనులు చేసుకుంటున్న వారు, చిన్న చిన్న వృత్తుల వారు, తోపుడు బళ్లు, రిక్షా కార్మికులు. ఇలాంటి కష్టజీవులందరినీ కూడా గత ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పి మోసం చేసి, గాలికి వదిలేసింది. ► అలాంటి వారిని ఆదుకోవాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టిగా నిలదీశాం. వారికి న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తూ అధికారంలోకి రాగానే 2019 నవంబర్‌లో రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన 3.40 లక్షల మందికి కోర్టు ఆమోదించిన జాబితా మేరకు అప్పట్లో రూ.238.73 కోట్లు చెల్లించాం. ► ఆ సమయంలో అర్హత ఉండి కూడా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) జాబితాలో మిగిలిపోయిన మరో 3,86,275 మంది రూ.10 వేలు లోపు డిపాజిట్‌దారులకు ఇవాళ రూ.207.61 కోట్లు చెల్లింపులు చేస్తున్నాం. దీంతో పాటు రూ.10 వేల నుంచి రూ.20 వేల లోపు డిపాజిట్‌దారులు దాదాపు 3.14 లక్షల మందికి రూ.459.23 కోట్లు ఇస్తున్నాం. మొత్తంగా 10.40 లక్షల మందికి రూ.905.57 కోట్లు ఇచ్చాం. రాఖీ పండగ బహుమానం అన్నా.. నేను అగ్రి గోల్డ్‌లో నెలకు రూ.500 చొప్పున రూ.11,500 జమ చేశాను. కంపెనీ మూత పడటంతో చాలా బాధపడ్డాను. చంద్రబాబుకు చాలాసార్లు ఫిర్యాదు చేశాం. రోడ్లెక్కి ధర్నాలు చేశాం. కానీ సాయం చేయలేదు. మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు మా సమస్య చెప్పుకున్నాం. మీరు సీఎంగా అవగానే వలంటీర్ మా ఇంటికి వచ్చి అన్ని వివరాలు తీసుకున్నారు. ఇప్పుడు రెండో విడతలో మా డబ్బు మాకు అందింది. ఈ రాఖీ పండగకు మీరు మాకు ఇచ్చిన కానుకిది. –విశాలాక్షి, కర్నూలు -
ఎన్నికల ఖర్చులు అభ్యర్థుల ఖాతాలో జమ చేస్తాం
హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఖర్చుల వివరాలు నేటి నుంచి వారి ఖాతాల్లో జమ చేస్తామని కలెక్టర్ అమయ్‌కుమార్ తెలిపారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే టోల్‌ఫ్రీ నంబర్ 18004252838, 1950కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. సీ–విజిల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సాక్షి, హుజూర్నగర్: హుజూర్నగర్ ఉప ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థుల ఖర్చుల వివరాలు నేటి నుంచి వారి ఖాతాలలో జమ చేస్తామని కలెక్టర్ అమయ్‌కుమార్ అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు ప్రతి రోజూ జరిగిన ర్యాలీలను వీడియో తీయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో మొత్తం 14 ఫ్లయింగ్‌స్క్వాడ్ టీమ్స్, 14 స్టాటిక్ సర్వే చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని తెలిపారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో 2 వీడియో సర్వేలైన్ టీమ్‌లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.46 లక్షల 75 వేలను సీజ్ చేసినట్లు తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో భాగంగా ఎన్నికల సందర్భంగా టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే టోల్‌ఫ్రీ నంబర్ 18004252838, 1950కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. సి–విజిల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. 24 గంటల పాటు జిల్లా కలెక్టరేట్, హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన టీంలు ఫిర్యాదు సెంటర్లలో పనిచేస్తున్నారని తెలిపారు. -
అవార్డులు సరే.. ప్రోత్సాహక నగదేదీ ?
యడ్లపాడు(చిలకలూరిపేట): ప్రతిభా అవార్డు –2018 సంబంధించిన నగదు ప్రోత్సాహం ప్రభుత్వం ఇప్పట్లో ఇచ్చేలా లేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవార్డులు ప్రదానం చేసి నాలుగు నెలలైనా నేటికి వాటి తాలూకు ప్రభుత్వం ఇవ్వాల్సిన నగదు ప్రోత్సాహాకం మాత్రం ఇవ్వకపోవడంపై విద్యార్థుల కుటుంబాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 10 తరగతి నుంచి పీజీ వరకు వివిధ స్థాయిల్లో ఉత్తమ ప్రతిభ కనపర్చిన వారిని ప్రొత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం అందించే నగదు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రతిభావంతులైన ఒక్కొక్క విద్యార్థికి ప్రోత్సాహకంగా రూ.20 వేలు చొప్పున ఇస్తామని ప్రకటించి నాలుగు నెలలు గడిచినా నేటికీ అందివ్వలేదు. జాప్యం లేకుండా చూడాల్సిన విద్యాశాఖ మాత్రం ఇంకా విద్యార్థుల బ్యాంక్ ఖాతా నంబర్ల వెతుకులాట పనిలోనే ఉండటం గమనార్హం. దీంతో రాష్ట్రంలో 7010 మంది ప్రతిభవంతులకు పురస్కారం కింద లభించాల్సిన నగదు రూ.14.20 కోట్లు వారి ఖాతాల్లో జమకాలేదు. వాటితో పాటు విద్యార్థి, వారి తల్లిదండ్రులకు చెల్లించాల్సిన టీఏ, డీఏలు కూడా దక్కకపోవడంతో విద్యార్థుల కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. భారత మాజీ ప్రధాని ఏపీజే అబ్ధుల్ కలాం జయంతి రోజునే వీటిని ఇవ్వాల్సి ఉన్నా పాలకులు, అధికారుల అలసత్వంతో నగదు వీరికి చేరడం లేదు. రాష్ట్రంలో ప్రతిభావంతులు వీరే.. ప్రతిభా అవార్డు –2018 కింద రాష్ట్ర వ్యాపితంగా ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశా>లలకు చెందిన 7,010 మంది విద్యార్థులను పాఠశాల విద్యశాఖ ఎంపిక చేసింది. పదో తరగతిలో 3,985 మంది, ఇంటర్లో 745 మంది, టెక్నికల్ విభాగంలో 430 మంది, డిగ్రీ, పీజీలో 311, యూనివర్సిటీలో 1,285 మందిని వివిధ కేటగిరిల కింద ఎంపికయ్యారు. వీరిలో బాలికలు 4,385 మంది, బాలురు 2,374 మంది ఉన్నారు. జిల్లాల వారీగా... అవార్డులు తీసుకున్న వారిలో శ్రీకాకుళం జిల్లా 356, విజయనగరం – 309, విశాఖపట్నం –486, తూర్పుగోదావరి –771, పశ్చిమగోదావరి –402, కృష్ణా –492, గుంటూరు –607, ప్రకాశం –448, నెల్లూరు –455, చిత్తూరు –682, వైఎస్సార్ కడప 495, అనంతపురం –756, కర్నూల్ – 501 మంది విద్యార్థులు ఉన్నారు. వీరితో పాటు స్పోర్ట్ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 248 మందికి అవార్డులు లభించాయి. గతేడాది అక్టోబర్‌లో అవార్డుల ప్రదానం.. ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ, పాఠశాల విద్యాశాఖ, సర్వశిక్షా అభియాన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ అవార్డుల ప్రదానోత్సవం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సౌత్ బైపాస్ వెనుక ఉన్న మిని స్టేడియంలో అబ్దుల్‌కలాం జయంతిని పురస్కరించుకుని గతేడాది అక్టోబర్ 15వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవార్డులు అందజేశారు. అవార్డు పొందిన విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్, గోల్డ్‌కోటెడ్ కాపర్ మెడల్, ట్యాబ్‌లను పంపిణీ చేశారు. రూ.20 వేల నగదు ప్రోత్సాహం, టీఏ, డీఏలను చెల్లించకపోవడంతో అంతా నిరాశచెందుతున్నారు. ఇప్పటికైనా నగదు ప్రోత్సాహాన్ని, టీఏ, డీఏలను త్వరితగతిన తమ ఖాతాలలో వేయాలంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. నగదు జమ కావాలి ప్రతిభా అవార్డు సెలక్షన్ లిస్ట్ వచ్చిన వెంటనే విద్యార్థుల బ్యాంక్ ఖాతా నంబర్లను ఆ రోజే ఇచ్చేశాం. ఒక్కొక్కరి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేశారు. ప్రస్తుతం 2 వేల మందికి నగదు జమ కావాల్సి ఉంది. –ఆర్ఎస్ గంగాభవాని,జిల్లా విద్యాశాఖాధికారి -
అంత డబ్బు డిపాజిట్‌పై రిటర్న్‌లు వేయలేదేం!
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్యాంక్ అకౌంట్లలో భారీ డిపాజిట్లు, ఇందుకు సంబంధించి సకాలంలో ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయడంలో వైఫల్యం వంటి అంశాలపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి సారించింది. రూ.25 లక్షలు పైబడి డిపాజిట్ చేసిన ఈ తరహా 1.16 లక్షల వ్యక్తులు, సంస్థలకు నోటీసులు జారీ చేసింది. సీబీడీటీ (ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్) చైర్మన్ సుశీల్ చంద్ర ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ► పెద్ద నోట్ల తర్వాత భారీ ఎత్తున నగదు డిపాజిట్ చేసి, ఐటీ రిటర్స్లు దాఖలు చేసిన వారి అకౌంట్లను కూడా క్షుణ్ణంగా పరిశీలించి, తగిన సమాధానాలు రాబడుతున్నాం. ► తమ బ్యాంక్ ఖాతాల్లో రూ.2.5 లక్షల పైన రద్దయిన రూ.500, రూ. 1000 డిపాజిట్లు చేసిన దాదాపు 18 లక్షల వ్యక్తులు, కంపెనీలకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ► వీరిలో కూడా ఐటీ రిటర్స్లు దాఖలు చేయని వ్యక్తులు, కంపెనీలను రెండుగా విభజించింది. ఇందులో ఒక విభాగం రూ.25లక్షలకు పైగా డిపాజిట్ చేసిన వర్గం. మరో వర్గం రూ.10 నుంచి 25 లక్షల వరకూ డిపాజిట్ చేసిన వర్గం. ► రూ.25 లక్షల పైబడి డిపాజిట్‌చేసి, రిటర్న్‌లు దాఖలు చేయని వారు 1.16 లక్షలు. వీరందరినీ 30 రోజుల్లోపు రిటర్నులు వేయాలని ఆదేశించాం. -
పెళ్లి పేరుతో దగా
►యూకేలో డాక్టర్‌నంటూ యువతికి రూ.14 లక్షల టోకరా ►పరారీలో ప్రధాన నిందితుడు ►డబ్బులు డిపాజిట్ అయిన బ్యాంక్ ఖాతాదారుడు ►ఢిల్లీకి చెందిన రషీద్‌ఖాన్ అరెస్టు సిటీబ్యూరో: ‘యూకేలో డాక్టర్‌ను. నెలకు లక్షల్లో జీతం వస్తుందని.. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌తో రాచకొండకు చెందిన ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్‌తో పరిచయం పెంచుకుని, వాట్సాప్ ద్వారా చాటింగ్‌తో మరింత దగ్గరై నమ్మకం కుదిరాక వీసా చార్జీలకు ఇండియా కరెన్సీని ఏజెంట్‌కు ఇవ్వాలంటూ యూకే పౌండ్ల పార్శిల్‌తో రూ.14 లక్షల వరకు కుచ్చుటోపీ పెట్టాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన నైజీరియాకు చెందిన వ్యక్తి పరారీలో ఉండగా, అతడికి బ్యాంక్ ఖాతాల విషయంలో సహకరించిన ఢిల్లీకి చెందిన రషీద్ ఖాన్‌ను రాచకొండ పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేసి ట్రాన్సిట్ వారంట్‌పై నగరానికి మంగళవారం తీసుకొచ్చారు. పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ కథనం ప్రకారం...గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న యువతి పెళ్లి సంబంధాల కోసం వివిధ మ్యాట్రిమోని వెబ్సైట్లలో రిజిస్టర్ చేసుకుంది. ఫిబ్రవరి 7న డాక్టర్ సుమంత్ భరత్ పేరుతో ఆమె భారత మ్యాట్రిమోనీ ఖాతాకు ఓ మెసేజ్ వచ్చింది. తమ పూర్వీకులు భారతదేశానికి చెందినవారని, తాను యూకేలో పుట్టిపెరిగానని, డాక్టర్‌గా పనిచేస్తానని నెలకు లక్షల్లో జీతం ఉంటుందని, పెళ్లికి అంగీకరిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకుంటానని నమ్మించాడు. అతడి ప్రొఫైల్ చూసి ఆమె పెళ్లికి అంగీకరించింది. ఏప్రిల్ తొలివారంలో అతను, తన సోదరి, ఆమె ఐదేళ్ల కుమారుడు ఇండియాకు వస్తున్నామని చెప్పాడు. వీసా చార్జీలకు ఇండియా కరెన్సీని ఏజెంట్‌కు పంపించాలని, ఆ తర్వాత ఒక మిలియన్ పౌండ్లను పంపిస్తానని నమ్మించాడు. కాబోయే భర్త ఇండియాకు వస్తున్నాడన్న ఆనందంలో కొంత డబ్బును ఏజెంట్ ఖాతాలో జమచేశారు. రెండు రోజుల తర్వాత ఢిల్లీ ఎయిర్ కస్టమ్స్ అధికారినంటూ ...‘మేడం మీ పేరు మీద ఒక పార్సిల్ వచ్చింది. అందులో యూకే పౌండ్లు ఉన్నాయి. అది మీ దగ్గరికి రావాలంటే యాంటీ టెర్రరిజం సర్టిఫికెట్, కస్టమ్స్ క్లియరెన్స్ చార్జీలు చెల్లించాలం’టూ అడిగాడు. ఆమెను నమ్మించడానికి యూకే పౌండ్లు ఉన్న పార్శిల్ ఫొటోలను వాట్సాప్‌లో షేర్ చేశాడు. నిజమేనని నమ్మిన బాధితురాలు ఏ మాత్రం ఆలోచించకుండా రూ.14 లక్షలు వారు సూచించిన ఖాతాలో డిపాజిట్ చేసింది. అయితే రోజులు గడుస్తున్నా యూకే పౌండ్ల పార్శిల్ రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఢిల్లీ కేంద్రంగా మోసం జరిగినట్లు గుర్తించారు. ఇండియాలోని ఓ మధ్యవర్తి ద్వారా ఒక నైజీరియన్ ఈ మోసం చేసినట్లు గుర్తించారు. బాధితురాలు 11 బ్యాంక్ ఖాతాల్లో జమచేసిన రూ.14 లక్షల్లో పది శాతం కమిషన్‌ను ఆయా బ్యాంక్ ఖాతాదారులకు నిందితుడు ఇచ్చాడు. ఈ ఖాతాదారుల్లో ఒకడైన ఢిల్లీకి చెందిన రషీద్ ఖాన్ అలియాస్ ఇమ్రాన్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు నైజీరియన్‌ను, అతడికి సహకరించిన మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.