Cancel notes
-
నోట్ల రద్దుపై ఆర్బీఐ అభ్యంతరాలు
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనం, నకిలీ నోట్లను అరికట్టొచ్చన్న కేంద్ర ప్రభుత్వ వాదనపై ఆర్బీఐ అభ్యంతరం వ్యక్తం చేసిందని కాంగ్రెస్ పేర్కొంది. పెద్ద నోట్ల రద్దును ప్రకటించడానికి ముందు అంటే 2016 నవంబర్ 8న సాయంత్రం 5.30 నిమిషాలకు ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశానికి సంబంధించిన (మినిట్స్) వివరాలను సోమవారం కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ మీడియాకు విడుదల చేశారు. ‘నల్లధనం చాలా వరకు కరెన్సీ రూపంలో లేదు. రియల్ రంగంలోని ఆస్తులు, బంగారం రూపంలో ఉన్నాయి. నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు’అని ఆర్బీఐ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో పేర్కొన్నట్లు రమేశ్ తెలిపారు. ‘ఆర్థిక వ్యవస్థలో పెరుగుదల మాత్రమే అసలైన పెరుగుదల. అంతేకానీ చెలామణి అవుతున్న కరెన్సీ పెరుగుదల ఆర్థిక వ్యవస్థపై అంతగా ప్రభావం చూపదు. నల్ల ధనం తగ్గుతుందన్న వాదన నోట్ల రద్దు నిర్ణయాన్ని పెద్దగా సమర్థించదు’అని ఆర్బీఐ వ్యాఖ్యలను ఉటంకించారు. దేశంలో చెలామణీ అవుతున్న మొత్తం కరెన్సీలో నకిలీ నోట్లు కేవలం రూ.400 కోట్లు ఉంటుందని, అది చాలా తక్కువ ప్రాముఖ్యం ఉన్న విషయమని ఆర్బీఐ తెలిపినట్లు చెప్పారు. -
అంత డబ్బు డిపాజిట్‌పై రిటర్న్‌లు వేయలేదేం!
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్యాంక్ అకౌంట్లలో భారీ డిపాజిట్లు, ఇందుకు సంబంధించి సకాలంలో ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయడంలో వైఫల్యం వంటి అంశాలపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి సారించింది. రూ.25 లక్షలు పైబడి డిపాజిట్ చేసిన ఈ తరహా 1.16 లక్షల వ్యక్తులు, సంస్థలకు నోటీసులు జారీ చేసింది. సీబీడీటీ (ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్) చైర్మన్ సుశీల్ చంద్ర ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ► పెద్ద నోట్ల తర్వాత భారీ ఎత్తున నగదు డిపాజిట్ చేసి, ఐటీ రిటర్స్లు దాఖలు చేసిన వారి అకౌంట్లను కూడా క్షుణ్ణంగా పరిశీలించి, తగిన సమాధానాలు రాబడుతున్నాం. ► తమ బ్యాంక్ ఖాతాల్లో రూ.2.5 లక్షల పైన రద్దయిన రూ.500, రూ. 1000 డిపాజిట్లు చేసిన దాదాపు 18 లక్షల వ్యక్తులు, కంపెనీలకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ► వీరిలో కూడా ఐటీ రిటర్స్లు దాఖలు చేయని వ్యక్తులు, కంపెనీలను రెండుగా విభజించింది. ఇందులో ఒక విభాగం రూ.25లక్షలకు పైగా డిపాజిట్ చేసిన వర్గం. మరో వర్గం రూ.10 నుంచి 25 లక్షల వరకూ డిపాజిట్ చేసిన వర్గం. ► రూ.25 లక్షల పైబడి డిపాజిట్‌చేసి, రిటర్న్‌లు దాఖలు చేయని వారు 1.16 లక్షలు. వీరందరినీ 30 రోజుల్లోపు రిటర్నులు వేయాలని ఆదేశించాం. -
ఐటీ రిటర్నుల్లో 25% వృద్ధి
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) పరిణామాల అనంతరం ఆదాయ పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2016–17 సంవత్సరానికి గాను 2.82 కోట్ల రిటర్నులు వచ్చినట్లు ఆదాయ పన్ను విభాగం తెలిపింది. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో దాఖలైన 2.22 కోట్ల ఐటీఆర్‌లతో పోలిస్తే 25.3 శాతం అధికమని వివరించింది. ఆగస్టు 5 దాకా మొత్తం 2.82 కోట్ల రిటర్నులు దాఖలైనట్లు ఆదాయ పన్ను విభాగం పేర్కొంది. వాస్తవానికి ఐటీఆర్‌ల దాఖలుకు జూలై 31 ఆఖరు తేదీ అయినప్పటికీ.. కొన్ని వర్గాల కోసం ఆగస్టు 5 దాకా ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. కొత్తగా మరింత మందిని పన్ను పరిధిలోకి తేగలిగినట్లు తాజా గణాం కాలు సూచిస్తున్నాయని ఆదాయ పన్ను విభాగం పేర్కొంది. వ్యక్తిగత ఆదాయ పన్ను ను సంబంధించి (కార్పొరేట్ ట్యాక్స్ కాకుం డా) అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు ఆగస్టు 5 నా టికి 41.79 శాతం వృద్ధి నమోదు చేశాయి. -
ప్రతికూలంలో అమ్మకాలెలా?
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో ప్రస్తుతం మార్కెట్లో ప్రతికూల వాతావరణం నెలకొంది. ఇలాంటి సమయంలో అధిక ధర రావటం కొంచెం కష్టమే. అయితే కొంచెం ప్రణాళిక, మరికొంత నేర్పు ఉంటే సులువగానే విక్రయించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ⇒ మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నప్పుటికీ కొన్ని అంశాలు స్థిరాస్తి ధరలను ప్రభావితం చేస్తుంటాయి. ఒకవేళ అవి ప్రతికూలంగా ఉన్నా.. వాటిని మెరుగుపరచడానికి, మార్చడానికి అవకాశం ఉండదు. ఉదాహరణకు స్థిరాసిత ఏ ప్రాంతంలో ఉంది? ఇరుగుపొరుగు ఎవరుంటారు? వంటి విషయాలన్నమాట. ఒకవేళ స్థిరాస్తి మంచి ప్రాంతంలో ఉంటే అమ్మకందారులు మంచి ధర పొందుతారు. ఇందుకు భిన్నంగా ఉంటే విక్రయానికి అనువైన పరిస్థితుల కోసం కసరత్తు చేయాల్సి ఉంటుంది. సరైన ధర చెప్పడం, ఆస్తికి సంబంధించిన పత్రాలన్నింటినీ పక్కాగా ఉంచుకోవటం, సరైన సమయంలో, సరైన కొనుగోలుదారున్ని పట్టుకోవటం వంటివన్నమాట. ⇒ ఇంటి ధరను ప్రధానంగా స్థిరాస్తి ఉన్న ప్రాంతం, దాని నిర్మాణ ఖర్చులు, స్థలం ధర నిర్ణయిస్తాయి. అయితే పూర్తిగా ఈ అంశాలే ధరను నిర్ణయిచవు. మార్కెట్ సెంటిమెంట్ కూడా భాగస్వామే. గిరాకీ, సరఫరాలు కూడా కొంతమేర ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి స్థిరాస్తిని అమ్మాలనుకున్నప్పుడు ముందుగా మార్కెట్ పరిస్థితుల్ని అధ్యయనం చేయాలి. ధరల పోకడ ఎలా ఉంది? ఆ ప్రాంతంలో సగటు ధర ఎంత? వంటి విషయాలపై దృష్టిపెట్టాలి. ⇒ విక్రయించాలనుకున్న స్థిరాస్తికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను కొనుగోలుదారుడికి స్పష్టంగా వివరించాలి. అతనికేమైనా సందేహాలుంటే ఓపిగ్గా నివృత్తి చేయాలి. యాజమాన్య హక్కుల విషయంలో ఎలాంటి వివాదాలు లేవని తేలాకే కొనుగోలుదారులు ముందడుగు వేస్తాడని గుర్తుంచుకోండి. -
రీమోనిటైజేషన్ పూర్తయ్యింది..
నోట్ల రద్దు అనంతర పరిస్థితిపై అరుణ్‌జైట్లీ రాంచీ: పెద్ద నోట్ల అనంతరం నెలకొన్ని ద్రవ్య కొరత సమస్య దాదాపు తొలగిపోయిందనీ, రీమోనిటైజేషన్ (నగదును అందుబాటులోకి తీసుకురావడం) ప్రక్రియ దాదాపు పూర్తయ్యిందనీ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ గురువారం పేర్కొన్నారు. రోజూవారీ నగదు సరఫరా పరిస్థితిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జాగ్రత్తగా పరిశీలిస్తోందని కూడా జైట్లీ వివరించారు. నల్లధనం నిరోధం, తీవ్రవాదులకు నిధులు అందకుండా చేయడం, నగదు లావాదేవీల డిజిటలైజేషన్ వంటి లక్ష్యాలను ఉద్దేశించి నవంబర్ 8న ప్రధాని నరేంద్రమోదీ రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనితో నగదు లభ్యత సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. జార్ఖండ్‌లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో పాల్గొన్న ఆర్థికమంత్రి ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన అంశాల్లో ముఖ్యమైనవి... ⇔ నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థతో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. నేరాలు పెరగడానికి, పన్నులు ఎగవేయడానికి నగదు ఆధారిత వ్యవస్థ దోహదపడుతుందనీ విశ్లేషించారు. ⇔ దేశంలో ప్రస్తుత వాణిజ్య, వ్యాపార విధానాలు మారాలని ఆయా అంశాలు మరింత సరళతరం కావాల్సి ఉందని విశ్లేషించారు. ⇔ నోట్ల రద్దు అనంతరం బ్యాంకులకు ఆయా నోట్ల డిపాజిట్లు ఎంత మొత్తంలో జరిగాయన్న ప్రశ్నకు ఆర్థికమంత్రి సమాధానం చెబుతూ, ‘‘కరెన్సీ లెక్కింపు ప్రక్రియ ఆసాంతం పూర్తయిన తర్వాతే సంబంధిత డిపాజిట్ల మొత్తాన్ని వెల్లడించడం జరుగుతుంది’’ అని ఇటీవలే ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. నోట్ల రద్దుతో వృద్ధి పెరుగుతుంది: ఆర్థికశాఖ ఇదిలావుండగా, పెద్ద నోట్ల రద్దుతో ఆర్థికవృద్ధి మరింత పెరుగుతుందని ఆర్థికశాఖ సహాయమంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ న్యూఢిల్లీలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో 23 శాతం ‘‘షాడో ఎనాకమీ’గా ఉందని, పేర్కొన్న ఆయన, నోట్ల రద్దు, డిజిటలైజేషన్ చొరవల వల్ల ఇక ముందు పన్ను చెల్లింపుల పరిధి మరింత విస్తరిస్తుందని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో నగదు నిష్పత్తి 4 శాతం ఉంటే, భారత్‌లో ఏకంగా 12 శాతంగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ప్రధాని మోదీ నవంబర్ 8 పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చొరవతో ప్రజలు డిజిటల్ ఆర్థిక లావాదేవీలవైపు అడుగులు వేస్తున్నారని అన్నారు. -
‘క్యాష్‌లెస్’కు ఊతం
►ఎస్‌హెచ్‌జీ మహిళలకు స్మార్ట్ ఫోన్లు ►కొనుగోలుకు స్త్రీనిధి ద్వారా రూ.6 వేల రుణం ►24 వాయిదాల్లో చెల్లించేందుకు నిర్ణయం ►నగదు రహిత లావాదేవీలు పెంచేందుకు ప్రభుత్వ ప్రయత్నం ►రూరల్ జిల్లాలో 1.62 లక్షల మందికి లబ్ధి వరంగల్ రూరల్ (వెల్ఫేర్) : కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత దేశ వ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు పెంచేందుకు అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్టీసీ బస్సులు, బస్టాండ్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అయితే క్యాష్‌లెస్ లావాదేవీలను పెంచేందుకు తాజాగా మరో అడుగు ముందుకు పడుతోంది. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)ల్లోని మహిళల వద్ద స్మార్ట్ఫోన్లు ఉంటే నగదు రహిత లావాదేవీలు ఊపందుకుంటాయని భావించి వారికి అవగాహన కల్పించాలని అధికారులు నిర్ణయించారు. కాగా, సంఘాల్లోని మహిళలకు ఫోన్లు కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత లేదని గుర్తించి.. స్త్రీనిధి బ్యాంకు ద్వారా రుణం ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నారు. దీంతో రూరల్ జిల్లాలో 1.62 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. రూ.6 వేలు.. 24 వాయిదాలు మహిళా సంఘాల్లోని సభ్యులు ఒక్కొక్కరు సెల్‌ఫోన్ కొనుగోలు చేసేందుకు రూ.6 వేల చొప్పున స్త్రీ నిధి బ్యాంకు ద్వారా రుణం అంజేయనున్నారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ కమిటీ సమావేశంలో అధికారులు నిర్ణయించారు. ఇలా రుణంగా అందే నగదుతో మహిళలు ఏ కంపెనీ ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్ అయినా కొనుగోలు చేసుకోవచ్చు. అనంతరం 24 వాయిదాల్లో రూ.275 చొప్పున ఈ నగదును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒక్కో మహిళ తీసుకున్న రూ.6 వేలకు రూ.6,600 చెల్లించాల్సి వస్తుంది. ఇది పెద్దగా భారమేం కాదు కనుక మహిళలంతా స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేస్తారని, తద్వారా నగదు రహిత లావాదేవీలు పెరుగుతాయనేది ప్రభుత్వ భావిస్తోంది. కాగా, అందరూ రుణం తీసుకోవాలనే నిబంధన విధించకపోవడంతో ఆసక్తి ఉన్న వారే రుణం తీసుకోవడంతో పాటు స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. స్త్రీ ‘నిధి’ సాయం.. స్త్రీనిధి బ్యాంకు ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు చేయూతనిచ్చేందుకు అనేక పథకాలు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం మహిళా సంఘాలకు రూ.71.54 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉంది. అయితే, ఇందులో ఇప్పటివరకు రూ.30 కోట్ల మేరకు అందజేశారు. దీంతో మిగిలిన రూ.41 కోట్లను వచ్చే నెల ముగిసేలోగా అందజేయాలని అధికారులు భావిస్తున్నారు. అన్ని గ్రామాల్లో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి. ఇందులో భాగం గా మరుగుదొడ్డి నిర్మాణానికి అయ్యే ఖర్చులో రూ.12 వేలను స్త్రీనిధి ద్వారా రుణంగా ఇస్తారు. ఈ రుణాన్ని తిరిగి 12 నెలల్లో వడ్డీతో సహా చెల్లించాల్సి ఉం టుంది. ఒకవేళ ఆలోగా నిర్మాణ బిల్లు ప్రభుత్వం నుంచి ఇస్తే ఆ వెంటనే చెల్లించాలనే నిబంధన విధించారు. -
టు కె రన్
మొబైల్ గేమ్ ఇటీవల భారత ప్రభుత్వం నోట్లు రద్దు చేసిన అంశాన్ని ఆధారంగా చేసుకుని ‘మిస్ ప్లేస్డ్ మైండ్స్’ సంస్థ ఒక మొబైల్ గేమ్ రూపొందించింది. ఆండ్రాయిడ్‌లో వచ్చిన ఈ గేమ్ పేరు ‘టు కె రన్’. కరెంట్ టాపిక్‌ని ఆధారంగా మన దేశంలో ఒక గేమ్ మార్కెట్లోకి రావడం ఇదే ప్రథమం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ క్యారికేచర్లతో యానిమేషన్ చేసి రూపొందిన ఈ గేమ్‌ను జనవరి మొదటి వారంలో మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ గేమ్‌లో... ఎన్నికల గుర్తుతో నోట్లను కొల్లగొడుతున్న అరవింద్ కేజ్రీవాల్‌ను అదుపు చేస్తున్న కానిస్టేబుల్‌గా మోడీ లాఠీతో కనిపిస్తారు. ఈ గేమ్ ఆడేందుకు తేలిగ్గా ఉంది. చూడటానికి ఆసక్తికరంగా ఉంది. సూర్యప్రకాశ్ (విజయవాడ), చంద్రధర్, సాయి తేజ, మోహనవంశీ, శిఖాశర్మ (హైదరాబాద్) ఈ గేమ్ రూపకర్తలు. గూగుల్ ప్లే నుంచి దీనిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
భారీ పన్ను వసూళ్లు..!
నోట్ల రద్దు ప్రభావం లేదని చెబుతున్నాయ్ • ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ విశ్లేషణ • వృద్ధి వేగం తగ్గుతుందన్నది అపోహేనన్న అభిప్రాయం న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధిపై రూ.500, రూ.1,000 నోట రద్దు ప్రభావం ఎంతమాత్రం లేదని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం మరోసారి విశ్లేషించారు. డిసెంబర్లో పరోక్ష పన్ను వసూళ్లలో భారీగా 14.2% (రూ.76 వేల కోట్లు) వృద్ధి నమోదయ్యిందని ఆయన పేర్కొంటూ, తయారీ రంగం పురోభివృద్ధి, తద్వారా ఎక్సైజ్ సుంకాల మెరుగుదలను ఈ చక్కటి వసూళ్లు సూచిస్తున్నట్లు తెలిపారు. ఆర్థికమంత్రి వెల్లడించిన అంశాల్లో ముఖ్యమైనవి... ⇔ డిసెంబర్లో పరోక్ష పన్నుల వసూళ్లను వేర్వేరుగా చూస్తే... ఎక్సైజ్ వసూళ్లు 31.6% (రూ.36,000 కోట్లు) పెరిగాయి. సేవల పన్ను వసూళ్లలో వృద్ధి 12.4%(రూ.23,000 కోట్లు). అయితే కస్టమ్స్‌లో మాత్రం అసలు వృద్ధిలేకపోగా 6.3% క్షీణించింది. పసిడి దిగుమతులు పడిపోవడమే దీనికి కారణం. ⇔ ఏప్రిల్–డిసెంబర్ కాలంలో చూస్తే... పరోక్ష పన్ను వసూళ్లు 25% వృద్ధితో రూ.6.30 లక్షల కోట్లకు చేరాయి. బడ్జెట్ అంచనాల్లో ఇది 81%. ప్రత్యక్ష పన్ను వసూళ్లు 12.01 శాతం ఎగసి, రూ.5.53 లక్షల కోట్లు. బడ్జెట్ అంచనాలో ఇది 65 శాతం. ⇔ డీమోనిటైజేషన్ అనంతరం ఉపాధి అవకాశాలు తగ్గాయన్న వార్తలు అన్నీ వాస్తవ ప్రాతిపదికతో కూడినవి కావు. వృద్ధి అంకెలు... ఇలాంటి ఊహాజనిత ప్రాతిపదికలను సమర్థించడం లేదు. పన్నులు, ఆయా గణాంకాలే వాస్తవం. ⇔ ఇక చాలా రాష్ట్రాల్లో వ్యాట్ వసూళ్లు నవంబర్‌లో కూడా పెరిగాయి. ⇔ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంకెలు, పన్ను వసూళ్ల అంకెలకు పొంతన కుదరడం లేదనడం సరికాదు. జీడీపీపై ఇప్పుడు వచ్చింది ముందస్తు అంచనాలు మాత్రమే. తుది గణాంకాలపై మాత్రమే మనం స్పందించాల్సి ఉంటుంది. -
తుగ్లక్‌ను గుర్తుకుతెచ్చిన మోదీ నిర్ణయం
వరంగల్ : దేశంలో రైతులు, చిన్న వ్యాపారస్తులు, మధ్యతరగతి, పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులకు చూస్తుంటే పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధాన మంత్రి మోదీ నిర్ణయం తుగ్లక్‌ను గుర్తుకు తెచ్చిందని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రీజినల్ కోఆర్డినేటర్ పీసీ.విష్ణునాథ్ అన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు వరంగల్‌లో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం పెద్ద నోట్ల రద్దుపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో, విదేశాల్లో ఉన్న నల్లధనం తెచ్చేందుకు పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని మోదీ ప్రకటించారన్నారు. నోట్ల రద్దుతో 50రోజుల పాటు ఇబ్బందులు ఉంటాయని, అనంతరం ఉంటే తనను ఉరితీయాలని మోదీ ప్రకటన చేశారని, ప్రస్తుతం ఇంకా ఇబ్బందులు కొనసాగుతున్నందున ఏం చేయాలో ఆ పార్టీ నేతలు చెప్పాలన్నారు. నోట్ల రద్దు వల్ల పాత రూ.500, రూ.1000 నోట్లు ఎన్ని కోట్లు వచ్చాయో చెప్పాలని పీఎం మోదీని ప్రశ్నిస్తే నోరు మెదపడం లేదన్నారు. ఈ విషయంపై ఆర్బీఐని ప్రశ్నించినా వారి వద్ద నుంచి కూడా ఎలాంటి సమాచారమూ రావడం లేదని విష్ణునాథ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దుతో అతి పెద్ద కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు. పీఎం మోదీ తీసుకున్న నిర్ణయంతో దేశానికి నష్టం జరుగుతున్న విషయాలను గుర్తించి ఆ పార్టీ నేతలు ఇప్పుడు తప్పుడు నిర్ణయం అని బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పెద్ద నోట్ల రద్దుకు కొన్ని రోజుల ముందు బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంస్థలు దేశ వ్యాప్తంగా వందల కోట్ల రూపాయలతో ఆస్తులను కొనుగోలు చేశాయన్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు బీహార్‌లో 8, ఒడిషాలో 14 ఆస్తులను రూ.3.41కోట్లకు కొనుగోళ్లు చేసిన విషయాన్ని కాంగ్రెస్ బహిర్గతం చేసిందన్నా రు. మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రధాని మోదీ ఏకపక్షంగా తీసుకోవడంతోనే ఆర్థిక ఇబ్బందులు నెలకొన్నాయన్నారు. దేశంలో ప్రజాప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకునే ముందు లోక్‌సభ, రాజ్యసభల్లో చర్చించి తీసుకుంటారని, అలా కాకుండా ఏకపక్షంగా తీసుకున్నారని ఆరోపించారు. ఈ సభలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, డీసీసీబీ చైర్మన్జంగా రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గుండెబోయిన విజయరామారావు, గండ్ర వెంకటరమణారెడ్డి, ఆరెపల్లి మోహన్, కొండేటి శ్రీధర్, పొదెం వీరయ్య, ఆరోగ్యం, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, గ్రేటర్ నాయకులు కట్ల శ్రీనివాస్‌రావు, రాజనాల శ్రీహరి, టీపీసీసీ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు. సమావేశ అనంతరం వరంగల్ అర్బన్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసేందుకు కాంగ్రెస్ నాయకులు ర్యాలీగా వెళ్తుండగా పోలీ సులు అడ్డుకొని అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. -
రూ. 650 కోట్లు డిపాజిట్
పదుల సంఖ్యలో మూతపడిన ఏటీఎంలు కొన్నింటిలోనే రూ.500 కొత్త నోట్లు వరంగల్ : కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసిన కారణంగా వాటి చెలామణి లేకపోవడంతో బ్యాంకుల్లో సుమారు రూ.650కోట్లకు పైగా పెద్ద నోట్లు డిపాజిట్ అయినట్లు బ్యాంకు అధికారులు తెలుపుతున్నారు. నోట్ల రద్దుతో 50రోజుల పాటు ఇబ్బందులు ఉంటాయని, కొత్త సంవత్సరం మొదటి తేది నుంచి లావాదేవీల్లో ఇబ్బందులు తొలగిపోతాయని ప్రధాన మంత్రి మోదీ ప్రకటించినా నోట్ల కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే బ్యాంకు అధికారులు ఏటీఎంలను పునరుద్ధరించే పనిలో పడ్డారు. అర్బన్ జిల్లా కేంద్రంలో ఎస్బీఐ, ఎస్బీహెచ్, అంధ్రా బ్యాంకులతో పాటు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ లాంటి ప్రైవేట్ బ్యాంకుల్లో ఎక్కువ మొత్తాల్లో నోట్లు డిపాజిట్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పెద్ద వ్యాపారులు మొదటి వారం రోజుల్లోనే ఎక్కవ మొత్తాల్లో డిపాజిట్ చేసి అందుకు ప్రత్యామ్నాయంగా కొత్త నోట్లను సమకూర్చుకున్నట్లు తెలిసింది. కొంత మంది ఇక్కడ డిపాజిట్లు చేయకుండా హైదరాబాద్, విజయవాడ లాంటి పెద్ద నగరాలకు తమకు వ్యాపార లావాదేవిల్లో భాగస్వాములతో నోట్ల మార్పిడి చేసుకున్నట్లు సమాచారం. వరంగల్ అర్బన్ జిల్లాలో వివిధ బ్యాంకులకు చెందిన 196 శాఖలు ఉండగా 215 ఏటీఎంలు ఉన్నాయి. ఇందులో 18,50,774 మంది వినియోగదారులు ఖాతాలు కలిగి ఉన్నారు. 86 ఏటీఎంలలో డబ్బులు పెట్టకుండా మూసివేసినట్లు బ్యాంకుల అధికారులు తెలిపారు. ఇవి నవంబర్ 8వ తేదీ నుంచి ఇప్పటి వరకు పనిచేయడం లేదు. మూసిన షెట్టర్లు తెరవలేదు. కొన్ని ఏటీఎంలు అడపదడపా డబ్బులు ఉన్నప్పుడే పనిచేస్తున్నాయి. డబ్బులు లోడ్ చేసిన రెండు, మూడు గంటలు పనిచేస్తున్నాయి. అనంతరం మళ్లీ మరుసటి రోజు వచ్చి లోడ్ చేస్తే తప్పా పనిచేయని స్థితిలో ఉన్నాయి. బ్యాంకులు ఉన్న చోట ఏర్పాటు చేసిన ఏటీఎంలు మాత్రమే నిరంతరం పనిచేస్తున్నాయి. జనవరి 1వ తేది నుంచి పలు ఏటీఎంల్లో కొత్త రూ.500నోట్లు లభ్యమవుతున్నాయి. బ్యాంకుల వద్ద ఉన్న ఏటీఎంలో వినియోగదారులకు ఒక్క లావాదేవికి రూ.4500 వరకు ఏటీఎంల్లో డ్రా చేసుకునే వెసలుబాటు కలిగింది. -
చితికిన చిరుజీవి
ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి పేరు: కె.నాగశివ, వ్యాపారం: కొబ్బరి బోండాల విక్రయం ఏరియా: వనస్థలిపురం ►నోట్ల రద్దుకు ముందు: రోజుకు రూ.3 వేల విక్రయాలు ►ఆదాయం: రోజుకు రూ.400 చొప్పున నెలకు రూ.12 వేలు ►నోట్ల రద్దు తర్వాత: రోజుకు రూ.500 విక్రయాలు ►ఆదాయం: రోజుకు రూ.80 చొప్పున నెలకు రూ.2400 ► నెలవారీ ఖర్చులు: ఇంటిఅద్దె రూ.3 వేలు, పిల్లల ఫీజులు రూ.2 వేలు, నిత్యావసరాలు: రూ.3 వేలు మొత్తం: 8000 అవస్థలివీ.. ఫైనాన్షియర్ నుంచి తీసుకున్న రూ.50 వేల అప్పుకుగాను రోజువారీగా రూ.500 చొప్పున చెల్లించడం లేదు. దీంతో ఫైనాన్షియర్ల ఒత్తిళ్లు. ►రెండు నెలలుగా ఇంటి అద్దె చెల్లించ లేదు. ఇల్లు ఖాళీ చేయాలని ఓనర్ వార్నింగ్ ►కొనేవారు లేక తెచ్చిన కొబ్బరిబోండాలు మురిగిపోతున్నాయి. ►బ్యాంకులకు ఐదుమార్లు వెళ్లినా నగదు దొరకలేదు. ► రెండు నెలలుగా మరో రూ.10 వేలు అప్పు చేసి కుటుంబ పోషణ. రోజుకు వంద కూడా కష్టమే.. పేరు: అనిత వ్యాపారం: కూరగాయల విక్రయం ఏరియా: బీఎన్‌రెడ్డినగర్ నోట్ల రద్దుకు ముందు: రోజుకు రూ.2 వేల విక్రయాలు ఆదాయం: రోజుకు రూ.400 చొప్పున నెలకు రూ.12వేలు నోట్ల రద్దు తర్వాత : కనాకష్టంగా రోజుకు రూ.400 విక్రయాలు ఆదాయం: రోజుకు రూ.70 చొప్పున నెలకు రూ.2100 నెలవారీ ఖర్చులు:ఇంటి అద్దె రూ.2500, పిల్లల ఫీజులు:రూ.1500, నిత్యావసరాలు:రూ.3 లు..మొత్తంగా: రూ.7వేలు అవస్థలివీ... ►ఇంటి అద్దె, పిల్లల ఫీజులు చెల్లించడం కష్టమవుతోంది ► రోజుకు రూ.100 కూడా గిట్టుబాటు కావడంలేదు. ► తెచ్చిన కూరగాయలు కొనేవారు లేక మురిగిపోతున్నాయి. ► దరలు దిగివచ్చినా కొనేవారు లేరు. ► కుటుంబ పోషణకు రూ.10 వేలు అప్పు అడిగితే ఎవరూ ఇవ్వడంలేదు. కుటుంబం చిన్నాభిన్నం పేరు: ప్రసాద్, పని: తాపీ మేస్త్రీ నోట్ల రద్దకు ముందు: రోజూ పని దొరికేది. నెలకు కనీసం రూ.15–18 వేల వరకు వచ్చేది. ఖర్చులు: ఇంటి అద్దె రూ.3000, చీటీ వాయిదా రూ.5000, నిత్యావసరాలు: రూ.3000, రూ.1000 పాల బిల్లు..మొత్తం రూ.12 వేలు ప్రస్తుతం నెలవారీ ఆదాయం: రూ.5 వేల లోపలే (రోజూ పనిదొరకడంలేదు) అవస్థలు ఇవీ... నిర్మాణ పనులు నిలిచిపోవడంతో నెలకు రూ.5 వేలు కూడా సంపాదించలేని దుస్థితి. ఒక వేళ పని దొరికినా చేసిన పనికి యజమాని నగదు ఇవ్వడం లేదు. వారానికి ఒకసారి చెక్కు రూపంలో ఇస్తున్నారు. హైదరాబాద్‌లో బ్యాంకు ఖాతా లేదు. దీంతో ఒంగోలు పంపి అకౌంట్లో వేయగా బ్యాంక్ నుంచి చెక్ క్లియరెన్స్ రావడానికి 15 రోజులు పడుతుంది. తీరా ఎకౌంట్లో జమ చేసిన తర్వాత చేతికి డబ్బులు రాలేదు. పిల్లలకు జ్వరం వస్తే డాక్టర్ వద్దకు తీసుకెళ్లేందుకు కూడా డబ్బుల్లేక భార్య, పిల్లలను సొంతూరుకు పంపాడు. ఇంటి యజమాని అద్దె కోసం ఒత్తిడి చేశారు. చేసేది లేక ఇళ్లు ఖాళీ చేశాడు. ప్రస్తుతం ఇక్కడ ఒక్కడే ఉంటూ..పని చేస్తున్న చోటే ఇంటి యజమానిని బతిమిలాడి..తాత్కాలికంగా ఓ గుడిసె వేసుకున్నాడు. కుటుంబం చిన్నాభిన్నమైందని విలపిస్తున్నాడు. -
‘నోట్ల రద్దు’పై రిజర్వు బ్యాంకు పిల్లిమొగ్గలు
-
43 రోజులు.. 60 పల్టీలు!
• ‘నోట్ల రద్దు’పై రిజర్వు బ్యాంకు పిల్లిమొగ్గలు • మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయలేక ఆపసోపాలు... • గత 43 రోజుల్లో.. ఏకంగా 60 సార్లు వెనుకడుగు నోట్ల రద్దు’నిర్ణయాన్ని అమలు చేయడంలో రిజర్వు బ్యాంకు ఆపసోపాలు పడుతోంది. ఉద్ధండులైన ఆర్థికవేత్తలున్నా.. అడ్డగోలు నిర్ణయాలతో అసంబద్ధ నిబంధనలను ప్రకటిస్తూ నవ్వుల పాలవుతోంది. తర్వాత నాలుక కరుచుకుని.. వాటిని వెనక్కి తీసుకుంటోంది. ఇలా నోట్ల రద్దును ప్రకటిం చిన నవంబర్ 8 నుంచి ఇప్పటివరకు.. 43 రోజుల వ్యవధిలో ఏకంగా 60 సార్లు జరిగింది. అందులో కొన్ని ప్రధాన అంశాలు.. నవంబర్ 8న మోదీ నోట్ల రద్దును ప్రకటించారు. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 వరకు పోస్టాఫీసులు,బ్యాంకుల్లో పాత నోట్లు ఎంత మొత్తమైనా డిపాజిట్ చేయవచ్చని ఆర్బీఐ చెప్పింది. తర్వాత 4 రోజులకే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. పాతనోట్ల డిపాజిట్‌కు తొందరపడవద్దని, ఇంకా 46 రోజుల టైముందనీ సెలవిచ్చారు. పరిమితులపై మల్లగుల్లాలు: నవంబర్ 8 తర్వాత బ్యాంకుల్లోంచి పాత నోట్లకు బదులుగా విత్‌డ్రా చేసుకోగలిగిన మొత్తం రోజుకు రూ.4వేలు. ఈ పరిస్థితి 15 రోజులు ఉంటుందని ఆర్బీఐ భరోసా ఇచ్చింది. కానీ 9 రోజులకే మాట మార్చి.. రోజుకు రూ.2 వేల కంటే ఎక్కువ విత్‌డ్రా కుదరదంది. తర్వాత.. నవంబర్ 15న నోట్ల మార్పిడి చేసుకున్న వారి వేలిపై ముద్రవేస్తామని ప్రకటన చేసింది. ఎన్నికల సంఘం అక్షింతలతో వెనక్కి తగ్గి, బేషరతుగా ఎంత మొత్తమైనా డిపాజిట్ చేసుకోవచ్చంది. తర్వాత రూ.2.5 లక్షల కంటే ఎక్కువ వేస్తే విచారణ, చర్యలు ఉంటాయని బాంబు పేల్చింది. సడలింపులు.. బిగింపులు: విత్‌డ్రా నిబంధనలపై జనం మండిపడ్డంతో.. ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ఖాతా నుంచి రూ.2.5 లక్షల వరకూ విత్‌డ్రా చేసుకోవచ్చని ప్రకటించింది. కానీ పలు నిబంధనలు పెట్టింది. ఖాతాదారు వివరాలన్నీ (కేవైసీ) తెలిపిన ఖాతాల్లోంచే విత్‌డ్రాకు అనుమతించడం, డిసెంబర్ 30 లోపు పెళ్లి ఉంటేనే నగదు ఇవ్వడం వంటి నిబంధనలపై ఆగ్రహం వ్యక్తమైంది. తరువాత వారానికి రూ.24 వేల వరకూ విత్‌డ్రా చేసుకోవచ్చని.. రైతులు, కంపెనీలు రూ.50 వేల వరకు తీసుకోవచ్చని మినహాయింపులు ఇచ్చింది. మరో పిల్లిమొగ్గ! తాజాగా రూ.5వేల కంటే ఎక్కువ మొత్తంలో పాత నోట్లను డిపాజిట్ చేసేందుకు ఒకే ఒక్క అవకాశం కల్పిస్తామని.. అది కూడా అప్పటివరకూ ఎందుకు డిపాజిట్ చేయలేకపోయా రో బ్యాంకు అధికారులకు వివరణ ఇచ్చాకేనని ఆర్బీఐ హుకుం జారీ చేసింది. ‘మా ప్రధాని, ఆర్థిక మంత్రి డిసెంబర్ 30 దాకా డిపాజిట్ చేసుకోవచ్చన్నారు కాబట్టి నేను ఇప్పటివరకూ చేయలేదు’ అన్న కామెంట్లు బ్యాంకులకు చేరడంతో మళ్లీ వెనక్కితగ్గింది. ‘మీ డబ్బు.. ఎంతైనా జమచేసుకోండి!’ అంటూ నాలుక కరిచేసుకుంది! – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
నోట్ల మార్పిడిలో ఆర్బీఐ ఆఫీసర్ హస్తం!
సాక్షి, బెంగళూరు: పెద్ద నోట్ల రద్దు తర్వాత నోట్ల మార్పిడి అక్రమాల్లో రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు దొరికిపోతుండగా, తాజాగా బెంగళూరులో ఐపీఎస్ అధికారి భార్య, ఆర్బీఐ అధికారిణిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెంగళూరులోని నృపతుంగ రోడ్లో ఉన్న రిజర్వు బ్యాంకు కార్యాలయంలో పనిచేస్తున్న ఓ మహిళాధికారి రాష్ట్ర మంత్రులకు సంబంధించిన పాత పెద్ద నోట్లను అక్రమ మార్గాల్లో మార్చడానికి సహకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీనియర్ ఐపీఎస్ అధికారి భార్య అయిన సదరు మహిళాధికారిపై సీబీఐ అధికారులు సాక్ష్యాలను సేకరిస్తున్నారు. భర్త ఐపీఎస్ అధికారి ద్వారా ఆమెతో పరిచయం పెంచుకున్న కొంత మంది కర్ణాటక మంత్రులు తమ వద్ద ఉన్న రూ. 5 కోట్ల నుంచి రూ. 8 కోట్ల వరకు నల్లధనాన్ని అక్రమ మార్గాల్లో వైట్‌మనీగా మార్చుకున్నారనే ఆరోపణలున్నాయి. సహకార బ్యాంకులపై విచారణ: నవంబర్ 10–14 తేదీల్లో మంగళూరు జిల్లా సహకారి బ్యాంకులోని సేవింగ్స్ అకౌంట్లలో రూ.428 కోట్లు డిపాజిట్ అయినట్లు సమాచారం. డీసీసీ బ్యాంకుల్లో డిపాజిట్ అయిన పెద్ద మొత్తంలోని నగదుకు సంబంధించి వివరాలను సేకరించడానికి నాబార్డుతో విచారణ జరిపించనుంది. -
పెద్ద నోట్ల రద్దు ప్రభావంపై అనిశ్చితి
ఆర్బీఐ ఎంపీసీ అభిప్రాయం ముంబై: పెద్ద కరెన్సీ నోట్ల రద్దు నేపథ్యంలో ద్రవ్యోల్బణ లక్ష్యంపై దృష్టి కారణంగానే కీలక రేట్లను యధాతథంగా కొనసాగించడానికే ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ మొగ్గు చూపారు. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు వుండొచ్చనే అంశంపై అనిశ్చితి నెలకొందని పటేల్ అభిప్రాయపడ్డారు. ఈ నెల 6–7 మధ్య జరిగిన ఆర్బీఐ మోనేటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) సమావేశ వివరాలను ఆర్బీఐ విడుదల చేసింది. ఈ వివరాల ప్రకా రం... ఈ కమిటీలోని ఆరుగురు సభ్యులు రెపో రేటు ను 6.25 శాతంగా ఉంచడానికే మొగ్గు చూపారు. ⇔ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం రేంజ్‌లోనే నియంత్రించాలనే విషయంపైనే దృష్టి కేంద్రీకరించాలని పటేల్ సూచించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ద్రవ్యోల్బణం వచ్చే ఏడాది పెరిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ⇔ నోట్ల రద్దు కారణంగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తాత్కాలికమే అయినప్పటికీ, స్వల్ప కాలిక ప్రభా వం ఉంటుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్. గాంధీ కూడా అభిప్రాయపడ్డారు. అయితే మధ్య కాలానికి వృద్ధి అవకాశాలపై చెప్పుకోదగ్గ ప్రతికూల ప్రభావాలు ఉండకపోవచ్చని పేర్కొన్నారు. చమురు ధరలు, భౌగోళిక–రాజకీయ స్థితిగతుల ప్రభావం ఉంటుందని వివరించారు. ⇔ పెద్ద నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థకు ఊహించని షాక్ అని మరో సభ్యుడు రవీంద్ర హెచ్ డోలాకియా అభిప్రాయపడ్డారు. ఫలితంగా జీడీపీ అంచనాల ను తగ్గించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయితే ఈ ప్రభావం తాత్కాలికమేనని వివరించారు. ⇔ పెద్ద నోట్ల రద్దు ప్రభావాలను తట్టుకునే స్థాయిలోనే మన ఆర్థిక వ్యవస్థ ఉందని మరో ఎంపీసీ సభ్యురాలు పామి దువా అభిప్రాయపడ్డారు. ఆర్థిక కార్యకలాపాలపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం తాత్కాలికమేనని ఆమె పేర్కొన్నారు. ⇔ డిమాండ్ తగ్గుతుండడం, దేశీయంగా సరఫరా సంబంధిత సమస్యలు తాత్కాలికమేనని మరో ఎంపీసీ సభ్యుడు దేబబ్రత పాత్ర అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ పరిణామాలు, స్థూల ఆర్థిక అంశాలకు సంబంధించినరిస్క్లు, ఎక్కువ కాలం ప్రభావం చూపుతాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. -
కొత్త నోట్లపై కాకి లెక్కలు..!
• ఆర్బీఐ, ప్రభుత్వ గణాంకాల్లో వ్యత్యాసాలు • సరఫరాలో రూ. 1.13 లక్షల కోట్ల తేడా • చెలామణీలోని నోట్లపైనా గందరగోళం... పెద్ద నోట్ల రద్దు దరిమిలా ఇటు ప్రభుత్వం, అటు రిజర్వ్ బ్యాంక్ కొత్త నోట్ల లభ్యత గురించి రోజుకో ప్రకటన చేస్తూ వస్తున్నాయి. అయితే ప్రభుత్వం, ఆర్బీఐ చెప్పే లెక్కల మధ్య పొంతన కుదరకపోతుండటమే చిక్కులు తెచ్చిపెడుతోంది. రెండు రోజుల వ్యవధిలోనే పెద్ద నోట్ల సరఫరా భారీగా పెరిగిపోవడం.. మళ్లీ అంతలోనే పదకొండు రోజుల పాటు అసలు నోట్ల సరఫరా ఊసే లేకపోవడం మొదలైనవి అనేక సందేహాలకు తావిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. ఇదంతా చూస్తుంటే.. కొత్త నోట్ల విషయంలో పార్లమెంటును, ప్రజలను ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తూనైనా ఉండొచ్చు లేదా ఆర్బీఐ లెక్కల్లోనే తప్పులైనా ఉండొచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు గణాంకాలతో సహా వారు ఆధారాలు చూపుతున్నారు. ఏది నిజం.. నవంబర్ 27 దాకా ఏటీఎంలు, బ్యాంకు శాఖల ద్వారా ప్రజలు దాదాపు రూ. 2.16 లక్షల కోట్ల కొత్త నోట్లను విత్‌డ్రా చేసుకున్నట్లు నవంబర్ 28న రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, ఇందులో ఏయే నోట్లు, ఎన్నెన్ని ఉన్నాయన్నది వివరించలేదు. కనుక ఇందులో ఎంతో కొంత మొత్తం రూ. 100 లేదా అంతకన్నా తక్కువ విలువ చేసే నోట్లు కూడా ఉన్నాయని భావించవచ్చు. ఇక ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ డిసెంబర్ 6న పార్లమెంట్లో చెప్పిన వివరాలను బట్టి చూస్తే నవంబర్ 29 దాకా రూ. 2,000 నోట్లు 160.8 కోట్లు, రూ. 500 నోట్లు 15.6 కోట్లు.. అంటే మొత్తం సుమారు రూ. 3.29 లక్షల కోట్లు విలువ చేసే 176.4 కోట్ల నోట్లు సరఫరా అయ్యాయి. ఇక్కడ పరిశీలించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఆర్బీఐ లెక్కల ప్రకారం డీమోనిటైజేషన్ తర్వాత 17 రోజుల వ్యవధిలో రూ. 2.16 లక్షల కోట్లు అంటే.. రోజుకు సగటున రూ. 12,700 కోట్ల మేర సరఫరా అయ్యాయి. కానీ ప్రభుత్వ లెక్కలను బట్టి చూస్తే నవంబర్ 29కి రూ. 3.29 లక్షల కోట్ల విలువైన నోట్లు సరఫరా అయ్యాయి. అంటే.. కేవలం రెండు రోజుల వ్యవధిలో కరెన్సీ సరఫరా ఏకంగా రూ. 1.13 లక్షల కోట్ల మేర పెరిగిపోయింది. పైపెచ్చు ఆర్బీఐ చెప్పిన గణాంకాల్లో చిన్నా, పెద్ద అన్ని రకాల డినామినేషన్ల నోట్లు ఉండగా.. మంత్రి చెప్పిన వివరాలు కేవలం పెద్ద నోట్లకు సంబంధించినవే. ఒకవేళ చిన్న నోట్లను కూడా పరిగణనలోకి తీసుకుని ఉంటే నవంబర్ 29 దాకా సరఫరా అయిన నోట్లు మరింత ఎక్కువగానే పెరిగేవి. మరిన్ని సందేహాలు.. ఇక మరో ఆసక్తికరమైన విషయం చూద్దాం. డిసెంబర్ 7న పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ మరిన్ని కొత్త గణాంకాలను వెల్లడించింది. అంతకు ముందు రోజు నాటి దాకా రూ.4 లక్షల కోట్ల మొత్తాన్ని సరఫరా చేసినట్లు ఆర్బీఐ డిçప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ చెప్పుకొచ్చారు. ఇందులో రూ. 1.06 లక్షల కోట్లు చిన్న నోట్లు అని ఆయన పేర్కొన్నారు. అంటే మిగతావి (రూ. 2.94 లక్షల కోట్లు) పెద్ద నోట్లేనని భావించవచ్చు. నవంబర్ 29 దాకా జరిగిన నోట్ల సరఫరాకు సంబంధించి వారం రోజుల ముందు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పార్లమెంటులో చెప్పిన రూ. 3.29 లక్షల కోట్ల కన్నా ఇది తక్కువే. ఈ గందరగోళం ఇక్కడితో ఆగలేదు. డిసెంబర్ 10 దాకా 170 కోట్ల మేర రూ. 2,000, రూ. 500 నోట్లను సరఫరా చేసినట్లు డిసెంబర్ 12న గాంధీ తెలిపారు. అంటే నవంబర్ 29 దాకా 176 కోట్ల పెద్ద నోట్లను సరఫరా చేశామంటూ మంత్రి చెప్పిన 11 రోజుల తర్వాత.. ఆయన చెబుతున్న దానికన్నా తక్కువ నోట్లే సరఫరా చేశామని ఆర్బీఐ చెప్పినట్లయ్యింది. పోనీ ఒకవేళ.. మేఘ్వాల్ అర కొరను పక్కన పెట్టిæ రౌండ్ ఫిగర్ చేసి 170 కోట్లని చెప్పారనుకుంటే నవంబర్ 29 –డిసెంబర్ 10 మధ్య కొత్త నోట్ల సరఫరా లేదా ముద్రణా నిల్చిపోయిందని అనుకోవాలా? ఆర్బీఐ ఈ వ్యత్యాసాలను ఎలా వివరించగలదు? నోట్లపై ఆర్బీఐ వివరణ చలామణీలోని నోట్లపై జర్నలిస్టు, సమాచార హక్కు కార్యకర్త అనిల్ గల్గాలికి ఇచ్చిన సమాధానంపై వివాదం రేగడంతో ఆర్బీఐ వివరణ ఇచ్చింది. చలామణీలోని నోట్లతో పాటు ఇంకా అందుబాటులోకి తేని నోట్లను కూడా కలిపి అనిల్ ప్రశ్నకు సమాధానం ఇచ్చినట్లు పేర్కొంది. వివరాల్లోకి వెడితే.. నవంబర్ 8 నాటికి (డీమోనిటైజేషన్ ప్రకటించిన తేది) చలామణీలో ఎన్ని నోట్లు ఉన్నాయి, ఎన్ని కొత్త కరెన్సీ నోట్లను ముద్రించారు తదితర వివరాలు ఇవ్వాల్సిందిగా సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ఆర్బీఐని అనిల్ కోరారు. అధికారిక లెక్కల ప్రకారం నవంబర్ 4 దాకా రూ. 17.97 లక్షల కోట్లు చలామణీలో ఉన్నాయి. అయితే, అనిల్ ప్రశ్నకు ఆర్బీఐ ఇచ్చిన సమాధానం ప్రకారం ఈ మొత్తం ఏకంగా రూ. 23.9 లక్షల కోట్లుగా ఉంది. ఫలితంగా రెండింటి మధ్య పొంతన లేక గందరగోళ పరిస్థితి తలెత్తింది. రెండింటి మధ్య వ్యత్యాస మొత్తం (సుమారు రూ. 6 లక్షల కోట్లు) తమ లాకర్లలోనే ఉంటుందని, దీన్ని చలామణీలోకి తేకపోవడం వల్ల అందుకు సంబంధించిన డేటాలో ప్రతిఫలించదని ఆర్బీఐ తెలిపింది. ఏ నోట్లు ముద్రిస్తున్నారో.. తగినన్ని నోట్లు వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రింటింగ్ ప్రెస్‌లు ఓవర్‌టైమ్ పనిచేస్తున్నాయంటూ ప్రభుత్వం చెబుతూ వస్తోంది. డీమోనిటేజైషన్ ప్రకటించిన తర్వాత కొద్ది రోజుల వ్యవధిలో ముద్రించిన నోట్లలో సింహభాగం 80–90 శాతం రూ. 500 నోట్లే ఉన్నాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి శక్తికాంత దాస్.. డిసెంబర్ 17న దూరదర్శన్‌కి ఇచ్చిన ఇంటర్వూ్యలో చెప్పారు. ఇక మేఘ్వాల్ సమాచారం ప్రకారం నవంబర్ 29 దాకా (అంటే డీమోనిటైజేషన్ అయిన 20 రోజుల దాకా) సరఫరా చేసిన రూ. 500 నోట్ల విలువ రూ. 7,800 కోట్లే (దాదాపు 15.6 కోట్ల నోట్లు). రద్దు చేసిన నోట్ల విలువలో (రూ. 8.58 లక్షల కోట్లు) కొత్తగా ముద్రించిన రూ. 500 నోట్లు ఒక్కశాతం కన్నా (0.91 శాతం) తక్కువే ఉండటం గమనార్హం. పోనీ గాంధీ చెప్పిన మాటలు బట్టి చూసినా.. నవంబర్ 10న.. అంటే డీమోనిటైజేషన్ ప్రకటించి నెల రోజులు గడిచినా కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదన్నమాట. ఇక, రూ. 2,000 నోట్లను నెలల తరబడి ముద్రిస్తూనే ఉన్నామని, చెప్పుకోతగ్గ పరిమాణంలో ఇవి చలామణీలో ఉన్నాయని శక్తికాంత దాస్ చెప్పారు. గణాంకాల ప్రకారం నవంబర్ 29 నాటి దాకా సరఫరా అయిన రూ. 2,000 నోట్ల విలువ సుమారు రూ. 3.21 లక్షల కోట్లు (160.8 కోట్లు రూ. 2,000) ఉంటుంది. రద్దయిన పెద్ద నోట్లు (రూ. 1,000) విలువ రూ. 6.86 లక్షల కోట్లలో ఇది దాదాపు 47%. అయితే, వినియోగానికి అనువుగా లేనంత పెద్ద నోటు కావడంతో(రూ.2,000) ఇవి ఎక్కువగా చెలామణీలోకి వచ్చినా నగదు ఎకానమీలో ఉపయోగం లేకుండా పోయిం ది. మళ్లీ డిసెంబర్ 10న గాంధీ వెల్లడించిన సమాచారం ప్రకారం రూ. 2,000 నోట్ల సరఫరా పరిమాణంలో మార్పేమీ లేదు. దీంతో నోట్ల వెతలు తీరాలంటే ప్రధాని చెప్పిన 50 రోజుల గడువు సరిపోయేట్లుగా లేదనేది పరిశీలకుల మాట. -
‘రద్దు’ తర్వాత పట్టుకుంది రూ.11 కోట్ల నగదే!
‘నోట్ల రద్దు’ తర్వాత ఏపీ, తెలంగాణలో ఐటీ శాఖ చర్యలివి సాక్షి, హైదరాబాద్: నోట్లు రద్దు తర్వాత దేశవ్యాప్తంగా ఐటీ సోదాలు, దాడుల్లో వందల కోట్లలో కొత్త, పాత నోట్లు, నల్లధనం బయటపడుతుంటే... ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం పట్టుకున్నది రూ.11 కోట్లు మాత్రమే. ఇందులో కొత్త నోట్ల విలువ రూ.1.9 కోట్లు. అసలు ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి కూడా చేసిన తనిఖీలు, సోదాలు 11 మాత్రమే. ఇక ఆస్తులు, బంగారం రూపంలో కలిపి గుర్తించిన మొత్తం నల్లధనం రూ.280 కోట్లు. ఆదాయ పన్ను శాఖ హైదరాబాద్ డైరెక్టర్ జనరల్ నీనా నిగమ్ వెల్లడించిన సమాచారం ఇది. సోమవారం హైదరాబాద్‌లోని ఆదాయ పన్ను శాఖ కార్యాలయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదాయ పన్ను శాఖ తీసుకున్న చర్యలను నీనా నిగమ్ వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు ఇరు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 30 తనిఖీలు/సోదాలు నిర్వహించామని.. రూ.760 కోట్ల విలువైన లెక్కల్లో చూపని ఆస్తులను గుర్తించామని తెలిపారు. -
బ్యాంకుల నెత్తిన నోట్ల రద్దు బండ..!
• పెరుగుతున్న వ్యయాలు • రుణాలకు డిమాండ్ తగ్గుదల • తాత్కాలికంగా తప్పని సమస్యలు న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో కుప్పలకొద్దీ వచ్చి పడిన డిపాజిట్ల ప్రయోజనాలు బ్యాంకులకు ఎప్పుడో దీర్ఘకాలంలో వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ.. ప్రస్తుతానికి మాత్రం వాటికి సమస్యలు తప్పేట్లు లేవు. ఒకవైపురుణాలకు డిమాండ్ పడిపోవటంతో పాటు మరోవైపు.. కొత్త పరిణామాల కారణంగా అదనపు వ్యయాలు తోడవుతుండటమూ దీనికి కారణం. భారీ ఎత్తున చలామణిలో ఉన్న రూ. 500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం గత నెలలో ప్రకటించడం బ్యాంకింగ్ రంగాన్ని గణనీయంగా కుదిపేసింది. అంత భారీ స్థాయిలో నగదును మళ్లీ రీప్లేస్ చేయాల్సివచ్చేసరికి రిజర్వ్ బ్యాంక్ వద్ద ఒక్కసారిగా కొత్త నోట్లకు కొరత ఏర్పడింది. ప్రింటింగ్ ప్రెస్‌లు నిరంతరం పనిచేస్తూనే ఉన్నా.. రద్దయిన నోట్లలో ఇప్పటికి మూడో వంతు నగదు మాత్రమే ఆర్బీఐ అందుబాటులోకితేగలిగిందని అంచనా. ఇటువంటి పరిస్థితుల్లో వ్యాపార విశ్వాసం తీవ్రంగా దెబ్బతిని రుణాలకు డిమాండ్ పడిపోయింది. రుణాలివ్వడానికి బ్యాంకుల దగ్గర పుష్కలంగా నిధులున్నప్పటికీ.. పాత నోట్లు డిపాజిట్‌చేసేందుకు వచ్చే ఖాతాదారులను చూసుకోవడంపైనే బ్యాంకు సిబ్బంది ప్రధానంగా దృష్టి పెట్టాల్సి వస్తుండటంతో ఇతరత్రా కార్యకలాపాలు కుంటుపడుతున్నాయి. డీమోనిటైజేషన్‌పై ఆందోళనతో డిపాజిట్ చేసేందుకువస్తున్న ఖాతాదారులకు ముందుగా ఉపశమనం కల్పించడం తమకు ముఖ్యమని, రుణాలివ్వడానికి బోలెడంత సమయం ఉందని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఇప్పటికే రుణ వృద్ధి మందగించినసమస్యతో సతమతమవుతున్న బ్యాంకులకు ఈ పరిణామాలన్నీ గోరుచుట్టుపై రోకటిపోటుగా మారాయి. మందగించిన రుణ వృద్ధి.. జూలై–సెప్టెంబర్ ›త్రైమాసికంలో మిగతా ప్రపంచ దేశాల కన్నా కూడా వేగవంతంగా భారత ఎకానమీ 7.3 శాతం మేర వృద్ధి నమోదు చేసింది. ఉపాధి కల్పనకు కనీసం ఎనిమిది శాతం వృద్ధినైనా నిలకడగా కొనసాగించాల్సిఉంటుంది. ఇందుకోసం ప్రైవేట్ పెట్టుబడులు పెరగాలి. ఎకానమీకి ఊతంగా నిల్చే వివిధ రంగాలకు బ్యాంకులు రుణాలు అందించాలి. ఇది జరగాలంటే బ్యాంకింగ్ రంగం సరిగ్గా ఉండాలి. అయితే చాన్నాళ్లుగా అంతంతమాత్రం లాభదాయకత, మొండిబకాయిల భారంతో కుంగుతున్న బ్యాంకింగ్ వ్యవస్థకు.. ప్రస్తుత కష్టం తాత్కాలికమైనదైనా కూడా చాలా బాధాకరమైనదిగానే పరిణమించవచ్చు. ఒకవేళ వ్యాపారాలు కోలుకోవడానికి ఇంకాఆలస్యమైతే.. ఇక్కట్లు మరింతగా పెరగొచ్చు. ప్రస్తుతం డీమోనిటైజేషన్ దెబ్బతో వ్యాపార కార్యకలాపాల నిర్వహణ, విస్తరణ కోసం లోన్ తీసుకుందామనుకునే వ్యాపారవర్గాలకు రుణం దొరకని పరిస్థితి నెలకొంది. ప్రతీబ్యాంకు సిబ్బందీ కరెన్సీని మార్చే హడావుడిలో ఉండటమే తప్ప తమకు రుణాలివ్వడంపై దృష్టే పెట్టడం లేదని వ్యాపారవర్గాలు ఆవేదన వెలిబుచ్చుతున్నాయి. దీంతో, ఏటా రెండంకెల శాతం స్థాయిలో వృద్ధి చెందుతున్న అమ్మకాలు ఈసారి అంతకు మించి పడిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంచనాల్లో మార్పులు .. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రుణ వృద్ధి అంచనాలను బ్యాంకులు సవరించుకుంటున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి కనీసం 10 శాతమైనా రుణ వృద్ధి సాధించాలనినిర్దేశించుకున్నప్పటికీ.. సాధ్యపడకపోవచ్చని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. రిటైల్ రుణాలకు డిమాండ్ తగ్గినట్లు పేర్కొన్నాయి. మరోవైపు పాత నోట్లతో బకాయిలను ముందస్తుగా తీర్చేస్తుండటం సైతం మొత్తంరుణాల పోర్ట్‌ఫోలియోపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఎస్బీఐ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ లోటు అంతటినీ.. నాలుగో త్రైమాసికంలో భర్తీ చేసుకోవాలని ఎస్బీఐ భావిస్తోంది. మరోవైపు, రుణ వృద్ధి మళ్లీ సాధారణస్థాయికి రావడానికి కనీసం రెండు త్రైమాసికాలైనా పట్టేస్తుందని ఇతర బ్యాంకుల అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద ఈ ఆర్థిక సంవత్సరంలో S బ్యాంకింగ్ రంగంలో రుణ వృద్ధి ఆరు శాతానికి పడిపోవచ్చనికన్సల్టెన్సీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే 1962 తర్వాత ఇదే అత్యంత తక్కువ స్థాయి వృద్ధి కాగలదు. రుణ వృద్ధి గత ఆర్థిక సంవత్సరం 10.9 శాతంగాను, అంతకు ముందు 9 శాతంగానూ నమోదైంది. వ్యయాల మోత.. డీమోనిటైజేషన్ దరిమిలా బ్యాంకుల తాత్కాలిక వ్యయాలూ పెరిగాయి. ఉద్యోగులకు ఓవర్‌టైమ్ చెల్లించడం, పాత నోట్లను డిపాజిట్ చేసుకునేందుకో లేదా మార్చుకునేందుకో పెద్ద ఎత్తున వస్తున్న ఖాతాదారులనుఅదుపులో ఉంచేందుకు అదనంగా సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాల్సి వస్తుండటం మొదలైన వాటికోసం బ్యాంకులు అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. కొత్త నోట్లకు అనుగుణంగా ఏటీఎంలను రీకాలిబ్రేట్చేసేందుకయ్యే వ్యయాలు వీటికి అదనం. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) అంచనాల ప్రకారం ఈ వ్యయాలు సుమారు రూ. 35,100 కోట్ల మేర ఉండొచ్చు. ఇది కాకుండా.. ఈ ఏడాది ఆఖరుదాకా ఏటీఎం లావాదేవీలు, ఇతరత్రా కార్డు చెల్లింపులపై ఫీజులు వసూలు చేయొద్దన్న ఆర్బీఐ ఆదేశం కూడా బ్యాంకుల ఆదాయ మార్గాలకు ప్రతికూలంగా మారింది. ఆర్బీఐ అనూహ్యంగా కీలక పాలసీ రేట్లనుయథాతథంగా ఉంచడం వల్ల బాండ్ మార్కెట్లు తగ్గడంతో బ్యాంకులు ఇప్పటిదాకా వాటిపై పెట్టుకున్న ఆశలూ ఆవిరైపోయాయి. ప్రస్తుతం అనేకానేక సమస్యల్లో ఉన్నప్పటికీ.. దీర్ఘకాలంలో బ్యాంకులకు ఈ పరిణామంమంచిదేనంటున్నారు విశ్లేషకులు. మరిన్ని నిధులు అధికారికంగా వ్యవస్థలోకి రావడం, క్రెడిట్ కార్డుల వినియోగం.. ఇతరత్రా ఆర్థిక సేవల వినియోగం పెరగడం మొదలైనవి ఇందుకు దోహదపడగలవంటున్నారు. -
ఆ విరాళాలను నిషేధించండి!
పార్టీలకు రూ. 2 వేలు, ఆ పైబడిన అజ్ఞాత విరాళాలపై ఈసీ న్యూఢిల్లీ: ఎన్నికల్లో నల్లధన ప్రవాహాన్ని అరికట్టడానికి ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా పార్టీలకు రెండు వేల రూపాయలు, ఆ పైబడి అజ్ఞాతంగా ఇచ్చే విరాళాలపై నిషేధం విధించేందుకు చట్టాల్లో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇలాంటి విరాళాలపై రాజ్యాంగ పరంగాగానీ, చట్ట పరంగాగానీ నిషేధం లేదు. అయితే ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29సీ ప్రకారం ‘పరోక్ష పాక్షిక నిషేధం’ ఉంది. విరాళాల డిక్లరేషన్ అవసరాలకు అనుగుణంగా ఇది సాధ్యం. కానీ, అలాంటి డిక్లరేషన్లు రూ. 20 వేలకు పైబడిన విరాళాలకు మాత్రమే తప్పనిసరి. ఇప్పుడు రెండు వేల రూపాయలు కంటే పైబడిన అనామక విరాళాలను నిషేధించాలని కేంద్రాన్ని ఈసీ కోరింది. ఇక లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సీట్లు గెలుచుకున్న పార్టీలకు మాత్రమే ఐటీ మినహాయింపు కొనసాగించాలని కూడా ఈసీ పేర్కొంది. కాగా, నోట్ల రద్దు తర్వాత రాజకీయ పార్టీలకు విరాళాల స్వీకరణలో ప్రత్యేక సడలింపులు ఏమీ లేవని, పాత రూ. 500, రూ. 1000 నోట్లను అవి తీసుకోరాదని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ ఆధియా ట్విటర్లో పేర్కొన్నారు. అలా చేస్తే ఐటీ అధికారులకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
అవినీతిని రూపుమాపేందుకే పెద్ద నోట్ల రద్దు
ఆర్ఎస్ఎస్ తెలంగాణ సంఘ చాలక్ వెంకటేశ్వర్రావు నగరంలో కదం తొక్కిన స్వయం సేవకులు నిక్కర్ నుంచి ప్యాంట్‌కు మారాక తొలి సమ్మేళనం విద్యారణ్యపురి : వేళ్లూనుకుపోయిన అవినీతిని రూపుమాపేందుకు కేంద్రప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత సంఘచాలక్ అధ్యక్షుడు ప్యాట వెంకటేశ్వర్రావు అన్నారు. అలాగే, కశ్మీర్ వంటి ప్రాంతాల్లో అల్లర్లు తగ్గుముఖం పడుతున్నాయని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల గణవేశ్(యూనిఫాం) నిక్కర్ నుంచి ప్యాంట్‌కు మారాక వరంగల్‌లోని తరుణ స్వయం సేవకుల కోసం తొలి సమ్మేళనాన్ని ఆదివారం ఏర్పాటుచేశారు. హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో జరిగిన ఈ సమ్మేళనంలో వెంకటేశ్వర్రావు ముఖ్యఅతిథి మాట్లాడారు. పెద్దనోట్ల రద్దుతో సామాన్య ప్రజలు తొలుత ఇబ్బంది పడుతున్నా.. ఎవరూ ప్రధాని నిర్ణయాన్ని వ్యతిరేకించడం లేదన్నారు. నల్లధనం కలిగిన ఉన్న వారు మాత్రం ఎలా మార్చుకోవాలో తెలియక నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. తొమ్మిది దశాబ్దాల ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ప్రారంభమై తొమ్మిది దశాబ్దాలు గడిచిందని.. అప్పటి నుంచి దేశం నలుమూలలా సంఘ కార్యక్రమాలను విస్తరించాయని వెంకటేశ్వర్రావు తెలిపారు. దేశ ప్రజల్లో జాతీయత భావాన్ని నింపడంలో సంఘం నిరంతరం కృషి చేస్తుంండగా.. సమాజంలోని మార్పులకు అనుగుణంగా తనను తాను తీర్చిదిద్దుకుంటూ ముందుకు సాగుతోందన్నారు. 1925నుంచి ఉన్న సంఘ గణవేష్ మార్పు విషయమై అఖిల భారత స్థాయిలో చర్చించాక కాలానికి అనుగుణంగా, అందరికీ సౌకర్యంగా ఉండేలా నిక్కర్ స్థానంలో ప్యాంట్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అయితే, గణవేష్ మారినా సంఘం సిద్ధాంతాలు మారవని ఆయన స్పష్టం చేశారు. దళితుల పట్ల వివక్ష చూపని సంస్థగా ఆర్ఎస్ఎస్కు పేరుందన్నారు. అనంతరం జ్యుడీషియల్ ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మరి జగన్నాథం మాట్లాడుతూ దేశరక్షణ, అభివృద్ధికి అంకిత భావంతో పనిచేసే ఏకైక సంస్థ ఆర్ఎస్ఎస్ అని పేర్కొన్నారు. సమావేశంలో ఆర్ఎస్ఎస్ వరంగల్ జిల్లా, మహానగర అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, పాణుగంటి విశ్వనాథ్ మాట్లాడారు. కాగా, సమ్మేళనంలో తొలుత స్వయం సేవకులు నూతన యూనిఫాంతో హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి హన్మకొండ చౌరస్తా, అశో కా జంక్షన్, పెట్రోల్‌పంపు, కమ్మరి వాడ, కిషన్‌పుర, పరేడ్ గ్రౌండ్ మీదుగా నిర్వహించిన పధ సంచలన్(రూట్ మార్చ్) ఆకట్టుకుంది. -
తొలిరోజునే బీజేపీకి ఇరకాటం!
అసెంబ్లీలో పెద్దనోట్ల రద్దు అంశం చర్చకు రావడంపై అసంతృప్తి అధికార టీఆర్ఎస్ తీరుపై కమలనాథుల గుర్రు సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల తొలిరోజునే బీజేపీ శాసనసభాపక్షం సభలో ఇరుకున పడే పరిస్థితి ఎదురుకానుంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేయడంతో రాష్ట్రంలోని వివిధవర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిం దే. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల మొదటిరోజునే ఈ అంశంపై చర్చకు అధి కారపక్షం ఆమోదం తెలపడంతో రాష్ట్ర బీజేపీ సంకటంలో పడింది. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అటు లోక్‌సభ, రాజ్యసభలను కుదిపేస్తుండగా, జాతీయస్థాయిలో విపక్షపార్టీల విమర్శలను తిప్పికొట్టేందుకు బీజేపీ ఎంతో శ్రమించాల్సి వస్తోంది. క్షేత్రస్థాయి లో సమస్యలు పరిష్కారం కాక.. బ్యాంకులు, ఏటీఎంలలో డబ్బులు దొరకక ప్రజల ఇబ్బందులు తీవ్రం కావడంతో కేంద్ర నిర్ణయాన్ని సమర్థిస్తూ సమాధానాలు చెప్పుకోవడం బీజేపీ నాయకులకు కష్టంగా మారుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర అసెంబ్లీలో ఈ అంశంపై చర్చకు అవకాశం ఇవ్వడమంటే బీజేపీ ప్రభుత్వంపై విపక్షాల దాడికి అవకాశం ఇచ్చినట్లేననే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను సభలో ఎండగడతామని, కనీసం 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలంటూ బీజేఎల్పీ డిమాండ్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. కానీ అందుకు పూర్తి భిన్నంగా సమావేశాల తొలిరోజునే విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావడాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. బీజేపీ పట్ల అధికార టీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరుపై ఆ పార్టీ నాయకులు గుర్రుగా ఉన్నారు. పెద్దనోట్ల రద్దుపై మోదీ తీసుకున్న నిర్ణయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుగా వ్యతిరేకించి, ఆ తర్వాత మంచి నిర్ణయమని ప్రకటించడం బీజేపీ జాతీయ నాయకత్వాన్ని ఒకింత సంతోష పరిచింది. అటు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూనే, నోట్ల రద్దు నిర్ణయం అమలు సరిగా లేదని కిందిస్థాయిలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఎప్పటికప్పుడు ఏదో ఒక పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం తన అసంతుష్ట వైఖరిని స్పష్టం చేస్తుండడం బీజేపీ నాయకులకు మింగుడు పడడం లేదు. విపక్షాలకు అవకాశం.. ఈ పరిణామాల దృష్ట్యా అసెంబ్లీలో మోదీ ప్రభుత్వం, బీజేపీ నాయకత్వంపై కాంగ్రెస్, ఎంఐఎం, ఇతర విపక్షాల విమర్శలకు పరోక్షంగా అధికార టీఆర్ఎస్ అవకాశం ఇచ్చినట్లుగా భావించాల్సి ఉంటుందని ఈ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. -
నోట్ల రద్దుతో నేనూ సహనం కోల్పోయా!
బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు సాక్షి, అమరావతి: నోట్ల రద్దు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతున్నారని, ఓ దశలో తాను కూడా సహనం కోల్పోయానని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు తెలిపారు. వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం ముఖ్యమంత్రిని కలిసిన ఆయన మీడియాతో మాట్లాడారు. బ్యాకుల్లో వారానికి రూ.24 వేలు ఇస్తారని చెప్పినా ఇవ్వడంలేదన్నారు. తన కుమారుణ్ని డబ్బు కోసం బ్యాంకుకు పంపితే కేవలం రూ. 6,000 ఇచ్చారని వాపోయారు. బ్యాంకర్లు నల్ల కుబేరులతో కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆర్బీఐ బ్యాంకులకు సరిపడా డబ్బును విమానాల్లో పంపాలన్నారు. -
టోకు వస్తువుల డిమాండూ డౌన్!
• నవంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం 3.15% • పెద్ద నోట్ల రద్దు ప్రభావం... న్యూఢిల్లీ: రూ.500, రూ.1,000 పెద్ద నోట్ల రద్దు ప్రభావం వ్యవస్థలో డిమాండ్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. రిటైల్‌తో పాటు టోకు వస్తువుల డిమాండ్ ప్రత్యేకించి ఆహార ఉత్పత్తుల విషయంలో భారీగా పడిపోయింది. నవంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం 3.15 శాతంగా నమోదయ్యింది. అంటే టోకు వస్తువుల బాస్కెట్ ధర 2015 నవంబర్‌తో పోల్చితే 2016 నవంబర్‌లో 3.15 శాతమే పెరిగిందన్నమాట. అక్టోబర్‌లో ఈ రేటు 3.39 శాతం. ఫుడ్, నాన్–ఫుడ్ ఆర్టికల్స్ విభాగంలో డిమాండ్ మందగమన జాడలు బుధవారం వాణిజ్యమంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల్లో కనిపించాయి. మంగళవారం విడుదలైన నవంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం కూడా రెండేళ్ల కనిష్ట స్థాయిలో 3.63 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. తాజా గణాంకాలు చూస్తే... ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్–ఫుడ్ ఆర్టికల్స్‌తో కూడిన ఈ విభాగంలో టోకు ద్రవ్యోల్బణం 1.25 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 2.15 శాతం. వేర్వేరుగా చూస్తే, ఫుడ్ ఆర్టికల్స్‌లో రేటు 2.55 శాతం నుంచి 1.54 శాతానికి తగ్గింది (అక్టోబర్‌లో 4.34 శాతం). నాన్–ఫుడ్ ఆర్టికల్స్‌లో ద్రవ్యోల్బణం పెరక్కపోగా –0.14% క్షీణించింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 6.33 శాతం. ఆహార ఉత్పత్తులకు సంబంధించి టోకున కూరగాయల ధరలు అసలు పెరక్కపోగా, – 24.10 శాతం క్షీణించాయి. తయారీ: మొత్తం సూచీలో దాదాపు 60 శాతం వాటా కలిగిన ఈ విభాగంలో కూడా టోకు ద్రవ్యోల్బణం –1.42 క్షీణత నుంచి 3.20 శాతం పెరుగుదల నమోదుచేసుకుంది. -
రిటర్నుల సవరణ పేరుతో మోసం చేస్తే చర్యలు
ఆదాయపన్ను శాఖ హెచ్చరిక న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆదాయపన్ను రిటర్నుల్లో పెద్ద ఎత్తున సవరణలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని కేంద్రం హెచ్చరించింది. బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తాలను గత సంవత్సరపు ఆదాయంగా చూపించే చర్యలకు పాల్పడితే విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 139(5) ప్రకారం ఓ వ్యక్తి గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాఖలు చేసిన రిటర్నులకు సవరణలు చేయవచ్చు. తాజాగా పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో భారీగా పన్ను చెల్లించకుండా తప్పించుకునేందుకు కొందరు... లెక్కల్లో చూపని తమ సంపదను గత సంవత్సరం ఆదాయంగా చూపించే ప్రయత్నం చేస్తుండడంతో ఆదాయపన్ను శాఖ తీవ్రంగా హెచ్చరించింది. ఆదాయాన్ని స్వచ్ఛందంగా వెల్లడిస్తే 50 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీనికి బదులు గత సంవత్సరపు ఆదాయంగా చూపిస్తే 30 శాతం పన్నుతోనే బయటపడేందుకు అవకాశం ఉంది. కానీ ఐటీ శాఖ నోటీసులిచ్చి, ఇలా సవరించినట్లు తేలిస్తే.. భారీ పన్ను, జరిమానానూ చెల్లించాల్సి ఉంటుంది. లోపాల సవరణకే పరిమితం... ‘‘సెక్షన్ 139(5) అన్నది రిటర్నుల్లో ఏదైనా తప్పిదం, పొరపాటు ఉంటే సవరణ పేర్కొనడానికి మాత్రమే. అంతేకానీ, లోగడ పేర్కొన్న ఆదాయానికి గణనీయంగా మార్పులు చేసేందుకు కాదు’’ అని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తన ప్రకటనలో స్పష్టం చేసింది. నవంబర్ 8 తర్వాత (పెద్ద నోట్ల రద్దు) కొంత మంది పన్ను చెల్లింపుదారులు ఈ నిబంధనను దుర్వినియోగం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చినట్టు పేర్కొంది. -
సమస్య తీవ్రతను గుర్తించండి
పెద్ద నోట్ల రద్దుపై హైకోర్టు ⇔సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలన్న ధర్మాసనం ⇔కౌంటర్ దాఖలుకు గడువు కోరిన కేంద్రం ⇔బుధవారం వరకు గడువు ⇔మరోసారి గడువు పెంచేది లేదని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్ : నోట్ల రద్దు నేపథ్యంలో నెల రోజులుగా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని ఉమ్మడి హైకోర్టు పేర్కొంది. సమస్య తీవ్రతను గుర్తించి అందుకు అనుగుణంగా స్పందించాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పింది. ఈ మొత్తం వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయడానికి కేంద్రానికి మరికొంత గడువునిస్తూ.. ఇకపై గడువు పెంచడం సాధ్యం కాదని తెలుపుతూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. రూ.1000, రూ.500 నోట్ల రద్దుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గత నెల 8న జారీ చేసిన నోటిఫికేషన్‌ను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన సుక్కా వెంకటేశ్వరరావు, న్యాయవాది కె.శ్రీనివాస్‌లు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. నగదు ఉపసంహరణ పరిమితులను సవాలు చేస్తూ మాజీ మంత్రి ఎం.వి.మైసూరారెడ్డి మరో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలన్నింటిపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. దొడ్డిదారిలో కోట్లు... మైసూరారెడ్డి తరఫు న్యాయవాది బాలాజీ వాదనలు వినిపిస్తూ.. అకస్మాత్తుగా నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం ప్రజల ఇబ్బందులను చాలా తేలిగ్గా తీసుకుంటోందన్నారు. నోట్లు అందక తాజాగా ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. సామాన్యుడు 100 రూపాయలు పొందేందుకు నానా అవస్థలు పడుతుంటే పెద్దలు మాత్రం దొడ్డిదారుల్లో కోట్ల రూపాయల కొత్త నోట్లు దక్కించుకుంటున్నారని తెలిపారు. పెళ్లిళ్లు పబ్బాలు జరుపుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారన్నారు. ఈ రోజు (గురువారం)తో నోట్లు రద్దు చేసి నెల అయిందని, మొదటి రోజు పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉందని వివరించారు. అసలు బ్యాంకులకు పంపిన నగదు వివరాల గురించి కేంద్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదని, దీనిని అడ్డం పెట్టుకుని అనేక మంది పెద్దలు లబ్ది పొందుతున్నారని తెలిపారు. వారంలో రూ.24 వేలను ఉపసంహరించుకోవచ్చునని ఆర్బీఐ చెబుతుంటే, బ్యాంకులు రూ.5 వేలకు మించి ఇవ్వడం లేదన్నారు. నోట్ల రద్దు మొదలు, ఉపసంహరణ పరిమితుల వరకు కేంద్రం చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వం తన కనీస బాధ్యతలను విస్మరించి ఇష్టమొచ్చిన రీతిలో ప్రవర్తిస్తోందని వివరించారు. ఇందుకు ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయకపోవడమే నిదర్శనమన్నారు. అటు పార్లమెంట్లో సమాధానం చెప్పని కేంద్రం, ఇటు న్యాయస్థానాలకు సైతం సమాధానాలు చెప్పడం లేదన్నారు. రాజకీయాల గురించి మాట్లాడొద్దు... ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. రాజకీయం గురించి, వ్యక్తుల గురించి కోర్టులో మాట్లాడవద్దని, వాటిని బయట చూసుకోవాలని బాలాజీకి తేల్చి చెప్పింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని, ఈ విషయంలో ఏం చేయగలమో పరిశీలిస్తున్నామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం చేసింది చట్ట విరుద్ధమా? కాదా? అన్న విషయాన్ని తేలుస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) కె.ఎం.నటరాజ్ స్పందిస్తూ, కౌంటర్ దాదాపుగా పూర్తయిందని, మరికొన్ని వివరాలు జోడించాల్సి ఉందని, అందువల్ల కొంత గడువు ఇవ్వాలని కోరారు. బ్యాంకుల వద్ద డబ్బు లేదు... ‘బ్యాంకుల వద్ద డబ్బు లేదు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీ రోజూ సమస్య ఎదురవుతూనే ఉంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సమస్య అధికంగా ఉంది. ప్రజలు పడుతున్న ఈ ఇబ్బందులను గుర్తించండి. సమస్య పరిష్కా రానికి తగిన విధంగా స్పందించండి’ అని ధర్మాసనం నటరాజ్‌కు స్పష్టం చేసింది. మళ్లీ బాలాజీ జోక్యం చేసుకుంటూ.. ప్రైవేటు బ్యాంకుల్లో కొత్త నోట్ల చెలామణి ఎక్కువగా ఉందని, దొడ్డిదారిన బడా బాబులు నల్లధనాన్ని మార్చుకుంటున్నారని తెలిపారు. అక్కడ కూడా తగిన స్థాయిలో డబ్బు లేదన్న ధర్మాసనం.. బుధవారం నాటికి కౌంటర్ దాఖలు చేసి తీరాలని నటరాజ్‌కు తేల్చి చెప్పింది. మరోసారి వాయిదాలు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఏవైనా ఆదేశాలు ఇస్తే తప్ప, తాము ఈ వ్యాజ్యాలపై విచారణను కొనసాగిస్తామని తెలిపింది. మీ సంగతేమిటని ఆర్బీఐ తరఫు న్యాయవాది బి.నళిన్‌కుమార్‌ను ప్రశ్నించగా, తాము కూడా తదుపరి విచారణకల్లా కౌంటర్ దాఖలు చేస్తామని ఆయన తెలిపారు. రుణాల చెల్లింపుల్లో రైతుల ఇబ్బందులపై వివరణ ఇవ్వండి నోట్ల రద్దు నేపథ్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) కు నగదు మార్పిడి, డిపాజిట్ల అవకాశం లేకుండా విధించిన నిషేధంపై ఉమ్మడి హైకోర్టు గురువారం ఆర్బీఐ, కేంద్ర ప్రభు త్వాల వివరణ కోరింది. పీఏసీఎస్‌లపై ఆర్బీఐ నిషేధంవల్ల బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాలు సకాలంలో చెల్లించే పరిస్థితి లేదని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన బి.మంగయ్య, మరో ఏడుగురు రైతులు హైకోర్టును ఆశ్ర యించారు. రైతులు రుణాలు చెల్లించేందుకు వెళితే డబ్బు తీసుకోవడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు. రుణం చెల్లిం చకపోతే, తిరిగి రుణం పొందే అవకాశం ఉం డదన్నారు. దీంతో ప్రైవేట్ ఫైనాన్షియర్లను ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. రుణాల చెల్లింపులో రైతు ల ఇబ్బందులను తొలగించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఆర్బీఐని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. -
విలీన ప్రక్రియ కొనసాగుతోంది: ఎస్బీఐ
నోట్ల రద్దు ప్రభావం ఉండదని స్పష్టీకరణ న్యూఢిల్లీ: అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియ సరైన దిశలోనే కొనసాగుతోందని ఎస్బీఐ తెలిపింది. ప్రస్తుత నోట్ల రద్దు కార్యక్రమం వల్ల విలీనంలో ఎలాంటి జాప్యం ఉండదని స్పష్టం చేసింది. అధిక విలువ కలిగిన నోట్లను వెనక్కి తీసుకునే కార్యక్రమం కారణంగా విలీనంలో జాప్యం ఉంటుందా? అని సోమవారమిక్కడ విలేకరులు ఎస్బీఐ ఎండీ రజనీష్ కుమార్‌ను ప్రశ్నించగా... తాను అలా అనుకోవడంలేదన్నారు. ఆర్బీఐ ద్రవ్య విధానం గురించి మాట్లాడుతూ... వడ్డీ రేట్లను తగ్గించకుంటే అదే అతిపెద్ద ఆశ్చర్యకరమైన విషయంగా పేర్కొన్నారు. ఇంక్రిమెంటల్ సీఆర్ఆర్ను తగ్గిస్తే ఆ మేరకు ప్రయోజనాన్ని కస్టమర్లకు అందిస్తామని రజనీష్ చెప్పారు. ఐదు అనుబంధ బ్యాంకులతోపాటు, భారతీయ మహిళా బ్యాంకు ఎస్బీఐలో విలీనం అవుతున్న విషయం తెలిసిందే. తుది విలీన ప్రణాళికకు ఆర్బీఐ, ప్రభుత్వ ఆమోదం కోసం ఎస్బీఐ వేచి చూస్తోంది. ఆర్బీఐ అదనపు సీఆర్ఆర్ తగ్గించాలి: ఎస్బీఐ అంతర్గత నివేదిక బ్యాంకింగ్ వ్యవస్థలో ఒక్కసారిగా వచ్చిన నగదును లాగేసేందుకు పెంచిన నగదు నిల్వల నిష్పత్తిని (సీఆర్ఆర్) రిజర్వ్ బ్యాంక్ వెంటనే తగ్గించాలని లేదా పూర్తిగా రద్దు చేయాలని ఎస్బీఐ తన అంతర్గత నివేదిక ఎకోరాప్లో పేర్కొంది. సీఆర్ఆర్ అదనంగా పెంచడం వల్ల బ్యాంకులపై మరింత భారం పడుతోందని, ఇలాంటపుడు లిక్విడిటీని తగ్గించడం కోసం వ్యవస్థను కుదిపేయకుండా ఉండేటువంటి విధానాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. -
నోట్ల రద్దుతో దీర్ఘకాలంలో లాభమే!!
• ఎల్ అండ్ టీ ఫైనాన్స్ ఎండీ దీనానాథ్ దుబాషి • రియల్టీ ధరలు తగ్గినా.. డిమాండ్ పెరుగుతుంది • గ్రామమాల్లో వారుుదా చెల్లింపుల్లో జాప్యం ఉండొచ్చు • డిఫాల్ట్‌లు మాత్రం ఉండకపోవచ్చు • వర్షాలు బాగాపడటం ఇందుకు అనుకూలిస్తుంది • డిజిటల్ సేవలపై విస్తరణపై మరింతగా దృష్టి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఆర్థిక సేవల రంగానికి దీర్ఘకాలంలో ప్రయోజనకరమైనదేనని ఎల్ అండ్ టీ ఫైనాన్స్ హోల్డింగ్‌స ఎండీ దీనానాథ్ దుబాషి పేర్కొన్నారు. స్వల్ప కాలానికి రియల్టీ ధరలు తగ్గే అవకాశం ఉన్నా... దీనివల్ల ఈ రంగంలో డిమాండ్ పెరుగుతుందన్నారు. పలు అంశాలపై ఆయన ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ... ఆర్థిక సేవల రంగంపై పెద్ద నోట్ల రద్దు ప్రభావమెలా ఉంది? నోట్ల రద్దుతో స్వల్పకాలికంగా లిక్విడిటీ కొరతకు ఏర్పడింది. కానీ దీర్ఘకాలంలో ఆర్థిక సేవల రంగానికిది లాభకరమే. రియల్ ఎస్టేట్ రంగంలో ధరలు తగ్గే కొద్దీ, డిమాండ్ పెరగొచ్చు. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లోకి బ్యాంకింగ్ మరింతగా విస్తరించే కొద్దీ నగదు కలెక్షన్ తదితర నిర్వహణాపరమైన ఖర్చులు గణనీయంగా తగ్గుతారుు. ద్రవ్య లభ్యత పెరిగితే వడ్డీ రేట్లూ తగ్గుతారుు. మా సంస్థ విషయానికొస్తే... మేం బలంగా ఉన్న వ్యాపార విభాగాలపై మరింత దృష్టి పెడుతున్నాం. మా లోన్ బుక్‌లో దాదాపు 90 శాతం భాగం ఎలక్ట్రానిక్ కలెక్షన్ల రూపంలోనే ఉంటోంది. కాబట్టి నోట్ల రద్దు ప్రభావం మాపై పెద్దగా లేదని చెప్పగలం. అరుుతే తాజా పరిణామాలతో కస్టమర్లకు డిజిటల్ మాధ్యమంలో మరింత మెరుగైన సేవలందించడంపై దృష్టి సారించాం. వడ్డీ రేట్లు తగ్గుతున్నారుు కదా! హౌసింగ్ రంగం ఎలా ఉండబోతోంది? హౌసింగ్‌కు సంబంధించి మేం ప్రత్యేకంగా స్వయం ఉపాధి పొందుతున్న వర్గంపై దృష్టి పెడుతున్నాం. ఈ విభాగం అధిక రాబడులందిస్తుందని మా నమ్మకం. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.7,529 కోట్లుగా ఉన్న మా హౌసింగ్ ఫైనాన్స వ్యాపారం ఈసారి క్యూ2లో 51 శాతం ఎగిసి రూ.11,381 కోట్లకు చేరింది. వడ్డీ రేట్ల తగ్గుదల వల్ల రాబోయే రోజుల్లో హౌసింగ్ రంగంలో చెప్పుకోతగ్గ స్థారుులో వృద్ధి కనపడుతుంది. ఇప్పటికిప్పుడు అమ్మకాలు మందగించినప్పటికీ, ప్రాపర్టీ ధరల తగ్గుదల కారణంగా రుణ వితరణపై సానుకూల ప్రభావమే ఉండగలదని అంచనా. ఎన్పీఏలను కట్టడి చేసేందుకు ప్రత్యేక చర్యలేమైనా...? మా స్థూల నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) పరిమాణం 40 బేసిస్ పారుుంట్ల మేర మెరుగుపడింది. గ్రామీణ ప్రాంతాల్లో.. సెప్టెంబర్‌లో ఎన్పీఏలు గణనీయంగా తగ్గారుు. ఇక క్యూ3లో సాధారణంగానే ఇవి పెరిగినా.. మళ్లీ మార్చ్ నాటికల్లా గణనీయంగా తగ్గొచ్చు. మరోవైపు, హోల్‌సేల్, ఇన్ఫ్రా వ్యాపార విభాగాల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. గడ్డుకాలాన్ని దాటినట్లే భావిస్తున్నాం. అరుునప్పటికీ.. వచ్చే 4-5 త్రైమాసికాల్లో నిబంధనల కన్నా అధికంగానే ప్రొవిజనింగ్ చేయడం ద్వారా వ్యాపారాన్ని పటిష్ఠం చేసుకుంటాం. స్థూలంగా చూసినప్పుడు క్యూ2తో పోలిస్తే క్యూ3లో ఎన్పీఏలు మరీ ఎక్కువగా పెరగకపోవచ్చు. క్యూ4లో మాత్రం తగ్గొచ్చు. మైక్రోఫైనాన్స సంస్థల్లో వాటాల కొనుగోలు వంటి యోచనేదైనా..? పెట్టుబడికి తగిన రాబడులందించే అవకాశం ఏదైనా వస్తే అందిపుచ్చుకునేందుకు మేమెప్పుడూ సిద్ధమే. కానీ, ప్రస్తుతానికి మాత్రం అటువంటి ప్రతిపాదనేదీ పరిశీలనలో లేదు. సంస్థ వృద్ధికి ఏయే వ్యాపార విభాగాలు తోడ్పడనున్నారుు? లాభదాయకత, ఆకర్షణీయ పరిశ్రమ, మరింత విలువను రాబట్టగలిగే సామర్ధ్యం... ఈ మూడింటి ఆధారంగానే మా వ్యూహాలుంటారుు. వీటి ప్రాతిపదికన మేం గ్రామీణ, హౌసింగ్, హోల్‌సేల్ రుణాలపై దృష్టి పెడుతున్నాం. దానికి తగ్గట్టే ఈ విభాగాల్లో వ్యాపార వృద్ధి 45 శాతం మేర నమోదైంది. రాబోయే రోజుల్లోనూ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తాం. మరింత మెరుగైన పనితీరు సాధించేలా ఎల్అండ్టీ ఫైనాన్స, ఫ్యామిలీ క్రెడిట్, ఎల్అండ్టీ ఫిన్‌కార్ప్ సంస్థలను విలీనం చేశాం. కంపెనీ సంస్థాగత స్వరూపాన్ని మరింత సరళం చేశాం. ఈ ఏడాది గ్రామాల్లో ఫైనాన్సింగ్ వ్యాపారం ఎలా ఉండొచ్చు? వరుసగా రెండేళ్ల కరువు తర్వాత 2016లో మెరుగైన వర్షం పడి ఖరీఫ్ పంటలకు ఊతమిచ్చింది. కానీ అసలైన గ్రామీణ డిమాండ్ ప్రభావాలనేవి ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలోనే కనిపిస్తారుు. గత క్యూ2తో పోలిస్తే ఈ క్యూ2లో ఈ వ్యాపార విభాగం సుమారు 17 శాతం వృద్ధి కనపరిచింది. గ్రామాల్లో ఫైనాన్సింగ్‌పై నోట్ల రద్దు ప్రభావం తాత్కాలికంగా వారుుదాల చెల్లింపును జాప్యం చేస్తుందేమో కానీ... డిఫాల్ట్‌లు ఉండకపోవచ్చు. 2016 ఖరీఫ్‌తో పోలిస్తే ఈ సారి రబీ పంటలకు... మద్దతు ధర అధికంగా ఉండటం రైతులకు సానుకూలాంశం. వచ్చే రెండేళ్లలో గ్రామీణ ఫైనాన్సింగ్ వ్యాపారం మరింత మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం. 20-22 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా. -
అడ్రస్ లేని రూ.500 నోట్లు
• పెద్ద నోట్ల రద్దు ప్రకటించి 26 రోజులవుతున్నా అగచాట్లే • ఇప్పటివరకు జిల్లాలోరూ.1000 కోట్ల మేర పంపిణీ • అరుుతే రూ.500 నోట్లు వచ్చింది మాత్రం • రూ.మూడు, నాలుగు కోట్లు మాత్రమే • రూ.100, రూ.20నోట్లు కూడా రూ.40 • నుంచి రూ.50 కోట్ల మేరకే సరఫరా సాక్షి, కడప: ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. ఒకటే రచ్చ.. బ్యాంకుల వద్ద నగదు దొరకక సామాన్య జనంతోపాటు ఉద్యోగులు పడుతున్న వేదన అంతా.. ఇంతా కాదు. ఒకవేళ ఏటీఎంలు, బ్యాంకుల వద్ద అంతో.. ఇంతో నగదు లభించినా అన్నీ రూ.2000 నోట్లే వస్తుండటం అందరినీ కలవరపెడుతోంది. ప్రత్యేకంగా చిల్లర దొరకక.. ఇస్తున్న పెద్ద నోట్లను ఎలా మార్చుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. అరుుతే బ్యాంకర్లు మాత్రం రూ.100 నోట్లు ఇవ్వడానికి అవి రాలేదంటూ తిప్పి పంపుతున్నారు. పైగా జిల్లాకు రూ.500 నోట్లు రాకపోవడం కూడా ఆందోళన కలిగించే పరిణామం. కనిపించని రూ.500 నోట్లు జిల్లాలో ఎక్కడ చూసినా సాధారణ ప్రజలతో పాటు ఉద్యోగులు, వృద్ధులు, పింఛన్‌దారులు పడరాని కష్టాలు పడుతున్నారు. అరుుతే బ్యాంకులకు ఇప్పటివరకు రూ.500 నోట్లు అంతంత మాత్రంగానే రావడం సమస్య తీవ్రతను మరింత పెంచుతోంది. ప్రధాని మోడీ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు నవంబర్ 8వ తేదీన ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాకు రూ.500 నోట్లు మూడు, నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. అవి కూడా చెన్నూరు, ఇతర ఒకట్రెండు బ్యాంకులలో మాత్రమే పంపిణీ చేశారు. అరుుతే దాదాపు 26 రోజులుగా ఇప్పటివరకు సుమారు రూ.1000 కోట్ల నగదు ప్రజలకు పంపిణీ చేశారు. రూ.1000 కోట్లకు గాను.. కేవలం మూడు, నాలుగు కోట్ల రూ.500 నోట్లు మాత్రమే వచ్చారుు. అరుుతే రూ.500నోట్లు ఎందుకు రావడం లేదన్నది అర్థం కావడంలేదు. అరుుతే ఆర్బీఐ నుంచే జిల్లాకు రూ.500నోట్లు రావడంలేదని తెలుస్తోంది. రూ.100, రూ20నోట్లు కూడా రూ4.0నుంచి రూ.50కోట్లే.. జిల్లాకు సంబంధించి రూ.100, రూ.20నోట్లు కేవలం రూ.40నుంచి రూ.50కోట్ల మేర మాత్రమే వచ్చారుు. అరుుతే జిల్లా పరిస్థితి దృష్ట్యా ఎక్కువ చిల్లర అవసరం ఉన్నా.. పెద్ద నోట్లే అధికంగా వచ్చారుు. రెండు రోజుల క్రితం జిల్లాకు రూ.160 కోట్లు రాగా.. అందులో ఒక్కటి కూడా రూ.500, రూ.100, రూ.20 నోట్లు లేవు. రూ.160 కోట్ల మొత్తం అంతా కూడా రూ.2వేల నోట్లే కావడం ప్రస్తావనార్హం. చిన్న నోట్లు రాకపోవడంతో ఎక్కువ సమస్య ఎదురవుతోంది. బ్యాంకు అధికారులు రూ.2వేల నోట్లు ఇస్తుండటంతో బయట కూడా చిల్లర దొరకక అవస్థలు పడుతున్నారు. ఎప్పుడు చిన్న నోట్లు వస్తాయో ఎవరికి అంతు చిక్కడంలేదు. ప్రత్యేకంగా ఆర్బీఐ నుంచి తెప్పించుకుంటే తప్ప సమస్య తెగేట్లు లేదు. ఎక్కడ చూసినా చిల్లర సమస్య.. జిల్లాలో ఎక్కడ చూసినా చిల్లర సమస్య వెంటాడుతోంది. రూ.2వేల నోట్లకు చిల్లర దొరకక ఏ షాపులోకి వెళ్లినా.. ఏ హోటల్‌కు వెళ్లినా ఆర్టీసీ బస్సు ఎక్కినా ఇలా ఎక్కడ చూసినా చిల్లర దొరకక కష్టాలు పడుతున్నారు. ఇదే అదునుగా భావించిన కొంతమంది రూ.2వేలకు రూ.10ల చొప్పున కమీషన్ తీసుకుంటూ చిల్లర ఇస్తున్నారు. ప్రస్తుతం చిల్లర సమస్య ఆర్థిక సంక్షోభాన్ని తలపిస్తోంది. ఉన్నతాధికారులు చిల్లర సమస్యను దృష్టిలో ఉంచుకొని చిన్న నోట్లు ఎక్కువ సరఫరా అయ్యేలా ప్రత్యేక చర్యలు చేపడితే తప్ప ఫలితం ఉండదు. -
పెళ్ళి చేసి చూడు!
• కరెన్సీ కష్టాలు ‘ఇల్లు కట్టి చూడు’ అన్న మాటేమో కానీ... ఇప్పుడు కష్టం తెలియాలంటే... కచ్చితంగా ‘పెళ్ళి చేసి’ చూడాలి. ఉన్న పెద్ద నోటు చెల్లదు... చెల్లే పెద్ద నోటు చేతికి రాదు! బ్యాంకులో డబ్బుంది... చేతిలోనే డబ్బు లేదు! అందుకే, ఆడపిల్ల పెళ్ళితో మధ్యతరగతి తండ్రి కష్టాలకు అంతు లేదు. తరగని ఏ.టి.ఎం. క్యూలు... దొరకని కరెన్సీ సాక్షిగా... ఇప్పుడన్నీ ‘క్యాష్’ లెస్ మ్యారేజ్లు... కరెన్సీ కష్టాలతో ‘జోష్’ లెస్ మ్యారేజ్లు! డిసెంబర్ 9... ప్రవీణ్కీ, రమ్యకీ పెళ్ళి. వాళ్ళిద్దరూ ప్రేమించుకొని, పెద్దల అంగీకారంతో పెళ్ళి చేసుకుంటున్నారు. మూడేళ్ళ ప్రేమ ఫలిస్తున్నందుకు నిజానికి ఇద్దరూ చాలా సంతోషంగా ఉండాలి. కానీ, ఇద్దరూ చాలా టెన్షన్‌గా ఉన్నారు. పెళ్ళి దగ్గర పడుతోందన్న ఉత్సాహం కన్నా, తేదీ దగ్గర కొస్తోందన్న టెన్షన్ వాళ్ళ ముఖాల్లో కనపడుతోంది. కారణం... కేంద్ర ప్రభుత్వం. నవంబర్ 8వ తేదీ రాత్రి కేంద్ర సర్కారు హఠాత్తుగా ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు వాళ్ళకు ఒక్కసారిగా టెన్షన్ తెచ్చి పెట్టింది. పెళ్ళి ఖర్చుల కోసం అప్పటికే పెద్ద మొత్తంలో డ్రా చేసిన డబ్బు బయట తీసుకొనేవాళ్ళు లేరు. బ్యాంకులో ఆ మొత్తం మళ్ళీ డిపాజిట్ చేయడానికి చిక్కులు... కొత్త కరెన్సీ కోసం తిప్పలు... ఈ ఇబ్బందులతో వాళ్ళు ఇప్పుడు తమ పెళ్ళిని ముందు అనుకున్నట్లు ఘనంగా కాకుండా, తక్కువ మంది అతిథుల మధ్య సింపుల్‌గా చేసుకొనే పనిలో పడ్డారు. మీకు తెలుసా? ఇవాళ ఇండియాలో పెళ్ళి ఖర్చు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి దాదాపు రూ. 5 లక్షల నుంచి రూ. 5 కోట్ల దాకా అవుతోందని అంచనా సగటు భారతీయులు తమ జీవితకాలంలో పోగు చేసుకొనే సంపదలో దాదాపు 5వ వంతు పెళ్ళి ఖర్చుకే పెడుతుంటారట! మన దేశంలో ఏటా బంగారానికి ఉండే డిమాండ్‌లో దాదాపు 50 శాతం పెళ్ళిళ్ళకు ఉండేదే! బ్యాంకులో ఉంది... చేతికి రాదు! ఒక్క ఈ జంటే కాదు... దేశం మొత్తం మీద ఇలా పాత నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న పెళ్ళిళ్ళు కొన్ని వేలు ఉన్నాయి. అందులోనూ ఆడపిల్ల తల్లితండ్రుల అవస్థలైతే చెప్పనే అక్కర్లేదు. విజయవాడలో పుట్టి, సినీ పరిశ్రమకు దగ్గరగా హైదరాబాద్‌లో స్థిరపడ్డ ప్రసాద్ దంపతులు అందుకు ఓ ఉదాహరణ. వాళ్ళ పెద్దమ్మాయి పెళ్ళి! కట్నకానుకలు అడగని మగపెళ్ళివాళ్ళు అడిగిందల్లా - పెళ్ళి కాస్తంత ఘనంగా చేయమని! అందుకు ప్రసాద్ దంపతులు ఆనందంగా సిద్ధపడ్డారు. ఏర్పాట్లు కూడా చేసుకుంటూ వచ్చారు. అన్నీ కుదుర్చుకొని, పెళ్ళి శుభలేఖలు కూడా కొట్టించి, పంచుతున్న సమయంలో ‘పెద్ద నోట్ల రద్దు’ వార్త వచ్చింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న మోడీ గారి ‘డీమానిటైజేషన్’ సినిమాతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బ్యాంకు నుంచి అప్పటికే ఈ ఆడపెళ్ళివారు తెచ్చుకున్న పెద్ద నోట్లు చెల్లవు. అక్టోబర్‌లోనే పెళ్ళిళ్ళ సీజన్ మొదలైపోవడంతో, పెళ్ళి ఖర్చుల కోసం బ్యాంకు నుంచి ముందే డబ్బు తీసి పెట్టుకున్న ప్రసాద్ లాంటి వాళ్ళ పాట్లు అన్నీ ఇన్నీ కావు. వాటిని బ్యాంకులో వేసేసినా, అంత మొత్తం కొత్త నోట్లివ్వరు. ఇంట్లో క్యాష్ లేదు. ఏ.టి.ఎం.లో కరెన్సీ రాదు. ఆలస్యంగా కళ్ళు తెరిచిన ప్రభుత్వం పెళ్ళిళ్ళు ఉన్నవాళ్ళు బ్యాంకు నుంచి కొత్తగా రూ. 2.5 లక్షలు విత్‌డ్రా చేసుకోవచ్చని అనుమతించింది. అయితే, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్.బి.ఐ) పెట్టిన సవాలక్ష షరతులతో అదీ చాలా కష్టంగా మారింది. ‘పెద్ద నోట్ల ఉపసంహరణ’ కన్నా ముందే బ్యాంకు ఖాతాలో అంత మొత్తం ఉంటేనే, ఈ రెండున్నర లక్షలు విత్ డ్రా చేయడానికి అనుమతిస్తారు. లేదంటే కుదరదు. అందుకే, పారితోషికం డబ్బు ఇవ్వాల్సినవాళ్ళు చెక్ రూపంలో ఇప్పుడు ఇచ్చినా, ఆ మొత్తం నవంబర్ 8 కన్నా ముందరే ప్రసాద్ బ్యాంకు ఖాతాలో లేదు కాబట్టి, పెళ్ళి ఖర్చుకు రూ. 2.5 లక్షల లెక్కలో ఆ మొత్తం విత్ డ్రా చేయలేని పరిస్థితి ఆ మధ్యతరగతి మనిషికి తలెత్తింది. పిల్ల పెళ్ళి కోసం ఇప్పుడా ఆడపిల్ల తండ్రి తల తాకట్టు పెట్టే పనిలో ఉన్నారు. బడాబాబులు, రాజకీయ నాయకుల ఇళ్ళల్లోని పెళ్ళిళ్ళకు మాత్రం ఈ కరెన్సీ కష్టాలేవీ అంటలేదు. గత నాలుగు వారాల్లో పెద్దవాళ్ళ ఇళ్ళల్లో ఆర్భాటంగా జరిగిన ఆడంబర వివాహాలు, మీడియాలో వచ్చిన వాటి వార్తలే అందుకు ఉదాహరణ. కుటుంబమంతా క్యూలోనే! బ్యాంకు ఖాతాలో డబ్బున్నా, వారానికి 24 వేల రూపాయలకు మించి విత్‌డ్రా చేయడానికి వీలు లేదన్న బ్యాంకు నిబంధన. దాంతో, పెళ్ళిళ్ళు ఉన్న మధ్యతరగతి కుటుంబాలు ఇంట్లో ఎవరెవరికి ఖాతా ఉంటే, వారంతా వారం వారం క్యూలో నిలబడి డబ్బులు తెస్తున్న సంఘటనలూ ఉన్నాయి. అమ్మాయి పెళ్ళి పెట్టుకున్న విశాఖపట్నంలోని ప్రభుత్వోద్యోగి నవీన్ కుటుంబం ఇప్పుడు ఆ పనే చేస్తోంది. సీతమ్మధారలోని బ్యాంక్ బ్రాంచ్ చుట్టూ తిరగడం, క్యూలో గడపడం నిత్యకృత్యమైపోయింది. మ్యారేజ్... ఓ మెగా ఇండస్ట్రీ! దేశంలో ఇవాళ వివాహాలు, దాని చుట్టూ జరిగే ఖర్చులు, కొనుగోళ్ళు, వగైరా అంతా ఓ అతి పెద్ద ఇండస్ట్రీ. మన ఇండియన్ వెడ్డింగ్ ఇండస్ట్రీ పరిమాణం దాదాపు రూ. 1 లక్ష కోట్ల నుంచి 1.25 లక్షల కోట్లని అంచనా ఈ పరిశ్రమ ఏటా 25 నుంచి 30 శాతం మేర పెరుగుతోంది ఇవాళ మన భారతదేశ జనాభాలో దాదాపు సగం మంది 29 ఏళ్ళ లోపు వయసు వాళ్ళే! అంటే, రాగల అయిదు నుంచి పదేళ్ళలో ఈ మ్యారేజ్ మార్కెట్ సైజు ఇంకా ఇంకా పెరుగుతుంది పెళ్ళిళ్ళ సీజన్లో... ఏటా 3 లక్షల పైగా ఉద్యోగాలు, ఉపాధి వస్తాయట! పెళ్ళికి పెద్ద అప్పు మిగిలింది! పెద్ద నోట్ల ఉపసంహరణ దెబ్బ మధ్యతరగతి వాళ్ళ ఇంటిలో పెళ్ళిళ్ళ మీదే కాదు... దిగువ శ్రేణి ఇళ్ళల్లో పెళ్ళిళ్ళపైనా పడింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లల పెళ్ళిళ్ళ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశించిన సంక్షేమ పథకాల డబ్బులు కూడా ఇప్పుడు బ్యాంకుల్లో ఇరుక్కుపోయాయి. దళితులు, గిరిజనులు, ఇతర వెనుకబడిన కులాలు (ఓ.బి.సిలు), ముస్లిమ్ కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు పెళ్ళి జరుగుతుంటే, వాళ్ళ తల్లితండ్రుల ఆదాయం ఏడాదికి లక్షన్నర రూపాయల లోపు అయితే, ‘షాదీ ముబారక్’, ‘కల్యాణ లక్ష్మి’ పథకాల ద్వారా రూ. 51 వేలు ప్రభుత్వం సాయం చేస్తుంది. దళారుల ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ప్రభుత్వం ఆ డబ్బుల్ని ఆన్లైన్లో చెల్లిస్తుంటుంది. సర్వసాధారణంగా సరిగ్గా పెళ్ళికి కొద్ది రోజుల ముందే లబ్ధిదారులు ఈ డబ్బు విత్‌డ్రా చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి లబ్ధిదారుల్లో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు. అక్కడ బ్యాంకుల్లో నగదు నిల్వలే తక్కువ. ఉన్న డబ్బులు, కొత్త కరెన్సీ వచ్చినంత వేగంగా ఖాళీ అయిపోతున్నాయి. ఏ.టి.ఎం.లు ఏ మాత్రం పనిచేస్తున్నాయో అందరికీ తెలిసిందే. దీంతో, దిగువ తరగతి వాళ్ళు తిప్పలు పడుతున్నారు. ఖర్చు తడిసిమోపెడు! చెక్కులు, డిజిటల్ చెల్లింపుల ద్వారా కల్యాణం కథ నడిపించవచ్చుగా అని కొందరు సన్నాయి నొక్కులు నొక్కవచ్చు. కానీ, ఇవాళ్టికీ మన దేశంలో పెళ్ళిళ్ళు అంటే, దాదాపు 70 - 75 శాతం చెల్లింపులు నగదు రూపంలోనే జరుగుతాయి. కల్యాణ మండపాల సంగతికొస్తే - నగరంలో ఉన్న ప్రాంతాన్ని బట్టి వాటికి 14 నుంచి 30 శాతం దాకా పన్ను పడుతుంది. అందుకే, అవి నిర్ణీత రుసుములో కొంత వరకే చెక్కు రూపంలో తీసుకొని, మిగతాది నగదు రూపంలో తీసుకుంటూ వచ్చాయి. తీరా ఇప్పుడు అంతా చెక్కుగా తీసుకోవాల్సి వచ్చేసరికి, వాటికి అదనంగా పన్ను పడుతోంది. అందుకే, అవి కొత్తగా పడుతున్న ఆ అదనపు భారం కూడా పెళ్ళివారే భరించాలంటూ, అదనపు రుసుము డిమాండ్ చేస్తున్నాయి. అసలే చేతిలో డబ్బుకు కటకటలాడుతున్న పెళ్ళింటివాళ్ళకు ఖర్చు తడిసిమోపెడవుతోంది. మూలిగే నక్క మీద తాటిపండు పడిన పరిస్థితి ఎదురవుతోంది. ఇలాంటి ఇబ్బందులు పడలేక... కేంద్ర సర్కారు వారి హఠాత్ నిర్ణయంతో చాలామంది తమ ఇంట్లో పెళ్ళిళ్ళను జనవరి, ఫిబ్రవరికి వాయిదా వేసుకున్నారు. ఆడంబరానికి అనుకోని బ్రేక్! అనుకోకుండా వచ్చిన కరెన్సీ కష్టాలతో అక్కడక్కడా ఊహించని కొంత మంచి కూడా జరుగుతున్నట్లుంది. సంగీత్‌లు, రిసెప్షన్లు అంటూ ఇటీవల ఒకటికి మూడు రోజుల పాటు ఆడంబరంగా చేస్తున్న వేడుకల జోరుకు తాజా దెబ్బతో కొంత బ్రేక్ పడింది. వంద రకాల వెరైటీలతో తినేవాళ్ళ కన్నా వేస్టేజ్ ఎక్కువగా సాగుతున్న విందుల విషయంలో వధూవరుల కుటుంబాలు ఆగి, ఆలోచించడం మొదలుపెట్టాయి. సర్వసాధారణంగా అతి భారీ ఖర్చుతో సాగే పంజాబీ పెళ్ళిళ్ళు కూడా ఇప్పుడు ఆదా బాట పట్టాయి. మధ్యతరగతి కుటుంబాలు తమ ఇంటి పెళ్ళిళ్ళను హోటళ్ళ నుంచి గురుద్వారాలకూ, మందిర్లకూ మార్చేస్తున్నాయి. పనిలో పనిగా, ‘షాగన్లు (బహుమానంగా డబ్బు ఉంచిన కవర్లు) వద్దు’ అంటూ శుభలేఖలతో పాటు చిన్న కాగితం కూడా పెట్టేస్తున్నారు. అతిథుల జాబితాను కుదిస్తున్నారు. అలంకరణలు తగ్గిస్తున్నారు. అలా ఖర్చు దాదాపు 20 నుంచి 40 శాతం దాకా తగ్గించుకుంటున్నట్లు ఒక అంచనా. కొత్త రకం మ్యారేజ్ ట్రెండ్స్! మారిన పరిస్థితులకు తగ్గట్లు కొన్ని పెళ్ళిళ్ళలో పద్ధతులూ చకచకా మారుతున్నాయి. శుభలేఖల ప్రింటింగ్ ఖర్చు లేకుండా ‘ఇ-కార్డులు’గా మెయిల్, వాట్సప్ చేస్తున్నారు. ఒకవేళ శుభలేఖలు ప్రింట్ కొట్టించినా, ‘పే టి.ఎం’, ‘అమెజాన్ గిఫ్ట్ కార్డ్‌లు’, ‘సోడెక్సో’ల ద్వారా, ఆన్లైన్ లావాదేవీల ద్వారా కానుకల్ని స్వీకరిస్తామంటూ శుభలేఖల్లోనే ‘గమనిక’ రాయడం లేటెస్ట్ ట్రెండ్. కొన్ని పెళ్ళి మండపాల్లో నగదు గిఫ్ట్స్ తీసుకోవడానికి స్వైప్ మిషన్లు వెలిశాయి. మండపంలో స్వైప్ మిషన్ చేత పట్టుకొని కూర్చొన్న వధూవరుల ఫోటోలు ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. పెళ్ళిళ్ళలో ఆన్లైన్లో కానుకలు ఇవ్వడమనే ట్రెండ్ విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం లాంటి నగరాల్లో క్రమంగా ఊపందుకుంటోంది. అయితే, ప్లాస్టిక్ మనీ, ఇ-వ్యాలెట్లు, ఆన్లైన్ బ్యాంకింగ్ లాంటివి పెద్దగా అలవాటు లేని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పెళ్ళి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. దేశంలోని బ్యాంకుల్లో దాదాపు 38 శాతమే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఆ మాటకొస్తే, బ్యాంకులు దండిగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో చాలామంది జనానికి కూడా ఇప్పటికీ మొబైల్ పేమెంట్స్ లాంటివీ తెలీవు. కెన్యా లాంటి దేశంలో కూడా నూటికి 53 మందికి మొబైల్ పేమెంట్స్ గురించి అవగాహన ఉంటే, మన దేశంలో నూటికి 12 మందికే దాని గురించి తెలుసు. కెన్యాలో 31 శాతం మంది ఆ రకం చెల్లింపుల విధానం పాటిస్తుంటే, మన దగ్గర కేవలం 5 శాతం మందే మొబైల్ చెల్లింపులు చేస్తున్నారు. ఈ వాస్తవ పరిస్థితుల నేపథ్యం, దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ ఉన్న నగదు కొరత మూలంగా... ఇప్పుడు ‘పెళ్ళి చేసి చూడు’ అన్నది అసలు సిసలు సవాలుగా మారింది. ఇంట్లో పెళ్ళితో ఆనందం కన్నా, ఆందోళన పెరిగింది. క్యాష్ లెస్ పెళ్ళి... జోష్ లెస్ మ్యారేజ్ అయింది. - రెంటాల జయదేవ -
ప్రజలను ‘క్యాష్‌లెస్’ వైపు మళ్లించాలి
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సలో సీఎస్ ప్రదీప్ చంద్ర ఆదేశం - ఇందుకోసం డిజిటల్ లిటరసీ కార్యక్రమాలు చేపట్టాలి - నగదు రహిత లావాదేవీలపై ప్రజలు,వ్యాపారస్తులకు అవగాహన కల్పించాలి - జన్‌ధన్ ఖాతాదారులందరికీ రూపే కార్డులు ఇవ్వాలి - బ్యాంకు ఖాతాలన్నింటినీ ఆధార్‌తో అనుసంధానించాలి - ‘ఆసరా’ చెల్లింపులన్నీ బ్యాంకులు,పోస్టాఫీసుల ద్వారానే జరిగేలా పర్యవేక్షించాలి సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత ఏర్పడిన కరెన్సీ కొరతను అధిగమించేందుకు ప్రజలందరినీ క్యాష్‌లెస్ చెల్లింపుల వైపు మళ్లించాలని, ఇందుకు డిజిటల్ లిటరసీ క్యాంపెరుున్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ప్రదీప్ చంద్ర కలెక్టర్లను ఆదేశిం చారు. నోట్ల రద్దు అంశంపై శనివా రం ఆర్థిక, ఐటీ అధికారులతో కలసి కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ కేంద్రం నోట్ల రద్దు నేపథ్యంలో ఎదురయ్యే పరిస్థితు లను ఎదుర్కోవడానికి వ్యూహం రూపొందిం చాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో ప్రజలు, వ్యాపా రస్తులను డిజిటల్ లావా దేవీల వైపు మళ్లిం చాలన్నారు. డిజిటల్ లిట రసీ ప్రజల్లోకి వెళ్లేలా పెద్ద ఎత్తున కార్యక్ర మాలు నిర్వహించాలని, జన్‌ధన్ ఖాతాలు ఉన్న వారందరికీ రూపే కార్డులు అందించ డంతోపాటు వాటిని వినియోగించేలా అవగాహన కల్పించాలన్నారు. కార్డులు ఉండి వినియోగించని వాటిని వాడుకలోకి తీసుకురా వాలన్నారు. ప్రతి బ్యాంకు ఖాతా నూ ఆధార్‌తో అనుసంధానించాలని సూచిం చారు. రాష్ట్రంలో 4.2 లక్షల మందికి ఆసరా పింఛన్లు నగదు రూపంలో పంపిణీ అవుతు న్నాయని, వాటిని బ్యాంకులు, పోస్టాఫీస్‌ల ద్వారా అందేలా చూడాలన్నా రు. ఈ నెలలో పోస్టాఫీసుల ద్వారా ఆసరా పింఛన్ల పంపి ణీని ప్రత్యక్షంగా పర్యవేక్షించా లని సీఎస్ సూచించారు. కొత్త జిల్లాల్లో కలెక్టర్లు సమర్థంగా పనిచేస్తున్నందుకు సీఎస్ వారిని ప్రత్యేకంగా అభినందించారు. 7, 8 తేదీల్లో అవగాహన కార్యక్రమాలు: జయేశ్ రంజన్ ఎలక్ట్రానిక్ పేమెంట్లపై వ్యాపారస్తులు, ప్రజ ల్లో ఉన్న సందేహాలను తీర్చేందుకు ఈ నెల 7, 8 తేదీలలో జిల్లా కేంద్రాలలో అవగా హన కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ కోరారు. ఐటీ శాఖ, మీ-సేవ (మం డల కేంద్రాల్లో), వలంటీర్ల ద్వారా (గ్రామ పంచాయతీల్లో) ప్రజలకు శిక్షణ ఇస్తామని, మన టీవీ ద్వారా శిక్షణ కార్యక్ర మాలను ప్రసారం చేస్తామన్నారు. రాష్ట్రంలో 81.71 లక్షల జన్‌ధన్ ఖాతాలున్నాయని, 70 లక్షల దాకా రూపే కార్డులు ఇచ్చారని, 12 లక్షల మందికి కార్డులు ఇవ్వాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సూచిం చారు. సమావేశంలో ఎంఏయూడీ కార్యదర్శి నవీన్ మిట్టల్, ఆర్థిక శాఖ కార్య దర్శి సందీప్ కుమార్ సుల్తానియా పాల్గొన్నారు. నగదు రహితానికి అందరూ అలవాటుపడాలి: సీఎస్ సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ తీసుకున్న రూ. 500, రూ. వెరుు్య నోట్ల రద్దు నిర్ణయం శాశ్వత ప్రభావం చూపనుందని సీఎస్ కె.ప్రదీప్ చంద్ర పేర్కొన్నారు. రద్దు చేసిన నోట్ల స్థానంలో కొత్త నోట్లు 25 నుంచి 30 శాతం వరకు మాత్రమే వచ్చే అవకాశముందన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ నగదురహిత లావాదేవీలకు అలవాటుపడక తప్పదని అభిప్రా యపడ్డారు. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డులు, బ్యాంకింగ్ యాప్‌లతో ఆర్థిక లావా దేవీలు జరపడాన్ని అందరూ నేర్చుకోవాలని సూచించారు. నగదు రహిత లావా దేవీలపై శనివారం రాష్ట్ర ఆర్థిక శాఖ సచివాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన శిబి రంలో ప్రదీప్ చంద్ర సచివాలయ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. నగదు రహితంతో లావాదేవీలన్నీ లెక్కల్లోకి వస్తాయని, దీంతో పన్నుల వసూళ్లు సైతం సులువవుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
తక్షణమే అసెంబ్లీని సమావేశపర్చాలి
• సీఎల్పీ డిమాండ్ • బడ్జెట్ కేటారుుంపులకు ‘కోత’ ప్రకటనలపై ఆగ్రహం • నయీమ్ కేసును సీబీఐకి ఇవ్వాలి.. • కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో షాడో కేబినెట్ ఏర్పాటుకు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దును సాకుగా చూపి రాష్ట్ర బడ్జెట్ కేటారుుంపుల్లో కోతపెడతామంటూ అప్రజాస్వామికంగా ఎలా నిర్ణరుుంచుకుంటారని ప్రభుత్వంపై కాంగ్రెస్ శాసనసభాపక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎల్పీ నేత కె.జానారెడ్డి అధ్యక్షతన పార్టీ శాసనభ్యులు, శాసనమండలి సభ్యులు అసెంబ్లీలోని కమిటీహాలులో గురువారం సమావేశమయ్యారు. మండలిలో కాంగ్రెస్‌నేత షబ్బీర్ అలీ, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశం వివరాలను సీఎల్పీ కార్యదర్శి పి.రామ్మోహన్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గిందని, ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటారుుంపుల్లో శాఖలవారీగా కోత పెడతామని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ చేసిన ప్రకటనపై సీఎల్పీ ఆగ్రహం వ్యక్తం చేసింది. శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై శాసనసభలో చర్చ జరిగి.. ఆమోదం పొందిందని గుర్తుచేశారు. ఆదాయం తగ్గిందనే సాకుతో బడ్జెట్ కేటారుుంపుల్లో కోతపెట్టే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. శాసనసభ ఆమోదించిన బడ్జెట్‌ను, అదే సభలో చర్చించకుండా, ఆమోదం తీసుకోకుండా కోతపెడ్తామని ఆర్థిక మంత్రి ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారని సీఎల్పీ ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వానికి తగ్గిన ఆదాయం ఎంత, పెద్ద నోట్ల రద్దు వల్ల వచ్చే నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు ఏమిటి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కలసిన సందర్భంలో చర్చలు ఏమిటి, సీఎం కేసీఆర్ ఇచ్చిన లేఖలో ఏముందనేది అసెంబ్లీలో చర్చించాలని సీఎల్పీ డిమాండ్ చేసింది. పెద్దనోట్ల రద్దు ప్రభావం, ఆదాయం తగ్గడంపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరింది. వీటిపై చర్చించడానికి వెంటనే అసెంబ్లీని సమావేశపర్చాలని డిమాండ్ చేసింది. ఈ నెల 5లోగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలనే డిమాండ్‌పై ప్రభుత్వం స్పందించాలని కోరింది. లేకుంటే అసెంబ్లీలోని గాంధీవిగ్రహం దగ్గర ఈ నెల 5న నిరసన వ్యక్తం చేయాలని నిర్ణరుుంచింది. ఓటుకు కోట్లు కేసుపై సీబీఐ విచారణ జరిపించాలి... గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్కౌంటర్, ఓటుకు కోట్లు కేసులను సీబీఐతో విచారణ జరిపించాలని సీఎల్పీ డిమాండ్ చేసింది. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత వేలకోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం ఉందని, ఆ డబ్బంతా ఏమైందని ప్రశ్నించింది. నయీమ్ దాచిపెట్టుకున్న వేలకోట్ల రూపాయలను ప్రభుత్వంలోని ముఖ్యులు తీసుకున్నారా, ప్రభుత్వమే స్వాధీనం చేసుకుందా, పోలీసులు పంచుకున్నారా అనేది తేల్చాలని డిమాండ్ చేసింది. ఓటుకు కోట్లు కేసులో టీడీపీ నేత రేవంత్‌రెడ్డిని అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించింది. సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు మధ్య చీకటి ఒప్పందం జరిగినందుకే ఈ కేసును నీరుగారుస్తున్నారని ఆరోపించింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మధ్యవర్తిగా చంద్రబాబు, కేసీఆర్‌ను కలిపారని ఆరోపించింది. శాఖలవారీగా షాడో కేబినెట్ రాష్ట్రంలో శాఖల వారీగా జరుగుతున్న పనులపై షాడో కేబినెట్‌గా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరించాలని సీఎల్పీ నిర్ణరుుంచినట్టు తెలుస్తోంది. ఏ శాఖపై ఎవరు అధ్యయనం చేయాలన్న అంశంపై నిపుణులతో చర్చించే బాధ్యతలను పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీమంత్రి టి.జీవన్‌రెడ్డికి అప్పగించారు. పీసీసీ, సీఎల్పీ మధ్య ఉన్న సమన్వయలోపంపైనా ఈ సమావేశంలో చర్చించారు. అలాగే రైతులకు రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రీరుుంబర్సుమెంట్పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శాసనసభలో చేసిన హామీని అమలుచేయకపోవడంపై సభాహక్కుల ఉల్లంఘన కింద నోటీసు ఇవ్వాలని నిర్ణరుుంచినట్టు తెలిసింది. -
జీడీపీ వృద్ధి రేటును ఒక శాతం తగ్గించిన క్రిసిల్
• 2016-17లో 6.9%కి తగ్గింపు • ద్రవ్యోల్బణం తగ్గుతుందని వెల్లడి ముంబై: నోట్ల రద్దు కారణంగా ఆర్థిక రంగం కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుందన్న ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్... దేశ జీడీపీ వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గతంలో వేసిన అంచనా 7.9 శాతం నుంచి 6.9 శాతానికి సవరించింది. అదే సమయంలో వినియోగధరల ఆధారిత ద్రవ్యోల్బణం సైతం అంచనా వేసిన 5 శాతం కంటే తక్కువగా 4.7 శాతంగా ఉంటుందని క్రిసిల్ తెలిపింది. డీమోనటైజేషన్ తర్వాత తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనడానికి మరి కొంత సమయం పడుతుందని, వినియోగం తగ్గడం వల్ల ద్రవ్యోల్బణం కూడా దిగివస్తుందని క్రిసిల్ తన నివేదికలో పేర్కొంది. ‘‘నగదుకు కొరత వల్ల జీడీపీలో 55 శాతంగా ఉన్న ప్రైవేటు వినియోగంపై నేరుగా ప్రభావం పడుతుంది. దీంతో మూడు, నాలుగో త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధి రేటు తగ్గుముఖం పడుతుంది’’ అని క్రిసిల్ వివరించింది. నోమురా అంచనా 6.5 శాతం ముంబై: డీమోనటైజేషన్ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతానికి తగ్గుతుందని భావిస్తున్నట్టు ఆర్థిక సేవల సంస్థ నోమురా తెలిపింది. ఈ ప్రభావం 2017 సంవత్సరం మొదటి మూడు నెలల కాలంలోనూ కొనసాగవచ్చని పేర్కొంది. నోట్ల రద్దుకు ముందు ఆర్థిక రంగంలో పటిష్ట పరిస్థితులు ఉండగా... పెట్టుబడుల్లో బలహీనత కారణంగా తిరిగి ఆ స్థారుుకి చేరుకోవడానికి సమయం పడుతుందని ఈ సంస్థ అంచనా వేసింది. వ్యవసాయేతర, వినియోగ ఆధారమైన రంగాల కార్యకలాపాలు నిదానించడమే ఇందుకు కారణాలుగా పేర్కొంది. ఇక బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ సైతం ఇదే విధమైన అంచనాలను ప్రకటించింది. నోట్ల రద్దు వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.9 శాతానికి దిగివస్తుందని తెలిపింది. -
మాటల గారడీతో మభ్యపెడుతున్నారు
దుబ్బాక సభలో సీఎం కేసీఆర్‌పై తమ్మినేని ధ్వజం దుబ్బాక: ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మాటల గారడీతో ప్రజలను సీఎం కేసీఆర్ మభ్యపెడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. బుధవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మహా జన పాదయాత్రసభలో ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్రం సిద్ధించినా తెలంగాణ ప్రజల బతుకులు మారలేదని, సీఎం కుటుంబ సభ్యులు మాత్రమే లబ్ధిపొందారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ఇతర రంగాలకు మళ్లిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. అంగన్వాడీ, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారన్నారు. ‘నోట్ల రద్దు’పై కేసీఆర్ వైఖరి మార్చుకోవాలంటూ తమ్మినేని లేఖ సాక్షి, హైదరాబాద్: ‘నోట్ల రద్దు’అంశంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై పునరాలోచించాలని సీఎం కేసీఆర్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వీరభద్రం బుధవారం సీఎం కేసీఆర్‌కు ఓ లేఖ రాశారు. సిద్దిపేట జిల్లా ధర్మారంలో బాలయ్య అనే రైతు ‘నోట్ల’సమస్య కారణంగా తన కుటుంబానికి విషమివ్వగా.. ఆయనతో పాటు తండ్రి గాలయ్య కూడా మృతి చెందారని పేర్కొన్నారు. -
రియల్టీపై నోట్ల రద్దు ప్రభావం లేదు
• 2017 ప్రథమార్థం వరకూ స్థిరంగానే ధరలు • ఆ తర్వాత 10-12 శాతం పెరిగే అవకాశం • హైదరాబాద్‌లో కొనుగోళ్లకు తరుణమిదే • ఆఫీసు, వాణిజ్య విభాగాలపై తాత్కాలిక ప్రభావం • జీఎస్టీ, రెరా బిల్లులతో ప్రాపర్టీ విలువలు పెరుగుతాయ్ • క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ అంచనాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెద్ద నోట్ల రద్దు ప్రభావం హైదరాబాద్ స్థిరాస్తి రంగంపై... అందులోనూ నివాస సముదాయాల విభాగంపై ఏమాత్రం లేదని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) హైదరాబాద్ చాప్టర్ చెప్పింది. ‘‘ఇక్కడ స్థిరాస్తి రంగంలో 90-95 శాతం మార్కెట్ మధ్య తరగతి గృహ విభాగానిదే. పైగా 80-85 శాతం స్థిరాస్తి కొనుగోళ్లు గృహ రుణాలు, పొదుపు చేసిన సొమ్ముతోనే జరుగుతారుు. అంటే నగదు రూపంలో లావాదేవీలు చాలా తక్కువగా. ఎక్కువ శాతం చెక్ రూపంలోనే జరుగుతుంటారుు’’ అని క్రెడాయ్ అధ్యక్షుడు ఎస్.రాంరెడ్డి తెలియజేశారు. మంగళవారమిక్కడ ‘‘హైదరాబాద్ రియల్టీ రంగంపై నోట్ల రద్దు, జీఎస్టీ, రెరా బిల్లుల ప్రభావం’’ అనే అంశంపై క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ జనరల్ సెక్రటరీ పి.రామకృష్ణారావుతో కలిసి ఆయన మాట్లాడారు. వారింకా ఏమన్నారంటే.. ⇔ ఇక్కడ రూ.25 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ వుండే ప్రాపర్టీలు ఎక్కువ. వీటి కస్టమర్లు ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, మెడికల్, సర్వీస్ సెక్టార్ ఉద్యోగులే. వీరంతా చెక్ రూపంలోనే కొనుగోళ్లు జరుపుతుంటారు. ⇔ బల్క్ ల్యాండ్స, లే అవుట్ల మార్కెట్లో నగదు లావాదేవీలు కాస్త ఎక్కువ జరుగుతుంటారుు. ఈ విభాగంలో కొంత ప్రభావం ఉంటుంది. అరుుతే హైదరాబాద్‌లో బల్క్ ల్యాండ్స, లే అవుట్ల మార్కెట్ 5-10 శాతమే. కార్యాలయ, వాణిజ్య విభాగంలో కొనుగోళ్ల కంటే ఎక్కువగా లీజు, అద్దె ఒప్పందాలే ఉంటారుు. వాటిపై ఈ ప్రభావం అంతగా ఉండదు. ⇔ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్‌లో స్టాంప్ డ్యూటీ, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్‌లు తక్కువగా 11 శాతం వరకు ఉన్నారుు. అదే కర్ణాటకలో 15-16 శాతం ఉన్నారుు. దీనికితోడు ఇతర మెట్రోలతో పోలిస్తే హైదరాబాద్‌లో స్థిరాస్తి ధరలూ తక్కువే. తాజా పరిస్థితుల నేపథ్యంలో 2017 ప్రథమార్థం వరకు నగరంలో రియల్టీ ధరలు స్థిరంగా ఉంటారుు. కాబట్టి కొనుగోలు దారులకు ఇదే సరైన సమయం. ⇔ ఒకసారి వస్తు సేవల పన్ను (జీఎస్టీ), స్థిరాస్తి నియంత్రణ బిల్లు (రెరా) అమలులోకి వచ్చాక స్థిరాస్తి రంగంలో పారదర్శకత నెలకొంటుంది. ఆయా చట్టాల్లోని నిబంధనలతో అసంఘటిత బిల్డర్లు/డెవలపర్లు నిలదొక్కుకోలేరు. దీంతో పెద్ద బిల్డర్లు మార్కెట్లో ధరలను కృత్రిమంగా పెంచే ప్రమాదం ఉంటుంది. 10-12 శాతం మేర ధరలు పెరిగే అవకాశముంది. ప్రస్తుత పన్నులు 11 శాతం కాగా జీఎస్టీ సుమారు 18 శాతం ఉండొచ్చు. అంటే జీఎస్టీ అమల్లోకి వస్తే స్థిరాస్తి ధరలు పెరిగే అవకాశముందన్నమాట. ⇔ స్థిరాస్తి రంగంలోని రకరకాల పన్నుల వల్లే నగదు రూపంలో లావాదేవీలు జరుగుతున్నారుు. వాటిని తగ్గిస్తే అందరూ చెక్ రూపంలోనే క్రయవిక్రయాలు జరుపుతారు. పన్నులు తగ్గించాలని క్రెడాయ్ తరుఫున ప్రభాత్వాన్ని కోరుతున్నాం. -
వడ్డీ రేట్లు ఇప్పటికింతే..
• డిపాజిట్లు వచ్చినా బ్యాంకులకు దక్కని ప్రయోజనం • సీఆర్ఆర్ పెంపే కారణం • బ్యాంకింగ్ వర్గాల విశ్లేషణ న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో పెద్ద ఎత్తున డిపాజిట్లు వచ్చి పడుతున్నప్పటికీ బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలేమీ కనిపించడం లేదు. నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ను రిజర్వ్ బ్యాంక్ ఎకాయెకిన 100 శాతానికి పెంచేయడంతో అదనపు నిల్వలపై బ్యాంకులకు రాబడి లేకపోవడమే ఇందుకు కారణమని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నారుు. ’వడ్డీ రేట్ల కోత సంగతి అటుంచండి. రద్దు చేసిన రూ. 500/1,000 నోట్ల రూపంలో సేవింగ్స ఖాతాల్లోకి కుప్పతెప్పలుగా వచ్చి పడుతున్న డిపాజిట్లపై 4 శాతం కనీస వడ్డీ రేటు చెల్లించేందుకు తగినన్ని వనరులను వెతుక్కుంటూ బ్యాంకులు నానా కష్టాలు పడుతున్నారుు’ అని సీనియర్ బ్యాంకర్ ఒకరు పేర్కొన్నారు. మరోవైపు, పెట్టుబడులు తరలిపోయే విధంగా వడ్డీ రేట్లు నిర్దిష్ట స్థారుుకన్నా కిందికి పడిపోకుండా కూడా చూడాల్సిన అవసరం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపారుు. ’గిట్టుబాటు కాక పెట్టుబడులు ఒక్కసారిగా అమెరికాకు ఎగిరిపోయేంతగా కూడా వడ్డీ రేట్లు తగ్గించలేం. ఈ విషయంలో సమతూకంతో వ్యవహరించాలి’ అని పేర్కొన్నారుు. నవంబర్ 27 నాటికి బ్యాంకుల్లోకి రూ. 8.11 లక్షల కోట్ల మేర డిపాజిట్లు వచ్చారుు. బ్యాంకింగ్ దిగ్గజాలు ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు మొదలైనవి ఇప్పటికే డిపాజిట్లపై రేట్లు తగ్గించడంతో రుణాలపైనా వడ్డీ రేట్లు తగ్గొచ్చన్న అంచనాలు నెలకొన్నారుు. బ్యాంకులు తమకొచ్చిన లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లను తమ దగ్గర అట్టే పెట్టుకుంటే కుదరదని, వడ్డీ రేట్లు తగ్గించి రుణాలుగా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించడం దీనికి మరింతగా ఊతమిచ్చింది. అరుుతే, అధిక మొత్తంలో డిపాజిట్లు వచ్చి పడినా ఆర్బీఐ ఒక్కసారిగా సీఆర్ఆర్ పెంచేయడంతో .. తక్కువ వ్యయాలతో నిధులు సమకూర్చుకున్న ప్రయోజనం బ్యాంకులకు లేకుండా పోరుుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. దీంతో ఆర్బీఐ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ బ్యాంకులు వడ్డీ రేట్ల ప్రయోజనాలను బదలారుుంచకుండా ఆగే అవకాశం ఉందని వివరించింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచవచ్చేమోనన్న ఆందోళనలతో పాటు అనేక అంశాల ప్రభావంతో రూపారుు మారకం విలువపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఒకవైపు అమెరికా ట్రెజరీ బిల్స్, బాండ్ రేట్లకు అనుగుణంగా వర్ధమాన మార్కెట్లలో బాండ్ ఈల్డ్‌లు (రాబడులు) పెరుగుతుండగా.. భారత్‌లో మాత్రం బాండ్ ఈల్డ్‌లు, ప్రభుత్వ సెక్యూరిటీల రేట్లు తగ్గుతున్నాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి శక్తికాంత దాస్ పేర్కొన్న సంగతి తెలిసిందే. -
నోట్ల రద్దు ప్రయోగం ఫెయిలా!
• ఇప్పటికే ప్రభుత్వం చేతికి 59% పెద్ద నోట్లు • మిగిలిన నోట్లు కూడా గడువుకల్లా • జమ కావొచ్చన్న అంచనాలు • అందుకే మరో స్వచ్ఛంద ఆదాయ • వెల్లడి పథకం అంటున్న నిపుణులు న్యూఢిల్లీ: నోట్ల రద్దుతో నల్లధనానికి చెక్ పెట్టి, ఆ మేరకు ప్రభుత్వ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకుందామని అనుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నం విఫలమైనట్టేనా...? బ్యాంకింగ్ వ్యవస్థలోకి భారీగా వచ్చి పడుతున్న చెల్లని నోట్లను గమనిస్తే ఆర్థిక రంగ పండితులకు ఈ సందేహాలే తలెత్తుతున్నారుు. ఈ సందేహాలు నిజమయ్యే సూచనలూ కనిపిస్తున్నారుు. ప్రస్తుత డీమోనిటైజేషన్ కార్యక్రమంలో భాగంగా చెల్లని నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి డిసెంబర్ 31 వరకు... అంటే మరో నెల రోజుల వ్యవధి ఉంది. అప్పటికి జమయ్యే మొత్తంలో నల్లధనం పరిమాణం మేరకు నగదు బ్యాంకు ఖాతాల్లోకి రాకుండా ఉండాలి. పన్ను అధికారుల విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందన్న భయంతో లెక్కల్లో చూపని నగదును ఖాతాల్లో డిపాజిట్ చేయరన్న అంచనాలున్నారుు. కానీ ప్రభుత్వం ఆశిస్తున్న ఫలితం రాకపోవొచ్చని విశ్లేషకులు అంటున్నారు. గణాంకాలు ఏం చెబుతున్నారుు...? రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నవంబర్ 10 నుంచి 27వ తేదీ మధ్య వెనక్కి వచ్చిన పెద్ద నోట్ల సమాచారాన్ని మాత్రమే ప్రకటించింది. దీని ప్రకారం... నవంబర్ 10-27 మధ్య బ్యాంకుల్లో రూ.8.47 లక్షల కోట్లు డిపాజిట్ అయ్యారుు. ఇది వ్యవస్థలో చెల్లుబాటు కాకుండా పోరుున రూ.500, రూ.1,000 నోట్ల విలువ రూ.15.45 లక్షల కోట్లలో... 54.6 శాతానికి సమానం. సాధారణంగా బ్యాంకుల్లో రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా కొంత నగదు నిల్వలు ఉంటారుు. గతేడాది కాలంలో సగటున చూసుకుంటే బ్యాంకులు రూ.70వేల కోట్ల నగదు నిల్వలను కలిగి ఉన్నారుు. అక్టోబర్ 28 నాటికి ఈ నిల్వలు రూ.75,000 కోట్లుగా ఉన్నారుు. వ్యవస్థలోని నగదులో రూ.500, రూ.1,000 నోట్లు 86 శాతం కనుక... బ్యాంకుల్లోని నగదు నిల్వల్లో చెల్లకుండా పోరుున పెద్ద నోట్ల విలువ రూ.64,500 కోట్లు. అంటే ఇప్పటివరకూ బ్యాంకుల వద్ద జమ అరుున పెద్ద నోట్లు, ఇప్పటికే బ్యాంకుల వద్దనున్న నోట్లతో కలుపుకుంటే... రద్దరుున పెద్ద నోట్ల రూపంలో ప్రభుత్వానికి చేరిన మొత్తం 59 శాతంగా ఉంది. ఇక వ్యవస్థలో మిగిలి ఉన్న పెద్ద నోట్లు 41 శాతమే. చివరకు మిగిలేది...? నల్లధనం కలిగిన వారు ఆదాయపన్ను నిఘాకు దొరక్కుండా పక్క దారులు వెతుక్కోవడం సహజం. ప్రస్తుత డీమోనిటైజేషన్ సమయంలోనూ ఇలాంటి దాఖలాలు కనిపిస్తున్నారుు. ఉదాహరణకు నోట్ల రద్దు నిర్ణయం తర్వాత కేవలం రెండు వారాల్లోనే... ఎప్పుడూ నామమాత్రపు నగదు నిల్వలతో ఉండే జన్‌ధన్ ఖాతాల్లో రూ.27,000 కోట్లు డిపాజిట్ అయ్యారుు. లెక్కల్లో చూపని నగదు ఈ ఖాతాల్లోకి వచ్చిందన్న సందేహాలకే ఈ గణాంకాలు ఆస్కారమిస్తున్నారుు. మరో నెల రోజుల వ్యవధిలో వ్యవస్థలో చెల్లుబాటు కాకుండా పోరుు మిగిలి ఉన్న 41% పెద్ద నోట్లలో గణనీయ స్థారుులో బ్యాంకుల్లోకి వస్తే ప్రభుత్వ ఆశలపై నీళ్లు చల్లినట్టే. దీర్ఘకాలంలో దేశాభివృద్ధి కోసం స్వల్ప కాలం పాటు కష్టాలు ఓర్చుకోండన్న ప్రభుత్వం... అప్పుడు ఏం చెబుతుందో చూడాలి. ప్రభుత్వానికీ వాస్తవం బోధపడిందా...? డీమోనటైజేషన్ విఫలయత్నంగా మారుతుందన్న భయం ప్రభుత్వానికి కూడా పట్టుకుందా..? మరోసారి స్వచ్ఛంద ఆదాయ వెల్లడికి అవకాశం కల్పిస్తూ... దీన్ని వినియోగించుకోని వారిపై భారీ జరిమానాలతో కొరడా ఝుళిపించనున్నట్టు ప్రకటించడం ఇందుకేనా...? ఇప్పుడు ఇవే సందేహాలు వ్యక్తమవుతున్నారుు. తాజాగా ప్రకటించిన ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద లెక్కల్లో చూపని నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేసి 50 శాతం పన్ను చెలిస్తే సరిపోతుంది. మరో 25 శాతాన్ని నాలుగేళ్ల పాటు వడ్డీ రహిత ప్రభుత్వ బాండ్లలో డిపాజిట్ చేస్తే ఆదాయపన్ను విచారణలు ఉండవు. మొత్తానికి నయానో, భయానో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉన్నట్టు తాజా చర్యలు తెలియజేస్తున్నారుు. అసలు నల్లధనం ఎంత...? ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో చాలా మంది సామాన్యులను వేధిస్తున్న ప్రశ్న... అసలు ఆర్థిక వ్యవస్థలో నల్లధనం పాత్ర ఎంత...? పలు అధ్యయనాల ప్రకారం చూస్తే... దేశీయ సమాంతర ఆర్థిక వ్యవస్థ లేదా నల్లధనం అనేది దేశీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో పావు శాతం ఉంటుంది. బ్యాంకు ఆఫ్ మెరిల్ లిచ్ అంచనాల ప్రకారం... భారత జీడీపీ రూ.1,51,78,100 కోట్లు. ఇందులో నల్లధనం 25 శాతం అంటే రూ.37,94,530 కోట్లు. ఈ నల్లధనంలోనూ నగదు రూపంలో ఉన్నది 10 శాతం. అంటే రూ.3,79,450 కోట్లు. ఈ మొత్తం లెక్కల్లో చూపని ఆదాయంగా పరిగణించాల్సి ఉంటుంది. -
ప్రజల మద్దతుతో బంద్ విఫలం: నల్లు
సాక్షి, హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుపై మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విపక్షాలు తలపెట్టిన బంద్‌ను ప్రజలు తిరస్కరించారని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీపై విశ్వాసంతో ప్రజలు దానిని విఫలం చేశారన్నారు. సోమవారం పార్టీ నాయకులు గోలి మధుసూదనరెడ్డి, సుధాకరశర్మ తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దుపై దుష్ర్పచారం చేస్తూ రెచ్చగొట్టేందుకు వివిధ ప్రతిపక్షపార్టీలు ప్రయత్నించినా ప్రజలు ప్రధాని మోదీకే మద్దతు తెలిపారన్నారు. మోదీ నిర్ణయంతో నల్లధనం బయటకు రావడంతో పాటు సంక్షేమ, అభివృద్ధి పథకాలకు మరిన్ని నిధులు అంది, అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగితే తమకు నూకలు చెల్లుతాయనే భయం ప్రతిపక్షాలకు పట్టుకుందన్నారు. నక్సలైట్ల డంప్‌లలో ఉన్న సుమారు రూ.60 వేల కోట్లు మురిగిపోరుునట్లేనన్నారు. ఈ విధంగా ఈ గ్రూపుల కార్యకలాపాలు కూడా తగ్గిపోరుు ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. -
నోట్ల రద్దు నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం
• ఆ అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు • న్యాయవాదులు వెంకటరమణ, కృష్ణయ్యల వాదన • ప్రభుత్వం నోటిఫికేషన్‌తో రూ.1,000, రూ.500 నోట్లు రద్దు చేసింది సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ అన్నారు. నోట్ల రద్దు నోటిఫికేషన్ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించేవిధంగా ఉందని చెప్పారు. 1978లో చట్టం ద్వారా పెద్ద నోట్ల ను రద్దు ద్వారా చేశారని, ప్రస్తుతం అటువం టిదేమీ లేకుండా కేవలం ఓ నోటిఫికేషన్ మాత్రమే జారీ చేసి, రూ.1,000, రూ.500 నోట్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారని తెలి పారు. అప్పట్లో ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటి షన్ దాఖలైందని, అరుుతే సుప్రీంకోర్టు ఆ చట్టాన్ని సమర్థించిందని పేర్కొన్నారు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 26(2) కింద పెద్ద నోట్ల రద్దు అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదని వివరించారు. రూ.1,000, రూ.500 నోట్ల రద్దుకు సంబం ధించి కేంద్ర ప్రభుత్వం ఈ నెల 8న జారీ చేసిన నోటిఫికేషన్‌ను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ హైదరా బాద్‌కు చెందిన సుక్కా వెంకటేశ్వర రావు, న్యాయవాది కె.శ్రీనివాస్‌లు వేర్వేరుగా పిటి షన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను తాత్కా లిక ప్రధాన న్యాయమూర్తి రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి అంబటి శంకరనారాయణతో కూడిన ధర్మాసనం సోమవారం విచారిం చింది. వెంకటేశ్వరరావు తరఫున వేదుల వెంకటరమణ వాదనలు వినిపించగా, శ్రీని వాస్ తరఫున పి.వి.కృష్ణయ్య వాదించారు. రద్దు చేసిన నోట్ల చెల్లుబాటుకు గడువు తేదీని కేంద్రం నిర్ణరుుంచిందని, సెక్షన్ 26(2) కింద అది చట్ట రూపంలో ఉండాలని, దానిని పార్లమెంట్ మాత్రమే చేయగలదని వెంకట రమణ తెలిపారు. ఈ కారణంగానే ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 26కు ‘ఏ’ను జత చేసి 1956లో సవరణ తీసుకొచ్చారని వివరిం చారు. ఇప్పుడు కేంద్రం అటువంటిదేమీ చేయకుండా నోటిఫికేషన్ ద్వారా మొత్తం ప్రక్రియను పూర్తి చేసిందన్నారు. చట్టాన్ని చేసే అధికారాన్ని బదలారుుంచడానికి వీల్లేద న్నారు. నోట్ల రద్దు వల్ల సామాన్యులు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని వివరించారు. పౌరుల హక్కులను హరిస్తున్న కేంద్రం ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ప్రతిపాదనలు, సిఫారసుల మేరకు కేంద్రం నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందని పీవీ కృష్ణయ్య పేర్కొ న్నారు. అందరితోనూ చర్చించి, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతనే నిర్ణయం తీసుకోవాలన్నారు. ధర్మాసనం స్పందిస్తూ ముందుగా అందరితో చర్చిస్తే, నోట్ల రద్దు ఉద్దేశం నెరవేరదు కదా? అని వ్యాఖ్యానించింది. పౌరుల హక్కుల విష యంలో కేంద్రం ఒకపక్క జోక్యం చేసు కుంటూ, మరోపక్క వాటిని హరిస్తోందని కృష్ణయ్య తెలిపారు. కేంద్రం తరఫున అద నపు సొలిసిటర్ జనరల్ వాదనలు వినేందుకు వీలుగా తదుపరి విచారణను ధర్మాసనం మంగళవారానికి వారుుదా వేసింది. నగదు విత్‌డ్రా పై పరిమితి విధించే అధికారం లేదు: మైసూరా కేంద్రం నగదు ఉపసంహరణను రూ.10 వేలకు, వారానికి గరిష్టంగా రూ.20 వేలకు పరి మితం చేయడాన్ని మాజీమంత్రి మైసూరారెడ్డి హైకోర్టులో సోమవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. నగదు ఉపసంహరణపై పరిమితి విధించేందుకు కేంద్ర ప్రభు త్వానికి ఎటువంటి అధికారం లేదని పేర్కొన్నారు. రూ.100, రూ.500 నోట్లు విసృ్తతంగా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు తక్షణమే చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యాన్ని తక్షణమే విచారిం చాలని మైసూరా తరఫు న్యాయవాది అభ్యర్థించగా ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం అందుకు అంగీకరించలేదు. -
నోట్ల రద్దు సమస్యల్ని తొలగించే ఆవిష్కరణలు రావాలి
నాట్కామ్-2016 సదస్సులో మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: పెద్దనోట్ల రద్దు ప్రభావంతో దేశవ్యాప్తంగా సామాన్యులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వారి కష్టాలను తొలగించే ఆవిష్కరణలను తెచ్చేందుకు సప్లయ్ చైన్ మేనేజ్మెంట్(ఎస్సీఎం) ప్రొఫెషనల్స్ శ్రీకారం చుట్టాలని ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు విజ్ఞప్తి చేశారు.‘సప్లయ్ చైన్ మేనేజ్మెంట్- న్యూ పారడిమ్ త్రూ నెట్వర్కింగ్ ఫర్ మేకిన్ ఇండియా’ అంశంపై ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్ మేనేజ్మెంట్(ఐఐఎంఎం) శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన జాతీయ సదస్సు(నాట్కామ్- 2016)ను ఆయన ప్రారంభించారు. సప్లయ్ చైన్ మేనేజ్మెంట్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స(ఐవోటీ)కీలకంగా మారిందని, డీమోనిటైజేషన్‌తో ఏర్పడిన సమస్యలకు నాట్కామ్ సదస్సు ద్వారా పరిష్కారాలను తగిన సలహాలను అందజేయాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లో ఐఐఎఎం ఎంపిక చేసిన పలువురికి ఉత్తమ సీఈవో, ఎంటర్ప్రెన్యూర్ పురస్కారాలను మంత్రి కేటీఆర్ అందజేశారు. రాంకీ గ్రూప్ చైర్మన్ ఎ.అయోధ్యరామిరెడ్డి, ఆర్ఐఎన్ఎల్ సీఎండీ పి.మధుసూదన్‌కు ఉత్తమ సీఈవోలుగా, హెచ్ఎఎల్, సైయంట్ సంస్థల చైర్మన్లు సువర్ణరాజు, బీవీ మోహన్‌రెడ్డికి ఉత్తమ వ్యాపార వేత్తలుగా పురస్కారాలను అందించారు. కార్యక్రమంలో నాట్కామ్-2016 చైర్మన్ మహేందర్‌కుమార్, ఐఐఎంఎం జాతీ య అధ్యక్షుడు ఓపీ లోంగియా తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యామ్నాయం చూపేవరకు పాత నోట్లు అనుమతించాలి
హిమాయత్‌నగర్: దేశంలో కొత్త కరెన్సీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకూ పాత కరెన్సీ చెల్లుబాటయ్యేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలు సంఘాలకు చెందిన నాయకులు కోరారు. మంగళవారం హిమాయత్‌నగర్‌లోని అమృత ఎస్టేట్స్‌లో అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం(ఎఐపీఎస్ఓ) ఆధ్వర్యంలో పాతనోట్లపై రౌండ్ టేబుల్ సమావేశాశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డి మాట్లాడుతూ రద్దయిన పాత నోట్ల స్థానంలో కొత్త కరెన్సీని వెంటనే అందుబాటులో తేవాలన్నారు. అవి వచ్చే వరకూ పాత కరెన్సీ చెల్లుబాటు అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నోట్ల రద్దు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మాజీ రాజ్యసభసభ్యులు అజీజ్పాషఅ మాట్లాడుతూ గతంలో ప్రభుత్వాలు నోట్లను రద్దుచేసినప్పుడు పెద్ద ఫలితాలేమీ రాలేదన్నారు. మాజీ ఎమ్మెల్సీ గుండా మల్లేష్, సిపిఐ గ్రేటర్ కార్యదర్శి డాక్టర సుధాకర్ మాట్లాడుతూ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ లేకుండా నోట్ల రద్దను ప్రకటించడం సరైంది కాదన్నారు. దీనివల్ల పేద వర్గాలకు చెందిన వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. -
23న రాష్ట్రానికి కేంద్ర బృందం
నోట్ల రద్దు ప్రభావంపై అధ్యయనం - క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులపై ఆరా - వివిధ రంగాల వారీగా నష్టాన్ని నివేదించనున్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం విశ్లేషించుకుంటోంది. ఇందులో భాగంగా క్షేత్రస్థా రుులో వాస్తవ పరిస్థితులు, నోట్ల రద్దు ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు కేంద్ర అధికారుల బృందం ఈనెల 23న రాష్ట్రానికి రానుంది. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఈ బృందం రెండు రోజులు పర్యటించనుంది. వివిధ శాఖలకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులు ఈ బృందంలో ఉంటారు. తెలంగాణలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రభావం ఎలా ఉందో అధ్యయనం చేస్తారు. బ్యాంకులు, ఏటీఎంలు ఎలా పనిచేస్తున్నాయి.. ప్రజలకు, ఖాతాదారులకు సత్వర సేవలందిస్తున్నాయా లేదా అనే దాన్ని క్షేత్రస్థారుులో పరిశీలిస్తారు. రైతులు, చిరు వ్యాపారులు, ఉపాధి హామీ కూలీలు, అసంఘటిత రంగాల వారిపై ఎలాంటి పరిణామాలున్నాయో అడిగి తెలుసుకుంటారు. రాష్ట్రంలోని దాదాపు 85 శాతం ఏటీఎంలలో నగదు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. బ్యాంకు బ్రాంచీల్లోనూ కరెన్సీ లేక డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రీ పగలు ఏటీఎంలు, బ్యాంకుల వద్ద ప్రజలు గంటల తరబడి క్యూలలో నిరీక్షిస్తున్న సంఘటనలు కోకొల్లలు. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం రాక ప్రాధాన్యం సంతరించుకుంది. నోట్ల రద్దు వల్ల వివిధ రంగాలపై తీవ్ర ప్రభావముం టుందని, రాష్ట్ర ఆదాయం తగ్గిపోయే ప్రమాదముం దని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. వివిధ శాఖలు, రంగాల వారీగా ప్రభావాన్ని విశ్లేషించే నివేదికను సిద్ధం చేస్తోంది. కేంద్ర బృందానికి ఈ నివేదికను అందజేసి పరిస్థితు లను వివరించనుంది. ఈ మేరకు నివేదిక తయారు చేసేందుకు సమాచారం పంపించాలని సంబంధిత శాఖలకు ఆర్థిక శాఖ లేఖలు రాసింది. నేడు వీడియో కాన్ఫరెన్స్ నోట్ల రద్దు నిర్ణయం అమలు తీరును తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం అన్ని రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స నిర్వహించనుంది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నిర్వహించే ఈ కాన్ఫరెన్సకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోపాటు రాష్ట్రంలో ఉన్న అన్ని బ్యాంకుల ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో జరిగిన నగదు మార్పిడి, బ్యాంకు ఖాతాల్లోకి వచ్చిన నగదు, ప్రజలు పడుతున్న అవస్థలపై చర్చించనున్నారు. మరోవైపు ఈనెల 8వ తేదీ రాత్రి తెలంగాణలోని అన్ని బ్యాంకులకు రూ.8,000 కోట్లు పంపిణీ చేసినట్లు ఆర్బీఐ వర్గాలు వెల్లడించారుు. ఇప్పటివరకు రూ.6,000 కోట్ల నగదు మార్పిడి జరిగిందని, దాదాపు రూ.9,500 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాల్లో జమ అరుునట్లు బ్యాంకర్లు అంచనాగా వెల్లడించారు. సరిపడేన్ని నోట్లు ఆర్బీఐ సరఫరా చేయటం లేదని, అందుకే ఖాతాదారులకు నిర్దేశించిన పరిమితికి లోబడిన డబ్బు కూడా ఇవ్వలేకపోతున్నామని బ్యాంకర్లు చెబుతున్నారు. -
వచ్చే ఎన్నికల్లో మాకు నోటిచ్చి ఓటేస్తారు
-
రాబడి తగ్గే ప్రమాదం: శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్ల రద్దు నిర్ణయంతో దీర్ఘకాలిక ప్రయోజనాలేమోకాని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం సచివాలయం మీడియా పారుుంట్ వద్ద మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను వినూత్నంగా ప్రవేశపెడుతూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తరుణంలో నోట్ల రద్దు వల్ల రాబడి తగ్గే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలను కొనసాగింపునకు తక్షణమే కేంద్రం రూ.10 వేల కోట్ల స్పెషల్ ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
ఆదాయంపై దాగుడు మూతలు
• ఓవైపు పడిపోతోందనే ఆందోళన.. మరోవైపు పెంచుకునే అవకాశాలు • నోట్ల రద్దును అనుకూలంగా మలుచుకుంటే భారీ ఆదాయం • పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పెరిగిన వసూళ్లు • అన్ని శాఖల్లో బకారుుల వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దుతో రాష్ట్ర ఆదాయం పడిపోతోందని ఓ వైపు ఆందోళన వ్యక్తమవుతున్నా.. ప్రస్తుత పరిణామాలను అనువుగా మలుచుకుంటే ఆదాయం పెంచుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 24వ తేదీ వరకు ప్రభుత్వ ఫీజులు, చార్జీలు, పన్నులు, జరిమానాలన్నీ పాత కరెన్సీతో చెల్లించవచ్చంటూ కేంద్రం వెసులుబాటు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలతో పాటు వివిధ కార్పొరేషన్లు తమ బిల్లులు, పన్నులు, బకారుుల వసూలు కు చేపట్టిన ప్రచారం విజయవంతమైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆస్తి పన్ను, నల్లా బిల్లులు, ఎల్ఆర్ఎస్ ఫీజుల రూపంలో రూ.200కోట్లకు పైగా సమకూరారుు. రాష్ట్రవ్యాప్తంగా గత వారం రోజుల్లో గ్రామ పంచాయతీల్లో రూ.32 కోట్ల పన్నులు, పాత బకారుులు వసూలయ్యారుు.కార్పొరేషన్లు, మున్సిపాలిటీలన్నింటా పన్నుల వసూలు కోట్లలోకి చేరింది. వరంగల్ కార్పొరేషన్ పరిధిలో వసూళ్లు రూ.7.55 కోట్లు దాటారుు. కరెంటు బిల్లుల చెల్లింపులకు సైతం పాత నోట్లు తీసుకుంటుండడంతో ఎస్డీపీసీఎల్ పరిధిలో ఈ నెల 11 నుంచి శుక్రవారం వరకు రూ.851 కోట్ల బిల్లులు వసూలయ్యారుు. సాధారణ రోజులతో పోలిస్తే వసూలు రెట్టింపు స్థారుుకి చేరిందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోనూ బిల్లుల వసూలు వేగం పుంజుకుంది. ఈ పరిస్థితిని వినియోగించుకునేందుకు వాణి జ్య పన్నుల శాఖ కూడా రూ.1,194 కోట్ల బకారుుల వసూలుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. అందులో గత వారంలో రూ.184 కోట్లు వసూలైనట్లు అధికారులు ప్రకటించారు. డీలర్లు, బకారుుదారులకు ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం పంపించి.. పెద్ద నోట్లు వినియోగించుకునేలా ఈ విభాగం ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. వ్యాట్‌కు పెట్రోల్‌తో ఊరట రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెలా వ్యాట్ ద్వారా దాదాపు రూ.3,000 కోట్ల ఆదాయం వస్తుం ది. నోట్ల రద్దుతో వ్యాపారాలన్నీ స్తంభించడంతో ఈ ఆదాయం తగ్గుతుందనే ఆందోళన వ్యక్తమైంది. కానీ పెట్రోల్ బంకుల్లో పాత పెద్ద నోట్లను వినియోగించే అవకాశమివ్వడంతో కొంత ఊరట లభిస్తోంది. నోట్ల రద్దు ప్రకటించిన తొలి మూడు రోజుల్లోనే 110 శాతం పెట్రోల్, 98 శాతం డీజిల్ అమ్మకాలు పెరిగారుు. రాష్ట్రానికి వచ్చే వ్యాట్‌లో సింహభాగం పెట్రోలియం, మద్యం అమ్మకాల ద్వారానే సమకూరుతుం ది. దీంతో ఈ నెలలో వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇప్పుడే అంచనా వేసే పరిస్థితి లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారుు. ప్రచారం లేకనే తగ్గిన రిజిస్ట్రేషన్లు నోట్ల రద్దు నిర్ణయం ప్రధానంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయాన్ని దెబ్బతీసింది. 9, 10 తేదీల్లో పాత నోట్ల వినియోగంపై స్పష్టత లేకపోవటంతో ఈ శాఖపై ప్రభావం చూపింది. ఈ శాఖలో రోజుకు సగటున రూ.15 కోట్ల ఆదాయం వస్తుంది. నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన వెంటనే ఇది రూ.90లక్షలకు పడిపోరుుంది. తర్వాత క్రమంగా పెరిగింది. పెద్ద నోట్లతో చెల్లించగలిగే విషయంపై ప్రచారం చేస్తే ఈనెలలో రిజిస్ట్రేషన్ల ఆదాయానికి ఢోకా ఉండదనే అభిప్రాయాలున్నారుు. అరుుతే స్థిరాస్తి వ్యాపారం, నిర్మాణం రంగం కుదేలయ్యే పరిస్థితులు ఉండడంతో భవిష్యత్తులో రిజిస్ట్రేషన్ల ఆదాయం బాగా తగ్గిపోతుందనే అంచనాలున్నారుు. -
మళ్లీ రియల్ బూమ్ వస్తుందా?
• పెద్ద నోట్ల రద్దు సానుకూలమంటున్న సంస్థలు • వడ్డీ రేట్లు తగ్గే అవకాశం; అందరూ బ్యాంకింగ్ వ్యవస్థలోకి.. • జీఎస్టీ, రెరా బిల్లులతో ఊపందుకున్న నిర్మాణాలు సాక్షి, హైదరాబాద్: ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత కారణంగా కొన్నేళ్ల పాటు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్న స్థిరాస్తి రంగాన్ని.. తాజాగా పెద్ద నోట్ల రద్దు మరింత కుదిపేస్తోంది. మరి, ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి స్థిరాస్తి రంగం మళ్లీ పట్టాలెక్కుతుందా? దేశంలో మళ్లీ రియల్ బూమ్ వస్తుందా? అంటే స్థిరాస్తి రంగ విశ్లేషకులు మాత్రం కచ్చితంగా వస్తుందని ఢంకా బజారుుస్తున్నారు. ఇదిగో అంటూ పలు కారణాలను ఉదహరిస్తున్నారు కూడా. అవేంటో మీరే చదవండి మరి. • దేశంలో పాత నోట్ల మార్పిడితో బ్యాంకులకు కట్టలకొద్ది నగదు వచ్చి చేరుతోంది. అధిక నగదు కారణంగా సమీప భవిష్యత్తులో బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశముంది. ప్రస్తుతం 9.5 శాతంగా ఉన్న వడ్డీ రేట్లు కాస్తా 7-8 శాతానికి తగ్గే అవకాశముందని చెబుతున్నారు. • రైతులు, చిన్న వ్యాపారులు, వర్తకులు, కాంట్రాక్టర్ల వంటి వారందరూ కూడా బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తారు. దీంతో వీరందరూ రుణాలకు అర్హత పొందుతారు. తక్కువ వడ్డీ రేట్ల కారణంగా నెలసరి వారుుదా (ఈఎంఐ) కూడా తగ్గుతుంది. దీంతో సామాన్యులు సైతం సొంతింటి కలను సాకారం చేసుకునే వీలుంది. • వచ్చే దశాబ్ద కాలంలో 50 శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లోకి వలస వస్తారు. స్టార్టప్స్, సెల్ఫ్ ఎంప్లారుుమెంట్ పెరుగుతుంది. ఆయా రం గాలకూ సీడ్ క్యాపిటల్, బ్యాంకు రుణాలు కూడా సులువుగానే వస్తా రుు. దీంతో అర్బన్ ఏరియాల్లో ఉండే స్థిరాస్తికి గిరాకీ పెరుగుతుంది. • తక్కువ వడ్డీ రేట్ల కారణంగా కొనుగోలుదారులనే కాదు పెట్టుబడిదారులూ స్థిరాస్తి రంగం వైపే ఆకర్షితులవుతారు. దీంతో ఈ భారీ ఎత్తున పెట్టుబడులొస్తారుు. ఉదాహరణకు బ్యాంకులో రూ.50 లక్షలు డిపాజిట్ చేస్తే వచ్చే వడ్డీ 5 శాతం. అదే రూ.50 లక్షలు పెట్టి ఫ్లాట్ కొంటే దాని మీద వచ్చే నెలవారి అద్దె రూ.20-25 వేల మధ్య ఉంటుంది. పెపైచ్చు ఏటా స్థిరాస్తి విలువ కూడా పెరుగుతుంటుంది. ఆదాయ పన్ను రారుుతీలూ ఉంటారుుక్కడ. • స్మార్ట్ సిటీ, స్వచ్ఛ భారత్, హౌసింగ్ ఫర్ ఆల్, కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, జాతీయ రహదారుల అనుసంధానం, రోడ్లు, విద్యుత్, మంచినీరు వంటి మౌలిక సదుపాయాల ఏర్పాటు, వంటి పలు కార్యక్రమాలతో నగరాలు అభివృద్ధి చెందనున్నారుు. దీంతో దేశంలో స్థిరాస్తి రంగం మళ్లీ బూమ్ రావటం ఖాయం. • స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో స్థిరాస్తి రంగం వాటా 7 శాతం పైనే. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్న రంగమూ ఇదే. 140కి పైగా అనుబంధ రంగాలకు వ్యాపార అవకాశాలనూ ఇస్తున్న విభాగమూ రియల్టీనే. అలాంటి స్థిరాస్తి రంగానికి మౌలిక రంగం హోదా కల్పించాలని నిపుణులు కోరుతున్నారు. సామాన్యుడే సమిధ.. • అరుుతే స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే వస్తు సేవా పన్ను (జీఎస్టీ) స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు (రెరా)లతో రేట్లు పెరిగే అవకాశముంది. • {పస్తుతం నిర్మాణ సంస్థలు టైల్స్, మార్బుల్స్, ఇనుము, ఇసుక, సిమెంట్, ఉడ్ వంటి నిర్మాణ సామగ్రిని ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నారు. వీటిని సీ ఫామ్ ద్వారా కొనుగోలు చేస్తుండటం వల్ల చ.అ.రూ.100 పన్ను తగ్గుతుంది బిల్డర్లకు. కానీ, జీఎస్టీ రాకతో నిర్మాణ సామగ్రిని సొంత రాష్ట్రాల్లోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో సీ ఫామ్ కింద తగ్గే రూ.100 పన్ను కూడా బిల్డర్ కస్టమర్ల మీదే వేస్తాడు. • రెరా బిల్లులోని నిబంధనలను అమలు చేయాలంటే నిర్మాణ సంస్థలు ప్రతి ప్రాజెక్ట్‌ను పక్కాగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్‌లకు నిధుల మళ్లింపు, ముందస్తు అమ్మకాలు నిలిపివేత వంటి రకరకాల నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. రెరా బిల్లుతో నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ఎంతలేదన్నా చ.అ.కు రూ.200 వరకూ పెరిగే అవకాశముంది. దీన్ని కూడా కస్టమర్ల మీదే వేస్తారు బిల్డర్లు. -
నోట్ల కష్టాలు... మరో ఆరు నెలలు!
-
రేపు మోదీతో కేసీఆర్ భేటీ!
-
నోట్ల రద్దు నష్టాలపై విస్తృత ప్రచారం చేయండి
- కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్ సూచన - నల్లకుబేరులకు మోదీ ప్రభుత్వం అండగా ఉంటోంది సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దువల్ల సామా న్యులు పడుతున్న కష్టాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సూచించారు. ఈ విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు, నల్లధనం పోగేసిన నేతలకు కొమ్ము కాస్తున్న వైనాన్ని కూడా ఎండ గట్టాలని కోరారు. గురువారం సాయంత్రం గాంధీ భవన్లో శ్రీనివాసన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రచార కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. టీపీసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, కమిటీ సభ్యులు జి.నాగయ్య, మల్లు రవి తదిత రులు హాజరయ్యారు. ఈ సందర్బంగా శ్రీనివా సన్, భట్టి విక్రమార్క మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోరుుందని, కేంద్ర అనాలోచిత చర్యల వల్ల 120 కోట్ల ప్రజలు రోడ్లపైకొచ్చి తీవ్రంగా అల్లాడిపోతున్నారని దుయ్యబట్టారు. అరుునప్ప టికీ నోట్ల రద్దు పెద్ద ఘన కార్యంగా బీజేపీ ప్రచారం చేసుకుంటోందని, దీనిని సమర్థవం తంగా తిప్పి కొట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ నేతలపై ఉందన్నారు. నల్లధనం పోగేసుకున్న వారికి మోదీ ప్రభుత్వం అండగా ఉంటోందని, విజయ్ మాల్యాకు వేలాది కోట్ల రుణం మాఫీ చేయడమే ఇందుకు నిదర్శనమ న్నారు. ఆయా అంశాలతో పాటు రెండున్నరేళ్లలో కేంద్రం చేసిన తప్పిదాలపై వినూత్న రీతిలో ప్రచారం చేయాలని కోరారు. సామాన్యులకు అర్థమయ్యే రీతిలో నినాదాలతో కూడిన పోస్టర్లు, కరపత్రాలను ముద్రించి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సూచించారు. -
రేపు మోదీతో కేసీఆర్ భేటీ!
• నోట్ల రద్దుపై ప్రధానితో ఫోన్లో మాట్లాడిన సీఎం • ఢిల్లీకి రమ్మన్న మోదీ.. నేడు సీఎం పయనం • నోట్ల రద్దు ఎఫెక్ట్‌పై అధికారులతో కేసీఆర్ చర్చలు • వ్యవస్థ ప్రక్షాళకు ఉపయోగపడితే • ప్రధాని నిర్ణయానికి మద్దతిద్దామని వెల్లడి • రాష్ట్ర ఆదాయం తగ్గిందని కేంద్రం గుర్తించాలి • కేంద్రానికి చెల్లించే అప్పులు వారుుదా వేయాలి • రూ.2.50 లక్షలు దాటిన నగదు నల్లధనంగా చూడొద్దు సాక్షి, హైదరాబాద్: పెద్దనోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా తలెత్తిన పరిస్థితులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రధాని నరేంద్ర మోదీతో గురువారం ఫోన్లో మాట్లాడారు. అందుకు స్పందించిన ప్రధాని శుక్రవారం ఢిల్లీకి రావాలని కేసీఆర్‌ను ఆహ్వానించారు. చర్చలకు అందుబాటులో ఉండాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అవలం బించాల్సిన పంథాను లిఖిత పూర్వకంగా అందించాలని సీఎంను కోరారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కేసీఆర్ ఢిల్లీకి బయ ల్దేరనున్నారు. శనివారం ప్రధానితో భేటీ అయ్యే అవకాశాలున్నాయని ముఖ్యమం త్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసిం ది. అంతకుముందు పెద్దనోట్ల రద్దు నిర్ణ యంతో రాష్ట్ర ఆదాయంపై పడిన ప్రభా వాన్ని సీఎం ఉన్నతాధికారులతో సుదీర్ఘం గా సమీక్షించారు. పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్రాల ఆదాయంపై ప్రభావం పడిందనే వాస్తవాన్ని కేంద్రం గుర్తించాలని, కేంద్రానికి రాష్ట్రాలు చెల్లించాల్సిన అప్పులను వారుుదా వేయాలని అభి ప్రాయపడ్డారు. నోట్ల రద్దు నిర్ణయం ఆర్థిక వ్యవస్థలోని లోటుపాట్లను సవరించేం దుకు, ఆర్థిక లావాదేవీలలో పారదర్శకత తీసుకు వచ్చేందుకు ఉపయోగపడితే తప్పకుండా మద్దతు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అరుుతే ఈ క్రమంలో సామాన్యులు, చిన్న వ్యాపారులు, అసం ఘటిత రంగంలో ఉన్న వారు ఇబ్బంది పడకుండా చూడాల్సిన అవసరముందని అన్నారు. రూ.2.50 లక్షలకు పైగా నగదు ఉన్న వారి డబ్బును బ్లాక్‌మనీగా కాకుండా లెక్కలోకి రాని నగదు (అన్ అకౌంటెండ్ మనీ)గా పరిగణించాలని సీఎం అభిప్రాయపడ్డారు. చిన్న, మధ్య తరగతి ప్రజలకు ఇబ్బంది లేకుండా, అవసరమైతే వారికి మద్దతుగా నిలబడే చర్యలు తీసుకోవాలన్నారు. అసంఘటిత వర్గాలు, చిల్లర వ్యాపారం చేసుకునే వారికి కొన్ని మినహారుుంపులు ఇవ్వాలన్నారు. ఈ విషయాలన్నీ తాను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ప్రధాని నిర్ణయానికి మద్దతిద్దాం... ఇప్పటివరకు నోట్ల రద్దు నిర్ణయంతో రాష్ట్ర ఆదాయం పడిపోతుందని అసంతృప్తి తో ఉన్న సీఎం ప్రధాని నిర్ణయానికి మద్దతి వ్వాలనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. గురువారం సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో సీఎస్ రాజీవ్‌శర్మ, సీనియర్ అధికారులు ప్రదీప్ చంద్ర, ఎంజీ.గోపాల్, ఎస్.కె.జోషి, ఎస్పీ సింగ్, నర్సింగ్ రావు, శాంతికుమారి, చంద్రవదన్, సునీల్‌శర్మ, సందీప్ సుల్తాని యా, రామకృష్ణరావు, నవీన్ మిట్టల్, స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ఆర్థిక వ్యవస్థను పూర్తి స్థారుులో ప్రక్షాళన చేసేందుకు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దోహదపడగలిగితే ప్రధా నికి మద్దతివ్వాలని అన్నారు. సంస్కరణలు కొనసాగి తీరాలని, అవి ఉన్నత స్థారుుకి పురోగమించాలని ఆకాంక్షించారు. ఆలోచ నాపరులు, మేధావులు కలసి పనిచేస్తే ఏదైనా విజయవంతం అవుతుందన్నారు. నల్లధనం నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సామాన్యులు, చిన్న వ్యాపారులు, అసంఘటిత వ్యాపార లావా దేవీలు నిర్వహించే వారు నష్టపోకుండా చూడాలన్నారు. ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకునేటప్పుడు కచ్చితంగా ప్రజలను పరిగణనలోకి తీసుకోవాలని, వారిని భాగస్వాములను చేయాలన్నారు. పెద్ద నోట్లరద్దు నిర్ణయం అనంతరం తలెత్తిన ఆర్థిక పరిస్థితులను సమీక్షించిన సీఎం రాష్ట్ర ఆదాయంపై పడిన ప్రభావాన్ని అంచనా వేశారు. రిజిస్ట్రేషన్, ట్రాన్సపోర్టు విభాగాల్లో ఆదాయం బాగా తగ్గిందని, ఎక్సైజ్, సేల్స్‌ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ విభాగాలపై కూడా ప్రభావం పడిందని గుర్తించారు. పెద్దనోట్ల రద్దుపై దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న భిన్నాభి ప్రాయా లను చర్చించారు. -
నోట్ల కష్టాలు... మరో ఆరు నెలలు!
• పాత నోట్ల స్థానంలో కొత్తవి చేర్చాలంటే • మే నెల వరకూ సమయం పట్టొచ్చు... • ఆర్థిక విశ్లేషకుల అంచనా... • దీనివల్ల ఎకానమీకి తీవ్ర నష్టమని అభిప్రాయం ముంబై: పెద్ద నోట్లను రద్దు చేసి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న మోదీ ప్రభుత్వానికి.. ఈ మొత్తం వ్యవహారాన్ని చక్కదిద్దడం మాత్రం అంత సులువేమీ కాదని ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. అంతేకాదు. ఇప్పుడు రద్దు చేసిన నోట్ల స్థానంలో కొత్తవాటిని మళ్లీ ప్రింట్ చేసి విడుదల చేసేందుకు అనుకున్న గడువు కంటే మరో ఆరు నెలలు అధికంగానే పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. అంటే అప్పటిదాకా జనాలకు నోట్ల కష్టాలు తీరే అవకాశం లేనట్టేననేది పరిశీలకుల అభిప్రాయం. నల్లధనానికి చెక్ చెప్పడం కోసమని రూ.500; రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ ఈ నెల 8న మోదీ సర్కారు హఠాత్తుగా ప్రకటించడం తెలిసిందే. వీటి మార్పిడికి, బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి ఈ ఏడాది డిసెంబర్ 30 వరకూ మాత్రమే గడువు ఇచ్చింది. ఆ తర్వాత 2017 మార్చి చివరి వరకూ ఆర్బీఐ వద్ద వీటిని మార్చుకోవడానికి వీలుంది. అరుుతే, పాత 500; 1,000 నోట్ల స్థానంలో కొత్తవాటిని ప్రవేశపెట్టాలంటే కనీసం వచ్చే ఏడాది మే నెల వరకూ సమయం పడుతుందని ఆర్థిక వేత్త సౌమిత్ర చౌదురి అభిప్రాయపడ్డారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సలహాదారుల్లో ఆయన కూడా ఒకరు కావడం గమనార్హం. జీడీపీ వృద్ధి అర శాతం తగ్గొచ్చు... చెల్లింపులు, కొనుగోళ్లు ఇతరత్రా లావాదేవీల్లో 98 శాతం ఇప్పటికీ కరెన్సీ రూపంలోనే జరుగుతున్నాయని.. ఈ నేపథ్యంలో కొత్త నోట్లకు సంబంధించి జాప్యంవల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. నోట్ల రద్దు కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్టోబర్-డిసెంబర్)లో జీడీపీ వృద్ధి రేటులో అర శాతం మేర నష్టపోవచ్చని డారుుష్ బ్యాంక్ ఏజీ అంచనా వేసింది. ‘కరెన్సీ కొరత అనేక నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఈ కాలంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధికి చిల్లుపడుతూనే ఉంటుంది. విశ్వాసం సన్నగిల్లడంతో రికవరీకి చాలా కాలం పట్టొచ్చు’ అని సౌమిత్ర చౌదురి అభిప్రాయపడ్డారు. కొత్త నోట్లను ప్రవేశపెట్టేందుకు ఎందుకు జాప్యం అవుతుందన్నదానిపై ఆయన ఒక బ్లాగ్‌లో ఈ అంశాలను పేర్కొన్నారు. ప్రింటింగ్ సులువేం కాదు... ‘మోదీ నోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో ఆర్బీఐ గణంకాల ప్రకారం.. వ్యవస్థ నుంచి మొత్తం 1660 కోట్ల 500 నోట్లను, 670 కోట్ల 1,000 నోట్లను వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మొత్తం 2300 కోట్ల నోట్లను(వీటి విలువ రూ.15 లక్షల కోట్లు) ఉపసంహరించాలి. వీటి స్థానంలో కొత్తగా రూ.2,000; 500 నోట్లను తీసుకురావాలనేది కేంద్ర ప్రభుత్వ వ్యూహం. ఇప్పటికే కొంత రూ.2,000 కరెన్సీని ప్రింట్ చేసి విడుదల చేశారు కూడా. అరుుతే, అధిక విలువ(డినామినేషన్) గల కరెన్సీ నోట్లను ప్రింట్ చేసే భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్(బీఆర్బీఎన్ఎం) ముద్రణ సామర్థ్యం నెలకు 130 కోట్ల నోట్లు మాత్రమే. ఇప్పుడు పనిచేస్తున్న డబుల్ షిఫ్ట్‌లకు మరో షిఫ్ట్‌ను జోడించి ఆగమేఘాలమీద పనిచేసినా కూడా 200 కోట్ల నోట్లను నెలకు ముద్రించొచ్చు. అంటే రూ.1,000 నోట్ల స్థానంలో కొత్తవాటిని(రూ.2,000 నోట్లు) ప్రింట్ చేసేందుకు ఈ ఏడాది చివరి వరకూ పడుతుంది. బీఆర్బీఎన్ఎంతో కలిసి ప్రింటింగ్ చేసినా కూడా రూ.500 నోట్ల స్థానంలో కొత్తవి ప్రింట్ చేసి విడుదల చేయాలంటే సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు అనేక నెలలు పడుతుంది. అంటే ప్రస్తుత రూ.500, 1,000 నోట్ల డినామినేషన్ నోట్ల విలువకు సరిపడా కరెన్సీని మళ్లీ ముద్రించాలంటే చాలా కాలం వేచిచూడకతప్పదు’ అని చౌదురి వివరించారు. -
నోట్ల రద్దు పెద్దలకు ముందే లీక్!
-
గులాబీ సంబరాలకు బ్రేక్?
- రెండున్నరేళ్ల పాలనపై 2న జరగాల్సిన కార్యక్రమం ప్రశ్నార్థకం - పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో అధినాయకత్వం పునరాలోచన సాక్షి,హైదరాబాద్: అధికారంలోకి వచ్చి డిసెంబర్ 2 నాటికి రెండున్నరేళ్లు పూర్తి చేసుకోనున్న సందర్భాన్ని సంబరంగా జరుపుకోవాలన్న నిర్ణయంపై అధికార టీఆర్ఎస్ పునరాలోచనలో పడిందా? దీనికి పార్టీ వర్గాలు అవుననే బదులిస్తున్నారుు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల ఇబ్బందులు, ప్రభుత్వ తాజా ఆర్థిక పరిస్థితి వంటి పరిణామాల నేపథ్యంలో సం బరాలకు దూరంగా ఉండాలనే ఆలోచనకు సీఎం కేసీఆర్ వచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నారుు. రాష్ట్రంలోని 31 జిల్లాలకు పార్టీ కొత్త కమిటీలు, రాష్ట్ర కమిటీ, అనుబంధ సంఘాల కమిటీలను నియమించుకుని, వారితో ఒక రోజు సమావేశమై ఆ తర్వాత డిసెంబర్ 2న హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ఆవల భారీ బహిరంగ సభను నిర్వహించాలని కూడా ప్రాథమికంగా నిర్ణయించారు. గత రెండున్నరేళ్లలో ఎదురైన సవాళ్లు, సమస్యలను అధిగమించిన తీరు, సాధించిన ప్రగతి వివరాలను దీని ద్వారా ప్రజలకు వివరించాలని సీఎం భావించారు. అలాగే వచ్చే రెండున్నరేళ్లలో రాష్ట్రాభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం చేపట్టబోయే కార్యక్రమాల గురించీ ప్రజలకు వివరించాలనుకున్నారు. కానీ పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం ఈ సంబరాలకు బ్రేక్ పడినట్లే అని తెలుస్తోంది. నోట్ల రద్దుతో గందరగోళం: కొత్త రాష్ట్రం కావడంతో వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుని అభివృద్ధికి బాటలు వేస్తున్నామని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నారుు. అయితే పెద్ద నోట్ల రద్దు ప్రభావం రాష్ట్రంలో అన్ని రకాల వ్యాపారాలపై పడటంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ప్రతి నెలా కనీసం రూ. 2 వేల కోట్ల రాబడికి కోత పడినట్లు అంచనా వేశారు. ఈ పరిణామం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, చెల్లింపులపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే దిగువ, మధ్య మధ్యతరగతి ప్రజలు, చిరు వ్యాపారులు కూడా చిల్లర సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు కొంత గందర గోళంగా తయారైన నేపథ్యంలో రెండున్నరేళ్ల సంబ రాల జోలికి వెళ్లక పోవడమే మంచిందన్న అభిప్రా యం వ్యక్తమైనట్లు పార్టీ వర్గాల సమాచారం. భారీ ఖర్చు, జనం తరలింపు సమస్యలే కారణం!: నోట్ల రద్దు సమస్యకుతోడు ఇప్పటికే పూర్తి కావాల్సిన పార్టీ సంస్థాగత కమిటీల నియామకం వారుుదాపడింది. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాల్సిన సమావేశం కూడా జరగలేదు. ఎక్కడికక్కడ కొంత అయోమయం నెలకొనడం, బహిరంగ సభ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడం, ప్రజలను సభకు తరలించడం సమస్యగా మారే అవకాశం కూడా ఉండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సంబరాలను వారుుదా వేసుకోవడమే మంచిదన్న నిర్ణయానికి అధినాయకత్వం వచ్చిందని చెబుతున్నారు. -
పెద్దలకు ముందే లీక్!
• నోట్ల రద్దుపై అధికార పక్ష నేతలకు ముందే తెలుసు: విపక్షాలు • ఆర్థిక అస్థిరత రాజ్యమేలుతోందంటూ రాజ్యసభలో సర్కారుపై ధ్వజం • సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుకు డిమాండ్ • లీక్ ఆరోపణలను ఖండించిన అధికార పక్షం • మృతి చెందిన సభ్యులకు నివాళి తెలిపి వారుుదా పడిన లోక్‌సభ • నేటి నుంచి దిగువసభలో వాడివేడి చర్చ.. అస్త్రాలతో సిద్ధమైన విపక్షాలు న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలి రోజు బుధవారం వాడివేడిగా సాగింది. నోట్ల రద్దు పై అధికార పార్టీ నేతలకు ముందుగానే సమాచారం ఉందని విపక్షాలు దుమ్మెత్తిపోశారుు. విచారణకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారుు. పలువురు బీజేపీ నేతలు ముందుగానే నోట్లు మార్చుకున్నారని కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఆరోపించారుు. దేశంలో ఆర్థిక అరాచకత్వం రాజ్యమేలుతోందని తీవ్ర ఆరోపణలు చేశారుు. అరుుతే.. ఇవి అర్థరహితమని ప్రభుత్వం ఖండించింది. నవంబర్ 8 నిర్ణయం లీకేజీ వార్తల్లో వాస్తవం లేదని, ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొంది. అందువల్లే ప్రారంభంలో సమస్యలు వచ్చాయంది. సమావేశాల తొలి రోజే నోట్ల రద్దుపై రాజ్యసభలో 7 గంటల చర్చ జరిగింది.లోక్‌సభ కూడా సమావేశమైన కాసేపటికే.. మృతిచెందిన తాజా, మాజీ ఎంపీలకు నివాళులర్పించి వారుుదా పడింది. మోదీ లక్ష్యంగా.. రాజ్యసభలో చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ ప్రధానిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజాసమస్యలను మోదీ సీరియస్‌గా తీసుకోవటం లేదన్నారు. సామాన్యులు, పేదలు, రైతులకు తీవ్ర నష్టం కలిగించిన రూ. 500, రూ.వెరుు్య నోట్ల రద్దుపై ప్రధాని తీసుకున్న అకాల, అనాలోచిత నిర్ణయమన్నారు. దేశంలో పేదలు, మహిళలు, ఉదయం 3 గంటలనుంచే బ్యాంకులు, ఏటీఎంల దగ్గర క్యూల్లో నిలబడితే.. మోదీ జపాన్‌లో నవ్వుతూ బుల్లెట్ రైలు నడిపారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర యూనిట్లు ఒకరోజు ముందుగానే పార్టీ నిధులను బ్యాంకుల్లో జమచేసినట్లు తమకు తెలిసిందన్నారు. ‘ఆర్థిక వ్యవస్థలో 86 శాతం ఉన్న పెద్ద నోట్లను సర్కారు స్తంభింపజేసింది. అంటే ఇంత మొత్తం నల్లధనమని ప్రభుత్వం నిర్ణరుుంచిందా? మిమ్మల్ని ప్రశ్నించే వారందరినీ దేశ ద్రోహులుగా ముద్ర వేస్తున్నారు’ అని ఆగ్రహించారు. ‘దేశ ప్రధానికి నష్టం కలిగించే ఏ చర్యనూ, కాంగ్రెస్‌గానీ, ఈ సభ గానీ సహించదు.ఇంతకూ ప్రధానికి నష్టం కలిగించాలని చూస్తున్నదెవరో చెప్పండి?’ అని ప్రశ్నించారు. నోట్ల రద్దు, బీజేపీకి ముందే సమాచారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు. ఇంత కీలకాంశంపై చర్చ జరుగుతున్నప్పుడు ప్రధాని సభలో ఉంటే బాగుంటుందన్నారు. యూపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేంద్రం నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందని ఎస్పీ బహిష్కృత ఎంపీ నరేశ్‌యాదవ్ విమర్శించారు. విపక్షాలన్నీ నల్లధనాన్ని వ్యతిరేకించటం లేదనేలా ప్రజలను మభ్యపెట్టేందుకు సర్కారు ప్రయత్నిస్తోందని జేడీయూ నేత శరద్‌యాదవ్ ఆరోపించారు. ‘ప్రజలకు తినేందుకు రొట్టెముక్క లేక బాధపడుతుంటే.. కేక్ తినమని చెప్పిన ఫ్రెంచ్ రాణి మేరీ అంటోనిటే లాగే.. మోదీ కూడా పేపర్ లేకపోతే ప్లాస్టిక్ వాడండని చెబుతున్నార’ని సీతారాం ఏచూరీ(సీపీఎం) ఎద్దేవా చేశారు. నోట్ల రద్దుపై ప్రధాని చెప్పిన ఏ వివరణా అర్థవంతంగా లేద’న్నారు. రాజకీయం కాదు.. దేశం కోసమే విపక్షాల విమర్శలకు ప్రభుత్వం సమాధానమిచ్చింది. దేశ అవసరాలు, అవినీతి, నల్లధనానికి చెక్ పెట్టడంతోపాటు దేశంలో ఉగ్రవాద కార్యక్రమాలను ఎదుర్కొనేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దీని వల్ల దేశానికి దీర్ఘకాలంలో మేలు జరుగుతుందన్నారు. ఉగ్రవాదం, అవినీతి నుంచి విముక్తికోసం సామాన్యులు ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగానే ఉన్నారని.. ఈ నిర్ణయం వల్ల ద్రవ్యోల్బణం, పన్నురేటు తగ్గుతాయన్నారు. నల్లధనం ఉన్నవారే దీనిపై ఎక్కువగా ఆందోళన చెందుతూ పుకార్లు సృష్టిస్తున్నారన్నారు. ‘చిన్న సమస్యలున్నారుు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరి నిర్ణయం ఇది. అందుకే వారూ సహకరిస్తున్నారు’ అని తెలిపారు. ‘మోదీ నిర్ణయాన్ని ప్రశ్నిస్తే దేశ ద్రోహులనే ముద్ర వేస్తున్నామని అంటున్నారు. నోట్ల రద్దును వ్యతిరేకిస్తే సహజంగానే వీరు అవినీతికి వ్యతిరేకమా కాదా అనే అనుమానాలు వస్తున్నారుు. చిన్న చిన్న ఇబ్బందులున్నా ప్రజలంతాప్రభుత్వ నిర్ణయాన్ని హర్షించటం విపక్షాలకు ఇబ్బందికరంగా మారినట్లుంది’ అని చెప్పారు. అకౌంట్ల లో హఠాత్తుగా పెరుగుతున్న మొత్తంపై చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. లోక్‌సభలో.. లోక్‌సభ మొదలవగానే ఆగస్టు 16న అకాల మరణం చెందిన టీఎంసీ ఎంపీ రేణుకా సిన్హాతోపాటు ఇటీవల మృతిచెందిన మాజీ సభ్యులు విజయలక్ష్మి, ఆరిఫ్ బేగ్, కణ్ణన్, హర్ష వర్ధన్, జయవంతి, ఉషావర్మలకు నివాళులర్పించింది. ఇజ్రారుుల్ మాజీ అధ్యక్షుడు పెరెస్, థాయ్‌లాండ్ రాజు అదుల్యదేజ్లకూ నివాళర్పించి మౌనం పాటించింది. సభ గురువారానికి వారుుదా పడింది. అన్ని చర్చలకు మేం సిద్ధం శీతాకాల సమావేశాల్లో విపక్షాలు లెవనెత్తే అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని పార్లమెంటు ఆవరణలో ప్రధాని మోదీ తెలిపారు. ఇందుకు అన్ని పార్టీలు సహకరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గత పార్లమెంటు సెషన్లో జీఎస్టీ బిల్లుపై విపక్షాల సహకారంతో కేంద్రం కీలకమైన అడుగు ముందుకేసిందన్నారు. దేశ ప్రయోజనాల కోసం పార్టీలు కలసిపనిచేయాన్నారు. కాగా, గురువారం నుంచి లోక్‌సభలో సర్కారును ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యారుు. -
చిల్లర వర్తకులకు ఉచితంగా స్వైప్ మిషన్లు
ఏపీ, తెలంగాణలో అవర్‌ట్రిప్.ఇన్ అందజేత హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో పెద్ద నోట్ల రద్దుతో ఆన్లైన్ లావాదేవీలు పెరిగారుు. స్వైప్ మిషన్లు ఉన్న సూపర్ మార్కెట్లు, పెద్ద ఔట్లెట్లు తమ వ్యాపారాలను సజావుగా సాగిస్తున్నారుు. మరి చిన్న చిన్న చిల్లర దుకాణాలు, వ్యాపారస్తులు మాత్రం వ్యాపారం లేక తల్లడిల్లిపోతున్నారు. మార్కెట్లో నోట్ల హడావుడి తగ్గితే కానీ వీరి వ్యాపారం మళ్లీ గాడినపడదు. వీరి కోసం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అవర్‌ట్రిప్.ఇన్ స్టార్టప్ ఉచితంగా స్వైప్ మిషన్లను పంపిణీ చేయాలని నిర్ణరుుంచింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ట్రావెల్ ఏజెంట్లు, చిన్న దుకాణాదారులు, వర్తకులు, ఏపీ ఆన్లైన్, మీ సేవా, మీ సేవా కేంద్రాలు, ఎంఎస్ఎంఈలకు ఈ అవకాశం కల్పిస్తున్నామని కంపెనీ ఫౌండర్ బి. మోహన్ రావు ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. సాధారణంగా స్వైప్ మిషన్ నుంచి జరిగే ప్రతి లావాదేవీ మీద 2-2.5 శాతం ఎండీఆర్ చార్జీలుంటాయని.. అరుుతే అవర్‌ట్రిప్ మాత్రం క్రెడిట్ కార్డ్ దారులకై తే 1.6 శాతం, డెబిట్ కార్డుదారులకై తే 1 శాతం మాత్రమే చేస్తుందని చెప్పారు. ఏపీ ఆన్లైన్, మీ సేవా కేంద్రాలకు కూడా ఉచితంగా స్వైప్ మిషన్లను అందిస్తామని.. వీరికి 1.2 శాతం చార్జీ విధిస్తామని.. మిషన్లు కావాలనుకునే వారు 94934 82134 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం బస్సు, విమాన టికెట్లు, హోటల్ బుకింగ్స, డొమెస్టిక్ మనీ ట్రాన్సఫర్, వినియోగ చెల్లింపులు వంటి సేవలందిస్తున్నాం. ప్రతి నెలా రూ.6-7 కోట్ల లావాదేవీలు జరుగుతున్నారుు. 2 నెలల్లో రూ.15 కోట్ల నిధుల సమీకరణ పూర్తి చేయనున్నామని’’ మోహన్ వివరించారు. -
సామాన్యుల జీవితాలు అస్తవ్యస్తం
• నోట్ల రద్దు అనాలోచిత నిర్ణయం: ఉత్తమ్ • నల్లధనానికి అడ్డుకట్ట: లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుపై తెలంగాణ జర్నలిస్టుల ఫోరం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశం వాడివేడిగా సాగింది. ‘తెలంగాణ సమాజంపై ప్రభావం’ అంశంపై మంగళవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఇది ప్రధాని మోదీ అనాలోచిత నిర్ణయమ న్నారు. ‘సామాన్యుల జీవితాలను అస్తవ్యస్తం చేసింది. ఎక్కడ చూసినా బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలే కనిపిస్తున్నారుు. గంటల తరబడి వేచివున్నా ఏటీఎంలలో డబ్బులు లేక వెనుదిరిగి వెళుతున్నారు. నల్లధనాన్ని వెలికి తీయడానికి రెండున్నరేళ్లుగా మోదీ ఏంచేశారు? 100 రోజుల్లో విదేశాల నుంచి నల్లధనం తెచ్చి అకౌంట్లల్లో జమ చేస్తామన్న హామీ ఎటుపోరుుంది? ఆ విషయం అవగాహన లేక చెప్పారా... కావాలనే విస్మరించారా అనేది అర్థం కావటంలేదు. పెద్ద నోట్లు రద్దు అన్న పెద్ద మనిషి రూ.2వేల రూపాయల నోటు ఎందుకు తెచ్చారన్న దానికి సమాధానం లేదు. నోట్ల రద్దు వల్ల ఎక్కువ ప్రభావితం అరుుంది గ్రామీణ రైతులు, మధ్యతరగతి ప్రజలు. రాజకీయ అవినీతి పెద్ద సమస్యే. అందుకు మేమందరం బాధ్యలమే. నోట్ల రద్దు నిర్ణయం వెనక్కు తీసుకోవాలి. రూ.2 వేల నోటు రద్దు చేయాలి. పాత నోట్లు ఇస్తే 30శాతం కమీషన్ అనేది ఇప్పుడు హాట్‌హాట్ గా నడుస్తోంది’ అని ఉత్తమ్ ధ్వజమెత్తారు. రూ.100 నోట్లు చాలు... తెలంగాణ యునెటైడ్ ప్రంట్ కన్వీనర్ విమలక్క మాట్లాడుతూ రూ.2వేలు, రూ.500 నోట్లు వద్దని, రూ.100నోట్లు మాత్రమే రా వాలన్నారు. ఇది ఒక రాజకీయ క్రీడన్నారు. ప్రతివారి చేతిలో రూ.500 నోట్లున్నాయని, అందుకే ప్రజలు ఇబ్బందులు పడుతున్నార న్నారు. సామాజిక విశ్లేషకులు డి.నరసింహా రెడ్డి మాట్లాడుతూ.. నోట్ల రద్దుపై శాస్త్రీయ అధ్యయనం లేదన్నారు. తెలంగాణ రైతులు చావుదెబ్బ తిన్నారన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. పెద్దనోట్ల రద్దు తో రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపు తోందన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. నోట్ల రద్దు నిర్ణయా న్ని స్వాగతిస్తున్నామని, అరుుతే సామాన్యుల కు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ‘నల్ల కుబేరులకు ప్రధాని నిర్ణయంతో నష్టం లేదు. నష్టపోయేది ప్రజలే. దోపిడిదారులపై మోదీ సర్జికల్ దాడులు ఎందుకు చేయరు’ అని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు శ్రీశైలం,సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, ప్రొఫెసర్ సుజాత పాల్గొన్నారు. సాహసోపేత నిర్ణయం పెదనోట్ల రద్దు సాహసోపేత నిర్ణయమని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. అమలులోని లోపాలు సరిదిద్దా లన్నారు. నల్లధనంపై తీసుకునే చర్యల వల్ల వచ్చే నిధులను రాష్ట్రాలకు పంచాల న్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేసీఆర్ స్పందిచాలన్నారు. గ్రామల ప్రజలు, రైతులు ఇబ్బందులను పరిగణలోకి తీసు కోవాలన్నారు. మద్యం, రియల్ వ్యాపా రాల ఆదాయం తగ్గి జీతాలు ఇవ్వలేం అంటున్న పరిస్థితులు వినవస్తున్నాయని తెలిపారు. ఎలా నష్టమో స్పష్టంగా చెప్పా లన్నారు. నష్టం తీవ్రంగా ఉంటే కేంద్రం వద్దకు వెళ్దామని, అందరం కలసి ప్రధానిని కలుద్దామని చెప్పారు. తప్పుదోవ పట్టించవద్దు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కె.లక్ష్మణ్ మాట్లాడుతూ... పెద్దనోట్ల రద్దుతో బ్లాక్ మనీకి అడ్డుకట్ట పడుతుందన్నారు. ప్రజల ను తప్పుదోవ పట్టించొద్దన్నారు. అద్భుతా లు సృష్టించటం మోదీ నైజమన్నారు. 2014లో ఎన్నికల్లో అవినీతే ప్రధాన అంశం గా మోదీ ప్రజల్లోకి వచ్చారన్నారు. కాంగ్రెస్ హయంలో అనినీతి పెరిగిపోరుుందని తెలిపారు. అనినీతి నిర్మూలన, నల్ల ధనం వెలికితీతకే పెద్ద నోట్లను రద్దు చేశారన్నారు. నోట్ల రద్దుతో ప్రభుత్వానికి వచ్చే నల్లధనం ప్రజలకే చెందుతుందన్నారు. దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ బలపడాల్సి ఉందన్నా రు. నిర్ణయాన్ని వ్యతిరేకించేవారు నల్ల కుబే రులకు లాభం చేసినవారవుతారన్నారు. -
ఖజానాకు ‘పెద్ద నోట్ల’ కళ
- డిస్కంకు రూ.202 కోట్లు... జలమండలికి రూ.30 కోట్లు - జీహెచ్ఎంసీకి రూ.157 కోట్ల ఆదాయం - రద్దు నోట్లతో చెల్లింపునకు 24 వరకు గడువు పొడిగింపు సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో సర్కారు ఖజానా గలగల లాడుతోంది. రద్దరుున రూ.500, రూ.1,000 నోట్లతో ప్రభుత్వ విభాగాల బిల్లులు, బకారుులు చెల్లించవచ్చన్న వెసులుబాటుతో కోట్లకు కోట్లు వచ్చిపడుతున్నారుు. జీహెచ్ఎంసీ తదితర విభాగాలకు మొత్తం నాలుగు రోజుల్లో సుమారు రూ.389 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తున్న నేపథ్యంలో రద్దరుు న నోట్లతో వివిధ పన్నులు, చార్జీలు, జరిమానాలు చెల్లిం పు గడు వును ప్రభుత్వం ఈ నెల 24 వరకు పొడిగిం చింది. గ్రేటర్ హైదరాబా ద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కి రికార్డు స్థారుులో ఆదాయం సమకూరుతుండగా, డిస్కం, జలమండలిలకు భారీగా బకారుు వసూలవుతున్నారుు. ట్రాఫిక్ ఈ-చలాన్ కూడా పెద్దఎత్తున చెల్లింపులు జరుగుతున్నారుు. జీహెచ్ఎంసీకి రికార్డు ఆదాయం... జీహెచ్ఎంసీకి గత నాలుగు రోజుల్లో ఆస్తి పన్ను, ఎల్ఆర్ఎస్ ఫీజుల రూ పంలో రికార్డు స్థారుు లో దాదాపు రూ.157 కోట్లు వసూల య్యారుు. సోమవారం ఒక్కరోజే రూ.55 కోట్లు రాగా, అందులో ఆస్తి పన్ను కింద రూ.19 కోట్లు, లేఅవుట్ల క్రమ బద్ధీకరణ కింద రూ.36 కోట్ల వరకు పన్ను వసూ లైంది. కొందరు ముందస్తు ఆస్తి పన్ను, ఎల్ఆర్ఎస్ కూడా చెల్లిస్తుండటం విశేషం. పెరిగిన బకారుుల చెల్లింపులు: పెద్ద నోట్ల రద్దుతో జలమండలికి బకారుులు పెద్ద ఎత్తున వసూలవుతున్నారుు. 4 రోజుల్లో రూ.30 కోట్ల వర కు ఆదాయం సమకూరింది. సోమవారం రూ.4.44 కోట్లు చార్జీల రూపేణా చెల్లింపులు జరిగారుు. భారీగా వసూలైన విద్యుత్ చార్జీలు విద్యుత్ శాఖకు కూడా భారీగా ఆదాయం సమకూరుతోంది. గత నాలుగు రోజుల్లో సుమారు రూ.202 కోట్లు వసూలయ్యారుు. సెలవు దినమైనప్పటికీ విద్యుత్ శాఖ కౌంటర్లు పనిచేయడంతో సుమారు రూ.20 కోట్ల వరకు చార్జీలు వసూలయ్యారుు. కొందరు విని యోగదారులు ముందస్తు చార్జీలు కూడా చెల్లిస్తున్నారు. ట్రాఫిక్ ఈ-చలాన్ చెల్లింపులు ఇక ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ ఈ-చలాన్లను కూడా వాహనదారులు రద్దరుున నోట్లతో క్లియర్ చేసుకొంటున్నారు. మీ-సేవ, ఈ-సేవా కేంద్రాల ద్వారా పెద్దఎత్తున చెల్లింపులు జరిపారు. సోమవారం సుమారు రూ.13 లక్షలకు పైగా పోలీసు యంత్రాంగానికి ఆదాయం సమకూరింది. -
నోట్ల సమస్యపై కేంద్రానికి లేఖ రాస్తాం: హరీశ్ రావు
సిద్దిపేట జోన్: పెద్ద నోట్ల రద్దు సమస్యలపై రైతులు, వ్యాపారుల నుంచి తనకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయని.. దీనికి సంబంధించి బ్యాంకుల్లో విత్‌డ్రా పరిమితులను సడలించాలని కేంద్రానికి లేఖ రాస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. నోట్ల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూడు డిమాండ్లతో కేంద్రానికి లేఖ రాస్తామని ఆయన చెప్పారు. కరెన్సీ మార్పిడి వ్యవహారంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రి దృష్టికి తీసుకెళతామని తెలిపారు. -
ఉపాధి పనులకూ బ్రేక్!
• పెద్ద నోట్ల రద్దు,చిల్లర సమస్యతో నిలిచిన చెల్లింపులు • జిల్లాల్లో పంపిణీకి సిద్ధంగా ఉన్న • రూ.70 కోట్లకు కొత్తనోట్ల కొరత • మరో రూ.170కోట్ల బకారుులు విడుదల కాని వైనం సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు, మార్పిడి సమస్యతో ఉపాధి హామీ పనులపైనా తీవ్రంగా ప్రభావం పడింది. ఈ పథకం కింద పనులు కల్పించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నా కూలీలు రావడం లేదు. సెప్టెంబర్‌లో చేసిన పనులకు సంబంధించి ఇవ్వాల్సిన వేతనం కూడా ఇప్పటికీ అందకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. వాస్తవానికి ఉపాధి బకారుులు చెల్లించేందుకు ప్రభుత్వం ఇటీవల రూ.70 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులన్నీ క్షేత్రస్థారుులో అధికారుల వద్ద సిద్ధంగా ఉన్నారుు. కానీ పాత నోట్లు రద్దు కావడంతో పంపిణీ ప్రక్రియను నాలుగైదు రోజులుగా నిలిపివేశారు. అన్ని చోట్లా నోట్ల మార్పిడి కోసం జనం బారులు తీరి ఉంటుండడంతో.. బ్యాంకు ఖాతాలు, పోస్టాఫీసు ఖాతాల ద్వారా వేతనాల సొమ్మును కూలీలకు అందించలేని పరిస్థితులు ఏర్పడ్డాయని క్షేత్రస్థారుు సిబ్బంది చెబుతున్నారు. నేరుగా పంపిణీ చేద్దామనుకున్నా అంత మొత్తానికి కొత్త నోట్లు ఇచ్చేందుకు బ్యాంకులు, పోస్టాఫీసులు అంగీకరించడం లేదని అంటున్నారు. మరో నెల బకారుులు కూడా.. ఇక అక్టోబరు నెలలో జరిగిన ఉపాధి పనుల నిమిత్తం కూలీలకు రూ.170 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు ఈ నిధులను సర్కారు విడుదల చేయలేదు. దీంతో ఓవైపు తమ వద్ద ఉన్న సొమ్మును పంపిణీ చేయలేక... మరోవైపు ప్రభుత్వం నుంచి మొత్తం బకారుులు విడుదలకాక కూలీలకు సమాధానం చెప్పలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. అరుుతే పనులు చేశాక రెండు నెలలవుతున్నా సొమ్ము చేతికి రాకపోతుండడంతో ఉపాధి పనులకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోతోంది. ఉపాధి హామ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 55 లక్షల జాబ్‌కార్డులు ఉండగా.. అందులో ఏటా ఉపాధి పనులకు వచ్చే వారి సంఖ్య 25 లక్షలకు పైమాటే. అరుుతే పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో పనులకు వచ్చే వారి సంఖ్య నాలుగైదు రోజులుగా గణనీయంగా పడిపోరుుంది. శనివారం అన్ని జిల్లాల్లో కలిపి 15,545 మందే పనులకు రావడం గమనార్హం. దీంతో ఆయా జిల్లాల్లో చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, హరితహారం కింద మొక్కల పెంపకం, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనాల నిర్మాణం, ఇంకుడు గుంతలు, వ్యవసాయ కుంటల తవ్వకం తదితర కార్యక్రమాలన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయారుు. -
మోదీ దిష్టిబొమ్మ దహనం చేయండి
పిలుపునిచ్చిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దులో సరైన వ్యూహం, ప్రణాళిక, అవగాహన లేకుండా చేసిన ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను రాష్ట్రం దహనం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. రూ.1000, రూ.500 నోట్లను అకస్మాత్తుగా రద్దు చేసిన కేంద్రం.. దానివల్ల ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోవడంలో ముందుచూపుతో వ్యవహరించలేదని ఆదివారం ఓ ప్రకటనలో విమర్శించారు. దీనివల్ల పేద, మధ్యతరగతికి చెందిన మహిళలు, రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. -
చిన్న స్టీల్ కంపెనీలపై ప్రభావం: టాటా స్టీల్
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గ్రామీణ ప్రాంతాల్లో స్టీల్ డిమాండ్‌పై తాత్కాలిక ప్రభావం చూపుతుందని టాటా స్టీల్ తెలిపింది. అలాగే, ద్వితీయ శ్రేణి స్టీల్ కంపెనీలపై కూడా ప్రభావం పడుతుందని పేర్కొంది. చిన్న మిల్లులు, రోలింగ్ పరిశ్రమలు చేసే వ్యాపారంలో అధిక భాగం నగదు ఆధారితమేనని పేర్కొంది. 60-70 శాతం పొడవైన స్టీల్ ఉత్పత్తుల (లాంగ్ ప్రొడక్ట్స్) వ్యాపార నిర్వహణ ఈ కంపెనీల ఆధ్వర్యంలోనే ఉన్నట్టు పేర్కొంది. కనుక నోట్ల రద్దు నిర్ణయం ఇంటిగ్రేటెడ్, పెద్ద స్థారుు కంపెనీల లాంగ్ ప్రొడక్ట్స్ వ్యాపారంపై సానుకూల ప్రభావం చూపుతుందని టాటా స్టీల్ ఇండియా (దక్షిణాసియా విభాగం) ఎండీ టీవీ నరేంద్రన్ అన్నారు. నోట్ల రద్దు నిర్ణయం సంఘటిత రంగం వైపు వ్యాపారం మళ్లేలా చేస్తుందన్నారు. పెద్ద కంపెనీలు గత కొన్నేళ్లలో లాంగ్ ప్రొడక్ట్స్ తయారీ సామర్థ్యాన్ని విస్తరించాయని, వీటికి సానుకూలమని పేర్కొన్నారు. అధికంగా నగదు లావాదేవీలపై ఆధారపడిన గ్రామీణ డిమాండ్‌పై తాత్కాలిక ప్రభావం ఉంటుందని, అరుుతే ఇది దీర్ఘకాలం పాటు కొనసాగే పెద్ద అంశమని భావించడం లేదని, డిమాండ్ వేగంగా పుంజుకుంటుందని నరేంద్రన్ చెప్పారు. అదే సమయంలో రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై నోట్ల రద్దు ప్రభావం ఏ మేర ఉంటుందన్నదాన్ని ఆసక్తిగా గమనిస్తున్నట్టు తెలిపారు. -
చంద్రబాబుకు ముందే తెలుసా?
-
చంద్రబాబుకు ముందే తెలుసా?
అందుకే జాగ్రత్త పడ్డారంటున్న ప్రతిపక్షాలు సాక్షి, హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ముందే తెలుసా? అందుకే ఆ క్రెడిట్ కొట్టేయడం కోసం ముందుగానే రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయాలంటూ ప్రధానమంత్రికి లేఖ రాశారా? అవుననే అంటున్నారుు ప్రతిపక్షాలు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అరుున టీడీపీ అధినేతకు పక్కా సమాచారం ఉందని అం దుకే ఆయన ముందుగా జాగ్రత్త పడ్డారని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు విమర్శిస్తున్నారు. చంద్రబాబు పెద్ద నోట్లు రద్దు చేయాలంటూ గత నెల 12న ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఆ తర్వాత జరిగిన మరో పరిణామం కూడా ఈ అనుమానాలకు ఊతమిచ్చేలా ఉంది. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థను ఫ్యూచర్ గ్రూప్‌కి విక్రరుుంచడం ప్రతిఫలంగా నగదును కాదని ఆ సంస్థ వాటాను తీసుకోవడం కూడా ఈ అనుమానాలను బలపరిచేదిగా ఉందని విశ్లేషకులంటున్నారు. సరిగ్గా ప్రధాని మోది ప్రకటన ముందు రోజు ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదరడం విశేషం. చంద్రబాబు ముందుగా తెలియడం వల్లనే నగదును తీసుకోలేదని, ఇలా పెద్దనోట్ల రద్దు జరిగేనాటికి పెద్దవాళ్లంతా సర్దుకున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారుు. ఆయనకు ముందెలా తెలిసింది?: బొత్స పెద్ద నోట్లను రద్దు చేస్తారనే విషయం చంద్రబాబుకు ముందుగానే ఎలా తెలిసింది అని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. బుధవారం ఆయన పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడు తూ ముఖ్యమంత్రిపైనా, టీడీపీ మంత్రుల పైనా కేంద్రం గట్టి నిఘా పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రజా ధనాన్ని ఎలా దోచుకుంటున్నారో అం దరికీ తెలుసునని, అందుకే ఈ విషయాన్ని ముందుగా తెలుసుకుని ఆయన జాగ్రత్త పడి ఉంటాడని బొత్స అన్నారు. పెద్ద నోట్లను రద్దు చేయాలని తానే కేంద్రానికి లేఖ రాశానని చంద్రబాబు చెప్పుకోవడాన్ని విలేకరులు ప్రస్తావించగా నిజమే... తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి రూ 500 నోట్ల కట్టలతో టీడీపీ నేత రేవంత్‌రెడ్డిని పంపేదీ చంద్రబాబే, మళ్లీ ఇలాంటి నోట్లను రద్దు చేయమని లేఖ రాసేది కూడా ఆయనే కదా... అని బొత్స వ్యంగ్యంగా అన్నారు. అసలు చంద్రబాబు వంటి నేతలు రాష్ట్రంలో ఉండటం దురదృష్టకరమని, ఓవైపు సమాచారం తెలుసుకుని జాగ్రత్త పడతారు, మరో వైపు కేంద్రానికి లేఖలు కూడా రాస్తారన్నారు. ఆ తరువాత తనంతటి ఉత్తములు లేనే లేరని తనకు తానే కితాబులు కూడా చంద్రబాబు ఇచ్చుకుం టారని బొత్స వ్యాఖ్యానించారు. -
నోట్ల రద్దుతో రియల్టీపై తీవ్ర ఒత్తిడి
‘కేంద్రం చర్య దీర్ఘకాలంలో రియల్టీ పరిశ్రమ వృద్ధికి బాగా దోహదపడుతుంది. పారదర్శకత పెరుగుతుంది కనక నిధుల సమీకరణలో డెవలపర్ల సమస్యలు కొంతమేర తగ్గుతారుు. రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్లో ధరలు అనువైన స్థారుుకి తగ్గొచ్చు. రెసిడెన్షియల్, ల్యాండ్ మార్కెట్లలో లావాదేవీలు తగ్గుతూ రావడం వల్ల సమీప భవిష్యత్తులో పరిశ్రమపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంటుంది. - శిశిర్ బైజాల్, నైట్ ఫ్రాంక్ ఇండియా చీఫ్ సాహసోపేత నిర్ణయం.. నల్ల ధనం కట్టడికి ప్రధాని మోది తీసుకున్న నిర్ణయం అత్యంత సాహసోపేతం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఇలాంటి నిర్ణయం ఎన్నడూ తీసుకోలేదు. ప్రభుత్వం అనుకున్నట్టుగా ప్రధాని నిర్ణయ ప్రభావం స్వల్పకాలంలోనే స్పష్టంగా కనపడుతుంది. చిన్న, మధ్యతరహా వ్యాపారుల లావాదేవీలన్నీ నగదు ద్వారానే జరుగుతారుు. ప్రధాని చెప్పినట్టుగా న్యాయంగా వ్యాపారం చేసుకునే వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలి. - రవీంద్ర మోది, ఫ్యాప్సీ ప్రెసిడెంట్ నల్లధనానికి చెక్... కేంద్రం చాలా సాహసోపేత నిర్ణయం తీసుకుంది. దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఉంటుంది. నల్లధనం, టెరర్ ్రఫైనాన్‌సకు ఇది ఎదురుదెబ్బ. కేంద్ర నిర్ణయాన్ని ఫిక్కీ స్వాగతిస్తోంది. తాజా నిర్ణయంతో ప్రజలు కొంత అసౌకర్యానికి గురికావొచ్చు. సమస్యల త్వరితగతి నియంత్రణకు ఆర్బీఐ, కేంద్రం సంయుక్తంగా పనిచేస్తున్నారుు. - హర్షవర్ధన్ నోతియా, ప్రెసిడెంట్- ఫిక్కీ దీర్ఘకాలానికి మంచి ఫలితాలు.. ప్రభుత్వ చర్య హర్షణీయం. దీని వల్ల ప్రస్తుతం కొన్ని సమస్యలు ఉత్పన్నమైనా.. దీర్ఘకాలంలో మంచి ఫలితాలను పొందొచ్చు. అంతర్జాతీయంగా పారదర్శకత, అవినీతి విభాగాల్లో భారత్ ర్యాంక్ మెరుగుపడుతుంది. - మమతా బినాని, ఐసీఎస్ఐ ప్రెసిడెంట్ అవినీతి కట్టడికిది సరైన నిర్ణయం ఇప్పుడున్న నల్ల ధనం బయటపడడానికి రూ.500, రూ.1,000 నోట్ల రద్దును మోదీ అస్త్రంగా చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ధరల స్థిరీకరణ జరగడం ఖాయం. రానున్న రోజుల్లో గృహ కొనుగోళ్లలో నగదు లావాదేవీలకు ఆస్కారం ఉండకపోవచ్చు. వ్యక్తుల చేతుల్లోని నగదు పూర్తిగా బ్యాంకు వ్యవస్థలోకి వచ్చి అధికారికమవుతుంది. ఆర్థిక వృద్ధికి బాటలు పరుస్తుంది. - కలిశెట్టి నాయుడు, రిటైల్ రంగ నిపుణులు ఇన్వెస్టర్ల నమ్మకం పెరుగుతుంది.. కేంద్ర నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుస్తుంది. బ్లాక్ మనీ, అసాంఘిక కార్యకలాపాలకు నిధుల మళ్లింపు ఇక కట్టడి అవుతుంది. నోట్ల రద్దు వల్ల సామాన్యులకు కొంత ఇబ్బందున్నా.. ఇది స్వల్పకాలమే. ప్రభుత్వం, బ్యాంకులు తగు చర్యలు తీసుకుని ఆర్థిక లావాదేవీలు నిరాటంకంగా సాగేలా చూస్తాయనే నమ్మకం ఉంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రపంచ వ్యాపార పటంలో భారత్ ర్యాంకు మెరుగై ఇన్వెస్టర్ల నమ్మకం అధికమవుతుంది. పెట్టుబడుల రాక పెరుగుతుంది. - రమేష్ దాట్ల, సీఐఐ దక్షిణప్రాంత చైర్మన్