
రేపు మోదీతో కేసీఆర్ భేటీ!
• నోట్ల రద్దుపై ప్రధానితో ఫోన్లో మాట్లాడిన సీఎం
• ఢిల్లీకి రమ్మన్న మోదీ.. నేడు సీఎం పయనం
• నోట్ల రద్దు ఎఫెక్ట్‌పై అధికారులతో కేసీఆర్ చర్చలు
• వ్యవస్థ ప్రక్షాళకు ఉపయోగపడితే
• ప్రధాని నిర్ణయానికి మద్దతిద్దామని వెల్లడి
• రాష్ట్ర ఆదాయం తగ్గిందని కేంద్రం గుర్తించాలి
• కేంద్రానికి చెల్లించే అప్పులు వారుుదా వేయాలి
• రూ.2.50 లక్షలు దాటిన నగదు నల్లధనంగా చూడొద్దు
సాక్షి, హైదరాబాద్: పెద్దనోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా తలెత్తిన పరిస్థితులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రధాని నరేంద్ర మోదీతో గురువారం ఫోన్‌లో మాట్లాడారు. అందుకు స్పందించిన ప్రధాని శుక్రవారం ఢిల్లీకి రావాలని కేసీఆర్‌ను ఆహ్వానించారు. చర్చలకు అందుబాటులో ఉండాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అవలం బించాల్సిన పంథాను లిఖిత పూర్వకంగా అందించాలని సీఎంను కోరారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కేసీఆర్ ఢిల్లీకి బయ ల్దేరనున్నారు. శనివారం ప్రధానితో భేటీ అయ్యే అవకాశాలున్నాయని ముఖ్యమం త్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసిం ది. అంతకుముందు పెద్దనోట్ల రద్దు నిర్ణ యంతో రాష్ట్ర ఆదాయంపై పడిన ప్రభా వాన్ని సీఎం ఉన్నతాధికారులతో సుదీర్ఘం గా సమీక్షించారు.
పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్రాల ఆదాయంపై ప్రభావం పడిందనే వాస్తవాన్ని కేంద్రం గుర్తించాలని, కేంద్రానికి రాష్ట్రాలు చెల్లించాల్సిన అప్పులను వారుుదా వేయాలని అభి ప్రాయపడ్డారు. నోట్ల రద్దు నిర్ణయం ఆర్థిక వ్యవస్థలోని లోటుపాట్లను సవరించేం దుకు, ఆర్థిక లావాదేవీలలో పారదర్శకత తీసుకు వచ్చేందుకు ఉపయోగపడితే తప్పకుండా మద్దతు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అరుుతే ఈ క్రమంలో సామాన్యులు, చిన్న వ్యాపారులు, అసం ఘటిత రంగంలో ఉన్న వారు ఇబ్బంది పడకుండా చూడాల్సిన అవసరముందని అన్నారు.
రూ.2.50 లక్షలకు పైగా నగదు ఉన్న వారి డబ్బును బ్లాక్‌మనీగా కాకుండా లెక్కలోకి రాని నగదు (అన్ అకౌంటెండ్ మనీ)గా పరిగణించాలని సీఎం అభిప్రాయపడ్డారు. చిన్న, మధ్య తరగతి ప్రజలకు ఇబ్బంది లేకుండా, అవసరమైతే వారికి మద్దతుగా నిలబడే చర్యలు తీసుకోవాలన్నారు. అసంఘటిత వర్గాలు, చిల్లర వ్యాపారం చేసుకునే వారికి కొన్ని మినహారుుంపులు ఇవ్వాలన్నారు. ఈ విషయాలన్నీ తాను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.
ప్రధాని నిర్ణయానికి మద్దతిద్దాం...
ఇప్పటివరకు నోట్ల రద్దు నిర్ణయంతో రాష్ట్ర ఆదాయం పడిపోతుందని అసంతృప్తి తో ఉన్న సీఎం ప్రధాని నిర్ణయానికి మద్దతి వ్వాలనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. గురువారం సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో సీఎస్ రాజీవ్‌శర్మ, సీనియర్ అధికారులు ప్రదీప్ చంద్ర, ఎంజీ.గోపాల్, ఎస్.కె.జోషి, ఎస్‌పీ సింగ్, నర్సింగ్ రావు, శాంతికుమారి, చంద్రవదన్, సునీల్‌శర్మ, సందీప్ సుల్తాని యా, రామకృష్ణరావు, నవీన్ మిట్టల్, స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ఆర్థిక వ్యవస్థను పూర్తి స్థారుులో ప్రక్షాళన చేసేందుకు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దోహదపడగలిగితే ప్రధా నికి మద్దతివ్వాలని అన్నారు. సంస్కరణలు కొనసాగి తీరాలని, అవి ఉన్నత స్థారుుకి పురోగమించాలని ఆకాంక్షించారు.
ఆలోచ నాపరులు, మేధావులు కలసి పనిచేస్తే ఏదైనా విజయవంతం అవుతుందన్నారు. నల్లధనం నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సామాన్యులు, చిన్న వ్యాపారులు, అసంఘటిత వ్యాపార లావా దేవీలు నిర్వహించే వారు నష్టపోకుండా చూడాలన్నారు. ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకునేటప్పుడు కచ్చితంగా ప్రజలను పరిగణనలోకి తీసుకోవాలని, వారిని భాగస్వాములను చేయాలన్నారు. పెద్ద నోట్లరద్దు నిర్ణయం అనంతరం తలెత్తిన ఆర్థిక పరిస్థితులను సమీక్షించిన సీఎం రాష్ట్ర ఆదాయంపై పడిన ప్రభావాన్ని అంచనా వేశారు. రిజిస్ట్రేషన్, ట్రాన్‌సపోర్టు విభాగాల్లో ఆదాయం బాగా తగ్గిందని, ఎక్సైజ్, సేల్స్‌ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ విభాగాలపై కూడా ప్రభావం పడిందని గుర్తించారు. పెద్దనోట్ల రద్దుపై దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న భిన్నాభి ప్రాయా లను చర్చించారు.