నోట్ల రద్దు నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం | notes cancellation Unconstitutional said vedula Venkatraman senior lawyer | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దు నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం

Published Tue, Nov 29 2016 2:34 AM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM

నోట్ల రద్దు నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం

నోట్ల రద్దు నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం

ఆ అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు
న్యాయవాదులు వెంకటరమణ, కృష్ణయ్యల వాదన
ప్రభుత్వం నోటిఫికేషన్‌తో రూ.1,000, రూ.500 నోట్లు రద్దు చేసింది

 సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ అన్నారు. నోట్ల రద్దు నోటిఫికేషన్ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించేవిధంగా ఉందని చెప్పారు. 1978లో చట్టం ద్వారా పెద్ద నోట్ల ను రద్దు ద్వారా చేశారని,  ప్రస్తుతం అటువం టిదేమీ లేకుండా కేవలం ఓ నోటిఫికేషన్ మాత్రమే జారీ చేసి, రూ.1,000, రూ.500 నోట్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారని తెలి పారు. అప్పట్లో ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటి షన్ దాఖలైందని, అరుుతే సుప్రీంకోర్టు ఆ చట్టాన్ని సమర్థించిందని పేర్కొన్నారు.

ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 26(2) కింద పెద్ద నోట్ల రద్దు అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదని వివరించారు. రూ.1,000, రూ.500 నోట్ల రద్దుకు సంబం ధించి కేంద్ర ప్రభుత్వం ఈ నెల 8న జారీ చేసిన నోటిఫికేషన్‌ను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ హైదరా బాద్‌కు చెందిన సుక్కా వెంకటేశ్వర రావు, న్యాయవాది కె.శ్రీనివాస్‌లు వేర్వేరుగా పిటి షన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను తాత్కా లిక ప్రధాన న్యాయమూర్తి రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి అంబటి శంకరనారాయణతో కూడిన ధర్మాసనం సోమవారం విచారిం చింది. వెంకటేశ్వరరావు తరఫున వేదుల వెంకటరమణ వాదనలు వినిపించగా, శ్రీని వాస్ తరఫున పి.వి.కృష్ణయ్య వాదించారు.

రద్దు చేసిన నోట్ల చెల్లుబాటుకు గడువు తేదీని కేంద్రం నిర్ణరుుంచిందని,  సెక్షన్ 26(2) కింద అది చట్ట రూపంలో ఉండాలని, దానిని పార్లమెంట్ మాత్రమే చేయగలదని వెంకట రమణ తెలిపారు. ఈ కారణంగానే ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 26కు ‘ఏ’ను జత చేసి 1956లో సవరణ తీసుకొచ్చారని వివరిం చారు. ఇప్పుడు కేంద్రం అటువంటిదేమీ చేయకుండా నోటిఫికేషన్ ద్వారా మొత్తం ప్రక్రియను పూర్తి చేసిందన్నారు. చట్టాన్ని చేసే అధికారాన్ని బదలారుుంచడానికి వీల్లేద న్నారు. నోట్ల రద్దు వల్ల సామాన్యులు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని వివరించారు.

పౌరుల హక్కులను హరిస్తున్న కేంద్రం
ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ప్రతిపాదనలు, సిఫారసుల మేరకు కేంద్రం నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందని  పీవీ కృష్ణయ్య పేర్కొ న్నారు. అందరితోనూ చర్చించి, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతనే  నిర్ణయం తీసుకోవాలన్నారు. ధర్మాసనం స్పందిస్తూ ముందుగా అందరితో చర్చిస్తే, నోట్ల రద్దు ఉద్దేశం నెరవేరదు కదా? అని వ్యాఖ్యానించింది. పౌరుల హక్కుల విష యంలో కేంద్రం ఒకపక్క జోక్యం చేసు కుంటూ, మరోపక్క వాటిని హరిస్తోందని కృష్ణయ్య తెలిపారు.  కేంద్రం తరఫున అద నపు సొలిసిటర్ జనరల్ వాదనలు వినేందుకు వీలుగా తదుపరి విచారణను ధర్మాసనం మంగళవారానికి వారుుదా వేసింది.

నగదు విత్‌డ్రా పై పరిమితి విధించే అధికారం లేదు: మైసూరా
కేంద్రం నగదు ఉపసంహరణను రూ.10 వేలకు, వారానికి గరిష్టంగా రూ.20 వేలకు పరి మితం చేయడాన్ని మాజీమంత్రి మైసూరారెడ్డి హైకోర్టులో సోమవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. నగదు ఉపసంహరణపై పరిమితి విధించేందుకు కేంద్ర ప్రభు త్వానికి ఎటువంటి అధికారం లేదని పేర్కొన్నారు. రూ.100, రూ.500 నోట్లు విసృ్తతంగా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు తక్షణమే చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యాన్ని తక్షణమే విచారిం చాలని మైసూరా తరఫు న్యాయవాది అభ్యర్థించగా ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం అందుకు అంగీకరించలేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement