Senior lawyer
-
న్యాయ కోవిదుడు నారీమన్ కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ శామ్ నారీమన్ (95) మంగళవారం అర్ధరాత్రి మృతిచెందారు. న్యాయ నిపుణుడుగా పేరుగాంచిన నారీమన్ 1929లో పార్సీ దంపతులైన బైరాంజీ నారీమన్, బానో నారీమన్లకు మయన్మార్‌లో జని్మంచారు. బాంబేలో ప్రాథమిక విద్యాభ్యాసంతోపాటు ప్రభుత్వ న్యాయ కళాశాలలో ఎల్ఎల్బీ పూర్తిచేశారు. బాంబే హైకోర్టులో న్యాయవాద వృత్తి ప్రారంభించిన నారీమన్ 1971లో సుప్రీంకోర్టులో సీనియర్ హోదా పొందారు. 1972 మే నుంచి 1972 జూన్ 25 వరకూ సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్ పనిచేశారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తన పదవికి మరుసటి రోజే రాజీనామా చేశారు. పలు కీలక కేసులు వాదించిన నారీమన్‌ను కేంద్ర ప్రభుత్వం 2007లో పద్మభూషణ్‌తో సత్కరించింది. 1999లో రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రపతి నామినేట్ చేశారు. 1991లో బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా 1994లో ఇంటర్నేషల్ కౌన్సిల్ ఫర్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ అధ్యక్షునిగా ఉన్నారు. 1998లో లండన్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్‌లో సభ్యుడయ్యారు. 1995 నుంచి 1997 వరకూ ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జ్యూరిస్ట్స్ కార్యనిర్వాహక కమిటీకి ౖచైర్మన్‌గా పనిచేశారు. ఫాలీ నారీమన్ కుమారుడు రోహింగ్టన్ నారీమన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించారు. నిర్ణయమే శాసనం ఫాలీ నారీమన్ చివరి వరకూ తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారుగానీ లాయర్‌గా రాజీ పడలేదు. ఎమర్జెన్సీ సమయంలో కేంద్రాన్ని కాదని అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ)గా రాజీనామా చేసిన ఆయన నర్మద రిహాబిలిటేషన్ కేసులో గుజరాత్ ప్రభుత్వం తరఫు న్యాయవాదిగా ఉంటూ క్రిస్టియన్లపై దాడులు నిరసిస్తూ ఆ కేసు నుంచి తప్పుకొన్నారు. తొలుత తాను మానవతావాదినని తర్వాతే న్యాయవాదిని అని ఆ సమయంలో అభిప్రాయపడ్డారు. ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని ఎదిరించినందకు నారీమన్‌కు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి ఢిల్లీలో ఎవరూ ముందుకురాకపోవడంతో స్థిరమైన నివాసం కోసం ఎంతో కష్టపడ్డారు. ‘వెన్నెముక లేనితనం కంటే నిరాశ్రయమే మేలు’ అని నారీమన్ వ్యాఖ్యానించారు. డిసెంబరు 2009లో జస్టిస్ ప్రసాద్, జస్టిస్ దినకరన్‌ల నియామకాల సమయంలో హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యుల సమీక్ష, బహిరంగ చర్చ అనంతరమే న్యాయ నియామకాలకు సిఫార్సులు చేపట్టాలని భావిస్తున్నట్లు జ్యూడీíÙయల్ అకౌంటబిలిటీపై కమిటీ పేర్కొంది. ఈ ప్రకటనపై రాం జఠ్మలానీ, శాంతి భూషణ్, అనిల్ దివాన్, కామిని జైశ్వాల్, ప్రశాంత్ భూషణ్లతోపాటు నారీమన్ సంతకం చేశారు. కీలక కేసులు వాదన తన సుదీర్ఘ కెరియర్లో నారీమన్ అనేక కీలక కేసులు వాదించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కేసులో ఆమె బెయిలు పొందడంలో కీలకవాదనలు చేశారు (అనంతరం ఆ బెయిలు రద్దయింది). భోపాల్ గ్యాస్ ఘటనలో యూనియన్ కార్బైడ్ తరఫున వాదించిన నారీమన్ తన తప్పును తదనంతరం అంగీకరించడానికి వెనకాడలేదు. 47 కోట్ల డాలర్ల పరిహారం కోర్టు వెలుపల బాధితులకు అందించేలా సంస్థతో ఒప్పందం కుదర్చడంలో కీలకపాత్ర పోషించారు. ఏఓఆర్ అసోసియేషన్ కేసులో తన వాదనా పటిమ అనంతరమే ఉన్నత న్యాయవ్యవస్థలో న్యాయమూర్తుల నియామకం సుప్రీంకోర్టు చేపట్టడం ప్రారంభించింది. అయితే తదనంతరం తన ఆత్మకథ ‘బిఫోర్ మెమరీ ఫేడ్స్’లో మాత్రం న్యాయమూర్తుల నియామక విషయంలో ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులు క్లోజ్ సర్క్యూట్ కాకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరినీ సంప్రదించాలని అభిప్రాయపడ్డారు. ‘‘ఫాలీ నారీమన్ అత్యుత్తుమ న్యాయవాదులు, మేధావుల్లో ఒకరు. సామాన్య పౌరులకు న్యాయం జరిగేలా తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన మృతి నన్నెంతో బాధించింది. నారీమన్ ఆత్మకు శాంతి కలగాలి’’ – ప్రధాని నరేంద్ర మోదీ ‘‘నారీమన్ మరణానికి సంతాపం తెలుపుతున్నా. చట్టంలో గొప్ప దిగ్గజమైన నారీమన్ మృతి చాలా విచారకరం’’ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ -
ఫాలీ నారీమన్ కన్నుమూత.. సీఎం జగన్ దిగ్భ్రాంతి
ఢిల్లీ, సాక్షి: న్యాయ రంగంలో ఒక శకం ముగిసింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ (95) ఇక లేరు. వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో ఢిల్లీలోని తన నివాసంలో ఇవాళ (బుధవారం) ఉదయం కన్నుమూశారు. ఫాలీ నారీమన్ సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది. బాంబే హైకోర్టులో 22 ఏళ్లపాటు ప్రాక్టీస్ చేసిన ఆయన.. 1971 నుంచి సర్వోన్నత న్యాయస్థానంలో పని చేస్తూ వచ్చారు. అలాగే.. 1991 నుంచి 2010 వరకు బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు. అంతర్జాతీయ మధ్యవర్తిత్వంపై గుర్తింపు పొందిన న్యాయనిపుణుడు ఫాలీ నారీమన్. న్యాయవాద వృత్తిలో ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1991లో పద్మభూషణ్, 2007లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. అదేవిధంగా 1999 నుంచి 2005 వరకు నారీమన్ రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. బ్రిటిష్ బర్మా రంగూన్లో 1929లో జన్మించారాయన. షిమ్లా, ముంబైలో విద్యాభ్యాసం కొనసాగించారు. తండ్రి ఆశయం కోసం సివిల్స్ ఎగ్జామ్స్ వైపు అడుగులేసిన ఆయన.. చివరకు ఆర్థిక స్తోమత సహకరించక న్యాయవాద వృత్తి వైపు అడుగులేశారు. End of an era—#falinariman passes away, a living legend who wl forever be in hearts &minds of those in law &public life. Above all his diverse achievements, he stuck to his principles unwaveringly &called a spade a spade, a quality shared by his brilliant son #Rohinton. — Abhishek Singhvi (@DrAMSinghvi) February 21, 2024 భారత రాజ్యాంగ చట్టం రూపకల్పనలోనూ నారిమన్ కీలక పాత్ర పోషించారు. అలాగే.. 1972 నుంచి మూడేళ్లపాటు అదనపు సోలిసిటర్ జనరల్‌గానూ పని చేశారు. అయితే.. ఎమర్జెన్సీ కారణంగా ఆయన రాజీనామా చేశారు. ఇక.. భోపాల్ గ్యాస్ దుర్ఘటన కేసులో యూనియన్ కార్బైడ్ కంపెనీ తరఫున వాదించారు నారిమన్. అయితే అది పొరపాటని తర్వాత ఇంటర్వ్యూలలో ఆయన పేర్కొన్నారు. గోలఖ్‌నాథ్, ఎస్పీ గుప్తా, టీఎంఏ పై ఫౌండేషన్ లాంటి కేసుల్ని ఆయన వాదించారు. సుప్రీం కోర్టు ఏవోఆర్ కేసును సైతం (ఉన్నత న్యాయవ్యవస్థలో న్యాయమూర్తుల నియామకాన్ని సుప్రీంకోర్టు స్వాధీనం చేసుకోవడానికి సంబంధించి..) ఈయనే వాదించారు. 2014లో తమిళనాడు మాజీ సీఎం జయలలిత కేసులో వాదనలు వినిపించి ఆమెకు బెయిల్ ఇప్పించారు. నారీమన్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ దిగ్భ్రాంతి సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్ నారీమన్ కన్నుమూత పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నారీమన్ కుటుంబ సభ్యులకు సీఎం జగన్ సంతాపం తెలిపినట్లు సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. -
సుప్రీంలో సీనియర్ హోదా.. కొత్త మార్గదర్శకాలు జారీ
ఢిల్లీ: సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదుల నియామకం విషయంలో నూతన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. భారత సుప్రీంకోర్టు ద్వారా సీనియర్ న్యాయవాదుల హోదా కోసం మార్గదర్శకాలు- 2023 పేరిట దీనిని విడుదల చేసింది సర్వోన్నత న్యాయస్థానం. కొత్తగా వయో పరిమితి విధింపుతోపాటు పలు నిబంధనలనూ చేర్చింది. ఇందిరా జైసింగ్ వర్సెస్ సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా.. ఈ ఏడాది మే 12వ తేదీన వెల్లడించిన ఆదేశాలనుసారం ఈ మార్గదర్శకాలు విడుదల చేసినట్లు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం.. ఈ కేసులో తీర్పు వెలువరించిన రెండు నెలలకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేయడం గమనార్హం. ఇక తీర్పులో.. న్యాయవాదులను సీనియర్ న్యాయవాదులుగా నియమించడానికి హైకోర్టులు, సుప్రీంకోర్టు అనుసరించిన ఇంటర్వ్యూ ప్రమాణాలను కోర్టు సమర్థించింది, సీనియర్ న్యాయవాదుల కేటాయింపునకు సంబంధించి వ్యవహారాలను.. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించే కమిటీ పర్యవేక్షిస్తుందని, ఇందులో ఇద్దరు సీనియర్ జడ్జిలతో పాటు అటార్నీ జనరల్, అలాగే చైర్పర్సన్.. సభ్యులుగానీ నామినేట్ చేసే ఓ బార్ మెంబర్ సైతం సభ్యులుగా ఉంటారని తెలిపింది. అసాధారణమైన సందర్భాల్లో మాత్రమే రహస్య బ్యాలెట్ ఓటింగ్‌ను ఆశ్రయించాలని కొత్త మార్గదర్శకాలు నిర్దేశించాయి. 45 ఏళ్లు నిండి ఉండాలి కనీసం పదేళ్లు అడ్వొకేట్‌గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. కనీసం 5 ఆర్టికల్స్ వేర్వేరు పబ్లికేషన్లలో ప్రచురితం కావాలి. ప్రచురణల సంఖ్యకు ఇచ్చిన పాయింట్లను 15 మార్కుల నుండి 5కి తగ్గించింది. కేసును వాదించి గెలవాలి, జడ్జిమెంట్ రావాలి న్యాయ కళాశాలల్లో బోధించిన అనుభవం పరిగణనలోకి తీసుకుంటారు తీర్పుల కోసం ఇచ్చిన పాయింట్ల సంఖ్యను గతంలో 40 నుండి 50 పాయింట్లకు పెంచారు. -
మారువేషంలో కొలీజియంలోకా?
అసలంటూ ప్రస్తుతం ఉనికిలోనే లేని ‘శోధన, మూల్యాంకన కమిటీ’లో ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఉండాలన్న కేంద్ర న్యాయమంత్రి సూచన తీవ్రమైనది! కేవలం న్యాయమూర్తులను మాత్రమే కలిగి ఉన్న కొలీజియంలో ప్రవేశించడానికి ప్రభుత్వం తెలివిగా మారువేషంలో వేస్తున్న తొలి అడుగుగా దీన్ని భావించాలి. న్యాయమూర్తుల ఎంపిక కమిటీలో ప్రభుత్వ ప్రాతినిధ్యం న్యాయవ్యవస్థ స్వతంత్రతను ధ్వంసం చేస్తుందని న్యాయ మూర్తుల నియామక కమిటీ చట్టం కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. న్యాయమంత్రి సూచన ఆ తీర్పును తోసిపుచ్చే ప్రయత్నమే. అలాగని హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల ప్రాతిపదికలో ఎలాంటి తప్పూ లేదని సూచించడం లేదు. ఇక్కడే శోధన ప్రారంభం కావలసి ఉంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకాల కోసం ‘శోధన, మూల్యాంకన కమిటీ’ (సెర్చ్ కమ్ ఎవాల్యుయేషన్ కమిటీ)ని నియమించాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లేఖ రాసినట్టు తెలిసింది. ఈ విషయాన్ని చర్చించేముందుగా మంత్రి సూచించిన శోధన, మూల్యాంకన కమిటీ అనేది ఉనికిలో లేదని గమనించాలి. ప్రస్తుతం ఉనికిలో ఉన్న చట్టం ప్రకారం ప్రధాన న్యాయమూర్తి, ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కొలీజియం... హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ ఉంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించినంతవరకూ ప్రధాన న్యాయమూర్తి, నలుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కొలీజయం సిఫార్సు చేస్తుంది. శోధన, మూల్యాంకన కమిటీ అవసరం ఇప్పుడు ఉందా? సమాధానం నిశ్చయాత్మకంగా అవును అన్నట్లయితే, అలాంటి కమిటీ పొందిక ఎలా ఉండాలి అనేది మరో ప్రశ్న. హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం సంప్రదాయంగా వస్తోంది. అయితే తాను పనిచేసే హైకోర్టులో ఆయన్ని ప్రధాన న్యాయమూర్తిగా నియమించరు. అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియ మించే సందర్భంలోనే సుప్రీంకోర్టులో రాష్ట్రాల భౌగోళిక ప్రాతి నిధ్యాన్ని లెక్కిస్తారు. కాబట్టి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన ప్రాతి పదిక ఇప్పటికే స్పష్టంగా ఉంది. కాబట్టి, కొత్తగా శోధన, మూల్యాంకన కమిటీ అవసరం లేదని తెలుస్తున్నది. దీనికి బదులుగా సీనియారిటీ నిబంధనను పక్కన పెట్టి చేసే నియామకాలకు ప్రాతిపదిక అవసరం. పరిధి ప్రాతిపదికను పరిగణించే అవకాశం పైన చెప్పినట్టుగా పరిమితం. కాబట్టి కేంద్ర మంత్రి సూచించిన శోధన, మూల్యాంకన కమిటీ ఈ సంప్రదాయానికి చేసే జోడింపు పెద్దగా లేదనే చెప్పాలి. ఇక జడ్జీల పనితీరు మూల్యాంకనం కూడా సుప్రీంకోర్టు న్యాయ మూర్తుల విధి. సుప్రీంకోర్టుకు నియమించాల్సిన న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుల బాగోగులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులే చక్కగా మూల్యాంకన చేయగలరు. దీన్ని పక్కనబెడితే, న్యాయ నిర్ణయాలు చాలా తరచుగా సుప్రసిద్ధ న్యాయ పత్రికల్లో తీవ్రమైన విద్యాత్మక విమర్శలకు గురవుతుంటాయి. న్యాయమూర్తుల మూల్యాంకనకు ఇది సుపరిచితమైన పద్ధతి. ఇలాంటి పరిస్థితుల్లో శోధన, మూల్యాంకన కమిటీలో ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఉండాలన్న కేంద్ర న్యాయమంత్రి సూచన తీవ్రమైనది! కేవలం న్యాయమూర్తులను మాత్రమే కలిగి ఉన్న కొలీజియంలో ప్రవేశించడానికి ప్రభుత్వం తెలివిగా మారు వేషంలో వేస్తున్న తొలి అడుగుగా దీన్ని భావించాలి. స్పష్టంగా చెప్పాలంటే, భారత రాజ్యాంగం నిర్దేశించిన అధికా రాల విభజన సూత్రాన్ని న్యాయమంత్రి తాజా సూచన ధ్వంసం చేస్తుంది. ఈ అధికారాల విభజన రాజ్యాంగ ప్రాథమిక లక్షణాల్లో ఒకటి. అన్ని రాజ్యాంగ బద్ధ సంస్థల్లో న్యాయవ్యవస్థ మాత్రమే, ప్రభు త్వాన్ని ఎన్నుకున్న మెజారిటీ ప్రజాభిప్రాయానికి ప్రతితులనాత్మకంగా ప్రభుత్వ పనితీరు పట్ల నిరోధ సమతౌల్యాన్ని అందించగలదు. ప్రభుత్వ పనితీరుకు నిరోధ సమతౌల్యంగా ఉండాల్సిన న్యాయ మూర్తుల నియామక కమిటీలో అదే ప్రభుత్వం భాగమైతే, ప్రభుత్వ ఇతర విభాగాలను తనిఖీ చేసే కోర్టు విధిని అది ధ్వంసం చేస్తుంది. ఇది ‘కోళ్ళగూటిలోకి నక్కను స్వయంగా ఆహ్వానించడమే’ అవుతుంది. న్యాయమూర్తుల ఎంపిక కమిటీలో ప్రభుత్వ ప్రాతినిధ్యం అనేది న్యాయవ్యవస్థ స్వతంత్రతను ధ్వంసం చేస్తుందని న్యాయమూర్తుల నియామక కమిటీ చట్టం కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో న్యాయ మంత్రి సూచన ఆ తీర్పును తోసిపుచ్చే ప్రయత్నమే. సుప్రీంకోర్టు ద్వారా ప్రకటితమైన చట్టాన్ని మార్చడానికి రెండు సుపరిచిత మార్గాలు ఉన్నాయి. మొదటిది, సముచితమైన శాసనం ద్వారా న్యాయస్థానం అన్వయించిన తీర్పు ప్రాతిపదికనే మార్చి వేయడం. రెండో మార్గం ఏమిటంటే, విస్తృత ధర్మాసనం ద్వారా ఆ తీర్పును తోసిపుచ్చడానికి ప్రయత్నించడం. ప్రభుత్వం ఈ రెండింటిలో ఏ ఒక్కదానికీ పూనుకోలేదు. బదులుగా, భారత ఉపరాష్ట్రపతి, న్యాయమంత్రి వంటి అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారే న్యాయస్థానం తీర్పునకు భిన్నంగా ప్రకటనలు చేస్తూ వచ్చారు. న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే ప్రయ త్నంలో, మొత్తంగా న్యాయవ్యవస్థ చట్టబద్ధతనే రద్దుపరిచే ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతూండటం గమనార్హం. న్యాయమూర్తుల నియామక విధానాన్ని మార్చాలని ప్రభుత్వం తీవ్రంగా భావిస్తూ ఉన్నట్లయితే, న్యాయమూర్తుల నియామక చట్టాన్ని తోసిపుచ్చిన తర్వాత ఒక కొత్త చట్టాన్ని తీసుకురాకుండా దాన్ని ఏదీ అడ్డుకోలేదు. అయితే ఈ మార్గాన్ని ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే చేపట్టడం లేదు. అసలు అలాంటి చట్టాన్ని రూపొందించే అవసరాన్నే ప్రభుత్వం పరిగణించలేదు. ఎందుకంటే, ప్రభు త్వంతో సంప్రదింపుల తర్వాతే నియామకాలను చేపడుతున్న పక్షంలో అలాంటి న్యాయమూర్తులతో ప్రభుత్వం ఎంతో సౌకర్యవంతంగా ఉంటూ వస్తోంది. రాష్ట్రపతి ఆదేశంతో నిమిత్తం లేకుండా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని గానీ, న్యాయమూర్తులను గానీ కొలీజియం సిఫార్సు చేసిన సందర్భం ఒక్కటి కూడా లేదు. అలాగే కొలీజియం చేసిన ఏ సిఫారసు అయినా ప్రభుత్వానికి అసౌకర్యంగా మారి వ్యతిరేకించిన పక్షంలో అలాంటి సూచనలను న్యాయవ్యవస్థ వెనక్కు తీసుకోవడం కూడా జరిగేది కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా ఎన్నికైన జస్టిస్ ఎన్వీ రమణ యూపీఏ ప్రభుత్వ హయాంలో ఎంపికైన చివరి న్యాయమూర్తి కావడం తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన ప్రధాన న్యాయమూర్తులు ఎన్డీయే ప్రభుత్వ హయాంలోనే నియ మితులవుతూ వచ్చారు. అలాగని హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల ఎంపిక ప్రాతిపదికలో ఎలాంటి తప్పూ లేదని ఇక్కడ సూచించడం లేదు. ఇక్కడే శోధన ప్రారంభం కావలసి ఉంది. ముఖ్యంగా, హైకోర్టుల నియామకాల కోసం ప్రాతిపదిక గురించి న్యాయ మంత్రి తాజా లేఖ పేర్కొనడం లేదు. సమస్య ఇక్కడే ఉందని నేను నమ్ముతున్నాను. న్యాయమూర్తులను నియమించే దశలోనే శోధన, మూల్యాంకనకు ప్రాధాన్యత ఉంటుంది. అయితే న్యాయమూర్తులతో కూడిన కమిటీనే దాన్ని చేపట్టాలి. న్యాయమూర్తుల నియామకాలకు నిర్దిష్ట ప్రాతిపదిక ఉండాలి. ఆ ప్రాతిపదికను ముందుగానే ప్రకటించి ప్రచురించాలి. అందుబాటులో ఉన్న ఉత్తమ అభ్యర్థిని న్యాయమూర్తిగా ఎంపిక చేయడానికి సరైన మార్గం ఏదంటే, ప్రస్తుతం లోపభూయిష్టంగా ఉంటున్న న్యాయమూర్తుల నియామక వ్యవస్థను అధిగమించడం. దానికిగానూ సంబంధిత అభ్యర్థులు తమ ఆసక్తిని వ్యక్తపర్చడానికీ, స్వయంగా నామినేషన్ దాఖలు చేయడానికీ అనుమతించాలి. అప్పుడు మాత్రమే జడ్జీల నియమాకానికి చెందిన పరిగణన పరిధి విస్తృతం అవుతుంది. ప్రజలకు బహిరంగంగా తెలుస్తుంది కూడా. స్వీయ నామినేషన్ వ్యవస్థ మాత్రమే వర్గం, కులం, జాతి, లైంగిక ధోరణికి సంబంధించిన వైవిధ్యతకు హామీ ఇస్తుంది. ధర్మాసనంలో మనం చూడవలసిన బహుళత్వం, వైవిధ్యం గురించి అర్థం చేసు కోవడానికి అది వీలు కలిగిస్తుంది. ఇందిరా జైసింగ్ వ్యాసకర్త సీనియర్ న్యాయవాది, భారత మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
పేదల వకీల్ తరిమెల బాలిరెడ్డి కన్నుమూత
సాక్షి, అమరావతి: పేదల న్యాయవాదిగా పేరుగాంచిన ప్రముఖ సీనియర్ న్యాయవాది తరిమెల బాలిరెడ్డి (90) ఆదివారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. గత కొద్ది కాలంగా ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. బాలిరెడ్డి 1931, ఏప్రిల్ 22న అనంతపురం జిల్లా శింగనమల మండలం జలాల్‌పురంలో జన్మించారు. పుణెలో ఎల్ఎల్బీ చదివిన ఆయన సుప్రీంకోర్టు దివంగత న్యాయమూర్తి జస్టిస్ ఒ.చిన్నపరెడ్డి వద్ద వృత్తిలో మెళకువలు నేర్చుకున్నారు. అతి తక్కువ కాలంలోనే క్రిమినల్ కేసులపై మంచిపట్టు సాధించారు. వేళ్ల మీద లెక్కించగలిగిన ప్రముఖ క్రిమినల్ న్యాయవాదుల్లో ఒకరిగా పేరుగాంచారు. న్యాయవాదులను పెట్టుకునే స్థోమత లేని ఖైదీలు న్యాయసాయం కోరుతూ బాలిరెడ్డికి లేఖలు రాసేవారు. ఆ లేఖలకు ఆయన తిరిగి సమాధానం ఇచ్చి.. ఆ ఖైదీల కేసులను ఉచితంగా వాదించేవారు. పేదవారి నుంచి పైసా కూడా ఫీజు తీసుకునేవారు కాదు. చాలా సందర్భాల్లో తన సొంత ఖర్చులు వెచ్చించేవారు. దీంతో ఆయన పేదల న్యాయవాదిగా కీర్తిగడించారు. అనేక కీలక కేసుల్లో తన వాదనలు వినిపించారు. న్యాయ కోవిదుడు చాగరి పద్మనాభరెడ్డి, బాలిరెడ్డిలు సుదీర్ఘకాలంపాటు క్రిమినల్ కేసుల విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మూలస్తంభాలుగా ఉన్నారు. న్యాయమూర్తులు సైతం క్రిమినల్ కేసులకు సంబంధించి వీరిద్దరిని సంప్రదించి తమ సందేహాలను నివృత్తి చేసుకునేవారు. బాలిరెడ్డికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు టి.విజయ్‌కుమార్ చార్టర్డ్ అకౌంటెంట్ కాగా మరో కుమారుడు నరేష్కుమార్ ఇంజనీర్. బాలిరెడ్డి మేనల్లుడు జస్టిస్ కంచిరెడ్డి సురేశ్‌రెడ్డి ప్రస్తుతం హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. బాలిరెడ్డి మృతికి ఏపీ, తెలంగాణ హైకోర్టులకు చెందిన పలువురు సీనియర్ న్యాయవాదులు తమ సంతాపం తెలియచేశారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ జూబ్లీహిల్స్ మహాప్రస్థానం శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. -
నోట్ల రద్దు నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం
• ఆ అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు • న్యాయవాదులు వెంకటరమణ, కృష్ణయ్యల వాదన • ప్రభుత్వం నోటిఫికేషన్‌తో రూ.1,000, రూ.500 నోట్లు రద్దు చేసింది సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ అన్నారు. నోట్ల రద్దు నోటిఫికేషన్ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించేవిధంగా ఉందని చెప్పారు. 1978లో చట్టం ద్వారా పెద్ద నోట్ల ను రద్దు ద్వారా చేశారని, ప్రస్తుతం అటువం టిదేమీ లేకుండా కేవలం ఓ నోటిఫికేషన్ మాత్రమే జారీ చేసి, రూ.1,000, రూ.500 నోట్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారని తెలి పారు. అప్పట్లో ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటి షన్ దాఖలైందని, అరుుతే సుప్రీంకోర్టు ఆ చట్టాన్ని సమర్థించిందని పేర్కొన్నారు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 26(2) కింద పెద్ద నోట్ల రద్దు అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదని వివరించారు. రూ.1,000, రూ.500 నోట్ల రద్దుకు సంబం ధించి కేంద్ర ప్రభుత్వం ఈ నెల 8న జారీ చేసిన నోటిఫికేషన్‌ను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ హైదరా బాద్‌కు చెందిన సుక్కా వెంకటేశ్వర రావు, న్యాయవాది కె.శ్రీనివాస్‌లు వేర్వేరుగా పిటి షన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను తాత్కా లిక ప్రధాన న్యాయమూర్తి రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి అంబటి శంకరనారాయణతో కూడిన ధర్మాసనం సోమవారం విచారిం చింది. వెంకటేశ్వరరావు తరఫున వేదుల వెంకటరమణ వాదనలు వినిపించగా, శ్రీని వాస్ తరఫున పి.వి.కృష్ణయ్య వాదించారు. రద్దు చేసిన నోట్ల చెల్లుబాటుకు గడువు తేదీని కేంద్రం నిర్ణరుుంచిందని, సెక్షన్ 26(2) కింద అది చట్ట రూపంలో ఉండాలని, దానిని పార్లమెంట్ మాత్రమే చేయగలదని వెంకట రమణ తెలిపారు. ఈ కారణంగానే ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 26కు ‘ఏ’ను జత చేసి 1956లో సవరణ తీసుకొచ్చారని వివరిం చారు. ఇప్పుడు కేంద్రం అటువంటిదేమీ చేయకుండా నోటిఫికేషన్ ద్వారా మొత్తం ప్రక్రియను పూర్తి చేసిందన్నారు. చట్టాన్ని చేసే అధికారాన్ని బదలారుుంచడానికి వీల్లేద న్నారు. నోట్ల రద్దు వల్ల సామాన్యులు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని వివరించారు. పౌరుల హక్కులను హరిస్తున్న కేంద్రం ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ప్రతిపాదనలు, సిఫారసుల మేరకు కేంద్రం నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందని పీవీ కృష్ణయ్య పేర్కొ న్నారు. అందరితోనూ చర్చించి, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతనే నిర్ణయం తీసుకోవాలన్నారు. ధర్మాసనం స్పందిస్తూ ముందుగా అందరితో చర్చిస్తే, నోట్ల రద్దు ఉద్దేశం నెరవేరదు కదా? అని వ్యాఖ్యానించింది. పౌరుల హక్కుల విష యంలో కేంద్రం ఒకపక్క జోక్యం చేసు కుంటూ, మరోపక్క వాటిని హరిస్తోందని కృష్ణయ్య తెలిపారు. కేంద్రం తరఫున అద నపు సొలిసిటర్ జనరల్ వాదనలు వినేందుకు వీలుగా తదుపరి విచారణను ధర్మాసనం మంగళవారానికి వారుుదా వేసింది. నగదు విత్‌డ్రా పై పరిమితి విధించే అధికారం లేదు: మైసూరా కేంద్రం నగదు ఉపసంహరణను రూ.10 వేలకు, వారానికి గరిష్టంగా రూ.20 వేలకు పరి మితం చేయడాన్ని మాజీమంత్రి మైసూరారెడ్డి హైకోర్టులో సోమవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. నగదు ఉపసంహరణపై పరిమితి విధించేందుకు కేంద్ర ప్రభు త్వానికి ఎటువంటి అధికారం లేదని పేర్కొన్నారు. రూ.100, రూ.500 నోట్లు విసృ్తతంగా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు తక్షణమే చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యాన్ని తక్షణమే విచారిం చాలని మైసూరా తరఫు న్యాయవాది అభ్యర్థించగా ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం అందుకు అంగీకరించలేదు. -
ఆంధ్రప్రదేశ్ ఏజీగా వేణుగోపాల్!
అదనపు ఏజీగా దమ్మాలపాటి శ్రీనివాస్? నేడు ఉత్తర్వులు వెలువడే అవకాశం హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా సీనియర్ న్యాయవాది పరాంకుశం వేణుగోపాల్ నియమితులు కానున్నారు. ఆయన నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు గురువారం వెలువడే అవకాశాలున్నాయి. అదనపు అడ్వొకేట్ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్ పేరు ఖరారైనట్లు తెలిసింది. ఆయన నియామకపు జీవో కూడా గురువారం వెలువడే అవకాశం ఉంది. ఏజీ పదవికి పలువురి పేర్లు వినిపించినప్పటికీ, అనూహ్యంగా పి.వేణుగోపాల్ పేరు ఖరారైంది. వేణుగోపాల్ పూర్వీకులు ఒరిస్సాలోని బరంపురంకు చెందిన వారు. తరువాత కాలంలో వారి కుటుంబం సికింద్రాబాద్‌లో స్థిరపడింది. 1954 నవంబర్ 23న వేణుగోపాల్ జన్మించారు. ఆయన విద్యాభ్యాసం మొత్తం సికింద్రాబాద్‌లోనే సాగింది. 1977లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అదే ఏడాది డిసెంబర్ 22న హైకోర్టు న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాది ఎన్.వి.రంగనాథన్ వద్ద జూనియర్‌గా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1983లో అడ్వొకేట్ జనరల్‌కు సహకరించేం దుకు ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా నియమితులై 1989 వరకు ఆ బాధ్యతలు నిర్వర్తించారు. వేణుగోపాల్ 2002-03లో హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్‌గా ఉన్నారు. -
ఏజీగా ముకుల్ రోహత్గీ!
సొలిసిటర్ జనరల్‌గా రంజిత్ కుమార్ న్యూఢిల్లీ: కేంద్రంలో ప్రభు త్వ మార్పు నేపథ్యంలో భారత నూతన అటార్నీ జనరల్ (ఏజీ)గా సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ నియూమకం దాదాపు ఖరారైంది. ప్రభుత్వ ఉన్నత న్యాయూధికారిగా ఇచ్చిన అవకాశానికి తాను అంగీ కారం తెలిపినట్టు రోహత్గీ బుధవారం నాడిక్కడ పీటీఐకి చెప్పారు. అరుుతే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నారు. రాజీనామా సమర్పించిన జి.ఇ. వాహనవతి స్థానంలో భారత 14వ ఏజీగా రోహత్గీ బాధ్యతలు స్వీకరిస్తారు. సుప్రీంకోర్టులోని వ్యాజ్యాలను ఒక గాడిన పెట్టడ మే తన ప్రధాన కర్తవ్యమని ఆయన చెప్పారు. ఉన్నత న్యాయస్థానాలకు నిస్సారమైన, చిల్లర వ్యాజ్యాలు వెల్లువెత్తకుండా చూస్తానన్నారు. ఇలావుండగా భారత సొలిసిటర్ జనరల్‌గా సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్‌ను నియమిం చాలని కేంద్రం నిర్ణరుుంచింది. ఎస్జీగా రాజీనామా చేసిన మోహన్ పరాశరన్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. అదనపు సొలిసిటర్ జనరల్‌గా న్యాయవాది మణిందర్ సింగ్ నియమితులయ్యూరు. గుజరాత్ సర్కారు తరఫున వాదించిన రోహత్గీ ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అవధ్ బేహారీ రో హత్గీ కుమారుడైన ముకుల్ రోహత్గీ.. 2002 గుజరా త్ అల్లర్లు, బూటకపు ఎన్కౌంటర్, బెస్ట్ బేకరీ, జహీరా షేక్ కేసులకు సంబంధించి సుప్రీం కోర్టులో గుజరాత్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించారు.