ఏజీగా ముకుల్ రోహత్గీ!
సొలిసిటర్ జనరల్‌గా రంజిత్ కుమార్
న్యూఢిల్లీ: కేంద్రంలో ప్రభు త్వ మార్పు నేపథ్యంలో భారత నూతన అటార్నీ జనరల్ (ఏజీ)గా సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ నియూమకం దాదాపు ఖరారైంది. ప్రభుత్వ ఉన్నత న్యాయూధికారిగా ఇచ్చిన అవకాశానికి తాను అంగీ కారం తెలిపినట్టు రోహత్గీ బుధవారం నాడిక్కడ పీటీఐకి చెప్పారు. అరుుతే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నారు. రాజీనామా సమర్పించిన జి.ఇ. వాహనవతి స్థానంలో భారత 14వ ఏజీగా రోహత్గీ బాధ్యతలు స్వీకరిస్తారు. సుప్రీంకోర్టులోని వ్యాజ్యాలను ఒక గాడిన పెట్టడ మే తన ప్రధాన కర్తవ్యమని ఆయన చెప్పారు. ఉన్నత న్యాయస్థానాలకు నిస్సారమైన, చిల్లర వ్యాజ్యాలు వెల్లువెత్తకుండా చూస్తానన్నారు. ఇలావుండగా భారత సొలిసిటర్ జనరల్‌గా సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్‌ను నియమిం చాలని కేంద్రం నిర్ణరుుంచింది. ఎస్‌జీగా రాజీనామా చేసిన మోహన్ పరాశరన్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. అదనపు సొలిసిటర్ జనరల్‌గా న్యాయవాది మణిందర్ సింగ్ నియమితులయ్యూరు.
గుజరాత్ సర్కారు తరఫున వాదించిన రోహత్గీ
ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అవధ్ బేహారీ రో హత్గీ కుమారుడైన ముకుల్ రోహత్గీ.. 2002 గుజరా త్ అల్లర్లు, బూటకపు ఎన్‌కౌంటర్, బెస్ట్ బేకరీ, జహీరా షేక్ కేసులకు సంబంధించి సుప్రీం కోర్టులో గుజరాత్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించారు.