న్యూఢిల్లీ, సాక్షి: అదానీపై అమెరికా కేసు వ్యవహారంపై ప్రముఖ న్యాయ నిపుణుడు, భారత మాజీ అటార్నీ జనరల్ రోహత్గీ విశ్లేషణ జరిపారు. అమెరికా కోర్టులో వేసిన ఛార్జ్‌షీట్‌లో ప్రధాన ఆరోపణల్లో ఎక్కడా అదానీ పేరు ప్రస్తావించలేదని అన్నారాయన..
అదానీ వ్యవహారంలో అమెరికా కోర్టులో వేసిన ఛార్జ్‌షీట్ పూర్తిగా తప్పుల తడక. చార్జ్‌షీట్‌లో ఎవరికి ఎవరు లంచాలు ఇచ్చారనే విషయంపై ఒక్క పేరు కూడా ప్రస్తావించలేదు. భారత అధికారులకు లంచాలు ఇచ్చారని ప్రస్తావించారు కానీ.. వారి పేర్లు, హోదాపై ఎక్కడా చెప్పలేదు.
నేనేం అదానీ గ్రూప్ తరఫున ప్రతినిధిగా మాట్లాడడం లేదు. నేనొక లాయర్‌ని. అమెరికా కోర్టు నేరారోపణను నేను పరిశీలించా. అందులో ఐదు అభియోగాల్లో.. ఒకటి, ఐదో అంశాలు కీలకంగా ఉన్నాయి. వాటిల్లోనూ అదానీగానీ, ఆయన బంధువు సాగర్‌పై గానీ అభియోగాలు లేవు. మొదటి అభియోగంలో.. అదానీల తప్ప కొందరి పేర్లు మాత్రమే ఉన్నాయి. అందులో కొందరు అధికారులు, ఒక విదేశీ వ్యక్తి పేరుంది. అలాగే.. కీలక ఆరోపణల్లోనూ అదానీ పేరు లేదు అని చెప్పారాయన.
ఆరోపణలు చేసే సమయంలో అధికారులు ఏ శాఖకు చెందిన వారు, వారి పేర్లు ఏంటన్నది కచ్చితంగా ఛార్జ్‌షీట్‌లో ఉండాలి. అదానీపై మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం. పేర్లు లేకుండా ఛార్జ్‌షీట్‌లో ఆరోపణలు మాత్రమే చేయడం.. విస్మయం కలిగించింది. ఇలాంటి ఛార్జ్‌షీట్‌పై ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు. అదానీ న్యాయపోరాటం చేస్తారని భావిస్తున్నా అని రోహత్గీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment