mukul rohatgi
-
ఇవేం నేరారోపణలు?
సాక్షి, అమరావతి: సౌర విద్యుత్ ప్రాజెక్టుల సంబంధించి అదానీ గ్రూపు లంచాలు ఇచ్చేందుకు కుట్ర పన్నిందంటూ యూఎస్ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్‌సీపీఏ) కింద అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ (డీఓజే) కేసు నమోదు చేయడాన్ని ప్రముఖ న్యాయ కోవిదుడు, మాజీ అటార్నీ జనరల్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ తప్పుబట్టారు. ‘డీఓజే’ చేసిన నేరారోపణలకు బలం చేకూర్చే విశ్వసనీయమైన ఆధారాలు ఏవీ లేవని ఆయన స్పష్టం చేశారు. ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్‌సీపీఏ)ను ఉల్లంఘించారనే విషయంలో అదానీలపై ఎలాంటి నేరారోపణలు లేవన్నారు. అలాగే న్యాయాన్ని అడ్డుకున్నారన్న నేరారోపణలో కూడా అదానీల పేర్లు గానీ వారి అధికారుల పేర్లు గానీ లేవని వెల్లడించారు. ఈ రెండు కీలకమైన నేరారోపణల్లో అదానీల పేర్లు లేవన్న సంగతిని అందరూ.. ముఖ్యంగా మీడియా గుర్తించాలని సూచించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఏం చెప్పారంటే...యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మోపిన నేరారోపణ పత్రాన్ని నేను చదివా. ఆయా వ్యక్తుల నిర్దిష్ట చర్యలపై అభియోగాలు మోపుతూ మన దేశంలో దాఖలు చేసే చార్జిషీట్ లాంటిది ఇది. నా లెక్క ప్రకారం మొత్తం ఐదు నేరారోపణలున్నాయి. ఇందులో మొదటి, ఐదో నేరారోపణలు మిగిలిన వాటికన్నా చాలా ముఖ్యమైనవి. అయితే ఒకటో నేరారోపణలోగానీ ఐదో నేరారోపణలోగానీ అదానీ, ఆయన మేనల్లుడు పేర్లు లేనే లేవు. ఆ నేరారోపణలు మన దేశంలో దాఖలు చేసే చార్జిషీట్ లాంటివి. అది లంచం కావచ్చు.. దొంగతనం కావచ్చు.. హత్య కావొచ్చు. మొదటి నేరారోపణలో ఇద్దరు అదానీల పేర్లు లేవు. ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్‌సీపీఏ) కింద ఈ నేరారోపణలు చేశారు. ఎఫ్‌సీపీఏ అనేది మన దేశంలో అవినీతి నిరోధక చట్టం లాంటిది. మొదటి నేరారోపణ ఏమిటంటే.. ఎఫ్సీపీఏని ఉల్లంఘించేందుకు కుట్ర పన్నారన్నది. ఇందులో ఆదానీల పేర్లు లేవు. వారి అధికారుల పేర్లు ఉన్నాయి. రెండు, మూడు, నాలుగో ఆరోపణలు సెక్యూరిటీలు, బాండ్లకు సంబంధించినవి. ఈ నేరారోపణల్లో అదానీలు, వారి అధికారుల పేర్లున్నాయి. ఐదవదైన చివరి నేరారోపణ చాలా ముఖ్యమైనది. ఈ నేరారోపణ న్యాయానికి ఆటంకం కలిగించారన్నది. ఇందులో అదానీల పేర్లు లేవు. వారి అధికారుల పేర్లు కూడా లేవు. అసలు ఎవరు ఎవరికి లంచం ఇచ్చారు..? ఎంత లంచం ఇచ్చారు..? ఎలా ఇచ్చారు... లాంటి వివరాల్లేవ్..!ఓ చార్జిషీట్లో ఫలానా వ్యక్తులు ఫలానా పనులు చేశారు.. ఫలానా వ్యక్తులు ఫలానా వారికి లంచం ఇచ్చారు లాంటి వివరాలేవీ లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. అదానీలు సౌర విద్యుత్ ప్రాజెక్టుల నిమిత్తం భారతదేశ వ్యక్తులకు, సంస్థలకు లంచం ఇవ్వజూపారన్నది ప్రధాన నేరారోపణ. అయితే ఆ నేరారోపణల్లో లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారని ఉందే కానీ.. ఎవరికి లంచం ఇచ్చారు? ఎలా లంచం ఇచ్చారు? ఇందులో అదానీ గ్రూపు అధికారుల ప్రత్యక్ష ప్రమేయం ఉందా? ఎంత లంచం ఇచ్చారు? ఏ కాంట్రాక్ట్ కోసం లంచం ఇచ్చారు? అధికారులు ఏ గ్రూపునకు చెందిన వారు తదితర వివరాలేవీ కనీస స్థాయిలో కూడా ఆధారాలు లేవు. ఇందుకు సంబంధించి ఒక్కరి పేరు కూడా ఆ నేరారోపణల్లో లేదు. ఇలాంటి నేరారోపణలపై ఎవరైనా ఎలా స్పందిస్తారు? ఆ నేరారోపణల్లో ఎక్కడా కూడా ఇండియాలో లంచాలు ఇచ్చినట్లు లేదు. లంచం ఇచ్చేందుకు కుట్ర పన్నారన్నదే ప్రధాన నేరారోపణ. కానీ ఇందుకు ఎలాంటి ఆధారాలు లేవు. ఈ వ్యవహారంలో వారు (అదానీలు) అమెరికాలోని న్యాయవాదుల సలహాలు తీసుకుంటారని భావిస్తున్నా. లంచం ఇవ్వాలని చూశారన్న ఆరోపణ మినహా అందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. అందువల్ల ఆ నేరారోపణలన్నీ కూడా ఊహాజనితమైనవే. మరోసారి చెబుతున్నా.. 1, 5వ నేరారోపణల్లో అదానీల పేర్లు లేవు. -
అదానీపై అమెరికా కేసు వ్యవహారంలో ముకుల్ రోహత్గీ విశ్లేషణ
-
అదానీపై కేసు: ‘ఎవరికి లంచాలు ఇచ్చారో ఛార్జ్‌షీట్‌లో లేదు’
న్యూఢిల్లీ, సాక్షి: అదానీపై అమెరికా కేసు వ్యవహారంపై ప్రముఖ న్యాయ నిపుణుడు, భారత మాజీ అటార్నీ జనరల్ రోహత్గీ విశ్లేషణ జరిపారు. అమెరికా కోర్టులో వేసిన ఛార్జ్‌షీట్‌లో ప్రధాన ఆరోపణల్లో ఎక్కడా అదానీ పేరు ప్రస్తావించలేదని అన్నారాయన.. అదానీ వ్యవహారంలో అమెరికా కోర్టులో వేసిన ఛార్జ్‌షీట్ పూర్తిగా తప్పుల తడక. చార్జ్‌షీట్‌లో ఎవరికి ఎవరు లంచాలు ఇచ్చారనే విషయంపై ఒక్క పేరు కూడా ప్రస్తావించలేదు. భారత అధికారులకు లంచాలు ఇచ్చారని ప్రస్తావించారు కానీ.. వారి పేర్లు, హోదాపై ఎక్కడా చెప్పలేదు.నేనేం అదానీ గ్రూప్ తరఫున ప్రతినిధిగా మాట్లాడడం లేదు. నేనొక లాయర్ని. అమెరికా కోర్టు నేరారోపణను నేను పరిశీలించా. అందులో ఐదు అభియోగాల్లో.. ఒకటి, ఐదో అంశాలు కీలకంగా ఉన్నాయి. వాటిల్లోనూ అదానీగానీ, ఆయన బంధువు సాగర్‌పై గానీ అభియోగాలు లేవు. మొదటి అభియోగంలో.. అదానీల తప్ప కొందరి పేర్లు మాత్రమే ఉన్నాయి. అందులో కొందరు అధికారులు, ఒక విదేశీ వ్యక్తి పేరుంది. అలాగే.. కీలక ఆరోపణల్లోనూ అదానీ పేరు లేదు అని చెప్పారాయన.ఆరోపణలు చేసే సమయంలో అధికారులు ఏ శాఖకు చెందిన వారు, వారి పేర్లు ఏంటన్నది కచ్చితంగా ఛార్జ్‌షీట్‌లో ఉండాలి. అదానీపై మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం. పేర్లు లేకుండా ఛార్జ్‌షీట్‌లో ఆరోపణలు మాత్రమే చేయడం.. విస్మయం కలిగించింది. ఇలాంటి ఛార్జ్‌షీట్‌పై ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు. అదానీ న్యాయపోరాటం చేస్తారని భావిస్తున్నా అని రోహత్గీ అన్నారు. -
కవితకు గుడ్ న్యూస్
-
సుప్రీంకోర్టులో రెండు మద్యం సీసాలు
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఓ కేసు విచారణ సందర్భంగా రెండు మద్యం సీసాలు కోర్టు గదిలో ప్రత్యక్షమయ్యాయి. ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనపై రెండు మద్యం కంపెనీల మధ్య నెలకొన్న వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. పిటిషనర్ల వాదించిన సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ ఈ మద్యం సీసాలను కోర్టులోకి తీసుకొచ్చారు. ధర్మాసనం ఎదుట ప్రదర్శించారు. వాటిని చూసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆశ్చర్యపోయారు. బిగ్గరగా నవ్వారు. అసలు ఏం జరిగిందంటే.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన జేకే ఎంటర్ప్రైజెస్ అనే లిక్కర్ కంపెనీ ‘లండన్ ప్రైడ్’ పేరుతో మద్యం తయారు చేస్తోంది. ఈ పేరు తాము తయారుచేస్తున్న ‘బ్లెండర్స్ ప్రైడ్’ మద్యం పేరును పోలి ఉందని పెర్నాడ్ రికార్డ్స్ అనే మరో లిక్కర్ కంపెనీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాకుండా లండన్ ప్రైడ్ లిక్కర్ బాటిల్ ‘ఇంపీరియల్ బ్లూ’ లిక్కర్ బాటిల్ మాదిరిగానే ఉందని ఆరోపించింది. లండన్ ప్రైడ్ పేరుతో లిక్కర్ తయారు చేయకుండా దాన్ని నిషేధించాలంటూ పెట్టుకున్న పిటిషన్‌ను మధ్యప్రదేశ్ హైకోర్టు గతేడాది తిరస్కరించింది. దీన్ని సవాలు చేస్తూ పెర్నాడ్ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున రోహత్గీ వాదనలు వినిపించారు. ధర్మాసనం అనుమతితో లండన్ ప్రైడ్, ఇంపీరియల్ బ్లూ లిక్కర్ సీసాలను తీసుకొచ్చి తన టేబుల్‌పై ఉంచారు. వాటిని చూసి సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నవ్వు ఆపుకోలేకపోయారు. ‘వాటిని మీతోపాటే తీసుకొచ్చారా?’ అని రోహత్గీని ప్రశ్నించారు. రెండు సీసాల మధ్య సారూప్యతను స్వయంగా చూపించడానికే తీసుకొచ్చానని ఆయన బదులిచ్చారు. ఈ కేసులో ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన జరిగిందని చెప్పారు. జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. గతంలో బాంబే హైకోర్టులో ఇలాంటి కేసులో తాను తీర్పు ఇచ్చానని గుర్తుచేసుకున్నారు. మధ్యప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుపై స్టే విధిస్తున్నట్లు చెప్పారు. జేకే ఎంటర్‌ప్రైజెస్‌కు నోటీసు జారీ చేశారు. -
నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు స్కిల్ స్కాం కేసు విచారణ
-
శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వాదనలు విననున్న సుప్రీంకోర్టు
-
చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ శుక్రవారానికి వాయిదా
-
CBN Petition: 17ఏ అవినీతిని కాపాడేందుకు కాదు
-
చంద్రబాబుకు పాత చట్టాలే వర్తిస్తాయి: రోహత్గి
-
జీఎస్టీ డీజీ స్కిల్ స్కాంలో చేసిన విచారణ కాపీని సమర్పించాం: రోహత్గీ
-
అవినీతి చేసినవారు సెక్షన్ 17A పేరుతో తప్పించుకోలేరు
-
ఏజీ పోస్ట్ నాకొద్దు: రొహత్గీ
న్యూఢిల్లీ: అటార్నీ జనరల్ పదవిని సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రొహత్గీ తిరస్కరించారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆదివారం చెప్పారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్(91) పదవీ కాలం ఈ నెల 30వ తేదీతో ముగియనుండటంతో ఆ పదవికి రొహత్గీని కేంద్రం ఎంపిక చేయడం తెలిసిందే. వేణు గోపాల్ కూడా ఆరోగ్యో కరాణాలతో ఈ పదవిలో మరింతకాలం కొనసాగనని ఇప్పటికే చెప్పారు. ముకల్ రొహత్గీ కేంద్రం ఆఫర్‌ను తిరస్కరించాడని ప్రత్యేక కారణాలేమీ లేవని చెప్పారు. ఒకటికి రెండుసార్లు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. రొహత్గీ 2014 నుంచి 2017వరకు అటార్నీ జనరల్‌గా పనిచేశారు. ఒకవేళ కేంద్రం ఆఫర్‌కు ఆయన ఓకే చెప్పి ఉంటే ఈ పదవిని రెండోసారి చేపట్టేవారు. చదవండి: సోనియాతో నితీశ్, లాలూ కీలక భేటీ.. -
పిల్లలు 7 గంటలకే స్కూల్‌కు వెళ్తుంటే... మేం తొమ్మిదింటికి కోర్టుకు రాలేమా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘మన పిల్లలు ఉదయం ఏడు గంటలకే పాఠశాలకు వెళ్తుంటే అప్పుడు మనం 9 గంటలకే కోర్టుకు రాలేమా?’’అని సుప్రీంకోర్టులో రెండో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ పేర్కొన్నారు. శుక్రవారం జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్రభట్, జస్టిస్ సుధాంశు ధూలియాలతో కూడిన ధర్మాసనం ఉదయం 9.30 గంటలకే కోర్టు ప్రొసీడింగ్స్ ప్రారంభించింది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్రొసీడింగ్స్ 9.30 గంటలకే ప్రారంభం కావడాన్ని సీనియర్ న్యాయవాది ముకుల్ రొహత్గి ప్రశంసించగా జస్టిస్ లలిత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘పిల్లలు ఉదయం 7 గంటలకు స్కూల్‌కి వెళ్లగలిగినప్పుడు, 9 గంటలకు మనం ఎందుకు రాలేమని నేనెప్పుడూ అంటుంటాను. కోర్టుల్లో కార్యకలాపాలు ఉదయం 9.30 గంటలకు మొదలైతే మరీ మంచిది‘ అని ఆయన అన్నారు. ‘కోర్టులు ముందుగా మొదలైతే, విధులను కూడా తొందరగానే ముగించొచ్చు. తర్వాతి రోజు కేసుల అధ్యయనానికి సాయంత్రం ఎక్కువ సమయం ఉంటుంది’ అన్నారు. ఆగస్ట్ చివరికి ఈ ఏర్పాట్లు మొదలవుతాయని భావిస్తున్నానని రొహత్గి పేర్కొనగా, ఇవి కొన్ని మాత్రమేనని జస్టిస్ లలిత్ చెప్పారు. సుప్రీంకోర్టుల్లో విచారణలు సాధారణంగా ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు జరుగుతుంటాయి. ఆగస్ట్ 26వ తేదీన రిటైర్ కానున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్థానంలో జస్టిస్ లలిత్ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. -
ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్
ముంబై: ముంబై తీరంలోని క్రూయిజ్‌లో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న కేసులో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఆర్యన్‌ఖాన్ అరెస్టయిన 25 రోజులు తర్వాత అతనికి బెయిల్ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్ డబ్ల్యూ సాంబ్రే గురువారం తీర్పు చెప్పారు. ఆర్యన్ సహ నిందితులు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలకు కూడా బెయిల్ మంజూరు చేశారు. ‘‘వారి ముగ్గురి బెయిల్ విజ్ఞప్తిని ఆమోదిస్తున్నాను. శుక్రవారం సాయంత్రానికి వివరంగా ఉత్తర్వులు జారీ చేస్తాను’’ జస్టిస్ సాంబ్రే చెప్పారు. ఇంకా పూర్తి ఉత్తర్వులు రాకపోవడంతో శుక్రవారం లేదంటే శనివారంనాడు ఆర్యన్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. వాదనలు సాగిందిలా.. ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై బాంబే హైకోర్టులో మూడు రోజుల పాటు వాదనలు సాగాయి. ఇప్పటికే రెండుసార్లు ఆర్యన్‌కు కింది కోర్టుల్లో చుక్కెదురు కావడంతో మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని లాయర్‌గా నియమించారు. క్రూయిజ్‌పై ఎన్సీబీ అధికారులు దాడి చేసినప్పుడు ఆర్యన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించలేదు. ఈ విషయాన్నే ఆయన తరఫున వాదించిన ముకుల్ రోహత్గీ పదే పదే ప్రస్తావించారు. వైద్య పరీక్షల్లో కూడా ఆర్యన్ డ్రగ్స్ సేవించాడనేది రుజువు కాలేదని న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు. అలాంటప్పుడు ఆర్యన్‌ను అదుపులోనికి తీసుకోవడం అర్థరహితమని వాదించారు. రెండేళ్ల క్రితం నాటి వాట్సాప్ సంభాషణలను ఆధారం చేసుకొని ఆర్యన్ చుట్టూ ఉచ్చు బిగించాలని చూశారని, కానీ ఆ సంభాషణల్లో కూడా ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. అర్బాజ్ ధరించిన షూలో డ్రగ్స్ లభిస్తే ఆర్యన్‌ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటని రోహత్గీ తన వాదనల్లో గట్టిగా ప్రశ్నించారు. మరోవైపు ఎన్సీబీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ ఆర్యన్ ఖాన్ మాదకద్రవ్యాలను తరచుగా సేవిస్తారని చెప్పారు. గత రెండేళ్లుగా ఆర్యన్ అక్రమంగా డ్రగ్స్ కొనుగోలు చేసి సేవిస్తున్నారని తన వాదనల్లో పేర్కొన్నారు. డ్రగ్స్ విక్రేతలతో ఆర్యన్‌కి సంబంధాలున్నాయని అనిల్ సింగ్ ఆరోపించారు. డ్రగ్స్‌తో వ్యాపారం చేసే స్థాయిలో పెద్ద మొత్తంలో ఆర్యన్ కొనుగోలు చేస్తున్నాడని అతని వాట్సాప్ సంభాషణల ద్వారా తేటతెల్లమవుతోందని, ఇదంతా ఒక కుట్ర ప్రకారం జరుగుతోందని అందుకే అతనికి బెయిల్ ఇవ్వొద్దని అనిల్ సింగ్ వాదించారు. క్రూయిజ్‌పై దాడి జరిగిన సమయంలో ఎక్కువమంది దగ్గర వివిధ రకాల మాదకద్రవ్యాలు లభించాయని వీటన్నింటినీ చూస్తుంటే ఆర్యన్ డ్రగ్స్ విషయం గురించి పూర్తిగా తెలుసునని ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం అన్నీ తెలిసి కూడా అక్కడ ఉండడం నేరపూరితమైన చర్యేనని వాదించారు. దీనికి రోహత్గీ గట్టిగా కౌంటర్ ఇస్తూ క్రూయిజ్‌లో 1,300 మంది ఉన్నారని గుర్తు చేశారు. తాజ్ హోటల్లో 500 గదులుంటే, రెండు గదుల్లో ఉన్న వారు డ్రగ్స్ సేవిస్తే మొత్తం హోటల్లో ఉన్న వారందరినీ అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. ఆర్యన్ ఎలాంటి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడలేదని, ఒక నవ యువకుడ్ని ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ పకడ్బందీగా వాదనలు వినిపించారు. లాయర్ రోహత్గీ వాదనలు విన్న న్యాయమూర్తి ముగ్గురికీ బెయిల్ ఇస్తానని ప్రకటించి, తీర్పు పూర్తి పాఠాన్ని శుక్రవారం వెల్లడిస్తానని స్పష్టం చేశారు. కాగా ఆర్యన్‌కు బెయిల్‌పై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ‘‘సినిమా ఇంకా మిగిలే ఉంది మిత్రమా’’..అంటూ స్పందించగా, ‘‘నాకిది చాలా సాధారణమైన కేసు. కొన్ని గెలుస్తాం, కొన్ని ఓడిపోతాం. కానీ ఆర్యన్‌కు బెయిల్ రావడం సంతోషంగా ఉందని సీనియర్ లాయర్ ముకుల్ రొహత్గీ అన్నారు. న్యాయం జరగాల్సిన సమయం వస్తే, సాక్ష్యాలతో పని ఉండదు అని నటుడు సోనూసూద్ పేర్కొనగా ‘‘అంతా దేవుడి దయ. ఒక తండ్రిగా ఊపిరిపీల్చుకుంటున్నాను. ఇక వాళ్లకి అంతా మంచే జరగాలి’’అని మరో నటుడు ఆర్.మాధవన్ ఆకాంక్షించారు. 2018 నాటి చీటింగ్ కేసులో గోసవి అరెస్ట్ పుణె: ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సాక్షిగా ప్రవేశపెట్టిన ప్రైవేట్ డిటెక్టివ్ కిరణ్ గోసవిని గురువారం మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో అతడిపై నమోదైన చీటింగ్ కేసుకు సంబంధించి అదుపులోనికి తీసుకున్నట్టు పోలీసులు చెప్పారు. కొన్నాళ్లుగా పరారీలో ఉన్న గోసవి పోలీసులకు లొంగిపోకుండా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో తలదాచుకుంటూ వస్తున్నారని పోలీసు అధికారులు చెప్పారు. ఆ తరవాత అతనిని పుణె కోర్టులో ప్రవేశపెట్టారు. డ్రగ్స్ కేసులో నిందితుడైన బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూక్‌ఖాన్ కుమారుడే ఆర్యన్‌తో కలిసి గోసవి దిగిన సెల్ఫీలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. 2018లో గోసవిపై నమోదైన చీటింగ్ కేసులో అదుపులోకి తీసుకున్నట్టు పుణె పోలీసు కమిషనర్ అమితాబ్ గుప్తా వెల్లడించారు. కత్రజ్ ప్రాంతంలోని ఒక లాడ్జిలో తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. సచిన్ పాటిల్ పేరుతో అతడు ఆ హోటల్లో ఉంటున్నాడు. నోటీసులివ్వకుండా వాంఖెడేని అరెస్ట్ చేయం ఆర్యన్ ఖాన్ విడుదలకు ముడుపులు డిమాండ్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేకి మూడు రోజుల ముందుగా నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయమని ముంబై పోలీసులు హైకోర్టుకు తెలిపారు. మహారాష్ట్ర పోలీసులు తనని అరెస్ట్ చేస్తారన్న భయం వెంటాడుతోందంటూ వాంఖెడే కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ వాంఖెడే దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ నితిన్ జమ్దార్, జస్టిస్ ఎస్వి కొత్వాల్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని, ముంబై పోలీసులు ఈ విషయంలో పక్షపాత ధోరణితో వ్యవహరించే అవకాశం ఉందని వాంఖెడే ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముంబై పోలీసుల తరఫున కోర్టుకు హాజరైన చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అరుణ ముందస్తు నోటీసు లేకుండా వాంఖెడేని అరెస్ట్ చేయరని స్పష్టం చేశారు. మరోవైపు తమ కుటుంబంపైనా, వ్యక్తిగత జీవితంపైనా దాడులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ వాంఖెడే భార్య క్రాంతి రేడ్కర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. తమకు న్యాయం చెయ్యాలంటూ ఆమె ఆ లేఖలో కోరారు. -
ఆర్యన్ ఖాన్‌కు బెయిల్: ‘ఇలాంటి కేసులు మాకు మామూలే’
ముంబై: ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న తన కుమారుడు ఆర్యన్‌ను జైలు నుంచి విడిపించేందుకు బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మాజీ అటార్నీ జనరల్, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సాయంతో ఆర్యన్ ఖాన్ జైలు నుంచి విడుదల కాబోతున్నాడు. బాంబే హైకోర్టు గురువారం అతడికి బెయిల్ మంజూరు చేసింది. ఆర్యన్ ఖాన్ తరపున ముకుల్ రోహత్గీ కోర్టులో వాదనలు వినిపించారు. కోర్టు తీర్పుపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. ఇలాంటి కేసులు తమకు సర్వసాధారణమని వ్యాఖ్యానించారు. ‘కోర్టు నుంచి ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఆర్యన్‌ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలు జైలు నుండి విడుదలవుతారు. ఇలాంటి కేసులు నాకు సర్వసాధారణం. కొన్ని గెలుస్తాం, కొన్ని ఓడిపోతాం. అతనికి (ఆర్యన్ ఖాన్) బెయిల్ లభించినందుకు నేను సంతోషిస్తున్నాను’ అని ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు. కోర్టు తీర్పుకు సంబంధించిన ఆర్డర్ కాపీ శుక్రవారం వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఆర్యన్‌ఖాన్‌తో పాటు మిగతా ఇద్దరు రేపు విడుదల అవుతారని.. ఒకవేళ ఆలస్యం జరిగితే శనివారం జైలు నుంచి బయటకు వస్తారని తెలిపారు. కాగా, ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ రావడంతో అతడి కుటుంబం ఊపిరి పీల్చుకుంది. (చదవండి: ముంబై మాదక ద్రవ్యాల కేసులో రోజుకో కొత్త మలుపు) -
ఆర్యన్ ఖాన్ కేసు: సీనియర్ లాయర్ రంగప్రవేశం.. ఎవరాయన?
ముంబై: తన కుమారుడిని ఎలాగైనా జైలు నుంచి విడిపించేందుకు బాలీవుడ్ అగ్ర నటుడు షారూఖ్ ఖాన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్యన్ ఖాన్‌ను బెయిల్‌పై తీసుకువచ్చేందుకు మాజీ అటార్నీ జనరల్, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని రంగంలోకి దింపారు. మంగళవారం బాంబే హైకోర్టులో ఆర్యన్ ఖాన్ తరపున ఆయన వాదనలు వినిపించారు. ముంబై క్రూయిజ్ మాదక ద్రవ్యాల కేసుతో ఆర్యన్‌కు సంబంధం లేదనే కోణంలో ఆయన గట్టిగా వాదించారు. ఈ నేపథ్యంలో ముకుల్ రోహత్గీ గురించి నెటిజనులు సోషల్ మీడియాలో ఆరా తీయడం మొదలుపెట్టారు. (చదవండి: మా నాన్న హిందు, అమ్మ ముస్లిం..) తలపండిన లాయర్ సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది అయిన ముకుల్ రోహత్గీ.. భారత్‌కు 14వ అటార్నీ జనరల్ (ఏజీ)గా 2014 నుంచి 2017 వరకు పనిచేశారు. అంతకుముందు అదనపు సొలిసిటర్ జనరల్‌గానూ సేవలు అందించారు. 66 ఏళ్ల ఈ తలపండిన లాయర్.. పలు హైప్రొఫైల్, కీలక కేసులు వాదించారు. హైకోర్టు మాజీ జడ్జి కుమారుడు ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అవధ్ బేహారీ రోహత్గీ కుమారుడైన ముకుల్ రోహత్గీ.. 2002 గుజరాత్ అల్లర్లు, బెస్ట్ బేకరీ, జహీరా షేక్ ఎన్కౌంటర్ల కేసుల విచారణలో సుప్రీం కోర్టులో గుజరాత్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. ఐపీసీలోని వివాదాస్పద సెక్షన్-377పై సుప్రీంకోర్టులో పిటిషనర్ల తరపున ప్రాతినిథ్యం వహించారు. సభర్వాల్ శిష్యుడు ముకుల్ రోహత్గీ.. 1955, ఆగస్టు 17న ఢిల్లీలో జన్మించారు. ముంబైలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో లా కోర్సు పూర్తి చేసిన తర్వాత యోగేశ్ కుమార్ సభర్వాల్ వద్ద ప్రాక్టీస్ మొదలు పెట్టారు. కొంత కాలం తర్వాత సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించి లాయర్‌గా మంచి పేరు సంపాదించారు. 1993లో ఢిల్లీ హైకోర్టు ఆయనను సీనియర్ న్యాయవాదిగా నియమించింది. 1999లో వాజపేయి ప్రభుత్వ హయాంలో అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. ముకుల్ రోహత్గీ సతీమణి పేరు వసుధ, కుమారు పేరు సమీర్. (చదవండి: ఆర్యన్‌ను వదిలేయడానికి రూ.25 కోట్లు?) -
టిక్‌టాక్‌కు మరో ఎదురుదెబ్బ..
న్యూఢిల్లీ: భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి చైనా వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్ తరపున కోర్టులో వాదించడానికి నిరాకరించారు. లద్దాఖ్‌లోని గల్వాన్ వ్యాలీ ముఖాముఖి నేపథ్యంలో చైనాకు సంబంధించిన 59 మొబైల్ యాప్‌లపై కేంద్రం నిషేదిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. చైనా కంపెనీ తరపున ప్రాతినిధ్యం వహిస్తూ యాప్‌ల తొలగింపుపై కోర్టుకు వెళ్తారని వస్తున్న వార్తలను ముకుల్ రోహత్గి ఖండించారు. ఈ మేరకు ఆయన బుధవారం రోజున మాట్లాడుతూ.. టిక్‌టాక్ సంస్థ వారి తరపున కోర్టులో వాదనలు వినిపించాలని కోరింది. అయితే టిక్‌టాక్ అభ్యర్థనను తిరస్కరించాను. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను కోర్టులో వాదించబోనని ఆ సంస్థకు స్పష్టం చేశానని పేర్కొన్నారు. కాగా.. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రతల నేపథ్యంలో చైనాకు సంబంధించిన టిక్ టాక్‌తోసహా లైకీ, యూసీ బ్రౌజర్, క్యామ్ స్కానర్, విగొ వీడియో వంటి 59 రకాల యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. (59 యాప్స్ నిషేధం: చైనా ఆందోళన) -
సెక్షన్-377.. కేంద్రానికి ఎదురుదెబ్బ
న్యాయ చరిత్రలో మరో చారిత్రక అధ్యయం చోటుచేసుకుంది. ఐపీసీలోని వివాదాస్పద సెక్షన్-377పై దాఖలైన రివ్యూ పిటిషన్‌పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. స్వలింగ సంపర్కం నేరం కిందకే వస్తుందంటూ గతంలో(2013) అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వగా.. ఇప్పుడు ఆ తీర్పును సమీక్షించేందుకే మొగ్గు చూపింది. ఈ మేరకు విచారణను వాయిదా వేయాలన్న కేంద్రం వినతిని ధర్మాసనం సున్నితంగా తోసిపుచ్చింది. దీంతో ఎల్జీబీటీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. సాక్షి, న్యూఢిల్లీ: సెక్షన్-377 తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్‌ను విచారణను వాయిదా వేయాలంటూ కేంద్రం తరపున అదనపు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే ‘సామాజిక నైతికతలో మార్పులు వస్తున్నాయి. అందుకే తీర్పులోని తప్పుఒప్పులను పునఃసమీక్షించాలని నిర్ణయించాం’ అని ధర్మాసనం పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఆర్ఎఫ్ నారీమన్, వైవీ చంద్రచూడ్, ఎఎమ్ కన్వీల్కర్, జస్టిస్ ఇందూ మల్హోత్రాలతో కూడిన విస్తృత ధర్మాసనం రిప్యూ పిటిషన్‌ను విచారణ చేపట్టింది. ‘సమాజంలో మార్పులు వస్తున్నాకొద్దీ.. విలువలు కూడా మారుతున్నాయి. కాబట్టి స్వలింగ సంపర్కం నేరం కాదు’ అని పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి(మాజీ అటార్నీ జనరల్) వాదనలు వినిపించారు. లంచ్ విరామం అనంతరం తిరిగి విచారణ కొనసాగనుంది. ఐపీసీ సెక్షన్ 377... ఈ సెక్షన్ కింద ప్రకృతి విరుద్ధంగా జరిగే లైంగిక సంపర్కం నేరం. మగవాళ్ళు మగవాళ్లతో.. లేదా మహిళలు మహిళలతో శృంగారంలో పాల్గొనడం అనైతిక చర్యగా పరిగణిస్తారు. ఐపిసి 377 సెక్షన్ కింద 'అసహజమైన నేరాల' (ఎవరైనా పురుషుడు, లేదా స్త్రీ, లేదా జంతువుతో అసహజ సంపర్కానికి) పాల్పడేందుకు ప్రయత్నించినా, పాల్పడినా వారికి యావజ్జీవిత జైలు శిక్ష, లేదా పదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం వుంది. దీనితో పాటు భారీ జరిమానా కూడా విధించొచ్చు. 150 ఏళ్లకు పైగా.. 1861లో ఈ సెక్షన్‌ను అప్పటి బ్రిటిష్ పాలకులు భారత శిక్షా స్మృతిలో ప్రవేశపెట్టారు. ఈ సెక్షన్‌ను సవాలు చేస్తూ 2001లో నాజ్ ఫౌండేషన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు ఇద్దరు వయోధికుల మధ్య పరస్పర అంగీకారంతో జరిగే గే సెక్స్ ‘నేరం కాదని’ తేల్చింది. రాజ్యాంగంలోని 14, 15, 21ల అధికరణాల్ని 377 సెక్షన్ ఉల్లంఘిస్తోందని పేర్కొంది. ఈ తీర్పును కొందరు సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో తీర్పుపై అభిప్రాయాన్ని వెల్లడించాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. చివరకు డిసెంబర్ 11, 2013న ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీం కొట్టివేస్తూ 377 సెక్షన్ రాజ్యాంగ విరుద్ధం కాదని, నేరమని తేల్చి చెప్పిది. అనంతరం తీర్పును సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం, గే హక్కుల కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అనంతరం పలువురు క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేయడంతో.. ఫిబ్రవరి 2, 2016న వాటిని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మసనానికి సిఫార్సు చేసింది. దాదాపు 26కు పైగా దేశాలు ఇప్పటికే స్వలింగ సంపర్కం నేరం కాదంటూ చట్టం చేశాయన్న విషయాన్ని ఈ సందర్భంగా పలువురు న్యాయనిపుణులు లేవనెత్తుతున్నారు. -
గోప్యతపై మాజీ అటార్నీ జనరల్ ఏమన్నారంటే...
సాక్షి, న్యూఢిల్లీ : గోప్యతను ప్రాథమిక హక్కుగా పరిణించడాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఎదుట తాను వ్యతిరేకించానని మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి చెప్పారు. గోప్యత ప్రాథమిక హక్కు కాదని, అది సాధారణ హక్కు మాత్రమేనని ప్రభుత్వం కోర్టులో వాదించిందని ఈ ఏడాది జూన్ వరకూ సుప్రీంలో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన రోహత్గి తెలిపారు. గతంలో గోప్యత అంశంపై భిన్నతీర్పులు వచ్చిన ఉదంతాన్ని ప్రస్తావించి దీనిపై రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించేలా సుప్రీం కోర్టును రోహత్గి ఒప్పించారు. జులైలో గోప్యత అంశాన్ని విచారించేందుకు సుప్రీం తొమ్మిది మంది న్యాయవాదులతో కూడిన బెంచ్ ఏర్పాటు చేసే సమయానికి ఆయన అటార్నీ జనరల్ పదవి నుంచి వైదొలిగారు. 2015 నుంచి రోహత్గి ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తూ గోప్యత ప్రాథమిక హక్కు కాదని నొక్కిచెబుతూ వచ్చారు. భారత రాజ్యాంగంలో అసలు గోప్యత అనే భావన లేదన్న విషయాన్నితాను మొదటినుంచి చెబుతున్నానన్నారు. అయితే ప్రభుత్వం తర్వాత తన వైఖరి మార్చుకుని గోప్యత కొంతమేరకు హక్కుగా పరిగణించవచ్చని కోర్టు ముందు అంగీకరించిందని చెప్పారు. ఇక గోప్యత ప్రాథమిక హక్కేనని సుప్రీం కోర్టు తేల్చిచెప్పడాన్ని పలువురు స్వాగతించారు. -
నూతన అటార్నీ జనరల్‌గా కేకే వేణుగోపాల్!
- దాదాపుగా ఖరారైన పేరు.. త్వరలో నోటిఫికేషన్ న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయాధికారి(అటార్నీ జనరల్)గా సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ పేరును కేంద్ర ప్రభుత్వం ఖరారుచేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు అతిత్వరలోనే వెలువడనున్నట్లు సమాచారం. పదవీ కాలాన్ని పొడిగించినా ఏజీగా కొనసాగేందుకు ముకుల్ రోహత్గీ నిరాకరించడంతో ఆయన వారసుడి ఎంపిక అనివార్యమైంది. ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనకు వెళ్లడానికి ముందే వేణుగోపాల్‌ను పిలిపించుకుని మాట్లాడారని జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. 86ఏళ్ల వేణుగోపాల్ స్వస్థలం కేరళ. దేశంలో హై-ప్రొఫైల్ కేసులు వాదించే లాయర్లలో అగ్రగణ్యుడిగా పేరుపొందిన ఆయన బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో బీజేపీ నాయకుల తరుఫున, 2జీ స్పెక్ట్రం కేసులో ప్రాసిక్యూషన్ తరఫున ఆయన బలమైన వాదనలు వినిపించారు. కాగా, ఏజీగా పేరు ఖరారైందన్న వార్తలపై వేణుగోపాల్ ఆచితూచి స్పందించారు. ‘నియామకపు నోటిఫికేషన్ వెలువడిన తర్వాతే అన్ని విషయాలు మాట్లాడతా’నని తనను కలిసిన మీడియా ప్రతినిధులతో అన్నారు. న్యాయరంగంలో చేసిన కృషికిగానూ 2015లో వేణుగోపాల్‌కు రెండో అత్యున్నత పౌరపురస్కారం ‘పద్మ విభూషణ్’ను అందించారు. ఇక తప్పుకుంటా: ముకుల్ రోహత్గీ -
తుది తీర్పు కూడా మనకే అనుకూలం
-
తుది తీర్పు కూడా మనకే అనుకూలం: రోహత్గీ
కుల్‌భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది. తుది తీర్పు కూడా మనకు అనుకూలంగా ఉంటుందన్న ఆశాభావాన్ని భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వ్యక్తం చేశారు. జాదవ్ తిరిగి స్వదేశానికి రావడాన్ని మనమంతా చూస్తామని ఆయన అన్నారు. ఈ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశం ముందు నుంచి ఈ కేసు విషయంలో తన వాదన గట్టిగా వినిపించిందని, ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ.. ముఖ్యంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖను అభినందిస్తున్నానని ఆయన అన్నారు. అంతర్జాతీయ న్యాయస్థానం నిర్ణయంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అయ్యిందని, ఈ నిర్ణయానికి ఇరు దేశాలూ తప్పనిసరిగా కట్టుబడి ఉండాల్సిందేనని రోహత్గి తెలిపారు. అంతర్జాతీయ కోర్టు నిర్ణయంతో దేశవ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. పలు నగరాల్లో టపాసులు పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తుది తీర్పు వెల్లడించేవరకు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి చర్య తీసుకోకూడదని అంతర్జాతీయ న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాక, ఈ కేసులో అక్కడ జరుగుతున్న విషయాలన్నింటినీ ఎప్పటికప్పుడు తమకు తెలియజేస్తూ ఉండాలని కూడా తెలిపింది. భారత రాయబార కార్యాలయం నుంచి తప్పనిసరిగా అధికారులు జాదవ్‌ను కలిసే అవకాశం కల్పించాలని స్పష్టం చేయడం కూడా భారతదేశానికి దౌత్య పరంగా మంచి విజయమని పలువురు న్యాయనిపుణులు అంటున్నారు. -
‘ముస్లింల పెళ్లి, విడాకులపై కొత్త చట్టం తెస్తాం’
-
‘ముస్లింల పెళ్లి, విడాకులపై కొత్త చట్టం తెస్తాం’
న్యూఢిల్లీ: ముస్లింల ట్రిపుల్ తలాక్‌ను సుప్రీంకోర్టు కొట్టి వేస్తే వారికి కొత్త చట్టాన్ని తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తరుపున సుప్రీంకోర్టుకు హాజరైన అటార్నీ జనరల్ ముఖుల్ రోహత్గీ వివరణ ఇచ్చారు. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్ నేతృత్వంలో ట్రిపుల్ తలాక్ కేసును విచారిస్తున్న విషయం తెలిసిందే. ఒక వేళ ట్రిపుల్ తలాక్ విధానం ఆగిపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటారో వివరించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరిన నేపథ్యం రోహత్గీ ఈ వివరణ ఇచ్చారు. ‘ఒక వేళ సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ విధానం విలువలేనిదని కొట్టి వేస్తే ముస్లింల వివాహం, విడాకుల అంశాన్ని క్రమబద్ధీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొస్తుంది’అని ఆయన చెప్పారు. అంతకుముందు తమకు తక్కువ సమయం ఉన్నందున ప్రస్తుతం ట్రిపుల్ తలాఖ్ అంశాన్ని పరిష్కరించి ఆ తర్వాత బహుభార్యత్వం, నిఖా హలాలావంటి మిగితా విషయాల సంగతి భవిష్యత్తులో చూస్తామని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. సంబంధిత మరిన్ని కథనాలకై చదవండి ‘బహుభార్యత్వంపై తర్వాత.. ముందు తలాక్‌పై..’