ముస్లింల ట్రిపుల్ తలాక్‌ను సుప్రీంకోర్టు కొట్టి వేస్తే వారికి కొత్త చట్టాన్ని తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తరుపున సుప్రీంకోర్టుకు హాజరైన అటార్నీ జనరల్ ముఖుల్ రోహత్గీ వివరణ ఇచ్చారు. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్ నేతృత్వంలో ట్రిపుల్ తలాక్ కేసును విచారిస్తున్న విషయం తెలిసిందే. ఒక వేళ ట్రిపుల్ తలాక్ విధానం ఆగిపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటారో వివరించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరిన నేపథ్యం రోహత్గీ ఈ వివరణ ఇచ్చారు.