భారత రాజ్యాంగ చరిత్రలో తొలిసారిగా, ముస్లింలు పాటించే మూడుసార్ల తలాక్, నిఖా హలాల్, బహుభార్యత్వం విధానాలను కేంద్రం సుప్రీంకోర్టులో వ్యతిరేకించింది. లింగ సమానత్వం, లౌకికత్వాల ప్రాతిపదికన వీటిని పునఃపరిశీలించాలంది. ఇస్లాం దేశాల్లోని మతాచారాలు, వివాహ చట్టాలను న్యాయ శాఖ.. కోర్టుకు సమర్పించిన తన అఫిడవిట్‌లో ప్రస్తావించింది. మన దేశంలోనూ మూడుసార్లు తలాక్, బహుభార్యత్వాల చెల్లుబాటును ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సరిచూడాలంది