triple talaq
-
ఇది హిందుస్తాన్
ప్రయాగ్‌రాజ్: దేశంలో మెజారిటీ ప్రజల ఇష్టానుసారం పాలన కొనసాగాలని చెప్పేందుకు మాత్రం సంకోచించనని అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ డాక్టర్ శేఖర్ యాదవ్ వ్యాఖ్యా నించారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఆదివారం అలహాబాద్ హైకోర్టు లైబ్రెరీ హాల్లో విశ్వహిందూ పరిషత్ హైకోర్టు యూనిట్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అంశంపై ఆయన మాట్లాడారు. ‘‘మెజారిటీ ప్రజల అభీష్టం మేరకే చట్టం నడుచుకోవాలి. కుటుంబంగా చూసినా, సమాజంగా చూసినా మెజారిటీ ప్రజల సంక్షేమం, సంతోషమే ముఖ్యం’’ అన్నారు. ముస్లింలలో ఉన్న బహుభార్యత్వం, త్రిపుల్ తలాఖ్, హలాలా వంటి విధానాలను జడ్జి పరోక్షంగా విమర్శించారు. ‘‘ మా పర్సనల్ లా వీటికి అంగీకరిస్తోందని అది ఏమాత్రం ఆమోదనీయం కాదు. మన శాస్త్రాలు, వేదాల్లో స్త్రీని శక్తిస్వరూపిణిగా భావించారు. నలుగురు భార్యలను కల్గి ఉంటాను, హలాలా, త్రిపుల్ తలాఖ్‌ను పాటిస్తానంటే కుదరదు. సామరస్యం, లింగ సమానత, సామ్యవాదమే యూసీసీ ధ్యేయం. అంతే తప్ప వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్, హిందూయిజాలను అది ప్రోత్సహించదు’’ అన్నారు. -
మోదీని పొగిడిన భార్యకు తలాక్...
బహ్రెయిచ్: అయోధ్యలో అభివృద్ధికి ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్ కారణమంటూ పొగడటమే ఆ మహిళ చేసిన నేరం. ఇందుకు ఆగ్రహిస్తూ భర్త ఆమెకు మూడుసార్లు తలాక్ చెప్పేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు భర్తతోపాటు అతడి ఏడుగురు కుటుంబసభ్యులపైనా కేసులు నమోదు చేశారు. బహ్రెయిచ్ జిల్లా మొహల్లా సరాయ్‌కి చెందిన బాధితురాలికి గతేడాది డిసెంబర్లో అయోధ్యకు చెందిన అర్షద్‌తో వివాహమైంది. మెట్టినింటికి వెళ్లాక అయోధ్యలో రోడ్లు, ఆ నగరం, అక్కడి వాతావరణం ఆమెకు నచ్చాయి.ఇదే విషయాన్ని భర్తకు చెప్పింది. ప్రధాని మోదీ, సీఎం యోగియే ఇందుకు కారణమని తెలిపింది. దీంతో, అర్షద్‌కు కోపం వచ్చి ఆమెను వెంటనే పుట్టింటికి పంపేశాడు. బంధువులు నచ్చజెప్పి, ఆమెను తిరిగి అయోధ్యకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆమెను కొడుతూ, తిడుతూ వేధిస్తున్నాడు. ప్రధాని మోదీ, సీఎం యోగిపై దుర్భాషలాడుతున్నాడు. అత్త, మరదళ్లు, మరుదులు కలిసి ఆమెను చంపేందుకు యత్నిస్తున్నారు. అర్షద్ చివరికామెకు మూడుసార్లు తలాక్ చెప్పాడు. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ఫోన్లో తలాక్ చెప్పాడు... ఫిక్స్ అయిపోయాడు!
రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి పని నిమిత్తం కువైట్‌కు వెళ్లి జీవిస్తున్నాడు. అయితే అతనికి పాకిస్థాన్‌కు చెందిన మహిళ పరిచయం అవ్వగా.. ఆమెను వివాహం చేసుకునేందుకు భారత్‌లోని తన భార్యకు ఫోన్ చేసి ట్రిపుల్ తలాక్ చెప్పాడు. అయితే సోమవారం అతడు జైపూర్ భారత ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కాగానే పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాలు.. రాజస్థాన్‌లోని చురుకు చెందిన 35 ఏళ్ల రెహ్మాన్ కువైట్‌లో పనిచేస్తున్నాడు. అతడికి హనుమాన్‌గఢ్‌లోని భద్ర ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల ఫరీదా బానోతో 2011లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే, రెహ్మాన్‌కు పాకిస్థాన్‌కు చెందిన మెహ్విష్ అనే మహిళతో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమకు దారి తీసింది.ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రెహ్మాన్ కువైట్ నుంచి భారత్‌లో ఉంటున్న తన భార్యకు ఫోన్ ద్వారా త్రిపుల్ తలాక్ చెప్పాడు. అనంతరం సౌదీ అరేబియాలో పాక్ మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె గత నెల టూరిస్ట్ వీసాపై చురుకు వచ్చి రెహ్మాన్ తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో మొదటి భార్య ఫరీదా బానో తన భర్త రెహ్మాన్‌పై కేసు పెట్టింది. తనను అధిక కట్నం కోసం వేధించారని, ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు తీసుకున్నారని ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలో సోమవారం కువైట్ నుంచి జైపూర్ విమానాశ్రయానికి చేరుకున్న రెహ్మాన్‌ను హనుమాన్‌ఘర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. ప్రాథమిక విచారణ అనంతరం అతడిని అరెస్ట్ చేసినట్లు హనుమాన్‌గఢ్ డిప్యూటీ ఎస్పీ రణ్వీర్ సింగ్ తెలిపారు. -
ఇన్‌స్టాగ్రామ్‌లో విడాకులిచ్చిన దుబాయ్ యువరాణి
అబుదాబీ: దుబాయ్ యువరాణి షేఖా మహ్రా బింట్(30) సంచలన ప్రకటన చేశారు. తన భర్తకు సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్ ద్వారా ట్రిపుల్ తలాక్‌తో విడాకులు ఇస్తున్నట్లు పోస్ట్ చేశారు. అంతేకాదు విడాకులకు కారణాలేంటో కూడా ఆమె ఆ సందేశంలో ఉంచారు.షేఖా మహ్రాకు దుబాయ్‌లో ప్రముఖవ్యాపారవేత్త అయిన షేక్ మనా బిన్ మహమ్మద్ బిన్ రషీద్ బిన్ మనా అల్ మక్తూమ్(30)తో కిందటి ఏడాది మేలో వివాహం జరిగింది. రెండు నెలల కిందటే ఈ జంటకు బిడ్డ పుట్టింది. అయితే.. వీళ్లు విడిపోతున్నారనే ప్రచారం ముందు నుంచే కొనసాగుతోంది. రెండు వారాల కిందట కన్నకూతురితో ఓ ఫొటోను ఉంచిన దుబాయ్ యువరాణి.. ఇద్దరం మాత్రమే అంటూ క్యాప్షన్ ఉంచింది. ఆ టైంలో ఆ భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం చాలామంది గమనించారు. అలాగే.. ఫొటోలను సైతం డిలీట్ చేసుకోవడంతో విడిపోతున్నారనే చర్చా మొదలైంది.అయితే.. ఆ ఊహాగానాలను నిజం చేస్తూ విడాకుల ప్రకటన చేశారామె. తాజా ఇన్‌స్టా పోస్టులో.. ‘‘ప్రియమైన భర్త.. మీరు ఇతర సహచరులతో నిమగ్నమై ఉన్నందున నేను మన విడాకుల్ని ప్రకటిస్తున్నా. జాగ్రత్తగా ఉండండి. మీ మాజీ భార్య.. అంటూ మూడుసార్లు విడాకులంటూ(తలాఖ్) రాసుకొచ్చారామె. View this post on Instagram A post shared by Shaikha Mahra Mohammed Rashed Al Maktoum (@hhshmahra) దుబాయ్ పాలకుడు, యూఏఈ దేశ ఉపాధ్యక్షుడు, ప్రధాని అయిన షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తనయ షేఖా మహ్రా. యూఏఈలో మహిళా హక్కుల సాధన కోసం న్యాయవాదిగా ఆమె తన వంతు కృషి చేస్తూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. తాజా విడాకుల ప్రకటన, అదీ భార్యగా సోషల్ మీడియా ద్వారా ట్రిపుల్ తలాఖ్ ప్రకటనతో ఆమె ఇప్పుడు ఆ దేశంలో చర్చనీయాంశంగా మారారు. -
నడుస్తున్న రైలులో భార్యకు ట్రిపుల్ తలాక్!
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహాద్లో ట్రిపుల్ తలాక్ కేసు వెలుగులోకి వచ్చింది. కదులుతున్న రైలులో ఒక యువకుడు తన భార్యకు ట్రిపుల్ తలాక్ ఇచ్చాడు. ఈ క్రమంలో భార్యపై దాడిచేసి, రైలు నుంచి దూకి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను వేడుకున్నారు.బాధితురాలు పుఖ్రాయాన్ పోలీస్ స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఆమె భర్తతో సహా నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదనపు కట్నం డిమాండ్ చేస్తూ తన భర్త విడాకులు ఇచ్చాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.ఈ ఉదంతం గురించి భోగానిపూర్ పోలీసు అధికారి మాట్లాడుతూ బాధితురాలు రాజస్థాన్‌కు చెందిన మహిళ అని, నఫీజుల్ హసన్ కుమారుడు మహమ్మద్ అసద్ ఆమెను వివాహం చేసుకున్నాడని తెలిపారు. ఆ తరువాత నుంచి భర్త మహ్మద్ అసద్ అత్తామామలు తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా భర్త తనకు ట్రిపుల్ తలాక్ చెప్పాడని ఆమె తెలిపారు. -
విద్యార్థుల ఎదుటే టీచర్‌కు తలాక్ చెప్పిన భర్త
బారాబంకీ: తరగతి గదిలో పాఠాలు చెబుతున్న టీచర్‌కు ఆమె భర్త ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దీంతో, సదరు ఉపాధ్యాయినితోపాటు విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీలో ఆగస్ట్ 24న ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె భర్తపై కేసు నమోదు చేశారు. బారాబంకీకి చెందిన బాధితురాలికి ఫిరోజాబాద్ జిల్లాకు చెందిన మహ్మద్ షకీల్‌తో 2020లో వివాహమైంది. కొంతకాలం తర్వాత షకీల్ సౌదీ అరేబియా వెళ్లిపోయాడు. అత్తింటి వారు కట్నం తేవాలంటూ వేధించి ఆమెను బలవంతంగా పుట్టింటికి పంపారు. పుట్టింట్లో ఉంటూ ఆమె ఓ ప్రైవేట్ స్కూలులో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 28న సౌదీ అరేబియా నుంచి సొంతూరుకు చేరుకున్న షకీల్.. జూలై 10న బాధితురాలి వద్దకు వచ్చాడు. తనతో రావాలని కోరాడు. వెంటనే రాలేనని చెప్పడంతో ఆరు రోజుల అనంతరం తిరిగి సొంతూరుకు వెళ్లిపోయాడు. ఆగస్ట్ 24న తరగతి గదిలో ఉండగా వచ్చి విద్యార్థుల ఎదుటే తనకు మూడు సార్లు తలాక్ చెప్పారని బాధితురాలు పోలీసులకిచి్చన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కొత్వాలీ సిటీ పోలీసులు షకీల్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. 2019లో కేంద్రం ట్రిపుల్ తలాక్ ఆచారం చట్ట విరుద్ధం, రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించిన విషయం తెలిసిందే. -
మైనార్టీలకు దగ్గరవడానికి కార్యక్రమాలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ రద్దు నిర్ణయం వల్ల ముస్లిం మహిళలకు ఎనలేని భద్రత లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ముస్లిం మహిళల పురోగతికి తాము చేపడుతున్న చర్యల గురించి అందరిలోనూ అవగాహన పెంచాలని తనను కలిసిన పార్టీ ఎంపీలకు చెప్పారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్‌కు చెందిన బీజేపీ ఎంపీలు ప్రధాని మోదీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఎంపీలతో మాట్లాడుతూ 2024 ఎన్నికలకు అందరూ సన్నద్ధంగా ఉండాలన్నారు. రానున్న రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని మైనార్టీ వర్గాల ప్రయోజనాల కోసం కేంద్రం తీసుకున్న చర్యల్ని విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రధాని చెప్పినట్టుగా కొందరు ఎంపీలు వెల్లడించారు. -
భార్యకు ట్రిపుల్ తలాక్
యశవంతపుర: ట్రిపుల్ తలాక్ చెప్పి భర్త తనను మోసం చేశాడని మంగళూరు పట్టణంలోని మంగళాదేవి సమీపంలోని మార్నమికట్టెకు చెందిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహమ్మద్ హుసేన్ అనే వ్యక్తి మొదటి భార్యను వదిలేసి భర్తకు దూరమైన శబానా అనేమహిళను ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. రెండు నెలల పాటు సంసారం సాగింది. చేసిన అప్పులు తీర్చటానికి ఆమె వద్దనున్న రూ.10 లక్షల విలువైన బంగార అభరణాలను తీసుకొని ఆమెను పుట్టింటిలో వదిలేశాడు. గర్భిణిగా ఉన్న ఆమెను వేధించి బలవంతంగా మాత్రలిచ్చి అబార్షన్ చేయించాడు. ఇటీవల ఆమె ఇంటికి రాగా చితకబాది మూడు సార్లు తలాక్ చెప్పి గెంటేశాడు. దీంతో బాధితురాలు ఆస్పత్రిలో చేరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
Triple Talaq: రాతపూర్వకంగా కూడా తలాక్ చెల్లదు.. తేల్చి చెప్పిన ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి: నోటి మాటగా మూడుసార్లు తలాక్ చెప్పడం ఇస్లాం చట్ట నిబంధనలకు విరుద్ధమైనప్పుడు, తలాక్‌నామా రూపంలో లిఖితపూర్వకంగా రాసుకున్నా కూడా చెల్లదని, వివాహం రద్దుకాదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఏక వాక్యంలో మూడుసార్లు చెప్పే తలాక్‌కు ఎలాంటి గుర్తింపు లేదంది. మూడుసార్లు తలాక్ చెప్పి, దాన్ని రాతపూర్వకంగా పంపడం చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. ఒకవేళ ఇస్లాం చట్ట నిబంధనల ప్రకారం విడాకులు తీసుకోవాలంటే.. భార్య, భర్త ఇద్దరి తరపు మధ్యవర్తులు వారి మధ్య సయోధ్యకు ప్రయత్నించాలంది. అది సాధ్యం కానప్పుడే సహేతుక కారణాలతో తలాక్ చెప్పొచ్చునని, అలా చెప్పే తలాక్‌ల మధ్య తగిన వ్యవధి ఉండి తీరాలని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హారీ ఇటీవల తీర్పు వెలువరించారు. ఇదీ వివాదం... తను, తన భర్త వేర్వేరుగా ఉంటున్న నేపథ్యంలో భర్త నుంచి జీవన భృతి ఇప్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పి.గౌస్‌బీ 2004లో పొన్నూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అభ్యర్థనను ఆమె భర్త జాన్ సైదా వ్యతిరేకించారు. తాను తలాక్ చెప్పి, దాన్ని రిజిస్టర్ పోస్టులో భార్యకు పంపానని, అయితే అది తిరస్కరణ కారణంతో తిరిగి వచ్చిందని, కాబట్టి జీవన భృతి చెల్లించాల్సిన అవసరం లేదని సైదా వాదించారు. పొన్నూరు కోర్టు సైదా వాదనలను తోసిపుచ్చుతూ గౌస్‌బీ, ఆమె కుమారుడికి నెలకు రూ.8 వేలు జీవన భృతి కింద చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ జాన్ సైదా అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై విచారణ జరిపిన గుంటూరు మొదటి అదనపు సెషన్స్ కోర్టు, కుమారుడికి జీవనభృతి చెల్లించాలని, గౌస్‌బీకి అవసరం లేదంటూ తీర్పునిచ్చింది. దీనిని సవాలు చేస్తూ గౌస్‌బీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రవినాథ్ తిల్హారీ విచారణ జరిపి ఇటీవల తీర్పు వెలువరించారు. గౌస్‌బీ, ఆమె కుమారుడికి జీవనభృతి చెల్లించాలంటూ పొన్నూరు కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించారు. భార్యకు మూడుసార్లు తలాక్ చెప్పి, దాన్ని రిజిస్టర్ పోస్టులో పంపి వివాహం రద్దయినట్లు పేర్కొనడాన్ని తప్పుపట్టారు. అలా చేయడం ద్వారా వివాహం రద్దు కాదన్నారు. భార్య, భర్త వేర్వేరుగా ఉంటున్నందున భర్త నుంచి భరణం పొందేందుకు ఆ మహిళ అర్హురాలేనని స్పష్టంచేశారు. -
పాతబస్తీలో వెలుగులోకొచ్చిన దారుణం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. దుబాయ్‌లో మహిళకు పని కల్పిస్తామని చెప్పి మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలగులోకి వచ్చింది. ఒక్కో మహిళను రూ.2 లక్షలకు దుబాయ్‌కి చెందిన షేక్‌లకు బస్తీలోని బ్రోకర్లు అమ్ముతున్నారు. విజిటింగ్ వీసాలపై మహిళలను అక్కడక పంపిస్తూ విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం ఐదుగురిని బ్రోకర్లు విక్రయించినట్లు తెలుస్తోంది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు తమవారి కోసం విదేశీ వ్యవహారాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ట్రిపుల్ తలాక్ పాతబస్తీలో ట్రిపుల్ తలాక్ కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. అమెరికా నుంచి ఫోన్లో తన భార్యకు అదివలీ అనే వ్యక్తి తలాక్ చెప్పాడని బాధితురాలు సభా ఫాతిమా తెలిపారు. పాతబస్తీకి చెందిన సభా ఫాతిమాను వలి వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఫాతిమా భర్త అమెరికాలో ఉంటున్నాడు. తన భర్త వలి అమెరికా నుంచి ఫోన్లో ట్రిపుల్ తలాక్ చేప్పాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలంటూ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆమె గురువారం ఆశ్రయించారు. -
తప్పుపట్టడమే కాంగ్రెస్ నైజం
డెహ్రీ/గయ/భగల్పూర్: దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న ఏ నిర్ణయాన్ని అయినా వ్యతిరేకించాలన్నది కాంగ్రెస్ పార్టీ విధానమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శుక్రవారం మూడు ప్రచార సభల్లో ప్రధాని పాల్గొన్నారు. రోహ్తస్, గయ, భగల్పూర్ సభల్లో పాల్గొని తన ప్రచారాన్ని మోదీ ప్రారంభించారు. ఈ సభల్లో ప్రధానితో పాటు బీజేపీ మిత్రపక్షం జేడీయూ నేత, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ వేదికను పంచుకున్నారు. దాదాపు 15 ఏళ్ల పాటు ఆర్జేడీ ప్రభుత్వం రాష్ట్రంలో నేరమయ, దోపిడీ పాలన సాగించిందని ప్రధాని ఆరోపించారు. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాఖ్‌పై నిషేధం, అయోధ్యలో రామాలయ నిర్మాణం, సరిహద్దుల్లో మిలటరీ ఆపరేషన్లు.. ఇలా తమ ప్రభుత్వం తీసుకున్న అన్ని జాతి ప్రయోజన నిర్ణయాలను కాంగ్రెస్ సహా విపక్షాలు వ్యతిరేకించాయని మోదీ పేర్కొన్నారు. ‘ఆర్టికల్ 370 రద్దు కోసం దేశమంతా ఎదురు చూడలేదా? ఇప్పుడు అధికారంలోకి వస్తే మళ్లీ ఆ అధికరణను అమల్లోకి తీసుకు వస్తామని కాంగ్రెస్ చెబుతోంది. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లోకి తన పిల్లలను పంపించిన బిహార్ ప్రజలను ఇది అవమానించడం కాదా? అయినా, ఓట్లు వేయండంటూ మీ దగ్గరకే రావడానికి వారికి ఎంత ధైర్యం?’ అని ప్రధాని మండిపడ్డారు. గల్వాన్ లోయలో చైనా దళాలతో జరిగిన ఘర్షణలను ప్రస్తావిస్తూ.. ‘దేశం కోసం బిహార్ బిడ్డలు ప్రాణాలర్పించారే కానీ.. దేశమాతను తలదించుకునేలా చేయలేదు’ అన్నారు. విపక్షాలు దళారుల తరఫున మాట్లాడుతూ వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయని, రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు సమయంలోనూ అవి దళారులు, మధ్యవర్తుల తరఫుననే మాట్లాడాయని విమర్శించారు. మొదట పాల్గొన్న డెహ్రీ సభలో ఇటీవల మరణించిన ఎల్జేపీ నేత, కేబినెట్ సహచరుడు రామ్‌విలాస్ పాశ్వాన్, మాజీ కేంద్రమంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్‌లకు నివాళులర్పిస్తూ ప్రధాని ప్రసంగాన్ని ప్రారంభించారు. లాలు నేతృత్వంలో ఆ చీకటి పాలనను బిహార్ ప్రజలు మర్చిపోలేరన్నారు. సైనికులను ప్రధాని అవమానించారు తూర్పు లద్దాఖ్‌లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించలేదని చెప్పి ప్రధాని మోదీ సైనికులను అవమానించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత భూభాగంలోకి చైనా సైనికులు వచ్చారన్నది వాస్తమన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హిసువాలో జరిగిన ప్రచార సభలో శుక్రవారం రాహుల్ పాల్గొన్నారు. చైనా సైనికులను ఎప్పుడు వారి భూభాగంలోకి తరిమేస్తారో ప్రధాని చెప్పాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ సమయంలో బిహార్‌కు చెందిన వలస కార్మికులను ఇతర రాష్ట్రాల్లో తరిమేశారని, అయినా ప్రధాని ఏమీ మాట్లాడలేదని రాహుల్ గాంధీ విమర్శించారు. -
నా సహ భారతీయుడా: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ : భారత ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ ప్రభుత్వం శనివారంతో ఏడాది పాలన పూర్తి చేసుకుంది. గడిచిన తొలి ఏడాది పాలనలో మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ ఎన్నో కీలక సంస్కరణలు తీసుకు వచ్చింది. ఏళ్ల తరబడి మూలుగుతున్న సమస్యలను తుడిచిపెట్టి దేశ వ్యాప్తంగా తనదైన ముద్ర వేశారు. 2019 లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించి కేంద్రంలో మరోసారి పాగ వేసింది. దేశంలోని ప్రతి పౌరుడి కలను సాకారం చేస్తూ భారత్ స్థాయిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తూ.. ప్రపంచ నాయకుడిగా మోదీ కీర్తి గడించారు. ఈ ఏడాది కాలంలో ఎన్నో సమస్యాత్మక అంశాలను సులువు చేసి అనేక విజయాలను మోదీ తన ఖాతాలో వేసుకున్నారు. వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లు, పౌరసత్వ చట్ట సవరణ, ఆర్టికల్ 370 రద్దు, అయోద్య వివాదం వంటి వాటికి శాశ్వత పరిష్కారం చూపించారు. (ఎన్నో ముడులు విప్పిన మోదీ) కేంద్రంలో రెండోసారి పాలక పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ పౌరులకు బహిరంగ లేఖ రాశారు. లేఖలో ఏడాది కాలంగా తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రస్తావించారు. ‘‘నా దేశ పౌరులారా.. గతేడాది ఇదే రోజు భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ప్రారంభమైంది. అనేక దశాబ్దాల తరువాత దేశ ప్రజలు పూర్తి మెజారిటీతో పూర్తికాలం అధికారం కట్టబెట్టారు. మరోసారి 130 కోట్ల భారతీయులకు, దేశ ప్రజాస్వామ్య సంస్కృతికి తలవంచి నమస్కరిస్తున్నా. మీ ప్రేమ, సహృదయత, చురుకైన సహకారం కొత్త శక్తిని, స్ఫూర్తిని ఇచ్చాయి. సాధారణ సమయంలో అయితే మీ మధ్యనే ఉండేవాణ్ణి. అయితే, ఇప్పుడున్న పరిస్థితులు నన్ను అనుమతించటం లేదు. అందుకే ఈ లేఖ ద్వారా మీ ఆశీస్సులు కోరుకుంటున్నా.అంటూ మోదీ పేర్కొన్నారు. (ప్రధానితో అమిత్ షా భేటీ) 2014 లో దేశ ప్రజలు మార్పు కోరుకుంటూ ఓటు వేశారు. అంతకు ముందు అయిదేళ్ళలో పరిపాలనా యంత్రాంగం ఎలా విఫలమైందో దేశం చూసింది. ఆ తరువాత అవినీతికి దూరంగా జరిగి, పరిపాలనను గాడిలో పెట్టటం చూశారు. ’అంత్యోదయ’ స్ఫూర్తి కి పూర్తిగా కట్టుబడి లక్షలాది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకు రాగలిగాం. 2014 నుంచి 2019 వరకు భారత ప్రతిష్ఠ గణనీయంగా పెరిగింది. పేదల గౌరవం పెరిగింది. దేశం ఆర్థికంగా అందరినీ కలుపుకోవటం జరిగింది. ఉచిత గ్యాస్, విద్యుత్ కనెక్షన్లు, సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించటంతోబాటు ”అందరికీ ఇళ్ళు" సార్థకమయ్యేలా పురోగతి సాధించాం.సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడుల ద్వారా భారత్ తన శక్తిని చాటుకుంది. అదే సమయంలో శతాబ్దాలుగా సాగుతున్న వన్ రాంక్-వన్ పెన్షన్, వన్ నేషన్ - వన్ టాక్స్ , మెరుగైన గరిష్ఠ మద్దతు ధర లాంటివి సాకారం చేసుకున్నాం. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ 2019 లో భారత ప్రజలు కేవలం కొనసాగింపు కోసమే ఓటు వేయలేదు. భారత్‌ను సమున్నతంగా చూడాలన్న కల సాకారం కావటానికి ఓటు వేశారు. భారత్‌ను ప్రపంచ నాయకత్వ స్థానంలో చూడాలన్నదే ఆ కల. గత ఏడాది కాలంలో తీసుకున్న నిర్ణయాలు ఆ కలను సాకారం చేయటానికి తీసుకున్నవే. ఈనాడు దేశ అభివృద్ధి పథంలో 130 కోట్ల మంది ప్రజలు మమేకమయ్యారు, సమీకృతమయ్యారు. జన శక్తి, రాష్ట్ర శక్తి అనే దీపకాంతులు యావద్దేశాన్నీ వెలిగించాయి. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే మంత్రం ఇచ్చిన ఉత్తేజంతో భారత్ అన్ని రంగాలలో ముందడుగు వేస్తోంది. (ఒక్క ఏడాది.. పెక్కు విజయాలు) నా భారతీయ పౌరులరా, గడిచిన ఏడాది కాలంలో కొన్ని నిర్ణయాలను విస్తృతంగా చర్చించటంతోపాటు బహిరంగ సభలలో కూడా ప్రస్తావించారు. ఆర్టికల్ 370 దేశ సమైక్యతనుమ, సమగ్రతా స్ఫూర్తిని మరింతగా పెంచింది. గౌరవ సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా ఇచ్చిన రామమందిరం తీర్పు శతాబ్దాలకాలంగా సాగుతున్న చర్చకు సుహృద్భావపు ముగింపునిచ్చింది. క్రూరమైన ట్రిపుల్ తలాక్ విధానాన్ని చరిత్ర అనే చెత్తబుట్టకు పరిమితం చేశాం. పౌరసత్వ చట్టానికి చేసిన సవరణ భారతదేశపు కరుణ, కలుపుకుపోయే తత్వాన్ని చాటిచెప్పింది. కానీ దేశాన్ని అభివృద్ధిపథంలో పరుగులు పెట్టించిన నిర్ణయాలు ఇంకా అనేకం ఉన్నాయి. జల్ జీవన్ మిషన్ త్రివిధ దళాల అధిపతి పదవిని సృష్టించటమన్నది ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ఒక సంస్కరణ. దీనివలన సాయుధ దళాల మధ్య సమన్వయం మెరుగుపడింది. అదే సమయంలో భారత్ తన మిషన్ గగన్ యాన్ ఏర్పాట్లను వేగవంతం చేసింది. పేదలను, రైతులను, మహిళలను, యువతను బలోపేతం చేయటం మన ప్రాధాన్యంగా మిగిలింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇప్పుడు రైతులందరికీ వర్తిస్తోంది. కేవలం ఏడాది కాలంలో 72,000 కోట్ల రూపాయలు 9 కోట్ల 50 లక్షలమంది రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. జల్ జీవన్ మిషన్ ద్వారా 15 కోట్లకు పైగా గ్రామీణ గృహాలకు పైపుల ద్వారా త్రాగు నీటి సరఫరా జరిగేట్టు చూశాం. మన 50 కోట్ల పశువుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున ఉచిత టీకాల కార్యక్రమం చేపట్టాం. మన దేశ చరిత్రలో మొట్టమొదటి సారిగా రైతులు, రైతు కూలీలు, చిన్న దుకాణ దారులు, అసంఘటిత రంగంలోని కార్మికులకు 60 ఏళ్ళు పైబడ్డాక రూ. 3000 వంతున నెలసరి పెన్షన్ క్రమం తప్పకుండా అందే ఏర్పాటు చేశాం. బాంకు రుణాలను వాడుకునే సౌకర్యంతో బాటు మత్స్యకారులకోసం ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశాం. మత్స్య రంగాన్ని బలోపేతం చేయటం కోసం అనేక ఇతర నిర్ణయాలు కూడా తీసుకున్నాం. ఇది నీలి ఆర్థిక వ్యవస్థ పుంజుకోవటానికి దోహదపడుతుంది. అదే విధంగా, వర్తకుల సమస్యలు సకాలంలో పరిష్కరించటానికి వీలుగా వ్యాపారి కల్యాణ్ బోర్డ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. స్వయం సహాయక బృందాలలోని 7 కోట్లమంది మహిళలకు ఎక్కువ మొత్తంలో ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకున్నాం. ఇటీవలే స్వయం సహాయక బృందాలకిచ్చే హామీ లేని రుణాలను అంతకు ముందున్న 10 లక్షల నుంచి రెట్టింపు చేసి 20 లక్షలకు పెంచాం. గిరిజన బాలబాలికల చదువులను దృష్టిలో పెట్టుకొని కొత్తగా 400 కు పైగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మించటం ప్రారంభించాం. (మోదీ 2.0) గడిచిన ఏడాది కాలంలో అనేక ప్రజానుకూల చట్టాలు రూపొందించాం. ఉత్పాదకత పరంగా మన పార్లమెంట్ దశాబ్దాలనాటి రికార్డును బద్దలు కొట్టింది. దాని ఫలితంగా వినియోగదారుల రక్షణ చట్టం కావచ్చు, చిట్ ఫండ్ చట్టాల సవరణ కావచ్చు, మహిళలకు, దివ్యాంగులకు మరింత రక్షణనిచ్చే చట్టాలు కావచ్చు. వాటిని పార్లమెంట్ ఆమోదించటం వేగవంతమైంది. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల కారణంగా గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య అంతరం తగ్గిపోతోంది. మొట్టమొదటి సారిగా గ్రామీణ భారతంలో ఇంటర్నెట్ వాడకం దారుల సంఖ్య పట్టణప్రాంతం వారికంటే 10% ఎక్కువగా నమోదైంది. దేశ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న అలాంటి చరిత్రాత్మక చర్యలు, నిర్ణయాల జాబితా ఈ లేఖలో ప్రస్తావించటం సాధ్యం కానంత పొడవైనది. కానీ ఈ ఏడాదిలో ప్రతి రోజూ నా ప్రభుత్వం ఈ నిర్ణయాల అమలుకోసం రేయింబవళ్ళూ చురుగ్గా పనిచేస్తూ వచ్చింది. అత్యాధునిక ఆరోగ్య వ్యవస్థ నా సహ భారతీయులారా, మన దేశ ప్రజల ఆశలు, ఆశయాల సాకారానికి మనం వేగంగా అడుగులు వేస్తున్న సమయంలో ప్రపంచమంతటా వ్యాపించిన కరోనావైరస్ మనదేశాన్నీ చుట్టుముట్టింది. ఒకవైపు గొప్ప ఆర్థిక వనరులున్న శక్తులు, అత్యాధునిక ఆరోగ్య వ్యవస్థలున్న దేశాలు ఉండగా, మరోవైపు భారీ జనాభా, పరిమిత వనరులతో సమస్యల సుడిగుండంలో ఉన్న మన దేశం ఉంది. కరోనా భారత్ ను తాకినప్పుడు భారతదేశం ప్రపంచానికి ఒక సమస్యగా మారుతుందని చాలామంది కలవరపడ్దారు. కానీ మనవైపు ప్రపంచం చూస్తున్న తీరును మీరు మీ ఆత్మ విశ్వాసంతో చాకచక్యంతో ఈరోజు మార్చగలిగారు. భారతీయుల సమష్ఠి బలానికీ, సామర్థ్యానికీ శక్తిమంతమైన, సుసంపన్నమైన దేశాలు సైతం సరితూగలేవని మీరు నిరూపించారు. కరోనా యోధుల గౌరవార్థం చప్పట్లు కొట్టినా, దీపాలు వెలిగించినా, భారత సాయుధ దళాలను గౌరవించినా, జనతా కర్ఫ్యూ అయినా, దేశవ్యాప్త లాక్ డౌన్ నిబంధనలకు కట్టుబడటం అయినా ప్రతి సందర్భంలోనూ మీరు శ్రేష్ఠ్ భారత్ కు ఏక్ భారత్‌ను హామీగా ఇచ్చారు. ఇంతటి భారీ విపత్కర సంక్షోభంలో కచ్చితంగా ఎవరూ, ఎలాంటి అసౌకర్యానికీ గురికాలేదనీ, బాధపడలేదనీ చెప్పటం లేదు. మన శ్రామికులు, వలస కార్మికులు, చేతి వృత్తులవారు, చిన్న తరహా పరిశ్రమలలోని హస్త కళాకారులు, బండ్ల వ్యాపారులు ఇంకా అలాంటి సోదరులెందరో అనేకానేక కష్టాలనెదుర్కున్నారు. వాళ్ళ సమస్యల తీవ్రత తగ్గించటానికి మనం కలసికట్టుగా పట్టుదలతో ముందుకు సాగుతున్నాం. అయితే, మనం ఎదుర్కొంటున్న అసౌకర్యాలు మనకు ప్రమాదకర దుర్ఘటనలుగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అందువలన నిబంధనలు, మార్గదర్శకాలు పాటించటం ప్రతి భారతీయుడికీ ముఖ్యమైన బాధ్యత. ఇప్పటిదాకా మనం ఎంతో ఓపికపట్టాం. దాన్ని అలాగే కొనసాగించాలి. భారతదేశం మిగిలిన అనేకదేశాలకంటే భద్రంగా, మెరుగైన స్థితిలో ఉండటానికి ముఖ్యమైన కారణాల్లో ఇదొకటి. ఇదొక సుదీర్ఘ పోరాటం. కానీ మనం ఇప్పటికే విజయపథంలో సాగుతున్నాం. విజయం మనందరి ఉమ్మడి దీక్షాఫలం. కొద్ది రోజుల కిందట ఒక మహా తుపాను పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను అతలాకుతలం చేసింది. అప్పుడు కూడా ఈ రాష్ట్రాల ప్రజలు ప్రదర్శించిన తెలివి, నిబ్బరం చాలా గొప్పవి. వాళ్ళ ధైర్యం భారత ప్రజలందరికీ స్ఫూర్తిదాయకం. కరోనా వైరస్ మీద సమష్ఠిగా పోరాటం ప్రియ మిత్రులారా, ఇలాంటి సమయంలో భారత్ సహా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎలా కోలుకుంటాయోనన్న విషయం మీద విస్తృతమైన చర్చ మొదలైంది. అయితే, ఈ విషయంలో భారత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. కరోనా వైరస్ మీద సమష్ఠిగా పోరాడుతునే ఆర్థిక వ్యవస్థ కోలుకునేట్టు చేసుకోవటంలో మనం ఒక ఉదాహరణగా నిలువగలిగాం. ఆర్థిక పరంగా 130 కోట్లమంది భారతీయులు ప్రపంచాన్ని ఆశ్చర్యపరచటంతోబాటు దానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. మనం స్వయం సమృద్ధం కావాల్సిన సమయమిది. మన శక్తిసామర్థ్యాలతో మనదైన పంథాలో ముందుకు సాగాలి. ఆ పంథా ఒక్కటే... ఆత్మనిర్భర్ భారత్ లేదా స్వయం సమృద్ధ భారత్. ఇటీవల ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల పాకేజ్ ఈ దిశలో వేసిన కీలకమైన అడుగు. ఈ చొరవ ఫలితంగా ప్రతి భారతీయునికీ అవకాశాల పరంపర మొదలవుతుంది. అది రైతులు కావచ్చు, శ్రామికులు కావచ్చు, చిన్న తరహా ఔత్సాహిక వ్యాపారులు కావచ్చు, స్టార్టప్ లతో సాగుతున్న యువత కావచ్చు. చెమటతో తడిసిన భారతదేశపు మట్టివాసన, కఠోరశ్రమ, మన శ్రామికుల ప్రతిభ ఫలితంగా భారతదేశం కచ్చితంగా దిగుమతుల మీద ఆధారపడటం తగ్గుతుంది. ఆ విధంగా స్వయం సమృద్ధి దిశగా సాగుతుంది. ప్రియ మిత్రులారా, గత ఆరేళ్ళ ఈ ప్రయాణంలో మీరు నిరంతరాయంగా నా మీద ప్రేమ కురిపించారు, ఆశీర్వదించారు. మీ ఆశీర్వాద బలమే దేశం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకునేలా చేసింది. గత ఏడాది కాలంలో వేగంగా పురోగతి సాధించేట్టు చేసింది. అయితే, చేయాల్సింది ఇంకా చాలా ఉందని నాకు తెలుసు. మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళూ, సమస్యలూ చాలా ఉన్నాయి. నేను రేయింబవళ్ళూ పనిచేస్తున్నా. నాలో లోపాలు ఉండవచ్చు. కానీ మనదేశానికి మాత్రం ఏ లోటూ లేదు.అందుకే నా మీద నాకున్న నమ్మకం కంటే మీ మీద, మీ బలం మీద, మీ సామర్థ్యాలమీద నాకు నమ్మకమెక్కువ. నా పట్టుదలకు మూలకారణమైన బలం మీరూ, మీ మద్దతు, మీ ఆశీర్వాదాలు, ప్రేమ మాత్రమే ప్రపంచమంతటా వ్యాపించిన ఈ కరోనా మహమ్మారితో వచ్చింది కచ్చితంగా ఒక సంక్షోభ సమయమే. కానీ మన భారతీయులకు మాత్రం మరింత పట్టుదలతో వ్యవహరించాల్సిన సమయం కూడా. 130 కోట్ల ప్రజల వర్తమానాన్నీ, భవిష్యత్తునూ ఎలాంటి కష్టాలూ శాసించలేవని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మన వర్తమానాన్ని, మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకుందాం. పురోగతి పథంలో ముందుగు సాగితే విజయం మన వశమవుతుంది. కృతమ్ మే దక్షిణే హస్తే, జయో మే సవ్య ఆహితః అంటారు. అంటే, ఒకచేత కార్యాచరణ, విధి నిర్వహణ ఉంటే, రెండో చేతికి విజయం ఖాయం అని. మన దేశ విజయం కోసం ప్రార్థిస్తూ, మీకు మరోమారు ప్రణమిల్లుతున్నా. మీకు, మీ కుటుంబానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.ఆరోగ్యంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. అప్రమత్తంగా ఉండండి, తెలిసి నడుచుకొండి. మీ ప్రధాన సేవకుడు- నరేంద్ర మోదీ’’ గత ఏడాది కాలంగా చేపట్టిన వివిధ సంస్కరణల గురించి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సుదీర్ఘ లేఖ రాశారు. -
మోదీ 2.0
సబ్కా సాథ్ , సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అన్న స్ఫూర్తితో తొలుత అడుగులు బలంగానే పడ్డాయి. ఆత్మ విశ్వాసంతో తీసుకున్న నిర్ణయాలతో అనుకున్నవి సాధించారు ఆరు నెలల్లోనే పట్టు సడలింది. అడుగులు తడబడ్డాయి. సీఏఏ వ్యతిరేక నిరసనలు కేంద్రానికి గట్టిగానే తాకాయి. దాని నుంచి బయటపడకుండానే కరోనా కసిగా కాటేసింది. కొన్ని విజయాలు, మరిన్ని వైఫల్యాలతో మోదీ ఏడాది పాలన సాగిందిలా.. ఆరంభం అదిరిపోయింది. కనీవినీ ఎరుగని మెజార్టీ ఇచ్చిన విజయోత్సాహంతో మొదటి ఆరు నెలలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూకుడుకి ఎవరూ కళ్లెం వేయలేకపోయారు. 2019, మే 30న రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన కుడిభుజమైన అమిత్‌షాకి హోంమంత్రి పదవి కట్టబెట్టి పక్కా ప్రణాళికతో అనుకున్న లక్ష్యాలను చేరుకునే దిశగా మోదీ అడుగులు వేశారు. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం కల తీరేలా ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్‌తో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నెరవేరే అవకాశం రావడం, 2024 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ లక్ష్యాన్ని సాధించడానికి చేపట్టిన సంస్కరణలు, రైతు ఆదాయం, మహిళా సాధికారత చర్యలు, కార్మిక సంస్కరణలు, ముస్లిం మహిళలకి భారీ ఊరటనిచ్చే ట్రిపుల్ తలాక్ చట్టం వంటివి మోదీ క్రేజ్‌ను అమాంతం పెంచేశాయి. రాజ్యసభలో మెజార్టీ లేకపోయినా వివాదాస్పద బిల్లులు గట్టెక్కేలా చేసిన వ్యూహరచన మోదీకి రాజకీయంగా ఎదురులేకుండా చేసింది. ఇక గత సెప్టెంబర్‌లో అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన హౌదీ మోదీ కార్యక్రమం ఆయన ఇమేజ్ను పెంచింది. 50 వేల మంది ఎన్నారైలు పాల్గొన్న ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవ అతిథిగా హాజరవడమే కాకుండా మోదీ ఆహ్వానం మేరకు ఫిబ్రవరిలో ట్రంప్ భారత్ పర్యటనకు రావడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడ్డాయి. రెండో సగంలో తడబడిన అడుగులు పౌరసత్వ చట్టానికి చేసిన సవరణలు (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాజుకున్న ఉద్యమం మోదీ మొదటి వైఫల్యంగా చెప్పుకోవాలి. ముస్లింల పౌరసత్వాన్ని రద్దు చేయడానికి ఎన్నార్సీని తీసుకురావడానికి ముందు జరిగే ప్రక్రియగా సీఏఏని తీసుకువచ్చారన్న ఆరోపణలతో దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. ఆ చట్ట ఉద్దేశాన్ని ప్రజల్లోకి సరిగ్గా తీసుకువెళ్లడంలోనూ, ముస్లింలలో భద్రతను నెలకొల్పడంలోనూ మోదీ సర్కార్ విఫలమైంది. రోజు రోజుకి దిగజారిపోతున్న ఆర్థిక వ్యవస్థను కాపాడడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకోకపోవడం, పెరిగిపోతున్న నిరుద్యోగం వంటివి ఈ ఏడాది కాలంలో మోదీ వైఫల్యాలే. ఇక రాజకీయంగా రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం, మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో పిల్లి మొగ్గలు వంటివి మోదీ క్రేజ్‌ని తగ్గించాయి. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్న సమయంలో కరోనా విజృంభణ దేశాన్ని ఆర్థికంగా మరింత అతలాకుతలం చేసింది. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో మోదీ విజయం సాధించినప్పటికీ, ఆర్థికంగా దేశాన్ని గాడిలో పెట్టే చర్యల్లో విఫలమయ్యారని విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. ట్రిపుల్ తలాక్ వ్యతిరేక చట్టం ముస్లిం సమాజంలో నోటి మాటతో మూడుసార్లు తలాక్ చెప్పడం ద్వారా విడాకులు ఇచ్చే పద్ధతిని వ్యతిరేకిస్తూ కేంద్రం చట్టం తీసుకువచ్చింది. రాజ్యసభలో మెజార్టీ లేకపోయినా బిల్లు పాస్ అయ్యేలా వ్యూహరచన చేసి తనకు తానే సాటి అనిపించుకున్నారు. ముస్లిం మహిళల్లో తన పట్ల నమ్మకాన్ని పెంచుకున్నారు. సీఏఏ, ఎన్నార్సీ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్లలో మైనార్టీలైన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లకు భారత్ పౌరసత్వం ఇవ్వడానికి వీలు కల్పించే పౌరసత్వ చట్టానికి సవరణలు చేశారు. ఇందులో ముస్లింలను మినహాయించడం వివాదానికి దారి తీసింది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటులో బిల్లును ఆమోదించినప్పటికీ దేశవ్యాప్తంగా అగ్గిరాజుకుంది. ముస్లిం సోదరుల్లో ఒక అభద్రతా భావాన్ని నింపింది. కోవిడ్ వీరుడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ భారత్‌కీ పలు సవాళ్లు విసిరింది. భౌతిక దూరం మినహా దీనిని అడ్డుకునే దారి లేకపోవడంతో 130 కోట్ల జనాభా కలిగిన దేశాన్ని సంపూర్ణంగా లాక్డౌన్ ప్రకటించాలన్న అత్యంత సాహసోపేత నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్నారు. సరైన సమయంలో లాక్డౌన్ ప్రకటించడం వల్ల ఆరోగ్య రంగంపై పెనుభారం పడకుండా కాపాడగలిగారు. పల్లెలకి వైరస్ విస్తరించకుండా నిరోధించడంలో విజయవంతమయ్యారు. మోదీ మాటకి కట్టుబడి దేశం అంతా ఏకతాటిపై నిలుస్తూ తొమ్మిది వారాల లాక్‌డౌన్‌కు ప్రజలంతా సహకరించడం ఆయనకున్న బలాన్ని తెలియజేస్తుంది. వలస కార్మికుల తరలింపులో గందరగోళం నెలకొని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ వైరస్ విస్తరణను సమర్థవంతంగానే అడ్డుకోగలిగారు. ఇప్పుడు ప్రధాన మెట్రో పాలిటిన్ నగరాల్లో తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఆందోళనకర స్థాయిలో కేసులైతే నమోదు కావడం లేదు. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాల్లోనే మోదీ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. మార్నింగ్ కన్సల్ట్ సర్వే ప్రకారం మోదీ తీసుకున్న కరోనా కట్టడి చర్యల్ని దేశంలో 82 శాతం మంది ప్రశంసించారు. ఈ స్థాయిలో ప్రజాదరణ ప్రపంచ దేశాల్లో మరే నాయకుడికి దక్కలేదు. కోవిడ్‌తో నిర్వీర్యమైన ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి రూ.20 లక్షల కోట్లతో ప్యాకేజీ ప్రకటించినప్పటికీ దానికి ఆశించినంత సానుకూలత లభించలేదు. రామ మందిర నిర్మాణానికి ట్రస్ట్ అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టుగా ఫిబ్రవరి 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో చేసిన ప్రకటన రామ భక్తుల్లో ఉత్సాహాన్ని నింపింది. 2019, నవంబర్ 9న యూపీలో అయోధ్య నిర్మాణానికి అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన మూడు నెలల్లోనే ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అయితే కరోనా వైరస్ మందిర నిర్మాణ పనులకు అడ్డంకిగా మారింది. ఆర్టికల్ 370 రద్దు రెండోసారి అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తీర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని ఆగస్టు 5, 2019న రద్దు చేసి రాష్ట్రాన్ని రెండుగా విభజించారు. జమ్మూకశ్మీర్, లదాఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు. ఆ సమయంలో కశ్మీర్లో అల్లర్లు చెలరేగకుండా కట్టుదిట్టమైన ఆంక్షలు విధించి తాను అనుకున్నది విజయవంతంగా అమలు చేశారు. -
భయాలున్నా స్వాగతించారు!
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఇచ్చిన క్లిష్ట తీర్పులపై భయాందోళనలు వ్యక్తమైనా పట్టించుకోకుండా దేశ ప్రజలు మనస్ఫూర్తిగా స్వాగతించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో శనివారం దేశరాజధానిలో మొదలైన అంతర్జాతీయ న్యాయ సదస్సులో ‘న్యాయవ్యవస్థ –మారుతున్న ప్రపంచం’ అంశంపై ప్రధాని ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. క్లిష్టమైన అంశాలపై ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ప్రపంచవ్యాప్త చర్చకు కారణమయ్యాయి. తీర్పు ఎలా ఉంటుందోనన్న భయాందోళనలు ముందుగా వ్యక్తమయ్యాయి. వాటిని పట్టించుకోకుండా దేశంలోని వంద కోట్ల మంది ప్రజలు న్యాయస్థానం తీర్పులను మనస్ఫూర్తిగా స్వాగతించారు’ అని అన్నారు. ఎంతో సున్నితమైన ‘అయోధ్య’, ‘ట్రిపుల్ తలాక్’ కేసు సహా వివిధ అంశాలపై ఇటీవలి కాలంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లింగ సమానత్వం లేకుండా ఏ దేశం, ఏ సమాజం కూడా పరిపూర్ణంగా అభివృద్ధి చెందజాలవన్నారు. తమ ప్రభుత్వం సైన్యంలో మహిళలకు సమాన అవకాశాలను కల్పించేందుకు, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను 26 వారాలకు పెంచేందుకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి మధ్య సమతూకం ఉండేలా దేశ న్యాయవ్యవస్థ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ‘ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేథ, ఇంటర్నెట్ వంటి వాటిని ప్రజలందరికీ మరింత వేగంగా న్యాయం అందించేందుకు ఉపయోగించుకోవాలి. మారుతున్న కాలంలో సమాచార పరిరక్షణ, సైబర్ నేరాలు న్యాయవ్యవస్థకు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. రాజ్యాంగానికి మూడు ప్రధానాంగాలైన న్యాయ, శాసనసభ కార్యనిర్వాహక వ్యవస్థలు తమ పరిధిలో పనిచేస్తూ దేశం ఎదుర్కొన్న ఎన్నో సవాళ్లను విజయవంతంగా అధిగమించాయి. ఇలాంటి సత్సంప్రదాయాన్ని నెలకొల్పుకున్నందుకు మనం గర్వపడాలి’ అని ప్రధాని చెప్పారు. పనికిరాని చట్టాలను రద్దు చేయడంతో పాటు సమాజ వికాసానికి అవసరమైన చట్టాలను రూపొందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని అన్నారు. ఈ కోర్టుల విధానం ద్వారా అన్ని కోర్టులను అనుసంధానించేందుకు, కోర్టు ప్రక్రియను సరళతరం చేసేందుకు నేషనల్ జ్యుడిషియర్ డేటాను నెలకొల్పుతామన్నారు. ఈ ప్రపంచ స్థాయి సదస్సులో 20కి పైగా దేశాల జడ్జీలు హాజరయ్యారు. సదస్సులో సీజేఐ జస్టిస్ బాబ్డే, సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్రం మంత్రి రవిశంకర్æ, అటార్నీజనరల్ వేణుగోపాల్ తదితరులు ప్రసంగించారు. మన న్యాయవ్యవస్థకు 2వేల ఏళ్ల చరిత్ర: సీజేఐ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే మాట్లాడుతూ..‘మొఘల్, డచ్, పోర్చుగీస్, ఇంగ్లిష్ సంస్కృతుల సమ్మేళనమే భారత్ అని పేర్కొన్నారు. దేశంలో సాధారణ న్యాయ వ్యవస్థ 2 వేల ఏళ్లపాటు పరిణామం చెందుతూ వచ్చింది. ఏళ్ల క్రితమే వ్యవస్థీకృతమైన చట్టాలు, న్యాయవ్యవస్థ ఉండేవి. న్యాయాధికారుల సమక్షంలో బహిరంగంగానే విచారణ జరిగేది’అని తెలిపారు. అప్పట్లోని పరిస్థితులను సీజేఐ ప్రస్తావిస్తూ..ఒక వ్యక్తి దోషిత్వం నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేని సందర్భాల్లో ‘కోడి కాలేయం’ పరీక్ష ద్వారా నిర్ధారించేవారు. తీర్పునిచ్చే గ్రామ పెద్ద.. కోడి కాలేయాన్ని బయటకు తీసి, పరీక్షించేవాడు. దానిని బట్టి అప్పటికప్పుడు దోషి ఎవరనేది ధ్రువీకరించే సంప్రదాయం ఈశాన్య రాష్ట్రాల్లోని గ్రామాల్లో ఉండేది. అలాగే, ఎవరైనా వ్యక్తి పదవీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పులి దంతాన్ని పట్టుకునే రివాజు ఉండేది. ఇలాంటివి మన సంప్రదాయాల్లో భిన్నత్వానికి ఉదాహరణలు’ అని తెలిపారు. ‘పెరుగుతున్న సాంకేతికత ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసింది. ఫలితంగా నిర్ణయాల ప్రభావం సంబంధిత న్యాయస్థానం పరిధికి వెలుపలా ఉంటోంది’ అని అన్నారు. చట్టాలు వర్తమాన పరిస్థితులకు అద్దం పట్టాలి జస్టిస్ లావు నాగేశ్వరరావు చట్టాలు వర్తమాన పరిస్థితులకు అద్దం పట్టేలా పరిణామం చెందుతూ ఉండాలని సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ లావు నాగేశ్వరరావు పేర్కొన్నారు. సదస్సులో ఆయన స్వాగతోపన్యాసం చేశారు. ‘చట్టాలు పరిణామం చెందడం అతి ముఖ్యమైన అంశం. దేశ ప్రగతి, సామాజిక పరిస్థితులను ఈ చట్టాలు ప్రతిబింబింపజేస్తాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాలు పరిణామం చెందనిపక్షంలో అది అన్యాయానికి దారితీస్తుంది’ అని ఆయన అన్నారు. ‘సమాజం, చట్టం మధ్య వారధిలా న్యాయమూర్తి పాత్ర ఉండాలి. వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా న్యాయస్థానాలు చట్టాలకు భాష్యాన్ని చెప్పాలి. ఇలాంటి సందర్భాల్లో న్యాయస్థానాలు జాగ్రత్త వహించాలి. ఇలాంటి సందర్భాల్లో రాజ్యాంగ లక్ష్యాలు, ఉద్దేశాలు ఓడిపోకూడదు..’ అని పేర్కొన్నారు. డెబ్బై ఏళ్లుగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు నిష్పాక్షికంగా, స్వతంత్రంగా న్యాయం వైపు నిలబడ్డారని పేర్కొన్నారు. ఆన్లైన్ డేటాకూ రక్షణ ఉండాలి వ్యక్తిగత గోప్యతా హక్కును ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు గుర్తించింది. దీని వల్ల ఫోన్ సంభాషణలేకాదు, ఆన్లైన్ డేటాకు రక్షణ కల్పించాలి. జాతి అభివృద్ధి, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా చట్టాలు మారాలి. ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న వివిధ న్యాయరీతులను అర్థం చేసుకుని, పాటించడం ద్వారా న్యాయ సమస్యలను మరింత సమర్థంగా పరిష్కరించేందుకు వీలు కలుగుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఎంతో కీలకమైన ప్రాథమిక విలువలు, లక్ష్యాలను సాధించేలా జడ్జీలు తీర్పులిచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. గత 70 ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన హక్కులను కాపాడేందుకు, చట్ట పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు జడ్జీలిచ్చిన తీర్పులే న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడాయి. జనాకర్షక నిర్ణయాలతో రాజ్యాంగ హక్కులు ప్రభావితం జస్టిస్ ఎన్.వి.రమణ జనాకర్షక నిర్ణయాలు రాజ్యాంగ హక్కులను ప్రభావితం చేస్తాయని, న్యాయస్థానాలు ఈ సందర్భంలో సముచిత నిర్ణయం తీసుకుంటూ రాజ్యాంగ విలువలు కాపాడాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. ఈ భూమిపై శాంతి ఉండాలంటే మన జాతి, మన తెగ, మన తరగతి, మన దేశం వంటి వాటిపై మన విధేయతను అధిగమించాలని, ప్రపంచ దృక్పథాన్ని కలిగి ఉండాలని మార్టిన్ లూథర్ కింగ్ చెప్పిన సూక్తిని జస్టిస్ రమణ ఉటంకించారు. ‘మహిళలు ప్రపంచ జనాభాలో సగం ఉన్నారు. మొత్తం ప్రపంచ పనిగంటల్లో మూడింట రెండో వంతు వారిదే. ప్రపంచ ఆదాయంలో పదో వంతు పొందుతారు. కానీ ప్రపంచ సంపదలో 0.01 శాతం కంటే తక్కువ సంపదను వారు కలిగి ఉన్నారు. చాలా దేశాలు తమ రాజ్యాంగం ద్వారా గానీ, మరో విధానంలో గానీ లింగ సమానత్వాన్ని, మహిళల గౌరవాన్ని గుర్తించాలి. నిత్యం వివక్షకు గురవుతున్న మహిళల అభ్యున్నతిని.. చట్టంలో ఉన్నతమైన ప్రకటనలు చేయడం వల్ల ఉద్దరించలేమని మనం అందరం గ్రహించాం. లింగ సమానత్వాన్ని కాపాడేందుకు న్యాయ వ్యవస్థకు తగినతం అవకాశాలు ఉన్నాయి. అందువల్ల లింగ సమానత్వం కాపాడడంలో ఎలాంటి రాజీ ఉండరాదని మనం గ్రహించాలి..’ అని పేర్కొన్నారు. ‘పర్యావరణ పరిరక్షణకు మనం తీసుకునే చర్యలు కేవలం ప్రస్తుత తరానికే కాకుండా భవిష్యత్తు తరాలకు సురక్షితమైన పర్యావరణాన్ని అందించే గొప్ప పనిగా మనం గ్రహించాలి’ అని అన్నారు. అంతర్జాతీయ సంస్థల ద్వారా ఇంటర్నెట్ సేవలు అందుతు న్నందున ఈ టెక్నాలజీలో వ్యక్తమవుతున్న జాతీయ, అంతర్జాతీయ ఆందోళనలకు తగిన పరిష్కారం చూపాలని అభిప్రాయపడ్డారు. -
ట్రిపుల్ తలాక్ బాధితులకు ఆర్థిక చేయూత!
లక్నో: ట్రిపుల్ తలాక్ బాధితులు పునరావాసం పొందే వరకు ఆర్థిక సహాయం చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ప్రకటించారు. ట్రిపుల్ తలాక్ బాధితులతో పాటు భర్త నుంచి విడాకులు పొందిన అన్ని మతాలు, వర్గాలకు చెందిన మహిళా బాధితులు వార్షిక సహాయం కింద ఏడాదికి రూ. ఆరు వేలు పొందనున్నారు. ఈ ప్రయోజనాలను బాధితులకు 2020 నుంచి వర్తించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉచిత న్యాయ సహాయం కూడా అందేలా సీఎం యోగీ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. యూపీ రాష్ట్ర మహిళలు ఆర్థిక సహాయాన్ని పొందడానికి వీలుగా.. సరళరీతిలో ప్రక్రియను రూపకల్పన చేశారు. ఆర్థిక ప్రయోజనాలను పొందాలంటే సదరు బాధిత మహిళ ఎఫ్ఐఆర్ కాపీతో పాటు కోర్టు కేసుకు సంబంధించిన కాపీని ప్రూఫ్ కింద సమర్పించాల్సి ఉంటుంది. యూపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు 5,000 మంది ట్రిపుల్ తలాక్ బాధితులతో సహా దాదాపు 10,000 మంది మహిళలు నేరుగా లబ్ధి పొందనున్నారు. -
ట్రిపుల్ తలాక్: ఆ వెంటనే మామ గ్యాంగ్‌రేప్
జైపూర్: రాజస్థాన్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. మామ, భర్త సోదరుడితో కలిసి కోడలిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన శుక్రవారం అల్వార్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. రాజస్ధాన్ ఆల్వార్‌కు చెందిన మహిళ(25)కు తన భర్త ట్రిపుల్ తలాక్ చెప్పిన అనంతరం.. బాధితురాలి మామ(భర్త తండ్రి)లోని మృగాడు బయటికి వచ్చాడు. కొడుకు విడాకులు చెప్పిన మరుక్షణమే తమ్ముడితో కలిసి కొడలిపై లైంగిక దాడికి పాల్పడి పైశాచిక ఆనందాన్ని పొందాడు ఆ ఉన్మాది. మరుసటి రోజు పుట్టింటికి వెళ్లిన బాధితురాలు తండ్రికి జరిగిన ఘటన గురించి చేప్పింది. తండ్రితో కలిసి బాధిత మహిళ సోమవారం భివాండి మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మహిళకు గత శుక్రవారం తన భర్త ట్రిపుల్ తలాక్ చెప్పిన కొద్ది గంటలకే.. అతని అన్న తనపై దాడి చేశాడని, అంతేకాక తన మామయ్యతో పాటు అతని తమ్ముడు లైంగిక దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్యాచారం కింద కేసు నమోదు చేసుకుని అమెను వైద్య పరీక్షలు నిమత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసు అధికారి మాట్లాడుతూ.. బాధిత మహిళ ఫిర్యాదుతో ట్రిపుల్ తలాక్, అత్యాచారం కేసు కింద వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయలేదని, ప్రస్తుతం బాధితురాలిని వైద్యపరీక్షల కోసం హస్సీటల్కు పంపించామని పోలీసులు తెలిపారు. అయితే ముస్లిం వర్గానికి చెందిన భర్త తన భార్యకు నోటి మాటగా గానీ, రాత ద్వారా గానీ, ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా లేదా ఇంకేరకంగానైనా ‘తలాక్’ను చెప్పడం అక్రమం. దీనిని ముస్లిం మహిళ వివాహ భద్రత చట్టం–2019 (యాక్ట్ నంబర్ 20 ఆఫ్ 2019) చాప్టర్–2లో పొందుపరచబడింది. ఎవరైనా ముస్లిం భర్త ‘తలాక్’ పదాన్ని అతని భార్యపై ప్రయోగిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. -
ఈనెల 17లోగా 6 కీలక తీర్పులు!
న్యూఢిల్లీ: ముస్లిం మహిళల స్వేచ్ఛను హరించి వేస్తోన్న ట్రిపుల్ తలాక్ రద్దు మొదలుకొని సామాజిక అసమానతలు వేళ్లూనుకొన్న అనేక అంశాల్లో చారిత్రక, సంచలన తీర్పులిచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ ఈనెల 17న పదవీ విరమణ చేయబోతున్నారు. అయితే ఆయన పదవీ విరమణకు మిగిలి ఉన్న ఈ పది రోజుల్లో సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం అత్యంత కీలకమైన తీర్పులిచ్చే అవకాశముంది. అందులో యావత్ భారత దేశం కొన్ని దశాబ్దాలుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న రామజన్మభూమి–బాబ్రీ మసీదు కేసు కీలకమైనది. దీంతోపాటు రాజకీయపరమైన, రక్షణకు సంబంధించిన, ఆర్థికపరమైన కేసుల్లో ధర్మాసనం తీర్పులను ఆవిష్కరించబోతోంది. రామజన్మభూమి–బాబ్రీ మసీదు దశాబ్దాలుగా దేశంలో ఎన్నో భావోద్వేగాలకు కారణమైన, ఎన్నెన్నో ఉద్రిక్తతలకు దారితీసిన, మరెన్నో వివాదాలకు తెరలేపిన రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదం ప్రధానమైనది. 70 ఏళ్ళుగా ఉన్న ఈ కేసులో జస్టిస్ గొగోయ్ సారథ్యంలోని బెంచ్ ఈ కీలక తీర్పుని వెలువరించనుంది. 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హిందు, ముస్లిం వర్గాలు దాఖలు అప్పీలు చేశాయి. దీనిపై సుప్రీంకోర్టు 40 రోజుల పాటు ఇరుపక్షాల వాదనలు వినింది. శబరిమలలోకి మహిళల ప్రవేశం వయోపరిమితులకు అతీతంగా మహిళలందరినీ శబరిమల ఆలయంలోకి అనుమతించే అంశంలో రివ్యూ పిటిషన్‌పై తుదితీర్పును సైతం చీఫ్ జస్టిస్ గొగోయ్ రిజర్వులో ఉంచారు. కేరళలోని శబరిమలలోకి అన్ని వయస్సుల మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ 2018 నాటి తీర్పును జస్టిస్ గొగోయ్ సారథ్యంలోని ధర్మాసనం కొనసాగిస్తుందా? లేదా అన్నది ఈ వారంలో తేలనుంది. రఫేల్ ఒప్పందం... రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై తీర్పుని సుప్రీంకోర్టు రిజర్వ్‌లో పెట్టింది. 36 యుద్దవిమానాల అవినీతి ఒప్పందానికి సంబంధించి పిటిషనర్లు గత ఏడాది అక్టోబర్‌లో దాఖలు చేసిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో సీబీఐ ఎందుకు విఫలమైందనేది ఈ కేసు విచారణ సందర్భంగా తలెత్తిన ప్రధాన వివాదాంశం. డిసెంబర్ 14, 2018లో ఈ ఒప్పందాన్ని సమర్థిçస్తూ తీర్పునివ్వడానికి ప్రభుత్వం కోర్టుని తప్పుదోవ పట్టించడమే కారణమని రివ్యూ పిటిషన్ ఆరోపించింది. చౌకీదార్ చోర్‌హై వివాదం మే 10న సీజేఐ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ నాయకురాలు మీనాక్షి లేఖీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును రిజర్వులో ఉంచింది. ఈ కేసులో చౌకీదార్ చోర్‌హై అనే పదబంధాన్ని తప్పుగా ఆపాదించినందుకు కోర్టుకి రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఈ కేసులో తుది తీర్పు ఇదే వారంలో వచ్చే అవకాశముంది. ఆర్థిక చట్టం రాజ్యాంగ బద్దత 2017 ఆర్థిక చట్టం యొక్క రాజ్యాంగబద్దమైన ప్రామాణికతను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌పై అంతిమ తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో పెట్టింది. ఈ వివాదంపై సైతం గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం తుది తీర్పుని ఇదే వారంలో ఇచ్చే అవకాశముంది. ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం పరిధిలోకి వస్తుందా లేదా అన్న అంశంపై దాఖలైన పిటిషన్‌పై ఏప్రిల్ 4న వాదనల అనంతరం సుప్రీంకోర్టు తీర్పు రిజర్వులో పెట్టింది. సమాచార హక్కు చట్టం 2005, సెక్షన్ 2(హెచ్) ప్రకారం చీఫ్ జస్టిస్ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందంటూ 2010, జనవరిలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. -
తొలి ‘తలాక్’ కేసు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ముస్లిం మహిళలకు వివాహ భద్రతను కల్పించే చట్టం అమల్లోకి వచ్చిన తరువాత తెలంగాణలో తొలి కేసు కరీంనగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో నమోదైంది. ఈ ఏడా ది జూలై 31న చట్టం అమలులోకి రాగా.. సరిగ్గా 15 రోజులకు తన భర్త అదనపు కట్నం తేలేదనే సాకుతో ట్రిపుల్ తలాక్ చెప్పినట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు ఆగస్టు 14న ఇన్స్పెక్టర్ పి.దామోదర్‌రెడ్డి కేసు నమోదు చేశారు. పెళ్లయిన మూడేళ్లకే... కరీంనగర్ జిల్లా ఆదర్శనగర్‌కు చెందిన ముస్లిం మహిళకు 2016లో జగిత్యాలకు చెందిన మీర్ ఖాజా అఫ్సరుద్దీన్తో వివాహమైంది. దుబాయిలో డ్రైవర్‌గా పనిచేస్తున్న అఫ్సరుద్దీన్కు వివాహం జరిపించారు. మూడు నెలల తర్వాత భార్యను దుబాయికి తీసుకెళ్లాడు. అక్కడ భర్తకు చేదోడుగా ఈ మహిళ కూడా ఉద్యోగం చేసింది. వీరికి 8 నెలల వయసున్న బాబు ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో భార్యతో కలసి అఫ్సరుద్దీన్ జగిత్యాల వచ్చాడు. ఈ క్రమంలో అదనపు కట్నం కోసం అఫ్సరుద్దీన్, అతని కుటుంబసభ్యులు వేధించడం ప్రారంభించారు. రూ.10 లక్షలు కట్నంగా తేవాలని, లేదంటే ‘తలాక్’చెబుతామని బెదిరించారు. కట్నం తేవడానికి మహిళ ఒప్పుకోకపోవడంతో ‘ముమ్మారు తలాక్’ చెప్పి విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించారు. ధైర్యంగా ముందుకొచ్చిన ముస్లిం మహిళ మూడేళ్లు కాపురం చేసి అదనపు కట్నం తేలేదనే కారణంగా ట్రిపుల్ తలాక్ చెప్పి బయటకు పంపడంతో సదరు మహిళ ఆగస్టు 14న కరీంనగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో అఫ్సరుద్దీన్, ఇతర కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు ఐపీసీ 498(ఎ), సెక్షన్–4 ఆఫ్ డీపీ యాక్ట్, సెక్షన్ 4 ఆఫ్ ముస్లిం మహిళ వివాహ భద్ర త హక్కు చట్టం కింద కేసులు నమోదు చేశారు. అఫ్సరుద్దీన్ను ఆగస్టు 27న రిమాండ్ చేసి, కుటుంబసభ్యులకు అరెస్టు నోటీస్ జారీ చేశారు. కాగా కరీంనగర్లో నమోదైన ఈ తలాక్ కేసులో చార్జిషీటు దాఖలు చేసేందుకు కరీంనగర్ పోలీస్ కమిషనర్‌కు ప్రతిపాదన పంపినట్లు ఇన్స్పెక్టర్ ‘సాక్షి’కి తెలిపారు. కమిషనర్ అనుమతి రాగానే చార్జిïÙటు దాఖలు చేస్తామని చెప్పారు. మూడేళ్ల వరకు జైలు, జరిమానా ముస్లిం వర్గానికి చెందిన భర్త తన భార్యకు నోటి మాటగా గానీ, రాత ద్వారా గానీ, ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా లేదా ఇంకేరకంగానైనా ‘తలాక్’ను వాడడం అక్రమం అని ముస్లిం మహిళ వివాహ భద్రత చట్టం–2019 (యాక్ట్ నంబర్ 20 ఆఫ్ 2019) చాప్టర్–2లో పొందుపరచబడింది. ఎవరైనా ముస్లిం భర్త ‘తలాక్’పదాన్ని అతని భార్యపై ప్రయోగిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. తలాక్ చెప్పడంతో చట్టాన్ని ఆశ్రయించా నా వివాహం సమయంలో సంప్రదాయ పద్ధతిలో లాంఛనాలు అందించాం. మా తల్లిదండ్రులు వరకట్నంతోపాటు బంగారం, ఫర్నిచర్ ఇచ్చారు. మరో పది లక్షల రూపాయలు తీసుకురావాలని నా భర్త మీర్‌ఖాజా అఫ్సరుద్దీన్తోపాటు అతని కుటుంబ సభ్యులు వేధించారు. అడిగిన కట్నం తేనందుకు ముమ్మారు తలాక్ చెప్పడంతో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాను. చట్ట ప్రకారం నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. – బాధిత మహిళ తెలంగాణలో తొలి కేసు ముస్లిం మహిళ ఫిర్యాదు మేరకు మూడుసార్లు తలాక్ చెప్పడాన్ని నేరంగా పరిగణించి ‘ముస్లిం మహిళ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్) యాక్టు – 2019’ప్రకారం కేసు నమోదు చేశాం. ట్రిపుల్ తలాక్ యాక్టు అమలులోకి వచి్చన తర్వాత నమోదైన మొదటి కేసు ఇది. ముస్లిం వర్గానికి చెందిన బాధిత మహిళలు తమకు అండగా తీసుకొచ్చిన చట్టాలను వినియోగించుకుంటే న్యాయం చేసేందుకు మా వంతు కృషి చేస్తాం. – పి. దామోదర్ రెడ్డి, మహిళా పోలీస్‌స్టేషన్, కరీంనగర్ -
రెండో భార్యకు తలాక్.. మొదటి భార్యతో పెళ్లి
కర్ణాటక, కృష్ణరాజపురం (బెంగళూరు): ట్రిపుల్ తలాక్‌ను కేంద్రం నిషేధించినప్పటికీ కొందరు స్వార్థం కోసం తలాక్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఇందులో విద్యావంతులూ ఉండడం గమనార్హం. దశాబ్ద కాలం క్రితం తలాక్ చెప్పిన మొదటి భార్యను మళ్లీ పెళ్లాడడానికి ఓ టెక్కీ రెండో భార్యకు తలాక్ చెప్పిన ఘటన బుధవారం బెంగళూరు ఆర్టీ నగరలో వెలుగు చూసింది. ఓ సాఫ్ట్వేర్ సంస్థలో టెక్కీగా పని చేస్తున్న జాకీర్ అనే వ్యక్తి చాలా కాలం క్రితం ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఆమెకు పదేళ్ల కిందట తలాక్ చెప్పి విడాకులిచ్చాడు. తరువాత మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో గత ఏడాది రెండో భార్యకు పుట్టిన బిడ్డ గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందడంతో ఆమెకు కూడా కొన్నిరోజుల కిందట తలాక్ చెప్పేశాడు. మళ్లీ మొదటి భార్యను పునర్వివాహమాడాలని యత్నిస్తున్నాడు. దీంతో రెండో భార్య స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో బుధవారం మహిళా కమిషన్‌ను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
పాఠ్యాంశంగా ట్రిపుల్ తలాక్
లక్నో: కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమలులోకి తెచ్చిన ట్రిపుల్ తలాక్ చట్టం విద్యార్థులకు పాఠ్యాంశంగా మారింది. తొలిసారిగా ఉత్తరప్రదేశ్‌లోని బరైలీలో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫులే రోహిల్ ఖండ్ యూనివర్శిటీలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ఈ సిలబస్‌ను ప్రవేశపెట్టారు. వర్శిటీ లా డిపార్ట్మెంట్ అధిపతి అమిత్ సింగ్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ముస్లిం మహిళల వైవాహిక హక్కుల పరిరక్షణ చట్టానికి (2019) సంబంధించిన సిలబస్‌ను చేర్చినట్టు చెప్పారు. పాత సిలబస్ స్థానంలో దీనిని ప్రవేశపెట్టినట్లు వివరించారు. యూనివర్శిటీ నిర్ణయం వల్ల మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. చట్టంలోని నిబంధనలను తెలుసుకోవడంతో పాటు కేస్ స్టడీస్‌కు కూడా ఈ అంశం ఉపకరిస్తుందని, దీని ద్వారా విద్యార్థులు మంచి లాయర్లుగా మారి, ప్రజలకు మరింత న్యాయం చేకూర్చగలరని ఆశిస్తున్నామని తెలిపారు. తమ విద్యార్థుల్లో ఒకరు ట్రిపుల్ తలాక్‌పై డాక్టరేట్ చేస్తున్నట్టు చెప్పారు. కాగా, కొత్త సిలబస్ పట్ల తామెంతో ఆసక్తిగా ఉన్నట్టు పలువురు విద్యార్థులు తెలిపారు. ట్రిపుల్ తలాక్ బిల్లును ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన విషయం తెలిసిందే. -
అవినీతి, ఉగ్రవాదానికి అడ్డుకట్ట
పారిస్: ముందెన్నడూ లేని రీతిలో దేశంలో అవినీతికి, బంధుప్రీతికి, ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేశామని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ప్రజాధనాన్ని లూటీ చేయటానికి కూడా కళ్లేలు వేశామన్నారు. ఇటీవలి ఎన్నికల్లో ప్రజలు తమకు అఖండ మెజారిటీ ఇస్తూ... ‘నవభారత నిర్మాణం’ అనే గురుత బాధ్యతను తమ భుజాలపై పెట్టారన్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో భారత సంతతికి చెందినవారిని ఉద్దేశించి శుక్రవారం మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయటంతో పాటు దాన్ని శిక్షార్హమైన నేరంగా చేస్తూ కీలకమైన చట్టం తీసుకువచ్చిందని గుర్తు చేశారు. జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేయడాన్ని పరోక్షంగా ఆయన ప్రస్తావిస్తూ.. ‘తాత్కాలిక వ్యవహారాలకు ఇక భారత్‌లో చోటులేదు. ఎందుకంటే మనది గౌతమ బుద్ధుడు, మహాత్మాగాంధీ, రాముడు, కృష్ణుడు అవతరించిన గడ్డ. దాదాపు 125 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశంలో అతి పెద్ద సమస్యగా మారిన కేవలం ఒకే ఒక్క తాత్కాలిక వ్యవహారాన్ని డీల్ చేయటానికి 70 ఏళ్లు పట్టిన విషయం మీరే చూశారు. ఈ పరిస్థితిపై నవ్వాలో ఏడ్వాలో నాకు తెలియడం లేదు. అయితే, శాశ్వత ప్రాతిపదికన చేపట్టే పనుల ద్వారానే లక్ష్య సాధన సాధ్యమవుతుంది’ అని స్పష్టంచేశారు. ‘ఓట్ల రూపంలో ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారానే దేశ పురోగమనం సాధ్యమవుతోంది తప్ప మోదీ కారణంగా కాదు’ అని ఆయన పేర్కొనగానే సభికులంతా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ ‘మోదీ ఉంటేనే సాధ్యం’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.‘‘నవభారత్ నిర్మాణం లో భాగంగానే అవినీతి, బంధుప్రీతి, వారసత్వ రాజకీయాలు, ప్రజాధనం దోపిడీ, ఉగ్రవాదం వం టి వాటిపై గతంలో ఎన్నడూ లేని విధంగా పోరాటం సాగించి అడ్డుకట్ట వేశాం. అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు దూసుకెళ్తున్నాం. కాప్– 21 సమ్మిట్‌లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం వాతా వరణ మార్పుల లక్ష్యాలను 2030 సంవత్సరం వరకు కాకుండా వచ్చే ఏడాదిన్నరలోనే సాధిస్తాం’’ అని ప్రధాని తెలిపారు. ఇన్ఫ్రా అనే పదాన్ని ప్రస్తావిస్తూ... ‘‘దీన్లో ఇన్ అంటే ఇండియా. ఫ్రా అంటే ఫ్రాన్స్. ఇన్ఫ్రా మాదిరిగా ఇరువురి సంబంధాలూ దృఢంగా ఉండాలి’’ అన్నారాయన. ఫుట్‌బాల్ భాషలో మోదీ ప్రసంగం భారత్‌తో ఫ్రాన్స్‌కు ఉన్న స్నేహ సంబంధాన్ని ఫుట్‌బాల్ ఆటతో పోలుస్తూ ప్రధాని మోదీ ఆసక్తికర ప్రసంగం చేశారు. వివిధ పరిస్థితుల్లో భారత్, ఫ్రాన్స్‌లు కలసి నిర్మాణాత్మక పద్ధతిలో పని చేశాయన్నారు. ‘ఫుట్‌బాల్‌ను అమితంగా ఇష్టపడే దేశానికి నేనొచ్చాను. మీకందరికీ గోల్ ఎంత ముఖ్యమైనదో తెలుసు. గత అయిదేళ్లలో మేం కూడా అసాధ్యం అనిపించేలా ఉన్న గోల్స్‌ను అధికారుల ఆత్మవిశ్వాసం సాధించగలిగింది’ అని ప్రధాని పేర్కొన్నారు. అంతకుముందు ప్రధాని ఫ్రాన్సులో 1950, 1960ల్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాద మృతుల స్మారక చిహ్నాన్ని ప్రారంభించారు. ఫ్రాన్స్ పర్యటన అనంతరం మోదీ యూఏఈ రాజధాని అబుదాబీకి బయలుదేరారు. అక్కడి నుంచి బహ్రెయిన్‌కు వెళ్లనున్నారు. -
70 ఏళ్లుగా బీజేపీపై మైనార్టీల్లో వ్యతిరేకత
న్యూఢిల్లీ: బీజేపీ పట్ల మైనార్టీల మనసుల్లో వ్యతిరేకత 70 ఏళ్లుగా నాటుకుపోయిందని, దాన్ని 70 రోజులు లేదా ఏడేళ్లలో తుడిచివేయలేమని మైనార్టీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ పేర్కొన్నారు. బీజేపీ 1980లో ప్రారంభమైనప్పటికీ దాని అనుబంధ సంస్థ జన సంఘ్ 1950 నుంచే కార్యకలాపాలు సాగిస్తోందన్నారు. ఓట్ల కోసం మైనార్టీలను దోపిడీ చేయకపోవడం, వివక్ష లేకుండా అభివృద్ధి చేయడం వల్లే ప్రధాని మోదీ నాయకత్వంలో పూర్తి రక్షణలో ఉన్నట్లు మైనార్టీలు భావిస్తున్నారని శుక్రవారం పీటీఐ ఇంటర్వ్యూలో నఖ్వీ వ్యాఖ్యానించారు. ట్రిపుల్ తలాక్ రద్దు వల్ల మోదీకి మైనార్టీల్లో ప్రజాదరణ పెరిగిందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు, నోట్ల రద్దు, జీఎస్టీ వంటివి కేంద్రం తెచ్చిన సంస్కరణ చర్యలని, అవి ప్రజాదరణ కోసం ఉద్దేశించినవి కావని పేర్కొన్నారు. -
ట్రిపుల్ తలాక్ చెప్పి.. కిరోసిన్ పోసి..
సాక్షి, లక్నో: ట్రిపుల్ తలాక్ కోసం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా, కఠిన శిక్షలు అమలు చేస్తున్నా పరిస్థితుల్లో మార్పు రావటం లేదు. ఇందుకు ఉత్తర ప్రదేశ్‌లోని శ్రావస్తిలో శుక్రవారం జరిగిన పాశవిక ఘటన సాక్ష్యంగా నిలిచింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లో ఓ గ్రామంలో సయిదా నివాసముంటోంది. ఉపాధి నిమిత్తం ఆమె భర్త ముంబైలో ఉంటున్నాడు. కొన్ని రోజుల క్రితం అతను సయిదాకు ఫోన్ చేసి మూడు సార్లు తలాక్ చెప్పాడు. తన భర్త విడాకులు కోరుతున్నాడంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా వారు కేసు నమోదు చేసుకోలేదు. భర్తతో కలిసి ఉండమని చెప్పి పంపించారు. నిస్సహాయ స్థితిలో ఇంటికి వెళ్లిన సయిదాతో ఆమె భర్త వాగ్వాదానికి దిగాడు. వెళ్లిపొమ్మంటూ బెదిరించాడు. పోలీసులను ఆశ్రయించినందుకు ఆగ్రహించిన భర్త ఆమె ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అయిదు సంవత్సరాల కన్నకూతురు ముందే ఈ దారుణానికి ఒడిగట్టడంతో బాలిక భయకంపితురాలైంది. ఆ సమయంలో అక్కడే ఉన్న వారి కుటుంబసభ్యులు అడ్డుకోకపోగా సహకరించడం గమనార్హం. బాలిక పోలీసులకు చెప్పిన విషయాల ప్రకారం.. ఆమెను చంపడానికి కుటుంబం అంతా కలిసి ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఆమె పారిపోకుండా భర్త జుట్టు పట్టుకోగా అతని సోదరీమణులు ఒంటిపై కిరోసిన్ పోశారు. వెంటనే అతని తల్లిదండ్రులు ఆమెకు నిప్పంటించారు. తీవ్ర నరకయాతన అనుభవించిన ఆమె కన్నుమూసింది. పోలీసులు నిందితుడితోపాటు అతని కుటుంబంపై వరకట్న వేధింపులు, హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అయితే గతంలో ఆగస్టు 6న బాధితురాలు పోలీసులను ఆశ్రయించినప్పటికీ కేసు నమోదు చేయకపోవటంపై విచారణ జరుపుతున్నారు. -
కోడలిపై అత్తింటివారి అమానుష చర్య..
లక్నో : ట్రిపుల్ తలాక్ కేసును వెనక్కి తీసుకోవడానికి అంగీకరించని కోడలిపై అత్తింటివారు అమానుష చర్యకు పాల్పడ్డారు. ఆమె ముక్కు కోసి.. దారుణంగా హింసించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాలు...తన భర్త ఫోన్లో ట్రిపుల్ తలాక్ చెప్పడంతో ఆవేదన చెందిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఓపికగా ఎదురు చూసినప్పటికీ తన భర్తలో మార్పు రాలేదని, అతడి మీద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న ఆమె అత్తింటివారు కేసు వాపసు తీసుకోవాల్సిందిగా కోరారు. అయితే బాధితురాలు ఇందుకు అంగీకరించకపోవడంతో తొలుత మాటలతో భయపెట్టారు. అయినప్పటికీ ఆమె లొంగకపోవడంతో ముక్కు కోసి అమానుషంగా ప్రవర్తించారు. కాగా ఈ కేసులో భార్యాభర్తల మధ్య సయోధ్య కుదుర్చడానికి గతంలో కౌన్సెలింగ్ ఇచ్చామని, అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని పోలీసులు తెలిపారు. బాధితురాలి ముక్కుపై తీవ్ర గాయాలు ఉన్నాయని.. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై ట్రిపుల్ తలాక్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇక ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టం -2019 ప్రకారం ప్రకారం తక్షణ ట్రిపుల్ తలాక్‌ను క్రిమినల్ చర్యగా పరిగణిస్తారన్న విషయం విదితమే. నేరం నిరూపణ అయిన పక్షంలో నిందితునికి మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది. ఉభయ సభల్లో నెగ్గిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఆమోదం తెలపడంతో ఇటీవలే చట్టరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఈమేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. -
ముస్లిం మహిళలపై అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, భువనేశ్వర్: ఒడిశా శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ముస్లిం మహిళలనుద్దేశించి అభ్యంతరకరంగా మాట్లాడారు. ముంబై, కోల్‌కతాల్లోని వేశ్యావాటికల్లో ముస్లిం మహిళలదే హవా అని అసెంబ్లీలో బీజేపీ ఉపనాయకుడు బిష్ణు సేథి వ్యాఖ్యానించారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్, బీజేడీ సభ్యుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందిన విషయంపై చర్చిస్తూ సేథి పై విధంగా మాట్లాడారు. దీంతో కాంగ్రెస్, అధికార బిజూ జనతాదళ్ (బీజేడీ) సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. రికార్డులనుంచి సేథి మాటలను తొలగించాలని డిమాండ్‌చేశారు. దీంతో మళ్లీ సేథి జీరో అవర్‌లో స్పందించారు. ‘వార్తాపత్రికలు, మేగజీన్లు చేసిన సర్వేల్లో వెల్లడైన వాస్తవాలనే నేను చెబుతున్నా. సర్వే వివరాలను చెప్పడంలో తప్పేముంది. ప్రత్యేకంగా ఏ వర్గాన్నో నేను తక్కువచేసి మాట్లాడటంలేదు. ముంబై, కోల్‌కతాల్లోని రెడ్‌లైట్ ఏరియాల్లో ముస్లిం మహిళలదే హవా అని ఆయా సర్వేల ఫలితాలు వెల్లడిస్తున్నాయి’ అని అన్నారు. మైనార్టీల ఓట్ల కోసమే కొన్ని రాజకీయ పార్టీలు ట్రిఫుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని ఆయన విమర్శించారు. ముస్లిం మహిళల హక్కులను కాపాడేందుకు మానవతా దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం ట్రిఫుల్ తలాక్ బిల్లును ఆమోదించిందన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా 38 దేశాల్లో ట్రిఫుల్ తలాక్‌ను రద్దు చేశారని వెల్లడించారు. ఈ బిల్లుతో మతానికి సంబంధం లేదని, సామాజిక రుగ్మతను రూపుమాపాలన్న ఉద్దేశంతోనే మోదీ సర్కారు దీన్ని ఆమోదించినట్టు ఎమ్మెల్యే బిష్ణు సేథి వివరించారు. ముస్లిం మహిళలపై అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసన చేపట్టడంతో సభలో గందరగోళం రేగింది. స్పీకర్ నచ్చజెప్పినా కాంగ్రెస్ సభ్యులు పట్టించుకోకపోవడంతో సభను లంచ్ వరకు వాయిదా వేయాల్సివచ్చింది. -
రూ.లక్ష కోసం ట్రిపుల్ తలాక్.. కేసు నమోదు..!
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ట్రిపుల్ తలాక్-2019 చట్టం కింద కేసు నమోదైంది. వరకట్నం ఇవ్వడం లేదని ఓ వ్యక్తి భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. అత్తింటివారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కోసి ప్రాంతానికి చెందిన జుమిరాత్, మేవత్‌కు చెందిన ఇక్రమ్‌కు కొద్దినెలల క్రితం వివాహమైంది. అయితే, కట్నం విషయంలో ఇరు కుటుంబాల మధ్య వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో గురువారం పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. వరకట్నం కింద లక్ష రూపాయలు చెల్లిస్తేనే జుమిరాత్‌ను ఏలుకుంటానని ఇక్రమ్ తేల్చిచెప్పాడు. (చదవండి : తలాక్ తలాక్ తలాక్ అంటే.. ఇకపై నేరమే) అత్తింటివారు నిరాకరించడంతో.. నడిరోడ్డుపైనే మూడుసార్లు తలాక్ చెప్పాడు. భార్యతో తనకు ఏ సంబంధం లేదని అక్కడ నుంచి వెళ్లిపోయాడు. కాగా, బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టం -2019 ప్రకారం ఇక్రమ్‌పై కేసు నమోదు చేశామని మథుర ఎస్పీ షాలాబ్ మాథుర్ చెప్పారు. ఈ చట్టం ప్రకారం తక్షణ ట్రిపుల్ తలాక్ క్రిమినల్ చర్యగా పరిగణిస్తారు. నేరం నిరూపణ అయిన పక్షంలో నిందితునికి మూడేళ్ల జైలు శిక్ష పడనుంది. ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చిందని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. -
తమిళనాడులో బీజేపీకి బానిసలా ఆ పార్టీ !
సాక్షి, చెన్నై: తమిళనాట బీజేపీకి అన్నాడీఎంకే పార్టీ బానిసలా కొనసాగుతుందని తమిళనాడు ముస్లిం లీగ్ పార్టీ అధ్యక్షడు ముస్తఫా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇటీవల ఆమోదించిన ట్రిపుల్ తలాక్ బిల్లుపై ముస్లింలు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తుంటే తమిళనాడు ప్రభుత్వం మాత్రం బీజేపీకి బాజా వాయిస్తుందని మండిపడ్డారు. గురువారం ట్రిప్లికేన్‌లో ఉన్న పార్టీ కార్యాలయంలో ట్రిపుల్ తలాక్ చట్టానికి వ్యతిరేకంగా వందలాది ముస్లిం మహిళలు మోదీకి బ్లాక్ పోస్ట్ కార్డులను పంపే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలతో పాటు మహిళలే స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తమ మతాచారాలపై బీజేపీవి కక్ష సాధింపు చర్యలు తేటతెల్లమైందన్నారు. ఏళ్ల తరబడి ఖురాన్‌ను పాటిస్తుంటే దానికి వ్యతిరేకంగా హిందుత్వ కుట్రతో బీజేపీ తమ జాతిని అణగదొక్కే ప్రయత్నం చేస్తోందనీ, దానికి తమిళ ప్రభుత్వం వంత పాడడం హేయమైన చర్య అని దుయ్యబట్టారు. -
తలాక్ తలాక్ తలాక్ అంటే.. ఇకపై నేరమే
న్యూఢిల్లీ: ముస్లిం సమాజంలో అమల్లో ఉన్న సత్వర విడాకుల ఆచారం ట్రిపుల్ తలాక్ ఇక నుంచి శిక్షార్హమైన నేరం కానుంది. ఈ మేరకు ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చిందని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గత ఫిబ్రవరిలో జారిచేసిన ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ స్థానంలో ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ చట్టం-2019 అమల్లోకి వచ్చింది. తలాక్ ఏ బిదత్‌తోపాటు ఇతర రూపాల్లో ఉన్న సత్వర తలాఖ్ విధానాలు ఇకపై చెల్లబోవు. మహిళలకు తమ భర్తలు వెనువెంటనే విడాకులు ఇచ్చేవిధానం ఇకపై నేరం కానుంది. మౌఖికంగాగానీ, లిఖితపూర్వకంగాగానీ, లేదా ఎలక్ట్రానిక్ రూపంలో ఇచ్చే సత్వర తలాక్ విధానం ఇకపై చెల్లబోదు, చట్టవిరుద్ధమని ఈ చట్టం పేర్కొంది. ఈ చట్టం ప్రకారం మూడుసార్లు తలాక్ అని పేర్కొంటూ ముస్లిం భర్తలు తమ భార్యలకు విడాకులు ఇస్తే.. దానిని నేరంగా పరిగణిస్తారు. ఇందుకు మూడేళ్ల వరకు జైలుశిక్షతోపాటు జరిమానా కూడా విధించే అవకాశముంది. విపక్షాల వ్యతిరేకత నడుమ ఇటీవల ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభలో గట్టెక్కిన సంగతి తెలిసిందే. -
ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
-
చేతులెత్తేసిన ప్రతిపక్షం
సాక్షి, న్యూఢిల్లీ : ఆట ఆడకముందే ఓడిపోవడం అంటే ఇదే. రాజ్యసభలో ప్రతిపక్షం చేసిందీ ఇదే. వివాదాస్పదమైన ట్రిపుల్ తలాక్, ఆర్టీఐ బిల్లులు రాజ్యసభ ఆమోదం పొందాయంటే ప్రతిపక్షం చేతులెత్తేయడమే అందుకు కారణం. ఈ రెండు బిల్లులను అడ్డుకునేందుకు కావాల్సినంత బలం రాజ్యసభలో ప్రతిపక్షానికి ఉన్నప్పటికీ అలా జరగలేదు. అఖండ మెజారిటీతో తాము అధికారాన్ని చేపట్టినప్పటికీ రాజ్యసభలో మెజారిటీ కలిగిన ప్రతిపక్షాల వల్ల తమ బిల్లులన్నీ వీగిపోతున్నాయంటూ గతంలో ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ మొత్తుకున్నట్లు ఇంకెవరు ఏడ్వాల్సిన అవసరం లేదు. చదవండి: ట్రిపుల్ తలాక్ ఇక రద్దు వివాదాస్పదమైన ట్రిపుల్ తలాక్ బిల్లును గత లోక్‌సభ ఆమోదించినప్పటికీ రాజ్యసభ వ్యతిరేకించడంతో అది వీగిపోయింది. ఇంతకుముందు లోక్‌సభ, నేటి లోక్‌సభ నాటికి రాజ్యసభలో సంఖ్యాపరమైన మార్పులు చోటు చేసుకున్నాయితప్ప, ప్రతిపక్షం మెజారిటీ పెద్దగా పడిపోలేదు. అప్పటికీ ఇప్పటికీ ప్రతిపక్షాలన్నీ ఈ వివాదాస్పద బిల్లును వ్యతిరేకిస్తూనే వస్తున్నాయి. ముస్లిం మహిళలకు మేలుకు ఉద్దేశించిన ఈ బిల్లు వల్ల కీడే ఎక్కువ జరుగుతుందన్నది ప్రతపక్షాల వాదన. ఈ బిల్లును గతవారం రాజ్యసభ 99–84 మెజారిటీతో ఆమోదించింది. ఈ బిల్లులోని లోపాలను సవరించేందుకు ఎంపిక కమిటీ పంపించాలంటూ ప్రతిపక్షం ప్రవేశ పెట్టిన తీర్మానం 84–100 ఓట్ల తేడాతో వీగిపోయింది. ఇక ఆర్టీఐ స్వయం ప్రతిపత్తిని సడలిస్తున్న సవరణ బిల్లు విషయంలోనూ ఇదే జరిగింది. ఎందుకు? ప్రతిపక్ష సభ్యుల గైర్హాజరు వల్ల ఇది జరిగిందా? మరి వారెందుకు గైర్హాజరయ్యారు? ట్రిబుల్ తలాక్ బిల్లును రాజ్యసభ ఆమోదానికి వచ్చినప్పుడు నలుగురు కాంగ్రెస్ సభ్యులు, ఆరుగురు సమాజ్‌వాది పార్టీ సభ్యులు, నలుగురు బహుజన్ సమాజ్ పార్టీ సభ్యులు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్‌తోపాటు మరో సభ్యుడు, తెలుగుదేశం పార్టీ, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నుంచి ఇద్దరు చొప్పున, డీఎంకే, సీపీఎం, తణమూల్ కాంగ్రెస్‌ల నుంచి ఒక్కరేసి చొప్పున గైర్హాజరయ్యారు. వీరిలో ఇద్దరు, ముగ్గురు నిజంగా అనారోగ్య కారణాల వల్ల సభకు హాజరుకాక పోవచ్చు. మరి, ఇంత మంది ఎందుకు గైర్హాజరయ్యారు. రెండోసారి మరింత బలంతో అధికారంలోకి వచ్చిన బీజేపీని ఏం చేయలేమనే నిర్లిప్త భావం వారిని అలుముకుందా ? ప్రతిపక్షాల మధ్య సమన్వయం లోపించిందా ? నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను నిర్వహించాలనే తపన వారిలో చచ్చి పోయిందా? లేదా అధికార పక్షం ప్రలోభాలకు వారు లొంగిపోయారా? తలాక్ బిల్లు రాజ్యసభ ఆమోదానికి వచ్చినప్పుడు అది అవాంఛిత బిల్లని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్ ముఫ్తీ మెహబూబా విమర్శించారు. అయితే ఆ రోజు సభకు ఆమె పార్టీకి చెందిన ఇద్దరు సభ్యుల్లో ఒక్కరు కూడా హాజరుకాలేదు. అంటే తమ పార్టీ సభ్యులు హాజరైన అడ్డుకోలేరనా, అదే అయితే ప్రతిపక్ష పార్టీల మధ్య సమన్వయం కొరవడినట్లే. ఈ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగానే వ్యవహరిస్తూ వస్తోంది. ఆరోజు సభలో కూడా అదే వైఖరిని ప్రదర్శించింది. ఇతర పార్టీల సభ్యుల గైర్హాజరు పట్లనే అనుమానాలు వస్తున్నాయి. ప్రతిపక్ష సభ్యుల గైర్హాజరు కారణంగానే బిల్లులు ఆమోదం పొందినట్లు బీజేపీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానించడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఏది ఏమైనప్పటికీ రాజ్యసభలో కూడా ఇక ప్రతిపక్షం వీగిపోయినట్లే. పాలకపక్షం ఎలాంటి బిల్లులను తీసుకొచ్చినా చెల్లుబాటు కావడం తప్పదేమో! -
ట్రిపుల్ తలాక్ బిల్లు; కశ్మీర్లో పంచాయతీ..!
శ్రీనగర్ : రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఓమర్ అబ్దుల్లా మధ్య ట్విటర్లో విమర్శల యుద్ధం కొనసాగుతోంది. కేంద్రం వైఖరిని ముఫ్తీ తప్పుబట్టారు. ఆగమేఘాల మీద ట్రిపుల్ తలాక్ బిల్లును తేవాల్సిన అవసరం ఏమొచ్చిందని అన్నారు. సుప్రీం కోర్టు సైతం ఈ బిల్లును చట్ట విరుద్దమైనదిగా ప్రకటించిందని గుర్తు చేశారు. కేవలం ముస్లింలపై కక్ష సాధించడానికే ట్రిపుల్ తలాక్ తీసుకువచ్చారని మండిపడ్డారు. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ బిల్లుకు ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం ఏముందని ట్విటర్లో పేర్కొన్నారు. కాగా, ముఫ్తీ వ్యాఖ్యలపై ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మెహబూబా ముఫ్తీ జీ.. రాజ్యసభలో బిల్లుపై ఓటింగ్ జరుగుతున్నప్పుడు మీ ఎంపీలు ఎక్కడున్నారు. ఉద్దేశపూర్వకంగానే సభ నుంచి మీ పార్టీ ఎంపీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ తగ్గిపోవడానికి, బిల్లు గట్టెక్కడానికి ప్రభుత్వానికి పరోక్షంగా సహకరించారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. మీ ఆంతర్యం ఏమిటీ అని’ ప్రశ్నించారు. ముఫ్తీ స్పందిస్తూ.. ‘ఓటింగ్ సమయంలో ప్రభుత్వ తీసుకొచ్చే బిల్లులకు నిరసనగా సంయమనం పాటించడం కూడా వ్యతిరేకించినట్టే. ఈ విషయం మీరు తెలుసుకుంటే మంచింది. 1999లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసిన మీ పార్టీ సభ్యుడు సోజ్ సాహెబ్‌ను బహిష్కరించారు. అక్కడే మీ నైతికత ఏంటో తెలిసిపోతోంది’ అన్నారు. దీనిపై ‘మీ పార్టీ వంచనను కప్పిపచ్చుకోడానికి ఇరవై ఏళ్ల సంఘటనను గుర్తుచేశారు. మీ ఎంపీలను రాజ్య సభకు గైర్హాజరు కావాలని ఆదేశించినట్టు అంగీకరిస్తున్నారు. సంయమనం పాటించటం ఓటు కాదు. బీజేపీకి సాయం చేసినట్టు అవుతుంది’ అని ఒమర్ విమర్శించారు. కాగా, ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభలో మంగళవారం ఆమోదం పొందిన విషయం తెలిసిందే. అనుకూలంగా 99, వ్యతిరేకంగా 84 ఓట్లు రావడంతో ఎట్టకేలకు మూడో ప్రయత్నంలో ట్రిపుల్ తలాక్ రాజ్యసభలో గట్టెక్కింది. -
తలాక్ చెప్పినందుకు మహిళ ఆత్మహత్యాయత్నం
అహ్మదాబాద్ : రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం తెలిపి ఒక్కరోజు గడవకుండానే ఓ భర్త తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన ఘటన బుధవారం అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. ఈ సంఘటనతో భాదితురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తేలింది . ప్రసుతం సదరు యువతి అహ్మదాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. తలాక్ చెప్పిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా మంగళవారం ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) పేరిట తెచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లును కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఎన్డీయేలో భాగమైన జేడీయూ, అన్నాడీఎంకే పార్టీలు వ్యతిరేకించినప్పటికీ, బీజేడీ మద్దతు తెలపడంతో బిల్లు గట్టెక్కింది. ఇక రాష్ట్రపతి బిల్లుపై సంతకం చేస్తే తక్షణమే ట్రిపుల్ తలాక్ బిల్లు చట్టరూపం దాల్చుతుంది. ఇప్పటి నుంచి ట్రిపుల్ తలాక్ చెప్పినవారికి మూడేళ్ల జైలు శిక్ష అమలవుతుందని బిల్లులో పేర్కొంది. కేంద్రం గతంలో ఫిబ్రవరి 21న ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్ స్థానంలో ట్రిపుల్ తలాక్ బిల్లు అమల్లోకి రానుంది. -
ట్రిపుల్ తలాక్
-
ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
-
ట్రిపుల్ తలాక్ ఇక రద్దు
న్యూఢిల్లీ : ముస్లిం పురుషులు తక్షణం మూడుసార్లు తలాక్ చెప్పి తమ భార్యలకు విడాకులు ఇవ్వడాన్ని (ట్రిపుల్ తలాక్ లేదా తలాక్–ఏ–బిద్దత్‌ను) నేరంగా పరిగణించేలా కేంద్రం తీసుకొచ్చిన బిల్లును రాజ్యసభ మంగళవారం ఆమోదించింది. ట్రిపుల్ తలాక్ బిల్లును లోక్‌సభ గతవారమే ఆమోదించడంతో ఈ బిల్లు పార్లమెంటులో పాస్ అయ్యింది. తలాక్–ఏ–బిద్దత్‌ను ఎస్ఎంఎస్, వాట్సాప్, రాతపూర్వకంగా, నోటి మాటతో లేదా ఇతర ఏ మార్గం/పద్ధతిలోనైనా.. ఎలా చెప్పినా ఆ చర్యను ఈ బిల్లు నేరంగా పరిగణిస్తుంది. ‘ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ)’ పేరిట తెచ్చిన ఈ బిల్లును ఎన్డీయేలో భాగమైన జేడీయూ, అన్నా డీఎంకే పార్టీలు కూడా వ్యతిరేకించినప్పటికీ, తటస్థ పార్టీ అయిన బీజేడీ బిల్లుకు మద్దతు తెలిపింది. బిల్లును ఆమోదించడంపై ఓటింగ్ నిర్వహించగా 99 ఓట్లు అనుకూలంగా, 84 ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి. దీంతో రాజ్యసభలోనూ ట్రిపుల్ తలాక్ బిల్లు గట్టెక్కింది. ఇక రాష్ట్రపతి సంతకం చేసిన అనంతరం ట్రిపుల్ తలాక్ బిల్లు చట్టరూపం దాల్చి, కేంద్రం గతంలో ఇచ్చిన ఆర్డినెన్స్ రద్దవుతుంది. బిల్లును ఆమోదించడంపై ఓటింగ్‌కు ముందు.. అసలు ఈ బిల్లును రాజ్యసభ ఎంపిక కమిటీకి పంపాలా? వద్దా? అన్న దానిపైనా ప్రతిపక్షాల బలవంతంతో ఓటింగ్ నిర్వహించారు. ఎంపిక కమిటీకి పంపవద్దని 100 ఓట్లు, పంపాలని 84 ఓట్లు పడ్డాయి. ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని గత ప్రభుత్వమే తీసుకొచ్చి, లోక్‌సభలో ఆమోదింపజేసుకున్నప్పటికీ, రాజ్యసభలో అది తిరస్కరణకు గురైంది. దీంతో రెండోసారి మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాకా ఈ బిల్లును మరోసారి తీసుకురాగా, పార్లమెంటు ఆమోదం లభించింది. 20 ఇస్లాం దేశాలు కూడా నియంత్రించాయి బిల్లుపై నాలుగున్నర గంటలు సాగిన చర్చలో న్యాయశాఖ మంత్రి రవిశంకర్ మాట్లాడుతూ తక్షణ ముమ్మారు తలాక్‌ను 20 ఇస్లాం దేశాలే నియంత్రించాయనీ, ముస్లిం మహిళల మంచి కోసం ప్రజాస్వామ్య దేశమైన మనం ఎందుకు ఆ పని చేయకూడదని ప్రశ్నించారు. హిందువుల్లోనూ బహుభార్యత్వం, వరకట్నం తదితర నేరాలకు జైలుశిక్ష ఉందని గుర్తుచేసిన రవిశంకర్.. ట్రిపుల్ తలాక్ చెప్పే వారికి జైలు శిక్ష విధించడాన్ని సమర్థించారు. ముస్లిం ఇళ్లలో గొడవలు పెట్టడానికి రాజకీయ దురుద్దేశంతో ఈ బిల్లును తెచ్చారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ ఆరోపించడంపై రవిశంకర్ సమాధానమిస్తూ, ముస్లిం మహిళల హక్కులను పట్టించుకోనందునే ఆ పార్టీకి 1984 తర్వాత ఇంకెప్పుడూ ఎన్నికల్లో సాధారణ మెజారిటీ కూడా రాలేదని విమర్శించారు. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగబద్ధం కాదని 2017లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందునే తాము ఇప్పుడు ఈ బిల్లు తీసుకురాలేదనీ, వాట్సాప్‌లో కూడా విడాకులిచ్చే భర్తల నుంచి ముస్లిం మహిళల హక్కులకు రక్షణ కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఈ బిల్లును తెచ్చిందని రవిశంకర్ చెప్పారు. ట్రిపుల్ తలాక్ బిల్లును రాజకీయ కోణంలో కాకుండా, మానవత్వం, లింగ సమానత్వం, మహిళా సాధికారత కోణంలో చూడాలని కోరారు. టీడీపీ, టీఆర్ఎస్ ఓటింగ్‌కు గైర్హాజరు బీజేపీ మిత్రపక్షమైన అన్నాడీఎంకేతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన టీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. బీజేపీ నేత అరుణ్ జైట్లీ సైతం ఓటింగ్‌కు రాలేకపోయారు. ఇక ఆస్కార్ ఫెర్నాండెజ్‌తో సహా కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు, ఎన్సీపీ ఎంపీలు శరద్‌పవార్, ప్రఫుల్ పటేల్, ఐదుగురు ఎస్పీ నేతలతో సహా మొత్తం 20 మంది ప్రతిపక్ష ఎంపీలూ ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు చెందిన 11 మంది సభ్యుల అన్నాడీఎంకే, ఆరుగురు సభ్యుల జనతాదళ్, ఆర్జేడీకి చెందిన జెఠ్మలానీ ఓటింగ్‌లో పాల్గొనలేదు. దీంతో మొత్తం 57 మంది సభ్యులు ఓటింగ్‌కు దూరమైనట్లయింది. ఫలితంగా సభ్యుల సంఖ్య 183కు చేరి బిల్లు ఆమోదానికి కావాల్సిన ఓట్ల సంఖ్య 92కు పరిమితమయింది. బిల్లులో ఏముంది? తలాక్–ఏ–బిద్దత్(తక్షణం మూడుసార్లు తలాక్ చెప్పడం)ను ఎస్ఎంఎస్, వాట్సాప్, రాతపూర్వకంగా, నోటి మాటతో లేదా ఇతర ఏ మార్గం/పద్ధతిలో చెప్పినా ఆ చర్య నేరమని ఈ బిల్లు చెబుతోంది. తక్షణం మూడుసార్లు తలాక్ చెప్పి భార్యలకు విడాకులిచ్చే ముస్లిం పురుషులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా నిబంధనలున్నాయి. ఎవరైనా ముస్లిం పురుషుడు తలాక్–ఏ–బిద్దత్ పద్ధతిలో భార్యకు విడాకులిచ్చాడని ఫిర్యాదు వస్తే, వారంట్ లేకుండానే అతణ్ని అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఈ బిల్లు కల్పిస్తోంది. అయితే బాధిత మహిళ లేదా ఆమె రక్త సంబంధీకులు లేదా అత్తింటివారు ఫిర్యాదు చేస్తే మాత్రమే పోలీసులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. బాధిత మహిళ వాంగ్మూలాన్ని కూడా పరిశీలించిన తర్వాతనే జడ్జీలు అవసరం అనుకుంటే నిందితుడికి బెయిలు మంజూరు చేయవచ్చు. విడాకుల అనంతరం తాను, తన పిల్లలు బతకడానికి అవసరమైన భరణం ఇవ్వాలని భర్తను అడిగేందుకు మహిళలకు హక్కు ఉంటుంది. చారిత్రక తప్పిదాన్ని సరిచేశాం: మోదీ ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదింపజేసుకోవడం ద్వారా పురాతన, మధ్యయుగ కాలం నాటి నుంచి ముస్లిం మహిళలకు జరుగుతున్న చారిత్రక తప్పిదాన్ని తాము సరిచేశామని ప్రధాని మోదీ అన్నారు. ఇకపై ట్రిపుల్ తలాక్ చెత్తబుట్టకు పరిమితమవుతుందన్నారు. బిల్లు ఆమోదం పొందిన అనంతరం మోదీ ఓ ట్వీట్ చేస్తూ ‘ఈ రోజు ఇండియా సంతోషిస్తోంది. సమాజంలో లింగ సమానత్వం సాధనలో ఇదో విజయం. బిల్లుకు మద్దతు తెలిపిన ఎంపీలందరికీ ధన్యవాదాలు. బిల్లుకు అనుకూలంగా ఓటేసిన పార్టీల చర్య భారత చరిత్రలో నిలిచిపోతుంది. పురాతన, మధ్యయుగం నాటి విధానమొకటి ఎట్టకేలకు చెత్తబుట్టలోకి చేరింది. ముస్లిం మహిళలు సాధికారత సాధించడంలో, సమాజంలో వారికి సముచిత గౌరవాన్ని సంపాదించుకోవడంలో ఈ చట్టం సహాయపడుతుంది’ అని వివరించారు. ముస్లింలపై దాడుల్లో ఓ భాగం: ఒవైసీ ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభ మంగళవారం ఆమోదం తెలపడంపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. 2014 నుంచి దేశంలో ముస్లింల పౌరసత్వం, గుర్తింపుపై జరుగుతున్న దాడుల్లో ఈ బిల్లు ఆమోదం ఒక భాగం మాత్రమేనని ఆయన విమర్శించారు. మూకదాడులు, పోలీసుల దురాగతాలు, సామూహిక ఖైదు తమను నిస్సహాయులను చేయలేవని పేర్కొన్నారు. రాజ్యాంగంపై ఉన్న బలమైన నమ్మకంతో అణచివేతకు, అన్యాయానికి, హక్కుల తిరస్కరణకు వ్యతిరేకంగా పోరాడతామని ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. భారత రాజ్యాంగ బహుళత్వం, వైవిధ్యతను కాపాడేందుకు ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తామని ఆయన తెలిపారు. ఈ చట్టం ముస్లిం మహిళలకు వ్యతిరేకమనీ, వారిని మరింత దీనావస్థలోకి నెడుతుందని ఒవైసీ అన్నారు. వ్యతిరేకంగా ఓటేసిన వైఎస్సార్సీపీ బీజేపీకి 114 మంది సభ్యుల బలం ఉన్నా 11 మంది సభ్యులున్న అన్నాడీఎంకే, ఆరుగురు సభ్యుల జనతాదళ్ వ్యతిరేకిస్తూ బయటకు వెళ్లిపోవటం, మరికొందరు హాజరుకాకపోవటంతో సభ్యుల సంఖ్య 92కు తగ్గింది. ఇద్దరు సభ్యులున్న వైఎస్సార్సీపీ తొలి నుంచీ కనబరుస్తున్న వైఖరికి తగ్గట్టుగానే ఈ బిల్లును వ్యతిరేకించింది. సభలో ఉన్న పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. తటస్థ వైఖరితో ఉన్న ఏడుగురు సభ్యుల బిజూ జనతాదళ్ ఆఖరి క్షణంలో ఈ బిల్లుకు మద్దతిచ్చింది. దీంతో మద్దతిచ్చిన సభ్యుల సంఖ్య 99కి చేరింది. దీంతో బిల్లుకు అనుకూలంగా 99 – వ్యతిరేకంగా 84 ఓట్లు వచ్చాయి. బిల్లు గట్టెక్కింది. -
చారిత్రాత్మక విజయం: ప్రధాని మోదీ
సాక్షి, అమరావతి: రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇతరులతో పాటు ముస్లిం మహిళ కూడా సమాన హక్కులు కల్పించేందుకు వీలుగా రూపొందించిన బిల్లుకు ఆమోదం లభించడం సంతోషంగా ఉందన్నారు. ముస్లిం మహిళలపై చూపుతున్న వివక్షకు నేడు సరైన న్యాయం జరిగిందన్నారు. ముస్లిం మహిళల ఆత్మగౌరవం పెరిగిందన్న మోదీ.. ఇది మహిళ విజయంగా వర్ణించారు. కాగా మంగళవారం సాయంత్రం రాజ్యసభలో బిల్లుకు ఆమోదం లభించిన విషయం తెలిసిందే. అనంతరం ప్రధాని ట్విటర్లో స్పందిస్తూ.. సంతోషం వ్యక్తం చేశారు. బిల్లుకు మద్దతు తెలిపిన రాజకీయ పార్టీల సభ్యులకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇది చారిత్రాత్మక విజయమన్నారు. బిల్లు ఆమోదంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. దీని ద్వారా ప్రధాని మోదీ ముస్లిం మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చారని గుర్తుచేశారు. ఇక దేశంలో ట్రిపుల్ తలాక్ అనే పదమే వినపడదని స్పష్టం చేశారు. కాగా ఉత్కంఠ భరితంగా సాగిన ఓటింగ్‌లో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో బీజేపీ నేతలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి అసలైన విజయం నేడు లభించిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అన్నారు. ముస్లిం మహిళల హక్కుల రక్షణకు తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని మరోసారి రుజువైందని అభిప్రాయపడ్డారు. -
ట్రిపుల్ తలాక్‌కు వైఎస్సార్సీపీ వ్యతిరేకం
-
రాజ్యసభలో ఆమోదం పొందిన ట్రిపుల్ తలాక్ బిల్లు
-
ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ (ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టం) బిల్లుకు రాజ్యసభలో ఎట్టకేలకు ఆమోదం లభించింది. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా మెజార్టీ సభ్యులు ఓటేశారు. పలువురు సభ్యులు సభకు గైర్హాజరు కావడంతో మ్యాజిక్ ఫిగర్ అనూహ్యంగా తగ్గింది. బిల్లుకు అనుకూలంగా 99 మంది ఓటేయగా.. వ్యతిరేకంగా 84 మంది సభ్యులు ఓటు వేశారు. బీజేపీ సొంత సభ్యులు ఉండగా.. మిత్రపక్షాల మద్దతుతో బిల్లుకు ఆమోదం లభించింది. పలువురు సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉండడంతో మ్యాజిక్ ఫిగర్ తగ్గడం వల్ల బిల్లు సునాయంగా ఆమోదం పొందింది. సభ్యులందరికి స్లిప్పులు పంచి రహస్య ఓటింగ్ పద్దతిలో బిల్లుపై సభ్యుల అభిప్రాయం తీసుకున్నారు. అనంతరం మెజార్టీ సభ్యులు అనుకూలంగా ఓటు వేశారని సభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు. బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించడంతో చట్టంలో పొందుపరిచిన విధంగా కఠిన శిక్ష అమలు కానుంది. కాగా తలాక్ బిల్లుకు ఈనెల 25న లోక్‌సభలో ఆమోదం లభించిన విషయం తెలిసిందే. తాజాగా రాజ్యసభలో కూడా గట్టెక్కడంతో రాష్ట్రపతి ఆమోదముద్ర అనంతరం చట్టరూపం దాల్చనుంది. ట్రిపుల్ తలాక్ బిల్లును తొలి నుంచి వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఆర్జేడీ, సీపీఎం, వైఎస్సార్సీపీ, ఎస్పీ, బీఎస్పీ సభ్యులు సభలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటువేశారు. అయినప్పటికీ మెజార్టీ సభ్యులు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. జేడీయూ, అన్నాడీఎంకే సభ నుంచి వాకౌట్ చేయగా.. టీడీపీ, టీఆర్ఎస్ సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. బిల్లుకు బీజేడీ మద్దతిచ్చింది. ఇది వరకే రెండుసార్లు రాజ్యసభలో బిల్లు వీగిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి బిల్లును నెగ్గించుకునేందుకు బీజేపీ ప్రత్యేక వ్యూహాలను రచించింది. అంతకుముందు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాల ప్రతిపాదనలకు సభ చైర్మన్ ఓటింగ్ చేపట్టారు. మూజువాణి పద్దతిలో ఓటింగ్‌ను నిర్వహించారు. తీర్మానానికి అనుకూలంగా 84 మంది ఓటువేయగా.. వ్యతిరేకంగా 100 మంది సభ్యులు ఓటువేశారు. దీంతో సవరణలకు విపక్షాలు చేసిన తీర్మానం వీగిపోయింది. -
రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై వాడివేడి చర్చ
-
ట్రిపుల్ తలాక్‌కు వైఎస్సార్సీపీ వ్యతిరేకం
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చలో భాగంగా సభలో మాట్లాడిన ఆయన.. పార్టీ వైఖరిని తెలిపారు. బిల్లులోని పలు అంశాలను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ట్రిపుల్ తలాక్ సివిల్ కాంట్రాక్ట్ కిందకు వచ్చే అంశమని, వాటికి క్రిమినల్ పనిష్మంట్ ఎలా ఇస్తారని విజయసాయి రెడ్డి సభలో ప్రశ్నించారు. చట్టంలో లేని అంశాల ఆధారంగా కఠిన శిక్ష ఎలా విధిస్తారని ప్రశ్నలను లేవనెత్తారు. ట్రిపుల్ తలాక్ చట్టం ముస్లిం పురుషుల పట్ల వివక్షపూరితంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి ఇది వరకే లోక్‌సభలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా బీజేపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్‌సభలో ఇదివరకే ఆమోదం పొందగా.. రాజ్యసభలో ప్రస్తుతం చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్‌తో సహా, టీఎంసీ, డీఎంకే, ఆర్జేడీ, సీపీఎం బిల్లును వ్యతిరేకించగా.. జేడీయూ, అన్నాడీఎంకే సభ నుంచి వాకౌట్ చేశాయి. మరో వైపు టీఆర్ఎస్ ఎంపీలు కూడా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. -
‘ఆస్తినంతా.. లాయర్లకు ధారపోయాల్సిందే..’
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ పలు అంశాలను లేవనెత్తారు. ఈ బిల్లుతో ముస్లిం కుటుంబాలకు మేలు జరగకపోగా.. అవి విచ్ఛిన్నయ్యే అవకాశాలే అధికంగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ బిల్లును తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్యభర్తలు చెరో లాయర్‌ను మాట్లాడుకుని.. ఉన్న కాస్తోకూస్తో ఆస్తిని కోర్టు వ్యవహారాలకు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు దాపురిస్తాయని అన్నారు. మైనారిటీ సోదరసోదరీమణుల మధ్య ట్రిపుల్ తలాక్ చిచ్చుపెడుతుందని హెచ్చరించారు. ఎట్టకేలకు కోర్టు తీర్పు అనంతరం ఆ కుటుంబం దివాళా తీయాల్సిందేనా అని ప్రశ్నించారు. అప్పటికే ఆర్థికంగా నష్టాలపాలు కావడంతో జైలు పాలైన వ్యక్తి జీవితం దుర్భరంగా మారుతుందని చెప్పారు. వారిని ఆత్మహత్య చేసుకునేందుకు.. లేక బందిపోటుగా మారేందుకు ఈ బిల్లు పురిగొల్పుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ భాగస్వామ్య పక్షం జేడీ(యూ) సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. -
ట్రిపుల్ తలాక్ ఎఫెక్ట్: కాంగ్రెస్ ఎంపీ రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ఆయన ప్రకటించారు. అమిత్ షా సమక్షంలో రేపు బీజేపీ చేరబోతున్నట్లు కూడా ఆయన తెలిపారు. కాగా ట్రిపుల్ తలాక్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగానే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లును రాజ్యసభలో కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని అమేథికి చెందిన సంజయ్ దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. తాజాగా ఆయన రాజీనామాతో పార్టీ నేతలు షాక్‌కిగురయ్యారు. -
రాజ్యసభలో ట్రిపుల్ రగడ
న్యూఢిల్లీ: రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ భాగస్వామ్య పక్షం జేడీ(యూ) సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. బిల్లుపై చర్చను ప్రారంభించిన మంత్రి ఇస్లామిక్ దేశాలు సైతం త్రిపుల్ తలాక్ ను నిషేధించాయని గుర్తు చేశారు.చిన్న చిన్న కారణాలతో ట్రిపుల్ తలాక్ చెబుతున్న ఉదంతాలు సుప్రీంకోర్టు దృష్టికి వచ్చాయని తెలిపారు.బాధితురాలు, ఆమె రక్త సంబంధీకులకు మాత్రమే ట్రిపుల్ తలాక్ పై కేసు పెట్టే అధికారం ఇచ్చామని,ఈ బిల్లు మానవత్వానికి, న్యాయానికి సంబంధించినది మాత్రమేనని, మతంతో ముడిపడి లేదని స్పష్టం చేశారు. మహిళల అభ్యున్నతి కోసమే తమ ప్రభుత్వం ఈబిల్లు తీసుకొచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ఇక పెద్దల సభలో అధికార సభ్యుల కంటే విపక్ష సభ్యులు అధికంగా ఉండటంతో ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో గట్టెక్కించడం మోదీ సర్కార్‌కు సవాల్‌గా మారింది. ప్రధాన విపక్ష పార్టీలన్నీ బిల్లును వ్యతిరేకిస్తుండటం ప్రభుత్వానికి మింగుడుపడటం లేదు. లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఓటింగ్‌కు వచ్చినప్పుడు కాంగ్రెస్, ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే సహా పలు విపక్ష పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. బిజేపీ మిత్ర పక్షం జేడీ(యూ) సైతం ట్రిపుల్ తలాక్ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం కంటే ముందు ఈ బిల్లును పరిశీలన కోసం సెలెక్ట్ కమిటీకి నివేదించాలని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకేలు డిమాండ్ చేశాయి. -
నేడు పెద్దల సభ ముందుకు ట్రిపుల్ తలాక్ బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభలో విపక్షాల నిరసనల నడుమ ఆమోదం పొందిన ట్రిపుల్ తలాక్ బిల్లు మంగళవారం రాజ్యసభ ముందుకొచ్చే అవకాశం ఉంది. రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును ఎట్టిపరిస్థితుల్లో గట్టెక్కించాలని భావిస్తున్న బీజేపీ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సభకు విధిగా హాజరు కావాలని పార్టీ రాజ్యసభ ఎంపీలందరికీ బీజేపీ విప్ జారీ చేసింది. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందినా రాజ్యసభలో ఈబిల్లు ఆమోదం ప్రభుత్వానికి అంత సులభం కాదు. పెద్దల సభలో అధికార సభ్యుల కంటే విపక్ష సభ్యులు అధికంగా ఉండటంతో ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో గట్టెక్కించడం మోదీ సర్కార్‌కు సవాల్‌గా మారింది. ప్రధాన విపక్ష పార్టీలన్నీ బిల్లును వ్యతిరేకిస్తుండటం ప్రభుత్వానికి మింగుడుపడటం లేదు. లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఓటింగ్‌కు వచ్చినప్పుడు కాంగ్రెస్, ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే సహా పలు విపక్ష పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. బిజేపీ మిత్ర పక్షం జేడీ(యూ) సైతం ట్రిపుల్ తలాక్ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం కంటే ముందు ఈ బిల్లును పరిశీలన కోసం సెలెక్ట్ కమిటీకి నివేదించాలని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకేలు డిమాండ్ చేశాయి. మరోవైపు విపక్షాలు బిల్లును వ్యతిరేకిస్తున్నా లింగ సమానత్వం, న్యాయం దిశగా ఈ బిల్లును రూపొందించామని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ చెబుతోంది. -
స్టాంప్‌పేపర్‌పై తలాక్
ఇండోర్: ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ లోక్‌సభలో బిల్లు ఆమోదించి రెండు రోజులు కూడా గడువకముందే స్టాంపుపై తలాక్ చెప్పిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. తలాక్ ద్వారా విడాకులు ఇస్తానన్న తన భర్త తిరిగి కావాలంటూ, భోజ్‌పురి సినిమాల నటి రేష్మా షేక్ (29) పోలీసులను ఆశ్రయించింది. ముదస్సిర్ బేగ్ (34), తాను 2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్నామని తెలిపారు. తమకు ప్రస్తుతం రెండు నెలల పాప కూడా ఉందని, అతడి కోసం నటన కూడా మానేశానని తెలిపారు. అయితే తన భర్త విడాకులు ఇస్తున్నానంటూ రూ. 100ల స్టాంపు మీద తలాక్ పంపాడు. ఈ విడాకులను తాను అంగీకరించడం లేదని ఆమె స్పష్టం చేశారు. తాను నివాసం ఉంటున్న చందన్ నగర్ పోలీసులుకు విషయం తెలియజేయగా వారు చర్యలు తీసుకోలేదని అన్నారు. పై అధికారులు ఆ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాహుల్ శర్మను ప్రశ్నించగా, అది భార్యాభర్తల మధ్య వచ్చిన గొడవ అని తెలిపారు. పలుమార్లు ముదస్సర్‌కు ఫోన్ చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. తలాక్ ఎ బైన్, ట్రిపుల్ తలాక్‌తో పోలిస్తే భిన్నమైనదని షరియా నిపుణులు తెలిపారు. -
‘తక్షణ తలాక్’పై ఇంత తొందరేల?
తక్షణ తలాక్ విధానం ద్వారా విడాకులిచ్చే దురాచారాన్ని అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును గురువారం లోక్‌సభ ఆమోదించింది. తలాక్ బిల్లు లోక్‌సభ ముందుకు రావడం ఇది మూడోసారి. ప్రభుత్వానికి ఆధిక్యత ఉన్న ఆ సభలో తొలి రెండుసార్లూ బిల్లుకు సులభంగానే ఆమోదముద్ర పడినా, రాజ్యసభలో విపక్షానికి మెజారిటీ ఉండటంతో అక్కడ సాధ్యం కాలేదు. ఇప్పుడైతే రాజ్యసభ ఆమోదం అసాధ్యం కాదన్న విశ్వాసంతో ప్రభుత్వం ఉంది. మధ్యలో నిరుడు సెప్టెంబర్‌లో ఒకసారి ఆర్డినెన్స్ కూడా జారీ అయింది. కానీ తాజా బిల్లును గమనిస్తే ఇన్నాళ్లుగా వ్యక్తమవుతున్న ప్రధాన అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణించదల్చుకోలేదని అర్ధమవుతుంది. ముస్లిం మహిళలకు సమస్యగా మారిన తక్షణ తలాక్ విధానం ఉండరాదన్న నిర్ణయంతో ఎవరూ విభేదించడం లేదు. ముస్లిం పర్సనల్ లా గుర్తిస్తున్న తక్షణ తలాక్ విధానం చెల్లదని, అది రాజ్యాంగ విరుద్ధమని సర్వోన్నత న్యాయస్థానం రెండేళ్లక్రితం తీర్పునిచ్చినప్పుడే చాలామంది దాన్ని హర్షించారు. మన రాజ్యాంగం భిన్న మతాలకుండే వైయక్తిక చట్టాలను (పర్సనల్ లా) గుర్తించింది. కానీ ఏ చట్టమైనా రాజ్యాంగం నిర్దేశించిన స్త్రీ, పురుష సమానత్వానికి లోబడి ఉండాల్సిందే. వివక్షనూ, ఆధిపత్య ధోరణిని ప్రోత్సహించే ఏదైనా చెల్లుబాటు కాదు. ఒకసారి సర్వోన్నత న్యాయస్థానం చెప్పాక ఆ విధానంలో ఎవరైనా విడాకులివ్వడానికి ప్రయత్నిస్తే అది చెల్లుబాటు కాదు. నిజానికి అందుకు చట్టం అవసరం కూడా లేదు. అయినా చట్టం అవసర మని ప్రభుత్వం భావిస్తే కాదనేవారుండరు. కానీ తక్షణ తలాక్ చెప్పడాన్ని దానికదే నేరంగా పరిగ ణించడం సరికాదని బిల్లును వ్యతిరేకిస్తున్నవారంటున్నారు. మొదట్లో బిల్లు తీసుకొచ్చినప్పుడు ఉన్న నిబంధనను ప్రభుత్వం స్వల్పంగా మార్చింది. భార్య లేదా ఆమె తరఫు రక్త సంబంధీకులు, బంధువులు ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మార్చారు. అలాగే దాన్ని రాజీకి వీలైన నేరంగా కూడా పరిగణిస్తూ ప్రతిపాదించారు. మొదట్లో ఉన్నట్టు ఇది నాన్ బెయిలబుల్ కేసుగానే ఉన్నా విచారణ సమయంలో బెయిల్ పొందేందుకు వీలు కల్పించారు. ఇంత వరకూ బాగానే ఉన్నా తక్షణ తలాక్‌ను నేరంగా పరిగణించరాదన్న ప్రధాన సూచనను మాత్రం ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏ వైయక్తిక చట్టమైనా వివాహాన్ని సివిల్ ఒప్పందంగానే పరిగణిస్తుంది. భార్యాభర్తలిద్దరిలో ఎవరైనా ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పక్షంలో రెండోవారు దాంపత్య హక్కుల పునరుద్ధరణ కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. అది లభించని పక్షంలో పరిహారాన్ని కోరవచ్చు. గృహ హింస చట్టం కింద కేసు పెట్టవచ్చు. అంతేతప్ప ఉల్లంఘించినవారిని నేరస్తులుగా పరిగణించే విధా నం లేదు. సివిల్ ఒప్పందాన్ని ఉల్లంఘించే ఇతర మతాలవారి విషయంలో లేని నిబంధన ముస్లిం పురుషులకు ఎందుకుండాలన్నది బిల్లును వ్యతిరేకిస్తున్నవారి అభ్యంతరం. ఇది రాజ్యాంగం ప్రవ చిస్తున్న సమానత్వ సిద్ధాంతానికి విరుద్ధం కాదా? ఇందువల్ల ముస్లిం మహిళలకు కలిగే మేలేమిటో కూడా అర్ధం కాదు. భర్త నిరాదరించిన పక్షంలో ఒంటరైన మహిళ వెంటనే కోరుకునేది జీవనం సాగించడానికి అవసరమైన మొత్తం. న్యాయస్థానం ఆ మొత్తాన్ని భర్త నుంచే ఇప్పించాలి. కానీ ఈ బిల్లు చట్టమయ్యాక భర్త జైలు పాలైతే ఆ పరిహారాన్ని అతను చెల్లించడం ఎలా సాధ్యం? అతడు చెల్లించలేని పక్షంలో ఆమెకు పరిహారం దక్కేదెలా? పైగా వివాహంలో పొరపొచ్చాలు వచ్చిన ప్పుడు సహజంగానే ఇద్దరినీ మళ్లీ ఒకటి చేయడానికి అందరూ ప్రయత్ని స్తారు. తక్షణ తలాక్ చెప్పిన భర్తపై మహిళ ఆవేశంతో కేసు పెట్టి అరెస్టు చేయిస్తే అలాంటి రాజీ యత్నాలకు అసలు వీలుంటుందా? ఈ బిల్లు చట్టమైతే ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి. సుప్రీంకోర్టు కూడా తక్షణ తలాక్ చెల్లదని చెప్పిందే తప్ప, దాన్ని నేరపూరిత చర్యగా పరిగణిం చాలని అనలేదు. చర్చ సందర్భంగా బిల్లును వ్యతిరేకించినవారు దాన్ని స్థాయీ సంఘానికి పంపాలని కోరారు. ఆ సూచన ఆహ్వానించదగ్గది. అక్కడైతే బిల్లును సంపూర్ణంగా అధ్యయనం చేయడానికి, మార్పులు సూచించడానికి ఆస్కారం ఉంటుంది. అయితే దీన్ని వెనువెంటనే తీసుకురావాల్సిన అవసరం ఉన్నదన్న మంత్రి అందుకు కారణం చెప్పారు. 2017 జనవరి నుంచి ఇంతవరకూ దేశవ్యాప్తంగా తక్షణ తలాక్‌తో విడాకులిచ్చిన ఉదంతాలు 547 జరిగాయని వివరించారు. అలాగే సుప్రీంకోర్టు ఇది చెల్లుబాటు కాదని చెప్పాక కూడా 345 ఉదంతాలు చోటుచేసుకున్నాయన్నారు. నిరుడు సెప్టెంబ ర్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు ఆయన చెప్పిన గణాంకాలను ఒకసారి ప్రస్తావించుకోవాలి. వాటి ప్రకారం అప్పటికి తక్షణ తలాక్ ఉదంతాలు 430 జరిగాయి. అంటే ఆ తర్వాత ఇంత వరకూ... అంటే ఈ పది నెలలకాలంలో కొత్తగా 117 ఉదంతాలు జరిగాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో ముస్లింల జనాభా దాదాపు 17.5 కోట్లు. ఇన్ని కోట్లమందిలో తక్షణ తలాక్ విధానం ఆచరిస్తున్నవారు ఎంత తక్కువమందో మంత్రి చెప్పిన గణాంకాలే వెల్లడిస్తున్నాయి. అయితే తక్కువ సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి గనుక తక్షణ తలాక్ రద్దు వద్దని ఎవరూ అనరు. కానీ ఆదరాబాదరాగా తీసుకురావలసిన అగత్యం లేదు. ఒక చట్టం చేయదల్చుకున్నప్పుడు దానిపై అన్ని కోణాల్లోనూ చర్చించడం, ఎలాంటి పర్యవసానాలుండగలవో ఆలోచించడం, అందరి అభిప్రాయాలూ పరిగణనలోకి తీసుకోవడం అవసరం. అప్పుడు మాత్రమే ఏ చట్టమైనా సమ గ్రంగా ఉంటుంది. అసహాయులకు ఆసరాగా నిలుస్తుంది. ఆదరాబాదరాగా తీసుకురావడం వల్ల, సూచనలను పెడచెవిన పెట్టడం వల్ల ఆశిస్తున్న ఫలితం రాదు. తాము ముస్లిం మహిళల ఆత్మగౌర వాన్ని కాపాడదల్చుకున్నామని, వారికి అన్యాయం జరగకుండా చూడదల్చుకున్నామని మంత్రి అంటున్నారు. కానీ ఈ బిల్లు ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే దాఖలా కనబడటం లేదు. కేంద్రం మరోసారి ఆలోచించాలి. -
ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 303 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 82 ఓట్లు వచ్చాయి. విపక్షాల నిరసనల మధ్య బిల్లును సభ ఆమోదించింది. బిల్లుపై జరిగిన చర్చలో పాలక, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదంతో సభలో గందరగోళం నెలకొంది. 2017లో సుప్రీం కోర్టు ట్రిపుల్ తలాక్‌ను నిషేధించినా ఈ పద్ధతి కొనసాగుతుండటంతో ట్రిపుల్ తలాక్‌ను నిషేధించే చట్టాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. మూడుసార్లు తలాక్ చెప్పడం ద్వారా భార్యకు విడాకులు ఇవ్వడం నేరమని ఇందుకు మూడేళ్ల జైలు శిక్ష విధించేలా ముసాయిదా బిల్లులో పొందుపరిచారు. నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తొలి సెషన్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టడం గమనార్హం. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, జేడీ(యూ), పీడీపీ వంటి పలు పార్టీలు బిల్లును పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపాలని కోరినా లింగ సమానత్వం, మహిళల హక్కుల పరిరక్షణ దిశగా బిల్లు ఆమోదం అనివార్యమని ప్రభుత్వం పేర్కొంది. ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తూ జేడీ(యూ), తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఎంపీలు వాకౌట్ చేశారు. కాగా, ట్రిపుల్ తలాక్ బిల్లుపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వలింగ సంపర్కాన్ని సుప్రీంకోర్టు చట్టబద్ధం చేస్తే.. ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరగణించాలంటూ కేంద్రం బిల్లు తీసుకురావడమేమిటని ప్రశ్నించారు. గురువారం సభలో ఆయన మాట్లాడుతూ...‘ మీరు తెచ్చిన బిల్లు ప్రకారం.. ఓ ముస్లిం వ్యక్తి తన భార్యకు మూడుసార్లు తలాక్ చెప్పినా వారి వివాహం చట్టబద్ధమే. అదే విధంగా ట్రిపుల్ తలాక్ ద్వారా భార్యకు విడాకులు ఇచ్చిన పురుషుడికి మూడేళ్లు జైలు శిక్ష విధిస్తారు. అదే జరిగితే భర్త జైలులో ఉన్నపుడు భార్యకు భరణం ఎలా లభిస్తుంది. విడాకులిచ్చిన భర్త జైలు నుంచి విడుదలయ్యే దాకా సదరు మహిళ ఎదురుచూస్తూ ఉండాలా?’ అని ప్రశ్నించారు -
స్వలింగ సంపర్కం నేరం కాదు; మరి ట్రిపుల్ తలాక్?!
న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ బిల్లుపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వలింగ సంపర్కాన్ని సుప్రీంకోర్టు చట్టబద్ధం చేస్తే.. ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరగణించాలంటూ కేంద్రం బిల్లు తీసుకురావడమేమిటని ప్రశ్నించారు. గురువారం సభలో ఆయన మాట్లాడుతూ...‘ మీరు తెచ్చిన బిల్లు ప్రకారం.. ఓ ముస్లిం వ్యక్తి తన భార్యకు మూడుసార్లు తలాక్ చెప్పినా వారి వివాహం చట్టబద్ధమే. అదే విధంగా ట్రిపుల్ తలాక్ ద్వారా భార్యకు విడాకులు ఇచ్చిన పురుషుడికి మూడేళ్లు జైలు శిక్ష విధిస్తారు. అదే జరిగితే భర్త జైలులో ఉన్నపుడు భార్యకు భరణం ఎలా లభిస్తుంది. విడాకులిచ్చిన భర్త జైలు నుంచి విడుదలయ్యే దాకా సదరు మహిళ ఎదురుచూస్తూ ఉండాలా?’ అని ప్రశ్నించారు. మహిళలను మీరు శిక్షిస్తున్నారు.. ‘స్వలింగ సంపర్కం, వివాహేతర సంబంధాలు నేరం కాదంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కానీ మీరు మాత్రం ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణించాలని అనుకుంటున్నారు. ఇదెక్కడి న్యాయం. మీరు సరికొత్త భారతాన్ని నిర్మించాలనే మాటకు కట్టుబడి ఉన్నారా! ట్రిపుల్ తలాక్ సరైంది కాదని సుప్రీంకోర్టు చెప్పింది. జైలులో ఉన్న భర్త బయటికి వచ్చేదాకా విడాకులు పొందిన ఓ భార్యకు ఎవరు ఆర్థిక సహాయం చేస్తారు. భర్తకు మూడేళ్లు జైలు శిక్ష విధించి భార్యలను మీరు శిక్షిస్తున్నారు’ అని అసదుద్దీన్ ఒవైసీ కేంద్రం తీరుపై మండిపడ్డారు. ట్రిపుల్ తలాక్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని మరోసారి స్పష్టం చేశారు. వాళ్ల కోసమే ఈ బిల్లు.. లోక్‌సభలో చర్చ సందర్భంగా అసదుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ స్పందించారు. ఎవరైనా ఒక వ్యక్తి తన భార్య లేదా కూతురు ఒక్క ఫోన్ కాల్ ద్వారా విడాకులు పొందటాన్ని ఒవైసీ సమర్థిస్తారా అని ప్రశ్నించారు. ‘ వాట్సాప్ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ ద్వారా విడాకులు ఇచ్చే వాళ్ల కోసమే ఈ బిల్లు. పళ్లు సరిగా లేవని, కూరలో తగినంత ఉప్పు వేయలేదని విడాకులు ఇస్తున్న మహానుభావులను చూస్తూనే ఉన్నాం కదా’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
జైలు శిక్ష అభ్యంతరకరం: ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ చట్టం ముస్లిం పురుషుల పట్ల వివక్షపూరితంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలని పేర్కొన్నారు. గురువారం లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...వివాహమనేది సివిల్ కాంట్రాక్ట్ అయినపుడు, దాని పరిణామాలు కూడా సివిల్‌గానే పరిగణించాలని అభిప్రాయపడ్డారు. విడాకులు ఇచ్చిన కారణంగా జైలు శిక్ష అనేది ప్రపంచంలో ఎక్కడా లేదని.. విడాకుల కేసుకు మూడేళ్ల జైలు శిక్ష అభ్యంతరకరమన్నారు. ఈ చట్టం కారణంగా భర్త జైలులో ఉంటే భార్యకు రావాల్సిన ఆర్థిక సహాయం ఎలా అందుతుందని ప్రశ్నించారు. ఒక మతాన్ని దృష్టిలో పెట్టుకుని చట్టం చేయకూడదని సూచించారు. అభద్రత వల్ల ఉగ్రవాదం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బిల్లుపై చర్చ సందర్భంగా మహిళా సాధికారికతకు, వివిధ రంగాల్లో వారి అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని మిథున్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. -
మరో పది రోజులు పార్లమెంట్!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు మరో 10 రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎంపీలకు తెలిపినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. కీలకమైన పలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నందునే సమావేశాలను పొడిగిస్తున్నట్లు సమాచారం. తదుపరి వివరాలను, తేదీలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం వెల్లడిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. సమావేశాలు ముగిసే వరకూ ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోవద్దని పార్టీ ఎంపీలకు అమిత్‌షా సూచించినట్లు సమాచారం. కేంద్రం సీరియస్‌గా తీసుకుంటున్న ట్రిపుల్ తలాక్ బిల్లు కూడా ఆమోదించాల్సిన బిల్లుల జాబితాలో ఉంది. -
పెళ్లైన 24 గంటలకే విడాకులు
లక్నో : వివాహం అయ్యి ఓ రోజైనా గడవకముందే నూతన వధువుకు తలాక్ చెప్పాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ జహీంగీరాబాద్లో చోటు చేసుకుంది. వివరాలు.. షాహే అలం అనే వ్యక్తికి ఈ నెల 13న రుక్సానా బానోతో వివాహం జరిగింది. అయితే పెళ్లికి ముందు అలంకు కట్నంలో భాగంగా బైక్ ఇస్తామని చెప్పారు బానో తల్లిదండ్రులు. కానీ పెళ్లి సమయానికి డబ్బు సర్దుబాటు కాకపోవడంతో బైక్ ఇవ్వలేదు. ఆగ్రహించిన అలం.. రుక్సానాకు ముమ్మార్లు తలాక్ చెప్పాడు. దాంతో రుక్సానా తండ్రి అలంతో పాటు అతని కుటుంబ సభ్యుల మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. -
రూ. 30 అడిగినందుకు తలాక్
లక్నో : ఓ వైపు ట్రిపుల్ తలాక్ నేరమంటూ కేంద్రం హెచ్చరిస్తున్నప్పటికి.. బాధితుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. తాజాగా నోయిడాలో మరో ట్రిపుల్ తలాక్ సంఘటన చేసుకుంది. కూరగాయలు కొనేందుకు 30 రూపాయలు అడిగిందని భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడో ప్రబుద్ధుడు. వివరాలు.. నోయిడాకు చెందిన జైనాబ్(30) కూరగాయలు కొనడం కోసం భర్తతో పాటు స్థానిక రావోజి మార్కెట్‌కు వెళ్లింది. కురగాయలు కొనే నిమిత్తం రూ. 30 ఇవ్వాల్సిందిగా భర్తను కోరింది. దాంతో ఆగ్రహించిన ఆమె భర్త సబీర్(32) స్క్రూడ్రైవర్‌తో జైనాబ్ మీద దాడి చేయడమే కాక.. ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఈ సంఘటన గురించి బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. ‘పెళ్లైన దగ్గర నుంచి సబీర్ నా కూతుర్ని హింసిస్తున్నాడు. అతని సోదరులు నా కుమార్తెతో తప్పుగా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో గత వారం జైనాబ్ మా ఇంటికి వచ్చింది. ఐదు రోజుల తర్వాత తన అత్త వారింటికి వెళ్లింది. వెళ్లిన దగ్గర నుంచి సబీర్ తనకు విడాకులు కావాలంటూ నా కుమార్తెను వేధించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో కూరగాయల కోసం నా కుమార్తె 30 రూపాయలు అడిగింది. దాంతో సబీర్ నా కుమార్తెకు తలాక్ చెప్పాడ’ని వాపోయాడు. జైనాబ్ తండ్రి ఫిర్యాదు మేరకు సబీర్, అతని కుటుంబ సభ్యుల మీద దాద్రీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. -
రాజ్యసభలో ట్రిపుల్ తలాక్‌కు చెక్ : జేడీయూ
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును తాము వ్యతిరేకిస్తామని, ఈ అంశంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌కు మద్దతు ఇవ్వబోమని బిహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ స్పష్టం చేసింది. జేడీయూ ట్రిపుల్ తలాక్‌ను వ్యతిరేకిస్తుందని, తమ వైఖరిలో ఎలాంటి మార్పూ ఉండదని ఆ పార్టీ నేత, బిహార్ మంత్రి షయం రజాక్ తెలిపారు. ట్రిపుల్ తలాక్ సామాజికాంశమని, దీన్ని సమాజమే పరిష్కరించాలని చెప్సారు. కాగా ట్రిపుల్ తలాక్ బిల్లును బిహార్ సీఎం నితీష్ కుమార్ ఇప్పటికే బాహాటంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. కాగా, ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి పౌరస్మృతి అమలు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం వంటి నిర్ణయాలను చర్చల ద్వారా లేదా కోర్టు తీర్పు ద్వారా పరిష్కరించాలని నితీష్ పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి పౌరస్మృతికి తాము వ్యతిరేకమని నితీష్ స్పష్టం చేశారు. -
ఆధార్ సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: బ్యాంకు అకౌంట్లు తెరిచేందుకు, మొబైల్ ఫోన్ కనెక్షన్లు పొందేందుకు ఆధార్‌ను గుర్తింపు ధ్రువీకరణగా వాడుకునేందుకు వీలు కల్పిస్తూ రూపొందించిన సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మార్చిలో విడుదల చేసిన ఆర్డినెన్స్ స్థానంలో రూపొందించిన ఈ సవరణ బిల్లును 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలను కూడా బిల్లులో ప్రతిపాదించింది. అదేవిధంగా, 18 ఏళ్లు నిండిన వారు బయోమెట్రిక్ గుర్తింపు విధానం నుంచి బయటికి వచ్చేందుకు వీలు కల్పించే ప్రతిపాదన కూడా ఉంది. కశ్మీర్లో రాష్ట్రపతి పాలన పొడిగింపు జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ వెల్లడించారు. రాష్ట్రంలో 2018 జూన్ 20వ తేదీ నుంచి రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది. అమర్నాథ్ యాత్ర ముగిసిన తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తామంటూ ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రపతి పాలనకు ఇదే ఆఖరి పొడిగింపు కావచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత గడువు జూలై 2వ తేదీతో ముగియనుండగా తాజా పొడిగింపు జూలై 3వ తేదీ నుంచి అమలు కానుంది. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ మేరకు ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టనుంది. ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం ట్రిపుల్ తలాక్ విధానంపై నిషేధం విధిస్తూ రూపొందించిన బిల్లును కేబినెట్ ఆమోదించింది. ఇందుకు సంబంధించి ఫిబ్రవరిలో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. 16వ లోక్‌సభ రద్దు కావడంతో రాజ్యసభ వద్ద పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లుకు కాలపరిమితి తీరింది. దీంతో ప్రభుత్వం మళ్లీ ఈ బిల్లు రూపొందించింది. ట్రస్టులకు ప్రత్యేక ఆర్థిక మండలా(ఎస్ఈజెడ్)లను ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పించే ఎస్ఈజెడ్ సవరణ బిల్లుపైనా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. -
అనిశ్చితి దాటి కొత్త ఆశల దిశగా..
న్యూఢిల్లీ: తీవ్ర అనిశ్చిత పరిస్థితులు రాజ్యమేలుతున్న సమయంలో 2014లో అధికారం చేపట్టిన ఎన్డీయే ప్రభుత్వం ప్రజల్లో కొత్త ఆశలు చిగురింపజేసిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొనియాడారు. ఆనాటి నుంచి నవభారత నిర్మాణానికి కృషిచేస్తూనే ఉందని తెలిపారు. రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారాలు కనుగొనేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల్ని ప్రారంభిస్తూ కోవింద్ గురువారం ఉభయసభల్ని ఉద్దేశించి ప్రసంగించారు. రఫేల్ ఒప్పందం, వెనకబడిన వర్గాలకు 10 శాతం కోటా, ట్రిపుల్ తలాక్ బిల్లు, పౌరసత్వ బిల్లు, నోట్లరద్దు తదితరాలను ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వ అభిప్రాయాలను ప్రతిబింబిస్తూ సాగిన ఆయన ఉపన్యాసం సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రావడంతో ప్రాధాన్యత ఏర్పడింది. శుక్రవారం ప్రవేశపెట్టబోయే తాత్కాలిక బడ్జెట్లో రైతులకు పలు ఉపశమన చర్యలు ఉంటాయని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన వ్యవసాయ సంక్షోభాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. రైతులు దేశ ఆర్థిక వ్యవస్థకు పునాదులన్న కోవింద్..2022 నాటికి వారి ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని తెలిపారు. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తీసుకున్న నిర్ణయం చారిత్రకమని ప్రశంసించారు. 2016 నాటి సర్జికల్ దాడులను ప్రస్తావించగానే అధికార పార్టీ సభ్యులు బల్లలు చరిచి హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో విజయాల్ని ప్రశంసించిన కోవింద్..తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. పలు అంశాలపై సుమారు గంటసేపు కొనసాగిన కోవింద్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. నవభారత నిర్మాణంపై... 2014 ఎన్నికలకు ముందు దేశంలో అస్థిరత నెలకొంది. ఎన్నికల తరువాత ఈ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నవభారత నిర్మాణానికి పూనుకుంది. అవినీతి, జడత్వ, లోపరహిత వ్యవస్థలతో కూడిన దేశ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం. నాలుగున్నరేళ్లుగా ప్రజల్లో కొత్త ఆశలు, విశ్వాసాన్ని పాదుకొల్పింది. దేశ ముఖచిత్రాన్నే మార్చివేసి సామాజిక, ఆర్థిక మార్పును తీసుకొచ్చింది. రైతు సమస్యలపై.. పవిత్ర పార్లమెంట్ తరఫున నేను మన అన్నదాతల్ని అభినందిస్తున్నా. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రభుత్వం రేయింబవళ్లు కష్టపడుతోంది. రైతుల సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. పౌరసత్వ బిల్లుపై.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో వేధింపులకు గురై భారత్‌కు వలసొచ్చే ముస్లిమేతరులకు ఈ బిల్లు న్యాయం చేస్తుంది. పౌరులకు సామాజిక, ఆర్థిక న్యాయం కల్పించడమే లక్ష్యంగా న్యాయ వ్యవస్థను సంస్కరించేందుకు పాటుపడుతోంది. ఆర్థిక వ్యవస్థపై.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా 2014లో 2.6 శాతం ఉండగా, 2017 నాటికి 3.3 శాతానికి ఎగబాకింది. నాలుగున్నరేళ్లుగా నమోదవుతున్న వృద్ధిరేటే దీనికి కారణం. సగటున వార్షిక వృద్ధిరేటు 7.3 శాతంగా నమోదైంది. దీంతో భారత్..ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. నోట్లరద్దుపై.. అవినీతి, నల్లధన వ్యతిరేక పోరులో నోట్లరద్దు కీలక ఘట్టంగా నిలిచిపోయింది. ఈ నిర్ణయంతో సమాంతర ఆర్థిక వ్యవస్థ మూలాలు దెబ్బతిన్నాయి. సంక్షేమ పథకాలపై.. పీఎం జీవిత బీమా పథకంతో సుమారు 21 కోట్ల మంది, సౌభాగ్య పథకంతో 2 కోట్ల కుటుంబాలు లబ్ధిపొందాయి. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా 9 కోట్ల టాయిలెట్లు నిర్మించాం. -
నేటి నుంచి పార్లమెంటు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు ముందు చివరి పార్లమెంటు సమావేశాలు నేటి నుంచి ఫిబ్రవరి 13 వరకూ జరగనున్నాయి. గురు వారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పౌరసత్వ బిల్లు, ట్రిపుల్ తలాక్ బిల్లు, ప్రజా ప్రాతినిథ్య చట్టం–2017 బిల్లు, కంపెనీల చట్టం బల్లు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ బిల్లులను ఈ సమావేశాల్లోనే ఆమోదింపజేసుకోవాలన్న కృతనిశ్చయంతో ఎన్డీయే ప్రభుత్వం ఉంది. అయితే ఈ బిల్లులపై జేడీయూ సహా పలు మిత్రపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందం, రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి. అయోధ్య చుట్టూ వివాదాస్పదం కాని స్థలాన్ని యజమానులకు తిరిగి ఇచ్చేస్తామని కేంద్రం చెప్పడంపైనా చర్చ సాగే అవకాశముంది. కాగా, తాత్కాలిక బడ్జెట్‌ను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు సమావేశాల నేపథ్యంలో రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సమావేశమయ్యారు. ఈ లోక్‌సభ సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని కోరారు. -
10 నిమిషాలు లేట్‌గా వచ్చినందుకు విడాకులు..
లక్నో : ట్రిపుల్ తలాక్ నేరం అంటూ కేంద్ర ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చినప్పటికి ఇలాంటి సంఘటనలు మాత్రం ఆగడం లేదు. భార్య 10 నిమిషాలు ఇంటికి ఆలస్యంగా వచ్చిందని చెప్పి ఫోన్లోనే విడాకులిచ్చాడు ఓ ప్రబుద్ధుడు. యూపీలో జరిగింది ఈ సంఘటన. వివరాలు.. బాధితురాలు జబ్బుచేసి ఉన్న తన నానమ్మను చూడ్డానికి పుట్టింటికి వెళ్లింది. వెళ్లే ముందు భర్త సరిగా అర్ధగంటలో ఇంట్లో ఉండాలని హెచ్చరించాడు. అయితే భర్త చెప్పిన టైం కాన్న ఓ పది నిమిషాలు ఆలస్యంగా ఇంటికి వచ్చింది బాధితురాలు. దాంతో బాధితురాలి భర్త ఆమె సోదరునికి ఫోన్ చేసి మూడుసార్లు తలాక్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. భర్త నిర్వకం తెలుసుకున్న బాధితురాలు తన కుటుంబసభ్యులను తీసుకుని అత్తారింటికి వస్తే ఆమె మీద దాడి చేసి ఇంట్లో నుంచి గెంటేశారు. దీంతో బాధితురాలు తన భర్త, అతని కుటుంబసభ్యుల మీద పోలీస్ కేసు పెట్టింది. పోలీసులు విచారణ మొదలుపెట్టారు. బాధితురాలు మాట్లాడుతూ.. తనకు న్యాయం చేయాలని లేకపోతే.. ఆత్మహత్యే దిక్కని బాధపడుతుంది. అంతేకాక పెళ్లైన నాటి నుంచి అత్తింటివారు తనను కట్నం కోసం వేధిస్తున్నారని తెలిపింది. తన తల్లిదండ్రులు చాలా పేదవారిని కట్నం ఇచ్చుకోలేరని చెప్పినా వినిపించుకోవడం లేదని వాపోయింది. కట్నం కోసం తనను కొట్టడమే కాక.. ఇప్పటికే ఒక సారి ఆబార్షన్ కూడా చేయించారని తెలిపింది. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని కోరింది. -
ఎంసీఐ, ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్‌లు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం గురువారం సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. కుంభకోణాలతో అప్రతిష్ట మూట గట్టుకున్న భారత వైద్య మండలి (ఎంసీఐ – మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) పాలనా వ్యవహారాలు చూసేందుకు కమిటీని నియమిస్తూ గతంలో ఇచ్చిన ఆర్డినెన్స్‌ను కేంద్రం మరోసారి ఇచ్చింది. గతంలో ఇచ్చిన ఆర్డినెన్స్ చట్టం రూపం దాల్చాల్సి ఉండగా, అది పార్లమెంటులో పెండింగ్‌లో ఉంది. జాతీయ మెడికల్ కమిషన్ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందితే ఎంసీఐ స్థానంలో కొత్త సంస్థ ఏర్పాటవుతుంది. తక్షణ ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ సెప్టెంబర్‌లో ఇచ్చిన ఆర్డినెన్స్ గడువు మరో పది రోజుల్లో తీరిపోనుండటంతో, ఆ ఆర్డినెన్స్‌ను కేంద్రం మరోసారి ఇచ్చింది. -
31 నుంచి బడ్జెట్ సమావేశాలు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు 2019, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకూ జరగనున్నాయి. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన బుధవారం నాడిక్కడ సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాల్లో భాగంగా ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈసారి పార్లమెంటు సమావేశాల సందర్భంగా సభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు సహా పలు కీలక అంశాలను కేబినెట్ కమిటీ చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ మంళవారం ఆమోదించిన పౌరసత్వ బిల్లు–2019ను బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభ ముందుకు తీసుకొచ్చే అవకాశముందని వెల్లడించాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 31న ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యంతర బడ్జెట్‌పై 2–3 రోజుల పాటు పార్లమెంటులో చర్చ సాగనుంది. అయితే కొన్ని కారణాల రీత్యా ఈసారి ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టడం లేదు. కాగా, ఆర్డినెన్సుల జారీకి అనుకూలంగా రాష్ట్రపతి పార్లమెంటును స్వల్పకాలం మాత్రమే ప్రోరోగ్ చేసే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందని ట్రిపుల్ తలాక్, మెడికల్ కౌన్సిల్, కంపెనీ వ్యవహారాల ఆర్డినెన్సులను మరోసారి జారీచేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధం
సాక్షి హైదరాబాద్: ముస్లిం మహిళలను ఉద్ధరించాలని కేంద్రం తీసుకొస్తున్న ట్రిపుల్ తలాక్ చట్టంతో మహిళలకు లాభం కంటే నష్టం ఎక్కువని, ఇది రాజ్యాంగ విరుద్ధమని అఖిల భారత సున్నీ ఉలేమా బోర్డు అధ్యక్షుడు మౌలానా సయ్యద్ హమేద్ హుస్సేన్ షుత్తరీ పేర్కొన్నారు. విడాకుల వ్యవస్థ ముస్లిం సమాజంలోనే స్త్రీ, పురుషులిద్దరికీ సమ న్యాయం జరిగే విధంగా ఉందన్నారు. రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను కేంద్ర హరిస్తుందని మండిపడ్డారు. డబీర్‌పురాలోని సంస్థ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఇతర మతస్తుల కంటే ముస్లింలలోనే విడాకుల శాతం చాలా తక్కువగా ఉందన్నారు. ముస్లిం సమాజంలో భార్యాభర్తలిద్దరూ కలసి జీవించలేనప్పుడు 3 నుంచి 4 నెలల వ్యవధిలో స్వేచ్ఛగా విడిపోయే అవకాశాన్ని ఇస్లామీయా షరియత్ ఇచ్చిందన్నారు. ముస్లిం వివాహాన్ని ఓ సివిల్ కాంట్రాక్టుగా పరిగణించాలని ఆయన కోరారు. కేంద్రం తీసుకొస్తున్న బిల్లు ద్వారా ట్రిపుల్ తలాక్ ఇచ్చిన భర్త జైలుకు పోతే అతని భార్య, పిల్లల పోషణ ఎవరు చూస్తారని ప్రశ్నించారు. బిల్లులో మార్పులు చేయాలన్నారు. ముస్లిం మహిళలకు కేంద్రం ఏదైనా మేలు చేయాలని భావిస్తే వారికి ఉచిత విద్యను అందించాలని కోరారు. -
ఓట్ల తక్కెడలో ట్రిపుల్ తలాక్
మహిళల హక్కుల గురించి బీజేపీ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితో ఆలోచిస్తే కేవలం ముస్లిం మహిళల కోసం మాత్రమే ఎందుకు అంతగా తపనపడుతోంది అనేది ప్రశ్న. వివాహ సంబంధాలలో ముస్లిం మహిళలు వివక్షకూ, అణచివేతకూ గురవుతున్నారని బీజేపీ భావించి త్రిపుల్ తలాక్ నిషేధం నిర్ణయం తీసుకుంటే అంతకు పది రెట్లు హిందూ మహిళలు వివక్షకూ, అణచివేతకూ గురవుతోన్న విషయం ఎందుకు పట్టించుకోవడం లేదు అన్నది సమాధానంలేని ప్రశ్న. ముస్లిం వ్యతిరేకతతో హిందువుల ఓట్లను కొల్లగొట్టడానికే దాడులూ, హత్యలూ, చివరకు త్రిపుల్ తలాక్‌ని కూడా బీజేపీ ఒక ఆయుధంగా వాడుకుంటోంది. తలాక్ తలాక్ తలాక్ ఒకే ఒక్క పదం. మూడు సార్లు ఉచ్చరిస్తే కడదాకా కలిసి నడుస్తానని మాట ఇచ్చిన సహచరిని నడిరోడ్డుమీదికి నెట్టేయొచ్చు. నలు గురు బిడ్డల తల్లినైనా నడిబజారులో నిలబెట్టొచ్చు.ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అప్పటివరకూ తానే సర్వస్వం అని భావించిన ఓ స్త్రీ జీవితాన్ని నిలువునా కూల్చేసే మతపరమైన హక్కు ఇది. జకియా సోమన్, సైరాబానూ, ఇష్రాత్ జహాన్, గుల్షన్ పర్వీన్, అఫ్రీన్ రెహమాన్, అతియా సాబ్రి ఈ ఐదుగురు మహిళలూ ముస్లిం స్త్రీల అస్తిత్వ ప్రతీక. ఇస్లాంని విశ్వసిస్తూనే ముస్లిం మహిళల హక్కులను గుర్తించాలంటూ, మతానికి లోబడి, రాజ్యాంగపరిధిలో ముస్లిం మహిళల హక్కులు కూడా మానవ హక్కుల్లో భాగమేనని ముస్లిం మహిళా ఆందోళన కారులు భావిస్తున్నారు. భారతీయ ముస్లిం మహిళలు స్త్రీపురుష అసమానతలను రూపుమాపేందుకు ట్రిపుల్ తలాక్ రద్దు కూడా మార్గమని భావిస్తున్నారు. భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ ని 2007, జనవరిలో ముంబాయి కేంద్రంగా స్థాపించారు. స్త్రీపురుష వ్యత్యాసాలుండకూడదని, మతంలోనూ స్త్రీపురుష సమానత్వాన్ని పాటించాలన్నది భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ డిమాండ్. స్త్రీ స్వేచ్ఛ అంటే పురుష వ్యతిరేకత కాదు. స్త్రీపురుష సమానత్వం. అలాగే భారత రాజ్యాంగంపైనా మాకు అచంచలమైన విశ్వాసం ఉన్నదని కూడా వారు ప్రకటించారు. నిజానికి ఖురాన్లో తొలిదశలో తలాక్ అనే భావనే లేదు. కాలక్రమంలో దాన్ని సృష్టించారు. అయితే దానికి కొన్ని నిబంధనలున్నాయి. కానీ వాటిని ఎవ్వరూ పాటించడం లేదు. అసలు ఖురాన్ లో స్త్రీలపై ఆధిపత్యానికి తావులేదు.. భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడితే పెద్దల సమక్షంలో చర్చించుకొని కలిసి ఉండేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేయాలని చెప్పింది. చిట్టచివరి ప్రయత్నం కూడా విఫలమైతే మూడు పర్యాయాలుగా తలాక్ చెప్పా లని చెప్పింది. 90 రోజుల వ్యవధిలో మూడు సార్లు పెద్దల సమక్షంలోనే తలాక్ చెప్పాలి. అలాగే ఆ స్త్రీ ఋతుక్రమంలో ఉండగా, గర్భవతిగా ఉన్నప్పుడు సైతం తలాక్ చెప్పకూడదు. కానీ ఆచరణలో అం దుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. స్త్రీలకు తెలియకుండా కూడా తలాక్ చెప్పేస్తున్నారు. హలాలా... తలాక్‌తో విడిపోయిన తరువాత ఆ స్త్రీకానీ, పురుషుడు కానీ మనసు మార్చుకొని ఆవేశంలో చెప్పిన తలాక్‌ని వెనక్కితీసుకునే అవకాశాన్ని హలాలా నియంత్రిస్తోంది. భర్తతో విడిపోయిన తరువాత వాళ్ళిద్దరూ తిరిగికలుసుకోవాలంటే ఆ స్త్రీ మరో పురుషుడిని వివాహమాడిన తరువాతనే రీయూనియన్‌కి అవకాశం ఉంటుంది. అంతవరకు తలాక్ తీసుకున్న భార్యాభర్తలిద్దరూ ఇష్టపడినా తిరిగి కలిసి ఉండే అవకాశం లేదు. హలాలా ఖాజీలు కేవలం 15 రోజుల్లోనే వివాహం, తలాక్ రెండూ పూర్తి చేసి చిన్నారులను సైతం విదేశీయులకు కట్టబెడుతున్న దుర్మార్గాలు జరుగుతున్నాయన్నది వీరి ఆరోపణ. మెహర్.... ఖురాన్ స్త్రీలకు ఇచ్చిన ప్రత్యేక హక్కు మెహర్. నిఖానామా(పెళ్ళి)సందర్భంగా స్త్రీలకి కొంత డబ్బో, వస్తువులో లేదా ఇళ్లో, వారి స్థాయిని బట్టి వరుడి తరఫున ఇస్తారు. దాన్ని రికార్డు కూడా చేయాలి. కానీ ఎక్కడా అది రికార్డు చేయడంలేదు. 786 రూపా యలు మాత్రమే స్త్రీల చేతిలో పెడుతున్నారు. దీంతో వీరికి నష్టం జరుగుతోంది. ఖులా... ముస్లిం స్త్రీలకి కూడా భర్త నుంచి విడిపోయే హక్కుంది దాని పేరే ఖులా. అయితే ముస్లిం స్త్రీలు విడిపోవాలనుకున్నప్పుడు కూడా భర్త అనుమతి కావాలంటున్నారు. కానీ ఖులా కోరుకున్న స్త్రీకి దానంతట అది దక్కే పరిస్థితి లేదు. అక్కడేమో స్త్రీల ప్రమేయం లేకుండానే తలాక్ చెప్పేస్తారు. ఇక్కడేమో భర్త అనుమతి లేనిదే ఖులా యివ్వరు. ఇటువంటి ముస్లిం మహిళల ఉద్యమాలూ, ఆందోళనల నేపథ్యంలో 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ ఆచారాన్ని నిషేధించాలంటూ కంకణం కట్టుకున్నది. అందులో భాగంగానే చట్ట పరంగా ట్రిపుల్ తలాక్‌ని నిషేధించడం కోసం పార్లమెంటులో బిల్లుని ప్రవేశపెట్టి లోక్ సభలో ఆమోదింపజేసుకున్నది. అయితే బీజేపీ ట్రిపుల్ తలాక్‌పై అనుసరిస్తున్న వైఖరిపైనే భిన్నాభిప్రాయాలున్నాయి. ఇది ముస్లిం మహిళల ప్రజాస్వామిక ఆకాంక్షలను నెరవేర్చడానికి తీసుకున్న చర్యా? లేక రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వేసిన ఎత్తుగడా? అనేది గమనించాల్సిన విషయం. మహిళల హక్కుల గురించి బీజేపీ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితో ఆలోచిస్తే కేవలం ముస్లిం మహిళల కోసం మాత్రమే ఎందుకు అంతగా తపనపడుతోంది అనేది ప్రశ్న. వివాహ సంబంధాలలో ముస్లిం మహిళలు వివక్షకూ, అణచివేతకూ గురవుతున్నారని బీజేపీ భావిస్తే ట్రిపుల్ తలాక్ నిషేధం నిర్ణయం తీసుకుంటే అంతకు పది రెట్లు హిందూ మహిళలు వివక్షకూ, అణచివేతకూ గురవుతోన్న విషయం ఎందుకు పట్టించుకోవడం లేదన్నది సమాధానంలేని ప్రశ్న. ఇప్పుడున్న లెక్కల ప్రకారం భారత దేశంలో ఇప్పటి వరకు 23 లక్షల మంది మహిళలను వారి భర్తలు ఎటువంటి చట్టపరమైన, న్యాయబద్దమైన విడాకులు లేకుండా వదిలి వెళ్లారు. ఇందులో ముస్లిం మహిళలు కేవలం రెండు లక్షలా 80 వేల మంది మాత్రమే. క్రైస్తవులు 90 వేల మంది. కాగా మిగిలిన వాళ్ళంతా హిందూ మహిళలేనని ఒక సర్వేలో వెల్లడయ్యింది. ఈవిషయాన్ని ధృవపరుస్తూ తమిళనాడులో ధనుష్ కోటి ప్రాంతంలో మత్స్యకారుల మహిళల పరిస్థితిని ఉదాహరణగా చెప్పడం జరిగింది. ఎటువంటి సమా చారం లేకుండానే భర్తలు ఆ ప్రాంతంలోని మహిళలను సునాయాసంగా వదిలించుకుంటున్నారని ఈ సర్వే ఆధారాలతో సహా నిరూపించింది. అంతేకాకుం డా ఇటీవల పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన ఉద్యోగాలు చేస్తోన్న భర్తలు తమ భార్యలను అవలీలగా భారతదేశంలో వదలిపెట్టి, విదేశాలకు పారిపోతున్నారని జాతీయ మహిళా కమిషన్‌కు 4000కు పైగా ఫిర్యాదులు అందాయి. ఎన్ఆర్ఐ భర్తల చేతిలో మోసపోతోన్న మహిళలు తమకు న్యాయం చేయా లని కమిషన్ని కోరుతున్నారు. అంతేకాకుండా గత కొన్ని వందల ఏళ్ళుగా హిందూ సాంప్రదాయం ప్రకారం జోగినీలుగా, దేవదాసీలుగా, మాతమ్మలుగా, దుర్భరమైన జీవితాలను గడుపుతోన్న లక్ష లాది మంది దళిత మహిళల పట్ల ఈ ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో మనకు తెలియంది కాదు. అంతేకాకుండా హిందూ సమా జంలో మహిళలు ఇప్పటికీ ద్వితీయ శ్రేణి పౌరులుగానే పరిగణింపబడుతున్నారు. చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ బాల్య వివాహాలు, వరకట్న దురాచారాలూ, గృహహింస, పరువు హత్యలూ అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతున్నాయి. ముస్లిం మతంలోని మహిళల హక్కుల కోసం మాట్లాడుతున్న ప్రభుత్వాలు హిందూ మహిళల హక్కులను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాయో సమాధానం చెప్పాల్సి ఉంది. ట్రిపుల్ తలాక్ ద్వారా ముస్లిం మహిళల మద్దతును, ఓట్లను బీజేపీ ఆశిస్తున్నదని కొందరు భావిస్తున్నారు. నిజానికి ఇది పాక్షిక సత్యమే. ఓ పక్క బీజేపీ ముస్లిం వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ, మరోపక్క ఈ ట్రిపుల్ తలాక్ చట్టం ద్వారా అదే ముస్లిం కుటుంబాల్లోని మహిళలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తుందని భావించడంలో పూర్తిగా నిజంలేదు. ఎందుకంటే ముస్లింల మీద గత నాలుగైదేళ్లుగా జరుగుతున్న దాడులు, హింసా కాండ, అత్యాచారాలు ముస్లిం మహిళలను కూడా ఆలోచింపజేస్తాయి. తమ కన్నబిడ్డల పట్ల, కుటుంబా ల్లోని పురుషులపట్ల బీజేపీ, దాని అనుబంధ సంస్థలు అనుసరిస్తోన్న క్రూరమైన విధానాలు, దాడులు ఆ స్త్రీలకు మనశ్శాంతి లేని జీవితాలను ప్రసాదించాయి. గుజరాత్లో జరిగిన మారణకాండను దీని నుంచి విడదీసి చూడలేం. మొత్తం భారత దేశ స్వాతంత్య్ర చరిత్రలో గత నాలుగైదేండ్లుగా జరిగిన హత్యలను పరిశీలిస్తే 2013లో ముగ్గురు ముస్లింలు మతపరమైన దాడుల వల్ల చనిపోతే, 2018 కి వచ్చేసరికి అది 30 మందికి చేరింది. అంటే ఐదేళ్ళలో ఇది పదిరెట్లు పెరిగినట్టు లెక్క. ఇందులో గోసంరక్షణ నినాదం ఎంతోమంది ముస్లింలపై దాడులకు కారణమైంది. అందువల్ల ముస్లిం మహిళల ఓట్లు బీజేపీ లక్ష్యం కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. నిజానికి బీజేపీకి అటువంటి ఉద్దేశం లేదు. ముస్లిం సమాజాన్ని భారతదేశంలోని హిందువుల ముందు దోషులుగా నిలబెట్టి, సహజంగా ముస్లింల పట్ల హిందువుల్లో ఉన్న వ్యతిరేకతను సొమ్ముచేసుకోవాలని మాత్రమే బీజేపీ భావిస్తోంది. అంతే తప్ప ముస్లింల పట్లగానీ, వారి స్త్రీలపట్లగానీ బీజేపీకి సాను కూలత ఉన్నదనుకోవడం పొరపాటు. ఉత్తరప్ర దేశ్‌లో 2017 ఎన్నికలకు ముందు బీజేపీ అనుసరించిన ముస్లిం వ్యతిరేకత హిందూ సెంటిమెంట్ సరిౖయెన ఫలితాలను ఇచ్చింది. భారతీయ జనతాపార్టీ ఆ రాష్ట్ర జనాభాలో 19 శాతానికి పైగా ఉన్న ముస్లిం లకు ఒక్క సీటుకూడా ఇవ్వకపోవడం గమనార్హం. అంటే ఉత్తర భారతంలో ముస్లింల పట్ల చారిత్రకంగా చిరకాలంగా ఉన్న సహజ వ్యతిరేకతను ఉపయోగించుకొని, హిందూ సమాజాన్ని సంఘటితం చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ముస్లిం వ్యతిరేకతతో హిందువుల ఓట్లను కొల్ల గొట్టడానికి చేస్తున్న ప్రయత్నాల్లో దాడులూ, హత్యలూ, చివరకు ట్రిపుల్ తలాక్‌ని కూడా బీజేపీ ఒక ఆయుధంగా వాడుకుంటోంది. వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు మొబైల్: 9705566213 -
ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభలో అడ్డంకులు
-
రాజ్యసభ రబ్బర్ స్టాంప్ కాదు..
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ తాజా బిల్లుపై రాజ్యసభలోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సోమవారం రాజ్యసభ ముందుకొచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లు ప్రస్తుత రూపంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని పట్టుబట్టాయి. బిల్లుపై పాలక బీజేపీ, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో సభ బుధవారానికి వాయిదా పడింది. ట్రిపుల్ తలాక్‌తో విడాకులు ఇచ్చే ప్రక్రియను నిషేధిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా రూపొందిన తాజా బిల్లును ఇటీవల లోక్‌సభ ఆమోదించిన సంగతి తెలిసిందే. కాగా, రాజ్యసభలో ఈ బిల్లుపై విస్తృత చర్చ అవసరమని విపక్షాలు పేర్కొన్నాయి. చట్టబద్ధంగా పరీక్షించకుండా చట్టాలను చేయలేమని లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందినంత మాత్రాన పెద్దల సభలో ఆమోదం పొందలేదని, రాజ్యసభ రబ్బర్ స్టాంప్ కాదని కాంగ్రెస్ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు. బిల్లును ఎవరూ వ్యతిరేకించడలేదని, దీన్ని పరిశీలించేందుకు సెలెక్ట్ కమిటీకి పంపాలని యావత్ విపక్షం డిమాండ్ చేస్తోందని చెప్పారు. బిల్లుపై ప్రభుత్వం రాజకీయం చేస్తోందని దుయ్యబట్టారు. చర్చకు సిద్ధమే.. మరోవైపు విపక్షాల దాడిని ప్రభుత్వం దీటుగా తిప్పికొట్టింది. ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధమని సుప్రీం కోర్టు తేల్చిచెప్పినా ఈ విధానం కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లుపై విపక్ష ఎంపీలు నినాదాలతో హోరెత్తిస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టడంతో సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ స్పీకర్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రకటించారు. -
తలాక్ బిల్లుపై విపక్షాల కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ట్రిపుల్ తలాక్‌బిల్లుపై ఉత్కంఠ కొనసాగుతోంది. విపక్షాల ఆందోళన నడుమ రాజ్యసభలో కేంంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రవేశపెట్టిన బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. బిల్లును సెలెక్టు కమిటీకి పంపాలని డిమాండ్ చేశాయి. తీవ్ర గందరగోళం నడుమ రాజ్యసభను బుధవారంకు వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ తెలిపారు. అంతకుముందు బిల్లును అడ్డుకుంటామని కాంగ్రెస్‌తో సహా ఇతర విపక్షాలు ఘంటాపథకంగా చెప్పి, ట్రిపుల్ తలాక్ బిల్లును పార్లమెంట్ సెలక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత తీర్మానంపై 11 పార్టీలు సంతకం చేశాయి. చర్చకు ముందు తీర్మానంపై ఓటింగ్ జరగాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్షాల ఆందోళనలు ఒకవైపు, రాజ్యసభలో అధికార పార్టీకి సంఖ్యాబలం లేకపోవడం మరోవైపు బీజేపీకి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల వేళ కీలకమైన ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందితేనే చట్టంగా మారనుంది. ఇదిలావుండగా సోమవారం జరిగి రాజ్యసభ సమావేశాలను సభ్యులందరూ హాజరుకావాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విప్‌ను జారీచేశాయి. -
రాజ్యసభకు ‘ట్రిపుల్ తలాక్’ బిల్లు
న్యూఢిల్లీ: వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లును కేంద్రం సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. అయితే ఉన్నదున్నట్టుగా ఈ బిల్లును ఆమోదించే ప్రసక్తే లేదని కాంగ్రెస్ తేల్చిచెబుతోంది. అధికార బీజేపీ మాత్రం ఓటింగ్ సమయంలో రాజ్యసభలో సభ్యులందరూ అందుబాటులో ఉండాలని విప్ జారీ చేసింది. గురువారం లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఎన్డీయే మిత్రుల సంఖ్యతో బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ శనివారం మాట్లాడుతూ, కాంగ్రెస్ ఇతర పక్షాలతో కలిసి తప్పకుండా బిల్లును అడ్డుకుంటుందని చెప్పారు. 2018లో దాదాపు పది పార్టీలు ఈ బిల్లును నేరుగానే వ్యతిరేకించాయని చెప్పారు. కొన్ని విషయాల్లో ప్రభుత్వానికి మద్దతునిచ్చిన పార్టీలు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బిల్లుపై ప్రభుత్వం తొందరపడుతోందని, మరింత మెరుగైన అధ్యయనంకోసం బిల్లును పార్లమెంట్ జాయింట్ సెలెక్ట్కి పంపాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది ముస్లిం మహిళల సమానత్వం, గౌరవం కోసం ఉద్దేశించినదని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా వ్యాఖ్యానించారు. ఈ బిల్లు ముస్లిం కుటుంబాలలో ఆందోళన కలిగిస్తున్నదని ఆలిండియా ముస్లిం విమెన్ పర్సనల్ లాబోర్డు అంటోంది. బిల్లుపై ప్రభుత్వం తీవ్రంగా వ్యవహరించడం వల్ల సమాజంలో అలజడులు చెలరేగే అవకాశముందని విమెన్ పర్సనల్ లాబోర్డు అధ్యక్షురాలు శైస్త్రా అంబర్ చెప్పారు. ప్రతిపాదిత చట్టం ప్రకారం తక్షణ ట్రిపుల్ తలాక్ చేస్తే విడాకులు ఇచ్చిన భర్తకు మూడేళ్లపాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. -
రేపు రాజ్యసభ ముందుకు ట్రిపుల్ తలాక్ బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ బిల్లుపై పాలక బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ ముఖాముఖీ పోరుకు సంసిద్ధమయ్యాయి. లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ తాజా బిల్లును ఆమోదింపచేసుకున్న ప్రభుత్వం సోమవారం పెద్దల సభలోనూ బిల్లును ప్రవేశపెడుతుండటంతో ఉత్కంఠ నెలకొంది. బిల్లుపై ఓటింగ్ జరుగుతుందనే అంచనాతో బీజేపీ, కాంగ్రెస్‌లు తమ సభ్యులను సోమవారం పార్లమెంట్ సమావేశాలకు విధిగా హాజరు కావాలని కోరుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. మతపరమైన వ్యవహారాల్లో ప్రభుత్వం తలదూర్చరాదని ఆ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ఇప్పటికే పార్లమెంట్ ఉభయసభల్లోని సభ్యులను పార్లమెంట్ సమావేశాలకు విధిగా హాజరు కావాలని విప్ జారీ చేసింది. కాగా, ట్రిపుల్ తలాక్ బిల్లు గత గురువారం విపక్షాల వాకౌట్ మధ్య లోక్‌సభ ఆమోదం పొందింది ఇక సోమవారం రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టి, సభామోదం పొందాలని బీజేపీ పట్టుదలగా ఉంటే, బిల్లును తాము సూచించిన మార్పులు చేపట్టకుంటే ఆమోదించేది లేదని కాంగ్రెస్ తేల్చిచెబుతోంది. -
ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
-
‘తలాక్’ బిల్లుకు లోక్ సభ ఓకే
న్యూఢిల్లీ: తక్షణ విడాకులిచ్చే ఇస్లాం సంప్రదాయం ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణించే తాజా బిల్లుకు గురువారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు–2018 పేరిట తెచ్చిన ఈ బిల్లుకు 245 మంది సభ్యులు అనుకూలంగా, 11 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఈ బిల్లును మరింత లోతుగా పరిశీలించేందుకు జాయింట్ సెలక్ట్ కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాల వినతిని కేంద్రం తోసిపుచ్చడంతో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు మధ్యలోనే సభ నుంచి వాకౌట్ చేశాయి. తాజా బిల్లుతో ఇంతకు ముందే లోక్‌సభలో ఆమోదం పొంది, రాజ్యసభలో అపరిష్కృతంగా ఉన్న పాత బిల్లు రద్దయింది. దీంతో ఏడాది వ్యవధిలో ఒకే బిల్లు రెండుసార్లు లోక్‌సభ ఆమోదం పొందినట్లయింది. ఇక తాజా బిల్లు తదుపరి దశలో రాజ్యసభ ఆమోదానికి వెళ్తుంది. అక్కడ కూడా గట్టెక్కి రాష్ట్రపతి ఆమోదముద్ర లభిస్తే చట్టరూపం దాలుస్తుంది. ఈ చట్టం ప్రకారం.. తక్షణ విడాకులు కోరుతూ ట్రిపుల్ తలాక్ చెప్పడం నేరం, చట్ట విరుద్ధం. ఆ నేరానికి పాల్పడే భర్తకు మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ట్రిపుల్ తలాక్ బిల్లును రూపొందించారన్న విపక్షాల వాదనల్ని ప్రభుత్వం కొట్టిపారేసింది. బిల్లు రాజ్యాంగ విరుద్ధం: విపక్షాలు ప్రస్తుతం అమలవుతున్న ఆర్డినెన్స్ స్థానంలో ఈ నెల 17నే న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టగా, గురువారం సభ పరిశీలనకు వచ్చింది. ఈ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. బిల్లులోని పలు నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని, మరింత అధ్యయనం నిమిత్తం బిల్లును జాయింట్ సెలక్ట్ కమిటీకి పంపాలని విపక్షాలు మూకుమ్మడిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఇలాంటి బిల్లుపై లోక్‌సభ ఇది వరకే చర్చించి ఆమోదం తెలిపిందని, కాబట్టి ఇంకా అభ్యంతరాలేమైనా ఉంటే వాటిని చర్చించాలి కానీ హఠాత్తుగా బిల్లును మరో కమిటీకి పంపాలని కోరొద్దని స్పీకర్ సుమిత్రా మహాజన్ సభ్యులకు సూచించారు. తాజా బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉందని, పలు ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తోందని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం ముస్లిం మహిళల సాధికారత కాదని, ముస్లిం పురుషుల్ని శిక్షించడమేనని మరో కాంగ్రెస్ ఎంపీ సుష్మితా దేవ్ ఎద్దేవా చేశారు. రాజకీయంతో చూడొద్దు: రవిశంకర్ తలాక్ బిల్లుపై రాజకీయాలు చేయొద్దని, ఇది ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని తెచ్చింది కాదని న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం ప్రతిపక్షాలు ఈ బిల్లు ఆమోదం పొందకుండా అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆక్షేపించారు. ‘రాజకీయ కొలమానంలో ఈ బిల్లును చూడొద్దు. ఇది మానవత్వం, సమన్యాయానికి సంబంధించింది’ అని పేర్కొన్నారు. మరింత అధ్యయనం కోసం బిల్లును జాయింట్ సెలక్ట్ కమిటీకి పంపాలన్న విపక్షాల డిమాండ్‌పై స్పందిస్తూ..సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాల్ని ప్రభుత్వం ఇది వరకే పరిశీలించి అందుకు అనుగుణంగా బిల్లులో సవరణలు చేసిందని వెల్లడించారు.2017 జనవరి నుంచి 477 ట్రిపుల్ తలాక్ కేసులు నమోదయ్యాయని, ఓ ప్రొఫెసర్ వాట్సప్‌లో తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పారని గుర్తుచేశారు. ప్రధాని మోదీ ర్యాలీకి హాజరైన భార్యకు వ్యక్తి ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులిచ్చిన దృష్టాంతాలూ ఉన్నాయని గుర్తుచేశారు. ప్రసాద్ వివరణ ముగిసిన వెంటనే కాంగ్రెస్, తృణమూల్, ఏఐఏడీఎంకే, ఆర్జేడీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ఇది తలాక్ 2.0 బిల్లు తొలి తలాక్ బిల్లు గతేడాది డిసెంబర్ 28న లోక్‌సభలో ఆమోదం పొందినా, ప్రతిపక్షాల వ్యతిరేకతతో రాజ్యసభలో పెండింగ్‌లో ఉంది. విపక్షాలు పలు అభ్యంతరాలు లేవనెత్తడంతో కొన్ని సవరణలు చేస్తూ సెప్టెంబర్ 17న ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆ సవరణలు చేరుస్తూ తాజాగా తెచ్చిన బిల్లు ప్రకారం..నిందితులకు బెయిల్ ఇచ్చే వెసులుబాటును కల్పించారు. తలాక్‌ను కాంపౌం డబుల్ నేరంగా ప్రకటించారు. అంటే.. భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిరితే కేసును వెనక్కి తీసుకోవచ్చు. బాధితురాలు, ఆమె దగ్గరి సంబంధీకులు ఫిర్యాదుచేస్తేనే కేసు నమోదు చేస్తారు. ఎప్పుడేం జరిగింది? ► 2016, ఫిబ్రవరి 5: ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహు భార్యత్వంల రాజ్యాంగబద్ధతపై దాఖలైన పిటిషన్ల విచారణలో అప్పటి అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సహకారం కోరిన సుప్రీంకోర్టు. విడాకుల కేసుల్లో ముస్లిం మహిళలు వివక్ష ఎదుర్కొంటున్నారా? అని సందేహించిన కోర్టు ► 2016, జూన్ 29: రాజ్యాంగమే గీటురాయిగా ట్రిపుల్ తలాక్ ఆచారాన్ని పరిశీలిస్తామన్న అత్యున్నత న్యాయస్థానం ► 2016, అక్టోబర్ 7: ట్రిపుల్ తలాక్‌ను వ్యతిరేకిస్తున్నట్లు సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు ► 2017, ఫిబ్రవరి 16: ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వంలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు ఐదుగురు జడ్జీల రాజ్యాంగ బెంచ్ ఏర్పాటు ► 2017, ఏప్రిల్ 16: ట్రిపుల్ తలాక్ అంశాన్ని తొలిసారి లేవనెత్తిన ప్రధాని మోదీ..ముస్లిం మహిళలకు న్యాయం చేస్తామని హామీ ► 2017, ఆగస్టు 22: ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధం, చెల్లుబాటు కాదని 3:2 మెజారిటీతో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ► 2017, డిసెంబర్ 28: ట్రిపుల్ తలాక్ నేరానికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ బిల్లుకు ఆమోదం తెలిపిన లోక్‌సభ ► 2018, ఆగస్టు 10: రాజ్యసభలో తలాక్ బిల్లు. ప్రవేశపెట్టిన కేంద్రం. విపక్షాల వ్యతిరేకతతో లభించని ఆమోదం. ► 2018, సెప్టెంబర్ 19: విపక్షాల సూచనల్ని పరిగణనలోకి తీసుకుని ఆర్డినెన్స్ జారీ ► 2018, డిసెంబర్ 27: సవరించిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం. కీ పాయింట్స్ ► మూడు సార్లు వరుసగా తలాక్ చెప్పడం ద్వారా విడాకులు ఇవ్వడాన్ని శిక్షార్హ నేరమని సంబంధిత బిల్లులో ప్రతిపాదించారు. ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇచ్చేందుకు ప్రయత్నించిన నేరానికిగానూ భర్తకు మూడేళ్ల జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా విధించవచ్చు. బాధిత మహిళకు మెయింటెనెన్స్ ఇవ్వాలనే ప్రతిపాదన కూడా ఉంది. ► తాజా ట్రిపుల్ తలాక్ బిల్లుపై గురువారం మధ్యాహ్నం 2 గంటలకు లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. ఈ చర్చ నాలుగు గంటల పాటు కొనసాగింది. ► ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణించడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. దీనివల్ల మహిళలకే నష్టం కలుగుతుందని వాదించాయి. తలాక్ చెప్పిన భర్తకు జైలు శిక్ష విధించకూడదన్న వాదనను ప్రభుత్వం తోసిపుచ్చింది. నిందితుడిని బెయిల్‌పై విడుదల చేసే అధికారం స్థానిక పోలీసు అధికారికి కాకుండా, మేజిస్ట్రేట్ స్థాయి అధికారికే ఉండాలన్న విజ్ఞప్తినీ ప్రభుత్వం తోసిపుచ్చింది. ► ప్రతిపాదిత చట్టం దుర్వినియోగం అయ్యే అవకాశముందన్న విపక్షాల ఆందోళనలతో.. ప్రభుత్వం ఈ బిల్లులో మూడు సవరణలను ప్రతిపాదించింది. అవి 1. బాధిత మహిళ కానీ, ఆ మహిళ దగ్గరి బంధువు కానీ తక్షణ తలాక్ చెప్పిన భర్తపై పోలీసు కేసు పెట్టాలి. 2. దంపతులిద్దరూ రాజీకి వస్తే ఆ మహిళ కేసును ఉపసంహరించుకోవచ్చు. 3. బాధిత మహిళ వాదన విన్నాకే ఆ భర్తకు బెయిల్ ఇవ్వాలో, వద్దో మేజిస్ట్రేట్ నిర్ణయించాలి. ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హ నేరంగా పరిగణిస్తూ ఈ సెప్టెంబర్‌లో కేంద్రం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. గత సంవత్సరం ఆగస్ట్‌లో ట్రిపుల్ తలాక్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ట్రిపుల్ తలాక్ నిరంకుశ విధానమని, అది ఇస్లామిక్ సంప్రదాయం కాదని, ఇస్లాం మత విధానాల్లో ట్రిపుల్ తలాక్ భాగం కాదని 3–2 మెజారిటీతో అత్యున్నత న్యాయస్థానంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ బిల్లు ప్రమాదకరం విపక్షాలు, హక్కుల కార్యకర్తల ఆందోళన న్యూఢిల్లీ: లోక్‌సభ ఆమోదించిన ‘ట్రిపుల్ తలాక్’ బిల్లుపై ముస్లిం సంస్థలు, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీల నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎక్కువమంది ఈ బిల్లును వ్యతిరేకించగా కొందరు మాత్రమే స్వాగతించారు. ప్రభుత్వ ఉద్దేశం స్పష్టం చేయాలి: ఒవైసీ స్వలింగ సంపర్కం నేరం కాదంటున్న ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ నేరం అని వాదించడం వెనుక గల ఉద్దేశాన్ని వెల్లడి చేయాలని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ట్రిపుల్తలాక్ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఒవైసీ మాట్లాడారు. ‘అక్రమసంబంధాలు నేరం కాదన్నారు. వివాహేతర సంబంధం పెట్టుకోకుండా పురుషులను ఆపే పరిస్థితులు లేవు. అలాంటప్పుడు ట్రిపుల్ తలాక్ మాత్రం నేరమని అంటున్నారు. స్వలింగ సంపర్కం నేరం కానపుడు ట్రిపుల్ తలాక్ నేరం ఎలా అవుతుంది? ఈ బిల్లును ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగానే తీసుకువచ్చింది. రాజ్యాంగంలోని సెక్షన్–377 ప్రకారం లింగపరమైన మైనారిటీలకు హక్కులున్నప్పడు, మతపరమైన మైనారిటీలకు ఎందుకు ఉండవు? మీ విశ్వాసం మీకున్నప్పుడు. మా విశ్వాసం కూడా మాదే అవుతుంది. మీ (ప్రభుత్వం) ఉద్దేశం సరిగా లేదు’ అని అన్నారు. ఎన్నికల దృష్టితో తెచ్చిన బిల్లు: కాంగ్రెస్ వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తలాక్ బిల్లు తెచ్చిందని లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ‘సంబంధిత వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రవేశపెట్టిన ఈ బిల్లులోని అంశాలు రాజ్యాంగానికి, ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నాయి. ట్రిపుల్ తలాక్ బిల్లులో మాదిరి కఠిన నిబంధనలు మరే చట్టంలోనూ లేవు. ఈ బిల్లును ఆమోదించటానికి ముందుగా పార్లమెంట్ జాయింట్ సెలెక్ట్ కమిటీకి పంపి అభిప్రాయం తీసుకోవాలి’ అని కోరారు. నేర పూరితం అనడం తగదు: కారత్ వ్యక్తిగత అంశాన్ని కూడా నేరం అనడం తగదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ అభిప్రాయపడ్డారు. ‘ఏ మతం కూడా ఇలాంటి కారణంపై అరెస్టు చేయాలని చెప్పలేదు. ముస్లిం మహిళల హక్కులను కాపాడటానికి బదులుగా మైనారిటీల్లో విభేదాలను సృష్టించడమే ఈ బిల్లు వెనుక ప్రభుత్వ వాస్తవ ఉద్దేశం. ఈ బిల్లు వల్ల ముస్లిం మహిళలకు మరిన్ని కష్టాలు తప్పవు’ అని ఆమె పేర్కొన్నారు. ఒక్కోమతానికి ఒక్కో చట్టమా? మతాన్ని బట్టి చట్టాలు ఎలా మారుతాయని ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఉమెన్స్ అసోసియేషన్ సెక్రటరీ కవితా కృష్ణన్ ప్రశ్నించారు. ‘భార్యను వదిలివేయడం వంటి చర్యలకు ముస్లిమేతరులు పాల్పడితే నేరం కానప్పుడు, ముస్లింలైతే నేరం ఎందుకు అవుతుంది’ అని అన్నారు. న్యాయ మంత్రి బదులివ్వలేకపోయారు ‘ఈ బిల్లులోని అంశాలపై ప్రతిపక్షాలు అడిగిన అనేక ప్రశ్నలకు న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానాలు చెప్పలేకపోయారు. కుటుంబాలను విచ్ఛిన్నం చేయడమే ప్రభుత్వం ఉద్దేశం’ అని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యురాలు ఆస్మా జెహ్రా ఆరోపించారు. తలాక్‌ను ప్రభుత్వం లేకుండా చేసినప్పుడు ఇంకా చర్చ ఎందుకని ఆల్ ఇండియా ఉలేమా కౌన్సిల్ కార్యదర్శి మౌలానా మహ్మూద్ దర్యాబా దీ ప్రశ్నించారు. తలాక్ చెప్పిన కారణంగా భర్త జైలుకు వెళితే, ఎలాంటి ఆర్థిక ఆసరాలేని అతని భార్య, సంతానం సంక్షేమంపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని ఆయన సూచించారు. ఈ బిల్లును ‘భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్’ సంస్థ సభ్యురాలు స్వాగతించారు. బహుభార్యత్వం, చిన్నారుల సంరక్షణ వంటి అంశాల్లో స్పష్టత తెచ్చేందుకు హిందూ వివాహ చట్టం మాదిరిగా ముస్లిం వివాహ చట్టాన్నీ తేవాలన్నారు. సుప్రీం ఏం చెప్పింది? ముస్లింలు పాటిస్తున్న ట్రిపుల్ తలాక్ (తలాక్ ఏ బిద్దత్) సంప్రదాయం చెల్లదనీ, అది రాజ్యాంగవిరుద్ధమని 2017, ఆగస్టు 22న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 3–2 మెజారిటీతో తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ట్రిపుల్ తలాక్‌ను కొట్టివేసేందుకు అనుకూలంగా జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్ తీర్పు ఇవ్వగా, అప్పటి సీజేఐ జస్టిస్ ఖేహర్, జస్టిస్ అబ్దుల్ నజీర్ మెజారిటీ తీర్పుతో విభేదించారు. ట్రిపుల్ తలాక్‌పై ఆర్నేల్లు నిషేధం విధించాలనీ, ఆలోగా కేంద్ర ప్రభుత్వం ఓ చట్టం తీసుకురావాలని తీర్పు ఇచ్చారు. రాజ్యాంగ ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ చివరికి ట్రిపుల్ తలాక్‌ను కొట్టివేస్తున్నట్లు జస్టిస్ ఖేహర్ 395 పేజీల తీర్పును వెలువరించారు. ఈ సందర్భంగా జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నారిమన్, జస్టిస్ యు.యు.లలిత్ మెజారిటీ తీర్పును వెలువరిస్తూ..‘ట్రిపుల్ తలాక్ ఆచారంలో భాగమైనప్పటికీ అది లోపభూయిష్టమైనది. పునరాలోచనకు ఆస్కారం లేకుండా వెనువెంటనే చెప్పేసే ట్రిపుల్ తలాక్ కారణంగా వివాహబంధాలు విచ్ఛిన్నం అవుతాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14(సమానత్వపు హక్కు)ను ఇది ఉల్లంఘించడమే’ అని ముగ్గురు జడ్జీలు మెజారిటీ తీర్పు ఇచ్చారు. ‘తమకు న్యాయం చేయాలంటూ ముస్లిం మహిళలు న్యాయస్థానం మెట్లు ఎక్కితే చేతులు ముడుచుకుని కూర్చోవడం కోర్టులకు సాధ్యం కాదు. తలాక్ ఎ బిద్దత్ సహా మూడు రకాల విడాకులను ముస్లిం పర్సనల్ అప్లికేషన్ చట్టం–1937లో చేర్చడంతో పాటు గుర్తింపునిచ్చారు. షరియా చట్టంలో చేర్చినంత మాత్రాన అది ప్రాథమిక హక్కులకు అతీతమైనదేమీ కాదు. రాజ్యాంగరచన కంటే ముందు లేదా తర్వాత రూపొందిన ఏ చట్టమైనా సరే ప్రాథమిక హక్కులను ఉల్లంఘించకూడదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 13(1) చెబుతోంది. ముస్లిం పురుషుడు ఇష్టానుసారం, జవాబుదారీతనం లేకుండా ఏకపక్షంగా తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు తలాక్ ఆస్కారం కల్పిస్తోంది’ అని తన తీర్పులో జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్ పేర్కొన్నారు. తలాక్ బిల్లుకు సంబంధించి లోక్‌సభ డిస్ప్లే బోర్డుపై కనిపిస్తున్న ఓట్లు లోక్‌సభలో బిల్లుపై మాట్లాడుతున్న రవిశంకర్ ప్రసాద్, మల్లికార్జున్ ఖర్గే, అసదుద్దీన్ ఒవైసీ -
‘ట్రిపుల్ తలాక్’కు మేం వ్యతిరేకం!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పార్లమెంటులో ట్రిపుల్ తలాక్ బిల్లును టీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ముస్లి మహిళల (వివాహ హక్కు రక్షణ) బిల్లు – 2018పై చర్చ సందర్భంగా టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి కేంద్రం తీరుపై మండిపడ్డారు. ఈ సమయంలో ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టడం వెనక ప్రభుత్వ ఉద్దేశమేంటని ఆయన ప్రశ్నించారు. ముస్లిం మహిళల హక్కులను కాపాడే విషయంలో ఈ బిల్లు నిరంకుశంగా ఉందని జితేందర్ రెడ్డి విమర్శించారు. మైనారిటీల విశ్వాసాన్ని వమ్ముచేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 14, ఆర్టికల్ 21లను ఉల్లంఘించేదిగా ఉందన్నారు. మత విశ్వాసాలను రాజ్యాంగ పరిధిలో విచారించడం న్యాయస్థానాల పని అని.. ఇకనైనా ఎన్డీయే ప్రభుత్వం మైనారిటీల విశ్వాసాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలని హితవు ఆయన పలికారు. లింగసమానతల విషయంలో టీఆర్ఎస్, పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టతతో ఉన్నామని.. అయితే, ముస్లిం ల పురుషులకు మూడేళ్ల పా టు జైలుశిక్ష విధించాలన్న నిబంధనకు టీఆర్ఎస్ పూర్తి వ్యతిరేకమని పేర్కొన్నారు. కేబుల్ ఆపరేటర్ల డిమాండ్లపై.. మహబూబ్‌నగర్ కేబుల్ ఆపరేటర్స్ సంఘం చేసిన డిమాండ్లను కేంద్రం తక్షణమే పరిష్కరించాలని సమాచార, ప్రసారశాఖ మంత్రిని జితేందర్‌రెడ్డి కోరారు. ఎంపిక చేసుకున్న చానెళ్లకే డబ్బులు చెల్లించాలన్న ట్రాయ్ నిబంధన ద్వారా కేబుల్ ఆపరేటర్లకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఆపరేటర్లు చానళ్ల ప్రసారాల విషయంలో పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టినందున వారి సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు. ప్రసార కంపెనీలలబ్ధికే ట్రాయ్ కొత్త నిబంధనలు తీసుకొచ్చిందని, వీటి ద్వారా కేబుల్ ఆపరేటర్లకు, వినియోగదారులకు లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుందన్నారు. టీవీ ప్రసార పరిశ్రమలో ఏకఛత్రాధిపత్యాన్ని తగ్గించేలా మంత్రి చొరవతీసుకోవాలని డిమాండ్ చేశారు. -
‘ఆ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలి’
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ తాజా బిల్లును సెలెక్ట్ కమిటీకి నివేదించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బిల్లుపై గురువారం మధ్యాహ్నం లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా పాలక, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో సభలో గందరగోళం నెలకొంది. ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు తీసుకోవడంతో ముస్లిం మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ప్రభుత్వం పేర్కొనగా మతపరమైన అంశాల్లో జోక్యం తగదని కాంగ్రెస్ నేతృత్వంలో తృణమూల్, ఎన్సీపీ, ఆప్, ఎంఐఎంలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెడుతూ దీన్ని రాజకీయ కోణంలో చూడరాదని, మానవతా దృక్పథంతో పరిశీలించాలని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్‌ను 20 ఇస్లామిక్ దేశాలు నిషేధించగా, భారత్ వంటి లౌకిక దేశాల్లో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. ఎవరైనా కట్నం డిమాండ్ చేయడం, మహిళలను వేధించడం చేస్తే వారి అరెస్ట్‌లకు అనుమతించే పార్లమెంట్ ట్రిపుల్ తలాక్‌ను ఎందుకు వ్యతిరేకించదని అన్నారు. ఈ బిల్లు ఏ మతం, వర్గం విశ్వాసాలను దెబ్బతీయదని స్పష్టం చేశారు. ఈ బిల్లు చాలా కీలకమని, దీనిపై లోతైన అథ్యయనం అవసరమని ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు. బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపాలని ఆయన కోరారు. తృణమూల్ సభ్యుడు సుదీప్ బందోపాధ్యాయ సైతం ఖర్గే వాదనతో ఏకీభవించారు. -
లోక్‌సభ ముందుకు ట్రిపుల్ తలాక్ తాజా బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్‌పై తాజా బిల్లును ప్రభుత్వం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధమని ఈ ఏడాది సెప్టెంబర్‌లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకవచ్చిన సంగతి తెలిసిందే. ఆర్డినెన్స్‌ను ఆరునెలల్లోగా బిల్లు రూపంలో తీసుకురావాల్సిన క్రమంలో పార్లమెంట్లో ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టనుంది. మోదీ ప్రభుత్వం గతంలో ట్రిపుల్ తలాక్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టగా బిల్లును లోక్‌సభ ఆమోదించగా, ఎన్డీఏకు మెజారిటీ లేని రాజ్యసభలో బిల్లుపై గందరగోళం చెలరేగింది. దీనిపై పాలక, విపక్షాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన వీడలేదు. దీంతో ట్రిపుల్ తలాక్‌పై తాజా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే క్రమంలో గురువారం బిల్లును ప్రభుత్వం లోక్‌సభ ముందుంచనుంది. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు విస్పష్టంగా వెల్లడించినా ఈ పద్ధతిలో విడాకులు ఇవ్వడం కొనసాగుతోందని తాజా బిల్లుపై మాట్లాడుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. మరోవైపు 430 ట్రిపుల్ తలాక్ ఘటనలు మీడియా ద్వారా వెలుగులోకి వచ్చాయని శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. వీటిలో 201 ట్రిపుల్ తలాక్ ఘటనలు సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన అనంతరం చోటుచేసుకున్నవి కావడం గమనార్హం. -
వాట్సాప్‌లో ట్రిపుల్ తలాఖ్
హైదరాబాద్: అదనపు కట్నం కోసం వేధించడమే కాక ఆడపిల్ల పుట్టిందని ఓ మాస్టారు వాట్సాప్ కాల్లో ట్రిపుల్ తలాఖ్ చెప్పిన ఉదంతమిది. కాళ్లవేళ్ల పడి బతిమిలాడినా భర్త వినకపోవడంతో పాఠశాల ముందు బాధితురాలు «ధర్నాకు పూనుకుంది. వివరాలు... హైదరాబాద్ టోలీచౌకీ ఎండీ లైన్స్‌లో నివాసముండే మొహమ్మద్ ముజామిల్ (29), యూసుఫ్‌గూడకు చెందిన సుమయ్యబాను దంపతులు. గతేడాది జనవరి 6న వీరి వివాహం జరిగింది. వివాహ సమయంలో 10 లక్షల కట్నకానుకలు ముట్టజెప్పారు. అదనపు కట్నం కోసం వేధింపులు.. వివాహం జరిగిన నెల తర్వాత సుమయ్యబానును అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. భర్త కూడా తల్లిదండ్రులకు వత్తాసు పలుకుతూ ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించసాగాడు. గతేడాది ఫిబ్రవరి 20న ముజామిల్ దంపతులకు కుమార్తె జన్మించింది. ఇంటికి వెళితే దాడులు.. సెప్టెంబర్‌లో ఆమె తన పాపతో కలసి టోలిచౌకీలోని అత్తారింటికి వెళ్లింది. అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధించడమే కాక ఆడపిల్ల పుట్టిందని సూటిపోటీ మాటలనేవారు. కడుపు నిండా తిననివ్వకుండా ఆమె మీద భౌతికంగా దాడి చేయసాగారు. పాలు అందక పాప ఆరోగ్యం క్షీణించడంతో ఆమె తల్లిదండ్రులు నవంబర్ 11న వచ్చి తల్లిపిల్లను తీసుకెళ్లి ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ట్రిపుల్ తలాఖ్ అంటూ విడాకులు.. భర్త, అత్తామామలు, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన మరిది కూడా కట్నంకోసం వేధిస్తుండటంతో నవంబర్ 23న బాధితురాలు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో భర్త, అత్తమామ, మరిదిలపై కేసు నమోదు చేశారు. దీంతో ఆగ్రహించిన ముజామిల్ నవంబర్ 28న ఆమెకు వాట్సాప్ కాల్ చేసి ట్రిపుల్ తలాఖ్ చెప్పాడు. పాపను చూసిన పాపాన పోలేదు: సుమయ్యబాను న్యాయం కావాలంటూ బాధితురాలు సుమయ్యబాను తన భర్త నిర్వహిస్తున్న పాఠశాల వద్ద సోదరుడు ఆదిల్‌ఖాన్‌తో కలసి ధర్నా చేసింది. అత్తింటివారు ఏనాడూ తన పాపను చూసిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ట్రిపుల్ తలాఖ్ చెప్పిన తన భర్తలో మార్పు వస్తుందనే ఆశతో రోజూ ఫోన్ చేసి ప్రా«ధేయపడ్డానని చెప్పింది. తన భర్తకు వేరొకరితో ఉన్న అక్రమ సంబంధం గురించి నిలదీసిన నాటి నుంచి వేధింపులు మొదలయ్యాయని ఆమె తెలిపింది. -
వాట్సాప్ కాల్లో ట్రిపుల్ తలాక్
-
‘తలాక్..తలాక్..తలాక్’ ఫోన్ కట్
సాక్షి, హైదరాబాద్ : వాట్సాప్ కాల్ చేసి భార్యకు త్రిపుల్ తలాఖ్ చెప్పాడో భర్త. తమ వివాహబంధం నేటితో ముగిసిపోయిందంటూ ఫోన్ పెట్టేశాడు. నివ్వెరపోయిన బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగింది. వివరాలు.. యూసుఫ్ గూడకు చెందిన సమియాభానుకు టోలిచౌకికి చెందిన మహ్మద్ మెజిమిల్ షరీఫ్‌తో రెండేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన కొంతకాలం పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఓ పాప జన్మించిన తర్వాత కలతలు మొదలయ్యాయి. సమియాను వదిలించుకుని షరీఫ్ మరో పెళ్లి చేసుకోవాలన్నాడు. నిత్యం వేధింపులకు గురిచేయడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. టోలిచౌకిలోని ఎం.డి.లైన్స్‌లో గల జెమ్స్ హైస్కూల్లో ప్రిన్సిపల్‌గా పనిచేసే షరీఫ్ నుంచి సమియాకు ఓ రోజు ఫోన్ కాల్ వచ్చింది. భర్త మనస్సు మారిందని భావించిన ఈ ఇల్లాలు సంబరపడిపోతూ ఫోన్ రిసీవ్ చేసుకుంది. అంతలోనే పిడుగులాంటి వార్త. ‘ఇక నుంచి నీకు, నాకు ఏ సంబంధం లేదు.. తలాఖ్, తలాఖ్, తలాఖ్’ అంటూ షరీఫ్ ఫోన్ పెట్టేశాడు. ఊహించని పరిణామంతో నిర్ఘాంతపోయిన ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు దర్నాకు దిగింది. భర్త పనిచేసే పాఠశాల ఎదుట కూడా సమియా ఆందోళనకు దిగడంతో అక్కడి నుంచి పరారయ్యాడు షరీఫ్. తనలా మరో ఆడపిల్ల జీవితం అన్యాయం కాకుండా కాపాడాలని సమియా కోరుతోంది. చట్టరిత్యా ట్రిబుల్ తలాక్ చెల్లదని.. అతనిపై వరకట్న వేధింపులకు సంబంధించి ఐపీసీ 498 ఏ, 406, 506, డీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. షరీఫ్ కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. -
కట్నం ఇవ్వలేదని ఫోన్లోనే తలాక్..
లక్నో : ఫోన్లో భార్యకు ట్రిపుల్ తలాక్ ఇచ్చిన యూపీకి చెందిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కట్నం ఇవ్వలేదని తన కుమార్తెను ఆడపడుచులు, అత్తింటి వారు సూటిపోటి మాటలతో వేధిస్తున్నారని, సౌదీ అరేబియాలో నివసించే తన అల్లుడు ఫోన్ ద్వారా తన కుమార్తెకు విడాకులు ఇచ్చాడని బాధితురాలి తల్లి ఆరోపించారు. అత్తింటి వేధింపులతో విసిగిపోయిన తన కుమార్తెను పుట్టింటికి తీసుకువచ్చామని, అయినా వారు కట్నం తీసుకురావాలని వేధిస్తన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సౌదీ నుంచి తమ అల్లుడు తన కుమార్తెకు ఫోన్లో తలాక్ చెప్పాడని తమకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని బాధితురాలి తల్లి రేష్మా డిమాండ్ చేశారు. ఎనిమిది నెలల కిందట తనకు వివాహమైందని, కట్నం కింద రూ 50 వేల నగదు, మోటార్ బైక్ తీసుకురావాలని తన అత్త తనను కొడుతోందని బాధితురాలు నూరి వాపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం నిందితులపై చర్య తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
‘ఈ ఆర్డినెన్స్‌తో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు’
సాక్షి, హైదరాబాద్ : ‘ట్రిపుల్ తలాక్’ను నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకరావడం పట్ల ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ కోర్టుకు వెళ్తామంటూ గురువారం ప్రకటించింది. పార్లమెంటు ఆమోదం పొందకుండానే ఆర్డినెన్స్ తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వ్యాఖ్యానించింది. చట్టసభలను గౌరవించకుండా కేంద్రం నిరంకుశంగా వ్యవహరించిందంటూ లా బోర్డు విమర్శించింది. దొడ్డిదారిన ఎందుకు తెచ్చారు? ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు జనరల్ సెక్రటరీ మౌలానా ఖలీద్ సైఫ్ ఉల్లా రహ్మానీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం దొడ్డి దారిన ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ తీసుకువచ్చిందని ఆరోపించారు. అసలు ముస్లిం వర్గాల అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా ఎలా వ్యవహరిస్తారంటూ ప్రశ్నించారు. ముస్లిం మహిళలకు హాని కలిగించే విధంగా ఉన్న ఆర్డినెన్స్‌ను సుప్రీం కోర్టులో సవాలు చేసే అంశంపై తమ లీగల్ కమిటీ చర్చిస్తోందని తెలిపారు. వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే : అసదుద్దీన్ ఒవైసీ ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ ఓ నాటకమని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. రఫెల్ డీల్, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ ఉదంతాలు, పెరుగుతున్న ఇంధన ధరల గురించి ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుందనే భయంతో బీజేపీ ఇటువంటి నాటకాలు ఆడుతోందని విమర్శించారు. కాగా ‘ట్రిపుల్ తలాక్’ను నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం గత బుధవారం ఆర్డినెన్స్ తీసుకు వచ్చింది. ఈ ఆర్డినెన్స్‌ను ఆమోదిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేశారు. ఏకాభిప్రాయం కుదరని కారణంగానే ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ తీసుకువచ్చామని న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వివరించారు. లోక్‌సభలో ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభలో మాత్రం ఈ బిల్లు ఆమోదం పొందలేదు. -
హడావుడి ఆర్డినెన్స్!
తక్షణ తలాక్ విధానం ద్వారా విడాకులివ్వడాన్ని నిషేధిస్తూ, దాన్ని నేరపూరిత చర్యగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. తక్షణ తలాక్ రాజ్యాంగ విరుద్ధమంటూ నిరుడు ఆగస్టులో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించాక కేంద్రం ఈ విషయంలో పట్టుదలగా వ్యవహరిస్తోంది. నిరుడు డిసెంబర్లో కేంద్ర మంత్రివర్గం దీనికి సంబంధించిన బిల్లును ఆమోదించింది. అనంతరం ఆ బిల్లుకు లోక్‌సభ ఆమోదాన్ని పొందింది. ప్రతిపక్షాల ఆధిక్యత ఉన్న రాజ్యసభలో దీనికి అవాంతరాలు ఎదురయ్యాయి. అక్కడా, వెలుపలా వ్యక్తమైన అభిప్రాయాల్లో కొన్నిటికి చోటిచ్చి తాజా ఆర్డినెన్స్ రూపొందించారు. దానికి బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెల్పడం, ఆ వెంటనే రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం చకచకా పూర్తయ్యాయి. ఈ దురాచారం ముస్లింలలో ప్రబలంగా లేదు. దాన్ని ఆచరించేవారి సంఖ్య స్వల్పం. అయితే బాధి తుల సంఖ్యతో నిమిత్తం లేకుండా అన్యాయం జరుగుతున్నదనుకుంటే దాన్ని చక్కదిద్దవలసిందే. ఆ విషయంలో రెండో మాటకు తావులేదు. పార్లమెంటు శీతాకాల సమావేశాల తేదీలు ఇంకా ఖరారు కాకపోయినా అవి డిసెంబర్లో ఉండే అవకాశం ఉంది. ఆ సమావేశాల వరకూ ఆగి బిల్లు ప్రవేశపెడితే... దాని ఆమోదానికి, ఆ తర్వాత చట్టంగా రూపొందడానికి మరో అయిదారు మాసాలు పడుతుంది. కనుక ఆర్డినెన్స్ తప్పనిసరైందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ చెబుతున్నారు. దానికి మద్దతుగా కొన్ని గణాంకాలు కూడా ఆయన ఏకరువు పెట్టారు. నిరుడు జనవరి మొదలుకొని ఈ నెల వరకూ దేశవ్యాప్తంగా 430 తక్షణ తలాక్ ఉదంతాలు చోటు చేసుకున్నాయని ఆయన వివరించారు. ఇందులో సర్వోన్నత న్యాయస్థానం తీర్పునివ్వకముందు 229, ఇచ్చాక 201 జరిగాయి. తక్షణ తలాక్ ఆచరణ మన దేశంలో ఎంత స్వల్పమో ఈ లెక్కలే చెబు తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో ముస్లింలు 14.23 శాతం. అంటే దాదాపు 17 కోట్ల 23 లక్షలు. అయితే గతంలో రాజ్యసభలో ఈ బిల్లుకు ఎదురైన అవాంతరాలకు గల కారణాలనుగానీ, ముస్లిం వర్గాల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలనుగానీ తాజా ఆర్డినెన్స్ పరిగణనలోకి తీసు కున్నట్టు కనబడదు. కనీసం ఆర్డినెన్స్ తీసుకొచ్చే ముందైనా ఆయా వర్గాలతో, మరీ ముఖ్యంగా ముస్లిం మహిళలతో కేంద్రం మరోసారి మాట్లాడితే బాగుండేది. ఎందుకంటే తక్షణ తలాక్ విధానం పోవాలని కోరుకునేవారు సైతం కొన్ని నిబంధనల విషయంలో అభ్యంతరం చెబుతున్నారు. లోక్‌సభ ఆమోదం పొందిన బిల్లు తక్షణ తలాక్ చెప్పటం దానికదే శిక్షార్హమైన నేరంగా పరిగణించి అందుకు మూడేళ్ల వరకూ జైలుశిక్ష, జరిమానా విధించవచ్చునని ప్రతిపాదించింది. ఇప్పుడు ఆ నిబంధనను స్వల్పంగా సవరించి భార్య లేదా ఆమె తరఫు రక్త సంబంధీకులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నిర్దేశించారు. దీన్ని రాజీకి వీలైన నేరంగా కూడా మార్చారు. అంటే ఇరుపక్షాలూ ఏకాభిప్రాయానికొచ్చి కేసును ఉపసంహరించుకోవచ్చు. అలాగే ఇది నాన్‌బెయిలబుల్ కేసు అయినా, విచారణ సమయంలో బెయిల్ పొందేందుకు వీలు కల్పించారు. గతంతో పోలిస్తే ఇవి మెరుగైన మార్పులే. అయితే లోగడ బిల్లును వ్యతిరేకించినవారు కోరింది ఇవి మాత్రమే కాదు. అసలు తక్షణ తలాక్ చెప్పడాన్ని నేరంగా పరిగణించే విధానమే రద్దు కావాలని వారు డిమాండ్ చేశారు. ఇందులో అహేతుకత ఏమీ లేదు. తక్షణ తలాక్ చెల్లదని సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే చెప్పింది గనుక లేని హక్కును చలాయించటం భర్తకు అసాధ్యం. ఒకవేళ గెంటేస్తే దాంపత్య హక్కుల్ని పరిరక్షించుకోవటానికి ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించొచ్చు. తలాక్ చట్టవిరుద్ధం గనుక ఆ పెళ్లి రద్దు కాలేదని న్యాయ స్థానం స్పష్టం చేస్తుంది. ఈ విషయంలో భర్త ఆమె హక్కులు కాలరాయాలని చూస్తే గృహహింస చట్టం కింద ఆమె కేసు పెట్టొచ్చు. సుప్రీంకోర్టు సైతం తక్షణ తలాక్ చెల్లదని చెప్పింది తప్ప, దాన్ని శిక్షార్హమైన నేరంగా పేర్కొనలేదు. భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు వచ్చినప్పుడు, అవి తీవ్రరూపం ధరించినప్పుడు విడాకుల వరకూ వెళ్తుంది. అయితే ఇతర మతస్తుల విషయంలో దాన్ని నేరపూరిత చర్యగా పరిగణించనప్పుడు ముస్లింలకు వేరే విధమైన నిబంధన ఎందుకు? ఇది తమ పట్ల చూపిస్తున్న వివక్షలో భాగమని వారనుకునే అవకాశం లేదా? ఆవేశం అవధులు దాటినప్పుడు భార్య లేదా ఆమె తరఫు బంధువులు కేసు పెట్టి తక్షణ తలాక్ చెప్పిన వ్యక్తిని అరెస్టు చేయిస్తే రాజీకి దారులు మూసుకుపోయే ప్రమాదం ఉంటుంది. భర్త నుంచి విడిపోయిన మహిళకు వెనువెంటనే కావాల్సింది భరణం. ఆమె, ఆమెతో ఉండే సంతానం జీవించడానికి అవసరమైన జీవనభృతి జైలు పాలైన భర్త సమకూర్చగలుగుతాడా? అలాంటి సందర్భాల్లో ఆమె మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించవచ్చునని ఆర్డినెన్స్ చెబుతోంది. కానీ ఆ జీవనభృతి ఇచ్చేదెవరో, ఎలా లెక్కేస్తారో ఈ ఆర్డినెన్స్‌లో లేదు. మారే కాలానికి అనుగుణంగా ఎవరైనా మారక తప్పదు. పౌర హక్కుల భావన లేనికాలంలో మహిళలకు అన్యాయం చేసే పలు సంప్రదాయాలు, విధానాలు అమల్లోకి వచ్చాయి. ప్రపం చంలోని అన్ని మతాల్లోనూ ఈ ధోరణులు కనిపిస్తాయి. ప్రతి మతం లోని పెద్దలూ ఎప్పటికప్పుడు ఈ అంశాలపై దృష్టి పెట్టి కాలం చెల్లిన విధానాలకు స్వస్తి పలకటం అవసరం. అదే సమయంలో ముస్లింల విషయంలో ఏకపక్షంగా, వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శ రాకుండా చూసుకోవటం ప్రభుత్వం బాధ్యత. డిసెంబర్‌లోగా జరగబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఆదరా బాదరాగా ఆర్డినెన్స్ తెచ్చిందని ఇప్పటికే కాంగ్రెస్ తదితర పక్షాలు ఆరోపించాయి. ఎవరినీ సంప్రదించకుండా, ఇప్పటికే వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకోకుండానే ఆర్డినెన్స్ జారీ చేసి ఆ విమర్శలను కేంద్రం నిజం చేసింది. -
‘ట్రిపుల్ తలాక్‌పై ఖేదం, మోదం
సాక్షి, న్యూఢిల్లీ : ‘ట్రిపుల్ తలాక్’ను నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు ఆర్డినెన్స్‌ను తీసుకరావడం పట్ల ముస్లింలు, మహిళా హక్కుల కార్యకర్తల్లో కొందరు ఆనందాన్ని వ్యక్తం చేయగా, కొందర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ ముస్లిం వ్యక్తి ఏ రకంగానైనా భార్యకు మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులు ఇచ్చేందుకు ప్రయత్నించినట్లయితే అతనికి మూడేళ్ల వరకు శిక్ష విధించేలా కేంద్రం ఈ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. 2017, డిసెంబర్లో లోక్‌సభ ఆమోదించిన ‘ముస్లిం మహిళల పెళ్లి హక్కుల పరిరక్షణ బిల్లు’ స్థానంలో ఈ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చారు. లోక్‌సభ ఆమోదించిన ఈ బిల్లులో పలు మార్పులు, చేర్పులు చేయాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు పట్టు పట్టడంతో నాడు రాజ్యసభలో సంపూర్త బలంలేని బీజేపీ ప్రభుత్వం ఆ సభలో బిల్లును ప్రవేశపెట్టలేక పోయింది. చివరకు కేంద్ర కేబినెట్ ప్రతిపక్షాలతోపాటు, పలు ముస్లిం సంస్థలు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకొని ఆగస్టు 9వ తేదీన బిల్లులోని కొన్ని సవరణలను తీసుకొచ్చింది. ఆ మరుసటి రోజే ఆ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ప్రతిపక్షాలు బిల్లులో చేసిన సవరణలను పరిగణలోకి తీసుకోకుండా గుడ్డిగా సభా కార్యక్రమాలను స్తంభింపచేయడంతో బిల్లును శీతాకాల పార్లమెంట్ సమావేశాల వరకు వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో బిల్లు స్థానంలో కేంద్ర కేబినెట్ ట్రిపుల్ తలాక్‌పై ఆర్డినెన్స్‌ను తీసుకరావాల్సి వచ్చింది. ఈ ఆర్డినెన్స్ పట్ల ముస్లింలో ఓ వర్గం హర్షం వ్యక్తం చేస్తుండగా, మరో వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హమైన నేరంగా పరిగణించరాదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వర్గం వాదిస్తోంది. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని 2017, అక్టోబర్ నెలలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కొన్ని దశాబ్దాలుగా దీనిపై వివాదం కొనసాగుతోంది. ట్రిపుల్ తలాక్‌లు చెల్లవని కోర్టులు తీర్పులు ఇచ్చిన సందర్భాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. షమీమ్ ఆరా వర్సెస్ ఉత్తర ప్రభుత్వం మధ్య కొనసాగిన కేసులో ట్రిపుల్ తలాక్ చెల్లదని 2002లోనే సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. 2017, ఫిబ్రవరి నెలలో ట్రిపుల్ తలాక్, బహు భార్యత్వం, నిఖా హలాలా (భర్త నుంచి విడిపోయి మళ్లి కలుసుకోవాలంటో మరో వ్యక్తినిపెళ్లి చేసుకొని విడాకులు తీసుకోవడం)ను వ్యతిరేకిస్తూ ట్రిపుల్ తలాక్ బాధితురాలు షయారా బానో, పలువురు ముస్లిం మహిళలు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేయడంతో వ్యవహారం ఇంతవరకు వచ్చింది. ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హమైన నాన్‌బెయిలబుల్ నేరంగా పరిగణిస్తూ, మూడేళ్ల వరకు జైలు, జరిమానా విధించేలా తొలుత బీజేపీ ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది. ఫలానా వ్యక్తి ట్రిపుల్ తలాక్ చెప్పాడంటూ ఎవరైన పోలీసు ఫిర్యాదు ఇచ్చేలా ఆ బిల్లును రూపొందించారు. ఈ బిల్లు వల్ల ముస్లిం మహిళలు నష్టపోయే అవకాశం ఉందంటూ ప్రతిపక్షాలు, పలు సంస్థలు గొడవ చేయడంతో కేంద్రం భార్య, లేదా అమె సమీప బంధువలు మాత్రమే ట్రిపుల్ తలాక్‌పై ఫిర్యాదు ఇచ్చేలా సవరణ తీసుకొచ్చింది. ట్రిపుల్ తలాక్ కేసుల్లో భార్యను విచారించి హేతుబద్ధంగా భర్తకు మేజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చేలా మరో మార్పు చేయడంతోపాటు, భార్యా భర్తలు అవసరమైతే రాజీకి వచ్చేందుకు కూడా వీలు కల్పిస్తూ ముఖ్యమన సవరణకు చేర్చారు. ఆర్డినెన్స్‌ను భారతీయ ముస్లిం మైనారిటీ ఆందోళన్ సంస్థ పూర్తిగా సమర్థించింది. సవరణలను కూడా స్వాగతించింది. ఆర్దినెన్స్ పట్ల అసంతృప్తి ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ పట్ల ప్రతిపక్ష పార్టీలతోపాటు కొన్ని మానవ హక్కుల సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ‘ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించడానికి, అది శిక్షార్హమైన నేరంగా పరిగణించడానికి ఎంతో తేడా ఉంది. ముస్లిం మహిళల పేరిట ముస్లిం పురుషులను వేధించేందుకు ఈ ఆర్డినెన్స్ ఉపయోగపడుతుంది’ అని ‘బెబాక్ కలెక్టివ్’ అనే మానవ హక్కుల సంఘం వ్యవస్థాపకులు హసీనా ఖాన్ వ్యాఖ్యానించారు. ట్రిపుల్ తలాక్‌కు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించడానికి బదులుగా గృహ హింస నేరంగా పరిగణించి గృహ హింస చట్టం కింద విచారించేలా ఉంటే బాగుంటుందని మానవ హక్కుల కార్యకర్త జావెద్ ఆనంద్ అభిప్రాయపడ్డారు. ట్రిపుల్ తలాక్ ఇస్తే భర్త నుంచి భరణం కోరే హక్కును కూడా కల్పించారుగానీ, జైల్లో ఉండే భర్త ఎలా భార్యకు భరణం చెల్లించగలరని ఆయన ప్రశ్నించారు. మెజారిటీ ముస్లింలలో మగవాళ్లు పనిచేస్తేగానీ కుటుంబం గడవదన్న విషయం తెల్సిందే. -
ఆర్డినెన్స్‌తో న్యాయం జరగదు: ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: ట్రిఫుల్ తలాక్ ఆర్డినెన్స్‌తో ముస్లిం మహిళలకు న్యాయం జరగదని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. కేంద్ర మంత్రి వర్గం ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడంపై మండిపడ్డారు. బుధవారం మజ్లిస్ పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంలో విలేకరులతో మాట్లాడారు. ముస్లిం మహిళలకు ఆర్డినెన్స్ వ్యతిరేకమని, దానితో మరింత అన్యాయం జరిగే అవకాశమే ఉంటుందని అన్నారు. ఇస్లాంలో వివాహం అనేది ఓ సివిల్ కాంట్రాక్ట్ అని, ఇందులో ప్యానెల్ ప్రొవిజన్లు తీసుకురావడం తప్పని పేర్కొన్నారు. ఈ ఆర్డినెన్స్ రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. రాజ్యాంగం పేర్కొంటున్న సమాన హక్కుల విషయాన్ని ముస్లింలకే వర్తింపజేయడం రాజ్యంగ విరుద్ధమే అవుతుందన్నారు. ట్రిపుల్ తలాక్ కారణంగా కేసు నమోదైతే మహిళలకు అండగా నిలబడేది ఎవరని ప్రశ్నించారు. కేసుకు గురైన వ్యక్తి జైలుకు వెళ్తూనే భరణం ఎలా చెల్లిస్తారని, శిక్ష పూర్తయి బయటికి వచ్చేవరకు మహిళ చిక్కుల్లో పడాల్సిందేనా అని ప్రశ్నించారు. ముస్లిం మహిళలను ఇక్కట్ల పాల్జేసేందుకు మోదీ సర్కార్ ఈ ఆర్డినెన్స్ తీసుకువస్తోందన్నారు. దీనిపై ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, మహిళా సంస్థలు సవాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కోర్టుకు వెళ్తే ఆర్డినెన్స్ నిలబడదన్నారు.