
అహ్మదాబాద్ : రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం తెలిపి ఒక్కరోజు గడవకుండానే ఓ భర్త తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన ఘటన బుధవారం అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. ఈ సంఘటనతో భాదితురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తేలింది . ప్రసుతం సదరు యువతి అహ్మదాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. తలాక్ చెప్పిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
కాగా మంగళవారం ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) పేరిట తెచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లును కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఎన్డీయేలో భాగమైన జేడీయూ, అన్నాడీఎంకే పార్టీలు వ్యతిరేకించినప్పటికీ, బీజేడీ మద్దతు తెలపడంతో బిల్లు గట్టెక్కింది. ఇక రాష్ట్రపతి బిల్లుపై సంతకం చేస్తే తక్షణమే ట్రిపుల్ తలాక్ బిల్లు చట్టరూపం దాల్చుతుంది. ఇప్పటి నుంచి ట్రిపుల్ తలాక్ చెప్పినవారికి మూడేళ్ల జైలు శిక్ష అమలవుతుందని బిల్లులో పేర్కొంది. కేంద్రం గతంలో ఫిబ్రవరి 21న ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్ స్థానంలో ట్రిపుల్ తలాక్ బిల్లు అమల్లోకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment