ahmedabad
-
అనుమతి లేకుండా యాంజియోప్లాస్టీ.. ఇద్దరు మృతి
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోరం చోటుచేసుకుంది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుని నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు మృతి చెందారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఆ వైద్యుడు అనుమతి లేకుండా ఏడుగురు బాధితులకు యాంజియోప్లాస్టీ నిర్వహించాడు. వీరిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఐదుగురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.మీడియాకు అందిన వివరాల ప్రకారం నవంబర్ 10న గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించింది. దీనికి 19 మంది బాధితులు హాజరయ్యారు. వీరిలో 17 మంది రోగులకు వైద్యులు యాంజియోగ్రఫీ చేశారు. ఏడుగురికి యాంజియోప్లాస్టీ చేశారు. ఈ విషయాన్ని బాధితుల కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయలేదు. చికిత్స అనంతరం బాధితుల ఆరోగ్యం దిగజారింది. ఈ నేపధ్యంలో మహేశ్ గిర్ధర్ భాయ్ బరోట్, నగర్ సేన్మా అనే బాధితులు మృతిచెందారు.విషయం తెలుసుకున్న బాధితుల గ్రామస్తులు ఆస్పత్రిని ధ్వంసం చేశారు. ఘటన అనంతరం ఆస్పత్రి యాజమాన్యం పరారయ్యింది. ఆసుపత్రి డైరెక్టర్, చైర్మన్ కూడా పరారయ్యారని సమాచారం. కాగా ఆయుష్మాన్ భారత్-ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (పీఎంజేఏవై) సొమ్మును దక్కించుకునేందుకు ఈ ప్రైవేట్ ఆసుపత్రి.. బాధితుల అంగీకారం తీసుకోకుండా ఈ విధంగా వ్యవహరిస్తున్నదని బాధిత కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు.ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన గుజరాత్ మెడికల్ కౌన్సిల్ అహ్మదాబాద్‌లోని ఖ్యాతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి నోటీసులు పంపింది. ఈ ఘటనపై ఆస్పత్రి సీఈవో సహా ఐదుగురి నుంచి జీఎంసీ సమాధానాలు కోరింది. యాంజియోగ్రఫీ, యాంజియోప్లాస్టీ గురించి బాధిత కుటుంబ సభ్యులకు ఎందుకు తెలియజేయలేదని కోరింది. మరోవైపు ఈ ఘటనపై గుజరాత్ ప్రభుత్వానికి చెందిన పీఎంజేఏవై ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది.ఈ పథకం కింద ఆసుపత్రికి అందాల్సిన అన్ని బకాయి చెల్లింపులను నిలిపివేసింది. కాగా గుండె సంబంధిత కరోనరీ ఆర్టరీ వ్యాధికి చికిత్సలో భాగంగా యాంజియోప్లాస్టీ చేస్తారు. ఈ వ్యాధి గుండె కండరాలకు రక్త ప్రవాహాన్ని మందగింపజేస్తుంది. ఫలితంగా రక్త నాళాలు కుచించుకుపోతాయి. ఈ చికిత్సతో కుచించుకుపోయిన ధమనులు లేదా సిరలను విస్తరించేలా చేస్తారు. ఫలితంగా కరోనరీ ధమనులకు రక్త ప్రవాహ పునరుద్ధరణ సవ్యంగా జరుగుతుంది.ఇది కూడా చదవండి: ఘనంగా శంకర నేత్రాలయ మ్యూజికల్ కాన్సర్ట్ -
దస్తన్ ఆటో వరల్డ్ కార్ల మ్యూజియం
రోల్స్‌రాయిస్, జాగ్వార్, బెంట్లీ, లాగోండా, క్యాడిలాక్, ఆస్టిన్, మెర్సిడెస్, ఆంబుమ్స్, హెచ్‌జె ముల్లినర్, అర్థర్ ముల్లినర్, విండోవర్స్, పార్క్ వార్డ్... ఈ కార్లన్నింటినీ ఒకే చోట చూడాలంటే దస్తన్ ఆటోవరల్డ్ వింటేజ్ మ్యూజియానికి వెళ్లాలి. మన హైదరాబాద్‌లో నిజాం నవాబు సేకరించిన కార్లను చౌమొహల్లా ΄్యాలెస్లో చూడవచ్చు. ఈ కలెక్షన్‌కు పదింతలు పెద్ద కలెక్షన్ అహ్మదాబాద్‌లోని ఆటో వరల్డ్ వింటేజ్ మ్యూజియంలో ఉంది. రెండువేల రెండు వందల ఎకరాల్లో విస్తరించిన ఈ మ్యూజియంలో మూడు వందలకు పైగా మోటారు వాహనాలుంటాయి. గాంధీ సినిమాలో ఉపయోగించిన మేబాష్ కారును కూడా చూడవచ్చు. అలాగే 1923 రోల్స్ 20 మోడల్ కూడా ఉంది. అహ్మదాబాద్ నగర శివారులో సర్దార్ పటేల్ రింగ్‌రోడ్, కత్వారాలో ఉన్న ఓ ఉన్న ఈ మ్యూజియం గిన్నిస్ రికార్డ్స్‌లో నమోదైంది. ప్రియమైన ప్రయాణం!ఈ మ్యూజియంలో ఉన్న బైక్‌లు, గుర్రపు బగ్గీలు, కార్లను సేకరించిన వ్యక్తి పేరు ప్రణ్లాల్ భోగిలాల్. రకరకాల కార్ల మీద ఆయనకున్న మోజు ఇలా మ్యూజియం రూపంలో కొలువుతీరింది. ఈ కార్లతో ఫొటో తీసుకోవాలనే సరదా కలిగితే ఒక్కో ఫొటోలకి వంద రూపాయలిచ్చి ఫొటో తీసుకోవచ్చు. వింటేజ్ కారులో ప్రయాణించాలనే సరదా కలిగితే అదీ సాధ్యమే. అయితే అత్యంత ప్రియమైన ప్రయాణమనే చెప్పాలి. ట్రిప్‌కి వెయ్యి రూపాయల వుతుంది. బరువైన బాడీ, పాత మోటర్లు కావడంతో నాలుగు లీటర్ల పెట్రోలు పోస్తే కిలోమీటరు ప్రయాణిస్తాయి. టూరిస్టులను మ్యూజియం బయటకు రెండు–మూడు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి వెనక్కి తీసుకువస్తారు. కారు ఎక్కేటప్పుడు ఒకరు వచ్చి డోర్ తీస్తారు, కూర్చోగానే డోర్ వేసేసి సెల్యూట్ చేస్తారు. తల΄ాగా చుట్టుకున్న డ్రైవర్ మన ఫోన్ తీసుకుని ఒక ఫొటో తీసిచ్చి ఆ తర్వాత కారు నడుపుతాడు. గంట కొట్టే కారుమ్యూజియం ఉద్యోగులు మేబాష్ కారును చూపిస్తూ ‘ఇది మేబాష్ తొలి కారు. ఈ కారును డిజైన్ చేసిన వ్యక్తి మనుమడు జర్మనీ నుంచి వచ్చి చెందిన 6 సిలిండర్ మేబాష్ కారును తనకు అమ్మవలసిందిగా కోరాడని, తన ఆటో ట్రెజరీ నుంచి అంత విలువైన కారును వదులుకోవడానికి ప్రాణ్‌లాల్ మనసు అంగీకరించలేదని చెబుతారు. ఈ మ్యూజియం అంతటినీ తిరిగి చూడాలంటే ఐదారు గంటలు పడుతుంది. సుడిగాలి పర్యటనలా చుట్టిరావాలన్నా కూడా మూడు గంటల సమయం పడుతుంది. గంట కొడుతూ ప్రయాణించే కారు చిన్న పిల్లలను ఆకట్టుకుంటుంది. ఇంజన్ మోడల్, చాసిటీ వంటి వివరాలు యువతను కట్టిపడేస్తాయి. ఇక్కడ పర్యటిస్తే ప్రపంచంలో మోటారు రంగం ఆవిర్భావం నుంచి నేటి వరకు పరిణామక్రమం అవగతమవుతుంది. దస్తన్ ఆటో వరల్డ్ వింటేజ్ మ్యూజియంలోకి ఎంట్రీ టికెట్ వంద రూపాయలు, పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన రెస్టారెంట్లో కాంప్లిమెంటరీ టీ ఇస్తారు. అహ్మదాబాద్ వెళ్లినప్పుడు గాంధీ ఆశ్రమం, సయ్యద్ సిద్ధిఖీ జాలీలతోపాటు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ఇది.– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
అతి తెలివి.. నకిలీ కోర్టు పెట్టి కలెక్టర్ కే షాక్
-
సంస్కర్త స్మారకం: అక్షర్ధామ్
అక్షర్ధామ్.... ఆధ్యాత్మికతకు అర్థం చెప్పిన స్వామి నారాయణుడి ఆలయం. సమాజాన్ని ధర్మం, జ్ఞానం, వైరాగ్యం, తాత్వికత వైపు నడిపించిన సంఘసంస్కర్త స్మారక మందిరమే అక్షర్ధామ్. స్వామి నారాయణుడు 18–19 శతాబ్దాల్లో సమాజంలో కరడుగట్టి ఉన్న సామాజిక దురాచారాలను పరిహరించడం కోసం పని చేశాడు. మనదేశం అప్పుడు స్థానికంగా హిందూ, ముస్లిం పాలకుల పాలనలో ఉంది. ఈ రాజ్యాలన్నీ బ్రిటిష్ పాలన కింద మనుగడ సాగించాయి. ఈ సమ్మేళన సంస్కృతి ప్రభావం సమాజం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. అనేక మూఢ నమ్మకాలు, సామాజిక దురాచారాలు పెచ్చరిల్లిన నేపథ్యంలో మహిళలు ఆంక్షల వలయంలో చిక్కుకుపోయారు. భద్రత, మత విశ్వాసాల నిబంధనల కింద పేదవాళ్లు మహిళలు మగ్గిపోతున్న సమయంలో సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన మహోన్నతుడు స్వామి నారాయణుడు. ఆడపిల్లలను పురిట్లోనే ప్రాణాలు తీస్తున్న రోజుల్లో స్వామి నారాయణుడు సతి దురాచారాన్ని నియంత్రించడంతో΄ాటు మహిళలకు చదువు అవసరాన్ని చెప్పాడు. వివక్ష రహిత, హింస రహిత సమాజాన్ని స్థాపించడం కోసం సమాజాన్ని సన్మార్గంలో నడిపించాడు. ఒక సంఘ సంస్కర్త గౌరవార్థం నిర్మించిన క్షేత్రం కావడంతో ఇక్కడ వైదిక క్రతువులు ఉండవు. ఏకకాలంలో ఈ ఆవరణంలో వేలాదిమంది ఉన్నప్పటికీ రణగొణధ్వనులుండవు. నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. అక్షర్‌థామ్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ఆర్ట్, సైన్స్, కల్చర్, స్పిరిచువాలిటీల సమ్మేళనం. ఇది ఎక్కడుంది! గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో ఉంది అక్షర్ధామ్. అహ్మదాబాద్ నుంచి 40 కి.మీ.లు ఉంటుంది. రాజస్థాన్ నుంచి తెప్పించిన ఈ పింక్ సాండ్స్టోన్ నిర్మాణం... అందమైన శిల్పసౌందర్యానికి నిలయం. చక్కటి గార్డెన్లు, స్వామి నారాయణ్ జీవిత చరిత్ర, ఆయన తీసుకువచ్చిన సంస్కరణల ఇతివృత్తంలో సాగే చిత్ర ప్రదర్శన, పెయింటింగ్స్, శిల్పాలను చూసి తీరాల్సిందే. ఈ ఆలయంలో ప్రతి అంగుళం అత్యాధునికమైన సాంకేతికతను, ఆధ్యాత్మిక భావనను, క్రమశిక్షణను ప్రతిబింబిస్తుంది. అక్షర్‌ధామ్‌ను ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయాణ సమయం కాకుండా కనీసం మూడు గంటల సమయాన్ని కేటాయించుకోవాలి. అక్షర్ధామ్కి ఎంట్రీ ఫీజ్ లేదు కానీ ఎగ్జిబిషన్లు, వాటర్ షోలకు టికెట్ ఉంటుంది. వాటర్ షో ‘సత్ చిత్ ఆనంద్’ కథనం కఠోపనిషత్తు ఆధారంగా హిందీలో సాగుతుంది నెరేషన్. నచికేతుడికి యముడు వరాలివ్వడం వంటి ఉపనిషత్ సారాంశాన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే, కానీ మల్టీ కలర్ లేజర్స్, ఫైర్‌బాల్స్, అండర్ వాటర్ ఫ్లేమ్స్‌లో టెక్నాలజీని ఎంజాయ్ చేయవచ్చు. ఫొటో పాయింట్ అక్షర్ధామ్ లోపలికి మన కెమెరాలను అనుమతించరు, కానీ ఈ ఆవరణలో ఫొటో పాయింట్ దగ్గర కెమెరాతో ఒక ఫొటోగ్రాఫర్ ఉంటాడు. పర్యటనకు గుర్తుగా అక్షర్ధామ్ గోపురం కనిపించేటట్లు ఫొటో తీయించుకోవచ్చు. సావనీర్ షాప్‌లో పుస్తకాలు, ఫొటోలు, వీడియో సీడీలతోపాటు అక్షర్ధామ్ టీ షర్టులుంటాయి. ఫొటోలతో ఇంటిని నింపడం కంటే టీ షర్టు కొనుక్కోవడం మంచి ఆప్షన్. అక్షర్ధామ్ ఆవరణ మొత్తం తిరిగి చూసిన తర్వాత ఆశ్యర్యంగా అనిపించేదేమిటంటే... స్వామి నారాయణుడి జీవనశైలి అత్యంత నిరాడంబరంగా సాగింది. ఆయన స్మారక మందిరం మాత్రం సంపన్నతకు ప్రతిరూపంగా ఉంది. అభిషేకం చేయవచ్చు! అక్షర్‌ధామ్‌లో పర్యాటకులు అందరూ స్వామి నారాయణ్‌కి అభిషేకం చేయవచ్చు. అభిషేక మండపంలో పూలు, ఆకులతో నీటి చెంబులను వరుసగా పేర్చి ఉంటారు. టికెట్ తీసుకుని మౌనంగా క్యూలో వెళ్లి అభిషేకం చేయాలి. ఇక్కడ నియమాలు చాలా కచ్చితంగా ఉంటాయి. కానీ హ్యూమన్ ఫ్రెండ్లీగానే ఉంటాయి. డ్రెస్ కోడ్ విషయంలో ఇండియన్, వెస్ట్రన్ అనే నియమాలేవీ ఉండవు. కానీ భుజాలు, ఛాతీ, నాభి, భుజాల నుంచి మోచేతుల వరకు, మోకాళ్ల కింది వరకు కవర్ అయ్యే డ్రెస్‌లను మాత్రమే అనుమతిస్తారు. మనం ధరించిన డ్రస్ వాళ్ల నియమాలకు లోబడి లేకపోతే మూడు వందల రూపాయలు డిపాజిట్ చేయించుకుని సరోంగ్ అనే డ్రస్‌ను ఇస్తారు. మన దుస్తుల మీద దానిని ధరించాలి. డ్రస్ వెనక్కి ఇచ్చినప్పుడు మన డబ్బు ఇచ్చేస్తారు. ఫోన్లు, కెమెరాలు, పెన్‌డ్రైవ్‌లు, మ్యూజిక్ డివైజ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ ఐటెమ్స్, ఆయుధాలు, ఆటబొమ్మలు, లగేజ్, పెట్లు, ఆహార పానీయాలు, పొగాకు ఆల్కహాల్ ఇతర నిషేధిత డ్రగ్స్‌కు అనుమతి ఉండదు. చంటి పిల్లలతో వెళ్లే వాళ్లకు పాలు, ఆహారం, నీళ్ల సీసాలను అనుమతిస్తారు. వికలాంగులకు, వృద్ధులకు వీల్ చైర్ ఫ్రీగా ఇస్తారు. -
22 ఏళ్ల తర్వాత పగ తీర్చుకున్న వ్యక్తి.. తండ్రిని చంపినట్లే..
ఓ వ్యక్తి తన పగను తీర్చుకున్నాడు. అయితే ఒకటి రెండేళ్లకు కాదు ఏకంగా 22 ఏళ్ల తర్వాత తన తండ్రిని చంపిన హంతకుడిని మట్టుబెట్టాడు. ఒకప్పుడు తన తండ్రిని ఎలా చంపాడే సదరు వ్యక్తిని కూడా అలాగే చంపేశాడు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది.పోలీసుల వివరాల ప్రకారం.. అక్టోబర్ 1న అహ్మదాబాద్ నఖత్ సింగ్ భాటి(50) అనే వ్యక్తి సైకిల్‌పై వెళ్తుండగా కారు ఢీకొనడంతో మరణించినట్లు సమాచారం అందింది. నఖత్ సింగ్ భాటీ అహ్మదాబాద్‌లో థాల్తేజ్ లోని ఓ కాలేనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ముందుగా ఇది ప్రమాదంగా భావించిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా హత్యకు గురైనట్లు తేలింది.నిందితుడు గోపాల సింగ్ భాటి ఉద్దేశపూర్వకంగానే నఖత్‌ను గుద్ది పారిపోయేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. 2002లో రాజస్థాన్‌లో 22 ఏళ్ల క్రితం తన తండ్రి కూడా ఇదే విధంగా నఖత్ హత్య చేసినట్లు పోలీసులకు వెల్లడించాడు. అందుకే ఇప్పుడు అతన్ని చంపి పగ తీర్చుకున్నట్లు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. -
తొలిసారి పరుగులు పెట్టనున్న వందే భారత్ మెట్రో రైలు
భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లు ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పరుగులు తీస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ మూడు రూట్లలో ఈ సెమీ హైస్పీడ్ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్, కాచిగూడ-యశ్వంత్‌పూర్-కాచిగూడ, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు సైతం రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.తాజాగా వందే భారత్ రైళ్లకు తోడు వందే భారత్ మెట్రో రైళ్లు, వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా రైల్వే శాఖ ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 16వ తేదీన తొలి వందే భారత్ మెట్రో రైలు పట్టాలు ఎక్కనుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి భుజ్ మధ్య ప్రయాణించనున్న తొలి వందే భారత్ మెట్రో రైలును..ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.ఈ రైలు దేశంలోని వివిధ నగరాల్లో ఉన్న మెట్రో రైళ్ల మాదిరిగానే ఉండగా.. వాటి కంటే సుదూర ప్రయాణాలకు ఉపయోగించనున్నారు. అహ్మదాబాద్-భుజ్ మధ్య 334 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 5 గంటల 45 నిమిషాల్లోనే ఈ వందే భారత్ మెట్రో రైలు ప్రయాణించనుంది. భుజ్ రైల్వే స్టేషన్లో తెల్లవారుజామున 5.50 గంటలకు ప్రారంభమై.. ఉదయం 10.50 గంటలకు అహ్మదాబాద్ స్టేషన్‌కు చేరుకోనుంది. తిరిగి సాయంత్రం 5.30 గంటలకు అహ్మదాబాద్‌లో ప్రారంభమై.. రాత్రి 11.10 గంటలకు భుజ్ చేరుకోనుంది. వారంలో 6 రోజులు ఈ వందే భారత్ మెట్రో రైలు ప్రయాణం చేయనుంది. ఇక భుజ్-అహ్మదాబాద్ మార్గంలో ఈ రైలుకు 9 స్టాప్‌లు ఉండగా.. ప్రతీ స్టేషన్లో 2 నిమిషాలు మాత్రమే ఆగుతుందని భారతీయ రైల్వే తెలిపింది.వందే భారత్ మెట్రో అనేది సెమీ-హై-స్పీడ్ రైలు. ఇది గంటకు 100 నుంచి 250 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టనుంది. వందే భారత్ రైలు లాగానే ఈ రైలు కూడా పూర్తిగా ఎయిర్ కండీషన్ కలిగి ఉంటుంది. మొదట 12 కోచ్‌లతో ప్రారంభం కానున్న ఈ వందే భారత్ మెట్రో రైలుకు.. ప్రయాణికుల రద్దీ దృష్టా వాటిని 16 కోచ్‌లకు పెంచనున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. ఈ రైళ్లకు ప్రత్యేకమైన కోచ్ కాన్ఫిగరేషన్ ఉండనుండగా.. నాలుగు కోచ్‌లు ఒక యూనిట్‌గా ఉంటాయి. ఇందులో మన మెట్రో రైలు లాగా ఆటోమేటిక్ డోర్లు ఉండటం మరో ప్రత్యేకత. ఈ వందే భారత్ మెట్రో రైలును గంటకు 100 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టేలా రూపొందించారు.ప్రయాణికులు అత్యవసర పరిస్థితుల్లో రైలు డ్రైవర్‌తో నేరుగా కమ్యూనికేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ప్రతి కోచ్‌లో మంటలు, పొగ వంటి ప్రమాదాన్ని వెంటనే గుర్తించేలా మొత్తం 14 సెన్సార్లతో కూడిన సెన్సార్ సిస్టమ్ ఉంటుంది. దివ్యాంగుల కోసం కోచ్‌లలో వీల్‌చైర్ యాక్సెస్ కలిగిన టాయిలెట్లు ఏర్పాటు చేశారు. -
రూ.4000 కోట్లతో షాపింగ్ మాల్.. మూడువేల జాబ్స్
భారతదేశంలో లులు గ్రూప్ ఇంటర్నేషనల్ కార్యకలాపాలను విస్తరించడానికి చైర్మన్ అండ్ ఎండీ 'ఎంఏ యూసఫ్ అలీ' ప్రయాణిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు అహ్మదాబాద్‌లో అతిపెద్ద షాపింగ్ మాల్ నిర్మించనున్నట్లు ఈయన పేర్కొన్నారు. దీనికోసం ఇప్పటికే 3,50,000 చదరపు అడుగుల భూమిని సేకరించినట్లు కూడా అలీ వెల్లడించారు.భారతదేశంలో అతిపెద్ద షాపింగ్ మాల్ నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభిస్తోందని యూసఫ్ అలీ అన్నారు. ఈ మాల్ నిర్మాణం పూర్తయితే సుమారు 3000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. ఈ షాపింగ్ మాల్ నిర్మించడానికి సుమారు రూ. 4000 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా.ప్రస్తుతం భారతదేశంలో ప్రధాన నగరాలైన బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, లక్నో, తిరువనంతపురం, కోయంబత్తూరులలో లులు మాల్స్ ఉన్నాయి. హైదరాబాద్‌లో గత ఏడాది లులు మాల్ ప్రారంభమైంది.ఇదీ చదవండి: గణేష్ చతుర్థి: స్వీట్స్ ఆర్డర్లలో ఆ నగరమే టాప్.. యూఏఈలోని అబుదాబిలో ప్రధాన కార్యాలయాన్ని కలిగిన 'లులు గ్రూప్ ఇంటర్నేషనల్' మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికన్ రిటైల్ పరిశ్రమలో ట్రెండ్‌సెట్టర్‌గా పిలువబడుతుంది. ఈ సంస్థ సుమారు 49 దేశాల్లో హైపర్ మార్కెట్లు, సూపర్ మార్కెట్లను నిర్వహిస్తోంది. ఇందులో ఈజిప్టు, ఇండియా, ఇండోనేసియా, మలేషియా మొదలైన దేశాలు ఉన్నాయి.#WATCH | Kerala: On investment in India, Chairman & Managing Director of Lulu Group International, Yusuffali M. A. says, "...I am very happy to give employment to my fellow citizens...India's biggest shopping mall is in Ahmedabad...I am getting full support from the central… pic.twitter.com/PFsxwVRRu3— ANI (@ANI) September 8, 2024 -
ఫైనల్లో దబంగ్ ఢిల్లీ
చెన్నై: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్‌లో దబంగ్ ఢిల్లీ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఢిల్లీ 8–6తో అహ్మదాబాద్ ఎస్జీ పైపర్స్‌పై విజయం సాధించింది. శనివారం జరిగే టైటిల్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ గోవా చాలెంజర్స్‌తో మాజీ చాంపియన్ దబంగ్ ఢిల్లీ తలపడుతుంది. తొలి పురుషుల సింగిల్స్‌లో సత్యన్ జ్ఞానశేఖరన్ 1–2 (4–11, 11–5, 5–11)తో లిలియాన్ బార్డెట్ చేతిలో ఓడిపోగా, మహిళల సింగిల్స్‌లో ఒరవన్ పరనగ్ 3–0 (11–7, 11–9, 11–9)తో బెర్నడెట్ సాక్స్‌పై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్‌లో ఒరవన్–సత్యన్ జోడీ 0–3 (9–11, 7–11, 9–11)తో బెర్నడెట్ సాక్స్–మానుశ్ షా ద్వయం చేతిలో ఓడింది. రెండో పురుషుల సింగిల్స్‌లో అండ్రియస్ లెవెంకొ 2–1 (11–8, 10–11, 11–8)తో మానుశ్ షాపై గెలుపొందాడు. గేమ్‌ల పరంగా ఇరుజట్ల స్కోరు 6–6తో సమం కాగా కీలకమైన రెండో మహిళల సింగిల్స్‌లోకి దిగిన ఢిల్లీ ప్లేయర్ దియా చిటాలే వరుస గేమ్‌లు గెలిచి జట్టును గెలిపించింది. ఆమె 2–0 (11–8, 11–4)తో రీత్ రిష్యాపై నెగ్గడంతో దబంగ్ ఢిల్లీ విజయం ఖాయమైంది. -
ఇక్కడ ఇళ్లు కొనడం సాధ్యమే!
న్యూఢిల్లీ: అందుబాటు ధరల ఇళ్లకు చిరునామాగా చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా నగరాలు నిలుస్తున్నాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), ఢిల్లీ నగరాలు మాత్రం ఇళ్ల కొనుగోలు పరంగా ఖరీదైనవని ప్రాప్‌టెక్ సంస్థ మ్యాజిక్‌బ్రిక్స్ వెల్లడించింది. ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరల తీరుపై ఒక నివేదిక విడుదల చేసింది. ఓ ఇంటి వార్షిక ఆదాయం నుంచి ఇంటి ధర (పీఐ రేషియో) నిష్పత్తి 2020లో ఉన్న 6.6 శాతం నుంచి 2024లో 7.5 శాతానికి పెరిగింది. అంటే ఓ ఇంటి వారందరూ ఏడున్నరేళ్లు కష్టపడి సంపాదించినంతా వెచ్చిస్తే కానీ ఇల్లు సమకూర్చుకోలేని పరిస్థితి. పీఐ రేషియో చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతాలో 5 చొప్పున ఉంది. అందుకే ఇక్కడి ఇళ్ల ధరలు అందుబాటులో ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొంది. ఎంఎంఆర్‌లో 14.3గా ఉంటే, ఢిల్లీలో 10.1గా ఉంది. అంటే ఇక్కడ ఇళ్ల ధరలు ఖరీదుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈఎంఐ – నెలవారీ ఆదాయం రేషియో 2020లో ఉన్న 46 శాతం నుంచి 2024 నాటికి 61 శాతానికి పెరిగింది. అంటే నెలవారీ వేతనంలో ఈఎంఐ వాటా 61 శాతానికి చేరింది. ఇళ్ల కొనుగోలుదారులపై పెరిగిన ఈఎంఐ భారాన్ని ఇది సూచిస్తోంది. నెలవారీ ఆదాయంలో ఈఎంఐ రేషియో ఢిల్లీలో 82 శాతం, ఎంఎంఆర్‌లో 116 శాతంగా ఉంది. హైదరాబాద్, గురుగ్రామ్‌లో 61 శాతం చొప్పున ఉంది. అహ్మదాబాద్, చెన్నైలో 41 శాతంగా, కోల్‌కతాలో 47 శాతంగా ఉంది. అసాధారణంగా పెరిగిన ధరలు 2021 ద్వితీయ ఆరు నెలలతోపాటు 2022లోనూ ఇళ్ల ధరలు ఎంతో అందుబాటులో ఉన్నాయి. తక్కువ వడ్డీ రేట్లు, గృహ ఆదాయాలు తిరిగి పుంజుకోవడంతో ఈ కాలంలో ఇళ్ల ధరలు తిరిగి పుంజుకున్నాయి. సొంతిల్లు కలిగి ఉండాలన్న ఆకాంక్షతో డిమాండ్ సరఫరాను మించిపోయింది. దీంతో ఇళ్ల ధరలు అసాధారణ స్థాయిలో పెరిగాయి. దీంతో అందుబాటు ధరల ఇళ్ల కొనుగోలు పరంగా సవాళ్లను తీసుకొచి్చంది’’అని మ్యాజిక్‌బ్రిక్స్ సీఈవో సు«దీర్ పాయ్ పేర్కొన్నారు. -
డెలివరీ ఏజెంట్‌కు సర్ప్రైజ్
బంధువులతో కలిసి పార్టీ.. ఆత్మ బంధువుల బర్త్‌డే.. వేడుక ఏదైనా మనకు టైమ్‌కు ఫుడ్ డెలివరీ చేసి మన సంతోషంలో భాగస్వాములవుతారు డెలివరీ ఏజెంట్. వాళ్ల కష్టాన్ని చాలాసార్లు గుర్తించం. కానీ.. తమకోసం ఫుడ్ తీసుకొచ్చిన డెలివరీ ఏజెంట్ బర్త్ డే సెలబ్రేట్ చేసి అతని సంతోషాన్ని రెట్టింపు చేశారు కొందరు యువకులు. వారం కిందట అహ్మదాబాద్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. నగరానికి చెందిన యశ్ షా జొమాటోలో ఫుడ్ ఆర్డర్చేశాడు. ఆర్డర్ డీటెయిల్స్ చూస్తుండగా.. భారీ వర్షం వల్ల డెలివరీ లేట్ అవుతుందని ఉంది. దాంతో పాటు.. డెలివరీ బాయ్ అయిన షేక్ ఆకిబ్ బర్త్‌డే అని కూడా కనిపించింది. డెలివరీ ఏజెంట్ తన బర్త్‌డే రోజు వర్షంలో తడుస్తూ పనిచేస్తున్నాడని గ్రహించి, ఏజెంట్‌ను సర్ప్రైజ్ చేయాలనుకున్నారు. ఆర్డర్‌తో వచ్చిన అతడికి ఫ్రెండ్స్‌తో కలిసి ‘హ్యాపీ బర్త్ డే’ అంటూ విష్ చేశారు. అంతేకాదు చిన్న కానుకను కూడా అందజేశారు. ఊహించని ఈ వేడుకకు డెలివరీ ఏజెంట్ చలించిపోయాడు. చిరునవ్వుతో వారికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆ దృశ్యం వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన యశ్.. ‘మీకు చేతనైనంత వరకు ఆనందాన్ని పంచండి. మాకు అవకాశం ఇచ్చినందుకు జొమాటోకు ధన్యవాదాలు’ అని క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియోకు రెండు మిలియన్ల వ్యూస్, లెక్కలేనన్ని లైక్స్, కామెంట్లు వచ్చాయి. దీనిపై జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్, డెలివరీ ఏజెంట్ షేక్ ఆకిబ్ కూడా స్పందించి ధన్యవాదాలు తెలిపారు. – అహ్మదాబాద్ -
UTT 2024: అహ్మదాబాద్‌కు రెండో విజయం
చెన్నై: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్‌లో కొత్త జట్టు అహ్మదాబాద్ ఎస్జీ పైపర్స్ రెండో విజయం అందుకుంది. యు ముంబా టీటీ జట్టుతో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో అహ్మదాబాద్ జట్టు 9-6 పాయింట్ల తేడాతో గెలిచింది. తొలి మ్యాచ్‌లో మనుశ్ షా (అహ్మదాబాద్) 2-11, 9-11, 11-8తో మానవ్ ఠక్కర్ చేతిలో ఓడిపోయాడు. రెండో మ్యాచ్‌లో రీత్ రిష్యా (అహ్మదాబాద్) 5-11, 11-8, 11-7తో సుతీర్థ ముఖర్జీపై నెగ్గింది. మూడో మ్యాచ్‌లో మనుశ్-బెర్నాడెట్ జాక్స్ ద్వయం 11-4, 11-8, 11-8తో మానవ్-మరియా జియో జోడీని ఓడించింది. నాలుగో మ్యాచ్‌లో లిలియన్ బార్డెట్ (అహ్మదాబాద్) 5-11, 11-9, 9-11తో ఖాద్రీ అరునా చేతిలో ఓటమి చవిచూశాడు. ఐదో మ్యాచ్‌లో బెర్నాడెట్ జాక్స్ 9-11, 11-4, 11-6తో మరియా జియోపై గెలిచి అహ్మదాబాద్‌కు విజయాన్ని ఖరారు చేశాడు. ఎనిమిది జట్లు పోటీపడుతున్న ఈ లీగ్‌లో ప్రస్తుతం అహ్మదాబాద్ జట్టు 24 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. -
రక్షాబంధన్: అన్నకు ప్రాణం పోసిన చెల్లెలు
అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. చెల్లెలంటే ప్రాణమిచ్చే అన్న.. అన్నయ్యంటే ప్రాణం పెట్టే చెల్లెళ్లను మనం చూసే ఉంటాం. ఇటువంటి కథనాలను మనం వినే ఉంటాం. అయితే అంతకుమించిన అనుభంధం రాజస్థాన్‌లోని ఈ అన్నాచెల్లెళ్లది.రాజస్థాన్‌లోని రామ్‌గఢ్‌కు చెందిన ఒక సోదరి తన సోదరునికి కిడ్నీని దానం చేయడం ద్వారా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. వీరు ఆస్పత్రిలోనే రక్షాబంధన్ వేడుకను జరుపుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే ఉపాధ్యాయురాలు సునీతా బుడానియా తన కిడ్నీని తన సోదరుడు దేవేంద్ర బుడానియాకు దానం చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ అహ్మదాబాద్‌లోని సివిల్ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.2016లో దేవేంద్ర బుడానియా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నేపధ్యంలో అతని బంధువైన బీర్బల్ బుడానియా అతనికి కిడ్నీని దానం చేశారు. అయితే ఆ కిడ్నీ ఎనిమిదేళ్ల తర్వాత పనిచేయడం మానేసింది. దీంతో దేవేంద్రకు మరోమారు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో దేవేంద్ర సోదరి సునీత తన అన్నకు తన కిడ్నీని దానం చేయాలని నిర్ణయించుకున్నారు.ఈ సందర్భంగా సునీతతో మీడియాతో మాట్లాడుతూ వివాహం అయినంతమాత్రన ఆడపిల్లకు పుట్టింటితో సంబంధం ముగిసిపోదని, అది ఇంకా పెరుగుతుందని అన్నారు. ఆడపిల్లకు అటు పుట్టినిల్లు, ఇటు అత్తారిల్లు అనే విధంగా బాధ్యతలు పెరుగుతాయన్నారు. తాను తన సోదరునికి కిడ్నీని దానం చేయడాన్ని సంతోషంగా భావిస్తున్నానని ఆమె అన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్న వీరిద్దరూ త్వరలోనే డిశ్చార్జి కానున్నారు. -
పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్
కాన్పూర్/న్యూఢిల్లీ: వారణాసి– అహ్మదాబాద్ మధ్య నడిచే సబర్మతి ఎక్స్‌ప్రెస్ శనివారం యూపీలో పట్టాలు తప్పింది. పట్టాలపైనున్న ఒక వస్తువు రైలింజిన్‌ను బలంగా తాకడంతో 20 బోగీలు పట్టాలు తప్పాయి. కాన్పూర్–భీమ్సేన్ రైల్వే స్టేషన్ల మధ్య తెల్లవారు జామున 2.35 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్ద శబ్దంతో బోగీలు ఊగుతూ, రైలు నిలిచిపోవడంతో నిద్రలో ఉన్న ప్రయాణికులంతా ఉలిక్కిపడి లేచారు. ఘటనలో ఎవరికీ ఎటువంటి అపాయం వాటిల్లలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఘటన అనంతరం ప్రయాణికులందరినీ బస్సుల్లో కాన్పూర్ రైల్వే స్టేషన్‌కు, అక్కడికి నుంచి వేరే రైళ్లలో గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేశారు. కుట్ర కోణంలో దర్యాప్తు‘రైలు పట్టాలపైనున్న ఓ వస్తువు ఇంజిన్‌ను తాకినట్లు ఆనవాళ్లున్నాయి. అన్ని ఆధారాలను అధికారులు సేకరిస్తున్నారు. యూపీ పోలీసులతోపాటు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు దర్యాప్తు చేపట్టారు’అని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ‘బండరాయి వంటిదేదో గట్టిగా గుద్దుకోవడంతో ఇంజిన్ ముందు భాగం తీవ్రంగా దెబ్బతిని, వంగిపోయినట్లు లోకో పైలట్ చెబుతున్నారు. 16వ బోగీ సమీపంలో మాకు దొరికిన వస్తువే ఇంజిన్ దెబ్బతినేందుకు కారణమై ఉండొచ్చు. ఇది సంఘ వ్యతిరేక శక్తుల పని’గా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
20 కోచ్‌ల వందేభారత్.. ట్రయల్ రన్ విజయవంతం
అత్యాధునిక, సౌకర్యవంతమైన ప్రయాణానికి వందేభారత్ రైలు పేరొందింది. ఇప్పుడు మరో వందేభారత్ రైలు పట్టాలపై పరుగులు తీయనుంది. పశ్చిమ రైల్వే తాజాగా అదనపు బోగీలతో కూడిన వందేభారత్ రైలును పరీక్షించింది. ఈ రైలు ఐదు గంటల 21 నిమిషాల్లో అహ్మదాబాద్ నుంచి ముంబై చేరుకుంది.కొత్తగా పట్టాలెక్కిన ఈ కాషారంగు వందేభారత్‌కు అదనంగా నాలుగు కోచ్‌లను జతచేర్చారు. దీంతో మొత్తం 20 బోగీలతో ఈ నూతన వందేభారత్ రైలు పరుగులు తీయనుంది. శుక్రవారం నాడు అహ్మదాబాద్- ముంబై మధ్య గంటకు 130 కి.మీ. వేగంతో ఈ రైలుకు సంబంధించిన ట్రయల్ రన్ నిర్వహించినట్లు అధికారి తెలిపారు. ఉదయం 7 గంటలకు అహ్మదాబాద్‌లో బయలుదేరిన రైలు మధ్యాహ్నం 12:21 గంటలకు ముంబై సెంట్రల్‌కు చేరుకుంది.తిరిగి మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ రైలు ముంబై సెంట్రల్ నుండి అహ్మదాబాద్‌కు తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించింది. భారతీయ రైల్వే 2024, జూలై 29 నుంచి దేశవ్యాప్తంగా 102 వందే భారత్ రైలు సర్వీసులను నడుపుతోంది. ప్రస్తుతం ముంబై- అహ్మదాబాద్ మధ్య వందే భారత్, తేజస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ తదితర రైళ్లతో సహా 50కి పైగా రైలు సర్వీసులు నడుస్తున్నాయి. -
ఇంటి కొనుగోలు భారం ఇక్కడ తక్కువ...! హైదరాబాద్ టాప్ సెకెండ్
దేశంలో ఎక్కడ ఇళ్ల కొనుగోలు భారం (అఫర్డబులిటీ) తక్కువ అనేదానిపై నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక విడుదల చేసింది. 2024 ప్రథమార్ధంలో అగ్రశ్రేణి ఎనిమిది నగరాల్లో అఫర్డబులిటీ స్థిరంగా ఉందని ఈ నివేదిక పేర్కొంది. 2023 చివరి నుంచి స్థిరంగా ఉన్న వడ్డీ రేట్ల ఆధారంగా ఈ అఫర్డబులిటీని నిర్ధారించారు.ఎనిమిది నగరాల్లో కుటుంబాలు తమ ఆదాయంలో ఇంటి ఈఎంఐ కోసం ఎంత శాతం వెచ్చిస్తున్నారన్న దాని ఆధారంగా నైట్ ఫ్రాంక్ అఫర్డబిలిటీ ఇండెక్స్‌ను రూపొందించింది. ఇది ఈఎంఐ-టు-ఇన్కమ్ నిష్పత్తిని సూచిస్తుంది.ఇందులో అహ్మదాబాద్ 21% నిష్పత్తితో అత్యంత సరసమైన హౌసింగ్ మార్కెట్‌గా ఉద్భవించింది. పుణె, కోల్‌కతా 24% నిష్పత్తితో దగ్గరగా ఉన్నాయి. మరోవైపు ముంబై 51% నిష్పత్తితో అతి తక్కువ సరసమైన నగరంగా నిలిచింది. దీని తర్వాత 51% నిష్పత్తితో హైదరాబాద్ అతి తక్కువ సరసమైన నగరంగా ఉంది. ఒక నగరంలో నైట్ ఫ్రాంక్ అఫర్డబులిటీ సూచిక స్థాయి 40% అంటే, సగటున ఆ నగరంలోని కుటుంబాలు గృహ రుణ ఈఎంఐ కోసం వారి ఆదాయంలో 40% ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది 50% కంటే ఎక్కువ ఉంటే భరించలేనిదిగా పరిగణిస్తారు.2019 నుంచి అన్ని మార్కెట్లలో మొత్తం అఫర్డబులిటీ మెరుగుపడింది. అయితే అహ్మదాబాద్‌లో 5% నుంచి హైదరాబాద్‌లో 26% వరకు మొదటి ఎనిమిది మార్కెట్లలో ధరలు పెరిగాయి. 2019 నుంచి అఫర్డబులిటీ 15 శాతం పాయింట్ల మేర కోలుకోవడంతో ముంబై అఫర్డబులిటీలో గణనీయ పెరుగుదలను నమోదు చేసింది.కోల్‌కతా మార్కెట్ స్థోమత 2019లో 32% నుండి H1 2024లో 24%కి మెరుగుపడింది. ఎన్‌సిఆర్ మరియు బెంగళూరులో స్థోమత స్థాయిలు అదే కాలంలో 6 శాతం పాయింట్లు పెరిగాయి. -
సెక్యూరిటీ అలర్ట్.. అహ్మదాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఢిల్లీ: ఢిల్లీ నుంచి ముంబై బయలుదేరిన అకాసా ఎయిర్ విమానానికి సెక్యూరిటీ అలెర్ట్ రావటం కలకలం రేపింది. దీంతో ఆ విమానాన్ని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు మళ్లించారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి ముంబైకి 186 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానానికి సెక్యూరిటీ హెచ్చరిక వచ్చింది.Akasa Air flight diverted to Ahmedabad airport after security alert https://t.co/BMWokfVVF9 pic.twitter.com/itUSAtj16s— DeshGujarat (@DeshGujarat) June 3, 2024 దీంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది 10.13 గంటలకు దారి మళ్లించి అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయి పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులందరినీ ఫ్లైట్ నుంచి దించివేశారు.‘ఫైట్ కెప్టెన్ అన్ని అత్యవసర సూచనలు పాటించారు. సురక్షింతంగా అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు. అకాశ్ ఫ్లైట్.. సెఫ్టీ, సెక్యూరిటీ ప్రొటోకాల్స్ పాటించింది’ అని అకాసా ఎయిర్ అధికార ప్రతినిధి వెల్లడించారు. -
Gujarat: పిల్లల బొమ్మల్లో, లంచ్ బాక్సుల్లో దాచి..
గాంధీ నగర్: గుజరాత్ రాష్ట్రంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. అహ్మదాబాద్‌లో విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి సుమారు రూ. కోటికి పైగా విలువైన డ్రగ్స్‌ను కస్టమ్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.వివరాలు.. అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్‌తోపాటు కస్టమ్స్, ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో అమెరికా, కెనడా, థాయ్‌లాండ్ నుంచి వచ్చిన వారి వద్ద నుంచి రూ. 1.15 కోట్ల విలువైన హైబ్రిడ్, సింథటిక్ గంజాయి పొట్లాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని చిన్నారుల ఆట బొమ్మలు, చాక్లెట్లు, లంచ్ బాక్స్‌లు, క్యాండీ విటమిన్‌లల్లో దాచి అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ఓ విదేశీయుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. -
MS Dhoni: ధోని కాళ్లు మొక్కాను.. సర్జరీ చేయిస్తా అన్నారు!
మహేంద్ర సింగ్ ధోని.. ఈ టీమిండియా దిగ్గజ కెప్టెన్ తన అద్బుత ఆట తీరు, నిరాండంబరతతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ తర్వాత కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ రూపంలో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు.చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా జట్టును రికార్డు స్థాయిలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపి.. ‘తలా’గా అభిమానుల గుండెల్లో ముద్ర వేసుకున్నాడు. అయితే, ధోని మైదానంలో దిగుతున్నాడంటే సీఎస్కే ఫ్యాన్స్‌కు మాత్రమే కాదు.. జట్లకు అతీతంగా అందరిలోనూ ఉత్సాహం నిండిపోతుంది.ఏ జట్టుకు మద్దతు ఇచ్చే వారైనా ధోని బ్యాటింగ్‌కు వచ్చాడంటే .. క్రీజులో ఉన్నంత సేపు అతడికే మద్దతుగా నిలుస్తారు. ఇక మరికొంత మందైతే తలాను నేరుగా కలిసేందుకు దెబ్బలు తినైనా సరే మైదానంలోకి దూసుకువస్తారు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి.ధోని బ్యాటింగ్‌కు రాగానే సెక్యూరిటీ కళ్లు గప్పిఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ సందర్భంగానూ ఓ వ్యక్తి ఇలాగే ఫీల్డ్‌లోకి దూసుకువచ్చాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ధోని బ్యాటింగ్‌కు రాగానే సెక్యూరిటీ కళ్లు గప్పి లోపలికి ప్రవేశించి.. ధోని పాదాలను చుట్టేశాడు.ఆ సమయంలో ధోని ఏమాత్రం సహనం కోల్పోకుండా తన అభిమాని సమస్యను అర్థం చేసుకోవడమే గాకుండా.. సర్జరీ చేయిస్తానని మాట ఇచ్చాడట. నాడు ధోనిని కలిసిన సదరు వ్యక్తి తాజాగా ఈ విషయాన్ని వెల్లడించాడు.ధోని కాళ్లు మొక్కాను.. సర్జరీ చేయిస్తా అన్నారు!‘‘ధోనిని చూడగానే నా చుట్టూ ఏం జరుగుతుందో అంతా మర్చిపోయాను. మైదానంలోకి పరిగెత్తుకు వెళ్లాను. మహీ భాయ్ అప్పుడు.. ‘సరదా కోసమే ఇక్కడికి వచ్చావు కదా’ అన్నాడు.మహీ భాయ్‌ను చూశానన్న ఆనందంలో నాకైతే పిచ్చిపట్టినట్లయింది. వెంటనే ఆయన పాదాలకు నమస్కరించాను. ఆయనొక లెజెండ్. నేరుగా ఆయనను చూడగానే నా కళ్లలో నీళ్లు వచ్చాయి.ఆ సమయంలో నేను భారంగా శ్వాస తీసుకోవడం గమనించి.. ఏమైందని అడిగారు. నా ముక్కు సరిగా పనిచేయదని.. శ్వాస విషయంలో ఇబ్బంది పడుతున్న అని చెప్పాను. వెంటనే ఆయన.. ‘బాధపడకు.. నీ సర్జరీ గురించి నేను చూసుకుంటా. నీకేం కానివ్వను’ అని భరోసా ఇచ్చారు’’ అని సదరు అభిమాని ఫోకస్డ్ ఇండియన్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.ధోని గ్రేట్అతడి వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా.. ధోని గ్రేట్ అంటూ అభిమానులు మురిసిపోతున్నారు. కాగా 42 ఏళ్ల వయసులో సీఎస్కే కెప్టెన్‌గా వైదొలిగిన ధోని.. ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందే పగ్గాలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడు.గైక్వాడ్ సారథ్యంలో వికెట్ కీపర్బ్యాటర్గా కొనసాగాడు ధోని. అయితే, డిఫెండింగ్ చాంపియన్ చెన్నై ఈసారి ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే నిష్క్రమించింది.చదవండి: Hardik-Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్Conversation between @msdhoni and fan 🥹💛Fan told him he has some breathing issues and there is surgery of it. He wanted to meet him before surgery. Mahi replied "Teri surgery ka mai dekh lunga. Tujhe kuch nahi hoga, tu ghabara mat. Mai tujhe kuch nahi hone dunga" pic.twitter.com/wKz9aZOVGQ— ` (@WorshipDhoni) May 29, 2024 -
Virat Kohli: కీలక మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి షాక్?!
ఐపీఎల్-2024 ఆరంభంలో పేలవ ప్రదర్శనతో విమర్శలపాలైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఊహించని విజయాలతో ప్లే ఆఫ్స్‌నకు దూసుకువచ్చింది. లీగ్ దశలో వరుసగా ఆరు మ్యాచ్‌లలో ఓడిన తర్వాత కూడా ఏమాత్రం డీలాపడకుండా.. పట్టుదలగా పోరాడి టాప్-4లో స్థానం సంపాదించింది.ఆరు మ్యాచ్‌లలో వరుసగా గెలుపొంది రాజస్తాన్ రాయల్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌కు సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. ఈ నేపథ్యంలో కీలక మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ ప్రాక్టీస్ సెషన్ రద్దు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.ఉగ్ర ముప్పు పొంచి ఉందనే సందేహాల నడుమ విరాట్ కోహ్లి భద్రతా కారణాల దృష్ట్యా ఆర్సీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆనంద్ బజార్ పత్రిక, హిందుస్థాన్ టైమ్స్ కథనం వెల్లడించింది. అహ్మదాబాద్‌లో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి.అతడు జాతీయ నిధిఈ మేరకు.. ‘‘అహ్మదాబాద్ చేరుకోగానే ఈ విషయం గురించి విరాట్ కోహ్లికి తెలిసింది. అతడు జాతీయ నిధి. అతడి భద్రతే మా ప్రథమ ప్రాధాన్యం. ఆర్సీబీ ఈ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు.వాళ్లకు ఈ విషయం చెప్పిన తర్వాత ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేసుకున్నట్లు తెలిపింది. రాజస్తాన్ రాయల్స్‌కు కూడా ఈ విషయం గురించి తెలిసింది. అయితే, వాళ్లు యథాతథంగా ప్రాక్టీస్ చేశారు’’ అని పోలీస్ అధికారి విజయ్ సంఘా పేర్కొన్నట్లు హిందుస్థాన్ టైమ్స్ తెలిపింది.ఈ క్రమంలోనే గుజరాత్ కాలేజీ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయాల్సిన ఆర్సీబీ తమ ప్రాక్టీస్ సెషన్‌తో పాటు ప్రీ- ప్రెస్‌మీట్‌ను కూడా క్యాన్సిల్ చేసుకున్నట్లు వెల్లడించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం... ఇందుకు ఉగ్ర ముప్పు కారణం కాదని తెలుస్తోంది.భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదు.. కారణం అదే‘‘భద్రతకు సంబంధించి ఎలాంటి అనుమానాలు లేవు. అంతగా సమస్య ఉందనుకుంటే ఇండోర్‌లో ప్రాక్టీస్ సెషన్ నిర్వహించుకోవచ్చని వాళ్లకు చెప్పాము. అయితే, వేడిమి తట్టుకోలేకమంటూ వాళ్లు సెషన్ రద్దు చేసుకున్నారు’’ అని అహ్మదాబాద్ స్టేడియం వద్ద పనిచేసే సిబ్బంది తెలిపినట్లు ఇండియా టుడే వెల్లడించింది. కారణాలు ఏమైనా మొత్తానికి కీలక మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ ప్రాక్టీస్ చేయలేదన్నది స్పష్టమైంది. ఒక రకంగా ఇది ఎదురుదెబ్బ లాంటిదే!చదవండి: RR vs RCB: వార్ వన్‌సైడ్.. గెలిచేది ఆ జట్టే: టీమిండియా దిగ్గజం -
మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని.. ‘పారిపోయిన’ ధోని! వైరల్
టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి మిస్టర్ కూల్ అని నిరూపించుకున్నాడు. మ్యాచ్ మధ్యలో మైదానంలోకి దూసుకువచ్చిన అభిమానిని ఆలింగనం చేసుకుని సాదరంగా వీడ్కోలు పలికాడు.గుజరాత్ టైటాన్స్- సీఎస్కే మధ్య శుక్రవారం నాటి మ్యాచ్ సందర్భంగా ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు ఆశలను సజీవం చేసుకునే క్రమంలో ఇరు జట్లు అహ్మదాబాద్ వేదికగా తలపడ్డాయి.సొంతమైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ ఓపెనర్ల విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి 231 పరుగుల భారీ స్కోరు సాధించింది.శతకాల మోతసాయి సుదర్శన్(103), శుబ్‌మన్ గిల్(104) శతకాల మోతతో నరేంద్ర మోదీ స్టేడియాన్ని హోరెత్తించారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై టాపార్డర్ కుప్పకూలగా.. మిడిలార్డర్ ఆదుకుంది. కానీ ఓటమి నుంచి తప్పించలేకపోయింది.నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు మాత్రమే చేసిన చెన్నై జట్టు టైటాన్స్ ముందు తలవంచింది. 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని 11 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచాడు.అయితే, ఆఖరి ఓవర్లో రషీద్ ఖాన్ బౌలింగ్ తొలి రెండు బంతుల్లో సిక్సర్లు బాది ధోని జోరు మీద ఉండగా... మూడో బంతికి ఎల్బీడబ్ల్యూ అప్పీలు చేసింది ప్రత్యర్థి జట్టు. కానీ బాల్ వికెట్స్ మిస్ చేసినట్లుగా తేలడంతో ధోని నాటౌట్‌గా నిలిచాడు.పాదాలకు నమస్కరించగానేఅయితే, ఇదే సమయంలో ఓ యువకుడు మైదానంలోకి దూసుకువచ్చాడు. అతడి రాకను గమనించిన ధోని తొలుత దూరంగా పారిపోతున్నట్లు నటించాడు. అతడు వచ్చి పాదాలకు నమస్కరించగానే భుజం తట్టిలేపి ఆలింగనం చేసుకుని ఇక వెళ్లు అన్నట్లుగా కూల్‌గా డీల్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తలా క్రేజ్, ఫ్యాన్స్ పట్ల అతడు వ్యవహరించే తీరు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.చదవండి: కొడుకు దూరం.. టీమిండియాలో చోటు కరువు.. ఐపీఎల్‌లోనూ అలా! పాపం..Best moments of IPL 🥹💛That Hug and That smile Mahi The Man The Myth The Legend 🥰 Demi God for Millions of Indians 🇮🇳 Ms Dhoni 🐐 #DHONI𓃵#ChennaiSuperKings#CSKvGT #Ahmedabad #TATAIPL2024 #T20WorldCup2024 pic.twitter.com/m8MA8YdKzh— Srinivas Mallya🇮🇳 (@SrinivasMallya2) May 11, 2024Ms Dhoni knows exactly how to make the stadium roar with his mass entry 🥹🔥🔥#CSKvsGT | #DHONI𓃵pic.twitter.com/U5DA5meNaw— 𝑃𝑖𝑘𝑎𝑐ℎ𝑢☆•° (@11eleven_4us) May 10, 2024The Helicopter Shot 🚁A maximum from #CSK's Number 7️⃣💥Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #GTvCSK pic.twitter.com/2QAN3jPjTb— IndianPremierLeague (@IPL) May 10, 2024 -
అహ్మదాబాద్‌లో స్కూళ్లకు బాంబు బెదిరింపులు
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో సోమవారం పలు స్కూళ్లకు వచ్చిన బాంబు బెదిరింపులు కలకాలం రేపాయి. దీంతో అప్రమత్తమైన పోలీసు యాత్రాంగం, బాంబ్ స్క్వాడ్స్ బెదిరింపులు వచ్చిన అన్ని పాఠశాలల్లో తనిఖీలు చేపట్టాయి. అయితే ఎటువంటి బాంబులు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. సియా గురుకుల పాఠశాల, థాల్తేజ్‌లోని ఆనంద్ నికేతన్, డీసీఎస్ బోపాల్, మెమ్నగర్లోని హెచ్‌బీకే పాఠశాల, థాల్తేజ్‌లోని జెబార్ పాఠశాల, ఎస్జీ రోడ్డులోని కాస్మోస్ క్యాజిల్ ఇంటర్నేషనల్ స్కూల్, చంద్ఖేడా, షాహిబాగ్ కంటోన్మెంట్‌లోని రెండు కేంద్రీయ విద్యాలయాలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన స్కూళ్ల యాజమాన్యం విద్యార్థులను ఖాళీ చేయించాయి.ఈ ఘటనపై అహ్మదాబాద్ పోలీసు కమినిషనర్ జీఎస్ మాలిక్ మాట్లాడుతూ.. రష్యన్ సర్వర్ నుంచి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. అరబిక్‌లో భాషా పదాలలో బాంబు బెదిరింపులు వచ్చాయి. బాంబు బెదిరింపు మెయిల్స్‌పై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. గుజరాత్లో ఎన్నికల పోలింగ్‌కు ఒకరోజు ముందు బాంబు బెదిరింపులు వచ్చాయని తెలిపారు. ఇటీవల ఢిల్లీ పరిధిలోని దాదాపు 200 స్కూళ్లకు బాంబు బెదిరింపు మియిల్స్ వచ్చిన విషయం తెలిసిందే. -
ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
గాంధీనగర్ : గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్ వేపై నిలిపి ఉంచిన ట్రక్కుపైకి ఓ కారు వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 10 మంది మరణించారు. ఖేడా జిల్లాలోని నదియాడ్ పట్టణం సమీపంలో బుధవారం ఈ ఘటన వెలుగుచూసింది. అతివేగం కారణంగా మారుతీ సుజుకి ఎర్టిగా కారు అదుపుతప్పి ట్రక్కు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 8 మంది చనిపోగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు. బాధితులు వడోదర నుంచి అహ్మదాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో 93 కిలోమీటర్ల పొడవైన ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు చదవండి: ‘అణు బాంబుల ధ్వంసం.. సీపీఎంపై రాజ్‌నాథ్ ఫైర్ -
ప్రకృతి సేద్యం నిశ్శబ్ద విప్లవం!
సాక్షి సాగుబడి, అహ్మదాబాద్ (గుజరాత్): ప్రకృతి వ్యవసాయం ఒక నిశ్శబ్ద విప్లవమని, స్వావలంబన విప్లవమని పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుభాష్ పాలేకర్ స్పష్టం చేశారు. అహ్మదాబాద్‌కు దగ్గరలోని బోటాడ్ జిల్లా పాలియాడ్లో శుక్రవారం సుభాష్ పాలేకర్ కృషి పై మూడు రోజుల శిక్షణ శిబిరం ప్రారంభమైంది. అనేక రాష్ట్రాలతో పాటు నేపాల్ నుంచి సుమారు 500 మంది రైతులు, రైతు శ్రేయోభిలాషులు ఈ శిబిరంలో పాల్గొంటున్నారు. పాలేకర్ ప్రసంగిస్తూ తన సేద్య పద్ధతిలో భూమిలో హ్యుమస్ పెరగటం వల్ల 90 శాతం సాగునీరు ఆదా అవుతుందన్నారు. పంటలు నేల నుంచి కన్నా వాతావరణం నుంచి ఎక్కువ నీటిని తీసుకుంటాయన్నారు. రసాయన రహిత వ్యవసాయ ఉత్పత్తులను రైతుల నుంచి నేరుగా వినియోగదారులు కొనుగోలు చేసుకునే ప్రత్యామ్నాయ స్వయం నియంత్రిత, స్వావలంబన వ్యవస్థ లో ధర నిర్ణయించే హక్కు రైతులేనని, ప్రభుత్వ జోక్యం అవసరం లేదన్నారు. వ్యవసాయ సంక్షోభానికి మూలం పంట పొలంలో పర్యావరణ సంక్షోభమే కారణమన్నారు. సుభాష్ పాలేకర్ కృషి పద్ధతి ఈ సంక్షోభాన్ని పరిష్కరించటంలో కీలక పాత్ర పోషిస్తుందని, ఆత్మ హత్యల్లేని సమాజాన్ని నిర్మిస్తుందని పాలేకర్ తెలిపారు. వాతావరణ మార్పులని ఎదుర్కోవటం ఈ సేద్యం వల్లనే సాధ్యం అన్నారు. ఇవి చదవండి: The Goat Life: 700 గొర్రెలూ.. ఎడారి.. అతను -
IPL 2024: ఫైనల్ మ్యాచ్ వేదిక ఖరారు
ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్ మ్యాచ్ వేదిక ఖరారైనట్లు తెలుస్తుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియాన్ని వేదిగా నిర్ణయించినట్లు సమాచారం. ముందుగా అనుకున్నట్లు అహ్మదాబాద్ ఫైనల్ మ్యాచ్‌కు వేదిక కాదని తేలిపోయింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో క్వాలిఫయర్, ఓ ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుందని తెలుస్తుంది. మరో ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్‌లు చెన్నైలో జరుగనున్నట్లు సమాచారం. ఫైనల్ మ్యాచ్ తేదీపై కూడా స్పష్టత వచ్చినట్లు తెలుస్తుంది. ముందుగా అనుకున్నట్లు మే 26న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఫైనల్ తేదీ, వేదికలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఆనవాయితీ ప్రకారం.. డిఫెండింగ్ ఛాంపియన్స్ హోం గ్రౌండ్‌లోనే ఆరంభ మరియు ఫైనల్ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఇదే సంప్రదాయాన్ని ఐపీఎల్ గవర్నింగ్ బాడీ ఈ సీజన్‌కు కూడా కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం భారత్‌లోనే అత్యధిక కెపాసిటీ కలిగిన స్టేడియం కావడంతో ఇక్కడ ఫైనల్ జరిగితే బాగుంటుందని కొందరు పెద్దలు అభిప్రాయపడినప్పటికీ.. గవర్నింగ్ బాడీ అంతిమంగా చెన్నైనే ఫైనల్ చేసినట్లు సమాచారం. కాగా, ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సీజన్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇవాళ (మార్చి 24) మరో రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్, లక్నో జట్లు (జైపూర్) తలపడనుండగా.. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో గుజరాత్, ముంబై ఇండియన్స్ (అహ్మదాబాద్) ఢీకొట్టనున్నాయి. -
గుజరాత్ వర్సిటీలో విదేశీ విద్యార్థులపై దాడి.. ఇద్దరు అరెస్ట్
అహ్మదాబాద్: గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లోని గుజరాత్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులపై కొందరు దాడికి దిగారు. క్యాంపస్‌లోని ఎ–బ్లాక్ హాస్టల్లో విదేశీ విద్యార్థులు కొందరు శనివారం రాత్రి నమాజ్ చేస్తుండగా ముగ్గురు విద్యార్థులు అడ్డుకున్నారు. వారికి మరో 200 మంది తోడై విధ్వంసం సృష్టించారు. రాళ్లు రువ్వడంతో శ్రీలంక, తజికిస్తాన్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు 25 మందిపై కేసులు పెట్టి ముగ్గురిని అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఇలాంటి ఘటనలను పునరావృతం కానివ్వబోమని వీసీ నీరజా అరుణ్ గుప్తా స్పష్టం చేశారు. బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని విదేశాంగ శాఖ పేర్కొంది.