అహ్మదాబాద్, బోటాడ్ జిల్లా పాలియాడ్‌లోని రైతు సదస్సులో ప్రసంగిస్తున్న డా. సుభాష్ పాలేకర్
పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుభాష్ పాలేకర్
సాక్షి సాగుబడి, అహ్మదాబాద్ (గుజరాత్): ప్రకృతి వ్యవసాయం ఒక నిశ్శబ్ద విప్లవమని, స్వావలంబన విప్లవమని పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుభాష్ పాలేకర్ స్పష్టం చేశారు. అహ్మదాబాద్‌కు దగ్గరలోని బోటాడ్ జిల్లా పాలియాడ్‌లో శుక్రవారం సుభాష్ పాలేకర్ కృషి పై మూడు రోజుల శిక్షణ శిబిరం ప్రారంభమైంది. అనేక రాష్ట్రాలతో పాటు నేపాల్ నుంచి సుమారు 500 మంది రైతులు, రైతు శ్రేయోభిలాషులు ఈ శిబిరంలో పాల్గొంటున్నారు.
పాలేకర్ ప్రసంగిస్తూ తన సేద్య పద్ధతిలో భూమిలో హ్యుమస్ పెరగటం వల్ల 90 శాతం సాగునీరు ఆదా అవుతుందన్నారు. పంటలు నేల నుంచి కన్నా వాతావరణం నుంచి ఎక్కువ నీటిని తీసుకుంటాయన్నారు. రసాయన రహిత వ్యవసాయ ఉత్పత్తులను రైతుల నుంచి నేరుగా వినియోగదారులు కొనుగోలు చేసుకునే ప్రత్యామ్నాయ స్వయం నియంత్రిత, స్వావలంబన వ్యవస్థ లో ధర నిర్ణయించే హక్కు రైతులేనని, ప్రభుత్వ జోక్యం అవసరం లేదన్నారు.
వ్యవసాయ సంక్షోభానికి మూలం పంట పొలంలో పర్యావరణ సంక్షోభమే కారణమన్నారు. సుభాష్ పాలేకర్ కృషి పద్ధతి ఈ సంక్షోభాన్ని పరిష్కరించటంలో కీలక పాత్ర పోషిస్తుందని, ఆత్మ హత్యల్లేని సమాజాన్ని నిర్మిస్తుందని పాలేకర్ తెలిపారు. వాతావరణ మార్పులని ఎదుర్కోవటం ఈ సేద్యం వల్లనే సాధ్యం అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment