Palekar
-
ప్రకృతి సేద్యం నిశ్శబ్ద విప్లవం!
సాక్షి సాగుబడి, అహ్మదాబాద్ (గుజరాత్): ప్రకృతి వ్యవసాయం ఒక నిశ్శబ్ద విప్లవమని, స్వావలంబన విప్లవమని పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుభాష్ పాలేకర్ స్పష్టం చేశారు. అహ్మదాబాద్‌కు దగ్గరలోని బోటాడ్ జిల్లా పాలియాడ్లో శుక్రవారం సుభాష్ పాలేకర్ కృషి పై మూడు రోజుల శిక్షణ శిబిరం ప్రారంభమైంది. అనేక రాష్ట్రాలతో పాటు నేపాల్ నుంచి సుమారు 500 మంది రైతులు, రైతు శ్రేయోభిలాషులు ఈ శిబిరంలో పాల్గొంటున్నారు. పాలేకర్ ప్రసంగిస్తూ తన సేద్య పద్ధతిలో భూమిలో హ్యుమస్ పెరగటం వల్ల 90 శాతం సాగునీరు ఆదా అవుతుందన్నారు. పంటలు నేల నుంచి కన్నా వాతావరణం నుంచి ఎక్కువ నీటిని తీసుకుంటాయన్నారు. రసాయన రహిత వ్యవసాయ ఉత్పత్తులను రైతుల నుంచి నేరుగా వినియోగదారులు కొనుగోలు చేసుకునే ప్రత్యామ్నాయ స్వయం నియంత్రిత, స్వావలంబన వ్యవస్థ లో ధర నిర్ణయించే హక్కు రైతులేనని, ప్రభుత్వ జోక్యం అవసరం లేదన్నారు. వ్యవసాయ సంక్షోభానికి మూలం పంట పొలంలో పర్యావరణ సంక్షోభమే కారణమన్నారు. సుభాష్ పాలేకర్ కృషి పద్ధతి ఈ సంక్షోభాన్ని పరిష్కరించటంలో కీలక పాత్ర పోషిస్తుందని, ఆత్మ హత్యల్లేని సమాజాన్ని నిర్మిస్తుందని పాలేకర్ తెలిపారు. వాతావరణ మార్పులని ఎదుర్కోవటం ఈ సేద్యం వల్లనే సాధ్యం అన్నారు. ఇవి చదవండి: The Goat Life: 700 గొర్రెలూ.. ఎడారి.. అతను -
సాగుబడి: పాలేకర్ ఫుడ్ ఫారెస్ట్‌లో ఎకరానికి రూ. 6 లక్షల ఆదాయం!
"పాలేకర్ ఫుడ్ ఫారెస్ట్ ఐదు అంచెల పంటల సాగు నమూనాతో ఎకరానికి ఏటా రూ. 6 లక్షల ఆదాయం సమకూరుతుందని పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. సుభాష్ పాలేకర్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. గుజరాత్లో ఫైవ్ లేయర్ ఫుడ్ ఫారెస్ట్లు తన టెక్నాలజీకి నిదర్శనంగా నిలిచాయని, తొలి ఏడాదే రూ. 2 లక్షలు, ఆరో ఏడాది నుంచి రూ. 6 లక్షల ఆదాయం సమకూరుతోందన్నారు. ఆసక్తిగల రైతులు గుజరాత్ వస్తే తానే స్వయంగా చూపిస్తానన్నారు." ఈ నెల 29,30,31 తేదీల్లో అహ్మదాబాద్‌కు 151 కి.మీ. దరంలోని పాలియాడ్ (బోటాడ్ జిల్లా)లోని శ్రీ విషమన్ బాపు ప్యాలెస్ మందిర్‌లో (ఆంగ్లం/ హిందీ) రైతు శిక్షణా శిబిరంలో పాల్గొనే వారికి ఈ ఫుడ్ ఫారెస్ట్‌లను స్వయంగా చూపిస్తానన్నారు. 3 రోజులకు ఫీజు రూ.700. ఇతర వివరాలకు.. ఘనశ్యాం భాయ్ వాల– 63550 77257, కశ్యప్ భాయ్‌చౌహాన్– 85303 13211. పుట్టగొడుగుల సాగుపై 26 రోజుల ఉచిత శిక్షణ.. ఇంటర్/డిప్లొమా దశలో చదువు మధ్యలో ఆపేసిన గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం, ‘ఆస్కి’ సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు పుట్టగొడుగుల పెంపకంపై పూర్తిస్థాయి శిక్షణా శిబిరం జరగనుంది. హైదరాబాద్ (రాజేంద్రనగర్‌లోని పిజెటిఎస్ఎయు ఆవరణ) లోని విస్తరణ విద్యా సంస్థలో జరిగే ఈ శిబిరంలో పాల్గొనే వారికి బోధనతో పాటు భోజన, వసతి కూడా పూర్తిగా ఉచితం. చిన్న స్థాయి పుట్టగొడుగుల రైతుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని అంశాలపై నైపుణ్య శిక్షణ ఇస్తారు. 16 ఏళ్లు పైబడిన గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులు అర్హులు. ఇంటర్ ఫస్టియర్ పాస్ లేదా టెన్త్ తర్వాత వ్యవసాయ/ అనుబంధ విభాగాల్లో 3 ఏళ్ల డిప్లొమా మొదటి ఏడాది పూర్తి చేసిన లేదా పదో తరగతి పాసైన తర్వాత కనీసం ఒక ఏడాది పుట్టగొడుగుల పెంపకంలో అనుభవం పొందిన వారు లేదా 8వ తరగతి పాసైన తర్వాత కనీసం 3 ఏళ్లుగా పుట్టగొడుగులు పెంపకం పని చేస్తున్న వారు.. ఈ ఉచిత శిక్షణకు అర్హులు. విద్యార్హత, కులధృవీకరణ, ఆధార్, ఫోటో తదితర వివరాలను పొందుపరుస్తూ ఆన్లైన్లో గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఈ క్యూ.ఆర్. కోడ్‌ను స్కాన్ చేయండి. ఇతర వివరాలకు.. 040– 2405368, 98666 18107. eeihyd1962@gmail.com 22 నుంచి దేశీ వరి సాగు, నీటి సంరక్షణపై ‘సేవ్’ శిక్షణ.. విశాఖపట్నం కృష్ణాపురంలోని సింహాచలం దేవస్థానం గోశాల (న్యూ)లో ఈ నెల 22 నుంచి 26 వరకు దేశీ వరి సాగుదారులు, దేశీ వరి బియ్యాన్ని సేకరించి ఆలయాల్లో నైవేద్యాల కోసం అందించే దాతలతో రైతుల ముఖాముఖి పరిచయ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకృతి వ్యవసాయ సాధకులు, ‘సేవ్’ సంస్థ నిర్వాహకులు విజయరామ్ తెలిపారు. పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో దేశీ వరి రకాల సాగు, ఉద్యాన పంటల 5 లేయర్ సాగు, వాననీటి సంరక్షణకు ఇంకుడు గుంతల తవ్వకంపై రైతులకు శిక్షణ ఇస్తామన్నారు. పెళ్లిళ్లలో ఔషధ గుణాలు గల సంప్రదాయ వంటకాలు వడ్డించే ఆసక్తి గల వారికి ఆ వంటకాలను కూడా ఈ శిబిరంలో పరిచయం చేస్తామన్నారు. ‘శబలా భోజన పండుగ’ పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలన్నీ ఐదు రోజులూ జరుగుతాయని, ఆసక్తిగల వారు ఏదో ఒక రోజు హాజరైతే చాలని విజయరామ్ తెలిపారు. వివరాలకు.. సేవ్ కార్యాలయం 63091 11427, సురేంద్ర 99491 90769. 29 నుంచి సేవాగ్రామ్‌లో జాతీయ విత్తనోత్సవం! వాతావరణ మార్పుల్ని తట్టుకునే శక్తి దేశీ వంగడాలకే ఉందనే నినాదంతో ఈ నెల 29 నుంచి 31 వరకు మహారాష్ట్ర వార్థా జిల్లా సేవాగ్రామ్‌లోని నాయ్ తాలిమ్ సమితి పరిసర్లో వార్షిక జాతీయ విత్తనోత్సవం జరగనుంది. దేశం నలుమూలల నుంచి అనేక పంటల దేశీ వంగడాల ప్రదర్శన, అమ్మకంతో పాటు సేంద్రియ రైతుల సదస్సులు, క్షేత్ర సందర్శనలు, నిపుణులతో ముఖాముఖి వంటి కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. రుసుము రూ. వెయ్యి. వివరాలకు.. యుగంధర ఖోడె – 91302 17662, ప్రతాప్ మరొడె – 75888 46544. ఇవి చదవండి: సాగుబడి: ఈ సరికొత్త ప్రయోగంతో.. కరువును తట్టుకున్న పంటలు! -
కాకినాడలో 24 నుంచి పాలేకర్ 8 రోజుల శిక్షణా శిబిరం
పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ (జీరోబడ్జెట్ నాచురల్ ఫార్మింగ్) పద్ధతిలో పంటల సాగుపై పూర్తిస్థాయి 8 రోజుల శిక్షణా శిబిరం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఈ నెల 24 నుంచి 31 వరకు జరగనుంది. ఆహార, వాణిజ్య, ఉద్యాన పంటలను జీరోబడ్జెట్ పద్ధతిలో సాగు చేసే పద్ధతులపై పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయోద్యమ పితామహుడు సుభాష్ పాలేకర్ సంపూర్ణ శిక్షణ ఇస్తారు. ఆయన ఆంగ్ల / హిందీ ప్రసంగాన్ని అప్పటికప్పుడే నిపుణులు తెలుగులోకి అనువదించి చెబుతారు. కాకినాడలోని భావన్నారాయణ ఆలయం సమీపంలో శ్రీచైతన్య పాలిటెక్నిక్ కాలేజీ (అశోక్ లేలాండ్ ఎదుట)లో శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న ఈ ఉచిత శిక్షణా శిబిరంలో తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన రైతులకు కూడా ప్రవేశం కల్పించనున్నట్లు శిబిరం నిర్వాహక కమిటీ సభ్యుడు, ప్రకృతి వ్యవసాయదారుడు పెండేకంటి శరత్ ‘సాక్షి’తో చెప్పారు. మహిళా రైతులకు ప్రత్యేక వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులు 23వ తేదీ రాత్రికి లేదా 24వ తేదీ ఉదయం 8 గంటల లోగా కాకినాడ చేరుకోవాలి. శిక్షణ జనవరి 31న ముగుస్తుంది. ఫిబ్రవరి 1వ తేదీన సర్టిఫికెట్ల పంపిణీ ఉంటుంది. శిక్షణ, భోజన, వసతి సదుపాయాలు ఉచితం. 5,500 మంది రైతులను మాత్రమే శిక్షణకు అనుమతిస్తారు. ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వారు మాత్రమే శిక్షణకు అర్హులు. ఈ నెల 21వ తేదీలోగా (ఈ మెయిల్ ద్వారా కూడా) పేర్లు నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు.. పెండేకంటి శరత్ : 099898 53366, sarathpendekanti@gmail.com త్రినాథ్: 089770 97405, thrinadh45@gmail.com -
ప్రకృతి సేద్యం బాగుంటే అమలు చేస్తాం
పెట్టుబడి లేని ఈ సేద్యాన్ని సమర్థిస్తున్నా రైతులపై బలవంతంగా రుద్దం: మంత్రి పోచారం పాలేకర్ పద్ధతి పాటిస్తే.. రైతు ఆత్మహత్యలుండవు 17,18 తేదీల్లో మహారాష్ట్రకు చెరకు రైతుల బృందం సాక్షి, హైదరాబాద్: పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న రైతుల పొలాలకు వెళ్లి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తామని, రైతులకు ప్రయోజనకరమని రుజువైతే ఈ పద్ధతిని ప్రభుత్వపరంగా అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం వెనుకాడబోదని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లో సేవ్ స్వచ్ఛంద సంస్థ అధినేత విజయరామ్ ఆధ్వర్యంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై రైతుల శిక్షణా శిబిరం జరిగింది. ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్‌తోపాటు తొలిసారిగా మంత్రి పోచా రం, పలువురు ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు ఈ శిబిరంలో పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ ఈ జీరో బడ్జెట్ వ్యవసాయ పద్ధతిపై రైతుగా తన పూర్తి మద్దతు ఉందన్నారు. విజయరామ్ ఆధ్వర్యంలో తన పొలంలో ప్రకృతి వ్యవసాయం చేయిస్తున్నానన్నారు. అయితే, రైతులందరికీ ఇది ప్రయోజనకరమని తేలితే తప్పకుండా ప్రభుత్వ విధానంగా చేపడతామన్నారు. దీన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, ప్రకృతి వ్యవసాయ భగీరథుడైన సుభాష్ పాలేకర్‌తో సమావేశం ఏర్పాటు చేయిస్తామన్నారు. పాలేకర్ వ్యవసాయ పద్ధతి పాటిస్తే రైతులకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం రాదన్నారు. రైతులకు రుణాలివ్వడం గొప్పకాదని .. రైతులు అప్పుల కోసం ఎదురుచూడాల్సిన అవసరంలేని వ్యవసాయ పద్ధతిని అందించడమే గొప్ప అన్నారు. ప్రకృతి వ్యవసాయంలో 80 టన్నుల దిగుబడి సాధిస్తున్న చెరకు తోటల పరిశీలనకు జనవరి 17,18 తేదీల్లో రైతుల బృందాన్ని మహారాష్ట్ర పంపనున్నట్లు తెలిపారు. ఇది ఆత్మహత్యలకు పరిష్కారం: పాలేకర్ తెలంగాణ, విదర్భతోపాటు దేశంలో తిష్టవేసిన వ్యవసాయ సంక్షోభానికి కారణం రసాయనిక, సేంద్రియ వ్యవసాయ పద్ధతులేనని సుభాష్ పాలేకర్ అన్నారు. రసాయనిక ఎరువులు, సేంద్రియ ఎరువులతో కూడా పని లేకుండా 90% సాగునీటిని, విద్యుత్‌ను ఆదా చేసుకుంటూ కచ్చితంగా దిగుబడులు పెంచుకోవడానికి పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో అవకాశం ఉందన్నారు. ఇది కల కా దని, దేశంలో 40 లక్షల మంది రైతులు ఇప్పటికే ఈ పద్ధతిని అనుసరిస్తున్నారన్నారు. ఈ పద్ధతిని ప్రభుత్వం అధికారిక వ్యవసాయ విధానంగా ప్రకటిస్తే రైతుల ఆత్మహత్యలకు తావు లేదని, కేన్సర్, మధుమేహం వంటి వ్యాధులకు అడ్డుకట్ట వేయడానికీ ఇదే మార్గమని పాలేకర్ స్పష్టం చేశారు. తెలంగాణలో త్వరలో 8 రోజులపాటు ప్రత్యేక రైతు శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ శిబిరంలో జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పరిశోధన సంచాలకులు డాక్టర్ రాజిరెడ్డి, పశుసంవర్థక శాఖ డెరైక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు ధర్మానాయక్, ఆత్మ డెరైక్టర్ విజయకుమార్ , 1500 మంది రైతులు పాల్గొన్నారు.