చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతాలో చౌక
మంబై, ఢిల్లీలో చాలా ఖరీదు
మ్యాజిక్‌బ్రిక్స్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: అందుబాటు ధరల ఇళ్లకు చిరునామాగా చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా నగరాలు నిలుస్తున్నాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), ఢిల్లీ నగరాలు మాత్రం ఇళ్ల కొనుగోలు పరంగా ఖరీదైనవని ప్రాప్‌టెక్ సంస్థ మ్యాజిక్‌బ్రిక్స్ వెల్లడించింది. ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరల తీరుపై ఒక నివేదిక విడుదల చేసింది. ఓ ఇంటి వార్షిక ఆదాయం నుంచి ఇంటి ధర (పీఐ రేషియో) నిష్పత్తి 2020లో ఉన్న 6.6 శాతం నుంచి 2024లో 7.5 శాతానికి పెరిగింది. అంటే ఓ ఇంటి వారందరూ ఏడున్నరేళ్లు కష్టపడి సంపాదించినంతా వెచ్చిస్తే కానీ ఇల్లు సమకూర్చుకోలేని పరిస్థితి.
పీఐ రేషియో చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతాలో 5 చొప్పున ఉంది. అందుకే ఇక్కడి ఇళ్ల ధరలు అందుబాటులో ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొంది. ఎంఎంఆర్‌లో 14.3గా ఉంటే, ఢిల్లీలో 10.1గా ఉంది. అంటే ఇక్కడ ఇళ్ల ధరలు ఖరీదుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈఎంఐ – నెలవారీ ఆదాయం రేషియో 2020లో ఉన్న 46 శాతం నుంచి 2024 నాటికి 61 శాతానికి పెరిగింది. అంటే నెలవారీ వేతనంలో ఈఎంఐ వాటా 61 శాతానికి చేరింది. ఇళ్ల కొనుగోలుదారులపై పెరిగిన ఈఎంఐ భారాన్ని ఇది సూచిస్తోంది. నెలవారీ ఆదాయంలో ఈఎంఐ రేషియో ఢిల్లీలో 82 శాతం, ఎంఎంఆర్‌లో 116 శాతంగా ఉంది. హైదరాబాద్, గురుగ్రామ్‌లో 61 శాతం చొప్పున ఉంది. అహ్మదాబాద్, చెన్నైలో 41 శాతంగా, కోల్‌కతాలో 47 శాతంగా ఉంది.
అసాధారణంగా పెరిగిన ధరలు
2021 ద్వితీయ ఆరు నెలలతోపాటు 2022లోనూ ఇళ్ల ధరలు ఎంతో అందుబాటులో ఉన్నాయి. తక్కువ వడ్డీ రేట్లు, గృహ ఆదాయాలు తిరిగి పుంజుకోవడంతో ఈ కాలంలో ఇళ్ల ధరలు తిరిగి పుంజుకున్నాయి. సొంతిల్లు కలిగి ఉండాలన్న ఆకాంక్షతో డిమాండ్ సరఫరాను మించిపోయింది. దీంతో ఇళ్ల ధరలు అసాధారణ స్థాయిలో పెరిగాయి. దీంతో అందుబాటు ధరల ఇళ్ల కొనుగోలు పరంగా సవాళ్లను తీసుకొచి్చంది’’అని మ్యాజిక్‌బ్రిక్స్ సీఈవో సు«దీర్ పాయ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment