వక్ఫ్ బిల్లు ఆమోదంపై భారీ ఎత్తున నిరసనలు | After Waqf Bill Clears Huge Protests In Kolkata, Chennai | Sakshi
Sakshi News home page

వక్ఫ్ బిల్లు ఆమోదంపై భారీ ఎత్తున నిరసనలు

Published Fri, Apr 4 2025 6:38 PM | Last Updated on Fri, Apr 4 2025 7:14 PM

After Waqf Bill Clears Huge Protests In Kolkata, Chennai

న్యూఢిల్లీ: పార్లమెంట్ లో వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం ముద్ర పడిన కొన్ని గంటల వ్యవధిలోనే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. పార్లమెంట్ లో ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్, తమిళనాడులో నిరసన గళం వినిపిస్తూ నిరసనకు దిగాయి ముస్లిం సంఘాలు. .‘వక్ఫ్ సవరణ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం’ అంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్ కతా, తమినాడులోని చెన్నై, గుజరాత్ లోని అహ్మదాబాద్ లో భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళలన్నీ జాయింట్ ఫారమ్ ఆఫ్ వక్ఫ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలోని జరిగినట్లు జాతీయ న్యూస్ ఏజెన్నీ ఏఎన్ఐ తెలిపింది.

 

అహ్మదాబాద్‌లో తీవ్రరూపం


వక్ఫ్ బిల్లుపై నిరసన కార్యక్రమం అహ్మదాబాద్ లో తీవ్రరూపం దాల్చింది. రోడ్లపై కూర్చొని పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే పోలీసులు వారిని బలవంతంగా తొలగించే ప్రయత్నం చేసే క్రమంలో అక్కడ మరింత  ఉద్రిక్తత నెలకొంది.

తమినాడు వ్యాప్తంగా విజయ్ తమిళగ వెట్రి కజగం నిరసన
చెన్నైలో కూడా ఇలాంటి దృశ్యాలు కనిపించాయి, అక్కడ  ఇటీవలే పార్టీ స్థాపించిన నటుడు విజయ్ ‘తమిళగ వెట్రి కజగం’ రాష్ట్రవ్యాప్త నిరసనను ప్రకటించింది. చెన్నై  కోయంబత్తూర్, తిరుచిరాపల్లి వంటి ప్రధాన నగరాల్లో టీవీకే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. చేతిలో ఫ్లకార్డులతో తమ నిరసన తెలిపారు. ముస్లింల హక్కులను హరించవద్దు అంటూ నిరసన వ్యక్తమైంది.

కాగా, రెండు రోజుల పాటు జరిగిన సుదీర్ఘ చర్చ, తీవ్రస్థాయి వాదోపవాదాల అనంతరం వక్ఫ్‌ (సవరణ) బిల్లు–2025పై పార్లమెంటు ఆమోద ముద్ర పడింది. విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్యే లోక్‌సభ బుధవారం ఈ బిల్లును ఆమోదించడం తెలిసిందే. అది గురువారం రాజ్యసభ ఆమోదం కూడా పొందింది. 13 గంటలకు పైగా జరిగిన చర్చ అనంతరం అర్ధరాత్రి ఒంటి గంట దాటాక  ఓటింగ్‌ ప్రక్రియ సుదీర్ఘంగా జరిగింది.

 

దాదాపుగా ప్రతి సవరణపైనా ఓటింగ్‌కు విపక్షాలు పట్టుబట్టాయి. వాటి సవరణలన్నీ వీగిపోయాయి. చివరికి బిల్లు ఆమోదం పొందింది. దానికి అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు పడ్డాయి. వక్ఫ్‌ బిల్లును కేంద్రం ఇక రాష్ట్రపతి ఆమోదానికి పంపనుంది. రాష్ట్రపతి సంతకం అనంతరం అది చట్టంగా రూపుదాల్చుతుంది. వక్ఫ్‌ బిల్లును లోక్‌సభ 288–232 ఓట్లతో ఆమోదించడం తెలిసిందే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement