చైర్మన్ జగదాంబికా పాల్ తీరుపై విపక్ష సభ్యులు ఆగ్రహం
పది మందిపై ఒకరోజు పాటు సస్పెన్షన్ వేటు
న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లుపై జరిగిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) సమావేశంలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ నేత, చైర్మన్ జగదాంబికా పాల్ నేతృత్వంలో జేపీసీ శుక్రవారం సమావేశమైంది. చైర్మన్ తీరుపై విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ఆయన నడుచుకుంటున్నారని, నియమ నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు.
మీటింగ్ ఎజెండాను రాత్రికి రాత్రే ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారని ధ్వజమెత్తారు. జేపీసీ కార్యకలాపాలను ఒక ఫార్స్‌గా మార్చేశారని దుయ్యబట్టారు. విపక్ష సభ్యుల తీరుపై జగదాంబికా పాల్ అభ్యంతరం వ్యక్తంచేశారు. తనను ఇష్టానుసారంగా దూషిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు కల్యాన్ బెనర్జీపై మండిపడ్డారు. సమావేశానికి అంతరాయం కలిగించడానికే వచ్చారా? అని నిలదీశారు. దీంతో జగదాంబికా పాల్‌కు వ్యతిరేకంగా విపక్ష సభ్యులు బిగ్గరగా నినాదాలు చేశారు.
రెండో చైర్మన్ సమావేశాన్ని రెండు సార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పది మంది విపక్ష సభ్యులను ఒకరోజుపాటు సస్పెండ్ చేస్తూ బీజేపీ సభ్యుడు నిశికాంత్ దూబే తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మాన్ని జేపీసీ ఆమోదించింది. దీంతో కల్యాణ్ బెనర్జీ, నదీమ్–ఉల్ హక్(తృణమూల్ కాంగ్రెస్), మొహమ్మద్ జావెద్, ఇమ్రాన్ మసూద్, సయీద్ నసీర్ హుస్సేన్(కాంగ్రెస్), ఎ.రాజా, మొహమ్మద్ అబ్దుల్లా(డీఎంకే), అసదుద్దీన్ ఓవైసీ(ఎంఐఎం), మొహిబుల్లా(సమాజ్‌వాదీ పారీ్ట), అరవింద్ సావంత్(శివసేన–ఉద్ధవ్) జేపీసీ భేటీ నుంచి సస్పెండయ్యారు.
విపక్ష సభ్యులు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఒక లేఖ రాశారు. ఈ నెల 27న జరగాల్సిన జేపీసీ సమావేశాన్ని వాయిదా వేయాలని కోరారు. మరోవైపు జమ్మూకశీ్మర్‌కు చెందిన మతపెద్ద మిర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ నేతృత్వంలో ఓ బృందం శుక్రవారం జేపీసీతో సమావేశమైంది. వక్ఫ్ సవరణ బిల్లుపై తమ అభ్యంతరాలను కమిటీ దృష్టికి తీసుకొచి్చంది. ఈ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ నెల 29వ తేదీన తమ తుది నివేదికను సిద్ధం చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వక్ఫ్ సవరణ బిల్లు–2024ను కేంద ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 8వ తేదీన జేపీసీకి పంపించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment