Waqf dispute
-
Waqf Amendment Bill: రేపు రాబోం
కోల్‌కతా/న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లుపై సమీక్ష చేపడుతున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నవంబర్ 9వ తేదీ నుంచి మొదలుకానున్న తదుపరి సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు కమిటీలోని విపక్ష సభ్యులు ప్రకటించారు. కమిటీ సభ్యులు కల్యాణ్ బెనర్జీ, నదీముల్ హక్ గురువారం కోల్‌కతాలో మాట్లాడారు. ‘‘విరామం ఇవ్వకుండా, సమీక్షలకు మేం సిద్ధమయ్యే అవకాశం లేకుండా చైర్మన్, బీజేపీ నేత జగదాంబికా పాల్ సమావేశాలకు తేదీలు ఖరారు చేశారు. వేర్వేరు రాష్ట్రాల్లో గువాహటి, భువనేశ్వర్, కోల్‌కతా, పట్నా, లక్నోల్లో ఆరు రోజుల్లో సమావేశాలకు రమ్మంటున్నారు. పాల్ ఏకపక్ష నిర్ణయాలను మేం వ్యతిరేకిస్తున్నాం. అందుకే ఈ దఫా భేటీలను మేం బహిష్కరించబోతున్నాం’’ అని అన్నారు. -
వక్ఫ్ జేపీసీకి విపక్షాలు దూరం!
న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నుంచి విపక్ష పారీ్టల సభ్యులు వైదొలగే అవకాశముంది. కమిటీ చైర్పర్సన్, బీజేపీ సీనియర్ నేత జగదాంబికా పాల్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, నియమ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని విపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎదుట తమ నిరసనను తెలిపేందుకు మంగళవారం వీరంతా ఆయనను కలవాలని నిర్ణయించుకున్నారు. పార్లమెంటరీ కమిటీ సమావేశాల్లో తమ అభిప్రాయాలకు పూచికపుల్లంత అయినా విలువ ఇవ్వట్లేరని, ప్రతిపాదిత బిల్లుపై తమకు తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయంటూ స్పీకర్‌కు ఒక సంయుక్త లేఖ సైతం రాయనున్నాయి. స్వేచ్ఛగా, పారదర్శకంగా కమిటీ సమావేశాలు నిర్వహించేలా జగదాంబికా పాల్‌ను ఆదేశించాలని, లేని పక్షంలో తామంతా కమిటీ నుంచి వైదొలుగుతామని స్పీకర్‌కు విపక్షసభ్యులు మంగళవారం కరాఖండీగా చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. -
వక్ఫ్ జేపీసీకి 1.2 కోట్ల మెయిల్స్
పుణె: వక్ఫ్ (సవరణ) బిల్లు–2024పై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని పార్లమెంటరీ వ్యవహారాలు, మైనార్టీ శాఖల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలోని జేపీసీకి ఏకంగా 1.2 కోట్ల ఈ మెయిల్స్ వచ్చాయని సోమవారం వెల్లడించారు. 75,000 మంది తమ వాదనలకు మద్దతుగా డాక్యుమెంట్లను కూడా సమరి్పంచారని తెలిపారు. బిల్లు సమర్థకులు, వ్యతిరేకులు ఇందులో ఉన్నారన్నారు. వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లును ఈ ఏడాది ఆగస్టు 8న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. విపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో జేపీసీకి పంపిన విషయం తెలిసిందే. బిల్లుపై అసత్య ప్రచారం చేస్తున్నారని, ముస్లింల ఆస్తులను ప్రభుత్వం లాగేసుకుంటుందని దుష్రచారం చేస్తున్నారని రిజిజు మండిపడ్డారు. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ సక్రమంగా జరగాలనేదే ఈ బిల్లు ఉద్దేశమన్నారు. -
ఈ టర్మ్‌లోనే జమిలి ఎన్నికలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ప్రభుత్వ పాలనా కాలంలోనే జమిలి(ఒకేసారి దేశవ్యాప్త) ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టంచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి 100 రోజుల పాలనలో సాధించిన విజయాలపై మంగళవారం పత్రికాసమావేశంలో మంత్రి అశ్వనీవైష్ణవ్‌తో కలిసి అమిత్ సుదీర్ఘంగా మాట్లాడారు. జనగణన ఎప్పుడో త్వరలో చెప్తాం జనగణన ఎప్పుడు జరపబోయేది త్వరలోనే వెల్లడిస్తామని, ప్రకటన చేశాక సంబంధిత వివరాలను తెలియజేస్తామని అమిత్ చెప్పా రు. జనగణన, కులగణన తక్షణం జరపాలంటూ విపక్షాల నుంచి విపరీతమైన డిమాండ్లు వెల్లువెత్తుతున్న తరుణంలో అమిత్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. రైతుల కోసం రూ.15 లక్షల కోట్ల పథకాలు ‘‘రైతాంగం బాగు కోసం సాగురంగంలో 14 విభాగాల్లో రూ.15 లక్షల కోట్ల విలువైన పథకాలను ఈ 100 రోజుల్లో అమల్లోకి తెచ్చాం. వ్యవసాయంలో మౌలిక వసతుల కల్పనకు మౌలిక సాగు నిధి ఏర్పాటుచేశాం. మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక తొలి నిర్ణయం రైతుల కోసమే తీసుకున్నారు. మెరుగైన మౌలిక వసతులకు రూ.3 లక్షల కోట్లు కేటాయించాం.25వేలకు పైగా కుగ్రామాలకు రోడ్ల అనుసంధానం పెంచుతున్నాం. ఉల్లి, బాస్మతి బియ్యంపై కనీస ఎగుమతి ధరను తొలగించాం. వక్ఫ్ ఆస్తులను కాపాడేందుకు కట్టుబడ్డాం. ఆస్తుల దురి్వనియోగాన్నీ వక్ఫ్ (సవరణ) బిల్లు అడ్డుకుంటుంది. గత నెలలో లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టాం. సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు బిల్లును పంపాం. త్వరలోనే పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందుతుంది’’ అని షా అన్నారు. -
'అవకతవకలపై గవర్నర్ ఆశ్చర్యం'
గవర్నర్ ముంగిటికి చేరిన ‘వక్ఫ్’ వివాదం గవర్నర్‌తో భేటీ అయిన బీజేపీ నేతలు అన్వర్ మనప్పాడి నివేదికను ప్రవేశపెట్టడంపై ప్రభుత్వానికి మార్గనిర్దేశనం చేయాల్సిందిగా విన్నపం శాసనమండలిని కుదిపేసిన వక్ఫ్ వ్యవహారం నివేదికను ప్రవేశపెట్టాల్సిందేనని బీజేపీ సభ్యుల ఆందోళన బెంగళూరు: వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలోని ఆస్తుల అవకతవకలకు సంబంధించిన వివాదం గవర్నర్ వద్దకు చేరింది. వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన అవకతవకలపై అన్వర్ మానప్పాడి నేతృత్వంలోని సమితి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసిన నివేదికను మండలిలో ప్రవేశపెట్టేందుకు అధికార పక్షం ససేమిరా అంటుండడంతో ఈ విషమాన్ని విపక్ష బీజేపీ నేతలు గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా దృష్టికి తీసుకెళ్లారు. వీరికి జేడీఎస్ నేతలు సైతం మద్దతు పలికారు. వీరంతా మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయి అన్వర్ మానప్పాడి నివేదికను మండలిలో ప్రవేశపెట్టాల్సిందిగా ప్రభుత్వానికి మార్గనిర్దేశనం చేయాలంటూ విన్నవించారు. ఈ సందర్భంగా శాసనమండలిలో విపక్షనేత కె.ఎస్.ఈశ్వరప్ప మాట్లాడుతూ....వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలోని 15 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే భూములు అన్యాక్రాంతమయ్యాయని, ఈ విషయంపై అన్వర్ మానప్పాడి అందజేసిన నివేదికను మండలిలో ప్రవేశపెట్టాలని హైకోర్టు సైతం ఆదేశించిందని గుర్తు చేశారు. ఇదే సందర్భంలో శాసనమండలి చైర్మన్ శంకరమూర్తి సైతం ఇందుకు సంబంధించి మూడు సార్లు రూలింగ్ ఇచ్చారని పేర్కొన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ నివేదికను చట్టసభల్లో ప్రవేశపెట్టలేదని విమర్శించారు. అందుకే ప్రస్తుతం ఈ విషయంలో గవర్నర్ కలగజేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి మార్గనిర్దేశనం చేయాల్సిందిగా కోరామని చెప్పారు. ఇక వక్ఫ్ ఆస్తుల భారీ అవకతవకలపై సమాచారం తెలుసుకున్న గవర్నర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారని ఈశ్వరప్ప వెల్లడించారు. మండలిలో అదే తీరు....... కాగా, మంగళవారం సైతం శాసనమండలిని వక్ఫ్ వ్యవహారం కుదిపేసింది. గవర్నర్‌తో సమావేశానికి ముందు శాసనమండలిలో ప్రతిపక్షాలు అధికార పక్షం తీరుపై నిప్పులు చెరిగాయి. అన్వర్ మానప్పాడి నివేదికను శాసనమండలిలో ప్రవేశపెట్టాల్సిందేనని కోరుతూ నిరసనకు దిగాయి. ఈ సందర్భంగా కె.ఎస్.ఈశ్వరప్ప మాట్లాడుతూ.....న్యాయస్థానాల ఆదేశాలను, మండలి చైర్మన్ రూలింగ్‌ను సైతం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మండలి చైర్మన్ స్థానం అత్యంత ఉన్నతమైనదని, అటువంటిది చైర్మన్ ఆదేశాలను పాటించకపోతే మంత్రులు తమ స్థానాలకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.