హింసాత్మకంగా‘వక్ఫ్’ నిరసనలు.. కేంద్ర బలగాలకు హైకోర్టు ఆదేశం | Bengal Waqf Protests Turn Violence Court Orders Forces | Sakshi

హింసాత్మకంగా‘వక్ఫ్’ నిరసనలు.. కేంద్ర బలగాలకు హైకోర్టు ఆదేశం

Apr 12 2025 8:51 PM | Updated on Apr 12 2025 9:14 PM

Bengal Waqf Protests Turn Violence Court Orders Forces

కోల్‌కతా:  పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి.  గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో ఇప్పటివరకూ ముగ్గురు అసువులు బాసారు. నిన్న(శుక్రవారం) జరిగిన దాడుల్లో ఇద్దరు మృతి చెందగా, ఈరోజు(శనివారం) జరిగిన కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.  ఈ విషయాన్ని లా అండ్ ఆర్డర్ ను చూసే అడిషనల్ డైరెక్టర్ జనరల్ జావేద్ షమీమ్ తెలిపారు. ముస్లిం జనాభా అధికంగా ఉండే ముర్షీదాబాద్ జిల్లాలో ఇప్పటివరకూ 118 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

కేంద్ర బలగాలను మోహరించండి
వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ర్యాలీలు హింసాత్మకంగా మారడంతో కోల్ కతా హైకోర్టు స్పందించింది. నిరసన ర్యాలీలను అదుపులోకి తేవడంతో పాటు హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండేందుకు కేంద్ర బలగాలను మోహరించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రధానంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న జంగీపూర్ లో కేంద్ర బలగాలను దింపాలని ఆదేశాల్లో పేర్కొంది.

శాంతించండి.. వక్ఫ్ చట్టాన్ని అమలు చేయం
నిరసన కార్యక్రమాలు తీవ్ర రూపం దాల్చడంతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు.వక్ఫ్ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని నిరసన కారులకు హామీ ఇచ్చారు. ‘ ప్రజలకు ఇదే నా విజ్ఞప్తి. రాష్ట్రంలోని అన్ని మతాలకు ప్రజలకు నేను ఒకటే విన్నపం చేస్తున్నా.  ఎవరూ కూడా రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులకు చోటివ్వకండి. ఇక్కడ ఏమైనా జరిగితే ఓవరాల్ గా నష్టపోయేది ప్రజలే. అది  ఏ వర్గమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా ప్రజలే ఇబ్బంది పడతారు. మీ నిరసనను హింసాత్మకంగా మారనివ్వకండి. ఎవరి జీవితమైనా ఒక్కటే. ప్రతీ మనిషి  జీవితం చాలా ముఖ్యమైనదే విషయం మీరు గ్రహించండి.

వక్ఫ్ సవరణ చట్టం అనేది రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదు. వక్ఫ్ సవరణ చట్టాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్న క్రమంలో దాన్ని మేము చట్టంగా గుర్తించడం లేదు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన చట్టం మాత్రమే.  మనం దీనికి కేంద్రాన్నే అడుగుదాం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉంది. మనకు సమాధానం చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వమే. ఈ చట్టానికి మేము మద్దతు ఇవ్వడం లేదు. అదే సమయంలో ఇక్కడ అమలుకు కూడా నోచుకోదు. ఇది గుర్తుపెట్టుకుంది. అంతా నిరసనలు విరమించి శాంతించండి’ అంటూ మమతా బెనర్జీ ‘ఎక్స్( వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement