waqf amendment bill 2025
-
ఇప్పటికే అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాం
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థపై ఉపరాష్ట్రపతి సహా పలువురు బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. ప్రస్తుతం తాము కార్య నిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నామంటూ సోమవారం వ్యాఖ్యానించింది.ముర్షిదాబాద్ అల్లర్ల కేసు నేపథ్యంతో.. పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన(Bengal President Rule) విధించాలని కోరుతూ విష్ణు శంకర్ జైన్ అనే న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో జస్టిస్ గవాయ్ పిటిషన్‌ను పరిశీలిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘మేం ఇప్పటికే కార్య నిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాం. ఇలాంటి తరుణంలో.. బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని, సైన్యాన్ని మోహరింపజేయాలని మాండమస్ రిట్ ప్రకారం రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వాలా?’’ అని పిటిషనర్ లాయర్‌ను ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో పిటిషనర్ కోరిన ఆదేశాలు జారీ చేయడానికి బెంచ్ నిరాకరించింది. ఇదిలా ఉంటే.. రాష్ట్రాలు రూపొందించే బిల్లుల విషయంలో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరును సుప్రీం కోర్టు తప్పుబడుతూ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో గవర్నర్, రాష్ట్రపతికి సైతం కాలపరిమితి విధించింది. ఈ వ్యవహారంలో రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక అధికారాలు పని చేయబోవని.. ఒకవేళ ఆ కాలపరిమితిని ఉల్లంఘిస్తే కోర్టులను ఆశ్రయించొచ్చని రాష్ట్రాలకు సూచించింది. అదే సమయంలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లనూ విచారిస్తూ.. స్టే ఆదేశాలు జారీ చేసింది కూడా. అయితే ఈ రెండు పరిణామాలపై బీజేపీ నేతలు కొందరు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సుప్రీం కోర్టుపై చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. ఒకవేళ సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే గనుక.. పార్లమెంట్ భవనాన్ని మూసివేయాలి’’ అని ఎంపీ వ్యాఖ్యానించారు. మరో బీజేపీ నేత దినేశ్ శర్మ సైతం సుప్రీం కోర్టుపై విమర్శలు గుప్పించారు. ఆఖరికి ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ఖడ్ కూడా సుప్రీం కోర్టు తీర్పును తప్పుబట్టారు. ‘రాష్ట్రపతికి గడువు నిర్దేశించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించడం తగదు. అది ప్రజాస్వామ్యశక్తులపై అణుక్షిపణిని ప్రయోగించడమే అవుతుంది. ఇప్పుడు.. శాసనాలు చేయగలిగే జడ్జీలు మనకు ఉన్నారు! కార్యనిర్వాహక విధులూ వారే నిర్వర్తించేస్తారు. సూపర్ పార్లమెంటులా వ్యవహరిస్తారు. వారికి మాత్రం ఎలాంటి జవాబుదారీతనం ఉండదు. ఎందుకంటే దేశ చట్టాలు వారికి వర్తించవు’’ అని అన్నారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి నోట్ల కట్టల వ్యవహారంపై స్పందిస్తూ దన్ఖడ్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఇక బీజేపీ నేతల వ్యాఖ్యలను వ్యతిగతం అని పేర్కొంటూ అధిష్టానం దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ ప్రతిపక్షాలు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి.ప్రస్తుతం సీజేఐగా ఉన్న సంజీవ్ ఖన్నా పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఆ స్థానంలో బీఆర్ గవాయ్(BR Gavai) బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కీలకమైన వక్ఫ్ పిటిషన్లపై ఈయనే విచారణ జరపబోతున్నారు. ఈ క్రమంలో.. ఆయన కార్య నిర్వాహక వ్యవస్థపై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 8-12 తేదీల మధ్య షంషేర్‌గంజ్, సూటి, ధులియాన్, జంగిపూర్ ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. ముగ్గురు మరణించగా.. వందల మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లనువిచారించే క్రమంలోనూ ఈ అల్లర్లను సీజేఐ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ప్రస్తావించింది. మే 5వ తేదీన ఈ పిటిషన్లపై విచారణ జరగనుంది. -
చంద్రబాబు నీకు దమ్ముంటే.. వర్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింల నిరసన
-
సైన్యాన్ని దింపండి.. రాష్ట్రపతి పాలన పెట్టండి
కోల్‌కతా: సీనియర్ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి(Mithun Chakraborty) పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బెంగాల్లో శాంతి భద్రతలు ఘోరంగా దెబ్బ తిన్నాయని, ప్రభుత్వం విఫలమైంది కాబట్టి రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.బెంగాల్లో రాష్ట్రపతి పాలన(President Rule) విధించాలని కేంద్రానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశా. ఇప్పటికీ కేంద్ర హోం శాఖను అదే కోరుతున్నా. కనీసం ఇప్పుడైనా స్పందించి సైన్యాన్ని దించండి. అప్పుడు ఇక్కడ ఎన్నికలు సజావుగా జరుగుతాయి’’ అని అన్నారాయన. తాజాగా వక్ఫ్ చట్టాన్ని(Waqf Bill) వ్యతిరేకిస్తూ ముర్షిదాబాద్‌లో జరిగిన అల్లర్లపై స్పందించిన ఆయన.. ఇలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. Watch: BJP leader and actor Mithun Chakraborty on the imposition of President's Rule in Bengal says, "I’ve requested many times, and I’m still requesting the Home Minister. At the very least, please deploy the military inside for two months during the elections. If they are… pic.twitter.com/x64pF7j9Mi— IANS (@ians_india) April 19, 2025ఇదిలా ఉంటే.. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 8-12 తేదీల మధ్య షంషేర్‌గంజ్, సూటి, ధులియాన్, జంగిపూర్ ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. ముగ్గురు మరణించగా.. వందల మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉద్రిక్తతల వేళ భారీగా కేంద్ర బలగాలను మోహరించాల్సి వచ్చింది. మరోవైపు.. సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించొద్దన్న సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తిని ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ పట్టించుకోలేదు. మాల్దా క్యాంప్‌లలో ఉన్న బాధిత కుటుంబాలను కలిసి ఆయన మాట్లాడారు. మరోవైపు.. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహాట్కర్ నేతృత్వంలోని బృందం సైతం రిలీఫ్ క్యాంప్‌లలో పర్యటించింది. -
వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోం
న్యూఢిల్లీ: ఇప్పటికే వక్ఫ్ ఆస్తులుగా పరిగణనలో ఉన్న ఆస్తులను డీనోటిఫై చేయబోమని సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. మే 5వ తేదీదాకా సెంట్రల్ వక్ఫ్ బోర్డులు, మండళ్లలో నియామకాలు చేపట్టబోమని పేర్కొంది. అయితే వక్ఫ్ ఆస్తుల డీనోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామంటూ సుప్రీంకోర్టు చేసిన ప్రతిపాదనపై మాత్రం కేంద్రప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. వక్ఫ్(సవరణ) చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల త్రిసభ్య ధర్మాసనం గురువారం సైతం కొనసాగించింది. ఈ సందర్భంగా వక్ఫ్(సవరణ) చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ఏడు రోజుల్లోపు స్పందన తెలియజేసేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గురువారం కోర్టుకు తెలిపారు. చట్టంలోని సెక్షన్ 9, సెక్షన్ 14 ప్రకారం వక్ఫ్ బోర్డులు, కౌన్సిళ్లలో ఎలాంటి నియామ కాలను కేసు తదుపరి విచారణ తేదీదాకా చేపట్ట బోమని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికే ‘వక్ఫ్ బై యూజర్’ విధానం ద్వారా వక్ఫ్ ఆస్తులుగా రిజిస్ట్రర్ అయిన, ధృవీకరించబడిన ఆస్తులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను డీనోటిఫై చేసి గందరగోళం చేయబోమని ఆయన మాటిచ్చారు. ‘‘ ఎంతో విస్తృతస్థాయి చర్చలు, సంప్రదింపుల ప్రక్రియ తర్వాత ప్రభుత్వం తన నిర్ణయాన్ని చట్టంగా తీసుకొచ్చాక ప్రభుత్వ వాదన వినకుండానే ధర్మాసనం ఆ చట్టాన్ని నిలుపుదలచేయడం సహేతుకం అనిపించుకోదు. ప్రభుత్వంలో భాగమైన మేము పార్లమెంట్‌కు, ప్రజలకు జవాబు చెప్పాల్సి ఉంటుంది. న్యాయమూర్తులు ‘వక్ఫ్ బై యూజర్’ నిబంధనపై తీసుకునే నిర్ణయాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి?’’ అని మెహతా ప్రశ్నించారు. దీనిపై సీజేఐ ఖన్నా స్పందించారు. ‘‘ 1995నాటి వక్ఫ్ చట్టం ప్రకారం గతంలో రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకున్న వక్ఫ్ ఆస్తులను ఈ కేసుల తదుపరి విచారణదాకా డీనోటిఫై చేయకూడదు’’ అని కేంద్రాన్ని ఆదేశించారు. గతంలో వక్ఫ్ ఆస్తులుగా కోర్టులు ప్రకటించిన ఆస్తుల డీనోటిఫైకు వీలుకల్పించే నూతన చట్టంలోని సెక్షన్లను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులకు ప్రతిపాదిస్తామని బుధవారం కోర్టు వ్యాఖ్యానించడం తెల్సిందే.ప్రైవేట్ ఆస్తులనూ వశపర్చుకున్నారుసెక్షన్ల నిలుపుదల ప్రతిపాదనను తుషార్ మెహతా తప్పుబట్టారు. ‘‘ చట్టంలోని సుదీర్ఘ సెక్షన్లను జడ్జీలు హడావిడిగా, యథాలాపంగా చదివి ఉండొచ్చు. చట్టబద్ధ్దమైన సెక్షన్‌ను నిలుపుదలచేయడం నిజంగా అరుదైన విషయం. ఈ విషయంలో ఈ చట్టం పూర్వాపరాలను జడ్జీలు మరోసారి పరిశీలించాలని వేడుకుంటున్నా. అన్ని వర్గాల నుంచి వినతులను స్వీకరించాకే ప్రభుత్వం ఈ సవరణ చట్టాన్ని తెచ్చింది. వక్ఫ్ పేరిట ప్రైవేట్ ఆస్తులనూ తమ వశం చేసుకున్నారు. కొన్ని చోట్ల గ్రామాల్లోని భూములు మొత్తం వక్ఫ్ పేరిట నమోదై ఉన్నాయి. లెక్కలేనన్ని ప్లాట్లు వక్ఫ్ ఆక్రమణలో ఉన్నాయి’’ అని మెహతా వాదించారు. ‘‘ప్రభుత్వం నుంచి ప్రాథమికస్థాయి స్పందనను అనుమతించకుండానే చట్టంలోని నిబంధనలను నిలుపుదలచేయడమంటే ధర్మాసనం అత్యంత కఠిన వైఖరిని అవలంబిస్తోందని అర్థమవుతోంది’’ అని మెహతా అసహనం వ్యక్తంచేశారు. ‘‘ మా వాదనలకు బలం చేకూర్చే సాక్ష్యాధారాలు, డాక్యుమెంట్లు, పాత శాసనాలను మీ ముందు ఉంచుతాం. మాకు ఒక వారం గడువు ఇవ్వండి. ఈలోపు ఏమీ జరిగిపోదుగా’’ అని మెహతా వ్యాఖ్యానించారు. ‘‘ కోర్టు తాత్కాలిక ఉత్తర్వులు ఇవ్వకుండా వారం రోజులు ఆగినంత మాత్రాన ఆకాశం విరిగిపడదుగా’’ అని ఒక రాష్ట్రం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది వ్యాఖ్యానించారు. దీంతో సీజేఐ స్పందించారు. ‘‘ మీరు వక్ఫ్ ఆస్తులకు సంబంధించి యతాతథ స్థితిని మార్చకుండా ఉంటే చాలు’’ అని అన్నారు. వక్ఫ్ చట్టం అమలుకాకుండా తాత్కాలిక ఉత్తర్వులు ఇవ్వాలన్న పిటిషన్ల అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. అలాగే చట్టం మొత్తం పూర్తిగా నిలుపుదల చేయడం కుదరదని కోర్టు స్పష్టంచేసింది. ‘‘ నూతన చట్టంలోని కొన్ని సెక్షన్లు సమతుల్యతతో ఉన్నాయి. అందుకే మొత్తం చట్టాన్ని నిలుపుల చేయడం అస్సలు కుదరదు. అలా చేయడం సహేతుకం కూడా కాదు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున డీనోటిఫై లాంటి వాటి జోలికి పోవద్దు’’ అని ధర్మాసనం సూచించింది.ముగ్గురే వాదించాలి‘‘ఎన్నో పిటిషన్లు వచ్చినా ప్రస్తుతానికి మేం ఐదు పిటిషన్లనే స్వీకరిస్తాం. మీ అందరిలో కేవలం ముగ్గురు న్యాయవాదులనే అన్ని పిటిషన్ల తరఫున వాదించేందుకు అనుమతిస్తాం. ఏ ముగ్గురు వాదించాలో మీరే నిర్ణయించుకోండి’’ అని పలు పిటిషన్ల తరఫు లాయర్లకు సీజేఐ సూచించారు. ఏడు రోజుల తర్వాత కేంద్రప్రభుత్వం స్పందన తెలిపాక ఐదురోజుల్లోపు రీజాయిండర్లను సమర్పించేందుకు పిటిషన్లకు ధర్మాసనం గడువు ఇచ్చింది. మే ఐదో తేదీన ప్రాథమిక స్థాయి అభ్యంతరాలను ఆలకించాక తాత్కాలిక ఉత్తర్వులిస్తామని బెంచ్ తెలిపింది. 1995 వక్ఫ్ చట్టాన్ని, ఆ చట్టానికి 2013లో చేసిన సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లనూ వేరుగా విచారిస్తామని కోర్టు పేర్కొంది. వైఎస్సార్సీపీ, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, జమియత్ ఉలేమా–ఇ–హింద్ అధ్యక్షుడు అర్షద్ మదానీ, డీఎంకే, ఆకాఫ్ కర్ణాటక రాష్ట్ర బోర్డు మాజీ ఛైర్మన్ అన్వర్ బాషా, సమçస్త కేరళ జమియతుల్ ఉలేమా, అంజుమ్ ఖదారీ, తయ్యబ్ ఖాన్ సల్మానీ, మొహమ్మద్ షఫీ, మొహమ్మద్ ఫజుల్‌రహీమ్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, కాంగ్రెస్ ఎంపీలు ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ, మొహమ్మద్ జావేద్, ఢిల్లీ ఆప్ ఎంపీ అమానతుల్లా ఖాన్, అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ తదితరులు మొత్తంగా దాదాపు 72 పిటిషన్లను వక్ఫ్ చట్టాన్ని సవాల్‌చేస్తూ దాఖలు చేయడం తెల్సిందే. -
‘సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం’
హైదరాబాద్: కేంద్రం సవరణ చేసిన వక్ఫ్ బోర్డు బిల్లుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ప్రభుత్వ సలహా దారు షబ్బీర్ అలీ సంతోషం వ్యక్తం చేశారు. రాజ్యాంగం మీద ముస్లింలకు నమ్మకం ఉందని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ‘వక్ఫ్ బోర్డ్ పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. కేంద్రం సవరణ చేసిన వక్ఫ్ బోర్డ్ బిల్లును మేము సుప్రీంకోర్టులో చాలెంజ్ చేశాం. మా తరఫున కపిల్ సిబాల్ వాదించారు. కేవలం ఒక మతానికి మాత్రమే చట్టం ఎలా చేస్తారు?. వక్ఫ్ భూములు గవర్నమెంట్ ఇచ్చిన భూములు కావు...దాతలు ఇచ్చిన భూములు పేద ముస్లింలకు చెందాలని ఇచ్చారు. వక్ఫ్ బోర్డు లో మహిళలు ఉన్నారుతెలంగాణలో,ఏపీలో మహిళలు కూడా ఉన్నారు. అన్ని మతాల దేవాలయాల భూములు కబ్జా చేస్తున్నారు. అన్నిటికీ చట్టం తీసుకొని రావాలి.... అప్పుడు స్వాగతిస్తం. వేరే వేరే మతాల వారిని బోర్డులో నియమించడం వల్ల గొడవలు జరుగుతాయి’ అని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.కాగా, వక్ఫ్ సవరణ చట్టం 2025పై దేశసర్వోన్నత న్యాయస్థానం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్‌పై సమాధానం ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరగా.. న్యాయస్థానం అందుకు అంగీకరించింది. వక్ఫ్ ఆస్తులు, నియామకాలపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధిస్తూ తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది.వక్ఫ్ (సవరణ) చట్టం 2025ను సవాల్ చేస్తూ 73 పిటిషన్లు నమోదు కాగా.. గురువారం వరుసగా రెండో రోజూ సుప్రీం కోర్టు వాదనలు వింది. కొన్ని అంశాలతో ప్రాథమిక సమాధానం ఇవ్వడానికి కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వారం గడువు కోరారు. తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని తెలిపారు. -
‘టీడీపీ స్వార్థ రాజకీయాలు ముస్లిం సమాజం గమనిస్తోంది’
సాక్షి, కర్నూలు: ‘వక్ఫ్ సవరణ చట్టం-2025’పై సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాలను స్వాగతిస్తున్నామని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎం.ఎ.హఫీజ్ ఖాన్ అన్నారు. గురువారం ఆయన కర్నూలు రాయల్ ఫంక్షన్ హాల్లో మీడియాతో మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ చట్టంపై దేశసర్వోన్నత న్యాయస్థానం ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంపై ఆయన స్పందించారు. చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం ముస్లిం, మైనార్టీలను అన్యాయం చేశారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, ఇప్పటికైనా ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి ముస్లిం, మైనార్టీల పక్షాన నిలబడాలని హఫీజ్ ఖాన్ డిమాండ్ చేశారు. హఫీజ్ ఖన్ ఇంకా ఏం మాట్లాడారంటే..వక్ఫ్ (సవరణ) చట్టం 2025ను సవాల్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై దేశసర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వారం గడువు కోరడం మనం చూశాం. తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని తెలపడం, వక్ఫ్ ఆస్తులు, నియామకాలపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధిస్తూ తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది. ఇది మా ముస్లిం సమాజానికి గొప్ప రిలీఫ్.రాజ్యాంగం మాకు కల్పించిన ప్రాథమిక హక్కులకు విరుద్దంగా కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి దశలోనూ అడ్డుకుంది. దీనిపై సుప్రీంలో తప్పకుండా మాకు అనుకూలంగా తీర్పు వస్తుందని మేం బలంగా నమ్ముతున్నాం. ఈ కేసులో సీజేఐ లేవనెత్తిన అంశాలు కూడా చాలా కీలకంగా ఉన్నాయి. వక్ఫ్ ఆస్తుల విషయంలో సీజేఐ గారు సొలిసిటర్ జనరల్‌ను అడిగిన ప్రశ్నలే మేం ముందు నుంచి అడిగాం. ప్రభుత్వానికి సుప్రిం ఇచ్చిన నిర్ణీత గడువులో వారు సమాధానం ఇవ్వాలి. మా ముస్లింల తరుపున పోరాడిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.టీడీపీ మాత్రం స్వార్ధ రాజకీయాలు చేసి తడిగుడ్డతో మా ముస్లిం, మైనార్టీల గొంతు కోసింది. వీరి స్వార్థ రాజకీయాలు ముస్లిం సమాజం గమనిస్తోంది. కచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒక్క ఏపీలోనే కాదు దేశంలోని ముస్లింలు అంతా కూడా చంద్రబాబు, నితీష్‌కుమార్‌ల వైపు చూశారు, మా హక్కులు అణగదొక్కుతుంటే మా వైపు నిలవకుండా వీరిద్దరూ మైనార్టీల పక్షాన నిలవకుండా బీజేపీ అజెండాను దేశమంతా అమలుచేయడానికి పూర్తిగా సహకరించారు, ఇప్పటికైనా చంద్రబాబు తన వైఖరి మార్చుకోవాలి, మీపై బాధ్యత ఉంది, మీరు ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి ముస్లిం, మైనార్టీల పక్షాన నిలబడాలని డిమాండ్ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా వైఎస్సార్సీపీ ప్రతి అడుగులో కూడా ముస్లిం సోదరుల వెంట నడుస్తుంది, వారి తరపున పోరాడుతుందని హఫీజ్ ఖాన్ చెప్పారు. -
వక్ఫ్ బై యూజర్ ఆస్తులను డీనోటిఫై చేయొద్దు: సుప్రీం
-
వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, సాక్షి: వక్ఫ్ సవరణ చట్టం 2025పై దేశసర్వోన్నత న్యాయస్థానం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్‌పై సమాధానం ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరగా.. న్యాయస్థానం అందుకు అంగీకరించింది. వక్ఫ్ ఆస్తులు, నియామకాలపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధిస్తూ తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది. వక్ఫ్ (సవరణ) చట్టం 2025ను సవాల్ చేస్తూ 73 పిటిషన్లు నమోదు కాగా.. గురువారం వరుసగా రెండో రోజూ సుప్రీం కోర్టు వాదనలు వింది. కొన్ని అంశాలతో ప్రాథమిక సమాధానం ఇవ్వడానికి కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వారం గడువు కోరారు. తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని తెలిపారు. ఈ క్రమంలో.. వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దని సీజేఐ నేతృత్వంలోని బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ‘‘వక్ఫ్ బోర్డులో నూతన నియామకాలు చేయొద్దు. వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించొద్దు. వక్ఫ్, వక్ఫ్ బై యూజర్ ఆస్తులను డీ నోటిఫై చేయొద్దు వక్ఫ్ ఆస్తులు, నియామకాలపై స్టేటస్ కో విధిస్తున్నాం. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలకు వారం రోజుల్లో సవివర రిప్లై దాఖలు చేయాలి. మరో ఐదు రోజుల్లో రిజైన్డర్ దాఖలు చేయాలి’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె.వి.విశ్వనాథన్‌ల త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. గత విచారణలో(బుధవారం).. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వక్ఫ్ సవరణ చట్టం మత స్వేచ్ఛ హక్కుకు భంగం కలిగిస్తుందిఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టంవక్ఫ్ అంటే ఇస్లాం కు అంకితమైందికేంద్రప్రభుత్వం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలుజేపిసీ ద్వారా సంపూర్ణంగా అన్ని వర్గాలతో చర్చలు జరిపామువక్ఫ్ అనేది కేవలం చారిటీకి సంబంధించినది మాత్రమేహిందూ ధార్మిక సంస్థలను కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయిహిందూయేతర అధికారులు హిందూ ధార్మిక సంస్థలను నిర్వహిస్తున్నారువక్ఫ్ భై యూజర్ ద్వారానే అనేక మసీదులను ఏర్పాటు చేశారురిజిస్టర్ చేసుకోవడంలో మసీదులకున్న అభ్యంతరం ఏమిటి సుప్రీంకోర్టు సీజేఐ వ్యాఖ్యలుసుదీర్ఘకాలంగా ముస్లిం కార్యక్రమాలకు వాడుతున్న (వక్ఫ్ బై యూజర్) ఆస్తులను డినోటిఫై చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయివక్ఫ్ బై యూజర్ ఆస్తులను రిజిస్టర్ చేయడం కష్టం..అయితే ఇది దుర్వినియోగమైందిఅయితే నిజంగా ముస్లిం ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న ఆస్తులు కూడా ఉన్నాయిహిందువుల ఆస్తులను హిందువులే నిర్వహిస్తున్నారు కదాపార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం లేదా ?హిందువుల కోసం కూడా పార్లమెంట్ చట్టాలు చేస్తుంది కదాఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమి లోనే ఉందని అంటున్నారు చారిత్రక , పురావస్తు ఆస్తులను వక్ఫ్ గా ప్రకటించడానికి వీలు లేదువక్ఫ్ పిటిషన్లపై విచారణ వేళ.. హైలైట్స్‌అంతకు ముందు.. వక్ఫ్ పిటిషన్ల విచారణను లైవ్ టెలికాస్ట్ కోరుతూ సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ లేఖ రాసింది. బుధవారం విచారణ టైంలో కిక్కిరిసిపోయిన కోర్టు హాల్లో కనీసం నిలబడటానికి కూడా స్థలం సరిపోలేదని, ఊపిరి ఆడక ఇద్దరు లాయర్లు స్పృహ కోల్పోయారని లేఖలో ప్రస్తావించింది.సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ హర్షంహైదరాబాద్: వక్ఫ్ (సవరణ) బిల్లుపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు వైఖరి దేశవ్యాప్తంగా ముస్లింలకు ఊరట కలిగించిందన్నారు. న్యాయ వ్యవస్థపై విశ్వాసం మరింత బలోపేతం చేసిందన్నారు. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంలో జరిగిన పరిణామాలను స్వాగతిస్తున్నామన్నారు. 👉అధికారంలోకి రాగానే వక్ఫ్ చట్టాన్ని అడ్డుకుంటాం. బీహార్‌ను వక్ఫ్ అల్లర్లతో మరో బెంగాల్(ముర్షిదాబాద్)గా మార్చాలని వాళ్లు(కేంద్రంలోని బీజేపీ) అనుకుంటున్నారు. ఆర్జేడీ నాయకత్వంలో అది అయ్యే పని కాదు అని తేజస్వి యాదవ్ అన్నారు. 👉వక్ఫ్ చట్టం దేశ ప్రజల మధ్య ఐక్యతను క్రమంగా తుడిచిపెట్టేందుకేనని కేంద్రంలోని ఎన్డీయే సర్కారు వక్ఫ్ సవరణ చట్టం తెచ్చిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపించారు. ఇది ఫెడరలిజాన్ని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 26ను ఉల్లంఘించడమేనని అన్నారాయన. రాజ్యాంగ విరుద్ధమైన ఈ చర్య ద్వారా.. ఆరెస్సెస్, బీజేపీలు వక్ఫ్ చట్టం ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నాయని విమర్శించారు. ఇండియా కూటమి.. కలిసి పోరాడుదాంరాజ్యాంగ విరుద్ధమైన వక్ఫ్ సవరణ చట్టం అడ్డుకునేందుకు ప్రతిపక్ష కూటమి ఇండియా కలిసి రావాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పిలుపు ఇచ్చారు. సొంత దేశంలో ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వం.. సౌదీ అరేబియా, దుబాయ్ లాంటి పశ్చిమ ఆసియా దేశాల నుంచి ఆతిథ్యం మాత్రం స్వీకరిస్తున్నారని మండిపడ్డారు. ఏకతాటిపైకి వచ్చి వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి పార్టీలు పోరాడాలని ఆమె అంటున్నారు. -
చంద్రబాబు, నితీశ్ పై దీదీ ఘాటు విమర్శలు
-
వర్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరుల నియామకంపై సీజేఐ ప్రశ్నల వర్షం
-
సుదీర్ఘ కాలంగా వక్ఫ్ అధీనంలో ఉన్న ఆస్తులను ఇకపై కూడా వక్ఫ్ ఆస్తులుగానే పరిగణించాలని భావిస్తున్నాం... ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలనుకుంటున్నాం... సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ
-
అల్లర్ల కుట్రలో బీఎస్ఎఫ్, నిఘా సంస్థలు
కోల్‌కతా: వివాదాస్పద వక్ఫ్(సవరణ) చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమబెంగాల్లోని ముర్షీదాబాద్ జిల్లాలో కొనసాగిన ఘర్షణలు, హింసాత్మక ఘటనల వెనుక కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సరిహద్దు భద్రతా బలగం(బీఎస్ఎఫ్), నిఘా వర్గాల హస్తముందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. బుధవారం కోల్‌కతాలో ముస్లిం మతాధికారులతో సమావేశం సందర్భంగా మమత మాట్లాడారు. ‘‘ అరాచక, సమాఖ్య వ్యతిరేక వక్ఫ్(సవరణ) చట్టాన్ని ప్రధాని మోదీ అమలుచేయొద్దు. దీని అమలు కొనసాగితే అది దేశాన్ని ముక్కలుచేస్తుంది. సొంత రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా పనిచేసే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ప్రధాని మోదీ వెంటనే పదవి నుంచి తప్పించాలి. ఓవైపు బంగ్లాదేశ్‌లో అస్థిర పరిస్థితులు రాజ్యమేలుతుంటే బీజేపీ సర్కార్ హడావుడిగా వక్ఫ్ చట్టం తెచ్చింది. బెంగాల్లో హింసకు కేంద్ర హోం శాఖ పథకరచన చేసింది. ఈ కుట్రలో బీఎస్ఎఫ్ పాత్రపై విచారణ జరిపించాలి. సరిహద్దును పరిరక్షించాల్సిన బాధ్యత బీఎస్‌ఎఫ్‌ది కాదా?. అంతర్జాతీయ సరిహద్దును మా(టీఎంసీ) ప్రభుత్వం పరిరక్షించదు. ఈ విషయంలో కేంద్రం తన బాధ్యతలను విస్మరించకూడదు. బెంగాల్ అల్లర్లలో మృతుల కుటుంబాలకు తలో రూ.10 లక్షల నష్టపరిహారం ఇస్తున్నా. సరిహద్దు దాటి బెంగాల్లోకి బంగ్లాదేశీయులు చొరబడుతుంటే నిర్లక్ష్యంగా ఉన్న బీఎస్ఎఫ్ వైఖరిపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తున్నా’’ అని మమత అన్నారు. ‘‘అమిత్ షా ఎన్నటికీ ప్రధాని కాలేరు. మోదీజీ ప్రధాని పీఠం నుంచి దిగిపోయాక అమిత్ షా ఏం చేస్తారు?. కేంద్ర నిఘా సంస్థలను అమిత్ షా దుర్వినియోగం చేస్తున్నారు. అమిత్ షా కార్యకలాపాలపై మోదీ ఓ కన్నేసి ఉంచాలి. మోదీ అమిత్‌కు అడ్డుకట్టవేయాల్సిందే’’ అని మమత అభ్యర్థించారు. స్థానిక కాంగ్రెస్ నిర్లక్ష్యమూ దాగి ఉందిఘర్షణల వెనుక టీఎంసీ ఉందన్న ఆరోపణలను మమత ఖండించారు. ‘‘ ఘర్షణలు జరిగిన ధులియాన్, షంషేర్‌గంజ్‌లు మాల్డా దక్షిణ్ లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తాయి. కాంగ్రెస్ నేత ఇషా ఖాన్ చౌదరి అక్కడ ఎంపీగా ఉన్నారు. ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్ క్రియాశీలకంగా ఉంది. ఈ ఘర్షణల వెనుక నిజంగా టీఎంసీ ఉంటే మా ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్లపై నిరసనకారులు ఎందుకు దాడులు చేస్తారు?. మా పార్టీ కార్యాలయాన్ని ఎందుకు ధ్వంసం చేస్తారు? అని మమత ఎదురు ప్రశ్నించారు. ముస్లిం మతాధికారులు వక్ఫ్ అంశంలో నేరుగా రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీలను కలిసి తమ ఆందోళనను తెలియజేయాలి. వక్ఫ్‌కు వ్యతిరేకంగా విపక్షాల ‘ఇండియా’ కూటమి తుదికంటా పోరాడుతుంది’’ అని అన్నారు.ఆయన యోగి కాదు భోగితనపై విమర్శలు చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై మమత ప్రతివిమర్శలు చేశారు. ‘‘యోగి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నిజానికి ఆయన యోగి కాదు పెద్ద భోగి. మహాకుంభమేళాలో తొక్కిసలాటలో ఎంత మంది చనిపోయారు?. మీ రాష్ట్రంలో పోలీస్ ఎన్కౌంటర్లలో ఎంత మందిని చంపేశారు?. రాష్ట్రంలో శాంతియుత ర్యాలీలను కూడా యోగి అనుమతించట్లేదు. బెంగాల్లో మాత్రం ప్రజలు స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నారు’’ అని అన్నారు. హిందువులను బాధితులుగా మారుస్తున్న మమత సర్కార్‌కు రోజులు దగ్గరపడ్డాయని బీజేపీ విమర్శించింది. -
వాటిని వక్ఫ్ ఆస్తులుగా భావిస్తాం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదమైన వక్ఫ్(సవరణ) చట్టం,2025ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ తొలిరోజే సర్వోన్నత న్యాయస్థానం పిటిషనర్లకు కాస్తంత ఊరట కల్గించేలా వ్యాఖ్యానించింది. సుదీర్ఘకాలంగా ముస్లిం మత, దాతృత్వ కార్యక్రమాలతో సంబంధముండి వక్ఫ్ అ«దీనంలో ఉన్న ఆస్తులను(వక్ఫ్ బై యూజర్) ఇకమీదటా వక్ఫ్ ఆస్తులుగానే పరిగణించాలని భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమా ర్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలని యోచిస్తున్నట్లు ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఆ దిశగా ఉత్తర్వులు, ఆదేశాలు ఇవ్వడానికంటే ముందు ఈ పిటిషన్లపై పూర్తిగా విచారణ చేపట్టాలని ప్రభుత్వం కోరింది. ‘‘ ఆస్తులు ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా వక్ఫ్ అ«దీనంలో ఉన్నాయా? రిజిస్ట్రర్ డాక్యుమెంట్లతో వక్ఫ్ కు దఖలుపడ్డాయా? అనేది తేలకుండానే ‘వక్ఫ్ బై యూజర్’ అనే నిబంధనను తొలగించలేం. ఎక్స్–అఫీషియో సభ్యులు మినహా వక్ఫ్ బోర్డులు, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లలో అందరూ ముస్లింలే సభ్యులుగా ఉండాలి’’ అని ధర్మాసనం స్పష్టంచేసింది. వక్ఫ్(సవరణ)చట్టం చట్టబద్ధతను సవాల్‌చేస్తూ దాఖలైన డజన్లకొద్దీ పిటిషన్లను బుధవారం విచారించడం మొదలెట్టాక తొలుత వీటిని హైకోర్టుకు బదలాయించాలని సుప్రీంకోర్టు భావించింది. అయితే ఈ ఆలోచనపై పిటిషన్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, కపిల్ సిబల్, హుజేఫా అహ్మదీ, వైఎస్సార్సీపీ తరఫున వాదించిన ఎస్.నిరంజన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావంచూపగల ఈ కేసులను సుప్రీంకోర్టులోనే విచారించాలని కపిల్ సిబల్ గట్టిగా వాదించారు. తర్వాత కోర్టు కేసును గురువారం మధ్యాహ్నానికి వాయిదావేసింది. ఆనాటి ఆస్తులకు పత్రాలుంటాయా? వక్ఫ్ ఆస్తిగా నమోదుచేయాలంటే వాటి డాక్యుమెంట్లు కచి్చతంగా సమర్పించాలంటూ చట్టంలోని సెక్షన్ 2ఏలో పేర్కొనడంపై సీజేఐ జస్టిస్ ఖన్నా అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘‘ ఢిల్లీలోని జామా మసీదునే ఉదాహరణగా తీసుకుందాం. వందల ఏళ్లుగా వాళ్ల అ«దీనంలో ఉన్న ఇలాంటి పాత ఆస్తులకు రిజిస్టర్ చేయాలంటే ఇప్పుడు డాక్యుమెంట్లు తీసుకురమ్మంటే ఎలా?. అలాంటి ఆస్తులకు డాక్యుమెంట్లు వాళ్ల దగ్గర ఉంటాయా? ’’ అని సీజేఐ.. కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించారు. గతాన్ని మీరు మార్చలేరు అని కేంద్రానుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘ వక్ఫ్ ఆస్తుల్లో కొన్ని దురి్వనియోగం అయిన మాట వాస్తవమే. అంతమాత్రాన దాన్ని సాకుగా చూపి ‘వక్ఫ్ బై యూజ్’ నిబంధనను తొలగిస్తామంటే కొత్త సమస్యలొస్తాయి. వక్ఫ్ బై యూజర్‌ను కోర్టులు గతంలోనే ధృవీకరించాయి. కోర్టు తీర్పులు, ఉత్తర్వులు, నిర్ణయాలను ప్రభుత్వాలు నిర్ణయించకూడదు. మీరు కేవలం ప్రాతిపదికను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి’’ అని కేంద్రాన్ని ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. వక్ఫ్ చట్టం తమకొద్దని చాలా మంది ముస్లింలు చెబుతున్నారని తుషార్ మెహతా చెప్పగా కోర్టు కలుగజేసుకుని ‘‘ అయితే మీరు హిందూ దాతృత్వ ట్రస్టుల్లోనూ ముస్లింలను సభ్యులుగా చేరుస్తామని చెప్పదల్చుకున్నారా?’’ అని సూటి ప్రశ్న వేసింది. ‘‘ వక్ఫ్ చట్టంపై ఇప్పటికే సంయుక్త పార్లమెంటరీ కమిటీ 38 సార్లు సమావేశమైంది. ఏకంగా 98.2 లక్షల మెమోరండంలను కమిటీ పరిశీలించింది. తర్వాతే పార్లమెంట్ ఉభయసభల్లో బిల్లు ఆమోదం పొందింది’’ అని మెహతా చెప్పుకొచ్చారు. దీంతో సీజేఐ స్పందించారు. ‘‘ ఇక్కడ రెండు విషయాలు తేలాలి. ఈ కేసులన్నింటినీ హైకోర్టుకు బదలాయించాలా? లేదంటే అసలు మీరు సుప్రీంకోర్టు ద్వారా ఏం ఆశిస్తున్నారు? ఏం వాదించాలనుకుంటున్నారు? అంటూ కేంద్రంంతోపాటు పిటిషనర్లకు నోటీసులు ఇచ్చారు. వాటికి సమాధానం చెప్పాలని ఆదేశించారు. ‘‘ చట్టంపై ఆందోళనల్లో హింస చోటుచేసుకోవడం ఆందోళనకరం. ఓవైపు ఈ అంశం కోర్టుల పరిధిలో పరిశీలనలో ఉండగా మరోవైపు ఆందోళనలు,హింస చెలరేగడం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది’’ అని అన్నారు. వెంటనే తుషార్ మెహతా కలుగజేసుకుని ‘‘ఇలా ఆందోళనలు చేయడం ద్వారా వ్యవస్థపై వాళ్లు తీవ్రమైన ఒత్తిడిని తేద్దామని చూస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ ఎవరు ఎవరిపై ఒత్తిడి తెస్తున్నారు? మాకైతే అర్థంకావట్లేదు’’ అని సిబల్ బదులిచ్చారు. ‘‘ సానుకూల అంశాలపైనా చర్చిద్దాం’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. ఏ ప్రాతిపదికన ముస్లింగా నిర్ధారిస్తారు? పిటిషనర్ల తరఫున కపిల్ సిబల్ వాదించారు. ‘‘ నేను ముస్లింనా కాదా అనే విషయాన్ని ఏ రకంగా కేంద్రం నిర్ధారిస్తుంది?. ఇతను వక్ఫ్‌కు ఆస్తిని, ఇతరత్రాలను దానంగా ఇవ్వడానికి అర్హుడు అని కేంద్రం ఎలా నిర్ధారించుకుంటుంది?. గత ఐదేళ్లుగా ఇస్లాంను ఆచరిస్తున్న వాళ్లే దానం ఇవ్వాలని చెప్పే హక్కు కేంద్రానికి ఎక్కడిది?’’ అని కోర్టులో సిబల్ వాదించారు. దశాబ్దాలుగా ఆచరణలో ఉన్న ‘వక్ఫ్ బై యూజర్’ను ఏకపక్షంగా తొలగించకూడదని లాయర్ హుజేఫా అహ్మదీ కోరారు. వైఎస్సార్సీపీ, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, జమియత్ ఉలేమా–ఇ–హింద్ అధ్యక్షుడు అర్షద్ మదానీ, సమస్థ కేరళ జమియతుల్ ఉలేమా, అంజుమ్ ఖదారీ, తయ్యబ్ ఖాన్ సల్మానీ, మొహమ్మద్ షఫీ, మొహమ్మద్ ఫజుల్‌రహీమ్, ఆర్జేడీ ఎంపీ మనోజ్‌కుమార్ ఝా, డీఎంకే, కాంగ్రెస్ ఎంపీలు ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ, మొహమ్మద్ జావేద్, తదితరులు మొత్తంగా 72 పిటిషన్లను వక్ఫ్ చట్టాన్ని సవాల్‌చేస్తూ దాఖలు చేశారు. ఈ అంశంలో సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీచేయకుండా ముందస్తుగా కేంద్రం ఏప్రిల్ 8వ తేదీన కెవియట్ పిటిషన్ దాఖలుచేసింది. దీంతో పటిషన్ల విచారణ మొదలుకాకుండానే సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి తాత్కాలిక ఉత్తర్వులురాకుండా అడ్డుకోగలిగింది.కేంద్రానికి సుప్రీంకోర్టు సంధించిన కీలక ప్రశ్నలు ⇒ ముస్లిమేతరులూ వక్ఫ్ బోర్డుల్లో ఉండేందుకు కొత్త చట్టం అనుమతిస్తోంది. మరి హిందూ ఆలయాల నిర్వహణ బాధ్యతలు చూసే ట్రస్టుల్లో ముస్లింలను సభ్యులుగా కేంద్రప్రభుత్వం అనుమతిస్తుందా? ⇒ బ్రిటిషర్లు రానంతవరకు భారత్‌లో భూములకు రిజి్రస్టేషనే లేదు. కొన్ని మసీదులను 14వ, 15వ శతాబ్దంలో నిర్మించారు. వాటికి సేల్‌డీడ్ లాంటివి తేవడం అసాధ్యం. శతాబ్దాలుగా వక్ఫ్ ఆస్తులుగా కొనసాగుతున్న మసీదులు, ఇతర ఆస్తుల హక్కుల పత్రాలు, డాక్యుమెంట్లను ముస్లింలు ఇప్పుడెలా తీసుకురాగలరు? ⇒ విచారణ, దర్యాప్తు పూర్తిచేసి అధీకృత అధికారి నిర్ధారించనంతవరకు సంబంధిత ఆస్తి వక్ఫ్‌ది కాదు అని ప్రభుత్వం చెబుతోంది. అలా నిర్ధారణ సాధ్యంకాని ఆస్తులన్నీ ప్రభుత్వానికి చెందుతాయా? ⇒ వక్ఫ్(సవరణ)చట్టం,2025 అమల్లోకి రాకముందు వరకు వక్ఫ్ బై యూజర్ నిబంధన అమల్లో ఉంది. ఇప్పుడు అది మనుగడలో లేదంటారా? ⇒ గతంలో కొన్ని ఆస్తులు వక్ఫ్ ఆస్తులేనని కోర్టు తీర్పులే స్పష్టంచేస్తున్నాయి. కొత్త చట్టంలోని సెక్షన్ 2ఏతో ప్రభుత్వం ఆ తీర్పులను చెల్లనివిగా మారుస్తోందా? -
వక్ఫ్ పిటిషన్లపై విచారణ.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
YSRCP: ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా వక్ఫ్ చట్టం
-
వక్ఫ్ పిటిషన్లపై విచారణ.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లను(Waqf Petitions) సుప్రీంకోర్టులో ఇవాళ (ఏప్రిల్ 16న) విచారణ ముగిసింది. తదుపరి విచారణను రేపటి మధ్యాహ్నానికి వాయిదా వేసింది. వక్ప్ సవరణ చట్టంపై స్టేకు సుప్రీం నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులందరికీ సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలకు జవాబు చెప్పాలని ఆదేశించింది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ విచారణ చేపట్టనుంది. కేంద్రం కేవియెట్ పిటిషన్ వేయడంతో ఇరువైపులా వాదనలను చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్‌కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా వక్ఫ్‌పై సుప్రీం కోర్టు సీజేఐ సంజీవ్ ఖన్నా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సుదీర్ఘకాలంగా ముస్లిం కార్యక్రమాలకు వాడుతున్న (వక్ఫ్ బై యూజర్) ఆస్తులను డినోటిఫై చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయి. వక్ఫ్ బై యూజర్ ఆస్తులను రిజిస్టర్ చేయడం కష్టం..అయితే ఇది దుర్వినియోగమైంది. అయితే నిజంగా ముస్లిం ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న ఆస్తులు కూడా ఉన్నాయి.హిందువుల ఆస్తులను హిందువులే నిర్వహిస్తున్నారు కదా. పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం లేదా? హిందువుల కోసం కూడా పార్లమెంట్ చట్టాలు చేస్తుంది కదా. ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమిలోనే ఉందని అంటున్నారు. చారిత్రక, పురావస్తు ఆస్తులను వక్ఫ్‌గా ప్రకటించడానికి వీలు లేదు’ అని పేర్కొన్నారు. .. వక్ప్ సవరణ చట్టం పిటీషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. వక్ఫ్ సవరణ చట్టం మత స్వేచ్ఛ హక్కుకు భంగం కలిగిస్తుంది. ఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టం. వక్ఫ్ అంటే ఇస్లాంకు అంకితమైందన్నారు. .. కేంద్రప్రభుత్వం తరఫు వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. జేపిసీ ద్వారా సంపూర్ణంగా అన్ని వర్గాలతో చర్చలు జరిపాము. వక్ఫ్ అనేది కేవలం చారిటీకి సంబంధించినది మాత్రమే. హిందూ ధార్మిక సంస్థలను కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి’ అని వాదించారు. ..ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హిందువుల ఆస్తులను హిందువులే నిర్వహిస్తున్నారు కదా. పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం లేదా? హిందువుల కోసం కూడా పార్లమెంట్ చట్టాలు చేస్తుంది కదా. ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమిలోనే ఉందని అంటున్నారు. చారిత్రక, పురావస్తు ఆస్తులను వక్ఫ్‌గా ప్రకటించడానికి వీలు లేదు’ అని స్పష్టం చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు రేపటికి వాయిదా వేసింది. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు ప్రతిపాదించిన మధ్యంతర ఉత్తర్వులుకేసు విచారణ నేపథ్యంలో కోర్టు వక్ఫ్‌గా ప్రకటించిన ఆస్తులను డినోటిఫై చేయకూడదు . వక్ఫ్ బై యూజర్ అయినా, వక్ఫ్ బై డీడ్ అయినా సరే వాటిని డినోటిఫై చేయవద్దు. వక్ఫ్ భూమా, ప్రభుత్వ భూమా అనే అంశంపై కలెక్టర్ విచారణ జరుపుతున్నప్పుడు దానికి వక్ఫ్ సవరణ చట్టంలోని నిబంధనలను అమలు చేయవద్దు వక్ఫ్ బోర్డు , సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో ఎక్స్ అఫీషియో సభ్యులు మినహా మిగిలిన వారంతా తప్పనిసరిగా ముస్లింలు మాత్రమే సభ్యులుగా ఉండాలి -
నమ్మి ఓట్లు వేస్తే, చంద్రబాబు, నితీశ్, ముస్లింలను మోసం చేశారు : మమత
-
వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంలో విచారణ
-
వక్ఫ్ పిటిషన్లపై ‘సుప్రీం’ కీలక విచారణ.. హైలైట్స్
సాక్షి, న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లను(Waqf Petitions) సుప్రీంకోర్టులో ఇవాళ (ఏప్రిల్ 16న) విచారణ జరపనుంది. కేంద్రం కేవియెట్ పిటిషన్ వేయడంతో ఇరువైపులా వాదనలను చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్‌కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. కొత్త చట్టంలోని పలు సెక్షన్లు రాజ్యాంగానికి విరుద్ధమని, జాతీయ సమగ్రతకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంటూ ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు పలు సంస్థలు, ఎన్జీవోలు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లను ఉమ్మడిగా ఇవాళ మధ్యాహ్నాం సీజేఐ బెంచ్ విచారణ జరపనుంది. వక్ఫ్ సవరణ చట్టం(Waqf Amendment Law) రాజ్యాంగ విరుద్ధమని, ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా చట్టం రూపొందించారని, ఈ చట్టంతో ముస్లిం మత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని, వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతరులను చేర్చడం రాజ్యాంగ విరుద్ధమేనని వైఎస్సార్సీపీ సైతం తన పిటిషన్లో పేర్కొంది.👉ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్(బిహార్)తో పాటు జేడీయూ, ఆప్, డీఎంకే, సీపీఐ, వైఎస్సార్‌షీపీ.. ఇలా ప్రధాన పార్టీలతో పాటు జమైత్ ఉలేమా హింద్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా పిటిషన్లు వేశాయి. వక్ఫ్‌సవరణ చట్టం బిల్లు నిబంధనలు ముస్లిం సమాజ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయని, ముస్లింల హక్కులను హరించే కుట్రగా అభివర్ణిస్తున్నాయి. ; ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. 👉బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు చట్టానికి మద్ధతుగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాయి. ఆ చట్టాన్ని సర్వోన్నత న్యాయస్థానం కొట్టేయబోదన్న ధీమాతో ఉంది.👉ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో మంగళవారం మరో పిటిషన్ దాఖలైంది. ఈ చట్టంలోని కొన్ని సెక్షన్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సీనియర్ న్యాయవాది విష్ణు శంకర్ జైన్ వేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపడతామని వెల్లడించింది. అయితే అది ఇవాళ విచారించబోయే పిటిషన్లతోనా? లేదంటే ప్రత్యేకంగానా? అనేదానిపై ఈ మధ్యాహ్నాం స్పష్టత రానుంది.👉పిటిషన్లలో కొన్ని.. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, దీనిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మరికొన్ని.. దీనిని అమలు చేయకుండా కేంద్రాన్ని ఆదేశించాలని కోరాయి. 👉పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. ఈ నెల మొదట్లో సుదీర్ఘ చర్చల అనంతరం ఇటు లోక్‌సభలో, అటు రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు ఆమోదం లభించింది. 👉అయితే.. చట్టసభల పరిధిని తాము దాటబోమని ఇంతకు ముందే సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయినప్పటికీ రాజ్యాంగానికి సంబంధించిన అంశాల్లో చివరి తీర్పు ఇచ్చే అధికారం మాత్రం ఉంటుందని తెలిపింది. ఈ క్రమంలో.. వక్ఫ్ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల్లో సమానత్వ హక్కు, మతాచారాలను అనుసరించేలాంటి హక్కులు ప్రభావితం అయ్యాయని పిటిషనర్లు వాదిస్తున్నారు. అందుకే సుప్రీం కోర్టు ఈ పిటిషన్లపై వాదనలు వినేందుకు సిద్ధమైంది. 👉ఈ సవరణలు వక్ఫ్ బోర్డుల నిర్వహణలో పారదర్శకత తీసుకురావడానికి, వెనుకబడిన ముస్లింలను బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయని కేంద్రం అంటోంది. మత స్వేచ్ఛను హరిస్తాయనే విమర్శలను తప్పుబడుతోంది. ముస్లింలను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయంటోంది. వక్ఫ్ బోర్డుల్లో అవినీతిని తగ్గించి, వ్యవస్థను పారదర్శకంగా చేయడానికే ఈ బిల్లును తెచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. -
వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ వైఎస్ఆర్ సీపీ పిటిషన్
-
వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో కీలక విచారణ
ఢిల్లీ: వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిసి పిటిషన్ పై రేపు(బధవారం) సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్ ఐటం నెంబర్ 86గా సుప్రీంకోర్టులో లిస్ట్ అయ్యింది. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమన్న వైఎస్సార్సీపీ.. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది.ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా చట్టం రూపొందించారని, ఈ చట్టంతో ముస్లింల మత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని పిటిషన్ లో పేర్కొంది. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను చేర్చడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్ లో స్పష్టం చేసింది. ఇదిలా ఉంచితే, వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 10 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె వి విశ్వనాథన్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. -
‘కొత్త వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధం’
తాడేపల్లి : ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరద్ధమన్నారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఈ వివాదాస్పద చట్టాన్ని ఆమోదించాయని మండిపడ్డారు. ఈరోజు(మంగళవారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ప్రెస్ మీట్లో మాట్లాడిన పేర్నినాని.. ‘ టీడీపీ, జనసేన ఓట్లు లేకపోతే వక్ఫ్ చట్టం పార్లమెంటులో పాస్ అయ్యేదా?, మరి వారిద్దరూ వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తే మోదీ ఆ చట్టాన్ని తెచ్చేవాడు కాదు. చంద్రబాబు బొమ్మను దేశ వ్యాప్తంగా ముస్లింలు చెప్పుతో కొడుతున్నారు. ముస్లింల ఆందోళనల్లో సిగ్గు లేకుండా టీడీపీ పాల్గొంటోంది.లింకు డాక్యుమెంట్లు బయటపెడితే నోరుమూశారు..వక్ఫ్ స్థలాల్లో సాక్షి ఆఫీసులు ఉన్నాయంటూ మొదట ఆరోపణలు చేశారు. సాక్షి స్థలాల లింకు డాక్యుమెంట్లు బయట పెట్టడంతో నోరు మూసుకున్నారు. తర్వాత వైఎస్సార్సీపీ విప్ జారీ చేయలేదంటూ ఆరోపణలు చేశారు. విప్ కాగితాలు బయట పెట్టగానే మళ్ళీ నోరు మూసుకున్నారు. హిందూ మత సంస్థలు, ఆలయాల్లో అన్యమతస్తులను తొలగిస్తున్నాం. చివరికి షాపులు ఉన్నా ఖాలీ చేయిస్తున్నాం. దేవాదాయ శాఖలో హిందూయేతరులను అధికారులను పెట్టటం లేదు. మరి వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను ఎలా పెడతారు?, అలా చేయటం కరెక్టేనా?, ముస్లింలు నమాజు చేసుకునే మసీదుల ఆలన పాలనాకు ముస్లిమేతరులను పెట్టటం సబబేనా? , ముస్లింల హక్కులను కాలరాయటం కరెక్టుకాదు.మా పార్టీలాగే మీరు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగలరా?చంద్రబాబు, లోకేష్ లకు ఖలేజా ఉంటే వక్ఫ్ చట్టాన్ని అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేయగలరా?, మా పార్టీలాగే మీరు కూడా వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేసు వేయలగరా?, దిక్కుమాలిన, దౌర్భాగ్య రాజకీయాలు మానుకోవాలి. పన్నుల వసూళ్లలో రెండు శాతం మాత్రమే వృద్ది ఉన్నప్పుడు జీఎస్డీపీలో దేశంలోనే నెంబర్ టూ ప్లేస్‌కి ఎలా వచ్చింది?, అంటే ఇంకా లక్షల కోట్ల అప్పులు చేయటానికి రెడీ అయ్యారని అర్థం అవుతోంది. చంద్రబాబు దళిత వ్యతిరేకి. అంబేద్కర్ జయంతి రోజునే దళితులకు సంకెళ్లు వేసి రోడ్డు మీద నడిపించటం దుర్మార్గం. 2018 కు ముందు మా పార్టీ నేతల ఫోన్లను ట్యాప్ చేశారు. ఏబీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇది జరుగుతోందని మేము గతంలోనే చెప్పాం. అధికారం ఉంటే చంద్రబాబు ఎన్ని పాపాలు చేస్తారో లెక్కలేదు. రాజధానిలో ఇంకా 44 వేల ఎకరాలు ఎందుకు తీసుకుంటున్నారో కూడా తేలుతుంది. తన స్వార్ధం కోసం తప్ప చంద్రబాబు రాష్ట్ర ప్రజల కోసం ఏమీ చేయడు’ అని ధ్వజమెత్తారు. -
వక్ఫ్(సవరణ) చట్టంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం.. చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
‘వక్ఫ్’ చట్టంపై సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ పిటిషన్
తాడేపల్లి,సాక్షి: వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ పిటిషన్ దాఖలు చేసింది. వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్లో వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఓటు వేసిన విషయం తెలిసిందే. మైనారిటీ సమాజానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు.ఇందులో భాగంగా వక్ఫ్ సవరణ బిల్లును ఇటీవల పార్లమెంట్లో వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. గతంలోనే వక్ఫ్ సవరణ బిల్లుపై వైఎస్సార్సీపీ అభ్యంతరం తెలపడంతో కేంద్ర ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసింది. మళ్లీ పార్లమెంట్లో బిల్లును ప్రవేశ పెట్టడంతో లోక్‌సభ, రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఎంపీలు ఓటేశారు. ముస్లింలకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వక్ఫ్ చట్టానికి మద్దతిచ్చి మరోసారి ముస్లింలను మోసం చేశారు. అన్ని మతాలలాగే ముస్లిం మతాన్ని చూడాలి, వారి ఆస్తుల విషయంలో ప్రభుత్వాల జోక్యం అనవసరం’ అని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో వైఎస్సార్సీపీ పేర్కొంది.కాగా, ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఉభయ సభల్లో ఈ బిల్లు పాస్ కావడంతో పాటు ఆపై రాష్ట్రపతి ఆమోద ముద్రతో ఈ సవరణ బిల్లు చట్టు రూపం దాల్చింది. దీనిని సవాల్ చేస్తూ ఇప్పటికే పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు అవ్వగా, తాజాగా వైఎస్సార్ సీపీ కూడా పిటిషన్ దాఖలు చేసింది. అందుకే వైఎస్సార్సీపీ సుప్రీంకోర్టులో సవాల్ వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోకుండా చట్టం చేశారు. అందుకే వైఎస్సార్సీపీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ వక్ఫ్ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 13,14,25,26లను ఉల్లంఘిస్తోంది. ప్రాథమిక హక్కులు, సమానత్వం, మత స్వేచ్చలకు వ్యతిరేకంగా ఉంది. కొన్ని మతాల స్వయం ప్రతిపత్తికి భంగం కలిగించేలా ఉంది. ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చటం వక్ఫ్ బోర్డు అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవటమే. ఈ నిర్ణయం వక్ఫ్ బోర్డు పరిపాలన స్వాతంత్య్రాన్ని దెబ్బ తీస్తోందని వైఎస్సార్సీపీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. YSRCP has filed a petition in the Supreme Court challenging the Waqf Bill, citing serious constitutional violations and failure to address the concerns of the Muslim community.The Bill violates Articles 13, 14, 25, and 26 of the Constitution—provisions that guarantee…— YSR Congress Party (@YSRCParty) April 14, 2025 -
చంద్రబాబు,నితీశ్ వల్లే వక్ఫ్ చట్టం: అసదుద్దీన్ ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వాములైన టీడీపీ అధినేత చంద్రబాబు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ సంపూర్ణ సహకారంతోనే ప్రధాని నరేంద్రమోదీ వక్ఫ్ నల్ల చట్టాన్ని తీసుకురాగలిగారని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని దారుస్సలాంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీటీడీ బోర్డులో హిందువులను మాత్రమే సభ్యులుగా కొనసాగిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు.. వక్ఫ్ బోర్డులో ఇతర మతస్తులను సభ్యులుగా చేర్చే బిల్లుకు ఏ విధంగా మద్దతు ఇచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు మద్దతిచ్చి.. తన కుమారుడు లోకేశ్ రాజకీయ భవితవ్యాన్ని దెబ్బతీశారని అన్నారు. భవిష్యత్‌లో ముస్లింలు చంద్రబాబు వారసులను ఎలా విశ్వసిస్తారని ప్రశ్నించారు. వక్ఫ్ చట్టం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే.. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 25, 26, 29లలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని అసదుద్దీన్ అన్నారు. మోదీ ప్రభుత్వం ఈ చట్టం ద్వారా ముస్లింల హక్కులన్నింటినీ లాక్కుందని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ సర్కారు దేశంలోని ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించారు. వక్ఫ్‌పై బీజేపీ చెప్పేవన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు. హిందు, జైన, సిక్కు ఎండోమెంట్ బోర్డులలో ఆ మత విశ్వాసాలను అనుసరించే వారు మాత్రమే సభ్యులుగా ఉంటారని, అలాంటప్పుడు వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు సభ్యులుగా ఉండటం సబబా? అని ప్రశ్నించారు. ఈ చట్టాన్ని అడ్డు పెట్టుకొని వక్స్ భూములను ఆక్రమించిన వారికే వాటిని కట్టబెట్టే ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. సవరణకు వ్యతిరేకంగా సభ వక్ఫ్ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో ఈ నెల 19న దారుస్సలాంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు అసదుద్దీన్ ప్రకటించారు. వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహా్మనీ అధ్యక్షత జరిగే ఈ సభకు దేశవ్యాప్తంగా మత పెద్దలు, పలువురు రాజకీయ నేతలు హాజరవుతారని చెప్పారు. వక్ఫ్ చట్ట వ్యతిరేక నిరసనలు శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. -
వక్ఫ్ సవరణ చట్టంపై హీరో విజయ్ కీలక నిర్ణయం
ఢిల్లీ: సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ చీఫ్ విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 4న పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ చట్టంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ అంశాన్ని ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలతో పాటు పలువురు సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో తాజాగా విజయ్ సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ వారంలో సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. సుదీర్ఘ చర్చ, తీవ్రస్థాయి వాదోపవాదాల అనంతరం వక్ఫ్ (సవరణ) బిల్లు–2025పై పార్లమెంటు ఆమోదముద్ర పడింది. విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్యే లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించడం తెలిసిందే.రాజ్యసభ ఆమోదం కూడా పొందింది. 13 గంటలకు పైగా జరిగిన చర్చ అనంతరం ఓటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా జరిగింది. దాదాపుగా ప్రతి సవరణపైనా ఓటింగ్‌కు విపక్షాలు పట్టుబట్టాయి. వాటి సవరణలన్నీ వీగిపోయాయి. చివరికి బిల్లు ఆమోదం పొందింది. దానికి అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు పడ్డాయి. వక్ఫ్ బిల్లును లోక్‌సభ 288–232 ఓట్లతో ఆమోదించడం తెలిసిందే. వక్ఫ్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా వేశారు. రాష్ట్రపతి సంతకంతో చట్టంగా రూపుదాల్చింది. -
చంద్రబాబు వల్లే మాకు మోసం జరిగింది..
-
హింసాత్మకంగా‘వక్ఫ్’ నిరసనలు.. కేంద్ర బలగాలకు హైకోర్టు ఆదేశం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో ఇప్పటివరకూ ముగ్గురు అసువులు బాసారు. నిన్న(శుక్రవారం) జరిగిన దాడుల్లో ఇద్దరు మృతి చెందగా, ఈరోజు(శనివారం) జరిగిన కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని లా అండ్ ఆర్డర్ ను చూసే అడిషనల్ డైరెక్టర్ జనరల్ జావేద్ షమీమ్ తెలిపారు. ముస్లిం జనాభా అధికంగా ఉండే ముర్షీదాబాద్ జిల్లాలో ఇప్పటివరకూ 118 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.కేంద్ర బలగాలను మోహరించండివక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ర్యాలీలు హింసాత్మకంగా మారడంతో కోల్ కతా హైకోర్టు స్పందించింది. నిరసన ర్యాలీలను అదుపులోకి తేవడంతో పాటు హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండేందుకు కేంద్ర బలగాలను మోహరించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రధానంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న జంగీపూర్ లో కేంద్ర బలగాలను దింపాలని ఆదేశాల్లో పేర్కొంది.శాంతించండి.. వక్ఫ్ చట్టాన్ని అమలు చేయంనిరసన కార్యక్రమాలు తీవ్ర రూపం దాల్చడంతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు.వక్ఫ్ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని నిరసన కారులకు హామీ ఇచ్చారు. ‘ ప్రజలకు ఇదే నా విజ్ఞప్తి. రాష్ట్రంలోని అన్ని మతాలకు ప్రజలకు నేను ఒకటే విన్నపం చేస్తున్నా. ఎవరూ కూడా రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులకు చోటివ్వకండి. ఇక్కడ ఏమైనా జరిగితే ఓవరాల్ గా నష్టపోయేది ప్రజలే. అది ఏ వర్గమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా ప్రజలే ఇబ్బంది పడతారు. మీ నిరసనను హింసాత్మకంగా మారనివ్వకండి. ఎవరి జీవితమైనా ఒక్కటే. ప్రతీ మనిషి జీవితం చాలా ముఖ్యమైనదే విషయం మీరు గ్రహించండి.వక్ఫ్ సవరణ చట్టం అనేది రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదు. వక్ఫ్ సవరణ చట్టాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్న క్రమంలో దాన్ని మేము చట్టంగా గుర్తించడం లేదు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన చట్టం మాత్రమే. మనం దీనికి కేంద్రాన్నే అడుగుదాం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉంది. మనకు సమాధానం చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వమే. ఈ చట్టానికి మేము మద్దతు ఇవ్వడం లేదు. అదే సమయంలో ఇక్కడ అమలుకు కూడా నోచుకోదు. ఇది గుర్తుపెట్టుకుంది. అంతా నిరసనలు విరమించి శాంతించండి’ అంటూ మమతా బెనర్జీ ‘ఎక్స్( వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.Shopping malls and shops are being looted in Shamsherganj, Murshidabad, in the name of peaceful protests against Waqf Amendment Act...Bangladeshi style of loot is happening....Is West Bengal steadily transforming to West Bangladesh ! pic.twitter.com/R2NmSNpo11— Sourish Mukherjee (@me_sourish_) April 12, 2025 Anyone has the right to PEACEFULLY protest against the Wakf law if they have a problem with it : NO ONE has right to resort to arson and violence in name of religion . West Bengal govt must come down hard on ALL involved. Spare NO ONE irrespective of community. In a surcharged… pic.twitter.com/t8IWRq0UD3— Rajdeep Sardesai (@sardesairajdeep) April 12, 2025 -
Waqf act:. పశ్చిమబెంగాల్లో నిరసన సెగ.. సీఎం మమతా విన్నపం ఇదే!
కోల్ కతా: వక్ఫ్ సవరణ చట్టం ఇప్పటికే అమల్లోకి వచ్చిన తరుణంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నిరసన జ్వాలలు రాజుకున్నాయి. వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలంటూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రధానంగా రాష్ట్రంలో ముర్షీబాద్ తో పాటు పల్ల జిల్లాల్లో వరుసగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో శనివారం అది ఇంకా తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో వంద మందిని అరెస్టు చేశారు. దీనిపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ‘ ప్రజలకు ఇదే నా విజ్ఞప్తి. రాష్ట్రంలోని అన్ని మతాలకు ప్రజలకు నేను ఒకటే విన్నపం చేస్తున్నా. ఎవరూ కూడా రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులకు చోటివ్వకండి. ఇక్కడ ఏమైనా జరిగితే ఓవరాల్ గా నష్టపోయేది ప్రజలే. అది ఏ వర్గమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా ప్రజలే ఇబ్బంది పడతారు. మీ నిరసనను హింసాత్మకంగా మారనివ్వకండి. ఎవరి జీవితమైనా ఒక్కటే. ప్రతీ మనిషి జీవితం చాలా ముఖ్యమైనదే విషయం మీరు గ్రహించండి.వక్ఫ్ సవరణ చట్టం అనేది రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదు. వక్ఫ్ సవరణ చట్టాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్న క్రమంలో దాన్ని మేము చట్టంగా గుర్తించడం లేదు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన చట్టం మాత్రమే. మనం దీనికి కేంద్రాన్నే అడుగుదాం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉంది. మనకు సమాధానం చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వమే. ఈ చట్టానికి మేము మద్దతు ఇవ్వడం లేదు. అదే సమయంలో ఇక్కడ అమలుకు కూడా నోచుకోదు. ఇది గుర్తుపెట్టుకుంది. అంతా నిరసనలు విరమించి శాంతించండి’ అంటూ మమతా బెనర్జీ ‘ఎక్స్( వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.সবার কাছে আবেদনসব ধর্মের সকল মানুষের কাছে আমার একান্ত আবেদন, আপনারা দয়া করে শান্ত থাকুন, সংযত থাকুন। ধর্মের নামে কোনো অ-ধার্মিক আচরণ করবেন না। প্রত্যেক মানুষের প্রাণই মূল্যবান, রাজনীতির স্বার্থে দাঙ্গা লাগাবেন না। দাঙ্গা যারা করছেন তারা সমাজের ক্ষতি করছেন।মনে রাখবেন, যে…— Mamata Banerjee (@MamataOfficial) April 12, 2025 కాగా, పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లు.. చట్ట రూపం దాల్చింది.ఏప్రిల్ 8వ తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. దీనికి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గత శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. మరోవైపు..సుప్రీంకోర్టులో వక్ఫ్ బిల్లును సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి., ఈ క్రమంలో.. తమ వాదనలు వినాలంటూ కేంద్రం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో 15, 16వ తేదీల్లో దేశ సర్వోన్నత న్యాయస్థానంలో జరగబోయే విచారణపై ఉత్కంఠ నెలకొంది. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుమారు 16 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటితో పాటు కేంద్రం వేసిన కేవియట్‌ను కలిపి విచారించాలని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం నిర్ణయించింది. -
బెంగాల్లో ‘వక్ఫ్’ ఉద్రిక్తతలు
కోల్‌కతా: వివాదాస్పద వక్ఫ్ చట్టానికి నిరసనగా పశ్చిమబెంగాల్లోని ముర్షిదాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శుక్రవారం కొందరు నిమ్టియా స్టేషన్లో నిలిపి ఉన్న రైలుపై రాళ్లతో దాడికి దిగారు. రైల్వే స్టేషన్ ఆస్తులను ధ్వంసం చేశారు. కనీసం పది మంది పోలీసులు సైతం ఈ దాడిలో గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు బీఎస్ఎఫ్ను రంగంలోకి దించారు. ఘటన నేపథ్యంలో రెండు రైళ్లను రద్దు చేశామని, మరో ఐదు రైళ్లను దారి మళ్లించామని అధికారులు తెలిపారు. రాళ్ల దాడిలో ప్రయాణికులు సైతం గాయపడ్డారని చెప్పారు. వక్ఫ్ చట్టాన్ని నిరసిస్తూ ముర్షిదాబాద్‌లో ఆందోళనకారులు నిరసనకు దిగారు. అడ్డుకున్న పోలీసులతో తలపడ్డారు. కొన్ని వాహనాలకు నిప్పుపెట్టారు. సుటి, సంసేర్గంజ్, జంగీపూర్‌లలో పరిస్థితి నియంత్రణలోనే ఉందని పోలీసులు తెలిపారు. పోలీస్‌స్టేషన్‌పై దాడికి దిగిన వారిని చెదరగొట్టామన్నారు. జాతీయ రహదారిపై రాకపోకలు సాధారణ స్థితికి చేరుకున్నాయన్నారు. కోల్‌కతాలోని అలియా వర్సిటీ విద్యార్థులు వక్ఫ్ చట్టంపై నిరసన ర్యాలీ నిర్వహించారు. కాగా, ముర్షిదాబాద్, నార్త్ 24 పరగణాల జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులపై గవర్నర్ సీవీ ఆనంద బోస్ స్పందించారు. హింసకు పాల్పడే వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. పరిస్థితులపై సీఎం మమతా బెనర్జీతో ఫోన్లో మాట్లాడారు. హోం మంత్రి అమిత్ షాకు పరిస్థితులను వివరించారు. సీఎం మమత ఈ నెల 16న కోల్‌కతాలో ఇమామ్లతో సమావేశం ఏర్పాటు చేశారని టీఎంసీ నేత కునాల్ ఘోష్ చెప్పారు. ముర్షిదాబాద్ జిల్లాలో మంగళవారం కూడా ఆందోళనల కారణంగా ఉద్రిక్తతలు తలెత్తాయి. -
‘వక్ఫ్’ పిటిషన్లపై 16న సుప్రీం విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: వక్ఫ్(సవరణ)చట్టం–2025 చట్టబద్ధతను సవాల్ చేస్తూ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సహా దాఖలు చేసిన 10 వరకు పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ నెల 16న విచారణ చేపట్టనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం వాదనలు వింటుందని సుప్రీంకోర్టు వెబ్సైట్ పేర్కొంది. ధర్మాసనంలో జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథ్ ఉంటారు. ఒవైసీతోపాటు ఆప్ నేత అమానతుల్లా ఖాన్, అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ అర్షద్ మదానీ, సమస్త కేరళ జమియతుల్ ఉలెమా, అంజుమ్ కదారి, తయ్యబ్ ఖాన్ సల్మానీ, మహ్మద్ షఫీ, మహ్మద్ ఫజలుర్రహీమ్, ఆర్జేడీ నేత మనోజ్ కుమార్ ఝా పిటిషన్లు వేశారు. ఈ చట్టంపై ఎలాంటి ఆదేశాలు జారీ చేసినా ముందుగా తమ వాదనను వినాలంటూ ఈ నెల 8న కేంద్రం సుప్రీంకోర్టులో కెవియెట్ దాఖలు చేయడం తెల్సిందే. పార్లమెంట్ ఆమోదం అనంతరం రాష్ట్రపతి ముర్ము సంతకం చేయడంతో వక్ఫ్(సవరణ) చట్టం–2025ను గురువారం నోటిఫై చేసింది. తీవ్ర వ్యతిరేకత నడుమ పార్లమెంట్ ఆమోదం పొందిన ఈ చట్టంతో తమిళనాడులోని 50 లక్షల మందితోపాటు దేశంలో ఉన్న 20 కోట్ల మంది ముస్లింల హక్కులకు భంగం వాటిల్లనుందని పిటిషనర్లలో ఒకటైన డీఎంకే అంటోంది. ఈ చట్టంలోని అంశాలు ఏకపక్షంగా, ప్రాథమిక హక్కులకు భంగకరంగా ఉన్నాయని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (ఏఐఎంపీఎల్బీ) అంటోంది. -
Waqf Act : అమల్లోకి వక్ఫ్ చట్టం.. విచారణపై తొందరెందుకన్న ‘సుప్రీం’
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లు.. చట్ట రూపం దాల్చింది. ఇవాళ్టి నుంచే(ఏప్రిల్ 8వ తేదీ) అమల్లోకి వచ్చినట్లు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గత శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. మరోవైపు..సుప్రీంకోర్టులో వక్ఫ్ బిల్లును సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తమ వాదనలు వినాలంటూ కేంద్రం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో 15, 16వ తేదీల్లో దేశ సర్వోన్నత న్యాయస్థానంలో జరగబోయే విచారణపై ఉత్కంఠ నెలకొంది. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుమారు 16 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటితో పాటు కేంద్రం వేసిన కేవియట్‌ను కలిపి విచారించాలని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం నిర్ణయించింది. సిస్టమ్ ప్రకారమే వెళదాం.. తొందరెందుకు?ఇదిలా ఉంటే.. వక్ఫ్ సవరణ బిల్లును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టడానికి నిరాకరించింది. జమైత్ ఉలేమా హై హింద్ ప్రెసిడెంట్ మౌలానా అర్షద్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. ఈ సవరణ బిల్లుపై దాఖలైన పిటిషన్లను త్వరగా విచారించాలని ఆయన కోరారు. అయితే ఈ విజ్ఞప్తిపై చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.‘ఎందుకు త్వరగా అని మెన్షన్ చేస్తున్నారు. మనకో సిస్టం ఉంది కదా. వాటిని తప్పకుండా సమీక్షిస్తాం. అవసరమైన వాటిని సూచిస్తాం’ అని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు. దీంతో వచ్చే మంగళ, బుధవారాల్లో విచారణ జరపనున్నట్లు పేర్కొంది. -
ఒమర్, రిజిజు భేటీపై రాజకీయ వివాదం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు శ్రీనగర్‌లోని తులిప్ గార్డెన్లో కలుసుకోవడం రాజకీయ దుమారం రేపుతోంది. వక్ఫ్ చట్టం విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) సానుకూల వైఖరి అవలంబించిన నేపథ్యంలోనే వీరిద్దరు కలుసుకున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే, తన తండ్రి, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా కోరిక మేరకు తులిప్ గార్డెన్‌కు వెళ్లిన ఒమర్‌కు అనూహ్యంగా అదే రోజు ఉదయం గార్డెన్‌కు వచ్చిన మంత్రి రిజిజు కలిశారని అధికార నేషనల్ కాన్ఫరెన్స్ అంటోంది. యోగక్షేమాలు తెలుసుకున్న అనంతరం ఎవరికి వారు వెళ్లిపోయారని చెబుతోంది. ఇదంతా కేవలం అనుకోకుండా జరిగిన పరిణామమని, దీన్ని అనవసరంగా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించింది. అయితే, రిజిజు ‘ఎక్స్’లో అబ్దుల్లాలతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేయడం వివాదాన్ని రేపింది. వక్ఫ్ సవరణ చట్టంపై బీజేపీకి ఎన్సీకి లొంగిపోయిందని ప్రతిపక్ష పీడీపీ ఆరోపించింది. పార్లమెంట్లో వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి రిజిజుకు తులిప్ గార్డెన్లో ఎన్సీ ఎర్ర తివాచీ పరిచిందని మరో నేత అన్నారు. సీఎం ఒమర్ తులిప్ గార్డెన్లో తారసపడిన కేంద్ర మంత్రి రిజిజుకు కనీసం దూరంగా ఉండటం ద్వారా నిరసన తెలిపి ఉండాల్సిందని పీపుల్స్ కాన్ఫరెన్స్ చీఫ్ సజాద్ లోనె పేర్కొన్నారు. -
వక్ఫ్ చట్టంపై జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం
-
వక్ఫ్ సవరణ చట్టం రద్దు కోసం మైనారిటీలు రౌండ్ టేబుల్ సమావేశం
-
వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
-
వక్ఫ్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర
న్యూఢిల్లీ: వక్ఫ్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. ఇప్పటికే పార్లమెంటు ఆమోదం పొందిన వక్ఫ్ (సవరణ) బిల్లు–2025 (ఉమీద్)పై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం సంతకం చేశారు. శనివారం రాత్రి ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. దాంతో వక్ఫ్ బిల్లు చట్టరూపం దాల్చింది. తీవ్ర వాదోపవాదాలు, విపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో వక్ఫ్ బిల్లుపై ఉభయ సభల్లోనూ ఓటింగ్ జరగడం, లోక్‌సభలో 288–232, రాజ్యసభలో 128–95 ఓట్ల తేడాతో బిల్లు గట్టెక్కడం తెలిసిందే.. -
మోసం చేశావ్ చంద్రబాబూ.. అసదుద్దీన్ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: వక్ఫ్ బిల్లును అడ్డుకుంటామని చెప్పి చంద్రబాబు మోసం చేశారంటూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. చంద్రబాబు చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకునే రకం కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘పిల్లనిచ్చిన మామనే మోసం చేసిన ఘనుడు చంద్రబాబు. గుజరాత్ అల్లర్ల సమయంలోనూ బాబు ముస్లింలను మోసం చేశారు’’ అని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.‘‘ఆ తర్వాత పదేళ్ల పాటు చంద్రబాబు అధికారానికి దురమయ్యాడు. ఇప్పటికే చంద్రబాబుకు 74 ఏళ్లు.. ఆయనకు భవిష్యత్ లేదు. చంద్రబాబు పాపాలకు లోకేష్ మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అంటూ అసదుద్దీన్ వ్యాఖ్యానించారు.కాగా, సీఎం చంద్రబాబు వక్ఫ్ సవరణకు బిల్లుకు మద్దతివ్వడం పట్ల టీడీపీకి చెందిన మైనార్టీ నేతల్లో కూడా తీవ్ర అసంతృప్తి రాజుకుంటోంది. బిల్లుకు అనుకూలంగా ఓటేయడం ద్వారా ముస్లిం సమాజానికి టీడీపీ ఎంత ద్రోహం తలపెట్టిందో పార్లమెంట్ సాక్షిగా తేటతెల్లమైందనే చర్చ జరుగుతోంది. దీంతో పలువురు నేతలు పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు గ్రహించడంతో ఒత్తిడి పెరిగిన సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర తీశారు. ఈ క్రమంలో ఏమాత్రం ఉపయోగం లేని మూడు సవరణలను ప్రతిపాదించి గొప్పగా ప్రచారం చేసుకున్నారు. -
ముస్లింలకు చంద్రబాబు వెన్నుపోటు: ఖాదర్ బాషా
సాక్షి, తాడేపల్లి: దేశవ్యాప్తంగా ముస్లిం సమాజం వ్యతిరేకిస్తున్న వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు పలకడం ద్వారా చంద్రబాబు చరిత్రహీనుడిగా నిలిచిపోతున్నారని వైఎస్సార్సీపీ ముస్లిం మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ షేక్ ఖాదర్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్దమైన బిల్లు ఆమోదం పొందేందుకు పూర్తి సహకారాన్ని అందించిన చంద్రబాబు ముస్లింల పట్ల తన వ్యతిరేక వైఖరిని చాటుకున్నారని మండిపడ్డారు. వక్ఫ్ భూములను కాజేసే కుట్రలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి అయ్యిందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే...ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేశానని గొప్పులు చెప్పుకునే చంద్రబాబు ముస్లింలు ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకోలేకపోవడం ఘోరం. ముస్లిం సమాజం మొత్తం ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్న వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వడం ద్వారా చంద్రబాబు తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. ఒకపక్క బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లుకు ఏకపక్షంగా మద్దతు తెలిపిన చంద్రబాబు, సవరణలు సూచించామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ముస్లిం సమాజంలో వక్ఫ్ భూమి అంటే అల్లాకు చెందిన భూమి అని అర్థం. గడిచిన వందేళ్లుగా ఎంతోమంది దాతలు ముస్లింల సమాజ ఉద్ధరణ కోసం మంచి మనసుతో సేవాభావంతో దానమిచ్చిన భూమి అది. ఇది ప్రభుత్వ భూమి కాదు. ఈ భూమితో ప్రభుత్వానికి సంబంధం లేదు.వైఎస్సార్సీపీపై బురదచల్లాలని..వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలపడం పట్ల టీడీపీపై రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలలో తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో వైఎస్సార్సీపీ మీద బురదజల్లాలని సోషల్ మీడియా ద్వారా టీడీపీ తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. లోక్‌సభలో ఈ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించిందని ఒకరోజు, రాజ్యసభలో మద్దతు తెలిపారని ఇంకోరోజు ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారానికి దిగింది. ఈ విధంగా ఇక్కడ కూడా చంద్రబాబు తన రెండు నాలుకల ధోరణి ప్రదర్శించారు.వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఎంపీలు మాట్లాడారు. లోక్‌సభలో ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేయగా, రాజ్యసభలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విప్ కూడా జారీ చేశారు. బిల్లుకి వ్యతిరేకంగా ఓటేశారు. కానీ కొన్ని ఊరూపేరు లేని పత్రికల్లో పత్రికల్లో జగన్ ముస్లింలకు వెన్నుపోటు అంటూ టీడీపీ పెయిడ్ కథనాలు రాయించి ముస్లింలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు మద్దుతుగా వైయస్సార్సీపీ ఓటేసిందని రుజువు చేయాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సవాల్ విసిరితే ఇంతవరకు టీడీపీ నుంచి సమాధానం లేదు. -
ముస్లింలకు వెన్నుపోటు.. టీడీపీకి రాజీనామాలు
-
వక్ఫ్ బిల్లుకు మద్దతుపై టీడీపీలో ముసలం
-
వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: కాంగ్రెస్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లును(waqf amendment bill) సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అంటోంది. వీలైనంత త్వరలోనే ఇది ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ప్రకటించారు. రాజ్యాంగ సూత్రాలు, నిబంధనలపై దాడి చేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తూనే ఉంటామన్న ఆయన.. గతంలో సీఏఏ, ఆర్టీఐ, ఎన్నికల నియమాలపై పోరాటాలు చేశామని జైరాం రమేశ్(Jairam Ramesh) తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ ద్వారా తెలియజేశారు. The INC's challenge of the CAA, 2019 is being heard in the Supreme Court.The INC's challenge of the 2019 amendments to the RTI Act, 2005 is being heard in the Supreme Court.The INC’s challenge to the validity of the amendments to the Conduct of Election Rules (2024) is being…— Jairam Ramesh (@Jairam_Ramesh) April 4, 2025 ఇదిలా ఉంటే.. రాజ్యసభ(Rajya Sabha)లో గురువారం మధ్యాహ్నాం నుంచి సుమారు 13 గంటలపాటు వక్ఫ్ బిల్లుపై చర్చ జరిగింది. ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేశారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. దీంతో శుక్రవారం ఉదయం బిల్లును ఆమోదించినట్లు పార్లమెంట్ అధికారికంగా ప్రకటించింది. బిల్లుపై చర్చ సందర్భంగా.. ఇది మైనారిటీలకు వ్యతిరేకంగా.. రాజ్యాంగవిరుద్ధంగా ఉందంటూ పలు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అదే సమయంలో ఇది చారిత్రక సంస్కరణగా అభివర్ణించిన కేంద్రం ఈ బిల్లు ముస్లింలకు లబ్ధి చేకూరుస్తుందని అంటోంది. అంతకు ముందు..సుదీర్ఘ సంవాదాల అనంతరం వక్ఫ్ (సవరణ) బిల్లు-2025కు లోక్‌సభ(Lok Sabha) ఆమోదం తెలిపింది. చర్చ సమయంలో అధికార, విపక్ష సభ్యుల వాద ప్రతివాదాలతో సభ ప్రతిధ్వనించింది. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం తెల్లవారుజాము 2.15 గం.లు దాటే వరకూ చర్చ, ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. దీంతో.. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి.