వక్ఫ్‌ సవరణ బిల్లుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: కాంగ్రెస్‌ | Congress To Challenge The Constitutionality Of The Waqf Amendment Bill Very Soon, Senior Leader Jairam Ramesh Confirmed | Sakshi
Sakshi News home page

వక్ఫ్‌ సవరణ బిల్లుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: కాంగ్రెస్‌

Published Fri, Apr 4 2025 11:51 AM | Last Updated on Fri, Apr 4 2025 1:43 PM

Congress Challenge Waqf Bill Very soon Senior Leader Confirmed

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన వక్ఫ్‌ సవరణ బిల్లును(waqf amendment bill) సుప్రీం కోర్టులో సవాల్‌ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ అంటోంది. వీలైనంత త్వరలోనే ఇది ఉంటుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ప్రకటించారు. 

రాజ్యాంగ సూత్రాలు, నిబంధనలపై దాడి చేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తూనే ఉంటామన్న ఆయన.. గతంలో సీఏఏ, ఆర్టీఐ, ఎన్నికల నియమాలపై పోరాటాలు చేశామని జైరాం రమేశ్‌(Jairam Ramesh) తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ ద్వారా తెలియజేశారు. 

 

ఇదిలా ఉంటే.. రాజ్యసభ(Rajya Sabha)లో గురువారం మధ్యాహ్నాం నుంచి సుమారు 13 గంటలపాటు వక్ఫ్‌ బిల్లుపై చర్చ జరిగింది. ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేశారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. దీంతో శుక్రవారం ఉదయం బిల్లును ఆమోదించినట్లు పార్లమెంట్‌ అధికారికంగా ప్రకటించింది. 

బిల్లుపై చర్చ సందర్భంగా.. ఇది మైనారిటీలకు వ్యతిరేకంగా.. రాజ్యాంగవిరుద్ధంగా ఉందంటూ పలు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అదే సమయంలో ఇది చారిత్రక సంస్కరణగా అభివర్ణించిన కేంద్రం ఈ బిల్లు ముస్లింలకు లబ్ధి చేకూరుస్తుందని అంటోంది. అంతకు ముందు..

సుదీర్ఘ సంవాదాల అనంతరం వక్ఫ్‌ (సవరణ) బిల్లు-2025కు లోక్‌సభ(Lok Sabha) ఆమోదం తెలిపింది. చర్చ సమయంలో అధికార, విపక్ష సభ్యుల వాద ప్రతివాదాలతో సభ ప్రతిధ్వనించింది. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం తెల్లవారుజాము 2.15 గం.లు దాటే వరకూ చర్చ, ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. దీంతో.. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement