challange
-
మస్క్ వర్సెస్ మడురో: ఆయన గెలిస్తే గనుక..
వెనిజులా అధ్యక్షుడు(నూతన)నికోలస్ మడురో విసిరిన సవాల్‌కు ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ స్పందించారు. మడురోపై పోటీకి తాను సిద్ధమని అన్నారాయన. పోటీకి ఎక్కడైనా, ఎప్పుడైనా నేను సిద్ధం అంటూ ఎక్స్ వేదికగా ప్రకటించారాయన.నాతో పోరాడాలనుకుంటే బరిలో దిగమని మస్క్‌కు నికోలస్ మడురో సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. దీంతో టెస్లా సీఈవో మస్క్ తాను సిద్ధమని ప్రకటించారు. ఆయన ఎక్కడ పోటీ అంటే అక్కడికి వస్తానని, తన వెంట మడురో ప్రియమైన గాడిదను కూడా తీసుకొస్తానంటూ వ్యంగ్యంగా బదులిచ్చారాయన. ఒకవేళ మడురో ఓడిపోతే.. ఆయన రాజకీయ సన్యాసం చేయాలి. తాను ఓడిపోతే గనుక ఉచితంగా ఆయన్ని మార్స్ ప్రయాణానికి తీసుకెళ్తానని స్పేస్ ఎక్స్ అధినేత ప్రకటించారు. వెనిజులా ఎన్నికల్లో మడురో విజయం సాధించారు. అయితే ఆయన అప్రజాస్వామ్యిక పద్ధతుల్లో గెలిచారంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విమర్శలకు మస్క్ మద్దతు ఇవ్వడంతో.. మడురో ఆయన్ని లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. వెనిజులాలో మస్క్ కంప్యూటర్ల హ్యాకింగ్‌కు పాల్పడుతున్నారంటూ సంచలన ఆరోపణలకు దిగారు. దీంతో అప్పటి నుంచి ఇద్దరి మధ్య పరస్పర మాటల యుద్ధం జరుగుతోంది. -
Europe : వలసల వలలో యూరప్
యూరప్ ను వలసలు చుట్టుముట్టేస్తున్నాయి. ఈ ఖండంలోని చాలా దేశాలు విలవిలలాడిపోతున్నాయి. ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. అల్లర్లు,నేరాలు,ఘోరాలు,అశాంతి ఆ దేశాలను అల్లకల్లోలం చేస్తున్నాయి.వీటికి పరిష్కారం లభించకపోగా,మరింత రగిలే ప్రమాదఘంటికలే వినిపిస్తున్నాయి. వలసలు ఏ ఖండానికి,ఏ దేశానికి కొత్తకాదు.ఇతర దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చినవారితోనూ, సక్రమంగా వలస వచ్చినవారితోనూ సమస్యలు పెరుగుతూనే వున్నాయి.భారతదేశం కూడా అందుకు మినహాయింపు కాదు. వలసలతో అశాంతి ప్రస్తుత అంశం యూరప్ విషయానికి వస్తే, వలసలు ప్రబలి,రోజుకొకరకమైన దుర్వార్త అక్కడి నుంచి వినాల్సివస్తోంది.ఇప్పటికే ఫ్రాన్స్ లో అల్లర్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. నెదర్లాండ్ లో ప్రభుత్వమే కూలిపోయింది.స్వీడన్ లో ఘర్షణలు లేని రోజంటూ లేదు. స్విట్జర్లాండ్ లో అశాంతి రాజ్యమేలుతోంది. బెల్జియం,జర్ననీలో అల్లర్లు,నేరాలుఘోరాలకు అదుపే లేదు.మానవతా దృక్పధంతో శరణు ఇచ్చినందుకు యూరప్ మొత్తం మూల్యం చెల్లించాల్సి వస్తోంది.శరణుకోరి ఆయా దేశాలలో ప్రవేశించినవారి సంఖ్య కోట్లకు చేరుకుంది.వీరంతా మిగిలిన సామాజిక సమస్యలను సృష్టించడమే గాక,రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు.ప్రభుత్వాల మనుగడే ప్రశ్నార్ధకమవుతోంది. శరణార్థుల దారి యూరపే.! యుద్ధాలు, అంతర్యుద్ధాల కారణంతో యుగొస్లావియా, ఉక్రెయిన్,సిరియా,ఆఫ్ఘనిస్థాన్ మొదలైన దేశాలలో బాధపడేవారు యూరప్ దేశాల వైపు వస్తున్నారు. అతి ప్రమాదకరమైన విధానాల్లో సముద్ర ప్రయాణాలు చేస్తూ, కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.ముఖ్యంగా 2015లో వలసలు పెద్దఎత్తున పోటెత్తాయి.ఆ సంవత్సరాన్ని 'వలసల సంవత్సరం'గా అభివర్ణించారు.2007-2011మధ్య కూడా వలసలు పెద్ద సంఖ్యలోనే జరిగాయి.ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం పెరగడం కూడా వలసలపైన కీలక ప్రభావం చూపించింది, ఇంకా చూపిస్తూనే వుంది. లక్షల మంది వలస 2022నాటికి వలస వచ్చిన జనాభా చూస్తే, జర్మనీలో 10.9మిలియన్లు, స్పెయిన్ లో 5.4మిలియన్లు, ఫ్రాన్స్ లో 5.3మిలియన్లు,ఇటలీలో 5మిలియన్లు ఉన్నట్లు సమాచారం. ఒక్క 2022లోనే యూరోపియన్ యూనియన్ లో ఆశ్రమం కోరిన వారి సంఖ్య 6,32,430.అందులో ఆమోదం పొందిన వారి సంఖ్య 3.10 లక్షలు.ఇన్నేళ్ల పాటు వచ్చినవారు,వస్తున్నవారిలో అధికారికంగా కంటే అనధికారికంగా వచ్చిన వారి సంఖ్య అంచనాలకు మించి వుంటుంది. లక్షల్లో వలసవస్తున్న వీరిని కొన్ని దేశాలు అడ్డుకుంటున్నాయి. జర్మనీ వంటికొన్ని దేశాలు మాత్రం ఆదుకుంటున్నాయి. నాటి పాపం నేడు అనుభవిస్తున్నారు పశ్చిమాసియా, దక్షిణాసియా, ఆఫ్రికా నుంచి పెద్దసంఖ్యలో వలసలు జరిగాయి. అరబ్ విప్లవం తర్వాత టునీసియా, లిబియా,ఈజిప్ట్,యెమెన్, అల్జీరియా వంటి దేశాల నుంచి వలసలు వెల్లువెత్తాయి. చట్టవిరుద్ధంగా ప్రవేశించినవారిలో ఎక్కువమంది గ్రీస్ ద్వారా వెళ్లినట్లు తెలుస్తోంది.వలసల ప్రభావం ఆర్ధిక, సామాజిక,రాజకీయ వ్యవస్థలపై పడుతోంది.నివాసం,ఉపాధి కల్పించడం ప్రభుత్వాలకు పెనుసమస్యగా మారింది. వివిధ సమాజాల మధ్య సాంస్కృతిక ప్రయాణం పెద్దసవాల్ విసురుతోంది. ప్రస్తుతం యూరప్ లో ప్రముఖంగా కనిపిస్తున్న ఈ జాఢ్యం మిగిలిన ఖండాలలోనూ రేపోమాపో శృతిమించకపోదు. సున్నితం.. కీలకం భిన్న సంస్కృతులకు, మతాలకు నిలయమై,అనేక దాడులకు ఆలవాలమై,ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా అవతరిస్తున్న భారతదేశం వలసల విషయంలో,ముఖ్యంగా మిగిలిన దేశాల నుంచి అక్రమంగా చొరబడిన వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యూరప్ వలసల అంశంపై ప్రపంచ దేశాధినేతలు దృష్టి పెట్టాలి. ఆయా దేశాల అంతర్గత సమస్యలను అరికట్టడంలోనూ, మతోన్మాద ఉగ్రవాదం ప్రబలకుండా చూడడంలోనూ అందరూ కలిసి సాగాలి.యూరప్ అనుభవాలు మిగిలిన ఖండాలకు పెద్దగుణపాఠం కావాలి. - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
మ్యాంగో ఈటింగ్ పోటీలు
-
ప్రజల కోసం, ధర్మం కోసం మాట్లాడా: ఈటల
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కు ముడుపులు అందాయన్న ఈటల రాజేందర్ కామెంట్లతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. దేవుడి మీద ప్రమాణం చేద్దామంటూ రేవంత్ రెడ్డి పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో.. ఇంట్లోనే ఉండిపోయిన ఈటల.. శనివారం సాయంత్రం బయట మీడియాతో మాట్లాడారు. ‘‘నేను వ్యక్తిగతంగా ఏం మాట్లాడలేదు. ఆత్మసాక్షిగానే చెప్పా. నేను ఎవరినీ కించపరిచే వ్యక్తిని.. గాయపరిచే వ్యక్తిని కాను. నేను వ్యక్తుల కోసం మాట్లాడలేదు.. ప్రజల కోసం, ధర్మం కోసం మాట్లాడా’’ అని పేర్కొన్నారు ఈటల. సంపూర్ణంగా అందరూ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడ్తా. రేపు(ఆదివారం) మాట్లాడతా.. అందరికీ సమాధానం చెప్తా. ఓ పొలిటికల్ లీడర్ కు కావాల్సింది కాన్ఫిడెంట్. నీ మీద నీకు నమ్మకం లేకపోతే కదా దేవుడిపై విశ్వాసం. గుళ్లకు వెళ్లి అమ్మతోడు.. అయ్యతోడు అనడం ఇదేమి కల్చర్?. ఇప్పుడున్న రాజకీయాలపై మాట్లాడిన. ఎవరెన్ని మాట్లాడినా.. ప్రజల కోసం ఈటల రాజేందర్ మాట్లాడతాడు. వ్యక్తిగతంగా నేనేం మాట్లాడలేదు అని తెలిపారాయన. కేసీఆర్ వ్యతిరేకంగా రేవంత్ పోరాడడం లేదని నేను అనలేదు. తాటాకు చప్పుళ్లకు భయపడే రకం ఈటల కాదు. నిజమెంతో, అబద్ధ ఏంటో ప్రజలే తేలుస్తారు. నా ఆత్మ సాక్షి ప్రకారమే నేను మాట్లాడా అని ఈటల తెలిపారు. ఎంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ప్రాపకంతో బతుకుతున్నారో తెలియదా? అంటూ రేవంత్ సవాల్లో పాల్గొనకుండానే బదులిచ్చారు ఈటల. -
ఈటలకు రేవంత్‌రెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. బీఆర్ఎస్ నుంచి రేవంత్ డబ్బులు తీసుకున్నారన్న ఈటల ఆరోపణలపై స్పందిస్తూ.. రేవంత్ సవాల్ విసిరారు. రేపు(శనివారం, ఏప్రిల్ 22) సాయంత్రం ఆరు గంటలకు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరకు వస్తా. బీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేస్తా. ఈటల కూడా వచ్చి ప్రమాణం చేయాలి. ఈ విషయంలో ఈటల దిగజారి మాట్లాడుతున్నారు అంటూ రేవంత్ మండిపడ్డారు. భాగ్యలక్ష్మి టెంపుల్ వద్దంటే.. నువ్వు చెప్పిన గుడి వద్దకే వస్తా. నేను డబ్బులు తీసుకోలేదని దేవుడిపై ఒట్టేసి చెప్తా. నా సవాల్ స్వీకరించి గుడికి వచ్చి ఈటల ప్రమాణం చేయాలి అని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ‘‘ఆరు నెలలు అయితే రాష్ట్రమే గుంజుకుంటాం..కేసీఆర్ దగ్గర రూ. 25 కోట్లు తీసుకుంటమా?. విచక్షణ మరచిపోయి మాట్లాడితే ఎలా?. రేవంత్ రెడ్డి అంటే ఈటల ఏమనుకుంటున్నాడు?. కేసీఆర్‌కు వ్యతిరేకంగా రేవంత్‌రెడ్డి కాకుండా ఇంకెవరు కొట్లాడారు. నాపైన ఈటల చేసిన ఆరోపణకు తెలంగాణ సమాజానికి స్పష్టత ఇవ్వదలుచుకున్నా’’ అని రేవంత్ పేర్కొన్నారు. నా పోరాటాన్ని ఈటల కించపరిచారు. రేపు సాయంత్రం 6 గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర సిద్దంగా ఉండు. అగ్నిపరీక్షకు నేను సిద్ధంగా ఉన్నా. ఈటల తాత్కాలిక దిగజారుడు రాజకీయాలు చేయడం దుర్మార్గం అని పేర్కొన్నారాయన. అంతకు ముందు మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉన్న పెద్దవాళ్ల కంటే ఎస్సీ, ఎస్టీ , బీసీ నాయకులే మునుగోడు ఎన్నికలకు సహాయం చేసారు. ఆ టైంలో పార్టీలో ఉన్న ముఖ్య నాయకులందరినీ సహాయం చేయాలని అడిగా. కానీ, ఉన్నత వర్గాల వారు ఎవరు సహాయం చేయలేదు అని పేర్కొన్నారాయన. ఇదీ చదవండి: నోరు జారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే -
ప్రతిసవాల్‌ను స్వీకరించని ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి
ఉదయగిరి/ఆత్మకూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి విసిరిన సవాల్‌కు వైఎస్సార్సీపీ నాయకులు ప్రతిస్పందించారు. అయితే ఆయన మాత్రం వారి సవాల్‌ను స్వీకరించలేదు. ఉదయగిరికి రాలేదు. వివరాలిలా ఉన్నాయి. పార్టీకి అన్యాయం చేసిన చంద్రశేఖర్‌రెడ్డి ఉదయగిరిలో అడుగుపెడితే ఒప్పుకోబోమని సొసైటీ మాజీ అధ్యక్షుడు మూలె వినయ్‌రెడ్డి గురువారం ఉదయం హెచ్చరించారు. దీనికి స్పందించిన చంద్రశేఖర్‌రెడ్డి సాయంత్రం ఉదయగిరి బస్టాండ్ సెంటర్‌కు చేరుకుని ‘నేను బస్టాండ్‌లో ఉన్నాను.. ఏం చేస్తారో రా..’ అంటూ సవాల్ చేశారు. ఈ విషయం తెలిసిన వినయ్‌రెడ్డి.. తన అనుచరులతో బస్టాండ్ వద్దకు చేరుకునేలోపు ఎమ్మెల్యే వెళ్లిపోయారు. ఈ సందర్భంగా వినయ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ రాత్రి, రేపు ఉదయగిరి బస్టాండ్‌లోనే ఉంటా.. దమ్ము, ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడాలి’ అని ఎమ్మెల్యే సవాల్‌కు ప్రతిసవాల్ చేశారు. శుక్రవారం ఉదయం ఉదయగిరి మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి తమ అనుచరులతో బస్టాండ్‌కు వచ్చి అక్కడే ఉన్న వినయ్‌రెడ్డికి సంఘీభావంగా నిలిచారు. వారు ఎమ్మెల్యేకు ఫోన్ చేయగా.. ఆయన ఫోన్ కట్ చేశారు. ఆ తర్వాత అక్కడి వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ.. సీఎంను, పార్టీ పెద్దలను ఒక్క మాట అన్నా సహించేది లేదని హెచ్చరించారు. కాగా, ఉదయగిరి బస్టాండ్ వద్ద సీఐ వి.గిరిబాబు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనారోగ్యంగా ఉన్నాను ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తన సోదరుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అనారోగ్యంతో ఉన్నానని, మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి వెళుతున్నానని, ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తనపై సవాల్ చేసిన వారి గురించి మాట్లాడతానని చెప్పారు. 2024లో తన ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎన్నికల్లో పోటీచేస్తానని చెప్పారు. పార్టీకి భిన్నంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు: ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డితో 3 సంవత్సరాలుగా తాము దూరంగా ఉంటున్నామని, ఎవరి వ్యాపారాలు వారు చేసుకుంటున్నామని ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి చెప్పారు. ఆత్మకూరులో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. మేకపాటి కుటుంబం పట్ల సీఎం జగన్, వారి కుటుంబ సభ్యులు ఎంతో ఆదరణగా ఉంటున్నారని తెలిపారు. సస్పెండైన వారు వెళ్లిపోయినంత మాత్రాన వైఎస్సార్సీపీకి ఎలాంటి నష్టంలేదని అన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు కొన్ని చానెల్స్ విషప్రచారం చేశాయని, వాస్తవాలు తెలుసుకోకుండా అలా ప్రసారం చేయడం సరికాదన్నారు. -
భళా చిత్రం.. కళా యజ్ఞం!
సాక్షి, హైదరాబాద్: అప్పుడే కుంచె పట్టడం మొదలుపెట్టినవారి నుంచి అలవోకగా కళాకృతులను సృష్టించే చిత్రకారులు. చూడగానే ఆకట్టుకునే, ఆలోచింపజేసే చిత్రాలు. ఓ సరికొత్త కళాయజ్ఞం. 21 రోజులపాటు రోజూ ఒక చిత్రాన్ని గీయాలంటూ ప్రముఖ చిత్రకారుడు యేలూరి శేషబ్రహ్మం ఇచ్చిన పిలుపునకు స్పందన ఇది. దేశంలోనే తొలిసారిగా ఫేస్బుక్ వేదికగా డిసెంబర్ 11న మొదలైన ఈ ‘చాలెంజ్’శనివారం (31వ తేదీ)తో ముగిసింది. 400 మందికిపైగా చిత్రకారులు, వేలకొద్దీ చిత్రాలను గీసి ఈ ‘కళాయజ్ఞం’లో పాల్గొన్నారు. ఇందులో పదుల సంఖ్యలో విదేశీ చిత్రకారులూ ఉండటం గమనార్హం. ఆర్ట్ చాలెంజ్ లాంటిదే.. దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ఈ ‘21 రోజుల కళాయజ్ఞ’.. సోషల్ మీడియా వేదికగా నడుస్తున్న పలు చాలెంజ్‌ల తరహాలో ఒక ఆర్ట్ చాలెంజ్ అని చెప్పొచ్చు. అయితే దాన్ని ‘కళాయజ్ఞ’గా పేర్కొనడంతో మరింత భారతీయతను సంతరించుకుంది. నిర్వాహకులు ముందే ప్రకటించిన 21 అంశాలలో రోజుకొక అంశం చొప్పున సింగిల్ కలర్ లేక మోనోక్రోమ్ విధానంలో 21 రోజుల పాటు చిత్రాలు గీయడమే దీని లక్ష్యం. ప్రకటిత అంశాలన్నీ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను, సామాన్య జనజీవన విధానాన్ని తెలిపేలా రూపొందించారు. దీనికోసం ‘ఫేస్బుక్’లో ప్రత్యేకంగా ఒక గ్రూపును ఏర్పాటు చేశారు. అప్పుడప్పుడే కుంచె పట్టిన చేతుల నుంచి కళాత్మకంగా కుంచెను నాట్యమాడించే వారి వరకు ప్రతిఒక్కరూ అద్భుత కళాఖండాలను సృష్టిస్తున్నారు. ప్రొఫెషనల్ చిత్రకారులే కాక ఇల్లస్ట్రేటర్స్, కార్టూనిస్ట్‌లు, స్థపతులు, డిజైనర్లు ఇంకా అనేక రంగాలలో ఉండి అభిరుచితో చిత్రాలు గీసేవారు కూడా ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. డ్రాయింగ్స్, పెయింటింగ్స్, శాండ్ ఆర్ట్, ప్రింట్ మేకింగ్, గ్రానైట్ ఎచింగ్స్ ద్వారా కూడా చిత్రాలకు ప్రాణం పోస్తున్నారు. హైదరాబాద్‌లో చిత్ర ప్రదర్శన నిబంధనల మేరకు కళాయజ్ఞంలో పాల్గొన్న కళాకారుల నుంచి మంచి కౌశలం చూపిన 21 మందిని ఎంపిక చేయనున్నారు. జాతీయ స్థాయిలో పేరొందిన ప్రముఖ చిత్రకారులు ఐదుగురు న్యాయ నిర్ణేతలుగా ఉంటారు. ఎంపిక చేసిన అద్భుత చిత్రాలతో హైదరాబాద్‌లో 3 రోజులపాటు చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. కళాయజ్ఞంలో పూర్తిస్థాయిలో పాలుపంచుకోలేని ఔత్సాహిక కళాకారులకు గెస్ట్ ఆర్టిస్ట్‌గా కొన్ని చిత్రాలు గీసే అవకాశం కూడా కల్పిస్తున్నారు. అనూహ్య స్పందన వస్తోంది విదేశాలతో పోలిస్తే మన దగ్గర ఆర్ట్ చాలెంజ్‌లు అరుదు. అందుకే భారతీయ సంస్కృతి, సంప్రదాయాల థీమ్‌తో దీన్ని డిజైన్ చేశాం. పదుల సంఖ్యలో వస్తారనుకున్నాం. కానీ అనుకోని విధంగా భారీ స్పందన లభించింది. వందలాది మంది వర్క్స్ ఒకేరోజు చూసే అవకాశం కళాభిమానులకు కనువిందు చేస్తుంది. చిత్రకారులకు ఒక చక్కని సాధనలా కూడా ఉపకరిస్తుంది. ఇప్పటికే వేలాది చిత్రాలతో ఈ కార్యక్రమం కళాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వీటిని ’'BrahmamKalaYajna' ఫేస్బుక్ పేజీలో వీక్షించవచ్చు. –శేషబ్రహ్మం, ప్రముఖ చిత్రకారుడు -
అదే జరిగితే రాజకీయాలు వదిలేస్తా: సీఎం షిండే
ముంబై: రాజకీయ సంక్షోభ ఎపిసోడ్‌ను ప్రజల మది నుంచి తుడిచేసేందుకు.. పాలనా పరమైన సంస్కరణలను తెరపైకి తీసుకొస్తున్నారు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే. అయితే శివ సేన అధినేత, మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే మాత్రం.. రెబల్ ఎమ్మెల్యేలపై విమర్శలను కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా థాక్రే చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు సీఎం షిండే. ‘‘అసెంబ్లీలో బలపరీక్షలో గెలిచాం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీతో కలిసి ఘన విజయం సాధిస్తాం. రెబల్స్ ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా గెలవరని కొందరు అంటున్నారు. కానీ, నేను చెప్తున్నా.. అందరికి అందరూ గెలుస్తారు. దానికి నాది బాధ్యత. వీళ్లలో ఏ ఒక్కరూ ఓడినాసరే.. నేను రాజకీయ సన్యాసం చేస్తా. అసలు ఓడిపోతారని.. గెలుస్తారని చెప్పడానికి నువ్వెవరు? అదంతా ప్రజలు.. ఓటర్లే నిర్ణయించేది’’.. అంటూ పరోక్షంగా ఉద్దవ్ థాక్రేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రెబల్స్ శివసేన ఎమ్మెల్యేల్లో నలభై మంది ఎన్నికల్లో పోటీ చేస్తే గెలవరని, కావాలంటే ఛాలెంజ్‌కు సిద్ధమని శివసేన పార్టీ అధినేత ఉద్దవ్‌థాక్రే వ్యాఖ్యానించారు. దీంతో థాక్రే పేరెత్తకుండానే.. శుక్రవారం సాయంత్రం రెబల్ ఎమ్మెల్యే సంజయ్ షిర్సత్ నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో సీఎం షిండే పైవ్యాఖ్యలు చేశారు. -
కన్నతల్లితోనే ఛాలెంజ్! ఆరేళ్ల తర్వాత..
చెప్పింది వినకుండా పిల్లలు మారాం చేసినప్పుడు.. ఫలానా కొనిస్తాం లేదంటే ఫలానా దగ్గరికి తీసుకెళ్తాం అంటూ బుజ్జగిస్తుంటారు పేరెంట్స్. ఈరోజుల్లో పిల్లల పాలిట సెల్‌ఫోన్ ఒక వ్యసనంగా మారింది. ఆ అలవాటు మాన్పించే ప్రయత్నాలు ఎన్ని ఉన్నా.. పూర్తి స్థాయిలో వర్కవుట్ కావడం లేదు. ఈ తరుణంలో ఓ తల్లి చేసిన పని.. ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఆరేళ్ల కిందట.. మిన్నెసోటా(అమెరికా)కు చెందిన 12 ఏళ్ల పిలగాడు సివెర్ట్ క్లెఫ్‌సాస్ ఇంట్లో ఉన్న మొబైల్‌కు అతుక్కుపోవడం మొదలుపెట్టాడు. కొడుకును ఎలాగైనా ఆ వ్యసనానికి దూరం చేయాలని తల్లి లోర్నా గోల్డ్స్ట్రాండ్ భావించింది. ఇందుకోసం కొడుకుతో ఓ ఛాలెంజ్ చేసింది. బహుశా ఏ తల్లికి ఇలాంటి ఐడియా వచ్చి ఉండదేమో.! ఆరేళ్ల పాటు సోషల్ మీడియాకు గనుక దూరంగా ఉంటే.. సివెర్ట్ 18వ పుట్టినరోజున 1,800 డాలర్లు (మన కరెన్సీలో లక్ష 36 వేల రూపాయలు) ఇస్తానని ఛాలెంజ్ విసిరింది. అంత చిన్న వయసులో అంత పెద్ద ఫిగర్ వినేసరికి సివెర్ట్ టెంప్ట్ అయ్యాడు. తల్లి ఛాలెంజ్‌కు సై చెప్పాడు. ఆరేళ్లు గిర్రున తిరిగింది.. తల్లితో చేసిన ఛాలెంజ్‌కు కట్టుబడి ఈ ఆరేళ్లు సోషల్ మీడియా జోలికి పోలేదు ఆ కుర్రాడు. మీరు నమ్మినా.. నమ్మకపోయినా.. అదే నిజం అంటున్నాడు. రీసెంట్గా బర్త్‌డే 18వ పుట్టినరోజు చేసుకున్న ఆ కుర్రాడికి.. ఛాలెంజ్ ప్రకారం 1,800 డాలర్లను కొడుక్కి అందించింది లోర్నా. అంతేకాదు కొడుకు ఫొటోను తన ఫేస్బుక్లో షేర్ చేసి.. జరిగిందంతా చెప్పింది. తన పెద్ద కూతురిలా కొడుకు కూడా సోషల్ మీడియాకు బానిస కావడం, మానసికంగా కుంగిపోవడం ఇష్టం లేకనే ఇలా ఛాలెంజ్ విసిరానని చెప్తోందామె. ఈ ఆరేళ్ల కాలంలో తన తోటి వాళ్లెందరో స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియాకు అడిక్ట్ అయ్యారు. కానీ, తన కొడుకు మాత్రం వాటికి దూరంగా ఉన్నాడని మెచ్చుకుంది ఆ తల్లి. ఇంతకీ ఈ తల్లికి ఈ ఐడియా ఎలా తట్టిందో తెలుసా? ఓరోజు రేడియోలో 18 ఫర్ 18 ఛాలెంజ్ అనే కాన్సెప్ట్ గురించి వినిందట. ఆ స్ఫూర్తితో కొడుక్కి ఈ ఛాలెంజ్ విసిరిందామె. ఇక ఎలాగూ కొడుకు తన ఛాలెంజ్ పూర్తి చేయడంతో.. ఇప్పుడతనికి స్వేచ్ఛ దొరికినట్లయ్యింది. -
కళ్ల ముందే కుప్పకూలుతూ.. చావు కోరల్లోకి!
Milk Crate Challenge: ఆన్లైన్ ప్రపంచం అస్సలు ఊహించని ట్రెండ్స్‌కు కేరాఫ్. ఎప్పుడు ఏ వీడియో ఎందుకు వైరల్ అవుతుందో అర్థంకాని విషయం. అలా మిల్క్ క్రాట్ ఛాలెంజ్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. విదేశీ యువత ఎక్కువగా మోజు పెంచుకుంటున్న ఈ ఛాలెంజ్.. పుట్టింది మాత్రం టిక్‌టాక్ ద్వారానే. మెట్లలాగా పేర్చిన పాల డబ్బాల మీద ఎక్కి సేఫ్‌గా దిగడమే ఈ ఛాలెంజ్ ఉద్దేశం. కానీ, కిందపడిపోతూ దెబ్బలు తగిలించుకోవడం మాత్రమే కాదు.. అంతర్గత గాయాలతో చనిపోతున్న కేసులు ఇప్పుడు పెరిగిపోతున్నాయి. వైరల్ వీడియో: నడిరోడ్డులో భయానక అనుభవం -
ఏంటీ.. జనమంతా మోదీకి మొక్కులు తీర్చుకుంటున్నారా?
ఎదురుగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ కటౌట్లు, ఫ్లెక్సీలు.. వాటికి ఎదురుగా నిల్చుని జనాలు దణ్ణం పెడుతున్న ఫొటోలు. సోషల్ మీడియాలో ఇప్పుడు కొనసాగుతున్న కొత్త ట్రెండ్ #ThankYouModiJiChallenge. బంకుల్లో ఆ ఫొటోలు చూస్తే చాలు.. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా ఈ ఛాలెంజ్ నడుస్తోందని చెప్పనక్కర్లేదు. #ThankYouModiJiChallenge Thanks a lot. All in one pic #ThankYouModiJiChallenge#NationAgainstPrivatization pic.twitter.com/qC3ZC6EDX8 — PM Naeem (@PMNaeem) July 19, 2021 Join the campaign#ThankYouModiJiChallenge pic.twitter.com/TrnJaql6P1 — Umar A Siddiqui (Shelley Ώïṉḋ)™) (@uashfaq) July 19, 2021 ఈ ట్రెండ్ ఎలా మొదలైంది అనేది స్పష్టత లేదుగానీ, సరదా కోసమైనా కొందరు ఈ ఛాలెంజ్ పాల్గొంటున్నారు. యూపీఏ పాలనలో మోదీ చేసిన ట్వీట్లను తెరపైకి తెస్తూ.. ఏడేళ్ల పాలనలో ధరల పెంపును ప్రస్తావిస్తూ ఫన్నీ మీమ్స్‌తో మరికొందరు ట్రెండ్‌ను కొనసాగిస్తున్నారు. #ThankYouModiJiChallenge Thanks a lot. All in one pic pic.twitter.com/Jx0RImRPVR#NationAgainstPrivatization — Ashwani Bhatia (@bhatia_movies) July 19, 2021 Thank you modi ji for hike petrol prices#ThankYouModiJiChallenge pic.twitter.com/x5wLmU9JNO — ParacetamoL150MG (@MgL150) July 19, 2021 ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ తమ విమర్శలకు ఈ ట్రెండ్‌ను వాడేసుకుంటోంది. ప్రస్తుతం నడుస్తున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై చర్చకు ప్రతిపక్ష కాంగ్రెస్ పట్టుబట్టడం చూస్తున్నాం. అయితే కాంగ్రెస్ కొనసాగిస్తున్న ఈ నెగెటివ్ ట్రెండ్‌ను పాజిటివ్‌గా మార్చేచే ప్రయత్నం చేస్తున్నారు మోదీ మద్ధతుదారులు. How do you "FEEL" when you see this picture ‼🤔#ThankYouModiJiChallenge#PetrolPriceHike pic.twitter.com/p8C0HWklYd — Jagdish Solanki (@iJagdishSolanki) July 18, 2021 #MonsoonSession | Trinamool Congress (TMC) MPs cycled to the Parliament today in protest against the rise in #FuelPrices. (ANI) pic.twitter.com/JA8N1AnAtp — NDTV (@ndtv) July 19, 2021 #ThankYouModiJiChallenge With this golden opertunity i have filled my fuel tank at 105/ltr. I express tons n thousands of guilty to have a Pradhan sevak like u.. pic.twitter.com/tYht98NJxz — Tarique Anjum (@TariqueRainy) July 19, 2021 ఇక ఈరోజు పెట్రో ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. మొత్తం మెట్రో నగరాల్లో ముంబైలో గరిష్టంగా పెట్రోల్ లీటర్ ధర రూ.107.83 కాగా, డీజిల్ ధర రూ.97.45గా ఉంది.హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.52గా ఉండగా డీజిల్ ధర రూ. 97.96గా ఉంది. -
అందమైన అమ్మాయి.. పాపం ఇలా ఘోరంగా బలైంది
అందం కోసం ఇంట్లోనే రకరకాల ప్రయత్నాలు-ప్రయోగాలు చేస్తుంటారు కొందరు. అలాగే ఫ్యాషనెబుల్‌గా కనిపించాలనే తాపత్రయంతో ఓ టీనేజర్ చేసిన పని.. ప్రాణాల్నే బలిగొంది. విషాదకరమైన ఈ ఉదంతం ఇప్పుడు బ్రెజిల్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. బ్రసీలియా: మినాస్ గెరాయిస్ స్టేట్‌లో ఎంగెన్హెయిర్ కాల్దాస్లో ఉంటోంది పదిహేనేళ్ల వయసున్న ఇసాబెల్లా ఎదువార్దా దె సౌసా. ఈ స్కూల్ చిన్నారి తన అందానికి మరింత మెరుగులు దిద్దాలనే ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగా కంటి భాగానికి రింగ్ కుట్టించుకోవాలనుకుంది. అయితే అమ్మతో సహా ఇంట్లో వాళ్లెవరూ ఆమెకు సహకరించలేదు. దీంతో స్నేహితురాలిని ఇంటికి పిలిపించుకుని ఆమె సాయంతో కంటికి పోగు కుట్టించుకుంది. మూడు రోజుల తర్వాత ఇసాబెల్లా ముఖంలో విపరీతమైన మార్పులు వచ్చాయి. ఇన్ఫెక్షన్ కావడంతో ముఖం ఉబ్బిపోయి.. కళ్లు పూర్తిగా మూసుకుపోయి ఇబ్బంది పెట్టాయి. దీంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఇన్ఫెక్షన్ తిరగబడడంతో ప్రాణాల మీదకు వచ్చింది. వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న తరుణంలో నాలుగుసార్లు గుండెపోటుకు గురైంది ఆ అమ్మాయి. చివరకు శుక్రవారం ఆ టీనేజర్ కన్నుమూసింది. పిచ్చి ఛాలెంజ్‌లు వద్దు ఈమధ్య టిక్‌టాక్‌లో పిచ్చి ఛాలెంజ్‌లు కొన్ని వైరల్ అవుతున్నాయి. ముఖం నిండా రింగులు కుట్టించుకునే ఛాలెంజ్‌లు వైరల్ అవుతున్నాయి. వాటి వల్ల నరాలు దెబ్బతినడంతో పాటు ఇన్ఫెక్షన్లు, చివరికి హెచ్ఐవీ కూడా సోకొచ్చని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఇక కంటికి రింగు కుట్టించుకున్న తర్వాత ఇజాబెల్లా చూపును కోల్పోయి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు. ‘ఒక అందమైన అమ్మాయి. నాకు అత్యంత ఇష్టమైన ఇసాబెల్లా.. ఇలా నరకం అనుభవించి చనిపోవడం బాధాకరంగా ఉంది. అందుకే తల్లిదండ్రులు చెప్పేది వినండి. పెద్దలు ఏం చెప్పినా మన మంచికే అని గుర్తించండి’ అని ఆమె దగ్గరి బంధువు ఒకరు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
టమాటో చాలెంజ్..
నెల్లూరు, మనుబోలు: లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న రైతన్నలను ఆదుకునేందుకు ఎన్నారైలు వినూత్న యత్నం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో టమాటో రైతులు నష్టపోతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న వారు ఓ చాలెంజ్ విసిరారు. నష్టపోతున్న రైతన్నలకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. భారీ ఎత్తున వాటిని కొనుగోలు చేశారు. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి అవస్థలు పడుతున్న ఇతర జిల్లాల వాసులకు కూడా ఉచితంగా పంపిణీ చేసి తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. జిల్లాలోని మనుబోలులో గురువారం ఈ ఘటన జరిగింది. వివరాలు.. లాక్డౌన్ సమయంలో గిట్టుబాటు ధర లభించకపోవడం, విక్రయాలు జరగకపోవడంతో చిత్తూరు జిల్లాలో టమాటో రైతులు ఇబ్బందులు పడుతున్న అంశం సోషల్ మీడియాలో వైరలైంది. ఈ క్రమంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఫర్ ఫార్మర్స్ (ఏటీఏఎఫ్‌ఎఫ్) సభ్యులు టమాటో రైతుల కష్టాలను తెలుసుకొని వారిని ఆదుకునేందుకు ఓ చాలెంజ్ విసిరారు. దీనికి పలువురు ఎన్నారైలు స్పందించారు. చిత్తూరు జిల్లాలో రైతుల నుంచి గిట్టుబాటు ధరకు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. వీటిని ప్రజల అవసరాల మేరకు ఇతర జిల్లాలకు కూడా తరలించి పేదలను ఆదుకుంటున్నారు. టమాటోలతో పాటు ఉల్లిపాయలు, క్యారెట్, వంకాయలను కలిపి నాలుగు టన్నుల కూరగాయలను మనుబోలులోని రైతుభరోసా కేంద్రానికి తరలించారు. వీటిని ప్యాకింగ్ చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో స్థానిక సీఎం నగర్, ఎరుకల కాలనీ, అరుంధతీయవాడల్లో ఉచితంగా పంపిణీ చేశారు. పొదలకూరు మండలంలోనూ కూరగాయలను అందజేశారు. రాష్ట్రంలో రైతు సంక్షేమ రాజ్యాన్ని తెచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి స్ఫూర్తితో.. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సూచనలతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఎన్నారైలు తెలిపారు. జిల్లాకు చెందిన ఎన్నారైలు చింతగుంట సుబ్బారెడ్డి, ప్రేమ్‌కల్యాణ్‌రెడ్డి కూరగాయల కొనుగోలు, పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి గుంజి రమేష్, గిద్దంటి రమణయ్య, బొమ్మిరెడ్డి హరగోపాల్‌రెడ్డి, కడివేటి చంద్రశేఖర్‌రెడ్డి, చిట్టమూరు అజయ్‌రెడ్డి, చల్లా రవీంద్ర, నవకోటి, భాస్కర్‌గౌడ్, భాస్కర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
సీతక్క చాలెంజ్‌ను స్వీకరించిన ఎంపీ రేవంత్
జూబ్లీహిల్స్: ములుగు ఎమ్మెల్యే సీతక్క ఇచ్చిన ఛాలెంజ్‌ను ఎంపీ రేవంత్‌రెడ్డి స్వీకరించారు. ఆకలితో ఉన్న వారిని ఆదుకోవాలని ఆమె సోషల్ మీడియా వేదికగా మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డికి ట్యాగ్ చేశారు. స్పందించిన రేవంత్‌రెడ్డి బుధవారం జూబ్లీహిల్స్‌లోని మల్కాజ్గిరి ఎంపీ కార్యాలయానికి 4,500 మందికి సరిపడా నిత్యావసర సరుకులను పంపించారు. ఈ సరుకులను రంజాన్ దీక్షలో ఉండే ముస్లింలతో పాటు ఆకలితో ఉన్న పేద కుటుంబాలకు అందిస్తామని ఆయన తెలిపారు. (‘సీతక్క మీరు చరిత్రలో నిలిచిపోతారు..’) అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వానికి మద్యం అమ్మకాల మీద ఉన్న శ్రద్ధ పేదల మీద లేదన్నారు. నిన్న జరిగిన కేబినేట్ భేటీ తర్వాత పేదల కోసం ఏదైనా ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తారని ఆశించామని తీరా చూస్తే మద్యం షాపుల ఓపెనింగ్ కోసమే కేబినేట్ భేటీ జరిగినట్లుందన్నారు. మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించినట్లుగానే మిగతా షాపులను కూడా తెరిచేందుకు అనుమతుల్వివాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు డాక్టర్ సి.రోహిణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.(అక్కొచ్చె.. అన్నం తెచ్చె..) -
అత్తయ్యతో కలిసి నటి టిక్‌టాక్ ఛాలెంజ్
-
సాయి పల్లవి, తమన్నాకు వరుణ్ ఛాలెంజ్!
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను సినీ నటుడు వరుణ్ తేజ్ కొణిదెల స్వీకరించాడు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా వరుణ్ తేజ్ తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటాడు. దీనికి సంబంధించిన ఆయన శనివారం ట్వీటర్లో పోస్ట్ చేశారు. గ్రీన్ ఛాలెంజ్‌కు నామినేట్ చేసిన ఎంపీ సంతోష్ కుమార్ గారికి, అక్కినేని అఖిల్‌కు ధన్యవాదాలు తెలిపాడు. కొంచెం బిజీగా ఉన్నా..కానీ మంచి పనికోసం కొంచెం ఆలస్యంగానైనా స్పందించాల్సిందేనని ట్వీట్ చేశారు. అంతేకాదు హరా హైతో భరా హై హ్యాష్ ట్యాగ్ తో గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా హీరోయిన్లు సాయి పల్లవి, తమన్నాలను నామినేట్ చేశాడు. మరి ఈ మెగా ప్రిన్స్ చాలెంజ్‌ను ఈ సాయి పల్లవి, తమన్నా ఎపుడు స్వీకరిస్తారో వేచి చూడాలి. రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మొక్కలు నాటిన వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వనమిత్ర అవార్డ్‌ను ఆవిష్కరించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన వారందరికీ ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. డాక్టర్ ఏపీజె అబ్దుల్ కలాం వనమిత్ర బ్యాడ్జ్ ఆఫ్ హానర్ అవార్డ్స్ ఇవ్వాలని ఇగ్నైటింగ్ మైండ్స్ సంస్థ నిర్ణయించింది. ఇందులో భాగంగా రూపొందించిన అవార్డ్స్‌ను రాజ్యసభ ఎంపీ, సంస్థ ప్యాట్రన్ సంతోష్ కుమార్ గతనెలలో (గురువారం, సెప్టెంబర్ 5) ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. Thanks for nominating me @MPsantoshtrs garu & @AkhilAkkineni8 for the #GreenIndiaChallenge Been a bit busy. But it’s never too late to do a good deed! Taking this initiative forward by nominating @Sai_Pallavi92 & @tamannaahspeaks to take this up#HaraHaitohBharaHai pic.twitter.com/Epoer8QERf — Varun Tej Konidela (@IAmVarunTej) October 5, 2019 -
స్నేహితుల మాట విని సాహసం
దొడ్డబళ్లాపురం: స్నేహితుల మాటకు కట్టుబడి ఒక వ్యక్తి నిండి ప్రవహిస్తున్న నదిలో దూకిన సంఘటన హొళేనరసీపురలో చోటుచేసుకుంది. హొళేనరసీపురకు చెందిన రాము అనే వ్యక్తి ఈ సాహసానికి పూనుకున్నాడు. ఆదివారం తన పిల్లలు, స్నేహితులతో కలిసి రాము కావేరి నది పరివాహక ప్రదేశానికి వెళ్లాడు. ఈ సందర్భంగా స్నేహితులతో 17 ఏళ్ల క్రితం ఇదే విధంగా పొంగి ప్రవహిస్తున్న నదిలో దూకి అవతలి వైపు ఒడ్డును చేరుకున్న సంఘటనను గుర్తు చేసాడు. దీంతో స్నేహితులు సరదాగా అయితే ఇప్పుడు చేసి చూపించు అంటూ ఎగతాళి చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న రాము పిల్లలతో ఈతకొట్టి చూపిస్తాను చూడండంటూ చెప్పి అమాంతం నదిలో దూకి అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
మూవ్ MOM మూవ్..
ఉదయం నిద్ర లేచింది మొదలు.. ఉరుకులుపరుగులు ఇంటి బాధ్యతలు.. ఉద్యోగ విధులు.. రెండింటినీ సమన్వయం చేసుకుంటూ పోటీలో నగర మహిళ అలసిపోతోంది. అమ్మగా మారాక... పెరిగిన కుటుంబ నిర్వహణ కారణంగా విశ్రాంతికి దూరమవుతోంది. ఫలితంగా అమ్మ శరీరానికి వ్యాయామం దూరమై.. జీవనశైలిలో వ్యాధుల బారిపడుతున్నారు. కుటుంబ సభ్యులకు పనులు కేటాయించడంలో అమ్మకు బిడియం అడ్డుగోడగా మారుతోంది. సున్నితమై ఇలాంటి అంశాలపై మోడర్న్ మామ్స్‌కు అవగాహన కల్పించేందుకు ‘మిలీనియం మామ్స్’ పేరిట ఈ నెల 15న ఉదయం 8:30 గంటలకు శంషాబాద్ నోవొటెల్ వద్ద మూవ్ మామ్ మూవ్ పేరిట కార్ల ర్యాలీనిర్వహించనున్నారు. సాక్షి, సిటీబ్యూరో: వాహనాలు నడపడంలో టైమ్, డిస్టెన్స్, స్పీడ్ విషయాల్లో ఆధునిక ‘మామ్స్’ ఎంత ఫిట్‌గా ఉన్నారో తెలియజెప్పడమే దీని ముఖ్య ఉద్ధేశ్యం. ఈ మధ్య నెక్లెస్‌రోడ్డులో వయోధిక వృద్ధులు వారి ఆరోగ్యంపై, సమస్యలపై అవగాహన కార్యక్రమం జరిగింది. అది మరువక ముందే ఇప్పుడు తల్లుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వారు వాహనాలు నడపటంలో ఎంత ఫిట్నెస్ కలిగి ఉన్నారనే విషయం గమనించి, ఆధునిక తల్లులకు శారీరక వ్యాయామంపై అవగాహన కల్పించనున్నారు. వెల్ఫేర్ ఆఫ్ మదర్... సహజంగా మహిళలకు బిడియం ఎక్కువ. గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూ కుటుంబ సభ్యులను సాయం అడిగే సాహసం కూడా చాలా మంది చేయరు. ఆమెలో కాస్తయినా మార్పు తీసుకువచ్చి ఆరోగ్య స్పృహ కలిగించాలన్నాదే తమ లక్ష్యం. మధుమేహం, ఊబకాయం వంటివి జీవనశైలి మార్పుల కారణంగా పెరుగుతాయి. మహిళల్లో కూడా ఈ రుగ్మతలు పెరగడం ఆందోళన కలిగించే అంశం. బాధ్యతల్లో తలమునకలైన ఆమెకు రోజు వ్యాయామం చేయాలనే ఆలోచన రెకెత్తించటమే దీని ఉద్ధేశ్యం. మిలీనియం మామ్స్ పేరిట నిర్వహించే కార్యక్రమంలో నగరంలో ఆసక్తిగల మహిళలను జట్టుగా తయారు చేస్తాం. వీరికి 21 రోజుల పాటు మామ్స్ ఛాలెంజ్ పేరిట పోటీ నిర్వహిస్తాం. జట్టులో ఉన్న అమ్మలకు శారీరక వ్యాయామాలను వివరిస్తాం. ప్రతిరోజు మహిళలు తాము మార్చుకున్న జీవనశైలి మార్పులను వివరిస్తూ గ్రూపులో పోస్టులు చేయాల్సి ఉంటుంది. శాస్త్రీయంగా కూడా 21 రోజులు వ్యాయామం అలవాటయితే క్రమంగా వారి జీవితంలో భాగమవుతుందనే ఆలోచనతో పోటీ నిర్వహిస్తున్నాం. – డాక్టర్ మణి పవిత్ర, నిర్వాహకులు అవగాహన ఇలా... శారీరక శ్రమ దూరం కావడం వల్ల తలెత్తే ఇబ్బందులకు పరిష్కారం వ్యాయామం మాత్రమే.. మిలీనియం మామ్స్ పేరిట ఈ నెల 15న ఉదయం 8.30 గంటలకు శంషాబాద్‌లోని నోవెటల్ వద్ద మూవ్ మామ్ మూవ్ పేరిట కార్ల ర్యాలీ ప్రారంభమై.. షాదాన్ మెడికల్ కాలేజీ ప్రాంగణం వరకు సాగుతుంది. అక్కడ పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. మదర్ డ్రైవర్ గానీ, న్యావిగేషన్ వచ్చి ఇందులో పాల్గొనవచ్చు. ఇప్పుడు తల్లులు చేస్తే దాన్నే పిల్లలు అనుకరిస్తారు. అంటే రెండు తరాలు బాగుపడ్డట్లు అవుతుందనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు డాక్టర్ మణి పవిత్ర అన్నారు. ఇప్పటికి 200 మంది పైగా తమ పేర్లు నమోదు చేసుకున్నారని, ఆసక్తి ఉన్నవారు మరిన్ని వివరాలకు ఫోన్: 92465 55712 నంబర్లో సంప్రదించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. -
సవాల్ విసిరిన అసదుద్దీన్ ఒవైసీ
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సవాలు విసిరారు. దమ్ముంటే హైదరాబాద్‌లో పోటీ చేసి గెలవాలని ఆయన పేర్కొన్నారు. చాలా మంది తనపై పోటీ చేసి గెలవాలని చూస్తున్నారని, ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా సహా ఎవరికైనా దమ్ము, ధైర్యం ఉంటే తనపై పోటీ చేసి తనపై గెలవాలని ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి కూడా సవాలు విసురుతున్నట్లు పేర్కొన్నారు. అంతా ఏకమైనా తమ పార్టీని ఓడించలేరని ఒవైసీ పేర్కొన్నారు. తన అనుచరులతో శనివారం హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించిన ఒవైసీ మోదీపై విమర్శల వర్షం కురిపించారు. ‘మోదీ పాలనలో మైనార్టీలు, దళితులపై దాడులు పెరిగిపోతున్నాయి. మోదీ ఓ పెద్ద మాయలోడని( ప్రముఖ మేజీషియన్ పీసీ సర్కార్‌తో పోల్చారు) పేర్కొన్నారు. జూన్ 25ను బ్లాక్‌డేగా మోదీ అభివర్ణించారని, కానీ, గాంధీ హత్య, బాబ్రీ మసీద్ కూల్చీవేత, గుజరాత్ అల్లర్లు వీటన్నింటిని కూడా ప్రజలు మర్చిపోలేరని ఒవైసీ వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు అనుకూలంగా బీజేపీ పనిచేస్తోందని, మైనార్టీ, దళితుల మీద వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో ప్రధాని మోదీ దారుణంగా విఫలమయ్యారని ఒవైసీ ఆక్షేపించారు. Challenge anyone to fight All India Majlis-e-Ittehadul Muslimeen(AIMIM) from Hyderabad. I challenge PM Modi or Amit Shah to contest a seat from here. I also challenge Congress. Even if both these parties contest together,they still wont be able to defeat us: Asaduddin Owaisi pic.twitter.com/CJKTbUeJOX — ANI (@ANI) June 30, 2018 -
అవినీతిపై విచారణకు సిద్ధమా ?
చిలకలూరిపేట టౌన్: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకి దమ్ముంటే సీబీసీఐడీ విచారణకు సిద్ధంగా ఉండాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్ సవాలు విసిరారు. శనివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. సీసీఐ కుంభకోణం, యడవల్లి దళిత భూముల అన్యాక్రాంతం, ఇద్దరు విలేకరుల హత్య, ఆత్యహత్యా ఉదంతాలు, నీరు–చెట్టు పథకంలో భాగంగా దళిత భూముల ఆక్రమణ, చెరువుల మట్టి అమ్ముకోవటం, యడ్లపాడులో అక్రమ గ్రావెల్ తవ్వకం, అగ్రిగోల్డ్ భూముల కొనుగోళ్లు, మద్యం వ్యాపారులు, బాణాసంచ వ్యాపారుల నుంచి భారీ ఎత్తున బలవంతపు వసూళ్లు, సిటీ కేబుల్ ఆపరేటర్ల ఆస్తుల స్వాధీనం, సీఆర్ క్లబ్లో పేకాట వ్యవహారం, స్వర్ణాంధ్ర పౌండేషన్‌కు నిధుల మళ్లింపు వంటి వాటిపై సీబీసీఐడీ, లేదా సీబీఐ విచారణకు పుల్లారావు సిద్ధమా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం, అడ్డువచ్చిన వారిపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. పుల్లారావు సతీమణి రాజ్యాంగేతర శక్తిగా మారారన్నారు. అంగన్ వాడీ కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు, మైత్రి సంఘాలు, బంగారపు దుకాణాల నిర్వాహకుల నుంచి పెద్ద ఎత్తున అక్రమ వసుళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. -
కేసీఆర్‌కు ఇదే నా సవాల్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్‌పై పోటీ చేసి తాను 50 వేల మెజార్టీతో గెలిచి తీరతానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నాం ఆయన తెలంగాణ అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడారు. నల్గొండ నుంచి కేసీఆర్ పోటీ చేయాలని కోరుతున్నానని, రూ.500 కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఆయన గెలవలేరని, అక్కడ విజయం తనదేనని కోమటిరెడ్డి చెప్పారు. కేసీఆర్ నల్గొండ నుంచి పోటీ చేసినా లేదా తానే గజ్వేల్ లో పోటీ చేసినా గెలుపు మాత్రం తనదేనని ఆయన అంటున్నారు. ఒకవేళ 50 వేల మెజార్టీతో గనుక తాను గెలవకుంటే.. వెంటనే రాజకీయ సన్యాసం చేస్తానని కోమటిరెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై ప్రశంసలు గుప్పించిన ఎంఐఎం శాసనసభపక్ష నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వాన్ని అక్బరుద్దీన్ పొగిడిన అంశాన్ని తాము పెద్దగా పట్టించుకోమంటూనే, అక్బరుద్దీన్ నాలుకకు నరం లేదంటూ విమర్శించారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే అక్బరుద్దీన్ మమ్మల్ని పొగిడేవారని కోమటిరెడ్డి విమర్శించారు. -
వైకల్యాన్ని ఎదురించి.. కరాటేలో రాణించి..
–చేతులు లేకున్నా కరాటేలో పతకాలు –జాతీయ స్థాయిలో ప్రతిభ –వెక్కిరిస్తున్న పేదరికం –దాతల సాయం కోసం ఎదురుచూపు ఆరాటం ముందు ఆటంకం ఎంత.. సంకల్పం ముందు వైకల్యం ఎంత.. ధడచిత్తం ముందు దురదృష్టం ఎంత.. అన్నట్టుగా కృషి, పట్టుదల, దక్షతతో చేతులు లేకున్నా కరాటేలో రాణిస్తున్నాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు పాలకొల్లు లక్ష్మీనగర్‌కు చెందిన ఆత్మకూరి సురేష్. సెల్ రిపేరింగ్ దుకాణం నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ 20 ఏళ్లుగా కరాటేలోనూ సత్తాచాటుతున్నాడు. –పాలకొల్లు సెంట్రల్ విధి చిన్నచూపు చూసినా అతని ఆత్మసై ్థర్యం ముందు ఓడిపోయింది. పుట్టుకతో రెండు చేతులు లేకున్నా కరాటేలో కింగ్‌లా మారాడు పాలకొల్లు లక్ష్మీనగర్‌కు చెందిన ఆత్మకూరి సురేష్. అతని చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో కష్టాలు, కన్నీళ్లు తోడయ్యాయి. సురేష్ తల్లి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. అతని నలుగురు తమ్ముళ్లు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లారు. ఈ నేపథ్యంలో కుటుంబ ఆసరా లేకపోయినా స్థానికంగా సెల్ మరమ్మతులు దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సురేష్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అద్దె ఇంట్లో నివాసముంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఏదైనా ఓ కళలో రాణించాలని నిర్ణయించుకున్న సురేష్ 1995లో పట్టణానికి చెందిన జపాన్ షోటోకాన్ కరాటే డూ కనంజూకు ఆర్గనైజేషన్ శిక్షకుడు ధనాని సూర్యప్రకాష్ వద్ద కరాటే శిక్షణ మొదలుపెట్టాడు. సురేష్ పట్టుదల చూసిన శిక్షకుడు ప్రకాష్ ప్రత్యేక శ్రద్ధ కనబర్చి కరాటేలో మెళకువలు నేర్పించారు. అప్పటినుంచి సురేష్ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్నాడు. విశాఖ, విజయవాడ, ఏలూరు, రాజమండ్రిలో జరిగిన స్టేట్, నేషనల్ కరాటే పోటీల్లో కుమితే విభాగంలో (స్పారింVŠ ) బంగారు పతకాలు, కటా విభాగంలో రజత పతకాలు గెలుచుకున్నాడు. ఖాళీ సమయంలో విద్యార్థులకు కరాటే నేర్పుతున్నాడు. సుమారు 300 మంది విద్యార్థులు అతని వద్ద శిక్షణ పొందారు. దాతల సహకారం ఉంటే.. దాతల సహకారం ఉంటే కాయ్ ఆధ్వర్యంలో వచ్చే నవంబర్‌లో లక్నోలో జరిగే నేషనల్ చాంపియన్ పోటీల్లో పాల్గొంటానని సురేష్ అంటున్నాడు. సర్వశిక్షా అభియాన్ త్వరలో పాఠశాల విద్యార్థులకు కరాటే శిక్షణ ఇప్పించాలనే ఆలోచనలో ఉందని, సురేష్‌కు ఇన్‌స్ట్రక్టర్‌గా అవకాశం ఇప్పించాలని శిక్షకుడు ప్రకాష్ కోరుతున్నారు. సురేష్‌కు స్పారింగ్, కుమితే కిక్‌లలో మంచి ప్రావీణ్యత ఉందంటున్నారు. -
తప్పుచేసినట్లు చూపితే..ప్రాణం తీసుకుంటా: మంత్రి
ముంబై: తాను అవినీతికి పాల్పడినట్లు వస్తున్న ఆరోపణలను నిరూపిస్తే ప్రాణాలను వదులుతానని మహారాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి గిరీశ్ బాపత్ అన్నారు. మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్(ఎమ్ఎల్సీ) వేదికగా ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి ఆరోపణలను నిరూపిస్తే కేవలం రాజకీయ సన్యాసం ఒక్కటే కాదని.. అసలు ఈ భూమి మీద నుంచి తాను సెలవు తీసుకుంటానని అన్నారు. ఎమ్ఎల్సీ వేదికగా ప్రతిపక్ష లీడర్ ధనంజయ్ ముండే చేసిన ఆరోపణలకు ఆయన పై విధంగా స్పందించారు. ఎన్సీపీ ఇప్పటివరకు పలువురు మంత్రులపై అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజా ముండే, ఎడ్యుకేషన్ మినిష్టర్ వినోద్ టవ్దేలపై ఎన్సీపీ ఆరోపణలు చేసింది. పౌర సరఫరాల శాఖలో పప్పుధాన్యాల ధరలను ఎక్కువ చేసి ప్రజలకు విక్రయించారని ఇందులో దాదాపు రూ.2,500-2,800 కోట్ల మేర అవినీతి జరిగిందని ధనంజయ ఆరోపించారు. తాను చేసిన ఆరోపణలు తప్పని తేలితే అదే శాఖ మంత్రి కింద సర్వెంట్ గా పనిచేస్తానని సవాలు విసిరారు. 15 ఏళ్ల పాటు బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆధారాలు ఆరోపణలు ఎన్నో కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం మీద చేసిందని అన్నారు. ప్రస్తుతం అధికార బీజేపీ తప్పు చేసిందని తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు.