సవాల్‌ విసిరిన అసదుద్దీన్‌ ఒవైసీ | Owaisi Challenges Congress and BJP | Sakshi
Sakshi News home page

దమ్ముంటే నాపై పోటీ చేయండి: ఒవైసీ

Published Sat, Jun 30 2018 1:40 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Contest From Hyderabad If You Have Guts  Owaisi  Challenge - Sakshi

అసదుద్దీన్‌ ఒవైసీ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌ : బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సవాలు విసిరారు. దమ్ముంటే హైదరాబాద్‌లో పోటీ చేసి గెలవాలని ఆయన పేర్కొన్నారు. చాలా మంది తనపై పోటీ చేసి గెలవాలని చూస్తున్నారని, ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా సహా ఎవరికైనా దమ్ము, ధైర్యం ఉంటే తనపై పోటీ చేసి తనపై గెలవాలని ఛాలెంజ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి కూడా సవాలు విసురుతున్నట్లు పేర్కొన్నారు. అంతా ఏకమైనా తమ పార్టీని ఓడించలేరని ఒవైసీ పేర్కొన్నారు. తన అనుచరులతో శనివారం హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించిన ఒవైసీ మోదీపై విమర్శల వర్షం కురిపించారు.

‘మోదీ పాలనలో మైనార్టీలు, దళితులపై దాడులు పెరిగిపోతున్నాయి. మోదీ ఓ పెద్ద మాయలోడని( ప్రముఖ మేజీషియన్‌ పీసీ సర్కార్‌తో పోల్చారు) పేర్కొన్నారు. జూన్‌ 25ను బ్లాక్‌డేగా మోదీ అభివర్ణించారని, కానీ, గాంధీ హత్య, బాబ్రీ మసీద్‌ కూల్చీవేత, గుజరాత్‌ అల్లర్లు వీటన్నింటిని కూడా ప్రజలు మర్చిపోలేరని ఒవైసీ వ్యాఖ్యానించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలకు అనుకూలంగా బీజేపీ పనిచేస్తోందని, మైనార్టీ, దళితుల మీద వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో ప్రధాని మోదీ దారుణంగా విఫలమయ్యారని ఒవైసీ ఆక్షేపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement