Asaduddin Owaisi
-
ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది పార్టీ వదిలిపోతే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయే అంటూ రాజాసింగ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. పవిత్ర రంజాన్ మాసంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విషం కక్కుతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. భయపడేవాళ్లు పాకిస్తాన్ పారిపోయారు.. తాము కొట్లాడే వాళ్లం కాబట్టి ఇక్కడే ఉన్నాం అంటున్నాడు ఓవైసీ.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఫస్ట్ పారిపోయేది అసదుద్దీనే అని అన్నారు.అసదుద్దీన్ దేశం విడిచి పారిపోవడం ఖాయమని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. మతకల్లోలు జరగొద్దని నిన్న ఒక్కరోజు ఇంట్లో నమాజః్ చేసుకోమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్తే తప్పు పట్టారన్నారు. అసదుద్దీన్ కు ట్రీట్ మెంట్ ఇప్పించాలని సీఎం రేవంత్ కు విజ్క్షప్తి చేస్తున్నానని చమత్కరించారు రాజాసింగ్. -
మరో సిరాజ్ కోసం.. పాతబస్తీలో ఎమ్మెస్కే వేట (ఫోటోలు)
-
‘మరో సిరాజ్’ వేటలో...
సాక్షి, హైదరాబాద్: పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ గత కొంత కాలంగా భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. పలు చిరస్మరణీయ విజయాల్లో భాగంగా ఉన్న అతను టి20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో కూడా సభ్యుడు. ఎంతో మంది యువ ఆటగాళ్లతో పోలిస్తే అతని ప్రస్థానం ఎంతో ప్రత్యేకం. పేదరిక నేపథ్యం, ఆటోడ్రైవర్‌గా పని చేసే తండ్రి, కనీస ఖర్చులకు కూడా ఇబ్బంది పడే స్థితి నుంచి అతను అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగాడు.ఒకదశలో షూస్ కూడా కొనుక్కోలేకపోయిన అతను డబ్బుల కోసం టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడేవాడు. ఆ తర్వాత కేవలం తన కఠోర శ్రమ, పట్టుదలతో పైకి ఎదిగాడు. ఇప్పుడు అలాంటి సిరాజ్‌లను వెతికి సానబెట్టేందుకు భారత మాజీ క్రికెటర్, మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రత్యేకంగా నగరంలోని పాతబస్తీలో ఉన్న పేద పేస్ బౌలర్ల కోసం ఒక ప్రతిభాన్వేషణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘హూ ఈజ్ అవర్ నెక్స్ట్ సిరాజ్’ పేరుతో ఈ కార్యక్రమం ఎమ్మెస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎంఎస్కేఎస్ఐసీఏ) ఆధ్వర్యంలో జరిగింది. దీనికి స్వయంగా సిరాజ్ హాజరై తన అనుభవాలను పంచుకున్నాడు. కెరీర్లో ఎదిగే క్రమంలో తనకు ఎదురైన కష్టాలను గుర్తు చేసుకున్న అతను... ప్రతిభావంతులైన కుర్రాళ్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని భవిష్యత్తులో గొప్ప బౌలర్లుగా ఎదగాలని ఆకాంక్షించాడు. అత్తాపూర్‌లోని విజయానంద్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ ప్రతిభాన్వేషణ కార్యక్రమాన్ని హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రారంభించారు. ఇలాంటి ప్రయత్నాలు క్రికెట్‌ను కెరీర్‌గా తీసుకోవాలనుకునే యువ ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపుతాయని, ప్రతిభ గలవారిని తీర్చిదిద్దుతున్న ఎమ్మెస్కే ప్రసాద్‌ను ప్రత్యేకంగా అభినందించారు. తన బాల్య స్నేహితుడు మునీర్ అహ్మద్, కోచ్ రహ్మతుల్లా బేగ్ గౌరవార్ధమే ప్రత్యేకంగా పాతబస్తీ క్రికెటర్ల కోసం ‘హూ ఈజ్ అవర్ నెక్స్ట్ సిరాజ్’ కార్యక్రమాన్ని లాభాపేక్ష లేకుండా నిర్వహించేందుకు సిద్ధమైనట్లు ఎమ్మెస్కే చెప్పారు. సుమారు 400 మంది యువ పేస్ బౌలర్లు ఈ ట్రయల్స్‌కు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మాజీ క్రికెటర్లు షహాబుద్దీన్, ఫసీర్ రహమాన్, సత్యప్రసాద్, మనోజ్‌సాయి, ప్రకాశ్‌బాబు, అమానుల్లా ఖాన్‌లతో పాటు టీఎన్జీఏ ప్రధాన కార్యదర్శి ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్ రెడ్డిపై అసదుద్దీన్ ఒవైసీ ప్రశంసలు
-
సుప్రీమ్ కోర్టులో అసదుద్దీన్ ఒవైసీ పిటిషన్
-
ప్రార్థనా స్థలాల చట్టంపై సుప్రీంకోర్టులో ఒవైసీ పిటిషన్
సాక్షి, ఢిల్లీ: దేశంలో ప్రార్థనా స్థలాల అంశంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దేశవ్యాప్తంగా ప్రార్థనా స్థలాల చట్టం 1991 అమలు చేయాలని కోర్టును ఒవైసీ కోరారు. దీంతో, ఇదే అంశంపై దాఖలైన ఇతర పిటిషన్లతో ఒవైసీ పిటిషన్ జత చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అన్ని పిటిషన్లపై వచ్చే నెల 17న విచారణ చేపట్టనున్నట్టు కోర్టు తెలిపింది.ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దేశవ్యాప్తంగా ప్రార్థనా స్థలాల చట్టం 1991 అమలు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నేడు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా ఇదే అంశంపై దాఖలైన ఇతర పిటిషన్లతో ఒవైసీ పిటిషన్ జత చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనంతర, అన్ని పిటిషన్లపై ఫిబ్రవరి 17న విచారణ జరుపుతామని సంజీవ్ ఖన్నా ధర్మాసనం వెల్లడించింది. -
మా దగ్గర ‘బీఆర్ఎస్’ జాతకాలు.. అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: అహంకారం వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందంటూ ఆ పార్టీపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 మంది అభ్యర్థులను మార్చి ఉంటే గెలిచేవారు. మా మద్దతుతోనే గ్రేటర్ ఎన్నికల్లో గెలిచారు. బీఆర్ఎస్ పార్టీ జాతకాలు మా దగ్గర ఉన్నాయి. మేం చెప్పడం మొదలుపెడితే తట్టుకోలేరంటూ ఆయన వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయి: కేటీఆర్ -
టీటీడీ బోర్డుపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
-
కాంగ్రెస్‌పై అసదుద్దీన్ ఓవైసీ ఫైర్.. అంత మాట అనేశారేంటి?
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం చతికిలపడింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలక్రిందులు చేస్తూ కాషాయపార్టీ అధికారాన్ని నిలబెట్టుకుంది. బీజేపీ 48 చోట్ల, కాంగ్రెస్ 37 చోట్ల విజయం సాధించాయి. అటూ జమ్మూకశ్మీర్ ఎన్నికల్లోనూ బీజేపీ బాగానే పుంజుకుంది. అధికారంలోకి రాకలేకపోయినప్పటికీ సీట్లను గణనీయంగా పెంచుకుంది. సొంతంగానే 29 స్థానాల్లో జెండా ఎగురవేసింది. కాగా, హరియాణా ఫలితాలను అంగీకరించబోమని కాంగ్రెస్ చేసిన ప్రకటనపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యారు. ఈవీఎంలపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. జమ్మూకశ్మీర్‌లో ఈవీఎంలతోనే గెలిచారని గుర్తు చేశారు. హరియాణాలో బీజేపీ మళ్లీ గెలవడానికి కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలే కారణమని ఆరోపించారు.బుధవారం ఆయన ఏఎన్ఐతో మాట్లాడుతూ.. "ఈవీఎంలను నిందించడం పరిపాటిగా మారింది. ఈవీఎంలతోనే మీరు ఒకచోట గెలిచారు. మరోచోట ఓటమి ఎదురయ్యేసరికి వాటిని నిందిస్తున్నారు. నా అంచనా ప్రకారం హరియాణాలో బీజేపీ ఓడిపోవాల్సింది. ఆ పార్టీకి వ్యతిరేకంగా చాలా అంశాలున్నాయి. పదేళ్లపాటు హరియాణాలో అధికారంలో ఉన్న బీజేపీపై వ్యతిరేకతను సద్వినియోగం చేసుకోవడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. కాంగ్రెస్ అంతర్గత విభేదాలతో బీజేపీ లాభపడింది. ఎన్నికల పోరులో బీజేపీకి కొంచెం ఓపెనింగ్ ఇస్తే చాలు.. దాన్ని సద్వినియోగం చేసుకుంటుంద"ని అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. చదవండి: ఏపీలాగే హరియాణా ఫలితాలు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలుహరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడించే సువర్ణావకాశాన్ని కాంగ్రెస్ జారవిడుచుకుందని దుయ్యబట్టారు. "ద్వేష రాజకీయాలతోనే బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పుకునే వారు. ఈ విషయం తప్పని 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత నేను చెప్పాను. హరియాణాలో బీజేపీ విజయానికి కారకులు ఎవరు? బీజేపీని ఓడించే అవకాశం ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. కానీ సువర్ణ అవకాశాన్ని ఆ పార్టీ జారవిడుచుకుంద"ని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం: కాంగ్రెస్షహరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోయింది. హరియాణా ఫలితాలను అంగీకరించబోమని, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. బీజేపీ ఒత్తిడితో ఫలితాలను తారుమారు చేశారని ఆరోపించింది. అంచనాలకు విరుద్ధంగా హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కాగా, కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. -
హైడ్రా కూల్చివేతలపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
జీహెచ్ఎంసీ ఆఫీసు కూల్చేస్తారా?: ఎంపీ అసద్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ‘హైడ్రా’ కూల్చివేతల అంశం హాట్ టాపిక్‌గా మారింది. డిజిటల్ కార్డుల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల హైదరాబాద్ కట్టడాల కూల్చివేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.కూల్చివేతలపై అసదుద్దీన్ ఓవైసీ మరోసారి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్టీఎల్లో కట్టారు.. కూల్చేస్తారా? అని ప్రశించారు. నెక్లెస్ రోడ్డు కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది తొలగిస్తారా? జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం,సెక్రటేరియట్లు, ప్రముఖుల ఘాట్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి వాటిని కూల్చేస్తారా? అంటూ అసదుద్దీన్ ప్రశ్నించారు. దీంతో, అసద్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. -
యతి నర్సింహానంద్ పై సీపీకి ఎంపీ అసదుద్దీన్ ఫిర్యాదు
-
పదేళ్లు అధికారంలో ఉంటాం: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలు వరుసగా రెండుసార్లు అవకాశం కల్పిస్తూ వస్తున్నారని, తాము కూడా పదేళ్ల పాటు అధికారంలో ఉండి మంచి పాలనతో పేదల అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని ఒక హోటల్లో ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మౌలానా ఖలీద్ సైఫుల్లా రహా్మనీ రచించిన ‘ప్రాఫెట్ ఫర్ ద వరల్డ్ (ప్రపంచానికి ప్రవక్త)’పుస్తకాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు. కొందరు రాజకీయ లబ్ధి కోసం నిరంతరం విషం చిమ్ముతుంటారని.. ప్రజల పక్షాన మాట్లాడేవారి కంటే విషం చిమ్మేవారు ఎక్కువైపోయారని వ్యాఖ్యానించారు. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండి దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మజ్లిస్ కలసి రావడం ఆనందంగా ఉంది ప్రభుత్వాన్ని నడిపించడంలో కొన్ని తప్పిదాలు జరగవచ్చని, వాటిని ఎత్తి చూపేందుకు బలమైన ప్రతిపక్షం అవసరమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం కావాలని, తర్వాత అభివృద్ధి, సంక్షేమంలో అంతా కలిసి రావాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ రాజకీయంగా విభేదించినా.. తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కలసి రావడం అనందంగా ఉందని చెప్పారు. మూసీ నది అభివృద్ధి, సుందరీకరణ పనుల్లో కొందరు పేదలు నివాసాలు కోల్పోయే అవకాశం ఉందని, వారికి ప్రభుత్వపరంగా డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని రేవంత్ ప్రకటించారు. అన్ని మతాలు చెప్పింది ఒక్కటేనని, అందరం కలసిమెలసి శాంతియుతంగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవాలని రేవంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టెమ్రిస్ వైస్‌చైర్మన్ ఫహీమ్ ఖురేïÙ, ఇస్లామిక్ స్కాలర్స్ పాల్గొన్నారు. -
హైడ్రాకు సవాల్.. జీహెచ్ఎంసీ ఆఫీసు కూల్చేస్తారా?: ఎంపీ అసద్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ‘హైడ్రా’ కూల్చివేతల అంశం హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్ కట్టడాల కూల్చివేతలపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుస్సేన్ సాగర్ వద్ద నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను ఏం చేయబోతున్నారని ఆయన నిలదీశారు.కాగా, హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలపై తాజాగా అసదుద్దీన్ స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన భవనాలను కూల్చి వేస్తున్న అధికారులు ఆ పరిధిలో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను కూడా కూల్చివేస్తారా?. హుస్సేన్ సాగర్ వద్ద నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాల సంగతి ఏంటి?. అక్కడ నిర్మించిన ఆఫీసులను ఏం చేయబోతున్నారు. నెక్లెస్ రోడ్డును కూడా తొలగిస్తారా?. నెక్లెస్ రోడ్డు ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది కదా?. మరి దాన్ని కూడా తవ్వేస్తారా?. గ్రేటర్ మున్సిపల్ హైదరాబాద్ కార్యాలయం కూడా నీటి కుంటలో నిర్మించినదే. మరి జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని కూడా కూల్చేస్తారా? అంటూ అసదుద్దీన్ ప్రశ్నించారు. దీంతో, అసద్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.మరోవైపు.. అక్రమ కట్టడాల కూల్చివేతపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఎలాంటి ఒత్తిడి వచ్చినా చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చేవేయాలనే నిర్ణయించాం. అలాగే, ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములైన వారి కట్టడాలను కూడా కూల్చివేస్తాం. చెన్నై, ఉత్తరాఖండ్, వయనాడ్‌లో ఏం జరిగిందో అందరూ చూశారు. చెరువుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత భవిష్యత్ తరాల కోసం చేపట్టాం. ఎలాంటి ఒత్తిడి వచ్చినా చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చేవేయాలనే నిర్ణయించాం. అందుకే హైడ్రాను ఏర్పాటు చేశాం. అక్రమ నిర్మాణాలు వదిలేస్తే నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్టే. అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు అందరూ సహకరించాలి. ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతాం. చెరువుల్లో అక్రమ నిర్మాణాలను వదిలేది లేదు. రాజకీయం కోసమో.. నాయకులపై కక్ష కోసం కూల్చివేతలు చేయడం లేదు. చెరువుల ఆక్రమణదారుల్లో ప్రభుత్వాలను ప్రభావితం చేసేవారు కూడా ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములైన వారు కూడా ఉండవచ్చు. హైడ్రా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుందన్నారు. -
వక్ఫ్ బిల్లుపై పార్లమెంటరీ సంఘం
సాక్షి, న్యూఢిల్లీ: వక్ఫ్(సవరణ) బిల్లు–2024ను క్షుణ్నంగా పరిశీలించి, మార్పుచేర్పులపై సిఫార్సులు చేయడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటుకు పార్లమెంటు శుక్రవారం ఆమోదం తెలిపింది. లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది కలిపి 31 మందిని కమిటీ సభ్యులుగా నియమించారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి వి.విజయసాయిరెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్ట), డి.కె.అరుణ (బీజేపీ), అసదుద్దీన్ ఒవైసీ (మజ్లిస్), లావు శ్రీకృష్ణదేవరాయలు (టీడీపీ) ఉన్నారు. కమిటీ తన నివేదికను పార్లమెంట్ తదుపరి సమావేశాల తొలి వారంలో సమరి్పంచనుంది. పార్లమెంట్ నిరవధిక వాయిదా పార్లమెంట్ ఉభయ సభలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. సమావేశాలు 12వ తేదీ దాకా జరగాల్సి ఉండగా ముందే వాయిదా వేశారు. -
స్నేహం అజరామరం.. చరిత్రాత్మకం
యే దోస్తీ హమ్ నహీ తోడేంగే తోడేంగే దమ్ మగర్ తేరా సాత్ నా చోడేంగే.. అంటూ నాటి షోలే సినిమాలో ఆనంద్ బక్షి..రచించిన ఈ పాట మొదలుకొని.. ఆ మధ్య కాలంలో వచి్చన.. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం నిదరలో ఇద్దరమూ ఒకేలా కలగంటం నిజంలో ప్రతి క్షణం కళలకే కల అవుతాం.. అంటూ భువన చంద్ర రచించిన ఈ పాట వరకూ స్నేహం గొప్పతనాన్ని తెలిపేవే.. ఇలాంటి అనేక పాటలు స్నేహంలోని మాధుర్యాన్ని తెలియజేస్తాయి.. నిజమే మరి నాటి నుంచి నేటి తరం వరకూ లవర్స్ లేని వాళ్లు ఉంటారేమో గానీ.. స్నేహితులు లేని వాళ్లు దాదాపు ఉండరనే చెప్పొచ్చు.. ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత మంది ప్రాణ స్నేహితులు ఉంటారు. వీరికి కులం, మతం, ప్రాంతం, భాష, ఆస్తి, అంతస్తు, పేద ధనిక వంటి బేధాలు అడ్డురావు.. మనం ఫోన్ చెయ్యగానే..‘అరేయ్ చెప్పరా మామా’ అనేంత క్లోజ్ నెస్ వారి మధ్య ఉంటుంది. స్నేహాన్ని పంచుకుంటూ, పెంచుకుంటూ.. కష్టాలు, కన్నీళ్లు, ఆనందాలు, సరదాలూ అన్నీ వారితో పంచుకునే వాళ్లే నిజమైన ఫ్రెండ్స్. నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా.. అలాంటి కొందరు దోస్తులకు సంబంధించిన కొన్ని ప్రేరణాత్మక విషయాలు..విడదీయరాని స్నేహ బంధం..గోల్కొండ: రాజకీయాల్లో ఒకేసారి ప్రవేశించి అంచలంచలుగా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగామని కార్వాన్, బహదూర్‌పురా ఎమ్మెల్యేలు కౌసర్ మోహియుద్దీన్, మహ్మద్ ముబీన్ అంటున్నారు. రోజు రోజుకు తమ స్నేహ బంధం బలపడుతుందని ‘ఫ్రెండ్షిప్ డే’ సందర్భంగా ‘సాక్షి’తో తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. 40 ఏళ్ల క్రితం మజ్లీస్ కార్యకర్తలుగా కార్వాన్ నుంచి కౌసర్ మోహియుద్దీన్ తన రాజకీయ జీవితం ప్రారంభించారు. అదే సమయంలో పాత నగరం ఆగాపూరా నుంచి మహ్మద్ ముబీన్ రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ సమయంలో ఇద్దరూ చురుకైన యువ కార్యకర్తలుగా పార్టీ అధిష్టానం మెప్పుపొందారు. దివంగత మజ్లీస్ అధినేత సలావుద్దీన్ ఓవైసీతో పాటు ప్రస్తుత అధినేత అసదుద్దీన్ ఓవైసీకి నమ్మిన బంటులుగా మారారు. అయితే ముందుగా ఎమ్మెల్యే పదవి వరించింది మాత్రం కౌసర్ మోహియుద్దీన్‌కు. వరుసగా మూడోసారి కౌసర్ ఎమ్మెల్యేగా విజయం సాధించగా ముబీన్ మొదటిసారి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే మెహియుద్దీన్ సతీమణి గోల్కొండ వెస్ట్, నానల్‌నగర్ నుంచి కార్పొరేటర్‌గా విజయం సాధించగా ముబీన్ మాత్రం ఆగాపూరా నుంచి రెండుసార్లు, శాస్త్రీపురం నుంచి ఒకసారి కార్పొరేటర్‌గా గెలిచారు. ప్రస్తుత అసెంబ్లీలో గెలిచిన ఇద్దరూ ఒకే రోజు ఒకే సారి ఒకే సమయంలో ఆప్తమిత్రులుగా అసెంబ్లీలో అడుగు పెట్టడం విశేషం. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ తాము ప్రాధాన్యం ఇస్తామంటారు. 40 ఏళ్ల తమ స్నేహ బంధంలో ఏనాడూ పొరపచ్చాలు రాలేదని వారు స్పష్టం చేశారు. -
నినాదాల వివాదం.. ఒవైసీపై రాష్ట్రపతికి ఫిర్యాదు
న్యూఢిల్లీ: లోక్‌సభలో ఎంపీగా ప్రమాణం చేసిన తర్వాత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వివాదాస్పద నినాదాలపై ఇద్దరు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 103 కింద ఒవైసీపై అనర్హత వేటు వేయాలని రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్లు న్యాయవాది వినీత్ జిందాల్ ఎక్స్(ట్విటర్)లో తెలిపారు.పార్లమెంటులో ఇతర దేశానికి జై కొట్టినందుకు ఆయను డిస్క్వాలిఫై చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. మంగళవారం(జూన్25) లోక్‌సభలో ఎంపీగా ప్రమాణం ముగిసిన తర్వాత జై తెలంగాణ, జై భీం, జై పాలస్తీనా అని నినాదాలు చేసి ఒవైసీ వివాదానికి తెరలేపిన విషయం తెలిసిందే.ఒవైసీ చేసిన నినాదాలను లోక్‌సభ రికార్డుల నుంచి ప్రొటెం స్పీకర్ ఇప్పటికే తొలగించారు. అయితే పాలస్తీనాలో ప్రజలు అణచివేతకు గురవుతున్నందునే తాను ఆ నినాదం చేశానని ఒవైసీ మీడియాకు తెలిపారు. -
అసదుద్దీన్ ప్రమాణస్వీకారం పై లోక్ సభ లో దుమారం
-
అసదుద్దీన్ నినాదాలతో లోక్‌సభలో దుమారం
సాక్షి,న్యూఢిల్లీ: లోక్‌సభలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ప్రమాణం దుమారం రేపింది. మంగళవారం(జూన్25) తెలంగాణ ఎంపీల ప్రమాణాల్లో భాగంగా అసదుద్దీన్ కూడా ప్రమాణం చేశారు.ఈ ప్రమాణం ముగిసిన తర్వాత అసదుద్దీన్ చేసిన నినాదాలు వివాదాస్పదమయ్యాయి. జై తెంగాణ, జై భీమ్, జై పాలస్తీనా అని అసదుద్దీన్ నినదించారు. దీనిపై అధికారపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన ప్రొటెం స్పీకర్ మెహతాబ్ అసదుద్దీన్ నినాదాలను రికార్డుల నుంచి తొలగిస్తామని ప్రకటించారు. స్పీకర్ ప్రకటన అనంతరం వివాదం సద్దుమణిగింది. BREAKING : Huge uproar in the Parliament after Hyderabad MP Asaduddin Owaisi says “ Jai Palestine” at the end of his oath. Your thoughts on this. pic.twitter.com/FQMEIeaFHX— Roshan Rai (@RoshanKrRaii) June 25, 2024 -
బీఆర్ఎస్ది తప్పుడు వ్యూహం: ఒవైసీ
హైదరాబాద్, సాక్షి: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ దారుణ ఓటమిపై తెలంగాణవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. బీజేపీతో లోపాయికారి ఒప్పందంలో భాగంగానే బీఆర్ఎస్ నేతలు ఆత్మబలిదానం చేసుకున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. మరోవైపు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సైతం బీఆర్ఎస్ జీరో ఫలితంపై స్పందించారు. బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే బీజేపీకి మద్దతు ఇచ్చారు. బీఆర్ఎస్ 8 చోట్ల డిపాజిట్ కోల్పోవడానికి క్రాస్ ఓటింగే కారణమైంది. బీఆర్ఎస్ ఇలా ఎందుకు చేసిందో నాకైతే తెలియదు. రాజకీయ వ్యూహంలో భాగం అనుకున్నా.. అది తప్పుడు వ్యూహం అని ఒవైసీ అభిప్రాయపడ్డారు. -
మాధవీలత ఓడిపోలేదు.. చిత్తుగా ఓడించిందెవరు?
లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణపై ఢిల్లీ పెద్దలు పెట్టిన ఫోకస్ మొత్తానికి ఫలించింది. 17 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ ఎనిమిది సీట్లలో గెలుపొంది తన విజయం శాతాన్ని మెరుగుపర్చుకుంది. అయితే గెలుపు సంగతి పక్కనపెడితే హాట్ టాపిక్‌గా మారిన హైదరాబాద్ ఎంపీ సీటులో మాత్రం ఘోర ఓటమిని చవిచూసింది.ఎంఐఎం కంచుకోట అయిన హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకునేందుకు బీజేపీ పెద్ద ప్లానే చేసింది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కొంపెళ్ల మాధవీలతను ఎంచుకుంది. తద్వారా ఎంఐఎం అడ్డాలో నారీశక్తిని అస్త్రంగా ప్రయోగించినట్లు సంకేతాలు పంపింది. కానీ, ఆ వ్యూహం కాషాయ పార్టీకి ప్రతికూలంగా మారరి బెడిసి కొట్టింది. విరించి హాస్పిటల్స్ ఛైర్ పర్సన్‌గా ఉన్న మాధవీలత.. హిందుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. హిందుత్వం, భారతీయ సంస్కృతిపై అనర్గళంగా మాట్లాడగలిగే మాధవీలత.. రెండేళ్లుగా పాతబస్తీ వేదికగా గోశాలతో పాటు భారీ యజ్ఞశాల ఏర్పాటు చేసి హిందూ వైదిక కార్యక్రమాలు సైతం నిర్వహించారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని.. పాతబస్తీలో కాషాయ జెండా ఎగరేయాలన్న లక్ష్యంతో మాధవీలతను బీజేపీ అధిష్ఠానం బరిలోకి దింపింది.ఇక అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచే మాధవీలత మీడియాకు ఎక్కడం ప్రారంభించారు. పతంగి పార్టీని లక్ష్యంగా చేసుకుని ఆమె చిత్రవిచిత్రమైన చేష్టలకు దిగారు. ఆ విన్యాసాలతో సోషల్ మీడియాకు ఎక్కిన ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ కూడా నడిచింది. ఇదంతా ఓటర్లకు చిరాకు తెప్పించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే హిందుత్వ ఎజెండాతో సాగిన ఆమె ప్రచారంలో నగరంలోని ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను భాగం చేయకపోవడమూ పెద్ద మైనస్‌గా మారింది. మరోవైపు పోలింగ్ టైంలో హిజాబ్‌లు తొలగించి మరీ ఓటర్లను పరిశీలించడం జాతీయ మీడియాకు ఎక్కి.. వివాదాస్పదంగా మారింది కూడా.కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు.. మొత్తంగా ఎన్నికల వేళ ఆమె చేసిన హడావుడి ఏమాత్రం సహకరించకపోగా, బీజేపీ అభ్యర్థి హోదాతో నవ్వుల పాలు అయ్యిందనేది విశ్లేషకుల మాట.హైదరాబాద్ ఎంపీగా ఎంఐఎం అధినేత, అసదుద్దీన్ ఒవైసీ 3.35 లక్షల భారీ మెజారిటీతో మాధవీలతపై ఘనవిజయం సాధించారు. -
హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఘన విజయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎంఐఎం మరోసారి ఘన విజయం సాధించింది. 3.38 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో మాధవీ లతపై గెలుపొందారు. దీంతో ఆయన ఈ స్థానంలో 5వసారి విజయం సాధించారు. ఇక్కడ బీజేపీ నుంచి పోటీచేసిన కొంపెల్లి మాధవీలత, బీఆర్ఎస్ పార్టీ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ మహ్మద్ వలీవుల్లా సమీర్ ఓటమిపాలు అయ్యారు. -
Elections 2024: పాతబస్తీలో ఉద్రిక్తత
హైదరాబాద్, సాక్షి: పోలింగ్ ముగిసే సమయంలో పాత బస్తీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎంపీ అభ్యర్థులు అసదుద్దీన్ ఒవైసీ, మాధవీలతలు పోలింగ్ కేంద్రాల పరిశీలనకు ఒకే రూట్లో రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అదే సమయంలో మాధవీలతను పాతబస్తీ వాసులు కొందరు అడ్డుకున్నారు. మాధవీలతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులపై మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆ యువకుల్ని అక్కడి నుంచి పంపించేశారు. -
ఓటు హక్కు వినియోగించుకున్న అసదుద్దీన్ ఒవైసీ
-
15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అమరావతి అభ్యర్థి (సిట్టింగ్ ఎంపీ) నవనీత్ కౌర్.. గతంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడిన మాటలు ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలకు, ఎంఐఎం అధినేత, హైదరాబాద్ లోక్‌సభ మజ్లిస్ అభ్యర్ధి అసదుద్దీన్ ఒవైసీ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. పాతబస్తీలో బీజేపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన నవనీత్ కౌర్.. దాదాపు పన్నెండేళ్ల కిందట అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ‘పోలీసులు 15 నిమిషాలు పక్కకు తప్పుకుంటే లెక్కలు సరిచేస్తామని చిన్నోడు అన్నాడని, కానీ వాళ్లకు 15 నిమిషాలేమో..మాకు 15 సెకన్లు చాలు..’అంటూ వ్యాఖ్యానించారు. కాగా గురువారం పాతబస్తీలో ఎన్నికల ప్రచారం చేస్తున్న అసద్ వద్ద.. నవనీత్ కౌర్ వాఖ్యలను మీడియా ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ఆయన తీవ్రంగా స్పందించారు. దమ్ముంటే చేసి చూపించండి ‘నరేంద్ర మోదీజీ 15 సెకన్లు కాదు.. గంట.. 15 గంటలు సమయం ఇవ్వండి.. అధికారం మీ చేతిలో ఉంది...ముస్లింలను ఏం చేస్తారో చేయండి.. మీలో మానవత్వం మిగిలి ఉందా? లేదా? అని మేము కూడా చూడాలని అనుకుంటున్నాం..అంతా మీదే.. అధికారం మీదే అయినప్పుడు ఎవరు ఆపుతున్నారు? మేం భయపడేది లేదు.. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం... దుమ్ముంటే చేసి చూపించాలి..’అంటూ అసదుద్దీన్ సవాల్ చేశారు. హైదరాబాద్ ప్రజలు పశువులు కాదు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు హైదరాబాద్‌ను ఎంఐఎంకు లీజుకు ఇచ్చాయంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై కూడా అసదుద్దీన్ స్పందించారు. హైదరాబాద్ ప్రజలు పశువులు కాదని, వారు పౌరులని, రాజకీయ పార్టీల ఆస్తులు కాదని వ్యాఖ్యానించారు. నలభై ఏళ్లుగా హైదరాబాద్ హిందుత్వ దుష్ట భావజాలాన్ని ఓడిస్తూ ఎంఐఎంకు అప్పగిస్తోందన్నారు. హిందుత్వం మళ్లీ ఓడిపోతుందని చెప్పారు. ముస్లింలను ద్వేషించడమే ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానమని, అందుకే మరోమారు బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. -
పాతబస్తీలో పతంగేనా?
హైదరాబాద్ లోక్‌సభ సెగ్మెంట్లో ప్రధాన రాజకీయపక్షాల మేనిఫెస్టోలు, ప్రలోభాలు, అభ్యర్థిత్వం, ప్రచార అంశాలేవీ పనిచేయవు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండే పార్టీలు, ప్రధాన ప్రతిపక్ష పార్టీల బలాలు, బలగాల కంటే బలమైన ముస్లిం, హిందుత్వ ఎజెండాలు ఇక్కడి రాజకీయాలను శాసించి ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయి. ఈ సెగ్మెంట్లో మెజారిటీ ఓటర్లు ముస్లిం సామాజికవర్గానికి చెందినవారే. దీంతో నాలుగున్నర దశాబ్దాలుగా మజ్లిస్ పార్టీ తిరుగులేని విజయాలను సాధిస్తూ వస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉండే పార్టీలు కూడా మొక్కుబడిగా స్నేహపూర్వక పోటీకి పరిమితమవుతాయి. బీజేపీ హిందుత్వ ఎజెండాతో మూడు దశాబ్దాలుగా పాతబస్తీపై పాగావేసేందుకు శక్తియుక్తులు ఒడ్డుతున్నా, రెండోస్థానంతో సరిపెట్టుకోవాల్సివస్తోంది. ఎప్పటి మాదిరిగా ఈసారి కూడా ముస్లిం–హిందుత్వ వాదం మధ్య పోరు నెలకొన్నా.. సామాజిక మాధ్యమాలు ప్రతి చిన్నఅంశాన్ని భూతద్దంలో చూపిస్తుండటంతో హైదరాబాద్ లోక్‌సభపై అందరి దృష్టి పడింది. అయితే ఈసారి బీజేపీ అభ్యర్థి దూకుడు సైతం పాలపొంగే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్హిందూ ఓటర్లను ఆకర్షిస్తూ..దేశంలోనే ముస్లిం సామాజికవర్గ పక్షాన గళంవిప్పే ఆల్ ఇండియా–మజ్లిస్–ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఐదోసారి ఎన్నికల బరిలో దిగారు. ఇప్పటి వరకు వార్ వన్‌సైడ్‌గా సాగగా, ఈసారి మాత్రం గట్టిపోటీ నెలకొంది. ప్రచారంలో ఎలాంటి హంగూఆర్భాటాలు లేకుండా ‘మా పనితీరు.. మా గుర్తింపు’ అంటూ ఉదయం పాదయాత్రతో డోర్ టూ డోర్ ప్రచారం, సాయంత్రం సభల ద్వారా ఓటర్లను ఆకర్షించే అసదుద్దీన్ ఒవైసీ ఈసారి సామాజిక మాధ్యమాలతోపాటు బ్యానర్లు, కటౌట్లు, వాల్‌పోస్టర్లతో ప్రచారం నిర్వహిస్తున్నారు. హిందూ సామాజిక వర్గ ఓటర్లను ఆకర్షించేందుకు తొలిసారిగా నల్లగొండ గద్దర్ గళంతో ‘భగ..భగ మండే నిప్పుల దండై....ఏఐఎంఐఎం పార్టీ జెండా గుండెకు అండై’’వీడియా, ఆడియోలను విడుదల చేశారు.పూజారుల మద్దతు సైతం కూడగట్టుకుంటున్నారు. కమలం దూకుడును కళ్లెం వేసేందుకు ఏకంగా ప్రచార సభల్లో ‘ముస్లింలను టార్గెట్ చేస్తున్న బీజేపీకి ఓటు హక్కుతో జవాబు చెప్పాలని’ప్ర«దానాంశంగా ప్రస్తావిస్తూ పోలింగ్ శాతం పెంపునకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎంబీటీ ఈసారి ముస్లిం సామాజికవర్గ ఓట్లు చీలి బీజేపీకి లబ్ధి చేకూరకుండా ఉండేందుకు ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్ మజ్లిస్ పార్టీకి కంచుకోట. టీడీపీ ఆవిర్భావంతోనే మజ్లిస్ శకం ప్రారంభమైంది. హైదరాబాద్ ఎంపీ సెగ్మెంట్లో తొలిసారిగా 1984లో మజ్లిస్ బోణీ కొట్టింది. అప్పటి నుంచి సుల్తాన్సలావుద్దీన్ ఒవైసీ వరుసగా ఆరుసార్లు ఎంపీగా ఎన్నికవ్వగా, ఆయన తదనంతరం అసదుద్దీ¯Œ ఒవైసీ ఎన్నికల బరిలోకి దిగి వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్నారు. అనుకూల అంశాలు » అత్యధికంగా ముస్లిం సామాజికవర్గ ఓటర్లు » అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం » బలమైన ముస్లిం సామాజిక ఎజెండా » హిందూ సామాజిక వర్గంలో సైతం గట్టి పట్టు » నాలుగు దశాబ్దాలుగా గట్టి పట్టు, బలమైన కేడర్ » లోక్‌సభ పరిధిలోని ఏడింటిలో ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రాతినిధ్యం » ముస్లిం సామాజికవర్గ ఓట్లు చీలకుండా ఎంబీటీ పోటీ నుంచి వైదొలగడం ప్రతికూల అంశాలు» బీజేపీ అభ్యర్థి మాధవీలతప్రచారంలో దూకుడు » పాతబస్తీ వెనుకబాటుతనం » తక్కువగా నమోదయ్యే పోలింగ్ శాతం మాధవీలత దూకుడు హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిత్వం ఖరారుతో రాజకీయ ఆరంగ్రేటం చేసిన కొంపల్లి మాధవీలత బలమైన హిందుత్వ ఎజెండాతో ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. హిందూ భావజాలం పుణికిపుచ్చుకొని సామాజిక, సేవా కార్యక్రమాలకు పరిమితమై బయట పెద్దగా పరిచయం లేని మాధవీలతకు బీజేపీ సీటు దక్కడంతో అనూహ్యంగా తెరపైకి వచ్చారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే మాధవీలత తన అభ్యర్థిత్వం ఖరారుతోనే తన ప్రత్యర్థి సిట్టింగ్ ఎంపీ అసదుద్దీ¯Œ ఒవైసీపై మాటలతూటాలు పేల్చి జాతీయమీడియా దృష్టిలో పడ్డారు. ఒక నేషనల్ టీవీ చానల్ నిర్వహించిన ‘ఆప్‌కి అదాలత్’కార్యక్రమంలో పాల్గొన్న మాధవీలత మాట్లాడే తీరుకు ప్రధాని మోదీ కితాబు ఇవ్వడంతో దేశ రాజకీయాలను ఆకర్షించారు. కేంద్ర ప్రభుత్వం ఆమెకు వై ప్లస్ కేటగిరి భద్రత కల్పించింది. పాతబస్తీలో శ్రీరామనవమి ఊరేగింపులో బాణం ఎక్కుపెట్టి వదిలినట్టు హావభావాలతో బలమైన హిందుత్వవాదాన్ని ప్రదర్శించి ఆ సామాజికవర్గ ఓటర్లను ఆకర్షించారు. సిట్టింగ్ ఎంపీ టార్గెట్‌గా పాతబస్తీ వెనుకబాటు, ఇతరాత్ర అంశాలపై విమర్శనా్రస్తాలు సందిస్తూ ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తూ మజ్లిస్ వ్యతిరేక ఓటర్లను ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా బీజేపీ పాతబస్తీలో పాగా వేసేందుకు ఎన్నికల్లో హేమాహేమీలను రంగంలోకి దింపి శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉంది. బీజేపీ పక్షాన బరిలో దిగిన బద్దం బాల్‌రెడ్డి, ముప్పారపు వెంకయ్యనాయుడు, సుభాష్ చందర్జీలు కొంతమేరకు గట్టి పోటీ ఇచ్చినా, విజయాన్ని అందుకోలేకపోయారు. గత రెండు పర్యాయాలుగా వరుసగా పోటీ చేసిన భాగ్యనగర్ ఉత్సవ కమిటీ బాధ్యుడు భగవంతరావు కూడా రెండో స్థానానికి పరిమితమయ్యారు. అనుకూల అంశాలు » బలమైన హిందుత్వ ఎజెండా » ప్రచారంలో దూకుడు ప్రదర్శించడం » పాతబస్తీలో సామాజిక, సేవా కార్యక్రమాలు » ఆర్థిక బలం, అంగబలం, అధిష్టానం అండదండలు » మజ్లిస్ పార్టీపై వ్యతిరేకత..ముస్లిం ఓట్లు చీలడం » ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా ప్రతికూల అంశాలు» మెజారిటీ ఓటర్లు ముస్లిం సామాజికవర్గం వారు కావడం » ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను కేవలం ఒక సెగ్మెంట్లోనే ప్రాతినిధ్యం » స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ మద్దతు లేక పోవడం, ప్రచారానికి రాకపోవడం » బలమైన పార్టీ కేడర్ లేకపోవడం » స్థానిక పార్టీ శ్రేణుల నుంచి సహాయ నిరాకరణ ఫ్రెండ్లీగానే... కాంగ్రెస్, బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్,ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల అభ్యర్ధులు ఎన్నికల బరిలోదిగినా...మజ్లిస్ ఉన్న దోస్తానాతోఫ్రెండ్లీగానే పోటీ పడుతున్నారు. మజ్లిస్‌తో పదేళ్ల తర్వాత చిగురించిన స్నేçహ్నబంధం దెబ్బతినకుండా ఉండేందుకు అధికార కాంగ్రెస్ వ్యూహాత్మకంగా హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు సమీర్ వలీ ఉల్లా ను బరిలో దింపింది. బీఆర్ఎస్ పార్టీ కూడా మజ్లిస్తోగల మిత్రత్వాన్ని దష్టిలో పెట్టుకొని గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ను పోటీలో పెట్టింది. అధిష్టానాల తీరుతో విజయ అవకాశాలపై కనీస ఆశలు లేక ఇరువురు అభ్యర్దులు సైతం మొక్కుబడిగా ప్రచారం కొనసాగిస్తున్నారు. లోకసభ నియోజకవర్గం ఏర్పాటు అనంతరం ఆదిలోనే కాంగ్రెస్ పార్టీ విజయపరంపర కొనసాగించినా... మజ్లిస్ శకం ప్రారంభం అనంతరం డిపాజిట్ దక్కడం కష్టంగా తయారైంది. బీఆర్ఎస్ పార్టీ కూడా పాతికేళ్లలో కనీసం డిపాజిట్ దక్కలేదు. మొక్కుబడిగా పోటీ చేస్తూ వస్తోంది. -
చంద్రబాబు పచ్చి మోసగాడు..
సాక్షి, హైదరాబాద్: ‘తెలుగుదేశం అధినేత చంద్రబాబు పచ్చి మోసగాడు.. రాజకీయ లబ్ధికోసం యూటర్న్ తీసుకోవడంలో మొనగాడు. 1994లో నేను ఎమ్యెల్యేగా పనిచేసినప్పటి నుంచి చూస్తున్నా.. స్థిరత్వంలేని ఆయన పదవి కోసం ఎంతకైనా బరితెగిస్తాడు. అప్పట్లో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఎలా మోసం చేశాడో చూశా. అతనికి పదవులే ముఖ్యం. అభివృద్ధి, ప్రజల సంక్షేమం చంద్రబాబుకు అస్సలు పట్టదు’.. అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విరుచుకుపడ్డారు. ‘సాక్షి’తో శనివారం ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..అధికారమే బాబు లక్ష్యం..చంద్రబాబు కేవలం అధికారం చేపట్టడమే లక్ష్యంగా పనిచేస్తాడు. రాజకీయ లబ్ధికోసం 1996లో వాజ్‌పేయితో జతకట్టాడు. ఆ తర్వాత బయటకొచ్చాడు. 2014లో మోదీతో కలిసి పనిచేశాడు. మళ్లీ విడిపోయాడు. మోదీని అనరాని మాటలు అన్నాడు. ఇది అందరికీ తెలుసు.. మళ్లీ మోదీతో కలిసి పనిచేస్తున్నాడు. కానీ, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అలా కాదు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం తపిస్తుంటాడు. దివంగత నేత వైఎస్సార్ ముస్లింలకు కల్పించిన రిజర్వేషన్లను జగన్ అమలుచేస్తున్నారు. తిరిగి అధికారంలోకొచ్చి వాటిని కొనసాగించడం ఖాయం. జగన్ అంటే ఒక విశ్వాసం. అదే చంద్రబాబు ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి హామీ ఇవ్వగలడు? ముస్లిం రిజరేషన్లపై చిత్తశుద్ధి ఉంటే.. మోదీ, అమిత్ షాతో చెప్పించగలడా? అతను మోదీ చేతిలో కీలుబొమ్మ. చంద్రబాబును నమ్మలేం. కాబట్టి భవిష్యత్తులో ముస్లిం రిజర్వేషన్లకు ముప్పు కలగకుండా చంద్రబాబు, ఆయన కూటమికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గట్టిగా బుద్ధిచెప్పాలి. మరోవైపు.. ప్రధాని మోదీ గ్యారంటీలంటే రాజ్యాంగంలో మార్పులు చేయడం, రిజర్వేషన్లను రద్దుచేయడం, మైనారిటీలకు వ్యతిరేకంగా విషం చిమ్మడమే. బీజేపీది హిందూత్వమే ఏకైక ఎజెండా. భారత్‌ను హిందూత్వ దేశంగా మార్చేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. వెనుకబాటుతనంపైనేముస్లింలకు రిజర్వేషన్లు..అసలు ముస్లింలకు రిజర్వేషన్లను కల్పించింది మతప్రాతిపదికన కాదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ రిజర్వేషన్లను సామాజిక, విద్యాపరమైన వెనుకబాటు కారణంగా అందిస్తున్నారు. ముస్లింలలో అనేక వెనుకబడిన కులాలున్నాయి. వారికి ప్రభుత్వ మద్దతు అవసరం. కానీ, బీజేపీకి వీరి అభివృద్ధి గిట్టడంలేదు. అందుకే.. ముస్లిం రిజర్వేషన్ల రద్దుచేస్తామంటున్నారు.అభివృద్ధికి సహకరిస్తాంతెలంగాణలో అభివృద్ధికి సహకారం అందిస్తామని అసద్ పునరుద్ఘాటించారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఎన్నికల తర్వాత ప్రజా సంక్షేమం, అభివృద్దే తమ లక్ష్యమన్నారు. తమ పనితీరే తమకు గుర్తింపని చెప్పారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో గవర్నర్‌గా రాజ్యాంగబద్ధ్ద బాధ్యతలు నిర్వహించి రాజీనామా చేసిన తమిళిసై తిరిగి ఎన్నికల ప్రచారానికి రావడం రాజకీయంగా అనైతికమన్నారు. -
మా మద్దతు సీఎం జగన్ కే
-
ఏపీలో జగన్‌తోనే ముస్లిం రిజర్వేషన్లు: అసదుద్దీన్ ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలిస్తేనే ముస్లిం రిజర్వేషన్ల అమలు కొనసాగుతుందని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తేల్చి చెప్పారు. జగన్ రిజర్వేషన్లకే కాదు.. రాజ్యాంగ పరిరక్షణ కోసం కూడా పాటుపడతారన్న నమ్మకం తనకుందని చెప్పారు. బుధవారం రాత్రి హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు. ‘‘ప్రధాని మోదీ మాట వినను.. ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తానని నిలబడి చెప్పే దమ్ము టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఉందా? ఏపీలో చంద్రబాబు గెలిస్తే ప్రధాని మోదీకి కీలుబొమ్మగా మారుతారు’’అని స్పష్టం చేశారు. బీజేపీతో చేతులు కలిపిన చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. బాబు కూటమిలోని పవన్ కల్యాణ్ ఒక నటుడని, మోదీ మహా నటుడని అసదుద్దీన్ ఎద్దేవా చేశారు. మోదీ సినీ ప్రపంచంలో ఉండి ఉంటే సినిమా రంగాన్ని కూడా భ్రష్టు పట్టించేవారని విమర్శించారు. వైఎస్సార్ సీపీకే మా సంపూర్ణ మద్దతు ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ మళ్లీ గెలుస్తారని, ముస్లిం రిజర్వేషన్లను ఆయనే పరిరక్షిస్తారని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి దమ్మున్న నాయకుడని కొనియాడారు. ప్రధాని మోదీని ప్రశ్నించే సత్తా ఆయనకే ఉందన్నారు. వైఎస్సార్ సీపీకే తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కలసికట్టుగా జగన్‌ను మరోసారి గెలిపించి, ముఖ్యమంత్రిని చేయాలని అసదుద్దీన్ పిలుపునిచ్చారు. -
మోదీని ఢీకొట్టే సత్తా సీఎం జగన్ కే ఉంది
-
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
గోల్కొండ: ప్రపంచంలోనే అత్యుత్తమమైన భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని మజ్లిస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ చేతుల్లో కీలు»ొమ్మ అయిన బీజేపీ దళితులు, ముస్లింలకు పక్కా వ్యతిరేకి అని విమర్శించారు. మంగళవారం గోల్కొండ ఎండిలైన్స్ చౌరస్తా వద్ద జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్‌భగవత్ ఒకొక్కటిగా తమ ఎజెండాను అమలు చేస్తూ దేశ విచ్చిన్నానికి కుట్రలు చేస్తున్నారని నిందించారు. గత పదేళ్ల పాలనలో దళితులు, ముస్లింల సంక్షేమానికి ఏమీ చేయని పీఎం మోదీ ఇప్పుడు వారి రిజర్వేషన్లను సైతం రద్దు చేసేందుకు పక్కాగా ప్లాన్ చేశారని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం నాయకుల హత్యాకాండ నేరుగా అక్కడి ప్రభుత్వాల కనుసన్నల్లోనే కొనసాగుతోందని ఒవైసీ ధ్వజమెత్తారు. ముస్లిం నేతలు అరెస్టయి జైలుకు వెళ్లే వారు సజీవంగా తిరిగిరావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ముస్లిం నేతలను పోలీసులే చంపారని ఆయన గుర్తు చేశారు. నన్ను ఓడించేందుకు మోదీ, అమిత్ షా పాట్లు హైదరాబాద్‌లో అరాచక వాతావరణం నెలకొల్పేందుకు బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఒవైసీ ఆరోపించారు. హైదరాబాద్ స్థానం నుంచి తనను ఓడించేందుకు మోదీ, అమిత్ షాలు పడరాని పాట్లు పడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మతసామరస్యానికి పెట్టిన పేరైన హైదరాబాద్ ఓటర్లు ఎంతో వివేకవంతులనీ, శాంతిభద్రతలు నగర అభివృద్ధి కోరుకుని తనను గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహియుద్దీన్, కార్పొరేటర్ నసీరుద్దీన్, మహ్మద్ గౌస్ తదితరులున్నారు. -
ముస్లింలు, దళితులకు చంద్రబాబు శత్రువు
సాక్షి, హైదరాబాద్: ముస్లింలు, దళితులకు చంద్రబాబు ప్రధాన శత్రువు అని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. రాజకీయ అవకాశవాది అయిన చంద్రబాబుకు ముస్లింలపై ఎటువంటి ప్రేమ ఉండదని, టీడీపీ, బీజేపీ, జనసేన మతతత్వ ఫాసిస్టు పార్టీలని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ పార్టీలు ముస్లింలు, క్రిస్టియన్ మైనార్టీలకు శత్రువులని అన్నారు.ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన అధికారంలోకి వస్తే ముందుగా ముస్లిం రిజర్వేషన్లు, ఆ తర్వాత దళితుల రిజర్వేషన్లు తొలగిస్తారని తెలిపారు. ఇందుకోసం బీజేపీ చేస్తున్న కుట్రను చంద్రబాబు, పవన్ ఏపీలో అమలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ముస్లింలు, దళితుల ప్రయోజనాలను తాకట్టుపెట్టి స్వలాభం కోసమే ఆలోచిస్తారన్నారు. 2002లో గుజరాత్ అల్లర్ల కారణంగా దేశం మొత్తం కాలిపోతుంటే, ముస్లింలపై దౌర్జన్యాలు జరుగుతుంటే చంద్రబాబు మాత్రం బీజేపీకి మద్దతిచ్చారని తెలిపారు. చంద్రబాబును ముస్లింలు ఎన్నటికీ నమ్మరని స్పష్టంగా చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెక్యులర్ వాది అని తెలిపారు. సోమవారం సాక్షి ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో పాల్గొన్న అసదుద్దీన్ ఓవైసీ తన అభిప్రాయాలను సూటిగా, స్పష్టంగా చెప్పారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నిన్నటి వరకు విశ్వగురు, జీ–20,చంద్రయాన్, 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అంటూ ఊదరగొట్టారని, ఇప్పుడు అవన్నీ వదిలేసి హిందూ–ముస్లిం వివాదాన్ని తెరమీదకు తెచ్చారని అన్నారు. ముస్లింలను ద్వేషించడం ఒక్కటే ప్రధాని మోదీ గ్యారంటీ అని, తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మోదీ ఆయనలోని లోపాలను కప్పిపుచ్చుకొనేందుకు ఇలాంటి వాతావరణం సృష్టించారన్నారు. ఇప్పుడిప్పుడే ముస్లింలు బాగుపడుతున్నారు వైఎస్ఆర్ ఇచ్చిన ముస్లిం రిజర్వేషన్ల వల్ల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా మంది ముస్లిం యువకులు, విద్యార్థులు లబ్ధి పొందుతున్నారని ఒవైసీ చెప్పారు. ఇప్పుడిప్పుడే ముస్లింలు బాగుపడుతున్నారని తెలిపారు. డాక్టర్లు, ఇంజనీర్లు, డీఎస్పీలు, ఆర్డీవోలు, టీచర్లుగా ఉద్యోగులు పొందుతున్నారన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్కు ముస్లింలు అంటే తీవ్రమైన ద్వేషమని, 4 శాతం రిజర్వేషన్ల ద్వారా ముస్లింలు లబి్ధపొందడం బీజేపీకి మింగుడుపడటంలేదని తెలిపారు.విద్య, ఉద్యోగ పరంగా ముస్లింలు లబ్ధి పొందడం, స్వావలంబన సాధించడం బీజేపీకి నచ్చడంలేదని, దీంతో రిజర్వేషన్లు తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్లు మతం ప్రాతిపదికన కాదని, ముస్లింలలోని నిమ్న కులాల వారికి ఇస్తున్నారని చెప్పారు. సామాజిక, విద్యాపరమైన వెనుకబాటు కారణంగా వారికి రిజర్వేషన్లు అందుతున్నాయని తెలిపారు. బీజేపీతో కలిసి టీడీపీ, జనసేన కుట్రలు ముస్లింల అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్తో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన పార్టీలు పనిచేస్తున్నాయన్నారు. చంద్రబాబు, పవన్ బీజేపీ ఎజెండా ఆధారంగా ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పారు. ఏపీలో వీరు అధికారంలోకి వస్తే బీజేపీ కుట్రలు అమలు చేస్తారని, చంద్రబాబు ముస్లిం రిజర్వేషన్లు లేకుండా చేస్తారని తెలిపారు. ముస్లిం రిజర్వేషన్ల తరువాత దళితులకు కూడా రిజర్వేషన్లు లేకుండా చేస్తారన్నారు. ఏపీ ప్రజలంతా ఆలోచించి టీడీపీ, బీజేపీ, జనసేనలాంటి మతతత్వ, ఫాసిస్టు పార్టీలను ఓడిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.హామీ ఇచ్చి అమలు చేసిన వైఎస్సార్ముస్లిం రిజర్వేషన్లను మహానేత వైఎస్సార్ హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే అమలు చేశారని అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. కాంగ్రెస్ పరిశీలకుడిగా గులాం నబీ ఆజాద్ 2004లో హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పటి కాంగ్రెస్ నేత యూనుస్ సుల్తాన్ ఇంట్లో జరిగిన సమావేశంలో ముస్లిం రిజర్వేషన్లు ఇస్తామని వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారన్నారు. హామీ ఇచ్చినట్లుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిందని తెలిపారు. కోర్టు దీనిపై అభ్యంతరం చెప్పడంతో ప్రముఖ ఆంత్రోపాలజిస్టు కృష్ణన్ ఆధ్వర్యంలో కమిటీ వేశారని, ముస్లింలలో కుల ప్రాతిపదికన 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సహేతుకమే అని ఆ కమిటీ తేలి్చందని చెప్పారు. ఆ తరువాత వేసిన ఎస్ఎల్పీలో ముస్లిం రిజర్వేషన్లను అనుమతిస్తూ సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందన్నారు.సెక్యులర్ లీడర్ జగన్‌కు అండగా నిలవండి సెక్యులర్ లీడర్ అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందరూ మద్దతివ్వాలని ఒవైసీ కోరారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జగన్ రాజకీయ నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. జగన్ ఎప్పుడూ దళితులు, ముస్లింల ప్రయోజనాల విషయంలో రాజీపడలేదన్నారు. ముస్లింలు, దళితులకు అండగా నిలిచే సెక్యులర్ లీడర్ జగన్ ఏపీకి అవసరమని, ఆయనకు మద్దతుగా నిలిచి ఓటెయ్యాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒవైసీ విజ్ఞప్తి చేశారు. -
4% ముస్లిం రిజర్వేషన్ల తొలగింపుపై.. అసదుద్దీన్ రియాక్షన్
-
రజాకార్ మూలాలు చిత్తూ చేసి 40 ఏళ్ల చరిత్ర తిరగరాస్తాము
-
హైకమాండ్ ఆదేశిస్తే అసదుద్దీన్ గెలుపుకోసం పనిచేస్తా -ఫిరోజ్ ఖాన్
-
మజ్లిస్ దూకుడు
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల కోసం మజ్లిస్ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే పాదయాత్రలతో ముందస్తు ప్రచారానికి శ్రీకారం చుట్టిన మజ్లిస్ పార్టీ.. రంజాన్ మాసం ఇఫ్తార్ విందులను సైతం సద్వినియోగం చేసుకుంటోంది. రోజుకో డివిజన్లో ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు హాజరు కావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. మజ్లిస్ పార్టీకి హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపుపై ఎలాంటి అనుమానాలు లేనప్పటికీ.. పోలింగ్ భారీగా జరిగేలా సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇఫ్తార్ విందుల్లో సైతం పోలింగ్ ప్రస్తావన తీసుకొని రావడం ఇందుకు బలంచే కూరుతోంది. గత ఎన్నికల్లో సైతం పాదయాత్రలు, బహిరంగ సభల్లో పోలింగ్ శాతం పెంపు ప్రస్తావన ప్రధానాంశంగా కొనసాగించింది. ఈసారి సైతం పోలింగ్ పెంపుపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. మెజారిటీ కోసం.. హైదరాబాద్ లోక్‌సభ పరిధిలో మెజారిటీ ఓటర్లు ముస్లిం సామాజిక వర్గం వారే. పోలింగ్ ఎంత ఎక్కువగా నమోదైతే అంతే స్థాయిలో మెజారిటీ పెరుగుతుందని మజ్లిస్ పార్టీ భావిస్తోంది. ఎన్నికల్లో మజ్లిస్ పార్టీకి పోలింగ్ శాతమే మెజారిటీపై ప్రభావం చూపుతోంది. హైదరాబాద్ లోక్‌సభకు తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో మజ్లిస్ పక్షాన అప్పట్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగిన అబ్దుల్ వాహెద్ ఓవైసీ, ఆ తర్వాత బరిలో దిగిన సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీల ఓటములకు పోలింగ్ శాతమే ప్రభావం చూపింది. ఆ తర్వాత పోలింగ్ శాతం పెంపుపై దృష్టి సారించడంతో సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ జైత్రయాత్ర ప్రారంభమైంది. అనంతరం అసదుద్దీన్ ఒవైసీ విజయ పరంపర కొనసాగుతోంది. క్రమంగా పెరుగుతున్న పోలింగ్ శాతం మజ్లిస్‌ను ఎదురు లేని శక్తిగా తయారు చేసినట్లయింది. గత నాలుగు పర్యాయాల్లో పాతబస్తీపై గట్టి పట్టు సాధించి ఎన్నికలను ఏకపక్షంగా మార్చినప్పటికీ పెరుగుతున్న ఓటర్లకు అనుగుణంగా మెజారిటీ పెరగకపోవడం మింగుడు పడని అంశంగా తయారైంది. దీంతో అత్యధిక మెజారిటీ కోసం పోలింగ్ శాతం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది మజ్లిస్ పార్టీ. -
‘సీఏఏ’పై స్టే ఇవ్వండి: సుప్రీంలో ఒవైసీ పిటిషన్
న్యూఢిల్లీ: ఇటీవలే అమలులోకి వచ్చిన సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్(సీఏఏ)పై స్టే ఇవ్వాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టులో శనివారం పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పెండింగ్‌లో ఉండగా సీఏఏ కింద కొత్తగా ఎవరికీ పౌరసత్వం ఇవ్వవద్దని పిటిషన్లో ఒవైసీ కోరారు. కాగా, 2019లో కేంద్రం తీసుకువచ్చిన సీఏఏ చట్టానికి సంబంధించి తాజాగా కేంద్రం రూల్స్ నోటిఫై చేసి అమలులోకి తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి డిసెంబర్ 31,2014కు ముందు దేశంలోకి వలస వచ్చిన నాన్ ముస్లింలకు భారత పౌరసత్వం ఇస్తారు. సీఏఏ పోర్టల్‌లో దరఖాస్తు చేసిన కొందరు మైగ్రెంట్స్‌కు ఇప్పటికే భారత పౌరసత్వం కల్పించారు. AIMIM president Asaduddin Owaisi approaches the Supreme Court seeking to stay the implementation of the Citizenship Amendment Act (CAA), 2019 and the Rules, 2024. Owaisi says no applications seeking grant of citizenship status be entertained or processed by the government under… pic.twitter.com/w8uQii4lyn — ANI (@ANI) March 16, 2024 ఇదీ చదవండి.. చైనా, పాక్ స్నేహం భారత్‌కు సవాలే -
ఈసారి ఒవైసీకి భారీ షాక్.. బీజేపీ నుంచి గట్టి అభ్య
-
సీఏఏ అమలుపై ప్రతిపక్షాల విమర్శలు
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుందని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే వివాదాస్పద సీఏఏ చట్టం అమలు నిర్ణయంపై మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఏఏ చట్టాన్ని సైతం ఎన్నికల పావుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాడుకుంటోందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ‘2019లో సీఏఏ చట్టం చేయబడితే.. మోదీ ప్రభుత్వానికి ఆ చట్టం విధివిధానాలు నోటీఫై చేయటానికి నాలుగేళ్ల మూడు నెలలు పట్టింది. అయినా మోదీ మాత్రం తన ప్రభుత్వం సమయానుకూలంగా పని చేస్తుందని చెప్పుకుంటారు. సీఏఏ నియమాలను నోటీపై చేయటానికి తీసుకున్న సమయం మోదీ చెప్పే అబద్ధాలకు మరో నిదర్శనం’ అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ‘ఎక్స్’ వేదికగా విమర్శలు చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ కేసులో భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై సుప్రీం కోర్టు కన్నెర్ర జేసిన విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు బీజేపీ ప్రభుత్వం ఇవాళ సీఏఏ అమలు నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. दिसंबर 2019 में संसद द्वारा पारित नागरिकता संशोधन अधिनियम के नियमों को अधिसूचित करने में मोदी सरकार को चार साल और तीन महीने लग गए। प्रधानमंत्री दावा करते हैं कि उनकी सरकार बिल्कुल प्रोफेशनल ढंग से और समयबद्ध तरीक़े से काम करती है। सीएए के नियमों को अधिसूचित करने में लिया गया इतना… — Jairam Ramesh (@Jairam_Ramesh) March 11, 2024 ‘దేశంలోని పౌరులు జీవనోపాధి కోసం బయటకు వెళ్లవలసి వచ్చినప్పుడు.. ఇతరుల కోసం ‘పౌరసత్వ చట్టం’ తీసుకురావడం వల్ల ఏమి జరుగుతుందని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. బీజేపీ ఆటకట్టించే రాజకీయం ఇప్పుడు ప్రజలకు అర్థమైందని అన్నారు. తమ పదేళ్ల పాలనలో లక్షలాది మంది పౌరులు దేశ పౌరసత్వాన్ని ఎందుకు వదులుకున్నారో బీజేపీ ప్రభుత్వం వివరించాలని నిలదీశారు. जब देश के नागरिक रोज़ी-रोटी के लिए बाहर जाने पर मजबूर हैं तो दूसरों के लिए ‘नागरिकता क़ानून’ लाने से क्या होगा? जनता अब भटकावे की राजनीति का भाजपाई खेल समझ चुकी है। भाजपा सरकार ये बताए कि उनके 10 सालों के राज में लाखों नागरिक देश की नागरिकता छोड़ कर क्यों चले गये। चाहे कुछ हो… — Akhilesh Yadav (@yadavakhilesh) March 11, 2024 ‘మీరు ఆరు నెలల ముందు సీఏఏ చట్టం నియమాలు నోటీఫై చేసి ఉండాల్సింది. దేశానికి మంచి జరిగితే.. మేము ఎల్లప్పుడూ మద్దతిస్తాం, అభినందిస్తాం.. కానీ, దేశానికి కీడు జరిగితే మాత్రం టీఎంసీ వ్యతిరేకిస్తుంది. రంజాన్ నెల ప్రారంభమయ్యే ముందు రోజే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో నాకు తెలుసు’ అని సీఎం మమతా బెనర్జీ అన్నారు. Aap chronology samajhiye, pehle election season aayega phir CAA rules aayenge. Our objections to CAA remain the same. CAA is divisive & based on Godse’s thought that wanted to reduce Muslims to second-class citizens. Give asylum to anyone who is persecuted but citizenship must… — Asaduddin Owaisi (@asadowaisi) March 11, 2024 సీఏఏ అమలు నిర్ణయంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘ఎన్నికల సీజన్ వస్తున్న సమయంలో సీఏఏ నియమాలు అమల్లోకి వచ్చాయి. సీఏఏపై తమ అభ్యంతరాలు ఇంకా అలాగే ఉన్నాయి. సీఏఏ అనేది విభజన, ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడాలని కోరుకునే గాడ్సే ఆలోచన విధానం. హింసించబడిన ఎవరికైనా ఆశ్రయం ఇవ్వండి. కానీ పౌరసత్వం అనేది మతం లేదా జాతీయతపై ఆధారపడి ఉండకూడదు. ఈ నిబంధనలను ఐదేళ్లుగా ఎందుకు పెండింగ్‌లో ఉంచారో? ఇప్పుడు ఎందుకు అమలు చేస్తున్నారో ప్రభుత్వం వివరించాలి. ఎన్పీఆర్-ఎన్ఆర్సీతో పాటు.. సీఏఏ కేవలం ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడానికి ఉద్దేశించబడింది. ఇది మరే ఇతర ప్రయోజనాలకు ఉపయోగపడదు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ వీధుల్లోకి వచ్చిన భారతీయులు.. మళ్లీ వ్యతిరేకించడం తప్ప మరో మార్గం లేదు’ అని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ‘ఎక్స్’ వేదికగా అన్నారు. -
పాతబస్తీపై ఫోకస్!
చాంద్రాయణగుట్ట (హైదరాబాద్): హైదరాబాద్ మహా నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, పాతబస్తీ ప్రాంతంపై ప్రత్యేక దృష్టిపెడతామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 2050 విజన్‌తో పాతబస్తీ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఎంఐఎం పార్టీతో కలసి పనిచేస్తామని చెప్పారు. శుక్రవారం పాతబస్తీ మెట్రోరైల్ నిర్మాణ పనులకు ఫలక్‌నుమా ఫారూక్‌నగర్‌లో సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. వివరాలు రేవంత్ మాటల్లోనే.. ‘‘హైదరాబాద్‌లో రవాణా సదుపాయాలు మెరుగుపరుస్తున్నాం. కంటోన్మెంట్లో రోడ్ల విస్తరణ చేపట్టాం. హైదరాబాద్‌లో పూర్తిస్థాయిలో మెట్రోరైల్ విస్తరిస్తే సామాన్య ప్రజలకు వెసులుబాటుగా ఉంటుంది. 2050 విజన్‌తో పాతబస్తీ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం. అందరూ ఈ ప్రాంతాన్ని ఓల్డ్ సిటీ అని చిన్నచూపు చూస్తుంటారు. కానీ ఈ ప్రాంతమే ఒరిజినల్ సిటీ. ఓల్డ్ సిటీపై నాకు అవగాహన ఉంది. మా ఊరు(కల్వకుర్తి)కు చాంద్రాయణగుట్ట, సంతోష్‌నగర్ మీదుగానే వెళతాం. పాతబస్తీలో రోడ్ల నిర్మాణం కోసం ఎంపీ అసదుద్దీన్ కోరిన వెంటనే రూ.200 కోట్లు మంజూరు చేశాం. హైదరాబాద్‌లో ఎక్కడెక్కడో మెట్రోరైల్‌ను ప్లాన్ చేసిన గత పాలకులు పాతబస్తీ మెట్రోను విస్మరించారు. మేం నాగోల్ నుంచి ఎల్బీనగర్కు, అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, పి–7 రోడ్డు మీదుగా ఎయిర్‌పోర్టుకు మెట్రోను అనుసంధానం చేస్తాం. దీంతోపాటు రాజేంద్రనగర్‌లో నిర్మించనున్న హైకోర్టు వరకు, రాయదుర్గం–ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్, మియాపూర్–ఆర్సీపురం వరకు మెట్రోను విస్తరిస్తాం. మీరాలం ట్యాంక్ వద్ద రూ.363 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపడతాం. అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే.. మెట్రోరైల్, ఓఆర్ఆర్, ఎయిర్పోర్ట్ అన్నీ కాంగ్రెస్ హయాంలోనే నిర్మించాం. 2004 నుంచి 2014 మధ్య హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి తాగునీటిని తీసుకొచి్చన ఘనత కాంగ్రెస్‌దే. మూసీ నదిని సుందరీకరించి, దేశంలోనే చక్కటి టూరిస్ట్ స్పాట్‌గా మారుస్తాం. ఇందులో భాగంగానే అక్బరుద్దీన్ ఒవైసీతో కలసి లండన్‌లో థేమ్స్ నదిపై అధ్యయనం చేశాం. గుజరాత్లో సబర్మతీ నదిని అభివృద్ధి చేసిన ప్రధాని మోదీ.. ఇక్కడ గండిపేట నుంచి 55 కిలోమీటర్ల పొడవునా మూసీ సుందరీకరణకు కూడా కేంద్ర నిధులు వెచ్చించాల్సిన అవసరం ఉంది. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచి్చనది వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే. నేను కూడా మైనారీ్టల అభ్యున్నతికి కృషి చేస్తా. అందుకే మైనార్టీ శాఖ, మున్సిపల్ శాఖలను నా వద్దే ఉంచుకున్నా. చంచల్‌గూడ జైలును తరలిస్తాం చంచల్‌గూడ జైలును హైదరాబాద్ నగరం వెలుపలకు తరలిస్తాం. ఆ స్థలంలో కేజీ, పీజీ క్యాంపస్ ద్వారా విద్యను అందిస్తాం. ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనాన్ని నిర్మిస్తాం. 1994–2004 మధ్య టీడీపీ, 2004–2014 కాంగ్రెస్, 2014–2023 వరకు బీఆర్ఎస్ పాలించాయి. నేను 2024 నుంచి 2034 వరకు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా..’’అని సీఎం రేవంత్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, మజ్లిస్ ఎమ్మెల్యేలు ముబీన్, మీర్ జులీ్ఫకర్ అలీ, జాఫర్ హుస్సేన్ మేరాజ్, అహ్మద్ బలాలా, ఎమ్మెల్సీ రియాజుల్ హఫెండీ, ప్రభుత్వ సలహారు షబ్బీర్ అలీ, సీఎం సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, మెట్రోరైల్ ఎండీ ఎనీ్వఎస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాతబస్తీకి మెట్రో సంతోషకరం: అసదుద్దీన్ ఒవైసీ పాతబస్తీకి మెట్రో రైల్ వస్తుండటం సంతోషకరమని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇది అందుబాటులోకి వస్తే పాతబస్తీ నుంచి నిత్యం 10–15వేల మంది హైటెక్ సిటీకి వెళతారని చెప్పారు. సీఎం రేవంత్ పాతబస్తీ అభివృద్ధిపై దృష్టి సారించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌ను కూడా ఈ ప్రాంతం నుంచి తరలించాలని కోరారు. డీఎస్సీని ఉర్దూ మాధ్యమంలో కూడా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. మూసీ సుందరీకరణకు తాము పూర్తిస్థాయిలో సహకరిస్తామని చెప్పారు. దేశంలో విద్వేషాన్ని నింపుతున్న వారిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. -
పాత బస్తీ మెట్రోకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: ఓల్డ్ సిటీ అంటే పాత నగరం కాదని.. ఇదే అసలైన హైదరాబాద్ నగరమని.. దీనిని పూర్థిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం ఫలక్‌నుమాలోని ఫరూక్నగర్ దగ్గర పాత బస్తీ మెట్రో లైన్ పనులకు భూమి పూజ చేసి ఆయన మాట్లాడారు. ‘‘ఇది ఓల్డ్ సిటీ కాదు..ఇదే ఒరిజినల్ సిటీ. అసలైన నగరాన్ని పూర్థిస్తాయిలో అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాం. అలాగే.. మూసీ పరివాహక ప్రాంతం అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నాం. ఇందు కోసమే లండన్ నగరాన్ని ఇక్కడి ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌తో కలిసి పరిశీలించాం. హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ విషయంలో ఎంఐఎంతో కలిసి పనిచేస్తాం. ఎన్నికలొచ్చినప్పుడే రాజకీయాలు. మిగతా సమయాల్లో అభివృద్ధికే ప్రాధాన్యమిస్తాం’’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కి.మీ మేర మెట్రో ప్రాజెక్టు విస్తరణకు తాజాగా సీఎం రేవంత్ ఆయన శంకుస్థాపన చేశారు. వీలైనంత త్వరగా ఈ మెట్రో రూట్‌ను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం చూస్తోంది. ఇంకా ఆయన ఏమన్నారంటే.. హైదరాబాద్ అభివృద్ధికి 2050 వైబ్రంట్ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. పాతబస్తీలో రోడ్ల విస్తరణకు రూ.200 కోట్లు కేటాయించాం. మూసీ నదిని 55 కి.మీ మేర సుందరీకరిస్తాం. మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసి చూపిస్తాం. మెట్రో రైలు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌కే కాదు పాతబస్తీకి ఉండాలి. అందులో సంపన్నులే కాదు మధ్యతరగతి ప్రజలూ ప్రయాణించాలి. చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ మెట్రోలో అతిపెద్ద జంక్షన్ కాబోతోంది. చంచల్‌గూడ జైలును అక్కడి నుంచి తరలించి.. విద్యాసంస్థ ఏర్పాటు చేస్తాం. రాజకీయాలు వేరు అభివృద్ధి వేరు. 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. వచ్చే నాలుగేళ్లలో పాతబస్తీ మెట్రో రైలు పూర్తి చేసి ప్రయాణిస్తాం. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌కు గుండెలాంటి పాతబస్తీకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి స్వాగతం. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తారని ఆశిస్తున్నాం. మీ చేతుల్లో ఐదేళ్లు అధికారం ఉంటుంది. అభివృద్ధికి మేం సహకరిస్తాం. రేవంత్‌రెడ్డి చాలా పట్టుదలతో ఈ స్థాయికి వచ్చారు. తెలంగాణలో ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారు. కొన్ని శక్తులు విధ్వంసానికి కుట్రలు పన్నుతున్నాయి.. వాటిని అడ్డుకోవాలి. రాష్ట్రాన్ని శాంతియుతంగా ముందుకు తీసుకెళ్లాలి. పాతబస్తీలో అభివృద్ధి పనుల కోసం సీఎంను కలవగానే రూ.120 కోట్లు విడుదల చేశారు. మూసీ నది అభివృద్ధికి మా పార్టీ సహకరిస్తుంది’’ అని పేర్కొన్నారు. -
హైదరాబాద్ రామేశ్వరం కేఫ్ సందర్శించిన అసదుద్దీన్ ఒవైసీ - వీడియో
ఇటీవల బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం పేలుడు సంభవించడంతో 10 మంది గాయపడ్డారు. పేలుడు సమయంలో గాయపడ్డ బాధితులకు సంఘీభావం తెలిపేందుకు ఆల్ ఇండియా మజ్లిస్-ఈ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ శనివారం హైదరాబాద్‌లోని రామేశ్వరం కేఫ్‌ను సందర్శించారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జన్మస్థలంతో కేఫ్‌కు ఉన్న అనుబంధాన్ని గురించి గుర్తు చేస్తూ.. బెంగళూరులో జరిగిన సంఘటనను అసదుద్దీన్ ఖండించారు. అసదుద్దీన్ ఎక్స్ (ట్విటర్) వేదికగా రామేశ్వరం కేఫ్‌లో ఫుడ్ బాగుందని. ఏపీజే అబ్దుల్ కలాం జన్మస్థలం పేరు కేఫ్ అని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యమని, రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ అనేది ఓ పిరికిపంద చర్య అని వెల్లడించారు. కేఫ్‌లో భోజనం చేస్తూ అసదుద్దీన్ అక్కడున్న కొంతమంది సందర్శకులతో కూడా మాట్లాడారు. ఇకపోతే.. బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో జరిగిన సంఘటన మీద కర్ణాటక పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. పేలుడుకు సంబంధించిన ఖచ్చితమైన నిజానిజాలను తెలుసుకోవాలని అక్కడి ప్రభుత్వం అధికారులను ఇప్పటికే ఆదేశించింది. అంతే కాకుండా ఇకపైన కూడా జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో పోలీసు పెట్రోలింగ్‌ను పెంచాలని అధికారులను ఆదేశించారు. రామేశ్వరం కేఫ్ ఫౌండర్ అండ్ సీఈఓ రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలని, అటువంటి చర్యలకు పాల్పడిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘటనలో గాయపడిన ప్రజలకు, సిబ్బందికి తన సంఘీభావం తెలియజేస్తూ.. వారికి అండగా మేమున్నామనే ధైర్యం చెప్పారు. #WATCH | Telangana: AIMIM chief Asaduddin Owaisi visited The Rameshwaram cafe in Hyderabad, in solidarity with #RameshwaramCafeBlast. pic.twitter.com/KLxODSQMIB — ANI (@ANI) March 2, 2024 -
7న పాతబస్తీలో మెట్రోరైలు పనులకు సీఎం శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో మెట్రో రైలు పను లకు ఈ నెల 7న ఫలక్‌నుమాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. దేశంలో ముస్లింలతో పాటు దళిత సామాజిక వర్గాలను టార్గెట్ చేసి నల్లచ ట్టాలను ప్రయోగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఏఐఎంఐఎం కేంద్ర కార్యాలయమైన హైదరాబాద్ దారుస్సలాం మైదా నంలో శనివారం జరిగిన పార్టీ 66వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ముస్లిం, దళితులపై ఉక్కుపాదం మోపుతుందని, సీఏఏ చట్టం ఏన్పీఆర్, ఎన్ఆర్సీలో ఇమిడి ఉందని పేర్కొ న్నారు. మరోమారు బీజేపీ గద్దెనెక్కకుండా అడ్డుకో వాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ పదేళ్ల పాల నలో నిరుద్యోగం పెరిగి పోయిందని. హిందూత్వ ఎజెండా తప్ప అభివృద్ధి లేదన్నారు. దేశంలో మత చిచ్చుతో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్ని స్తోదని దుయ్యబట్టారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్‌లో బీజేపీ పాగావేయాలన్నది ఆ పార్టీ పగటి కలేనని ఒవైసీ ఎద్దేవా చేశారు. బీజేపీకి దమ్ముంటే ఇక్కడి నుంచి పోటీ చేయాలని మోదీకి సవాల్ విసిరారు. సభలో పార్టీ జాతీయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీతోపాటు పార్టీ శాసనసభ్యులు,ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావ సభలో మాట్లాడుతున్న అసదుద్దీన్ -
పుతిన్ ప్రైవేట్ ఆర్మీలో తెలంగాణ వాసులు
సాక్షి, హైదరాబాద్: రష్యాలో సెక్యూరిటీ గార్డు, హెల్పర్ ఉద్యోగాలు ఇప్పిస్తామన్న బ్రోకర్ల వలకు చిక్కి 12 మంది భారతీయ యువకులు ప్రస్తుతం ప్రాణభయంతో విలవిల్లాడుతున్నారు. ఉక్రెయిన్‌పై పోరులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌కు చెందిన ప్రైవేటు సైన్యం ‘ది వాగ్నర్’ గ్రూప్‌లో బలవంతంగా పనికి కుదర్చడంతో వారంతా బాంబులు, తుపాకుల మోత మధ్య బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తున్నారు. తమను వీలైనంత త్వర గా తిరిగి తీసుకెళ్లాలని తమ కుటుంబీకులకు ఆడి యో, వీడియో సందేశాలు పంపుతున్నారు. ఈ బాధితుల్లో హైదరాబాద్‌లోని బజార్‌ఘాట్‌కు చెందిన మహమద్ అస్ఫాన్, నారాయణ్‌పేట జిల్లా కేంద్రానికి చెందిన సయ్యద్ మహ్మద్ సుఫియన్ ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. నమ్మించి మోసం.. బాబా బ్లాగ్స్ పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహించే ఫైసల్ ఖాన్ అలియాస్ బాబా ప్రస్తుతం షార్జాలో ఉంటున్నాడు. దాదాపు 50 వేల మంది ఫాలోవర్లు ఉన్న తన బ్లాగ్ ద్వారానే రష్యాలో సెక్యూరిటీ గార్డు, హెల్పర్ ఉద్యోగాలు ఉన్నాయంటూ ఎర వేశాడు. దీనికి ఆకర్షితుడైన బజార్‌ఘాట్ ప్రాంతానికి చెందిన మహమద్ అస్ఫాన్ (30) మొదట బాబాను సంప్రదించాడు. ఏడాది కాలం కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసేలా రష్యాలో ఉద్యోగాలు ఉన్నాయని నమ్మబలికాడు. అతన్నుంచి రూ.3 లక్షలు వసూలు చేసి ఉద్యోగం ఖరారు చేస్తానంటూ నమ్మబలికాడు. మాస్కోలోని తన సబ్ ఏజెంట్లు సుఫాయాన్, మోయిన్, రమేష్‌లను సంప్రదించాలని సూచించాడు. దీంతో గతేడాది నవంబర్ 12న అస్ఫాన్ చైన్నె విమానాశ్రయం నుంచి షార్జా మీదుగా రష్యా చేరుకున్నాడు. ఈ ప్రయాణం కోసం విజిట్ వీసా ఏర్పాటు చేసిన బాబా.. జాబ్ వీసాను మోయిన్ ఇస్తాడని నమ్మించాడు. అక్కడకు వెళ్లిన అతన్ని రిసీవ్ చేసుకున్న రమేష్ సెక్యూరిటీ ఉద్యోగం అని చెప్పి తీసుకువెళ్లాడు. సంతకాలు తీసుకొని.. మాస్కోలోని ఒక మాల్లో పని చేయాలంటూ రష్యన్ భాషలో రాసి ఉన్న పత్రంపై అస్ఫాన్‌తో రమేష్ సంతకాలు చేయించాడు. రమేష్, మోయిన్‌లు అస్ఫాన్ సహా 12 మంది భారతీయులను ఆ సమీపంలోని సైనిక శిబిరానికి తీసుకెళ్లి తుపాకులు వినియోగించడంలో ప్రాథమిక శిక్షణ ఇచ్చారు. సెక్యూరిటీ గార్డు విధుల్లో భాగంగానే ఇది ఇస్తున్నట్లు నమ్మించారు. ఆపై వారిని దాదాపు వెయ్యి కి.మీ. దూరంలోని ఉక్రెయిన్ సరిహద్దుల్లోకి చేర్చారు. దీంతో తాను సంతకం చేసింది పుతిన్‌కు చెందిన ప్రైవేట్ ఆర్మీ ది వాగ్నర్ గ్రూప్‌లో ఏడాదిపాటు పని చేసేందుకని అస్ఫాన్ ఆలస్యంగా గుర్తించాడు. ఆజాద్ యూసుఫ్ అనే భారతీయుడు తమ కళ్లెదుటే అశువులు బాయడంతో మిగిలిన వారంతా ఆందోళన చెందారు. అనంతరం వారిని అక్కడ నుంచి ఉక్రెయిన్‌లోని వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. రూ. లక్ష జీతమంటూ సుఫియన్ను మోసగించి... నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన డ్రైవర్ జహీర్, నాసీమా రెండో కుమారుడు సయ్యద్ మహ్మద్ సుఫియన్ ఇంటర్ వరకు చదువుకొని 2021లో జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లి హోటల్లో పనిచేస్తున్నాడు. అక్కడే అతనికి బాబా పరిచయమయ్యాడు. దుబాయ్‌లో పనిచేస్తే రూ.30 వేలే వస్తాయ్..అదే రష్యాలో హెల్పర్‌గా పనిచేస్తే రూ.లక్ష వరకు జీతం వస్తుందని నమ్మించాడు. ఇందుకుగాను తనకు రూ.3 లక్షలు ఇవ్వాలని చెప్పాడు. అందుకు సుఫియన్ అంగీకరించడంతో తల్లిదండ్రులు అప్పు చేసి ఆ డబ్బు కుమారుడికి ఇచ్చారు. డిసెంబర్ 17న దుబాయ్‌కు అక్కడి నుంచి 18న రష్యాకు సుఫియాన్ వెళ్లాడు. రక్షించాలంటూ సందేశాలు.. అస్ఫాన్ గతేడాది డిసెంబర్ 13 వరకు కుటుంబీకులతో సంప్రదింపులు జరిపినా ఆపై సిగ్నల్స్ దొరకలేదు. మిగిలిన 11 మందికీ సరైన సిగ్నల్స్ లభించక కుటుంబీకులకు ఆడియో, వీడియో సందేశాలు పంపారు. వాటిలోనే తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ రికార్డుల్లో బాంబుల మోతలు, తుపాకీ కాల్పులు వినిపిస్తున్నట్లు కుటుంబీకులు చెబుతున్నారు. అస్ఫాన్ సోదరుడు ఇమ్రాన్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘అస్ఫాన్‌కు భార్య, కుమార్తె (2), కుమారుడు (8 నెలలు) ఉన్నారు. ఉక్రెయిన్‌లోని యుద్ధక్షేత్రంలో ఉన్న అతడిని ఇక్కడకు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అస్ఫాన్ ఇటీవల పంపిన సందేశంలో వారి చుట్టూ ఉన్న వాళ్లు యుద్ధంలో మరణిస్తున్నారని చెప్పాడు. నన్ను వెనక్కు తీసుకురావడానికి ఏదైనా చేయాడంటూ వేడుకున్నాడు’ అని పేర్కొన్నాడు. బాధిత కుటుంబాల కోరిక మేరకు స్పందించిన ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈ అంశంపై మాస్కోలోని భారత రాయబార కార్యాలయానికి లేఖ రాశారు. -
దేశానికి బాబా మోదీ అవసరం లేదు: ఒవైసీ
న్యూఢిల్లీ: కేంద్రం వైఖరిపై మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ నిప్పులు చెరిగారు. మోదీ ప్రభుత్వం ఒక వర్గానికో, మతానికో చెందిన ప్రభుత్వమా లేక యావద్దేశానికి ప్రభుత్వమా అని నిలదీశారు. దేశానికి బాబా మోదీ ప్రభుత్వం అవసరం లేదన్నారు. రామమందిర నిర్మాణంపై శనివారం సభలో చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘రామ మందిర ప్రారంభం ద్వారా ఒక మతంపై మరో మతం విజయం సాధించినట్లు సందేశం ఇవ్వదలిచారా? దేశంలోని 17 కోట్ల ముస్లింలకు ఏం సందేశమిస్తున్నారు? నేను బాబర్, జిన్నా, ఔరంగజేబ్ తరఫున మాట్లాడటం లేదు. రాముడిని గౌరవిస్తా. కానీ గాడ్సేను ద్వేషిస్తా. ‘బాబ్రీ మసీదు జిందాబాద్, బాబ్రీ మసీదు ఎప్పటికీ ఉంటుంది’ అంటూ ముగించారు. -
‘బీజేపీకి ఆప్‌కు మధ్య తేడా ఎంటీ?’
అమ్ ఆద్మీ పార్టీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలపై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవిండ్ కేజ్రీవాల్, రాష్ట్రం ప్రభుత్వం ప్రతి నెల మొదటి మంగళవారం సుందరకాండ, హనుమాన్ చాలీసా పఠించాలని నిర్ణయం తీసుకుంటే.. బీజేపీకి ఆప్ మధ్య తేడా ఏంటని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఈ రెండు పార్టీల మధ్య ఏమాత్రం తేడా ఉండదని అన్నారు. ఢిల్లీలోని ప్రతి నియోజకవర్గంలో ప్రతి నెల మొదటి మంగళవారం సుందరకాండ, హనుమాన్ చాలీసా పఠించాలని ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. సుందరకాండ, హనుమాన్ చాలీసా పఠించడానికి రానున్న రోజుల్లో సుమారు 2,600 ప్రాంతాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యపై స్పందించిన మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సదరు మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. ఆప్ తమను తాము గొప్పగా ఊహించుకుంటోందని అన్నారు. ప్రధాన మంత్రి మోదీ అనుసరిస్తున్న హిందుత్వ రాగాన్ని ఆప్ అమలు చేస్తోందని మండిడ్డారు. ఆప్‌లో కొంత మంది నేతలు తాము సరయు నదికి వెళ్లుతామని అంటారు. మరికొందరు సుందరకాండ పఠనం పాఠశాలల్లో, ఆస్పత్రిలో అమలు చేయాలని వ్యాఖ్యాస్తారు. ఇలా చేస్తూ ఆప్ పార్టీ నరేంద్రమోదీ అడుగుజాడల్లో నడుస్తోందని విమర్శించారు. నరేంద్ర మోదీ ఏదైతే చేయాలనుకుంటారో మీరు (ఆప్) అదే చేస్తారని అన్నారు. ఇలా చేస్తూ వెళ్లితే.. మీకు(ఆప్), బీజేపీకి తేడా ఏం ఉందని ఓవైసీ సూటిగా నిలదీశారు. చదవండి: ‘ఇండియా కూటమి చరిత్రక గెలుపు నమోదు చేస్తుంది’ -
హంగ్ కోసం బీజేపీ యత్నం
‘రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈసారి ఇక్కడ పప్పులు ఉడకడం లేదని పసిగట్టింది. దీంతో రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలని చూస్తోంది. దాని ఫలితంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని భావిస్తోంది. వచ్చే ఐదేళ్లలో సంకీర్ణంతో బలోపేతం కావాలనుకుంటోంది. ప్రజలు మజ్లిస్‌కు 9, బీఆర్ఎస్కు 110 సీట్లలో సంపూర్ణ మద్దతు ఇచ్చి.. కేసీఆర్ మామకు అధికారం కట్టబెట్టాలి’ అని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. బధవారం టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... – సాక్షి, హైదరాబాద్ కాంగ్రెస్‌తోనే బీజేపీ గ్రాఫ్ పెరుగుతోంది కాంగ్రెస్ అసమర్థత వల్లే బీజేపీ గ్రాఫ్ పెరుగుతోంది. కేంద్రంలో వరుసగా గెలుస్తోంది. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే ఎంపీల బలం 50కి పడిపోయింది. మోదీ ప్రధాని కావడానికి ఆయనే కారణం. తమ అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి కోపమంతా మజ్లిస్‌పై ప్రదర్శిస్తున్నారు. ఓట్లు చీల్చుతున్నామని అపవాదు అంటకడుతున్నారు. అమేథీలో మజ్లిస్ పోటీ చేయకపోయినా స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓడిపోయారు. తాత ముత్తాత, నానమ్మ సీట్లను కూడా కాపాడుకోలేకపోయారు. కేరళలోని వయనాడ్‌లో ముస్లిం లీగ్ సహకారంతో 30 శాతం ముస్లిం ఓట్లతో రాహుల్ గెలిచారు. శివసేనతో అధికారం పంచుకున్నప్పుడు కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ ఎలా అవుతుంది. ఎంఐఎం, బీఆర్ఎస్ కోసం తలుపులు మూసేశామని రాహుల్ చెబుతున్నారు. ఇండియా కూటమిలో మేము ఎలా భాగస్వాములం అవుతాం. అజహరుద్దీన్.. అసమర్థ రాజకీయవాది అజహరుద్దీన్ మంచి క్రికెటరే.. కానీ, రాజకీయాల్లో అసమర్థుడు. యూపీలోని మొరాదాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ప్రజలు గెలిపిస్తే అక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఆ తర్వాత రాజస్తాన్‌కు పంపిస్తే అక్కడ ఓడిపోయారు. ఆ తర్వాత తిరిగి ముఖం చూపించలేదు. సొంతగడ్డపై కేటీఆర్ ఆయనకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాధ్యతలు అప్పగిస్తే దాని స్థాయి దిగజార్చారు. ఆయన అవినీతిపై నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఎన్నికల్లో ప్రత్యర్థులు ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైతే తప్పేంటి? అసమర్థ నేత కాబట్టి ఆయనపై బలమైన మజ్లిస్ అభ్యర్థిని రంగంలోకి దింపాం. కాంగ్రెస్ చీఫ్ పక్కా ఆర్ఎస్ఎస్వాది టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గతంలో ఏబీవీపీలో పనిచేశారు. కార్వాన్లో కిషన్ రెడ్డి పోటీ చేసినప్పుడు ఆయనకు మద్దతుగా గుడిమల్కాపూర్‌లో ప్రచారం నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ ఆయనను టీడీపీకి పంపిస్తే ఆ పార్టీ అడ్రస్ తెలంగాణలో గల్లంతైంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సూచనతో కాంగ్రెస్‌లో చేరారు. మోహ¯న్ భగవత్ రిమోట్ కంట్రోల్‌తోనే గాంధీభవన్ పనిచేస్తోంది. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే. హైదరాబాద్‌లో మజ్లిస్ బలంగా ఉంది కాబట్టి తెలంగాణలో మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించారు. కానీ కర్ణాటక, రాజస్తాన్, మధ్యప్రదేశ్, మిజోరం, ఛత్తీస్‌గడ్‌లలో ఎందుకు ప్రకటించలేదో సమాధానం చెప్పాలి? అక్కడ ముస్లింలు లేరా..? లేక వారి అభివృద్ధిపై చిత్తశుద్ది లేదా? బీఆర్ఎస్తో ఎలాంటి పొత్తులేదు బీఆర్ఎస్తో మజ్లిస్‌కు ఎలాంటి పొత్తు లేదు. ఫ్రెండ్లీ పార్టీ మాత్రమే. బీజేపీతో కలిసే ప్రసక్తే లేదు. కాంగ్రెస్, బీజేపీ మధ్య సంబంధం ఉంది. మేము ఎవరికీ బీ–టీమ్ కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తోంది కాబట్టి సమర్థిస్తున్నాం. బీజేపీతో కేసీఆర్‌కు సంబంధం ఉంటే.. తొమ్మిదిన్నరేళ్లలో మైనారిటీల కోసం పెద్దఎత్తున బడ్జెట్ కేటాయింపు జరిగేదా? 201 మైనార్టీ గురుకులాల ఏర్పాటు చేసేవారా? ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌తోపాటు ఏటా రూ.650 కోట్లు ముస్లింల విద్య కోసం ఖర్చు పెట్టేవారా? కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. భైంసా ప్రశాంతంగా ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉంటే మతఘర్షణలు జరుగుతాయి. మత సామరస్యం దెబ్బతీంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కల్ల. మతప్రాతిపదిక రిజర్వేషన్ కాదు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న 4 శాతం రిజర్వేషన్లు మత ప్రాతిపదికన చేసినవి కావు. ముస్లిం సామాజిక వర్గంలో ఆర్థికంగా, విద్యాపరంగా వెనకబడిన వారికి మాత్రమే అమలు చేస్తున్నారు. అదీ పీఎస్ కృష్ణన్, మండల్ కమిషన్ రిపోర్టు ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశాలతో రిజర్వేషన్ అమలవుతోంటే బీజేపీకి వచ్చిన ఇబ్బందేంటి? తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి మోదీ ప్రభుత్వానికి పంపితే మంజూరు చేయలేదు. బీజేపీ ఇప్పుడు దీన్ని రద్దు చేస్తామని చెబుతోంది. పాఠ్యపుస్తకాల్లో గాం«దీని అవమానపర్చి.. గాంధీని చంపిన గాడ్సే గురించి చదివిస్తున్నారు. -
తెలంగాణలో కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం: ఒవైసీ
-
కాంగ్రెస్ వల్లే బీజేపీ గెలుస్తోంది: ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వల్లే కేంద్రంలో బీజేపీ గెలుస్తూ వస్తోందని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఆయన మీడియాతో ముఖాముఖి నిర్వహించారు. ‘‘కాంగ్రెస్ వల్లే బీజేపీ కేంద్రంలో గెలుస్తోంది. కానీ, బీజేపీ విజయానికి నన్ను బాధ్యుడిగా కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. బీజేపీ విజయానిని నేను ఎలా బాధ్యుడ్ని అవుతాను. పైగా సోషల్ మీడియాలోనూ కాంగ్రెస్ నాపై దుష్ప్రచారం చేస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రాజకీయ జీవితం ఆరెస్సెస్‌తోనే మొదలైంది. గాంధీభవన్ రిమోట్ ఇప్పుడు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేతిలో ఉంది అని ఒవైసీ ఎద్దేవా చేశారు. ఏదిఏమైనా సరే బీజేపీతో తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారాయన. బీఆర్ఎస్కు బహిరంగ మద్దతు ప్రకటించిన ఎంఐఎం.. హైదరాబాద్‌లో పలు నియోజకవర్గాల్లో తమ అభ్యర్థుల్ని నిలిపింది. ‘‘ ఈ ఎన్నికల్లో మా సత్తా చాటుతాం. మా స్థానాల్ని మేం తిరిగి కైవసం చేసుకుంటాం. జూబ్లీహిల్స్‌లో ఈసారి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాం’’ అని అన్నారాయన. -
కేసీఆర్ మామకు మద్దతిద్దాం
వికారాబాద్: ఎట్టి పరిస్థితిల్లోనూ సంకీర్ణ సర్కారు రానివ్వం.. ఈ ఎన్నికల్లో కేసీఆర్ మామకు మద్దతిద్దాం.. ఆర్ఎస్ఎస్ అన్న రేవంత్‌రెడ్డిని ఇంట్లో కూర్చోబెడదామని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. మంగళవారం వికారాబాద్‌లోని చిగుళ్లపల్లి గ్రౌండ్లో జరిగిన ముస్లింల సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్‌గాందీ, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రేవంత్ మూలాలు ఆర్ఎస్ఎస్లోనే ఉన్నాయని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆదేశాలతోనే రేవంత్ ముందుగా టీడీపీలోకి ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్లారని ఆరోపించారు. అందుకే అతన్ని కొడంగల్ ఇంటికే పరిమితం చేయాలని పిలుపునిచ్చారు. 2004, 2009 ఎన్నికల్లో గోషామహల్లో తమ సపోర్టు వల్లే కాంగ్రెస్ గెలిచిందన్నారు. అప్పట్లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డితో తమకున్న సత్సంబంధాల వల్లే సపోర్టు చేశామని ఓవైసీ తెలిపారు. బీజేపీకి లాభం జరగకూడదనేదే తమ ప్రధాన ఉద్దేశమనీ, తమ అంతిమ లక్ష్యం ఆర్ఎస్ఎస్ను నిలువరించడమేనని స్పష్టం చేశారు. గోషామహల్లో బీజేపీ గెలుపునకు దోహదం చేస్తోంది కాంగ్రెస్సేనని ఆరోపించారు. తాను బీజేపీ, కేసీఆర్ ఇచ్చే డబ్బులకు అమ్ముడు పోయానని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు, విమర్శలను తిప్పికొట్టారు. నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని మీరే జైలుకు పంపారని కాంగ్రెస్ నేతలనుద్దేశించి విమర్శించారు. వారి కోరిక మేరకే.. అప్పట్లో తాను జైలుకు వెళ్లి జగన్‌తో రాయబారం చేశానని, ఆయన మీతో కలిసేందుకు ఒప్పుకోలేదని వివరించారు. ఆ రోజు మీరు నాకెన్ని డబ్బులు ఇచ్చారని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. సిద్ధాంత పరంగా కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని ఆరోపించారు. పాతబస్తీ ఏమైనా బండి జాగీరా తెలంగాణలో ఆర్ఎస్ఎస్ గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఓవైసీ ఆరోపించారు. అది ఎప్పటికీ జరగనివ్వమని స్పష్టం చేశారు. కర్ణాటకలో బుర్ఖా వేసుకుని పోటీ పరీక్షలకు హాజరుకావద్దని ఆర్డర్ ఇచ్చారని, అలాంటి పరిస్థితి తెలంగాణలో ఉందా అని ఆయన ప్రశ్నించారు. మైనార్టీల సంక్షేమానికి బీఆర్ఎస్ కట్టుబడి ఉందనీ, అందుకే ముస్లింలు కేసీఆర్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పాతబస్తీలో సర్జికల్ స్టైక్ చేయిస్తాం అంటాడు.. పాత బస్తీ ఏమైనా నీ జాగీరా? అని ప్రశ్నించారు. జిల్లాలోని నాలుగు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ముస్లిం మైనార్టీలను కోరారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు అబ్దుల్ ఆది, హఫీజ్, మీర్‌మహేమూద్, రఫీ, తాహెర్‌అలీ, ఉస్మాన్, మోయిజ్, ఇబ్రహీ, షరీఫ్, అలీమొద్దీన్ పాల్గొన్నారు. -
రేవంత్ రెడ్డి RSS నుంచి వచ్చిన వ్యక్తి : ఒవైసీ
-
ఓవైసీకి రేవంత్ రెడ్డి సవాల్..!
-
భాంజా ఒవైసీ.. మూము కేసీఆర్!
మేరే భారే మే జల్దీ మాముకు బోల్ దేరేం.. కుచ్ బీ నహీ హువా తోబీ మాముకు బోల్ రేం..(నేను ఏది చేసినా.. ఏది చేయకపోయినా.. కొంత మంది వెంటనే మామకు చెప్పేస్తున్నారు) అంటూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అంటున్నారు. ఆయన అంటున్నట్లుగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం సీఎం కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసీలను మామా అల్లుళ్లు అంటూ సంబోధిస్తున్నారు. నాంపల్లి బహిరంగ సభలో రాజేంద్ర నగర్ అభ్యర్థిని ప్రకటించిన అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. అబ్ దేఖో మాముకు బీ గుస్సా ఆతా (మామకు కూడా కోపం వస్తుంది) అంటూ నవ్వుతూ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి.. ఇక మలక్‌పేట్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న మాజీ కార్పొరేటర్ ముజఫర్ విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణలోని ముస్లింలందరినీ భాంజా ఒవైసీ (అల్లుడు.. ఒవైసీ) మూము (కేసీఆర్)కు దేదియే క్యా అంటూ మామా అల్లుళ్ల బంధాన్ని వివరించారు. – చార్మినార్ -
తెలంగాణ ఎన్నికల్లో MIM సత్తా ఏంటో చూపిస్తాం
-
రాహుల్.. మా బలం నీకు తెలియదు: ఒవైసీ
సాక్షి, సంగారెడ్డి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. డబ్బులు తీసుకుని బీజేపీ కోసం పని చేస్తున్నారంటూ రాహుల్ చేసిన ఆరోపణలపై ఒవైసీ తీవ్రస్తాయిలో ధ్వజమెత్తారు. కేవలం మతపరమైన విద్వేషం కారణంగానే రాహుల్ గాంధీ తనపై అలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఒవైసీ అంటున్నారు. గురువారం సాయంత్రం సంగారెడ్డిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఒవైసీ, రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై స్పందించారు. ‘కర్ణాటక ఎన్నికల సమయంలో ఢిల్లీలోని నా ఇంటికి రాహుల్ ఒకరిని పంపారు. ఆ రహస్యం ఏంటో చెప్పమంటారా?.. నేనూ మీ గురించి చాలా చెప్పగలుగుతా’ అంటూ రాహుల్‌ను ఉద్దేశించి ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘అమేథీలో ఓడిపోవడానికి బీజేపీ దగ్గరి నుంచి ఎంత తీసుకున్నారు. మీ స్నేహితులు సింధియా, జితిన్ ప్రసాదలు బీజేపీలో చేరారు. కానీ, వాళ్లెవరిపైనా డబ్బులు తీసుకున్నారంటూ ఆరోపణలు మీరు చెయ్యరు. ఎందుకంటే.. మీకు(రాహుల్) మేమంటే ద్వేషం’’ అని ఒవైసీ ప్రసంగించారు. కావాలనే రాహుల్ నాపై ఆరోపణలు చేస్తున్నారు. నా పేరు అసదుద్దీన్ కాబట్టే రాహుల్ ఈ ఆరోపణలు చేశారు. నెత్తిన టోపీ, గడ్డం ఉంది కాబట్టే ఈ ఆరోపణలు చేశారు. కానీ, రాహుల్‌కు మా బలమేంటో తెలియదు. మా బలమేంటో గుర్తించే ఇందిరా గాంధీకి దారుస్సలాంకు వచ్చారు. రాహుల్.. ఈ గడ్డం టోపీదారులే రాహుల్‌కు త్వరలో బుద్ది చెప్తారు అని ఒవైసీ వ్యాఖ్యానించారు. ‘‘మీ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో పట్టుబడితే.. మీరు ఎందుకు నోరు మెదపరు. ఎంపీప్రభాకర్‌పై మీ కార్యకర్త దాడి చేస్తే ఎందుకు ప్రశ్నించలేదు?. దమ్ముంటే నాపై బరిలోకి దిగు.. తాడోపేడో తేల్చుకుందాం అని రాహుల్‌కు ఒవైసీ సవాల్ విసిరారు. తెలంగాణ పర్యటనలో భాగంగా.. బుధవారం ఓ ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. ‘‘పలు రాష్ట్రాల్లో బీజేపీ నుంచి డబ్బు తీసుకుని.. కాంగ్రెస్‌పై అభ్యర్థులను నిలబెడుతోంద’’ని ఎంఐఎంపై ఆరోపణలు చేశారు. -
మజ్లిస్ సిట్టింగ్ ఎమ్మెల్యేకు నో ఛాన్స్!
హైదరాబాద్: చార్మినార్ నియోజకవర్గం నుంచి ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థుల పేర్లు ఖరారు కాగా.. మజ్లిస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లు ఇంకా ఖరారు కాలేదు. ఈసారి చార్మినార్ సిట్టింగ్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌కు టికెట్ లభించదని ప్రచారాలు జరగుతుండడంతో.. ముంతాజ్ అహ్మద్ ఖాన్ కాకుండా మరెవరికి టికెట్ కేటాహిస్తారోనని చార్మినార్నియోజకవర్గం మజ్లిస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఈసారి ముంతాజ్ అహ్మద్ ఖాన్‌కు పార్టీ టికెట్ లభించకపోతే.. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకుని మరీ పోటీ చేయించడానికి ఆయన కుమారులు పట్టుబడుతున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చారి్మనార్, యాకుత్‌పురా నుంచి కొత్త వారికి అవకాశం కల్పించనున్నట్లు గతంలోనే చెప్పారని.. దీంతో ముంతాజ్ అహ్మద్ ఖాన్‌తో పాటు సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీలకు ఈసారి టికెట్లు లభించవని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చివరి నిమిషం వరకు వేచి ఉండి.. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు యాకుత్‌పురా సిట్టింగ్ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ నిశబ్దంగా ఉన్నప్పటికీ.. ముంతాజ్ అహ్మద్ ఖాన్ మాత్రం తనకు టికెట్ ఇవ్వకపోతే.. తన తనయునికి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. చివరి నిమిషం వరకు వేచి ఉండి.. ఇక టికెట్ రాదని తెలిస్తే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీలోకి పార్టీ మారడం తప్పా.. ఆయన వద్ద మరో మార్గం లేదంటున్నారు. ముంతాజ్ అహ్మద్ ఖాన్ పార్టీ మారడానికి సిద్ధంగా ఉంటే.. తమ పార్టీలోకి ఆహా్వనించి చార్మినార్ నుంచి టికెట్ ఇచ్చి ఎన్నికల బరిలో దింపడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సిద్ధంగా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికే టీటీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న అలీ మస్కతిని చార్మినార్ నియోజకవర్గం నుంచి పోటీలోకి దింపుతున్నట్లు రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ప్రకటించినప్పటికీ.. ఇప్పటికే రెండు దఫాలుగా విడుదలైన అధికారిక లిస్టులలో ఎక్కడా అలీ మస్కతి పేరు లేకపోవడంతో ముంతాజ్‌ఖాన్ కోసం ఈ సీటు రిజర్వ్ పెట్టినట్లు పాతబస్తీలో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ చార్మినార్ నుంచి ముంతాజ్ ఖాన్‌కు టికెట్ లభిస్తే.. అలీ మస్కతిని హైదరాబాద్ పార్లమెంట్‌కు పోటీ చేయించే యోచనలో పార్టీ ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే ఇంత వరకు అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పార్టీ చార్మినార్ అభ్యరి్థని ప్రకటించడం లేదని అంటున్నారు. ఈసారి మజ్లిస్ పార్టీకి దీటుగా.. కాంగ్రెస్ చార్మినార్ నుంచి మజ్లిస్ పార్టీకి దీటుగా తమ అభ్యర్థని ఎన్నికల బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. 2009, 2014, 2018 ఎన్నికల్లో మజ్లిస్ పార్టీతో మజ్లిసేతర పార్టీలు హోరాహోరి ఎన్నికల పోరాటం చేసినప్పటికీ.. అంతిమ విజయం మజ్లిస్ పార్టీకే దక్కింది. మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఈసారి పాతబస్తీలో కూడా ఊహించని రాజకీయ పరిణాలు ఎదురవుతాయని రాజకీయ పరిశీలకు భావిస్తున్నారు. మజ్లిస్ పార్టీలో సిట్టింగ్‌లకు టికెట్లు లభించకపోతే.. పాతబస్తీ రాజకీయ ముఖ చిత్రం మారుతుందని అంటున్నారు. ముంతాజ్ అహ్మద్ ఖాన్ రాజకీయ అరంగేటం బజ్లిస్ బజావ్ తెహ్రీఖ్(ఎంబీటీ)తో మొదలైంది. ఎంబీటీ పార్టీ టికెట్‌పై యాకుత్‌పురా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనంతరం పార్టీ ఫిరాయించి మజ్లిస్ పారీ్టలో చేరారు. అప్పటి నుంచి పోటీ చేసిన ప్రతి ఎన్నికలో విజయం సాధించారు. ప్రస్తుతం చారి్మనార్ నియోజకవర్గం నుంచి మజ్లిస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ముంతాజ్ అహ్మద్ ఖాన్ పార్టీ మారే ప్రసక్తే ఉండదని.. ఇవన్నీ రాజకీయ ఊహాగానాలేనని దారుస్సలాం నాయకులు అంటున్నారు. -
నేను అప్పుడే చెప్పినా..పట్టించుకోలేదు: అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ వైరల్
సాక్షి, హైదరాబాద్: గూఢచర్య ఆరోపణలతో భారత నేవీకి చెందిన ఎనిమిది మాజీ అధికారులకు ఖతార్ కోర్టు మరణ శిక్ష విధించడంపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మాజీ నావికాదళ అధికారులు ఇపుడు మరణం అంచున ఉండటం దురదృష్టకరమంటూ ఆయన ట్వీట్ చేశారు. (భారత నేవీ మాజీ అధికారులకు ఖతార్‌లో మరణశిక్ష!) ఖతార్‌లో చిక్కుకున్న నావికాదళ మాజీ అధికారుల సమస్యను ఆగస్టులో పార్లమెంట్లో లేవనెత్తినట్లు ఒవైసీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. ఇస్లామిక్ దేశాలు తనను ఎంతగా ప్రేమిస్తున్నాయని గొప్పగా చెప్పుకునే ప్రధాని మోదీ మరణశిక్షను ఎదుర్కొంటున్న మన మాజీ నావికాదళ అధికారులను వెంటనే వెనక్కి తీసుకురావాలని ఒవైసీ డిమాండ్ చేశారు. కాగా ఇజ్రాయెల్‌కు గూఢచారులుగా పనిచేస్తున్నారనే అనుమానంతో ఎనిమిది మంది భారత నేవీ మాజీ అధికారులకు ఖతార్ కోర్టు మరణ శిక్ష విధించడం తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఆగస్టులోఘీ ఎనిమిది మంది అధికారులను ఖతార్అదుపులోకి తీసుకుంది. వీరికి ఖతార్ కోర్టు గురువారం మరణశిక్ష విధించింది. ఈ తీర్పుపై భారత ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సాధ్యమయ్యే అన్ని చట్టపరమైన చర్యలను అన్వేషిస్తున్నట్లు ప్రకటించింది. In August, I had raised the issue of our ex-naval officers stuck in #Qatar. Today they have been sentenced to death. @narendramodi has boasted about how much “Islamic countries” love him. He must bring our ex-naval officers back. It’s very unfortunate that they face the death row pic.twitter.com/qvmIff9Tbk — Asaduddin Owaisi (@asadowaisi) October 26, 2023 -
మేనిఫెస్టో లేని మజ్లిస్
ప్రతి రాజకీయ పార్టీకి ఎన్నికల మేనిఫెస్టో కీలకమైనది. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో చెబుతూ.. ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించడం ఆనవాయితీ. దాన్ని బట్టే ఆ పార్టీ గెలుపుపోటములు కూడా ఆధారపడి ఉంటాయి. స్వతంత్రులు సైతం తమను గెలిస్తే చేసే పనులను ప్రకటించి ఓట్లను అభ్యర్థిస్తారు. కానీ, అసలు మేనిఫెస్టో లేకుండా ఎన్నికల బరిలో దిగే ఏకైక రాజకీయ పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్– ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం). సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నా, వరసగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఏఐఎంఐఎం మాత్రం ఎన్నడూ మేనిఫెస్టో విడుదల చేయలేదు. ఎన్నికల మేనిఫెస్టోతో సంబంధం లేకుండా.. ఓటర్లకు జవాబుదారీగా ఉండేందుకు ఏం చేశారో, ఏం చేస్తారో చెప్పకుండానే ఓటర్లను ఆకర్షిస్తోంది. ఆరున్నర దశాబ్ధాలుగా ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ మేనిఫెస్టో పత్రాన్ని విడుదల చేయలేదు. తాజాగా కూడా తెలంగాణ, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం మేనిఫెస్టో లేకుండానే బరిలో దిగుతోంది. ప్రాంతీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తింపు ఉన్న ఏఐఎంఐఎం మిగతా రాజకీయ పక్షాలకు భిన్నంగా మేనిఫెస్టో విడుదల చేయని పార్టీగా రికార్డుకెక్కింది. పాతబస్తీ నుంచి దేశస్థాయికి ‘‘మా పనితీరు.. మా గుర్తింపు’’ అనే నినాదంతో ఎన్నికల క్షేత్రంలో దిగే ఎంఐఎం హైదరాబాద్ పాతబస్తీ నుంచి జాతీయ స్థాయికి పార్టీని విస్తరించింది. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, బిహార్ శాసనసభల్లో సైతం పార్టీ ప్రాతినిధ్యం కలిగి ఉంది. అదేవిధంగా కర్ణాటక, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలో స్థానిక స్థంస్థల్లో ప్రాతినిధ్యం వహిస్తోంది. పార్లమెంటులోనూ హైదరాబాద్ నుంచి అసదుద్దీన్ ఒవైసీ, ఔరంగాబాద్ నుంచి ఇంతీయాజ్ జలీల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారంలో ఆరు రోజులు... ఏఐఎంఐఎం పార్టీ ప్రధాన కార్యాలయమైన దారుస్సలాంలో వారంలో ఆరు రోజుల పాటు ప్రతి రోజూ ప్రజా గ్రీవెన్స్ కొనసాగుతుంది. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీల వరకు అందుబాటులో ఉంటారు. వివిధ పనులపై వచ్చే ప్రజలు నేరుగా కార్పొరేటర్నో, ఎమ్మెల్యేనో, ఎంపీనో కలిసి తమ సమస్యలు చెప్పుకొనే అవకాశం ఇక్కడ ఉంటుంది. ముస్లిం సామాజిక వర్గం కంటే హిందుసామాజిక వర్గం తాకిడి దారుస్సలాంకు అధికంగా ఉండటం విశేషం. అయితే ఇక్కడ అంతా క్యూ పాటించాల్సిందే. పాతబస్తీలో కింగ్ మేకర్ హైదరాబాద్ రాజకీయాలలో మజ్లిస్ కింగ్ మేకర్ పాత్రను పోషిస్తోంది. హైదరాబాద్ పాతనగరం రాజకీయ పరిస్థితికి కొత్త నగరం భిన్నంగా ఉంటుంది. హిందూ, ముస్లిం ఎజెండాలతో ఇక్కడ మజ్లిస్, బీజేపీ రాజకీయంగా తలపడుతున్నా.. ఫలితం మాత్రం వన్‌సైడ్‌గా ఉంటోంది. ఇదీ చరిత్ర 96 ఏళ్ల కిందట నిజాం పాలనలోని హైదరాబాద్ స్టేట్‌లో 1927లో ‘మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్’గా ఆవిర్భవించిన ధార్మిక సంస్ధ క్రమంగా ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్’ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. 1948లో హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్‌లో చేరిన తర్వాత ఈ సంస్థ నిషేధానికి గురైంది. అసదుద్దీన్ ఒవైసీ తాత అప్పటి ప్రసిద్ధ న్యాయవాది మౌలానా అబ్దుల్ వాహిద్ ఒవైసీ 1958లో రాజ్యాంగంలో పొందుపరిచిన మైనారిటీల హక్కుల కోసం పోరాడేందుకు ఆ సంస్థనే రాజకీయ పార్టీగా మార్చారు. 1959లోనే హైదరాబాద్‌లో జరిగిన రెండు మున్సిపల్ ఉప ఎన్నికల్లో పార్టీ విజయం సాధించింది. 1960లో హైదరాబాద్ బల్డియాలో ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. వరసగా అబ్దుల్ వాహెద్ ఒవైసీ కుమారుడు సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ, ఆ తర్వాత ఆయన కుమారుడు అసదుద్దీన్ ఒవైసీ పార్టీ పగ్గాలు చేపట్టి ముస్లిం మైనారిటీ గొంతుకగా బలమైన రాజకీయ శక్తిగా మార్చుతూ వచ్చారు. మభ్యపెట్టడానికే మేనిఫెస్టో ఎన్నికల్లో ప్రజలను మభ్య పెట్టడానికి మేనిఫెస్టో ఒక ప్రచారసాధనం. ఓట్లు రాబట్టుకునేందుకు ఒక ఆయుధం. అందుకే మేం ఎన్నడూ ఆ ఊసెత్తం. హామీలు ఇవ్వం. పని చేసి గుర్తింపు తెచ్చుకుంటాం. ప్రజల మధ్యనే ఉంటాం. ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. ఇలాంటప్పుడు ఇక మేనిఫెస్టో అవసరం ఏముంది. అమలు కాని హామీలిచ్చి ప్రజలకు అందుబాటులో లేకుండా తిరగడం మజ్లిస్ పార్టీ పద్ధతి కాదు. – అసదుద్దీన్ ఒవైసీ ,అధినేత, ఏఐఎంఐఎం - మహమ్మద్ హమీద్ ఖాన్ -
కేసీఆర్‌కు మా సంపూర్ణ మద్దతు: ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికలపై ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌కు తమ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారాయన. ‘‘పేదల కోసం కేసీఆర్ చాలా పథకాలు తీసుకొచ్చారు.కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టో అద్భుతంగా ఉంది. కేసీఆర్ తెలంగాణకు హ్యాట్రిక్ సీఎం అవుతారు’’ అని ఒవైసీ అన్నారు. మజ్లిస్ పార్టీ అధినేత ఇంతకు ముందు కూడా కేసీఆర్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. వారం కిందట హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి, సుఖశాంతుల కోసం మూడోసారి కేసీఆర్‌ను గెలిపించాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందేనని విమర్శించారు. అయితే తెలంగాణతో పాటు రాజస్థాన్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని ఆ సందర్భంలో ఆయన ప్రకటించారు. -
ఇజ్రాయెల్ వార్‌పై ఒవైసీ రియాక్షన్.. ఆయనో డెవిల్ అంటూ..
సాక్షి, హైదరాబాద్: ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఇజ్రాయెల్-హమాస్ దాడుల కారణంగా ఇప్పటికే వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఇలాంటి తరుణంలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఇజ్రాయెల్ వార్‌పై ఘాటుగా స్పందించారు. తన మద్దతు పాలస్తీనాకు ఉంటుందని ఒవైసీ స్పష్టం చేశారు. కాగా, ఒవైసీ శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఒవైసీ మాట్లాడుతూ.. తాను పాలస్తీనా వైపే ఉంటానని తేల్చి చెప్పారు. గాజాలో ఇప్పటికీ పోరాడుతున్న వారికి లక్షలాదిమంది సెల్యూట్ చేస్తున్నారని అన్నారు. గాజాకు విద్యుత్, తాగునీటి సరఫరాను నిలిపివేయడంతో లక్షల మంది పౌరులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 21 లక్షల జనాభా ఉన్న గాజాలో 10 లక్షల మంది పేద ప్రజలు నిరాశ్రయులయ్యారు. అయినా కూడా ప్రపంచం మౌనంగా ఉంది. 70 ఏళ్లుగా పాలస్తీనాలో ఇజ్రాయెల్ ఆక్రమణదారుగా ఉంది. అక్కడ దారుణాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. #WATCH | Hyderabad: On the Israel-Palestine conflict, AIMIM chief Asaduddin Owaisi says, "The poor people of Gaza, with a population of 21 lakh, 10 lakh have been rendered homeless...The world is silent...For 70 years Israel has been an occupier...You cannot see the occupation,… pic.twitter.com/9riNvVEOV1 — ANI (@ANI) October 15, 2023 ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహును దుష్టశక్తిగా(డెవిల్) అభివర్ణించారు. ఆయన క్రూరుడని, యుద్ధ నేరగాడని మండిపడ్డారు. పాలస్తీనా పేరెత్తితే కేసులు పెడతామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరిండంపై ఒవైసీ ఘాటు విమర్శలు చేశారు. మన త్రివర్ణ పతాకంతోపాటు తాను పాలస్తీనా జెండాను కూడా గర్వంగా ధరిస్తానని పేర్కొన్నారు. తాను పాలస్తీనా పక్షానే ఉంటానని తేల్చి చెప్పారు. పాలస్తీనియన్లపై జరుగుతున్న అకృత్యాలను ఆపాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేయాలని అనుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ విషయమై ప్రధాని మోదీ మానవత్వంతో స్పందించాలని కోరారు. పాలస్తీనా కేవలం ముస్లింలకు సంబంధించిన విషయం కాదని, ఇది మానవతా సమస్య అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. పాలస్తీనాకు ఇప్పటికే కాంగ్రెస్ తన మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా ఇరు దేశాల మధ్య వెంటనే కాల్పుల విరమణ పాటించాలని నిన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పిలుపునిచ్చింది. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. లిస్ట్ ఇదే.. -
మరోసారి కేసీఆరే ముఖ్యమంత్రి: అసదుద్దీన్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సారి తెలంగాణ సీఎం అవుతారని మజ్లిస్ అధి నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జోస్యం చెప్పారు. సోమవారం హైదరాబాద్ దారు స్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడుతే తెలంగాణ అభివృద్ధి, సుఖశాంతుల కోసం మూడోసారి కేసీఆర్‌ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందేనని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని, తెలంగాణతోపాటు మొదటిసారిగా రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని అసదుద్దీన్ ప్రకటించారు. రాజస్తాన్‌కు సంబంధించి ఇప్పటికే ముగ్గురు అభ్యర్ధులను ప్రకటించామని, త్వరలో తెలంగాణ అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. తాము నిరంతరం ప్రజల మధ్యలో ఉంటామని, పోటీచేసే ప్రతి చోటా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. -
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై అసదుద్దీన్ ఓవైసీ కీలక ప్రకటన
-
రేవంత్ సినిమా మొత్తం మా దగ్గరుంది.. ఒవైసీ షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది. ఈ నేపథంలో పొలిటికల్ నేతల మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరుకుంటోంది. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా అసదుద్దీన్ ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ.. టీపీసీసీ చీఫ్ రేవంత్ సినిమా మా దగ్గర ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు పని అయిపోగానే కాంగ్రెస్ గూటికి వచ్చి చేరారు. రేవంత్ రెడ్డి జీవితమంతా బీజేపీ, ఆరెస్సెస్‌తోనే ముడిపడి వుందన్నారు. దశాబ్థాల పాటు రేవంత్ రెడ్డి.. కిషన్ రెడ్డితోనే కలిసి తిరిగారని ఒవైసీ ఆరోపించారు. ఒవైసీ కుటుంబం మహారాష్ట్ర నుంచి వచ్చిందని రేవంత్ అంటున్నారని.. కానీ తన తాత ముత్తాతలు హిందుస్తాన్లోనే పుట్టారని స్పష్టం చేశారు. నా పూర్వీకులు ఇక్కడ పుడితే నా దేశం ఇదే అనే హక్కు తనకు లేదా అని ఒవైసీ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అసలు ఎక్కడి నుంచి వచ్చారని ఆయన నిలదీశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న మాటలు ఆరెస్సెస్ నాలుక నుంచి వచ్చినవని అసదుద్దీన్ దుయ్యబట్టారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్ రెడ్డితో కలిసి రేవంత్ రెడ్డి పనిచేయడాన్ని తాను చూశానని ఒవైసీ ఆరోపించారు. ఆయన ముందు ఏబీవీపీలో అటు నుంచి ఆరెస్సెస్ అక్కడి నుంచి బీజేపీలోకి వెళ్లినట్టు ఒవైసీ ఆరోపించారు. ఆరెస్సెస్ వాళ్లు చంద్రబాబు వద్దకు వెళ్లమంటే అక్కడికి వెళ్లినట్టు తెలిపారు. ఆయన పని అయిపోగానే కాంగ్రెస్‌లోకి వెళ్లాడని హాట్ కామెంట్స్ చేశారు. ఆరెస్సెస్‌తో సంబంధం లేదని చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రమాణం చేస్తావా అని ఒవైసీ సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎక్కడ పుట్టారో చెప్పాలని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: అమిత్ షా జోక్యంతో లైన్ క్లియర్.. బీజేపీలో చేరిన చీకోటి ప్రవీణ్ -
కేసీఆర్‌ను గెలిపించడానికే మోదీ పర్యటనలు.. బాంబు పేల్చిన రేవంత్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీల ఫెలికాల్ బంధాన్ని గురించి నిజామాబాద్ సాక్షిగా ప్రధాని మోదీ బయటపెట్టారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడమే బీఆర్ఎస్, బీజేపీ లక్ష్యమని రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, రేవంత్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అంటే బీజేపీ రిస్తేదార్ సమితి అని మా నాయకుడు రాహుల్ గాంధీ ముందే చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి కేసీఆర్‌ను గెలిపించేందుకే మోదీ తెలంగాణలో పర్యటనలు చేస్తున్నారు. పదేళ్లలో విభజన హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చే ప్రయత్నం చేయలేదు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మోదీ అపహాస్యం చేశారు. మోదీనే ఒప్పుకున్నారు.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను అరెస్టు చేయొద్దని కేసీఆర్ అడిగిన విషయాన్ని కూడా మోదీ చెప్పాల్సింది. బీఆర్ఎస్ అదేశాలతోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చారు. కేసీఆర్ అవినీతిపై ఎందుకు ఈడీ, సీబీఐ, ఐటీ విచారణ చేయడం లేదు. సీఎం కేసీఆర్ అవినీతి చేశారని ఆరోపణలు చేసినప్పుడు మోదీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ దోపిడీలో బీజేపీకి వాటాలు వెళుతున్నాయి. అందుకే కేసీఆర్‌పై మోదీ చర్యలు తీసుకోవడం లేదు. ఈ నిజాన్ని నిన్న నిజామాబాద్ సాక్షిగా మోదీ ఒప్పుకున్నారు. బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడంపై ఎంఐఎం పునరాలోచించుకోవాలి. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే.. అవిభక్త కవలలు. మోదీ, కేసీఆర్‌ది ఫెవికాల్ బంధం. వారిది గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ. అలాంటి వారికి అసదుద్దీన్ ఎలా మద్దతు ఇస్తారు. ఎంఐఎం ఎవరివైపు నిలబడుతుంది?. బీజేపీతో దోస్తీ కడుతున్న బీఆర్ఎస్తోనా?. బీజేపీ, బీఆర్ఎస్ను ఓడించాలంటున్న కాంగ్రెస్ తోనా?. ఇదంతా నాణేనికి ఒకవైపే.. కేసీఆర్‌కు నీళ్లు అంటే.. కవిత కన్నీళ్లు గుర్తొస్తాయి. నిధులు అంటే దోపిడీ సొమ్ము.. నియామకాలు అంటే కొడుకును సీఎం చేయడం గుర్తొస్తాయి. కేసీఆర్ కొల్లగొట్టిన సొమ్ములతోనే మోదీని ఆయన దర్బారులో సన్మానం చేశారు. ఇదంతా కనిపించే ఒకవైపు మాత్రమే. మరి ఎన్నికల కోసం పంపిన కనిపించని వేల కోట్ల సంగతి ఏంటి?. బీఆర్ఎస్ దోపిడీపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. కేసీఆర్ అధిష్టానం నరేంద్ర మోదీ అని స్పష్టత వచ్చింది. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉంటుందని ఆ పార్టీ ఎంపీలే నాకు చెప్పారు. 9 బీఆర్ఎస్, 7 బీజేపీకి, 1 ఎంఐఎంకు అని పంపకాలు చేసుకున్నారు. బండారం బయటపడిందనే కాంగ్రెస్‌పై బీజేపీ, బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నాయి. వాళ్లిద్దరూ కాంగ్రెస్‌ను ఉమ్మడి శత్రువుగా భావిస్తున్నారు. మోదీ చెప్పింది నిజమో కాదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. ఇది కూడా చదవండి: ‘బీఆర్ఎస్ మేనిఫెస్టో.. శుభవార్తకు రెడీగా ఉండండి’ -
చంద్రబాబును నమ్మొద్దు: ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంపై మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. చంద్రబాబు జైలుకు ఎందుకు వెళ్లారో అందరికీ తెలుసని ఒవైసీ అన్నారు. ‘‘ఏపీలో చంద్రబాబు హ్యాపీగా జైల్లో ఉన్నారు. చంద్రబాబు జైలుకు ఎందుకు వెళ్లారో అందరికీ తెలుసు. చంద్రబాబును నమ్మలేం.. ప్రజలు కూడా నమ్మొద్దు’’ అని ఒవైసీ అన్నారు. ఇక ఏపీలో సీఎం జగన్ పాలన బాగుందని కితాబిచ్చారు ఒవైసీ. -
ఏపీలో సీఎం జగన్ పాలన బాగుంది: అసదుద్దీన్ ఓవైసీ
-
ఒవైసీకి దమ్ముంటే నాపై పోటీ చేయాలి: రాజాసింగ్
సాక్షి, అబిడ్స్ (హైదరాబాద్): మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దమ్ముంటే గో షామహల్ నియోజకవర్గంలో తనపై పోటీ చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాలు విసిరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ.. మజ్లిస్ పార్టీని పాముకు పాలుపోసి పెంచినట్లు పోషించిందని ఆరోపించారు. కాంగ్రెస్ బంధుత్వాన్ని ఒవైసీ అప్పుడే మరిచిపోయారని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి ఒవైసీ సవాల్ విసరడం విడ్డూరంగా ఉందన్నారు. అసదుద్దీన్ కానీ ఆయన సోదరుడు అక్బరుద్దీన్ కానీ తనపై పోటీచేస్తే ప్రజలు వారిని చిత్తుగా ఓడిస్తారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో గోషామహల్లో మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సాధిస్తానని రాజాసింగ్ ధీమా వ్యక్తంచేశారు. తాంత్రిక పూజల్లో కేసీఆర్ సిద్ధహస్తుడు కరీంనగర్ టౌన్: ముఖ్యమంత్రి కేసీఆర్ తాంత్రిక పూజల్లో సిద్ధహస్తుడని బీజేపీ జాతీ య ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇతర పార్టీల నేతలనే కా కుండా తన మాట వినని సొంత పార్టీ నాయకులు కూడా నాశనం కావాలని కోరుకుంటూ ఇతర రాష్ట్రాలకు వెళ్లి క్షుద్ర పూజలు చేస్తున్నా రని మండిపడ్డారు. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని సోమ వారం కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయం వద్ద సంజయ్ మొక్క నాటారు. అనంతరం బీజేపీ ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఎన్ని వేషాలేసినా, ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కులాల మధ్య కుమ్ములాటలు పెట్టి గెలవాలని చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచే వాళ్లంతా కేసీఆర్‌కు ఏటీఎం మిషన్ లాంటివాళ్లేనని, ఎప్పుడంటే అప్పుడు వాళ్లను బీఆర్ఎస్లోకి తీసుకోవడం ఖాయమన్నారు. -
దమ్ముంటే హైదరాబాద్ నుంచి పోటీ చేయాలి
సాక్షి, హైదరాబాద్: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దమ్ముం టే హైదరాబాద్ స్థానం నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్‌నేత రాహుల్‌గాందీకి ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సవాల్ విసిరారు. రాహుల్‌గాంధీ పెద్దపెద్ద ప్రకటనలు చేయడం కాదని, బరిలోకి దిగి తనతో తలపడాలని ఒవైసీ సూచించారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ దారుసలాం మైదానంలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బాబ్రీమసీదు కూల్చివేశారని, పునరుద్ధరణ జరగలేదని, అదే తెలంగాణ సచివాలయంలో మసీదు కూలి్చవేసినా, తిరిగి పునరుద్ధరించారని గుర్తు చేశారు. లోక్‌సభలో బీఎస్పీకి చెందిన ఓ ముస్లిం ఎంపీని బీజేపీ ఎంపీ మతపరంగా అవమానపర్చేవిధంగా దూషణలు చేశారని, పార్లమెంటులో ముస్లిం సభ్యుల హత్యలకు పాల్పడేరోజు ఎంతో దూరంలో లేనట్టు కనిపిస్తోందని ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ సబ్‌కాసాత్..సబ్కావికాస్ ఎక్కడ ఉందని, ఆయన ఒక్కమాట కూడా మాట్లాడరని విమర్శించారు. మజ్లిస్ మహిళాబిల్లుకు వ్యతిరేకం కాదని, అందులో వెనుకబడిన తరగతుల మహిళల రిజర్వేషన్ కోసమే వ్యతిరేకించినట్టు స్పష్టం చేశారు. బరిలో లేని స్థానాల్లో బీఆర్ఎస్కు మద్దతు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పోటీ చేయని స్థానాల్లో బీఆర్ఎస్కు సహకరించాలని ఒవైసీ పిలుపునిచ్చారు. మజ్లిస్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే అభ్యర్థులకు ఏ మాత్రం సహకరించొద్దని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణలో అల్లర్లు జరిగాయని, అలాంటి ఘటనలు ప్రస్తుత బీఆర్ఎస్ పాలనలో లేవన్నారు. తెలంగాణలో శాంతిభద్రతలు దెబ్బతీసేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వారికి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. -
దమ్ముంటే హైదరాబాద్ లో పోటీ చేయండి..రాహుల్ గాంధీకి ఓవైసీ సవాల్
-
Owaisi Vs Rahul: బస్తీమే సవాల్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ఓ సమావేశంలో అసుదుద్దీన్ మాట్లాడారు.. ఆయోధ్యలోని బాబ్రీ మసీదు కాంగ్రెస్ హయాంలోనే కూల్చివేశారని ధ్వజమెత్తారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి పోటీచేయాలని మీ నాయకుడిని (రాహుల్‌గాంధీ) చాలెంజ్ చేస్తున్నా. మీరు ఎప్పుడూ భారీ భారీ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. క్షేత్రస్థాయిలో నాతో పోటీకి నిలబడండి. నేను సిద్ధంగా ఉన్నాను. కాంగ్రెస్ నేతలు ఎన్నో చెబుతారు. కానీ వారి హయాంలో బాబ్రీ మసీదు, సెక్రటేరియట్ మసీదు కూల్చివేశారు’ అని ఓవైసీ మండిపడ్డారు. చదవండి: ఆదానీతో కలిసి శరద్ పవార్.. ఇదేం ట్విస్టు..? అదే విధంగా బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి మతపరంగా దూషించిన వ్యాఖ్యలపై ఓవైసీ మాట్లాడుతూ.. పార్లమెంటులో ముస్లింల సామూహిత హత్యలు జరిగే రోజు ఎంతో దూరం లేదన్నారు. సబ్కా సాత్, సబ్కా వికాస్ ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. దీనిపై దేశ ప్రధాని మోదీ ఒక్క మాట కూడా మాట్లాడరని విమర్శించారు. Like they say "Jhukti hai duniya,Jhukane waala chahiye" For every Ramesh you need a Unapologetic Owaisi not cry babies.#ArrestRameshBidhuri | #AsaduddinOwaisi | #AIMIM pic.twitter.com/cDfUKKqiJz — Mister J. - مسٹر جے (@Angryman_J) September 23, 2023 కాగా ఈ ఏడాది చివరల్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇక మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని రాహుల్ వ్యాఖ్యానించిన కొన్ని గంటలకే ఒవైసీ ఈ సవాలు విసరడం విశేషం. అంతకముందు ఈనెలలో తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ..ఎంఐఎంపై విమర్శలు చేశారు. తమను తాము వేర్వేరు పార్టీలుగా చెప్పుకుంటున్నామని, రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఈ మూడు పార్టీలతో పోరాడుతోందని తెలిపారు. అంతేగాక సీఎం కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీలపై సీబీఐ, ఐడీ కేసులు లేవని, ప్రధాని మోదీ వారిని తన సొంత వ్యక్తులుగా బావిస్తున్నారని దుయ్యబట్టారు. వీహెచ్ కౌంటర్ ఒవైసీ రాహుల్ గాంధీకి సవాల్ విసిరిన పరిణామంపై తెలంగాణ సీనియర్ నేత వీహెచ్ స్పందించారు. ఒవైసీకి రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హతే లేదని మండిపడ్డారు. అలాగే బీఆర్ఎస్తో పొత్తు రాజకీయంపైనా వీహెచ్, ఒవైసీని విమర్శించారు. -
మహిళా బిల్లును వ్యతిరేకించిన MIM
-
ఇది యాంటీ బీసీ, యాంటీ ముస్లిం బిల్లు: ఎంపీ అసుదుద్దీన్
న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు ఎంఐఎం నేత, ఎంపీ అసుదుద్దీన్ పేర్కొన్నారు. ఆ బిల్లులో కొన్ని ప్రధాన లోపాలున్నాయని అన్నారు. ‘నారీ శక్తి వందన్ అధినియం’ పేరుతో ప్రవేశపెట్టిన బిల్లులో ముస్లిం, ఓబీసీ వర్గాల మహిళల కోటాను చేర్చలేదని విమర్శించారు. కాగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ కల్పించే బిల్లును మంగళవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై దిగువసభలో బుధవారం చర్చ సాగింది.ఈ సందర్భంగా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లోక్‌సభలో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు యాంటీ బీసీ, యాంటీ ముస్లిం బిల్లు అని విమర్శించారు. బీసీలకు న్యాయమైన వాటాను ఈ బిల్లు నిరాకరించిందన్నారు. కేవలం ధనవంతులే చట్టసభల్లో ఉండేలా ఈ బిల్లు పెట్టారని దుయ్యబట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ, ముస్లిం మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని కోరారు. అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభభాయి పటేల్ రాజ్యాంగ సభలో ముస్లింలపై వివక్ష చూపించారని, వారు నిజాయితీగా ఉంటే ముస్లింలకు మరింత ప్రాతినిధ్యం ఉండేదని ఆరోపించారు. చదవండి: మహిళా రిజర్వేషన్ బిల్లును 15 ఏళ్లకే పరిమితం చేయొద్దు: ఎంపీ సత్యవతి -
కేసీఆర్ నాయకత్వానికి మేం మద్దతిస్తాం: ఓవైసీ
-
చైనా ముందు మోకరిల్లిన మోదీ సర్కారు: అసదుద్దీన్
సాక్షి, హైదరాబాద్: చైనా ముందు మోదీ సర్కార్ మోకరిల్లుతోందని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. లద్దాఖ్ సరిహద్దులో ఏం జరుగుతుందో దేశప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఒవైసీ మాట్లాడుతూ భారత వీర సైనికులు 40 నెలలుగా సరిహద్దులో చైనీయులకు భయపడకుండా నిలబడ్డారన్నారు. మరి మోదీ ఎందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఎదురొడ్డి నిలబడలేకపోతున్నారని ప్రశ్నించారు. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం అవార్డుకు ఎంపిక చేయడం పట్ల అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. -
ఎంపీ ఇంటిపైనే రాళ్ల దాడి జరిగితే సామాన్యుడి పరిస్థితేంటి?
సాక్షి, హైదరాబాద్: నాలుగు పర్యాయాలు ఎంపీ అయిన తన ఇంటిపైనే రాళ్ల దాడి జరిగితే.. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్ దార్సుసలాంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలోని తన ఇంటిపై రాళ్ల దాడి జరగడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఒక వైపు ముస్లింల ఇళ్లపై బుల్డోజర్లు ప్రయోగిస్తూనే, మరోవైపు ఎంపీ ఇంటిపై రాళ్లు రువ్వుతున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్లతో కూల్చివేతలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా రాళ్ల దాడులకు, తాటాకు చప్పుళ్లకు భయపడేదిలేదన్నారు. ఇలాంటి ఘటన బీజేపీ నేత ఇంటిపై జరిగితే స్పందన మరోలా ఉండేదని ఒవైసీ అన్నారు. దేశంలో జరుగుతున్న హింసాకాండపై ప్రధాని మోదీ నోరు మెదపడం లేదని, కనీసం స్వాత్రంత్య్ర దినోత్సవ ప్రసంగంలోనైనా స్పందిస్తారా? కనీసం ఖండిస్తారా? అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ ఎక్కడ ఉంది? అంటూ నిలదీశారు. -
విద్వేష రాజకీయాలు దేశానికి చేటు
సాక్షి, న్యూఢిల్లీ: అధికార బీజేపీ దేశంలో విద్వేషం సృష్టిస్తోందని..ప్రభుత్వం చేస్తున్న రాజకీయాలు దేశానికి చేటు చేస్తాయని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు. చైనా ఓ పక్క దేశాన్ని ఆక్రమిస్తుంటే, కేంద్రం ఏం చేస్తోందని ప్రశ్నించారు. మణిపూర్, హరియాణాలో జరుగుతున్న హింసాకాండకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాధ్యత వహించాలన్నారు. దేశాన్ని ఓ దుకాణదారుడు, ఓ చౌకీదార్ ఏలుతున్నారని, మైనార్టీలపై దాడులు జరుగుతున్నా ఏ ఒక్కరూ నోరు మెదపడం లేదని..ఇది ఇలానే కొనసాగితే దుకాణదారుడి దుకాణం మూతపడుతుందని, చౌకీదార్ మారుతాడని స్పష్టం చేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఒవైసీ మాట్లాడారు. నుహ్ హింస, యూసీసీ, హిజాబ్, మణిపూర్ సహా పలుఅంశాలను ఆయన ప్రస్తావించారు. అక్కడ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు మీ మనస్సాక్షి ఎక్కడికి పోయిందని కేంద్రాన్ని ప్రశ్నించారు. సీఎం సహకరిస్తున్నారు కాబట్టి ఆయన్ను తొలగించడం ఇష్టం లేదని ఎద్దేవా చేశారు. హరియాణాలోని నూహ్‌లో 750 భవనాలను ముస్లింలవి అనే కారణంగానే నిబంధనలు పాటించకుండా కూల్చివేశారని, అవి పూర్తిగా చట్టవిరుద్ధమని, హైకోర్టు పేర్కొందని గుర్తు చేసిన ఒవైసీ, భవనాలు కూలుస్తున్నప్పుడు దేశ మనస్సాక్షి ఎక్కడికి పోయిందన్నారు. క్విట్ ఇండియా నినాదం ముస్లిందే ఇటీవల మీనాసాహబ్ అనే వ్యక్తిని అతను ధరించిన దుస్తులు, గడ్డం చూసి, పేరు అడిగి ఒకరు చంపారు...అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశంలో బతకాలంటే మోదీకి ఓటేయాలన్నారు. ఇది ఛాందస వాదానికి ఉదాహరణ కాదా? అని ఒవైసీ ప్రశ్నించారు. ఇక దేశంలో హిజాబ్‌ను సమస్యగా మార్చి, ముస్లిం బాలికలను చదువుకు దూరంగా ఉంచారని దుయ్యబట్టారు. ‘బిల్కిస్‌బానో ఈ దేశపు పుత్రిక కాదా అని నేను అడుగుతున్నా. బిల్కిస్‌బానోపై 11 మంది అత్యాచారం చేశారు, ఆమె తల్లిపై అత్యాచారం చేసి హత్య చేశారు. మీరు నేరస్తులను విడుదల చేశారు. మీరు మెజారిటీ కోసం పనిచేస్తున్నారు’అని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బీజేపీ నేతలు మాట్లాడితే ‘క్విట్ ఇండియా’అంటున్నారని, అయితే ఈ నినాదం ఒక ముస్లిం ఇచ్చారని తెలిస్తే మాత్రం ఈ మాట చెప్పడం మానేస్తారని ఎద్దేవా చేశారు. మహాత్మాగాంధీ ఆమోదించిన క్విట్ ఇండియా నినాదాన్ని యూసుఫ్ మెహర్ అలీ రూపొందించారని చెప్పారు. పాకిస్తాన్లో ఉన్న కులభూషణ్ జాదవ్‌ను ఎందుకు తీసుకురావడం లేదన్నారు. ‘విశ్వగురు–విశ్వగురు అంటారు కానీ మీరు కులభూషణ్ జాదవ్‌ను మర్చిపోయారు. నేవీ అధికారులు ఖతార్‌లో ఒక సంవత్సరం జైలులో ఉన్నారు, కానీ మీరు వారిని తీసుకురాలేకపోయారు’అని అన్నారు. చైనా ఆక్రమిస్తుంటే ఏం చేస్తున్నారు ఇక చైనా అంశాన్ని ప్రస్తావిస్తూ ‘మీరు చైనా గురించి ఏమీ మాట్లాడరు. 2013లో మోదీ సమస్య ఢిల్లీలో ఉందని, సరిహద్దులో లేదన్నారు. ఈ రోజు చైనా మన భూమిపై కూర్చోలేదా?, ప్రభుత్వం ఏం చేస్తోంది. మోదీ అహ్మదాబాద్‌లో జిన్‌పింగ్‌ను పిలిచి, హత్తుకున్నారు.అతన్ని చెన్నైకి తీసుకెళ్లారు. అయితే ఏం జరిగింది, ఫలితం ఏమిటి?’అని అడిగారు. ఒకదేశం, ఒకేచట్టం అనే యూసీసీ ఫార్ములా ఏంటని ఒవైసీ ప్రశ్నించారు. దేశంలో ఒకే మతం, ఒకే సంస్కృతి, ఒకే భాష అనేది నియంతల ఫార్ములా అని పేర్కొన్నారు. దేశంలో లెక్కలేనన్ని భాషలు, అనేక మతాలు ఉన్నాయని గుర్తు చేశారు. -
గద్దర్ అంతిమ యాత్ర విషాదం.. అశ్రునయనాల మధ్య అలీఖాన్ అంత్యక్రియలు
నాంపల్లి (హైదరాబాద్): సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ అంత్యక్రియలు దారుస్సలాం రోడ్డులోని ఆఖరిత్ మంజిల్‌లో జనసందోహం నడుమ జరిగాయి. సోమవారం గద్దర్ అంతిమ యాత్రలో జరిగిన తొక్కిసలాటలో అస్వస్థతకు గురై, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆయన తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన పార్థివదేహాన్ని సోమవారం రాత్రి ఆసుపత్రి నుంచి లక్డీకాపూల్‌లోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. మంగళవారం ఉదయం 5.30 గంటలకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని మసీదుకు తరలించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పార్థివదేహాన్ని అభిమానులు, బంధువుల సందర్శనార్థం అక్కడే కాసేపు ఉంచారు. అనంతరం దారుస్సలాంలోని ఆఖరిత్ మంజిల్ శ్మశాన వాటికకు తీసుకెళ్లి అశ్రునయనాల నడుమ అంత్యక్రియలు పూర్తి చేశారు. అంతిమ యాత్రకు భారీ స్థాయిలో ఆయన అభిమానులు, జర్నలిస్టులు, రాజకీయ నేతలు, పౌర, విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు, మేధావులు, కవులు, కళాకారులు హాజరయ్యారు. జహీరుద్దీన్ అలీఖాన్ కడచూపు కోసం తరలివచ్చిన వందలాది మందితో దారుస్సలాం రోడ్డు పూర్తిగా కిక్కిరిసిపోయింది. ప్రముఖుల పరామర్శ... లక్డీకాపూల్‌లోని జహీరుద్దీన్ అలీఖాన్ నివాసానికి చేరుకున్న పలువురు ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. పరామర్శించిన వారిలో రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కి, ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, ఎమ్మెల్యే సీతక్క, డీజీపీ అంజనీకుమార్, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ప్రముఖ విద్యావేత్త వేదకుమార్, సీనియర్ జర్నలిస్టులు పల్లె రవికుమార్, విరాహత్ అలీ, షబ్నమ్ హాస్మి, అయూబ్ ఖాన్, మాజీ ఎమ్మెల్సీ అమీన్వుల్లా హసన్ జాఫ్రి ఉన్నారు. అలీఖాన్ కుటుంబ సభ్యులకు డీజీపీ పరామర్శ సాక్షి, హైదరాబాద్: అస్వస్థతకు గురై సోమవారం సా యంత్రం మృతిచెందిన ఉర్దూ దినపత్రిక సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ కుటుంబ సభ్యులను డీజీపీ అంజనీ కుమార్ పరామర్శించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఉదయం లక్డీకాపూల్‌లోని అలీ ఖాన్ నివాసానికి వెళ్లారు. అక్కడ జహీరుద్దీన్ అలీఖాన్ కుటుంబ సభ్యులను డీజీపీ పరామర్శించి ఓదార్చారు. -
జైపూర్ ట్రైన్ కాల్పుల్లో హైదరాబాదీ మృతి.. కేటీఆర్‌కు ఒవైసీ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: జైపూర్ ట్రైన్ కాల్పుల ఘటనలో హైదరాబాదీ మృతి చెందాడు. ఈ విషయాన్ని ప్రకటించిన ఎంఐఎం అధినేత, నగర ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ట్విటర్ ద్వారా మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశాడు. జైపూర్-ముంబై ట్రైన్ కాల్పుల్లో హైదరాబాద్ నాంపల్లి బజార్‌ఘాట్ చెందిన సయ్యద్ సైఫుల్లా మృతి చెందాడు. అతనికి భార్యా, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. చిన్న కూతురికి ఆరు నెలల వయసే ఉంది. మృతదేహాన్ని రప్పించడంలో నాంపల్లి ఎమ్మెల్యే చొరవ చూపిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలంటూ మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేశారాయన. ఇదిలా ఉంటే.. రాజస్థాన్ జైపూర్ నుంచి ముంబై వెళ్తున్న జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. రైలు పాల్ఘడ్(మహారాష్ట్ర) చేరుకున్న టైంలో.. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో అతని సీనియర్ అధికారి ఏఎస్సైఐ టికా రామ్ మీనా, మరో ముగ్గురు మృతి చెందారు. ఆపై దహిసర్ స్టేషన్ వద్ద రైలు దూకి చేతన్ పారిపోగా.. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. షార్ట్‌టెంపర్‌తోనే అతను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అధికారులు చెబుతుండగా.. మరోవైపు ఉగ్రదాడి కోణం అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ నడుస్తోంది. The fourth victim of the #JaipurExpressTerrorAttack has been identified as Syed Saifullah. He was a resident of Bazaarghat, Nampally. He is survived by 3 daughters, the youngest is just 6 months old. AIMIM Nampally MLA @Jaffarhusainmla is with the family for the past few hours &… — Asaduddin Owaisi (@asadowaisi) August 1, 2023 -
జ్ఞానవాపిపై సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు
లక్నో/ఢిల్లీ: జ్ఞానవాపి మసీదు అంశంపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం వర్గాలు చారిత్రక తప్పిదానికి పాల్పడ్డాయని.. సరిదిద్దుకునే అవకాశం ఇప్పటికీ వారికి ఉందంటూ వ్యాఖ్యానించారాయన. సోమవారం ఉదయం ఓ జాతీయ మీడియా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన జ్ఞానవాపిపై స్పందించారు. ‘‘జ్ఞానవాపిలో జ్యోతిర్లింగం ఉంది. దానిని మేమేవరం ఉంచలేదు. విగ్రహాలు అక్కడ ఉన్నాయి. ఇప్పటికైనా చారిత్రక తప్పిదం సరిదిద్దుకుంటామనే ప్రతిపాదన ముస్లింల నుంచి రావాలి. జ్ఞానవాపిని మసీదు అని పిలిస్తేనే అది వివాదం అయినట్లు లెక్క. అక్కడి ప్రజలు ఆలోచించాలి. అసలు అక్కడ త్రిశూలానికి ఏం పని? అని ఆ పాడ్‌కాస్ట్‌లో ప్రసంగించారు. ఈ సాయంత్రం ఆ పాడ్‌కాస్ట్‌కు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. ज्ञानवापी को मस्जिद कहेंगे तो होगा विवाद, वहां त्रिशूल क्या कर रहा है? सीएम योगी का बड़ा बयान#YogiAdityanath#Gyanvapi pic.twitter.com/tI8qnT23Cy — Manish Pandey MP (@joinmanishpande) July 31, 2023 ఒవైసీ అభ్యంతరం.. జ్ఞానవాపిపై సీఎం యోగి వ్యాఖ్యలను ఏఐఎంఐఎం తీవ్రంగా పరిగణించింది. ‘‘90వ దశకంలోకి మేం వెళ్లాలనుకోవట్లేదు. చట్టం ప్రకారం.. మా హక్కుల ప్రకారమే మేం అక్కడ ప్రార్థనలు చేయాలనుకుంటున్నాం. కేసు కోర్టులో ఉండగా.. అలాంటి ప్రకటనలు ఎలా చేస్తారు? అని ఎంఐఎం నేత వారిస్ పథా తప్పుబట్టారు. ఇదిలా ఉంటే.. మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సైతం ఈ అంశంపై స్పందించారు. ‘‘అలహాబాద్ హైకోర్టులో ఏఎస్ఐ సర్వేను ముస్లిం వైపు వ్యతిరేకించారని, మరికొద్ది రోజుల్లో తీర్పు వెలువడుతుందని సీఎం యోగికి తెలుసు. అయినప్పటికీ అతను అలాంటి వివాదాస్పద ప్రకటన ఇచ్చాడు. ఇది న్యాయపరిధిని ఉల్లంఘించడమే అని తెలిపారు. #WATCH | On UP CM Yogi Adityanath’s Gyanvapi statement, AIMIM MP Asaduddin Owaisi says "CM Yogi knows that the Muslim side has opposed ASI survey in Allahabad High Court and the judgement will be given in a few days, still he gave such a controversial statement, this is judicial… pic.twitter.com/IuBSqMHepv — ANI (@ANI) July 31, 2023 -
మేం వాళ్లకు అంటరానివాళ్లమేమో!: ఎంఐఎం
ఢిల్లీ: బీజేపీని ఓడించే ఏకైక లక్ష్యంతో ఏకమైన 26 పార్టీల విపక్ష కూటమి.. ఇండియా(I.N.D.I.A) పేరుతో 2024 సార్వత్రిక ఎన్నికలకు సంఘటితంగా వెళ్లాలని నిర్ణయించుకుంది. అయితే రెండు రోజల బెంగళూరు విపక్ష భేటీకి తమను ఆహ్వానించకపోవడాన్ని ఎంఐఎం తీవ్రంగా పరిగణించింది. రాజకీయంగా మేం అంటరానివాళ్లమని భావించారు గనుకే మమ్మల్ని విపక్ష భేటీకి పిలవలేదేమో అని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మజ్లిస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి వారిస్ పథాన్. ‘‘లౌకిక పార్టీలని చెప్పుకునే వాళ్లు.. ఎందుకనో మమ్మల్ని ఆహ్వానించలేదు. బహుశా రాజకీయ అంటరానితనమే అందుకు కారణం కాబోలు. ఒకప్పుడు బీజేపీతో ఉన్న నితీశ్ కుమార్, ఉద్దవ్ థాక్రే, మెహబూబా ముఫ్తీలను సైతం వాళ్లు పిలిచారు. అంతెందుకు.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తిట్టిపోసిన అరవింద్ కేజ్రీవాల్ సైతం వాళ్లతో బెంగళూరులో కూర్చున్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా మేం కృష్టి చేస్తున్నాం. కానీ, మా పార్టీని, పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీని వాళ్లు పట్టించుకోలేదు అని వారిస్ వ్యాఖ్యానించారు. ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూసివ్ అలయన్స్ పేరుతో విపక్ష కూటమి.. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఢీ కొట్టేందుకు సిద్ధం కావాలని నిర్ణయించుకున్నాయి. ఇదీ చదవండి: ఇండియాపై యుద్ధానికి దిగితే గెలుపెవరిదంటే.. -
విపక్షాల కూటమికి ఒవైసీ పంచ్.. ‘చౌదరీ’ల క్లబ్‌లా తయారైందంటూ..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిపై తీవ్ర చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక, యూసీసీ బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో పెట్టేందుకు అటు బీజేపీ రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. యూసీసీని తమ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఇక, తాజాగా ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ.. హిందూ వివాహ చట్టాన్ని పూర్తిగా మార్చలేని వారు, యూసీసీని ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. బీజేపీని ఓడించాలనుకుంటున్న విపక్ష పార్టీలు.. భిన్నమైన ఎజెండాతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఇదే క్రమంలో విపక్ష పార్టీల కూటమికి సెటైరికల్ పంచ్ ఇచ్చారు. విపక్ష పార్టీల కూటమి చౌదరీల క్లబ్‌లా తయారైందన్నారు. విపక్ష పార్టీల భేటీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మామూలు వ్యక్తి కాదు అని, దేశ రాజకీయాల్లో ఆయన ముఖ్య పాత్ర పోషిస్తున్నారని ఒవైసీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. #WATCH | Our party will oppose UCC...If you (opposition parties) want to defeat BJP then you have to show the difference that you will not follow the agenda set by BJP. They (opposition parties) are a club of big 'Chaudharis'. You have not invited our Telangana CM to the meeting.… pic.twitter.com/ABGOvfPbVV — ANI (@ANI) July 15, 2023 ఇదిలా ఉండగా, అంతకుముందకు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మకు ఒవైసీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ముస్లిం వ్యాపారుల వల్లనే కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని శర్మ చేసిన వ్యాఖ్యలకు ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. అసోంలో ఒక విచిత్రమైన గుంపు తయారైంది. వారింట్లో గేదె పాలు ఇవ్వకపోయినా, కోడి గుడ్డు పెట్టక పోయినా దానికి ముస్లింలు(అసోంలో మియాలు) కారణమంటారు. బహుశా వారి వ్యక్తిగత వైఫల్యాలకు కూడా మియా భాయ్ మీద నిందలు వేస్తారేమోనని చురకలంటించారు. ఇదే క్రమంలో మన ప్రధాని విదేశీ ముస్లింలతో చాలా చనువుగా ఉంటారు కదా.. మరి అక్కడికి వెళ్ళినప్పుడు టమాటాలు, పాలకూరను, బంగాళాదుంపలను ఎగుమతి చేయమని ఆయా దేశాలను కోరితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. क्या Assam के CM Himanta Sarma UCC Bill को अदिवासियों पर लागू करेंगे, वह सिर्फ एक आंख से देख रहे हैं बस और उस आंख में मुसलमानों को लेकर Hatred (नफ़रत) भरी हुई है : Barrister Asaduddin Owaisi#ucc #ManipurBurning #UCCDividesIndia #IndiaAgainstUCC #aimim #owaisi pic.twitter.com/3OJHPYO2Sg — Mohammad shahnshah (@shahnshah_aimim) July 15, 2023 ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌లో మరో ట్విస్ట్? -
మీ ఇంట్లో గేదె పాలు ఇవ్వకపోయినా మేమే కారణమా?
న్యూఢిల్లీ: ముస్లిం వ్యాపారుల వల్లనే కాయగూరల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ వ్యాఖ్యలకు ప్రతి స్పందిస్తూ ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. మీ ఇళ్లలో గేదెలు పాలు ఇవ్వకపోయినా దానికి ముస్లింలే కారణం అనేలా ఉన్నారే.. అంటూ ట్విట్టర్లో ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అస్సామీయులు ఎప్పుడు వ్యాపారం చేసినా కాయగూరల ధరలు ఇంతగా పెరగలేదని ముస్లిం వ్యాపారులే ధరలను పెంచుకుంటూ పోతున్నారని అన్నారు. మీరే చెప్పండి కాయగూరల ధరలను పెంచింది ఎవరు మియాలు(అసోంలో ఉంటూ బెంగాలీ మాట్లాడే స్థానిక ముస్లింలు) కాదా? అని ఎదురు ప్రశ్నించారు. ఈ సందర్బంగా మియా సంఘం వారిని బయటవారిగా చెబుతూ వారు అస్సామీ సంస్కృతిని, భాషని కించపరుస్తూ చాలా జాత్యహంకారంతో వ్యవహరిస్తూ ఉంటారని ఘాటు విమర్శలు చేశారు. అసోం సీఎం చేసిన ఈ వ్యాఖ్యలకు ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. అసోంలో ఒక విచిత్రమైన గుంపు తయారయ్యింది. వారింట్లో గేదె పాలు ఇవ్వకపోయినా, కోడి గుడ్డు పెట్టక పోయినా దానికి మియాలే కారణమంటారు. బహుశా వారి వ్యక్తిగత వైఫల్యాలకు కూడా మియా భాయ్ మీద నిందలు వేస్తారేమోనని చురకలంటించారు. మన ప్రధాని విదేశీ ముస్లింలతో చాలా చనువుగా ఉంటారు కదా మరి అక్కడికి వెళ్ళినప్పుడు టమాటాలు, పాలకూరను, బంగాళాదుంపలను ఎగుమతి చేయమని ఆయా దేశాలను కోరితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. देश में एक ऐसी मंडिली है जिसके घर अगर भैंस दूध ना दे या मुर्ग़ी अण्डा ना दे तो उसका इल्ज़ाम भी मियाँ जी पर ही लगा देंगे। शायद अपने “निजी” नाकामियों का ठीकरा भी मियाँ भाई के सर ही फोड़ते होंगे।आज कल मोदी जी की विदेशी मुसलमानों से गहरी यारी चल रही है, उन्हीं से कुछ टमाटर, पालक, आलू… https://t.co/1MtjCnrmDT — Asaduddin Owaisi (@asadowaisi) July 14, 2023 ఇది కూడా చదవండి: రాంగ్ రూటులో వచ్చి అంబులెన్సును ఢీకొట్టిన మంత్రి కాన్వాయ్ -
ప్రజల దృష్టిని మళ్లించేందుకే యూసీసీ
సాక్షి, హైదరాబాద్: పేదరికం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, చైనా చొరబాటు లాంటి వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఉమ్మ డి పౌరస్మృతి (యూసీసీ) అమలు ప్రతిపాదన తెచ్చారని హైదరాబాద్ ఎంపీ, ఆల్ ఇండియా మజ్లిస్–ఏ–ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. శుక్రవారం మజ్లిస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన దారుస్సలాంలో ఆయన మీడియాతో మాట్లాడారు. యూసీసీ అమలు గురించి తెలంగాణలోని ఆదిలాబాద్‌కు వచ్చి గోండు సామాజిక వర్గానికి చెప్పాలని ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. గతంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ ఈ అంశాన్ని లేవనెత్తిందని, వచ్చే 2024 ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందడమే దాని లక్ష్యమని ఒవైసీ ధ్వజమెత్తారు. కామన్ లా కోడ్‌పై సూచనల కోసం అప్పీల్ చేసిన లా కమిషన్‌కు యూసీసీపై తమ పార్టీ స్పందనను పంపామని వివరించారు. ఇటీవల, భోపాల్‌లో ప్రధాని మోదీ యూసీసీపై ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారని వాఖ్యానించారని, ‘ఒక ఇంట్లో ఒక సభ్యునికి ఒక చట్టం, మరొకరికి మరొక చట్టం ఉంటే ఆ ఇంటిని నడపగలమా? అని ప్రశ్నించారు. యూనిఫాం సివిల్ కోడ్‌పై కేరళ గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై ఒవైసీ మండిపడ్డారు. ఏపీ సీఎం జగన్‌ను కలుస్తా ఏపీ సీఎం జగన్ తనకు మిత్రుడని, త్వరలో ఆయనను యూసీసీ అంశంపై కలుస్తామని అ సదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు. ఇప్పటికే ఆయన తనను లంచ్‌కు ఆహ్వానించారని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశమై యూసీసీకి వ్యతిరేకంగా మద్దతు కోరగా, ఆయ న సానుకూలంగా స్పందించడంతో పాటు భావస్వారూప్య పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. -
ఉమ్మడి పౌర స్మృతికి వ్యతిరేకం.. తేల్చిచెప్పిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశాభివృద్ధిని విస్మరించి ఇప్పటికే పలు రకాలుగా ప్రజల నడుమ చిచ్చు పెడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్) పేరుతో మరోమారు దేశ ప్రజలను విభజించేందుకు కుయుక్తులు పన్నుతోందని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ధ్వజమెత్తారు. విభిన్న ప్రాంతాలు, జాతులు, మతాలు, ఆచార వ్యవహా రాలు, సంస్కృతులు కలిగి, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన భారత ప్రజల ఐక్యతను చీల్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను తాము నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తామని తేల్చిచెప్పారు. అందులో భాగంగా యూసీసీ బిల్లును వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. యూసీసీ బిల్లుతో దేశంలో ప్రత్యేక సంస్కృతి కలిగిన గిరిజనులు, పలు మతాలు, జాతులు, ప్రాంతాలతో పాటుగా హిందూ మతాన్ని ఆచరించే ప్రజలూ అయోమయానికి లోనవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు ఖాలీద్ సైఫుల్లా రెహ్మాని ఆధ్వర్యంలో బోర్డు కార్యవర్గం సోమవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌తో సమావేశమైంది. యూసీసీ బిల్లును వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేసింది. దేశ ప్రజల అస్థిత్వానికి, వారి తరతరాల సాంప్రదాయ, సాంస్కృతిక ఆచార వ్యవహారాలకు గొడ్డలిపెట్టుగా కేంద్ర ప్రభుత్వం మారిందని ఆరోపించింది. ఈ సమావేశంలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రులు మహమూద్ అలీ, కె.తారకరామారావు పాల్గొన్నారు. పార్లమెంట్లో వ్యతిరేకిస్తాం... ‘కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న యూసీసీ దురుద్దేశంతో కూడుకున్నదని స్పష్టమవుతోంది. దేశంలో ఎన్నో పరిష్కరించాల్సిన సమస్యలున్నా పట్టించుకోకుండా, బీజేపీ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లుగా దేశ ప్రజల అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది. ప్రజలను రెచ్చగొట్టి అనవసరమైన గొడవలు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకే యూసీసీ అంటూ మరోసారి విభజన రాజకీయాలకు పాల్పడుతోంది. అందుకే యూసీసీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’అని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తుందని ప్రకటించారు. భావ సారూప్యత కలిగిన పార్టీలను కలుపుకొనిపోతూ యూసీసీ బిల్లుపై పోరాడతామని చెప్పారు. ఇందుకు సంబంధించి పార్లమెంటు ఉభయ సభల్లో చేపట్టే కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకోవాలని పార్లమెంటరీ పార్టీ నేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్రావుకు సూచించారు. కాగా దేశంలోని గంగా జమున తహజీబ్‌ను రక్షించేందుకు ముందుకు రావాలనే తమ అభ్యర్థనను అర్థం చేసుకుని ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నందుకు గాను సీఎం కేసీఆర్‌కు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ధన్యవాదాలు తెలిపింది. ఏపీ సీఎంకు కూడా విజ్ఞప్తి చేస్తాం: అసదుద్దీన్ ఉమ్మడి పౌర స్మృతి వస్తే అన్ని వర్గాలకూ నష్టం జరుగుతుందని మజ్లిస్ అధినేత, అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ముస్లింలు, గిరిజనులతో పాటు హిందూవులకు కూడా మంచిది కాదని చెప్పారు. హిందూ వివాహ చట్టం రద్దు అవుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్‌తో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ లౌకికవాదాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని ఒవైసీ ఆరోపించారు. గత పదేళ్లుగా తెలంగాణ ప్రశాంతంగా ఉందని, ఈ పరిస్థితుల్లో కేంద్రం యూసీసీ బిల్లు తెస్తే వ్యతిరేకించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. ఏపీ సీఎంకు కూడా ఈ మేరకు విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. -
యూసీసీపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి పౌరస్మృతి బిల్లు రూపకల్పన దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. కాగా, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ ఈ బిల్లును ప్రవేశపెట్టనుంద. ఈనేపథ్యంలో ప్రతిపక్షాలు ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తున్నాయి. ఇక, తాజాగా ఉమ్మడి పౌరస్మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ కేంద్రంపై సంచలన కామెంట్స్ చేశారు. అయితే, యూనిఫామ్ సివిల్ కోడ్‌పై సోమవారం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు ఖాలీద్ సయీఫుల్లా రెహ్మాని ఆధ్వర్యంలో బోర్డు కార్యవర్గం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌తో సమావేశమైంది. ఈ సమావేశంలో ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్భరుద్దీన్, మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, బోర్డు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న యూసీసీ నిర్ణయం దురుద్దేశంతో కూడుకున్నదని స్పష్టమౌతున్నది. దేశంలో ఎన్నో పరిష్కరించాల్సిన సమస్యలున్నా పట్టించుకోకుండా గత తొమ్మిదేండ్లుగా దేశ ప్రజల అభివృద్ధిని ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది బీజేపీ ప్రభుత్వం. దేశంలో పనులేమీ లేనట్టు.. ప్రజలను రెచ్చగొట్టి అనవసరమైన గొడవలు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకే యూసీసీ అంటూ మరోసారి విభజన రాజకీయాలకు పాల్పడుతున్నది. అందుకే బీజేపీ తీసుకోవాలనుకుంటున్న యూసీసీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన బిల్లును రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. యూసీసీతో అందరికీ ఇబ్బందులే: ఒవైసీ మరోవైపు.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. బీజేపీ సర్కార్ తెస్తామన్న యూసీసీని వ్యతిరేకించాలని కేసీఆర్‌ను కోరాం. సీఏఏను వ్యతిరేకిస్తూ టీఎస్ అసెంబ్లీలో మొదటగా తీర్మానం చేసింది. యూసీసీ తీసుకురావడం ద్వారా దేశంలోని భిన్నత్వాన్ని దెబ్బతీయాలని మోదీ కుట్ర చేస్తున్నారు. యూసీసీ కేవలం ముస్లింలకే కాదు.. హిందువులతో పాటుగా క్రిస్టియన్లు, వివిధ ఆదివాసీ వర్గాలకు ఇబ్బంది. దేశంలో భిన్నత్వం ఉండటం మోదీకి ఇష్టం లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: కేటీఆర్ కొడుకు హిమాన్షు పెద్ద మనస్సు.. ప్రశంసల వర్షం -
తెలంగాణ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. బీఆర్ఎస్కు ఎఫెక్ట్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పొలిటికల్ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక, ఇప్పటి వరకు దోస్తీలుగా ఉన్న బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య మాటల వార్ నడుస్తోంది. ఇదే క్రమంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్‌కు డెరెక్ట్‌గా వార్నింగ్ ఇస్తూ కామెంట్స్ చేశారు. దీనికి షకీల్ కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. మరోవైపు.. అసెంబ్లీలో కూడా అక్బరుద్దీన్ ఒవైసీ.. తెలంగాణ సర్కార్ తీరుపై విరుచుకుపడ్డారు. పాతబస్తీ అభివృద్ధి, మెట్రో సేవలపై అసెంబ్లీ వేదికగా పలు ప్రశ్నలు సంధిస్తూ అధికార పార్టీపై ఫుల్ ఫైరయ్యారు. దీంతో, రంగంలోకి దిగిన కేటీఆర్.. ఎంఐఎంకు కౌంటర్ ఇస్తూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. మొన్న నిజామాబాద్‌లో అసదుద్దీన్ చేసిన కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఒవైసీ మాట్లాడుతూ.. తెలంగాణలో అన్ని స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తుంది. అంతేకాదు.. దళిత బంధులా.. ముస్లిం బంధు ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు. కారు స్టీరింగ్ తమ చేతిలో ఉందనే వాళ్లు దీనిని గమనించాలని సూచించారు. ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో ప్రజల ఆదరణతో తామే మళ్లీ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, వచ్చే ఎన్నికల్లో తాము ఏ పార్టీతో జట్టు కడతామన్నది ఎన్నికలనాటికి చెబుతామని అనడం కీలకంగా మారింది. అయితే, బీఆర్ఎస్పై ఎంఐఎం ఆరోపణల నేపథ్యంలో మజ్లిస్ పార్టీ ప్లాన్ మార్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్కు కాకుండా కాంగ్రెస్‌కు చేరువయ్యేందకు మజ్లిస్ నేతలు ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. దీంతో, వచ్చే ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: తెలంగాణలో భిన్నంగా ఓటరు నాడి.. ఆ పార్టీకే మెజారిటీ సీట్లు! -
మజ్లిస్ రూట్ మారుతోందా ?
-
భయపడే వాళ్లు ఎవరూ లేరు.. ఒవైసీకి ఎమ్మెల్యే షకీల్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, నిజామాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో చూసుకుందామని బెదిరిస్తే భయపడే వారు ఇక్కడ ఎవరూ లేరు అంటూ స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. దీంతో, ఎమ్మెల్యే వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కాగా, బీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ శుక్రవారం ఓ వీడియోలో మాట్లాడుతూ.. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికలు రాగానే ఆయన నైజం బయటపెడుతున్నారు. ఎన్నికల్లో చూసుకుంటామని బెదిరిస్తే భయపడే వారు ఎవరూ లేరు. దమ్ముంటే ముందు నుండి కొట్లాడండి.. వెనుక నుండి కాదు. నేనెవరి మీదా తప్పుడు కేసులు పెట్టలేదు. ఎంఐఎం కౌనిల్సర్లు నామీద ముమ్మాటికీ హత్యాయత్నం చేశారు. ప్లాన్ ప్రకారమే ఆరోజు నామీద దాడి చేసి చంపాలనుకున్నారు. ప్రస్తుతం జైలులో ఉన్న నిందితులపై సంఘ విద్రోహా కేసులు ఉన్నాయి. దొంగతనం, రౌడీయిజం, మర్డర్ ఇలా చాలా కేసులు వారిపై ఉన్నాయి. బోధన్ బీఆర్ఎస్ రాజకీయ నేత శరత్ రెడ్డి, ఎంఐఎం నేతలు కలిసి నాపై కుట్రలు చేస్తున్నారు. ఈ హత్యాయత్నం కేసులో పోలీసులే నిజానిజాలు తేలుస్తారు. ఈసారి ఎన్నికల్లో తేల్చుకుందాం. బోధన్ ప్రజలు నాతోనే ఉన్నారు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: అరెస్ట్ అయిన వారంతా కవిత గెలుపు కోసం పనిచేశారు: ఎంఐఎం ఒవైసీ -
తెలంగాణలో మతతత్వం పెరుగుతోంది: అసదుద్దీన్ ఓవైసీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మతతత్వం పెరుగుతోందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. అన్ని కులాలకు భవనాలు కట్టి.. ఇస్లామిక్ సెంటర్‌ను ఎందుకు నిర్మించలేదని ప్రవ్నించారు. మెట్రో రైలును పాతబస్తీలో ఎందుకు విస్తరించలేదని నిలదీశారు. ప్రభుత్వం పనిచేయలేదు కాబట్టే తాము ప్రశ్నిస్తున్నామని స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రులను కలవడం మంచిదేనని అసుదుద్దీన్ తెలిపారు. అయితే కేటీఆర్‌ను సీఎం కేసీఆర్ ప్రమోట్ చేస్తున్నట్లు కనిస్తోందన్నారు. రాజకీయ పార్టీలు ప్రజలకు దూరం కాకూడదని అన్నారు. ఉస్మానియా ఆసుపత్రి గురించి ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. చదవండి: ముగిసిన టీ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహ సమావేశం -
ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ఉర్దూకు ప్రాధాన్యం ఇవ్వలేదని, ఎక్కడ ఉర్దూ పోస్టర్లు, ప్రకటనలు లేవని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. గురువారం రాత్రి అల్లాపూర్‌లో నిర్వహించిన గెల్సా యాదే పక్రే మిలాత్ మౌలానా అబ్ధుల్ ఓవైసీ సంస్మరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్సిటీలు, పెద్ద విద్యా సంస్థల్లో ముస్లింలకు ప్రాధాన్యం దక్కడం లేదని ఆరోపించారు. కారు స్టీరింగ్ తమ చేతిలో ఉందనే వాళ్లు దీనిని గమనించాలని సూచించారు. ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో ప్రజల ఆదరణతో తామే మళ్లీ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కొందరు నాయకులు విధ్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఎంఐఎం పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. అనంతరం 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన ఆరుగురు విద్యార్థులకు పతకాలు, మెమొంటోలు అందజేశారు. -
ఒవైసీ విమర్శలపై కేటీఆర్ రియాక్షన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొద్దిరోజులుగా అధికార పార్టీ, బీజేపీ నేతల మధ్య మాటల యద్దం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం, హోంమంత్రి అమిత్ షా టార్గెట్‌గా మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో తెలంగాణలో వచ్చే ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ జోస్యం చెప్పారు. బీఆర్ఎస్కు ఎన్ని సీట్లు వస్తాయో చెప్పారు. కాగా, మంత్రి కేటీఆర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో 90-100 సీట్లు గెలుస్తాం. తెలంగాణలో బీజేపీ ఉనికి కోల్పోతుంది. దేశం అన్ని రంగాల్లో వెనుకబడటానికి బీజేపీనే కారణం. మణిపూర్‌లో అల్లర్లు జరుగుతుంటే అమిత్ షా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఓ వైపు ఒవైసీ మాపై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ విధానాలు బాగున్నాయంటున్నారు. డీలిమిటేషన్‌పై అన్ని పార్టీలు ఏకం కావాలి. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. ఇది కూడా చదవండి: తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. మరో కీలక నిర్ణయం -
బీఆర్ఎస్ మీద అసద్ గుస్సా..
-
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
కేసీఆర్ సర్కార్‌పై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్తో ఎంఐఎం పార్టీకి ఉన్న రాజకీయ సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏనాడూ అవి ఒకరికొకరు మద్దతు అని ప్రకటించుకున్న దాఖలాలు లేవు. అలాగే పరస్పర విమర్శలకు దూరంగా ఉంటూ వస్తున్నాయి. దీనిని ఆసరాగా తీసుకునే బీజేపీ.. బీఆర్ఎస్ సర్కార్‌పై విమర్శలు చేస్తూ వస్తోంది కూడా. ఈ క్రమంలో తాజాగా మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ స్టీరింగ్ మా చేతుల్లో ఉందని కొందరు అంటుండడం హాస్యాస్పదంగా ఉందంటూ అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. మేం అడిగిన ఒక్క పని కూడా బీఆర్ఎస్ చేయలేదని పేర్కొన్నాయన. ఈ క్రమంలో బీఆర్ఎస్ తీరుపై ఆగ్రహం వెల్లగక్కారు. ‘ఓల్డ్ సిటీలో ఎందుకు మెట్రో నిర్మించడం లేద’ని సర్కార్‌ను నిలదీశారు. అంతేకాదు.. దళిత బంధులా.. ముస్లిం బంధు ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీపై తొలిసారిగా తీవ్ర విమర్శలకు దిగారు ఒవైసీ. అదీ సూటి విమర్శలతో కావడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇదీ చదవండి: ట్విటర్లో రాములమ్మ పంచాయితీ -
ఒవైసీ కుటుంబం ఆస్తులు మాత్రమే ఎలా పెరిగాయి?: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. బీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పటి వరకు ఒవైసీ కుటుంబం ఆస్తులు మాత్రమే పెరిగాయని ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, బండి సంజయ్ బుధవారం కరీంనగర్లో టీటీడీ ఆలయ భూమిపూజకు హాజరయ్యారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో ఉంది. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి అంటకాగే పార్టీ ఎంఐఎం. పాతబస్తీని ఎందుకు ఎంఐఎం అభివృద్ధి చేయలేకపోయింది. ఇప్పటి వరకు ఒవైసీ కుటుంబం ఆస్తులు మాత్రమే పెరిగాయి. దమ్ముంటే ఎంఐఎం అన్ని చోట్లా పోటీ చేయాలి. డిపాజిట్ కూడా రాదు. నరికి చంపుతామన్న ఎంఐఎం నాయకుల మాటలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ మా చేతుల్లో ఉందనడం హాస్యాస్పదమన్నారు. మేము అడిగిన ఒక్క పని కూడా బీఆర్ఎస్ చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: ఈటల Vs విజయశాంతి: ట్విట్టర్లో పొలిటికల్ పంచాయితీ.. -
పార్లమెంట్ భవనంపై ఆర్జేడీ వివాదాస్పద ట్వీట్.. మండిపడ్డ ఓవైసీ
పార్లమెంట్ ప్రారంభోత్సవ వేళ.. రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చేసిన ట్వీట్‌పై మజ్లిస్ ఇత్తెహదుల్ ముస్లీమీన్ (ఎమ్ఐఎమ్)నేత అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. పార్లమెంట్ భవనాన్ని శవపేటికతో పోల్చడాన్ని తప్పుబట్టారు. ఈ రకమైన పోలికలు అవసరమా అని ప్రశ్నించారు. ప్రధాని కాకుండా స్పీకర్ ఓం బిర్లా చేతుల మీదుగానే ప్రారంభోత్సవం జరిగుంటే బావుండేదని అభిప్రాయపడ్డారు. 'ఆర్జేడీకి నిర్దిష్టమైన అభిప్రాయమే ఉండదు. సెక్యులరిజమ్ గురించి మాట్లాడుతుంది.. బీజేపీతో స్నేహం చేసి బయటికి వచ్చిన నితీష్ కుమార్‌ను ముఖ్యమంత్రిని చేస్తుంది. పాత పార్లమెంట్‌కు కనీసం అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు కూడా లేవు. అలాంటప్పుడు కొత్త పార్లమెంట్‌ను సమాదితో ఎందుకు పోల్చుతారు. ఈ రకమైన పోలికలు అవసరమా' అని ఆర్జేడీపై ఓవైసీ ఫైరయ్యారు. పీఎం ప్రధాని నరేంద్ర మోదీ తప్ప ఇంకా ఎవరూ ఈ పని చేయలేరన్నట్లు ప్రవర్తిస్తారని ఓవైసీ విమర్శించారు. 2014కు ముందు దేశంలో ఏం జరగనట్లు.. ప్రస్తుతం మాత్రమే అంతా జరుగుతున్నట్లు ప్రధాని ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తారని ఆరోపించారు. ఆర్జేడీ వివాదాస్పద ట్వీట్: పార్లమెంట్ ప్రారంభోత్సవ వేళ.. బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత లాలు యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చేసిన ట్వీట్ పెను వివాదాని దారితీసింది. కొత్త పార్లమెంట్ భవనాన్ని శవపేటికతో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఆర్జేడీ. ఈ భవనం శవపేటిక మాదిరిగా సమాధి చేసిన ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుందని, దీన్ని దేశం అంగీకరించదంటూ ఆర్జేడీ పార్టీ బీజేపీని విమర్శిస్తూ ట్వీట్ చేసింది. ఇదీ చదవండి:పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం.. ఇది నిజంగా అప్రతిష్ట: రాహుల్ -
పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సింది ప్రధాని కాదు: రాహుల్ గాంధీ
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రం కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. కాగా, నూతన పార్లమెంట్ భవనాన్ని ఈనెల 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం, రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, రాహుల్ ట్విట్టర్ వేదికగా.. ‘కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలి. ప్రధానమంత్రి కాదు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపై స్పందించింది. అదే రోజున వీడీ సావర్కర్ జయంతి. కేంద్రం చర్య జాతి నిర్మాతలను అవమానించడమేనని కాంగ్రెస్ అభిప్రాయపడింది. ఇదిలా ఉండగా, అంతకుముందు.. పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించడంపై ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ప్రధాని పార్లమెంట్‌ను ప్రారంభించడమేంటని ప్రశ్నించారు. ప్రధాని కార్యనిర్వహక వర్గానికి అధిపతి అని, రాజ్యాంగం ప్రకారం అధికారాల విభజన స్పష్టంగా ఉందన్నారు. పార్లమెంట్‌కు అధిపతులు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ అని, వారితో పార్లమెంట్‌ను ప్రారంభించవచ్చన్నారు. नए संसद भवन का उद्घाटन राष्ट्रपति जी को ही करना चाहिए, प्रधानमंत्री को नहीं! — Rahul Gandhi (@RahulGandhi) May 21, 2023 Why should PM inaugurate Parliament? He is head of the executive, not legislature. We have separation of powers & Hon’ble @loksabhaspeaker & RS Chair could have inaugurated. It’s made with public money, why is PM behaving like his “friends” have sponsored it from their private… https://t.co/XmnGfYFh6u — Asaduddin Owaisi (@asadowaisi) May 19, 2023 ఇది కూడా చదవండి: కవిత అరెస్ట్ మా చేతుల్లో లేదు: కిషన్‌రెడ్డి సంచలన కామెంట్స్ -
సామాజిక న్యాయం అంటే ఇదేనా?
-
ఆర్టిజన్ల సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్థల్లో ఆర్టిజన్ల సమ్మె ముగిసింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అహ్మద్ బలాల మధ్యవర్తిత్వం వహించడంతో సమ్మెను బేషరతుగా విరమించుకున్నట్టు .. తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్(హెచ్ 82), ఎంఐఎం అనుబంధ ఇతెహాద్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్లు ప్రకటించాయి. తమ డిమాండ్ల సాధనకు ఈ రెండు యూనియన్లు మంగళవారం ఉదయం 8 గంటల నుంచి సమ్మెకు పిలుపునివ్వగా, విద్యుత్ సంస్థలపై పాక్షిక ప్రభావం కనబడింది. సమ్మెలో పాల్గొన్న యూనియన్ల ముఖ్య నేతలతో సహా 200 మంది ఆర్టిజన్లను ఉద్యోగాల నుంచి తొలగించినట్టు ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూనియన్ల నాయకుల విజ్ఞప్తితో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బుధవారం సీఎండీతో ఫోన్లో మాట్లాడారు. తొలగించిన ఉద్యోగులను తిరిగి చేర్చుకుంటాం.. తొలగించిన ఉద్యోగులను తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకోవాలని ఒవైసీ కోరారు. సానుకూలంగా స్పందించిన సీఎండీ ..బేషరతుగా సమ్మె విరమిస్తే 10 రోజుల్లోగా ఉద్యోగాల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఇతేహాద్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అహమద్ బలాల రెండు యూనియన్ల నేతలతో కలిసి విద్యుత్ సౌధలో ప్రభాకర్ రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డిని కలిసి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సమ్మెను బేషరతుగా విరమిస్తున్నట్టు హెచ్–82 యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్.సాయిలు, ఇతెహాద్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ హుసేన్‌లు తెలిపారు. రెగ్యులర్ ఉద్యోగులకు సమానంగా ఆర్టిజన్లకు రూ.16లక్షల గ్రాట్యుటీతో పాటు మెడికల్ అన్‌ఫిట్ పథకం కింద కుటుంబసభ్యులకు ఉద్యోగావకాశం కల్పించాలని విజ్ఞప్తి చేయగా, ప్రభాకర్‌రావు సానుకూలంగా స్పందించారని సాయిలు వెల్లడించారు. సమ్మె తొలిరోజే 200 మంది ఆర్టిజన్లను ఉద్యోగాల నుంచి తొలగించడంతో బుధవారం రెండోరోజు సమ్మెకు ఆర్టిజన్లు సుముఖత వ్యక్తం చేయలేదని, ఈ కారణంగానే విరమణ ప్రకటన చేయాల్సి వచ్చిందని యూనియన్ల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. -
అమిత్ షాకు వరుసగా కౌంటర్లు
-
అమిత్ షా విమర్శలకు అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్
-
‘ఒవైసీ అంటూ ఎంతకాలం ఏడుస్తారు?’
హైదరాబాద్: తెలంగాణలో అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ చేవెళ్ల సభ సాక్షిగా ప్రకటించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకమన్న ఆయన.. వాటి ఫలాలను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అంతేకాదు.. మజ్లిస్ పార్టీ స్టీరింగ్‌తో నడుస్తున్న కేసీఆర్ పాలనతో తెలంగాణ అభివృద్ధి జరగదంటూ విమర్శలు గుప్పించాయి. అయితే.. అయితే అమిత్ షా చేవెళ్ల ప్రసంగంపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. షా చేసింది ముస్లిం విద్వేష ప్రసంగమన్న ఒవైసీ.. బీజేపీకి తెలంగాణపై విజన్ లేదని విమర్శించారు. ‘‘ముస్లిం విద్వేష ప్రసంగం మాత్రమే కాదు.. బీజేపీకి తెలంగాణ పట్ల విజన్ లేదు. బూటకపు ఎన్కౌంటర్లు, హైదరాబాద్‌పై సర్జికల్ స్ట్రైక్స్, కర్ఫ్యూలు, నేరస్థులను విడుదల చేయడం, బుల్డోజర్లను మాత్రమే వాళ్లు అందించగలరు. అసలు తెలంగాణ ప్రజల్ని ఎందుకు అంతగా ద్వేషిస్తున్నారు? అని ఒవైసీ ట్విటర్వేదికగా అమిత్ షాపై కౌంటర్ విమర్శలు గుప్పించారు. రికార్డు స్థాయికి చేరిన ద్రవ్యోల్బణం గురించి, నిరుద్యోగం గురించి మాట్లాడాలంటూ ఆయన షాకు చురకలు అంటించారు. ఒవైసీ మీద పడి ఎంతకాలం ఏడుస్తారంటూ మండిపడ్డారాయన. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు న్యాయం చేయాలని అమిత్ షా నిజంగా భావిస్తే.. 50 శాతం కోటా పరిమితిని తొలగించడానికి రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టాలి. అనుభావిక డేటా ఆధారంగానే వెనుకబడిన ముస్లిం సమూహాలకు రిజర్వేషన్లు ఇవ్వబడ్డాయని ఆయన గుర్తించాలి అని ట్వీట్లో ఒవైసీ పేర్కొన్నారు. ఈ విషయంలో సుధీర్ కమిషన్ రిపోర్ట్‌ను ఆయన చదవాలని, లేదంటే చదివిన ఎవరినైనా అడిగి తెలుసుకోవాలని షాకు సూచించారు. సుప్రీం కోర్టు స్టే కింద ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగుతున్నాయని అమిత్ షాకు ఒవైసీ గుర్తు చేశారు. Sir @AmitShah ye “owaisi owaisi” ka rona kab tak chalega? Khaali khattey dialog’aan maarte rehte. Please sometimes speak about record-breaking inflation & unemployment also. Telangana has the highest per capita income in the country Modi allegedly says reach out to pasmanda… — Asaduddin Owaisi (@asadowaisi) April 23, 2023 -
అతీక్ అహ్మద్ హత్య ఘటనపై ఒవైసీ రియాక్షన్ ఇదే..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అతీక్ అహ్మద్, అతని సోరుడు అష్రఫ్ హత్యలపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ ఘటనపై సుప్రీకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దర్యాప్తులో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక్క అధికారి కూడా ఉండొద్దన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ యూపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 'హత్య సమయంలో అక్కడున్న పోలీసులు అధికారులను విధుల నుంచి తొలగించాలి. పోలీస్ కస్టడీలోనే అతీక్ అతని సోదరుడు దారుణ హత్యకు గురయ్యారు. నిందితులకు ఆ ఆయుధాలు ఎలా వచ్చాయి? హత్య అనంతరం వారు జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు. చంపిన తర్వాత మతపరమైన నినాదాలు ఎందుకు చేస్తున్నారు?. టెర్రరిస్టులు అని కాకపోతే వాళ్లను ఏమని పిలవాలి? దేశభక్తులు అనాలా? ఈ ఘటన అనంతరం సంబరాలు చేసుకుంటున్నవారు రాబందులు. ఈ హత్యలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం పాత్ర ఉంది. ఈ ఘటన యూపీలో శాంతి భద్రతలపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నా. ఇలా పబ్లిక్‌గా హత్యలు జరిగితే ప్రజలకు రాజ్యాంగం, శాంతి భద్రతలపై విశ్వాసం ఉంటుందా? యూపీలో బీజేపీ పరిపాలన చట్ట ప్రకారం జరగడం లేదు, తుపాకీ రాజ్యమేలుతోంది.' అని ఒవైసీ ఫైర్ అయ్యారు. చదవండి: ఫేమస్ కావాలనే అతీక్‌ను కాల్చి చంపాం.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు.. -
యూపీలో అసద్ ఎన్కౌంటర్.. ఒవైసీ రియాక్షన్ ఇదే..
సాక్షి, నిజామాబాద్: ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ మాజీ ఎంపీ, జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ అతిఖ్ అహ్మద్ కొడుకు అసద్‌ను యూపీ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన ఘటన దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న అసద్‌ను పోలీసులు ఝాన్నీ వద్ద కాల్చి చంపారు. ఇక, ఈ ఎన్‌కౌంటర్‌పై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. కాగా, ఒవైసీ నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాజస్థాన్‌లో జునైద్, నాసిర్‌లను చంపినవాళ్లను బీజేపీ ఎన్కౌంటర్ చేస్తుందా అని ప్రశ్నించారు. ఇవాళ మతం పేరిట బీజేపీ సర్కార్ ఎన్కౌంటర్లు చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. చట్టాలను ఆ పార్టీ బలహీనపరుస్తుందన్నారు. రాజ్యాంగాన్ని ఎన్కౌంటర్ చేస్తోందని ఆరోపించారు. ఎన్కౌంటర్ చేసుకుంటూ పోతే అప్పుడు కోర్టులు, చట్టాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. మైనార్టీల పట్ల నరేంద్ర మోదీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్స్ విషయంలో కేంద్రం ఆంక్షలు విధిస్తోందన్నారు. మజ్లిస్ సేవకుడిగా అసదుద్దీన్ ఒవైసీ ఎప్పటి వరకు ఉంటాడో అప్పటి వరకు పోరాటం చేస్తూనే ఉంటాను అని వ్యాఖ్యలు చేశారు. #WATCH | Will the BJP also shoot those who killed Junaid and Nasir? No, because you (BJP) do encounters in the name of religion. You want to weaken the rule of law, do encounter of the Constitution: AIMIM MP Asaduddin Owaisi in Telangana's Nizamabad pic.twitter.com/H0a1xqRIC3 — ANI (@ANI) April 13, 2023 -
ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ శోభాయాత్రలో గాడ్సే ఫోటో ప్రదర్శించారని మండిపడ్డారు. దేశంలో తొలి టెర్రరిస్టు నాథురామ్ గాడ్సేనేనని.. ఆయన ఫోటోలు ప్రదర్శిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తాము లాడెన్, హజరీ ఫోటోలు ప్రదర్శిస్తే ఊరుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా ఇటీవల హైదరాబాద్‌లో శ్రీరామనవమి రోజున గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నిర్వహించిన శోభాయాత్రలో మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే ఫొటో దర్శనం ఇవ్వడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసదుద్దీన్ స్పందిస్తూ...హనుమాన్ శోభయాత్రలో గాడ్సే ఫొటోలు ప్రదర్శించడం ఏంటని ప్రశ్నించారు. చదవండి: వీడిన సస్పెన్స్.. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇంచార్జీగా మర్రి రాజశేఖర్ రెడ్డి -
శాంతిభద్రతల కోసం బీజేపీని తిరస్కరించాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మతవిద్వేషాల వ్యాప్తికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని, శాంతిభద్రతలు వెల్లివిరియాలంటే కమలనాథులను తిరస్కరించాలని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రజలకు పిలుపునిచ్చారు. కేవలం మతోన్మాదాన్ని రెచ్చగొట్టి అధికారంలో రావాలని పగటికలలు కంటోందని దుయ్యబట్టారు. గురువారం హైదరాబాద్ దారుస్సలాం మైదానంలో జరిగిన ఏఐఎంఐఎం ఆవిర్భావ దినోత్సవాల్లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని, బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ఇక్కడే జీడీపీ ఎక్కువని పేర్కొన్నారు. రాష్ట్రంలో మతకల్లోలాలు లేవని, శాంతి, అభివృద్ధి రెండూ ఉన్నాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి, రాజ్యాంగం కావాలో లేక బుల్డోజర్ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు గంట మోగినట్లేనని, పార్టీ బాధ్యులు ఎన్నికలకు సంసిద్ధం కావాలని అసదుద్దీన్ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో రాజస్తాన్, కర్ణాటకలో ఏఐఎంఐఎం పోటీ చేస్తుందని ప్రకటించారు. గ్యాస్ సిలిండర్‌కు నమస్కారం పెట్టండి వచ్చే ఎన్నికల్లో ఓటు వేసే ముందు మహిళలు తమ ఇళ్లలోని గ్యాస్ సిలిండర్లకు నమస్కారం పెట్టి వెళ్లాలని ఒవైసీ విజ్ఞప్తి చేశారు. వంటగ్యాస్ సిలిండర్ల ధరలను మరోసారి పెంచిన మోదీ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. ఖదీర్‌ఖాన్ కుటుంబాన్ని తమ పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఒవైసీ ప్రకటించారు. భారతదేశానికి చాయ్‌వాలా, చౌకీదార్ అవసరం లేదని, దేశ సరిహద్దులను రక్షించగల బలమైన ప్రధాని అవసరమని ఏఐఎంఐఎం శాసన పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అహ్మద్ పాషా ఖాద్రీ, అహ్మద్ పాషా ఖాద్రీ, జాఫర్ హుస్సేన్ మేరాజ్, కౌసర్ మోహియుద్దీన్, అహ్మద్ బలాలా, మోజంఖాన్, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో బీజేపీ ఓటమి ఖాయం: ఒవైసీ
-
ఇలాంటి దాడులకు నేను భయపడే వ్యక్తిని కాదు: అసదుద్దీన్
-
ఎంఐఎం అదినేత అసదుద్దీన్ నివాసంపై దుండగుల దాడి
-
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ నివాసంపై దుండగుల దాడి
సాక్షి, ఢిల్లీ: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ నివాసంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. రాజస్థాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లకముందే ఈ దాడి జరిగింది. ఘటనాస్థలంలో ఆధారాలను ఫోరెన్సిక్ సేకరించింది. ఘటనపై పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటివరకు ఢిల్లీలో నాలుగుసార్లు దుండగులు దాడికి పాల్పడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటిపై రాళ్లు విసిరారని అసదుద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు అసదుద్దీన్ ఇంటిపై నాలుగు సార్లు దాడి జరిగింది. కాగా, ఒవైసీ రెండు రోజుల రాజస్థాన్ పర్యటనలో ఉన్నారు. అక్కడ ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ ప్రచారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.. చదవండి: రింగ్ మాస్టర్‌కు ఝలక్.. నువ్వు లక్కీఫెలో భయ్యా! -
సరైన టైంలో నిర్ణయం.. అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 50 శాతం స్థానాల్లో పోటీపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. తాజ్‌మహల్ కంటే అందమైన సెక్రటేరియట్ కేసీఆర్ కట్టారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామం అని అసదుద్దీన్ పేర్కొన్నారు. ‘‘తెలంగాణలో మంచి పరిపాలన చేస్తున్నారు.. దేశమంతా వస్తే మంచిదే. మమ్మల్ని బీజేపీ బీ టీం అని కాంగ్రెస్ వాళ్లు ప్రచారం చేస్తున్నారు. బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో జేపీసీ కోసం అడిగితే మోదీ ఒప్పుకోవడం లేదు. సెక్రటేరియట్ ఓపినింగ్ అధికారిక కార్యక్రమం.. అక్కడికి వెళ్తాము. పరేడ్ గ్రౌండ్ మీటింగ్ బీఆర్ఎస్ రాజకీయ సమావేశం.. మాకు సంబంధం లేదు.. ఇతర పార్టీలని పిలిస్తే వాళ్ల ఇష్టం అని అసదుద్దీన్ అన్నారు. చదవండి: సీఎం కేసీఆర్‌తో జగ్గారెడ్డి భేటీ.. కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? -
జెండాలో ఆ రంగును తీసేస్తారా?: మోదీపై నిప్పులు చెరిగిన ఒవైసీ
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభలో బుధవారం కూడా అదానీకి సంబంధించిన హిండెన్‌బర్గ్ నివేదికపై రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అధికార బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల యుద్ధమే నడిచింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. కాగా, ఉభయ సభల్లో కేంద్ర మంత్రులు కౌంటర్‌కు దిగారు. కాంగ్రెస్ నేతలు హిండెన్‌బర్గ్ విషయం ప్రస్తావించగా.. బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ బోఫోర్స్ అంశాన్ని లేవనెత్తారు. అటు రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పీయూష్ గోయల్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఖర్గే ఆరోపణలకు కేంద్ర మంత్రి కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో దేశ భద్రత విషయంలో రాజీలేదని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖర్గే మాట్లాడుతూ.. నేను నిజం మాట్లాడితే అది దేశ వ్యతిరేకమా? నేను దేశ వ్యతిరేకిని కాదు. ఇక్కడ అందరికంటే నాకు దేశభక్తి ఎక్కువ. మీరు దేశాన్ని దోచుకుంటున్నారు. నేను దేశ వ్యతిరేకిని అని చెబుతున్నారు అంటూ మండిపడ్డారు. If I speak the truth, is it anti-national? I'm not anti-national. I'm more patriotic than anyone here. I'm a 'bhoomi-putra'...You're looting the country& telling me that I'm anti-national: LoP Rajya Sabha Mallikarjun Kharge during debate on Motion of Thanks on President's address pic.twitter.com/RnasKTzYl5 — ANI (@ANI) February 8, 2023 అటు బడ్జెట్ కేటాయింపులపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాల సందర్భంగా సభలో ఒవైసీ మాట్లాడుతూ.. రాష్ట్రపతి ప్రసంగంలో ముస్లింల గురించి ఒక్క మాట కూడా లేదు. మైనార్టీల పథకాలకు బడ్జెట్లో నిధులు తగ్గించారు. ఆకుపచ్చ రంగు అంటే ప్రధాని నరేంద్ర మోదీకి ఎందుకంత అసహనం?. జాతీయ జెండాలో ఆకుపచ్చరంగును తీసేస్తారా?. మీ నారీశక్తి నినాదం బిల్కిస్ బానో విషయంలో ఏమైంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. -
ఒవైసీకి రెండు ఓట్లు.. కాంగ్రెస్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సంఘం తాజాగా వెల్లడించిన ఓటరు జాబితాలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఒవైసీకి రెండు వేర్వేరు చిరునామాలతో రెండు చోట్ల ఓట్లున్నట్టు తేలింది. సాధారణ పౌరులకు ఇలా ఉన్నట్టు అడపాదడపా వినడం సాధారణమే అయినా.. ఒక ఎంపీకి నిబంధనలకు విరుద్ధంగా రెండు చోట్ల ఓటర్ల జాబితా లో పేరుండటం చర్చనీయాంశమైంది. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరు గుర్తింపు కార్డు నంబర్ (ఎపిక్ నంబర్) టీడీజడ్1557521తో హైదర్‌గూడ ఉర్దూ హాల్ లేన్ చిరునామాతో మదీనా హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ఒక ఓటుంది. రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజక వర్గంలో ఎపిక్ నంబర్ కేజీవై0601229తో మైలార్‌దేవ్‌పల్లిలో సెయింట్ ఫియాజ్ స్కూల్ పోలింగ్స్టేషన్లో మరో ఓటుంది. ఎన్నికల సంఘానికి టీపీసీసీ ఫిర్యాదు ఈ పరిణామాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణించింది. ముమ్మాటికీ నిబంధనలకు విరుద్ధమేనని వాదిస్తోంది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి రెండు చోట్ల ఓటు హక్కు ఉండటంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. -
గుజరాత్ అల్లర్లపై అమిత్ షా కామెంట్స్.. ఒవైసీ షాకింగ్ కౌంటర్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ పొలిటికల్ వాతావరణం వేడెక్కింది. నేతల మధ్య మాటల వార్ నడుస్తోంది. ఈ క్రమంలో ప్రచారంలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా.. 2002 గుజరాత్లో అల్లర్లు సృష్టించిన వారికి తగిన బుద్ధి చెప్పామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విధ్వంసం సృష్టించిన వారికి తగిన బుద్ధి చెప్పి 22 ఏళ్లుగా రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచామని అన్నారు. కాగా, అమిత్ షా వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ క్రమంలో బీజేపీపై కౌంటర్ అటాక్ చేశారు. కాగా, ఒవైసీ మాట్లాడుతూ.. అమిత్ షా మీరు చెప్పిన ఎన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. గుజరాత్ అల్లర్లు సృష్టించిన వారికి బుద్ధి చెప్పాం అని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోకి తెచ్చామనీ చెప్పుకుంటున్నారు. కానీ, బిల్కిస్‌ను దారుణంగా అత్యాచారం చేసిన దోషులను విడుదల చేయాలన్న పాఠం నేర్పారు. ఆ బాధితురాలి మూడేళ్ల కూతురుని హత్య చేసిన నేరస్థులను బయట స్వేచ్ఛగా తిరిగేలా చేయాలనీ మాకు నేర్పించారు. నేరస్థులకు శిక్ష పడినప్పుడే సమాజంలో అసలైన శాంతి నెలకొంటుంది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో అధికార బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం ఎప్పుడూ ఒక్కరి చేతిలోనే ఉండదు. ఏదో ఒకరోజు అధికారం మారుతుంది. అధికారంలో ఉన్నారనే భావనతోనే అమిత్ షా ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు అని తీవ్ర విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా.. తొలిసారిగా గుజరాత్ ఎన్నికల బరిలోకి ఎంఐఎం పార్టీ దిగుతోంది. తమ పార్టీ 14 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడు సబీర్ కబ్లీవాలా స్పష్టం చేశారు. .@AmitShah aapne kaunsa sabaq sikhaya? - Barrister @asadowaisi pic.twitter.com/aAuEIhukTm — AIMIM (@aimim_national) November 26, 2022 -
శ్రద్ధా హత్యోదంతం.. లవ్ జిహాద్ కాదు!
హైదరాబాద్: సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్యోదంతంపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గురువారం స్పందించారు. ఈ కేసుకు మతం రంగు పులమడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన.. ఇది లవ్ జిహాద్ ఘటన కాదంటూ ఉద్ఘాటించారు. ‘‘ఈ వ్యవహారాన్ని మత కోణంలో బీజేపీ చూస్తోంది. బీజేపీ రాజకీయాలు పూర్తిగా తప్పు. ఇది లవ్ జిహాద్ ఘటన కాదు. కానీ.. ఒక మహిళపై హేయనీయంగా ప్రవర్తించడం, వేధించడం.. దాడికి సంబంధించింది. ఆ కోణంలోనే ఈ కేసును చూడాలి.. అంతా ఖండించాలి కూడా’’ అని ఒవైసీ పేర్కొన్నారు. ఇక ఆజామ్‌ఘడ్‌లో ఓ వ్యక్తి తన భార్యను కిరాకతంగా చంపి.. సూట్‌కేసులో కుక్కిన ఘటనపైనా స్పందించారు ఒవైసీ. ఇలాంటి ఘటనలు బాధాకరమని, వీటికి హిందూ-ముస్లిం రంగులు పులిమి రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. శ్రద్ధా వాకర్ హత్య కేసును ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ప్రముఖంగా ప్రస్తావించింది. ఆదివారం ఈశాన్య ఢిల్లీలో జరిగిన రోడ్ షోలో అసోంముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. మెహ్రౌలీ(శ్రద్ధా కేసు) ఘోర హత్య తనను కలిచివేసిందని అన్నారు. దేశానికి యూనిఫామ్ సివిల్ కోడ్‌తో పాటు లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా కఠిన చట్టం తేవాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఈ దేశానికి అఫ్తాబ్(శ్రద్ధా హత్యకేసు నిందితుడు) లాంటి వాళ్ల అవసరం లేదని, శ్రీరాముడులాంటి వ్యక్తి.. నరేంద్ర మోదీ నేతల అవసరం ఉందని అసోం సీఎం వ్యాఖ్యానించారు. -
అసదుద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడి?
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌పై రాళ్ల దాడి జరిగినట్లు ఆల్ ఇండియా మజ్లిజ్ ఈ ఇత్తెహదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) పార్టీ అధికార ప్రతినిధి ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను ఖండించారు పోలీసులు. సోమవారం జరిగిన ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. సోమవారం సాయంత్రం ట్రైను సూరత్‌కు చేరుకునే క్రమంలో రాళ్ల దాడి జరిగినట్లు ఏఐఎంఐఎం జాతీయ ప్రతినిధి వారిస్ పఠాన్ ఆరోపించారు. గుజరాత్‌లోని సూరత్‌లో ప్రచార ర్యాలీ నిర్వహించేందుకు ఆయన వెళ్తున్నారని చెప్పారు. రైలుపై రాళ్లు విసిరినట్లు తన వద్ద కొన్ని ఫోటో ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ‘అసదుద్దీన్ ఓవైసీ సాబ్, సబిర్ కబ్లివాలా సర్, నేను, ఏఐఎంఐఎం టీం అహ్మదాబాద్ నుంచి సూరత్‌కు వందేభారత్ రైలులో ప్రయాణిస్తున్నాం. ఈ క్రమంలో కొందరు దుండగులు రాళ్లు విసిరి అద్దాలు పగలగొట్టారు.’ అని పేర్కొన్నారు వారిస్ పఠాన్. ఏఐఎంఐఎం ఆరోపణలను ఖండించారు పశ్చిమ రైల్వే పోలీసు ఎస్పీ రాజేశ్ పర్మార్. భరుచి జిల్లాలోని అంక్లేశ్వర్ సమీపంలో ట్రాక్ పనులు నడుస్తున్నందున కొన్ని రాళ్లు ట్రైన్‌పై పడ్డాయని తెలిపారు. ఇది రాళ్ల దాడి కాదని స్పష్టం చేశారు. ఆయన కిటికీకి దూరంగానే కూర్చుని ఉన్నారని తెలిపారు. దెబ్బతిన్న విండోను మార్చామని, దర్యాప్తు చేపట్టాని తెలిపారు. అసదుద్దీన్ ఓవైసీ కూర్చున్న సీటు పక్క కిటికి అద్దం ఇదీ చదవండి: సౌత్‌లో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ట్రయల్ రన్ సక్సెస్ -
ముందు బైక్... వెనకాల కాన్వాయ్.. అభిమానిని చూసి ఆగిన ఎంపీ
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ మంగళవారం మధ్యాహ్నం బంజారాహిల్స్ రోడ్ నెం. 12 మీదుగా బైక్‌పై వెళుతుండగా రోడ్డు పక్క నుంచి ఎన్బీటీ నగర్ బస్తీకి చెందిన అభిమాని కనిపించాడు. దీంతో వెనుకాల కాన్వాయ్‌తో పాటు తన బైక్‌ను కూడా రోడ్డు పక్కన ఆపి అతడిని పలకరించారు. బైక్‌పై దూసుకెళ్తున్న అసదుద్దీన్ ఒవైసీ ఒక్కసారిగా బుల్లెట్ బండి దిగి రోడ్డుపై వెళుతున్న ఎన్బీటీ నగర్‌కు చెందిన శివకుమార్‌ను గుర్తు పట్టిన అసద్ ఆగడమే కాకుండా కుశలప్రశ్నలు వేశారు. అతడి తండ్రి ఒవైసీ పోటీ చేసినప్పుడు తాను బూత్ ఏజెంట్‌గా ఉండేవాడినని ఈ సందర్భంగా శివకుమార్ గుర్తు చేసుకున్నారు. స్వయంగా అసద్ బుల్లెట్ దిగి తనను పలకరించడంపట్ల శివకుమార్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ దృశ్యాన్ని అక్కడున్న వారంతా తమ సెల్ఫోన్లలో బంధించారు. (క్లిక్ చేయండి: ఫోర్జరీ కేసులో టీటీడీపీ ప్రధాన కార్యదర్శి జీవీజీ నాయుడు అరెస్ట్) -
ఒవైసీ కామెంట్లు.. బీజేపీ కౌంటర్
బీజాపూర్: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తాజా వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. హిజాబ్ ధరించిన మహిళ భారత్‌కు ప్రధానిగా చూడాలని ఉందంటూ ఒవైసీ కామెంట్లు చేశారు. అంతటితో ఆగకుండా బీజేపీపై విరుచుకుపడ్డారు. మంగళవారం కర్ణాటక బీజాపూర్‌లో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. బీజేపీ దేశంలోని సెక్యులరిజాన్ని రూపుమాపాలని చూస్తోందని, అందరికీ సమాన అవకాశాలు అనే సిద్ధాంతానికి ఆ పార్టీ పూర్తి వ్యతిరేకమని ఆయన విమర్శించారు. అయితే.. ఒవైసీ కామెంట్లకు.. బీజేపీ బదులిచ్చింది. బీజేపీ నేత షెహ్జాద్ పూనావాలా ట్విటర్లో బుధవారం ఒవైసీపై సెటైర్లు పేల్చారు. హిజాబ్ ధరించే మహిళ ప్రధాని కావాలని ఒవైసీ కోరుకుంటున్నారు. రాజ్యాంగం ఎవరినీ అడ్డుకోదు కూడా. కానీ, హిజాబ్ ధరించిన మహిళ ఏఐఎంఐఎం పార్టీకి ఎప్పుడు ప్రెసిడెంట్ అవుతుంది?. ఒవైసీ కోరిక అక్కడి నుంచే ఎందుకు మొదలు కాకూడదు అంటూ షెహ్జాద్ ట్వీట్ చేశారు. Owaisi ji hopes that a Hijab wearing girl becomes PM of India! Well Constitution bars nobody but do tell us when will a Hijab wearing girl get to become President of AIMIM? Let us start with that? pic.twitter.com/MdG4v0sky6 — Shehzad Jai Hind (@Shehzad_Ind) October 26, 2022 ఇక హిజాబ్ వ్యవహారంలో సుప్రీం జడ్జిలు భిన్నతీర్పులు ఇవ్వడంపైనా ఒవైసీ బీజాపూర్‌లో స్పందించారు. హిజాబ్ ధరించి విద్యాలయాలకు వెళ్లడం పెద్ద సమస్యేమీ కాదని జడ్జి వ్యాఖ్యానించారని ఒవైసీ గుర్తు చేశారు. హలాల్ మాంసం, ముస్లిం టోపీలు, గడ్డాలు.. ఇలా అన్నింటి నుంచి ప్రమాదమని బీజేపీ భావిస్తోంది. ముస్లింల ఆహార అలవాట్లు కూడా వాళ్లకు సమస్యే. ఇస్లాంకు పూర్తి వ్యతిరేకం ఆ పార్టీ. దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి, ఇస్లాం గుర్తింపును ముగించాలన్నదే బీజేపీ అసలు ఎజెండా అని విమర్శలు గుప్పించారు. ఇదీ చదవండి: ఉచిత విద్యను 'రేవడీ' అనడం బాధాకరం -
భారత్-పాక్ మ్యాచ్‌పై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
టీ20 వరల్డ్‌కప్-2022లో దాయాదుల సమరం ప్రారంభానికి ముందే ఇరు దేశాల మధ్య వాతావరణాన్ని వేడెక్కించింది. వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్ వన్డే టోర్నీలో ఆడేందుకు భారత్.. పాక్‌లో అడుగుపెట్టబోయేది లేదంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా చేసిన వ్యాఖ్యలే ఈ ఉద్రిక్త వాతావరణానికి కారణమయ్యాయి. షా వ్యాఖ్యలకు బెదిరిపోయిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. భారత్‌కు కౌంటరిచ్చే ప్రయత్నం చేసింది. ఆసియా కప్ ఆడేందుకు భారత్ పాక్‌లో అడుగుపెట్టకపోతే.. భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో తామూ కూడా పాల్గొనేది లేదంటూ బెదిరింపులకు దిగింది. కొందరు పాక్ ఆటగాళ్లైతే.. టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. వికారాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆసియా కప్ ఆడేందుకు మనం పాక్‌కు వెళ్లకూడదనుకున్నప్పుడు.. మెల్బోర్న్లో రేపు (అక్టోబర్ 23) ఆ జట్టుతో మ్యాచ్ ఎందుకు ఆడాలి.. వదిలేయండి.. పాక్‌తో మ్యాచ్ ఆడకుంటే ఏమవుతుంది..? రూ.2,000 కోట్ల నష్టం వస్తుందా..? ఇది మన దేశం కంటే ముఖ్యమా..? అంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. అసదుద్దీన్ చేసిన ఈ వ్యాఖ్యలు హైటెన్షన్ మ్యాచ్‌కు ముందే వాతావరణాన్ని హీటెక్కిస్తున్నాయి. ఇదిలా ఉంటే, భారత్-పాక్‌ల మధ్య మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రేపు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. -
ముస్లిం జనాభా పెరగడం లేదు..
సాక్షి, హైదరాబాద్: ‘‘దేశంలో ముస్లింల జనాభా పెరగడం లేదు. పెరుగుదల రేటు తగ్గుతోంది. బిడ్డకు బిడ్డకు మధ్య అంతరం గరిష్టంగా ఉండేందుకు కండోమ్‌లు ఎక్కువగా వాడుతున్నది ముస్లింలే..’’ అని ఆలిండియా ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింల పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి హైదరాబాద్ దారుస్సలాం మైదానంలో జరిగిన రహ్మతుల్ లిల్ ఆలమీన్ సభలో ఆయన ప్రసంగించారు. జనాభా నియంత్రణ విషయమై ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను అసదుద్దీన్ తప్పుపట్టారు. ముస్లింల సంతానోత్పత్తి రేటు తగ్గిందన్న విషయాన్ని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ముస్లింల జనాభా పెరుగుతోందని అనవసరంగా ఆరోపణలు చేయవద్దన్నారు. వారి తీరు జాతీయ వాదానికి వ్యతిరేకం బీజేపీ హిందూ దేశం కలలు స్వాతంత్య్ర భారతానికి, జాతీయవాదానికి వ్యతిరేకమని అసదుద్దీన్ పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింల పరిస్థితి దారుణంగా ఉందని, బహిరంగ జైళ్లలో జీవిస్తున్నట్టుగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వీధికుక్కలకు దక్కిన గౌరవం కూడా ముస్లింలకు దక్కడం లేదన్నారు. గుజరాత్లో దాండియా కార్యక్రమంపై రాళ్లు రువ్వారని ఆరోపిస్తూ పోలీసులు తొమ్మిది మందిని స్తంభానికి కట్టేసి కొరడాలతో కొట్టారని.. పోలీసులు ఇలా చట్టాన్ని చేతిలో తీసుకుంటే కోర్టులు ఎందుకు మూసివేయాలని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా మౌనం వహించడం విచారకరమని పేర్కొన్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను దేశభక్తులుగా అభివర్ణించడం సరికాదని విమర్శించారు. మిలాద్ సందర్భంగా పోలీసులు పెట్రోల్ బంకులు మూసివేయడం ఏమిటని, మిగతా పండుగలకు అలా ఎందుకు మూసివేయరని ప్రశ్నించారు. టిప్పు వారసత్వాన్ని తుడిచిపెట్టలేరు బెంగళూరు–మైసూర్ టిప్పు ఎక్స్‌ప్రెస్ రైలు పేరును వడయార్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చడాన్ని అసదుద్దీన్ తప్పుపట్టారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా టిప్పుసుల్తాన్ పోరాడారని, అది బీజేపీకి రుచించలేదా అని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలతో టిప్పు వారసత్వాన్ని తుడిచి వేయడం బీజేపీకి ఎప్పటికీ సాధ్యం కాదన్నారు. -
ఒవైసీ హాట్ కామెంట్స్
-
అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో శునకాలకున్న గౌరవం కూడా ముస్లింలకు లేదని అన్నారు. ముస్లింలను బూచిగ చూపెట్టి ఆర్ఎస్ఎస్ విభజన రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. దేశంలో ముస్లింలు ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతకాల్సిన అవసరం లేదన్నారు. ముస్లింలకు రాజ్యాంగం కల్పించిన అధికారాలు ఉన్నాయని చెప్పారు. ఒకప్పుడు నన్ను బీజేపీ బీ-టీమ్‌గా పిలిచిన మమతా బెనర్జీ ఇప్పుడు ఆర్ఆర్ఎస్, మోదీలను పొగుడుతున్నారని ఎంపీ అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. చదవండి: (ఈయనగారిని ఇలాగే వదిలెయ్యకండిరా.. బీజేపీ బాబులూ!) -
మోదీకి ఎందుకంత భయం.. ఒవైసీ సెటైర్లు
సాక్షి,న్యూఢిల్లీ: చైనా జిన్జియాంగ్ రాష్ట్రంలో ఉయ్ఘర్లపై జరుగుతున్న మనవహక్కుల ఉల్లంఘనలపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్ ముందుకు ముసాయిదా తీర్మానం వచ్చింది. అయితే దీనిపై చర్చకు జరిగిన ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. పలు ఇతర దేశాలు కూడా ఓటింగ్‌లో పాల్గొనకపోవడంతో ఇది చైనాకు అనుకూలంగా మారింది. తీర్మానం వీగిపోయింది. ఫలితంగా చైనాకు మరోసారి తిరుగులేకుండా పోయింది. ఈ విషయంపై స్పందిస్తూ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అంటే ఎందుకంత భయం? అని ప్రశ్నించారు. ఆయనతో 18 సార్లు భేటీ అయినా.. ఏది కరెక్ట్, ఏది తప్పో చెప్పే ధైర్యం లేదా అని నిలదీశారు. ఐరాస ఓటింగ్‌లో భారత్ దూరంగా ఉండి చైనాకు ఎందుకు అనుకూలంగా వ్యవహరించిందో ప్రధాని చెప్పాలని ఒవైసీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. Will the PM Modi saheb explain the reason for India’s decision to help China out in the UNHRC on the Uighur issue by choosing to abstain from an important vote? Is he so scared of offending Xi Jingping, whom he met 18 times, that India can’t speak for what is right? https://t.co/TJNy3Ffn2w — Asaduddin Owaisi (@asadowaisi) October 7, 2022 కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామ మహమద్ కూడా ఈ విషయంపై విమర్శలు గుప్పించారు. మన భూమిని చైనా ఆక్రమించిందని చెప్పడానికి గానీ, చైనాలో మానవహక్కుల ఉల్లంఘనలకు ఖండించడానికి గానీ మోదీ సిద్ధంగా లేరు, చైనా అంటే ఆయనకు ఎందుకంత భయం అని ప్రశ్నించారు. ఈమేరకు ఆమె ట్వీట్ చేశారు. India abstains on draft resolution at UNHRC for a debate on human rights violations of Uyghurs in China Far from holding China accountable for stealing our land, PM Modi can't even bring himself to condemn China on human right violations. Why is @narendramodi so scared of China! — Dr. Shama Mohamed (@drshamamohd) October 6, 2022 ఐరాస మానవహక్కుల కమిషన్ తీర్మానంపై జరిగిన ఓటింగ్ ఫలితం చైనాకు అనుకూలంగా వచ్చింది. 19 దేశాలు తీర్మానాన్ని వ్యతిరేకించాయి. భారత్, మలేసియా, ఉక్రెయిన్ సహా 11 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. దీంతో తీర్మానం వీగిపోయింది. చదవండి: వందే భారత్ రైలు ప్రమాదం.. గేదెల యజమానులపై కేసు -
ఒవైసీ హత్యాయత్నం కేసు.. యూపీ సర్కార్‌కు నోటీసులు
ఢిల్లీ: ఎంఐఎం అధినేత, లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై జరిగిన హత్యాయత్నం కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులకు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ.. ఒవైసీ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయితే.. ఈ అంశాన్ని పునర్విచారణ కోసం అలహాబాద్ హైకోర్టుకు తిరిగి పంపాలా వద్దా అనే అంశంపై మాత్రమే సుప్రీంకోర్టు ఇవాళ నోటీసు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 11న చేపట్టనుంది. హాపూర్‌లో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆయన కాన్వాయ్‌పై ఫిబ్రవరి 3వ తేదీన దాడి జరిగింది. తుపాకీతో కాల్పులు జరిపారు దుండగులు. అయితే దాడి నుంచి ఒవైసీ సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఈ హత్యాయత్నానికి సంబంధించి నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. అయితే వాళ్లకు బెయిల్ మంజూరు కావడంతో ఇప్పుడు వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఇదీ చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్విస్ట్ -
అసదుద్దీన్ ఫోన్ నంబర్ కోసం ముంబైలో ఆరా.. బాంబ్ బ్లాస్ట్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని చార్మినార్ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఫోన్ నెంబర్ కోసం ముంబైలోని ఆ పార్టీ యాక్టివిస్ట్‌ను సంప్రదించాడు. అతడు తిరస్కరించడంతో దేశ వ్యాప్తంగా బాంబు పేలుళ్లు చేస్తామంటూ బెదిరించాడు. ఈ వ్యవహారం అక్కడి శాంతాక్రుజ్ సైబర్ క్రైమ్ పోలీసుల వద్దకు వెళ్లడంతో కేసు నమోదై నగర వాసి అరెస్టు అయ్యాడు. దీన్ని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ బాలాసాహెబ్ తాంబే సాక్షికి తెలిపారు. చార్మినార్ ప్రాంతానికి చెందిన రంజిత్ కుమార్ వ్యాపారి. ఈయన సోషల్ మీడియా ద్వారా ముంబైలోని శాంత క్రుజ్ వాసి రఫత్ హుస్సేన్ ఫోన్ నెంబర్ సంగ్రహించాడు. గత మంగళవారం ఆయనకు వీడియో కాల్ చేసిన రంజిత్ తనకు ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ ఫోన్ నెంబర్ కావాలంటూ అడిగాడు. హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన రంజిత్ ముంబైలో ఉండే తనకు ఫోన్ చేసి అసదుద్దీన్ ఓవైసీ నెంబర్ అడగటంతో హుస్సేన్ అనుమానించారు. దీనికి తోడు తనకు రంజిత్‌తో పరిచయం లేకపోవడంతో ఫోన్ నెంబర్ ఇవ్వనంటూ స్పష్టం చేశాడు. దీంతో సహనం కోల్పోయిన రంజిత్ తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చాడు. తాను అడిగిన ఫోన్ నెంబర్ ఇవ్వడానికి తిరస్కరించావని, ఫలితంగా బుధవారం (మరుసటి రోజు) దేశ వ్యాప్తంగా బాంబు పేలుళ్లు తప్పవంటూ బెదిరించి ఫోన్ పెట్టేశాడు. ఈ పరిణామంతో కంగుతిన్న హుస్సేన్ విషయాన్ని అక్కడి క్రైమ్స్ విభాగం డీసీపీ బాల్సింగ్ రాజ్‌పుత్‌కు ఫిర్యాదు చేశారు. వస్త్ర వ్యాపారి అయిన హుస్సేన్ ఫిర్యాదు ఆధారంగా శాంతాక్రుజ్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గత గురువారం నగరానికి వచ్చిన ప్రత్యేక బృందం రంజిత్‌ను అరెస్టు చేసి తీసుకువెళ్లింది. శుక్రవారం అక్కడి కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి అనుమతితో రోజుల పోలీసు కస్టడీకి తీసుకుంది. దీనిపై ఇన్స్పెక్టర్ బాలాసాహెబ్ తాంబే సాక్షితో మాట్లాడుతూ... ప్రాథమిక విచారణలో రంజిత్ తనకు అసదుద్దీన్ అంటే అభిమానమని, ఆయన్ని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకోవడానికే ఫోన్ నెంబర్ అడిగానని చెప్పాడు. హుస్సేన్ తిరస్కరించడంతో పాటు నిర్లక్ష్యంగా మాట్లాడటంతోనే అలా వార్నింగ్ ఇచ్చానని వివరించాడు. రంజిత్ ఆకతాయి తనంతోనూ ఇలా చేశాడని అనుమానం ఉంది. -
ఒవైసీకి శ్రీనగర్ పోలీసుల స్ట్రాంగ్ కౌంటర్
శ్రీనగర్: ఏఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి శ్రీనగర్ పోలీసులు కౌంటర్ ఇచ్చారు. జామియా మసీద్ విషయంలో ఒవైసీ చేసిన ఆరోపణలను పోలీసులు ఖండించారు. సోఫియాన్, పుల్వామాలో తాజాగా మల్టీపర్పస్ సినిమా హాల్స్‌ను ప్రారంభించారు జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. దీంతో హాల్‌కు వెళ్లి సినిమా చూడాలన్న అక్కడి ప్రజల చిరకాల కల నెరవేరిందంటూ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు వస్తున్నాయి. అయితే ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ.. ఎంపీ ఒవైసీ ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. శ్రీనగర్‌లోని జామియా మసీద్‌ను ప్రతీ శుక్రవారం మూసేస్తున్నారని, కనీసం శుక్రవారం మధ్యాహ్న సమయంలో అయినా తెరవాలంటూ ఎల్జీని ఉద్దేశిస్తూ ఎద్దేవా ట్వీట్ చేశారు ఒవైసీ. అయితే దీనికి.. శ్రీనగర్ పోలీసులు ట్విటర్ ద్వారా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ‘‘జామియా పూర్తిగా తెరిచే ఉంటోంది. కరోనా తర్వాత కేవలం మూడు శుక్రవారాల్లో మధ్యాహ్న నమాజ్ సమయంలో మాత్రమే, అదీ ఉగ్రదాడి సమాచారం, శాంతిభద్రతల సమస్యలతో మూతపడింది. లోపల జరిగే సంఘటనలకు తమది బాధ్యత కాదని జామియా అధికారులు ప్రకటించిన నేపథ్యంలోనే తాత్కాలికంగా ఆ పూటకు మూసేయాల్సి వచ్చింది’’ అంటూ చివర్లో.. అజ్ఞానానికి సాకు లేదు అని ఒవైసీ ట్వీట్‌కు శ్రీనగర్ పోలీసులు ఘాటుగానే బదులు ఇచ్చారు. Jamia is fully opened,only on 3 occasions post-covid,it was temporarily shut for friday noon prayers owing to inputs of terror attack /law & order situation.This was after Jamia authorities failed to take responsibility of happenings inside. Staying far is no excuse of ignorance. https://t.co/wqicG3oAr2 — Srinagar Police (@SrinagarPolice) September 20, 2022 ఇదీ చదవండి: హిజాబ్‌పై నిషేధం సబబే! -
నెహ్రు తర్వాత బలమైన ప్రధాని మోదీనే.. ఒవైసీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రజల అవసరాలు తీర్చేందుకు బలమైన ప్రధాని వద్దంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో బలహీన వర్గాలు, మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూరాలంటే దేశంలో బలహీన ప్రధాని అవసరం అన్నారు. ఈసారి బలహీనులకు లబ్ధి చేకూర్చే బలహీన ప్రధాని దేశానికి అవసరమని తాను భావిస్తున్నానని సెటైరికల్ కామెంట్స్ చేశారు. బలహీన ప్రధాని పగ్గాలు చేపడితే బలహీనవర్గాలు లాభపడతాయని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. బలమైన ప్రధాని కేవలం ధనవంతులకు(సంపన్న వర్గాలకే) సాయపడుతున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు మనం బలమైన ప్రధానిని చూశాము.. ఇక వచ్చే ఎన్నికల్లో పేదలకే మేలు చేసే ప్రధానిని ఎన్నుకోవాలన్నారు. కాగా, 2024 ఎన్నికల్లో తాము ఈ దిశగా ప్రయత్నం చేస్తామన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వానికి 306 మంది ఎంపీలున్నా.. వ్యవస్థను నిందిస్తున్నారని అన్నారు. పేదలు, రైతులు, యువతకు మేలు చేసేందుకు ఆయనకు ఇంకా ఏం అధికారాలు కావాలని ప్రశ్నించారు. దేశంలో జవహర్లాల్ నెహ్రూ తర్వాత అత్యంత శక్తివంతమైన ప్రధాని అయిన నరేంద్ర మోదీ.. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, చైనా చొరబాటు, కార్పొరేట్ ట్యాక్స్ రద్దు వంటి ప్రశ్నలు ఎదురైతే ప్రధాని వ్యవస్ధను నిందిస్తుంటారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగానే ఒవైసీ.. ఆమ్ ఆద్మీ పార్టీపైన సైతం విమర్శలు గుప్పించారు. గుజరాత్లో జరిగిన బిల్కిన్ బానో కేసు విషయంలో ఖైదీల విడుదలపై అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు స్పందించలేదన్నారు. ఆప్ కూడా బీజేపీ వంటిదేనని.. రెండు పార్టీలు ఒక్కటేనని అన్నారు. When we speak of development of minority communities & justice for them, nonsense is spoken against us. This is hypocrisy in a way that those posing as experts of secularism today will decide who's secular & who's communal.The country is watching them: AIMIM chief Asauddin Owaisi pic.twitter.com/gNFrieqoeQ — ANI (@ANI) September 10, 2022 -
కారు స్టీరింగ్ ఒవైసీ చేతిలో ఉంది: తరుణ్ చుగ్
-
అమిత్ షాకు లేఖ రాసిన ఒవైసీ.. సెప్టెంబర్ 17న ఏం జరగబోతోంది?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ లేఖలు రాశారు. లేఖల్లో సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యత దినంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఎంఐఎం చీఫ్ ఒవైసీ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు. కాబట్టి సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యత దినంగా నిర్వహించాలి. 17వ తేదీన పాతబస్తీలో తిరంగాయాత్ర, బహిరంగ సభ నిర్వహిస్తాము. ఈ కార్యక్రమంలో మా పార్టీ ఎమ్మెల్యేలందరూ పాల్గొంటారు. తెలంగాణ విమోచనం కోసం హిందువులు, ముస్లింలు కలిసి పోరాడారు అని వ్యాఖ్యానించారు. ఇది కూడా చదవండి: పాలిటిక్స్‌లో ట్విస్టులు.. బీజేపీ బిగ్ ప్లాన్! -
ఆరెస్సెస్‌కు సపోర్టుగా దీదీ వ్యాఖ్యలు.. ఒవైసీ గరం!
బెంగాల్ రాజకీయాలు అనగానే బీజేపీ వర్సెస్ సీఎం మమతా బెనర్జీ అన్నట్టుగా ఉంటాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి రెండు పార్టీల మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. అయితే, ఈ క్రమంలో సీఎం మమత.. ఆరెస్సెస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆమె వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ మమతకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. అయితే, సీఎం మమతా బెనర్జీ ఇటీవల ఆరెస్సెస్‌పై మాట్లాడుతూ గతంలో ఉన్నంత చెడ్డగా లేదని అన్నారు. కాగా, ఆమె వ్యాఖ్యలపై తాజాగా ఎంఐఎం చీఫ్ అసద్దుద్దీన్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. అసద్ స్పందిస్తూ.. ఆరెస్సెస్ హిందూ రాజ్యాన్ని కాంక్షిస్తుందన్నారు. ఆరెస్సెస్ చరిత్రంతా ముస్లిం వ్యతిరేకతే కనిపిస్తుందన్నారు. ఆరెస్సెస్‌పై వ్యాఖ్యలపై మమతా బెనర్జీ నిజాయితీని, నిలకడ ధోరణిని టీఎంసీ ముస్లిం నేతలు ప్రశంసిస్తారని పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే మమత 2003లో ఆరెస్సెస్‌పై చేసిన వ్యాఖ్యలను సైతం గుర్తు చేశారు. 2003లో ఆరెస్సెస్‌ను దేశభక్తులుగా కీర్తించారని, ఆరెస్సెస్‌లో ఇప్పటికీ చాలా మంది మంచివారున్నారని, వారు బీజేపీకి మద్దతివ్వబోరని మమత చెప్పినట్టు ఒవైసీ తెలిపారు. దీంతో, ఆరెస్సెస్ మమతా బెనర్జీని దుర్గగా అభివర్ణించారని చెప్పుకొచ్చారు. ఇక, మమత వ్యాఖ్యలపై బెంగాల్ ఇమాం అసోసియేషనన్ చీఫ్ మహ్మద్ యాహ్య కూడా స్పందిస్తూ 20 కోట్ల మంది ముస్లింలు మమతా బెనర్జీని సెక్యులర్ నేతగా భావిస్తున్నరని తెలిపారు. కానీ, అనూహ్యంగా ఆమె ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని స్పష్టం చేశారు. In 2003 too Mamata had called RSS “patriots”. In turn RSS had called her “Durga”. RSS wants Hindu Rashtra. Its history is full of anti-Muslim hate crime. She’d defended BJP govt in Parliament after Gujarat pogrom. Hope TMC’s “Muslim faces” praise her for her honesty & consistency https://t.co/45LKZ7aI4s — Asaduddin Owaisi (@asadowaisi) September 1, 2022 ఇది కూడా చదవండి: బీజేపీ హై కమాండ్‌కు రాజాసింగ్ భార్య లేఖ.. ఏమన్నారంటే? -
రాజాసింగ్ సస్పెన్షన్ ఓ డ్రామా.. టీఆర్ఎస్తోనే అది సాధ్యమైంది
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ ఒక నాటకమని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు బీజేపీ నాటకమాడుతోందని ఆరోపించారు. సోమవారం హైదరాబాద్ దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజాసింగ్‌కు బీజేపీ మద్దతు కొనసాగుతోందన్నారు. జైలులో ఉన్న ఆయనను విడిపించేందు కు బీజేపీ తీవ్రంగా ప్రయ త్నిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నందునే విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ ను వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపించిందని, ఢిల్లీలో శాంతిభద్రతల అంశం కేంద్రం చేతుల్లో ఉండటంతో నుపుర్శర్మని అరెస్ట్ చేయలేదన్నారు. బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. మాంసాహారంపై నిషేధమా?: కర్ణాటకలో గణేశ్ చతుర్థి సందర్భంగా మాంసాహారంపై నిషేధం విధించడమేమిటని ఒవైసీ మండిపడ్డారు. బెంగళూరులో మాంసాహారాన్ని నిషేధించడం ద్వారా ప్రపంచానికి ఎలాంటి సందేశం ఇవ్వాలని బీజేపీ యత్నిస్తోందని ప్రశ్నించారు. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని మండిపడ్డారు. కర్ణాటకలో 80 శాతంమంది ప్రజలు నాన్‌వెజ్ తింటున్నారని పేర్కొన్నారు. హోటళ్లలో యథేచ్ఛగా నాన్‌వెజ్ దొరుకుతుండగా, పేదల కోసం నాన్‌వెజ్ షాపులు తెరిస్తే మాత్రం అభ్యంతరం చెబుతున్నారని అన్నారు. మాంసం విక్రయించేవాళ్లలో అత్యధికులు ముస్లిం వర్గానికి చెందినవారేనన్న అక్కసుతోనే మాంసం విక్రయాలపై నిషేధం విధిస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలో హక్కులు అణచివేతకు గురవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. మొరాదాబాద్‌లో ముస్లింలను నమాజ్ చేయకుండా నిలిపివేయడంపై ఒౖవైసీ మండిపడ్డారు. నమాజ్ చేయడానికి అనుమతి తీసుకోవాలా, ఇది ముస్లింలపట్ల ద్వేషాన్ని స్పష్టం చేస్తోందన్నారు. బీజేపీ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తోందని, ముస్లింలను అణిచివేసేందుకు అన్నిచోట్లా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బీసీసీఐ అడ్మినిస్ట్రేటర్ జయేశ్ షాకు సంబంధించిన ఓ ప్రశ్నపై ఒవైసీ స్పందిస్తూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం భారత్‌పై ఉన్న ప్రేమను రుజువు చేయదని అన్నారు. -
హైదరాబాద్‌పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్.. అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, హైదరాబాద్‌పై బీజేపీ కుట్ర చేసిందని ఎఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ధ్వజమెత్తారు. మత కల్లోలాలు సృష్టించేందుకు హైదరాబాద్‌పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేపట్టిందని మండిపడ్డారు. బీజేపీ సర్జికల్ స్ట్రైక్‌ను హైదరాబాదీలు భగ్నం చేశారని అన్నారు. పాతబస్తీలో కొంతమంది ఆందోళన చేశారని, అందులో ఏం తప్పు ఉందని ప్రశ్నించారు. పోలీసులపై ఎవరూ రాళ్లు విసరలేదని స్పష్టం చేశారు. కొందరిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, వాళ్లను విడిపిస్తే తప్పేముందని నిలదీశారు. రాజాసింగ్‌కు ఇప్పటికీ బీజేపీ పెద్దల మద్దతు ఉందన్నారు. కాగా గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పీడీయాక్ట్పై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మసీదుల్లో ప్రార్థనల అనంతరం ఎలాంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించరాదని ముస్లింలకు శుక్రవారం ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఒవైసీ సూచించారు. ప్రశాంతంగా ప్రార్ధనలు చేసుకోవాలని సూచించారు. ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ఉండాలంటే ప్రార్థనల అనంతరం అందరూ ప్రశాంతంగా తమ ఇళ్లలోకి వెళ్లాలని తెలిపారు. ఓవైసీ, మత పెద్దల పిలుపుతో ప్రశాంతంగా ప్రార్ధనలు ముగిశాయి. చదవండి: తెలంగాణలో నయా నిజాం వచ్చారు.. కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన జేపీ నడ్డా -
ఒక్క ఉప ఎన్నిక కోసం బీజేపీ ఇంత బరితెగించాలా: ఎంపీ అసదుద్దీన్
సాక్షి, హైదరాబాద్: ఎఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు గురువారం తెలుగులో ట్వీట్లు చేశారు. ఒక ఉప ఎన్నిక కోసం బీజేపీ ఇంత బరితెగించాలా? అని మండిపడ్డారు. బీజేపీ తీరు ఇప్పుడే ఇలా ఉంటే సార్వత్రిక ఎన్నికల నాటికి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అగ్నికి ఆహుతి చేద్దాం అనుకుంటున్నారా? అని ధ్వజమెత్తారు. అల్లా దయతో ఇవన్ని జరగకూడదు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ శ్రుష్టిస్తున్న హింసకాండనుంచీ విముక్తి పొందాలని అసిద్దం. — Asaduddin Owaisi (@asadowaisi) August 25, 2022 దుకాణాలు, పాఠశాలలు మూయించి, ప్రజలను బయటకు రాకుండా చేస్తున్నారని విమర్శించారు. అల్లా దయతో ఇవన్నీ జరగకూడదని, తెలంగాణ రాష్ట్ర బీజేపీ సృష్టిస్తున్న హింసకాండ నుంచి విముక్తి పొందాలని ఆశిద్దామన్నారు. చదవండి: Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ బీజేపీ వక ఉప ఎన్నికల కోసం ఇంత బరితెగించాలా? ఇప్పుడే బీజేపీ తీరు ఇలా ఉంటే సార్వత్రిక ఎన్నికల పరిస్థితి ఏమిటి? రాష్ట్రాన్ని అగ్ని ఆహుతి చేద్దాం అనుకుంటున్నారా? దుకనాళ్లు, పాఠశాలలు మూయించి ప్రజలను ఇల్లలోనుంచి బయటకు రాకుండా చేసి కర్ఫ్యూ శ్రుష్టించాలని అనుకుంటున్నారా? — Asaduddin Owaisi (@asadowaisi) August 25, 2022 ఇదిలా ఉండగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై షాహినాయత్ గంజ్‌లోని ఆయన ఇంట్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ భద్రత నడుమ రాజాసింగ్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రాజాసింగ్‌కు వైద్య పరీక్షలు చేశారు. తర్వాత చర్లపల్లి జైలుకు తరలించే అవకాశం ఉంది. చదవండి: Hyderabad: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ -
మరో వీడియో విడుదల చేసిన రాజాసింగ్.. సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తనను నగర బహిష్కరణ చేయాలని చూస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. రెండోసారి అరెస్ట్‌కు ముందు ఆయన స్పందిస్తూ.. వీడియో విడుదల చేశారు. తాను తుపాకీ గుళ్లకు, ఉరిశిక్షకు భయపడేవాడిని కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. చదవండి: రాజాసింగ్‌కు ఊహించని షాక్.. ఇలా జరిగిందేంటి? ‘‘నేను మహ్మద్ ప్రవక్త గురించి వీడియోలో మాట్లాడానని కొందరు ఆరోపిస్తున్నారు. నేను వీడియోలో ఎక్కడా మహ్మద్ ప్రవక్త పేరును ప్రస్తావించలేదు. పాతబస్తీలో ఒవైసీ మతకల్లోలాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. నా తల నరుకుతామని నినాదాలు చేస్తున్నారు’’ అని రాజాసింగ్ అన్నారు. రెచ్చగొట్టే నినాదాలు చేసినవారిపై ఎన్ని కేసులు పెట్టారు అంటూ రాజాసింగ్ ప్రశ్నించారు. నన్ను ఇవాళ రాత్రి, లేదా తెల్లవారుజామున అరెస్ట్ చేస్తారనే సమాచారం అందింది. పాత కేసుల్లో అరెస్ట్ చేయాలని కుట్రలు చేస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. -
రాజాసింగ్ సస్పెన్షన్ కేవలం కంటితుడుపు చర్యే: అసదుద్దీన్ ఒవైసీ
-
స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఎంఐఎం లేఖ
-
స్పీకర్‌కు ఎంఐఎం లేఖ.. రాజాసింగ్‌పై సంచలన కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఎంఐఎం లేఖ రాసింది. రాజాసింగ్ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని పేర్కొంది. సెక్షన్ 41 సీఆర్పీసీ కింద నోటిస్ ఇవ్వలేదనే కారణంతోనే రాజాసింగ్‌కు బెయిల్ ఇచ్చారని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. చట్టప్రకారం మరోసారి రాజాసింగ్‌ను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చదవండి: Telangana: హీటెక్కిన స్టేట్..! హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ఉద్దేశంతోనే రాజాసింగ్ వీడియో విడుదల చేశారని అసదుద్దీన్ మండిపడ్డారు. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో హైదరాబాద్‌లో సాప్ట్వేర్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రాజాసింగ్‌ను అరెస్ట్ చేసి వీడియో శాంపిల్ తీసుకోవాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. కాగా, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చెలరేగిన దుమారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా.. రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది బీజేపీ. మరోవైపు రాజాసింగ్ వ్యాఖ్యలపై పాతబస్తీలోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. నాటకీయ పరిణామాల తర్వాత మంగళవారం రాత్రి రాజాసింగ్‌కు బెయిల్ దక్కిన నేపథ్యంలో.. భారీగా యువత ఓల్డ్‌సిటీలో రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
బీజేపీ అధిష్టానం ఆదేశాలతోనే హైదరాబాద్‌లో అలజడి: ఎంపీ అసదుద్దీన్
-
మునుగోడు కోసం తెలంగాణను తగలబెడతారా?: అసదుద్దీన్ ఒవైసీ ఫైర్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. మహ్మాద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో, మజ్లీస్ నేతల ఫిర్యాదులతో కేసు నమోదు చేసిన పోలీసులు రాజాసింగ్‌ను అరెస్ట్ చేశారు. పోలీసు వాహనంలో రాజాసింగ్‌ను స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎనిమిదేళ్లుగా తెలంగాణ ప్రశాంతంగా ఉంది. శాంతి భద్రతలను విఘాతం కలిగించాలని బీజేపీ కుట్ర చేస్తోంది. బీజేపీ అధిష్టానం ఆదేశాలతోనే అలజడి సృష్టిస్తున్నారు. లౌకికవాదాన్ని వ్యతిరేకించడమే బీజేపీ విధానం. ఉప ఎన్నికల కోసం తెలంగాణను తగలబెడతారా?. ఇస్లామ్‌కు, మహ్మాద్ ప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడటం బీజేపీకి పాలసీగా మారిపోయింది. రాజాసింగ్ విచారణను పోలీసులు రికార్డు చేయాలి’’ అని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: బీజేపీ నేతలు అరెస్ట్.. కిషన్ రెడ్డి స్పందన ఇదే.. -
కశ్మీరీ పండిట్లకు రక్షణ ఏదీ?: ఒవైసీ
ఢిల్లీ: కశ్మీరీ పండిట్ల రక్షణ విషయంలో కేంద్రం అవలంభిస్తున్న విధానాన్ని తప్పుబట్టారు ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. తాజాగా అక్కడ కశ్మీరీ పండిట్లపై జరిగిన దారుణ దాడి నేపథ్యంలో ఆయన తీవ్రంగా స్పందించారు. కశ్మీరీ లోయలో కశ్మీరీ పండిట్లకు రక్షణ కరువైంది. కేంద్ర పాలన దారుణంగా విఫలమవుతోంది. ఆర్టికల్ 370 రద్దు పండిట్లకు లాభం చేకూరుస్తుందని ప్రచారం చేసింది కేంద్రం. కానీ, ఇప్పుడు వాళ్లు అక్కడ అభద్రతా భావానికి లోనవుతున్నారు అని కేంద్రాన్ని నిందించారు ఒవైసీ. అక్కడ(జమ్ము కశ్మీర్)లో బీజేపీ చేత నియమించబడ్డ లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారు. నరేంద్ర మోదీ పాలనే అక్కడా సాగుతోంది. కానీ, చేతకానీ స్థితిలో ఉండిపోయారు వాళ్లు అంటూ విమర్శించారు. అలాగే.. గుజరాత్లో బిల్కిస్ బానో దురాగతం నిందితులకు క్షమాభిక్ష పెట్టి విడుదల చేయడంపైనా ఒవైసీ మండిపడ్డారు. ప్రధాని మోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలోనూ నారీశక్తి గురించి మాట్లాడారు. అలాంటిది గ్యాంగ్‌రేప్ దోషులకు రిలీజ్ చేయడం సమంజసమేనా? అని ప్రశ్నించారు. ఇక యూపీలో గాడ్సే ఫొటోతో తిరంగా యాత్రను నిర్వహించడంపై.. అక్కడి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఎంపీ ఒవైసీ. మాటల్లో గాంధీని ఉపయోగిస్తున్నారని.. కానీ, చేతల్లో గాడ్సే మీద ప్రేమను ఒలకబోస్తున్నారంటూ యోగి సర్కార్‌పై మండిపడ్డారు. ఇదీ చదవండి: బిల్కిస్ బానో క(వ్య)థ ఇది! -
యోగి సర్కార్ తీరు సరికాదు: ఒవైసీ
లక్నో: ఉత్తర ప్రదేశ్ సర్కార్‌పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అసంతృప్తి వెల్లగక్కారు. కన్వర్ యాత్ర సందర్భంగా.. కన్వరియాల మీద పూలు జల్లడం కోసం ప్రభుత్వ నిధుల్ని వెచ్చించడాన్ని, భక్తులకు పోలీసుల కాళ్లు నొక్కి, పూలతో స్వాగతం పలుకుతూ సేవలు చేయడానికి అధికారుల్ని సర్కార్ నియమించడాన్ని ఒవైసీ తప్పుబట్టారు. ఒకవైపు యూపీ ప్రభుత్వం కన్వర్ యాత్ర కోసం పూలు జల్లేందుకు అధికారుల్ని నియమిస్తోంది. ఎక్కడ చూసిన అవే కథనాలు కనిపిస్తున్నాయి. సంతోషం. అదే సమయంలో ముస్లింల ఇళ్లను కూల్చడానికి బుల్డోజర్లను అదే అధికారులతో పంపిస్తోంది. ముస్లింలు తమ మీద పూలు చల్లమని కోరుకోవడం లేదు.. కనీసం బుల్డోజర్లను తమవైపు పంపించొద్దని కోరుకుంటున్నారు. कांवड़ियों के जज़्बात इतने मुतज़लज़ल हैं कि वे किसी मुसलमान पुलिस अहलकार का नाम भी बर्दाश्त नहीं कर सकते। यह भेद-भाव क्यों? यकसानियत नहीं होनी चाहिए? एक से नफ़रत और दूसरों से मोहब्बत क्यों? एक मज़हब के लिए ट्रैफिक डाइवर्ट और दूसरे के लिए बुलडोज़र क्यों? 3/n pic.twitter.com/DPZwC02iNF — Asaduddin Owaisi (@asadowaisi) July 26, 2022 బహిరంగ ప్రాంతాల్లో కొన్ని నిమిషాలపాటు ముస్లింలు నమాజ్ చేస్తే.. నానా రభస చేస్తున్నారు. అదొక రచ్చ అవుతోంది. పోలీస్ కేసులు, బుల్లెట్లు, ఘర్షణలకు కారణం అవుతోంది. ఎన్ఎస్ఏ, యూఏపీఏ, మూకదాడులు-హత్యలు ఇవన్నీ ముస్లింలకేనా? అని ప్రశ్నించారు ఒవైసీ. లూలూ మాల్ వ్యవహారం తర్వాత యూపీలో చాలా చోట్ల బహిరంగ ప్రదేశాల్లో నమాజ్‌లు చేసేవాళ్లను అరెస్ట్ చేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలోనే ఎంపీ ఒవైసీ ఇలా అసహనం వ్యక్తం చేశారు. కన్వరియాల మనోభావాలు చాలా బలంగా ఉంటాయి. వారు ముస్లిం పోలీసు అధికారి పేరును కూడా సహించలేరు. ఎందుకు ఈ భేదం? ఒకరిని ద్వేషించి మరొకరిని ఎందుకు ప్రేమించాలి? ఒక మతం కోసం ట్రాఫిక్‌ను మళ్లించి, మరో మతానికి బుల్డోజర్లను ఎందుకు మళ్లించారు అంటూ ట్విటర్లో పోస్టులు చేశారు ఒవైసీ. ఇదీ చదవండి: కేసీఆర్‌ను ఓడించకపోతే నా జీవితానికి సార్థకత లేదు -
ఎంఐఎం తరపున గెలిచిన అరుణ
భోపాల్: ఎంఐఎం పార్టీ తరపున ఓ హిందూ అభ్యర్థి మధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందడం అక్కడి రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఊహించని రీతిలో ఓ మహిళా అభ్యర్థిని బరిలోకి దింపి గెలుపు అందుకుంది ఆ పార్టీ. స్వయానా మంత్రే దగ్గరుండి అక్కడి ప్రచార బాధ్యతలను చూసుకున్నా.. ఆమె గెలుపును ఆపలేకపోయారు. తన విజయానికి గానూ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. హామీలను నెరవేరుస్తానంటోంది అరుణ ఉపాధ్యాయ. మొట్టమొదటిసారి మధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది ఎంఐఎం. మొదటి ఫేజ్‌లో నాలుగు చోట్ల సంచలన విజయం సాధించింది. ఆయా చోట్ల బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించారు ఎంఐఎం అభ్యర్థులు. ఇప్పుడు రెండో ఫేజ్లోనూ ఏడు స్థానాల్లో పోటీ చేస్తే.. మూడు స్థానాలు కైవసం చేసుకుంది. అందులో ఖార్గావ్ మున్సిపల్ స్థానం విజయం ప్రత్యేకంగా నిలిచింది. ఈ మున్సిపాలిటీలో వార్డు నెంబర్ 2లో పోటీకి దిగింది గృహిణి అయిన అరుణ శ్యామ్ ఉపాధ్యాయ. ఆమె భర్త శ్యామ్ ఉపాధ్యాయ స్థానికంగా ఉద్యమవేత్త. రాజ్యాంగం, దళిత-వెనుకబడిన వర్గాల వాదనకు ఆకర్షితుడై ఎంఐఎంలో చేరాడు. తొలుత పార్టీ సీటును శ్యామ్‌కే కేటాయించాలనుకుంది. కానీ, అనూహ్యంగా స్థానికంగా మహిళలతో కలివిడిగా ఉండే అరుణకు బరిలోకి దించింది. కీలకమైన మున్సిపాలిటీ కావడంతో మధ్యప్రదేశ్ మంత్రి విశ్వాస్ సారంగ్ తన అనుచరులతో ప్రచారం చేయించినప్పటికీ.. అరుణనే గెలుపు అందుకుంది. #ArunaUpadhyaya Thanked #AIMIM President Barrister @asadowaisi after Winning Corporator Election on AIMIM Ticket from City of #Khargone for the First Time in #MadhyaPradesh, #AIMIM has Registered a Big Victory in Corporator Elections. pic.twitter.com/hRIjsP8eqk — Syed Mubeen (Tez Dhar) (@SyedZiya_Mubeen) July 21, 2022 -
‘తాజ్‌మహల్ కట్టకపోతే లీటర్ పెట్రోల్ రూ.40 కే వచ్చేది’.. మోదీపై ఒవైసీ సెటైర్లు
భోపాల్: ఒకవేళ షాజహాన్ తాజ్‌మహల్‌ను కట్టి ఉండకపోతే ఈ రోజు లీటర్ పెట్రోల్ ధర రూ.40 మాత్రమే ఉండేదని అన్నారు ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. బీజేపీ, ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ఈ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అధికార కమలం పార్టీ దేశంలోని అన్ని సమస్యలకు మొగలులు, ముస్లింలనే నిందిస్తోందని ఆరోపించారు. 'దేశంలోని యువతకు ఉద్యోగాలు లేవు. ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతోంది. డీజిల్ లీటరు రూ.102కి చేరింది. వీటన్నింటికీ కారణం ఔరంగజేబు. ప్రధాని మోదీ కాదు. దేశంలోని నిరుద్యోగానికి అక్బర్ చక్రవర్తి బాధ్యత వహిస్తాడు. పెట్రోల్ ధర లీటర్ రూ.104-115కి చేరడానికి తాజ్‌మహల్ కట్టిన వ్యక్తే కారణం. ఒకవేళ షాజహాన్ తాజ్‌మహల్ కట్టి ఉండకపోతే లీటర్ పెట్రోల్‌ను ఇవాళ రూ.40కే అమ్మేవారు. ప్రధాని మోదీ. తాజ్‌మహల్, ఎర్రకోట కట్టి షాజహాన్ తప్పిదం చేశారని నేను అంగీకరిస్తాను. దానికి బదులు షాజహాన్ ఆ డబ్బునంతా ఆదా చేసి 2014 ఎన్నికల్లో మీకు ఇవ్వాల్సింది. దేశంలోని ప్రతి సమస్యకు ముస్లింలు, మొగలులే కారణమని ప్రచారం చేస్తున్నారు' అని ఒవైసీ బీజేపీపై విమర్శల దాడికి దిగారు. ఈమేరకు మధ్యప్రదేశ్‌లో ఓ బహిరంగ సభలో మాట్లాడిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. చదవండి👉🏻శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు.. మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు? देश में महंगाई, बेरोज़गारी, और बढ़ती पेट्रोल-डीज़ल की कीमतों का ज़िम्मेदार @narendramodi नहीं, मुग़ल हैं😜 - Barrister @asadowaisi https://t.co/KLDrUaOwMz — AIMIM (@aimim_national) July 4, 2022 భారత్‌ను కేవలం మొగలులే పాలించారా? అని ఒవైసీ.. మోదీని సూటిగా ప్రశ్నించారు? అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడు పాలించలేదా? అని అడిగారు. బీజేపీకి మొగలులు మాత్రమే కన్పిస్తారని విమర్శించారు. ఆ పార్టీ ఒక కన్నుతో మొగలులను, మరో కన్నుతో పాకిస్థాన్‌ను చూస్తుందని ధ్వజమెత్తారు. మొగలులు, పాకిస్థాన్‌తో భారతీయ ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదని ఒవైసీ అన్నారు. మహమ్మద్ అలీ జిన్నా ప్రతిపాదనను తిరస్కరించామని పేర్కొన్నారు. భారత్ తమ మాతృభూమి అని, చనిపోయే వరకు ఇక్కడే జీవిస్తామన్నారు. తమను వెళ్లగొట్టాలని ఎవరెన్ని నినాదాలు చేసినా పట్టించుకోమన్నారు. చదవండి👉🏻వ్యాక్సినేషన్ సక్సెస్‌ను వదిలేసి.. నా ఫొటోపై పడ్డారు -
Bihar-RJD: బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం! అసదుద్దీన్‌కు షాక్!
పట్నా: మహారాష్ట్ర పరిణామాలతో ఆసక్తికరంగా మారిన దేశ రాజకీయాల్లో మరింత వేడి పెంచే సంఘటన చోటుచేసుకుంది. బిహార్‌లో ఇప్పటివరకు అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) వెనక్కినెట్టింది. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి షాకిస్తూ ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరారు. ఈమేరకు జాతీయ వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది. ఏఐఎంఐఎం పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు మొహమ్మద్ అంజార్ నైమీ, ముహమ్మద్ ఐజర్ అస్ఫీ, సయ్యద్ రుక్నూద్దీన్, షానవాజ్ తమ పార్టీలో చేరినట్టు ఆర్జేడీ కీలక నేత తేజస్వీ యాదవ్ బుధవారం ప్రకటించారు. కాగా, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎంఐఎం బిహార్‌లో 5 స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. చదవండి👉🏻ఉత్కంఠ రేపుతోన్న మహారాష్ట్ర రాజకీయాలు.. ఏం జరగవచ్చు? అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ తాజా చేరికలతో ఆర్జేడీ మరింత బలం పుంజుకుంది. 79 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. తర్వాతి స్థానంలో 77 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ ఉంది. 243 సీట్లున్న బిహార్‌లో జేడీ (యూ), బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోంది. గత ఎన్నికల్లో జేడీయూ 45 సీట్లు సాధించగా.. బీజేపీ 74 సాధించింది. వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీకి చెందిన ముగ్గురు కాషాయ పార్టీలో చేరడంతో వారి బలం 77కు పెరిగింది. ఇక కాంగ్రెస్‌కు 19 మంది ఎమ్మెల్యేలు, వామపక్ష పార్టీకి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 90 చోట్ల పోటీ చేస్తే ఫలితాలు శూన్యం! 2020 బిహార్ ఎన్నికల్లో 5 స్థానాల్లో గెలుపొంది దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన ఏఐఎంఐఎం పార్టీ... 2021 ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోయింది. 90 చోట్ల పోటీ చేసి ఒక్కచోట కూడా విజయం సాధించలేకపోయింది. ఈనేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు తమ భవిష్యత్ అయోమయంలో పడుతుందనే పార్టీ మారినట్టు ఎమ్మెల్యేలు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారా దాదాపు 20 చోట్ల ఆర్జేడీ విజయావకాశాలను అసదుద్దీన్ పార్టీ దెబ్బకొట్టడం గమనార్హం!| చదవండి👉🏻మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష.. ఏక్నాథ్ షిండే ప్లాన్ ఇదే! -
బీజేపీని ఓడించే దమ్ములేదని తేలింది: ఒవైసీ
న్యూఢిల్లీ: ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ యూపీ ఉప ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితంతో.. బీజేపీని ఓడించే దమ్ము సమాజ్‌వాదీ పార్టీకి లేదని స్పష్టం అవుతోందని అన్నారు. యూపీ ఉప ఎన్నికల ఫలితాలు.. సమాజ్‌వాదీ పార్టీకి బిజెపీని ఓడించే దమ్ము లేదని నిరూపించాయి. అసలు ఆ పార్టీకి అంత మేధో నిజాయితీ లేదని తేలింది. ఇలాంటి అసమర్థ పార్టీలకు దయ చేసి మైనారిటీలు ఓట్లు వేయకండి అని ఒవైసీ పిలుపు ఇచ్చారు. ‘‘బీజేపీ గెలుపునకు బాధ్యులెవరో.. ఇప్పుడు ఎవరికి బీజేపీ బి-టీమ్, సి-టీమ్ అని పేరు పెడతారో’’ అంటూ అఖిలేష్ యాదవ్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు ఒవైసీ. అంతేకాదు రాంపూర్, ఆజాంఘడ్ ఉప ఎన్నికల్లో ఓటమికి ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌నే బాధ్యుడిగా విమర్శించారు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. అఖిలేష్ యాదవ్ అహంభావి. కనీసం.. ప్రజలను కూడా కలవలేకపోయాడు. దేశంలోని ముస్లింలు తమకంటూ ఒక రాజకీయ గుర్తింపు తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా అంటూ పేర్కొన్నారు ఒవైసీ. UP by-poll results show Samajwadi Party is inacapable of defeating BJP, they don't have intellectual honesty. Minority community shouldn't vote for such incompetent parties. Who is responsible for BJP's win, now, whom will they name as B-team, C-team:AIMIM chief Asaduddin Owaisi pic.twitter.com/OSdkdkDWOT — ANI (@ANI) June 26, 2022 -
అగ్నిపథ్ స్కీమ్‌పై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: అగ్నిపథ్ స్కీమ్‌ను కేంద్ర వెనక్కి తీసుకోవాలని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. అగ్నిపథ్ వల్ల భారత ఆర్మీ బలహీనపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో తమ పార్టీ తలదూర్చదని ఆయన అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల విషయంపై జరిగిన సమావేశానికి శరద్‌పవార్ తనకు ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే పవార్ ఆహ్వానంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర తక్కువ అంచనా వేయొద్దు అని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. చదవండి: (ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిపై ఉత్కంఠ.. రేసులో బలంగా ఆ ఇద్దరు..?) -
మోదీ జీ.. మీ దోస్త్‌ను అడిగి తెలుసుకోండి: ఒవైసీ కౌంటర్
ప్రధాని నరేంద్ర మోదీపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ, ఆయన దోస్త్ అబ్బాస్ గురించి ఒవైసీ ప్రస్తావించడం దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. మోదీ స్నేహితుడిని ప్రస్తావిస్తూ ఒవైసీ.. బీజేపీకి కౌంటర్ ఇచ్చారు. వివరాల ప్రకారం.. ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ ఇటీవలే 100వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా మోదీ.. హీరాబెన్ కాళ్లు కడిగి ఆమెకు సపర్యలు చేశారు. హీరాబెన్ పుట్టిన రోజు సందర్భంగా మోదీ.. తన బ్లాగ్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన తల్లితో గడిచిన జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్న మోదీ.. తన చిన్ననాటి మిత్రుడు అబ్బాస్ గురించి కూడా ప్రస్తావించారు. ప్రధాని మోదీకి తన చిన్నతనంలో అబ్బాస్ అనే ఫ్రెండ్ ఉండేవాడని చెప్పుకొచ్చారు. తన తండ్రికి ఓ స్నేహితుడి ఉండేవాడని.. అయితే, ప్రమాదవశాత్తు ఆయన చనిపోయారని తెలిపారు. దీంతో ఆయన కొడుకు అబ్బాస్‌ను.. మోదీ తండ్రి.. వారి ఇంటికి తీసుకువచ్చారని.. అబ్బాస్ తనతోనే చదువు పూర్తి చేసినట్టు మోదీ చెప్పారు. అలాగే, ఈద్ పండగ వేళ తన తల్లి ఆ అబ్బాయికి ప్రేమతో వంటలు చేసేదని మోదీ గుర్తు చేశారు. కాగా, మోదీ చెప్పిన విషయాలపై అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ జీ.. ఒకవేళ మీ మిత్రుడు అబ్బాస్ ఉండి ఉంటే.. ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు సరైనవో కావో అడిగి తెలుసుకోవాలన్నారు. ఈ క్రమంలోనే నిజంగా మోదీకి ఇలాంటి ఫ్రెండ్ ఉన్నట్లు ఎవరికీ తెలియదన్నారు. ఒకవేళ అబ్బాస్ ఉండి ఉంటే.. ఇస్లామిక్ మతపెద్దలతో పాటు తాను కూడా మాట్లాడే ప్రసంగాలను విని వాటిపై వివరణ ఇచ్చేలా మోదీ చర్యలు తీసుకోవాలని అసద్ కోరారు. అలాగే, సుపుర్ శర్మ వ్యాఖ్యలను అబ్బాస్ కూడా అంగీకరించడు. తామేమైనా ఏవైనా అబద్దాలు చెబితే.. మీ ఫ్రెండ్ అబ్బాస్ ద్వారా తెలుసుకోండి మోదీ జీ అంటూ అసద్ కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా.. అబ్బాస్ అడ్రస్ ఇస్తే తామే అతని వద్దకు వెళ్తామని అసద్ స్పష్టం చేశారు. .@narendramodi जी, अपने दोस्त अब्बास को बुलाकर उलेमा-ए-किराम की तक़रीर सुनाइये और फिर उनसे पूछिए कि जो नूपुर शर्मा ने हजरत मोहम्मद ﷺ के बारें में कहा, वो सही है या ग़लत ? - Barrister @asadowaisi pic.twitter.com/6GS51Xt3Le — Farhaz khan AIMIM (@farhazkhanAIMIM) June 20, 2022 ఇది కూడా చదవండి: కాంగ్రెస్ నేతపై దాడి.. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిక -
యూపీ సీఎం యోగిపై అసదుద్దీన్ ఒవైసీ షాకింగ్ కామెంట్స్
దేశంలో బుల్డోజర్ల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. మొన్నటి వరక ఢిల్లీలో బుల్డోజర్లకు పనిచెప్పగా.. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజరుతో కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యానాథ్‌పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, మాజీ బీజేపీ నేత నుపూర్ శర్మ వ్యాఖ్యలకు నిరసనగా జూన్ 10వ తేదీన ముస్లిం సంఘాలు దేశవ్యాప్తంగా మసీద్‌ల వద్ద ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూపీతో సహా పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. కాగా యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో హింసాత్మక ఘటనలకు ప్రధాన సూత్రధారి అయిన జావేద్ మహ్మద్ ఇంటిని యోగి సర్కార్ కూల్చివేసింది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని కచ్ నగరంలో ఓ ర్యాలీలో మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. సీఎం యోగిపై విరుచుకుపడ్డారు. యూపీ సీఎం యోగి అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎవరినైనా దోషులుగా నిర్ధారిస్తారా? వారి ఇళ్లను కూల్చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. "Close the courts, lock them down": Asaduddin Owaisi lashes out after UP Police demolish Muslim activist Afreen Fatima's house. Watch: https://t.co/jSSc5C5nSD#StandWithAfreenFatima #AfreenFatima #AsaduddinOwaisi pic.twitter.com/vPAIfsoW5b — The Cognate (@TheCognate_) June 13, 2022 ఇది కూడా చదవండి: గాంధీ ఫ్యామిలీపై ఈగ వాలినా అంతుచూస్తాం -
ఢిల్లీ పోలీసులకు ఆ దమ్ము లేనట్లుంది: ఒవైసీ
హైదరాబాద్: విద్వేషపూరిత వ్యాఖ్యల నేపథ్యంతో ఢిల్లీ పోలీసులు, ఎంఐఎం చీఫ్.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు చేశారు. అయితే దీనిపై స్పందించిన ఒవైసీ.. ఢిల్లీ పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారాయన. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఢిల్లీ పోలీసులు అసదుద్దీన్ ఒవైసీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీజేపీ బహిష్కృత నేత నవీన్ జిందాల్, జర్నలిస్ట్ సబా నఖ్వీ, మౌలానా ముఫ్తీ నదీమ్, అబ్దుర్ రెహమాన్, గుల్జార్ అన్సారీ, అనిల్ కుమార్ మీనా పేర్లను సైతం చేర్చారు. ‘‘ఢిల్లీ పోలీసులు సైడ్‌ఇజం లేదా బ్యాలెన్స్ వాద్ సిండ్రోమ్స్‌తో బాధపడుతున్నట్లు ఉన్నారు. ఒక పక్క ప్రవక్తను బాహాటంగా అవమానించారు. మరో పక్క బీజేపీ మద్దతుదారులను మభ్యపెట్టడానికి.. రెండు వైపులా ద్వేషపూరిత ప్రసంగం ఉన్నట్లుగా చూపిస్తున్నారు’’ అంటూ మండిపడ్డారు అసదుద్దీన్ ఒవైసీ. 1. I’ve received an excerpt of the FIR. This is the first FIR I’ve seen that’s not specifying what the crime is. Imagine an FIR about a murder where cops don’t mention the weapon or that the victim bled to death. I don’t know which specific remarks of mine have attracted the FIR pic.twitter.com/0RJW1z71aN — Asaduddin Owaisi (@asadowaisi) June 9, 2022 నా వరకు ఎఫ్ఐఆర్లో నేరం ఏంటో కూడా పేర్కొనలేదు. ఇలా ఎఫ్ఐఆర్ను చూడడం ఇదే మొదటిసారి. విద్వేషపూరిత ప్రసంగాలను విమర్శించడం.. విద్వేషపూరిత ప్రసంగాలు ఇవ్వడం ఒక్కటి కాదు. ఢిల్లీ పోలీసులకు యతి, నూపుర్ శర్మ, నవీన్ జిందాల్‌లపై కేసులు పెట్టే దమ్ములేనట్లు ఉంది. అందుకే విషయాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులు బహుశా హిందూవాదులను కించపరచకుండా ఈ వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే మార్గం గురించి ఆలోచించడానికి ప్రయత్నిస్తున్నారేమో అంటూ వరుస ట్వీట్లు చేశారు ఒవైసీ. చదవండి: రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. ఎంఐఎం అధినేతపై కేసు నమోదు -
రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌పై కేసు నమోదు
న్యూఢిల్లీ: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఢిల్లీ స్పెషల్ సెల్‌లోని ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్ విభాగం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అలాగే ఆలయ పూజారి యతి నర్సింగానంద్‌పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. కాగా ఇప్పటికే మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మపై కూడా ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆమెతోపాటు నవీన్ జిందాల్ జర్నలిస్ట్ సబా నఖ్వీ, షాదాబ్ చౌహాన్, మౌలానా ముఫ్తీ నదీమ్, అబ్దుర్ రెహ్మాన్, గుల్జార్ అన్సారీ, అనిల్ కుమార్‌పై కూడా ఎఫ్ఐఆర్ దాఖలైంది. మొత్తం ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. సోషల్ మీడియాలో మత విద్వేశాలను వ్యాప్తి చేసి ప్రజల ప్రశాంత వాతావరణానికి విఘాతం కలిగించారని పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. దేశంలో అశాంతిని సృష్టించే ఉద్ధేశంతో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన వారిపై కూడా దర్యాప్తు చేస్తామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. సంబంధిత వార్త: వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత: మరిన్ని చిక్కుల్లో నూపుర్ శర్మ AIMIM chief Asaduddin Owaisi named in FIR registered by the IFSO unit of Delhi Police over alleged inflammatory remarks yesterday. Swami Yati Narasimhananda's name also mentioned in the FIR. pic.twitter.com/8NpEKdQvI8 — ANI (@ANI) June 9, 2022