
చంద్రబాబు జైలుకు ఎందుకు వెళ్లారో అందరికీ తెలుసు. చంద్రబాబును నమ్మలేం..
సాక్షి, హైదరాబాద్: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంపై మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. చంద్రబాబు జైలుకు ఎందుకు వెళ్లారో అందరికీ తెలుసని ఒవైసీ అన్నారు.
‘‘ఏపీలో చంద్రబాబు హ్యాపీగా జైల్లో ఉన్నారు. చంద్రబాబు జైలుకు ఎందుకు వెళ్లారో అందరికీ తెలుసు. చంద్రబాబును నమ్మలేం.. ప్రజలు కూడా నమ్మొద్దు’’ అని ఒవైసీ అన్నారు. ఇక ఏపీలో సీఎం జగన్ పాలన బాగుందని కితాబిచ్చారు ఒవైసీ.