సిట్‌ క్లోజ్‌.. బెయిల్‌ రద్దు పిటిషన్‌ డిస్మిస్‌ | Supreme Court Dismiss Chandrababu Bail Petition In Skill Scam Case | Sakshi
Sakshi News home page

స్కిల్‌ కేసులో సిట్‌ క్లోజ్‌.. చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌ డిస్మిస్‌

Published Wed, Jan 15 2025 2:34 PM | Last Updated on Wed, Jan 15 2025 3:23 PM

Supreme Court Dismiss Chandrababu Bail Petition In Skill Scam Case

న్యూఢిల్లీ, సాక్షి: స్కిల్ కుంభకోణం కేసులో నారా చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్‌ను సుప్రీం కోర్టు డిస్మిస్‌ చేసింది. ఏపీ సీఐడీ తరఫున ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతోనే బుధవారం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. 

స్కిల్‌ స్కాం(Skill Scam Case) కేసులో దర్యాప్తు దాదాపు పూర్తి అయిందని,  కేసును పెండింగ్‌లో ఉంచడం వల్ల ఉపయోగం లేదని ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి కోర్టుకు వెల్లడించారు. అలాగే ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీటు దాఖలు అయిందని, కొన్ని సాంకేతిక కారణాల వల్ల బెయిల్‌ రద్దు పిటిషన్‌ చేశారని తెలిపారాయన.  

ఈ క్రమంలో బెయిల్ రద్దు చేయాలని కోరడం లేదా ? అని ఏపీ ప్రభుత్వాన్ని జస్టిస్ ఎం.బేలా త్రివేది ప్రశ్నించారు. ‘లేదు’ అని ప్రభుత్వం నుంచి సమాధానం రావడంతో కేసును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వ తరఫున న్యాయమూర్తికి సూచించారు. అయితే ఈ కేసులో చంద్రబాబు బెయిల్‌ మీద ఉండడంతో.. బెయిల్ షరతులు(Bail Conditions) ఉల్లంఘించినా, విచారణకు సహకరించకపోయినా తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది.

కూటమి ప్రభుత్వం కొలువు దీరరాక.. స్కిల్‌ స్కాం కేసులో దర్యాప్తు స్పీడ్‌ మొత్తం తగ్గిపోయింది. చంద్రబాబు సీఎం కావడంతో ప్రభుత్వంలోని పెద్దలు, అధికారులు అందరూ ఆయన్ని బయటపడేసేందుకు మూకుమ్మడిగా కృషి చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు బెయిల్‌రద్దు పిటిషన్‌లో స్వర్ణాంధ్ర పత్రికా విలేకరి బాలాగంగధర్‌ తిలక్‌ భాగమయ్యారు. ఆయన పిటిషన్‌పై  సీనియర్ న్యాయవాది హరిన్ రావల్ వాదనలు వినిపించారు. 

బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

చంద్రబాబే(Chandrababu) ప్రభుత్వం కావడంతో తనపై ఉన్న కేసులను కొట్టేయించుకున్నారని హరిన్‌ రావల్‌ వాదించారు. ప్రభుత్వం మారగానే సిట్‌ ఆఫీస్‌ను మూసేయించారని, పైగా అధికార దుర్వినయోగానికి పాల్పడ్డారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే స్కిల్‌ స్కాం కేసులో మీకేం సంబంధమంటూ పిటిషనర్‌ను మందలిస్తూ ఆయన పిటిషన్‌ను కొట్టేసింది.  

ఇదిలా ఉంటే.. గతంలో చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాలని ఏపీ సీఐడీ తరఫున ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ వేసింది. అయితే ఇప్పుడు అదే దర్యాప్తు సంస్థ ఆయన బెయిల్‌ రద్దు పిటిషన్‌పై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడం గమనార్హం. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టై.. జైలు జీవితం గడిపారు. ఆపై హైకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది.

స్కిల్‌ స్కాం కేసులో ఎప్పుడు ఏం జరిగిందంటే.. 

   6.9.2023: ‘రేపో మాపో నన్నూ అరెస్టు చేస్తారేమో?’  అనంతపురం జిల్లా రాయదుర్గంలో చంద్రబాబు వ్యాఖ్యలు
   9.9.2023: నంద్యాలలో చంద్రబాబు అరెస్టు. రోడ్డు మార్గంలో విజయవాడకు తరలింపు. తాడేపల్లిలోని సిట్‌ కార్యాలయంలో విచారణ
   10.9.2023: విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపరిచిన సీఐడీ అధికారులు. రోజంతా కొనసాగిన విచారణ. 14 రోజుల రిమాండు విధించిన కోర్టు. అర్ధరాత్రి 1.16 గంటలకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలింపు
   11.9.2023: జైల్లో చంద్రబాబుకు ప్రాణహాని ఉన్నందున హౌస్‌ రిమాండ్‌కు అనుమతించాలని, నైపుణ్యాభివృద్ధి కేసు దస్త్రాలివ్వాలని కోరుతూ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్‌
   12.9.2023: హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసిన చంద్రబాబు. చంద్రబాబు హౌస్‌ రిమాండ్‌ పిటిషన్‌ను తిరస్కరించిన ఏసీబీ కోర్టు
   13.9.2023: క్వాష్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీకి, సీఐడీ కస్టడీ పిటిషన్‌పై 18 వరకూ ఒత్తిడి చేయొద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశం. విచారణ 19కి వాయిదా
   14.9.2023:     ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు
చంద్రబాబును ములాఖత్‌లో కలిసిన జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, నందమూరి బాలకృష్ణ, నారా లోకేశ్‌. 
     15.9.2023: బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీకి ఏసీబీ కోర్టు ఆదేశం
   17.9.2023: నైపుణ్యాభివృద్ధి కేసుపై దిల్లీలో సీఐడీ చీఫ్‌ సంజయ్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డిల మీడియా సమావేశం
   19.9.2023: చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
    చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ 21కి వాయిదా
   20.9.2023: చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ. 21న నిర్ణయం వెల్లడిస్తామన్న ఏసీబీ కోర్టు
    సీఐడీ అధికారుల కాల్‌ డేటా రికార్డులు భద్రపరచాలని పిటిషన్‌. కౌంటర్‌ వేయాలని సీఐడీకి ఏసీబీ కోర్టు ఆదేశం
    21.9.2023: స్కిల్‌ కేసు సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ పిల్‌ 
   22.9.2023: రెండు రోజుల సీఐడీ కస్టడీకి చంద్రబాబు. రిమాండ్‌ 24 వరకు పొడిగింపు
   చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ కొట్టేసిన హైకోర్టు
   బెయిలు పిటిషన్, పీటీ వారంట్ల పిటిషన్‌పై విచారణ 25కి వాయిదా
   23.9.2023: చంద్రబాబును తొలిరోజు దాదాపు 5 గంటలపాటు విచారించిన సీఐడీ అధికారులు
   క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయటంతో సుప్రీంకోర్టులో చంద్రబాబు అప్పీలు
   సీఐడీ కస్టడీ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు. అత్యవసర విచారణకు న్యాయస్థానం నిరాకరణ 
   24.9.2023: రెండో రోజూ చంద్రబాబును విచారించిన సీఐడీ అధికారులు. అక్టోబరు 5 వరకు జ్యుడిషియల్‌ రిమాండు పొడిగించిన ఏసీబీ కోర్టు
   25.9.2023: చంద్రబాబును మరో 5 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్‌
   26.9.2023: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ సెప్టెంబరు 27కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
   27.9.2023: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణను అక్టోబరు 3కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
    బెయిలు, కస్టడీ పిటిషన్ల విచారణ అక్టోబరు 4కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
   28.9.2023: చంద్రబాబు కేసులో సుప్రీంకోర్టులో కేవియట్‌ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం
   30.9.2023: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారించే ధర్మాసనం ఖరారు
   3.10.2023: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ. హైకోర్టులో సమర్పించిన దస్త్రాలన్నీ ఇవ్వాలంటూ ధర్మాసనం ఆదేశం
   4.10.2023: చంద్రబాబు బెయిలు, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ
   5.10.2023: చంద్రబాబు బెయిలు, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ
    చంద్రబాబు రిమాండ్‌ను 19 వరకు పొడిగించిన ఏసీబీ కోర్టు
 6.10.2023: చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు
 9.10.2023: చంద్రబాబుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఎ వర్తించేలా కనిపిస్తోందన్న సుప్రీంకోర్టు ధర్మాసనం 
   కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్, కస్టడీ పిటిషన్‌ను కొట్టేసిన ఏసీబీ కోర్టు
   10.10.2023: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
   12.10.2023: చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను 17కు వాయిదా వేసిన హైకోర్టు
   13.10.2023: కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఉండవల్లి దాఖలు చేసిన పిల్‌పై విచారణను వాయిదా వేసిన హైకోర్టు
   14.10.2023: చంద్రబాబు శరీరంపై తీవ్రమైన దద్దుర్లు, పొక్కులు. చంద్రబాబుకు ఏసీ ఏర్పాటు చేయాలంటూ ఏసీబీ కోర్టు ఆదేశం
   17.10.2023: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు పూర్తి. తీర్పు రిజర్వు చేసిన సర్వోన్నత న్యాయస్థానం
    కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ 19కి వాయిదా
  19.10.2023: ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఎదుట వర్చువల్‌గా చంద్రబాబు హాజరు
  20.10.2023: ఫైబర్‌నెట్‌ కేసులో పీటీ వారంట్‌పై చంద్రబాబును నవంబరు 9 వరకు ఏసీబీ కోర్టు ముందు హాజరుపరచొద్దని, అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశం
   చంద్రబాబుకు రోజుకు రెండు లీగల్‌ ములాఖత్‌లకు అనుమతిచ్చిన ఏసీబీ కోర్టు 
   కాల్‌డేటా పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేయాలని సీఐడీకి ఏసీబీ కోర్టు ఆదేశం
   26.10.2023: చంద్రబాబు కుడి కంటికి శస్త్రచికిత్స చేయాలని ఎల్‌వీ ప్రసాద్‌ ఆసుపత్రి వైద్యుల వెల్లడి
   27.10.2023: తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి చంద్రబాబు లేఖ
   చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ నుంచి తప్పుకొన్న వెకేషన్‌ బెంచ్‌ న్యాయమూర్తి
   సీఐడీ కాల్‌ డేటా రికార్డుపై ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు
   తమ పార్టీ బ్యాంకు లావాదేవీల వివరాలను సీఐడీ కోరడంపై హైకోర్టుకు టీడీపీ
   28.10.2023: చంద్రబాబు కుడి కంటికి శస్త్రచికిత్స చేయాలని ప్రభుత్వ వైద్యుడి నిర్ధారణ
   30.10.2023: చంద్రబాబు మధ్యంతర బెయిలుపై వాదనలు పూర్తి. తీర్పు రిజర్వు
   31.10.2023: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement