సాక్షి,కాకినాడజిల్లా: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో దొంగలు మరోసారి దొరికిపోయారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత కురసాల కన్నబాబు అన్నారు. ఈ వ్యవహారంలో అవినీతి ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) హైకోర్టుకు స్పష్టంగా తెలిపిందని చెప్పారు. కాకినాడ జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో కన్నబాబు ఆదివారం(అక్టోబర్ 27) మీడియాతో మాట్లాడారు.
‘చంద్రబాబు ఎన్ని తప్పులు చేసినా ఆయనను కాపాడే వ్యవస్ధ ఉంటుంది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు సమ్మతితో డొల్ల కంపెనీలు సృష్టించి వందల కోట్లు కొల్లగొట్టారని అందరికీ తెలుసు. ఈ కేసు కోల్డ్ స్టోరేజీలో పెట్టేసిన సందర్భంలో ఈడీ ముందుకు వచ్చింది. ఈ స్కామ్‌లో అవినీతి నిజం అని ఈడీ హైకోర్టుకు స్పష్టంగా తెలిపింది.
ఈడీ కోర్టులో ఫైల్ చేసిన కౌంటర్ చంద్రబాబుకు ఆయన మద్దత్తుదారులకు చెంపపెట్టు లాంటిది. ఈడీ కౌంటర్ పై చంద్రబాబు ఏం చెబుతారు అని ప్రశ్నిస్తున్నాం. అన్‌స్టాపబుల్ పేరుతో చంద్రబాబు,బాలకృష్ణ పెద్ద షో చేశారు. ఈడీ ఎవరి ప్రభుత్వంలో పని చేస్తుంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారు?
బీజేపీ,జనసేన నాయకులు ఈడీ కౌంటర్‌పై ఏం చెబుతారు. చంద్రబాబు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనుకుంటున్నారు. స్కిల్ స్కామ్‌లో ఎన్ని సూట్‌కేసు కంపెనీలు రిజిస్టర్ చేశారో ఈడీ చెప్పింది. బోగస్ కంపెనీలు, షెల్ కంపెనీలతో డబ్బులు కాజేశారని ఈడీ వివరించింది.
చంద్రబాబు కోసం జరిగిన స్కామ్ ఇది. స్కిల్ స్కామ్ సొమ్ములు ఎక్కడికి వెళ్ళాయి? హైకోర్టులో ఈడీ కౌంటర్ వేయడం ఒక కీలమైన అంశం. స్కిల్ స్కామ్ లో రూ.330 కోట్లు అవినితి జరిగిందని కాగ్ తేల్చింది’అని కన్నబాబు గుర్తుచేశారు.
ఇదీ చదవండి: దీపావళికి కూటమి ప్రభుత్వం ఇచ్చే కానుక ఇదేనా..
Comments
Please login to add a commentAdd a comment