kannababu
-
‘స్కిల్’ దొంగలు మరోసారి దొరికిపోయారు: కన్నబాబు
సాక్షి,కాకినాడజిల్లా: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో దొంగలు మరోసారి దొరికిపోయారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత కురసాల కన్నబాబు అన్నారు. ఈ వ్యవహారంలో అవినీతి ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) హైకోర్టుకు స్పష్టంగా తెలిపిందని చెప్పారు. కాకినాడ జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో కన్నబాబు ఆదివారం(అక్టోబర్ 27) మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు ఎన్ని తప్పులు చేసినా ఆయనను కాపాడే వ్యవస్ధ ఉంటుంది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు సమ్మతితో డొల్ల కంపెనీలు సృష్టించి వందల కోట్లు కొల్లగొట్టారని అందరికీ తెలుసు. ఈ కేసు కోల్డ్ స్టోరేజీలో పెట్టేసిన సందర్భంలో ఈడీ ముందుకు వచ్చింది. ఈ స్కామ్‌లో అవినీతి నిజం అని ఈడీ హైకోర్టుకు స్పష్టంగా తెలిపింది. ఈడీ కోర్టులో ఫైల్ చేసిన కౌంటర్ చంద్రబాబుకు ఆయన మద్దత్తుదారులకు చెంపపెట్టు లాంటిది. ఈడీ కౌంటర్ పై చంద్రబాబు ఏం చెబుతారు అని ప్రశ్నిస్తున్నాం. అన్‌స్టాపబుల్ పేరుతో చంద్రబాబు,బాలకృష్ణ పెద్ద షో చేశారు. ఈడీ ఎవరి ప్రభుత్వంలో పని చేస్తుంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారు? బీజేపీ,జనసేన నాయకులు ఈడీ కౌంటర్‌పై ఏం చెబుతారు. చంద్రబాబు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనుకుంటున్నారు. స్కిల్ స్కామ్‌లో ఎన్ని సూట్‌కేసు కంపెనీలు రిజిస్టర్ చేశారో ఈడీ చెప్పింది. బోగస్ కంపెనీలు, షెల్ కంపెనీలతో డబ్బులు కాజేశారని ఈడీ వివరించింది.చంద్రబాబు కోసం జరిగిన స్కామ్ ఇది. స్కిల్ స్కామ్ సొమ్ములు ఎక్కడికి వెళ్ళాయి? హైకోర్టులో ఈడీ కౌంటర్ వేయడం ఒక కీలమైన అంశం. స్కిల్ స్కామ్ లో రూ.330 కోట్లు అవినితి జరిగిందని కాగ్ తేల్చింది’అని కన్నబాబు గుర్తుచేశారు. ఇదీ చదవండి: దీపావళికి కూటమి ప్రభుత్వం ఇచ్చే కానుక ఇదేనా.. -
ఈ సంక్షేమం ఆగకూడదు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాతే రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమం అందుతోందని, అట్టడుగు వర్గాల సామాజిక సాధికారత సాధ్యమైందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. ఈ సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌ను ఎన్నుకోవాలని తెలిపారు. కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్లో సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అధ్యక్షతన జరిగిన సామాజిక సాధికార సభలో ఆయన ప్రసంగించారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మగౌరవంతో బతకగలుగుతున్నారని మంత్రి తెలిపారు. వయో పరిమితిని 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గించి, అవ్వాతాతలకు పెన్షన్ ఇస్తున్న మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని చెప్పారు. అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.18,760 ఇస్తానని చెప్పి, ఇప్పటికే మూడు విడతలు అందించారని, జనవరిలో నాలుగో విడత కూడా ఇవ్వనున్నారని తెలిపారు. 2014 ఎన్నికలకు ముందు రుణ మాఫీ చేస్తానని చంద్రబాబు రైతులను, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను మోసం చేశారన్నారు. అదే అక్కచెల్లెమ్మలకు 2019 ఏప్రిల్ వరకూ ఉన్న బకాయిలు చెల్లిస్తామన్న జగన్ దానిని అమలు చేసి చూపించారన్నారు. రైతులకు అన్ని విధాలుగా అండదండలు అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తొలిసారిగా గౌరవాన్ని కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. జగన్ సీఎం అయ్యాక బీసీ ఉప కులాలన్నింటినీ గుర్తించి, 57 కార్పొరేషన్లకు తొలిసారి చైర్మన్లను నియమించి, వారికి సరైన గుర్తింపు, గౌరవం కల్పించారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి ఉప ముఖ్యమంత్రి పదవులు, మంత్రి వర్గంలో, ఇతర నామినేటెడ్ పదవులన్నింటిలో పెద్ద పీట వేసిన సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ చెప్పారు. ఇన్నాళ్లూ మాటలకే పరిమితమైన సామాజిక సాధికారతను సీఎం జగన్ చేతల్లో చూపించారని అన్నారు. చంద్రబాబు మంత్రివర్గంలో ఎస్సీ, మైనార్టీలకు స్థానమే కల్పించలేదన్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా చంద్రబాబుకు ఆయన కులమే కనిపిస్తుందని, సీఎం జగన్‌కు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కనిపిస్తారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని అన్నారు. సీఎం వైఎస్ జగన్‌కు బడుగు, బలహీన వర్గాలే ప్రాధాన్యత అని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు చెప్పారు. రాజ్యసభకు తొమ్మిది మందికి అవకాశం వస్తే అందులో మత్స్యకార వర్గం నుంచి తనకు, శెట్టిబలిజల నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, యాదవ నుంచి బీద మస్తాన్‌రావు, కురుబ నుంచి ఆర్. కృష్ణయ్యలకు ప్రాతినిధ్యం కల్పించి రాజకీయంగా అగ్రస్థానంలో కూర్చోబెట్టారన్నారు. అవే పదవులను కోట్లకు అమ్ముకున్న నైజం చంద్రబాబుదని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు లభించిన గౌరవం 2024 తర్వాత ఆగిపోకూడదంటే సీఎం జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ చెప్పారు. ఎవరైనా పార్టీ పెడితే సీఎం కావాలనుకుంటారని, కానీ పక్కవారు సీఎం కావాలని కోరుకునే నాయకులు మనకు అవసరమా అంటూ పవన్ కళ్యాణ్ తీరును ఎద్దేవా చేశారు. బలిసిన వారికి, బడుగులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో బడుగుల పక్షాన నిలిచిన జగన్‌కు మద్దతుగా నిలిచి మరోసారి సీఎంను చేయాలని కోరారు. సామాజిక సాధికారతకు అర్థం చెప్పేలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన అందించారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి, మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీ వంగా గీత, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు పాల్గొన్నారు. -
బాబుకు లోపల మోత మోగుతుంది..మోగని టీడీపీ కంచాలు..
-
చీకటి ఒప్పందానికి రుజువు
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో దొరికిపోయిన దొంగ, మాజీ సీఎం చంద్రబాబును ఎల్లో మీడియా పునీతుడిగా, అన్నా హజారేకు అన్న మాదిరిగా ప్రచారం చేస్తోందని ఎమ్మెల్యే కురసాల కన్నబాబు విమర్శించారు. గతంలో చంద్రబాబును పెద్ద లంచగొండిగా పేర్కొంటూ రామోజీరావు స్వయంగా తన పత్రికలో కార్టూన్ వేయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు అదే చంద్రబాబును దేశభక్తుడి మాదిరిగా చిత్రీకరించేందుకు ఈనాడు ఆపసోపాలు పడుతోందన్నారు. ఫేక్ ఉద్యమాన్ని నడిపిస్తున్న ఎల్లో మీడియా చంద్రబాబును దోమలతో చంపేలా కుట్ర చేస్తున్నారంటూ కథనాలు ప్రచురించడం పైశాచికత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. సిల్క్ డెవలప్మెంట్ స్కామ్‌పై శుక్రవారం శాసనసభలో స్వల్ప కాలిక చర్చలో కన్నబాబు మాట్లాడారు. కరెంట్ పోయిందని కహానీలు ఒప్పందం సమయంలో కరెంట్ పోవడంతో తేదీ వేయలేదని సీమెన్స్ ఇండియా అప్పటి ఎండీ సుమ న్బోస్ చెప్పడం విడ్డూరంగా ఉంది. నిజమైన చీకటి ఒప్పందానికి ఇదే ఉదాహరణ. విజనరీగా ప్రచారం చేసుకునే చంద్రబాబు హయాంలో సెక్రటేరియట్, సీఎంవోల్లో కనీసం జనరేటర్ కూడా లేదా? కరెంట్ పోయిన వెంటనే సెల్ఫోన్లో టార్చ్ వేస్తున్న రోజులివి! స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు సహనిందితులు ముకుల్ అగర్వాల్, సుమన్ బోస్, వికాస్ ఖన్వేల్కర్ గతంలో ఒకే కంపెనీలో పనిచేశారు. పక్కా ఆధారాలతో ఈడీ అరెస్టు చేసిన సుమన్ బోస్ బెయిల్‌పై వచ్చి చంద్రబాబు తప్పు చేయలేదని చెప్పడం సిగ్గుచేటు. గుజరాత్‌తో పోలిక సిగ్గుచేటు గుజరాత్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో 85 శాతం సీమెన్స్, 15 శాతం ప్రభుత్వం భరించింది. ఇందులో సీమెన్స్ గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా కాకుండా కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా (సీఎస్ఆర్) రూ.99.85 కోట్లు సమకూరిస్తే ప్రభు త్వం రూ.17.10 కోట్లు ఖర్చు పెట్టింది. అదే ఏపీలో రూ.3,281 కోట్ల ప్రాజెక్టు అంటూ సీమెన్స్ పేరుతో బోగస్ ఒప్పందం చేసుకున్నారు. ఆ కంపెనీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే ప్రభుత్వ వాటాగా ఏకంగా రూ.371 కోట్లను విడుదల చేసి అప్పనంగా దోచేశారు. చంద్రబాబు తరపున ఢిల్లీ నుంచి వచ్చిన ఒక వకీల్‌సాబ్ కోర్టుల్లో కేసు వాదిస్తుంటే లోకల్ వకీల్ సాబ్ రోడ్లపై దొర్లుతూ వాగుతున్నాడు. పెండ్యాలకు టికెట్లు తీసింది మీరే.. చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, లోకేశ్ అనుచరుడు కిలారు రాజేష్‌ను విచారిస్తే మొత్తం బయటకొస్తుంది. వారిని ఇప్పటికే దేశం దాటించేశారు. లోకేశ్ జాతీయ మీడియాతో పెండ్యాల శ్రీనివాస్ అసలు ప్రభుత్వ ఉద్యోగి కాదని చెబుతు న్నారు. పెండ్యాల శ్రీనివాస్ ప్రభుత్వ ఉద్యోగే. చంద్రబాబుకు సూట్‌కేసుల్లో డబ్బులు తెచ్చింది అతడే. పైగా శ్రీనివాస్ పిక్నిక్కు అమెరికా వెళ్లాడని లోకేశ్ చెబుతున్నాడు. అలాగైతే మీ నాన్నను (చంద్రబాబును) అరెస్టు చేసిన వెంటనే వెనక్కి పిలిపించొచ్చు కదా? మీరే టికెట్లు తీసి ఆయన్ను అమెరికా పంపించారనేందుకు మాదగ్గర ఆధారా లున్నాయి. ఇంటర్‌పోల్ సాయం తీసుకునైనా పెండ్యాల శ్రీనివాస్, రాజేష్‌ను వెనక్కి తీసుకొస్తాం. దొంగతనం తేటతెల్లం: పేర్ని నాని, మాజీ మంత్రి చంద్రబాబు సీఐడీ విచారణలో నాకు తెలియదు.. మర్చిపోయా.. గుర్తులేదు అంటూ సినిమా డైలాగులు చెప్పారు. ఆయనకు బాకా ఊదే వ్యక్తులు, మీడియా సంస్థలు ఆధారాలు అడుగుతున్నాయి. లంచాలను ఫోన్‌పే, బ్యాంకు ఖాతాల ద్వారా తీసుకుంటారా? ఒకప్పుడు చంద్రబాబు ఒక్కరే ప్రజాధనాన్ని స్వాహా చేయగా లోకేశ్ రాకతో దోచుకునే జేబులు పెరిగాయి. టీడీపీ జమా ఖర్చులు చూసే దొంగ ఆడిటర్‌ను స్కిల్ డెవలప్మెంట్లో పెట్టుకుని కథ నడిపించారు. చంద్రబాబు తన గ్లామర్, గడ్డం అందాన్ని చూసి సీమెన్స్ పరుగెత్తుకుంటూ వచ్చిందని కేబినెట్లో కథలు చెప్పారు. ఇప్పుడు దొంగతనం తేటతెల్లం అవుతోంది. వాటాల కోసమే టీడీపీ సభ్యులు అసెంబ్లీలో రచ్చరచ్చ చేశారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి సీటు లాక్కున్నప్పుడు కత్తి అందించిన బాలకృష్ణకు ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. మొన్న బావను అరెస్టు చేయగానే పార్టీ ఆఫీసులో సీట్లో కూర్చోగా ఈరోజు అసెంబ్లీలోనే చంద్రబాబు సీట్లో బాలయ్య కూర్చున్నారు. మావాడు (పవన్ కళ్యాణ్) ఒక్కసారి ఎమ్మెల్యేగా, కార్పొరేటర్‌గా కూడా గెలవలేదు. అందుకే చంద్రబాబు ఎక్కడా సంతకం పెట్టలేదని అజ్ఞానంగా మాట్లాడుతు న్నాడు. చంద్రబాబు న్యాయవాదులు ఎక్కడా స్కిల్‌లో స్కామ్ జరగలేదని వాదించట్లేదు. రిమా ండ్ రిపోర్టులో ఏమీ లేదని ఎనిమిదేళ్ల వయసున్న తన పిల్లాడు కూడా చెబుతాడని చంద్రబాబు కుటుంబ సభ్యురాలు (నారా బ్రహ్మణి) అంటు న్నారు. ఈ వివరాలన్నీ తెలిస్తే తన తాతకు ఇంత స్కిల్ ఉందా? అని ఆ పిల్లాడికీ అర్థం అవుతుంది. తప్పు చేస్తే చట్టం ముందు ఎవరైనా ఒకటే. పంజాబ్‌లో సినిమాల షూటింగ్‌ల పిచ్చి ఉన్న డేరా బాబా నేరం చేసి దొరికిపోయాడు. గోదావరి పుష్కరాల్లో అమాయకులను బలి తీసుకున్న చంద్రబాబు కూడా అదే కోవలోకి వస్తారు. -
దొరికిపోయిన గజదొంగ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: మాజీ సీఎం చంద్రబాబు అవినీతి వ్యవహారాలపై సాక్షాత్తూ ఐటీ శాఖే నిగ్గు తేల్చినా పచ్చ మీడియా ఎందుకు కథనాలు రాయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. ‘చంద్రబాబు దొరికిన దొంగ.. గజదొంగ! చిన్న కాంట్రాక్టులోనే రూ.118 కోట్లు నొక్కితే 14 ఏళ్లు సీఎంగా బొక్కిందెంత? రామోజీ, ఏబీఎన్ రాధాకృష్ణ, బీఆర్ నాయుడు కళ్లకు ఇవి కనిపించడం లేదా? ఈ బాగోతాన్ని రాయాలనిపించడం లేదా?’ అని నిలదీశారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఈ అవినీతిని ప్రశ్నిస్తారని తాను అనుకోవడం లేదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, చంద్రబాబుకు సొంత వదినే కాబట్టి ఆమె మాట్లాడటం లేదని, ఇక కమ్యూనిస్టులు ఎలాగూ స్పందించరని చెప్పారు. కన్నబాబు ఆదివారం కాకినాడలో మీడియాతో మాట్లాడారు. తెహల్కా ఎప్పుడో చెప్పింది చంద్రబాబు తనను ఎవరూ ఏమీ చేయలేరని, సచ్చిలుడినని కితాబు ఇచ్చుకుంటున్నారు. జాతీయ మీడియా కథనాలతో ఆయన ఎంత దుర్మార్గమైన అవినీతి చేశారో బహిర్గతమైంది. ఆరోపణలకు సమాధానం చెప్పకుండా వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు షోకాజ్‌పై దాటవేత వైఖరి అనుసరిస్తున్నారు. చంద్రబాబుకు డబ్బులు అందాయనడానికి వాట్సాప్ చాట్స్, ఈ–మెయిల్ ఆధారాలున్నాయని ఐటీశాఖ స్పష్టం చేసింది. చిన్న కాంట్రాక్టుల్లోనే చంద్రబాబు ఇంత డబ్బు నొక్కేశారంటే ఆయన ఎంత పెద్ద గజదొంగ అయి ఉంటాడు? ఇంత జరిగినా చంద్రబాబు నోరు విప్పట్లేదు. ఆయన వందిమాగధులు, భజన బృందాలు స్పందించడం లేదు. ఎల్లో మీడియా అసలే మాట్లాడదు. కాకినాడలో నిర్వహించిన పార్టీ జోన్–2 సమావేశంలో ఈ విషయాన్ని ఎందుకు ఖండించలేకపోయావు బాబూ? కనీసం నీ కార్యకర్తలకైనా సమాధానం చెప్పే దమ్ము లేదంటే తప్పు జరిగిందనే విషయం అర్థమవుతోంది. చంద్రబాబు ఎలా అవినీతి సామ్రాజ్యం నిర్మించుకున్నాడో 1999లోనే తెహల్కా చెప్పింది. ఓటుకు కోట్లు కేసు ద్వారా కూడా ఆయన వద్ద ఎంత అవినీతి సొమ్ము పేరుకు పోయిందో వెల్లడైంది. లోకేశ్ పాత్ర కూడా.. ఈ అవినీతి బాగోతంలో చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేశ్ పేరు కూడా చెబుతున్నారు. చిన్నచిన్న రాజకీయ ఆరోపణలకే పరువు నష్టం దావా వేసిన చరిత్ర మీ హెరిటేజ్‌కు, మీకు ఉంది కదా! మీ అవినీతిని బహిర్గతం చేసిన జాతీయ మీడియాపై పరువు నష్టం దావా వేసే దమ్ముందా? తేలు కుట్టిన దొంగల్లా ఎందుకున్నారు? 2014లో చంద్రబాబు 650 అంశాలతో ఇచ్చిన మేనిఫెస్టోకే దిక్కు లేదు. ఎన్నికలు కాగానే దాన్ని మాయం చేశారు. అధికారంలోకి వస్తానని ఆయనకే నమ్మకం లేదు. ఇక ఆయన ప్రజలకు గ్యారెంటీ ఇవ్వడం ఏమిటి? గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి లాస్ట్ బాల్ అన్నట్లుగా చంద్రబాబు సూపర్ సిక్స్ అంటున్నారు. ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఎలాగూ లేదు. పార్టీ ఉంటుందో లేదో తెలియదు. కచ్చితంగా బౌండరీలో క్యాచ్ ఇచ్చి నిష్క్రమిస్తారు. -
బాబుది విధ్వంస యాత్ర
కాకినాడ రూరల్: రాష్ట్రంలో చంద్రబాబు విధ్వంస యాత్ర సాగిస్తున్నారని, అరాచకం సృష్టించేందుకే కుట్రపూరితంగా యాత్ర చేపడుతున్నారని మాజీమంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఎక్కడికెళ్లినా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ముందుగానే ప్లాన్ వేసుకుని పుంగనూరు వెళ్లి 50 మంది పోలీసులను గాయపరిచారని, రక్తం వచ్చేలా దాడులు చేశారని, వాహనాలు తగలబెట్టారని చెప్పారు. అల్లర్లకు బాబు, పవన్ యత్నం.. చంద్రబాబు, ఆయనకు మద్దతు పలుకుతున్న పవన్ మాట్లాడుతున్న తీరుచూస్తే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయం అర్థమవుతోందన్నారు. పుంగనూరులో టీడీపీ కార్యకర్తలతో దాడులు చేయించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆపాదించే ప్రయత్నం చేశారని కన్నబాబు చెప్పారు. పోలీసుల గురించి మాట్లాడే భాష ఇదేనా అని ప్రశ్నించారు. తన కార్యకర్తపై చేయి చేసుకున్నారంటూ సీఐ అంజుయాదవ్‌పై గతంలో గొడవ చేసిన పవన్.. ఇదే పోలీసులపై చంద్రబాబు దాడి చేయిస్తే ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. బాబు ఏ ప్రాజెక్టు పూర్తిచేశారు? 14 ఏళ్లు సీఎంగా పనిచేసి ఏ ప్రాజెక్ట్ పూర్తిచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కక్కుర్తితో పట్టిసీమ ప్రాజెక్టు పూర్తిచేసి రాయలసీమ ప్రాజెక్టులు ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు. ఇక చంద్రబాబుకు సింహం బ్రాండ్ లేదని, మామగారిని కుళ్లబొడిచిన నక్కజిత్తుల బ్రాండ్ ఉందని కురసాల ఎద్దేవా చేశారు. -
విజయవాడలో సీ ఫుడ్ ఫెస్టివల్
సాక్షి, అమరావతి: స్థానిక వినియోగాన్ని పెంచడం, ప్రత్యామ్నాయ మార్కెటింగ్ సౌకర్యాల కల్పనే లక్ష్యంగా విజయవాడలో 28వ తేదీ నుంచి మూడు రోజుల పాటు సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ కూనపురెడ్డి కన్నబాబు తెలిపారు. సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏటా 50 లక్షల టన్నుల మత్స్య సంపద ఉత్పత్తితో దేశంలోనే నం.1 స్థానంలో ఉన్న రాష్ట్రంలో స్థానిక వినియోగం 8 శాతానికి మించడం లేదన్నారు. దేశ వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే రొయ్యల్లో 75 శాతం మన రాష్ట్రం నుంచే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. కానీ వినియోగం మాత్రం 5 శాతం లోపే ఉందని చెప్పారు. మిగిలిన రొయ్య అంతా ఎగుమతి అవుతోందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులు ఎదురైతే రాష్ట్రంలోని రొయ్య రైతులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తోందని తెలిపారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే డొమెస్టిక్ మార్కెట్‌ను పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రంలో సీ ఫుడ్ వినియోగదారులు పెద్ద ఎత్తున ఉన్నా.. డిమాండ్‌కు తగ్గట్టుగా రిటైల్ షాపులు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారిందన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ‘ఫిష్ ఆంధ్రా’ బ్రాండ్‌తో స్థానిక వినియోగం పెంచేలా ఆక్వా హబ్స్ అండ్ స్పోక్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే 1,500 అవుట్ లెట్స్‌ను ఏర్పాటు చేయగా.. 15 హబ్స్ నిర్మాణంలో ఉన్నట్టు చెప్పారు. మరిన్ని హబ్స్, అవుట్ లెట్స్ ఏర్పాటుకు ముందుకొచ్చే ఔత్సాహికులను ప్రోత్సహించడం, వినియోగదారుల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ సీ ఫుడ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఫెస్టివల్లో 20 వేల మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ఫెస్టివల్లో రోజూ రూ.699తో అపరిమితమైన సీ ఫుడ్ బఫెట్‌ను అందిస్తున్నామన్నారు. సీ ఫుడ్‌పై వంటల పోటీలు, వైద్యులు, పోషకాహార నిపుణులతో సెమినార్లు, 2కే రన్ నిర్వహంచనున్నట్టు తెలిపారు. ఇలాంటి సీ ఫుడ్ ఫెస్టివల్స్ విశాఖ, కాకినాడ, భీమవరం, నెల్లూరు తదితర ప్రాంతాలతో పాటు హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లోనూ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా ఫెస్టివల్ బ్రోచర్‌ను కమిషనర్ కన్నబాబు విడుదల చేశారు. -
ఫిష్.. ఫిష్ హుర్రే!
సాక్షి, అమరావతి: ‘ఫిష్ ఆంధ్ర’ అవుట్‌లెట్స్‌కు ఆదరణ మరింత పెరుగుతోంది. ‘ఫిష్ ఆంధ్ర’ అవుట్‌లెట్స్‌కు ఏ రోజు వెళ్లినా కావాల్సిన మత్స్య ఉత్పత్తులు తాజాగా దొరుకుతాయన్న నమ్మకం మాంసాహార ప్రియుల్లో ఏర్పడింది. దీంతో వీటికి విశేష ఆదరణ లభిస్తోంది. తమకు జీవనోపాధి లభించడంతోపాటు తమ ద్వారా మరికొందరికి ఉపాధి కల్పించగలుగుతున్నామని అవుట్‌లెట్స్ నిర్వాహకులు చెబుతుంటే.. శుభ్రమైన వాతావరణంలో తాజా మత్స్య ఉత్పత్తులు లభిస్తున్నాయని వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక వినియోగం పెంచే లక్ష్యంతో.. మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా ‘ఫిష్ ఆంధ్ర’ పేరిట ప్రభుత్వం బ్రాండింగ్ చేసి ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలో ఏటా 4.36 లక్షల టన్నులున్న మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగాన్ని 2025 నాటికి కనీసం 15 లక్షల టన్నులకు పెంచాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 70 హబ్‌లను, వాటికి అనుబంధంగా 14 వేల అవుట్లెట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తొలి దశలో జిల్లాకు ఒకటి చొప్పున ఆక్వా హబ్, వాటికి అనుబంధంగా 4 వేల అవుట్‌లెట్స్, స్పోక్స్, డెయిలీ, సూపర్, లాంజ్ యూనిట్స్‌తో పాటు త్రీవీలర్, 4 వీలర్ కియోస్‌్కలను 60 శాతం సబ్సిడీపై నిరుద్యోగ యువతకు మంజూరు చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,250 అవుట్‌లెట్స్, 70 త్రీ వీలర్, 84 ఫోర్ వీలర్ వెహికల్స్, 62 డెయిలీ, 50 సూపర్, 11 లాంజ్ యూనిట్స్ కలిపి మొత్తంగా 1,527 యూనిట్స్ ఏర్పాటయ్యాయి. తొలుత నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో సముద్ర మత్స్య ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. స్థానికంగా దొరికే చేపలు, రొయ్యలతోపాటు సముద్ర మత్స్య ఉత్పత్తులు సైతం లభిస్తుండటంతో వీటిని కొనేందుకు ఎగబడుతున్నారు. స్పందన చాలా బాగుంది ప్రైవేటు బ్యాంక్‌లో ఉద్యోగం చేసేవాడిని. నెలకు రూ.15 వేలు జీతం వచ్చేది. ప్రభుత్వ ప్రోత్సాహంతో కర్నూలులోని నంద్యాల చెక్‌పోస్ట్ సెంటర్లో 60 శాతం సబ్సిడీతో ఫిష్ ఆంధ్ర అవుట్లెట్ పెట్టుకున్నా. ఆదివారం 200–300 కిలోలు, మిగిలిన రోజుల్లో 50నుంచి 100 కేజీల వరకు మత్స్య ఉత్పత్తులు అమ్ముడుపోతున్నాయి. నాకు ఉపాధి లభించడంతోపాటు మరో నలుగురికి ఉపాధి చూపిస్తున్నా. కాకినాడ నుంచి సముద్ర చేపలు, రొయ్యలు, పీతలు సైతం వస్తున్నాయి. సీ ఫుడ్స్ కోసం క్యూ కడుతున్నారు. సాయంత్రం పూట చేప, రొయ్య తదితర వంటకాలతో వాల్యూ యాడెడ్ యూనిట్ నడుపుతున్న. స్పందన చాలా బాగుంది. సిబ్బంది జీతభత్యాల కింద రూ.56 వేలు చెల్లిస్తున్నా. రూ.60 వేలకు పైగా ఈఎంఐలు కడుతున్నా. అయినా రూ.50 వేల వరకు మిగులుతోంది. – బట్టు రాజశేఖర్, ఫిష్ ఆంధ్ర అవుట్లెట్ నిర్వాహకుడు, కర్నూలు చాలా తాజాగా ఉంటున్నాయి ప్రతి ఆదివారం ఫిష్ ఆంధ్ర అవుట్లెట్కు వస్తున్నా. ఇక్కడ గోదావరిలో మాత్రమే దొరికే చేపలతో పాటు సముద్ర చేపలు, రొయ్యలు కూడా దొరుకుతాయి. చాలా తాజాగా ఉంటున్నాయి. ఎంతో రుచిగా ఉంటున్నాయి. – జి.శ్రీనివాసరావు, పోరంకి, విజయవాడ హైజీనిక్‌గా ఉంటున్నాయి అవుట్లెట్కు ఏరోజు వచ్చినా అన్నిరకాల చేపలు దొరుకుతున్నాయి. చాలా తాజాగా ఉంటున్నాయి. హైజీనిక్‌గా మెయింటైన్ చేస్తున్నారు. – కె.రామయ్య, ఈడుపుగల్లు, పెనమలూరు ఆదరణ పెరుగుతోంది స్థానిక వినియోగం పెంచడం లక్ష్యంగా ఫిష్ ఆంధ్ర పేరిట నాణ్యమైన మత్స్య ఉత్పత్తులను హబ్ అండ్ స్పోక్ మోడల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇప్పటికే మూడు హబ్‌లతో పాటు 1,500కు పైగా అవుట్‌లెట్స్, ఇతర యూనిట్స్‌ను అందుబాటులోకి తెచ్చాం. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. గతంతో పోలిస్తే స్థానిక వినియోగం గణనీయంగా పెరిగింది. – కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ -
కాపు ఉద్యమకారుడి కుటుంబానికి సీఎం బాసట
కాకినాడ రూరల్: కాపు రిజర్వేషన్ల ఉద్యమం సందర్భంగా 2016లో కాకినాడలో కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యకు పాల్పడిన కాపు ఉద్యమకారుడు చీకట్ల వెంకట రమణమూర్తి కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాసటగా నిలిచారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో చంద్రబాబు హయాంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కిర్లంపూడి కేంద్రంగా కాపు ఉద్యమం ప్రారంభించారు. ఈ క్రమంలో తునిలో రైలు దహనం ఘటన మరునాడు వెంకట రమణమూర్తి కలెక్టరేట్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పట్లో ఈ ఘటన సంచలనమైంది. అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే కాపులను ఇబ్బంది పెడుతోందని, చంద్రబాబు, పవన్ కల్యాణ్ కాపు రిజర్వేషన్లపై సమాధానం చెప్పాలని, కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్‌తో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని వెంకట రమణమూర్తి రాసిన లేఖలో పేర్కొన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. లారీ డీజిల్ మెకానిక్‌గా పనిచేసే అతడి ఆత్మహత్యతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. మృతుడికి భార్య పార్వతి, కుమారుడు రాజేష్, కుమార్తె రాజేశ్వరి ఉన్నారు. వీరిని అప్పట్లో ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ ఓదార్చారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం సహాయ నిధి నుంచి చీకట్ల పార్వతి పేరిట రూ.5 లక్షలు మంజూరు చేశారు. ఈ చెక్కును రమణయ్యపేటలోని తన క్యాంపు కార్యాలయం వద్ద మాజీ మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆదివారం వెంకట రమణమూర్తి కుమార్తె రాజేశ్వరి, కుమారుడు రాజేష్ కు అందజేశారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. వెంకట రమణమూర్తి కుటుంబ పరిస్థితిని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన స్పందించి రూ.5 లక్షల ఆరి్థక సహాయం పంపించి ఆదుకున్నారని చెప్పారు. వెంకట రమణమూర్తి కుమార్తె రాజేశ్వరి కాకినాడ 3వ డివిజన్లో వలంటీర్‌గా పని చేస్తోందన్నారు. -
రైతు పక్షపాత ప్రభుత్వంపై దుష్ప్రచారమా?
కాకినాడ: వైఎస్ జగన్ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వమని, అన్నదాత సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఈ సర్కారుపై మాజీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం చేస్తారా... అంటూ వ్యవసాయ శాఖ మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఆయన గురువారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవలి అకాల వర్షాలను సాకుగా తీసుకుని రైతుల పక్షాన మాట్లాడుతున్నట్టు ఆ ఇద్దరు నేతలు డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. ఏ ఒక్క రైతు నష్టపోకూడదనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ నిబంధనలను సడలించి మరీ తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా సివిల్ సప్లైస్ ద్వారా ఖరీఫ్‌లో 6.40 లక్షల రైతుల నుంచి 35,41,564 టన్నుల ధాన్యం కొన్నారని తెలిపారు. సుమారు రూ.7,233 కోట్లలో రూ.7,212 కోట్లు.. అంటే 99 శాతం చెల్లింపులు జరిగాయని చెప్పారు. ప్రస్తుత సీజన్లో రూ.1,629 కోట్ల విలువైన ధాన్యాన్ని కొని రూ.1,277 కోట్ల చెల్లింపులు కూడా చేశారన్నారు. 21 రోజుల్లో చెల్లించాలనే నిబంధన ఉన్నప్పటికీ రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆరు రోజులకే చెల్లించారన్నారు. ఎఫ్‌సీఐ బొండాలు ధాన్యాన్ని కొంతకాలంగా కొనడంలేదని, అయితే ఈసారి అధిక విస్తీర్ణంలో ఈ రకం పండించడంతో ముఖ్యమంత్రి కేంద్రం దృష్టికి తీసుకెళ్లి వాటినీ కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. 17 శాతంకన్నా తేమ అధికంగా ఉంటే రైతులు నష్టపోకూడదని నిబంధనలు సడలించారన్నారు. తడిసిన ధాన్యం కళ్లాల్లో ఉండడం వల్ల ఆఫ్‌లైన్‌లో సైతం ప్రొక్యూర్మెంట్ జరిగిందన్నారు. ఇవన్నీ విపక్ష నేతలకు కనిపించలేదా.. అని ప్రశ్నించారు. -
టీడీపీ స్కిల్ స్కాంపై మంత్రి బుగ్గన కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: ఏపీలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీపీ హయాంలో జరిగిన స్కిల్ స్కామ్‌పై చర్చ జరిగింది. ఈ క్రమంలో మంత్రి బుగ్గన, ఎమ్మెల్యే కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో కన్నబాబు మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ స్కాం ఓ దొంగల ముఠా కథ. డబ్బులు కొట్టేసే కార్యక్రమంలో టీడీపీ వాళ్లకు ఉన్న స్కిల్ ఎవరికీ లేదు. నిరుద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసింది. చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన నెలరోజులకే ప్రతిపాదన తెచ్చారు. ప్రతిపాదన రాగానే కేబినెట్లో ప్రవేశపెట్టి ఆమోదించారు. రూ. 3,356 కోట్ల ప్రాజెక్టుకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఏదైనా ప్రాజెక్ట్ ముందుకొస్తే డీపీఆర్ ఇవ్వాలి. డీపీఆర్ సిమెన్స్ కంపెనీ ఇవ్వకుండా ఇతరులు ఇచ్చారు. కంపెనీ ఇవ్వకుండా ఇతరులు డీపీఆర్ ఎలా తయారు చేస్తారు. ఒక కంపెనీకి ప్రభుత్వం రూ.3వేల కోట్లు ఖర్చు పెడుతుందా?. ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగలేదన్నారు. ఈ స్కాంలో నిందితులు ఎవరో తేల్చి త్వరగా చర్యలు తీసుకోవాలి అని అన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. జీవో, ఎంవోయూకి తేడా ఉంది. రూ.371 కోట్లు ఇచ్చే ముందు సరైన వివరాలు పేర్కొనలేదు. లెటర్ నెంబర్, డేటా లేకుండానే నిధులు విడుదల చేశారు. చంద్రబాబు హయంలో కేవలం స్కిల్ స్కాం ద్వారానే రూ. 371 కోట్లు దోపిడీ జరిగింది. ఫేక్ ఇన్వాయిస్లతో నగదు కాజేశారు. ఎలాంటి ఒప్పందాలు లేకుండా పలు కంపెనీలకు నిధులు మళ్లించారు అని ఆరోపించారు. ఇంకా ఏమన్నారంటే.. జీవోలోని అంశాలు, సంబంధిత లేఖలను ప్రస్తావించకుండానే సంతకాలు. ఒక్కపైసా సీమెన్స్ నుంచి రాకుండానే డబ్బు విడుదల. డబ్బు విడుదలకు ఆర్థికశాఖ అధికారుల అభ్యంతరం. వాటిని కొట్టేసి తానే స్వయంగా నిధులు విడుదల చేయించిన చంద్రబాబు. తర్వాత షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ చేశారు. జీఎస్టీ అధికారుల ఆరాతో వెలుగులోకి ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. ఈడీ, సెబీ సోదాల్లో అవన్నీ షెల్ కంపెనీలుగా గుర్తింపు. ఒక్క పైసా కూడా తమకు ముట్టలేదన్న సీమెన్స్ గ్లోబల్ టీం. మరిన్ని ఆధారాలను ఇచ్చిన సీమెన్స్ గ్లోబల్ టీమ్. కొంత డబ్బు హైదరాబాద్, పుణే వెళ్లిందని ఆధారాలిచ్చిన సీమెన్స్ గ్లోబల్ టీమ్. ఇవన్నీ కూడా చంద్రబాబు హయాంలోనే వెలుగు చూశాయి. అయినా వాటన్నింటినీ దాచేసిన చంద్రబాబు సర్కారు. ముఖ్యమంత్రి హోదాను అడ్డుపెట్టుకుని ఏసీబీని తొక్కిపెట్టిన చంద్రబాబు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఈడీ, సీఐడీ. కేసును మరింత ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న సీఐడీ. రాష్ట్రంలో మొదలై.. విదేశాలకు పాకిన కుంభకోణం. దోచిన ప్రజాధనం విదేశాలకు తరలింపు. గంటా సుబ్బారావు అనే అనధికార ప్రైవేట్ వ్యక్తిని ఏపీఎస్ఎస్డీసీకి సీఈవోగా నియమించారు. సీఎఫ్ఎంఎస్ కార్పొరేషన్‌కి, సీఈవోగా కూడా ప్రైవేట్ వ్యక్తినే పెట్టుకున్నారు. రిటైర్డ్ అధికారి లక్ష్మీనారాయణ అనే వ్యక్తిని డైరెక్టర్‌గా నియమించారు. రూ.370 కోట్ల విలువైన సాఫ్ట్ వేర్‌కు ఎంవోయూ చేసుకున్నారు. డిజ్ టెక్ కంపెనీ నుంచి ఈ ప్రాజెక్టులో ఏ భాగస్వామ్యం లేకుండా ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఏమీ చేయకుండా డిజ్ టెక్ కంపెనీకి రూ.370 కోట్లు అప్పనంగా ఇచ్చేశారు. ఎంవోయూపై గంటా సుబ్బారావు, సుమన్ బోస్, సంతోష్ సారాల సంతకాలున్నాయి. జీవోకి, ఎంవోయూకి తేడా ఉంది. రూ.371 కోట్లను ఇచ్చే ముందు సరైన వివరాలు నమోదు చేయలేదు. లెటర్ నెంబర్, డేటా లేకుండానే నిధులు విడుదల చేశారు. చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ద్వారానే రూ.371 కోట్లు కాజేశారు. ఫేక్ ఇన్వాయిస్లతో నిధులు కాజేశారు. ఎలాంటి ఒప్పందాలు లేకుండా పలు కంపెనీలకు నిధులు మళ్లించారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో టీడీపీ నేతలు భారీగా దోచుకున్నారు. రూ.3,300 కోట్ల పెట్టుబడి అని మోసం చేశారు. సీమెన్స్ 90శాతం పెట్టుబడి పెడుతుందని అబద్ధాలు చెప్పారు. 10శాతం ప్రభుత్వం నిధులు ఇవ్వాలని చెప్పి రూ.371 కోట్లు విడుదల. గంటా సుబ్బారావు, సుమన్ బోస్ మధ్య ఈ ఒప్పందం జరిగింది. సుమన్ బోస్కి, సీమెన్స్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. అయినా సీమెన్స్ పేరుతో రూ.371 కోట్లు దోచుకున్నారు. నిధులు విడుదలకు అభ్యంతరం తెలిపిన ఆర్థికశాఖ అధికారులు. చంద్రబాబు చెప్పినందువల్లే అధికారులు డబ్బు రిలీజ్ చేశారు. -
ఏపీ మాజీ మంత్రి కన్నబాబుతో స్ట్రెయిట్ టాక్
-
ఒబెరాయ్ హోటల్‌కు 20 ఎకరాల కేటాయింపు
తిరుపతి అలిపిరి/ జమ్మలమడుగు/మధురపూడి(రాజమహేంద్రవరం): ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా తిరుపతి అలిపిరి రోడ్డులో టూరిజం స్థలం 20 ఎకరాలను ఒబెరాయ్ హోటల్‌కు లీజ్ కమ్ రెంట్ విధానంలో కేటాయించే విషయమై ఒప్పంద పత్రాలను మార్చుకున్నట్టు టూరిజం ఎండీ కన్నబాబు తెలిపారు. శనివారం మధ్యాహ్నం స్థానిక అలిపిరి రోడ్డులోని దేవలోక్ వద్ద ఒబెరాయ్ హోటట్ ప్రతినిధులతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. దాదాపు రూ.100 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారని తెలిపారు. గండికోటలో స్థలం పరిశీలన వైఎస్సార్ జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో ఒబెరాయ్ బృందం పర్యటించింది. ఒబెరాయ్ హోటల్ సీఈవో, ఎండీ విక్రమ్ ఒబెరాయ్, కార్పొరేట్ అఫెర్స్ ప్రెసిడెంట్ శంకర్, ఫైనాన్స్ ఆఫీసర్ కల్లోల్ కుందా,ఎంఏఎల్ రెడ్డి, మహిమాసింగ్ ఠాగూర్ బృందం పర్యటించింది. ఈ సందర్భంగా నాలుగు వందల ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. గతేడాది ఒబెరాయ్ హోటల్ యాజమాన్యం గండికోటలో రిసార్టులను ఏర్పాటు చేస్తామని, భూమిని కేటాయించాలని కోరడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఒబెరాయ్ యాజమాన్యానికి 50 ఎకరాల భూమిని కేటాయించింది. దీంతో రూ.250 కోట్లతో 120 విల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దాదాపు 40 నిమిషాల పాటు ఒబెరాయ్ బృందం గండికోటలోని వివిధ ప్రాంతాలను పరిశీలించింది. పెన్నానదిలోయ అందాన్ని తిలకించారు. పిచ్చుక లంక, హేవలాక్ బ్రిడ్జి అభివృద్ధిపై ఒబెరాయ్ ప్రతినిధులతో కలెక్టర్ల చర్చ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రసిద్ధి గాంచిన హేవలాక్ బ్రిడ్జి, పర్యాటక కేంద్రమైన పిచ్చుక లంక అభివృద్ధిపై ఒబెరాయ్ గ్రూప్ ప్రతి నిధులతో తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్లు కె.మాధవీలత, హిమాన్షుశుక్లా, ఎంపీ మార్గాని భరత్‌రామ్ చర్చించారు. తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్తూ మధురపూడి విమానాశ్రయంలో ఆగిన ఒబెరాయ్ గ్రూప్ ప్రతినిధులతో శనివారం రాత్రి సమావేశమై పిచ్చుక లంక, హేవలాక్ బ్రిడ్జి అభివృద్ధి ద్వారా పర్యాటక రంగాన్ని విస్తరించవచ్చని వివరించారు. భేటీలో రాష్ట్ర ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు. -
రూ.100 కోట్లతో గండికోట అభివృద్ధి
బి.కొత్తకోట: వైఎస్సార్ జిల్లా గండికోటను రూ.100 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీటీడీసీ) ఎండీ కె.కన్నబాబు తెలిపారు. గండికోటకు స్పెషల్ ప్రాజెక్టు కింద కేంద్రం రూ.100 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె సమీపంలోని మల్లయ్యకొండపై అభివృద్ధి పనులు చేపట్టేందుకు స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డితో కలిసి ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తోందని తెలిపారు. తద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించే దిశగా కృషి చేస్తోందని చెప్పారు. గండికోటలో చేపట్టిన రోప్ వే పనులు త్వరలో పూర్తవుతాయని చెప్పారు. శ్రీకాళహస్తి, లంబసింగి, పెనుగొండ, గాలికొండ, అన్నవరంలో 20 కిలో మీటర్ల మేర రోప్ వేను రూ.1,200 కోట్లతో పీపీపీ పద్ధతిలో ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఒబెరాయ్ సంస్థ రూ.1,350 కోట్లతో గండికోట, తిరుపతి, పిచ్చుకలంక, హార్సిలీహిల్స్, విశాఖపట్నంలో సెవెన్ స్టార్ హోటళ్లను నిర్మించనుందని చెప్పారు. వైజాగ్ బీచ్ కారిడార్ అమలుకు ప్రణాళికలు రూపొందించామని, భోగాపురం, భీమిలిలో పర్యాటకుల కోసం సీ ప్లేన్, తొట్లకొండలో రూ.120 కోట్లతో అక్వేరియం టన్నెల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయని పేర్కొన్నారు. విజయవాడ భవానీ ద్వీపం అభివృద్ధికి రూ.149 కోట్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని తెలిపారు. ఇంద్రకీలాద్రి నుంచి భవానీ ద్వీపం వరకు 2.5 కిలోమీటర్లు రోప్‌వే ఏర్పాటు ఈ మాస్టర్ ప్లాన్‌లో ఉందన్నారు. లంబసింగి, పాడేరులో కొత్తగా హోటళ్ల నిర్మాణం, అన్నవరంలో ఎకో రిసార్ట్‌కు చర్యలు చేపట్టామని చెప్పారు. -
కొత్త మంత్రి వర్గంపై కన్నబాబు కామెంట్స్
-
తప్పుదోవ పట్టిస్తారా?
సాక్షి, అమరావతి: వివిధ కారణాలతో చనిపోయిన వారిని కల్తీ సారా మృతులంటూ సభను టీడీపీ తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణశ్రీనివాస్ (నాని) మండిపడ్డారు. ప్రతిపక్షం పదేపదే సభను అడ్డుకోవడంతో బుధవారం అసెంబ్లీలో ఈ ప్రకటన చేశారు. ఇదీ వాస్తవం.. ఈ నెల 11న జంగారెడ్డిగూడెంలో వరదరాజులు అనే వ్యక్తి అనారోగ్యానికి గురి కావడంతో ఏలూరు అక్కడ నుంచి గుంటూరు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలియగానే నేను 12వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు గుంటూరు ఆస్పత్రి వైద్యులతో మాట్లాడా. వరదరాజులు బ్రెయిన్ హెమరేజ్‌తో మెదడులో రక్తస్రావం జరుగుతోందని ఆస్పత్రి సూపరింటెండెంట్ చెప్పారు. అతడిని బతికించేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం దక్కలేదు. బాధితుడు మంగళవారం రాత్రి 7 గంటలకు చనిపోయాడు. ఇప్పటికే ఎంఎల్సీ ప్రాథమిక నివేదిక రాగా పూర్తి స్థాయి రిపోర్టు రావాల్సి ఉంది. ఈలోగానే టీడీపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. లక్షణాలన్నీ ఒకేలా ఉండాలి కదా? అవి నిజంగా కల్తీ సారాకు సంబంధించిన మరణాలే అయితే ఒకే రకమైన లక్షణాలుండాలి కదా? జంగారెడ్డిగూడెంలో చనిపోయిన వారందరి లక్షణాలు ఒకేలా లేవు. కొందరు కిడ్నీ వ్యాధులతో మరణిస్తే మరికొందరు కాలేయ సంబంధ జబ్బులతో మరికొందరు గుండెపోటు వల్ల మృతి చెందారు. వినే ఓపికా లేదా?: బుగ్గన టీడీపీ సభ్యులు రోజూ రెండు మరణాలను పెంచుతూ శవ రాజకీయాలు చేస్తున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. కనీసం అడిగిన ప్రశ్నలకు సమాధానం వినే ఓపిక కూడా వారికి లేదని విమర్శించారు. అప్పుడు ఎందుకు వెళ్లలేదు?: కన్నబాబు రాష్ట్రంలో ఏ సమస్యలు కనపడకపోవడంతో టీడీపీ సభ్యులు ఈ అంశాన్ని ఎత్తుకున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు దుయ్యబట్టారు. అధికారంలో ఉండగా ప్రచార వ్యామోహంతో గోదావరి పుష్కరాల్లో 29మంది, ఏర్పేడులో ఇసుక మాఫియా 16మందిని చంపినప్పుడు పరామర్శించని చంద్రబాబు ఇప్పుడు ఓట్ల కోసం జంగారెడ్డిగూడెం పరుగెత్తుకెళ్లారని చెప్పారు. -
విశాఖ అభివృద్ధిపై సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు
-
చెరువుల వేలంపై ఆందోళన అనవసరం
సాక్షి, అమరావతి: మత్స్యకార సహకార సంఘాల అభ్యున్నతి కోసం జారీ చేసిన జీవో 217 విషయంలో మత్స్యకారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు స్పష్టం చేశారు. వాస్తవానికి దీనివల్ల వారికి మేలు జరుగుతుందన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మత్స్యకార సొసైటీల్లో ప్రతి మత్స్యకారుడు కనీసం రూ.15 వేలకు తక్కువ కాకుండా ఆదాయం పొందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. వంద హెక్టార్లు పైబడిన చెరువులను బహిరంగ వేలం ద్వారా కేటాయించి ఆదాయంలో 30 శాతాన్ని సొసైటీ సభ్యులకు సమానంగా జమ చేయాలని, మరో 20 శాతం మత్స్య కారుల సహకార సంఘాల ఫెడరేషన్(ఆప్కాఫ్) ద్వారా వారి అభ్యున్నతి కోసం ఖర్చు చేయాలని నిర్ణయించామన్నారు. వేలం పాటల్లో మత్స్యకార సహకార సొసైటీలు కూడా పాల్గొనవచ్చన్నారు. సహజంగా అత్యధికంగా సముద్రంపైనే ఆధారపడి జీవించే మత్స్యకారులకు 217 జీవోతో ఎలాంటి నష్టం ఉండదన్నారు. మంచినీటి చెరువులకు సంబంధించిన ఈ జీవో వల్ల వారికి ఇబ్బంది ఉండదన్నారు. వంద హెక్టార్లకు పైబడిన, పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న నెల్లూరు జిల్లాలోని 27 చెరువులకు ప్రస్తుతం ఈ జీవోను వర్తింపచేస్తామని, మిగిలిన చోట్ల పాత పద్ధతిలోనే కొనసాగిస్తామని చెప్పారు. సందేహాల నివృత్తికి సిద్ధం వంద హెక్టార్లు పైబడిన చెరువులు దళారీల చేతుల్లో ఉండడం వల్ల లీజు సొసైటీల్లో సభ్యులు ఏటా రూ.300 నుంచి రూ.10 వేలకు మించి ఆదాయాన్ని పొందడం లేదని కన్నబాబు తెలిపారు. 90 శాతం సొసైటీల్లో గరిష్టంగా ఏటా రూ.2500 మించి పొందలేకపోతున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వంద హెక్టార్ల విస్తీర్ణం పైబడినవి 582 చెరువులుండగా 337 చోట్ల మాత్రమే మత్స్యకార సçహకార సంఘాలకు లీజుకు ఇస్తున్నామన్నారు. జీవోపై సందేహాలుంటే నివృత్తి చేసేందుకు తమ శాఖ సిద్ధంగా ఉందన్నారు. వ్యాపారం చేయడం లేదు మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగం పెంచడం, ఫిష్ ఆంధ్ర పేరిట నాణ్యమైన మత్స్య ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో హబ్ అండ్ స్పోక్ మోడల్ ద్వారా దేశీయ మార్కెటింగ్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని కమిషనర్ కన్నబాబు చెప్పారు. 70 ఆక్వా హబ్‌లు, 14 వేలకు పైగా రిటైల్ అవుట్‌లెట్స్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఫెసిలిటర్గా వ్యవహరిస్తుందే కానీ వ్యాపారం చేయడం లేదన్నారు. సమావేశంలో సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ విజయకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డీజిల్ సబ్సిడీ, పరిహారం, భరోసా గతంలో డీజిల్ సబ్సిడీ రూ.6.03 మాత్రమే ఇవ్వగా ఇప్పుడు రూ.9కి రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని కన్నబాబు తెలిపారు. టీడీపీ హయాంలో ఐదేళ్లలో డీజిల్ సబ్సిడీ కింద రూ.59.42 కోట్లు ఇవ్వగా ఇప్పుడు 33 నెలల్లోనే ప్రభుత్వం రూ.89.17 కోట్లు చెల్లించింది. ప్రమాదవశాత్తూ మరణిస్తే పరిహారాన్ని రూ.ఐదు లక్షల నుంచి రూ.10 లక్షలకు ప్రభుత్వం పెంచింది. ఇప్పటివరకు 64 కుటుంబాలకు రూ.64.10 కోట్లు పరిహారంగా చెల్లించింది. వేట నిషేధ సమయంలో నాడు ఐదేళ్లలో రూ.104.67 కోట్లు ఇవ్వగా ఇప్పుడు వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద మూడేళ్లలో రూ.309.33 కోట్లు చెల్లించింది. -
ఆయనకి బాబు మాటే బంగారు బాట: మంత్రి కన్నబాబు
-
‘రైతు సంక్షేమం కోసం సీఎం జగన్ ఎన్నో పథకాలు తెచ్చారు’
-
దిగజారుడు రాజకీయాలు చేసి ఢిల్లీ వీధుల్లో డ్రామాలా..?
-
ఆంధ్రా ఆక్వా అంటే.. అమెరికాలో లొట్టలు!
సాక్షి, అమరావతి: ఆంధ్రా రొయ్యలు, చేపలకు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఎనలేని డిమాండ్ ఉందని మరోసారి రుజువైంది. ఇక్కడి మత్స్య ఉత్పత్తులంటే అమెరికా వాసులు లొట్టలేసుకుని తింటారు. విస్తీర్ణంలోనే కాదు.. దిగుబడుల్లోనూ నంబర్ 1గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల్లో అదే స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. ఆంధ్రా నుంచి ఆక్వా ఎగుమతుల్లో మూడొంతులు అమెరికాకే జరుగుతున్నాయని ఎంపెడా వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. ఆక్వారంగంపై 2020–21 మొదట్లో కరోనా ప్రభావం కాస్త తీవ్రంగానే చూపినప్పటికీ ద్వితీయార్థంలో మాత్రం అనూహ్యంగా పుంజుకుంది. దీంతో ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది దేశం నుంచి రూ.43,717.26 కోట్ల విలువైన 11,49,341 టన్నుల ఆక్వా ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. 2019–20తో పోలిస్తే పరిమాణంలో 10.81 శాతం, విలువలో 6.31 శాతం తగ్గుదల నమోదైంది. రూ.15,832 కోట్ల విలువైన 2,93,314 టన్నుల ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులతో ఏపీ దేశంలోనే నంబర్ 1గా నిలిచింది. గతేడాదితో పోలిస్తే పరిమాణంలో 4.54 శాతం, విలువలో 2.15 శాతం తగ్గుదల నమోదైంది. చదవండి: భలే ఫిష్.. ఆల్ ఫ్రెష్ ఎగుమతుల్లో 36 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే దేశ ఎగుమతుల పరిమాణంలో 36 శాతంతో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. 13 శాతంతో తమిళనాడు, కేరళ, 10 శాతంతో గుజరాత్ తరువాత స్థానాల్లో ఉన్నాయి. ఎగుమతుల విలువ పరంగా చూసినా 24 శాతంతో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. 18 శాతంతో గుజరాత్, 14 శాతంతో కేరళ, 10 శాతంతో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తరువాత స్థానాల్లో ఉన్నాయి. ఎగుమతుల పరిమాణంలోను, విలువలోను ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌కు సమీపంలో కూడా లేవు. ఏపీ ఎగుమతుల్లో మూడొంతులు అమెరికాకే మన దేశం నుంచి జరిగిన ఆక్వా ఎగుమతుల్లో 25 శాతం అమెరికాకు, 19 శాతం చొప్పున చైనా, దక్షిణ తూర్పు ఆసియా దేశాలకు, 13 శాతం యూరోపియన్ దేశాలకు, 8 శాతం జపాన్‌కు, 4 శాతం మిడిల్ ఈస్ట్ దేశాలకు, 12 శాతం ఇతర దేశాలకు వెళ్లాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి జరిగిన ఎగుమతుల్లో 70.74 శాతం అమెరికా సంయుక్త రాష్ట్రాలకు (యూఎస్ఏకు), 12.74 శాతం చైనాకు, 4.54 శాతం యూరోపియన్ దేశాలకు, 3.51 శాతం మిడిల్ ఈస్ట్ దేశాలకు, 2.92 శాతం సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలకు వెళ్లాయి. ఇక ఫ్రోజెన్ చేసిన రొయ్యల ఎగుమతుల్లో 97.20 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే జరగడం గమనార్హం. చదవండి: కొల్లేరు కొర్రమీను.. కనుమరుగయ్యేను వనామీలోనే 77 శాతం ఏపీదే రొయ్యల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న మన రాష్ట్రం మరోసారి సత్తా చాటుకుంది. 2020–21లో వనామీ రొయ్యల ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 1,08,526.27 హెక్టార్లలో సాగవుతున్న ఆక్వాకల్చర్ ద్వారా 8,15,745 టన్నుల వనామీ రొయ్యల ఉత్పత్తి జరిగింది. మన రాష్ట్రంలో 71,921 హెక్టార్లలో 6,34,672 టన్నుల వనామీ రొయ్యలు ఉత్పత్తి అయ్యాయి. దేశంలో వనామీ రొయ్యల ఉత్పత్తిలో 77.80 శాతం ఏపీ నుంచే జరగడం గమనార్హం. 28 శాతం ఎగుమతి వైజాగ్ పోర్టు నుంచే దేశంలో 10 పోర్టుల ద్వారా రూ.43,717.26 కోట్ల విలువైన 11,49,341 టన్నుల ఎగుమతులు జరిగాయి. వాటిలో రూ.16,124.92 కోట్ల విలువైన 2,80,687 టన్నుల మత్స్య ఎగుమతులు ఆంధ్రప్రదేశ్‌లోని పోర్టుల నుంచే జరిగాయి. అంటే మొత్తం ఎగుమతుల్లో 24 శాతం విలువైన 37 శాతం ఆక్వా ఉత్పత్తులు మన రాష్ట్ర పరిధిలోని పోర్టుల నుంచే వెళ్లాయి. ప్రధానంగా రూ.12,362.71 కోట్ల (28.28 శాతం) విలువైన 2,16,457 టన్నుల(18.83 శాతం) ఎగుమతులతో వైజాగ్ పోర్టు ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల్లో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. రూ.5112.77 కోట్ల (11.70 శాతం) విలువైన 1,16,419 టన్నుల (10.13 శాతం) ఎగుమతితో కోల్‌కతా పోర్టు, రూ.4,994.75 కోట్ల (11.43 శాతం) విలువైన 1,43,552 టన్నుల (12.49 శాతం) ఎగుమతితో కొచ్చి పోర్టు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. రూ.3,762.21 కోట్ల (8.61 శాతం) విలువైన 64,230 టన్నుల (5.59 శాతం) ఎగుమతులతో రాష్ట్రంలోని కృష్ణపట్నం పోర్టు జాతీయస్థాయిలో నాలుగో స్థానంలో నిలిచింది. ఎగుమతుల్లో మనమే టాప్ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ తిరుగులేని ఆధిక్యతను కొనసాగిస్తోంది. 2020–21 మొదట్లో కరోనా కొంత ప్రభావం చూపినప్పటికీ ద్వితీయార్థంలో ఎగుమతులు అనూహ్యంగా పుంజుకున్నాయి. రికార్డు స్థాయిలో ఎగుమతులు చేయగలిగాం. నంబర్ 1గా నిలవగలిగాం. – కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ -
రైతులను అరెస్ట్ చేయించిన ఘనుడు చంద్రబాబు
-
లక్ష మంది రైతులతో వ్యవసాయ సలహా మండళ్లు
సాక్షి, అమరావతి : ‘ఎంతో అనుభవజ్ఞులైన లక్షమంది రైతులతో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటయ్యాయి. ఇంతపెద్ద వ్యవస్థ మరే రాష్ట్రంలోనూ లేదు. వీరి సలహాలు, సూచనలతో రైతులకు ఎంతో మేలు చెయ్యొచ్చు’.. అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా ఏర్పాటైన ఈ సలహా మండళ్లను వ్యవసాయపరంగా అన్ని అంశాల్లో భాగస్వాములను చేస్తున్నామన్నారు. రైతులకు మరింత మెరుగైన సేవలందించేందుకే ఈ మండళ్లు ఏర్పాటయ్యాయని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో శుక్రవారం 13 జిల్లాల వ్యవసాయ సలహా మండళ్ల చైర్మన్లతో జరిగిన రాష్ట్రస్థాయి అవగాహన సదస్సులో మంత్రి కన్నబాబు మాట్లాడారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో ఏర్పాటుచేసిన ఈ సలహా మండళ్ల సహకారంతో రాష్ట్రంలో వ్యవసాయరంగం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. వ్యవసాయ, ఉద్యాన, సహకార, పట్టుసాగు, చేపలు రొయ్యల పెంపకం తదితర అన్ని అంశాల్లో ఈ మండళ్లు సూచనలిస్తే వాటిని సీఎం దృష్టికి తీసుకువచ్చి వ్యవసాయాన్ని మరింతగా అభివృద్ధి చెయ్యొచ్చన్నారు. సాగుచేసే ప్రతి ఎకరాను ఈ–క్రాప్‌లో నమోదు చేయించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని మంత్రి కన్నబాబు అన్నారు. బోర్ల కింద వరి పండించకుండా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ–క్రాప్, సీఎం యాప్‌లను మరింత సరళతరం చేసి రైతులకు అర్ధమయ్యేలా చెయ్యాలన్నారు. అనంతరం వ్యవసాయ సలహా మండళ్ల ఆవిర్భావం, ఉద్దేశ్యాలు, బాధ్యతలు తదితర అంశాలపై వివిధ శాఖల ఉన్నతాధికారులు అవగాహన కల్పించారు. పంటల ప్రణాళిక, డిమాండ్ మేరకు ఉత్పత్తి, పంటల మార్పు, రైతులకు ఆర్బీకేలో అందుతున్న సేవలు, మార్కెట్ ఇంటెలిజెన్స్, వాతావరణ పరిస్థితులు తదితర అంశాలపై సలహాలిస్తూ రైతుల్ని చైతన్యపరచాలని సూచనలు చేశారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఏపీ వ్యవసాయ మిషన్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ అనుబంధ శాఖల కమిషనర్లు అరుణ్‌కుమార్, ప్రద్యుమ్న, శ్రీధర్, అహ్మద్‌బాబు, కన్నబాబు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఆర్ అమరేంద్రకుమార్, ఏపీ సీడ్స్, ఆయిల్ ఫెడ్, ఆగ్రోస్ ఎండీలు శేఖర్‌బాబు, శ్రీకంఠనాథరెడ్డి, కృష్ణమూర్తి, సీడ్స్ సర్టిఫికేషన్ డైరెక్టర్ త్రివిక్రమరావు తదితరులు పాల్గొన్నారు. -
పశ్చిమ డెల్టాలో ఫిషరీస్ వర్సిటీ
సాక్షి, అమరావతి: ఆక్వా రాజధాని ‘పశ్చిమ డెల్టా’లో ఫిషరీస్ యూనివర్సిటీ నెలకొల్పే దిశగా రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సరిపల్లి–లిఖితపూడి గ్రామాల మధ్య ఈ వర్సిటీ ఏర్పాటు కాబోతోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 40 ఎకరాల భూమిని కేటాయించింది. దీనికి రూ.332 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.100 కోట్లు కేటాయించింది. వర్సిటీ నిర్మాణానికి సెప్టెంబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. నిపుణుల కొరత తీర్చేలా.. చేపలు, రొయ్యల ఉత్పత్తిలో మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా చేపల ఉత్పత్తిలో 29 శాతం, రొయ్యల ఉత్పత్తిలో 68 శాతం వాటా ఏపీదే. మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లోనూ 40 శాతం వాటా రాష్ట్రానిదే. రాష్ట్ర స్థూల ఆదాయంలో 8.67 శాతం (రూ.55,294 కోట్లు) ఈ రంగం నుంచే వస్తోంది. గడచిన పదేళ్లలో సముద్ర చేపల ఉత్పత్తి రెట్టింపు కాగా, రొయ్యల ఉత్పత్తి నాలుగు రెట్లు, సంప్రదాయ చెరువుల్లో చేపల ఉత్పత్తి రెండున్నర రెట్లు, ఉప్పు, మంచినీటి చెరువుల్లో రొయ్యల ఉత్పత్తి 15 రెట్లు పెరిగింది. ఈ రంగంపై 8.50 లక్షల మంది మత్స్యకార కుటుంబాలతో పాటు 26.50 లక్షల మంది ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. ఏటా 11 శాతం వృద్ధిరేటు సాధిస్తున్న ఆక్వా రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ రంగంలో నిపుణుల కొరతను తీర్చడంతోపాటు లోతైన పరిశోధనలు చేపట్టడం.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో ప్రత్యేకంగా ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తోంది. మరో రెండు కళాశాలల ఏర్పాటు ఈ వర్సిటీకి అనుబంధంగా శ్రీకాకుళం జిల్లా పలాస, కృష్ణా జిల్లా కైకలూరు వద్ద కూడా ఫిషరీస్ కళాశాలలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వర్సిటీకి అనుబంధంగా మరిన్ని పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు కాబోతున్నాయి. సర్కారు చర్యల వల్ల ఆక్వా రంగంలో పరిశోధనలు పెరగడమే కాకుండా నిరుద్యోగ యువతకు విద్యా, ఉద్యోగ అవకాశాలు మెరుగుపర్చడంతోపాటు ఆక్వా రంగంపై ఆధారపడిన వారి నైపుణ్యతను పెంపొందించేందుకు అవకాశం కలుగుతుంది. దేశంలోనే మూడో వర్సిటీ దేశంలోని కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రమే ఫిషరీస్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఏపీలో నిర్మిస్తున్న ఈ వర్సిటీ దేశంలోæ మూడోది కానుంది. ఇందుకు అవసరమైన భూమిని రెవెన్యూ శాఖ ఇప్పటికే గుర్తించి ఇటీవలే మత్స్య శాఖకు అప్పగించింది. తొలి దశలో ఇచ్చే రూ.100 కోట్లతో పరిపాలనా భవనం, అకడమిక్ బ్లాక్, విద్యార్థులు, విద్యార్థినులకు వేర్వేరుగా హాస్టల్స్, రైతులకు శిక్షణ కేంద్రం, మల్టీపర్పస్ బిల్డింగ్ వంటి సదుపాయాలు కల్పిస్తారు. రాష్ట్ర విద్య, సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో అంతర్జాతీయ ప్రమాణాలతో వర్సిటీని నిర్మించేందుకు త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. టెండర్లు పిలిచేందుకు కసరత్తు ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.100 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో పరిపాలన, విద్యా సంబంధిత భవనాలతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు త్వరలో టెండర్లు పిలవబోతున్నాం. – కె.కన్నబాబు, కమిషనర్, మత్స్య శాఖ వచ్చే విద్యా సంవత్సరం నుంచే.. ఫిషరీస్ యూనివర్సిటీ ప్రాంగణంలో కొత్తగా మత్స్య కళాశాల కూడా ఏర్పాటు కానుంది. తొలుత బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్సెస్ కోర్సుతో వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ తరువాత మాస్టర్ ఆఫ్ ఫిషరీస్ సైన్సెస్, పీహెచ్డీ కోర్సులను సైతం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీహెచ్డీలలో ఆక్వా కల్చర్, అక్వాటిక్, యానిమల్ హెల్త్ మేనేజ్మెంట్, ఫిషరీస్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ తదితర కోర్సులు ఉంటాయని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నెల్లూరు జిల్లా ముత్తుకూరు వద్ద మత్స్య కళాశాల, అవనిగడ్డ మండలం బావదేవరపల్లి వద్ద ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాల ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఉప్పు నీటి రొయ్యలు, బిక్కవోలు మండలం బలభద్రపురంలో మంచినీటి చేపల పరిశోధనా కేంద్రాలు ఉండగా.. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి వద్ద మంచినీటి చేపలు, రొయ్యల పరిశోధనా కేంద్రం ఉంది. ఇవన్నీ ఇకపై ఫిషరీస్ యూనివర్సిటీకి అనుబంధంగా పనిచేస్తాయి.