- పార్టీ అడ్డతీగల మండల శాఖ సమావేశంలో
- వైఎస్సార్ సీసీ జిల్లా సారథి కన్నబాబు పిలుపు
సైనికుల్లా కదలండి
Published Thu, Oct 20 2016 11:39 PM | Last Updated on Tue, May 29 2018 2:28 PM
అడ్డతీగల :
ప్రజాసమస్యలు పట్టించుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు సాగిస్తున్న అరాచక పాలనను అంతమొందించడానికి పార్టీ శ్రేణులు సైనికుల్లా కదలాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధక్షుడు కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. ఆ పార్టీ అడ్డతీగల మండలశాఖ సమావేశం స్థానిక ఆర్‌అండ్ బీ అతిథిగృహం ఆవరణలో పార్టీ యువజన విభాగం జిల్లా అధక్షుడు అనంత ఉదయభాస్కర్ అధక్షతన గురువారం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన కన్నబాబు మాట్లాడుతూ అవినీతి, అక్రమాలకు చంద్రబాబు చిరునామాగా మారి నయవంచక పాలన సాగిస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు అలవి కాని హామీలిచ్చి, గద్దెనెక్కాక నిత్యం అబద్ధాలతో గ్లోబల్ ప్రచారం చేసుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారన్నారు.
పసికందులు చనిపోతున్నా పట్టించుకోరా?
రాజవొమ్మంగి మండలంలో పసికందులు చనిపోతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని కన్నబాబు అన్నారు కాళ్లవాపు వ్యాధితో విలీన మండలాల్లో పదుల సంఖ్యలో గిరిజనులు మరణిస్తున్నా పాలకులకు చీమకుట్టినట్టయినా లేదన్నారు. రూ. వందల కోట్లు దోచుకోవడానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లకుండా ఎత్తిపోతల పథకాలను తలకెత్తుకుంటున్నారన్నారు. మన్యంలో భూపతిపాలెం, ముసురుమిల్లి జలాశయాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా విదల్చలేన్నారు. తెలుగుదేశం నియంతృత్వ పరిపాలనకు చరమగీతం పాడేందుకు ప్రతి కార్యకార్తా కంకణం కట్టుకుని పోరాడాలకు కన్నబాబు పిలుపునిచ్చారు.
1019లో చంద్రబాబుకు గుణపాఠం
ప్రజాపోరాటాలు చేసే నాయకులను పోలీసుల సాయంతో అణిచివేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి 2019లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. పార్టీ అధినేత జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి ఇచ్చిన స్ఫూర్తితో పార్టీ శ్రేణులు అవిశ్రాంత పోరాటానికి సిద్ధపడాలన్నారు. అత్యంత నీచమైన పరిపాలన చేస్తున్న చంద్రబాబు సొంతానికి రూ. కోట్లు పోగేసుకోవడం మినహా కనీసం వృద్ధులకు పింఛను కూడా ఇవ్వడం లేదని అరకు పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ పరిశీలకురాలు, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి విమర్శించారు. టక్కుటమార విద్యలతో ప్రజలను మభ్యపెడుతున్న చంద్రబాబు పరిపాలనలోని డొల్లతనం ప్రజలకు ఇప్పటికే అర్థమైందని పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. జిల్లాలో ఎక్కడాలేని విధంగా అత్యధిక ప్రజాప్రతినిధులను గెలిపించిన చరిత్ర మన్యం ప్రజానీకానిదని అనంత ఉదయ్ భాస్కర్ అన్నారు. ఇదే ప్రజాదరణ భవిష్యత్తులోనూ ఉండేలా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమిష్టిగా కృషి చేద్దామన్నారు. ప్రజల కనీసావసరాలు తీర్చడానికి సైతం ఈ ప్రభుత్వానికి మన సొప్పడం లేదని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి విమర్శించారు. సమావేశానికి రంపచోడవరం డివిజ¯ŒSలోని వివిధ మండలాల నుంచి పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా తరలి వచ్చారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొమ్మిశెట్టి బాలకృష్ణ, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు బాలోజి గడ్డిబాబు, కాకినాడ రూరల్ నాయకుడు సీతారాములు, పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు ,డీసీసీబీ డైరెక్టర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం చివర్లో జక్కంపూడి రాజా, కురసాల కన్నబాబు, గిడ్డి ఈశ్వరిలను పార్టీ అడ్డతీగల మండల శాఖ అధ్యక్షుడు మద్దాల వీర్రాజు అనంత ఉదయభాస్కర్ తదితరులు గజమాలతో సత్కరించారు.
Advertisement
Advertisement