సాక్షి, కాకినాడ: రాష్ట్రంలోని ఉద్యోగుల భవిష్యత్‌తో చంద్రబాబు సర్కారు జూదం ఆడుతోందని, సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కాకినాడ పార్లమెంట్ వైఎస్‌ఆర్‌సీపీ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద నిరహర దీక్షలు చేపట్టిన ప్రభుత్వ ఉద్యోగులకు ఆయన మద్దతు పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మాట ఇచ్చారని ఆయన తెలిపారు. జగన్ మాట ఇస్తే వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని వాటికి కట్టుబడి ఉంటారని తెలిపారు.
కాగా, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి అసెంబ్లీలో తీర్మానం చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment