సాక్షి, విశాఖపట్నం : తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు విశాఖ నగరంలో విచ్చలవిడిగా భూఆక్రమణలకు పాల్పడ్డారని అనకాపల్లి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. సిటీలో జరిగిన భూకుంభకోణాలపై పూర్తి విచారణ జరిపిస్తామని వెల్లడించారు. ఈ వ్యవహారంతో సంబంధమున్న అధికారులు, ప్రజాప్రతినిధులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. రాజధాని అమరావతి నగర నిర్మాణానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అక్కడ జరిగిన అవకతవకలపై కూడా విచారణ జరిపిస్తామని అన్నారు. విద్యా, వైద్యానికి సంబంధించిన అంశాలకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. అనకాపల్లి అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని తెలిపారు. ఇదిలాఉండగా.. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారి విశాఖకు వచ్చిన యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు (యూవీ రమణమూర్తిరాజు)కు కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment