visakha lands
-
‘టీడీపీ తప్పు చేసింది.. ఆ పాపం చంద్రబాబుదే’
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో భూములపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు తప్పులను సరిదిద్దుతుంటే తిరిగి తమపైనే ఆరోపణలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన టీడీపీ నేతలే ధర్నా చేయడం విడ్డూరం. టీడీపీ సందేహాలు తీర్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. చదవండి: ఇదేం సినిమా అనుకున్నావా? బాలకృష్ణ రాజీనామా ఇంకెప్పుడు? ‘‘మధురవాడ ఐటీ హిల్స్ భూముల అడ్డగోలు కేటాయింపు పాపం చంద్రబాబుదే. కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా చంద్రబాబు అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూములపై ఒప్పందం రద్దు చేయాలని భావించింది. ఎన్సీసీ కోర్టును ఆశ్రయించడం.. కోర్టు స్టేటస్ కో ఇవ్వడంతో సంప్రదింపులు జరిపాం. ఎన్సీసీ సంస్థ 2007లో రూ.90 కోట్లు ప్రభుత్వానికి చెల్లించింది. 2020లో మరో 97 కోట్లు చెల్లించింది. అసలు ఎన్సీసీ భూముల వ్యవహారంలో టీడీపీ తప్పు చేసింది. దోపిడీ చేయాలని ప్రయత్నించింది. టీడీపీ నాయకులు ధర్నా చేసేందుకు ముందు పూర్వ పరాలు తెలుసుకోవాలని’’ మంత్రి బొత్స సత్యనారాయణ హితవు పలికారు. -
విశాఖలో భారీగా ప్రభుత్వ భూమి స్వాధీనం
సాక్షి, విశాఖపట్నం : విశాఖలో భారీ ఎత్తున ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. అడవివరం నుంచి శోత్యాం వెళ్లే మార్గంలో రామ అగ్రహారం వద్ద దాదాపు 110 ఎకరాల భూమి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి మొక్కలను పెంచుతున్నారు. ఇందులో పది ఎకరాల భూమిని మినహాయిస్తే మిగతా భూమి అంతా ప్రభుత్వానిది. టీడీపీ హయాంలో కొందరు బడా బాబులు ఈ భూమిని ఆక్రమించుకుని అనుభవిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ దశలో రెవెన్యూ అధికారులు శనివారం ఉదయం ఆ ప్రాంతానికి వెళ్లి ప్రహరీ గోడను తొలగించి భూమిని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 70 ఎకరాల ఖరీదైన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం పట్ల ఆ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. (టీడీపీ అండతో ఇదీ ‘గీతం’ బాగోతం) -
కబ్జాకోరుల్ని వదిలిపెట్టం : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే
సాక్షి, విశాఖపట్నం : తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు విశాఖ నగరంలో విచ్చలవిడిగా భూఆక్రమణలకు పాల్పడ్డారని అనకాపల్లి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. సిటీలో జరిగిన భూకుంభకోణాలపై పూర్తి విచారణ జరిపిస్తామని వెల్లడించారు. ఈ వ్యవహారంతో సంబంధమున్న అధికారులు, ప్రజాప్రతినిధులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. రాజధాని అమరావతి నగర నిర్మాణానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అక్కడ జరిగిన అవకతవకలపై కూడా విచారణ జరిపిస్తామని అన్నారు. విద్యా, వైద్యానికి సంబంధించిన అంశాలకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. అనకాపల్లి అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని తెలిపారు. ఇదిలాఉండగా.. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారి విశాఖకు వచ్చిన యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు (యూవీ రమణమూర్తిరాజు)కు కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. -
ఐఏఎస్ వాణీ మోహన్ చేసింది తప్పే!
► విచారణ విధానం పాటించలేదు ►ఏకపక్ష తీర్పు ఇచ్చారు ►సీఎంకు చేరిన నివేదిక అమరావతి: ఐఏఎస్ అధికారి వాణీమోహన్ తప్పు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నివేదిక అందింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జగదీష్ చంద్ర శర్మ ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) దినేష్ కుమార్‌కు సమర్పించిన నివేదిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చేరింది. విశాఖపట్నంలో రూ. వంద కోట్ల విలువైన భూమి ప్రభుత్వానిదని అప్పటి విశాఖ జిల్లా కలెక్టరు కోర్టు తీర్పు ఇవ్వగా ఇది తమదేనంటూ ప్రయివేటు వ్యక్తి సెటిల్మెంట్ కమిషనర్‌కు అప్పీల్ చేసుకున్నారు. అప్పట్లో సర్వే సెటిల్మెంట్ కమిషనర్ హోదాలో ఉన్న వాణీ మోహన్ ఇరు వర్గాల వాదనలు వినకుండా ఇది ప్రభుత్వ భూమి అనడానికి ఆధారాలు లేవంటూ ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు. దీనిపై విశాఖపట్నం అప్పటి కలెక్టరు యువరాజ్ కమిషనర్ అప్పీల్స్ కోర్టులో కేసు దాఖలు చేశారు. పక్కాగా ఈ భూమి ప్రభుత్వానిదని అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ తమ వాదనను వినకుండా ఏకపక్షంగా ఈభూమి ప్రయివేటుదంటూ వాణీమోహన్ తీర్పు చెప్పారంటూ అప్పట్లో ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆమెను సర్వే సెటిల్మెంట్ కమిషనర్ పోస్టు నుంచి ప్రభుత్వం తప్పించింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జగదీష్ చంద్ర శర్మను సీఎం ఆదేశించారు. ప్రయివేటు వ్యక్తుల అడ్వకేట్లు, ప్రభుత్వ అధికారులు అందరి వాదనలు విని వాస్తవాలను వాకబు చేసిన ఆయన వాణీమోహన్‌దే తప్పని తేల్చారు. ‘తీర్పు ఎలాగైనా ఇవ్వవచ్చు. అందులో తప్పొప్పుల గురించి చెప్పలేం. అయితే సెటిల్మెంట్ కమిషనర్ విచారణ విషయంలో పద్ధతిని సక్రమంగా పాటించలేదు. ప్రొసీజర్ పాటించకుండా తీర్పు ఇవ్వడం తప్పే...’ అని సీఎస్‌కు సమర్పించిన నివేదికలో పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ భూవివాదం కేసు ప్రస్తుతం కమిషనర్ అప్పీల్స్ కోర్టు విచారణలో ఉంది. విశాఖపట్నం నగరంలోని ఈ భూమి ప్రభుత్వానిదా? ప్రయివేటుదా అనే అంశంపై ప్రభుత్వ, ప్రయివేటు న్యాయవాదుల వాదనలు విని కమిషనర్ అప్పీల్స్ తీర్పు ఇవ్వాల్సి ఉంది. ఈ వివాదం నేపథ్యంలోనే ప్రభుత్వం వాణీ మోహన్‌కు పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్లో పెట్టింది. ప్రస్తుతం నివేదిక అందినందున ఈ అంశంపై ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటారనే అంశం ఐఏఎస్ అధికార వర్గాల్లో ఆసక్తిగా మారింది.