సాక్షి, విశాఖపట్నం: విశాఖలో భూములపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు తప్పులను సరిదిద్దుతుంటే తిరిగి తమపైనే ఆరోపణలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన టీడీపీ నేతలే ధర్నా చేయడం విడ్డూరం. టీడీపీ సందేహాలు తీర్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
చదవండి: ఇదేం సినిమా అనుకున్నావా? బాలకృష్ణ రాజీనామా ఇంకెప్పుడు?
‘‘మధురవాడ ఐటీ హిల్స్ భూముల అడ్డగోలు కేటాయింపు పాపం చంద్రబాబుదే. కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా చంద్రబాబు అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూములపై ఒప్పందం రద్దు చేయాలని భావించింది. ఎన్‌సీసీ కోర్టును ఆశ్రయించడం.. కోర్టు స్టేటస్ కో ఇవ్వడంతో సంప్రదింపులు జరిపాం. ఎన్‌సీసీ సంస్థ 2007లో రూ.90 కోట్లు ప్రభుత్వానికి చెల్లించింది. 2020లో మరో 97 కోట్లు చెల్లించింది. అసలు ఎన్‌సీసీ భూముల వ్యవహారంలో టీడీపీ తప్పు చేసింది. దోపిడీ చేయాలని ప్రయత్నించింది. టీడీపీ నాయకులు ధర్నా చేసేందుకు ముందు పూర్వ పరాలు తెలుసుకోవాలని’’ మంత్రి బొత్స సత్యనారాయణ హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment