
సాక్షి, విశాఖపట్నం : విశాఖలో భారీ ఎత్తున ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. అడవివరం నుంచి శోత్యాం వెళ్లే మార్గంలో రామ అగ్రహారం వద్ద దాదాపు 110 ఎకరాల భూమి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి మొక్కలను పెంచుతున్నారు. ఇందులో పది ఎకరాల భూమిని మినహాయిస్తే మిగతా భూమి అంతా ప్రభుత్వానిది. టీడీపీ హయాంలో కొందరు బడా బాబులు ఈ భూమిని ఆక్రమించుకుని అనుభవిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ దశలో రెవెన్యూ అధికారులు శనివారం ఉదయం ఆ ప్రాంతానికి వెళ్లి ప్రహరీ గోడను తొలగించి భూమిని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 70 ఎకరాల ఖరీదైన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం పట్ల ఆ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. (టీడీపీ అండతో ఇదీ ‘గీతం’ బాగోతం)
Comments
Please login to add a commentAdd a comment