విశాఖ తూర్పు ఎమ్మెల్యే రామకృష్ణబాబు కేరాఫ్ సెటిల్‌మెంట్స్
విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. ఈ పేరంటే హడల్. భూ కబ్జాలు, సెటిల్‌మెంట్‌లు, దందాలే గుర్తొసాయి. నియోజకవర్గంలో ‘వెలగ’బెట్టింది మాత్రం శూన్యం. 2009, 2014, 2019 జరిగిన సాధారణ ఎన్నికల్లో వరుసగా టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికైనా సొంత వ్యాపారాలు, దందాలుపైనే దృష్టి పెట్టారు. అనుచరులతో భూ కబ్జాలకు పాల్పడటం, మద్యం వ్యాపారం, కోడి పందాలు నిర్వహించి సొమ్ము చేసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.
– ఆరిలోవ
నగర వాసులకు విష సంస్కృతి పరిచయం చేసిన ఘనుడు కోడిపందేలు, జూదాలతో రూ. కోట్లు వెనకేసుకున్న వైనం ఎంవీపీ కాలనీలో రూ.కోట్ల విలువైన భూముల ఆక్రమణ కన్ను పడితే కబ్జా చేయాల్సిందే మద్యం దుకాణాల ఏర్పాటుతో మహిళల ఆక్రందన కోడి పందేలు, మద్యం షాపులు విశాఖ ప్రజలకు తెలియన కోడి పందేలు సంస్కృతిని ఎమ్మెల్యే వెలగపూడి రుచి చూపించారు. ఇది విష సంస్కృతి అని తెలియక ఇక్కడ ప్రజలు సుమారు నాలుగేళ్లు పాటు వరుసగా సంక్రాంతి సమయంలో జేబులు గుల్ల చేసుకొన్నారు.
ఈ పందేలను స్వయంగా ఎమ్మెల్యే వెలగపూడే ముడసర్లోవ రిజర్యాయరు వెనుక జీవీఎంసీకి చెందిన 10 ఎకరాల ఖాళీ స్థలంలో 2016, నుంచి 2020 వరకు వరుసగా నాలుగు సంవత్సరాలు సంక్రాంతికి కోడి పందేలు నిర్వహించి రూ. కోట్లలో సొమ్ముచేసుకున్నారు. దీంతో పాటు ఆరిలోవ, జోడుగుళ్లుపాలెం, అప్పూఘర్, జాలరిపేట ప్రాంతాలలో మద్యం దుకాణాలను 2015 నుంచి ప్రారంభించారు. 2015లో ఆరిలోవలో నిర్వహించిన మద్యం దుకాణం తొలగించాలని స్థానికులు, డ్వాక్రా సంఘాల మహిళలు, ఐద్వా మహిళలు ధర్నాలు చేపట్టినా ఆయన పట్టించుకోలేదు.
► టీడీపీ నుంచి 2009లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనకు రుషికొండ ప్రాంతంపై కన్నుపడింది. అక్కడ రెవెన్యూకి చెందిన భూమిలో గెడ్డ భాగాన్ని ఆక్రమించి ఆ స్థలం రోడ్డు నిర్మాణంలో తొలగించినట్లు చూపించారు. అతని స్థలం పోయినందుకు వేరేచోట ప్రత్యామ్నాయంగా స్థలం పొందారు.
► 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన దందాలపై మరింత దృష్టి సారించారు. జోడుగుళ్లుపాలెం వద్ద సుమారు ఎకరం స్థలాన్ని తన బంధువుల పేరుతో ఆక్రమించే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని స్థానికులు గమనించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ప్రయత్నానికి బ్రేక్ పడింది.
► నియోజకవర్గానికి ప్రధాన కేంద్రంగా నిలిచిన ఎంవీపీ కాలనీలో సెక్టార్–2లో గెడ్డ స్థలాన్ని ఆక్రమించి ఓ బిల్డర్‌కు అపార్టుమెంట్ నిర్మాణం కోసం కట్టబెట్టారు. ఆ అపార్టుమెంట్‌లో కొన్ని ప్లాట్లు తనకు ఇవ్వడానికి బిల్డర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అప్పట్లో నియోజకవర్గంలో సంచలనమైంది. దీంతో జీవీఎంసీ అధికారులు ఆ అపార్టుమెంట్ నిర్మాణాన్ని నిలిపేశారు. దీనిపై అప్పట్లో వైఎస్సార్‌సీపీ నాయకుడు(ప్రస్తుతం జనసేన కార్పొరేటర్) పీతల మూర్తియాదవ్ ఈ ఆక్రమణపై కోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం ఆ కేసు వ్యవహారం కోర్టులో ఉంది.
రామకృష్ణాపురాన్ని ఆనుకొని ముడసర్లోవ రిజర్యాయరు వెనుక 2017లో పెగదిలికి చెందిన వెలగపూడి రామకృష్ణబాబు ఆనుచరులు కొందరు సర్వే నంబర్లు 26, 27ల్లో సుమారు ఎకరం ప్రభుత్వ స్థలం ఆక్రమించి 18 కమ్మల పాకలు వేశారు. దీనిపై వెలగపూడికి వ్యతిరేకంగా అప్పట్లో ఫిర్యాదులు వెళ్లడంతో జీవీఎంసీ అధికారులు వాటిని తొలగించారు. ఇలా మూడుసార్లు అధికారులు తొలగించాల్సి వచ్చింది. దీంతో వెలగపూడి అనుచరులు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment