విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు చంద్రబాబు తీరని ద్రోహం
ప్రధాని మోదీ వద్ద కనీసం స్టీల్ ప్లాంట్ ఊసెత్తని చంద్రబాబు..
రైల్వే జోన్‌పై అబద్ధాలు చెప్పిన చంద్రబాబు
గత ప్రభుత్వం భూమి ఇవ్వలేదంటూ సభలో పచ్చి అబద్ధాలు
మొత్తం పెట్టుబడులు తానే తీసుకువచ్చానంటూ డాంబికాలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ (Visakha Steel Plant)పై చంద్రబాబు (Chandrababu) మోసం మరోసారి బయటపడింది. విశాఖ మోదీ (PM Modi) సభలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కనీసం ప్రస్తావించని సీఎం చంద్రబాబు.. స్టీల్ ప్లాంట్‌ను ఆదుకోవాలని ప్రధానికి కనీసం విజ్ఞప్తి కూడా చేయలేదు.
1400 రోజులకుపైగా స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యమం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కాపాడతామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఎన్నికల తర్వాత స్టీల్ ప్లాంట్ అంశాన్ని చంద్రబాబు పక్కన పెట్టారు. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ గనుల గురించి ప్రస్తావించిన చంద్రబాబు.. విశాఖ స్టీల్ ప్లాంట్ గనుల గురించి మాత్రం ప్రస్తావించలేదు. ప్రధానికి అపాయిమెంట్ ఇప్పించాలని కార్మికుల కోరిన కూడా చంద్రబాబు పట్టించుకోలేదు.
విశాఖ స్టీల్ ప్లాంట్ చంద్రబాబు తీరని ద్రోహం చేశారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోదీ వద్ద కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ ఊసెత్తని చంద్రబాబు.. మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు మాత్రం ఐరన్ఓర్ సప్లై చేసేందుకు పైప్‌లైన్ వేసేందుకు అనుమతించాలని మోదీని చంద్రబాబు కోరారు.
స్టీల్ ప్లాంట్‌కు ఐరన్ ఓర్ అడగకుండా.. మిట్టల్ స్టీల్‌ప్లాంట్‌కు ఐరన్ ఓర్ సప్లైకు పైప్ లైన్‌ను చంద్రబాబు అడిగారు. రైల్వే జోన్‌పై అబద్ధాలు చెప్పిన చంద్రబాబు.. గత ప్రభుత్వం భూమి ఇవ్వలేదంటూ ప్రధాని సభలో పచ్చి అబద్ధాలు చెప్పారు. మొత్తం పెట్టుబడులు తానే తీసుకువచ్చానంటూ చంద్రబాబు డాంబికాలు పలికారు.
ఇదీ చదవండి: ఇదీ వాస్తవం.. గణాంకాలతో సహా వివరించిన మార్గాని భరత్
ఏడు నెలల్లో తామే అంతా చేశాం అన్నట్లు చంద్రబాబు బిల్డప్ ఇచ్చారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం సాధించిన ప్రాజెక్టులను తన ఖాతాలో వేసుకున్న చంద్రబాబు.. నరేంద్ర మోదీని పొగడ్తలతో ముంచెత్తించారు. అటు ఇంగ్లీషు, ఇటు హిందీలోనూ ప్రధానిని ప్రసన్నం చేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారు.
Comments
Please login to add a commentAdd a comment