Vizag Steel plant
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల నిరసన
-
బాబూ.. టోల్ పెట్టకపోతే రోడ్లు వేయరా?: సీపీఎం శ్రీనివాసరావు
సాక్షి, విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. అలాగే, స్టీల్‌ప్లాంట్‌పై కేబినెట్లో ఒక్కసారైనా చర్చ జరిగిందా? అని ప్రశ్నించారు. టోల్ వసూలు చేసి రోడ్లు వేస్తామని చంద్రబాబు చెప్పడం విచిత్రంగా ఉందంటూ కామెంట్స్ చేశారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ కాపాడుతారనే కారణంగానే గాజువాకలో టీడీపీ ఎమ్మెల్యేకి అతిపెద్ద మెజారిటీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై టీడీపీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. వివరాలు కావాలని పవన్ కళ్యాణ్ అడగడం విడ్డూరం. రాష్ట్ర ప్రభుత్వానికి వివరాలు ఇవ్వాలా?. కూటమి ప్రభుత్వం ఒక్కసారైనా కేబినెట్లో స్టీల్ ప్లాంట్ కోసం చర్చించిందా?. సనాతన ధర్మంలో అవినీతి అనే అంశం లేనట్టు ఉంది.స్మార్ట్ మీటర్లను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబు వ్యతిరేకించారు. ఇప్పుడు అవే స్మార్ట్ మీటర్లు వేస్తుంటే ఈ ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదు?. ఇరిగేషన్లో పీపీపీ మోడల్ ఏమిటో అర్ధం కావడం లేదు. టోల్ వసూలు చేసి రోడ్లు వేస్తామని చంద్రబాబు చెప్పడం విచిత్రంగా ఉంది. టోల్ పెట్టకపోతే రోడ్లు వేయరా?. సీఎం బాబు మొదటి సంతకం చేసిన డీఎస్సీ ఏమైంది?. డీఎస్సీకి దిక్కులేదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో పరుగులు పెట్టిస్తారా?. విశాఖలో అత్యాచారాలపై చాలా బాధగా ఉంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వారిని శిక్షించాలి. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు 30వేల మంది మహిళలు మిస్సింగ్ అని ప్రచారం చేశారు. ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు.. ఏం చేశారు?. లేదంటే అది ఎన్నికల డ్రామానా? అని ప్రశ్నించారు. -
‘మీ మద్దతే కదా ఉంది.. ప్రధాని మోదీని ఒప్పించలేరా?’
అమరావతి, సాక్షి: విశాఖ స్టీల్‌ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకునే విషయంలో.. కూటమి ప్రభుత్వ వైఖరి అనుమానాస్పదంగా ఉందన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి. గురువారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం డిమాండ్ చేయగా.. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ కల్యాణి మీడియాతో మాట్లాడారు.‘‘కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ప్రైవేటీకరణ వేగంగా దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకే కూటమి ప్రభుత్వ తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. రెగ్యులర్ ఉద్యోగులకు 50% జీతం కోత పెట్టారు. 4500 కాంట్రాక్ట్ ఉద్యోగులకు నాలుగు నెలలుగా వేతనాలు లేవు. 500 మందిని డిప్యుటేషన్ మీద వెళ్లిపోమంటున్నారు. మరికొంత మందిని వీఆర్ఎస్ తీసుకోమని ఒత్తిడి తెస్తున్నారు.. చంద్రబాబు,పవన్ పై కేంద్రం ఆధాపడి ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోతే మద్దతు ఉపసంహరించుకుంటామని చెబితే కేంద్రం ఎందుకు దిగిరాదు. ప్రధాని 29న విశాఖ వస్తున్నారంటున్నారు. స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు,పవన్ ప్రధానితో ప్రకటన చేయించాలి... స్టీల్ ప్లాంట్ రాష్ట్ర ప్రజల సెంటిమెంట్. 32 మంది ప్రాణత్యాగాలతో స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం. ప్రైవేటీకరణ ఆపాల్సిన అవసరం చంద్రబాబు, పవన్ పై ఉంది. ఎన్నికల్లో చంద్రబాబు,పవన్ చెప్పిన మాటల వల్లే ఉత్తరాంధ్ర ప్రజలు ఓటేశారు. అలాంటిది.. కార్మికులను మోసం చేయడం చాలా దారుణం... ఇద్దరు ఎంపీలున్న కర్ణాటక ఎంపీలు చేయగలిగింది మన వాళ్లెందుకు చేయలేరు?. చత్తీస్ ఘడ్ లోని నాగర్నా ప్లాంట్ పై కేంద్రం తన ప్రకటను వెనక్కి తీసుకుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే 2024 వరకూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ ఎంపీలు ప్రైవేటీకరణను అన్నిరకాలుగా అడ్డుకోగలిగారు. ఇప్పుడు.. కూటమి నేతలు ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలి అని కల్యాణి డిమాండ్ చేశారు. -
స్టీల్ ప్లాంట్ రచ్చ.. మండలిలో గందరగోళం
-
‘మేమున్నాం మీ వెంట’ అనే భరోసా ఇచ్చేదెవరు?
మహానది–గోదావరి నదుల మధ్య విస్తరించి యున్న భూభాగమే కళింగాంధ్ర. ఈ కళింగాంధ్రలోని అంతర్భాగం ఉత్తరాంధ్ర. ఇది ఇచ్ఛాపురం నుండి పాయకరావుపేట వరకు వ్యాపించి ఉంది. విస్తారమైన కొండకోనలు, అటవీ భూములు గల పచ్చని ప్రాకృతిక ప్రదేశం. ఇక్కడ నివసించే ప్రజలు కష్టపడే తత్వం గలవారు. మైదాన, గిరిజన, మత్స్యకార ప్రజల శ్రమతో సృష్టించబడిన సంపద పెట్టుబడి వర్గాల పరమౌతున్నది. దాంతో ఇక్కడి ప్రజలు అనాదిగా పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ప్రాంతం వెనుకబడినది అనేకంటే, వెనుకకు నెట్టి వేయబడిందన్నమాట సబబుగా ఉంటుంది.ఒక వ్యక్తి కాని, ఒక సమూహం కాని ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి జీవనోపాధి నిమిత్తం కాల పరిమితితో సంబంధం లేకుండా వెళ్లడాన్ని వలస అనొచ్చు. అనాదిగా ఉత్తరాంధ్ర ప్రజలు అనుభవిస్తున్న ప్రధాన సమస్య ‘వలస’. ఇలా వలస వెళ్లినవారు ఆయా ప్రాంతాల్లో అనేక ఇడుములు పడటం చూస్తున్నాం. వీరికి ‘మేమున్నాం మీ వెంట’ అనే భరోసా ఇచ్చేదెవరు? మరో ముఖ్య సమస్య ఈ ప్రాంత భాష–యాస, కట్టు– బొట్టుపై జరుగుతున్న దాడి. నాగరికులుగా తమకు తాము ముద్రవేసుకొన్నవారు ఆటవికంగా ఉత్తరాంధ్ర జనాన్ని అవహేళన చేస్తున్నారు. తెలంగాణ సాంస్కృతిక భాషోద్యమంలాగా, ఉత్తరాంధ్ర సాంస్కృతిక భాషోద్యమం రావాలి. ఈ ప్రాంత వేషం–భాష అధికారికంగా అన్నిటా చలామణి కావాలి. తగువిధంగా గౌరవం పొందాలి. తెలంగాణ సాహితీవేత్తల వలె ఈ ప్రాంత కవులు, రచయితలు, కళాకారులు తమ మాండలిక భాషా సౌరభాలతో సాహిత్యాన్ని నిర్మించాలి.అనాదిగా ఈ ప్రాంతం పారిశ్రామికీకరణకు చాలా దూరంలో ఉంది. ఒక్క విశాఖపట్నం, పైడిభీమవరం తప్పితే ఎక్కడా పరిశ్రమల స్థాపన లేదు. ఉత్తరాంధ్ర అంతటా వ్యవసాయధారిత ఉత్పత్తుల పరిశ్రమల స్థాపన ఎక్కువగా జరగాల్సి ఉంది. అయితే రెడ్ క్యాటగిరీకి చెందిన కాలుష్య కారక పరిశ్రమల స్థాపన మాత్రం జరుగుతోంది. ఇవి ఉత్తరాంధ్ర ప్రజల జీవనానికి, మనుగడకు సవాల్ విసురుతున్నాయి.ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ఇండస్ట్రీని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవాలి. ఉత్తరాంధ్రలో నిర్మించ తలపెట్టిన అనేక నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మాణ దశలోనే ఉన్నాయి. శతశాతం పూర్తయినవి దాదాపుగా లేవు. విశాఖ రైల్వే జోన్ ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉంది. ఉత్తరాంధ్ర అంతట మారుమూల ప్రాంతాలను అనుసంధానం చేస్తూ రహ దారుల నిర్మాణం పెద్ద యెత్తున జరగాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన ప్రాంతం ఉత్తరాంధ్రలోనే ఎక్కువగా ఉంది. ఇక్కడ అడవి బిడ్డలు పౌష్టికాహార లోపంతో రక్తహీనతకు గురై తీవ్ర అనారోగ్యం పాలౌతున్నారు. ఈ కొండకోనల్లో, అడవుల్లో విలువైన అటవీ సంపద ఉంది. అందువల్ల ఈ భూములపై గిరిజనులకు ప్రత్యేక హక్కులు ఉండాలి. 1/70 చట్టం అమలు సక్రమంగా జరగాలి. ఇక్కడ ఖనిజ సంపద అపారంగా ఉంది. దీనితో వచ్చే ఆదాయం గిరిపుత్రుల సంక్షేమానికే వినియోగించాలి. ఇక్కడ భూగర్భ జలాలలో కాల్షియం, ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉంది. కిడ్నీ, ఎముకల వ్యాధులతో తరచూ బాధపడటం చూస్తాం. అందువల్ల ఇక్కడి ప్రజలకు మంచినీరు అందివ్వాలి. నిర్మాణంలో ఉన్న పోర్టులను, హార్బర్లను వేగవంతం చేయాలి.చదవండి: రైతులు అడగాల్సిన ‘మహా’ నమూనాకార్మికులలో 90 శాతానికి పైబడి అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. వీరిలో భవన నిర్మాణ రంగంలోనే అధికంగా ఉన్నారు. వీరి భద్రతకు చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాంత ప్రజల జీవనస్థితిగతులు మెరుగవ్వాలంటే, విభజన చట్టం సెక్షన్ 94(3)లో పేర్కొన్న విధంగా ఉత్తరాంధ్రకు ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలి. అది వెనుకబడిన బుందేల్‌ఖండ్, కోరాపుట్, బోలంగిర్, కలహండి తరహాలో ఉండాలి.చదవండి: మంచి పనిని కించపరుస్తారా?ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద పట్టణం విశాఖపట్నం. ఈ పట్టణం ఇతర ప్రాంతాల పెట్టుబడి వర్గాల గుప్పిట ఉంది. విశాఖను మాత్రమే అభివృద్ధి చేస్తే ఒనగూరే లాభమేమిటి? నిజంగా ఈ ప్రాంత ప్రజల పరిస్థితి మెరుగుపడుతుందా అనేది మాత్రం శేషప్రశ్నే. ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి గతంలో జరిగిన వివిధ వామపక్ష, అస్తిత్వ జీవన పోరాటాల వలె మరికొన్ని ఉద్యమాలు రావాల్సి ఉందేమో!- పిల్లా తిరుపతిరావు తెలుగు ఉపాధ్యాయుడు -
విశాఖ ఉక్కు కార్మికుల ఆందోళన
-
స్టీల్ ప్లాంట్ కార్మికులపై ఉక్కుపాదం నోరు మెదపని కూటమి ప్రభుత్వం
-
విశాఖ స్టీల్ ప్లాంట్ పై సీఎం చంద్రబాబు నిర్లక్ష్యం
-
వైజాగ్ స్టీల్‌కు రూ.1,650 కోట్లు.. ఎల్ అండ్ టీకి ప్రాజెక్ట్‌లు
నిర్వహణ, ఆర్థికపరమైన సవాళ్లతో సతమతమవుతున్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌కు (వైజాగ్ స్టీల్) రూ.1,650 కోట్లు సమకూర్చినట్లు కేంద్ర ఉక్కు శాఖ తెలిపింది. సంస్థ కార్యకలాపాలు యథావిధంగా కొనసాగేలా తోడ్పాటు అందించేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 19న రూ.500 కోట్లు ఈక్విటీ కింద, సెప్టెంబర్ 27న రూ.1,140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ లోన్ కింద అందించినట్లు పేర్కొంది. సంస్థ సుస్థిరంగా నిలదొక్కుకోవడంపై ఎస్‌బీఐక్యాప్స్ ఒక నివేదికను రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.ఇదీ చదవండి: పన్నుల ప్రణాళిక.. ఎగవేత మధ్య తేడా!ఎల్అండ్టీకి భారీ ప్రాజెక్టులుఅధిక వోల్టేజీ విద్యుత్ గ్రిడ్లను విస్తరించడం, బలోపేతం చేయడం కోసం మధ్యప్రాచ్య, ఆఫ్రికాలో ప్రధాన ప్రాజెక్టులను దక్కించుకున్నట్టు మౌలిక రంగ నిర్మాణ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో వెల్లడించింది. పవర్ ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ విభాగం ఈ ఆర్డర్లను పొందినట్లు కంపెనీ తెలిపింది. రూ.5,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్ల శ్రేణిలో ఆర్డర్లు ప్రధానమైనవిగా కంపెనీ వర్గీకరించింది. కాగా, కెన్యా కోసం కొత్త నేషనల్ సిస్టమ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మిస్తారు. ప్రముఖ ఒరిజినల్ పరికరాల తయారీ కంపెనీ భాగస్వామ్యంలోని కన్సార్షియం ఈ ఆర్డర్‌ను అందుకుంది. మధ్యప్రాచ్యంలోని సౌదీ అరేబియాలో అధిక వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్ల టర్న్‌కీ నిర్మాణం చేపడతారు. ఖతార్‌లో కొనసాగుతున్న విద్యుత్ వ్యవస్థ విస్తరణ ప్రాజెక్ట్‌లో అదనపు గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్స్ ఏర్పాటు చేస్తారు. -
స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు శీతకన్ను.. మళ్లీ పాతపాటే!
సాక్షి, విశాఖ: ఏపీ సీఎం చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మరోసారి నిరాశే మిగిల్చారు. విశాఖ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్‌పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అంతేకాకుండా సేయిల్‌కు లాభాలు వచ్చినప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు ఎందుకు రావడం లేదని కార్మికులను ఎదురు ప్రశ్నించడం గమనార్హం.నేడు విశాఖ పర్యటన సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏదైనా స్పష్టత వస్తుందని భావించిన కార్మికులకు మళ్లీ నిరాశే ఎదురైంది. స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు పాత పాటే పాడారు. సేయిల్ లాభాల బాటలో నడుస్తోంది. సేయిల్‌కు లాభాలు వచ్చినప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు ఎందుకు రావడం లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను లాభాల బాటలో నడిపించాలి. దానిపై ఏం చెయ్యాలో ఆలోచిస్తున్నాం. మంచి మేనేజ్మెంట్ను ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పుకొచ్చారు.మరోవైపు, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉక్కు పోరాట కమిటీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్మెంట్ కోరారు. అయితే, ఇప్పటి వరకు అపాయింట్మెంట్పై ఎలాంటి స్పష్టత రాలేదు. సీఎం చంద్రబాబు పిలుపు కోసం పోరాట కమిటీ సభ్యులు ఎదురు చూస్తున్నారు. -
చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వ విధానాలను సమర్థిస్తున్నారా?: బొత్స
విశాఖపట్నం, సాక్షి: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వ విధానం ఏంటో సీఎం చంద్రబాబు నాయుడు చెప్పాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. శనివారం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ‘‘కేంద్ర మంత్రులు చెప్తున్నది వేరు.. క్షేత్ర స్థాయిలో జరుగుతున్నది వేరు. స్టీల్ ప్లాంట్‌లో జరుగుతున్న తాజా పరిణామాలపై చంద్రబాబు వైఖరి ఏమిటి?. కేంద్ర ప్రభుత్వ విధానాలను బాబు సమర్థిస్తున్నారా?. ఈ ప్రాంత మనోభావాలను గౌరవించాలి. స్టీల్ ప్లాంట్ కోసం రాజకీయం చేయోద్దు. ఉమ్మడి ఆంధ్రుల హక్కు ఇది. చంద్రబాబు ఖచ్చితంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్‌పై ద్వంద్వ వైఖరితో వెళ్తే ప్రజలు ఉపేక్షించరు. ఉన్న స్టీల్ ప్లాంట్‌ను కాపాడాలి. ఇంకో స్టీల్ ప్లాంట్ వస్తే సంతోషమే. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కొనసాగాలి. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణపై ఒక్క నిర్ణయం కూడా జరగలేదు...పాల డైరీల చరిత్రలో ఎన్నడూ పాల సేకరణ ధర తగ్గించలేదు. చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు పాల సేకరణ ధర తగ్గించింది. చంద్రబాబు వెంటనే పాడి రైతులకు న్యాయం చెయ్యాలి. అమూల్ వచ్చాక రాష్ట్రంలో పాల సేకరణ ధర పెరిగింది. విశాఖ డెయిరీలో పాల సేకరణ ధర ఎందుకు తగ్గించారో సమాధానం చెప్పాలి. పాడి రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి.మరోవైపు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. చట్టం ఒక పక్షం వహిస్తుంది. చట్టం నాలుగు పాదాలపై ఉండాలి. ఏకపక్షం వహించడం మంచిది కాదు. ఇసుక ఉచితం అని చెప్పి ప్రజలను మోసం చేశారు. గతంలో ఇసుక పాలసీ చాలా సులభంగా ఉండేది.నాడు విశాఖలో ఇసుక రూ రూ. 13వేలకు వచ్చేది. -
బాబూ.. అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు అవసరమా?: వడ్డే శోభనాద్రీశ్వరరావు
సాక్షి, విజయవాడ: ఏపీలో అసెంబ్లీకి ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ సరిపోదా?.. మళ్లీ ఐకానిక్ అసెంబ్లీ అవసరమా చంద్రబాబు అని ప్రశ్నించారు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు. అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు వేయాల్సిన అవసరం ఏముంది?. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు లేకపోవడం మనం సిగ్గుపడాల్సిన విషయం అని ఘాటు కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. 2014-19లో చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయలేదు. చంద్రబాబు తన మనసులోని కొన్ని అంశాలకే ప్రాధాన్యత ఇచ్చారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మార్పులేమీ రాలేదు. చంద్రబాబు చెప్పిన పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక హోదా ఉండాల్సిందే. చంద్రబాబు, పవన్.. ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలి.ఔటర్ రింగ్ రోడ్డు కారణంగా హైదరాబాద్ డెవలప్ కాలేదు.. ఐటీ వల్ల హైదరాబాద్ అభివృద్ధి చెందలేదు. అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు వేయాల్సిన అవసరం ఏముంది?. మేం నెత్తీ నోరూ మొత్తుకున్నా వినకుండా 33 వేల ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నారు. 33వేల ఎకరాలు తీసుకుని ఏం లాభం.. అక్కడ ముళ్ల చెట్లు పెరిగాయి. ఇప్పుడు లక్షలు ఖర్చు చేసి ఆ పొలాల్లోని చెట్లను తొలగిస్తున్నారు. అలాగే, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు లేకపోవడం మనం సిగ్గుపడాల్సిన విషయం. చంద్రబాబు తక్షణమే ప్రకాశం, అనంతపురం జిల్లాల్లోని ఐరన్ ఓర్ గనులను విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేటాయించాలి. ముందు రాష్ట్రం చేయాల్సిన పని చేస్తే.. అప్పుడు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావచ్చు.విజయవాడ-విశాఖ మధ్య మెట్రో రైల్ వేస్తానని హడావుడి చేశాడు.. కానీ జరిగిందేమీ లేదు. అమెరికాలో కూడా లేని హైపర్ లూప్ రైలును తెస్తానని ప్రకటించడం చూస్తే నవ్వొస్తోంది. చెన్నై-బెంగుళూరు-హైదరాబాద్-అమరావతిని కలిపి బుల్లెట్ రైలు వేయాలంటున్నాడు. నాది కాకపోతే ఢిల్లీ దాకా దొర్లాలనీ వెనకటికి ఎవడో చెప్పినట్లుంది చంద్రబాబు ఆలోచన. చంద్రబాబు ఇలాంటి అనవరమైన ఆలోచనలను మానుకోవాలని కోరుతున్నాను. ఐకానిక్ హైకోర్టు బిల్డింగ్ కట్టాలన్న ఆలోచన విరమించుకోండి. అలాగే, అసెంబ్లీకి ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ సరిపోదా.. మళ్లీ ఐకానిక్ అసెంబ్లీ అవసరమా?. ఐకానిక్ భవనాలకు బదులు భూములిచ్చిన రైతులకు న్యాయం చేయండి. ఉచిత ఇసుక అన్నావ్.. ప్రయోజనం ఎవరికి చేకూరుతుందో మీకూ రిపోర్టులు వస్తున్నాయ్ ఒక్కసారి పరిశీలించండి. అవినీతి చేస్తే ఎన్టీఆర్ మంత్రులను కూడా సహించలేదు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటే రెండోసారి తప్పులు జరగవు’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఉక్కు ఉద్యోగుల ఆకలి కేకలు
ఉక్కు ఉద్యమాన్ని సడలించి ప్రైవేట్ పరం చేసేలా కేంద్రానికి సహకరించడమే లక్ష్యంగా సాగుతున్న చంద్రబాబు ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై రోజుకో కుట్ర పన్నుతోంది. ఆర్థి క పరిస్థితుల సాకుతో ప్రతి నెలా వేతనాన్ని రెండు విడతల్లో అందిస్తున్న యాజమాన్యం ఈసారి దీపావళికి వెలుగులు లేకుండా చేసింది. ఈ నెల రెండో విడత జీతాలు చెల్లించకుండా ముఖం చాటేసింది. స్టీల్ ప్లాంట్‌ని కాపాడుకునేందుకు శ్రమిస్తున్న ఉద్యోగులు, కార్మికుల ఆర్థి క మూలాలపై ప్రభుత్వాలు దెబ్బ కొడుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఉక్కు ఉద్యమాన్ని తాము ముందుండి నడిపిస్తామంటూ అధికారంలోకి రాకముందు వరకూ హామీలిచి్చన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు తమ ఆకలి కేకల్ని పట్టించుకోవడం లేదని కార్మికులు మండిపడుతున్నారు. బలవంతపు పదవీ విరమణకు ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేయగా ఇప్పుడు ఏకంగా జీతాలు ఇవ్వకుండా వేధించడంపై రగిలిపోతున్నారు. నష్టాల పేరుతో గత పది నెలలుగా విశాఖ ఉద్యోగులకు యాజమాన్యం ప్రతి నెలా రెండు విడతలుగా జీతాలను చెల్లిస్తోంది. మొదటి విడత 10వ తేదీలోపు ఇస్తుండగా రెండో విడత నెలలో చివరి వారంలో ఖాతాల్లో జమ అయ్యేది. ఈ నెలలో తొలి విడత జీతాలను ఆలస్యం చేసి దసరా తర్వాత చెల్లించారు. నెల ముగిసిపోతున్నా రెండో విడత ఇంతవరకు జమ కాకపోవడంతో ఉక్కు ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నంనీరుగారిన హామీ..ఉక్కు ఉద్యోగులు తమ వేతన సమస్యలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి గతంలో పలుమార్లు తెచ్చారు. సకాలంలో చెల్లించేలా చూస్తామంటూ వారు పొడిపొడిగా హామీ ఇచ్చారు. అయితే అది అమలైందా? లేదా? అనే విషయంపై ఒక్కసారి కూడా ఆరా తీయలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని కార్మికులు పేర్కొంటున్నారు. దీనిపై తదుపరి కార్యాచరణ సిద్ధం చేసి ఆందోళన కొనసాగిస్తామని సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.ఢిల్లీ వెళ్లిపోయిన సీఎండీదీపావళి నేపథ్యంలో రెండో విడత జీతాలు వెంటనే చెల్లించాలంటూ కార్మిక సంఘాల నాయకులు సోమవారం ఉదయం యాజమాన్యం వద్ద మొరపెట్టుకున్నారు. అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు సీఎండీని కలిసేందుకు ప్రయతి్నంచగా కేంద్ర ఉక్కు కార్యదర్శితో సమావేశంలో ఉన్నందున సాయంత్రం 4.30కి రావాలని అపాయింట్మెంట్ ఇచ్చారు.చెప్పిన సమయానికి సంఘాల నాయకులు అడ్మిన్ బిల్డింగ్ వద్దకు వెళ్లగా సీఎండీ అంతకుముందే హిల్‌టాప్ గెస్ట్‌హౌస్‌కు వెళ్లిపోయారని తెలియడంతో అక్కడకు వెళ్లేందుకు ప్రయతి్నంచారు. అయితే సీఎండీ అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లిపోయారనీ ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించడంతో హతాశులయ్యారు. ఉదయం.. సాయంత్రం అంటూ తిప్పుకుని తీరా చెప్పాపెట్టకుండా వెళ్లిపోవడంతో ఆందోళన చెందిన కార్మికులు డైరెక్టర్ (పర్సనల్), హెచ్ఆర్ అధికారులను కలసి తక్షణం జీతాలు చెల్లించాలని కోరారు. దీనిపై డైరెక్టర్లతో చర్చిస్తామంటూ వారు కూడా అక్కడి నుంచి జారుకున్నారు. కాసేపటి తర్వాత వచి్చన డైరెక్టర్.. రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లు నడపటానికి ముడి పదార్థాల కోసం ప్రయతి్నస్తున్నామని, ఇప్పట్లో జీతాలు జమ చేసే పరిస్థితులు కనిపించడం లేదని చావుకబురు చల్లగా చెప్పారు. దీంతో పండగ సమయానికి వేతనాలు జమ అవుతాయని ఆశపడ్డ ఉద్యోగులు, కార్మికులు నిర్ఘాంతపోయారు.వీఆర్ఎస్కు 2,478 మంది అనుకూలంఉక్కు నగరం: విశాఖ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ప్రకటించిన వలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ (వీఆర్ఎస్) సర్వేకు 2,478 మంది అనుకూలంగా స్పందిచారు. తొలి రోజు 500 మంది అనుకూలంగా స్పందించగా.. రెండో రోజు 1,200 మంది మద్దతు తెలిపారు. సర్వే గడువు ముగిసే మంగళవారం నాటికి 2,478 మంది అనుకూలంగా స్పందించారు. వీరిలో 1,083 మంది అధికారులు కాగా, 1,395 మంది కార్మికులు ఉన్నారు. స్టీల్‌ప్లాంట్‌లో రోజురోజుకు దిగజారిపోతున్న పరిస్థితులు ఈ సర్వేకు అద్దం పడుతున్నాయి. లీవ్ ఎన్‌క్యా‹Ùమెంట్, ఎల్టీసీ, ఎల్ఎల్టీసీ, ఎల్టీఎ నిలిపివేయడంతో ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు అధికారులకు 10 శాతం పెర్క్స్ తొలగించగా, కార్మికులకు హెచ్ఆర్ఏ నిలిపివేత, ఉక్కు క్వార్టర్ల నివాసులకు విద్యుత్ చార్జీల పెంపు ద్వారా తీవ్రమైన ఆర్థిక భారం పెంచారు. కనీసం జీతమైనా సరిగా ఇస్తున్నారంటే అది కూడా లేదు. ఏడాది కాలంగా ప్రతినెలా రెండు విడతలుగా సగం జీతం ఇస్తుండటంతో ఉద్యోగులు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు డిఫాల్టర్లుగా మారుతున్నారు. దీనికి తోడు పీఎఫ్ ట్రస్ట్, ఎస్ఎబీఎఫ్ ట్రస్ట్, త్రిఫ్ట్ సొసైటీలకు యాజమాన్యం సుమారు రూ.700 కోట్లు బకాయి పడటంతో ఉద్యోగులకు మరింత నష్టం కలిగిస్తోంది. ఈ ఏడాదిమే నెల నుంచి రిటైరైన ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యా‹Ùమెంట్ చెల్లించటం లేదు. దీంతో ఉద్యోగుల్లో భయం, అభద్రతా భావం పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో ఎంత వేగంగా ప్లాంట్ నుంచి బయటపడదామా అని ఉద్యోగులు భావిస్తున్నారు. -
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని కార్మికుల నిరసన
-
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పక్కదోవ.. రుషికొండ ప్యాలెస్ పై నీచ రాజకీయం
-
కేంద్రాన్ని ఒప్పించడంలో బాబు విఫలం: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రాన్ని ఒప్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారని అన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇదే సమయంలో కూటమి పాలనపై 100 రోజుల్లోనే వ్యతిరేకత ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు అమలు చేయడం లేదన్నారు.వైఎస్సార్సీపీ ఎంపీ, ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి బుధవారం రాత్రి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయనకు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..‘విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకం. అవసరమైతే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రాన్ని ఒప్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారు. స్టీల్ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది.కూటమి పాలనపై 100 రోజుల్లోనే వ్యతిరేకత ప్రారంభమైంది. చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదు. దస్పల్లా, ఎన్సీసీ భూములతో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎలాంటి విచారణకైనా నేను సిద్ధం. ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నా ఎటువంటి అభ్యంతరం లేదు.డయేరియా బాధితులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారు. డయేరియాతో 14 మంది మరణించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తాను. పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తాం. దీపావళి తర్వాత రీజినల్ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు స్వీకరిస్తాను. పార్టీ బలోపేతం కోసమే రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులు మార్పు జరిగింది అని కామెంట్స్ చేశారు. -
అగ్గిపెట్టెలకు 23 కోట్లా..! లక్షకోట్ల స్టీలాప్లాంట్ స్కాం..
-
కూటమి ఎంపీలను ఏకిపారేసిన స్టీల్ ప్లాంట్ కార్మికులు
-
విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యమం అణిచివేతలో కూటమి ప్రభుత్వం
సాక్షి,విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యమంపై ఉక్కుపాదం మోపింది. స్టీల్ ప్లాంట్ కార్మికులు మీడియాతో మాట్లాడొద్దంటూ షరతులు విధించారు. ఇందులో భాగంగా షరతులతో కూడిన సర్క్యులర్ మెమోను స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం జారీ చేసింది.తాజా,స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం నిర్ణయంపై కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై తాము చేస్తున్న ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నాయని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.యాజమాన్యం బెదిరింపులకు తాము భయపడబోమని స్పష్టం చేస్తున్నారు. కాగా,ఆదివారం స్టీల్‌ప్లాంట్ కార్మికులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. అనంతరం యాజమాన్యం సర్క్యులర్ విడుదల చేయడం విశేషం. -
ఉక్కు కార్మికుల భారీ మానవహారం
సాక్షి,విశాఖపట్నం: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఉక్కు కార్మికులు తమ ఆందోళనలను మరింత ఉదృతం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం కార్మికులు భారీ ఎత్తున మానవ హారం నిర్వహించనున్నారు.ఢిల్లీ పర్యటనకు వెళుతున్న చంద్రబాబును విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉక్కు ఉద్యమానికి ప్రజలు సహకరించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ విజ్ఞప్తి చేసింది. శనివారరం అర్ధరాత్రి వరకు ఈడీ వర్క్స్ బిల్డింగ్ వద్ద కొనసాగిన ఉక్కు కార్మికుల నిరసన.. కార్మిక వ్యతిరేక నిర్ణయాలను వెంటనే వెనక్కు తీసుకోవాలని నినాదాలు చేశారు. నేడు నేషనల్ హైవేపై అగనంపూడి నుంచి గాజువాక వరకు భారీ మానవ హారం చేపట్టనున్నారు. -
నేడు స్టీల్ ప్లాంట్ సీఎండీని కలవనున్న పోరాట కమిటీ నేతలు
-
స్టీల్ ప్లాంట్ కార్మికుల సమరం
-
స్టీల్ ప్లాంట్ కార్మికులను ఏం చేద్దామనుకుంటున్నారు?: ఎమ్మెల్సీ బొత్స
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి సర్కార్ నిరుద్యోగులను మోసం చేసిందన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. అలాగే, ఉద్యోగాలు ఇస్తామని స్టీల్ ప్లాంట్‌లో కార్మికులను తొలగించడమేంటని ప్రశ్నించారు. నిత్యావసరాల ధరలు పెరిగిపోతుంటే మీరు మందు రేటు తగ్గిస్తారా? అని అడిగారు.ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మంగళవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో కూటమి నేతలను గెలిపిస్తే నిరుద్యోగులకు 20లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మరి ఉద్యోగాలు ఇచ్చారా?. కూటమి ప్రభుత్వ పాలనలో ఇప్పుడు మాత్రం స్టీల్ ప్లాంట్ కార్మికులను తొలగిస్తున్నారు. స్టీల్‌ప్లాంట్‌లో కార్మికులను తొలగించడం కరెక్ట్ కాదు. అసలు స్టీల్ ప్లాంట్ కార్మికులను ఏం చేద్దామనుకుంటున్నారు?. నాలుగు వేల మంది స్టీల్ ప్లాంట్ కార్మికులను తొలగించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఏ ఒక్క ఉద్యోగిని తొలగించడానికి ఒప్పుకోము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసే ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని చంద్రబాబు, పవన్, బీజేపీ నిలబెట్టుకోవాలి.నిత్యావసరాల ధరలు పెరిగిపోతుంటే మీరు మందు రేటు తగ్గిస్తారా?. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మీకు చీమ కుట్టినట్టు అయినా లేదు. రూ.99కే మద్యం అందిస్తామని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. మద్యం షాపుల్లో ఉన్న 15000 మందిని రోడ్డున పడేశారు. మందు మీద రేటు తగ్గిస్తున్నారు.. నిత్యవసర వస్తువుల ధరల సంగతి ఏంటి?. ధరల స్థిరీకరణ కోసం గత ప్రభుత్వం 2000 కోట్లు ఏర్పాటు చేసి ధరలను అదుపులో పెట్టింది. పండగకు పప్పన్నం కాదు చారు అన్నం కూడా తినే పరిస్థితి లేదు. నిత్యవసర వస్తువుల ధరలు పెరిగితే తక్కువ ధరలు ఉన్న రాష్ట్రాల నుంచి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూరగాయలను తెప్పించేది. ధరలను అదుపులో పెట్టింది. రెండున్నర లక్షల మంది వాలంటీర్లను తొలగించారు. వాలంటీర్లకు పది వేల జీతం ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారు.లులూ కంపెనీ.. ప్రభుత్వం నుంచి రూ.1300 కోట్ల స్థలం తీసుకొని 600 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామన్నారు. ప్రభుత్వం ఇచ్చే స్థలం రేటు కంటే పది రెట్లు పెట్టుబడి పెడితే ఉపయోగం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే స్థలం రేటులో సగం కూడా పెట్టుబడులు లేకపోతే ఎలా?. అందుకే గతంలో లులూ కంపెనీ పెట్టుబడులు వద్దని చెప్పాము అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇది కూడా చదవండి: బాదుడుపై బాబు ఫోకస్.. ఇదేనా సంపద సృష్టి: వైఎస్సార్సీపీ -
వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత.. పోలీసు బలగాల మోహరింపు
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కాంట్రాక్ట్ కార్మికులు ఈడీ వర్క్స్ బిల్డింగ్‌ను ముట్టడించారు. తమకు న్యాయం చేయాలని యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో స్టీల్‌ప్లాంట్ వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు.విశాఖ స్టీల్‌ప్లాంట్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు నిరసనలు చేపట్టారు. మంగళవారం ఉదయం ఈడీ వర్క్స్ బిల్డింగ్‌ను కార్మికులు ముట్టడించారు. ఈ సందర్బంగా అక్కడకి భారీ సంఖ్యలో పోలీసులు, సీఐఎస్ఎఫ్ బలగాలు చేరుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులు సైతం స్టీల్ ప్లాంట్ వద్దకు వచ్చారు. కాగా, 4200 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగింపుపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తోందని కార్మికులు మండిపడుతున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. శాంతియుతంగా నిరసన చేపడితే తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. విశాఖ ఉక్కు కార్మికులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఆదివారం ఉదయం కూడా స్టీల్‌ప్లాంట్ బీసీ గేట్ ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తే ఊరుకునేది లేదని కార్మిక నేతలు హచ్చరించారు. స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు.ఇదిలా ఉండగా.. స్టీల్‌ప్లాంట్‌ను కాపాడతామని గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ప్లాంట్ నిర్వీర్యం అవుతుంటే చేష్టలుడిగి చూస్తోంది. స్ట్రాటజిక్ సేల్ పేరిట ప్లాంట్‌ను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్రం వేస్తున్న అడుగులకు రాష్ట్ర ప్రభుత్వం మడుగులొత్తుతోంది. నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ రచ్చరచ్చ కావడంతో ఉక్కు యాజమాన్యం వెనక్కి తగ్గింది. ఈ నిర్ణయం తాత్కాలికమేనని, భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యోగ కోతలు జరగొచ్చనే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.ఇది కూడా చదవండి: చంద్రబాబు ‘కొవ్వు’ ప్రకటనకు 'ఎలాంటి ఆధారాల్లేవ్': సుప్రీంకోర్టు -
రోడ్డెక్కిన స్టీల్ ప్లాంట్ కార్మికులు