సాక్షి, విశాఖ: ఏపీ సీఎం చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మరోసారి నిరాశే మిగిల్చారు. విశాఖ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్‌పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అంతేకాకుండా సేయిల్‌కు లాభాలు వచ్చినప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు ఎందుకు రావడం లేదని కార్మికులను ఎదురు ప్రశ్నించడం గమనార్హం.
నేడు విశాఖ పర్యటన సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏదైనా స్పష్టత వస్తుందని భావించిన కార్మికులకు మళ్లీ నిరాశే ఎదురైంది. స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు పాత పాటే పాడారు. సేయిల్ లాభాల బాటలో నడుస్తోంది. సేయిల్‌కు లాభాలు వచ్చినప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు ఎందుకు రావడం లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను లాభాల బాటలో నడిపించాలి. దానిపై ఏం చెయ్యాలో ఆలోచిస్తున్నాం. మంచి మేనేజ్‌మెంట్‌ను ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పుకొచ్చారు.
మరోవైపు, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉక్కు పోరాట కమిటీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోరారు. అయితే, ఇప్పటి వరకు అపాయింట్‌మెంట్‌పై ఎలాంటి స్పష్టత రాలేదు. సీఎం చంద్రబాబు పిలుపు కోసం పోరాట కమిటీ సభ్యులు ఎదురు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment