వేతనాలు అందక పండుగ పూట అవస్థలు
ప్రతి నెలా రెండు విడతల్లో చెల్లింపులు
ఈసారి తొలి విడత మాత్రమే జమ
చర్చలకు పిలిచి ఢిల్లీ వెళ్లిపోయిన సీఎండీ
సమస్యలు పట్టించుకోని చంద్రబాబు సర్కారు
ఉక్కు ఉద్యమాన్ని సడలించి ప్రైవేట్ పరం చేసేలా కేంద్రానికి సహకరించడమే లక్ష్యంగా సాగుతున్న చంద్రబాబు ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై రోజుకో కుట్ర పన్నుతోంది. ఆర్థి క పరిస్థితుల సాకుతో ప్రతి నెలా వేతనాన్ని రెండు విడతల్లో అందిస్తున్న యాజమాన్యం ఈసారి దీపావళికి వెలుగులు లేకుండా చేసింది. ఈ నెల రెండో విడత జీతాలు చెల్లించకుండా ముఖం చాటేసింది. స్టీల్ ప్లాంట్‌ని కాపాడుకునేందుకు శ్రమిస్తున్న ఉద్యోగులు, కార్మికుల ఆర్థి క మూలాలపై ప్రభుత్వాలు దెబ్బ కొడుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఉక్కు ఉద్యమాన్ని తాము ముందుండి నడిపిస్తామంటూ అధికారంలోకి రాకముందు వరకూ హామీలిచి్చన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు తమ ఆకలి కేకల్ని పట్టించుకోవడం లేదని కార్మికులు మండిపడుతున్నారు. బలవంతపు పదవీ విరమణకు ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేయగా ఇప్పుడు ఏకంగా జీతాలు ఇవ్వకుండా వేధించడంపై రగిలిపోతున్నారు. నష్టాల పేరుతో గత పది నెలలుగా విశాఖ ఉద్యోగులకు యాజమాన్యం ప్రతి నెలా రెండు విడతలుగా జీతాలను చెల్లిస్తోంది. మొదటి విడత 10వ తేదీలోపు ఇస్తుండగా రెండో విడత నెలలో చివరి వారంలో ఖాతాల్లో జమ అయ్యేది. ఈ నెలలో తొలి విడత జీతాలను ఆలస్యం చేసి దసరా తర్వాత చెల్లించారు. నెల ముగిసిపోతున్నా రెండో విడత ఇంతవరకు జమ కాకపోవడంతో ఉక్కు ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం
నీరుగారిన హామీ..
ఉక్కు ఉద్యోగులు తమ వేతన సమస్యలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి గతంలో పలుమార్లు తెచ్చారు. సకాలంలో చెల్లించేలా చూస్తామంటూ వారు పొడిపొడిగా హామీ ఇచ్చారు. అయితే అది అమలైందా? లేదా? అనే విషయంపై ఒక్కసారి కూడా ఆరా తీయలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని కార్మికులు పేర్కొంటున్నారు. దీనిపై తదుపరి కార్యాచరణ సిద్ధం చేసి ఆందోళన కొనసాగిస్తామని సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.
ఢిల్లీ వెళ్లిపోయిన సీఎండీ
దీపావళి నేపథ్యంలో రెండో విడత జీతాలు వెంటనే చెల్లించాలంటూ కార్మిక సంఘాల నాయకులు సోమవారం ఉదయం యాజమాన్యం వద్ద మొరపెట్టుకున్నారు. అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు సీఎండీని కలిసేందుకు ప్రయతి్నంచగా కేంద్ర ఉక్కు కార్యదర్శితో సమావేశంలో ఉన్నందున సాయంత్రం 4.30కి రావాలని అపాయింట్‌మెంట్ ఇచ్చారు.
చెప్పిన సమయానికి సంఘాల నాయకులు అడ్మిన్ బిల్డింగ్ వద్దకు వెళ్లగా సీఎండీ అంతకుముందే హిల్‌టాప్ గెస్ట్‌హౌస్‌కు వెళ్లిపోయారని తెలియడంతో అక్కడకు వెళ్లేందుకు ప్రయతి్నంచారు. అయితే సీఎండీ అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లిపోయారనీ ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించడంతో హతాశులయ్యారు. ఉదయం.. సాయంత్రం అంటూ తిప్పుకుని తీరా చెప్పాపెట్టకుండా వెళ్లిపోవడంతో ఆందోళన చెందిన కార్మికులు డైరెక్టర్ (పర్సనల్), హెచ్‌ఆర్ అధికారులను కలసి తక్షణం జీతాలు చెల్లించాలని కోరారు. దీనిపై డైరెక్టర్లతో చర్చిస్తామంటూ వారు కూడా అక్కడి నుంచి జారుకున్నారు. కాసేపటి తర్వాత వచి్చన డైరెక్టర్.. రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లు నడపటానికి ముడి పదార్థాల కోసం ప్రయతి్నస్తున్నామని, ఇప్పట్లో జీతాలు జమ చేసే పరిస్థితులు కనిపించడం లేదని చావుకబురు చల్లగా చెప్పారు. దీంతో పండగ సమయానికి వేతనాలు జమ అవుతాయని ఆశపడ్డ ఉద్యోగులు, కార్మికులు నిర్ఘాంతపోయారు.
వీఆర్‌ఎస్‌కు 2,478 మంది అనుకూలం
ఉక్కు నగరం: విశాఖ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ప్రకటించిన వలంటరీ రిటైర్‌మెంట్ స్కీమ్ (వీఆర్‌ఎస్) సర్వేకు 2,478 మంది అనుకూలంగా స్పందిచారు. తొలి రోజు 500 మంది అనుకూలంగా స్పందించగా.. రెండో రోజు 1,200 మంది మద్దతు తెలిపారు. సర్వే గడువు ముగిసే మంగళవారం నాటికి 2,478 మంది అనుకూలంగా స్పందించారు. వీరిలో 1,083 మంది అధికారులు కాగా, 1,395 మంది కార్మికులు ఉన్నారు. స్టీల్‌ప్లాంట్‌లో రోజురోజుకు దిగజారిపోతున్న పరిస్థితులు ఈ సర్వేకు అద్దం పడుతున్నాయి. లీవ్ ఎన్‌క్యా‹Ùమెంట్, ఎల్‌టీసీ, ఎల్‌ఎల్‌టీసీ, ఎల్‌టీఎ నిలిపివేయడంతో ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
దీనికి తోడు అధికారులకు 10 శాతం పెర్క్స్ తొలగించగా, కార్మికులకు హెచ్‌ఆర్‌ఏ నిలిపివేత, ఉక్కు క్వార్టర్ల నివాసులకు విద్యుత్ చార్జీల పెంపు ద్వారా తీవ్రమైన ఆర్థిక భారం పెంచారు. కనీసం జీతమైనా సరిగా ఇస్తున్నారంటే అది కూడా లేదు. ఏడాది కాలంగా ప్రతినెలా రెండు విడతలుగా సగం జీతం ఇస్తుండటంతో ఉద్యోగులు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు డిఫాల్టర్లుగా మారుతున్నారు. దీనికి తోడు పీఎఫ్ ట్రస్ట్, ఎస్‌ఎబీఎఫ్ ట్రస్ట్, త్రిఫ్ట్ సొసైటీలకు యాజమాన్యం సుమారు రూ.700 కోట్లు బకాయి పడటంతో ఉద్యోగులకు మరింత నష్టం కలిగిస్తోంది. ఈ ఏడాదిమే నెల నుంచి రిటైరైన ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యా‹Ùమెంట్ చెల్లించటం లేదు. దీంతో ఉద్యోగుల్లో భయం, అభద్రతా భావం పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో ఎంత వేగంగా ప్లాంట్ నుంచి బయటపడదామా అని ఉద్యోగులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment